![Married Woman Ends Life In Hyderabad](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/6%2B6565.jpg.webp?itok=hLShrleO)
ఉప్పల్,హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన చందన్‌సింగ్ భార్య మమత(31)తో 12 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఉప్పల్ హనుమసాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు. వీరికి ఓ కుమార్తె (9) కుమారుడు(13) ఉన్నారు. భర్త గ్యాస్ స్టవ్‌ల రిపేరింగ్ చేస్తుంటాడు. గత కొంత కాలంగా స్థానికంగా నివసించే రాకేష్‌గౌడ్‌తో భార్యకు పరిచయం ఏర్పడింది. అద కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీతో రాకేష్ మమతను వేధింపులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలున్నాయి.
వేధింపులు భరించలేకే ఆమె బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందన్నారు. మృతురాలి ఒంటిపై గాయాలున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాకేష్‌గౌడ్, భర్త చందన్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment