ఈనాడు కార్యాలయంలో దారుణం
రామోజీ ఫిలింసిటీలో అనూహ్యంగా ప్రాణాలు విడిచిన ఈనాడు ఉద్యోగిని
ఈనాడు కార్యాలయం నాలుగో ఫ్లోర్ మీది నుంచి పడడంతో మృతి
ఇప్పటివరకు ప్రకటన చేయని రాఫిసి యాజమాన్యం
సాక్షి,హైదరాబాద్: రాఫిసి(రామోజీఫిల్మ్‌సిటీ)లో ఈనాడు ఉద్యోగిని సాయికుమారి అనుమానస్పదంగా మరణించారు. రాఫిసిలోని ఈనాడు కార్యాలయం నాలుగో అంతస్తు నుంచి కింద పడి సాయికుమారి చనిపోయారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మృతి చెందిన సాయికుమారి ఈనాడు కార్యాలయం కాల్‌సెంటర్‌లో ఉద్యోగిని.
సాయికుమారి భర్త కూడా ఈనాడు సంస్థల్లోనే పనిచేస్తున్నారు. సాయికుమారికి ఇద్దరు పిల్లలు. మహిళ మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళది ఆత్మహత్యా కాదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సాయికుమారి కుటుంబం పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో నివాసం ఉంటున్నారు. గత కొద్ది కాలంగా వీపరీతమైన పని ఒత్తిడి కారణంగా మనోవేదనకు గురైనట్టు సమాచారం.
కొందరు రాఫిసి (రామోజీ ఫిల్మ్ సిటీ) ఉద్యోగులు ఇచ్చిన సమాచారం మేరకు మరణించిన మహిళా ఉద్యోగి పేరు సాయికుమారి అని తెలిసింది. ఈనాడు కార్యాలయంలోని కాల్ సెంటర్లో సాయికుమారి పని చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఉదయం ఆఫీసుకు వచ్చిన సాయికుమారి.. అదే బిల్డింగ్ నాలుగో ఫ్లోర్ పైనుంచి పడి చనిపోవటం సంచలనంగా మారింది. సాయికుమారి భర్త కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాయికుమారి మృతికి గల కారణాలపై ఇతర ఉద్యోగులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఏం జరిగిందో అన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల రాఫిసి (రామోజీ ఫిల్మ్ సిటీ)లో జరిగిన ఓ ఘటన కూడా చర్చనీయాంశమయింది. ఘనంగా ఈవెంట్లు నిర్వహిస్తామని చెప్పుకునే రామోజీ ఫిలిం సిటీలో నిర్వాహకుల నిర్లక్ష్యంతో క్రేన్ వైర్ తెగిపోయింది. ఈ ఘటనలో వెస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్‌షా మరణించగా, సంస్థ ప్రెసిడెంట్ విశ్వనాథ్ తీవ్రంగా గాయపడ్డారు. రాఫిసిలో ఏం జరిగినా.. మీడియాను గానీ ఇతరులను గానీ లోపలికి అనుమతించరని స్థానికులు చెబుతున్నారు. అక్కడ యాజమాన్యం వారిచ్చే సమాచారమే తప్ప .. ఏదీ బయటకు రానివ్వరన్న విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment