
దుమ్కా: జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో దసరా పండుగపూట విషాదం చోటుచేసుకుంది. భర్త చీర కొనివ్వలేదని 26 ఏళ్ల వివాహిత రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన మహిళను బాగ్జోపా నివాసి సెండో దేవిగా గుర్తించారు. దసరా సందర్భంగా భర్త తనకు కొత్త చీర కొనివ్వలేదని, ఆగ్రహించిన ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త ట్రాక్టర్ డ్రైవర్ అని, వారికి ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారని పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: తాను కన్నుమూస్తూ... మరో ఐదుగురికి ప్రాణదానం
Comments
Please login to add a commentAdd a comment