విజయనగర్‌కాలనీ(హైదరాబాద్ సిటీ): పెళ్లి కావడం లేదని మనస్థాపం చెందిన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం అసీఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం అసీఫ్‌నగర్ సయ్యద్ అలీ గూడలో రషీదా బేగమ్.. కూతురు జబీన్, కుమారుడు అమీర్‌ఖాన్‌లతో నివ సిస్తుంది.
గత కొన్నాళ్లుగా వివాహం కాకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన జబిన్.. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న అసీఫ్‌నగర్ ఎస్సై ఉపేందర్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
పెళ్లి కావటంలేదని మనస్తాపంతో..
Published Mon, Apr 25 2016 10:48 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement