Ramoji Film city
-
ఇది సరైన సందేశమేనా?
‘మరణం నా చివరి చరణం కాదు’ అంటాడు విప్లవ కవి అలిశెట్టి ప్రభాకర్. నిజమే, ప్రభావశీలమైన వ్యక్తులు మరణానంతరం కూడా జీవించే ఉంటారు. వారి ప్రభావ స్థాయిని బట్టి సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాల పర్యంతం కూడా. ప్రభావశీలతలో పాజిటివ్ కోణం ఒక్కటే చూడాలా? నెగెటివ్ ప్రభావానికి కూడా ఈ సూత్రం వర్తిస్తుందా? మానవ చరిత్రపై అడాల్ఫ్ హిట్లర్ చేసిన రక్తాక్షర సంతకం కూడా తక్కువ ప్రభావాన్ని చూపలేదు కదా! అతడు కూడా మనకు ప్రాతఃస్మరణీయుడవుతాడా?నిజానికి ఇందులో సమస్య ఏమీ లేదు. సందేహాతీతమైన సదాచారాలు మనకు ఉన్నాయి. సమాజం మేలు కోరిన వారు, ప్రజల మంచి కోసం పోరాడినవారు, మంచితనాన్ని పెంచినవారిని స్మరించుకునే సంప్రదాయం మనకున్నది. స్మారకాలు నిర్మించుకునే అలవాటు కూడా ఉన్నది. వారి జీవితాల్లోంచి సమాజం పాఠాలు నేర్చుకోవాలనే కాంక్షతో వారినలా తమ జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలబెట్టుకుంటారు. చెడుమార్గంలో పయనించి ప్రభావం కలిగించిన వారిని... అధ్యయనం కోసం మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కించాలి. వారికి మరణమే చివరి చరణం కావాలి. ఆ ప్రభావం ఆదర్శం కాకూడదు.కానీ, దురదృష్టవశాత్తు మారుతున్న కాలం వింత పోకడలు పోతున్నది. అభివృద్ధికి అర్థం మారుతున్నది. విజయ గాథలకు కొత్త నిర్వచనాలు చేరుతున్నాయి. గొప్పతనం అనే మాటకు తాత్పర్యం మారింది. ఎవరు బాగా సంపాదిస్తారో వారే మహానుభావులు అనే భావన బలపడుతున్నది. వారు ఏ మార్గంలో సంపాదించారన్న పట్టింపేమీ కనిపించడం లేదు. గమ్యం మాత్రమే కాదు, గమ్యాన్ని చేరే మార్గం కూడా పవిత్రంగా ఉండాలన్న గాంధీ బోధనను ఒక చాదస్తం కింద జమకట్టవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. గాడ్సే వారసులకు గౌరవ మర్యాదలు లభిస్తున్న కాలంలోకి ప్రవేశించాము కదా!పారిశ్రామికాభివృద్ధిలో జాతి ప్రగతిని దర్శించిన జేఆర్డీ టాటా వంటి ఉన్నతస్థాయి పారిశ్రామికవేత్తలు కూడా మనకు ఉన్నారు. అటువంటి వారు చనిపోయినప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకొని అధికారిక సంస్మరణ సభలు నిర్వహించినట్టు గుర్తు లేదు. అటువంటి అదృష్టం మన తెలుగువాడైన చెరుకూరి రామోజీరావుకు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఈనాడు’కున్నంత పేరు ఆయనకూ ఉన్నది. బాగా సంపాదించారు. చిట్‌ఫండ్స్‌తో ప్రారంభమై మీడియాకు విస్తరించారు. మీడియా దన్నుతో సాటి చిట్‌ఫండ్ కంపెనీలను చావబాది, వాటిని దివాళా తీయించారు. ఫలితంగా ఆయన ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్’ దినదిన ప్రవర్ధమానమైంది.చిట్‌ఫండ్స్‌కు తోడుగా ‘ఫైనాన్షియర్స్’ పేరుతో మరో జంట కంపెనీ తెరిచారు. రెండు చేతులా ప్రజాధనాన్ని స్వీకరించారు. మీడియాను విస్తరింపజేశారు. ఫిలిం సిటీ పేరుతో ఓ మాహిష్మతీ రాజ్యాన్ని స్థాపించేశారు. ఈలోగా మీడియాను వాడుకొని ప్రభుత్వాలను మార్చారు. ‘పత్రికొక్కటి ఉన్న పదివేల సైన్యంబు’ అన్నారు నార్ల వెంకటేశ్వరరావు. ఆ వాక్యాన్ని చెరుకూరి వారు వ్యాపారపరంగా ఆలోచించారు. పదివేల సైన్యంబును ప్రయోగిస్తూ వచ్చారు. మొదట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పదివేల సైన్యం పొగబాంబులు పేల్చింది. ఫలితంగా ఎన్టీ రామారావు గద్దెనెక్కారు. రామోజీరావు వ్యాపారపు అడుగులకు మడుగులొత్తడానికి రామారావు నిరాకరించారు. క్రుద్ధుడైన రామోజీ వృద్ధుడైన రామారావుపైకి తన పదివేల సైన్యాన్ని అదిలించారు. ఎన్టీఆర్ గద్దె దిగి చంద్రబాబు గద్దెనెక్కారు. మనోవేదనతో ఐదు మాసాల్లోపే ఎన్టీఆర్ చనిపోయారు. రామోజీరావు పట్ల కృతజ్ఞతాపూర్వకంగా చంద్రబాబు ఆయనకు శుక్రాచార్యులవారి హోదా కల్పించారు.పత్రికా రచన రంగానికి సంబంధించి రామోజీకి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయి. ‘ఈనాడు’ ఎడిటర్ హోదాతో ఆయన ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. కానీ ఆయన వృత్తిపరంగా జర్నలిస్టు కాదు. నాన్ జర్నలిస్ట్ ఎడిటర్‌గా ఆయన పలు రికార్డుల్ని బద్దలు కొట్టారు. ఏకవాక్య రచన కూడా లేకుండా ఏకబిగిన దశాబ్దాల తరబడి ప్రధాన సంపాదకుడిగా కొనసాగిన ఘనతను ఆయన్నుంచి ఎవరూ లాక్కోలేరు. 1974లో విశాఖపట్నం నుంచి ‘ఈనాడు’ పత్రిక ప్రారంభమయ్యే నాటికి అప్పటికే ఉన్న రెండు పెద్ద పత్రికలు పాత మూసలోనే మునకేసి ఉన్నాయి. ఈ స్థితిలో కొంత ఆధునికతను జోడిస్తూ, ప్రజల అవసరాలను గమనిస్తూ, వారికి అర్థమయ్యే సరళమైన భాషను వినియోగిస్తూ ‘ఈనాడు’ ముందుకొచ్చింది. ఈ మార్పులకు మూల పురుషుడు ‘ఈనాడు’ తొలి ఎడిటర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ ఉరఫ్ ఏబీకే ప్రసాద్ అనే తెలుగుజాతి అగ్రశ్రేణి పాత్రికేయుడు.‘ఈనాడు’ హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైన కొద్ది కాలానికే ఏబీకే ప్రసాద్‌ను బయటకు పంపించారన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తర్వాత కాలంలో రామోజీరావే స్వయంగా ప్రధాన సంపాదకులయ్యారు. ఏబీకే నెలకొల్పిన పత్రికా ప్రమాణాల స్థానాన్ని క్రమంగా రామోజీ వ్యాపార సూత్రాలు ఆక్రమించాయి. ఈ వ్యాపార సూత్రాలు కూడా పత్రిక విస్తృతిలో వాటి పాత్రను పోషించాయి. ఆ రోజుల్లో ‘స్కైలాబ్’ పేరుతో అమెరికా నెలకొల్పిన ఒక అంతరిక్ష కేంద్రానికి ఆయుష్షు మూడింది. అది ముక్కచెక్కలై భూమ్మీద పడిపోయే సందర్భాన్ని ‘ఈనాడు’ వినియోగించుకున్నది. అది రేపోమాపో పడిపోనున్నదనీ, దాంతో భూమి బద్దలైపోతుందని, ఇవే మనకు చివరి రోజులనీ ఊరూరా ప్రచారం జరగడంలో ‘ఈనాడు’ గొప్ప పాత్రనే పోషించింది. ఆ విధంగా గ్రామీణ ప్రజల్లోకి కూడా చొచ్చుకొనిపోగలిగింది.పత్రికకు ఉండవలసిన నిష్పాక్షికత అనే లక్షణాన్ని ఈ యాభయ్యేళ్ల ప్రయాణంలో మొదటి ఐదారేళ్లు ‘ఈనాడు’ పాటించిందేమో! ఎనభయ్యో దశకం ప్రారంభంలోనే నిష్పాక్షికతకు నిప్పు పెట్టేసింది. గడిచిన నాలుగున్నర దశాబ్దాలుగా దాని పాత్రికేయమంతా ఏకపక్షా రచనా వ్యాసంగమే! నాణేనికి ఉండే రెండో కోణాన్ని తెలుగు ప్రజలు చూడకుండా ‘ఈనాడు’ దాచిపెట్టింది. పోటీగా మరో పత్రిక ఎదగకుండా దాని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే రామోజీ ఎత్తుగడలన్నీ తెలుగు ప్రజల అనుభవంలో ఉన్నవే. ‘ఉదయం’ పత్రిక అకాల అస్తమయానికి ఈ ఎత్తుగడలే కారణం. ‘వార్త’ను నిర్వీర్యం చేయడానికి కూడా అది ప్రయత్నాలు చేసింది. ఒక్క ‘సాక్షి’ ముందు మాత్రం దాని మంత్రాంగం పారలేదు. ఫలితంగా గత పదహారేళ్లుగా తెలుగు ప్రజలకు వార్తాంశాల రెండో కోణం ఆవిష్కృతమైంది. దశాబ్దాల తరబడి తెలుగు ప్రజలకు నిష్పాక్షిక సమాచార హక్కును దక్కకుండా చేసినందుకుగాను ఆయన్ను అక్షర సూర్యుడుగా భృత్య మీడియా బహువిధాలుగా శ్లాఘించింది. ప్రభుత్వం వారి సంస్మరణ సభలో వక్తలందరూ నోరారా కొనియాడారు.ఇక రామోజీరావు తన వ్యాపార సామ్రాజ్య స్థాపనలో అనుసరించిన పద్ధతులూ, నియమోల్లంఘనలూ, చట్టవిరుద్ధ వ్యవహారాలూ ఆమోదయోగ్యమైనవేనా? భవిష్యత్తు తరాల వారికి వాటిని బోధించవచ్చునా? ఈ అంశాలపై విస్తృతమైన చర్చ జరగవలసి ఉన్నది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో ఆయన చేసిన డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమైనదని స్వయంగా ఆర్బీఐ ప్రకటించింది. ఆయన కూడా అది తప్పేనని ఒప్పుకున్నందువల్లనే ఆ సంస్థను మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ఎవరెవరి దగ్గర డిపాజిట్లు వసూలు చేశారో, ఎవరెవరికి తిరిగి చెల్లించారో తెలియజేస్తూ ఒక జాబితాను సమర్పించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం ఆదేశాన్ని ఆయన పాటించలేదు.కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. చిట్‌ఫండ్ సంస్థలు డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. కానీ మార్గదర్శి ఆ చట్టాన్ని ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించింది. ఆ డిపాజిట్లను నిబంధనలకు విరుద్ధంగా షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్‌లో, తమ సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టింది. లేని చందాదారులను ఉన్నట్టుగా చూపిస్తూ ఘోస్ట్ చిట్టీలు నడుపుతూ మనీలాండరింగ్ నేరానికి పాల్పడినట్టు ఇటీవల జరిగిన సోదాల్లో బయటపడింది. కేంద్ర దర్యాపు సంస్థలు జోక్యం చేసుకోవలసిన పరిణామాలివి.ఇక రామోజీ ఫిలింసిటీ ఒక అక్రమాల పుట్ట. ఇక్కడ జరిగిన నియమోల్లంఘనలు నూటొక్క రకాలు. ఇందులో ప్రభుత్వ భూముల ఆక్రమణ ఉన్నది. పప్పుబెల్లాలు పంచి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన నేరం ఉన్నది. తరతరాల నాటి రహదారులనే కబ్జా చేసి కాంపౌండ్ వాల్ చుట్టుకున్న దాదాగిరి ఉన్నది. మాతృభూమిలో వైద్యసేవలు చేయడానికి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ డాక్టర్‌ను బెదిరించి 200 ఎకరాల భూమిని కారుచౌకగా కొట్టేసిన దాష్టీకం ఉన్నది. భూపరిమితి చట్టాన్ని వెంట్రుక సమానంగా జమకట్టిన లెక్కలేని తెంపరితనం ఈ ఫిలింసిటీ కథలో దాగున్నది.ఎటువంటి అనుమతుల్లేకుండా ఫిలిం సిటీలో నిర్మించిన 147 భవనాలు హెచ్ఎమ్డీఏ అధికారాన్ని తొడగొట్టి సవాల్ చేస్తున్నాయి. చెరువులను చెరపట్టి వాటిలోకి ప్రవాహాలను మోసుకెళ్లే కాల్వలను రహదారులుగా మార్చుకున్న ఫిలింసిటీ రుబాబు ముంగిట... ‘వాల్టా’ చట్టం చేతులు ముడుచుకొని సిగ్గుతో తలవంచి నిలబడింది. రామోజీ వ్యాపార సామ్రాజ్య విస్తరణ వెనుక ఇంత తతంగం ఉన్నది. ఇది రేఖామాత్రపు ప్రస్తావన మాత్రమే! ఈ ‘సక్సెస్’ స్టోరీ రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదేనా? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరపడం సమర్థనీయమేనా? అమరావతిలో శిలా విగ్రహం, ఒక రహదారికి పేరు, స్మారక ఘాట్ల స్థాపన ఎటువంటి స్ఫూర్తిని ఉద్దీపింపజేస్తాయి. ‘భారతరత్న’ బిరుదాన్ని ఆయనకు సంపాదించిపెడతామని ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం సరైన సందేశాన్నే సమాజంలోకి పంపిస్తుందా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రామోజీ బ్రతికుండగానే సమాధి కట్టుకున్నాడు.. ఎందుకంటే ?
-
ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు
-
రామోజీరావు అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్, సాక్షి: రామోజీగ్రూప్ సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం ఉదయం ఫిల్మ్ సిటీలోని స్మృతి వనంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు జరిగాయి. రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ నిప్పంటించారు.రామోజీరావుకు గౌరవ వందనంగా గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు పోలీసులు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక.. అంత్యక్రియలకు భారీ సంఖ్యలో రామోజీ సంస్థల ఉద్యోగులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి స్మృతి వనం దాకా అంతిమయాత్ర కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామోజీరావు అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. ఆయన కుటుంబ సభ్యుల కూడా ఇందులో పాల్గొన్నారు.మరోవైపు ఈ ఉదయం కూడా పలువురు ప్రముఖులు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలను వీక్షించేందుకు స్మృతివనంలో ఎల్ఈడీ స్క్రీన్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: పెదపారుపూడి టు ఫిలింసిటీ -
ఈనాడు ఒత్తిళ్లతో మహిళా ఉద్యోగి ఆత్మహత్య
-
ఈనాడు ఒత్తిళ్లతో మహిళా ఉద్యోగి ఆత్మహత్య
అబ్దుల్లాపూర్‌మెట్: ఈనాడు దినపత్రిక యాజమాన్యం ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ మహిళా ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడింది. సంస్థలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను, అనుభవిస్తున్న మానసిక క్షోభను భర్తతో పంచుకున్నప్పటికీ.. అవి మరింత తీవ్రతరం కావడంతో తనకిక చావే శరణ్యం అనుకుంది. తాను పనిచేస్తున్న ఈనాడు కార్యాలయ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు, మృతురాలి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పరిధిలోని కుంట్లూర్ రెవెన్యూ గజ్జి స్వామియాదవ్ కాలనీలో నివాసముండే ఎర్రగొల్ల శ్రీనివాస్, సాయికుమారి (34)కి పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. శ్రీనివాస్ పదిహేనేళ్లుగా, సాయికుమారి తొమ్మిదేళ్లుగా రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఈనాడు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈనాడు కాల్ సెంటర్లో పనిచేసే సాయికుమారికి కొంతకాలంగా సంస్థలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. దీంతో తరచూ ఇబ్బంది పడుతుండేది. భర్తకు చెప్పుకుని బాధ పడేది. ఆదివారం సరదాగా గడిపి.. ఈ క్రమంలోనే భార్యకు మానసిక ధైర్యాన్నిచ్చేందుకు శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి తిప్పాడు. ఇద్దరూ సరదాగా గడిపారు. సోమవారం విధుల్లో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీకి బయలుదేరిన సాయికుమారిని ఉదయం 6 గంటలకు తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి జాతీయ రహదారి వద్ద దిగబెట్టి ఇంటికి వచ్చాడు. అయితే 9 గంటల సమయంలో ఈనాడు హెచ్ఆర్ విభాగం నుంచి శ్రీనివాస్‌కు ఫోన్ వచ్చింది. సాయికుమారి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయిందని చెప్పడంతో హుటాహుటిన ఫిల్మ్‌సిటీకి వెళ్లాడు. అప్పటికే తలకు తీవ్ర గాయమైన సాయికుమారి మృతి చెందింది. శ్రీనివాస్ ఇచ్చింన ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికీ తరలించారు. ఈనాడు సిబ్బంది అత్యుత్సాహం ఈనాడు సంస్థ ఒత్తిళ్ల కారణంగా తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చింన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పీఎస్‌లో ఉన్న శ్రీనివాస్ నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే అతని చుట్టూ కంచెలా ఉన్న ఈనాడు సిబ్బంది అడ్డుకున్నారు. తన భార్య మృతికి దారితీసిన పరిస్థితులను మీడియాకు వివరించేందుకు సిద్ధమవుతున్న శ్రీనివాస్‌ను బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. -
యాజమాన్యం వేధింపులే కారణమంటున్న బంధువులు
-
రామోజీ ఫిలిం సిటీ వేధింపులు...మహిళా ఉద్యోగిని ఆత్మహత్య కేసుపై వాస్తవాలు
-
రామోజీ ఫిలిం సిటీ వేధింపులు...మహిళా ఉద్యోగిని ఆత్మహత్య కేసుపై వాస్తవాలు
-
రామోజీ ఫిల్మ్‌సిటీ: ఈనాడు ఆఫీసు పైనుంచి పడి మహిళ మృతి
-
రాఫిసి: ఈనాడు ఆఫీసు పైనుంచి పడి మహిళ మృతి
సాక్షి,హైదరాబాద్: రాఫిసి(రామోజీఫిల్మ్‌సిటీ)లో ఈనాడు ఉద్యోగిని సాయికుమారి అనుమానస్పదంగా మరణించారు. రాఫిసిలోని ఈనాడు కార్యాలయం నాలుగో అంతస్తు నుంచి కింద పడి సాయికుమారి చనిపోయారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మృతి చెందిన సాయికుమారి ఈనాడు కార్యాలయం కాల్సెంటర్లో ఉద్యోగిని. సాయికుమారి భర్త కూడా ఈనాడు సంస్థల్లోనే పనిచేస్తున్నారు. సాయికుమారికి ఇద్దరు పిల్లలు. మహిళ మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళది ఆత్మహత్యా కాదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సాయికుమారి కుటుంబం పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో నివాసం ఉంటున్నారు. గత కొద్ది కాలంగా వీపరీతమైన పని ఒత్తిడి కారణంగా మనోవేదనకు గురైనట్టు సమాచారం. కొందరు రాఫిసి (రామోజీ ఫిల్మ్ సిటీ) ఉద్యోగులు ఇచ్చిన సమాచారం మేరకు మరణించిన మహిళా ఉద్యోగి పేరు సాయికుమారి అని తెలిసింది. ఈనాడు కార్యాలయంలోని కాల్ సెంటర్లో సాయికుమారి పని చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఉదయం ఆఫీసుకు వచ్చిన సాయికుమారి.. అదే బిల్డింగ్ నాలుగో ఫ్లోర్ పైనుంచి పడి చనిపోవటం సంచలనంగా మారింది. సాయికుమారి భర్త కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాయికుమారి మృతికి గల కారణాలపై ఇతర ఉద్యోగులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఏం జరిగిందో అన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల రాఫిసి (రామోజీ ఫిల్మ్ సిటీ)లో జరిగిన ఓ ఘటన కూడా చర్చనీయాంశమయింది. ఘనంగా ఈవెంట్లు నిర్వహిస్తామని చెప్పుకునే రామోజీ ఫిలిం సిటీలో నిర్వాహకుల నిర్లక్ష్యంతో క్రేన్ వైర్ తెగిపోయింది. ఈ ఘటనలో వెస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్‌షా మరణించగా, సంస్థ ప్రెసిడెంట్ విశ్వనాథ్ తీవ్రంగా గాయపడ్డారు. రాఫిసిలో ఏం జరిగినా.. మీడియాను గానీ ఇతరులను గానీ లోపలికి అనుమతించరని స్థానికులు చెబుతున్నారు. అక్కడ యాజమాన్యం వారిచ్చే సమాచారమే తప్ప .. ఏదీ బయటకు రానివ్వరన్న విమర్శలున్నాయి. ఇదీ చదవండి.. ఫొటోగ్రాఫర్ దారుణ హత్య -
అధికారులతో కుమ్మకై మభ్యపెట్టి మా పత్రాలు కాజేసి..
-
ఆడవాళ్ళని చూడకుండా పోలీసులతో.. రామోజీ రావు అకృత్యాలపై మహిళలు
-
ఫిలింసిటీ నిర్మాణం కోసం రామోజీ వేసిన అడుగులు..స్టెప్ బై స్టెప్
-
గేటులోపలికి పట్టాదారుణ్ని అనుమతిస్తాం, మీడియాకి అనుమతి లేదు
-
రాబందు రామోజీ..సంచలన నిజాలు బయటపెట్టిన బాధితులు..
-
వైఎస్ఆర్ ఇచ్చిన భూములు తిరిగిచ్చేయ్...రామోజీకి డెడ్ లైన్..
-
రామోజీకి గోనె ప్రకాశరావు బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: సమాజానికి మార్గదర్శకులు అని మీకు మీరే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దంటూ రామోజీకి గోనె ప్రకాశరావు బహిరంగ లేఖ రాశారు. మీ నిత్య జీవితంలో విలువలు పాటిస్తున్నారా?. ఇతరుల విషయాల్లో మీరు పాటించే సూత్రాలు మీ విషయంలో ఎందుకు పాటించరు?. ఈ బహిరంగ లేఖ ద్వారా ప్రజల పక్షాన అడిగే ప్రశ్నలకు రామోజీ సమాధానం చెప్పాలి’’ అంటూ ప్రకాశ్‌రావు డిమాండ్ చేశారు. ‘‘పదిహేను సంవత్సరాలుగా బలహీన వర్గాలకు చెందాల్సిన భూములు మీ అధీనం లో ఉన్నాయి. నాగన్‌పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 189, 203 కింద 14 ఎకరాల 30 గుంటల భూమిని దివంగత సీఎం వైఎస్సార్ బలహీన వర్గాలకు కేటాయించారు. మీ రాజకీయ పలుకుబడితో 15 ఏళ్లుగా పేదల భూమిని ఆక్రమించారు. ప్రభుత్వ రహదారిని రామోజీ ఫిలిం సిటీ కింద ఆక్రమించారు. అనాజ్ పూర్ నుండి ఇబ్రహీంపట్నం వరకు 13 కి.మీ ప్రభుత్వ రహదారి ఆక్రమించారు. దాని వల్ల కోహెడ ,ఇబ్రహీంపట్నం వెళ్ళటానికి దూరం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు ప్రభుత్వ రహదారిని ఆక్రమించడం వల్ల 16 గ్రామాల్లోని 90 వేల మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’ అంటూ ప్రకాశరావు దుయ్యబట్టారు. ‘‘ప్రజా రహదారిని కబ్జా చేయటాన్ని మీరెలా సమర్ధించుకుంటారు?. మీరు ప్రజా రహదారులను కబ్జా చేయటం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వ రహదారులు మీ ఎస్టేట్ కాదు. మీ సామ్రాజాన్ని సామాన్యులు చూడకూడదు అనుకుంటే భారీ ప్రహరీలు నిర్మించుకోండి. అంతే కానీ అటువైపు ప్రజలు రాకూడదని ప్రభుత్వ రహదారులు ఆక్రమించటం ఏమిటి?’’ అని ప్రకాశరావు ప్రశ్నించారు. ‘‘రామోజీకి 2024 మార్చి 31 వరకు డెడ్ లైన్. ఈ లోపు ప్రభుత్వ భూములు తిరిగి ఇచ్చేయాలి. మీ స్టూడియోలో పని చేసే వారిని ఉన్న పళంగా తీసేస్తారు. వారికి జీతాలు ఇవ్వరు. కార్మికుల చట్టాలు ఉల్లఘించారు. రామోజీ పిరికివాడు, చావు అంటే భయం.సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇస్తా. రామోజీ ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలి. లేదంటే వైఎస్సార్ పేరు తలుచుకోవడానికి మీరు అర్హులు కాదు. డెడ్ లైన్ లోపు ప్రభుత్వ భూములను రామోజీ తిరిగి అప్పగించాలి. లేదంటే బుల్డోజర్లు పెట్టి మీ గోడలు కూలుస్తా’’ అంటూ గోనె ప్రకాశరావు హెచ్చరించారు. -
రామోజీ ఫిలింసిటీ కేసుపై పోలీసుల దర్యాప్తు వేగవంతం
-
రామోజీ ఫిల్మ్ సిటీలో భద్రతా లోపాలు
-
రామోజీఫిల్మ్ సిటీలో ప్రమాదం..ఒకరు మృతి, మరొకరికి గాయాలు
-
ష్..గప్‌చుప్! ఆ టాలెంట్ రామోజీ రావుకే సొంతం
సాక్షి, హైదరాబాద్: ఎక్కడా రహస్యాలు, దాపరికాలు ఉండకూడదంటూ ఊదరగొట్టే రామోజీరావు, తన దినపత్రిక, తన గ్రూపు సంస్థల్లో జరిగే ఉదంతాలను మాత్రం అత్యంత గోప్యంగా ఉంచాలని చూస్తారు. ముఖ్యంగా ఫిల్మ్ సిటీలో ఏం జరిగినా అంత సులభంగా బయటకు పొక్కదు. రామోజీరావు అంగీకరిస్తే తప్ప ఫిల్మ్ సిటీ ఆనే కోటలోకి తమకు కూడా ఎంట్రీ ఉండదని పోలీసు వర్గాలే చెబుతుంటాయి. కాగా ఈ క్రమంలో తమతో పాటు అవస రమైతే ప్రభుత్వం పైనా ఒత్తిడి తీసుకువచ్చి విషయం బయట పడకుండా మేనేజ్ చేస్తారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఉదంతాలు కొన్ని గతంలో చోటు చేసుకున్నాయి. అయితే గురువారం చోటు చేసుకున్న ప్రమాదంలో కన్నుమూసింది తమ ఉద్యోగి కాకపోవడం, బయటి వాడైన ప్రవాస భారతీయుడు కావడంతో విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. అప్పట్లో 22 మంది ఉద్యోగులు గాయపడినా.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదాలు చోటు చేసుకోవడం కొత్తేంకాదు. చిన్న చిన్న ఉదంతాలు, తన ఉద్యోగులకు పరిమితమైన, ఒకరిద్దరికి సంబంధించిన అంశాలు ఆ కోట దాటి బయటకు రావు.. రానివ్వరు. కానీ 2008 నవంబర్‌లో చోటు చేసుకున్న ఓ భారీ అగ్నిప్రమాదం.. వారం తర్వాత ‘సాక్షి’ చొరవతో వెలుగులోకి వచ్చింది. ఓ అంతర్జాతీయ సంస్థకు చెందిన వార్షిక సమావేశానికి దాని నిర్వాహకులు రామోజీ ఫిల్మ్ సిటీని ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందాలు పూర్తయిన తర్వాత వేదిక కూడా ఖరారైంది. ఆ ఏడాది నవంబర్ 2న దాదాపు 3,500 మంది హాజరైన ఆ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఫిల్మ్ సిటీకి చెందిన సిబ్బంది ప్రధాన వేదికను సిద్ధం చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎగరేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్టేజీ సమీపంలో దాదాపు 200 హైడ్రోజన్ బెలూన్లను ఉంచారు. ఈ కార్యక్రమం నిర్వహణను అప్పట్లో ఫైర్ సూపర్వైజర్గా ఉన్న శ్రీనివాసరావు, ఫైర్ మెన్ లక్ష్మణ్‌లు పర్యవేక్షించారు. అయితే ఈ ఉత్సవాలకు హాజరైన ఓ ప్రతినిధి హైడ్రోజన్ బెలూన్ల సమీపంలో సిగరెట్ కాల్చే ప్రయత్నం చేసినా ఫిల్మ్ సిటీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఫైర్ సూపర్వైజర్, ఫైర్ మెన్ మాత్రం వారించే ప్రయత్నం చేశారు. ఈలోపే ఆ ప్రతినిధి విసిరేసిన సిగరెట్ పీక సమీపంలో ఉన్న హైడ్రోజన్ బెలూన్లపై పడటం, అవి ఒక్కసారిగా పేలిపోయి మంటలు వ్యాపించడం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడ పని చేస్తున్న దాదాపు 22 మంది ఫిల్మ్ సిటీ ఉద్యోగులకు గాయాలయ్యాయి. వీరికి తన కోటలోనే ఉన్న ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా వైద్యం చేయించిన రామోజీరావు.. పోలీసులు, అగ్నిమాప శాఖ అధికారుల వరకు విషయం చేరనీయలేదు. తన సంస్థ కోసం పని చేస్తూ గాయపడిన వారికి మొండిచేయి చూపారు. దాదాపు వారం తర్వాత ఈ విషయం నాటకీయంగా వెలుగులోకి రావడంతో హయత్‌నగర్ (అప్పట్లో అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణా లేదు) పోలీసులు సీన్లోకి వచ్చారు. దీంతో విషయం లీక్ చేశారంటూ రామోజీ సైన్యం రాద్ధాంతం చేసింది. చివరకు నామమాత్రంగా సిబ్బందికి సహాయం చేసింది. ఆ టాలెంట్ రామోజీ రావుకే సొంతం ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రమాదాలను బాహ్య ప్రపంచానికి తెలియకుండా దాచి ఉంచే రామోజీ రావులో మరో టాలెంట్ కూడా ఉంది. తన సంస్థల్లో చోటు చేసుకునే ఉదంతాలు పోలీసు రికార్డులకు ఎక్కకుండా చూడటమే కాదు.. తప్పంతా క్షతగాత్రులు లేదా బాధితులదే అన్నట్టుగా కూడా చూపించగలరు. బాధితులే ఆ విధంగా చెప్పేలా చేయగల నైపుణ్యం రామోజీరావు సొంతం. 2009లో బాలానగర్‌లోని ఈనాడు ప్రింటింగ్ ప్రెస్‌లో జరిగిన ప్రమాదమే దీనికి ఉదాహరణ. ఈ ఉదంతాన్ని చాలా రోజులు గోప్యంగా ఉంచిన యాజమాన్యం ఎట్టకేలకు పోలీసులకు తెలిపినా.. ఫిర్యాదు లేకుండా చూసుకుంది. సీన్ కట్ చేస్తే తప్పు తనదే అంటూ చెప్పిన ఆ బాధితుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం కొసమెరుపు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిజయ్‌కుమార్ నిరుపేద. బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చి భవన నిర్మాణ కార్మికుడిగా మారాడు. 2009 మే 19న బాలానగర్‌లోని ఈనాడు ప్రింటింగ్ ప్రెస్‌లో పనికి వచ్చాడు. అక్కడి మూడో అంతస్తులో పని చేస్తూ మధ్యాహ్నం వేళ కింద పడ్డాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది విషయం రామోజీ కోటరీకి తెలిపారు. వాళ్ళ ఆదేశాల మేరకు విషయం బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో బిజయ్‌ను ఈనాడు ప్రింటింగ్ ప్రెస్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలించాలని ప్రయత్నించారు. అక్కడ పండ్ల వ్యాపారం చేసే సయ్యద్ ముస్తఫా ఈ వ్యవహారం గమనించి అడ్డుకుని ప్రశ్నించారు. క్షతగాత్రుడికి తక్షణ వైద్యం అందాలనే ఉద్దేశంతో ‘108’కు సమాచారం ఇచ్చారు. ఈ పరిణామంతో కంగుతిన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయనపై దాడి చేసి తమపైనే దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ముస్తాఫా ద్వారా ఈ ప్రమాదం విషయం వెలుగులోకి రావడంతో బాలానగర్ పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీంతో హడావుడిగా బిజయ్‌కుమార్ వద్దకు వెళ్ళిన ఈనాడు సిబ్బంది కథ మార్చేశారు. అదే రోజు అతడిని తీసుకుని బాలానగర్ ఠాణాకు వచ్చారు. తన తప్పిదం వల్లే ఈనాడు కార్యాలయం పైనుంచి కింద పడ్డానని, దీనిపై కేసు వద్దని అతడితోనే రాయించి పంపారు. ఫిర్యాదు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. విస్టెక్స్ ఉదంతంలోనూ అనేక ప్రయత్నాలు విస్టెక్స్ ఏషియా సీఈఓ సంజయ్ షా మరణానికి కారణమైన రామోజీ ఫిల్మ్ సిటీపై ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలిదిండి జానకిరామ్ రాజు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇందులో ఫిల్మ్ సిటీలోని భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం, రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్న వైఫల్యాలను ఎత్తిచూపారు. అయితే విస్టెక్స్ ఉదంతంలోనూ రామోజీ తన మార్క్‌ను చూపించారు. దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న ఆర్ఎఫ్సీ ఉద్యోగుల ఫోన్లన్నీ స్వాధీనం చేసుకోవాలని, విషయం బయటకు పొక్కనివ్వొద్దని హెచ్చరించారు. పోలీసులకిచ్చిన ఫిర్యాదులోని అంశాలు రికార్డుల్లోకి ఎక్కకుండా ఉంచేందుకు ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించారు. జరిగిన ఉదంతంపై కేసు నమోదు చేసుకోవాలని, కానీ భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం, అంబులెన్స్ రాక ఆలస్యం కావడం, అదనపు అంబులెన్స్ లేకపోవడం వంటివి ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) నమోదు కాకుండా చూడాలని అనేక ప్రయత్నాలు చేశారు. అవి రికార్డుల్లోకి ఎక్కి, బయటకు వస్తే ఫిల్మ్ సిటీ వ్యాపారం దెబ్బతింటుదంటూ తమ మందీమార్బలంతో పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. కానీ పోలీసులు ససేమిరా అన్నారు. విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడమే కాకుండా ఫిర్యాదులోని ప్రతి అంశాన్నీ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. -
RFC: నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్: హైదరాబాద్ నగర శివార్లలో ఈనాడు అధి నేత చెరుకూరి రామోజీరావు నేతృత్వంలోని రామో జీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్వా హకుల నిర్లక్ష్యం, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపో వడం, అత్యవసర సమయంలో వినియోగించడా నికి అంబులెన్స్‌లు సైతం లేక ఆస్పత్రికి తరలించ డంలో 20 నిమిషాల వరకు ఆలస్యం కావడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. అంచెలంచెలుగా ఎది గిన ప్రవాస భారతీయుడు, బహుళజాతి సంస్థ విస్టెక్స్ ఏషియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈఓ సంజయ్ షా (56) ప్రాణాలు కోల్పోయా రు. తీవ్రంగా గాయపడిన ఆ సంస్థ ప్రెసిడెంట్ దాట్ల విశ్వనాథ్ రాజు అలియాస్ రాజు దాట్ల (52) ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రమా దం జరిగిన వెంటనే ఘటనా స్థలిలోనే ఉన్న షా సతీమణి అంబులెన్స్, అంబులెన్స్ అంటూ అక్కడ ఉన్న ఫిల్మ్ సిటీ సిబ్బందిని విలపిస్తూ వేడుకోవడం కంటతడి పెట్టించింది. గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనపై సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలిదిండి జానకిరామ్ రాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఫిల్మ్ సిటీ సహా మరికొందరిపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై నుంచి అమెరికా దాకా.. ముంబైకి చెందిన సంజయ్ షా 1989లో అమెరికాకు వలసవెళ్ళారు. అక్కడి లేహై యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అమెరికాలోనే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్, జనరల్ మోటార్స్‌లతో పాటు జర్మనీలోని సాప్ సంస్థలోనూ ఉన్నత స్థానాల్లో పని చేశారు. తర్వాత సొంత కంపెనీ ఏర్పాటు కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. 1999లో అమెరికాలోని ఇల్లినాయిస్ కేంద్రంగా విస్టెక్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో విస్తరించింది. దీని వార్షిక టర్నోవర్ రూ.3,500 కోట్లకు పైగా ఉంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోనూ దీని కార్యాలయం ఉంది. దీనికి కలిదిండి జానకిరామ్ రాజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. తమ సంస్థ ఏర్పాటు చేసి 25 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని భావించిన యాజమాన్యం రామోజీ ఫిల్మ్ సిటీని వేదికగా ఎంచుకుంది. లైమ్లైట్ గార్డెన్లో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విస్టెక్స్ కార్యాలయాల్లో ఈ వేడుకలు జరుగుతుండగా.. ప్రతి కార్యక్రమానికీ సీఈఓ సంజయ్ షా, ప్రెసిడెంట్ విశ్వనాథ్ రాజు హాజరవుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ లోని తమ ఉద్యోగులు, క్లయింట్లతో కలిసి వేడుకల నిర్వహణకు రామోజీ ఫిల్మ్ సిటీలోని లైమ్లైట్ గార్డెన్‌ను బుక్ చేసుకున్నారు. రెండురోజుల పాటు జరిగే వేడుకల కోసం గురువారం రాత్రి ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. 20 అడుగుల ఎత్తునుంచి దిగుతూ.. ప్రారంభ కార్యక్రమాన్ని వెరైటీగా నిర్వహించాలని నిర్ణయించారు. కాంక్రీట్ స్టేజీపైన ఉన్న రూఫ్‌కు తాళ్లు కట్టి, వాటికి వేలాడేలా చెక్కతో ఓ ప్లాట్‌ఫామ్ తయారు చేశారు. అలంకరించిన ఆ ప్లాట్‌ఫామ్ మె ల్లగా కిందకు దిగుతుండగా సీఈఓ, ప్రెసిడెంట్లు 20 అడుగుల ఎత్తులో దానిపై నిలబడి.. ఆహుతు లకు అభివాదం చేస్తూ స్టేజీపైకి దిగేలా ఏర్పాట్లు చే శారు. ఇందుకు ఫిల్మ్ సిటీతో పాటు ఈవెంట్ మేనే జర్ల అనుమతి కూడా తీసుకున్నారు. చెక్కతో చేసిన సదరు ప్లాట్‌ఫామ్‌కు రెండు వైపులా ఇనుప చువ్వ లు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 7.40 గంటల సమయంలో ఈ ప్లాట్‌ఫామ్ పైకి ఇద్దరూ ఎక్కగా.. పైన ఉన్న రూఫ్‌కు కట్టిన తాళ్ల సాయంతో ప్లాట్‌ఫామ్‌ను పైనుంచి కిందకు దింపడం ప్రారంభించారు. అయితే కొద్దిసే పటికే ఒక పక్కన తాడు తెగిపోవడంతో ప్లాట్‌ఫామ్ పక్కకు ఒరిగి, దానిపై ఉన్న ఇద్దరూ దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి సిమెంట్‌తో కట్టిన స్టేజీపై వేగంగా పడి పోయారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేవు.. రెస్క్యూ లేదు విస్టెక్స్, ఫిల్మ్ సిటీ ఉద్యోగులు, ఈవెంట్ మేనేజర్లు వెంటనే అక్కడ గుమిగూడారు. విస్టెక్స్ సంస్థ ప్రతినిధులు తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఏదైనా పెద్ద ఆస్పత్రికి తరలించడానికి సహాయం చేయాల్సిందిగా అక్కడ ఉన్న వారిని కోరారు. ఓ వైపు సరైన భద్రతా ఏర్పాట్ల లోపం కారణంగా ప్రమాదం జరగ్గా.. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించేలా సరైన రెస్క్యూ టీమ్ సైతం ఫిల్మ్ సిటీకి లేకపోవడంతో విలువైన సమయం వృధా అయ్యింది. ఆస్పత్రికి తరలింపు ఆలస్యమైంది. విస్టెక్స్ ప్రతినిధులు, షా భార్య 15 నుంచి 20 నిమిషాలు వేడుకుంటే తప్ప ఫిల్మ్ సిటీ నిర్వాహకులు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయలేదు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఒక అంబులెన్స్‌లో సంజయ్ షాను హయత్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. విశ్వనాథ్ రాజును తీసుకువెళ్లడానికి మరో అంబులెన్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కంపెనీ ప్రతినిధులు ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన్ను సొంత కారులోనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో సంజయ్ షా కన్నుమూశారు. విశ్వనాథ్ రాజును మెరుగైన చికిత్స నిమిత్తం మలక్‌పేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శరీరంలో అనేక చోట్ల ఎముకలు విరగటంతో పాటు తీవ్ర గాయాలైన ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఫిల్మ్ సిటీపై క్రిమినల్ కేసు నమోదు జానకిరామ్ రాజు తన ఫిర్యాదులో ఫిల్మ్ సిటీలోని భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం తదితర అంశాలను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ (ఉషా కిరణ్ ఈవెంట్స్), సీనియర్ ఈవెంట్ మేనేజర్ రితిక్ ఛటర్జీ, సేఫ్టీ డిపార్ట్మెంట్ చీఫ్ మేనేజర్ జి.ఉదయ్ కిరణ్, ఫిల్మ్ సిటీలో స్పెషల్ ఎఫెక్ట్స్ కాంట్రాక్టర్‌గా ఉన్న ఎస్.సురేష్ బాబు, రోప్ ఆపరేటర్ ఎస్.దుర్గా సతీష్ తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 336, 287 రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద వీరిపై ఆరోపణలు చేశారు. భార్య కళ్ల ఎదుటే ప్రమాదం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగిన సమయంలో విస్టెక్స్ సంస్థ సీఈఓ సంజయ్ షా భార్య కూడా అక్కడే ఉన్నారు. దంపతు లిద్దరూ గురువారం సాయంత్రం తమ సొంత విమానంలో ముంబై నుంచి శంషాబాద్ విమా నాశ్రయానికి, అక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చారు. స్టేజీ కింద ఆహుతులతో కలిసి సంజయ్ భార్య కూర్చుని వీక్షిస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. దీంతో పరుగున స్టేజీ పైకి వచ్చిన ఆమె.. రక్తపు మడుగులో పడి ఉన్న తన భర్తను ఆస్పత్రికి తరలించండి అంటూ దాదా పు 15 నిమిషాలు అందరినీ వేడుకున్నారు. ఉస్మానియాలో పోస్టుమార్టం.. ముంబైకి మృతదేహం సంజయ్ షా మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శుక్రవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భార్యకు అప్పగించారు. అక్కడి నుంచి శవపేటికను మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ప్రత్యేక అంబులెన్స్‌లో ఎయిర్‌పోర్టుకు, ఆపై విమానాశ్రయం అంబులెన్స్‌లో షా విమానం ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్ళారు. కానీ అందులో శవ పేటికను పెట్టడానికి అవకాశం లేకపోవడంతో కార్గో విమానంలో ముంబైకి పంపారు. షా భార్య సహా మిగిలిన వారు సంజయ్ విమానంలోనే ముంబై వెళ్ళారు. తమ స్వస్థలం గుజరాత్ అని, ఏళ్ళ క్రితమే ముంబైకి వలసవచ్చామని సంజయ్ భార్య పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెలు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. -
రామోజీ ఫిల్మ్ సిటీపై కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలు అయ్యాయి. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ను నిందితులుగా చేర్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఫంక్షన్ల నిర్వహణ కోసం పలు గార్డెన్లను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి లైమ్లైట్ గార్డెన్. ఈ గార్డెన్ వద్ద విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో క్రేన్ ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ ద్వారా గెస్టులను కిందకు దించుతుండగా వైర్ తెగిపోయింది. దీంతో పలువురు కంపెనీ ప్రతినిధులు కిందపడిపోయారు. తీవ్రగాయాలతో విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షా అక్కడికక్కడే చనిపోయాడు. మృతిని పోలీసులు ధృవీకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంలో కంపెనీ చైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆయన్ని మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై ఆస్పత్రి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరికొందరు కంపెనీ ప్రతినిధులకు సైతం గాయాలైనట్లు తెలిసింది. ప్రమాదం ఎలా జరిగిందంటే.? రామోజీ ఫిల్మ్ సిటీలోని లైమ్లైట్ గార్డెన్లో విస్టెక్స్ కంపెనీకి సంబంధించి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విస్టెక్స్ కంపెనీ సిబ్బంది పలువురు హాజరయ్యారు. ఏర్పాట్లు అన్నీ రామోజీ ఫిలింసిటీ చేసింది. ఇందులో భాగంగా సినిమా తరహాలో ఎత్తు నుంచి ఓ క్రేన్‌లో CEOను, ఛైర్మన్‌ను కిందికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సర్కస్ తరహా ఫీట్లకు నిర్వహాకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిపుణులైన సిబ్బందితో పాటు.. నాణ్యమైన క్రేన్లు ఉండాలి. దీంతో పాటు పబ్లిక్ ఈవెంట్లలో ఇష్టానుసారంగా సర్కస్ ఫీట్లు చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. పైగా ఏ ప్రభుత్వాధికారి కూడా ఇలాంటి ఫీట్లకు అనుమతి కూడా ఇవ్వరు. అయినా రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహాకులు అన్ని నిబంధనలను పక్కనబెట్టి.. విస్టెక్స్ కంపెనీ ఉన్నతాధికారులను క్రేన్ ఎక్కించారు. తేడా కొట్టడంతో క్రేన్ కుప్పకూలి సీఈవో సంజయ్‌షా మరణించారు. (ప్రమాదం జరిగిన గార్డెన్ ప్రాంతం ఇదే) ఇక ఈ ఘటనపై కేసు నమోదు అయ్యింది. FIR ప్రకారం.. జానకీరాం రాజు అనే ప్రైవేట్ ఉద్యోగి ఈ ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులుగా రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ను చేర్చి దర్యాప్తు చేపట్టారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు. -
రామోజీఫిల్మ్‌సిటీలో రాజవంశీకుల భూములు
సాక్షి, న్యూఢిల్లీ: రామోజీ ఫిల్మ్‌సిటీలో రాజవంశీకులకు చెందిన భూములతోపాటు అసైన్డ్, రహదారి భూములున్నాయని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రామోజీ ఫిల్మ్ సిటీలో భూఆక్రమణలపై మీడియాతో ఆయన మాట్లాడారు. రామోజీ ఫిల్మ్‌సిటీకి చెందిన 3 వేల ఎకరాల్లో 1,700 ఎకరాలు గాలిబ్ జంగ్కు చెందిన భూములున్నాయని... ప్రజారహదారులు, హరిజనుల భూములు, భూదాన్ భూములను సైతం కబ్జా చేశారని చెప్పా రు. కార్మికుల చట్టాలను కూడా ఉల్లంఘిచారని, గతంలో ఈనాడులో పనిచేసిన వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. అనాజ్‌పూర్–ఇబ్రహీంపట్నం రహదారిని మూసేసి, కబ్జా చేశారని... దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గోనె పేర్కొన్నారు. దివంగత వై.ఎస్.రాజ శేఖరరెడ్డి హయాంలో 682 మందికి 200 గజాల చొప్పున పట్టాలు ఇవ్వగా లబ్దిదారులను వారి స్థలాల్లోకి రానివ్వట్లేదని గోనె ప్రకాశ్‌రావు ఆరోపించారు. ఈ ఆస్తులను ప్రభుత్వం వెంటనే అ«దీనంలోకి తీసుకొని రామోజీరావుకు నోటీసులు జారీ చేయాలన్నారు. ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’చట్టం ప్రకారం నోటీసులపై రామోజీరావు కోర్టుకు వెళ్లడానికి వీల్లేదని... ఇది చాలా పటిష్టమైన చట్టమని చెప్పారు. న్యాయ పోరాటం క్లైమాక్స్‌కు... బ్రిటిష్ పాలకులు ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’అనే చట్టం తీసుకొచ్చారని, అందులో దేశవ్యాప్తంగా వివిధ రాజవంశాలకు చెందిన 560 మందిని చేర్చారని గోనె ప్రకాశ్‌రావు తెలిపారు. నిజాం స్టేట్‌లో మార్వాడీ, ముస్లింలు తదితర 8 కుటుంబాలు ఉన్నాయన్నారు. అయితే ఈ రాజవంశీకులకు చెందిన రూ. లక్షల కోట్ల విలువైన ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని.. ఈ విషయంలో తాను చేస్తున్న పోరాటం క్లైమాక్స్‌కు వచ్చిందన్నారు. ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’చట్టం ప్రకారం రాజవంశీకుల మరణానంతరం వారి వారసులు మైనర్లయితే పరిశ్రమలు, ఆస్తులు, భూములను ప్రభుత్వం అదీనంలోకి తీసుకుంటుందని... వారసులు మేజర్లు అయ్యాక ఆ ఆస్తులను వారికి తిరిగి అప్పగిస్తుందని ఆయన చెప్పారు. అయితే తెలంగాణలో ఆ ఆస్తులు, భూములు అన్యాక్రాంతమయ్యాయని, రూ. లక్షల కోట్ల విలువైన ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’కిందకు వచ్చే ఆస్తులు ఒక పత్రికాధిపతి (రామోజీరావు), తెలుగు రాష్ట్రాల్లోనే నంబర్ వన్ బిల్డర్‌గా ఉన్న రామేశ్వరరావు అధీనంలో ఉన్నాయని గోనె ఆరోపించారు. వాటిలో పెద్దపెద్ద భవనాలు కట్టారని తెలిపారు. రాష్ట్రంతోపాటు అమెరికాలో పెద్ద పారిశ్రామికవేత్త, ఎయిర్‌పోర్టులు నిర్మించిన ఆయనకు స్టార్ హోటళ్లు కూడా ఉన్నాయని వాటిని తాజ్ గ్రూప్‌నకు ఇచ్చారని, అవి కూడా ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’భూములే అన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు విచారణ చేపట్టాలి రాజవంశానికి చెందిన వారందరినీ కలుపుకొని న్యాయం కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాం«దీలను కలిసి ఆధారాలు అందిస్తానని గోనె ప్రకాశ్‌రావు తెలిపారు. ఈ తరహా వ్యవహారాలు కర్ణాటకలోనూ ఉన్నందున చర్యలు తీసుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒక కమిటీ వేసి విచారణ జరిపించాలని కోరారు. సంబంధిత పత్రాలు, సమాచారం కోసం హైదరాబాద్‌లోని రాజ్యాభిలేఖ కార్యాలయానికి దరఖాస్తు చేశానన్నారు. 2008లో పాయిగా వంశానికి చెందిన 140 ఎకరాలు (రూ. 20 వేల కోట్ల విలువైన) రిలీజ్ అయ్యాయని తెలిపారు. దీనిపై రాయచూర్‌లోని ఆ కుటుంబంతో మాట్లాడానని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు హామీలిచ్చిన పథకాల అమలుకు ఆ ఆస్తులను వాడాలని కోరతామని చెప్పారు. లక్ష నాగళ్లతో (రామోజీ ఫిల్మ్‌సిటీని) దున్నిస్తానని చెప్పిన కేసీఆర్... సీఎం అయ్యాక కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని త్వరలో కలిసి ఈ వ్యవహారాన్ని వివరిస్తానని చెప్పారు. ఆర్థిక చిక్కుల్లో నుంచి రాష్ట్రం బయటపడేందుకు తాను చెబుతున్న విషయం ఒక ఫార్ములా అని అన్నారు. ఈ సందర్భంగా గతంలో రామోజీరావు ఆక్రమణలపై 2010లో ‘ఇండియా టుడే’ ప్రచురించిన కథనాలను, పత్రాలను గోనె ప్రకాశ్‌రావు మీడియాకు చూపించారు.