
సాక్షి, కృష్ణా: మచిలీపట్నం సమీపంలో ఓ యువతి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పులిగడ్డ-పెనుముడి వారధి పై నుంచి డిగ్రీ చదవుతున్న ఓ యువతి కృష్ణానదిలోకి దూకింది. అయితే ఘటనా స్థలానికి దగ్గరలోనే అవనిగడ్డ పోలీసులు నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు ఆమెను కాపాడారు. అవనిగడ్డ పోలీసులు మాణిక్యాలరావు, కానిస్టేబుల్ గోపిరాజు నదిలోకి దూకి ఆమెకు రక్షించడంతో.. ప్రాణాలతో బయటపడింది. వెంటనే స్థానికుల సహాయంతో యువతిని అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. యువతిని కాపాడిన అవనిగడ్డ ఏఎస్‌ఐ మాణిక్యాలరావును డీజీపీ గౌతమ్‌సవాంగ్, పలువురు ఉన్నతాధికారులు అభినందించారు.