సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ బెటాలియన్‌లలో పనిచేసే కానిస్టేబుళ్ల ఆందోళనలపై రాష్ట్ర పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. విధులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి పోలీసులు ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా భావిస్తున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించమని హెచ్చరించారు.
పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ సామాన్య జనానికి ఇబ్బంది కలిగేలా రోడ్లపై వచ్చిన పోలీసులపై చట్టపరమైన, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సెలవుల విషయంలో పాత పద్ధతినే అనుసరిస్తామని ఇప్పటికే చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళన చేయడంపై సరికాదన్నారు. ఆగ్రహం వ్యక్తం చేసింది. బెటాలియన్స్‌లో ఆందోళన చేస్తున్న వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానిస్టేబుళ్ల ఆందోళన వెనక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తముందని అనుమానం ఉందన్నారు.
కాగా తెలంగాణలో ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అన్ని జిల్లాలోలనూ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు
వరంగల్ జిల్లా మమూనూరు క్యాంపులో మొదలైన ఆందోళన సెక్రటేరియట్ చేరింది. క్రమంగా రాష్ట్రంలోని అన్ని బెటాలియన్లకు పాకింది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, నల్గొండ రూరల్, మంచిర్యాలలో నిరసనలు చేపట్టారు. అయితే మామునూరు బెటాలియన్ ఆవరణలో ఏకంగా యూనిఫాం ధరించిన పోలీసులే నిరసనకు దిగారు. టీజీఎస్పీ వద్దు ఏక్ పోలీస్ ముద్దు, టీజీఎస్పీకో హఠావో.. ఏక్ పోలీస్ బనావో అంటూ నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment