గోరంట్ల : అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామంలో నాగమ్మ(35) గురువారం రాత్రి తన ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పారు. అనంతరం ఆమెను గోరంట్లలోని ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం నాగమ్మ మృతి చెందింది. కాగా, ఆమె బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఆమె మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.