attempt suicide
-
అశ్వారావుపేట SI ఆత్మహత్యాయత్నం
-
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
-
నిద్రమాత్రలు మింగిన నటుడు.. మరో నటుడిపై కేసు నమోదు
మోడల్, బాడీబిల్డర్, నటుడు మనోజ్ పాటిల్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించడానే ఆరోపణలతో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌పై కేసు నమోదైంది. ఈ కేసును నటుడితో పాటు మరో ముగ్గురిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. మనోజ్‌పాటిల్ గురువారం ఓషివారాలోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది ఉదయం ఒంటి గంట సమయంలో జరగగా గమనించిన ఆయన కుంటుంబ సభ్యులు కూపర్ ఆసుపత్రికి తరలించారు. అతని వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సాహిల్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు. సాహిల్ ఖాన్ తన కొడుకును మానసికంగా వేధించాడని మనోజ్ పాటిల్ తల్లి మీడియాకి తెలిపింది. అది ప్రాణాలను తీసుకునే దాకా వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేసు నమోదైన అనంతరం నటుడు సాహిల్ ఖాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘సోషల్ నెట్వర్కింగ్ సైట్లో రాజ్ ఫౌజ్దార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఢిల్లీకి చెందిన అతనికి మనోజ్ రూ.2 లక్షలు తీసుకుని, గడువు ముగిసిన స్టరాయిడ్స్ ఇచ్చాడని తెలిపాడు. దీంతో గుండె, చర్మ సమస్యలు వచ్చాయని చెప్పాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినా ఇవ్వకుండా రాజ్ ఫౌజ్దార్ను ఇబ్బంది పెట్టాడని పేర్కొన్నాడు. లావాదేవీలకి సంబంధించిన అన్ని రసీదులు చూపించి సహాయం చేయమని కోరగా, అతనికి మద్దతుగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాను. అంతేకానీ నాకు ఈ విషయానికి ఏం సంబంధం లేదు’ అని సాహిల్ ఖాన్ తెలిపాడు. మరోవైపు ఇంతకుముందే సాహిల్ సోషల్ మీడియాలో తన ఇమేజీని దెబ్బతీస్తున్నాడని ఆరోపిస్తూ మనోజ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈ బాడీబిల్డర్ మేనేజర్ తెలిపాడు. -
పెళ్లి అయిన మూడు రోజులకే.. ‘నవ వరుడి’ ఆత్మహత్యాయత్నం..
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): జగిత్యాల జిల్లా కేంద్రంలోని మార్కండేయనగర్కు చెందిన బాబా పెళ్లి అయిన మూడు రోజులకే కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. బాబాకు మూడు రోజుల క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. అప్పటినుంచి వీరద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విషయమై యువకుడు గురువారం జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు.. ఇద్దరికీ సర్దిచెప్పి ఇంటికి పంపించారు. శుక్రవారం మళ్లీ ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన బాబా పదునైన కత్తితో చెయ్యి, వీపు భాగాల్లో కోసుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దూషించిన వ్యక్తిపై చర్య తీసుకోండి కథలాపూర్(వేములవాడ): అటవీశాఖకు చెందిన భూమిని కబ్జా చేశాడని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తి తనను దూషించాడని సెక్షన్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన పిట్టల రాజం అటవీశాఖకు చెందిన భూమిని కబ్జా చేసి, చెట్లు నాటాడు. దీనిపై ప్రశ్నించి, వాటిని తొలగించిన అటవీశాఖ సెక్షన్ అధికారి శ్రీనివాస్‌ను అతను దూషించాడు. ఈ మేరకు బాధితుడు శుక్రవారం ఠాణాలో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చర్య తీసుకోవాలని కోరారు. చదవండి: అదనపు కట్నం కోసం వేధింపులు.. ఎనిమిది నెలల నిండు గర్భిణి పై.. -
కులాంతర వివాహం.. బంధువుల సమక్షంలో అత్తింటివారు దూషించడంతో..
సాక్షి, మిర్యాలగూడ(నల్లగొండ): అట్రాసిటీ కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. మిర్యాలగూడ పట్టణం గాంధీనగర్‌కు చెందిన గ్యార సాయికుమార్, ఇందిరమ్మకాలనీకి చెందిన సౌజన్యను ఏడాదిన్నర క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులుగా దంపతుల మధ్య తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సౌజన్య కుటుంబ సభ్యులు సాయికుమార్‌ను బంధువుల సమక్షంలో కులం పేరుతో దూషించారు. ఈ విషయంపై సాయికుమార్ తల్లి సైదమ్మ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్య తీసుకోవాలని కోరుతూ ఈ నెల 6వ తేదీన వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారని సాయికుమార్ మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న సాయికుమార్ వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తెరిచి తాగాడు. గమనించిన పోలీసులు వెంటనే అతడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాయికుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్: ప్రగతి భవన్ వద్ద అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం
-
భార్య మోసం చేసిందని భర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి, తిమ్మాపూర్(కరీంనగర్): భార్య వేధింపులు భరించలేక ఓ వ్యక్తి దిగువ మానేరు జలాశయం కాకతీయ కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సోమవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధి అల్గునూర్ శివారులో జరిగింది. నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానిక చేపలకాలనీకి చెందిన జాలర్లు ప్రాణాలు తెగించి కాపాడారు. బాధితుడు, జాలర్ల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కొత్తవాడకు చెందిన వెంకటేశ్ భార్య వేధింపులు భరించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కొన్ని రోజులుగా బయటే తిరుగుతూ సోమవారం ఉదయం అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ వద్దకు చేరుకొని అందులో దూకాడు. ఇదే సమయంలో చేపల కాలనీకి చెందిన బాలరాజు కరీంనగర్ మార్కెట్లో చేపలు విక్రయించి ఇంటికి వస్తున్నాడు. కాలువ వద్దకు రాగానే వెంకటేశ్ నీటిలో కొట్టుకుపోతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమైన బాలరాజు అక్కడే ఉన్న చిందం శ్రీను, అమర్ సాయంతో తన బండికి ఉన్న తాడును కాలువలోకి వేసి యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే యువకుడు తాడు పట్టుకోకపోవడంతో బాలరాజు తాడుసాయంతో కాలువలోకి దిగి వెంకటేశ్‌ను ఒడ్డుకు చేర్చాడు. ఈ సందర్భంగా బాధితుడిని వివవరాలు అడగ్గా, తనది ఆదిలాబాద్ జిల్లా కొత్తవాడ అని చెప్పాడు. తనను భార్య మోసం చేసిందని, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందామని కాలువలో దూకానని వెల్లడించాడు. యువకుడిని కాపాడినవారు ఎల్ఎండీ పోలీసులకు సమాచారం అందించగా, అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాణాలకు తెగించి వెంటకేశ్‌ను కాపాడిన బాలరాజు, శ్రీను, అమర్‌ను ఎస్సై కృష్ణారెడ్డి అభినందించారు. -
కలకలం రేపిన ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని తలమడుగు మండలం దహేగామ్ గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. జిల్లాకు చెందిన శ్రీరామ్,సుజాత అనే ప్రేమ జంట మంగళవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామ శివారు ప్రాంతంలో తెల్లవారు జామున అపస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీరామ్, సుజాతలను చికిత్స కోసం రిమ్స్ అసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రేమికుడు శ్రీరామ్ పరిస్థితి విషమించి ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. సుజాతకు చికిత్స అందిస్తుండగా ఆమె పరిస్థితి కూడా విషమించడంతో మృతి చెందింది. ప్రేమికుల మరణం ఇరువురి కుటుంబాలలో విషాదం నెలకొల్పింది. ఇదిలా ఉండగా తమ పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పడంతో మనస్తాపంతో ప్రేమికులు ప్రాణాలు తీసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
ప్రగతిభవన్ వద్ద ఆత్మహత్యాయత్నం
పంజగుట్ట (హైదరాబాద్): తెలంగాణ ఉద్యమకారులకు కనీసం డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా మంజూరు చేయలేదనే ఆవేదనతో ప్రగతిభవన్ ముందు ఉద్యమకారుడైన ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. చాదర్‌ఘాట్, మూసానగర్కు చెందిన ఆటోడ్రైవర్ కొడారి చందర్(46) ప్రగతిభవన్ బీబీ–1 గేటు వద్ద తనతో పాటు తెచ్చుకున్న డీజిల్ ఒంటిపై పోసుకోగా అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకుని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 2010 తెలంగాణ ఉద్యమం సమయంలో అసెంబ్లీ గేటు వద్ద సదరు వ్యక్తి ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మహత్యకు యత్నించాడని, దీనిపై కేసు కూడా నమోదైందని పోలీసులు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా బతుకులు మారలేదని చందర్ ఆవేదనలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఉద్యమకారుడినైన తనకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించాలంటూ గతంలో పలువురు మంత్రులను కలసి వినతిపత్రమి చ్చాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యకు యత్నించాడు. చందర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చందర్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులున్నారు. శుక్రవారం ప్రగతిభవన్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన ఆటో డ్రైవర్ చందర్ -
ప్రియుడు పెళ్లికి అంగీకరించలేదని.. ఆత్మహత్యాయత్నం
బంజారాహిల్స్: ప్రేమించిన యువకుడు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఓ యువతి పోలీసుల ఎదుటే గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. రాజమండ్రికి చెందిన వీరబాబు(20) జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలో అద్దెకుంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బీహెచ్ఈఎల్ లింగంపల్లిలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న స్వప్న(20)తో 5 నెలల క్రితం టిక్‌టాక్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ నేపథ్యంలో వీరబాబు తరచూ స్వప్నను తన గదికి పిలిపించుకునేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రెండు వారాల క్రితం పెళ్లి చేసుకోవాలని ఆమె అతడిని నిలదీసింది. అందుకు వీరబాబు నిరాకరించాడు. దీంతో స్వప్న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినా వీరబాబు మొండికేశాడు. ఈ క్రమంలో స్వప్న శనివారం తన తల్లితో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వీరబాబుపై చర్యలు తీసుకోవాలని కోరగా పోలీసులు అతడిని పిలిపించారు. అతని వైఖరిలో మార్పులేకపోడంతో ఆగ్రహించిన బాధితురాలు తనతో పాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతు కోసుకుంది. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. కాగా, ఆమె తన ప్రియుడి తీరుపై ఓ సెల్ఫీ వీడియోను కూడా తీసి తనను అర్థంచేసుకోవాలని కోరింది. పోలీసులు వీరబాబును అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పంజగుట్ట ఠాణా ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం
పంజగుట్ట: పంజగుట్ట పోలీస్‌స్టేషన్ గేటు ముందే అందరూ చూస్తుండగానే ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని హాహాకారాలు చేస్తూ పోలీస్‌స్టేషన్‌లోకి వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. చెన్నైకి చెందిన సానం లోకేశ్వరికి (37) అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌తో 2000లో పెళ్లి జరిగింది. కూతురికి 8 నెలల వయసు ఉన్నప్పుడే భార్యాభర్తలు విడిపోయారు. 2012లో లోకేశ్వరికి వారాసిగూడకు చెందిన ప్రవీణ్‌కుమార్ పరిచయమయ్యాడు. 2013లో లోకేశ్వరిని ప్రవీణ్ నగరానికి తీసుకువచ్చి బీఎస్ మక్తాలో ఓ గదిలో ఉంచి సహజీవనం చేశాడు. ఇద్దరూ కలిసి సోమాజిగూడలోని బాబూఖాన్ ఎస్టేట్‌లో బీఎస్పీ జువెలర్స్ పేరుతో ఓ నగల దుకాణం తెరిచారు. లోకేశ్వరి దుకాణం నుంచి 23 తులాల బంగారు ఆభరణాలు దొంగతనం చేసింది. 2014లో లోకేశ్వరిపై ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో లోకేశ్వరిని అరెస్టు చేసిన పోలీసులు.. 23 తులాల ఆభరణాలను రీకవరీ చేశారు. 2014 డిసెంబర్లో జైలు నుంచి బయటకు వచ్చిన లోకేశ్వరి తిరిగి చెన్నై వెళ్లిపోయింది. కాగా, గత శుక్రవారం తన స్నేహితుడు కన్నన్‌తో కలిసి లోకేశ్వరి హైదరాబాద్‌కు వచ్చింది. ప్రవీణ్ తనను మోసం చేసి రూ.కోటి తీసుకున్నాడని ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు లోకేశ్వరి తెలిపినట్లు సమాచారం. ప్రమాదంలో లోకేశ్వరి శరీరం 70 శాతం మేర కాలిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
కృష్ణా నదిలోకి దూకిన యువతి
సాక్షి, కృష్ణా: మచిలీపట్నం సమీపంలో ఓ యువతి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పులిగడ్డ-పెనుముడి వారధి పై నుంచి డిగ్రీ చదవుతున్న ఓ యువతి కృష్ణానదిలోకి దూకింది. అయితే ఘటనా స్థలానికి దగ్గరలోనే అవనిగడ్డ పోలీసులు నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు ఆమెను కాపాడారు. అవనిగడ్డ పోలీసులు మాణిక్యాలరావు, కానిస్టేబుల్ గోపిరాజు నదిలోకి దూకి ఆమెకు రక్షించడంతో.. ప్రాణాలతో బయటపడింది. వెంటనే స్థానికుల సహాయంతో యువతిని అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. యువతిని కాపాడిన అవనిగడ్డ ఏఎస్ఐ మాణిక్యాలరావును డీజీపీ గౌతమ్‌సవాంగ్, పలువురు ఉన్నతాధికారులు అభినందించారు. -
పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నం
సాక్షి, నంద్యాల (కర్నూలు): మహానంది పోలీసులు తనపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారంటూ గురువారం ఓ రైతు ఆర్డీఓ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. తన పొలాన్ని తిరుపతయ్య అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన రైతు సుధాకర్ మాల మహానాడు నాయకులతో కలిసి ఆర్డీఓ రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశాడు. నాయకులు ఆర్డీఓకు వినతిపత్రం ఇస్తుండగానే సుధాకర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అక్కడున్న వారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ తిరుపతయ్య తన పొలాన్ని ఆశ్రమించుకోవడమే గాక స్టేషన్లో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని, పోలీసులు కూడా తనపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని వాపోయాడు. స్పందించిన ఆర్డీఓ అధికారులతో విచారించి, పొలం సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
మహబూబ్‌నగర్ క్రైం : ప్రేమించుకున్నాం..పెళ్లి చేయండని ఓ ప్రేమజంట పెద్దలను వేడుకున్నారు.. వారు ఒప్పుకోక పోవడంతోపాటు ప్రేమజంటను విడదీయాలని ప్రయత్నించడంతో ఇద్దరు మనస్తాపానికి గురయ్యారు. కలిసి బతకలేకపోతే కలిసి చనిపోదాం అని నిర్ణయించుకుని పురుగుల మందు తాగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మండల పరిధిలోని అల్లీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. పట్టణంలోని గాంధీరోడ్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక, అల్లీపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఆంజనేయులు ఇద్దరు కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 18న ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ విషయంపై అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. అమ్మాయిని తీసుకుని రావాలని అబ్బాయి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చి రెండు రోజులు గడువు పెట్టారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ విషయం ప్రేమికులకు తెలియగా శుక్రవారం ఉదయం అల్లీపూర్ సమీపంలో పంట పొలాల్లో వారిద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి చికిత్స కోసం జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు. ఇదిలా ఉండగా అమ్మాయి మైనర్ కావడంతో వచ్చిన ఫిర్యాదు మేరకు ఆంజనేయులపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కంపెనీ స్టెరిలైట్ కాపర్ యూనిట్‌కు వ్యతిరేకంగా వరుసగా జరిగిన హింసాత్మక ఘటన మరువక ముందే రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. కడలూర్ జిల్లాలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో సోమవారం పలువురు ఆత్మహత్యకు యత్నించారు. పోలీసుల వివరాల ప్రకారం.. అధికారుల తీరుకు నిరసనగా 25 మంది కార్మికులు మూకుమ్మడిగా నీళ్లలో విషం కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేశారని తెలిపారు. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, ప్రస్తుతం ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగం నుంచి వారిని తొలగిస్తారనే భయంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. -
అత్తగారింటి ఎదుట అల్లుడి ఆత్మహత్యాయత్నం
కాగజ్‌నగర్‌రూరల్ : కట్నంగా ఇచ్చిన భూమిని పట్టా చేయనందుకు అల్లుడు ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన సంఘటన కాగజ్‌నగర్ మండలంలోని చింతగూడ కోయవాగు గ్రామంలో చోటు చేసుకుంది. కాగజ్‌నగర్‌రూరల్ ఇన్చార్జి ఎస్సై సిరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతగూడకు చెంది న చిట్యాల జలందర్ అదే గ్రామానికి చెందిన లక్ష్మి, పోచయ్యల కుమార్తెను ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో చింతగూడ గ్రామం శివారులోని 1.5ఎకరాల భూమిని వరకట్నంగా ఇచ్చారు. 8 సంవత్సరాలుగా అత్తమామలు అల్లుడికి కౌలు డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ సంవత్సరం ఆ భూమిని రూ.40వేలకు కుదువ పెట్టారు. విషయం తెలుసుకున్న అల్లుడు ఆ డబ్బులతో పాటు భూమిని తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బాధితుడు తాగిన మైకంలో గురువారం రాత్రి అత్తమామ ఇంటిముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేందానికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు తరలిం చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రైతు కంట కన్నీరు
-
తల్లితో సహా ముగ్గురు కుమార్తెలు ఆత్మహత్యాయత్నం
అద్దంకి (ప్రకాశం జిల్లా): భర్త వేధింపులు తట్టుకోలేక ముగ్గురు కుమార్తెలతో తనువు చాలించాలని నిర్ణయించుకొని విషగుళికలను మంచి నీటిలో కలిపి కుమార్తెలకు తాపి తాను త్రాగింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన సమాచారం మేరకు ... పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ మూడవలైన్లో నివాసం ఉంటున్న పేర్లబాజి జాతకాలు, ప్రశ్నలు చెబుతుంటాడు. ఇతనికి భార్య బుచ్చమ్మ, కుమార్తెలు కోటేశ్వరీ, శృతి, చిన్నారి ఉన్నారు. భార్యపై అనుమానంతో తరచూ వేధిస్తుండేవాడు . దీంతో తనువు చాలించాలని నిర్ణయించుకొని విషగుళికలను మంచి నీటిలో కలుపుకోని కుమార్తెలకు తాపి తాను త్రాగింది. తాగిన కుమార్తెలు బయటివచ్చి కేకలు వేయటంతో స్తానికులు విషయం కనుక్కోని వెంటనే ఆటోలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యంకోసం ఒంగోలు తరలించారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
గార్లదిన్నె: మండలంలోని కొట్టాలపల్లిలో పుష్పలీల అనే వివాహిత ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆమె ఈ చర్యకు యత్నించినట్లు వివరించారు. వెంటనే ఆమెను 108లో అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. -
కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి..
కరీంనగర్: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్‌లోని గీతభవన్ సమీపంలో నివాసముంటున్న శ్యామ్ కొబ్బరిబోండాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో.. తన ఇద్దరు పిల్లలు శ్రీహర్షిత(9), హర్ష(7)లతో పాటు కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి తాగి ఆత్మహత్యాయత్నానాకి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. హర్ష పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్ఐ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
-
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హజీపూర్(మంచిర్యాల జిల్లా): హజీపూర్ మండలం దొనబండకు చెందిన హరీష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. హజీపూర్ ఎస్ఐ తహసీనోద్దీన్ వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. హరీష్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. -
ఉన్నతాధికారి లైంగిక వేధింపులు
తుమకూరు(బెంగళూరు): ఉన్నతాధికారి లైంగిక వేధింపులతో మహిళా అధికారిణి తన కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన గురువారం తుమకూరులో చోటు చేసుకుంది. వివరాలు.. నగరంలోని సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో ఓ మహిళ అధికారిణిగా పని చేస్తోంది. ఏడాది కాలంగా జాయింట్ డైరెకర్ సుబ్రమణ్య లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సదరు మహిళా అధికారిణి గురువారం కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించింది. అయితే సహచర ఉద్యోగులు వెంటనే గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితురాలు జాయింట్ డైరెక్టర్‌పై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, నెల నెలా మాముళ్లు ఇవ్వాలని బెదరిస్తున్నాడని, సిబ్బంది ముందు దూషించేవాడని, ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికి రావాలని వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. జిల్లా కలెక్టర్ మోహన్‌రాజు, జిల్లా పంచాయతీ సీఈఓ శాంతారామ్, మహిళ,శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ నంజేగౌడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాధితురాలితో మాట్లాడి వివరాలు రాబట్టారు. అధికారి సుబ్రమణ్యం పైన కఠిన చర్యలను తిసుకుంటామని హామీ ఇచ్చారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
మునుగోడు: గత కొన్నేళ్లుగా ఉద్యోగం చేస్తున్న తమను అర్ధంతరంగా విధుల నుంచి తొలగించారని అధికారుల ఎదుట పురుగుల మందు తాగి ఇద్దరు మహిళా ఉద్యోగులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన మంగళవారం మునుగోడులో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, ఐసీడీఎస్ అధికారుల వివరాల ప్రకారం.. నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న కార్యకర్త మెరుగు మంజుల, ఆయా మేకల మంజులను సంబంధిత శాఖ అధికారులు సస్పెండ్ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ సస్పెండ్ లెటర్‌ను వారు పోస్టులో పంపితే తీసుకోకపోవడంతో సదరు ప్రాజెక్టు అధికారి తన కార్యాలయానికి పిలిపించి వారి చేతికి అందించారు. దానిని తీసుకున్న ఇరువురు తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా మూత తీసి ఆమె ఎదుటనే తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. అది గమనించిన సీడీపీఓతో పాటు, ఆ కార్యాలయంలోని ఉద్యోగులు వారిని అడ్డుకున్నారు. కానీ అప్పటికే ఆయా కొంత ఎక్కువ మొత్తంలో తాగి సొమ్మసిల్లి పడిపోగా, కార్యకర్త కూడా తాగింది. వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం 108లో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కట్నం వేధింపులకు బలైన నవవధువు
-
విషగుళికలు తీసుకున్న ముగ్గురు విద్యార్ధులు
-
ప్రేమను పెద్దలు అంగీకరించలేదని...
మహబూబ్‌నగర్: మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం జిల్లాలోని కోడేరు మండలం నర్సాయిపట్టి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన తెలుగు మద్దిలేటి (17) అదే గ్రామానికి చెందిన కుర్వ నాగమణి(17) అనే యువతీ, యువకులు గత రెండు సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. అయినా మైనారిటి తీరగానే వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత సోమవారం మద్దిలేటి, నాగమణిలు తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకునేందుకు ఊరు వదిలివెళ్లారు. దీంతో నాగమణి తండ్రి నారాయణ తన బిడ్డను మద్దిలేటి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని కోడేరు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. ఈవిషయాన్ని ఫోన్ ద్వారా మద్దిలేటికి గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో మనస్తాపం చెందిన ఇరువురు ప్రేమికులు గ్రామ సమీపంలో ఉన్న చిన్న బంగారయ్య మామిడి తోట వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. -
బీఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
నల్గొండ: జిల్లాలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీఫార్మసీ చదువుతున్న ఓ విద్యార్థి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హెచ్ వోడీ వేధింపులు తాళలేక అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా హెచ్‌వోడీ తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. అయినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. దాంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. గమనించిన తోటి విద్యార్థులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
సర్వే ఎఫెక్ట్: ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కరీంనగర్: తెలంగాణలో నిర్వహించిన సమగ్ర సర్వేలో తన పేరు నమోదు చేసుకోలేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లు తన పేరు నమోదు చేసుకోలేదని ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసినట్టు అధికారులు తెలిపారు. -
బరితెగిస్తున్న టీడీపీ నేతలు
-
డీఎస్పీ ఆఫీస్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
కర్నూలు: వీఆర్‌కు పంపడంపై మనస్తాపం చెందిన మహిళా హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలులోని డీఎస్పీ కార్యాలయంలోని చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లలితమ్మ పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కర్నూలులో పోలీస్ కానిస్టేబుళ్లను మూకుమ్మడిగా అధికారులు వీఆర్‌కు పంపడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
కలెక్టరేట్ నుంచి దూకిన ఉద్యోగ సంఘాల నేత
-
కలెక్టరేట్ నుంచి దూకిన ఉద్యోగ సంఘాల నేత
కాకినాడ: పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చటర్జీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన కాకినాడ కలెక్టరేట్ భవనం వద్ద చోటు చేసుకుంది. గత 10 నెలలుగా పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంపై చటర్జీ గత కొద్దికాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటూ కాకినాడ కలెక్టరేట్ భవనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కలెక్టరేట్ భవనంపై నుంచి దూకినట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన చటర్జీని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పది నెలల నుంచి జీతాలు రాకపోవడంతో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు(ఎంపీహెచ్ఏ) ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం నుంచి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం వద్ద బైఠాయించిన వీరు రాత్రి డీఎంహెచ్ఓ కార్యాలయ భవనంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ నిరసన తెలిపారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డి.చటర్జీ మాట్లాడుతూ మే 15 నాటికి జీతాలు చెల్లిస్తామని కలెక్టర్ నీతూ ప్రసాద్ గత నెల 17న తమకు హామీ ఇచ్చారని.. అయితే జీతాల కు సంబంధించిన బడ్జెట్ ఇంకా విడుదల కాలేదన్నారు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అవస్థలు పడుతున్నారని...సక్రమంగా జీతాలు రాకపోవడంతో గండేపల్లి పీహెచ్సీలో ఎంపీహెచ్‌ఏగా విధులు నిర్వహిస్తున్న జగన్ మురళి సుమారు 15 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులకు వెల్లడించారు. తమకు జీతాలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని, మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన చటర్జీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఉద్యోగులను విషాదంలోకి నెట్టింది.