
సాక్షి,రంగారెడ్డిజిల్లా : రామోజీ ఫిలింసిటీ భూ ఆక్రమణల వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఫిలింసిటీ కోసం తమ భూములు ఆక్రమించారని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామ రైతులు శుక్రవారం(ఫిబ్రవరి21) ఉదయం ఆందోళన చేపట్టారు.
వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఫిలింసిటీకి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. రైతుల భూములను ఆక్రమించిన రామోజీ ఫిలింసిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిలింసిటీ కబ్జాలో ఉన్న తమ భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో వేల ఎకరాల్లో రామోజీ ఫిలింసిటీ నిర్మాణానికిగాను చుట్టుపక్కల ఉన్న రైతులు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారని ఫిలింసిటీ యాజమాన్యంపై గతంలో పలువురు ఆరోపణలు చేశారు. తాజాగా అనాజ్‌పూర్ రైతులు ఇదే విషయమై ఆందోళన చేపట్టడంతో కబ్జాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.

Comments
Please login to add a commentAdd a comment