క్షణికావేశంలో తల్లి ఆత్మహత్య
ఏమైందో తెలియని వయసులో పిల్లలు
రెండు కుటుంబాల్లో తీరని శోకం
కన్నీరు పెట్టించిన చిన్నారుల తీరు
మేడిపల్లి: ‘అమ్మా.. మమ్మల్ని ముద్దుగా పెంచావు. ఎంత అల్లరి చేసినా ఓపికగా భరించా వు.. అందరితో ఆడుకుంటుంటే మురిసిపోయావు. మేమే నీ లోకం.. మేమే నీ సర్వస్వం అ న్నట్లు మెదిలావు.. అంతలోనే మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావా అమ్మా.. ఇక మాకు దిక్కెవరు.. మమ్మల్ని ఎవరు లా లిస్తారు.. ఎవరు బుజ్జగించి బువ్వ తినిపిస్తారు అ మ్మా.. అనే రీతిలో ఆ చిన్నారులు తల్లి మృతదేహం వద్ద కనిపించిన తీరు కంటతడి పెట్టించింది. క్షణికావేశంలో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం అటు పుట్టింట్లో.. ఇటు మెట్టింట్లో తీరని శోకాన్ని మిగిలి్చంది.
ఈ విషాధ ఘటన భీమారం మండలంలోని కమ్మరిపేటలో చోటుచేసుకుంది. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన పాక లక్ష్మి, రాజం కూతురు శ్రావణిని కమ్మరిపేట గ్రామానికి చెందిన తిపిరి నరేశ్‌కిచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమారులు శ్రాహన్స్(4), రుద్రాన్స్ (ఏడాది) ఉన్నారు. నరేశ్ తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. శ్రావణి బీడీలు చుడుతోంది. ఉన్నంతలో హాయిగా ఉంటున్నారు. ఈ క్రమంలో శ్రాహన్స్‌కు ఐదు రోజులుగా జ్వరం వస్తోంది. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని నరేశ్ శ్రావణికి చెబుతున్నాడు. తానే తీసుకెళ్లాలంటే ఎలా అని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి మంగళవారం ఇంట్లోకి వెళ్లి క్రిమిసంహారక మందు తాగింది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జగిత్యాల ఆస్పత్రికి.. అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘ఎంత పనిచేశావు బిడ్డా.. నీ పిల్లలు పసిమొగ్గలని గుర్తుకురాలేదా.. ఆ యముడే మదిలో నుంచి జ్ఞాపకాలు తీసేసాడా.. అంటూ గుండెలవిసేలా రోదించారు.
విగతజీవిగా మారిన భార్య మృతదేహాన్ని చూస్తూ భర్త నరేశ్.. అమ్మకు ఏమైంది నాన్న అంటూ నాలుగేళ్ల కొడుకు.. ఏం జరుగుతుందో తెలియక బోసిపోయిన ముఖంతో ఏడాది కుమారుడు.. మీ అమ్మ ఇకరాదు బిడ్డా అని ఎలా చెప్పాలో తెలియక బరువెక్కిన హృదయంతో దిక్కులు పిక్కటెల్లేలా రోదించారు శ్రావణి తల్లిదండ్రులు. అప్పటి వరకు అందరితో కలివిడిగా ఉన్న శ్రావణి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తన ఇద్దరు పిల్లలతోపాటు కుటుంబ సభ్యులకు కడుపుకోతను మిగిలి్చంది. పెద్ద కుమారుడితో శ్రావణికి తలకొరివి పెట్టించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment