young women
-
వీడని యువతి హత్య మిస్టరీ
గంగాధర(చొప్పదండి): మంచిర్యాల జిల్లాలో అదృశ్యమై, కరీంనగర్ జిల్లాలో శవమై కనిపించిన యువతి హత్య మిస్టరీ వీడటం లేదు. గంగాధర పోలీస్‌స్టేషన్‌లో సోమవారం గుర్తు తెలియని యువతి హత్య కేసు నమోదవగా మృతురాలి కుటుంబ వివరాలు మంగళవారం సాయంత్రం తెలిశాయి. అయితే, ఆమెను ఎవరు తీసుకెళ్లారు.. ఎక్కడ హత్య చేశారు, ఆమె వెంట ఉన్న నాలుగేళ్ల కుమారుడి జాడ తెలియలేదు. కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉండే మమత కాసిపేటకు చెందిన భరత్‌ను ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు ఉన్నాడు. కాగా, మమత నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి మంచిర్యాల వచ్చి, తెలిసినవారి ఇంట్లో ఉంటోంది. ఈ నెల 25న సాయంత్రం నూనె ప్యాకెట్ తీసుకువస్తానని కుమారుడితో కలిసి బయటకు వచ్చింది. ఆమె కారు ఎక్కిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తర్వాత కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిలో గంగాధర మండలం కొండన్నపల్లి బస్టాండ్ సమీపంలోని మామిడితోట వద్ద రోడ్డు పక్కన మమత శవమై కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి ఫొటోతో అన్ని పోలీస్స్టేషన్లకు పంపించారు. మంచిర్యాలలో ఉండే ఆమె కుటుంబసభ్యులు గుర్తించి, మంగళవారం సాయంత్రం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు వారికి అప్పగించారు. మమత హత్యపై, ఆమె కుమారుడి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. మృతురాలు ఎక్కిన కారు ఎవరిది, అందులో ఉన్నది ఎవరు, ఎటు తీసుకెళ్లారు అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నారు. త్వరలోనే హత్య మిస్టరీ వీడుతుందని ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు. -
అంబరాన మహాకుంభ సంబరం
ఆకాశం అంటే అనంతం... అనంతమైన భక్తి కూడా ఆకాశం లాంటిదే. తనలోని అనంతమైన భక్తిని ఆకాశ వేదికగా చాటింది ఇరవై నాలుగు సంవత్సరాల అనామికాశర్మ...ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన స్కైడైవర్ అనామికా శర్మ బ్యాంకాక్ మీదుగా 13 వేల అడుగుల ఎత్తులో మహాకుంభ్ అధికారిక జెండాను ఎగరేసి చరిత్ర సృష్టించింది. అనామిక డేరింగ్ ఫీట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. విమానం ఎక్కే ముందు ఆత్మవిశ్వాసంతో మహాకుంభ్ జెండాను అనామిక పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో ఉన్నాయి. అనామిక విమానం నుండి దూకడం, జెండా ఎగరవేస్తూ ‘మహాకుంభ్ 2025’కు ప్రపంచానికి స్వాగతం పలికే దృశ్యాలు, బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే కుంభమేళ న్ట అబ్బురపరుస్తాయి.‘ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహాకుంభ్ 2025కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆహ్వానిస్తున్నాను’ అని అనామిక శర్మ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోనే చూస్తూ నెటిజనులు అనామికను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.వాటిలో కొన్ని...‘అపూర్వ సాహసం, భక్తిభావం మేళవించిన దృశ్యం’‘మన సంస్కృతిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు’‘ఇది స్టంట్ కాదు. ప్రపంచానికి అందించిన శక్తిమంతమైన సందేశం’అనామిక తండ్రి మాజీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తండ్రి ఒడిలో సాహసాల ఓనమాలు నేర్చుకున్న అనామికకు ధైర్యంగా ముందుకు దూసుకెళ్లడమే తెలుసు. తాజా ఫీట్‌తో తన సాహసాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది.పవిత్ర క్షేత్రమైన ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనామిక మన సంస్కృతి, సంప్రదాయాలను వింటూ పెరిగింది. ‘మన సంస్కృతిలోని గొప్పదనం ఏమిటంటే, ఒక మంచి పని కోసం అందరూ ముందుకు వస్తారు. నేనేమిటి? నా స్థాయి ఏమిటి అని ఎప్పుడూ ఆలోచించరు. రామాయణంలో ఉడుత కథ దీనికి ఉదాహరణ. భరతమాత బిడ్డను అని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను’ అంటుంది అనామిక.భవిష్యత్‌లో మరెన్నో సాహసాలు చేయడానికి సిద్ధం అవుతున్న అనామిక ట్రైన్డ్ స్కూబా డైవర్ కూడా. మన దేశంలో ‘స్కై సి లైసెన్స్’ ఉన్న యంగెస్ట్ ఫీమెల్ స్కైడైవర్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.‘వీడియోను చూసి చాలామంది... మీకు భయంగా అనిపించలేదా అని అడిగారు. నిజం చెప్పాలంటే భక్తి భావంతో నాకు భయం కలగలేదు. ఒకటికి పదిసార్లు మనసులో మేరా భారత్ మహాన్ అనుకున్నాను’ అంటోంది అనామిక. -
గుండెపోటుతో ఎంబీబీఎస్ స్టూడెంట్ మృతి
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని మహవీర్ మెడికల్ కళాశాలకు చెందిన ఓ విద్యారి్థని సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందింది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి..హైదరాబాద్‌కు చెందిన మేఘన(18) స్థానిక మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతోంది. కాగా సోమవారం సాయంత్రం కళాశాల ఆవరణలోని గ్రౌండ్లో స్నేహితులతో కలిసి ఉండగా.. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. తోటి విద్యార్థులు వెంటనే ఆమెను కళాశాల ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. తల్లిదండ్రులు చేరుకుని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి్పంచగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతిచెందింది. విద్యారి్థని తండ్రి బాబురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ పోలీసులు తెలిపారు. -
Viral: రీల్స్ మోజులో యువతి పిచ్చి స్టంట్.. చేయి జారిందా అంతే!
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ప్రజలంతా ఫోన్లపైనే రోజంతా గడిపేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విటర్.. ఇలా అన్నింట్లోనూ అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. మరికొందరు. ఈ సామాజిక మాద్యమాల ద్వారా ఫేమస్ అయిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు చేయకూడని పనులు చేసి నలుగురిలో నవ్వులపాలు అవ్వడమే కాకుండా కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అవ్వాలనే ఉద్ధేశంతో సాహసాలకు తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనే పుణెలో వెలుగు చేసింది. గా రీల్స్ మోజులో పడిన కొంతమంది యువతీ, యువకులు.. వ్యూస్ కోసండేంజరస్ స్టంట్లు చేశారు.పుణె లోని స్వామి నారాయణ్ ఆలయం సమీపపంలోని ఎత్తయిన భవనం నుంచి ఓ యువతి కిందకు వేలాడుతూ ఉండడం వీడియోలో కనిపిస్తోంది. మరో యువకుడు పైనుంచి ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు. కిందనున్న హైవేపై భారీ వాహనాలు వెళుతున్నాయి. ఏ మాత్రం పట్టు జారినా యువతి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ తతంగాన్ని వారి స్నేహితులు కెమెరాల్లో చిత్రీకరించారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. టీనేజర్ల చర్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై సరైన చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు.#Pune: For Creating Reels and checking the strength, Youngsters risk their lives by doing stunt on an abandoned building near Swaminarayan Mandir, Jambhulwadi Pune@TikamShekhawat pic.twitter.com/a5xsLjfGYi— Punekar News (@punekarnews) June 20, 2024 -
SKY IS THE LIMIT: నాన్న ఇచ్చిన రెక్కలు
ఇంటి గడప దాటకూడని ఆంక్షలు అక్కడా ఇక్కడా ఇంకా కొనసాగుతున్నా నేడు భారతీయ యువతులు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. ఎగురుతున్నారు. కొడుకు ఎంతో కూతురూ అంతే అనే ఎరుక కలిగిన తల్లిదండ్రులు వారిని ప్రోత్సహిస్తున్నారు. అమ్మ ఆశీస్సులు ఉన్నా నాన్న ప్రోత్సాహమే తమను ముందుకు నడిపిందని ఈ మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్లు అంటున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ల విజయగాథలు ఇవి.నాన్న మాటే ఇంధనంనా పేరు శ్రీప్రియ మోదలే. మాది మహారాష్ట్రలోని పూణే. నాన్న శ్రీకాంత్ మోదలే. అమ్మ ప్రజ్ఞ మోదలే. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే సంతానం. అయినా కూడా మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మా నాన్న పెట్రోల్ పంపులకు సంబంధించిన చిన్న వ్యాపారం చేస్తారు. అమ్మ ఇంట్లోనే ఆహారం తయారు చేసి అమ్ముతుంది. తండ్రి శ్రీకాంత్, తల్లి ప్రజ్ఞతో శ్రీప్రియ ఇలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా నా తల్లిదండ్రులు నన్నెప్పుడూ నిరాశపర్చలేదు. మా నాన్నైతే నీకు నచ్చిన వృత్తిలో వెళ్లు అని వెన్నుతట్టి ప్రోత్సహించారు. నేను పూణే యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత ఎట్మాస్ఫియరిక్ సైన్సెస్‌లో ఎంటెక్ చేశాను. ఆ తర్వాత రీసెర్చ్ అసోసియేట్‌గా, స్విమ్మింగ్ కోచ్‌గా, జాతీయ స్థాయి కరాటే ప్లేయర్‌గా, సెల్ఫ్ డిఫెన్స్ ఇన్ స్ట్రక్టర్‌గా రకరకాల పనులు చేశాను. ఇన్ని చేసినా ఎక్కడో అసంతృప్తి నాలో ఉండేది. దేశసేవలో భాగం అయ్యేందుకు నాకున్న బలాలను, అవకాశాలను ఆలోచించాను. దేశ రక్షణ కోసం పనిచేసే ఉద్యోగం కరెక్ట్ అనిపించింది. అందుకే నేను భారత వాయుసేన వైపు రావాలని నిర్ణయించుకుని కష్టపడ్డాను. చివరకు ఫ్లయింగ్ ఆఫీసర్‌గా శిక్షణ పూర్తి చేయడం సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. వాయుసేన ఆపరేషన్స్ అన్నింటికీ వాతావరణ సమాచారం అత్యంత కీలకమైంది. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందించే కీలక బాధ్యతలు దక్కడం నాకు సంతోషంగా ఉంది. – శ్రీప్రియ, ఫ్లయింగ్ ఆఫీసర్నాన్నే నాకు స్ఫూర్తినా పేరు నందినీ సౌరిత్. హర్యానాలోని పల్వల్ జిల్లా మా స్వస్థలం. నాన్న శివ్‌నారాయణ్ సౌరిత్, అమ్మ సంతోషికుమారి సౌరిత్. మా నాన్న ఫ్లయిట్ లెఫ్టినెంట్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో ఆయనే నాకు స్ఫూర్తి. మా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క సంతానం. పైగా అమ్మాయిని అయినా నాన్న నాకు ఎప్పుడూ ఎలాంటి ఆంక్షలూ లేకుండా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. మా నాన్న కోరిక వల్లే నేను ఎయిర్ ఫోర్స్‌లో చేరాను.తండ్రి శివ్‌నారాయణ్, సంతోషికుమారిలతో నందిని సౌరిత్ ‘నా కూతురు ఎంతో ఉన్నతంగా అందరికంటే ఎత్తులో ఉండాలి’ అని నాన్న నాకు చెబుతూ ఉండేవారు. అదే నాలో చిన్ననాటి నుంచి స్ఫూర్తి నింపింది. నేను ఎన్సీసీ కేడెట్ను. జాతీయ స్థాయిలో అథ్లెట్‌ను. భారత వాయుసేనలో చేరిన తర్వాత శిక్షణ సమయంలో ఇవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. కఠోర శిక్షణ పూర్తి చేసి ఈ రోజు నేను ఫ్లయింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. నా తల్లిదండ్రులు ఇప్పుడు నా పక్కన ఉండడం నాకు మరింత సంతోషంగా ఉంది. నేను శిక్షణలో ఆర్డర్ ఆఫ్ మెరిట్‌తో ఎడ్యుకేషన్ బ్రాంచ్‌కు ఎంపికయ్యాను. వాయుసేనకు సంబంధించిన కీలక బాధ్యతలు అవి. – నందినీ సౌరిత్, ఫ్లయింగ్ ఆఫీసర్నాన్నే దేశసేవ చేయమన్నారుమాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. శామిలి జిల్లా. పుట్టిపెరిగింది అంతా ఢిల్లీలోనే. అక్కడే కేంద్రీయ విద్యాలయ్‌లో చదువుకున్నాను. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకామ్ పూర్తి చేశాను. మా నాన్న రవీందర్‌కుమార్ ఇన్‌కమ్‌ట్యాక్స్ ఆఫీసర్, అమ్మ అంజేష్ గృహిణి. ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి ముందు నేను ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండేదాన్ని.‘ఆ ఉద్యోగాలు చేసేందుకు అందరూ ఉత్సాహపడతారు. కాని దేశ సేవ కోసం కొందరే ముందుకు వస్తారు. నువ్వు దేశ సేవ చేయమ్మా’ అని నాన్న అన్నారు. తండ్రి రవీందర్‌కుమార్, తల్లి అంజేష్లతో మాన్వి నా మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికయ్యాను. మా కుటుంబంలో భారత సైన్యంలోకి వచ్చిన మొదటి ఆఫీసర్ని నేనే. అందుకు నాకు గర్వంగా ఉంది. శారీరకంగా, మానసికంగా ఎంతో గొప్ప ఉద్యోగం ఇది. అకాడమీకి రాక ముందు, ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత నాలో నేనే ఎంతో మార్పు గమనించాను. ఇక్కడ వృత్తిగతంగానే కాదు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఎన్నో అంశాలు నేర్చుకున్నాను. నాపై నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను అకౌంట్స్ బ్రాంచ్‌లో ఉత్తమ కేడెట్‌గా నిలిచాను. నాకు ఇప్పుడు అకౌంట్స్ బ్రాంచ్ ఇచ్చారు. – మాన్వి, ఫ్లయింగ్ ఆఫీసర్ -
మహిళల్లో వృద్ధాప్యం త్వరగా రావడానికి కారణం ఇదే!
మహిళలకు మాతృత్వం అపురూపమైనది. చాలామంది అమ్మ నవ్వడం ఓ వరంలా భావిస్తారు. పిల్లలను కనడమే ఆడజన్మకు సార్థకత అని భావించేవాళ్లు ఉన్నారు. కానీ అమ్మగా ఓ స్త్రీ ఎప్పుడైతే మారుతుందో.. ఇక ప్రతి నిమిషం పిల్లల కోసమే వెచ్చిస్తుంది. తన గురించి ఆలోచించడమే మానేస్తుంది. అంతటి త్యాగమూర్తి స్త్రీ. అలాంటి మహిళలు మగవారికంటే తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చి ముసిలి వాళ్లు అయిపోతుండటం జరుగుతుంది. అందుకు కారణం ఏంటో తాజా అధ్యాయనంలో వెల్లడించారు శాస్త్రవేత్తలు. దీనికి అదే కారణమంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు మహిళల్లో వృద్ధాప్య ప్రక్రియ వేగవంతమవ్వడానికి గల కారణాలపై అధ్యయనం చేశారు. అందుకోసం సుమారు వెయ్యిమందికి పైగా మహిళలపై పరిశోధన చేశారు. వాళ్లలో పునరుత్పత్తి తర్వాత వస్తున్న డీఎన్ఏ మార్పులపై క్షణ్ణంగా అధ్య యనం నిర్వహించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం శాస్త్రవేత్తలు ఆరు విభిన్నమైన "ఎపిజెనెటిక్ క్లాక్‌లు" లేదా డీఎన్ఏ మిథైలేషన్ నమునా ప్రక్రియలతో మహిళల జీవసంబంధమైన వయసును లెక్కించారు. ఆరేళ్ల సుదీర్ఘ పరిశోధనల్లో.. ఇలా అధ్యయనంలో పాల్గొన్న 825 మంది ఫలితాలు ప్రకారం..ప్రతి గర్భం స్త్రీకి రెండు నుంచి మూడు నెలలు బయోలాజికల్ వృద్ధాప్యంతో ముడి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆరేళ్లుగా మహిళల్లో వస్తున్న మార్పులను అధ్యయనం చేయగా..గర్భవతుల జీవసంబంధమైన వృద్ధాప్యంలో ఎక్కువ పెరుగుదలను గుర్తించారు. ఈ అంశంపై కొలంబియా ఏజింగ్ సెంటర్లో అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్ట్‌లు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. గర్భధారణ జీవసంబంధమైన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందని.. ఈ ప్రభావాలు అధిక సంతానోత్పత్తి కలిగిన యువ స్త్రీలలో స్పష్టంగా కనిపిస్తాయని వెల్లడించారు. అంతేగాదు ఎక్కువ గర్భాలు లేదా పిల్లలను కన్న మహిళల్లో జీవసంబంధమైన వృద్ధాప్యంలో ఎక్కువ పెరుగుదల కనిపించిదని అన్నారు. అందువల్లే గతంలో గర్భవతిగా ఉన్న స్త్రీలు బిడ్డను మోయని వారికంటే పెద్దవారిగా కనిపిస్తారని చెప్పారు. కొందరికి ధూమపానం అలవాట్లు, ఆర్థిక పరిస్థితి కారణంగా సరైన పోషాకాలతో కూడిన ఆహారం తీసుకోలేని మహిళలపై పరిశోధనలు చేయగా వారిలో జీవసంబంధమైన వృద్ధాప్యం మరింత వేగవంతంగా ఉందన్నారు. ముఖ్యంగా తండ్రులుగా ఉన్న పురుషుల్లో ఈ ప్రభావ లేదని అన్నారు. దీని ప్రభావం కేవలం గర్భం లేదా పాలిచ్చే తల్లుల్లో కనిపిస్తుందని అన్నారు. ఇక్కడ ప్రతి స్త్రీ గర్భం సంఖ్య కూడా వారిలో జీవసంబంధమైన మార్పులు తీసుకువస్తుందని అధ్యయనంలో తేలింది. ఇవే వృద్ధాప్యంపై ప్రభావం చూపిస్తాయని తెలిపారు. అయితే కౌమారదశలోని గర్భం దాల్చినవారిపై ఈ ప్రభావాలు మరింత ఎక్కువగా ఉంటాయన్నారు. అందుకు ఆరోగ్య సంరక్షణ, సరైన వనరులు లేకపోవడం తదితరాలు కూడా ఈ ప్రభావానికి కారణమవుతాయని అన్నారు శాస్త్రవేత్తలు. అయితే ఇక్కడ మహిళల్లో వేగంగా వచ్చే ఈ వృద్ధాప్యం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపి మరణానికి కారణమవుతోందా? లేదా? అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఇక్కడ తల్లుల సంరక్షణ అనేది ప్రధానమైనది అనేది ఈ అధ్యయనం పేర్కొంది. కొత్త తల్లులకు మంచి పోషకాలతో కూడిన ఆహారం, హెల్తీగా ఉండేలా తగిన వైద్యం ప్రాముఖ్యతలను తెలియజేస్తోంది ఈ పరిశోధన. అంతేగాఉ ముఖ్యంగా గర్భధారణ సమయంలో సరైన ఫుడ్, డైట్, మానసికంగా హెల్తీగా ఉంటే ఈ వృధ్యాప్య ఛాలయలను అధిగమించొచ్చని చెబుతున్నారు. ఈ పరిశోధన ఫలితాలు 'ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్'లో ప్రచురితమయ్యింది. (చదవండి: మగవారికి మెనోపాజ్ వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారంటే..!) -
Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిహార్ నుంచి 25 ఏళ్ల శాంభవి చౌదరి ఎన్నికల్లో పోటీ చేయనుంది. దేశంలో అతి చిన్నవయసు మహిళా దళిత అభ్యర్థిగా శాంభవి వార్తల్లో నిలిచింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా తాను వేయదగ్గ ముద్ర... తనదైన దృష్టికోణం ఉన్నాయంటున్నది శాంభవి. ‘నేను పనిచేసే చోట స్త్రీలు, యువతే నా లక్ష్యం. వీరికి ఆర్థిక స్వావలంబన, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తే అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది’ అంటోంది శాంభవి చౌదరి. 25 ఏళ్ల 9 నెలల వయసు వున్న ఈ డాక్టరెట్ స్టూడెంట్ బిహార్‌లోని ‘సమస్తిపూర్’ పార్లమెంట్ స్థానం నుంచి లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) తరఫున పోటీ చేయనుంది. ఇది రిజర్వ్డ్ స్థానం. బహుశా శాంభవి దేశంలోనే అత్యంత చిన్న వయసు కలిగిన దళిత మహిళా అభ్యర్థి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. అందుకే అందరూ ఆమెవైపు ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయ కుటుంబం నుంచి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎం.ఏ. సోషియాలజీ చేసి ఇప్పుడు ‘బిహార్ రాజకీయాల్లో కులం, జెండర్ ప్రాధాన్యత’ అనే అంశం మీద పీహెచ్డీ చేస్తున్న శాంభవి రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. ఈమె తండ్రి అశోక్ కుమార్ చౌదరి జెడి (యు)లో మంత్రి. తాత మహదేవ్ చౌదరి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పని చేశారు. శాంభవి భర్త సాయన్ కునాల్ సామాజిక రంగంలో ఉన్నాడు. ఈమె మామగారు మాజీ ఐ.పి.ఎస్ అధికారి ఆచార్య కిశోర్ కునాల్ దళితుల కోసం చాలా పోరాటాలే చేశాడు. చాలా గుడులలో దళిత పురోహితులను ఆయన నియమించాడు. వీరందరి మధ్యలో చదువు మీద దృష్టి పెట్టి, పరిశోధన కొనసాగిస్తున్న శాంభవి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో దిగింది. నాకంటూ వ్యక్తిత్వం ఉంది శాంభవి పోటీ చేస్తున్న లోక్ జనశక్తి పార్టీ ఎన్డిఏ కూటమిలో ఉంది. బిజెపి కుటుంబ వారసత్వం గురించి అభ్యంతరం చెప్పడం తెలిసిందే. ‘మీ నాన్నగారు మంత్రి. మరి మీకు సీటిచ్చారు’ అనే ప్రశ్నకు ‘నిజమే. కాని నాకు సీటు రావడంలో ఆయన ప్రమేయం మాత్రం లేదు. చిన్నప్పటి నుంచి నేను మా తాత, నాన్న పేదవాళ్ల సమస్యలు వింటూ వారి కోసం పనిచేయడం చూస్తూ పెరిగాను. అది నామీద ఎక్కడో ప్రభావం చూపింది. దళితుల్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా, చదువుకున్న మహిళగా దళితుల పట్ల నాకు అవగాహన ఉంది. రాజకీయ కుటుంబం నుంచి రావడం వల్ల ప్రజలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసు. ఎలక్షన్లు సమీపించేవరకూ నేను నిలబడాలని అనుకోలేదు. కాని సమీపించాక లోక్ జనశక్తి చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌తో చెప్పాను. ఆయన నా భర్తను సొంత తమ్ముడిలా చూస్తారు. అంతేకాదు, బిహార్ రాజకీయాలలో యువత రాణించాలని భావిస్తారు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయన్న కారణం రీత్యానే సీట్ ఇచ్చారు’ అని తెలిపిందామె. అత్తగారి ఊరు పట్నాలో పుట్టి పెరిగిన శాంభవి తన అత్తగారి ఊరైన సమస్తిపూర్‌లో గెలవడానికి సిద్ధమవుతోంది. ‘ఆ ఊరి గురించి నిజం చెప్పాలంటే నాకేమీ తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. మొదట అక్కడ ఒక ఇల్లు కొని అక్కడే ఉంటానన్న భరోసా కల్పించాలి. ఆ ఊరి యువతతో ఇప్పటికే కాంటాక్ట్‌లోకి వెళ్లాను. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపిస్తారు. అవి వమ్ము చేయకుండా ఉండటమే నా ప్రథమ లక్ష్యం’ అంటున్న శాంభవి రాజకీయ జీవితాన్ని త్వరలో ఓటర్లు నిర్ణయిస్తారు. -
ఇద్దరితో ప్రేమాయణం.. ప్రియుడి కోసం యువతుల కొట్లాట
వెంగళరావునగర్(హైదరాబాద్): ఇద్దరు యువతులను మోసం చేసి మూడో యువతితో పెళ్లితంతుకు సిద్ధమైన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ వ్యక్తి తనకు మాత్రమే సొంతమంటూ మహిళలు కేసు పెట్టిన విచిత్రమైన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఏపీలోని రాయచోటి ప్రాంతానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ అనే యువకుడు మాదాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తుంటాడు. అదే ఆస్పత్రిలో పని చేసే యువతి రెండేళ్ల క్రితం అతనికి పరిచయం అయింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంగళరావునగర్ డివిజన్లోని ఒక బస్తీలో నివాసం ఉంటున్న యువతి రూముకు అనేకమార్లు వచ్చి తన కోర్కెను తీర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు చెప్పకుండా కార్ఘానాలోని మరో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పనిచేసే ఇంకో యువతితో సేమ్ సీన్ రిపీట్ చేశాడు. కట్ చేస్తే... (ఈ నెల 6న) ఎవరికీ చెప్పకుండా స్వగ్రామం వెళ్లాడు. అక్కడ తన ఇంటి పక్కనే ఉంటున్న యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ నెల 24న నిశ్చితార్థం చేసుకోవాలనుకుని అనుకున్నాడు. పక్కాగా ప్లానింగ్ చేసి ఉంగరాలు, దండలు మార్చుకోవాలనుకునే సమయంలో సినీ ఫక్కీలో మధురానగర్ ఎస్ఐ ఇక్బాల్ షడన్‌గా రంగ ప్రవేశం చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిశ్చితార్థాన్ని చివరి నిమిషంలో అడ్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా వారికి అతని ఫ్లాష్‌బ్యాక్ మొత్తం చెప్పి నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సమస్య పరిష్కారం అయిందనుకున్నారంతా... అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. ఫక్రుద్దీన్‌ను మధురానగర్‌కు తీసుకువచ్చారని తెలుసుకున్న బాధిత యువతులు బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అర్ధరాత్రి వరకు వీడు నా వాడు అంటే కాదు నా వాడంటూ ఇరువురు యువతులు వాదులాడుకున్నారు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ముందుగా నేను మోసపోయాను, కాబట్టి నాకే సొంతమంటూ ఒకరు, కాదు నేనూ సర్వస్వం అర్పించాను పెళ్లి చేసుకుంటానన్నాడు నాకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నారు. సమస్య ఎలా పరిష్కరించాలో అర్థంకాక మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌తోపాటు ఎస్ఐ ఇక్బాల్ తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు బాబా ఫక్రుద్దీన్‌ను పోలీసులు రిమాండ్ తరలించి ఊపిరిపీల్చుకున్నారు. చదవండి: తెలియకుండా విదేశాలకు భార్య! భర్త ఆత్మహత్య -
Asha Suman: ఆత్మవిశ్వాసమే అసలైన గురుదక్షిణ
రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో దివ్యాంగురాలైన ఒక స్టూడెంట్ అత్యాచారానికి గురైన సంఘటన ఆశా సుమన్‌ను షాక్‌కు గురి చేసింది. స్కూలు, కాలేజిల్లో చదివే అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పాలని ఆ సమయంలో సంకల్పించుకుంది ఆశ. దివ్యాంగులు, సాధారణ యువతులు 30 వేల మందికి పైగా ఆత్మరక్షణ విద్యలు నేర్పించిన ఉపాధ్యాయురాలు ఆశా సుమన్ గురించి... తొమ్మిది సంవత్సరాల క్రితం రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని ఖార్కర గ్రామంలో... ఆరోజు స్కూల్‌కు వెళ్లింది ఆశా సుమన్. బడిలో మగపిల్లలు తప్ప ఆడపిల్లలు ఎవరూ కనిపించలేదు. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఈ లోపే ఎవరో ఊళ్లో జరిగిన దుర్ఘటన గురించి చెప్పారు. దివ్యాంగురాలైన ఒక అమ్మాయి సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ సంఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. విషయం తెలిసిన ఆశ హుటాహుటిన బాధితురాలి ఇంటికి వెళ్లింది. ఆ సంఘటనకు సంబంధించిన విషయాలు చెవిన పడుతున్నప్పుడు ఆమె మనసు దుఃఖసముద్రం అయింది. ఈ సంఘటన ప్రభావంతో కొద్దిమంది తల్లిదండ్రులు అమ్మాయిలను స్కూల్‌కు పంపడం మాన్పించారు. నిజానికి ఆ ప్రాంతంలో ఆడపిల్లల చదువుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. ఇచ్చే వాళ్లు కూడా తమ ఇంటి ఆడపిల్లలను బడికి పంపడానికి భయపడుతున్నారు. స్కూల్‌కు వెళ్లినా, స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా ఆ పాశవిక సంఘటన, తల్లిదండ్రులపై దాని ప్రభావం పడి ఆడపిల్లలు స్కూల్‌కు దూరం కావడం... ఇవి పదేపదే గుర్తుకు వచ్చి ఆశను విపరీతంగా బాధపెట్టాయి. ‘ఆ అమ్మాయికి తనను తాను రక్షించుకోవడం తెలిస్తే ఇలా జరిగేది కాదేమో. ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్య నేర్పాలి’ అనుకుంది. మొదటి అడుగుగా... పిల్లల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడింది. పిల్లలను తిరిగి స్కూల్‌కు పంపించడానికి వారు మొదట్లో ససేమిరా అన్నారు. చదువు అనేది ఎంత అవసరమో వివరించి, అమ్మాయిలు తమను తాము కాపాడుకునే ఆత్మరక్షణ విద్యల గురించి చెప్పి వారిలో మార్పు తీసుకువచ్చింది. కొన్ని రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి అమ్మాయిలను తన స్కూటర్‌పై స్కూల్‌కు తీసుకువచ్చేది. రెండు నెలల తరువాత పరిస్థితి మామూలుగా మారింది. స్కూల్లోని అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించడంతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పేది. ఆశ గురించి విన్న చుట్టుపక్కల ఊళ్లలోని స్కూల్, కాలేజీ వాళ్లు ‘మా స్టూడెంట్స్‌కు కూడా నేర్పించండి’ అంటూ ఆహ్వానిం చారు. కాదనకుండా వారి ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో స్కూళ్లు, కాలేజీలలో ఎంతోమంది అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించింది. వైకల్యం ఉన్న బాలికలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పే విధానం వేరుగా ఉంటుంది, వారు సులభంగా అర్థం చేసుకునేలా, అర్థం చేసుకున్నది ఆచరణలో చేసేలా రోజువారి సంఘటనలను ఉదాహరిస్తూ, డమ్మీని ఉపయోగిస్తూ నేర్పిస్తుంటుంది. దృష్టిలోపం ఉన్న మౌనిక అనే స్టూడెంట్ ఆశ టీచర్ దగ్గర సెల్ఫ్–డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకుంది. ‘నేను బయటికి ఎక్కడికి వెళ్లినా తోడుగా అన్నయ్య వచ్చేవాడు. అన్నయ్య లేకుంటే బయటకు వెళ్లడానికి సాహసించేదాన్ని కాదు. అయితే ఇప్పుడు నా గురించే నేనే కాదు, తల్లిదండ్రులు కూడా భయపడడం లేదు. ఎవరైనా నాకు చెడు చేయడానికి ముందుకు వస్తే నిమిషాల్లో మట్టి కరిపించగలననే నమ్మకం వచ్చింది’ అంటుంది మౌనిక. స్టూడెంట్స్లోనే కాదు వారి తల్లిదండ్రులలోనూ ఇప్పుడు ఎంతో ధైర్యం వచ్చింది. ‘చాలామందిలాగే నేను కూడా మా అమ్మాయిని స్కూల్‌కు పంపడానికి భయపడ్డాను. ఇప్పుడు అలాంటి భయాలేవీ లేవు. స్కూల్ అయిపోగానే అమ్మాయిల కోసం ఆశా టీచర్ నిర్వహిస్తున్న సెల్ఫ్–డిఫెన్స్ క్లాసులను దగ్గర నుంచి చూశాను. అమ్మాయిల్లో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది. ప్రతి స్కూల్లో ఆశలాంటి టీచర్ ఒకరు ఉండాలి’ అంటున్నాడు ఆ ఊరికి చెందిన జస్వంత్. అమ్మాయిలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఆశ టీచర్ చేస్తున్న కృషికి ఎన్నో పురస్కారాలు లభించాయి. ఆత్మరక్షణ విద్యల వల్ల అమ్మాయిల్లో కనిపించే ఆత్మవిశ్వాసమే తనకు అసలు సిసలు గురుదక్షిణ అంటుంది ఆశా సుమన్. -
లైగింక వేధింపులపై ఎస్పీకి ఫిర్యాదు
తిరువళ్లూరు: ఉన్నత ఉద్యోగుల నుంచి తరచూ ఎదురవుతున్న లైగింక వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బాధిత యువతులు బుధవారం ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. తిరువళ్లూరు జిల్లా తొడుగాడు గ్రామంలో కార్లకు బ్రేక్, తాళం తయారు చేసే సంస్థ ఉంది. ఈ సంస్థకు దక్షణ కొరియాకు చెందిన కియాంగ్ జూ లీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఽహేమావతి, ధనశేఖర్ తదితరులు మేనేజర్లుగా పని చేస్తున్నారు. కంపెనీలో సుమారు 100 మంది యువతులు పని చేస్తున్నారు. కాగా కంపెనీలో పని చేసే యువతులకు కియాంగ్ జూలీ తరచూ లైగింక వేధింపులకు గురి చేస్తున్నాడని యువతులు వాపోయారు. వేధింపులపై ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. అనంతరం అదనపు ఎస్పీ మీనాక్షికి వినతి పత్రం సమర్పించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగం నుంచి తొలగించిన వారిని విధుల్లోకి తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
అమెరికా వీధుల్లో తిరుగుతూ.. ఆకలితో అలమటిస్తూ..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువతి. రెండేళ్లుగా బాగానే ఉన్నా ఇటీవల తీవ్రంగా మానసిక ఒత్తిడికి లోనైంది. ఆస్పత్రిలో చేర్చినా భయాందోళనతో బయటికి వెళ్లిపోయింది. తన పేరేమిటో కూడా సరిగా చెప్పలేని స్థితికి చేరుకుంది. చివరికి ఆకలితో అలమటిస్తూ అక్కడి వీధుల్లో తిరుగుతోంది. హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతానికి చెందిన సయ్యదా లులూ మిన్హాజ్ జైదీ దీన గాథ. ఆమెను గమనించిన ఓ హైదరాబాదీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ఎవరన్నది తెలిసింది. ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆకలితో అలమటిస్తూ.. లులూ జైదీ 2021 ఆగస్టులో ఎంఎస్ ఇంజనీరింగ్ చేసేందుకు అమెరికాలోని డెట్రాయిట్కు వెళ్లింది. అక్కడి ట్రినీ యూనివర్సిటీలో చదువుతోంది. తరచూ తల్లితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. కానీ కొన్ని నెలల కింద మానసిక ఒత్తిడికి లోనైంది. నాలుగు నెలల నుంచి తల్లికి ఫోన్ చేయడం కూడా మానేసింది. ఆమె ప్రవర్తనలో విపరీత మార్పును చూసిన తోటి విద్యార్థులు తల్లికి సమాచారం ఇచ్చారు. ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. లులూ జైదీ తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయినట్టు గుర్తించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. కానీ ఆమె ఆస్పత్రిలోంచి వెళ్లిపోయింది. వీధుల్లో తిరుగుతూ, ఎవరేమైనా పెడితే తింటూ గడుపుతోంది. ఈ క్రమంలో షికాగో నగరానికి చేరుకుంది. అక్కడ ఓ వీధిలో ఆకలితో ఆలమటిస్తున్న లులూ జైదీని అక్కడే ఉంటున్న హైదరాబాదీ గమనించి మాట్లాడారు. ఆమె పేరు కూడా చెప్పలేని పరిస్థితి, ఆకలితో అలమటిస్తున్న తీరును వీడియో తీసి సోషల్ మీడియాలో హైదరాబాద్ గ్రూప్‌లలో షేర్ చేశారు. అమెరికాలోని హైదరాబాదీలు, తోటి విద్యార్థులు ఇది చూసి.. లులూ జైదీని షికాగోలోని సురక్షిత ప్రాంతానికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. హైదరాబాద్‌కు తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు లులూ జైదీ దుస్థితి గురించి తెలిసిన ఆమె తల్లి.. తన కుమార్తెను కాపాడి, తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావాలంటూ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆమెను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన జైశంకర్.. ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో షికాగోలోని భారత కాన్సులేట్ జనరల్.. లులూ జైదీ ఎవరి వద్ద ఉందో తమతో టచ్‌లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. -
పోలీసుల అదుపులో ఒడిశా యువతులు
భద్రాద్రి: పొట్టకూటి కూసం ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతులు తమిళనాడు రాష్ట్రానికి వెళ్తూ మార్గమధ్యలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ పోలీసులకు చిక్కారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఒడివా రాష్ట్రం కోరాపుట్‌కు చెందిన 13 మంది యువతులు తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూట్లోని ఓ దుస్తుల కంపెనీలో పనిచేసేందుకు వెళ్తున్నారు. యువతులు రెండు కార్లు (వాహనాల్లో) బయలు దేరారు. మార్గమధ్యలో ఓ కారు చెడిపోయింది. దీంతో ఒకేకారులో సర్దుకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చండ్రుగొండలోని ఓ పెట్రోల్‌బంకులో కారు ఆపి సేదతీరుతున్నారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ విజయలక్ష్మి సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువతుల వద్ద ఉన్న కంపెనీ గుర్తింపు కార్డులను పోలీసులు తనిఖీ చేయగా అవి ఓ ప్రముఖ దుస్తుల కంపెనీకి చెందినవిగా ఉన్నాయి. కాగా, ఈ అంశంపై డీఎస్పీ అబ్దుల్ రెహమాన్‌ను వివరణ కోరగా పోలీసులకు పట్టుపడిన యువతులను ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. సమగ్ర విచారణ అనంతరం యువతులను పంపిస్తామన్నారు. -
నవభారత నారీశక్తి
పెరుగుతున్న మహిళాశక్తికి ఇది మరో నిదర్శనం. 2022కి గాను ఇటీవల ప్రకటించిన సివిల్ సర్వీస్ పరీక్షా ఫలితాల్లో కృతార్థులైన అభ్యర్థుల్లో మూడోవంతు మంది, మరో మాటలో 34 శాతం ఆడవారే! తొలి 4 ర్యాంకులూ మహిళలవే! ఇంకా చెప్పాలంటే, అగ్రశ్రేణిలో నిలిచిన పాతిక మంది అభ్యర్థుల్లో 14 మంది స్త్రీలే! ఈ లెక్కలన్నీ మారుతున్న ధోరణికి అద్దం పడుతున్నాయి. ప్రపంచంలోనే అతి క్లిష్టమైన ఈ మూడు దశల పరీక్షలో యువతులు ఇలా అగ్రపీఠిన నిలవడం ఇదే తొలిసారి కాకున్నా, వరుసగా కొన్నేళ్ళుగా వారు ఇలాంటి ఫలితాలు సాధిస్తున్న తీరు అసాధారణం. అంతేకాక, ఒకే ఏడాది ఇంతమంది యువతులు సివిల్స్‌కు ఎంపికవడం ఇదే ప్రప్రథమం. సివిల్ సర్వీసుల్లో ఏయేటి కాయేడు స్త్రీల వాటా పెరుగుతుండడం సానుకూల ధోరణి. అంతకు మించి ఆనందదాయకం. గణాంకాలు గమనిస్తే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేస్తున్నవారిలో మహిళల వాటా 2018లో 24 శాతమైంది. 2021లో అది 26 శాతానికి ఎగబాకింది. తాజాగా 2022 పరీక్షల్లో అది గణనీయంగా 34 శాతానికి హెచ్చింది. సంఖ్యాపరంగా చూస్తే, ఈసారి మొత్తం 933 మంది అభ్యర్థులకు సివిల్స్‌లో చోటు దక్కగా, వారిలో 320 మంది స్త్రీలే. ఇది ఒక్కరోజులో, రాత్రికి రాత్రి జరిగిన పరిణామం కాదు. దశాబ్దాల పరిణామక్రమంలో చోటుచేసుకున్న మార్పు. అనేక ఇతర రంగాల లాగే సివిల్స్ సైతం ఒకప్పుడు పూర్తిగా పురుషాధిక్యమైనదే. 2006 వరకు యూపీఎస్సీ ఎంపిక చేసే మొత్తం అభ్యర్థుల సంఖ్యలో దాదాపు 20 శాతమే మహిళలు. ఇక, ఇంకాస్త వెనక్కి వెళితే, 1980ల్లో, 1990ల తొలినాళ్ళలో వారి సంఖ్య 20 శాతం కన్నా తక్కువే. ఆ గత చరిత్ర మారి, ఈసారి 34 శాతం మహిళలు సివిల్స్ ఉద్యోగానికి లేఖలు అందుకోవడం గణనీయమైన మార్పు. భారతదేశంలో విస్తృత సివిల్ సర్వీస్ వ్యవస్థలోకి ప్రతిభావంతులైన యువతీ యువకులను ఏటా ప్రవేశపెట్టే యూపీఎస్సీ పరీక్ష అత్యంత కష్టమైనది. చైనాలో జాతీయ కాలేజ్ ప్రవేశపరీక్ష గావో కవో లాంటి ఒకటి, రెండే ప్రపంచంలో ఈ స్థాయి క్లిష్టమైనవంటారు. ఏటా మూడు దశల్లో సాగే ఈ కఠిన పరీక్షకు ఏటా దాదాపు 10 లక్షల మంది లోపు దరఖాస్తు చేసుకుంటే, అందులో 1 శాతం కన్నా తక్కువ మందే రెండో దశ అయిన లిఖిత పరీక్ష (మెయిన్స్)కు చేరుకుంటారని లెక్క. అలాంటి పోటీ పరీక్షలో గత ఏడాది కూడా సివిల్స్‌లో తొలి 4 ర్యాంకులూ మహిళలకే దక్కాయి. వరుసగా రెండోసారి ఈ ఏడాదీ అదే ఫలితం పునరావృతమవడం విశేషం. గమనించాల్సింది ఏమిటంటే – వైద్యప్రవేశ పరీక్షలు ‘నీట్’లోనూ ఈ ఏడాది యువతులదే అగ్రస్థానం. జాతీయస్థాయిలో 12వ తరగతి బోర్డ్ పరీక్షా ఫలితాల్లోనూ గత అయిదేళ్ళుగా అబ్బాయిల కన్నా అమ్మాయిలదే పైచేయి. సివిల్స్‌లో ప్రథమ స్థానంలో నిల్చిన ఇషితా కిశోర్ మొదలు మూడో స్థానం దక్కిన తెలుగ మ్మాయి ఉమా హారతి సహా సివిల్స్‌లో నెగ్గిన అనేకమంది అభ్యర్థుల ఆశలు, ఆకాంక్షలు, జీవితంలోని కష్టనష్టాలను ఎదిరించి నిలిచిన వారి పట్టుదల, సహనం స్ఫూర్తిదాయకం. కృతనిశ్చయులైతే... కులం, మతం, ప్రాంతం, లింగ దుర్విచక్షణ లాంటి అనేక అవరోధాలను అధిగమించి సమాజంలోని అన్ని వర్గాల నుంచి వనితలు విజేతలుగా అవతరించడం సాధ్యమని ఈ విజయగాథలు ఋజువు చేస్తున్నాయి. నిష్పాక్షికంగా, అత్యంత సంక్లిష్ట ప్రక్రియగా సాగే సివిల్స్ పరీక్షల్లో అమ్మాయిలు ఈ తరహా విజయాలు సాధిస్తూ, ఉన్నతోద్యోగాలకు ఎంపికవడం విశేషం. ఒకపక్కన కార్పొరేట్ ప్రపంచం సైతం సీనియర్ హోదాల్లో లింగ వైవిధ్యం సాధించడానికి కష్టపడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ అధికార యంత్రాంగ సర్వీసులో ఈ స్థాయిలో మహిళలకు ప్రాతినిధ్యం దక్కడం చరిత్రాత్మకమే! అయితే ఇది చాలదు. నిజానికి, ప్రభుత్వ పాలనలో లింగ సమానత్వంపై యూఎన్డీపీ 2021 నివేదిక ప్రకారం అనేక ఇతర దేశాలతో పోలిస్తే మనం వెనకబడే ఉన్నాం. ప్రభుత్వ ఉన్నతోద్యోగాల్లో స్త్రీల వాటా స్వీడన్లో 53 శాతం, ఆస్ట్రేలియాలో 40 శాతం, సింగపూర్ 29 శాతం కాగా, భారత్ వాటా కేవలం 12 శాతమేనట. ప్రస్తుత మహిళా విజయగాథ మరింత కాలం కొనసాగినప్పుడే ఈ లోటు భర్తీ అవుతుంది. ఇప్పటికీ జమ్ము– కశ్మీర్, జార్ఖండ్ సహా అనేక రాష్ట్రాల్లో అవసరానికి తగ్గ సంఖ్యలో అసలు ఐఏఎస్‌లే లేరన్న పార్లమెంటరీ సంఘం నివేదికను చెవికెక్కించుకోవాలి. అయితే, కేవలం సివిల్స్‌లోనో, మధ్యశ్రేణి ఉద్యోగాల్లోనో స్త్రీల ప్రాతినిధ్యం పెరిగితే సరిపోదు. నేటికీ పితృస్వామిక భావజాలం, ఆడవారు ఇంటికే పరిమితమనే మనస్తత్వం మన సమాజంలో పోలేదన్నది చేదు నిజం. అందుకు తగ్గట్లే... మన జాతీయ శ్రామికశక్తిలో పనిచేసే వయసులోని మహిళల వాటా కూడా తక్కువే. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం 2005లో 35 శాతమున్న వనితల వాటా, 2021లో 25 శాతానికి పడిపోయింది. వెలుగు వెనుకే ఉన్న ఈ చీకటి ఓ విషాదం. కాకపోతే, మునుపటితో పోలిస్తే లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యల సంఖ్య తగ్గింది. ఆధు నిక మహిళ ఒకప్పటితో పోలిస్తే విద్య, ఉద్యోగాల్లో బంధనాలను తెంచుకుంది. ఆటల నుంచి ఆర్మ్›్డ సర్వీసుల దాకా అన్నింటా తాను పురుషుడితో సమానంగా ముందడుగు వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఒత్తిళ్ళు, పనిప్రదేశాల్లో అభద్రత, నగరాల్లోనూ నాసిరకపు ప్రజారవాణా దుఃస్థితిని మార్చాలి. లింగ దుర్విచక్ష లేని పనిసంస్కృతిని ప్రోత్సహించాలి. సమాజంలో దుర్లక్షణాలున్నా వాటిని దాటుకొని పడతులు పైకి రావడం సాధ్యమేనని తాజా సివిల్స్ ఫలితాలు ఆశావాదాన్ని ప్రోది చేస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ ధోరణి గ్రామాలకూ విస్తరించడం శుభవార్త. ఇలాంటి మహిళా విజేతలు మరింత పెరిగితేనే, మన యువభారతం... నవభారతం అవుతుంది. -
లక్షతో కంపెనీ ప్రారంభించి, రూ. 50 కోట్ల సంస్థగా.. 27ఏళ్ల యువతి సాహసమిది!
'చదువుకున్న వెంటనే ఏదో ఒక ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించాలి, స్థిరపడాలి' ఇది చదువుకున్న చాలా మంది ఆలోచన. అయితే చదువు కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదు అద్భుతాలు సృష్టించడానికని కొంత మంది నిరూపిస్తున్నారు. ఆలాంటి వ్యక్తిత్వం ఉన్న వారిలో ఒకరు 'అరుషి అగర్వాల్'. ఇంతకీ అరుషి అగర్వాల్ ఎవరు? ఈ సాధించిన ఆ అద్భుతం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఘజియాబాద్‌లోని నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి, యువ పారిశ్రామిక వేత్తగా.. కేవలం మూడు సంవత్సరాల్లో రూ. 50 కోట్ల కంపెనీ నిర్మించేలా చేసింది. ఇది నిజంగానే గొప్ప అద్భుతం అనే చెప్పాలి. కేవలం మూడేళ్ళలో ఒక అమ్మాయి అనుకున్నది సాధించి సక్సెస్ సాధించింది. నిజానికి అరుషి అగర్వాల్ స్వస్థలం మొరాదాబాద్. ఈమె జెపి ఇన్స్టిట్యూట్ నుంచి బి-టెక్ అండ్ ఎమ్-టెక్ పూర్తి చేసింది. ఆ తరువాత ఢిల్లీ ఐఐటీలో ఇంటర్న్‌షిప్ చేసింది. ఈ సమయంలోనే రెండు సార్లు కోటి రూపాయల భారీ జీతం ఆఫర్ పొందింది. అయితే ఈ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించింది. భారీ శాలరీ ప్యాకేజి వద్దనుకుని తానే సొంతంగా కంపెనీ ప్రారంభించాలని TalentDecrypt అనే సంస్థను ప్రారంభించింది. దీని కోసం కోడింగ్ నేర్చుకుంది. అంతే కాకుండా క్యాంపస్ ప్లేస్మెంట్ పొందని వారికి సహాయం చేయడానికి సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. మొత్తానికి అనుకున్న విధంగానే రూ. లక్ష పెట్టుబడితో కంపెనీ మొదలుపెట్టింది. (ఇదీ చదవండి: టీ షర్ట్ రూ. 2 లక్షలు, మొబైల్ కవర్ రూ. 25వేలు.. అన్ని బ్రాండెడ్ వస్తువులే!) కంపెనీ ప్రారంభించిన కేవలం మూడు సంవత్సరాల్లో ఆమె సాఫ్ట్వేర్ సహాయంతో 10 లక్షల మంది ఉద్యోగాలు పొందారు. అంతే కాకూండా వారు యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, సింగపూర్, యుఎఇ, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్‌లోని 380 కంపెనీలకు సహాయం చేశారు. ఈ సాఫ్ట్వేర్ కింద, ఉద్యోగం పొందాలనుకునే వారు హ్యాకథాన్ (Hackathon) ద్వారా వర్చువల్ స్కిల్ టెస్ట్ చేస్తారు. దీని తరువాత నేరుగా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలలో హాజరు కావచ్చు. (ఇదీ చదవండి: టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్లో రానుందా? ఇదిగో సాక్ష్యం..!) ఈ సాఫ్ట్వేర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి మోసాలకు తావు లేకుండా ఉద్యోగం పొందటానికి వీలు కల్పిస్తుంది. అరుషి అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలలో ఒకరిగా భారత ప్రభుత్వంచే పురస్కారం పొందింది. ఆమె తన తాత 'ఓం ప్రకాష్ గుప్తా'ను తన ఆరాధ్యదైవంగా భావిస్తుంది. ఆమె తండ్రి అజయ్ గుప్తా వ్యాపారవేత్త, ఆమె తల్లి గృహిణి. ప్రస్తుతం ఆమె నోయిడా కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. -
రూ.50 లక్షల కట్నం, బైక్ ముందే కావాలి.. ఇస్తేగాని పెళ్లి చేసుకోను
పటాన్చెరు టౌన్: కట్నం, బైక్ ముందే కావాలని, ఇస్తేగాని పెళ్లి చేసుకునేది లేదని ఓ యువకుడు ఫోన్లో యువతిని తిడుతూ అడగటంతో మనస్తాపం చెందిన యువతి రెండో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యయు యత్నించింది. ఈ సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్చెరు పట్టణంలోని నాయికోటి బస్తీకి చెందిన జంగయ్య కూతురు యామినికి పటాన్చెరు మండలం భానూర్ కంచర్లగూడెంకు చెందిన జంగయ్య అక్క లక్ష్మి కుమారుడు చిన్నోల శంకర్‌తో మార్చి 26వ తేదీన నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో రూ.50 లక్షలు కట్నం భూమి అమ్మిన తర్వాత ఇస్తామని చెప్పడంతో శంకర్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. నిశ్చితార్థం జరిగిన మార్నాడే కట్నంతో పాటు బైక్ ముందే కావాలని యువతికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అడిగాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు శుక్రవారం యువకుడి ఇంటికి వెళ్లి మాట్లాడేందుకు వెళ్లడంతో తనకు పెళ్లి అవసరం లేదంటూనిశ్చితార్థం సమయంలో పెట్టిన రింగ్ తీసి పడేశాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు మళ్లీ మాట్లాడుదామని చెప్పి ఇంటికి వచ్చారు. దీంతో మనస్తాపం చెందిన యువతి భవనం రెండో అంతస్తు పైనుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే యామినిని చికిత్స కోసం పట్టణంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి మిషయంగా ఉందని వైద్యులు తెలిపారు. కట్నకానుకల విషయంలో శంకర్, అతడి కుటుంబ సభ్యులు వేధించడంవల్లే తమ కూతురు ఆత్మహత్యకు యత్నించిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మాయిలకు మాత్రమే
ఆ కుస్తీ శాలకు వెళితే 35 మంది యువతులు భారీ కసరత్తులు చేస్తూ కనిపిస్తారు. హర్యానాలోని సోనిపట్‌లో ‘యుద్ధవీర్ అఖాడా’ మహిళా రెజ్లర్ల గురుకులంగా వాసికెక్కింది. ఉదయం 4.30 గంటలు. ఆ అమ్మాయిలంతా లేచి మొదట చేయవలసిన పని బాదం పప్పును మెత్తగా నూరి చిక్కటి పా లతో తీసుకోవడం. ఆ తర్వాత శరీరంలో చురుకుదనం తెచ్చే చిన్నపా టి వ్యాయామాలు చేయడం. ఆ తర్వాత వ్యాయామ స్థాయిని పెంచుకుంటూ వడం. ఆపై గోదాలో దిగి ఒకటి రెండు కుస్తీలు ఆడటం. ఉదయం 8.30 వరకూ ఈ శిక్షణ సాగుతుంది. ఏ మాత్రం మార్పు ఉండదు. మళ్లీ సాయంత్రం ఇలాగే నాలుగు గంటల శిక్షణ ఉంటుంది. ఢిల్లీకి గంటన్నర దూరంలో ఉన్న సోనిపట్ (హర్యాణ) అనే ఒక మోస్తారు పట్టణం శివార్లలో ఆవాల చేల పక్కన ఉన్న ‘యుద్ధ్వీర్ అఖాడా’ కేవలం మహిళా రెజ్లర్లకు ఉద్దేశించబడినది. దీనిని స్థాపించిన యుద్ధవీర్ స్వయంగా కుస్తీ యోధుడు. విశాలమైన ఈ శిక్షణా కేంద్రంలో గోడల నిండా అతడు తెచ్చిన మెడల్స్ వేలాడదీసి ఉంటాయి. ప్రస్తుతం అతడు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నందువల్ల అతని తండ్రి, శిక్షకులు ఈ అమ్మాయిలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. 2016 నుంచి వచ్చిన ఊపు హర్యాణలో ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసి పంపడం, ఆటలకు దూరంగా ఉంచడం ఆనవాయితీ. అయితే 2016 రియో ఒలింపిక్స్‌లో హర్యాణ నుంచి సాక్షి మాలిక్ ఒలింపిక్స్‌లో పతకం తేవడంతో ఒక్కసారిగా ఆ రాష్ట్రమంతా మహిళా కుస్తీ గురించి చర్చించుకోవడం మొదలెట్టింది. అదే సంవత్సరం ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ వచ్చి ఆడపిల్లల కుస్తీని కథాంశంగా చూపి సూపర్‌హిట్ కొట్టడంతో అక్కడి తల్లిదండ్రులు, ఆడపిల్లలు కుస్తీని తమ భవిష్యత్తుకు ఒక మంచి మార్గంగా భావించారు. అది గమనించిన యుద్ధ్వీర్ ఆ మరుసటి సంవత్సరం ఈ అకాడెమీని తెరిచాడు. గురుకుల విద్య యుద్ధ్ వీర్ అఖాడాలో 10 ఏళ్లు నిండిన వయసు నుంచి 15 ఏళ్ల లోపు చేరవచ్చు. 20 ఏళ్ల వయసు వచ్చేవరకు సాధన చేయాల్సి వుంటుంది. అన్నాళ్లు అక్కడే ఉండివాలి. అయితే ఈ విద్య ఉచితం కాదు. ఒక్కో స్టూడెంట్ నెలకు కనీసం 15 వేలు చెల్లించాలి. శిక్షణ ఇస్తూ మంచి ఆహారం కూడా ఇవ్వాలంటే కనీసం ఈ మాత్రం ఫీజు అవసరం అని నిర్వాహకులు అంటారు. సంప్రదాయ జిమ్‌తో పా టు కొయ్యదుంగను ఈడ్చడం, టైర్లను సుత్తితో బాదడం, మట్టి గోదాలో కుస్తీ ఆడటం వంటి శిక్షణ ఉంటుంది. నడుముకు బలం రావడానికి, చేతుల్లో ఒడుపు రావడానికి రకరకాల వ్యాయామాలు చేయిస్తారు. ఆశలు... ఆకాంక్షలు ఇక్కడ చేరిన వారంతా ఇప్పటికే అండర్ 15, అండర్ 17 కుస్తీ పోటీల్లో జాతీయ స్థాయిలో ఆడి పతకాలు తెస్తున్నారు. జూనియర్ ఛాంపియన్ బిపా ష దహియా ఇక్కడ ఇంకా శిక్షణలో ఉంది. కామన్వెల్త్, ఒలింపిక్స్‌లో ఆడి ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకోవాలని, ఆర్మీలో చేరాలని వీరంతా భావిస్తున్నారు. ‘మేము ఐదుగురం అక్కాచెల్లెళ్లం. కొడుకు లేని కారణాన మా నాన్న మాలో ముగ్గుర్ని ఇక్కడికి పంపించాడు. మేము దృఢంగా, బలంగా ఉండాలని ఆయన కోరిక’ అని ఒకమ్మాయి అంది. సమాజంలో స్త్రీలపై ఉండే వివక్ష, హింసను తట్టుకోవడానికి మానసికంగా, శారీరకంగా బలంగా ఉండటానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అమ్మాయిలు భావిస్తున్నారు.రెండు నిమిషాల్లో ఎత్తి కిందపడేయగల వీరిని చూస్తే ఎవరైనా సరే ఒళ్లు దగ్గర పెట్టుకోక తప్పదు మరి. అలంకరణ లేదు ఇక్కడ చేరే అమ్మాయిలందరూ మిలట్రీలోలాగా క్రాఫ్ చేయించుకోవాల్సి ఉంటుంది. టీషర్టులు, ట్రాక్ ప్యాంట్లు తప్పనిసరి. గబుక్కున చూస్తే వీరంతా అబ్బాయిలకు మల్లే కనిపిస్తారు. ఆదివారం రోజు ఇచ్చే వెసులుబాటులో సరదాగా వంట చేయడం, ఆ సాయంత్రం నృత్యంతో సేద తీరడం చేస్తారు. ‘మేమంతా స్నేహితులమే అయినా గోదాలో ఉన్న కాసేపు శత్రువులమే’ అని నవ్వుతారు. ‘ఓడినవారు ఐదు నిమిషాల్లో మాట కలిపేయాలి అనేది నియమం’ అంటారు. -
ఆడిపాడే వయసులో.. భక్తిమార్గమే గొప్పదని..
సాక్షి, హొసపేటె: ఆడిపాడే వయసులో ఓ యువతి ఇహలోక అంశాలను త్యజించి సన్యాసదీక్ష తీసుకుంది. హొసపేటె నగరంలో నివాసముంటున్న వ్యాపారి దివంగత కాంతిలాల్ జిరావర్, రేఖా దేవి దంపతుల నలుగురు కుమార్తెల్లో మూడో కుమార్తె ముముక్ష బుధవారం జైన మత సంప్రదాయాల ప్రకారం సన్యాసదీక్ష స్వీకరించింది. స్థానిక హోటల్ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జైనమునులు ఆమెకు సన్యాస దీక్ష ఇచ్చారు. ఆధ్యాత్మిక ప్రపంచమే మిన్న 19 ఏళ్ల ముముక్ష మాట్లాడుతూ తన నాలుగేళ్ల వయస్సులో తండ్రి ఓ ప్రమాదంలో మృతి చెందారు. అన్ని కష్టాలను అధిగమించి తాను 10వ తరగతిలో 95.8 శాతం, పీయూసీలో 99 శాతం మార్కులతో పాసైనట్లు తెలిపింది. లౌకిక ప్రపంచం కన్నా తనకు ఆధ్యాత్మిక ప్రపంచమే మిన్నగా భావించి ఈరోజు జైన సన్యాసాన్ని స్వీకరించానని తెలిపింది. ఈ సందర్భంగా బంధుమిత్రులు ఆమెను భారమైన హృదయాలతో అభినందించారు. -
Hyderabad: వలపు వల హనీ ట్రాప్‌తో నిలువు దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రాంతానికి చెందిన చోటామోటా వ్యాపారుల్లో అమాయకులను ఎంచుకోవడం... యువతులతో వారికి ఎర వేసి ఫొటోల వరకు తీసుకువెళ్లడం... వాటితో యువతుల బంధువులుగా రంగంలోకి దిగడం... దాడులు, బెదిరింపులతో భయభ్రాంతులకు గురి చేసి అందినకాడికి దండుకోవడం... ఈ పంథాలో రెచ్చిపోతున్న “హనీట్రాప్స్ బందిపోటు’ ముఠాను ముషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అరెస్టైన 12 మందిలో ఓ మాజీ హోంగార్డు, బౌన్సర్ ఉన్నట్లు మధ్య మండల డీసీపీ ఎం.రాజేష్ చంద్ర తెలిపారు. చిక్కడపల్లి ఏసీపీ ఎస్.యాదగిరితో కలిసి సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. హోంగార్డుగా పని చేస్తూ నేరాలు... ముషీరాబాద్ పరిధిలోని దయారా మార్కెట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ విఖార్ మెహ్దీ గతంలో నగర భద్రతా విభాగంలో హోంగార్డుగా పని చేశారు. 2013లో పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ, బెదిరింపులకు పాల్పడి జైలుకు వెళ్లాడు. 2016లో నోట్ల రద్దు తర్వాత పాత నోట్లకు కొత్త నోట్లు మార్పిడి పేరుతో దందా చేసి పలువురిని మోసం చేశాడు. దీనిపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో మరోసారి జైలుకు వెళ్లాడు. ఇతడి నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. విఖార్ జైల్లో ఉండగా తలాబ్‌కట్టకు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్‌తో పరిచయమైంది. వీళ్లిద్దరూ కలిసి పంజగుట్టలో విఖార్‌తో కలిసి అరెస్టు అయిన సంతోష్‌నగర్ వాసి మహ్మద్ కలీం ఖాన్, ముషీరాబాద్‌కు చెందిన పాత నేరగాడు, విఖార్ సోదరుడైన సిరాజ్ జట్టు కట్టారు. పహాడీషరీఫ్, మెహదీపట్నం ప్రాంతాలకు చెందిన షేక్ సమీర, సైదా ఫాతిమా, మహ్మద్ ఇస్మాయిల్, అలీ, మజీద్ అహ్మద్, అహ్మద్ రిజ్వాన్, సయ్యద్ రఫీఖ్, షేక్ బషీర్, స్టేజ్ డ్యాన్సర్ హీనాలతో ముఠా ఏర్పాటు చేశారు. చిరు వ్యాపారులను ఎంపిక చేసుకుని... ఈ గ్యాంగ్‌లోని పురుషులు తమ ప్రాంతాల్లోని చిరు వ్యాపారుల్లో అమాయకులను టార్గెట్‌గా చేసుకుంటారు. వీరి ద్వారా విషయం తెలుసుకునే ముఠాలోని యువతులు, మహిళలు అతడి వద్దకు వెళ్తారు. ఆయా వ్యాపారాలకు సంబంధించి ఆర్డర్లు ఇవ్వడానికంటూ వ్యాపారుల ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. ఆపై వారికి వాట్సాప్‌లో సందేశాలు పంపి చాటింగ్స్ చేస్తారు. ఓ ప్రాంతంలో కలుసుకోవడానికి రమ్మని పిలిచి వారితో ఫొటోలు దిగుతారు. ఈ ఫొటోలను తీసుకుని ముఠా సభ్యులు అసలు కథ మొదలెడతారు. ఆ వ్యాపారి వద్దకు వెళ్లి సదరు మహిళ తమ భార్య లేదా కాబోయే భార్య అని చెప్పి, ఆమెను లోబరుచుకుంటున్నావని బెదిరించి దాడి చేస్తారు. పోలీసులుగా ఎంట్రీ ఇచ్చే విఖార్, ఇమ్రాన్లు కేసుల పేరుతో, విలేకరి రూపంలో వచ్చే రిజ్వాన్ ఫొటోలు మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరిస్తాడు. దీంతో వారు సదరు వ్యక్తి నుంచి భారీ మొత్తం డిమాండ్ చేసి అందినకాడికి దండుకుంటారు. మూడు ఠాణాల్లో నాలుగు కేసులు... ఈ ఏడాది జూన్ నుంచి నేరాలు చేస్తున్న ఈ గ్యాంగ్‌పై ఇప్పటి వరకు ఆసిఫ్‌నగర్, సంతోష్‌నగర్, ముషీరాబాద్‌ల్లో కేసులు నమోదయ్యాయి. ముషీరాబాద్‌కు చెందిన ఖమ్రుద్దీన్‌ను రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. వీరి వేధింపులు తట్టుకోలేక అతడు తన ఇంటిని తాకట్టు పెట్టి రూ.5 లక్షలు ఇచ్చాడు. ఇదే ప్రాంత వాసి ఖలీల్ పాషా రూ.2.5 లక్షలు మరో ఇద్దరి నుంచి ఇంకొంత రాబట్టారు. ఇలా మొత్తం రూ.8.5 లక్షలు కాజేసిన, బెదిరింపులకు డమ్మీ పిస్టల్స్, కత్తులు వాడే వీరిపై ముషీరాబాద్‌లో బందిపోటు దొంగతనం సహా వివిధ ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. చిక్కడపల్లి ఏసీపీ ఎస్.యాదగిరి నేతృత్వంలో రంగంలోకి దిగిన నాలుగు బృందాలు హీనా సహా మిగిలిన 12 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.5 లక్షల నగదు, రెండు డమ్మీ తుపాకులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వీరిలో అర్హులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, వీరి బారినపడిన బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని డీసీపీ రాజేష్ చంద్ర కోరారు. -
ప్రేమించమని వేధింపులు.. భయాందోళనతో..
బెంగళూరు: ప్రేమించాలంటూ పోకిరీ వెంటపడి వేధిస్తుండడాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా మల్లాతహళ్లి గ్రామం నివాసి పల్లవి (22)ఆత్మహత్య చేసుకున్న యువతి. కుమారస్వామి అనే యువకుడు గత కొంత కాలంగా పల్లవిని ప్రేమించమని వేధిస్తుండడంతో భయాందోళనకు గురైన పల్లవి ఉరి వేసుకుంది. తమ కుమార్తె మృతికి కుమారస్వామి వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (భర్త నిద్రలో చనిపోయినట్లు నమ్మించింది..చివర్లో కూతురు షాకింగ్ ట్విస్ట్) -
కొంతకాలంగా పెళ్లి సంబంధాలు.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా..
సాక్షి, ఎర్రవల్లిచౌరస్తా: ఇటిక్యాల మండలంలోని కొండేరులో యువతి అదృశ్యమైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ గోకారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొండేరు చెందిన డక్కలి కోటమ్మ, హనుమంతు దంపతుల చిన్న కుమార్తె రాణికి కుటుంబసభ్యులు కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలిపారు. ఆమెకు ఇష్టం లేకపోవడంతో బుధవారం ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూలీ పనులకు వెళ్లగా ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా తమ కూతురు లేకపోవడంతో ఆరా తీయగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. గురువారం తల్లి ఫిర్యాదు మేరకు సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (చిత్రకారుడు బాలి తనయుడు మంచు తుపానులో మృతి) -
మెదక్ జిల్లాలో రెచ్చిపోయిన కామాంధులు
-
మెదక్ జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా మద్దూరు మండలం లాడ్నూరు గ్రామంలో కామాంధులు రెచ్చిపోయారు. 23 ఏళ్ల మూగ యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత రాత్రి ఓ కారులో యువతిని బలవంతంగా ఎక్కించుకొని వెళ్లిన కొందరు యువకులు గ్రామశివార్లలో అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. కారును వెంబండించి పట్టుకుంటే ఆకునూరు గ్రామానికి చెందిన కనకస్వామి, నరేష్ అనే వ్యక్తులు అందులో ఉన్నారని బాధిత యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. వదిలేయాలని వేడుకున్నా..) -
నివేదన ప్రేమవివాహం.. ఇంటికి వచ్చి చూసే సరికి..
సాక్షి, చెన్నై: కూతురు ప్రేమ వివాహం చేసుకుందని సోమవారం తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. పరమత్తివేలూరు తాలూకా పాండమంగళం సమీపంలోని నెట్టైయం పాళయానికి చెందిన వీరప్పన్ (55) కూలి. ఇతని భార్య భానుమతి. వీరికి నివేద (22) అనే ఏకైక కుమార్తె ఉంది. ఈమె ఎమ్.ఎస్.సి చదువుకుని ఇంట్లో ఉంటోంది. ఈక్రమంలో నివేద అదే ప్రాంతంలోని బెల్లం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సేలం జిల్లా మకుడం చావడికి చెందిన యువరాజ్ (25)ను ప్రేమించింది. నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి వారు పెళ్లి చేసుకుని మకుడంచావడిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల వీరప్పన్ తన కుమార్తె నివేదను భర్తతో కలిసి పట్టణానికి రావాలని ఆహ్వానించాడు. అయితే నివేద రావడానికి నిరాకరించింది. దీంతో వీరప్పన్ సోమవారం కుమార్తెను తీసుకురమ్మని భార్య భానుమతిని మకుడం చావడికి పంపాడు. అయితే నివేద ఇంటికి రావడానికి నిరాకరించిందని, దీంతో చేసేది లేక తిరిగి వస్తున్నానని భానుమతి భర్తకు చెప్పింది. ఇంటికి వచ్చి చూసే సరికి భర్త తాడుతో ఉరివేసుకుని ఉండడంతో వేలూరు పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరప్పన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. -
మద్యం మత్తులో యువతి హల్చల్.. బీర్‌బాటిల్‌తో దాడి.. ఏఎస్సైకి తీవ్రగాయాలు
సాక్షి, విశాఖపట్నం: మద్యం మత్తులో అర్ధరాత్రి ఓ యువతి హల్చల్ చేసింది. విశాఖ బీచ్ రోడ్డులో బీరు తాగుతూ యువతి న్యూసెన్స్ చేసింది. దీనిని ప్రశ్నించిన ఏఎస్ఐ సత్యనారాయణపై మద్యం బాటిల్‌తో దాడికి యత్నించింది. అది గురితప్పి పక్కనే ఉన్న గోవింద్ అనే యువకుడిని తీవ్రంగా గాయపరిచింది. అనంతరం ఏఎస్సైని కాలితో తన్ని, దాడికి పాల్పడుతూ తీవ్రంగా గాయపరిచింది. పోలీసులు అయితే మీరేం చేస్తారంటూ అసభ్యపదజాలంతో యువతి రెచ్చిపోయింది. నా బాయ్ ఫ్రెండ్‌కి చెప్పి మిమ్మల్ని లేపించేస్తానంటూ బెదిరింపులకు దిగింది. రేపటి నుంచి పోలీసులెవరూ రోడ్డుమీద తిరగకుండా చేస్తానని మద్యం మత్తులో హెచ్చరించింది. ఘటన జరిగిన సమయంలో యువతి ఫుల్‌గా మద్యం సేవించినట్లు గుర్తించారు. గాయపడిన గోవింద్ అనే యువకుడు యువతిపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చదవండి: (భార్యకు విడాకులిస్తానని మహిళా అధికారితో చెట్టాపట్టాల్.. చివరకు..) -
టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్లిన యువతి అదృశ్యం.. ముంబై వెళ్తున్నా అంటూ..
సాక్షి, హైదరాబాద్: టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్న ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన బుధవారం అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మల్లేష్ కథనం ప్రకారం.. అంబర్‌పేట డివిజన్ పటేల్‌నగర్‌లో నివసించే షేక్ ఉన్నీసా కూతురు షేక్ సనా(19) ఉదయం 11 గంటలకు టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తల్లికి ఫోన్ చేసి తాను ముంబాయి వెళ్తున్నట్లు తల్లికి సమాచారం ఇచ్చి ఫోన్ స్విచాఫ్ చేసింది. దీంతో తల్లి ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: పాతబస్తీకి మెట్రో కలేనా..?) -
పెళ్లింట విషాదం.. కొద్దిక్షణాల్లో పెళ్లనగా పెళ్లికుమార్తె ఆత్మహత్య
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. మరికాసేపట్లో పెళ్లనగా ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. నవీపేటలో మరికొద్ది గంటల్లో పెళ్లిపీటలెక్కాల్సిన రవళి అనే యువతి ఆదివారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాబోయే భర్త వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పెళ్లికి ముందే ఉద్యోగం చేయాలని, పలు రకాలుగా ఒత్తిళ్లకు గురిచేయడంతో రవళి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌కు చెందిన సంతోష్‌తో ఈరోజు వివాహం జరగాల్సి ఉంది. ఈ సమయంలో ఆత్మహత్యకు చేసుకోవడంతో పెళ్లింట్లో విషాదం నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: కోర్ సిటీలోకార్ రేసా?.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు) -
హోమ్ ట్యూషన్ చెప్పేందుకు వెళ్లి.. అఖిల్ వచ్చాడని సారిక వాట్సాప్ మెసేజ్ చేసి..
సాక్షి, హైదరాబాద్: హోమ్ ట్యూషన్ చెప్పేందుకు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గుండ్లపోచంపల్లికి చెందిన శ్రీశైలం, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా రెండో కుమార్తె సారిక(22) బీ–ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతూ హోమ్ ట్యూషన్స్ చెబుతోంది. గత నెల 30వ తేదీన 7 గంటలకు ట్యూషన్ చెప్పేందుకు వెళ్లిన సారిక ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతకగా ఫలితం లేకుండాపోయింది. ఆమె మొబైల్ నంబర్‌కు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. అయితే తన అక్క మొబైల్ ఫోన్‌కు అఖిల్ వచ్చాడని సారిక వాట్సాప్ మెసేజ్ పెట్టిందని, ఆ తరువాత ఫోన్ స్విచ్ఛాప్ పెట్టిందని, అతడిపై అనుమానం ఉందంటూ యువతి తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (అసభ్య చిత్రాలను వీడియోలుగా తీసి.. కోట్ల రూపాయల సంపాదన) -
వారి పోరాటం ఫలించాలంటే...
పోలీసుల కస్టడీలో మాసా అమీనీ మరణించిన ఘటన అనంతరం పెల్లుబికిన నిరసనలు ఇరాన్లో ఇంకా కొనసాగుతున్నాయి. విద్యార్థులు, యువతులు కీలక పాత్ర పోషిస్తుండగా, ఇరాన్ సమాజంలోని సకల వర్గాల ప్రజలు ఈ నిరసన ప్రదర్శనల్లో చేరుతున్నారు. మరోవైపు వేలాదిమంది నిరసనకారులను అరెస్టు చేయడంతోపాటు జర్నలిస్టులు, డాక్టర్లు, లాయర్లు వంటివారిపై కూడా ప్రభుత్వం నిర్బంధం విధించింది. ఇరాన్ భద్రతా బలగాల చేతిలో ఇప్పటివరకూ 326 మంది చనిపోయారు. నిరసనకారులకు క్షమాభిక్ష పెట్టరాదని పార్లమెంట్ తీర్మానం చేసింది. ఇరాన్ సమాజం మొత్తం ఏకమై సాగిస్తున్న ఈ చిరస్మరణీయ పోరాటానికి భారత్‌తో సహా ప్రపంచ దేశాల సంఘీభావం అవసరం. సెప్టెంబర్ 16న మాసా అమీనీ అనే 22 ఏళ్ల కుర్దిష్ ఇరానియన్ యువతి పోలీసుల కస్టడీలో మరణించిన ఘటన ఇరాన్లో రగిలించిన ప్రదర్శనలు పదో వారంలోకి ప్రవేశించాయి. నార్వే కేంద్రంగా పనిచేసే ఇరాన్ మానవ హక్కుల ఎన్జీవో (ఐహెచ్ఆర్ఎన్జీఓ) ప్రకారం, పట్టణాల్లో దీనిపై తిరుగుబాటు ప్రారంభమైనప్పటినుంచి ఇరాన్ భద్రతా బలగాల చేతిలో 326 మంది చనిపోయారు. ఇందులో 40 మంది పిల్లలు. వీరు కారులో ఉండటమో, దారిపక్కన నిలుచుని ఉండటమో జరిగింది. పోలీసులచే హత్యకు గురైన పిల్లల జాబితాలో ఇటీవల చేరిన అబ్బాయి పేరు కియాన్ పిర్ఫాలక్. తొమ్మిదేళ్ల కియాన్ ఇరాన్‌లోని ఐజేహ్ నగరానికి చెందినవాడు. అనేక ఇతర కేసుల్లో జరిగిన విధం గానే భద్రతా బలగాలు తమ కుమారుడిని లాక్కెళ్తారనే భయంతో అతడి దేహాన్ని ఐసుతో కప్పి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఇరాన్ వ్యాప్తంగా పౌరుల హత్యలు జరుగుతున్నప్పటికీ, షియా సంప్ర దాయం ప్రకారం 40వ రోజున చనిపోయినవారి స్మృతిలో ప్రదర్శన కారులు తిరిగి వీధుల్లోకి వచ్చారు. ఒకవైపు ప్రజాగ్రహం, ఆందోళనలు కొనసాగుతుండగానే, ఇంత వరకూ అరెస్టయిన 13,000 మంది నిరసనకారులకు దేశ న్యాయ వ్యవస్థ ఎలాంటి క్షమాభిక్ష పెట్టరాదని ఇరాన్ పార్లమెంటులోని 290 మంది ఎంపీల్లో 227 మంది డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరానియన్ మానవ హక్కుల కార్యకర్తల ప్రయత్నాలు, నిరసన కారులకు మద్దతుగా కెనడా, బ్రిటన్, యూరోపియన్ కౌన్సిల్ సంకేతా త్మకంగా ఆంక్షలు అమలు చేసినప్పటికీ ఇవేవీ ఇరాన్ అధికారులపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని కలిగించలేదు. ఇరాన్ ప్రజల తలరాత పట్ల భారతీయులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు పూర్తిగా ఉదాసీనంగా ఉంటున్నారు. ప్రతిరోజూ మృతి చెందుతున్న నిరసన కారుల సంఖ్య పెరుగుతూ వస్తూండగా, అరెస్టయిన వారిని సామూ హికంగా విచారించడం వేగవంతమవుతోంది. గత కొన్ని నెలలుగా వేలాదిమంది నిరసనకారులను అరెస్టు చేయడంతోపాటు ఇరాన్ ప్రభుత్వం దేశంలోని జర్నలిస్టులు, విద్యా ర్థులు, పాఠశాలలు, డాక్టర్లు, లాయర్లు వంటివారిపై కూడా నిర్బంధం విధించింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ అంచనా ప్రకారం ఇరాన్లో గత 10 వారాల్లో 51 మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. నిరసన ప్రదర్శనలు ప్రారంభమై నప్పటినుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు 308 మంది యూనివర్సిటీ విద్యార్థులను ప్రభుత్వ బలగాలు అరెస్టు చేశాయని హ్యూమన్ రైట్స్ వాచ్ అంచనా. ఇరాన్లో పనిచేస్తున్న కొందరు మానవ హక్కుల కార్య కర్తల అభిప్రాయం ప్రకారం, 2022 నవంబర్ ప్రారంభం నాటికి 130 మంది మానవ హక్కుల సమర్థకులను, 38 మంది మహిళా హక్కుల సమర్థకులను, 36 మంది రాజకీయ కార్యకర్తలను, 19 మంది లాయర్లను ఇరాన్ నిఘా సంస్థలు అరెస్టు చేశాయి. ఇరానియన్ న్యాయవ్యవస్థకు చెందిన న్యూస్ ఏజెన్సీ ప్రకారం, వివిధ ప్రావిన్సుల్లో నిరసనకారులపై నేరారోపణ అభియోగాలు మోపటం మొదలైపోయింది. అల్బోర్జ్ ప్రావిన్స్‌లో 201, జంజీన్లో 119, కుర్దిస్తాన్‌లో 110, ఖుజెస్తాన్లో 105, సెమ్నన్లో 89, ఖజ్విన్‌లో 55, కెర్మన్‌లో 25 చార్జిషీట్లను మోపగా, రాజధాని నగరమైన తెహ్రాన్‌లో వెయ్యిమంది నిరసనకారులపై చార్జిషీట్ మోపారు. దీనికితోడుగా, అక్టోబర్ 30న తెహ్రాన్‌లోని రివల్యూషనరీ కోర్టు 15వ బ్రాంచ్... ఆరుగురు నిరనసకారులపై యుద్ధం చేస్తున్నారనీ, వీరు అత్యంత అవినీతిపరులనీ, జాతీయ భద్రతకు వ్యతిరేకంగా కుమ్మక్క య్యారనీ అభియోగాలు మోపింది. దేశంలో కొనసాగుతున్న నిరనస ప్రదర్శనల్లో విద్యార్థులు, యువతులు కీలక పాత్ర పోషిస్తుండగా, ఇరాన్ సమాజంలోని సకల వర్గాల ప్రజలు నిరసనల్లో చేరుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 2009, 2017లో జరిగిన సామాజిక ఉద్యమాల్లా ప్రస్తుత నిరసన ప్రదర్శనలు చల్లారేట్టు కనిపించడం లేదు. దీనికి రెండు కారణాలు తోడయ్యాయి. మొదటిది: ఇరానియన్ టీనేజర్లు, విద్యా ర్థులు తమ తల్లిదండ్రుల కంటే మరింత సాహసవంతులుగా, పోరాట కారులుగా మారారు. ఎందుకంటే వారికి ఇకపై భవిష్యత్తు అనేది కనిపించడం లేదు. రెండు: ఇరాన్ ప్రభుత్వ నైతికస్థైర్యం∙ఎంత బల హీనపడిందంటే, దాని సైనిక, రాజకీయ సంస్థలు ఎలాంటి విశ్వస నీయతనూ కలిగించడం లేదు. గత రెండు నెలల్లో, ఇరాన్ కళాకారులు, మేధావులు, క్రీడాకారులు మొత్తంగా ప్రదర్శనకారుల పట్ల సంఘీభావం తెలిపారు. ఇలాంటి ఐక్యతా ప్రదర్శనకు తాజా ఉదహరణగా ఇరాన్ ఫుట్‌బాల్ టీమ్ నిలబడింది. నవంబర్ 21న ఇంగ్లండ్‌పై ప్రపంచకప్ మ్యాచ్ జరగ డానికి ముందు సాంప్రదాయికంగా తమ దేశ జాతీయ గీతాన్ని ఆలపించడానికి ఇరాన్ జట్టు తిరస్కరించింది. ఇరాన్ ప్రభుత్వం దేశంలో పిల్లలను, యువతను కాల్చి చంపుతున్నందుకు తీవ్ర నిరస నను జాతీయ గీతం ఆలపించకపోవడం ద్వారా ప్రదర్శించిన ఇరాన్ పుట్‌బాల్ జట్టు బహిరంగంగానే దేశీయ నిరసనకారులకు సంఘీ భావం తెలిపింది. దేశ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇరాన్ అధికా రులు ఒక అడుగు వెనక్కు వేసి తాము ఎక్కడ నిలిచామో అంచనా వేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఇస్లామిక్ రిపబ్లిక్ ఇప్పుడు ఒక ప్రమాదకరమైన అంచుకు చేరినట్లు కనబడుతోంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఇస్లామిక్ పాలనకు ముగింపు పలకడానికి చేతులు కలుపుతున్నారు. మరోవైపున యూరోపియన్ యూనియన్, బ్రిటన్, అమెరికాలు ఇరాన్ వీధుల్లో స్కూలు పిల్లలను, టీనేజర్లను కాల్చి చంపుతున్న వ్యవస్థతో సజావుగా వ్యాపారాన్ని సాగించలేరు. అందుకే పశ్చిమదేశాలు, తూర్పుదేశాలు కూడా తమ ప్రజాస్వామ్య విధిని పరిపూర్తి చేయడం కోసం ఇరాన్ ప్రజలను ప్రోత్సహించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల మద్దతు లేకుండా ఇరానియన్లు స్వాతంత్య్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని సాధించలేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అత్యంత ప్రధానమైన శక్తి ఏదంటే, ఇస్లామిక్ పాలనలోని అణిచివేతకు లోబడిపోవడానికి తిరస్కరిస్తున్న ఇరానియన్లు మాత్రమే. అదే సమయంలో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంక్షలు విధించే విషయంలో తమ తమ ప్రభుత్వాలతో లాబీయింగ్ చేయడం, క్రీడలు, సాంస్కృతిక అంశాలను బహిష్కరిం చడం, ఇరాన్లో పౌర ప్రతిఘటనా ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతుకోసం ప్రజలను కూడగట్టడం వంటి చర్యల ద్వారా అంతర్జాతీయ మిత్రుల సహాయం చాలా కీలకమని మనం మర్చిపోకూడాదు. 1980లలో దక్షిణాఫ్రికాలోని వర్ణవివక్షా పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాట ఉదాహరణ అలాంటి ప్రయత్నానికి స్ఫూర్తి దాయకంగా నిలబడవచ్చు. ఈ సందర్భంగా 2005లో జోహాన్స్‌బర్గ్‌లో నెల్సన్ మండేలా చెప్పిన మాటలను మనం మర్చిపోకూడదు. ‘‘మేం నిర్బంధంలో మగ్గుతున్నప్పుడు మాపై అణచివేతకు వ్యతిరేకంగా సంఘీభావం తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇచ్చిన మద్దతును మేం ఎన్నడూ మర్చిపోము. ఆ ప్రయత్నాలు ఫలించాయి. అందువల్లే పేదరికం నుంచి విముక్తి కోసం మద్దతునివ్వడంలో ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలతో మేము భుజం కలిపి నిలబడగలుగుతున్నాం.’’ ఆ విధంగానే ఈరోజు కోట్లాది ఇరాన్ ప్రజలు సగర్వంగా లేచి నిలబడుతున్నారు. భారత్‌తో పాటు, ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి సంఘీభావం కోసం వారు వేచి చూస్తున్నారు. వ్యాసకర్త ఇరానియన్ పొలిటికల్ ఫిలాసఫర్ రామిన్ జహాన్బెగ్లూ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
పెళ్లి చేసుకోమంటూ యువతి పోరు.. అయిదు పేజీల లేఖ రాసి..
సాక్షి, బెంగళూరు: నిన్నే పెళ్లిచేసుకుంటా, నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని రావాలని యువతి వేధిస్తుండడంతో తట్టుకోలేక యువకుడు ఇల్లు వదిలి పరారయ్యాడు. ఈ విచిత్ర ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కలబురిగి జిల్లా హరవాళ గ్రామానికి చెందిన మారప్ప అనే యువకుడు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నాడు. గతంలో బీదర్ జిల్లాలో పెళ్లి చూపుల్లో ఓ యువతిని చూశాడు. అయితే ఆమె తిరస్కరించడంతో తిరిగి వచ్చేశాడు. తరువాత కొంతకాలానికి మరో యువతితో అతనికి పెల్లి సంబంధం కుదిరింది. ఈ క్రమంలో గతంలో చూసిన అమ్మాయి మారప్పకు క నబడటంతో ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకుని కాల్స్, మెసేజ్‌లు చేసుకునేవారు. కొన్నిరోజుల తరువాత మారప్పకు నిశ్చితార్థమైన విషయం తెలుసుకున్న యువతి అతనికి రోజూ ఫోన్ చేసి నీవంటే ఇష్టమని చెప్పడం మొదలు పెట్టింది. జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలని, తననే పెళ్లి చేసుకోవాలంటూ పోరుపెట్టేది. దీంతో యువతి వేధింపులు తాళలేక యువకుడు ఇల్లు వదిలిపెట్టి ఉడాయించాడు. ఐదు పేజీల లేఖ రాసి, మొబైల్‌ను కూడా ఇంట్లో వదిలేశాడు. అతని తల్లిదండ్రులు కుమారుని కోసం కన్నీరుపెడుతున్నారు. దీనిపై నెలగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్న, చిన్న కారణాలకే.. ఉసురు తీసుకున్నారు!
కాటారం/నర్మెట/వాజేడు: తన కాళ్లపై తను నిలబడాలని తల్లిదండ్రులు మందలించడంతో చేతికి అందివచ్చిన కొడుకు ఇక ఎప్పటికీ అందనంత దూరం వెళ్లిపోయాడు. ధాన్యం విక్రయించేదాకా ఆగమని చెప్పినా వినకుండా, అడిగిన వెంటనే సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ యువతి కన్నతల్లికి పుట్టెడు శోకం మిగిల్చి కానరాని లోకాలకు తరలిపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని మనస్తాపంతో ఓ యువకుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. ఈ ముగ్గురూ ఇరవై ఏళ్లకు అటుఇటుగా ఉన్నవారే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఇద్దరు యువకులు, ఓ యువతి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు మందలించారని.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లికి చెందిన సింగనవేణ మధునక్క, ఓదేలు కుమారు డు శ్రీధర్(23) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఏదైనా పనిచేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 12న పొలం వద్దకు వెళ్లి గడ్డిమందు తాగాడు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీధర్ మృతి చెందాడు. సెల్ ఫోన్ కొనివ్వలేదని.. జనగామ జిల్లా నర్మెట మండలం కన్నెబోయినగూడెంకు చెందిన కీర్తి ఉప్పలమ్మకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. భర్త యాదగిరి 22 ఏళ్ల క్రితం చనిపోయాడు. వ్యవసాయం చేస్తూ పిల్లలను పోషించుకుంటూ పెద్ద కూతురు, కుమారుడి వివాహాలు జరిపించింది. చిన్నకూతురు మౌనిక (23) తల్లిని ఇటీవల సెల్‌ఫోన్ కొనివ్వమని అడిగింది. ఇప్పుడు డబ్బులు లేవు.. ధాన్యం విక్రయించాక కొనిస్తానని చెప్పడంతో మనస్తాపానికి గురైన మౌనిక ఈ నెల 7న గడ్డి మందుతాగింది. హైదరాబాద్ నిమ్స్‌లో పరిస్థితి విషమించి మృతి చెందింది. బైక్ రిపేర్ చేయించలేక పోయానని.. ములుగు జిల్లా వాజేడు మండలం ఏడ్జర్లపల్లికి చెందిన అంకని నాగరాజు(20) మూడే ళ్ల క్రితం ఓ యాక్సిడెంట్ చేశాడు. ఆ సమయంలో ఆవతలి వ్యక్తి స్కూటీ దెబ్బతింది. పెద్ద మనుషుల పంచాయితీలో స్కూటీ బాగు చేసి ఇస్తా నని నాగరాజు హామీ ఇచ్చాడు. వెంటనే స్థానిక మెకానిక్కు ఇచ్చాడు. కానీ, మెకానిక్ ఇప్పటివరకు స్కూటీని మరమ్మతు చేసి ఇవ్వలేదు. స్కూటీని తిరిగి ఇవ్వలేకపోతున్నానని మనస్తాపానికి గురైన నాగరాజు బుధవారంరాత్రి పురుగుల మందు తాగాడు. ఏటూరునాగారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందాడు. -
ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతిని తల్లిదండ్రులు మందలించి ఇంటికి తీసుకురాగా మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోరబండలో జరిగిన సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్పీఆర్ హిల్స్ సమీపంలోని ఇందిరానగర్‌కు చెందిన బి.లక్ష్మయ్య,నాగలక్ష్మిల కూతురు హేమలత (19) నల్గొండకు చెందిన వరుణ్‌కు ప్రేమించింది. పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ నెల 17న పెళ్లి చేసుకుంది.అదే రోజు అక్కడి పోలీసులు హేమలత తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు నల్గొండకు వెళ్లి పోలీసుల సమక్షంలో కూతురికి కౌన్సిలింగ్ చేసి నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం హేమలత నాయనమ్మ యాదమ్మ ఇంటి బయటకు కూర్చుని ఉండగా ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది. విషయాన్ని గమనించిన యాదమ్మ కేకలు వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయగా వచ్చి చూసేసరికి యువతి మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అంజనేయులు తెలిపారు. చదవండి: (భర్త కాదు.. మృగం.. భార్యను కత్తితో పొడిచి హత్య) -
ఫేస్బుక్లో పరిచయైన యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు.. రూ.39లక్షలు..!
సాక్షి, బెంగళూరు: ఫేస్బుక్ పరిచయం ఓ వ్యక్తిని నిలువునా ముంచింది. నాలుగు నెలల క్రితం విజయపుర జిల్లా సిందగి తాలూకా బగలూరి పరమేశ్వరహిప్పరగి అనే యువకుడి ఫేస్బుక్లో ఫ్రెండ్‌రిక్వెస్ట్ వచ్చింది. ఆమోదించిన పరమే«శ్వరహిప్పరగి, యువతితో క్రమేణా పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరు ఫోన్‌నెంబర్లు తీసుకున్నారు. చాటింగ్ ప్రారంభించారు. వంద, వెయ్యి రూపాయలనుంచి సుమారు రూ.39 లక్షలు పరమేశ్వరహిప్పరగి దశలవారీగా యువతి లాగేసింది. వివరాల్లోకి వెళితే... సిందగి నివాసి పరమేశ్వరకు 2022 జూన్ 29 తేదీన మంజుల, కేఆర్ అనే ఫేస్బుక్ ఐడీ నుంచి ఫ్రెండ్‌రిక్వెస్ట్ వచ్చింది. పరమే«శ్వర కన్ఫర్మ్ చేయగానే యువతి హాయ్ అని మెసేజ్ పెట్టింది. తెలంగాణా రంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు కంపెనీలో ఉన్న పరమేశ్వర నిత్యం మెసేజ్ చేయడం ద్వారా గుర్తుతెలియని యువతితో ఆత్మీయంగా మెలిగారు. ఆగష్టు 14న తల్లి ఆరోగ్యం సరిగా లేదంటూ రూ.700 ఫోన్‌పే చేయాలని యువతి నుంచి మెసేజ్ వచ్చింది. అనంతరం రూ.2 వేలు అడగగానే యువతికి పరమేశ్వర ఫోన్ చేశాడు. కొద్దిరోజుల తరువాత తిథి కార్యక్రమానికి రూ.5 వేలు కావాలని యువతి అడిగిన వెంటనే పరమేశ్వర ఆమె అకౌంట్‌కు జమ చేశారు. చదవండి: (ప్రేమిస్తున్నానంటూ యువతికి పెళ్లైన వ్యక్తి ప్రపోజ్) వివాహం చేసుకుంటానని నమ్మించి.... కొద్దిరోజుల అనంతరం ఫోన్ చేసిన మంజుల తాను ఐఏఎస్ పరీక్ష పాసయ్యాను. కలెక్టర్ పోస్టు వస్తుంది. ప్రస్తుతం హాసన్‌లో ఉన్నాను తనను చూసుకునేవారు ఎవరూ లేరు. బెంగళూరుకు వెళ్లాలి ఖర్చులకు డబ్బుల్లేవు ఆర్థిక సాయం చేస్తే వివాహం చేసుకుంటానని పరమేశ్వరకు తెలిపింది. యువతి మాటలు నమ్మిన పరమేశ్వర ఒకేరోజు రూ.50 వేలు రెండు దఫాలుగా చెల్లించాడు. కొద్దిరోజుల అనంతరం మంజుల మరింత స్నేహంగా మెలుగుతూ పరమేశ్వర నుంచి దశలవారీగా రూ.41.26 లక్షలు కాజేసింది. అనంతరం తన వద్ద పైసా కూడా లేదని పరమేశ్వర మంజులను అడిగాడు. పాపం కొద్దిగా ఖర్చుకు డబ్బు ఉండాలని భావించి మంజుల రూ.2.21 లక్షలు పరమేశ్వర అకౌంట్‌కు జమ చేసింది. మళ్లీ మంజుల డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానించిన ఆయన ఈనెల 15న విజయపుర సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టామని చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్డీ.ఆనందకుమార్ తెలిపారు. -
బెడ్రూమ్లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.. ఏం జరిగింది?
తణుకు (పశ్చిమ గోదావరి) : తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో ఓ యువతి సజీవ దహనం ఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న గ్రామానికి చెందిన ముళ్లపూడి నాగహారిక (19) ఇంట్లో బెడ్రూమ్లో మంచంపైనే సజీవ దహనం అయ్యింది. అయితే, ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా హత్య చేసి కాల్చివేశారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్, రూపరాణి దంపతుల కుమార్తె నాగహారిక శుక్రవారం రాత్రి తన గదిలో నిద్రించింది. తెల్లారేసరికి నాగహారిక మంచంపై కాలి బూడిదై కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగహారికకు రూపరాణి సవతి తల్లికాగా ఆమెకు తొమ్మిదేళ్ల మంజలిప్రియ అనే కుమార్తె ఉంది. ఇటీవల నూతనంగా ఇల్లు నిర్మించుకున్న వీరు మూడు నెలల క్రితం గృహప్రవేశం చేశారు. అయితే పూర్తిస్థాయిలో ఇంటి సామగ్రి తెచ్చుకోకపోవడంతో యజమాని ముళ్లపూడి శ్రీనివాస్ పాత ఇంటివద్దనేనిద్రిస్తున్నారు. శనివారం ఉదయం కొత్త ఇంటికి వచ్చి భార్యను నిద్రలేపే సమయంలో కుమార్తె నిద్రిస్తున్న గది నుంచి పొగలు రావడం గమనించారు. అప్పటికే నాగహారిక మంటల్లో కాలిపోయింది. తండ్రి ముళ్లపూడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ సీహెచ్ ఆంజనేయులు, ఎస్సై రాజ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ సిబ్బంది, డాగ్‌స్కా్వడ్ ఘటనా స్థలంలో పలు ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు నాగహారిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
మామయ్య ఇంటికి వచ్చిన ఖమ్మం యువతి.. షాపింగ్ చేస్తుండగా యువకుడు షాకింగ్ ట్విస్ట్..
పెనమలూరు(విజయవాడ): పోరంకిలో యువతిని కిడ్నాప్ చేసిన యువకుడిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ ఆర్.గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా వైరాకు చెందిన యువతి (18) పోరంకిలో ఉంటున్న మామయ్య ఇంటికి గత నెలలో వచ్చింది. చదవండి: ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్.. ఆమె గత నెల 5వ తేదీన కుటుంబ సభ్యులతో పోరంకిలో షాపింగ్ చేస్తున్న సమయంలో పరిచయం ఉన్న ఎం.శ్రీనివాసరావు అనే యువకుడు వచ్చి ఆమెను బలవంతంగా బైక్ పై తీసుకు వెళ్లాడు. ఆమెను సబ్బవరం తీసుకు వెళ్లి వదిలేశాడు. ఆమె తిరిగి ఇంటికి వచ్చి జరిగిన విషయం తెలిపింది. ఈ ఘటన పై కుటుంబ సభ్యులు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. -
Hyderabad: శ్మశానవాటికలో యువతిపై లైంగికదాడి
సాక్షి, హైదరాబాద్(చాంద్రాయణగుట్ట): శ్మశానవాటికలో యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జీఎం చావునీకి చెందని ఇబ్రహీంబేగ్ (24), ఉమర్ బేగ్(20) అన్నదమ్ముల పిల్లలు. స్థానికంగానే ఉండే మతిస్థిమితం లేని ఓ మహిళ (30)తో ఇబ్రహీంకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకొని ఆమెపై లైంగిక దాడి చేద్దామని అన్నదమ్ములు పథకం పన్నారు. ఈ క్రమంలోనే ఇబ్రహీం శనివారం యువతిని పిలిపించుకొని బైక్‌పై తిప్పుతూ జీఎం చావునీలో ఓ శ్మశాన వాటికలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. అనంతరం ఉమర్‌కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటనపై యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: (జూనియర్ ఆర్టిస్ట్‌ల ప్రేమాయణం.. నాలుగేళ్లు ఒకరితో.. నాలుగు నెలలు మరొకరితో..) -
ప్రేమించలేదని ప్రాణం తీసాడు...
-
ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు
-
అతిథులుగా ఆహ్వానించి, అంతరంగిక లీలలతో ముంచెత్తుతుంది.. తర్వాతే..
భువనేశ్వర్: రాజకీయ నాయకులు, సినిమా నిర్మాతలను ముగ్గులోకి దింపి, మోసం చేసిన మాయలాడిని ఖండగిరి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందిత మహిళ న్యాయశాస్త్రంలో పట్టా పొందింది. అయితే పోలీసులు ఈ విషయమై అధికారికంగా సమాచారం జారీ చేయలేదు. ఆమె వద్ద 2 పెన్‌డ్రైవ్‌లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు ఇది వరకే వివాహమైంది. భర్త సహాయ సహకారాలతో ప్రముఖులను ముగ్గులోకి దింపి.. నిలువునా దోచుకుంటున్నట్లు ఆరోపణ. ఫేసుబుక్ పరిచయ వేదికగా ప్రముఖుల వివరాలను సేకరించి, సన్నిహిత పరిచయాలు పెంచుకుంటుంది. వారిని అతిథులుగా ఆహ్వానించి, అంతరంగిక లీలలతో ముంచెత్తుతుంది. ఈ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను భద్రపరిచి, భారీ మొత్తం కోసం బెదిరించడంలో ఆరితేరినట్లు బాధితులు లబోదిబోమంటున్నారు. మాజీ మంత్రులు, నాయకులు, ప్రముఖ వ్యాపారులు, సినీ నిర్మాతలు ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఖండగిరి పోలీస్ ఠాణాలో ఫిర్యాదు నమోదు కావడంతో డొంక కదిలింది. దీర్ఘకాలంగా విచారణకు సహకరించనందున పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. 2021 నుంచి ఈ వ్యవహారంలో తలమునకలై ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. చదవండి: (Nayanathara: నయన్ అంత పెద్ద షాక్ ఇస్తుందా!) -
సినిమా స్టైల్లో.. షాకింగ్ విషయాన్ని చెప్పిన ఇంటర్ విద్యార్థిని.. కంగుతిన్న పోలీసులు
పెదపూడి(కాకినాడ జిల్లా): జి.మామిడాడలో తమ బాలిక కిడ్నాప్‌కు గురైందని ఆమె తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించడంతో పోలీసులు బాలికను పట్టుకున్న ఉదంతమిది. పెదపూడి ఎస్ఐ పి.వాసు తెలిపిన వివరాల ప్రకారం జి.మామిడాడకు చెందిన ఓ బాలిక ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం 10 గంటలకు బాలిక రాలేదంటూ కళాశాల యాజమాన్యం ఫోన్ చేయడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. చదవండి: వ్యభిచారం గుట్టురట్టు.. పోలీసులకు దొరికేసిన ఐదు జంటలు సెల్ లొకేషన్ ఆధారంగా బాలిక రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ వద్ద ఉన్నారని నిర్ధారించుకున్నారు. బాలికతో పాటు ఆమెను తీసుకెళుతున్న యువకుడిని సైతం పట్టుకున్నారు. నాలుగేళ్ల క్రితం ఇన్స్టాగ్రాం ద్వారా పరిచయమైన తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన ఒక యువకుడిని ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకోవడానికి అతడితో వెళ్లినట్లు బాలిక చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు. బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించి యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
Tamil Nadu: ‘నీట్’లో తక్కువ మార్కులు.. విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఈ ఏడాది నీట్ ఉత్తీర్ణత తగ్గింది. కేవలం 51.3 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. టాప్ 50 జాబితాలో ఇద్దరు తమిళనాడు విద్యార్థులకు చోటు దక్కింది. వివరాలు.. వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం గత నెల నీట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది నీట్ పరీక్షకు రాష్ట్రం నుంచి 1,32,167 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 67,787 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 54 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 51.3 శాతానికి పరిమితమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల ఉత్తీర్ణత మరీ తక్కువగా ఉంది. అయితే, దేశవ్యాప్తంగా టాప్ 50లో తమిళనాడుకు చెందిన ఇద్దరు విద్యార్థులకు చోటు దక్కించుకోవడం గమనార్హం. మదురైకు చెందిన త్రిదేవ్ వినాయక(ఓబీసీ కేటగిరిలో –705 మార్కులతో) 30వ స్థానం, హరిణి అనే విద్యార్ధిని జనరల్ కేటగిరిలో 702 మార్కులతో 43వ స్థానం దక్కించుకోవడం విశేషం. కాగా నీట్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యల బాట పట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆవడి సమీపంలో ఓ విద్యార్థిని మరణించగా, తిరుత్తణిలో మరో విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నీట్ తప్పిన విద్యార్థులకు తల్లిదండ్రులు భరోసా ఇవ్వాలని, వారితోనే ఉండాలని, అవసరం అయితే, ప్రభుత్వం 104, 1100 నెంబర్లకు ఫోన్ చేసి కౌన్సెలింగ్ తీసుకోవాలని అధికారులు సూచించారు. యువతి బలవన్మరణం తిరువళ్లూరు: నీట్ పరీక్షల్లో ఆశించిన మార్కులు రాకపోవడంతో ఓ యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. ఆవడి సమీపంలోని తిరుముల్లైవాయల్ ఇంది రా నగర్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు అముద కుమార్తె లక్ష్మీ శ్వేత(19) ప్లస్–2 పూర్తి చేసి రెండేళ్లుగా నీట్‌కు ఆన్లైన్ క్లాసుల ద్వారా కోచింగ్ తీసుకుంటోంది. గత నెలలో రాసిన నీట్ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. పరీక్షల్లో అర్హత మార్కులు సాధించకపోవడంతో ఆవేదనకు గురై ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీ టెక్నీషియన్ పాడుపని.. నమ్మించి యువతిని హోటల్‌కు తీసుకెళ్లి..
కాకినాడ క్రైం: తన కుమార్తెపై లైంగికదాడి జరిగిందంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక టూ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. తన కుమార్తెపై ఇంటి ఎదురుగా ఏసీ దుకాణంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న పిఠాపురానికి చెందిన శేఖర్ అత్యాచారం చేశాడని కాకినాడ మిలటరీ రోడ్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు ఇచ్చారు. చదవండి: స్వీట్‌గా మాట్లాడి క్లోజ్ అవుతారు.. కలవాలని ఉందని చెప్పి.. మీ నాన్న తీసుకు రమ్మన్నారంటూ నమ్మబలికి ఈ నెల 23న సాయంత్రం కాకినాడలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పేర్కొన్నారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తన కుమార్తె జరిగిన విషయాన్ని తెలిపిందన్నాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో వెలుగుచూసే వాస్తవాల ఆధారంగా చర్యలు చేపడతామని సీఐ రామచంద్రరావు వివరించారు. -
చాటింగ్, హాట్ ఫొటోలతో పారిశ్రామికవేత్తకు టోకరా
బెంగళూరు: యువతి పేరుతో పంపిన హాట్ ఫోటోలకు స్పందించిన వృద్ధ పారిశ్రామికవేత్తను కేటుగాళ్లు పోలీసుల పేరుతో బ్లాక్మెయిల్ చేసి రూ.14.90 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న హలసూరుగేట్ పోలీసులు కవనా, నిధి అనే వారిపై కేసు నమోదు చేశారు. పోలీసులపేరుతో రైడ్ హోసూరురోడ్డులో సదరు పారిశ్రామికవేత్తకు స్వంత కంపెనీ ఉంది. నాలుగేళ్ల క్రితం ఇన్సూరెన్స్ విషయంపై కవనా అనే యువతి పరిచయమైంది. వారం క్రితం నిధి అనే యువతిని పారిశ్రామికవేత్తకు పరిచయం చేసింది. ఆమె పారిశ్రామికవేత్తతో వాట్సాప్‌లో చాటింగ్ చేస్తుండేది. ఈ విషయాన్ని తెలుసుకున్న నిధి స్నేహితుడు యువరాజు నిధి పేరుతో మరో ఫోన్ నంబర్ ద్వారా ఆ పారిశ్రామికవత్తకు హాట్ పొటోలు పంపాడు. ఈనెల 3 తేదీన నిధి సెల్ నుంచి పారిశ్రామికవేత్తకు మెసేజ్ పంపించి హొసూరురోడ్డు పెట్రోల్‌బంక్ వద్దకు పిలిపించాడు. మరో వ్యక్తితో కలిసి తాము క్రైం పోలీసులమంటూ ఆ పారిశ్రామికవేత్త కారు కీ, మొబైల్‌ను లాక్కున్నారు. యువతితో చాటింగ్ చేసిన వీడియో స్క్రీన్‌షాట్, హాట్ ఫొటోలకు సంబంధించి మీపై ఎఫ్ఐఆర్ నమోదైందని, ఈ కేసు మూసివేయాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం 14.90 లక్షలు తీసుకున్నారు. చదవండి: (కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు మృతి) ఈనెల 10 తేదీన ఫోన్ చేసి కేజీ.రోడ్డు బసప్పపార్కు వద్దకు పిలిపించి రూ.50 వేలు తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తులు నకిలీ పోలీసులని పసిగట్టిన సదరు పారిశ్రామికవేత్త హలసూరుగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలింపు చేపట్టి యువరాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ఈ వ్యవహారంలో అతనే సూత్రధారి అని తేలిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. జిమ్ ట్రైనర్ అయిన యువరాజు అప్పుల ఊబిలో కూరుకుపోయాడని, స్నేహితురాలు నిధి పారిశ్రామికవేత్తకు మెసేజ్ చేయడాన్ని గమనించి మరో నెంబరు నుంచి అదే పేరుతో చాటింగ్ చేయించి నకిలీ పోలీసుల అవతారమెత్తి నగదు దోచుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. -
భవిష్యత్తుపై ఎన్నో కలలు.. భర్తతో అమెరికా జీవితం గురించి ఆశలు..
వడమాలపేట (చెన్నై): ఆమె భవిష్యత్తుపై ఎన్నో కలలు కంది.. కాబోయే భర్తతో అమెరికాలో మొదలుపెట్టబోయే జీవితం గురించి ఆశలు.. అయితే విధి రోడ్డు ప్రమాదం రూపంలో కల్లలు చేసింది. ఆమె ఆశల్ని చిదిమేసింది. తన వివాహానికి కల్యాణ మండపం బుక్ చేయడానికి వస్తూ ఆమె తిరిగిరాని లోకాలకు చేరుకుంది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన సెల్వంకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ప్రియాంక(30) ఎంఈ పూర్తి చేసింది. గత వారం ఆమెకు పెళ్లి సంబంధం కుదిరింది. తిరుపతి లేదా తిరుమలలో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి తరువాత ఆమె భర్తతో అమెరికా వెళ్లాల్సి ఉంది. కల్యాణ మండపం బుక్ చేయడానికి అమ్మ, నాన్న, చిన్నాన్న కొడుకుతో కలిసి సోమవారం బొలెరో వాహనంలో ప్రియాంక తిరుపతికి బయల్దేరారు. నగరి వరకు కారును ఆమె తండ్రి నడుపుతూ వచ్చాడు. అయితే అతడు అలసిపోవడంతో ప్రియాంక అక్కడ నుంచి డ్రైవింగ్ చేసింది. మార్గమధ్యంలో వడమాలపేట మండలం అంజేరమ్మ ఆలయం వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో ప్రియాంక తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రులకు ఎలాంటి గాయాలు కాలేదు. తమ్ముడికి మాత్రం స్వల్పగాయాలయ్యాయి. ప్రియాంక బంధువులు కాంచీపురం, చెన్నై, నగరి తదితర ప్రాంతాల నుంచి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రైవేటు అంబులెన్సులో మృతదేహాన్ని కాంచీపురానికి తరలించారు. చదవండి: (ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు భార్య..) -
భరించలేని తలనొప్పి, వాంతులు, నోట్లో నుంచి నురుగ వచ్చి
సాక్షి, హైదరాబాద్: ఐసీఐసీఐ బ్యాంకులో పని చేస్తున్న ఓ యువతి తలనొప్పి భరించలేక మరణించిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్‌కోఠి ప్రాంతంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి సమాచారం మేరకు... నిజామాబాద్ జిల్లా పెద్దభీంగల్ గ్రామానికి చెందిన కొత్తపల్లి అనూష(22) నాలుగు నెలల క్రితం నగరానికి వచ్చింది. అబిడ్స్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో క్యాషీయర్‌గా పనిచేస్తూ కింగ్‌కోఠి షేర్‌గేట్ దగ్గర ఉన్న సింధూజ హాస్టల్లో నివాసం ఉంటోంది. సోమవారం తన స్నేహితురాలితో కలసి డ్యూటీకి వెళ్లింది. అప్పటికే తలనొప్పి, వికారంగా ఉండటంతో ఆఫీస్‌కు వెళ్లిన గంటకు వాంతు చేసుకుంది. వెంటనే తాను పనిచేయలేనని మేనేజర్ పర్మిషన్ తీసుకుని హాస్టల్‌కు వచ్చింది. కొద్దిసేపటికే తలనొప్పి ఎక్కువ కాడంతో పక్క రూమ్ మేట్ ఒకామే జండూబామ్ రాసి తలకు మసాజ్ చేసింది. అయినా సాయంత్రం 4 గంటల సమయంలో తీవ్ర తలనొప్పి, ఒళ్లంతా చెమటలు పట్టి, కనుగుడ్లు తేలేస్తుండటంతో.. ఆందోళన చెందిన స్నేహితులు అనూషను ఆసుపత్రికి తీసికెళుతున్న క్రమంలో మరోసారి వాంతి చేసుకుంది. ఆటోలో ఎక్కించాక నోటి నుంచి నురగ వచ్చి అపస్మారక స్థితికి చేరుకుంది. సమీపంలోని కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసికెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: అనుమానమే పెనుభూతమై.. భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్య -
11ఏళ్ల అనంతరం వీడిన మర్డర్ మిస్టరీ!
పెద్దదోర్నాల: పదకొండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన యువతి మర్డర్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. వివాహేతర సంబంధం నెరుపుతుందనే కారణం చూపి సోదరుడితో కలిసి కట్టుకున్న ఇల్లాలు ప్రియాంకను (19)ను దారుణంగా హతమార్చాడు కర్ణాటకకు చెందిన ఉపాధ్యాయుడు హుచ్చప్ప. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం విజయపూర్ జిల్లా వాదావేన్ తాలూకా ముధుదేహాల్‌కు చెందిన హుచ్చప్ప, ప్రియాంక భార్యాభర్తలు. కొన్నాళ్లపాటు అన్యోన్యంగానే కాపురం కొనసాగించారు. ఈ నేపథ్యంలో ప్రియాంక ఓ దళిత యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని గమనించిన భర్త హుచ్చప్ప పద్ధతి మార్చుకోవాలని భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయితే భర్త మాటలను పెడచెవిన పెట్టిన ప్రియాంక.. వివాహేతర సంబంధం కొనసాగించేది. దీంతో ఎలాగైనా భార్యను చంపేయాలని భావించిన హుచ్చప్ప పక్కాగా ప్లాను వేశాడు. దైవదర్శనం కోసం శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళదామంటూ తన సోదరుడు, భార్యతో కలిసి బయలు దేరాడు. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో దర్శనం పూర్తి చేసుకున్న వీరు 2011వ సంవత్సరం జూలై 25 తేదీ అర్ధరాత్రి ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని కొర్రప్రోలు సమీపంలోకి రాగానే ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సోదరుడి సహాయంతో నైలాన్ తాడును ప్రియాంక గొంతుకు బిగించి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు .. ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి లోదుస్తులతో ఉన్న మృతదేహాన్ని రోడ్డు పక్కనే ఉన్న చప్టాలో పడేసి కర్ణాటకకు చేరుకున్నారు. ఈ హత్య విషయం మృతురాలి తల్లిదండ్రులకు తెలిసినా, కుమార్తె ప్రవర్తనతో విసిగిపోయిన వారు కూడా మౌనంగానే ఉన్నారు. ఈ క్రమంలో పరిచయం ఉన్న వారు నీ భార్య ఏదంటూ అడగగా, ఆమె ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయిందంటూ అందరినీ నమ్మించాడు. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న దోర్నాల పోలీసులు దీనిపై చాలా కాలం విచారణ చేపట్టి విసిగి పోయారు. ప్రియాంక హత్య విషయం బయట పడిందిలా.. ప్రియాంకను భర్తే హతమార్చిన విషయం బంధువులందరికీ తెలిసినా ప్రియాంక ప్రవర్తన, నడవడిక కారణంగా ఎవరూ ఆ విషయాన్ని బయట పెట్టకుండా మనస్సులోనే దాచుకున్నారు. హుచ్చప్పకు, అతని దాయాదులకు ఆస్తి పంపకాల్లో నెలకొన్న విభేదాల కారణంగా మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారు ప్రియాంక హత్యకు గురైన విషయాన్ని కర్ణాటకకు చెందిన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. గతేడాది జూన్ 1వ తేదీన మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు విచారణ చేపట్టి నిందితులు చెప్పిన ఆధారాల మేరకు పెద్దదోర్నాల పోలీసు స్టేషన్‌కు చేరుకోవడంతో అసలు విషయం బయట పడింది. దీంతో భర్త, అతని సోదరుడిపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఉద్యోగం లేదు.. పెళ్లి కాలేదు.. 24వ అంతస్తు నుంచి దూకిన యువతి
చెన్నై: ఉద్యోగం లేదు..పెళ్లి కాలేదు.. అనే తీవ్ర మనో వేదనలో ఉన్న ఓ యువతి శనివారం వేకువజామున 24వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. చెన్నై ఓఎంఆర్ రోడ్డులోని కేలంబాక్కంలో 30 అంతస్తుల భవనం ఉంది. ఇందులో 24వ అంతస్తులో విలియం జేమ్స్, ఆయన కుమార్తె జెనీఫర్(35) నివాసం ఉంటున్నారు. ఇది వరకు జెనీఫర్ ఓ ఐటీ సంస్థలో పనిచేసేవారు. కరోనా పరిస్థితుల తర్వాత ఉద్యోగం కోల్పోయింది. దీంతో మరో ఉద్యోగం కోసం ఏడాది కాలంగా ఆమె తీవ్ర ప్రయత్నంలో ఉన్నారు. చదవండి: (ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. ఇష్టపడి పెళ్లిచేస్కొని.. వ్యాయామం చేస్తూ..) అయితే ఉద్యోగం దొరక్క పోవడం, వయస్సు మీద పడ్డా పెళ్లి కాక పోవడం వంటి పరిస్థితులు ఆమెను తీవ్ర మనో వేదనకు గురి చేశాయి. రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకు వెళ్లినా, అవకాశం దక్కక పోవడంతో ఆమె మరింత మనో వేదనకు గురయ్యారు. శుక్రవారమంతా గదికే ఆమె పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో శనివారం వేకువ జామున 3గంటల సమయంలో గది కిటికీ గుండా ఆమె కిందకి దూకేసింది. శబ్ధం విన్న సెక్యూరిటీ సిబ్బంది పరుగులు తీయగా.. అప్పటికే ఆమె శరీరం ఛిద్రమైంది. ఘటనా స్థలంలోనే ఆమె మరణించింది. కేలంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసిన మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
'ఫోన్ నెంబర్ ఇవ్వు.. లేకపోతే లైంగికదాడి చేస్తాం'
గచ్చిబౌలి (హైదరాబాద్): ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడంతో కొందరు యువకులు బెదిరింపులకు పాల్పడ్డట్లు ఓ యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి వెంట వచ్చిన బాక్సర్ దాడి చేయడంతో గాయాలయ్యాయని మరో యువకుడు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ తిరుపతి, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఐటీ కారిడార్‌లోని నాలెడ్జ్ సిటీలో ఐటీసీ కోహినూర్ స్టార్ హోటల్లో 24 గంటలు తెరిచి ఉండే ఒటినో రూఫ్ టాప్ హ్యాంగింగ్ బార్‌కు శనివారం రాత్రి 11.30 గంటలకు యూఎస్‌లో రీసెర్చ్ స్కాలర్, న్యూట్రీషియన్‌గా పనిచేస్తూ నగరంలో ఉండే రాజస్తాన్‌కు చెందిన ఓ యువతి (25)తో కలిసి విష్ణు, విక్రమ్‌లు వెళ్లారు. యువతికి పరిచయస్తుడైన మయాంక్ అగర్వాల్, అబ్రార్, సాదత్, అరీఫుద్ధీన్లతో పాటు మరో ఇద్దరు స్నేహితులు కలిసి అదే బార్‌కు వచ్చారు. చదవండి: (నాగదోషం ఉన్నట్లు నమ్మించి.. పలుమార్లు అత్యాచారం) అర్థరాత్రి దాటిన తరువాత మయాంక్, సాదత్లు యువతిని పక్కకు పిలిచి ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బాక్సర్ విక్రమ్ దాడిలో అబ్రార్ గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం అబ్రార్ శనివారం తెల్లవారు జామున రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్ ఇవ్వక పోవడంతో తనపై లైంగిక దాడి చేస్తామని బెదిరించారని బాధిత యువతి సోమవారం రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. విక్రమ్ దాడిలో అబ్రార్, మయాంక్ వర్గం దాడిలో విష్ణు గాయపడ్డారని చెప్పారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేశామని, సీసీ పుటేజీలు పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాధితురాలితో పాటు విష్ణు, విక్రమ్‌లు మంగళవారం సాయంత్రం రాయదుర్గం పీఎస్‌కు వచ్చారు. యువతి నుంచి పోలీసులు మరిన్ని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా యువతి మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబీకులను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. తగిన చర్యలు తీసుకోకుంటే మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు. -
బేస్‌బాల్ మ్యాచ్‌లో యువతి అర్థనగ్న ప్రదర్శన.. గెంటేసిన నిర్వాహకులు
బేస్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఒక యువతి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. స్టేడియంలో అందరూ చూస్తున్నారనే విషయాన్ని మరిచిపోయిన యువతి ఫూటుగా మద్యం సేవించి అర్థనగ్న ప్రదర్శనతో రెచ్చిపోయింది. సోయి లేకుండా ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా డ్యాన్స్ చేసింది. ఇదంతా గమనించిన అక్కడి సిబ్బంది యువతిని హద్దులు మీరుతున్నారంటూ హెచ్చరించారు. వారి హెచ్చరికలు బేఖాతరు చేయని సదరు యువతి మత్తు మైకంలో మరింత శ్రుతి మించింది. చివరికి ఆమె దగ్గరికి వెళ్లి కుదరుగా కూర్చోవాలని.. లేదంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా యువతికి చెప్పారు. ఎంత చెప్పినా ఆమె ధోరణి మారకపోవడంతో చిర్రెత్తిపోయిన సిబ్బంది ఆమెను స్టేడియం నుంచి బయటికి పంపించేశారు. ఇదంతా గత శనివారమే చోటుచేసుకున్నప్పటికి వీడియో కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక లాస్ ఏంజిల్స్ వేదికగా లాస్ ఏంజిల్స్ డార్జర్స్, న్యూయార్క్ మెట్స్ మధ్య బేస్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లాస్ ఏంజిల్స్ డార్జర్స్ 6-1 తేడాతో విజయం సాధించింది. Drunk Dodgers fan had her boobs popping out while dancing, so she got thrown out... pic.twitter.com/9K0cAUCfRK — Bacon, Grits, Eggs (@reddawg77089) June 9, 2022 చదవండి: మ్యాచ్‌కు ఆటంకం కలిగించిన అభిమాని.. క్రికెటర్ చర్య వైరల్ -
యువతిపై మాజీ ప్రియుడు హత్యాయత్నం
మండ్య: ఓ యువకుడు యువతిపై హత్యాయత్నం చేసిన ఘటన మండ్య నగరంలోని మండ్య వైద్య కళాశాల ఆవరణంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... మండ్య తాలూకా వై యరహళ్లి గ్రామానికి చెందిన నవ్య (20) మండ్య మిమ్స్ ఎంఆర్డీ విభాగంలో పారా మెడికల్ కోర్సు చేస్తోంది. అదే గ్రామానికి చెందిన తన బంధువు పరమేశ్, నవ్య నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల నవ్య పరమేశ్‌కు దూరంగా ఉంటోంది. దీన్ని సహించలేని పరమేశ్ ఆమెను హత్య చేయాలని పథకం పన్నాడు. గురువారం మధ్యాహ్నం నుంచి నవ్య కోసం అక్కడే వేచి ఉన్నాడు. 4.30 గంటల సమయంలో నవ్య కళాశాల నుంచి బయటకు రాగా తను వెంట తెచ్చుకున్న బలమైన కట్టెతో దాడి చేశాడు. దీంతో నవ్య తలకు తీవ్రంగా గాయమైంది. అక్కడే ఉన్న విద్యార్థులు పరమేశ్‌ను పట్టుకుని చితకబాదారు. తీవ్ర రక్తస్రావమైన నవ్యను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దుండగున్ని అరెస్ట్ చేశారు. చదవండి: (ఎస్ఐ వివాహేతర సంబంధం.. గుట్టురట్టు చేసిన భార్య) -
లవ్ ఫెయిల్యూర్.. యువతి ఆత్మహత్య.. మృతిపై భిన్న కథనాలు..
తగరపువలస (భీమిలి) విశాఖపట్నం: ప్రేమ విఫలమై భీమిలి మండలం కొత్త మూలకుద్దు పాకదిబ్బకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని కొయ్య లావణ్య(16) ఆదివారం సాయంత్రం ఉరి వేసుకుని చనిపోయింది. దీనిపై గ్రామంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొయ్య లావణ్య, ఇదే గ్రామానికి చెందిన మణి కుమార్ అనే యువకుడు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. చదవండి: స్కూల్ కరస్పాండెంట్ పాడుపని.. బాలికకు మత్తు టాబ్లెట్లు ఇచ్చి.. ఈ క్రమంలో వివాహం చేసుకోమని మణికుమార్‌ను లావణ్య కోరగా నిరాకరించాడని ఒక కథనం వినిపిస్తుండగా.., మణికుమార్ కుటుంబ సభ్యులు లావణ్య కుటుంబ సభ్యులను కలిసి వివాహం గురించి మాట్లాడగా వారు నిరాకరించారని మరో కథనం వినిపిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న లావణ్యను సంగివలస అనిల్ నీరుకొండ ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్టు నిర్ధారించారు. మధ్యాహ్నం గ్రామంలో జరిగిన రజస్వల ఫంక్షన్లో ఉత్సాహంగా పాల్గొన్న లావణ్య ఇంతలోనే అఘాయిత్యానికి పాల్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విభిన్న కథనాలపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
20 ఏళ్ల యువతికి 3డీ ప్రింటెడ్ చెవి
టెక్సాస్: అమెరికా వైద్యులు మొట్టమొదటిసారిగా 3డీ ప్రింటెడ్ సాంకేతికతతో రూపొందించిన చెవిని 20 ఏళ్ల యువతికి విజయవంతంగా అతికించారు. టెక్సాస్‌కు చెందిన 3డీ బయో థెరప్యూటిక్స్ అనే సంస్థ దీనిని రూపొందించింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. మెక్సికోకు చెందిన అలెక్సా(20)కు కుడి వైపు వెలుపలి చెవి చిన్నదిగా, అక్రమాకారంలో ఉంది. పరిశీలించిన 3డీ బయో థెరప్యూటిక్స్ నిపుణులు ఆమె మరో చెవి నుంచి కణజాలాన్ని సేకరించారు. అచ్చు కుడివైపు చెవిమాదిరిగానే సహజమైందిగా అనిపించేలా ‘ఆరినోవో’అనే 3డీ టెక్నాలజీని వాడి మరో చెవికి రూపం కల్పించారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోకు చెందిన మైక్రోషియా–కాంజెనిటల్ ఇయర్ డిఫార్మిటీ ఇన్స్టిట్యూట్కు చెందిన సర్జన్ డాక్టర్ అర్డురో బొనిల్లా ఈ ప్రక్రియకు నేతృత్వం వహించారు. ఈ చెవిని సర్జరీ ద్వారా ఆమెకు అతికించారు. నెల రోజుల విశ్రాంతి అనంతరం గురువారం అలెక్సా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యిందన్నారు. రోగుల కార్టిలేజ్ కణాలను ఉపయోగించుకుని చెవిని పునర్నిర్మించేందుకు ఈ నూతన టెక్నాలజీని వినియోగించినట్లు డాక్టర్ అర్టురో చెప్పారు. దీని వల్ల కొత్త చెవిని శరీరం తిరస్కరించేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. ఒకటి లేదా రెండు చెవులు అసంపూర్ణంగా, వెలుపలి భాగాలు లేని మైక్రోషియా అనే లోపంతో ఉన్నవారికి ఈ ఆధునాతన చికిత్స ఎంతో ఉపకారి కాగలదని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు పేషెంట్ పక్కటెముకల నుంచి సేకరించి కణాలను చెవి పునర్నిర్మాణానికి ఉపయోగిస్తున్నారని అన్నారు. -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం
రామభద్రపురం: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మిర్తివలస గ్రామానికి చెందిన సువ్వాడ ఉషారాణి అదే గ్రామానికి చెందిన పొట్నూరు గోపాలకృష్ణ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. గోపాలకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ పోలీస్ లైన్స్‌లో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. అయితే 2020లో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో గ్రామపెద్దల వద్దకు పంచాయితీ చేరింది. దీంతో గోపాలకృష్ణ నుంచి కొంత మొత్తాన్ని ఉషారాణికి ఇప్పించి రాజీ కుదిర్చారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. గోపాలకృష్ణ డిప్యుటేషన్‌పై విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తూ, అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి ఉషారాణితో గడుపుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని గోపాలకృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజయనగరం హ్యూమన్ రైట్స్ సంఘం సభ్యులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు గ్రామ పెద్దలతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ ఎం. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఇంటి దొంగ గుట్టురట్టు.. అసలు సూత్రధారి బ్యాంకు మేనేజరే!) -
అద్దెకుంటున్న యువకుడితో పరిచయం.. యువతికి ఫోన్ చేసి ఫొటోలు పోస్టు చేస్తానంటూ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యువతిని ప్రేమించి తనతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించిన యువకుడిపై భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భవానీపురానికి చెందిన యువతి నగరంలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆ యువతి కృష్ణలంకలో ఉంటున్న తన పెదనాన్న ఇంటికి వెళ్లగా, అక్కడ అద్దెకు ఉంటున్న అమిత్ పరిచయమయ్యాడు. అతని ద్వారా అయనవెల్లి రాజేష్ అనే యువకుడు పరిచయమయ్యాడు. గతేడాది అక్టోబర్‌లో వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. చదవండి: భర్త నిర్వాకం.. ప్రియురాలితో గుట్టుగా కాపురం.. భార్యకు తెలిసి.. ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ రాజేష్ యువతిని బెదిరించి డబ్బులు అడిగాడు. భయంతో ఆమె అతనికి కొంత డబ్బు ఇచ్చింది. అయినప్పటికీ అతని బెదిరింపులు ఆగలేదు. ఈ క్రమంలో రూ.3లక్షల నగదు, రెండు బంగారు ఉంగరాలు ఇచ్చింది. ఇదంతా ఏడాది కాలంగా జరుగుతున్నా యువతి భయంతో ఎవరికీ చెప్పలేదు. గత ఏప్రిల్ 27న రాజేష్ ఆ యువతికి ఫోన్ చేసి ఫొటోలు పోస్టు చేస్తానంటూ మళ్లీ బెదిరించసాగాడు. ఎవరికీ చెప్పుకోలేక భయపడి ఆమె స్కూటీతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఆస్పత్రి పాలైంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ యువతి రాజేష్ తన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించి డబ్బులు తీసుకున్నాడని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమూల్య ప్రతిభ
నల్లమల అడవుల్లో ఓ కుగ్రామం దోమలపెంట. ఆ ఊరిలో పుట్టిన అమ్మాయి ఇమ్మడి అమూల్య. యూఎస్‌లో అడుగుపెట్టబోతోంది... విద్యార్థిగా కాదు! యంగ్ ఉమెన్ లీడర్షిప్ ప్రతినిధిగా...!! యూఎస్ కాన్సులేట్ ఎంపికలో విజేతగా!! ‘స్టడీ ఆఫ్ ద యూఎస్ ఇన్స్టిట్యూట్స్ 2022’ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది మన తెలుగుమ్మాయి అమూల్య. ఆమె సొంతూరు మహబూబ్ నగర్ జిల్లాలోని దోమలపెంట. నల్లమల అడవుల్లో అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామం అది. ఇప్పుడు హైదరాబాద్‌లోని ‘రాజ బహద్దూర్ వెంకట రామారెడ్డి ఉమెన్స్ కాలేజ్’లో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్‌లో రెండవ సంవత్సరం చదువుతోంది. కాలేజ్‌లోని ఎన్ఎస్ఎస్, క్విల్స్ క్లబ్, ఐక్యూ ఏస్ క్లబ్, ఎస్‌యూసి క్లబ్‌లలో మెంబర్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలలో చురుగ్గా ఉండేది. నల్గొండలో స్కూల్ రోజుల నుంచి కూడా అమూల్య వక్తృత్వం, వ్యాసరచనలలో ప్రైజ్‌లు అందుకుంది. ఇవన్నీ ఆమెను సామాజికాంశాల మీద నిర్వహించే ర్యాలీల్లో ముందు వరుసలో నిలబెట్టాయి. వీటికి తోడుగా ఆమె తన ఊరి స్కూల్ కోసం, ఆడపిల్లల చదువు గురించి స్వచ్ఛందంగా చేస్తున్న కార్యక్రమాలు కూడా తోడయ్యాయి. అమూల్య తన ఊరి కబుర్లు చెబుతూ నానమ్మ ఇమ్మడి సామ్రాజ్యం గారిని ప్రముఖంగా గుర్తు చేసుకుంది. ‘‘మా దోమలపెంటలో ఆడపిల్లలు చదువుకోవడం ఓ విచిత్రం. అలాంటిది మా నానమ్మ తన ఎనిమిది మంది కొడుకులతోపాటు కూతుర్ని కూడా చదివించింది. తాతయ్య పోవడంతో ఇంటి బాధ్యత పూర్తిగా నానమ్మ మీదనే పడింది. ఆమె బర్రెల పాలు అమ్మి అంతమందినీ చదివించింది. ఆడపిల్లలను బడికి పంపించని ఊరిలో, ఇన్ని ఆర్థిక కష్టాల మధ్య మా అత్తమ్మను చదివించడం అంటేనే ఆడపిల్లలు కూడా చదువుకోవాలని ఆమె ఎంత గట్టిగా నమ్మిందో తెలుస్తోంది. ఆ ప్రభావం మా అందరి మీదా ఉంది. పెద్ద నాన్నల నుంచి మా నాన్న చిన్నాన్నలు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాళ్లు తమ ఊరికి, స్కూల్‌కి ఏదో ఒకటి చేయాలని మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. నేను కూడా ఏటా ఆగస్టు 15వ తేదీ, జనవరి 26న దోమలపెంట స్కూల్‌కి వెళ్లి విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, ఇతర స్టేషనరీ ఇస్తుంటాను. స్కూలు ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవడం, అమ్మాయిల ఉన్నత చదువులు ఎంత అవసరం అనే విషయాల మీద మాట్లాడేదాన్ని. నాన్న వాళ్లు మాత్రం ప్రగతిపథం అనే చారిటీతో స్కూల్‌కి వాటర్ ఫిల్టర్, ఫ్యాన్లు ఇచ్చేవాళ్లు. ఇవన్నీ నేను ఇష్టంగా చేస్తుంటాను. కొన్నేళ్ల కిందట మా ఊరిలో వీథి పక్కన పడి ఉన్న ఓ అమ్మాయిని ఓ ముసలావిడ దగ్గరకు తీసి పెంచింది. ఆ అమ్మాయి ఇప్పుడు టెన్త్ చదువుతోంది. కరోనా ఆన్లైన్ క్లాసుల సమయంలో తనకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాం. మంచి స్టూడెంట్ అని అప్పుడు తెలిసింది. టెన్త్ తర్వాత ఆ అమ్మాయి కాలేజ్ ఎడ్యుకేషన్ బాధ్యత కూడా మా కుటుంబమే తీసుకుంది. ‘మనం మనకోసం చేసుకున్న పని కంటే సమాజం కోసం చేసిన పనిలో ఎక్కువ సంతృప్తి దొరుకుతుంది’ అని నమ్ముతాను. యూఎస్ కాన్సులేట్ నన్ను ఎంపిక చేయడానికి ఇవన్నీ దోహదం చేశాయి. దశల వారీగా వడపోత మా కాలేజ్ వాళ్లు కొందరు విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి ముగ్గురిని ఎంపిక చేసి ఆ ముగ్గురినీ హైదరాబాద్‌లో ఉన్న యూఎస్ కాన్సులేట్‌కి పంపించారు. వాళ్లను కాన్సులేట్ వాళ్లు మళ్లీ ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ కాన్సులేట్‌లోనే జరుగుతుంది. కానీ కరోనా కారణంగా జూమ్ ఇంటర్వ్యూ చేశారు. దేశంలో అన్ని కాన్సులేట్ల నుంచి ఇంటర్వ్యూ రికార్డులు ఢిల్లీ కాన్సులేట్‌కి పంపిస్తారు. వాళ్లు వాటన్నింటినీ పరిశీలించి ఫైనల్‌గా ముగ్గురిని ఎంపిక చేస్తారు. ‘స్టడీ ఆఫ్ ద యూఎస్ ఇన్స్టిట్యూట్స్(ఎస్యూఎస్ఐ) 2022’కి ఎంపికైన ముగ్గురిలో నాతోపాటు అహ్మదాబాద్ నుంచి ఒకమ్మాయి, చెన్నై నుంచి ఒకమ్మాయి ఉన్నారు. కాన్సులేట్‌కి ఇచ్చిన నివేదికలో ‘నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను’ అనే వివరాలు రాయాలి. అలాగే ఈ ‘ఎస్యూఎస్ఐ ప్రోగ్రామ్‌కి హాజరైన తర్వాత ఆ సమాచారంతో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాను’ అనే విషయాన్ని కూడా చెప్పగలగాలి. అందులో మన భావంతోపాటు ఇంగ్లిష్ ప్రావీణ్యత, లీడర్షిప్ క్వాలిటీలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు’’ అంటూ ఎన్నో అమూల్యమైన విషయాలను వివరించింది అమూల్య. ఆమె జూన్‌నెల 23వ తేదీన యూఎస్ విమానం ఎక్కనుంది. 25వ తేదీ నుంచి యూఎస్, కాన్సాస్ రాష్ట్రంలోని ‘యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్’ లో మొదలయ్యే సమావేశాల్లో పాల్గొననుంది. ఆల్ ది బెస్ట్ అమూల్యా! మాకు గర్వకారణం! యూఎస్ కాన్సులేట్‌కు మేము మా విద్యార్థులను నామినేట్ చేసేటప్పుడు ‘ఆ విద్యార్థినే ఎందుకు నామినేట్ చేస్తున్నాం’ అనే అంశాన్ని సమగ్రంగా వివరించాలి. చదువులో చురుగ్గా ఉండడంతోపాటు సమాజానికి తన వంతు కంట్రిబ్యూషన్ ఇస్తున్న వారిని ఎంపిక చేయాలి. ఫౌండేషన్లు, చారిటీలు, ఎన్జీవోలతో కలిసి పని చేయడం వంటివి ప్రధానంగా ఉంటాయి. అమూల్య ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి. ఆడపిల్లల చదువు పట్ల పెద్దగా ఆసక్తి చూపించని మన భారతీయ గ్రామాల్లో అదొకటి. అలాంటి చోట నుంచి వచ్చిన ఈ అమ్మాయి తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా తనలాంటి ఆడపిల్లలందరూ ఎదగాలని కోరుకునేది. అందుకోసం గ్రామాలకు వెళ్లి ఆడపిల్లలకు ఉన్నత చదువు పట్ల అవగాహనతోపాటు, ‘ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలి’ వంటి విషయాల్లో మెళకువలు చెప్తుంటుంది. ఇన్ని అర్హతలు ఉండడం వల్లనే దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది అప్లికేషన్ల నుంచి ఈ అమ్మాయికి అవకాశం వచ్చింది. ఒక చురుకైన అమ్మాయి తన సేవలను మరింత విస్తరింపచేయడంలో మా కాలేజ్ పాత్ర ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది. – సంయుక్త, నోడల్ ఆఫీసర్, ఓవర్సీస్ స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ – వాకా మంజులారెడ్డి -
పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడు.. ఇక పెళ్లి కాదని
తలమడుగు (ఆదిలాబాద్): పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడు, ఇక తనకు పెళ్లి కాదేమోనని మనస్తాపంతో పురుగుల మందు తాగిన యువతి చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రుయ్యడి గ్రామనికి చెందిన కుమ్మరి శ్రీనీల(19)ని అదే గ్రామానికి చెందిన చెన్నల సాయి కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. విషయం తెలిసి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడగా, వాటిని చెడగొట్టాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనీల ఫిబ్రవరి 28న ఇంట్లోని యాసిడ్, సూపర్‌వాస్మాల్ తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. శ్రీనీల తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవళిక తెలిపారు. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్టు) -
పెళ్లి చేసుకోవాలని కోరితే.. తల్లిని అడగాలని వెళ్లాడు.. అంతలోనే..
సాక్షి, గోరంట్ల (సత్యసాయి జిల్లా): యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మల్లాపల్లిలో చోటు చేసుకుంది. సీఐ జయనాయక్ తెలిపిన వివరాల మేరకు.. గోరంట్ల పట్టణానికి చెందిన గోపీకృష్ణ కుమార్తె తేజశ్విని (22) తిరుపతిలో బీఫార్మసీ చదువుతోంది. తమ వీధిలోనే నివాసముంటున్న ముస్తఫా (లేట్), హసీనా దంపతుల కుమారుడు సాధిక్, తేజస్విని కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. మండలంలోని మల్లాపల్లి సమీపంలో ఇటుక బట్టీ నడుపుతున్న సాధిక్ అక్కడే ఓ రేకుల షెడ్ ఏర్పాటు చేసుకున్నాడు. సాధిక్ అక్కడ ఉన్నాడని తెలుసుకున్న తేజశ్విని గురువారం కళాశాల నుంచి నేరుగా సాధిక్ వద్దకు వచ్చింది. కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని తేజశ్విని కోరగా, తన తల్లిని అడిగి వస్తానని సాధిక్ గోరంట్లకు వచ్చేశాడు. అతను తిరిగి వెళ్లి చూసే సరికి తేజశ్విని ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. చదవండి: (ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..) సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని తండ్రి గోపికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ జయనాయక్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బంధువులు తేజశ్విని మృతదేహంతో గోరంట్ల పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రేమ పేరుతో సాధిక్ తమ బిడ్డను హత్య చేశాడని, నిందితున్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ గోరంట్ల పోలీసుస్టేషన్ చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. పారదర్శకంగా కేసును విచారిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. చదవండి: ('లోన్ కట్టకపోతే.. న్యూడ్ ఫొటోలు ఇంట్లో వాళ్లకు పంపిస్తాం') -
వాసన్న చొరవ.. నాలుగేళ్ల నిరీక్షణకు తెర..!
సాక్షి, ఒంగోలు: రేయింబవళ్లు కష్టపడి చదివి సాధించిన ఉద్యోగం ఓ చిన్న సాంకేతిక కారణంతో ఆ యువతికి అందకుండా పోయింది. కోర్టు ఆదేశించినా అధికారులు పోస్టు మంజూరు చేయలేదు. ఈ క్రమంలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ప్రత్యేక చొరవ తీసుకొని పోస్టు మంజూరు చేయించడంతో ఆ యువతి ఉద్యోగంలో చేరింది. వివరాల్లోకి వెళితే..జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామం యానాది సామాజిక వర్గానికి చెందిన పొట్లూరి హనుమంతరావు, లలితమ్మలకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మాయి అంజలి డీఈడీ పూర్తి చేసిం 2018లో డీఎస్సీ రాయగా మంచి మార్కులతో 3726 ర్యాంకు సాధించింది. ఈ డీఎస్సీలో ఎస్టీ యానాది ఉప కులానికి 8 తెలుగు మీడియం పోస్టులను కేటాయించారు. ఈ క్రమంలో 2020లో డీఎస్పీ 2018 పోస్టులకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలంటూ విద్యాశాఖ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మెసేజ్‌లు పంపింది. అయితే ఫోన్ ప్రాబ్లం కారణంగా ఆ సమాచారాన్ని అంజలి అందుకోలేకపోయింది. దీంతో ఈమె కంటే ఎక్కువ ర్యాంకులు వచ్చిన అదే సామాజికవర్గానికి చెందిన మరో ఇద్దరు మహిళలు ఉద్యోగాలు సాధించారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న అంజలి అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. చదవండి👉🏾: (మంచి విజన్ ఉన్న యువ సీఎం జగన్: కుమార మంగళం బిర్లా) పూర్వాపరాలను పరిశీలించిన డివిజన్ బెంచ్ అంజలికి పోస్టు కేటాయించాలని, ఒకవేళ పోస్టు ఏదీ ఖాళీగా లేకపోతే సూపర్‌న్యూమరీ పోస్టు అయినా కేటాయించాలంటూ పాఠశాల విద్యాశాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే పాతికేళ్ల క్రితమే సూపర్ న్యూమరీ పోస్టులకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. దీంతో ఆమె విషయాన్ని పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి అభ్యర్థించింది. బాలినేని ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రికి స్వయంగా లేఖ రాసి పర్యవేక్షించారు. దీంతో అంజలికి గత నెల 10న సూపర్ న్యూమరీ పోస్టు మంజూరైంది. ఆమెకు గుడ్లూరు మండలం చేవూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పోస్టు కేటాయిస్తూ ఉత్తర్వులు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి.జగన్నాథరావు ఉత్తర్వులు జారీ చేశారు. తన ఉద్యోగం పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని పోస్టు మంజూరు చేయించిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. -
నిజామాబాద్ జిల్లాలో విషాదం..
సాక్షి, నిజామాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండల ధాటికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఎండదెబ్బతో నిజామాబాద్ జిల్లాలో ఓ యువతి మృతి చెందింది. డిచ్పల్లి మండలం లింగసముద్రం గ్రామానికి చెందిన చిన్నోళ్ల సవిత(19) వడదెబ్బకు మృత్యువాత పడటం ఆ గ్రామంలో విషాదం రేపింది. వడదెబ్బ కారణంగా అనారోగ్యానికి గురైన సవితను ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. కాగా, జిల్లావ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉంది. గత వారం రోజుల నుంచి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ఉన్మాదం: ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యువకుడు
సాక్షి, నెల్లూరు: వెంకటగిరిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంటర్ విద్యార్థి చిగురుపాటి జ్యోతికను ప్రేమించలేదనే కోపంతో చెంచుకృష్ణ అనే యువకుడు కత్తితో గొంతు కోశాడు. జ్యోతిక పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెంచుకృష్ణను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ వర్క్‌ఫ్రమ్ హోమ్.. ప్రేమించిన యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పాత బకాయి అడిగినందుకు... అనుమసముద్రంపేట: మద్యం మత్తులో తనపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడని హసనాపురానికి చెందిన సుభాషిణి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుభాషిణి హసనాపురం సెంటర్లో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకుని కూల్‌డ్రింక్స్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. ఆదివారం శ్రీకొలనుకు చెందిన గడ్డం విజయ్‌కుమార్ మరో ముగ్గురితో కలిసి మద్యం సేవించేందుకు కూల్‌డ్రింక్ షాపు వద్దకు రాగా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పాత బకాయి సైతం చెల్లించాలని కోరడంతో ఇద్దరి నడుమ వాగి్వవాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో విజయ్‌కుమార్ తనపై దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏఎస్‌పేట పోలీసులు కేసు విచారణ చేపడుతున్నారు. -
కాలేజీకి వెళ్లిన యువతి మిస్సింగ్.. తిరిగి ఇంటికి రాకపోవడంతో..
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): మండల పరిధిలో కళాశాల విద్యార్థిని అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు, మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ వైఎస్సార్ కాలనీకి చెందిన మౌనిక(19), స్థానిక కోమటివాని చెరువు సమీపంలోని కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈ నెల 19న కళాశాలకు వెళ్లిన విద్యార్థిని తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆదివారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు ఎస్ఐ -9440796741కు సమాచారం ఇవ్వాలని కోరారు. చదవండి: ప్రేమించిన యువతి ఫోన్ స్విచ్ ఆఫ్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య.. -
‘అమ్మా ! నేను అందరిలా మళ్లీ బడికెళ్లగలనా..?'
సాక్షి, అనంతపురం: ‘అమ్మా ! నేను అందరిలా మళ్లీ బడికెళ్లగలనా? బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకుంటానమ్మా! ఎలాగైనా ఈ జబ్బు నయం చేయించు’ అంటూ కన్నీళ్లతో వేడుకుంటున్న కుమార్తెను చూసిన తల్లిదండ్రుల వేదనకు అంతు లేకుండా పోతోంది. మళ్లీ ఆమెను మునుపటిలా చేయాలనే తపన వారికీ ఉంది. అయితే పేదరికం కారణంగా శస్త్రచికిత్స చేయించలేని స్థితిలో మౌనంగా రోదిస్తున్నారు. కాలికి పుండులా వ్యాపించి భరించ లేని నొప్పితో విలవిల్లాడుతున్న తమ కుమార్తెకు శస్త్ర చికిత్స చేయించే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. సంతోషాలకు బ్రేక్ పడిందిలా! బుక్కరాయసముద్రం మండలం విరుపాక్షేశ్వర నగర్‌కు చెందిన పేరూరు పురుషోత్తం.. నగరంలోని ఓ ఫ్యాక్టరీలో దినకూలీగా పనిచేస్తున్నాడు. భర్తకు తోడుగా భార్య పుష్పావతి సైతం చిన్నాచితక పనులతో సంసారాన్ని గుట్టుగా నెట్టుకొస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి సంకీర్తన.. డిగ్రీ చదువుతోంది. చిన్నమ్మాయి సుప్రజ.. నగరంలోని పాతూరు కస్తూరిబా బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆనందంగా సాగిపోతున్న సుప్రజ జీవితాన్ని అంతుచిక్కని వ్యాధి కకావికలం చేసింది. గత ఏడాది చివర కాలుపై కురుపులాంటిది కనిపిస్తే వైద్యం చేయించారు. భరించరాని నొప్పితో బాధపడుతుండడంతో వైద్య పరీక్షలు చేయిస్తే ‘బోన్ కాన్సర్ ’ అని తేలింది. అనంతపురం సర్వజనాస్పత్రితో పాటు, కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేయించారు. నయం కాలేదు. తిరుపతిలోని స్విమ్స్‌లో వైద్యం చేయించారు. ఫలితం దక్కలేదు. హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేయాలని... ఆరోగ్యశ్రీ పరిధి దాటిపోవడంతో రూ.8 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని వైద్యులు సూచించారు. ఎక్కడ పది రూపాయలు తక్కువవుతుందని తెలిసినా గంపెడాశతో పరుగులు పెట్టిన ఆ కుటుంబానికి ప్రస్తుతం దిక్కు తోచలేదు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో బడికెళ్లి చదువుకోవాలనే తపన ఆ చిన్నారిలో మరింత ఎక్కువైంది. ఇలాంటి తరుణంలో తమ బిడ్డకు ప్రాణదానం చేసే ఆపన్న హస్తం కోసం నిరుపేద తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. దాతలు సంప్రదించాల్సిన చిరునామా పేరు : పేరూరు పురుషోత్తం ఫోన్ నంబర్ : 63035 59280 బ్యాంక్ ఖాతా నంబర్ : 1100 2614 0452 (కెనరాబ్యాంక్, సుభాష్‌రోడ్డు, అనంతపురం శాఖ) ఐఎఫ్ఎస్సీ కోడ్ : సీఎన్ఆర్బీ0000659 -
తాళి కట్టిన గంటలోనే నడిరోడ్డుపై వదిలేశాడు..
సాక్షి, తిరువళ్లూరు (చెన్నై): తాళి కట్టిన గంటలోనే తనను నడిరోడ్డుపై వదిలేశాడని..తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు యువతి ఆందోళనకు దిగింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా మెయ్యూరు గ్రామానికి చెందిన మునస్వామి కుమార్తె లక్ష్మి(23) నర్సింగ్ పూర్తి చేసి చెన్నైలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తోంది. సమీప బంధువైన అదే గ్రామానికి చెందిన చిన్నరాజ్(26) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చిన్నరాజ్ నమ్మించడంతో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. గత డిసెంబర్లో యువతి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారు. వడమధురైకి చెందిన వేరే యువతితో చిన్నరాజ్‌కు పెళ్లి సంబంధం కుదుర్చారు. విషయం తెలుసుకుని యువకుడిని నిలదీయగా, నిర్లక్ష్యంగా సమాధామిచ్చాడు. దీంతో డిసెంబర్ 18న ఊత్తుకోట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ చేసి పెళ్లికి ఒప్పించారు. ఈ ఏడాది జనవరి 8న ఊత్తుకోటలోని చర్చిలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇంటికి తీసుకెళతానంటూ ఊత్తుకోట దాటిన తరువాత లక్ష్మిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. నెలన్నర తరువాత శుక్రవారం ఉదయం ఇంటికి రావడంతో లక్ష్మి అతడి ఇంటికి వెళ్లింది. తనకు న్యాయం చేయాలని నిలదీసింది. దీంతో ఆగ్రహించిన చిన్నరాజ్ బంధువులు యువతిపై దాడి చేసి ఇంటి లోపలికి రానివ్వకుండా తాళం వేశారు. దీంతో చేసేదేమి లేక తనకు న్యాయం చేయాలని యువతి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. యువతికి ఐద్వా సంఘం నేతలు మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న ఊత్తుకోట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువతిని విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
ప్రియుడితో ప్రేమ వివాహం.. మూడు నెలల ముచ్చట తీరకుండానే..!
సాక్షి, విజయనగరం(బాడంగి): ప్రేమను పండించుకుని భవిష్యత్తుపై కోటి ఆశలతో ప్రియుడినే పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్లయిన మూడునెలలకే బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గజరాయునివలస గ్రామానికి చెందిన పాచిపెంట స్వాతి(25) బుధవారం కన్నవారింటి వద్ద పురుగు మందు తాగి అపస్మాకర స్థితికి చేరుకోగా కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స చేస్తుండగా మృతి చెందింది. గ్రామంలో రెండున్నరేళ్లుగా వలంటీర్‌గా పనిచేస్తున్న ఆమెకు మూడునెలల క్రితం సాలూరులో బ్యాంకులో మెసెంజర్‌గా కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న బోగి చాణక్యతో ప్రేమవివాహం జరిగింది. స్వాతి వలంటీర్‌గా పనిచేస్తుండడంతో భర్త అప్పుడప్పుడు అత్తవారింటికి వచ్చి వెళ్తుంటాడు. ఇంతలో ఏమైందో కానీ ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి పాచిపెంట వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎ.నరేష్ కేసు నమోదుచేశారు. ఈ ఫిర్యాదుపై తహసీల్దార్ కె.సుధాకర్ మెజిస్టీరియల్ దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా మృతురాలి తల్లిదండ్రులు, భర్త బంధువులను ప్రశ్నించారు. కుమార్తె ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు లేవని ఫిర్యాదులో తల్లి పేర్కొనడంతో పంచాయతీ పెద్దలసమక్షంలో ఆస్పత్రి దగ్గరే శవపంచనామా చేసి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. వలంటీర్ స్వాతి మృతితో తోటి వలంటీర్లు గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. చదవండి: (ఆ బెంగతో ఏకంగా ప్రాణాలే తీసుకుంది) అప్పుల బాధతో మరొకరు.. గజపతినగరం: గజపతినగరం మండలం పురిటి పెంట న్యూకాలనీలో నివాసం ఉంటున్న కర్రి అప్పారావు (49) తాను నివాసం ఉంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం జరిగిన ఈ సంఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్రి అప్పారావు మొదటి భార్య చని పోగా రెండవ భార్య రమాదేవితో కాపురం సాగిస్తున్నాడు. అప్పారావు, రెండో భార్య రమాదేవి నిత్యం గొడవలు పడుతూ ఉండేవారని దీనికి ప్రధానకారణం ఆర్థిక భారం, కుటుంబ కలహాలేనని చెబుతున్నారు. మొదటి భార్యకు ఇద్దరు అబ్బాయిలు కాగా రెండో భార్యకు ఐదేళ్ల పాప ఉంది. వారంతా పక్కపక్కనే ఉండడంతో, నిత్యం కుటుంబకలహాలు, ఆర్థిక భారం తట్టుకోలేక అప్పారావు మనస్తాపం చెంది సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గంగరాజు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆనందంగా గడిపి.. కుటుంబ సభ్యులందరూ నిద్రపోయాక..
శెట్టూరు(అనంతపురం జిల్లా): మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు వివాహిత. పోలీసులు తెలిపిన మేరకు... శెట్టూరుకు చెందిన మాల మిద్దె సుధాకర్, రాణిమంజుల దంపతుల చిన్న కుమార్తె సోనియా (25) ఎంటెక్ పూర్తి చేసుకుని, అనంతపురంలో ఉంటూ గ్రూప్స్‌కు సిద్ధమవుతోంది. బుధవారం రాత్రి స్వగ్రామానికి వచ్చిన సోనియా.. కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపింది. రాత్రి కుటుంబ సభ్యులందరూ నిద్రపోయాక ఓ గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదవండి: భార్యను వదిలించుకోవడానికి భర్త మాస్టర్ ప్లాన్.. వైద్యం పేరుతో గురువారం ఉదయం ఎంత సేపటికీ సోనియా బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు గది తలుపులు తీసి చూడడంతో సోనియా ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న ఎస్ఐ యువరాజ్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. కాగా, సోనియా మృతికి ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ఘటనలో.. మరో ఘటనలో యాటకల్లుకు చెందిన రామాంజినేయులు, రాధమ్మ దంపతుల కుమార్తె ఇందు (22)కు నాలుగు నెలల క్రితం కర్ణాటకలోని కొలిమికెర గ్రామానికి చెందిన వీరేష్‌తో వివాహమైంది. నెల రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఇందు.. ఆ తర్వాత అత్తారింటికి వెళ్లలేదు. కళాశాలలో చదువుతున్న సమయంలో తాను ప్రేమించిన యువకుడు మృతిచెందాడన్న విషయం తెలుసుకుని తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలోనే ఇందును అత్తారింటికి పంపేందుకు తల్లిదండ్రులు సన్నాహాలు చేస్తుండడంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం ఉదయం గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇందు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అయ్యో ధరణి.. ఎంతపని చేశావమ్మా..
దుగ్గిరెడ్డిపాలెం(మర్రిపూడి)/ప్రకాశం జిల్లా: పరీక్షలు సరిగా రాయలేదని మనస్తాపం చెంది విద్యార్థిని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని దుగ్గిరెడ్డిపాలెంలో గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముచ్చుమూరి ధరణి (20) కనిగిరిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. చదవండి: మహిళా ప్రొఫెసర్‌కు అశ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్‌లు.. పరీక్షలు సరిగ్గా రాయలేదని మనస్తాపం చెందింది. బుధవారం రాత్రి నిద్రమాత్రలు మింగింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆమెను వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ అంకమ్మరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మృతదేహాన్ని పొస్టుమార్టం కోసం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఏమైందో? ఏమో?.. చింతచెట్టుకు వేలాడుతూ..
గుమ్మలక్ష్మీపురం (శ్రీకాకుళం): మండలంలోని సంధిగూడ గ్రామంలో యువతి మండంగి సంధ్య (25) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెది హత్యా? ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై ఎల్విన్‌పేట సీఐ టీవీ తిరుపతిరావు, ఎస్సై షన్ముఖరాజు బుధవారం విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం గొహిది గ్రామానికి చెందిన సంధ్యకు గుమ్మలక్ష్మీపురం మండలం వంగర పంచాయతీ సంధిగూడ గ్రామానికి చెందిన ఆరిక లక్ష్మణ్‌తో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో సుమారు నాలుగుసార్లు లక్ష్మణ్ ఇంటికి సంధ్య వచ్చి వెళ్లింది. ఈ ఏడాది జనవరిలో కూడా లక్ష్మణ్ ఇంటికి ఆమె రాగా వారిద్దరి మధ్య కొద్దిపాటి గొడవ జరగడంతో మనస్తాపానికి గురై లక్ష్మణ్‌కు సంబంధించిన సర్టిఫికెట్లన్నీ పట్టుకుని స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇటీవల పలు పోస్టులకు ప్రకటనలు రావడంతో దరఖాస్తు చేసుకునేందుకు సర్టిఫికెట్లు అవసరమై సంధ్యకు ఫోన్ చేసి ఇవ్వాల్సిందిగా లక్ష్మణ్ కోరినప్పటికీ నిరాకరించింది. దీంతో గొహిది సర్పంచ్‌కు లక్ష్మణ్ ఫోన్ చేసి తన సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరాడు. ఈ మేరకు సర్పంచ్ ఆమెతో మాట్లాడి సర్టిఫికెట్లు ఇప్పించాడు. చదవండి: (నాన్నా నన్ను క్షమించు... చాలా సార్లు ఇబ్బంది పెట్టాను!) ఇదిలా ఉండగా లక్ష్మణ్ జనవరి 28న పనిమీద విశాఖ జిల్లా పెందుర్తి వెళ్లిన సమయంలో సంధ్య మళ్లీ సంధిగూడ వచ్చింది. ఏం జరిగిందో ఏమో గానీ మంగళవారం రాత్రి సంధిగూడ గ్రామానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న చింతచెట్టుకు ఆమె వేలాడుతూ కనిపించింది. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి, పరిశీలించి శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు..
సాక్షి, గొల్లపల్లి(నూజివీడు) కృష్ణా: పెళ్లిచేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు తనను గర్భవతిని చేసి, ఆ తర్వాత మోసం చేశాడని.. తనకు న్యాయం చేయాలంటూ ఓ యువతి తన ఏడునెలల కుమారుడితో మండలంలోని గొల్లపల్లి సచివాలయం వద్ద సోమవారం బైఠాయించింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా.. తనకేమీ న్యాయం చేయట్లేదని వాపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తూర్పు దిగవల్లికి చెందిన మిసమెట్ల వెంకటేశ్వరమ్మ(19)కు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో గ్రామంలోని ఆమె బంధువుల వద్ద ఉండి మూడేళ్ల క్రితం గొల్లపల్లిలోని ఆమె పెద్దమ్మ సాయల రాములమ్మ వద్దకు వచ్చి ఉంటోంది. కూలిపనులకు వెళ్తున్న సమయంలో గొల్లపల్లికి చెందిన తటకలూరి విష్ణుబాబు(20) అనే యువకుడు ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని ఆమె వెంట పడేవాడు. రోజూ వెంట పడటంతో వెంకటేశ్వరమ్మ సైతం అతనితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇరువురూ ఒక్కటయ్యారు. దీంతో వెంకటేశ్వరమ్మ గర్భవతి అయ్యింది. ఈ నేపథ్యంలో గతేడాది సర్పంచి ఎన్నికలకు ముందు స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు సైతం చేసింది. చదవండి: (ఒకరు బీటెక్.. మరొకరు బీఎస్సీ.. ఏ కష్టమొచ్చిందో.!) అయితే ఈ పంచాయతీ గ్రామంలోని పెద్దల వద్దకు వెళ్లగా, వారి ముందు పెళ్లి చేసుకుంటామని ఒప్పుకొని ఆ తరువాత యువకుడితో పాటు వారి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో పెద్దలు కూడా చేతులెత్తేశారు. ఆ తర్వాత యువతి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు తిరిగినా గ్రామంలో పెద్దలు గాని, పోలీసులు గాని పట్టించుకోకపోవడంతో చివరకు ఏమి చేయాలో తెలియక సచివాలయం వద్ద బైఠాయించింది. ఆమెకు మద్దతుగా సోషల్ వర్కర్ పంతం మార్తమ్మ, బీఎస్పీ నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు రంగు ధనలక్ష్మిలు, గ్రామంలోని పలువురు మహిళలు నిలిచారు. చదవండి: (తల్లి మందలించిందని పారిపోయిన యువతి.. చివరికి ఏమైందంటే..) -
యువతిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు మైనర్ల అరెస్ట్
ముంబై: ముంబైలోని ఈస్ట్రన్ ఉపనగరం గోవండీ ప్రాంతంలో ఓ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. స్థానిక శివాజీనగర్ ఏరియాలోని మట్టీరోడ్డులో శనివారం తెల్లవారు జామున 4.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అత్యాచారానికి గురైన యువతి ఓ సంస్థలో కేటరర్‌గా పనిచేస్తోంది. శుక్రవారం పనిలోకి వెళ్లిన యువతి సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఆమెతో పనిచేసే ఓ యువకుడు తనతో కొంచెం పని ఉందని, మాట్లాడాలని చెప్పి ఆమెను ఇంటికి వెళ్లకుండా ఆపేశాడు. ఆ తర్వాత ఆ యువతిని తీసుకుని ఓ మురికివాడలోని చిన్ని గదిలో బంధించివేశాడు. చదవండి: (నేరస్తుల పాలిట సింహస్వప్నం.. ఏఏ ఖాన్ కన్నుమూత) అనంతరం అతని స్నేహితులకు సమాచారం అందించి ఆ యువతిపై నలుగురు వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ్నుంచి నిందితులు పారిపోయారు. వెంటనే బాధితురాలు లేచి జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితులపై ఐపీఎస్ సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (విద్యుత్ బిల్లు కొట్టేందుకు వెళ్లి మైనర్‌పై అఘాయిత్యం) -
మూడుసార్లు పెళ్లి వాయిదా.. సహజీవనం.. ఆ క్రమంలోనే..
సాక్షి, దండేపల్లి (ఆదిలాబాద్): ఏడాది క్రితం నిశ్చియమైన పెళ్లి మూడుసార్లు వాయిదా పడటంతో మనస్తాపం చెందిన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఏఎస్పై పాల్ తెలిపిన వివరాల ప్రకారం.. కాసిపేట మండలం దేవాపూర్‌కు చెందిన సెడ్మాక సింధు (23)కు ఏడాది క్రితం దండేపల్లి మండలం ఇప్పలగూడకు చెందిన ఆత్రం మహేశ్‌తో పెళ్లి నిశ్చయమైంది. ఇంతలో దగ్గరి బంధువులు ముగ్గురు మృతి చెండంతో పెళ్లి వాయిదా వేస్తూ వచ్చారు. అయితే సింధు, మహేశ్ ఒకరినొకరు ఇష్టపడటం, మేనరికం కావడంతో పెళ్లికాకుండానే ఇప్పలగూడలో ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో సింధు గర్భం దాల్చింది. పెళ్లి మూడుసార్లు వాయిదా పడటం, దీంతోపాటు గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మొదట లక్సెట్టిపేటకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి తండ్రి భగవంత్‌రావ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పై తెలిపారు. చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను చూసి.. చలించిన యువ డాక్టర్) -
విషాదం: సరిగ్గా చదవడం లేదని మందలిస్తే..
వంగర (శ్రీకాకుళం): మండల పరిధి కొప్పర పంచాయతీ కె.కొత్తవలస గ్రా మానికి చెందిన విద్యార్థిని గొట్టిపల్లి శ్రావణి (17) మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు సమీపంలో వంగర –రాజాం రోడ్డులో ఉన్న వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యకు శుక్రవారం పాల్పడింది. ఎస్ఐ రొంగలి దేవానంద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తవలస గ్రామానికి చెందిన శ్రావణి విజయవాడ పడమటి రోడ్డులో ఉన్న శ్రీనివాస హైస్కూల్ లో పదో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఉపాధి కోసం వలస వెళ్లిపోవడంతో అక్కడే చదువుతోంది. ఇటీవలే సంక్రాంతికి సొంతూరు వచ్చారు. చదవండి: (పుట్టిన రోజే ప్రాణాలు పోయాయి) శ్రావణి సరిగ్గా చదవడం లేదని ఇటీవల తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంట ల సమయంలో ఇంటి నుంచి బయల్దేరి వెళ్లి వంతెన నుంచి నీటిలో దూకేసింది. దీనిపై స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాజాం అగ్నిమాపక శకటం సిబ్బందికి సమాచారం అందించి మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటనా స్థలాన్ని సీఐ డి.నవీన్‌కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని రాజాం సీహెచ్‌సీకి తరలించారు. తండ్రి గొట్టిపల్లి అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పేదింట విషాదం.. విద్యార్థిని ఆత్మహత్యతో కె.కొత్తవలస గ్రామంలో వి షాద ఛాయలు అలముకున్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రావణి తల్లిదండ్రులు గొట్టిపల్లి అప్పలరాజు, చిట్టెమ్మలు కొన్నేళ్ల కిందట విజయవాడకు వలస వెళ్లారు. సంక్రాంతికి సొంతూరు వచ్చారు. ఈ లోగా ఈ విషాదం సంభవించడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. -
డ్యూటీకని చెప్పి.. జీతం తీసుకొని వెళ్లిపోయి.. ఫోన్ చేస్తే..
బంజారాహిల్స్ (హైదరాబాద్): అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై అంబిక తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ బుడగ జంగం బస్తీలో నివసించే రెడ్డిబోయినోల కల్యాణి(21) బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఈ నెల 9వ తేదీ ఉదయం ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లిన ఆమె ఈనెల 11వ తేదీ వరకు కూడా తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లి ఈనెల 12వ తేదీన ఆస్పత్రికి వచ్చి కూతురి కోసం వాకబు చేసింది. అయితే ఆమె 9వ తేదీన జీతం తీసుకొని వెళ్లిపోయిందని తిరిగి రాలేదని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో తల్లి వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు సెల్ నం. 95531 25593లో సంప్రదించాలని తెలిపారు. చదవండి: (ఊహించని అద్భుతం: తల్లి దక్కదు, బిడ్డనైనా సేవ్ చేద్దామనుకున్నారు..) -
నాలుగేళ్లుగా సహజీవనం.. ప్రియుడు మందలించడంతో..
సాక్షి, మాకవరపాలెం (విశాఖపట్నం): ప్రియుడు మందలించాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని లచ్చన్నపాలెం శివారు దాలింపేటకు చెందిన పోలవరపు దుర్గాదేవి(18), రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామానికి చెందిన దమ్ము నాగేంద్ర ప్రేమించుకున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నా అనివార్య కారణాల వల్ల పెళ్లి జరగలేదు. నాలుగేళ్లుగా నాగేంద్ర ఇంటివద్ద సహజీవనం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నాలుగు రోజుల క్రితం నాగేంద్ర, దుర్గాదేవి మధ్య ఘర్షణ జరిగింది. నాగేంద్ర మందలించడంతో మనస్తాపానికి గురైన దుర్గాదేవి దాలింపేట వద్ద ఏలేరు కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. దుర్గాదేవి మృతదేహం మండలంలోని పైడిపాల వద్ద లభ్యమైంది. శనివారం అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రామకృష్ణారావు తెలిపారు. చదవండి: (భార్య చనిపోతే.. మరో కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు..) -
స్నేహితుడి సోదరితో పరిచయం.. లైంగిక దాడి, ఆపై ట్యాబ్లెట్స్ ఇచ్చి..
సాక్షి, కాకినాడ: యువతికి మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడి పెళ్లి చేసుకోవడానికి ముఖం చాటేసిన నయవంచకుడికి పదేళ్ల జైలు, రూ.వేయి జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎల్.వెంకటేశ్వరరావు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మారేడుమిల్లి చర్చివీధికి చెందిన సురబోయిన పవన్‌కుమార్ తన స్నేహితుడి సోదరితో పరిచయం పెంచుకున్నాడు. ఆ నర్సింగ్ చదవడానికి 2015లో కాకినాడకు వచ్చింది. దీంతో పవన్‌కుమార్ తరచూ కాకినాడ వచ్చి మాయమాటలు చెప్పి వంచించాడు. ఆ యువతి 2015లో గర్భం దాల్చగా దాని విచ్ఛిత్తికి టాబ్లెట్లు ఇచ్చాడు. చదవండి: (28 రోజులుగా కోమాలో.. వయాగ్రా అధిక మొత్తంలో ఇవ్వడంతో..) ఆరు నెలల తరువాత పెళ్లి చేసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చాడు. కాగా 2016లో పవన్ కుమార్‌ను పెళ్లి చేసుకోవాలని యువతి నిలదీయగా అతడు నిరాకరించాడు. దీంతో 2016లో మారేడుమిల్లి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా లైంగికదాడికి పాల్పడినందుకు ఐపీసీ 376 పాటు ఐపీసీ 417, 313, 315, 506, పోక్సో చట్టం కింద కేసును ఎస్సై డి.రాంబాబు నమోదు చేశారు. కోర్టు విచారణలో పవన్‌కుమార్ నేరం చేసినట్టు రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. ఏపీపీ ఎండీ అక్బర్ ఆజం ప్రాసిక్యూషన్ నిర్వహించారు. చదవండి: (భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం..) -
యువతిపై అత్యాచారం, హత్య.. కట్టెల కోసమని అడవిలోకి వెళ్లగా..
ఒరిస్సా(జయపురం): బొరిగుమ్మ సమితి చలానగుడ గ్రామ సమీపంలోని నీలగిరి అడవిలో 19 ఏళ్ల యువతి మృతదేహాన్ని పోలీసులు సోమవారం కనుగొన్నారు. ఆమెపై అత్యాచారం జరిపి, ఆపై హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలు చిలిగుడ గ్రామానికి చెందిన సుభద్ర అమనాత్య(19)గా గుర్తించినట్లు బొరిగుమ్మ సబ్‌డివిజనల్ పోలీసు అధికారి హరికృష్ణ మఝి తెలిపారు. సుభద్ర అమనాత్య డిసెంబరు 30న ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఆమె తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు గాలించారు. జాడ తెలియరాలేదు. చదవండి: (బెదిరించి లొంగదీసుకుని.. గిరిజన బాలికలపై లైంగిక దాడి..) సోమవారం ఉదయం చిలిగుడ గ్రామ మహిళలు కట్టెల కోసమని నీలగిరి అడవిలోకి వెళ్లగా, సగం కాలిన సుభద్ర అమనాత్య మృతదేహం కనిపించింది. బొరిగుమ్మ పోలీసు అధికారి ఖురేశ్వర సాహుకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసు డాగ్, సైంటిఫిక్ టీమ్‌లు చేరుకొని దర్యాప్తు ప్రారంభించాయి. సుభద్రను దుండగులు హత్యచేసి నీలగిరి తోటలో పడేసినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని హరికృష్ణ మఝి వెల్లడించారు. దుండగులను పట్టుకున్నాకనే ఆమెపై అత్యాచారం జరిగిందా, ఎందుకు హత్య చేశారనే విషయాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. మృతురాలి సోదరుడు బలరాం అమనాత్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
పేస్టు అనుకుని.. ఎలుకల మందుతో పళ్లు తోముకుని..
అద్దంకి రూరల్(ప్రకాశం జిల్లా): పేస్టు అనుకుని ఎలుకల మందుతో పళ్లు తోముకుని ఓ యువతి మృతి చెందిన సంఘటన అద్దంకి మండలంలోని వెంకటాపురంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. వెంకటాపురం గ్రామానికి చెందిన పాలపర్తి కోటేశ్వరమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద కుమారె పాలపర్తి కీర్తి(18) తల్లితో పాటు కూలి పనులకు వెళ్తోంది. చదవండి: హాస్టల్లో ఉండలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఈ నేపథ్యంలో గురువారం పేస్టు అనుకుని ఎలుకల మందు బ్రెష్‌పై వేసుకుని కీర్తి పళ్లు తోముకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి కడుపులో మంటగా ఉందని తల్లికి చెప్పడంతో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించింది. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందూతూ శనివారం కీర్తి మృతిచెందింది. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ లక్ష్మీభవాని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
పెళ్లి బాజా మోగాల్సిన ఇంట విషాదం.. ఓ ప్రబుద్ధుడు పెళ్లి చెడగొట్టడంతో
సాక్షి, నిజామాబాద్(మాచారెడ్డి): కొద్ది రోజుల్లో పెళ్లి భాజా మోగాల్సిన ఇంట విషాదం అలుముకుంది. ఓ ప్రబుద్ధుడు పెళ్లి చెడగొట్టడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఫరీదుపేట గ్రామానికి చెందిన కవిత (21)కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. అయితే అదే గ్రామానికి చెందిన వివాహితుడైన గోదూరి ప్రవీణ్ అనే వ్యక్తి ఆమెను ప్రేమిస్తున్నానంటూ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. ఈ విషయమై గతంలో గ్రామంలో పంచాయితీ నిర్వహించి జరిమానా సైతం విధించారు. అయినా అతడి బుద్ధి మారలేదు. చదవండి: (Uday Kumar Reddy: ఎస్సైగా ఇక్కడే.. ఎస్పీగా ఇక్కడికే!) పెళ్లి చెడగొట్టాలన్న దురుద్దేశంతో ఆ యువతికి కాబోయే భర్తకు ఫోన్ చేశాడు. తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో పెళ్లి ఆగిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన కవిత సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బహిర్భూమికని వెళ్లి గ్రామశివారులోని బండారి చెరువు కాలువ వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు ఆత్మహత్యకు గోదూరి ప్రవీణ్ కారణమని యువతి తండ్రి ఎల్లయ్య, తల్లి మణెవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. చదవండి: (దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే..) -
యువతిపట్ల అసభ్య ప్రవర్తన.. కారులో ఖాళీ ఉందంటూ వెకిలివేషాలు
సాక్షి, బంజారాహిల్స్: పబ్‌లో పార్టీ ముగించుకుని బయటకు వచ్చిన యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసుల సమాచారం మేరకు.. టోలీచౌకి ప్రాంతానికి చెందిన యువతి(28) సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. మంగళవారం రాత్రి మరో స్నేహితురాలితో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నం. 36లోని రోగ్ క్లబ్ పబ్‌కు విందు కోసం వచ్చింది. చదవండి: (Hyderabad: మసాజ్ సెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు) పబ్ మూసిన తర్వాత కిందకు వచ్చిన యువతి వ్యాలెట్ డ్రైవర్ కోసం వేచి ఉన్న సమయంలో అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చారు. ఆమెతో మాటలు కలిపేందుకు ప్రయత్నించడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడారు. తమ కారులో ఖాళీ ఉందంటూ వెకిలివేషాలు వేశారు. దీంతో బాధితురాలు బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (మూడేళ్లు సహజీవనం.. ఇపుడు దూరంగా ఉంటోందని..) -
ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడు..
సాక్షి, చెన్నై: ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడి కిరాతకం నామక్కల్‌లో వెలుగు చూసింది. బీహార్‌కు చెందిన ఓ యువతి నామక్కల్ వేప్పేడులోని ఓ ప్రైవేటు మిల్లులో పనిచేస్తోంది. అక్క డే పనిచేస్తున్న బాల్ రాజ్‌తో ఈమె పరిచయం ప్రేమగా మారింది. అయితే, ఆదివారం సెలవు కావడంతో ప్రియురాలికి మాయ మాటలు చెప్పి తన ఇంటికి బాల్‌రాజ్ తీసుకెళ్లాడు. చదవండి: (Lovers Commit Suicide: ప్రేమ జంట ఆత్మహత్య) కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేకపోవడంతో అక్కడి నుంచి బయటకు వచ్చే యత్నం చేసిన ఆమె మీద బాల్‌రాజ్ లైంగిక దాడి చేశాడు. అంతేకాదు, మిత్రులు ప్రదీప్, మనోజ్‌కు అప్పగించాడు. ముగ్గురు కలిసి ఆమె మీద పలుమార్లు సామూహిక లైంగిక దాడి చేయడంతో స్పృహ తప్పింది. ఆందోళనతో ఆ ముగ్గురు ఉడాయించారు. అర్ధరాత్రి వేళ స్పృహలోకి వచ్చిన ఆ యువతి పెట్టిన కేకలతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో బీహార్‌కు పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఆ ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. -
Hyderabad: ముగ్గురు యువతుల అదృశ్యం.. షాకింగ్ ఏంటంటే..
సాక్షి, హైదరాబాద్(మేడ్చల్): ఓ కంపెనీలో పని చేస్తున్న ముగ్గురు యువతులు అదృశ్యమైన ఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బుష్రబి జిలానిషేక్ (17), బిస్బిల్లాబి జిలాని షేక్ (16), అశ్మాబి అజీం (19) ముగ్గురు బిహార్ నుంచి వలస వచ్చి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయలో నివాసముంటున్నారు. దేవరయావంజాల్‌లోని ఓ బుక్ కంపెనీలో కార్మికురాలుగా పని చేస్తున్నారు. కాగా ఎప్పటిలాగే ముగ్గురు శనివారం ఉదయం 8 గంటలకు కంపెనీకి వెళ్లారు. రాత్రి వరకు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరితో పాటే అదే కంపెనీలో పని చేస్తున్న విష్ణు, నూతన్, విశ్వకర్మలు సైతం పనులను హాజరుకాకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) -
ఫోన్ మాట్లాడొద్దన్నా వినలేదు.. షాపుకు వెళ్లొస్తానని చెప్పి..
సాక్షి, హైదరాబాద్ (అంబర్‌పేట): షాపుకు వెళ్లొస్తానని ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదశ్యమైంది. ఈ సంఘటన గురువారం అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లో నివసించే మధుకర్ కుమార్తె పూజారాణి(20) ఇంట్లోనే ఉంటుంది. గత కొంత కాలంగా నిరంతరాయంగా ఫోన్లోనే మాట్లాడుతుండేది. ఇది సరైన పద్ధతి కాదని వారించినా వినలేదు. ఈ నేపథ్యంలోనే బుధవారం షాపుకు వెళ్లొస్తానని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని చెప్పి..)