
సిరిసిల్లక్రైం/వేములవాడరూరల్: ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాదిన్నరపాటు జీవితం గడిపిన ఇంట్లో వరకట్నం కోరలు చాచడంతో ఎదురుగట్ట రవళి(21)అనే వివాహిత బలైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామానికి చెందిన ఎడ్ల రవళి ఉరఫ్ ఎదురుగట్ల రవళి అదే ప్రాంతానికి చెందిన ఎదురుగట్ల శ్రవణ్ ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరుకావడం పెద్దలు అంగీకరించలేదు. సిరిసిల్లలోని గాంధీనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా భర్త శ్రవణ్‌తోపాటు అత్త లక్ష్మి కట్నం తేవాలని వేధింపులకు గురి చేయడంతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉరివేసుకుని విగతజీవిగా మారిన రవళి మృతదేహాన్ని పోలీసులు చేరుకునే సరికే కిందికి దించారు. దీంతో జరిగింది హత్యా? అత్మహత్య? అనే అనుమానాలు స్థానికంగా చర్చనీయమయ్యాయి. తన కూతురు అనుమానస్పదంగా మృతి చెందిందని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లి ఎడ్ల స్వప్న ఫిర్యాదుచేసింది. సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment