commits
-
దసరాకి భర్త చీర కొనలేదని వివాహిత ఆత్మహత్య
దుమ్కా: జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో దసరా పండుగపూట విషాదం చోటుచేసుకుంది. భర్త చీర కొనివ్వలేదని 26 ఏళ్ల వివాహిత రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన మహిళను బాగ్జోపా నివాసి సెండో దేవిగా గుర్తించారు. దసరా సందర్భంగా భర్త తనకు కొత్త చీర కొనివ్వలేదని, ఆగ్రహించిన ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త ట్రాక్టర్ డ్రైవర్ అని, వారికి ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారని పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తాను కన్నుమూస్తూ... మరో ఐదుగురికి ప్రాణదానం -
మెదక్: నార్సింగిలో అదృశ్యమైన ప్రేమజంట ఆత్మహత్య
-
వివాహేతర సంబంధాన్ని నిలదీసిన భర్త.. దీంతో..
సాక్షి, హోసూరు(కర్ణాటక): వివాహేతర సంబంధాన్ని నిలదీయడంతో భార్య బావిలో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాగలూరు సమీపంలోని దాసరపల్లిదిన్న ప్రాంతానికి చెందిన సురేష్ భార్య ఆనందమ్మ(35)కు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఇది తెలిసి భర్త సురేష్ భార్యను నిలదీశాడు. దీంతో ఆమె సోమవారం సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఒడిశా మహిళ... హోసూరు: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం సాయంత్రం హోసూరు సమీపంలోని బేడరపల్లిలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన గుణబుయాన్ మండోదరి (22)ని ఏడాదిన్నర క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆదివారం మండోదరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కారణాలు తెలియాల్సి ఉంది. డీఎస్పీ శంకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భార్య పుట్టింటికి వెళ్లిందని.. భర్త అదృశ్యం.. -
బ్లేడ్‌తో కోసుకుని యువకుడి ఆత్మహత్య
తెనాలి(గుంటూరు జిల్లా): తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బ్లేడ్‌తో కోసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన యువకుడు కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా కడదిన్నె గ్రామానికి చెందిన రవితేజ(25)గా జేబులో ఆధార్ కార్డు ద్వారా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సిఉంది. పోలీసులు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కిరోసిన్ పోసుకుని గృహిణి ఆత్మహత్య
డిండి : కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని గృహిణి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం అంకూర్ గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. వృత్తిరీత్యా భార్య మాధవి (30)తో మండల కేంద్రంలో నివాసముంటున్నారు. ఏడాది నుంచి మాధవి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భర్త కరుణాకర్‌రెడ్డి చికిత్స చేయిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భర్త కరుణాకర్‌రెడ్డి పాఠశాల పని నిమిత్తం దేవరకొండకు వెళ్లాడు. మాధవి కుమార్తె ఆరాధ్యను స్కూల్‌కు పంపించి తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి పొగలు, మంటలు రావడంతో గమనించిన చుట్టు పక్కల వారు వచ్చి మంటలను ఆర్పారు. కానీ ఆ లోపే మాధవి శరీరం పూర్తిగా కాలిపోవడంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డిండి : కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని గృహిణి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం అంకూర్ గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. వృత్తిరీత్యా భార్య మాధవి (30)తో మండల కేంద్రంలో నివాసముంటున్నారు. ఏడాది నుంచి మాధవి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భర్త కరుణాకర్‌రెడ్డి చికిత్స చేయిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భర్త కరుణాకర్‌రెడ్డి పాఠశాల పని నిమిత్తం దేవరకొండకు వెళ్లాడు. మాధవి కుమార్తె ఆరాధ్యను స్కూల్‌కు పంపించి తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి పొగలు, మంటలు రావడంతో గమనించిన చుట్టు పక్కల వారు వచ్చి మంటలను ఆర్పారు. కానీ ఆ లోపే మాధవి శరీరం పూర్తిగా కాలిపోవడంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పర్మనెంట్ వీసా తిరస్కరించారని..
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా మెల్బోర్న్ ప్రాంతంలో ఓ భారతీయ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం చేసిన తన ధరఖాస్తును అధికారులు నిరాకరించడంతో అతడు ప్రాణాలు తీసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 36 ఏళ్ళ దీపక్ సింగ్ 2008 లో స్టూడెంట్ వీసాతో ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ వెల్ఫేర్ కోర్సు చదివేందుకు వెళ్ళాడు. చదువుకునే సమయంలోఅతడు అక్కడ ఉద్యోగం చేసినట్లుగా రుజువులు దొరకండం అతడ్ని శాస్వత నివాసానికి అర్హత లేకుండా చేసింది. అనంతరం అక్కడే ఓ ఆస్ట్రేలియన్ మహిళను సింగ్ వివాహమాడాడు. టెంపరరీ వీసాతో కొనసాగుతూ... అక్కడి పౌరురాలిని వివాహమాడిన ఆధారంతో పర్మనెంట్ రెసిడెన్సీ (పీఆర్) వీసాకోసం ధరఖాస్తు చేసుకున్నాడు. పని హక్కులను తొలగించడంతోపాటు.. భారత్ కు తిరిగి వెళ్ళాల్సిందిగా సింగ్ ను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశించడంతో అతడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని, అతడి స్నేహితుడు, సంఘం సభ్యుడైన జస్వీందర్ సిద్ధు తెలిపినట్లు ఓ వెబ్ సైట్ వివరాల్లో వెల్లడించింది. ఆస్ట్రేలియా పౌరురాలిని పెళ్ళాడిన సింగ్.. స్పౌస్ వీసా ఆధారంగా పర్మనెంట్ రెసిడెన్సీ వీసాకు ధరఖాస్తు చేసుకున్నాడని, అయితే అది రావడం ఎంతో కష్టం అని తేలడంతో సింగ్ తీవ్ర నిరాశకు, ఒత్తిడికి లోనయ్యాడని సిద్ధు తెలిపాడు. 2012 లోనే ఓసారి అతని ధరఖాస్తును తిరస్కరించడంతో అప్పట్నుంచీ అతడు పీఆర్ వీసాకోసం తీవ్రంగా పోరాడుతున్నాడని, ఇమ్మిగ్రేషన్ నిరాకరణపై కోర్టును ఆశ్రయించిన సింగ్.... పోరాటం చివరిస్థాయిలో ఉండగా.. కోర్టుకు హాజరు కావాల్సిన అతడు.. ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపాడు. ప్రతిరోజులాగే ఆదివారం కూడా అతడు నిద్రలేచి కనీసం ఏమీ తినకుండా ఆఫీసుకు బయల్దేరాడని, ఇంటినుంచీ వెళ్ళిన కేవలం అరగంట లోపే పోలీసులు అతడు కారులో చనిపోయినట్లుగా సమాచారం అదించినట్లు సిద్ధూ తెలిపాడు. -
రైలు కింద పడి వ్యక్తి మృతి
అరకు: విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ రైల్వే రిక్వెస్ట్ స్టేజి వద్ద గురువారం ఉదయం 7 గంటల సమయంలో రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అరకు మండలం కొండవీధి గ్రామానికి చెందిన కళాసి కొర్ర నానాజి(32)గా గుర్తించారు. రైలు కింద పడటంతో శరీరం నుజ్జునుజ్జైపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సౌర ప్రాజెక్టులకు బిలియన్ డాలర్ల నిధులు
lన్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు.భారత్ లో రెండు రోజుల పాటు పర్యటనలో భాగంగా ఆయన ప్రధానిని, ఆర్థికమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా దేశంలో సోలార్ ప్రాజెక్టుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలను ఫండింగ్ చేయనున్నట్టు వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది. పోషణ, పునరుత్పాదక శక్తి రంగాల్లో భారత ప్రభుత్వ పథకాలకు మద్దతు అందించే చర్యల్లో భాగంగా ప్రపంచ బ్యాంక్ ప్రధానిని కలిసినట్టు పీఎంవో వర్గాలు ట్విట్ చేశాయి. ప్రధాని కార్యాలయం ప్రధాన మంత్రి తో భేటీ అయిన కిమ్ ఫోటోను క ట్వీట్ చేశాయి. భారీ సౌర ఇంధన కార్యక్రమానికి 30 సోలార్ ప్రాజెక్టులకు ఒక బిలియన్ డాలర్ల (6వేల 750 కోట్లను) నిధులను ఇవ్వనున్నట్టు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్(ఐఎస్ఎ)తో దీనికి సంబంధించి ఒక ఒప్పందాన్ని కదుర్చుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలొ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం ఐఎస్ఎ ఆర్థిక భాగస్వామిగా బహుపాక్షిక రుణ ఏజెన్సీ స్థాపిస్తుంది. క్లైమేట్ ఫ్రెండ్లీ భవిష్యత్తులో గ్లోబల్ ఉద్యమానికి ఇది దోహం చేస్తుందనే కిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఇండియాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం న్యూ ఢిల్లీలోని స్కిల్ ఇండియా సెంటర్ ను సందర్శించారు. అనంతరం ఆ తర్వాత అంగన్ వాడి సెంటర్ కు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి చిన్నారులతో సరదాగా ముచ్చటించినసంగతి తెలిసిందే. -
ఆల్కహాల్ తాగొద్దన్నారనీ..
- ఎనగుర్తిలో ఘటన - హత్య చేశారంటూ మృతుడి సోదరుడి ఆరోపణ దుబ్బాక: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఎనగుర్తికి చెందిన చెప్యాల బాలయ్య(23) అదే గ్రామానికి చెందిన ఇస్తారి లక్ష్మీనారాయణ ఇంటికి రెండేళ్ల క్రితం ఇల్లరికం వెళ్లాడు. బాలయ్య కూలీనాలీ చేస్తూ ఏడాదిన్నర వరకు కుటుంబాన్ని పోషించాడు. ఇటీవల బాలయ్య తాగుడుకు బానిస కావడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. బుధవారం రాత్రి బాలయ్య తాగి ఇంటికొచ్చాడు. ఎందుకు తాగావని కుటుంబ సభ్యులు అడగడంతో మనస్తాపానికి గురైన బాలయ్య ఇంట్లో ఉన్న విషపు గుళికలు మింగాడు. దీంతో కుటుంబ సభ్యులు బాలయ్యను హుటాహుటిన దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. బాలయ్యకు భార్య కవిత, కూతురు ప్రణీత ఉన్నారు. బాలయ్యది ఆత్మహత్య కాదని విషం పెట్టి హత్య చేశారని బాలయ్య అన్న చెప్యాల కనకయ్య ఆరోపించారు. ఈ మేరకు భూంపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
షాద్‌నగర్ : చటాన్‌పల్లి గ్రామ శివారులోని బీవీరావు నగర్ పౌల్ట్రిలో బుధవారం ఓవ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... కేశంపేట మండల పరిధిలోని లింగంధాన గ్రామానికి చెందిన ఇస్తారి(55) గత 15ఏళ్లుగా లక్ష్మీనారాయణకు చెందిన పౌల్ట్రీలో కూలీ పనులు చేస్తున్నాడు. ఆరు నెలలుగా కూలి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని..
కరీంనగర్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన మౌనిక, కృష్ణమూర్తిగా గుర్తించారు. వీరిద్దరి కులాలు వేరు కావటంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి పెద్దపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద పురుగు మందు తాగినట్లు తెలుస్తోంది. విగతజీవులై పడి ఉండగా శనివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలను బట్టి వారిని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి కావటంలేదని మనస్తాపంతో..
విజయనగర్‌కాలనీ(హైదరాబాద్ సిటీ): పెళ్లి కావడం లేదని మనస్థాపం చెందిన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం అసీఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం అసీఫ్‌నగర్ సయ్యద్ అలీ గూడలో రషీదా బేగమ్.. కూతురు జబీన్, కుమారుడు అమీర్‌ఖాన్‌లతో నివ సిస్తుంది. గత కొన్నాళ్లుగా వివాహం కాకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన జబిన్.. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న అసీఫ్‌నగర్ ఎస్సై ఉపేందర్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. -
ఉరేసుకుని విద్యార్థి బలవన్మరణం
దుండిగల్(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా దుండిగల్‌లోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాలకు చెందిన హాస్టల్ ఉంటున్న అమర్(17) గురువారం రాత్రి తన గదిలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. శుక్రవారం ఉదయం నిర్వాహకులు గమనించేసరికి చనిపోయి ఉన్నాడు. విషయం తెలిసి సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
మరుగుదొడ్డి నిర్మించలేదని విద్యార్థిని ఆత్మహత్య
-
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..
-
ఉరేసుకుని మెడికో ఆత్మహత్య
-
నారాయణ' విద్యార్ధి ఆత్మహత్యాయత్నం
-
విశాఖలో విద్యార్ధిని ఆత్మహత్య