karimnagar
-
కరీంనగర్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్
సాక్షి,కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా భావించే కరీంనగర్లో ఆ పార్టీకి తాజాగా బిగ్ షాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన కరీంనగర్ నగర మేయర్ సునీల్‌రావుతో పాటు 10 మంది కార్పొరేటర్లు కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. శనివారం(జనవరి25) కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో వీరంతా బీజేపీలో చేరనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఎన్నికలోనూ కరీంనగర్ ప్రజలు అండగా నిలబడ్డారు. ఉప ఎన్నికల్లోనూ పార్టీకి ఘన విజయాలు అందించారు.2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలిపించారు. అయితే తర్వాత ఏడాది 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ పడింది. ఇక్కడి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా బండి సంజయ్ ఘన విజయం సాధించి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లో పార్టీకి కీలక నేతగా ఉన్న సునీల్‌రావు బీజేపీలోకి వెళుతుండడం పార్టీ వర్గాలను కలవరపరుస్తోంది. -
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్
హైదరాబాద్, సాక్షి: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మంగళవారం ఉదయం ఆయనకు బెయిల్ లభించింది. రెండు కేసుల్లోనూ జడ్జి ఆయనకు బెయిల్ ఇచ్చారు. జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.ఆదివారం కరీంనగర్(Karimnagar) కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా.. కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్(Sanjay)ల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుని సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. రాత్రంతా ఆయన త్రీటౌన్ పోలీస్టేషన్లో ఉన్నారు. ఈ ఉదయం వైద్య పరీక్షల అనంతరం పాడి కౌశిక్‌రెడ్డిని (Padi kaushik Reddy) రెండో అదనపు అదనపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. రూ.10 వేలప్పున మూడు పూత్తులు ఇవ్వాలని ఆదేశిస్తూ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.వాదనలు ఇలా..రెండో అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ప్రేమ లత ముందు కరీంనగర్ పోలీసులు కౌశిక్‌ను హాజరు పర్చారు. కౌశిక్‌రెడ్డిపై గతంలోనూ పలు కేసులు ఉన్నందున రిమాండ్ విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అయితే.. కౌశిక్‌పై నమోదు అయిన సెక్షన్స్ అన్నీ బెయిలేబుల్ కాబట్టి రిమాండ్ రిజెక్ట్ చేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. ఈ క్రమంలో.. అర్ణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు(2014) తీర్పు ప్రకారం రిజెక్షన్ కోసం కోరింది. దీంతో బీఆర్ఎస్ లీగల్ టీం వాదనతో ఏకీభవించిన జడ్జి.. బెయిల్ మంజూరు చేశారు. ఇకముందు అలాంటి దూకుడు ప్రదర్శించొద్దని కౌశిక్‌ను హెచ్చరించిన మెజిస్ట్రేట్.. కోర్ట్ ప్రొసీజర్స్ ప్రకారం కరీంనగర్ లో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దనీ ఆదేశించారు.రేపు మాట్లాడతా: కౌశిక్ రెడ్డితెలంగాణా ప్రజలు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది హైడ్రామా. ఈ హైడ్రామాలో నాకు మద్దతు తెలిపిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు అందరికీ నా ధన్యవాదాలు. పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దనుకుంటున్నా. రేపు హైదరాబాద్ లో పూర్తి వివరాలు వెల్లడిస్తా. కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం ఏ రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి కూడా నిబంధనలు అడ్డువస్తున్నాయి అని మీడియాను ఉద్దేశించి అన్నారాయన. -
‘నన్ను నెట్టేస్తావా.. కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తే ఇంత అక్కసా?’
కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(kaushik reddy) తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నిన్న (ఆదివారం) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) లో కౌశిక్‌రెడ్డి తనను నెట్టివేశాడని సంజయ్ కుమార్(Sanjay Kumar)ఆరోపించారు. ‘ నిన్న జరిగింది అధికారిక సమావేశం. నన్ను కౌశిక్‌రెడ్డి నెట్టేశాడు. కౌశిక్‌రెడ్డి ఇలా చేయడం ఎంతవరకూ కరెక్ట్.నేను ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని దూషించలేదు. కౌశిక్‌రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఆయనపై కేసులున్నాయి. కౌశిక్‌రెడ్డికి బెదిరించడం అలవాటు,. వరంగల్‌లో బెదిరించి సెటిల్మెంట్ చేశాడు. స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశాను. స్పీకర్ దీనిపై చర్యలు తీసుకోవాలి. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను ఎవరూ హర్షించరు. నేను ప్రజా సమస్యలపై మాట్లాడుతామనుకుంటే నాకు ఆటంక కల్గించాడు. జగిత్యాల అభివృద్ధి కొరకే ప్రజలు నన్ను గెలిపించారు.. అభివృద్ధి చేయడం నా ధర్మం . కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తే ఇంత అక్కసు ఎందుకు? అని ప్రశ్నించారు సంజయ్.సమీక్షా సమావేశంలో తోపులాటఆదివారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది. జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్‌ను కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.కౌశిక్‌రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్‌కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. -
కౌశిక్‌రెడ్డిVsసంజయ్‌కుమార్: గంగుల కీలక వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్ జిల్లా: ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి,సంజయ్ కుమార్ వ్యవహారంలో కౌశిక్‌రెడ్డిని పోలీసులు లాక్కెళ్లడం విచారకరమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వచ్చారని, అక్కడికి మమ్మల్ని ఆహ్వానిస్తేనే వెళ్లామని తెలిపారు. ఎమ్మెల్యేల బాహాబాహీపై గంగుల సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘సమావేశం ఎజెండా క్లియర్‌గా ఉంది. ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యల్ని తీసుకెళ్లాలనుకున్నాం. మా డిమాండ్స్ సభ ముందు పెట్టాం. ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని వాటి కోసం ఫొటోలు దిగినవారంతా భ్రమలో ఉన్నారు. ఇళ్లపై క్లారిటీ ఇవ్వాలని కోరాం. దీనిపై సమాధానం రాలేదు.ఎమ్మెల్యేను లాక్కెల్లడం నేనెప్పుడూ చూడలేదు. ముగ్గురు మంత్రులు అనుమతిస్తేనే లాక్కెళ్లారా..? అనుమతిస్తే మీరు సభ నడపడంలో విఫలమైనట్టే. మీ ఆదేశాలు లేకుండా పోలీసులు స్టేజ్ ఎక్కారంటే మీరు క్షమాపణ చెప్పాలి. సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్ ఇరిటేట్ అయ్యాడు. కోపతాపాలు సర్వసాధారణమే అయితే వాటిని కంట్రోల్ చేయాలి.ఒక ఎమ్మెల్యేను గుంజుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతమందిపై మీరు కేసులు పెడతారు?అదేమైనా బలప్రదర్శన వేదికనా..? పోలీసు కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. కౌశిక్,సంజయ్ మధ్య ఏం జరిగిందనేది డిఫరెంట్, అది వ్యక్తిగతం. కానీ, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారనేది మా ప్రశ్న’అని గంగుల అన్నారు. -
ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డిల మధ్య తోపులాట
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది.జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్‌ను కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.కౌశిక్‌రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్‌కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. -
నిర్లక్ష్యంలో చాలా ‘స్మార్ట్’
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్మార్ట్‌సిటీ మిషన్ (ఎస్సీఎం) కింద చేపట్టిన పనులు పలు నగరాల్లో నత్తనడకన సాగుతున్నాయి. దేశంలోని 100 నగరాలను ఎస్సీఎం ద్వారా ‘సుందర నగరాలు’గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. పనులు పూర్తి చేసేందుకు లక్ష్యాలు నిర్దేశించుకున్నా.. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. వాస్తవానికి 2023 జూన్‌లోనే.. దేశంలోని వంద నగరాల్లో చేపట్టిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఇప్పటికి రెండు పర్యాయాలు స్మార్ట్‌సిటీ మిషన్ గడువు పొడిగించినా ఫలితం లేదు. పనుల తీరు చూస్తే 2025 మార్చి 31 నాటికైనా పూర్తవుతాయా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. తొమ్మిదేళ్లుగా సా..గుతున్న పనులు దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నగరాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. 2015 ఆగస్టు 27న స్మార్ట్‌సిటీ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. దేశంలోని 100 నగరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని పెంచడం దీని లక్ష్యం. మొదటి విడత 98 నగరాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఆ తర్వాత వరంగల్, కరీంనగర్‌ను కూడా స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చింది. సుమారు తొమ్మిదేళ్ల వ్యవధిలో వంద నగరాల కోసం 8,066 ప్రాజెక్టుల వర్క్ ఆర్డర్లను జారీ చేసి రూ.1,64,669 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేసింది. ఈ మేరకు 2024 నవంబర్ 28 వరకు 7,352 ప్రాజెక్టుల వర్క్ ఆర్డర్లపై రూ.1,47,366 కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయాన్ని భువనగరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి తోఖన్ సాహు వెల్లడించారు.ఇన్ని నిధులు ఖర్చయినా.. అన్ని ప్రాజెక్టులను 13 నగరాలు మాత్రమే పూర్తి చేశాయి. ఆ తర్వాత 48 నగరాల్లో 90 శాతం, 23 నగరాల్లో 75 శాతం పూర్తయ్యాయి. 16 నగరాల్లో స్మార్ట్‌సిటీ మిషన్ ప్రాజెక్టులు అసంపూర్తిగానే ఉండగా.. రూ.17,303 కోట్ల విలువైన 714 ప్రాజెక్టులు ఇంకా అమలు దశలోనే ఉన్నాయి. ఆ 13 నగరాలు భేష్.. నూరు శాతం స్మార్ట్‌సిటీ మిషన్‌లో చేపట్టి ప్రాజెక్టులు పూర్తి చేసిన నగరాల్లో గుజరాత్ రాష్ట్రంలో సూరత్, జార్ఘండ్‌లో రాంచీ, కర్ణాటకలో తుమకూరు, లక్ష్యదీప్‌లో కవరాట్టి, మధ్యప్రదేశ్‌లో జబల్పూర్, మహారాష్ట్రలో పుణె, రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్, తమిళనాడులో కోయంబత్తూర్, మధురై, సాలెం, ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా, బరేలీ ఉన్నాయి. 60 శాతంలోనే వరంగల్, కరీంనగర్.. గ్రేటర్ వరంగల్, కరీంనగర్ స్మార్ట్‌సిటీల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆ రెండు నగరాలకు కేటాయించిన నిధులు, ఖర్చయిన నిధులు, పూర్తయిన ప్రాజెక్టులను పరిశీలిస్తే.. ఇంకా 58 శాతంలోనే ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోగా.. తుది గడువైన 2025 మార్చి 31 నాటికి పూర్తవడం ప్రశ్నార్థకంగా ఉంది. 2017–18లో కరీంనగర్, గ్రేటర్ వరంగల్‌ను కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలుగా ప్రకటించిన తర్వాత.. ఆ రెండు నగరాల్లో రూ.1,879 కోట్లతో రహదారులు, నాలాలు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలను రూపొందించింది. క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి పురపాలకశాఖ అధికారులు ప్రతిపాదించగా.. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేసింది. స్మార్ట్‌సిటీలుగా ప్రకటించి ఆరేళ్లు దాటినా ఆ రెండు నగరాల్లో పనులు 60 శాతం దాటలేదు. నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు.. గ్రేటర్ వరంగల్‌లో రూ.179 కోట్లు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రూ.102 కోట్లు అందుబాటులో ఉన్నా పనులు చేయించడంలో అధికారులు అలసత్వం చేశారనే ఫిర్యాదులున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.. అందుకే గడువు పొడిగింపు.. ఉత్తరప్రదేశ్‌లోని 10 నగరాల్లో రూ.21,115.53 కోట్లతో 889 ప్రాజెక్టులు చేపట్టగా.. రూ.864.4 కోట్ల విలువైన 39 ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఏడు నగరాల్లో 788 ప్రాజెక్టుల కోసం రూ.15,078.54 కోట్లు అంచనా కాగా.. 748 ప్రాజెక్టులను రూ.14,192.23 కోట్లతో పూర్తి చేయగా, 40 ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. తెలంగాణలోని రెండు నగరాల్లో రూ.2,817.65 కోట్ల విలువైన 169 ప్రాజెక్టుల్లో 97 పూర్తి కాగా, రూ.794.74 కోట్ల విలువైన 72 ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. తమిళనాడులోని 11 నగరాల్లో రూ.17,983.63 కోట్ల విలువైన 733 ప్రాజెక్టుల్లో రూ.513.54 కోట్లతో చేపట్టిన 25 పూర్తి కావలసి ఉంది. రాజస్తాన్‌లోని అజ్మీర్, జైపూర్, కోట, ఉదయ్‌పూర్ నగరాల్లో రూ.8639.95 కోట్ల ఖర్చు కాగల 579 ప్రాజెక్టుల్లో 561 పూర్తి కాగా, రూ.324.73 కోట్లతో నడుస్తున్న 18 పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో 47, ఛత్తీస్‌గఢ్‌లో 41, హిమాచల్‌ప్రదేశ్‌లో 32, బిహార్‌లో 30, జమ్ముకశీ్మర్లో 30, మహారాష్ట్రలో 29, కేరళలో 27, కర్ణాటకలో 26, హరియాణాలో 26 ప్రాజెక్టులు.. మొత్తం 714 పెండింగ్‌లో ఉన్నాయి.స్మార్‌సిటీ మిషన్ వివరాలు.. స్మార్ట్‌సిటీ మిషన్ (ఎస్సీఎం)కు శ్రీకారం: 2015 ఆగస్టు 27 దేశంలో ఎంపిక చేసిన నగరాల సంఖ్య: 100 (మొదట 98 నగరాలు.. ఆ తర్వాత కరీంనగర్, వరంగల్) ఎస్సీఎం కింద విడుదలైన నిధులు: రూ.1,64,669 కోట్లు ప్రతిపాదన చేసిన ప్రాజెక్టులవర్క్ఆర్డర్లు: 8,066 నూరు శాతం ప్రాజెక్టులు పూర్తి చేసిన నగరాలు: 13 90 శాతంలో ఆగిన నగరాలు : 48 75 శాతం వరకు పూర్తి చేసినవి : 23 నత్తనడకన రూ.17,303 కోట్ల విలువైన 714 ప్రాజెక్టులుస్మార్ట్సిటీలతో ప్రయోజనాలు..» సమర్థవంతమైన పబ్లిక్ రవాణా వ్యవస్థ » వ్యర్థ నీటి రీసైక్లింగ్ » నీటి వృధాను అరికట్టే సెన్సార్స్, యాజమాన్యం, గ్రీన్ స్పేసెస్ » భౌతిక, సాంఘిక అవస్థాపనా సౌకర్యాల కల్పన » ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో ఉపాధి వస్తు, సేవల లభ్యత » ప్రజల జీవన ప్రమాణాల్లో పెరుగుదల » సహజ వనరుల సమర్థ వినియోగం » గవర్నెన్స్‌లో పౌరుల భాగస్వామ్యం » పర్యావరణ పరిరక్షణ–యాజమాన్యం » ‘స్మార్ట్’ పట్టణాభివృద్ధి సాధన..సుస్థిర వృద్ధి » గ్లోబల్ నెట్ వర్కింగ్ » సృజనాత్మక పరిశ్రమ » ఆధునిక సమాచార వ్యవస్థఅందుబాటులోకి » ఈ–అర్బన్ గవర్నెన్స్.. » పారిశ్రామికీకరణ » భద్రతా వ్యవస్థ ఆధునికీకరణ.. ఇలా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. -
ఉత్తర తెలంగాణకు మంచిరోజులెన్నడు?
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అభివృద్ధికి పుష్కల వనరులు ఉన్నా... పేదరికమూ, దారిద్య్రమూ తాండవిస్తూనే ఉన్నాయి. రైతన్నల ఆత్మ హత్యలు, నేతన్నల ఆకలిచావులు కొనసాగుతూనే ఉన్నాయి. యువత ఎడారి బాట పడుతుంటే... బీడీ కార్మికుల బతుకులు మసిబారుతున్నాయి. సామాజిక అణిచివేతలు సరేసరి! ఇలా ఎన్నో సమస్యలు. గతం గతః. నేడు కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఈసారైనా న్యాయం జరుగుతుందని ఆశతో ఈ ప్రాంతవాసులు ఉన్నారు.రాష్ట్రంలోనే ఓ మూలకు విసిరేయబడ్డ ట్లున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్నింటా వివక్షకు గురవుతోంది. ఆదర్శ జిల్లాగా చెప్పు కుంటున్న ఆదిలాబాద్ కేవలం అక్షర క్రమంలోనే ముందుండి, అభివృద్ధిలో మాత్రం ఏళ్లుగా వెనుక బాటుకు గురవుతోంది. ఉన్నంతలో కొంత మేరకు పైపై అభివృద్ధి ఛాయలు కనిపిస్తున్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలది మరో ప్రత్యేక స్థితి. కార్పొరేటీకరణ దుష్ఫలితంగా విద్య, వైద్యం పేదలకు ఎండ మావిగానే మిగులుతున్నాయి. ప్రపంచీకరణ పుణ్యమా అని అసంఘటిత, బీడీ కార్మికుల బతుకులు మరింత దుర్భర మవుతున్నాయి. మూడు జిల్లాల్లో కలిపి సుమారు 7–8 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. ఆకాశాన్నంటు తున్న ధరలు, అందని కనీస వేతనాలు, వెరసి వీరి బతుకులు మరింత దుర్భర స్థితిలోకి నెట్ట బడుతున్నాయి.ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) మొత్తం జనా భాలో 18 శాతం మంది గిరిపుత్రులున్నారు. 78 ఏళ్ల స్వతంత్ర చరిత్రలోనూ వీరివి చీకటి బతుకులే. జ్వరమొచ్చినా. జలుబు చేసినా వందల్లో జనం రాలిపోవాల్సిందే. ఈ మూడు జిల్లాల్లోనూ పుష్కల వనరులున్నా వాటి సద్వినియోగం లేక లక్షల మంది యువత ఉపాధి కోసం ఎడారి బాట పడుతున్నారు. ప్రణాళికా బద్ధంగా వినియోగించుకుంటే పక్క రాష్ట్రాలకు అప్పిచ్చేంత నీటి వనరులున్నాయి. అయినా ఖరీఫ్ ప్రారంభంలో రైతులు కారుమబ్బుల నుండి జాలువారే చినుకు కోసం ఆకాశానికేసి ఎదురు చూడాల్సిందే. గోదావరి వంటి జీవ నదులు, సిరులు పండించే సారవంతమైన నల్లరేగడి నేలలు, విస్తారమైన అటవీ సంపద. సిరులు కురిపించే సింగరేణి బొగ్గు గనులు, (Sigareni Coal Mines) విస్తారమైన ఖనిజ సంపద ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఇలా ఎన్ని ఉన్నా వనరులను ఉత్తర తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేక పోతోంది.నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతూ... అభివృద్ధికి నోచుకోని ఉత్తర తెలంగాణ జిల్లాలపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఇక్కడి దుర్భిక్ష పరిస్థి తుల్ని పారదోలేందుకు ‘జలయజ్ఞం’ ద్వారా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి బాటలు వేసిన మహానేత ఆయన. అయితే గడిచిన దశాబ్ద కాలంలో ఏ ఒక్క కొత్త పరిశ్రమ స్థాపించకపోగా ఉన్న పరిశ్రమలనేకం ఉత్తర తెలంగాణలో మూసి వేతకు గురయ్యాయి. ఆదిలాబాద్‌లో సీసీఐ మూసివేతతో 2,500 మంది, స్పిన్నింగు మిల్లు ప్రైవేటీకరణతో 750 మంది, నిర్మల్ ప్రాంతంలో నటరాజ్ స్పిన్నింగ్ మిల్లుల మూతతో 2,000 మంది, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ (Bodhan Sugar Factory) మూసివేతతో 2,500 మంది, కరీంనగర్లో ఎరువుల కర్మాగారం మూతతో 2,500 మంది ఉపాధికి దూరమయ్యారు. ఇవి మచ్చుకు మాత్రమే. ఈ పరి స్థితుల్లో యువతకు గల్ఫ్ బాట తప్పడం లేదు. ఫలితంగా వేలాది కుటుంబాల్లో గల్ఫ్ గాయం మిగులుతోంది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వైఎస్సార్ ‘సమ వికేంద్రీకరణ’ సిద్ధాంతం బదులు ‘అపసవ్య కేంద్రీకరణ’పై దృష్టి పెట్టడంతో ప్రాంతాల మధ్య అసమాన తలు మళ్లీ మొదలవుతున్నాయి.చదవండి: చెప్పిన గొప్పలు ఏమయ్యాయి?ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో సింగరేణి బొగ్గుగనులతో పాటు విస్తారంగా మాంగనీసు, ఇనుప ధాతువూ ఉంది. నిజామాబాద్ జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో పసు పుతో పాటు ప్రత్యేక పంటగా ఎర్రజొన్న సాగ వుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు స్థాపించాలి. ఆదిలాబాద్‌లో అటవీ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. కరీంనగర్, నిజామాబాద్‌లలో గ్రానైట్ గనులున్నాయి. కరీంనగర్, వరంగల్ జిల్లాల సరిహద్దులో భీమదేవరపల్లి మండలంలో ఇనుపరాతి గుట్టలున్నాయి. కావున ఇక్కడ ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి పూను కోవాలి. మంథని కేంద్రంగా మైనింగ్ యూని వర్సిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. స్థానికులకే ఇక్కడ పనులు కల్పించాలి. ఈ ప్రాంతం నుండి ఎన్నుకోబడిన ప్రతి నేతా న్యాయంగా మనకు రావాల్సిన నిధుల కోసం చట్టసభల్లో గొంతు విప్పాలి.- డాక్టర్ బి. కేశవులు నార్త్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఫౌండర్ – చైర్మన్ -
ప్రేమంటూ వేధింపులు.. యువతి బలవన్మరణం
హుజూరాబాద్: ప్రేమ పేరుతో ఓ యువకుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ జిల్లా హు జూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో సోమవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హుజూరాబాద్ మండలం ఇప్పలనర్సింగాపూర్‌కు చెందిన కిల్లి కుమారస్వామి, వసంత కూతురు వరుణ్‌ప్రియ (18) హన్మకొండలోని మహిళా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెను అదే గ్రామానికి చెందిన అజయ్ (19) మూడేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన వరుణప్రియ తల్లిదండ్రులు అజయ్‌ను మందలించినా.. అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కుమారస్వామి కూతురు వరుణ్ప్రియను.. ఆమె అమ్మమ్మ ఇల్లున్న పెద్దపాపయ్యపల్లిలో వదిలిపెట్టి వచ్చాడు. ఇంట్లో అందరూ వ్యవసాయ పనులకు వెళ్లారు. వారు వచ్చి చూసేసరికే వరుణ్‌ప్రియ ఇంట్లో ఉరేసుకుని కనిపించింది. అజయ్ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హుజూరాబాద్ సీఐ తిరుమల్‌గౌడ్ తెలిపారు. -
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం
-
దమ్ముంటే రా!.. ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలే చెబుతారు: కేటీఆర్
సాక్షి, కరీంనగర్: తెలంగాణకు పునఃర్జన్మనిచ్చింది కరీంనగర్ అని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి జన్మస్థలం కరీంనగర్ అని, ఆనాడు 370 మంది అమరుల సాక్షిగా మొదటిసారిగా 11 సీట్లు బీఆర్ఎస్కు వచ్చాయని తెలిపారు. కరీంనగర్‌లోని అల్గునూర్‌లో దీక్షా దీవస్ సభలో శుక్రవారం కేటీఆర్ మాట్లాడుతూ.. 1956 నుంచి 1968వరకు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందని తెలిపారు. తొలిదశ ఉద్యమంలో 370 మంది బలిదానం అయ్యారని.. 1971 నుంచి 30 ఏళ్ళ పాటు మేధావులు ఉద్యమకారులు ఎదురు చూశారని చెప్పారు. అప్పుడే కలిసివచ్చే కాలానికి నడిచి వచ్చిన కేసీఆర్.. కరీంనగర్ సింహగర్జనతో ఉద్యమబాట పట్టాడని పేర్కొన్నారు. పదవులు త్యాగం చేసి 2001లో టీఆర్ఎస్ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని రగిల్చారని.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారని తెలిపారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. 2001 నుంచి 2014 వరకు ప్రజా ఉద్యమం సాగించారని చెప్పారు.‘ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంతో విధిలేని పరిస్థితుల్లో అనాడు కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చింది. రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్, తెలంగాణ ప్రజలకు దక్కుతుంది. సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ అడుక్కునే పరిస్థితి అంటున్నారు నేడు గద్ధెనెక్కినవారు. వారు కేసీఆర్ కాలి గోరుకు సరిపోరు. ఎక్కడికైనా పోదాం.. ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలు చెబుతారు. దమ్ముంటే రా... పోదాం ఎక్కడికైనా. ఏదో సాధించినట్లు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు లేకుండా పోతే వీపు చింతపండు చేసే పరిస్థితి ఉంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
నాటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసేందుకే దీక్షాదివస్: గంగుల
సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి గుర్తు చేసేందుకే దీక్షాదివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. రేపటి దీక్షాదివస్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని గంగుల కామెంట్స్ చేశారు.రేపటి దీక్షాదివస్ కోసం కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం అల్గునూరులో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గంగుల మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి గుర్తు చేసేందుకే దీక్షాదివస్ ని నిర్వహిస్తున్నాం. బీఅర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్న కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలగాలి.తెలంగాణ అంటేనే సెంటిమెంట్.. ఆ సెంటిమెంట్ ను ఎందుకు మర్చిపోతాం?. రేపటి దీక్షాదివస్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. తెలంగాణ తరహా మలిదశ ఉద్యమానికి మరోసారి శ్రీకారం చుట్టబోతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
సార్.. ఈ అన్నం మాకొద్దు
కరీంనగర్/జగిత్యాలటౌన్: మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామంటూ రెండుచోట్ల విద్యార్థులు ఆందోళనకు దిగా రు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పురాతన పాఠశాల వి ద్యార్థులు రోడ్డెక్కగా, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరెపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి చేరుకొని కలెక్టర్ సత్యప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌లోని పురాతన పా ఠశాలలో 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సో మవారం 217 మంది పాఠశాలకు హాజరయ్యారు. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న ఈ పాఠశాలలో వారంరోజులుగా ఉడికీఉడకని అన్నం పెడుతున్నారని, అడుగు భాగం మెత్తగా, ముద్దగా మారి మాడిపోతోందని, ఆ అన్నం ఎలా తినేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అరగంట పాటు ఆందోళన చేసినా ఉన్నతాధికారులెవరూ పాఠశాలకు రాలేదు. దీంతో విద్యార్థులు అన్నం తినకుండానే పడేశారు. ఆరెపల్లి పాఠశాలలో వంట మనిషిని మార్చాలని కోరుతూ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని, రుచిలేని అన్నం వడ్డిస్తున్నారని, ప్రశ్నిస్తే ఇష్టమున్నచోట చెప్పుకోమంటూ వంట మనుషులు బెదిరిస్తున్నారని ప్రజావాణిలో గోడు వెళ్లబోసుకున్నారు. నాలుగు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ప్రజావాణి ఆడిటోరియంలోకి వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు. వంటమనిíÙని తొలగించి సరైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని నిరసన విరమింపజేశారు. -
కృంగి‘పోతున్న’ పండుటాకులు: చట్టం ఉందిగా అండగా!
కనిపెంచిన బిడ్డల్ని,కంటికి రెప్పలా కాపాడి, ఎన్నో కష్టాలకోర్చి వారిని పెంచి ప్రయోజకుల్ని చేస్తారు తల్లిదండ్రులు. కానీ రెక్కలు వచ్చిన బిడ్డలు కన్నతండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఆస్తుల కోసం వేధింపులకు పాల్పడుతున్నారు. హృదయాల్ని కదిలించే ఇలాంటి ఉదంతాలపై స్పెషల్ స్టోరీ..వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొందరు కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు.. ఆస్తుల కోసం వేధింపులకు గురిచేయడం, తిండి పెట్టకపోవడం, చేయి చేసుకోవడం, చివరకు చంపేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు కృంగిపోయేలా చేస్తున్నాయి.. రెక్కలు ముక్కలు చేసుకొని, పిల్లలను పెంచి, ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టకుండా మనోవేదనకు గురి చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ఇంకొందరు కలెక్టరేట్లలో ప్రజావాణిని, ఠాణాల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వృద్ధుల మిస్సింగ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.ఈమె పేరు గుర్రాల అంతమ్మ. మానకొండూరు మండలం కొండపల్కల. 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా కొడుకు లక్ష్మారెడ్డి మాయమాటలు చెప్పి, ఏడెకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 2022లో తన భర్త మల్లారెడ్డి మరణించడంతో కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అంతమ్మ వాపోయింది. కూతురు వద్ద తలదాచుకుంటున్నానని కన్నీటిపర్యంతమైంది. మిగిలిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కుమారుడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది.ఈ చిత్రంలో కనిపిస్తున్నది చొప్పదండికి చెందిన ముత్యాల గోపాల్‌రెడ్డి, ఆయన భార్య. వీరికి ఇద్దరు కుమారులు రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 20 ఎకరాల వ్యవసాయ భూమితో దర్జాగా బతికేవారు. పిల్లలను చదివించి, ప్రయోజకులను చేశారు. తీరా కుమారులు మాయమాటలు చెప్పి, భూమిని తమ పేరిట పట్టా చేసుకున్నారు. తర్వాత ఇంట్లో నుంచి గెంటేశారని, ఈ వయసులో తమకు ఇదేం దుస్థితి అంటూ ఆ దంపతులు కంటతడి పెడుతున్నారు.జగిత్యాల మున్సిపాలిటీలోని ఓ వార్డుకు చెందిన ఒక వృద్ధుడు కొడుకు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మానసికంగా కృంగిపోయాడు. ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని, విచారణ చేపడుతున్నారు.సిరిసిల్లకు చెందిన ఓ వృద్ధుడు కుమారుడు ఆస్తి రాయించుకొని, తర్వాత పట్టించుకోకపోవడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్నాడని హెల్ప్ లైన్–14567కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. అధికారులు తొలుత కౌన్సెలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఆర్డీవో ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ తండ్రికి, కుమారుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టంలోని నిబంధనలు, విధించే శిక్షల గురించి వివరించారు. తర్వాత కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది.సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో ఆస్తి వివాదం కారణంగా కొడుకు సింగరేణి రిటైర్డ్ కార్మికుడైన తన తండ్రి మధునయ్యను తోసేశాడు. అతను కిందపడి, మృతిచెందాడు.చట్టాలున్నాయి.. న్యాయం పొందొచ్చుపండుటాకులకు సొంత బిడ్డల నుంచే వేధింపులు, నిరాదరణ ఎదురవుతుండటంతో కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల రక్షణ, పోషణ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో ఒక నియమావళి రూపొందించింది. 2019లో కేంద్రం వృద్ధుల సంక్షేమం మరింత మెరుగ్గా ఉండటానికి చట్టానికి సవరణలు చేసింది. వాటి ప్రకారం ప్రతీ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటైంది. దానికి ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ స్థాయి అధికారి చైర్మన్‌గా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. బాధిత వృద్ధులకు ఉచితంగా వారి బిడ్డల నుంచి రక్షణ, పోషణ కల్పిస్తారు. బాధితులకు ఈ తీర్పు నచ్చకపోతే కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటయ్యే అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను 60 రోజుల్లో ఆశ్రయించి, అంతిమ న్యాయం పొందొచ్చు. ఆస్తిని తిరిగి పొందే హక్కునిరాదరణకు గురైనప్పుడు తమ బిడ్డలకు రాసిచ్చిన ఆస్తిని వృద్ధులు బేషరతుగా తిరిగి పొందే హక్కును చట్టంలో చేర్చారు. కేవలం గిఫ్ట్ డీడ్ చేసిన ఆస్తి మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని సైతం తిరిగి పొందొచ్చు. ప్రతీ నెల మెయింటెనెన్స్ రూ.10 వేల వరకు ఇప్పిస్తారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడికి కలెక్టర్ ఇలాగే న్యాయం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించిన ఇటువంటి చట్టాలపై వృద్ధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కుమారులు నిర్లక్ష్యం చేస్తే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 14567 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా నేరుగా ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవచ్చు. కౌన్సెలింగ్ ఇచ్చి, పోషణ కింద ఆర్థికసాయం అందే ఏర్పాటు చేసి, పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తారు.వేధిస్తే కఠిన చర్యలు వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. వాటిపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. ఎవరి నుంచి ఏ విధమైన వేధింపులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమాచారం కోసమైనా హెల్ప్‌లైన్ నంబర్లో సంప్రదించవచ్చు. వృద్ధులను వారి సంతానం ప్రేమతో చూడాలి. వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.– శ్రీనివాస్, సీపీ రామగుండం -
కేసీఆర్‌ను ఓడించినా మార్పు రాలేదు : రేవంత్
సాక్షి, కరీంనగర్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఓడించినా మార్పు రాలేదని అని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. వేములవాడలో కాంగ్రెస్ ప్రజా విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.కేసీఆర్‌ను చిత్తుగా ఓడించిన మార్పు రాలేదుబీఆర్ఆఎస్ నేతలకు మైండ్ దొబ్బిందిపదేళ్లలో రుణమాఫీ చేసుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదుకేసీఆర్ అసెంబ్లీ కి రా..రుణమాఫీ లెక్కలు మేము చెప్తాంరాష్ట్రాన్ని రూ.7లక్షల కోట్ల అప్పుల ఊబిలో కేసీఆర్ నెట్టారుకేసీఆర్ గడీలను కూల్చివేసేందుకే పాదయాత్ర చేశా10 ఏళ్లలో కేసీఆర్ చేయలేని పనులన్నీ చేసి చూపిస్తున్నాంమిడ్ మానేరు నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించాలి10ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాజన్న దేవాలయాన్ని ఎందుకు పట్టించుకోలేదుకాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే.. దాన్ని నిలిబెట్టుకునేందుకు ఎంతదూరమైనా వెళ్తుందితెలంగాణలో ప్రాజెక్ట్‌లను కట్టింది కాంగ్రెస్సే.. ఇప్పుడున్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేది కాంగ్రెస్సే బీఆర్ఎస్,బీజేపీ నేతలు పనిచేసి ఉంటే ప్రాజెక్ట్‌లు ఎందుకు మిగిలిపోయాయి కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు నాయకత్వం వహించిందిఇదే కరీంనగర్ గడ్డపై తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని సోనియా గాంధీ ఆనాడు మాట ఇచ్చారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ఇచ్చారుబండి సంజయ్ రెండుసార్లు కరీంనగర్ ఎంపీ అయ్యారు. ఏమైనా అభివృద్ది చేశారా?కరీంనగర్ జిల్లా గురించి బండి సంజయ్ పార్లమెంట్లో ఎప్పుడైనా మాట్లాడారు కేంద్రం నుంచి బీజేపీ నేతలు ఏమైనా నిధులు తెచ్చారుకరీంనగర్ ఎమ్మెల్యేని కలవాలనంటే జర్మనీ వెళ్లాల్సి వచ్చేదిస్వతంత్య్ర భారతంలో కొండంగల్ నుంచి ఎవరూ మంత్రి కాలేదుమా ప్రాంతం నష్టపోయింది.. అందుకే అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నామా ప్రాంత నిరుద్యోగులకు ఉధ్యోగాలు రావాలని ఫార్మా విలేజ్ తెస్తే ..అధికారులపై దాడులు చేశారుకేటీఆర్, హరీష్ రావు బాషను కేసీఆర్ సమర్దిస్తున్నారా..?పరిశ్రమలు పెట్టొద్దా కేసీఆర్కాళేశ్వరం కింద భూములు బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించలేదా అభివృద్ధి జరగాలంటే భూ సేకరణ జరగాల్సిందేభూమి కోల్పోయిన రైతుకు మేలు జరిగేలా ప్రభుత్వం ఆలోచిస్తుంది -
మహిళ ప్రాణాలు కాపాడిన మంత్రి బండి సంజయ్
కరీంనగర్, సాక్షి: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మానకొండూరు మండలం కెల్లడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద ఇరుక్కుపోయింది. కేకలు వేయడంతో హుజూరాబాద్ సమీపంలోని సింగాపూర్ శివారులో కొద్దిదూరం వెళ్లాక డ్రైవర్ లారీని ఆపాడు.ఈ క్రమంలో ములుగు వెళుతూ ఘటనా స్థలం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగారు. లారీ కింద చిక్కుకుని రక్తమోడుతున్న దివ్యశ్రీని బండి సంజయ్ కాపాడారు. అటువైపు వెళుతున్న లారీలను ఆపి జాకీలు, కత్తెర తెప్పించారు. కేంద్ర మంత్రి సూచనతో జుట్టు కత్తిరించి ఆమె మహిళ ప్రాణాలను స్థానికులు కాపాడారు. అనంతరం ఆ మహిళను చూసిన ఆమె పిల్లలు భోరున విలపించారు. గాయాలపాలైన మహిళను కరీంనగర్‌లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆసుపత్రికి బండి సంజయ్ పంపించారు. దివ్యశ్రీ చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని ఆసుపత్రి వైద్యులకు మంత్రి సంజయ్ తెలిపారు. -
కరీంనగర్ రాయితో నూతన హైకోర్టు నిర్మాణం
కరీంనగర్ క్రైం: రాష్ట్ర నూతన హైకోర్టు నిర్మాణంలో కరీంనగర్ నుంచి తెప్పించిన బండను వాడుతున్నామని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొప్ప చరిత్ర కలదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తెలిపారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో నిర్మించనున్న 12 నూతన కోర్టు భవనాల సముదాయానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. అలాగే సీతారాంపూర్ రోడ్డు లో జడ్జీల నూతన నివాస భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ జిల్లాలోని వివిధ కో ర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించాలన్నారు. అందుకు న్యాయవాదులు సహకరించాలని సూచించారు. కేసుల విచారణలో అనవసర వాయిదాల ను నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కోర్టు పరిపాలనా జడ్జిగా వ్యవహరిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్‌తోపాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వినోద్‌కుమార్, జస్టిస్ విజయసేన్‌రెడ్డి, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ శ్రీనివాసరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణకుమార్ మాట్లాడారు. అనంతరం కరీంనగర్ జిల్లాకు చెందిన హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ పి.నవీన్రావుతోపాటు వృత్తిలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ న్యాయవాదులు పి.గోపాలకృష్ణ, కె.మాధవరావు, జి.నారాయణరెడ్డి, వి.వెంకటేశ్వరరావు, జి.హనుమంతరావును చీఫ్ జస్టిస్ సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్‌రెడ్డి, న్యాయమూర్తులు, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ ఆర్డీవో మహేశ్వర్, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యే ముందు చీఫ్ జస్టిస్ సహా ఇతర న్యాయమూర్తులంతా మంకమ్మతోటలోని జస్టిస్ ఈవీ వేణుగోపాల్ నివాసంలో తేనీటి విందుకు హాజరయ్యారు. -
కౌశిక్‌రెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కరీంనగర్,సాక్షి: కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దళితబంధు కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధర్నా చేపట్టారు. కౌశిక్‌రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెండోవిడత దళితబంధు ఇవ్వాలంటూ దరఖాస్తుదారులతో కలిసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగారు. దరఖాస్తుదారులతో కలిసి ధర్నా కోసం అంబేద్కర్ చౌక్ కు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, దరఖాస్తుదారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ధర్నాకు దిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హుజూరాబాద్ అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా ఉద్రిక్తంగా మారింది. -
వీడియో కాల్ కలకలం.. అర్థరాత్రి ఎమ్మెల్యేకు నగ్నంగా ఫోన్ కాల్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరస్తులు ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి పొలిటీషియన్ వరకు ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూ డబ్బులు కాజేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఇటీవలి కాలంలో వాట్సాప్‌లో నగ్న వీడియో కాల్స్ చేసి కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని ఓ ఎమ్మెల్యే సైతం ఇదే పరిస్థితి ఏర్పడింది.వివరాల ప్రకారం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తర్వాత సదరు ఎమ్మెల్యేకు వీడియో కాల్ వచ్చింది. గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ రావడంతో ఎవరో అనుకుని.. వీడియో కాల్‌ను ఎమ్మెల్యే ఆన్సర్ చేశారు. దీంతో ఫోన్ స్క్రీన్‌పై ఓ మహిళ నగ్నంగా కనిపించింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే కాల్‌ను కట్ చేశారు.ఈ క్రమంలో వీడియో కాల్ నుంచి తేరుకున్న ఎమ్మెల్యే.. నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే గురువారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ)లో కూడా ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్‌నంబర్ ఎవరిదని కనుక్కునే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.అయితే, తనపై కుట్ర పన్నేందుకు ఎవరైనా అలా వీడియోకాల్ చేశారా? లేక నిజంగానే గుర్తుతెలియని వ్యక్తులే చేసి ఉంటారా? అనే అనుమానం ఎమ్మెల్యేకు కలిగింది. తన ప్రతిష్ఠను దిగజార్చడంతోపాటు బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంతో ఎవరైనా ఈ పనికి పాల్పడి ఉంటారనే సందేహంతో ఆయన వెంటనే నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే గురువారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ)లో సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్‌నంబర్ ఎవరిదని కనుక్కునే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
కళ్లెదుటే కన్నకొడుకు సజీవ దహనం.. పాపం ఆ తల్లి..
మానకొండూర్: ఆరేళ్ల బాలుడు మిట్టమధ్యాహ్నం ఇంట్లో గాఢనిద్రలో ఉన్నాడు.. హఠాత్తుగా శరీరానికి వేడి తాకింది. నిద్రలోంచి తేరుకున్న ఆ చిన్నారి చుట్టూ మంటలు.. అమ్మా.. అమ్మా.. అంటూ హాహాకారాలు చేస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు మరోగదిలోకి పారిపోయాడు. ఇంటి ఆవరణలో కొంత దూరంలో ఉన్న తల్లి మంటలను గమనించింది. కొడుకును కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఊపిరాడక ఆ చిన్నారి ప్రాణాలు వదిలాడు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ విషాదంపై స్థానికులు తెలిపిన వివరాలివి.ఈదులగట్టెపల్లి గ్రామానికి చెందిన అగ్గిడి రాజు, అనిత దంపతులకు రితిక, కొడుకు సాయికుమార్ (6) సంతానం. సాయికుమార్ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. రాజు ఆటో డ్రైవర్, అనిత కూరగాయలు అమ్ముతుంది. దీంతోపాటు సీజన్లో టార్పాలిన్లు (పరదాలు) కిరాయికి ఇస్తూ ఉపాధి పొందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో కూలర్ వేసుకుని సాయికుమార్ నిద్రిస్తున్నాడు. అనిత, రితిక ఇంటికి కొంతదూరంలో చెట్టు కింద కూర్చుకున్నారు. విద్యుదాఘాతంతో ఇంటి ఎదుట పందిరికి మంటలు అంటుకుని ఇంట్లోని టార్పాలిన్లకు వ్యాపించాయి.నిద్రలో ఉన్న సాయికుమార్ గమనించి ‘అమ్మా.. అమ్మా.. మంటలు’అంటూ ఏడుస్తూ అరిచాడు. గమనించిన తల్లి అనిత ఇంటి వద్దకు పరుగు తీసింది. అప్పటికే మంటలు ఎగిసిపడుతున్నాయి. కొడుకును కాపాడుకునేందుకు తల్లి చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ క్రమంలో ఆమెకూ గాయాలయ్యాయి. మంటలు మరింత వ్యాపించడంతో బాలుడు తన ప్రాణాలు కాపాడుకునేందుకు.. ఇంట్లోని మరోగదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. చదవండి: ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్యస్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి అగ్నిమాపక శకటం చేరుకుని, మంటలార్పగా.. అప్పటికే మంటల వేడి తాళలేక, పొగతో ఊపిరి ఆడక బాలుడు మృతి చెందాడు. ఇంట్లోని సామగ్రి కాలిబూడిదైంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్లెదుటే మంటల్లో కాలిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మానకొండూర్ ఇన్చార్జి సీఐ స్వామి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
తెలంగాణలో కొత్త లైన్, ఉప్పల్ స్టేషన్.. రైల్వే మంత్రికి బండి సంజయ్ లేఖ
సాక్షి, ఢిల్లీ: కరీంనగర్–హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తి నివేదిక (డీపీఆర్) సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్..రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి బండి సంజయ్ లేఖ ఇచ్చారు.ఈ సందర్భంగా బండి సంజయ్ లేఖలో..‘కరీంనగర్ నుండి హసన్‌పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లైన్‌కు రూ.1415 కోట్లు వ్యయం అవుతుంది. ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు. రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్‌లో ఉందని, తక్షణమే ఆమోదం తెలపాలని కోరారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, కరీంనగర్–వరంగల్ మధ్య వాణిజ్య కనెక్టివిటీ పెరిగి ఆర్దిక వృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్‌ను అప్ గ్రేడ్ చేయాలని, జమ్మికుంట స్టేషన్ వద్ద దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో లేఖ అందజేశారు. ఉప్పల్ స్టేషన్ అప్ గ్రేడ్‌లో భాగంగా ప్లాట్ ఫాం, రైల్వే స్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలని, కొత్త రైల్వే సేవలను ప్రవేశపెట్టాలని కోరారు. ప్రయాణీకుల రాకపోకలకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపర్చాలని, పార్కింగ్‌ను విస్తరించాలన్నారు. అలాగే, సోలార్ ప్యానల్స్‌ను కూడా అమర్చాలని, టిక్కెట్ కౌంటర్, లగేజీ నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చాలని లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో మేలు కలిగించే ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: ఎందుకీ హైడ్రామాలు.. బండి సంజయ్ ఫైర్ -
‘లింగ’మార్పిడి చేసి చంపారు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీకే) నుంచి జారీ అయిన దొంగ సర్టిఫికెట్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిక్షేపంగా.. గుండ్రాయిలా ఉన్న వ్యక్తి పేరిట డెత్ సర్టిఫికెట్ జారీ అయిన తతంగం బల్దియాలో భూకంపం పుట్టిస్తోంది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇందులో తమ డిపార్ట్మెంట్ ప్రమేయం కూడా ఉందని గుర్తించడం గమనార్హం. సంచలనం సృష్టించిన ఈ కేసులో బల్దియా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుండగాæ.. ఓ పోలీసు అధికారి పాత్రపైనా దర్యాప్తు ముమ్మురంగా సాగుతోంది. ఈ సర్టిఫికెట్ జారీ అయిన విధానాన్ని బట్టి చూస్తే నేర పరిశోధనలో అనుభవం ఉన్నవారే ఇది చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తానికి ఓ పోలీసు అధికారి, బల్దియా ఉద్యోగులు పథకం ప్రకారం ఈ పని చేశారని పోలీసులు అంచనాకు వచ్చారు.తొలుత స్త్రీగా చూపి.. తొలుత సునీల్ ఖీర్ పేరిట మిస్సింగ్ కేసులేమైనా నమోదయ్యాయా లేదా అని పోలీసులు రికార్డులు తనిఖీ చేశారు. లేవని తెలిశాక బల్దియాలోనే తప్పు జరిగిందన్న నిర్ధారణకు వచ్చారు. బతికి ఉన్న వ్యక్తిపై డెత్ సర్టిఫికెట్ జారీ అవడంపై బల్దియా ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా దృష్టి సారించారు. 12 ఏళ్ల క్రితం కేసు కావడంతో అప్పటి ఫైళ్ల బూజు దులిపి మరీ అధికారులు పరిశీలిస్తున్నారు. వాస్తవానికి 2012 జనవరి 29న సునీల్ ఖీర్ తల్లి మహాభిరీ మరణించింది. వారి బంధువుల్లోని ఓ పోలీసు అధికారి డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడే ఆయన తన తెలివితేటలు ప్రదర్శించారు. చనిపోయిన మహాభిరీ పేరును సునీల్ ఖీర్గా నమోదు చేయించారు. మరణించిన విషయమై బల్దియా సిబ్బంది వాల్మీకి నగర్‌లోని మహాభిరీ ఇంటికి వెళ్లి, వాకబు చేశారు. ఆ సమయంలో చనిపోయిన వృద్ధురాలి పేరు సునీల్ ఖీర్ అని కొందరు నమ్మబలికారని బల్దియా అధికారులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు మరణించిన మహాభిరీ ఆధార్‌కార్డును సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అందులో మహాభిరీతో పేరుతోనే ఉండటం గమనార్హం. అదే సమయంలో ఆమెకు రెండు పేర్లు కూడా లేవని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.జారీ సమయంలో పురుషుడిగా..విచారణ ముగిసిన తరువాత సర్టిఫికెట్ జారీ సమయంలో సునీల్ ఖీర్‌ను పురుషుడిగా పేర్కొనడం ఇష్యూ అయింది. ఇక్కడే బల్దియా అధికారుల నిర్లక్ష్యాన్ని పోలీసులు గుర్తించారు. వాస్తవానికి మరణించిన వ్యక్తి మహిళ అయినా, ఆమె పేరు సునీల్ ఖీర్ అయినా పొరపాటు పడ్డారని అనుకునేవారు. కానీ, సర్టిఫికెట్‌పై ఆకస్మికంగా పురుషుడిగా లింగమార్పిడి చేసి, జారీ చేయడాన్ని మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇది పొరపాటు కాదని, అసలు ఆ సమయంలో విచారణ సరిగా జరగలేదంటున్నారు. పథకం ప్రకారం.. పేరు, లింగం మార్చి బతికి ఉన్న మనిషిని డెత్ సర్టిఫికెట్‌పై చంపిన వ్యవహారంలో దరఖాస్తుదారుడితోపాటు బల్దియా ఉద్యోగులు కుమ్మక్కయ్యారని దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.సోదరుడి మృతిపైనా అనుమానాలు..2012లో జనవరిలో మరణించిన తన తల్లి పేరిట జారీ కావాల్సిన డెత్ సర్టిఫికెట్ తన పేరిట రావడంపై బాధితుడు సునీల్ కొత్త సందేహాలు లేవనెత్తుతున్నాడు. 2016లో తన మరో సోదరుడు సంజయ్ ఖీర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని, ఇప్పుడు అసలు అది రోడ్డు ప్రమాదమా లేక పథకం ప్రకారం హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని ‘సాక్షి’కి తెలిపాడు. తామిద్దరం అడ్డు లేకపోతే ఎవరికి లాభం కలుగుతుందో వారే ఈ పని చేశారని, పోలీసులు ఈ డెత్ సర్టిఫికెట్‌తోపాటు తన తమ్ముడి ఆకస్మిక మరణంపైనా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.లింగమార్పిడి కొత్తేమీ కాదు..కరీంనగర్ బల్దియాలో లింగమార్పిడి కొత్తేమీ కాదు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. రెండేళ్ల కింద పలువురు లబ్ధిదారుల పేరిట జారీ అయిన పింఛన్ల విషయంలోనూ పురుషులను స్త్రీలుగా, స్త్రీలను పురుషులుగా పేర్కొంటూ జారీ చేసిన రికార్డు కరీంనగర్ బల్దియాకు ఉంది. తాజాగా డెత్ సర్టిఫికెట్ విషయంలోనూ అదే మోడస్ ఒపెరండి అనుసరించడం గమనార్హం. -
బీజేపీలో చేరడానికి చాలా మంది సిద్దం: బండి సంజయ్
కరీంనగర్, సాక్షి: పార్టీకోసం పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన కరీంనగర్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.‘‘కేసీఆర్ దశ గ్రహ యాగాలు చేయాలి. కేసీఆరే ఓ దశమ గ్రహం. వరదల వల్ల నష్టపోయిన వారి కోసం యాగాలు చేయాలి. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడానికి.. బిడ్డ కోసం యాగాలు చేస్తున్నాడు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబంకు ఇక నోఎంట్రీ బోర్డే. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను దృష్టి మరల్చడానికే హైడ్రా పేరుతో కూల్చివేతలు. బీజేపీలో చేరడానికి ఇంకా చాలా మంది సిద్దంగా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంటులోనే బీజేపీ అత్యధిక సభ్యత్వం నమోదు కావాలి’’ అని అన్నారు. -
బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నిజంగా రుణమాఫీ చేస్తే.. రైతులు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం వడుదల చేయాలి. రైతులకు క్లియరెన్స్ సర్టిఫిటికెట్ ఇవ్వాలి. చనిపోయిన రైతులకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది. సోనియాగాంధీ బర్త్ డే రోజున కూడా కూడా మోసం చేశారు. ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది కాంగ్రెస్. రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారు?. రైతుల పక్షాన పోరాడుతాం. విలీనాలు వద్దు.. దండం పెడుతా. ..గతంలో రేవంత్ రెడ్డి బీజేపీ అని బీజేపీలోకి పోతారని ప్రచారం చేశారు. 30 వేల ఉద్యోగాలు ఏ దేశంలో ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పాలె. నోటిఫికేషన్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ను చేర్చుకోవాల్సిన అవసరరం బీజేపీకి లేదు. కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే ఉంది. బీఆర్ఎస్ను కలుపుకుంటే మా ప్రభుత్వం ఏమైనా వస్తదా?. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పక్కాగా కలుస్తాయి. కేసీఆర్ కుటుంబాన్ని లోపల ఎందుకు వేయలేదు?. కేసీఆర్ ఢిల్లీలో లాబీయింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్, భూ స్కామ్ అన్నీ అటకెక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఇక చేరికలు మాత్రమే ఉన్నాయ్. ప్రజలు కోరితే తప్ప అధికారులు, నాయకులూ స్పందించే పరిస్థితి లేదు. సాగు, తాగు నీటి వంటివాటిపై రివ్యూ లేదు’అని అన్నారు. -
కరీంనగర్లో సందడి చేసిన సంయుక్త మీనన్, పాయల్ రాజ్‌పుత్ (ఫొటోలు)
-
Naba Mohammadi: మోటారు పాఠం.. జపాన్ చేర్చుతోంది!
బోటనీ పాఠమంటే.. బోరు..బోరు.. హిస్టరీ రొస్టు్ట కంటే రెస్ట్ మేలు.. అని పాడుకుంటే పొరపాటే.. పాఠం సరిగా వింటే విదేశీయానం, విమోనమెక్కే యోగం దక్కుతుందని నిరూపించింది కరీంనగర్ జిల్లా శంకరపట్నంకు చెందిన నబా మొహమ్మదీ. ఇటీవల హైదరాబాద్‌లో ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఏకంగా ఈ ఏడాది నవంబరులో జపాన్ లో జరిగే సకుర సైన్స్ ఫెస్టివల్ లో పాల్గొనబోతోంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? కేవలం సైన్స్ మీద ఉన్న ఆసక్తి.. మోటారు పాఠం వినడం వల్లే అంటుంది. నబా..! తనకు సైన్స్‌పై ఉన్న ఆసక్తి తనను జపాన్ గడ్డపై కాలు మోపేలా చేస్తుందని ‘సాక్షి’కి చెప్పింది.ఏంటా మోటారు కథ...!నబా ప్రస్తుతం శంకరపట్నంలోనే ఇంటర్ సెకండియర్ చదువుతోంది. దాదాపు నాలుగేళ్ల క్రితం తాను 9వ తరగతిలో ఉండగా.. విన్న ఫిజిక్స్ పాఠం తన ఆలోచన తీరును మార్చివేసింది. 8 వ తరగతి వరకు బేసిక్ సైన్స్ విన్న తాను.. తొలిసారిగా మోటారు ఎలా పనిచేస్తుందో తన గురువులు చెప్పిన పాఠానికి ముగ్ధురాలైంది. విద్యుచ్ఛక్తి, అయస్కాంత శక్తిని కలిపి మోటారు నడిపే విధానం తెలుసుకోవడం తనకు సైన్స్ ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిన్న సూత్రం ఆధారంగా ప్రపంచంలోని ఎన్నో మోటార్లు ఎలా నడుస్తున్నాయన్న విషయంపై తనకు పూర్తి అవగాహన వచ్చింది. అది మొదలు సైన్స్పాఠాలను మరింత శ్రద్ధగా చదువుతూ విశ్లేషణ చేసుకునేది. ప్రతీది తనకు అర్థమయ్యేందుకు అదనపు పుస్తకాలు, యూట్యూబ్ చూసేది. ఇటీవల జిల్లా స్థాయిలో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో కరీంనగర్ నుంచి మొదటి స్థానంలో నిలిచింది. అదే ఊపులో రాష్ట్రస్థాయికి ఎంపికై టాప్–5లో టాప్–2 స్థానం దక్కించుకుంది. ఫలితంగా నవంబరులో జపాన్ లో జరిగే సుకుర సైన్స్ ఫెస్టివల్లో పాల్గొనే అరుదైన అవకాశం చేజిక్కించుకుంది.తాను కూడా ఏదైనా సాధించాలంటే..!అదే ఉత్సాహంతో తాను కూడా ఏదైనా సాధించాలని తలచింది. అంధులకు దారి చూపేందుకు ప్రత్యేక డివైజ్ రూపొందించింది. ఇది ప్రస్తుతంప్రోటోటైప్ దశలోనే ఉంది. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. దీనికి త్వరలోనే పేటెంట్ కూడా దరఖాస్తు చేసుకుంటానని నబా ‘సాక్షి’కి వివరించింది. జపాన్ పర్యటనలో అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాలను గమనించి, వాటిని ఇక్కడఅమలు చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. తాను ఈ ప్రగతి సాధించడం వెనక తన తండ్రి షాబీర్, ఫిర్దౌస్ సుల్తానాలు ఎంతోప్రోత్సహించారని, సంప్రదాయ కుటుంబమైనా, బాలికనైన తనను అన్ని కాంపిటీషన్లకు పంపించారని తెలిపింది. అదే సమయంలో తనకు పాఠాలు చెప్పిన గురువులకు తానెప్పుడూ రుణపడి ఉంటానని, పెద్దయ్యాక శాస్త్రవేత్తనవుతాననీ, అంధులకు చూపునవుతాననీ వారికి దారిచూపేందుకు రూపొందించిన ఉపకరణాన్ని మరింత అభివృద్ధి చేస్తాననీ చెప్పింది. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా ఎదగడమే తన కల అని వివరించింది నబా. – బి. అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి, కరీంనగర్