సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. మరికాసేపట్లో పెళ్లనగా ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. నవీపేటలో మరికొద్ది గంటల్లో పెళ్లిపీటలెక్కాల్సిన రవళి అనే యువతి ఆదివారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాబోయే భర్త వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
పెళ్లికి ముందే ఉద్యోగం చేయాలని, పలు రకాలుగా ఒత్తిళ్లకు గురిచేయడంతో రవళి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌కు చెందిన సంతోష్‌తో ఈరోజు వివాహం జరగాల్సి ఉంది. ఈ సమయంలో ఆత్మహత్యకు చేసుకోవడంతో పెళ్లింట్లో విషాదం నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (Hyderabad: కోర్ సిటీలోకార్ రేసా?.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు)
Comments
Please login to add a commentAdd a comment