ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కరీంనగర్: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్‌లోని గీతభవన్ సమీపంలో నివాసముంటున్న శ్యామ్ కొబ్బరిబోండాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో.. తన ఇద్దరు పిల్లలు శ్రీహర్షిత(9), హర్ష(7)లతో పాటు కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి తాగి ఆత్మహత్యాయత్నానాకి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. హర్ష పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.