suspiciously died
-
రాఫిసి: ఈనాడు ఆఫీసు పైనుంచి పడి మహిళ మృతి
సాక్షి,హైదరాబాద్: రాఫిసి(రామోజీఫిల్మ్‌సిటీ)లో ఈనాడు ఉద్యోగిని సాయికుమారి అనుమానస్పదంగా మరణించారు. రాఫిసిలోని ఈనాడు కార్యాలయం నాలుగో అంతస్తు నుంచి కింద పడి సాయికుమారి చనిపోయారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మృతి చెందిన సాయికుమారి ఈనాడు కార్యాలయం కాల్సెంటర్లో ఉద్యోగిని. సాయికుమారి భర్త కూడా ఈనాడు సంస్థల్లోనే పనిచేస్తున్నారు. సాయికుమారికి ఇద్దరు పిల్లలు. మహిళ మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళది ఆత్మహత్యా కాదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సాయికుమారి కుటుంబం పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో నివాసం ఉంటున్నారు. గత కొద్ది కాలంగా వీపరీతమైన పని ఒత్తిడి కారణంగా మనోవేదనకు గురైనట్టు సమాచారం. కొందరు రాఫిసి (రామోజీ ఫిల్మ్ సిటీ) ఉద్యోగులు ఇచ్చిన సమాచారం మేరకు మరణించిన మహిళా ఉద్యోగి పేరు సాయికుమారి అని తెలిసింది. ఈనాడు కార్యాలయంలోని కాల్ సెంటర్లో సాయికుమారి పని చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఉదయం ఆఫీసుకు వచ్చిన సాయికుమారి.. అదే బిల్డింగ్ నాలుగో ఫ్లోర్ పైనుంచి పడి చనిపోవటం సంచలనంగా మారింది. సాయికుమారి భర్త కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాయికుమారి మృతికి గల కారణాలపై ఇతర ఉద్యోగులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఏం జరిగిందో అన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల రాఫిసి (రామోజీ ఫిల్మ్ సిటీ)లో జరిగిన ఓ ఘటన కూడా చర్చనీయాంశమయింది. ఘనంగా ఈవెంట్లు నిర్వహిస్తామని చెప్పుకునే రామోజీ ఫిలిం సిటీలో నిర్వాహకుల నిర్లక్ష్యంతో క్రేన్ వైర్ తెగిపోయింది. ఈ ఘటనలో వెస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్‌షా మరణించగా, సంస్థ ప్రెసిడెంట్ విశ్వనాథ్ తీవ్రంగా గాయపడ్డారు. రాఫిసిలో ఏం జరిగినా.. మీడియాను గానీ ఇతరులను గానీ లోపలికి అనుమతించరని స్థానికులు చెబుతున్నారు. అక్కడ యాజమాన్యం వారిచ్చే సమాచారమే తప్ప .. ఏదీ బయటకు రానివ్వరన్న విమర్శలున్నాయి. ఇదీ చదవండి.. ఫొటోగ్రాఫర్ దారుణ హత్య -
అన్న కొడుకుతో ప్రేమ వ్యవహారం.. మందలించడంతో
సాక్షి, నార్నూర్: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ క్వార్టర్స్‌లో శుక్రవారం రాత్రి ఇందూరు వైష్ణవి (15) అనే బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. ఎస్హెచ్ఓ బి.శ్రీనివాస్ తెలిపిన వివరాలివీ.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గతేడాదిగా హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఇందూరు ఊశన్న–వసంతలది ఆదిలాబాద్ గ్రామం. తన భార్య వసంత ఆదిలాబాద్‌లో అంగన్వాడీ విధులు నిర్వహిస్తుండగా, కరోనా నేపథ్యంలో తన కూతురు వైష్ణవితో కలిసి స్థానిక క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. తన ఏకైక కూతురును గారంగా పెంచారు. ఆమె ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. (ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి.. ఆస్తి కోసం) రెండేళ్లుగా వైష్ణవికి వరుసకు అన్న అయిన సడ్డకుని అన్న కొడుకుతో ప్రేమ వ్యవహారం సాగుతోంది. గమనించిన కుటుంబ సభ్యులు గతంలోనే వారిని మందలించారు. ఇదే విషయమై తరచూ గొడవలు జరిగేవి. ఆమెకు కౌన్సెలింగ్ సైతం చేసినా మార్పు రాలేదు. శుక్రవారం రాత్రి ఫోన్లో చాటింగ్ చేస్తుండగా గమనించిన తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైనట్లు పేర్కొన్నారు. కాగా బాలిక మృతి అనుమానాస్పదంగా ఉందని తల్లి వసంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ శ్రీనివాస్ వివరించారు. ఇదిలా ఉండగా సంఘటన స్థలాన్ని ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్‌రెడ్డి పరిశీలించారు. (అనుమానించి ఉద్యోగం మాన్పించాడు.. చివరకు!) -
గాజులు పెట్టించుకోవడానికి వెళ్లి..
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని కొండపూర్ శివారు మల్లన్నగుట్ట తండాకు చెందిన అంగన్వాడీ టీచర్ దారావత్ గీత(26) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..గీత గురువారం సాయంత్రం తన ఆడబిడ్డలతో కలిసి కొండపూర్‌లో గాజులు పెట్టుకోవడానికి వెళ్లింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గురువారం రాత్రి గ్రామ శివారులోని రోడ్డుపై గీత కింద పడి రక్తం మడుగులో ఉంది. విషయాన్ని గమనించిన కొందరు భర్త భోజ్యానాయక్‌కు తెలిపారు. భోజ్యానాయక్ సంఘటన స్థలానికి వెళ్లి గీతను చేర్యాలలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిఖిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం గీత మృతి చెందింది. మృతురాలికి భర్త, మగ్గురు కుమారైలు ఉన్నారు. గాజుల దుకాణం వద్ద నుంచి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను ఇంటి వద్ద దింపుతానని బండిపై ఎక్కించుకుని తీసుకెళ్లి తలపై బండతో కొట్టి చంపాడని మృతురాలి భర్త భోజ్యానాయక్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని మద్దూరు ఎస్ఐ ఎన్ వీరేందర్ తెలిపారు. -
మంటలకు కాంప్లెక్స్ నిర్వాహకుడి ఆహుతి
రాజమహేంద్రవరం క్రైం: వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరి«ధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా గన్నవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(65) కొంతకాలంగా భార్య, పిల్లలతో గొడవపడి రాజమహేంద్రవరం వచ్చేశాడు. ఇతడు గోదావరి గట్టున మార్కండేయస్వామి గుడి సమీపంలో ఉన్న సులభ కాంప్లెక్స్‌ను రెండు నెలలుగా కంచిపాటి గోవింద్ వద్ద సబ్ లీజుకు తీసుకొని నిర్వహిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సులభ కాంప్లెక్స్ నుంచి మంటలు వ్యాపించడంతో స్థానికుల అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే మంటలలో చిక్కుకున్న వెంకటేశ్వరరావు పూర్తిగా కాలిపోయి మృతి చెందాడు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పాతకక్షల నేపథ్యంలో ఎవరైనా పెట్రోల్ పోసి అంటించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూటైతే సులభ కాంప్లెక్స్ మొత్తం మంటలు వ్యాపించి ఉండేవి. కేవలం నిర్వాహకుడు కూర్చొనే క్యాబిన్ మాత్రమే అంటుకోవడం, మంటలలో పూర్తిగా కాలిబూడిద కావడం బట్టి చూస్తే ఇది హత్యేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు ఎప్పుడు రాజమహేంద్రవరం వచ్చాడనేది స్థానికులు చెప్పలేకపోతున్నారు. స్థానికులకు వెంకటేశ్వరరావుగా పరిచయమయ్యాడు. ఇంటి పేరు, కుటుంబ సభ్యుల పేర్లు ఎవరికీ చెప్పలేదని స్థానికులు పేర్కొంటున్నారు. మృతుడు పూర్తిగా కాలిపోవడం బట్టి చూస్తే ఎవరైనా కావాలనే అంటించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలాన్ని వన్‌టౌన్ సీఐ రవీంద్ర, ఎస్సై రాజశేఖర్ పరిశీలించారు. ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. సులభ కాంప్లెక్స్ ప్రధాన నిర్వాహకుడు కంచిపాటి గోవింద్‌ను ప్రశ్నించి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణ వాసి మస్కట్ లో మృతి
మాచారెడ్డి : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మస్కట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లికి చెందిన ఈరబోయిన అంజయ్య అనే వ్యక్తి గత నెల 22న ఉపాధి నిమిత్తం ఒమన్ రాజధాని మస్కట్ వెళ్లాడు. అయితే, ఆదివారం అతడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
అనుమానాస్పదంగా పాలిటెక్నిక్ విద్యార్థి మృతి
మద్దిరాల (చిలకలూరిపేట రూరల్), న్యూస్‌లైన్: వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతు న్న విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. రూరల్ పోలీసుల కథనం మేరకు.. మద్దిరాల గ్రామంలోని ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని బావిలో విద్యార్థి ఇందుర్తి అఖిల్(17) మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం గుర్తించారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లికి చెందిన అఖిల్ మరో నలుగురు విద్యార్థులతో కలిసి కళాశాలలోని వసతిగృహంలో ఉంటున్నాడు. ఈనెల 24న సహ విద్యార్థి తన సెల్‌ఫోన్ కనిపించడం లేదని అఖిల్‌ను అడగ్గా.. తెలియదని చెప్పడంతో గట్టిగా నిలదీశాడు. ఆ రోజు నుంచి అఖిల్ కనిపించకపోవడంతో కళాశాల యాజమాన్యం అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు బంధుమిత్రుల నివాసాల వద్ద విచారించినా ప్రయోజనం లేకుండాపోయింది. ఆదివారం కళాశాల ఆవరణలోని బావి నుంచి దుర్వాసన వెదజల్లుతుండడంతో యాజమాన్యం గమనించగా.. బావిలో శవం తేలుతోంది. ఆ మేరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడు కళాశాల విద్యార్థి అఖిల్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న అఖిల్ కుటుంబ సభ్యులు, బంధువులు కళాశాలకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. యాజమాన్యం సకాలంలో స్పందించకపోవడంతో దారుణం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. తండ్రి లేని బిడ్డకు ఉన్నత విద్య అందించి అత్యున్నత శిఖరాలకు చేరుద్దామనుకున్న తరుణంలో విధి వక్రీకరించిందని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. సంఘటనా స్థలాన్ని రూరల్ సీఐ టి.సంజీవ్‌కుమార్ పరిశీలించారు. విద్యార్థి మృతిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఇచ్చిన పక్షంలో కేసు నమోదుచేసి విచారణ నిర్వహిస్తామని ఎస్ఐ జగదీష్ తెలిపారు. విద్యార్థి మృతదేహాన్ని కళాశాల ఆవరణలోనే ఉంచారు. సృహ తప్పి పడిపోయిన ప్రిన్సిపాల్ .. కళాశాల ఆవరణలోని బావిలో విద్యార్థి మృతదేహం ఉందన్న సమాచారం తెలుసుకున్న ప్రిన్సిపాల్ డాక్టర్ పి.కేశవరావు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసిన వెంటనే సృహ తప్పి కిందపడిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది ప్రిన్సిపాల్‌ను ప్రవేటు వైద్యశాలకు తరలించారు.