woman commits suicide
-
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం...
ఉప్పల్,హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన చందన్‌సింగ్ భార్య మమత(31)తో 12 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఉప్పల్ హనుమసాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు. వీరికి ఓ కుమార్తె (9) కుమారుడు(13) ఉన్నారు. భర్త గ్యాస్ స్టవ్‌ల రిపేరింగ్ చేస్తుంటాడు. గత కొంత కాలంగా స్థానికంగా నివసించే రాకేష్గౌడ్తో భార్యకు పరిచయం ఏర్పడింది. అద కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీతో రాకేష్ మమతను వేధింపులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. వేధింపులు భరించలేకే ఆమె బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందన్నారు. మృతురాలి ఒంటిపై గాయాలున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాకేష్‌గౌడ్, భర్త చందన్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
భర్తను వదిలేసి.. మరో వ్యక్తితో సహజీవనం!
హుబ్లీ: ఇన్‌స్టా గ్రామ్ ప్రేమ వలలో చిక్కి ధార్వాడలో రామదుర్గకు చెందిన శ్వేత (24) అనే వివాహిత యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. ఆమెకు మూడున్నరేళ్ల క్రితం రామదుర్గకు చెందిన విశ్వనాథ్‌తో పెళ్లి అయింది. ఇన్‌స్టాలో శ్వేతకు ధార్వాడ తాలూకా శివళ్లి గ్రామానికి చెందిన విజయ్ నాయకర్‌తో స్నేహం మొదలై ప్రేమకు దారితీసింది. ఫలితంగా భర్తను వదిలేసి ఆమె శ్రీనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో సహజీవనం ప్రారంభించింది. శ్వేత కుటుంబ సభ్యులు విజయ్ ఇంటికి వెళ్లి ఇది సబబు కాదని మందలించారు. వీలైతే ఆమెను పెళ్లి చేసుకో, ఊరికే ఇలా తమ కుమార్తె సంసారాన్ని నాశనం చేయవద్దు అని బుద్ధిమాటలు చెప్పారు. విజయ్ తమనే బెదిరించినట్లు శ్వేత తల్లి శశి సావంత్ తెలిపారు. శ్వేత ఇటీవల భర్త విశ్వనాథ్‌కు విడాకుల నోటీసు కూడా పంపింది. అయితే శుక్రవారం నాడు విజయ్, శ్వేత మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ శ్వేత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థలాన్ని ఉప నగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొన్నారు. సంసారంలో చిచ్చు పెట్టిన విజయ్ పరారీలో ఉన్నాడు. -
పెళ్లైన ఆటో డ్రైవర్‌తో యువతి ప్రేమ.. చివరకు
తిరువళ్లూరు: వివాహితుడితో ప్రేమ వ్యవహరం నడుపుతున్న కుమార్తెను తల్లిదండ్రులు మందలిండంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు..తిరువళ్లూరు జిల్లా తన్నీర్‌కులం రామాపురం గ్రామానికి చెందిన శివకుమార్ కుమార్తె ఆర్తి (21). ఈమె చైన్నె భక్తవత్సలం మహిళ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. కాగా ఆర్తికి అదే ప్రాంతంలో ఆటో డ్రైవర్ అయిన వివాహితుడైన వ్యక్తితో గత రెండేళ్ల నుంచి ప్రేమ వ్యవహరం నడుపుతున్న తెలుస్తోంది. వీరి ప్రేమ వ్యవహరం ఇద్దరి ఇంటి పెద్దలకు తెలియడంతో మందలించినట్లు తెలుస్తోంది. దీంతో యువతి మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న యువతిని కిందకు దింపి స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. కాగా ఆటో డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని మహిళ పోలీసులకు యువతి బంధువులు ఫిర్యాదు చేశారు. -
స్పా ఉద్యోగిని ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఢిల్లీ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాగలగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బ్యూటీ స్పాలో పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన సోనియా (24) మృతురాలు. ఆత్మహత్యకు గల కారణాలు తెలిసిరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ప్రేమలో మోసపోయానని..ప్రేమలో మోసపోయానని అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దక్షిణ కన్నడ జిల్లా బెళ్తండగి తాలూకా మిత్రబాగిలు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అమ్మాయి (17)ని బంధువు అయిన ప్రవీణ్ అనే యువకుడు ప్రేమ పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని వదిలేశాడు. దీంతో విరక్తి చెందిన యువతి 20వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. ప్రవీణ్‌పై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
సనత్‌నగర్: భవనంపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బేగంపేట ఎస్ఐ జయచందర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన హరీష్ జి ప్రభు ఎస్బీఐలో ఏజీఎంగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య రంజిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చెన్నై నుంచి జులైలో హైదరాబాద్‌కు బదిలీపై వచి్చన ఆయన బేగంపేట ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాలనీలోని కోరల్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. కాగా గత ఏప్రిల్‌లో రంజిత తల్లి మృతి చెందడంతో అప్పటి నుంచి మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం అపార్ట్మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆమె భర్త హరీష్ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. మానసిక సమస్యలతో తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మా.. ఎంత పనిచేశావు..!
మేడిపల్లి: ‘అమ్మా.. మమ్మల్ని ముద్దుగా పెంచావు. ఎంత అల్లరి చేసినా ఓపికగా భరించా వు.. అందరితో ఆడుకుంటుంటే మురిసిపోయావు. మేమే నీ లోకం.. మేమే నీ సర్వస్వం అ న్నట్లు మెదిలావు.. అంతలోనే మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావా అమ్మా.. ఇక మాకు దిక్కెవరు.. మమ్మల్ని ఎవరు లా లిస్తారు.. ఎవరు బుజ్జగించి బువ్వ తినిపిస్తారు అ మ్మా.. అనే రీతిలో ఆ చిన్నారులు తల్లి మృతదేహం వద్ద కనిపించిన తీరు కంటతడి పెట్టించింది. క్షణికావేశంలో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం అటు పుట్టింట్లో.. ఇటు మెట్టింట్లో తీరని శోకాన్ని మిగిలి్చంది. ఈ విషాధ ఘటన భీమారం మండలంలోని కమ్మరిపేటలో చోటుచేసుకుంది. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన పాక లక్ష్మి, రాజం కూతురు శ్రావణిని కమ్మరిపేట గ్రామానికి చెందిన తిపిరి నరేశ్‌కిచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమారులు శ్రాహన్స్(4), రుద్రాన్స్ (ఏడాది) ఉన్నారు. నరేశ్ తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. శ్రావణి బీడీలు చుడుతోంది. ఉన్నంతలో హాయిగా ఉంటున్నారు. ఈ క్రమంలో శ్రాహన్స్‌కు ఐదు రోజులుగా జ్వరం వస్తోంది. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని నరేశ్ శ్రావణికి చెబుతున్నాడు. తానే తీసుకెళ్లాలంటే ఎలా అని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి మంగళవారం ఇంట్లోకి వెళ్లి క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జగిత్యాల ఆస్పత్రికి.. అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘ఎంత పనిచేశావు బిడ్డా.. నీ పిల్లలు పసిమొగ్గలని గుర్తుకురాలేదా.. ఆ యముడే మదిలో నుంచి జ్ఞాపకాలు తీసేసాడా.. అంటూ గుండెలవిసేలా రోదించారు. విగతజీవిగా మారిన భార్య మృతదేహాన్ని చూస్తూ భర్త నరేశ్.. అమ్మకు ఏమైంది నాన్న అంటూ నాలుగేళ్ల కొడుకు.. ఏం జరుగుతుందో తెలియక బోసిపోయిన ముఖంతో ఏడాది కుమారుడు.. మీ అమ్మ ఇకరాదు బిడ్డా అని ఎలా చెప్పాలో తెలియక బరువెక్కిన హృదయంతో దిక్కులు పిక్కటెల్లేలా రోదించారు శ్రావణి తల్లిదండ్రులు. అప్పటి వరకు అందరితో కలివిడిగా ఉన్న శ్రావణి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తన ఇద్దరు పిల్లలతోపాటు కుటుంబ సభ్యులకు కడుపుకోతను మిగిలి్చంది. పెద్ద కుమారుడితో శ్రావణికి తలకొరివి పెట్టించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు. -
నిమ్స్ అడిషనల్ ప్రొఫెసర్ బలవన్మరణం
సనత్‌నగర్/లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రిలో అనస్థీషియా విభాగంలో అడిషనల్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రాచీకార్ (46) బలవన్మరణానికి పాల్పడ్డారు. నెల రోజుల క్రితమే ఖాళీ చేసిన ఇంటికి ఒంటరిగా వచ్చిన ఆమె అధిక మోతాదులో అనస్థీషియా ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన ప్రాచీకార్, దీపక్‌లు దంపతులు. ప్రాచీకార్ నిమ్స్‌లో ఎనస్థీషియా విభాగంలో అడిషనల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, భర్త దీపక్ మరో ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్‌గా ఉన్నారు. వీరికి ఒక కుమారుడు. గత నెల రోజుల క్రితం వరకు బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉన్న వీరి కుటుంబం..మూసాపేటలో కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి బేగంపేటలోని ఇల్లు ఖాళీగా ఉంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పాత ఇంటికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి ప్రాచీకార్ వెళ్లారు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భర్త దీపక్ ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో అక్కడికి వచి్చన భర్తకు ఇంటి లోపలి గడియ వేసుకుని ఉండడంతో పాటు ఎంతకీ తలుపు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అపస్మారక స్థితిలో కనిపించిన ప్రాచీకార్ను హుటాహుటిన నిమ్స్ ఆస్పత్రికి తరలించగా..పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. కాగా ప్రాచీకర్ అధిక మోతాదులో మత్తు మందు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి గాం«దీలో పోస్టుమార్టం నిర్వహించి..నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. అయితే ప్రాచీకార్ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచి్చందనేది అంతుపట్టడం లేదు. ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి స్థితిలో ఉన్న ప్రాచీకార్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తెలియడం లేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే కుటుంబపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేక విధి నిర్వహణలో ఏదైనా ఇబ్బంది ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రాచీకర్ ఆత్మహత్య విషయం తెలిసి నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర ఉద్యోగులు అర్ధరాత్రి నిమ్స్‌కు వచ్చారు. ప్రాచీకర్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయంత్రం 6.30 గంటల వరకు ఆమె విధుల్లో ఉన్నారని, రెండేళ్ల బాలుడి సర్జరీకి సహకరించారని కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ అమరేష్ తెలిపారు. -
జిమ్ రిసెప్షనిస్ట్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బాగలకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దావణగెరెకి చెందిన మల్లనగౌడ, జ్యోతి దంపతుల కుమార్తె శ్రావణి(22) దాసరహళ్లిలో ఉంటూ బాగలకుంట పరిధిలోని గోల్డెన్ జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోంది. సోమవారం ఉదయం రోజులాగే పనికి వెళ్లిన శ్రావణి హఠాత్తుగా కూర్చున్న చోటే వాంతులు చేసుకుని అస్వస్థతకు గురై కుప్పకూలింది. జిమ్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. శ్రావణికి తలంలితండ్రులు వివాహం నిశ్చయించారు. అయితే ఆమె శంకర్ అనే యువకుడిని ప్రేమిస్తోందని సమాచారం. శ్రావణిని పెళ్లికి ఒప్పించాలని తల్లితండ్రులు ఇటీవల బెంగళూరు వచ్చారు. అయితే వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని శ్రావణి చివరిసారిగా ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అప్పటికే ఆమె విషం తాగింది. కేసు దర్యాప్తులో ఉంది. -
కడుపునొప్పితో యువతి ఆత్మహత్య
మండ్య: తీవ్రమైన కడుపు నొప్పిని భరించలేక యువతి ఒకరు ప్రాణాలు తీసుకుంది. మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని కణివెకొప్పలు గ్రామంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. న్యాయవాది కణివె యోగేష్ కుమార్తె అయిన గౌతమి (21) కొంత కాలంగా తరచూ కడుపునొప్పితో బాధపడుతోంది. వైద్యులతో చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. ఉదయం ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
శివమొగ్గ : బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శివమొగ్గ జిల్లా సొరభలో జరిగింది.భద్రావతికి చెందిన అక్షిత(30) సొరభ పట్టణానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకొని ఇదే పట్టణంలోని విద్యుత్ నగరలో నివాసం ఉంటోంది. పట్టణంలోనే బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. అయినా నయం కాలేదు. దీంతో ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సొరభ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఇద్దరు కుమార్తెలతో తల్లి బలవన్మరణం
సాక్షి, చెన్నై: భర్తతో అభిప్రాయ భేదాలు విడాకుల వరకు వెళ్లడంతో తీవ్ర మనో వేదనకు గురైన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో పాటు తానూ బలవన్మరణానికి పాల్పడింది. దిండుగల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. దిండుగల్ జిల్లా తాడి కొంబు పరిధిలోని కామాక్షిపురం శక్తినగర్‌కు చెందిన శ్రీనివాసన్(42), మేనక (35) దంపతులకు హిందు మహావిని(16), తన్యశ్రీ(11) కుమార్తెలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలు స్థానికంగా సీబీఎస్ఈ పాఠశాలలో పది, ఆరు తరగతులు చదువుతున్నారు. మహావిని ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితిలో కొద్ది రోజులుగా ఈ దంపతుల మధ్య జరిగిన గొ డవ విడాకుల కోసం కోర్టు వరకు వెళ్లింది.నందవనం రోడ్డులో తాను నడుపుతున్న టూ వీలర్ సర్వీస్ సెంటర్ లో వాటర్ మోటార్ పనిచేయక పోవడంతో సోమవారం ఇంట్లో ఉన్న మోటారును తీసుకెళ్లేందు కు శ్రీనివాసన్ ప్రయత్నించాడు. దీనిని మేనకతో పాటు పిల్లలు అడ్డుకున్నారు. తమ గొడవలు విడా కుల కోసం కోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో శ్రీనివా సన్ చర్యలపై మేనక మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సాయంత్రం అతడిని పోలీసులు పిలిపించి చీవాట్లు పెట్టారు. రాత్రి పోలీసు స్టేషన్ నుంచి వచ్చిన శ్రీనివాసన్ ఇంట్లో ఉన్న తన బట్టలను తీసుకెళ్లేందుకు వెళ్లాడు.ఇంటి తలుపులు తెరవక పోవడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో కిటికి తలుపులు పగుల కొట్టి చూశారు. లోపల గది లో తన ఇద్దరు కుమార్తెలతో పాటుగా మేనక ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టా నికి తరలించారు. శ్రీనివాసన్‌ను విచారించగా తాను పొద్దుపోయే వరకు పోలీసు స్టేషన్లోనే ఉన్న ట్లు చెప్పాడు. మనస్తాపంతో ఉన్న మేనక పిల్లలతో పాటు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పో లీసులు నిర్ధారించారు. -
ప్రియుడి ఆత్యహత్య.. అతడి బాటలోనే ప్రియురాలు
తూర్పు గోదావరి: ప్రేమించిన యువకుడు గంజాయికి బానిసై క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువతి తనువు చాలించారు. ఈ ఘటనతో యానాంలో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. యానాంలోని యూకేవీనగర్‌కి చెందిన మీసాల మౌనిక(22)కు ఓ అక్క, చెల్లి ఉన్నారు. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. మౌనిక తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్ కాలేజీలో నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈమె అక్క, చెల్లెలు వివాహాలై అత్తవారిళ్లలో ఉంటున్నారు. మౌనిక ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులు సంరక్షణలో ఉంటోంది. రెండేళ్లుగా కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో ప్రేమలోఉంది. గంజాయికి బానిసైన చిన్నా రెండు నెలల క్రితం రూ.500 అడిగితే.. తన సోదరుడు డబ్బులివ్వలేదనే కోపంతో ఒంటికి నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. అప్పట్నుంచి మౌనిక కళాశాలకు వెళ్లడం మానేసింది. చిన్నాకు సంబంధించిన దుస్తులు, వస్తువులను గదిలో పెట్టుకుని ఫొటోలు గోడలకు అతికించి చూసుకుంటూ.. మానసిక కుంగుబాటుతో ఉంటోంది. సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. మేనమామ త్రిమూర్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా యువతి మృతదేహానికి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఘటనపై ఎస్సై నూకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పాపను బాగా చూసుకోండి.. 4 పేజీల సూసైడ్ నోట్ రాసి..
ఏలూరు: విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామ సచివాలయం–1లో మహిళా సంరక్షణ కార్యదర్శిగా పని చేస్తున్న గుణదల శిరీష(30) భర్త వేధింపులు తాళలేక సోమవారం అర్ధరాత్రి నూజివీడులోని తన పుట్టింటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుణదల శిరీషకు ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్లకు చెందిన గద్దల వెంకటేశ్వరరావుతో 2018 ఆగస్టులో వివాహమైంది. వివాహమైన నాటి నుంచి నిత్యం అనుమానంతో శిరీషను వేధించేవాడు. ఆ తరువాత కొంతకాలానికి పాప పుట్టింది. 2019 నవంబరులో నున్న సచివాలయం–1లో మహిళా సంరక్షణ కార్యదర్శిగా ఉద్యోగం రావడంతో నున్నలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉండేవారు. ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరుగుతుండడంతో పెద్దలు పలుమార్లు సర్దిచెప్పి కాపురానికి పంపించేవారు.అయితే మూడు రోజుల క్రితం తలపై కొట్టడంతో తీవ్ర గాయమైంది. దీంతో శిరీష నూజివీడులోని తన పుట్టింటికి వచ్చింది. తరువాత తన అన్నను పాపను తీసుకురమ్మని పంపగా వారు పంపలేదు. దీంతో చేసేదేమీ లేక తాను చనిపోయిన తర్వాత పాపను బాగా చూసుకోవాలని తన అన్నను కోరుతూ సూసైడ్ నోట్ రాసింది. తన ఆత్మహత్యకు తన భర్తతో పాటు అత్తమామలు, ఆడబిడ్డ, చిన్న అత్తలు కారణమని లెటర్లో పేర్కొంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఆమె అన్న ఆమె గదిలోకి వెళ్లగా ఉరివేసుకుని ఉండడంతో వెంటనే అందరిని పిలిచి చెప్పడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శివనారాయణ బాపూనగర్‌లోని సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ ఈడే అశోక్‌కుమార్‌గౌడ్ ఏరియా ఆసుపత్రికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు. సూసైడ్ లేఖ ఆధారంగా, మృతురాలి అన్న గుణదల కాశీ విశ్వనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పని మనిషి ఆత్మహత్య.. పదేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం
హైదరాబాద్: ల్యాంకోహిల్స్‌లో 21వ అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి కృష్ణ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదుచేశారు. యువతి బలవన్మరణానికి వేధింపులే కారణమని నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో వ్యాపారి, కన్నడ నటుడు అయిన ఓ వ్యక్తి సాగిస్తున్న చీకటి కార్యకలాపాలు, దారుణాలు బయటపడుతున్నాయి. స్థానికులు, పోలీసుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచంద్రావు కొన్ని కన్నడ సినిమాల్లో నటించాడు. పదేళ్ల క్రితం నగరానికి చేరి బంజారాహిల్స్ కేంద్రంగా హోం థియేటర్ల వ్యాపారం చేస్తున్నాడు. మణికొండ ల్యాంకోహిల్స్ అపార్ట్మెంట్స్ 15 ఎల్‌హెచ్ బ్లాక్‌లో భార్య, కుమార్తెతో ఉంటున్నాడు. కుమార్తె కేర్‌టేకర్‌గా పదేళ్లుగా కాకినాడకు చెందిన బిందుశ్రీ పనిచేస్తోంది. అక్కడే తనకు కేటాయించిన గదిలో ఉంటోంది. పదేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం . కొద్దిరోజులుగా వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఐదురోజుల క్రితం పూర్ణచంద్రావు కుమార్తెను సాకేందుకు మరో యువతిని ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో శుక్రవారం రాత్రి గొడవలు తారాస్థాయికి చేరాయి. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ పరస్పరం వాదించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. ఆ తరువాత బిందుశ్రీపై 21వఅంతస్తుపై నుంచి కిందకు దూకింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు సమాచారమిచ్చారు. పనిమనిషి ఆత్మహత్య విషయం పూర్ణచంద్రావుకు తెలియజేసేందుకు అతడి ఫ్లాట్‌కు చేరగా.. అరగంట తర్వాత తలుపులు తీయటంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. వేధింపుల వల్లేనా? కన్నడ సినిమాల్లో నటించానంటూ పూర్ణచంద్రావు ప్రచారం చేసుకునేవాడు. సినీపరిశ్రమలో తన పరిచయాలతో అవకాశాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు ఆశచూపేవాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. తరచూ ఇదే విధంగా కొంతమంది మహిళలు, యువతులు వచ్చిపోవటం, అనుమానాస్పదంగా తిరగటం గమనించినట్టు అదే అపార్ట్మెంట్లో ఉంటున్న కొందరు మీడియాకు తెలిపారు. ఘటన జరగడానికి మూడ్రోజుల ముందు నలుగురు యువతులు అతడి ఫ్లాట్‌కు వచ్చారని వివరించారు. అనుమానాస్పద మరణంగా తొలుత భావించిన పోలీసులు వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు నిర్ధారించారు. పూర్ణచంద్రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
Hyderabad: 21వ అంతస్తు నుంచి దూకి పని మనిషి ఆత్మహత్య
హైదరాబాద్: ల్యాంకోహిల్స్‌లో 21వ అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీఐ చంద్రశేఖర్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. కాకినాడ జగ్గంపేటకు చెందిన పోలపల్లి కృష్ణ జీవనోపాధి కోసం బంజారాహిల్స్‌లోని షౌకత్‌నగర్‌కు వలస వచ్చి హౌస్‌కీపింగ్ పనులు చేస్తున్నాడు. కృష్ణ కూతురు బిందుశ్రీ (28) పదేళ్లుగా మణికొండ ల్యాంకోహిల్స్‌లో– 15 ఎల్‌హెచ్ 2104లో నివాసం ఉంటున్న పూర్ణచంద్ ఇంట్లో పని మనిషిగా చేస్తోంది. హైఎండ్‌హో థియేటర్స్ బిజినెస్ చేసి కాకినాడకు చెందిన పూర్ణచంద్ ఇంట్లోనే సర్వెంట్ రూమ్‌లో బిందుశ్రీ ఉంటోంది. శనివారం తెల్లవారు జామున ఫోన్ మాట్లాడుకుంటూ వాష్ ఏరియా నుంచి బిందుశ్రీ కిందికి దూకడంతో తల ఛిద్రమై అక్కక్కడే మృతి చెందింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పూర్ణచంద్‌కు సమాచారం ఇచ్చారు. రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె తండ్రి కృష్ణ పేర్కొన్నారు. -
ప్రియుడు మరో యువతితో తిరుగుతున్నాడని...
మైసూరు: ప్రియుడు మోసం చేయడంతో యువతి ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన మైసూరు జిల్లాలోని కేఆర్ నగర తాలూకాలోని గౌడెనహళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. నిసర్గ (20) అనే అమ్మాయి కేఆర్ నగరలో డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. ఈమె , సుమారు 4 సంవత్సరాల నుంచి ఇదే కాలేజీకి చెందిన సుహాస్ రెడ్డి అనే యువకుడు ప్రేమలో ఉన్నారు. సినిమాలకు, షికార్లకు తిరిగారు. మరో యువతితో తిరుగుతున్నాడని కొన్నిరోజులుగా ప్రియుడు పట్టించుకోక పోవడంతో పాటు మరో యువతితో కలిసి తిరగడం చూసిన నిసర్గ మోసపోయానని కుమిలిపోయింది. సుహాస్ రెడ్డి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయం చెబితే వారు మందలించి పంపించారు. శనివారం ఇంట్లో డెత్‌నోట్ రాసిపెట్టి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన మరణానికి సుహాస్ రెడ్డి, అతని తండ్రి గోపాలకృష్ణ కారణమని, వారికి కఠిన శిక్ష పడాలని లేఖలో రాసింది. కేఆర్ నగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో ఉద్యోగం.. గృహ ప్రవేశం చేసిన ఐదు రోజులకే..
యశవంతపుర: ఇంటిని కొనుగోలు చేసి గృహప్రవేశం చేసిన ఐదు రోజులకే ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన దక్షిణ కన్నడ జిల్లా ఉళ్లాలలో జరిగింది. ఉళ్లాల ఫరంగిపేటకు చెందిన అశ్విని బంగేరా (25) కుంపల చిత్రాంజలి నగరలో ఇంటిని కొనుగోలు చేసింది. ఉన్నత చదువులు చదివి, అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా తన బంధువుల ద్వారా ఇంటిని కొన్నారు. నెలన్నర క్రితం ఉళ్లాలకు వచ్చి ఈనెల 3న వైభవంగా గృహప్రవేశం చేశారు. బుధవారం రాత్రి తన స్నేహితుడికి ఐల వ్ యూ అని సందేశం పెట్టారు. గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. గురువారం ఉదయం స్నేహితుడు వచ్చి తలుపు తట్టగా విషయం బయట పడింది. 20 పేజీల డెత్‌నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి కొనుగోలులో మోసపోయానని, రుణం చెల్లింపులపై బ్యాంక్ అధికారులు తనను వేధిస్తున్నట్లు రాసి ఉంది. సమస్యలపై విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉళ్లాల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య
కర్ణాటక: ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదనే ఆవేదనతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఉడుపి జిల్లా బైందూరు తాలూకా కాల్నొడు గ్రామానికి చెందిన గౌతమి(22) ఎంకాం పూర్తి చేసింది. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం కోసం అర్జీ పెట్టుకున్నారు. అయినప్పటికీ ఉద్యోగం రాలేదు. దీంతో మనోవేదనకు గురై తన ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బైందూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
విమానాశ్రయంలో మహిళ ఆత్మహత్య
సాక్షి, చైన్నె : కొత్తగా నిర్మించిన విమానాశ్రయ పార్కింగ్ టెర్మినల్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి సినిమా థియేటర్లో పీఎస్–2 చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చిన మహిళ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. చైన్నె విమానాశ్రయం ఆవరణలో ఆరు అంతస్తులతో బ్రహ్మాండ మల్టీ లెవల్ కార్ పార్కింగ్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఇక్కడ 2వేల కార్లు, ద్విచక్ర వాహనాల నిలిపేందుకు సౌకార్యలు కల్పించడమే కాదు, సినిమా థియేటర్లు సైతం నిర్మించి ఉన్నారు. ఇక్కడ పీఎస్–2 చిత్రాన్ని వీక్షించేందుకు తన ఇద్దరు పిల్లలతో పల్లావరం సమీపంలోని పులిచ్చలూరుకు చెందిన బాలాజీ భార్య ఐశ్వర్య(35) వచ్చారు. శుక్రవారం రాత్రి సినిమా ప్రదర్శన మధ్యలో ఆమె ఇద్దరు పిల్లలను థియేటర్లో వదిలి బయటకు వచ్చారు. నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. పై నుంచి ఎవరో కింద పడడాన్ని గుర్తించిన పార్కింగ్ సిబ్బంది పరుగులు తీశారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను క్రోంపేట ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి మరణ సమాచారం తెలియక 9వ తరగతి, 5వ తరగతి చదివే ఆమె కుమారుడు, కుమార్తె ఇద్దరు సినిమా చూస్తూ ఉండి పోయారు. చివరకు తల్లి కనిపించక పోవడంతో ఆందోళనకు లోనయ్యారు. పోలీసులు ఆ పిల్లలను తమ సంరక్షణలో ఉంచుకున్నారు. విచారణలో బాలాజీ అమెరికాలో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తున్నట్లు తేలింది. ఇద్దరు పిల్లలతో ఐశ్వర్య మాత్రం పులిచ్చలూరులో ఉన్నట్లు గుర్తించారు. పిల్లలు తెలిపిన వివరాల మేరకు బంధువులకు సమాచారం అందించారు. గత కొన్ని నెలలుగా ఐశ్వర్య తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు వెలుగు చూసింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుగుతోంది. అయితే బ్రహ్మాండంగా రూపుదిద్దుకున్న విమానాశ్రయ టెర్మినల్‌లో తొలి ఆత్మహత్య ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇలాంటివి పునరావృతం కాకుండా భద్రతా పరంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. -
వివాహేతర సంబంధం.. ఆ టైంలో గడిపిన వీడియోను ఆమె భర్తకు పంపి..
తిరువొత్తియూరు(తమిళనాడు): యువతి ఆత్మహత్య ఘటనలో ప్రేమికుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కోవై జిల్లా అన్ననూర్ సమీపంలోని కెంపనాయకన్ పాళయంలో బీహార్‌కు చెందిన దంపతులు బిక్కుకుమార్, బీరెత్తి కుమారి రెండేళ్ల నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న తేని జిల్లాకు చెందిన పాండి మురుగన్ అనే యువకుడితో బీరెత్తికుమారికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ ఉల్లాసంగా ఉన్న సమయంలో తీసుకున్న వీడియోను ఆమె భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేశాడు. దీనిపై బీరెత్తికుమారి, బిక్కుకుమార్ ఈ నెల 17వ తేదీ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కోవై గణేషన్పురంలో కాపురం పెట్టారు. చదవండి: లక్ష రూపాయల కోసమే రాజేశ్వరి వివాహేతర సంబంధం.. ఈ క్రమంలో పాండి మురుగన్ మరోసారి వీడియో పంపాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బీరెత్తికుమారి ఒంటరిగా ఉన్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న అన్ననూర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణ చేస్తున్నారు. -
శాడిస్టు భర్త.. భార్యపై అనుమానం, ఉద్యోగానికి వెళ్లనివ్వకుండా..
కోనేరుసెంటర్(మచిలీపట్నం): భర్త వేధింపులు తాళలేని ఓ వివాహిత బలన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. సీఐ రాజశేఖర్ కథనం మేరకు.. మచిలీపట్నం బందరుకోటకు చెందిన పేటేటి లిఖిత (22)కు కోడూరు మండలం హంసలదీకి గ్రామానికి చెందిన ఇజిటి గోపాల కృష్ణతో గత ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది. దంపతులు మచిలీపట్నంలోని ఈడేపల్లిలో కాపురం మొదలుపెట్టారు. కొన్ని నెలలు సజావుగా సాగిన వీరి కాపురంలో గోపాలకృష్ణ కారణంగా కలతలు మొదలయ్యాయి. గోపాలకృష్ణ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉండటంతో పాటు భార్యను తరుచూ అనుమానించటం మొదలుపెట్టాడు. కుటుంబ పోషణను పట్టించుకోకుండా తిరగడం, భార్యను ఉద్యోగానికి పంపకుండా మానసికంగా వేధిస్తుండటంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో సోమవారం భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. గోపాలకృష్ణ తిట్టటంతో మనస్తాపానికి గురైన లిఖిత ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య ఉరివేసుకోవడాన్ని గోపాలకృష్ణ గుర్తించి ఉరి నుంచి కిందికి దింపి చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో చేర్చాడు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లిఖిత పరిస్థితి విషమించి మంగళవారం కన్నుమూసింది. విషయం తెలుసుకున్న చిలకలపూడి సీఐ రాజశేఖర్ విజయవాడలోని ఆస్పత్రికి చేరుకుని బంధువుల నుంచి వివరాలు సేకరించారు. లిఖిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
భర్తతో గొడవ పడి భార్య ఆత్మహత్య
షాబాద్: భర్తతో గొడవ పడి కూతురు ఆత్మహత్యకు పాల్పడగా.. మనస్తాపంతో ఆమె తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ గురువయ్యగౌడ్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని హైతాబాద్ గ్రామానికి చెందిన కుమ్మరి మల్లేశ్, యాదమ్మ దంపతులకు కుమారుడు గురుప్రసాద్, కూతురు సుమిత్ర సంతానం. ఏడేళ్ల క్రితం మల్లేశ్ మృతి చెందడంతో వీరి బాగోగులు తల్లి యాదమ్మ చూసుకునేది. కూతురు సుమిత్రకు రుద్రారం గ్రామానికి చెందిన కుమ్మరి శివకుమార్‌తో రెండున్నరేళ్ల క్రితం వివాహం జరిపించారు. దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శివకుమార్ 26న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యతి్నంచాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సుమిత్ర (22) మంగళవారం రాత్రి హైతాబాద్‌లో తల్లిగారి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణించిందని తల్లి యాదమ్మ(45) నీటి సంపులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
8 ఏళ్లుగా సహజీవనం.. చివరికి షాకింగ్ ట్విస్ట్.. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ : సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు భరించలేక ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా బోట్లవనపర్తికి చెందిన పల్లవి (27) నగరంలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. కొన్నేళ్ల క్రితం ఇందిరానగర్‌కు చెందిన సదానందంతో పరిచయం ఏర్పడింది. సదానందం పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో 8 ఏళ్లుగా అతనితో సహజీవనం చేస్తుంది. అతడికి భార్య పిల్లలు ఉన్నట్లు తెలిసినా పల్లవి సర్దుకుపోయింది. అయితే సదానందం తరచూ ఆమెను కొట్టేవాడు. ఈ విషయాన్ని పల్లవి పలుమార్లు తల్లి దృష్టికి తీసుకెళ్లింది. ఈ నెల 22న తల్లికి ఫోన్ చేసి సదానందం వేధింపులు భరించలేకపోతున్నానని ఊరికి వచ్చేస్తానని చెప్పింది. మరుసటి రోజు రాత్రి కూడా సదానందం ఆమెపై దాడి చేయడంతో మనస్తాపానికిలోనైన పల్లవి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన సదానందం బస్తీ వాసులతో కలిసి ఆమెను కిందకు దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తల్లి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు సదానందంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
అందం ఆమె పాలిట శాపమైంది
మైసూరు: అందం ఆమె పాలిట శాపమైంది, చదువుకుని ఖాళీగా ఉండడం ఎందుకని ఓ చిన్నపాటి ఉద్యోగంలో చేరితే పై అధికారి కామాంధునిగా మారాడు. సెస్కాంలో ఉన్నతాధికారి వేధింపులను తట్టుకోలేక మహిళా కంప్యూటర్ ఆపరేటర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కొడగు జిల్లా మడికెరి వద్ద మంగళవారం జరిగింది. ఫోన్ చేయి, వాట్సప్ చాట్ అని ఒత్తిడి వివరాలు.. మడికెరి తాలూకా కగ్గోడ్లు గ్రామానికి చెందిన సౌమ్య అనే మహిళ గతేడాది మేలో మడికెరి సెస్కాం కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరారు. అయితే సహాయక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) వినయ్ ఆమైపెన కన్నేశాడు. నాకు ఫోన్ చేయి, వాట్సాప్ చాట్ చేయి అంటూ సౌమ్యను తరచూ వేధించేవాడని సౌమ్య భర్త, విశ్రాంత జవాన్ తెలిపారు. వినయ్ వేధింపులు అలాగే కొనసాగుతుండడంతో విరక్తి చెందిన సౌమ్య ఇంట్లో పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త మడికెరి మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఏఈఈ వినయ్‌పై కేసు నమోదు చేశారు. -
పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య
నల్గొండ: కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మంగళవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పర్వేదుల గ్రామానికి చెందిన పున్నె బ్రహ్మం పది సంవత్సరాల క్రితం పెద్దఅడిశర్లపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి(28)ని కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు విఘ్నేష్, కుమార్తె గాయత్రి సంతానం. వీరు పర్వేదుల గ్రామంలోనే కిరాణ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి దాంపత్య జీవితంలో గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత నెల 19న కుటుంబ కలహాలతో ధనలక్ష్మి ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఆమెను నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి మంగళవారం ఆమె మృతిచెందింది. మృతురాలి తల్లి కుంచెపు కళమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పచ్చిపాల పరమేష్ తెలిపారు. కాగా ఆస్పత్రిలోనే నల్లగొండ జడ్జి చేత మరణ వాంగ్మూలం రికార్డు చేసినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
నా భర్త పెద్ద సైకో!: లేఖ రాసి.. హెడ్ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
నస్పూర్(మంచిర్యాల): భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రవికుమార్, మృతురాలు రాసిన సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న వివరాల ప్రకా రం పట్టణ పరిధిలోని నాగార్జున కాలనీలో నివాసం ఉండే ఆకుదారి కిష్టయ్య తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య వనిత (35) కూతుర్లు వర్షశ్రీ, చరితశ్రీ, కుమారుడు కృష్ణవంశీ ఉన్నారు. కిష్టయ్య భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతుండేవాడు. సోమవారం కిష్టయ్య పని నిమిత్తం బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి వనిత ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతురాలి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. వాగ్వాదానికి దిగిన స్థానికులు వనిత ఆత్మహత్యకు భర్త కిష్టయ్యనే కారణమని, అతడిని ఇక్కడికి తీసుకురావాలని స్థానికులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించకుండా అడ్డుకున్నారు. ఎస్సై రవి కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ వారికి సర్దిచెప్పారు. -
తల్లి చెప్పిన మాటలు నచ్చక.. యువతి షాకింగ్ నిర్ణయం
మార్కాపురం(ప్రకాశం జిల్లా): ఉన్నత చదువులు చదువుకోవాలని తల్లి చెప్పిన మాటలు నచ్చక ఓ యవతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం మార్కాపురం పట్టణ పరిధిలోని తర్లుపాడు రోడ్డులో సబ్‌స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన నాగలక్ష్మీ కూతురు సాయిసింధు డిగ్రీ పూర్తి చేసింది. పీజీ చదవాలని తల్లి సూచించగా ఇష్టం లేదని చెప్పింది. ఉన్నత చదువులు చదివితే ఉద్యోగం వస్తుందని, పీజీలో చేరేందుకు కళశాలకు వెళ్లాలని తల్లి గురువారం మరోసారి నచ్చజెప్పింది. చదవడం ఇష్టం లేని సింధు తల్లి బయటకు వెళ్లగానే లోపల తలుపు గడియ వేసుకుని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లి తలుపులు మూసి ఉండటంతో ఆందోళన చెంది పగులగొట్టింది. విగత జీవిగా మారిన కుమార్తెను చూసి బోరున విలపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై శశికుమార్ తెలిపారు. చదవండి: గ్యాస్ట్రబుల్ అని వెళ్తే.. షాక్ ఇచ్చిన డాక్టర్.. ఎంత పనిచేశాడంటే? -
నువ్వు చచ్చిపోతే నా కొడుక్కి మూడో పెళ్లి చేస్తా...
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు) : నా చావుకు.. భర్త, అత్తమామలే కారణం. భర్త, అత్త అసలు మనుషులే కాదు. ఎన్నో రకాలుగా హింసించారు. నేను చనిపోతే వాళ్లు నా పిల్లలను రోడ్డున వదిలేస్తారు.. అందుకే వారినీ నాతో పాటు తీసుకుపోతున్నా.. తన ఆత్మహత్యకు దారితీసిన నేపథ్యాన్ని ఓ వివాహిత ఇలా సూసైడ్ నోట్లో వివరించడం అందరికీ కంటతడి పెట్టించింది. వివాహితతో పాటు ఏడాది పసికందు అక్షిత శుక్రవారం ఉదయం మృతి చెందగా.. 4 ఏళ్ల తుషిత మృత్యువుతో పోరాడుతోంది. అయితే వీరి మృతికి భర్త మోహన్‌కృష్ణతో పాటు అత్త రామలక్ష్మిగా కుటుంబ సభ్యులు, పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై శైలజ తల్లి అనంతలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీపీ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైనప్పటి నుంచీ వేధింపులే..: ఎంవీపీకాలనీ పోలీసు స్టేషన్ పరిధిలోని కృష్ణా కళాశాల సమీపంలో సంపంగి మోహన్ కృష్ణ తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. 2017లో నగరానికి చెందిన సంపంగి మోహన్‌కృష్ణ.. రాజమండ్రి సమీపంలోని నాతవరానికి చెందిన శైలజ (34)ను వివాహం చేసుకున్నాడు. మోహన్‌కృష్ణకు ఇది రెండో వివాహం. అతను నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో మార్కెటింగ్ డిపార్టుమెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లైన మరుసటిరోజు నుంచి శైలజను అదనపుకట్నం కోసం మోహన్‌కృష్ణ అతని తల్లి రామలక్ష్మి వేధింపులకు గురిచేసే వారు. అత్త సూటిపోటి మాటలతో హింసించడంతో పాటు భర్త రోజూ తాగి వచ్చి కొట్టేవాడు. దీనికి తోడు ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో చిత్రహింసలు మరింత ఎక్కువయ్యాయి. తనకు బాబు కావాలని వేధించేవాడు. నువ్వు చచ్చిపోతే తన కొడుక్కి మూడో పెళ్లి చెస్తానంటూ అత్త వేధించేది. దీంతో పాటు సారి విషయంలోనూ శైలజకు వేధింపులు అధికమయ్యాయి. వివాహం సమయంలో రూ. 5 లక్షల కట్నంతో పాటు రూ.40 వేలు ఆడపడుచు కట్నం, 10 తులాల బంగారు శైలజ పుట్టింటివాళ్లు పెట్టారు. ఇవి సరిపోని మోహన్‌కృష్ణ, అత్త రామలక్ష్మి రూ.2లక్షలు సారి తేవాలని శైలజను టార్చర్ చేశారు. దీంతో తల్లిదండ్రులకు, తోబుట్టువులకు తన పరిస్థితిని చెప్పుకుని శైలజ బాధపడేది. దీంతో కుటుంబ సభ్యులు సారి నిమిత్తం రూ.50 వేలు మోహన్‌కృష్ణకు అందజేశారు. అయిప్పటికీ మిగతా డబ్బులు తీసుకురావాలని నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. చాలా సార్లు చచ్చిపోవాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు ఆమె కుటుంబ సభ్యులకు వివరించింది. పిల్లలతో పాటు ఆత్మహత్యాయత్నం వేధింపులు తట్టుకోలేని శైలజ తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నెల 29న పిల్లలకు దోమలు స్ప్రై తాగించింది. అనంతరం తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఈ విషయాన్ని గమనించిన మోహన్‌కృష్ణ, అతని తల్లి రాత్రి 8 గంటల సమయంలో శైలజను పిల్లలను మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మెడికవర్‌లో చికిత్స పొందుతూ శైలజ, చిన్న కూతురు అక్షితలు శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. పెద్ద కూతురు తుషిత(4) ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. అయితే శైలజ, పాప మృతి సమాచారం తెలు సుకున్న మోహన్‌కృష్ణ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు శైలజ, అక్షితల మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మోహన్‌కృష్ణను కస్టడీలోకి తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య
(నెల్లూరు) ఉలవపాడు: ప్రేమించిన అబ్బాయి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల కేంద్రమైన ఉలవపాడులో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఉలవపాడుకు చెందిన కుంచాల భార్గవి (19) దర్గా సెంటర్లో నివాసం ఉంటోంది. అదే కాలనీకి చెందిన మాల్యాద్రి, భార్గవి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తర్వాత మాల్యాద్రి పెళ్లి చేసుకోనని అడ్డం తిరిగాడు. తనకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, బలవంత పెడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో యువతి లేఖ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. తర్వాత కుటుంబసభ్యులు గుర్తించారు. ఎమ్మెల్యే దృష్టికి.. ఈనెల 10వ తేదీన జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి భార్గవి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో యువతి సమస్యను తెలియజేసింది. పోలీసులు పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరింది. వెంటనే ఎమ్మెల్యే అక్కడే ఉన్న ఏఎస్సై సుబ్బారావును పిలిచి నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఇంతలోనే యువతి ఆత్మహత్య చేసుకుంది. -
జాబ్ ఇష్టం లేక యువతి ఆత్మహత్య
తూర్పు గోదావరి (కొవ్వూరు) : ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఓ యువతి శనివారం ఆత్మహత్య చేసుకుంది. వివరాలివీ.. నందమూరుకు చెందిన చిట్టిబాబు కుమార్తె యంగల శ్రీదేదీప్య (22) ఏలూరులో ఎమ్మెస్సీ న్యూట్రీషియన్ చదివింది. విశాఖపట్నం సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో రెండు నెలల పాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి, శుక్రవారం సాయంత్రం స్వస్థలం వచ్చింది. ఆమెకు సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. తనకు ఆ జాబ్ చేయడం ఇష్టం లేదని పీజీ చేస్తానని తండ్రి చినబాబుకు శ్రీదేదీప్య చెప్పింది. ఆర్థిక పరిస్థితి బాగా లేనందున జాబ్‌లో చేరాలని తండ్రి సూచించారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున టాయిలెట్ కోసం లేచిన తండ్రికి శ్రీదేదీప్య నోటి వెంట నురగలతో అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను వెంటనే కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీదేదీప్య మృతి చెందింది. ఆమె ఇంట్లోని చీమల మందు తాగి ఉండవచ్చునని తండ్రి అభిప్రాయపడుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై జి.సతీష్ తెలిపారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఇలా చేస్తాడని ఎవరు అనుకోరు
నల్గొండ (సూర్యాపేట) : అత్తింటి వేధింపులకు మరో వివాహిత బలైంది. ఈ విషాదకర ఘటన ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గుంజె పిచ్చయ్య కూతురు రమాదేవి (21), ఇదే మండలం తుమ్మలపెనపహాడ్ గ్రామానికి చెందిన వరికుప్పల విజయ్ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 6 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో కట్నంగా నగదుతో పాటు ప్లాటు, మండల కేంద్రంలో వ్యవసాయ భూమిని ఒప్పుకున్నారు. విజయ్ వృత్తి రీత్యా డ్రైవర్ కావడంతో సూర్యాపేటలో కాపురం పెట్టారు. కాగా, కొద్ది రోజులుగా అదనపు కట్నం తేవాలని భర్త అత్త మామలు రమాదేవిని వేధిస్తున్నారు. భర్త విజయ్ తరచూ చిత్రహింసలు గురి చేస్తుండడంతో రమాదేవి మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14న రాత్రి గుర్తుతెలియని టాబ్లెట్స్ మింగింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున రమాదేవి మృతిచెందింది. మృతురాలి తండ్రి గుంజె పిచ్చయ్య ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదవేందర్‌రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
భర్తను వదిలి ప్రియుడితో మూడేళ్లు సహజీవనం.. ఆ క్రమంలోనే..
పీలేరు రూరల్ : ప్రియుడి వేధింపులతో సహజీవనం చేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం పీలేరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన వెంకటముని కుమార్తె పొన్ను నిరోషా (28)కు పదేళ్ల క్రితం దేవరకొండ పంచాయతీ మైలవాండ్లపల్లెకు మంజునాథ్‌తో వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. అయితే మూడేళ్ల క్రితం పీలేరు పట్టణం రాఘవేంద్రనగర్‌కు చెందిన యుగంధర్ ఆచారితో నిరోషాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. నిరోషా భర్తతో గొడవ పడి యుగంధర్ ఆచారి వద్దకు చేరుకుంది. మూడేళ్లుగా సహజీవనం సాగిస్తోంది. కొంతకాలంగా యుగంధర్ఆచారి వేధింపులతో జీవితంపై విరక్తి చెందిన నిరోషా శుక్రవారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన యుగంధర్ ఆచారి ఆయన భార్య భవ్య హుటాహుటిన నిరోషాను కిందకు దింపి చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిరోషా తండ్రి వెంకటముని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. చదవండి: (రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం..) -
ఇష్టం లేని పెళ్లి చేశారంటూ యువతి..
ఇష్టం లేని పెళ్లి చేశారని యువతి పురుగుల మందు తాగగా, భార్య విడాకులు ఇచ్చిందని భర్త బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో మంగళవారం చోటుచేసుకున్నాయి. వరంగల్ (చిల్పూరు): జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని కొత్తపల్లెకు చెందిన దామెర రేఖ (22) తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ మంగళవారం తెల్లవారుజామున క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాజు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొత్తపల్లెకు చెందిన దామెర లచ్చమ్మ కుమారుడు రాజ్‌కుమార్‌కు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన గొడిశాల కుమారస్వామి–స్వరూపల కుమార్తె రేఖతో గత మార్చి 30వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి అయిన నాటినుంచి ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని రేఖ భర్తతో ఎడమొహం పెడమొహంగా ఉండేది. కొద్దిరోజులు పుట్టింటికి పంపితే మారుతుందని పంపించారు. సోమవారం రేఖను తిరిగి చిల్పూరుకు తీసుకువచ్చారు. మంగళవారం తెల్ల వారు జామున క్రిమిసంహారక మందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. భార్య విడాకులు ఇచ్చిందని భర్త.. గార్ల : మహబూబాబాద్ జిల్లా గార్ల పంచాయతీ పరిధి గండి గ్రామానికి చెందిన అత్తులూరి భాస్కర్ (36)భార్య విడాకులు ఇచ్చిందని జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పో లీసుల కథనం ప్రకారం.. అత్తులూరి భాస్కర్ గార్లలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. 14 ఏళ్ల క్రితం అమలేశ్వరితో వివాహం జరిగింది. కొన్నేళ్లపాటు వీ రి వైవాహిక జీవితం సజావుగానే సాగింది. ఆరేళ్ల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. గత జనవరిలో భార్య విడాకులు ఇచ్చింది. భార్య లేదనే మనస్తాపంతో భాస్కర్ మ ద్యానికి బానిసయ్యాడు. జీవి తంపై విరక్తి చెందిన భాస్కర్ ఈ నెల 5న ఇంట్లో తల్లితండ్రులకు గార్ల వెళ్లొస్తానని చె ప్పి, ఇంటికి 100 మీటర్ల దూ రంలో గల వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున గ్రా మానికి చెందిన ఓ వ్యక్తి బహిర్భూమికి వెళ్లగా భాస్కర్ బావిలో శవమై కనిపించగా కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. మృతుడి అన్న శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై బానోత్ వెంకన్న తెలిపారు. -
‘ఏ తప్పూ చేయలేదు.. నా చావును కోరుకుంటున్నారు కదా.. మీ కోరిక తీరుస్తా’
సాక్షి, హైదరాబాద్: జీవితంలో ఏ తప్పూ చేయలేదు.. అనుకోకుండా జరిగిన సంఘటనను అడ్డుపెట్టుకుని కోపం తీర్చుకుంటున్నారు.. నా చావును కోరుకుంటున్నారు కదా.. మీ కోరిక తీరుస్తా.. అంటూ సూసైడ్ నోట్‌రాసి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... అమలాపురానికి చెందిన సంధ్య(19) వివాహం ఏడాది క్రితం మేనమామ వరసయ్యే మీర్సాహెబ్తో జరిగింది. మీర్‌సాహెబ్ కార్పెంటర్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి కార్మికనగర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కొన్నిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం సంధ్య తన తల్లితో కలిసి ఆటోలో మూసాపేట నుంచి ఇంటికి వచ్చింది. అయితే ఆ ఆటోలో ఎందుకు వచ్చావంటూ ఆమెపై భర్త కోప్పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. అడ్డు వచ్చిన అత్తపై మీరాసాహెబ్ చేయి చేసుకోవడంతో పాటు దుర్భాషలాడాడు. రాత్రంతా ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఏ తప్పూ చేయలేదంటూ సంధ్య వాదనకు దిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భర్తను ఉద్దేశించి సూసైడ్ నోట్ రాసిన సంధ్య గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్ పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: అనన్యా .. సారీ! నువ్వు నాతో సంతోషంగా బతకలేవు ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అడిగినప్పుడల్లా అదనపు కట్నం ఇచ్చినా.. సంతోషి దక్కలేదు
ఆదిలాబాద్(నేరడిగొండ): అదనపు కట్నం వేధింపులకు ఓ వివాహిత బలైన ఘటన నేరడిగొండ మండలం రాజుర గ్రామంలో శుక్రవారం జరిగింది. బోథ్ మండలం కండేపల్లి గ్రామానికి చెందిన ప్రకాష్–శ్యామల దంపతుల కూతురు సంతోషి ఉరఫ్ కృష్ణవాణి(26)కి రాజుర గ్రామానికి చెందిన పృథ్వీరాజ్‌తో ఏడాది క్రితం వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ.18.50 లక్షల నగదు, బంగారం, ఇతర లాంచనాలు ముట్టజెప్పారు. మూడు నెలలు సాఫీగా సాగిన కాపురం జీవితంలో అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. దీంతో సంతోషి తల్లిదండ్రులు అదనంగా రూ.6 లక్షలు ఇవ్వడంతోపాటు నిర్మల్‌లో ప్లాట్ కొనుగోలు చేశారు. శుక్రవారం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. ఉదయం 7:30 గంటలకు పృథ్వీరాజ్ తండ్రి ప్రకాష్‌కు ఫోన్ చేసి సంతోషి ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. దీంతో కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన రాజుర గ్రామానికి చేరుకున్నారు. విగతజీవిగా ఉన్న కూతురును చూసి బోరున విలపించారు. ఇంతలో ఇచ్చోడ సీఐ రమేశ్‌బాబు, ఎస్సై మహేందర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి బంధువులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వివరించారు. ఇంతలో ఏఎస్పీ హర్షవర్ధన్ చేరుకుని కుటుంబీకులకు నచ్చజెప్పారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పడంతో వారు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం బోథ్ ఆస్పత్రికి తరలించారు. భర్త పృథ్వీరాజ్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు, ఆడపడుచులు, అల్లుళ్లు చిత్రహింసలు పెట్టి చంపారని ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: సరదాగా మాట్లాడుకుందామని పిలిచి.. -
పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మామిడికాయ పచ్చడి.. క్షణికావేశంలో
సాక్షి, కరీంనగర్: రామడుగు మండలంలోని గోపాల్‌రావుపేటకు చెందిన ఇరుకు సాయిప్రియ(28) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. సాయిప్రియ–తిరుపతి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. సాయిప్రియ బీడీలు చేస్తుండగా తిరుపతి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గురువారం సాయంత్రం మామిడికాయ పచ్చడి విషయంలో దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. సాయిప్రియ క్షణికావేశంలో వంట గదిలోకి వెళ్లి, ఒంటిపైన కిరోసిన్ పోసుకొని, నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు ఆర్పివేసే క్రమంలో భర్త తిరుపతి, తోటి కోడలికి గాయాలయ్యాయి. సాయిప్రియను కరీంనగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. శుక్రవారం మృతురాలి తండ్రి గంటి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ప్రేమ పేరుతో ఎస్ఐ వంచన
అనంతపురం : ఎస్ఐ చేతిలో వంచనకు గురై ఆత్మహత్యాయత్నం చేసిన యువతి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ...పామిడి మండలం గురుమాంజనేయ (జీఏ) కొట్టాలకు చెందిన రమావత్ విజయ్‌కుమార్‌నాయక్ తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈయన అనంతపురానికి చెందిన భారతిని ప్రేమించాడు. అయితే పెళ్లికి ససేమిరా అనడంతో ఆమె “దిశ’ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. తొమ్మిది నెలల క్రితం పెళ్లితో ఈ ప్రేమ కథ సుఖాంతమైంది. అయితే విజయ్‌కుమార్ తన స్వగ్రామానికి చెందిన తిరుపాల్‌నాయక్ కుమార్తె సరస్వతితోనూ ప్రేమాయణం నెరిపాడు. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. రెండు రోజుల క్రితం సరస్వతి జీఏ కొట్టాలలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. సరస్వతి తండ్రి తిరుపాల్‌నాయక్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయకుమార్‌పై పామిడి సీఐ ఎం.ఈరన్న కేసు నమోదు చేశారు. విజయ్‌కుమార్ ఎస్ఐ కాక ముందు గుంతకల్లు మున్సిపాలిటీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఓ మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో వంచించినట్లు సమాచారం. -
రూ.20 లక్షల కట్నం, ఘనంగా పెళ్లి.. ఏడాది కాకముందే..
సాక్షి, సిరిసిల్ల: వరకట్నం వేధింపులకు నవ వధువు బలైంది. హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకోగా.. మృతదేహాన్ని కస్బెకట్కూర్‌కు తరలించారు. సిరిసిల్లలోని అబ్బాయి ఇంటి వద్ద అమ్మాయి కుటుంబీకులు, గ్రామస్తులు నిరసన తెలుపగా.. పోలీసులు బందోబస్తు చేపట్టారు. మృతురాలి పెద్దనాన్న జూపల్లి వేణుగోపాల్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటకు చెందిన చీటి ఉదయ్‌కు తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్‌కు చెందిన జూపల్లి నిఖితకు 11 నెలల క్రితం వివాహమైంది. రూ.20 లక్షల కట్నం, ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి చేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అయిన ఉదయ్, నిఖితలు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఉదయ్ అదనపు కట్నం తేవాలని నిఖితను వేధించసాగాడు. తల్లిగారింటి వద్ద వ్యవసాయ భూమిలో నుంచి రెండెకరాలు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైన నిఖిత హైదరాబాద్‌లో వారు ఉంటున్న ఇంట్లోనే గురువారం తెల్లవారుజామున ఉరేసుకుంది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు అంబులెన్స్‌ను కస్బెకట్కూర్ పంపించిన పోలీసులు నిఖిత కుటుంబసభ్యులు ఆమె మృతదేహంతో హైదరాబాద్ నుంచి అంబులెన్స్‌లో బయలుదేరారు. సిరిసిల్లలోని నిఖిత అత్తగారింటి వద్ద ధర్నా చేస్తారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వారు తంగళ్లపల్లి మండలం జిల్లెల చెక్‌పోస్టు వద్ద అంబులెన్స్‌ను అడ్డుకొని, కస్బెకట్కూర్‌కు పంపించారు. మృతురాలి పెద్దనాన్న ఆధ్వర్యంలో పలు వు రు ముందుగానే ఉదయ్ ఇంటికి వెళ్లగా.. అప్పటికే తాళం వేసి, పరారయ్యారు. ఎలాంటి తప్పు చేయకుంటే ఇంట్లో ఎందుకు ఉండరని ప్రశ్నిస్తూ అక్కడే నిరసనకు దిగారు. అయితే మృతదేహం కస్బెకట్కూర్‌లో ఉండగా కుటుంబసభ్యుల్లో కొందరు సిరిసిల్లలో ఉదయ్ ఇంటి వద్దే ధర్నా చేస్తున్నారు. ►ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మెట్రో స్టేషన్ పైనుంచి దూకి యువతి మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని అక్షర్ధామ్ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఓ యువతి (22) ఆత్మహత్యకు పాల్పడింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన ఈమె గురువారం ఉదయం 7.30 సమయంలో మెట్రోస్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి కిందికి దూకేందుకు ప్రయత్నించింది. అది చూసి వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెను వారించేందుకు ప్రయత్నించారు. ఆమె వినకపోవడంతో కాపాడేందుకు కింద భారీ దుప్పటిని అడ్డుగా పట్టుకుని నిలబడ్డారు. కిందికి దూకిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో కన్నుమూసిందని అధికారులు తెలిపారు. ఆ యువతి గత కొద్ది రోజులుగా గుర్గావ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసిందన్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. మెట్రో భవనం పైనుంచి దూకుతున్న యువతి -
భయానక దృశ్యం.. ఆ చిన్నారులు స్కూల్ కెళ్లి ఇంటికి వచ్చేసరికి..
వీరఘట్టం(పార్వతీపురం మన్యం జిల్లా): ఉదయం అమ్మ చేతి గోరుముద్దలు తిని స్కూల్‌కు వెళ్లిన ఆ చిన్నారులు.. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తల్లి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతుండడం చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఆ భయానక దృశ్యాన్ని చూసిన చిన్నారుల గొంతు మూగబోయింది. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం తూడి గ్రామానికి చెందిన కిక్కర శంకరమ్మ(45) మంగళవారం మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చదవండి: బీటెక్ ఫెయిలవ్వడంతో.. ఉప్పుటేరులో దూకి.. వీరఘట్టం మండలం తూడి గ్రామానికి చెందిన కిక్కర పారయ్య, కొమరాడకు చెందిన శంకరమ్మకు 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పారయ్యకు రెండో వివాహం. పారయ్య, శంకరమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు హరికృష్ణ, ధనుష్‌లు ఉన్నారు. గొర్రెల కాపరి అయిన పారయ్య, భార్య శంకరమ్మతో అన్యోన్యంగా ఉండేవాడు. అయితే మంగళవారం ఉదయం భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో గానీ గ్రామసమీపంలో ఉన్న గొర్రెల మందను కాసేందుకు భర్త వెళ్లగా, భార్య శంకరమ్మ ఇద్దరు పిల్లలకు భోజనం పెట్టి ఊళ్లో ఉన్న స్కూల్‌కు పంపించింది. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై ఎం.హరికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ట్రిపుల్ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
నూజివీడు: స్థానిక ట్రిపుల్ఐటీ విద్యార్థిని మరడపు హారిక (19) ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతున్న హారిక స్వస్థలం తూర్పుగోదా వరి జిల్లా రాజమండ్రి నగరంలోని కొత్తపేట. వేకువజామున 5.45 గంటల ప్రాంతంలో తాను ఉంటున్న కే–3 హాస్టల్ భవనంపై భాగంలోకి వెళ్లి అక్కడే బ్లేడ్‌తో రెండు చేతులకు మణికట్టు వద్ద, మెడవద్ద కోసుకొని ఆ తరువాత నాలుగంతస్తు పై నుంచి కిందకు దూకింది. విద్యార్థిని కిందకు దూకడంతో భారీగా శబ్దం రావడంతో పాల వ్యాను డ్రైవర్ చూసి వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన వచ్చి క్యాంపస్‌లోనే ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే నైట్ డ్యూటీ వైద్యురాలు ఆస్పత్రిలో లేకపోవడంతో పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. రెండు కాళ్లకు, వెన్నుపూస వద్ద తీవ్ర గాయాలయ్యాయి. బ్లేడ్‌తో కోసుకోవడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. క్షతగాత్రురాలికి రక్తం ఎక్కించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థిని స్పృహలోనే ఉండి ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలోని సెమిస్టర్–1 ఫలితాల్లో బ్యాక్‌లాగ్స్ ఉండటంతో భయంవేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పిందని ట్రిపుల్ఐటీ అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని నూజివీడు సీఐ ఆర్.అంకబాబు, పట్టణ ఎస్ఐ తలారి రామకృష్ణ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించొద్దన్నందుకు యువతి ఆత్మహత్య
వరంగల్ (పాలకుర్తి) : ప్రేమించొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు మండలంలోని మల్లంపల్లి గ్రామం బిక్షునాయక్ తండాకు చెందిన గుగులోతు ప్రియాంక(18) శనివారం ఆత్మహత్య చేసుకుంది. ప్రియాంక హనుమకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె ఒకరిని ప్రేమించిందని తల్లిదండ్రులు మందలించారు. మనస్థాపం చెందిన ప్రియాంక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. చికిత్స నిమిత్తం జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రియాంక తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు. -
హైదరాబాద్: నవ వధువు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. డొయెన్స్ కాలనీ ఉంటున్న ఫాతిమా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఫాతిమా తన భర్త, అత్తమామల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందని వివాహిత తల్లి తండ్రుల ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భార్యపై అనుమానం.. వివస్త్రను చేసి.. తాడుతో బిగించి -
రెండేళ్లుగా ప్రేమ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో..
సాక్షి, ఆదిలాబాద్: ప్రేమించిన యువకుడితో పెళ్లికి అతడి కుటుంబీకులు నిరాకరించడంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని ఖండాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై హరిబా బు తెలిపిన వివరాలు.. ఖండాల గ్రామానికి చెందిన చౌహాన్ సునీత (20), శ్రీనివాస్ గతేడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. శ్రీనివాస్ కుటుంబీకులు పెళ్లికి నిరాకరించడంతో సునీత ఆదివారం ఇంట్లో పురుగులు మందు తాగింది. గమనించిన కుటుంబీకులు రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో శ్రీనివాస్‌తోపాటు పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
రెండు రోజుల్లో వివాహం.. అంతలోనే..
సాక్షి, చెన్నై: మరో రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా అధ్యాపకురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తూత్తుకుడి జిల్లాలో జరిగింది. నజ్రత్ డేనియల్ వీధికి చెందిన సెంథిల్ మురుగన్, శాంతి కుమార్తె వేలాంగని తెన్కాశిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. అదే కళాశాలలో పనిచేస్తున్న ఈ రోడ్డుకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 9న వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈక్రమంలో సోమవారం వేలాంగని తల్లితో గొడవ పడింది. దీంతో మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చదవండి: పెళ్లై ఇద్దరు పిల్లలు, ఇంకా పెళ్లి కాలేదని..హోటల్‌కు తీసుకెళ్లి -
పీఎఫ్ డబ్బు ఇప్పించలేదని కిరోసిన్ పోసుకుని
సాక్షి, బంజారాహిల్స్: పీఎఫ్ డబ్బు ఇప్పించడం లేదనే ఆవేదనతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఫిలింనగర్‌లోని సైదప్ప బస్తీలో నివసించే జె.సంగీత(45) సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఐదేళ్లుగా హౌస్‌కీపింగ్ విభాగంలో పని చేస్తుంది. ఇటీవల ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించారు. రోజూ ఆఫీస్‌కు వెళ్లి తన పీఎఫ్ డబ్బులు అడుగుతుండగా హౌస్‌కీపింగ్ సూపర్వైజర్ ప్రవీణ్ కుమార్ పట్టించుకోకపోగా సమాధానం సైతం ఇవ్వకపోవడంతో తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. చుట్టుపక్కల వారు గమనించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కరోనా దెబ్బతో 71 లక్షల ఈపీఎఫ్ ఖాతాల తొలగింపు -
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో మహిళ ఆత్మహత్య
భోపాల్: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం కలకలం రేపుతోంది. మృతురాలు, ఎమ్మెల్యే జీవితంలో ఆమెకు స్థానం లభించనందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ మాజీ మంత్రి ఉమాంగ్ సింఘర్ భోపాల్ నివాసంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలం నుంచి సూసైడ్ నోట్ లభ్యం చేసుకున్నారు. దీనిలో ‘‘సింఘర్ జీవితంలో నాకు చోటు లేదని అర్థం అయ్యింది. అందుకే నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నాను’’ అని రాసి ఉందని తెలిపారు పోలీసులు. మృతురాలిని భోపాల్‌లోని షాపురా ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు. ఏడాది కాలంగా ఆమెకు, సింఘర్‌కు పరిచయం ఉందని.. మృతురాలు తరచుగా ఎమ్మెల్యే నివాసానికి వస్తూ ఉండేదన్నారు. పైగా ఆమె మరణించడానికి 25-30 రోజుల ముందు నుంచి ఎమ్మెల్యే నివాసంలోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రాజేష్ సింగ్ భదోరియా మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యే భవనంలో ఓ పనిమనిషి, అతడి భార్య నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పనిమనిషి భార్య, మృతురాలు నిద్రిస్తున్న గది తలుపు తట్టి చూడగా.. ఎలాంటి స్పందన లేదు. దాంతో వెంటనే సర్వెంట్ ఈ విషయాన్ని సింఘర్‌కు తెలిపాడు. ఇక ఎమ్మెల్యే సూచనల మేరకు పనిమనిషి గదిలోకి వెళ్లి చూడగా.. అక్కడ సదరు మహిళ వేలాడుతూ కనిపించింది’’ అన్నారు. సింఘర్ మాట్లాడుతూ.. ‘‘ఇది హృదయ విదారక సంఘటన. చనిపోయిన మహిళ నాకు మంచి స్నేహితురాలు. ఆమె మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. చికిత్స తీసుకుంటుందని నాకు తెలియదు. గత రెండు రోజులుగా నేను భోపాల్‌లో లేను. ఇక పోలీసులు ఆమె వద్ద నుంచి అంబాలా, భోపాల్ ఆస్పత్రులకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్లను కనుగొన్నారు. ఇక సదరు మహిళ అనారోగ్యం గురించి నాకు ముందే తెలిసి ఉంటే.. మంచి చికిత్స ఇప్పించేవాడిని. ఇలా జరగకుండా చూసేవాడిని’’ అని తెలిపారు. చదవండి: నా చావుతోనైనా కుటుంబానికి రక్షణ కల్పించండి -
పెళ్లికి ప్రియుడు ఒప్పుకోలేదని..
పటాన్చెరు టౌన్: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి విషయం వచ్చేసరికి ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదని ప్రియుడు చెప్పడంతో మనస్తాపం చెంది న ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధి లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పటాన్చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన విజయలక్ష్మి కి ఇద్దరు కూతుర్లు. రెండో కూతురు శ్రావణి (21) డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటుంది. శ్రావణి అదే గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి అలియాస్ విక్కీ ప్రేమించుకున్నారు. శ్రావణి మామ రాజశేఖర్‌రెడ్డి.. వెంకట్రామిరెడ్డితో పెళ్లి గు రించి మాట్లాడగా, శ్రావణి తో పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని చెప్పాడు. దీంతో పెళ్లి చేసుకోకపోతే శ్రావణి వెంటపడొద్దని మందలించడంతో, అప్పటి నుంచి వెంకట్రామిరెడ్డి శ్రావణిని కలవలేదు. గతేడాది శ్రావణి మామ రాజశేఖర్‌రెడ్డి మృతిచెందడంతో మళ్లీ వెంకట్రామిరెడ్డి శ్రావణిని ప్రేమిస్తున్నానని వెంటపడటం ప్రారంభించాడు. ఇది గమనించిన శ్రావణి తల్లి విజయలక్ష్మి తన కూతురుతో మాట్లాడొద్దని విక్కీని మందలించింది. ఈ క్రమంలో ఈనెల 10న విజయలక్ష్మి పెద్దనాన్న చనిపోవడంతో కుటుంబసభ్యుల తో కలసి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం శ్రావణి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసింది. సాయంత్రం కుటుంబసభ్యులు కార్యక్రమం ముగించుకొని ఇం టికి వచ్చేసరికి శ్రావణి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతోనే తన కూతురు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. -
ముగ్గురు కుమార్తెలతో బావిలో దూకిన తల్లి
-
అనంతపురం జిల్లాలో విషాదం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లి తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన పుట్టపర్తి మండలం పెద్దమ్మవారిపల్లిలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కుమార్తెలు మృతిచెందగా, తల్లిని స్థానికులు కాపాడారు. ఈ ఘటనలో కుమార్తెలు భవ్య(8),భార్గవి(8), చందన(5) మృతి చెందారు. తల్లి అరుణను ఆసుపత్రికి తరలించారు. తల్లి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. -
ఆత్మహత్య చేసుకుంటున్నా..!
గణపురం: ‘భర్తతో గొడవైంది.. జీవితం మీద విరక్తి చెందా.. నా రెండేళ్ల కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నా’అని ఓ మహిళ 100 నంబరుకు ఫోన్ చేసింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆమెను రక్షించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామానికి చెందిన కొడగాని మౌనిక.. బుధవారం 100 నంబర్‌కు డయల్ చేసింది. దీంతో కంట్రోల్ రూం నుంచి గణపురం పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా.. ఎస్సై రాజన్‌బాబు సిబ్బందితో హుటాహుటిన వారి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ఉన్న తల్లీ కొడుకులను స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. మౌనిక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని హైదరాబాద్‌లోని ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచి్చనట్లు ఎస్సై చెప్పారు. -
దేవునికడప చెరువులో మహిళ ఆత్మహత్య
కడప అర్బన్ : కడపకు చెందిన ఓ మహిళ శనివారం అర్ధరాత్రి– ఆదివారం తెల్లవారుజామున మధ్య సమయంలో దేవుని కడప చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక కో ఆపరేటివ్ కాలనీలో ఆటోడ్రైవర్ రమేష్, నాగరత్న (34) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. శనివారం రాత్రి భార్య, భర్త గొడవపడి.. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాన్ని కుటుంబ సభ్యులు పలు రకాలుగా తెలియజేస్తున్నారు. అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడిందా? లేక భర్త, కుటుంబ సభ్యులతో గొడవపడి, వారి వేధింపులు తాళలేక ఈ చర్యలకు పాల్పడి ఉంటారా? అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ సీఐ కె.అశోక్‌రెడ్డి తెలిపారు. -
కాపాడబోయి.. కాళ్లు విరగ్గొట్టుకున్నాడు..!
సాక్షి, కోదాడ: ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న మహిళను కాపాడబోయిన ఓ యువకుడు తన రెండు కాళ్లు విరగ్గొట్టుకున్న ఘటన బుధవారం ఉదయం పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం శ్రీనవాసనగర్లోని తిపిరిశెట్టి రాజు ఇంట్లో కింది పోర్షన్లో తాటిపల్లి రమాదేవి (55) కొంత కాలంగా అద్దెకు నివాసం ఉంటుంది. భర్తతో దూరంగా ఉంటున్న ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం ఉదయం తన ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ విషయాన్ని గమనించి పై అంతస్తులో ఉన్న రాజు కుమారుడు ఆమెను కాపాడేందుకు పై అంతస్తు నుంచి కిందకు దూకి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. ఒకేసారి దూకడంతో ఆయన రెండు కాళ్లు విరిగాయి. రమాదేవి అప్పటికే 90 శాతం కాలిపోవడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమె పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పవన్‌ను కోదాడలో ఓ పైవేట్ వైద్యశాలకు తరలించి విరిగిన రెండు కాళ్లకు కట్లు వేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కోదాడ పట్టణ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రవళిది హత్యా? ఆత్మహత్యా?
సిరిసిల్లక్రైం/వేములవాడరూరల్: ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాదిన్నరపాటు జీవితం గడిపిన ఇంట్లో వరకట్నం కోరలు చాచడంతో ఎదురుగట్ట రవళి(21)అనే వివాహిత బలైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామానికి చెందిన ఎడ్ల రవళి ఉరఫ్ ఎదురుగట్ల రవళి అదే ప్రాంతానికి చెందిన ఎదురుగట్ల శ్రవణ్ ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరుకావడం పెద్దలు అంగీకరించలేదు. సిరిసిల్లలోని గాంధీనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా భర్త శ్రవణ్‌తోపాటు అత్త లక్ష్మి కట్నం తేవాలని వేధింపులకు గురి చేయడంతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉరివేసుకుని విగతజీవిగా మారిన రవళి మృతదేహాన్ని పోలీసులు చేరుకునే సరికే కిందికి దించారు. దీంతో జరిగింది హత్యా? అత్మహత్య? అనే అనుమానాలు స్థానికంగా చర్చనీయమయ్యాయి. తన కూతురు అనుమానస్పదంగా మృతి చెందిందని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లి ఎడ్ల స్వప్న ఫిర్యాదుచేసింది. సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. -
ఉరేసుకొని యువతి ఆత్మహత్య
సాక్షి, నాగోలు: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యువతి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎల్బీనగర్ సీఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటి జంగయ్యనగర్ కాలనీలో నివాసం ఉండే జ్యోతి జీహెచ్ఎంసీలో ఉద్యోగి. జ్యోతి భర్త ప్రేమ్‌దాస్ గతంలోనే చనిపోయాడు. కుమారుడు ప్రదీప్‌కుమార్, కుమారై లక్ష్మిప్రియాంక(19)లతో కలిసి ఉంటోంది. లక్ష్మి ప్రియాంక ప్రస్తుతం కొత్తపేటలోని శ్రీనేత్ర చికిత్సాలయంలో ఉద్యోగం చేస్తోంది. శనివారం ఉదయం యాథావిధిగా తల్లి ఉద్యోగానికి వెళ్లగా సోదరుడు ప్రదీప్‌కుమార్ పని నిమిత్తం బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం 12గంటల సమయంలో వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి ఇంటికి వచ్చి డోర్ కొట్టగా తీయలేదు. దీంతో తలుపు పగలగొట్టి చూడగా లక్ష్మిప్రియాంక ఉరేసుకొని కనిపించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రదీప్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
అక్క పెళ్లి కాకుండా నువ్వెలా పెళ్లి చేసుకుంటావ్!
ప్రొద్దుటూరు క్రైం : స్ధానిక దస్తగిరిపేటలో మోతుకూరు ప్రమీద (19) అనే యువతి మంగళారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దస్తగిరిపేటలో నివాసం ఉంటున్న ప్రమీద కొంత కాలం నుంచి ఒక యువకుడితో పరిచయం పెంచుకుంది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేయమని కోరింది. ప్రమీద కంటే పెద్ద కూతురికి పెళ్లి కాలేదు. ‘అక్క పెళ్లి కాకుండా ఎలా చేసుకుంటావని’ తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. పెద్దలు తమ పెళ్లి చేయరేమోనని కలత చెందిన ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు చీర కట్టుకొని ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు వచ్చేసరికి ఆమె మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ ఎస్ఐ మధుమళ్లేశ్వరరెడ్డి తెలిపారు. -
ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య
ప్రకాశం జిల్లా / బేస్తవారిపేట: ఎంబీఓ మొదటి సంవత్సరం చదువుతున్న బిక్కా కల్పన (21) కడుపునొప్పి భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన స్థానిక అచ్చిరెడ్డి కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అచ్చిరెడ్డి కాలనీకి చెందిన బిక్కా నరసింహారెడ్డి పెద్ద కుమార్తె కల్పన మార్కాపురంలో ఎంబీఏ చదువుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల నుంచి ఆమె తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. చదువుకునేందుకంటూ కల్పన బెడ్రూమ్లోకి వెళ్లి తలుపునకు గడియ పెట్టుకుంది. అర్ధరాత్రి మిగిలిన కుటుంబ సభ్యులు బాత్రూమ్కు వెళ్లేందుకు ఎంతసేపు తలుపుకొట్టినా తీయలేదు. అనుమానం వచ్చి గడ్డపారతో తలుపు పగులగొట్టారు. అప్పటికే కల్పన తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
కార్వేటినగరం: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రియుడుతో గొడవ పడి ఆ యువతి తనువు చాలించింది. ఎస్ఐ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలు.. కార్వేటినగరం మండలం పరిధిలోని గుండ్రాజు ఇండ్లు( పెళ్లిచింతమాను) గ్రామానికి చెందిన కె.గురుమూర్తి(30) రామకుప్పం మండలం గురుకుల మడుగు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ గ్రామంలో ఉంటోన్న కళావతి, చెల్లప్పనాయుడు కుమార్తె పి. శ్రావణి(21)ని గురుమూర్తి ఉద్యోగం ఇప్పిస్తానని వశపరుకున్నాడు. తిరుపతిలోని ఓ కోచింగ్ సెంటర్లో కూడా చేర్పించాడు. ఈ క్రమంలో శ్రావణి తమ సొంత గ్రామం గురుకుల మడుగుకు ఇటీవల వెళ్లి పోయింది. దీంతో రామకుప్పం మండలంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న తన సోదరుడు ప్రేమ్‌కుమార్ ద్వారా శ్రావణిని కార్వేటినగరానికి గురుమూర్తి రప్పించాడు. భార్య పుట్టింటికి అలిగిపోవడంతో.. కాగా గురుమూర్తి ఆరేళ్ల క్రితం పాదిరికుప్పం గ్రామానికి చెందిన కావేరిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా గురుమూర్తి శ్రావణితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటికి సక్రమంగా రాకపోవడంతో భార్య కావేరి మూడు నెలల క్రితం భర్తతో గొడపడి పుట్టింటికి అలిగి వెళ్లిపోయింది. దీంతో శ్రావణిని శనివారం కార్వేటినగరంలో.. సరాసరి తన మొదటి భార్యతో కాపురం ఉంటున్న అద్దె ఇంటిలోకే తీసుకొచ్చాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పెళ్లి, ఉద్యోగానికి సంబంధించి సోమవారం రాత్రి గొడవ జరిగింది. తనకు ఉద్యోగమైనా ఇప్పించాలని లేకుంటే పెళ్లి చేసుకోవాలని శ్రావణి నిలదీసింది. అందుకు గురుమూర్తి నిరాకరిండంతో శ్రావణి తీవ్ర మనస్థాపానికి గురైంది. తర్వాత వంటగదిలోకి వెళ్లి ఫ్యాన్ కొక్కీకి ఉరేసుకుని మృతి చెందింది. కాగా సోదరుడైన మరో ఉపాధ్యాయుడు ప్రేమకుమార్ కూడా ఈ వ్యవహారంలో గురుమూర్తికి సహాయం చేసినట్లు తెలిసింది. అలాగే శ్రావణిని ప్రేమకుమారే స్వగ్రామం నుంచి కార్వేటినగరానికి తీసుకొచ్చాడని సమాచారం. కాగా మృతురాలు శ్రావణి కుటుంబం కడు పేదరికంలో ఉందని, దీన్ని ఆసరాగా చేసుకుని గురుమూర్తి లోబరుచుకున్నట్లు తెలుస్తోంది. కాగా శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మహిళా వైద్యురాలు ఆత్మహత్య
బనశంకరి : వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలో ఆలస్యంగా నందినీ లేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. నందినీలేఔట్ కృషానందనగరలోని బీబీఎంపీ ఆసుపత్రిలో పనిచేస్తున్న అశ్వినీ (32)కి మూడేళ్ల క్రితం డాక్టర్ లోహిత్‌తో వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో అశ్విని తన తల్లి ఇంటిలో నివాసం ఉంటోంది. సోమవారం ఆస్పత్రిలో విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న అశ్వినీ తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం అశ్వని గది నుంచ ?బయటికి రాకపోగా అనుమానించిన తల్లి గదిలోకి వెళ్లి చూడగా ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. భర్త వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందుని అశ్వినీ తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
కైకలూరు : కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరేసుకుని తనువు చాలించింది. కైకలూరు టౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కైకలూరుకు చెందిన సప్పా అప్పారావు, దమయంతి రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్ (28) కు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామానికి చెందిన ఆదిరెడ్డి గౌరీశ్వరరావు, లక్ష్మి దంపతుల రెండో కుమార్తె రమ్యశ్రీ (25) తో 2016 మార్చి 23న వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో రెండున్నర ఎకరాల పొలం, రూ.6 లక్షల నగదు, 35 కాసుల బంగారం కట్నంగా ఇచ్చారు. ఇటీవల మరికొంత నగదు, సామాగ్రి కూడా అదనంగా అందించారు. ప్రవీణ్‌కుమార్ కాకినాడ సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. రమ్యశ్రీ ఇంజినీరింగ్ చదివింది. శుక్రవారం సాయంత్రం భర్త, అత్తమామలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండగా మేడపైకి వెళ్ళిన రమ్యశ్రీ ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందింది. చుట్టుపక్కల వాళ్ల నుంచి విషయం తెలుసుకున్న రమ్య తరఫు బంధువులు శనివారం కైకలూరు పెద్ద ఎత్తున వచ్చారు. తమ కుమార్తె మృతికి అల్లుడు, అతని కుటుంబ సభ్యులే కారణమని మృతురాలి తండ్రి గౌరీశ్వరరావు ఆరోపించారు. సమాచారం అందుకున్న గుడివాడ డీఎస్పీ మహేష్, కైకలూరు తహసీల్ధారు శ్రీనునాయక్, సీఐ వి.రవికుమార్, ఎస్సై గణేష్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకుని రమ్యశ్రీ మృతదేహానికి పంచనామా నిర్వహించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతురాలి తండ్రి గౌరీశ్వరరావు ఫిర్యాదు మేరకు కైకలూరు టౌన్ పోలీసులు భర్త ప్రవీణ్‌కుమార్, అతని తల్లిదండ్రులు అప్పారావు, దమయంతి, తమ్ముడు చిన్నా, బాబాయి సీతారామయ్య, మేనమామ ధర్నారావులపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. తల్లడిల్లిన తల్లి హృదయం.. మృతురాలి తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు. తండ్రి వ్యవసాయ కూలీ. మొదటి, రెండో కుమార్తెలకు వివాహాలు చేశారు. మరో ఇరువురు చదువుకుంటున్నారు. రమ్యశ్రీ మృతదేహాన్ని చూసి సోదరి, తల్లిదండ్రులు విలపించిన తీరు కంట తడి పెట్టించింది. తల్లి, సోదరి మాట్లాడుతూ రమ్యశ్రీ మరణానికి కారణమైన వారందరినీ కఠినంగా శిక్షించాలని కోరారు. తమ బిడ్డది ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం కాదని, మరణంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. -
కామాంధుడితో కాంప్రమైజ్..!
షాజహాన్‌పూర్ : అఘాయిత్యం జరిగింది మహాప్రభో న్యాయం చేయండని వేడుకున్న ఓ మహిళను రక్షకభటులు చిన్నచూపు చూశారు. కేసు నమోదు చేయకపోగా.. రేప్ చేసిన కామాంధుడితో కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన బాధితురాలు పోలీస్ స్టేషన్లోనే ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి భర్త రామ్‌వీర్ తెలిపిన వివరాలు.. షాజహాన్పూర్లో నివాసముండే సుశీల (పేరు మార్చాం)పై అదే గ్రామానికి చెందిన వినయ్‌కుమార్ అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిందితుడికి అనుకూలంగా మాట్లాడారు. కేసు నమోదు చేయలేమనీ, వినయ్‌కుమార్‌తో కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి తెచ్చారు. పోలీసుల వ్యవహారంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన సుశీల వారి ఎదుటే బుధవారం (ఆగస్టు 29) ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని సుశీల భర్త తెలిపారు. కాగా, ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. స్టేషన్ ఇన్చార్జి సుభాష్‌కుమార్‌తో సహా ముగ్గురు సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. నిందితుడు వినయ్‌కుమార్‌ను అరెస్టు చేశామని ఎస్పీ ఎస్ఎన్.చినప్ప తెలిపారు. -
భర్త చికెన్ తేలేదని వివాహిత ఆత్మహత్యాయత్నం
ప్రకాశం జిల్లా, మార్కాపురం: భర్త చికెన్ తేలేదని వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం పట్టణంలోని ఎస్సీ, బీసీ కాలనీలో జరిగినట్లు ఎస్సై జి.కోటయ్య తెలిపారు. వివరాలు.. కాలనీలో నివాసం ఉండే లక్ష్మిదేవి తన భర్తను చికెన్ తేవాలని కోరగా ఆయన మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. క్షణికావేశానికి లోనైన లక్ష్మిదేవి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
యువతి ఆత్యహత్య
కంచికచర్ల (నందిగామ) : ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యువతి చీరెతో దూ లానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కంచికచర్లలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం స్థానిక మోడల్ కాలనీకి చెందిన వల్లంశెట్టి అంజిలి (17) ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ చిల్లర దుకాణంలో పని చేస్తుంది. తల్లి మోడల్ కాలనీలో సమోసాలు తయారు చేస్తుంటుంది. అయితే ఒంట్లో బాగోలేదని అంజిలి పనికి వెళ్లలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరెతో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్యహత్యకు కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న సీఐ అల్లు నవీన్ నరసింహమూర్తి, ఎస్ఐ సందీప్ ఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ప్రాణం తీసిన స్థల వివాదం
మహానంది: అన్నదమ్ముల ఇళ్ల మధ్య ఉన్న స్థల వివాదం ఓ నిండు ప్రాణాన్ని తీసుకుంది. మసీదుపురం గ్రామానికి చెందిన నరాల ప్రభావతి(35) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మహానంది ఎస్ఐ జి.పెద్దయ్యనాయుడు తెలిపిన వివరాల మేరకు.. నరాల ప్రభావతి, మాధవీశ్వరరెడ్డి, రాజేశ్వరరెడ్డి, సువర్ణ దంపతుల ఇంటి మధ్య స్థల వివాదం ఉంది. దీంతో గత కొద్దిరోజులుగా వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో గొడవలు జరిగాయి. అన్నదమ్ముల మధ్య స్థల సమస్య ఉండటంతో రెండు రోజుల నుంచి గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో రాజేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు దూషిస్తూ కొట్టినారని మనస్తాపం చెందిన ప్రభావతి పురుగుల మందు తాగింది. చికిత్స కోసం నంద్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పరిస్థితి విషమించడంతో కోలుకోలేక మృతి చెందింది. ప్రభావతి తండ్రి వీరారెడ్డి ఫిర్యాదు మేరకు రాజేశ్వరరెడ్డి దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అత్తింటి వేధింపులకు వివాహిత బలి
కడవకుదురు (చినగంజాం): అత్తింటి వేధింపులు భరించలేక గర్భిణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కడవకుదురులో శనివారం జరిగింది. మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. కడవకుదురు నడిబొడ్డు పోతురాజు శిల వద్ద నివాసం ఉంటున్న బత్తిన సుబ్బారావు రెండో కోడలు మంజు వైప్లవి (23) ఇంట్లోని దూలానికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సుబ్బారావు కుమారుడు వెంకటేష్ బీహార్‌లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఒంగోలు సత్యనారాయణపురానికి చెందిన పాపని సుబ్బారావు కుమార్తె పాపని మంజు వైప్లవితో 2016 మేలో వివాహమైంది. 2016కు పూర్వం వెంకటేష్ అన్న కృష్ణ ఒంగోలులోని పాపని సుబ్బారావు ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. తన అన్న వద్దకు తరుచూ వచ్చి వెళ్తున్న వెంకటేష్ అదే ఇంట్లో ఉంటున్న మంజును ప్రేమించాడు. పెద్దలు వారి వివాహానికి అంగీకరించలేదు. ఆ సమయంలో వెంకటేష్ నాటకీయంగా రైలు పట్టాలపై రైలుకెదురు వెళ్తూ ఆమెను బెదిరించి తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆమెను తెచ్చుకుని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్యను పుట్టింటికి వెళ్లనీయకుండా కడవకుదురులోనే ఉంచి భర్త విధులకు బీహార్ వెళ్లి అప్పుడప్పుడూ ఇంటికి వచ్చిపోతున్నాడు. మంజు తల్లిదండ్రులు బిడ్డపై మమకారంతో కడవకుదురు వచ్చి ఆమెను చూసుకొని వెళ్తుండే వారు. ఈ నేపథ్యంలో అత్త రమాదేవి, భర్త వెంకటేష్‌లు పుట్టింటి నుంచి పాతిక సవర్ల బంగారం తేవడంతో పాటు ఇంటిని రాసివ్వమని వేధించడం ప్రారంభించారు. తీవ్ర మనస్తాపం చెంది తమ కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారం క్రితం డ్యూటీ నుంచి సెలవుపై వచ్చిన భర్త ఇంటి వద్దే ఉంటున్నాడు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ సురేష్ శనివారం రాత్రి పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త నుంచి వివరాలు సేకరించారు. -
కార్పొరేటర్ కూతురు ఆత్మహత్య
వరకట్నం వేధింపులు ఈమె ఉసురుతీశాయి. మైసూరుకు చెందిన కార్పొరేటర్ కూతురు బెంగళూరులో అత్తింట ఉరితాడుకు వేలాడింది. బొమ్మనహళ్లి : పెళ్లయి ఏడు నెలలు కూడా నిండకనే వరకట్న దాహానికి ఓ యువతి బలైంది. అత్త పెట్టే వేధింపులు భరించలేక ఆ నవ వధువు నాలుగు పేజీల డెత్‌నోట్ రాసి ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి ఇక్కడి హెచ్ఎస్ఆర్ లేఔట్లో చోటు చేసుకుంది. వివరాలు... మైసూరు మహానగర పాలికె కార్పొరేటర్ నాగభూషణ్ కుమార్తె వనిత(26)ను తమిళనాడుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వసంత్‌కు ఇచ్చి ఏడు నెలల క్రితం వివాహం జరిపించారు. అప్పటి నుంచి దంపతులు, వసంత్ తల్లిదండ్రులు ఇక్కడి హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోనే నివాసం ఉంటున్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి దంపతులు సంతోషంగానే ఉంటున్నారు. అయితే అత్త గాయత్రి గత కొంతకాలంగా ప్రతి రోజు అదనంగా కట్నం తీసుకు రావాలని వేధింపులకు పాల్పడేది. అంతేకాకుండా తిండి కూడా సరిగా పెట్టేది కాదని, ఆమె పెట్టే వేధింపులకు తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆత్మహత్యకు ముందు వనిత తన డెత్‌నోట్‌లో రాసింది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు తన గదిలోకి వెళ్లిన వనిత మళ్లీ బయటకు రాలేదు. వసంత్ విధులు ముగించుకుని రాత్రి 8 గంటలకు వచ్చి చూడగా వనిత ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే వసంత్ ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు అక్కడికి చేరుకుని డెత్‌నోట్ స్వాధీనం చేసుకుని వసంత్‌ను, అతని తల్లిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య
యాచారం: వరకట్న వేధింపులకు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మండల పరిధిలోని మాల్ గ్రామానికి చెందిన మునుకంటి విశ్వనాథం, ధనలక్ష్మి దంపతుల కుమార్తె మానస(25)ను నగరంలోని చిక్కడపల్లికి చెందిన నవీన్‌కుమార్‌కు ఇచ్చి ఫిబ్రవరిలో వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ. 20 లక్షల కట్నం ఇచ్చారు. అయితే మరింత కట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేయడంతో మానస వినాయకచవితికి పుట్టింటికి వచ్చి మాల్లోనే ఉండిపోయింది. కట్నం తెస్తేనే కాపురానికి రావాలని నవీన్ కుటుంబ సభ్యులు ఫోనులో వేధింపులకు గురి చేస్తుండడంతో మనస్తాపానికి గురైన మానస ఈనెల 2న ఇంట్లోనే ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్ప పొందుతున్న మానస మంగళవారం మృతి చెందింది. వరకట్న వేధింపులకు తాళలేక మానస ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి ధనలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మానస భర్త నవీన్‌తో పాటు ఆయన తండ్రి బాలక్రిష్ణ, తల్లి అను, మరిది నాగరాజు, ఆడపడుచు శరణ్యలపై కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రకుమార్ తెలిపారు. -
యువతి ఆత్మహత్య
నెల్లూరు (క్రైమ్): ప్రేమ వ్యవహారం ఇంట్లో ఎక్కడ తెలుస్తుందోననే మనస్తాపంతో ఓ యువతి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎన్సీ బాలయ్య కాలనీలో గురువారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మర్రివాడకు చెందిన గంటా కృష్ణయ్య కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చారు. నవాబుపేట ఎన్నీ బాలయ్య కాలనీలో నివాసముంటున్నారు. ఆయన కుమార్తె రుక్మిణి (19) నవాబుపేటలోని ఓ ప్రైవేటు (హాస్పిటల్) క్లినిక్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. గురువారం ఓ యువకుడు హాస్పిటల్‌కు వచ్చి తాను రుక్మిణి ప్రేమించుకుంటున్నామని, ఆమెకు ఎలా ఉద్యోగం ఇస్తారని డాక్టర్‌ను నిలదీశారు. దీంతో డాక్టర్ రుక్మిణిని పిలిచి అడుగగా తనకు అతను ఎవరో తెలియదని చెప్పింది. దీంతో డాక్టర్ ఇంటికి వెళ్లి తండ్రిని తీసుకుని హాస్పిటల్‌కు రావాలని చెప్పాడు. ఈ వ్యవహారం ఎక్కడ తల్లిదండ్రులకు తెలుస్తుందోనని మనస్థాపం చెందిన రుక్మిణి ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దీంతో ఇంటి తలుపుకు లోపల నుంచి గడియపెట్టుకుని ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు తెరిచే ప్రయత్నం చేయగా తెరుచుకోలేదు. దీంతో అతికష్టంపై తలుపులు తెరచి చూడగా రుక్మిణి ఆత్మహత్య చేసుకుని ఉంది. ఆత్మహత్య విషయంపై రెండోనగర పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణారెడ్డి, ఎస్ఐ వి. శ్రీహరిబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాతీశారు. హాస్పిటల్‌కు వచ్చి డాక్టర్‌ను నిలదీసిన ఆ యువకుడు ఎవరనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. -
మహిళ ఆత్మహత్య
అన్నానగర్: కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది చిన్నారితో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోడి సమీపంలో చోటు చేసుకుంది. బోడి సమీపంలోని బి. మీనాక్షిపురం కన్డియమ్మన్ ఆలయ వీధికి చెందిన కాళియప్పన్ కుమార్తె అరసమణి (28). ఈమెకు పెరియకుళం దేవదానపట్టికి చెందిన గణేషన్ (30)తో వివాహం జరిగింది. వీరికి పెళ్లై రెండేళ్లైనా సంతనం కలగలేదు. దీంతో అహల్య (ఒకటిన్నర ఏళ్ల)అనే చిన్నారిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఈ స్థితిలో భార్యభర్తలకు మధ్య తరచూ కలహాలు వస్తుండడంతో అరసమణి తన తల్లిదండ్రుల ఇంటికి చిన్నారిని తీసుకొని వెళుతున్నాని చెప్పి అక్కడి నుంచి వెళ్లింది. ఈ విషయాన్ని ఈమె తల్లిదండ్రులకు భర్త గణేషన్ తెలిపాడు. కాని వారిద్దరు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో వెతికారు. వారి ఆచూకి లభించలేదు. ఈ క్రమంలో బోడి సమీపంలోని మేలసొక్కనాథపురంలోని ఓ బావిలో చిన్నారితో మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి మృతి చెందిన వారిని బయటకి తీశారు. విచారణలో మృతి చెందింది అరసరమణి, అహల్య అని తేలింది. కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని అరసమణి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పెళ్లి ఆపేశారు.. మహిళా ఇంజినీర్ ఆత్మహత్య
► పెళ్లి రద్దు ఒత్తిళ్లతో మహిళ టెక్కీ ఆత్మహత్య ► జాతకం బాగాలేదని అబ్బాయి తరపు నుంచి సూటిపోటి మాటలు ► తట్టుకోలేక తీవ్ర నిర్ణయం ► మృతురాలు ప్రముఖ సంస్ధలో టీంలీడర్ బొమ్మనహళ్లి : నిశ్చితార్థం అయ్యింది, తర్వలో మూడు ముళ్ల వేడుక జరగాల్సి ఉంది. అంతలోనే పెళ్లి రద్దు చేసుకోవాలని అబ్బాయి తరపు వారు ఒత్తిడి చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఒక మహిళా ఇంజనీరు ఇంట్లో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం రాత్రి బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర పోలిస్ స్టేషన్ పరిధిలోని ఐడీయల్ హోంటౌన్ షిప్లో చోటు చేసుకుంది. మృతురాలిని నాగలక్ష్మి (32)గా గుర్తించారు. పోలీసుల కధనం మేరకు... టౌన్‌షిఫ్‌లో నివాసముండే దేవానంద్ కుమార్తె నాగలక్ష్మి బెంగళూరు సిస్కో ఐటీ కంపెనీలో టీంలీడర్‌గా పనిచేస్తున్నారు . ఆమెకు బెంగళూరులోనే నివాసముంటూ , హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నా కార్తీక్‌తో పెళ్ళి నిశ్చయమైంది . గతేడాది నిశ్చతార్థం జరిపించారు. మే 29వ తేదీన పెళ్లికి ముహూర్తం కుదిరింది. నాగలక్ష్మి కుటుంబం సభ్యులు పెళ్ళి కోసం అన్ని ఎర్పాట్లు చేసుకుంటున్నారు . అబ్బాయి తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడని... 20రోజుల క్రితం కార్తీక్ తండ్రి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇందుకు నాగలక్ష్మి కారణమని , ఆమె జాతకం సరిగా లేదని , నిశ్చితార్థానికి అయిన ఖర్చు మొత్తం వెనక్కు ఇస్తామని , పెళ్ళి రద్దు చేయాలని కార్తీక్ కుటుంబ సభ్యులు నాగలక్ష్మి కుటుంబాని డిమాండ్ చేశారు . దాంతో ఆవేదనకు లోనైన నాగలక్ష్మి మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నారు . అంతకుముందు నాలుగు పేజీల డెత్ నోటును రాసి ఉంచారు . జీవితం మీద విరక్తితో చనిపోతున్నట్లు పేర్కోన్నారు . స్దానిక పోలిసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డీసీపీ అనుచిత్ పరిశీలన జరిపారు. -
మహిళ ఆత్మహత్య
కంటోన్మెంట్: అనుమానాస్పద స్థితిలో మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. చిలకలగూడకు చెందిన అబ్దుల్ సుభాన్, నజీమిన్ భాను దంపతుల కుమార్తె షాబాజ్ ఫాతిమా (23) గోల్డెన్ బేకరీ యజమాని సయ్యద్ ఇంతియాజ్‌ను పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత ఇంతియాజ్, భార్య ఫాతిమా, అత్తమామలతో కలిసి వెస్ట్‌మారేడ్‌పల్లిలో కాపురం పెట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇంతియాజ్ తమ కూతురిని వేధించేవాడని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో ఫాతిమా తల్లిదండ్రులు చిలకలగూడలోని తమ సొంతింటికి వెళ్లి అక్కడే ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఇంతియాజ్ శనివారం ఫాతిమా తల్లిదండ్రులను తన ఇంటికి ఆహ్వానించాడు. ఈ సందర్భంగా మరోసారి గొడవజరిగిందని తెలిపారు. శనివారం రాత్రి తాము చిలకలగూడకు వెళ్లిపోగా, ఆదివారం తెల్లవారుజామున అల్లుడు ఇంతియాజ్ తమకు ఫోన్ చేసి, ఫాతిమా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడన్నారు. దానిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫాతిమా తల్లి నజీమిన్ భాను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నవ వధువు ఆత్మహత్య
►ప్రేమ వివాహం చేసుకుని రెండు నెలలు గడవక ముందే దారుణం ►వేధింపులే కారణం ►మృతురాలి కుటుంబసభ్యులు చాంద్రాయణగుట్ట: వరకట్న వేధింపులు తాళలేక పెళ్లయిన రెండు నెలల్లోనే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఉప్పుగూడ శివసాయినగర్కు చెందిన అనిత కుమార్తె రేణుక (20), పార్వతీనగర్‌కు చెందిన చినావత్ పవన్ ప్రేమించుకున్నారు. పవన్ తలాబ్‌కట్టలోని టిఫిన్ సెంటర్లో పని చేసేవాడు. ప్రేమ వివాహమే అయినా రూ.2 లక్షలు ఇస్తేనే పెళ్లికి అంగీకరిస్తామంటూ పవన్ తల్లిదండ్రులు మొండికేయడంతో కుల పెద్దలు సర్ది చెప్పి గత నవంబర్ 28న స్థానిక బంగారు మైసమ్మ ఆలయ సన్నిధిలో వివాహం జరిపించారు. పెళ్లై వారం రోజులు గడవక ముందే కట్నం కోసం అత్తింటివారు రేణుకను వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రూ. 2 లక్షలు తేవాలని పవన్ సంక్రాంతి పండుగ ముందు రేణుకను కొట్టి పుట్టింటికి పంపగా, బంధువులు సర్ధి చెప్పి అత్తగారింటికి పంపారు. అయితే ఆదివారం రాత్రి పవన్ మరోసారి ఆమెను కొట్టడంతో భరించలేని రేణుక సోమవారం మధ్యాహ్నం మంగళసూత్రంతో సహా ఆభరణాలను అక్కడే వదిలి పుట్టింటికి వచ్చింది. ఆమెను అనుసరిస్తూ వచ్చిన భర్త పవన్, అత్త విజయ తల్లిగారింటి ముందే మరోసారి రేణుకపై దాడి చేశారు. దీనిని భరించలేని రేణుక ఇంట్లోకి వెళ్లి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ తాజుద్దీన్ అహ్మద్, ఛత్రినాక ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్, ఎస్సై తఖియుద్దీన్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
మహిళ ఆత్మహత్య
శంకర్పల్లి: వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక శ్రీరాంనగర్ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లకొండ కొండ గ్రామానికి చెందిన నవీన(32) శ్రీధర్‌రెడ్డి దంపతులు శంకర్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే శ్రీధర్‌రెడ్డి భార్యను వేధిస్తుండడంతో భరించలేక ఆమె బుధవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి తండ్రి చంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరివేసుకుని మహిళ బలవన్మరణం
బొమ్మలరామారం : ఉరివేసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో మంగళవారంచోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జలాల్పూర్ గ్రామానికి చెందినపత్తి పుష్ప(30) కుటుంబ తగాదాలతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజుల క్రితం పుష్పకు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందంటూ పంచాయతీ జరిగింది. దాంతో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన మృతురాలి భర్త గంగారాం ఇంటికి వచ్చి తలుపు తీయగాపుష్ప దూలానికి ఉరి వేసుకుని కనిపించింది. మృతురాలి తండ్రి మోతె పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
క్షణికావేశంతో ఐదు నెలలకే ముగిసిన వివాహ బంధం
ఆత్మహత్యకు పాల్పడ్డ భర్త ఆవేదనతో గొంతు కోసుకొని ఆస్పత్రిపాలైన భార్య చిత్తూరు జిల్లా : కుటుంబంలో వచ్చి కలతలతో ఐదు నెలల వివాహ బంధం అర్ధాంతరంగా ముగిసింది. భార్యతో వచ్చిన గొడవకు వునస్థాపం చెంది భర్త సురేష్ (28) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు ఆవేదన చెందిన భార్య సోని(25) గొంతు కోసుకొని ఆస్పత్రికి చేరింది. కుప్పంలో బుధవారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి... తమిళనాడు రాష్ట్రం పర్చూరు పట్టణానికి చెందిన సురేష్‌కు కర్ణాటక రాష్ట్రం కోలారుకు చెందిన సోనికు గత ఐదు నెలల క్రితం వివాహమైంది. అనంతరం సురేష్ కుప్పంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ పట్టణ సమీపంలోని ఎన్టీఆర్ కాలనీలో అద్దె ఇల్లు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రవుంలో రెండు రోజుల క్రితం కోలారులో జరిగిన సోని చెల్లెలు నిశ్చిర్థానికి భార్యభర్తలిద్దరూ హాజరయ్యూరు. అక్కడ సోని కన్నా ఎక్కువ నగలు, నగదు పెట్టి వివాహం చేస్తున్నారని సోని ఆమె భర్త సురేష్‌లు అత్తవూవులతో గొడవపడి కుప్పం చేరుకున్నారు. ఇంట్లో మంగళవారం రాత్రి భార్యభర్తల వుధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. సోని తల్లిదండ్రులు తనకు బంగారు నగలు ఎక్కువ ఇవ్వకుండా పెళ్ళి చేశారంటూ సురేష్ భార్య సోనిల వుధ్య తగాదా పెరిగింది. దీంతో వునస్థాపం చెందిన సురేష్ బుధవారం తెల్లవారుఝామున ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోనే ఉన్న సోని విషయుం తెలుసుకుని ఆవేదన చెంది భర్త లేని జీవితం తనకొద్దంటూ కత్తితో గొంతు కోసుకుని కుప్పకూలింది. వెంటనే చుట్టుపక్కల ఉన్న వారు పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. ఆత్మహత్యకు పాల్పడ్డ సురేష్‌ను బంధువులు స్వగ్రావుం తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరుకు తీసుకెళ్ళారు. ఈ విషాద సంఘటనపై చుట్టుపక్కల ప్రాంత వాసులను కలచివేసింది.బాదితుల పిర్యాదు మేరకు కుప్పం ఎస్ ఐ రావుస్వామి కేసు నమెదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ ఆత్మహత్య
పార్వతీపురం: అనారోగ్యాన్ని తట్టుకోలేక ఓ మహిళ మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఇందిరా కాలనీలో జరిగిన సంఘటనపై స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం గంటా వీధికి చెందిన బూర్లి వరణమ్మ (45) కొన్ని రోజులుగా థైరాయిడ్‌తో బాధపడుతోంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆమె బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు విషయం తెలుసుకొని మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
భర్త గల్ఫ్ వెళ్లడంతో ...
పశ్చిమ గోదావరి జిల్లా : పెళ్లైన నాలుగునెలలకే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇరగవరం శివారు గొల్లగుంటపాలెంలో సోమవారం జరిగింది. ఇరగవరం ఎస్ఐ వి.ఎస్.వి.భద్రరావు కథనం ప్రకారం.. గొల్లగుంట పాలేనికి చెందిన గాయత్రి (20)కి అదే ఊరుకు చెందిన వేండ్ర చంద్రరావుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లైంది. చంద్రరావు పెళ్లి ముందు నాలుగేళ్లు ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆషాఢం మాసం కావడంతో గాయత్రి పుట్టింటికి వెళ్లింది. పెళ్లైన తర్వాత గత నెలలో చంద్రరావు మళ్లీ గల్ఫ్ వెళ్లడంతో మనస్తాపానికి గురైన గాయత్రి ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. పొలం పనులకు వెళ్లి వచ్చిన గాయత్రి తల్లి నాగమణి కూతురు అపస్మారక స్థితిలో ఉండడంతో ఇరుగుపొరుగువారి సాయంతో తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై తహసీల్దార్ జి.మమ్మీ, పెనుగొండ సీఐ సి.హెచ్.రామారావు విచారణ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కామాంధుడి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
జంగారెడ్డిగూడెం : కామాంధుడి వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహతృ్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ ఎ.ఆనందరెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని తాడువాయికి చెందిన పగిళ్ల శైలజ (35)కు 11 ఏళ్ల క్రితం అమృతరావుతో వివాహమైంది. ఆమె తన భర్తతో కలిసి కూలి పనులు చేసుకుని జీవిస్తోంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కలపాల జయరాజు కొంతకాలంగా కామవాంఛ తీర్చాలని శైలజను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఈనెల 8న శైలజ గొల్లగూడెం గ్రామంలో పొలం పనులకు వెళ్లగా, అక్కడకు వెళ్లిన జయరాజు ఆమెను పామాయిల్ తోటలోకి లాక్కెళ్లి తీవ్రంగా కొట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన శైలజ అక్కడే పురుగుల మందు సేవించింది. ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు చేసుకుంటుండగా, చుట్టుపక్కల వాళ్లు గమనించి స్థానిక ఏరియా ఆస్పత్రికి ఆమెను తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించింది. దీనిపై శైలజ తండ్రి పల్లంటి దుర్గారావు ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
చింతపల్లి : ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చింతపల్లి మండలంలోని హోమంతాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అనాజీపురంలో చోటు చేసుకుంది. భర్త వేధింపుల కారణంగానే మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాంపల్లి సీఐ వెంకట్‌రెడ్డి, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామానికి చెందిన దర్శనం పర్వతాలు, అంజమ్మ కుమార్తె రేణుక (28)ను చింతపల్లి మండలం హో మంతాలపల్లి గ్రామ పరిధిలోని అనాజీపురం గ్రామానికి చెందిన వస్కుల రాములు కుమారుడు రాజుకు పది సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం జరిపిం చారు. అప్పటి నుంచి వారికి సంతానం లేని కారణంగా ప్రతి రోజూ రేణుకను హింసించేవాడు. సోమవారం గ్రామస్తులు వనభోజనాలకు వెళ్లడంతో భార్యాభర్తలు ఇరువురూ వెళ్లారు. అక్కడ మద్యం సేవిం చిన రాజు తన భార్యను చితకబాదాడు. దీంతో మనస్థాపానికి గురైన రేణుక అక్కడే వ్యవసాయ పొలంలో ఉన్న పురుగుల మందును తాగింది. విషయం తెలుసుకున్న స్థాని కులు, బంధువులు వెంటనే చికిత్స నిమిత్తం చింతపల్లికి తరలి స్తుం డగా మృతి చెందింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం మండలంలోని అనాజీపురంలో రేణుక మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న కొమ్మేపల్లి గ్రామస్తులు అనాజీపురానికి చేరుకున్నారు. అక్కడ రాజు కుటుంబ సభ్యులకు, రేణుక కుటుంబీకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న నాంపల్లి సీఐ వెం కట్రెడ్డి, ఎస్ఐ శంకర్‌రెడ్డి తమ సిబ్బం దితో గ్రామానికి చేరుకుని ఇరువర్గాల వారికి నచ్చజెప్పారు. అనంతరం సంఘటనకు గల కారణాలను బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిం చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భర్తే కారణమని ఫిర్యాదు రేణుకకు సంతానం లేని కారణంగా పది సంవత్సరాల నుంచి ప్రతి రోజూ రాజు రేణుకను చితకబాదేవాడని ఆమె బంధువులు, తల్లిదండ్రులు ఆరోపించారు. రాజు మద్యం సేవించి రేణుకను హింసకు గురి చేసేవాడని, సోమవారం కూడా కొట్టడంతో భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. -
ఒంటిపై కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్య
తాడేపల్లిగూడెం రూరల్ : వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పట్టింపాలెంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టింపాలెంకు చెందిన కిక్కిరిశెట్టి గణేష్‌కు పెంటపాడు మండలం చింతపల్లికి చెందిన సత్యవేణిలకు 2011 ఫిబ్రవరి 12న వివాహమైంది. వివాహ సమయంలో గణేష్‌కు రూ.5 లక్షల కట్నం, లాంఛనాలు అందజేశారు. కొంతకాలం వీరి సంసారం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు గ్రీష్మ లక్ష్మీ దుర్గ(3), కుసుమ (8 నెలలు) కలిగారు. ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో అధిక కట్నం కోసం అత్తవారు వేధించడంతో ప్రారంభించారు. ఈ క్రమంలో వేధింపులు తాళలేక సత్యవేణి శనివారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి పోతుల మణి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని తాడేపల్లిగూడెం రూరల్ సీఐ గుమ్మళ్ల మధుబాబు, మండల మేజిస్ట్రేట్ పాశం నాగమణి, ఎస్సై వి.చంద్రశేఖర్ పరిశీలించారు. వరకట్న వేధింపుల కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మతురాలు అత్త లక్ష్మీ నర్సమ్మ, భర్త గణేష్, ఆడపడుచు దుర్గా భవానీలను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా సత్యవేణి మతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యో పాపం పిల్లలు.. ‘ఇద్దరు ఆడపిల్లలను తల్లి ఒంటరి చేసి పోయిందే’ అని సత్యవేణి బంధువులు రోదిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది. ఐదేళ్ల, ఎనిమిది నెలల కుమార్తెలు ఇద్దరికీ తమ తల్లి ఏమైపోయిందో తెలియక రోదిస్తుంటే చూపరులు చలించిపోయారు. సత్యవేణి మతితో ఇటు పట్టింపాలెంలోను, అటు చింతపల్లిలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.