Dowry Harassment
-
రూ.50 లక్షలు, బెంజ్ కారు కావాలి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ అత్యాశతో వరకట్నం కోసం కక్కుర్తి పడ్డారు. అలిగిన వరుడు, అతని తల్లితండ్రులు, బంధువులు పెళ్లి మండపం నుంచి పరారయ్యారు. ఈ వింత సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. న్యాయం చేయాలంటూ వధువు తండ్రి ఉప్పారపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాలేజీ నుంచి ప్రేమ వధువరులు ఇద్దరూ కాలేజీ రోజుల నుంచి స్నేహితులు. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. గత ఏడాది జూలై నెలలో ఇండియాకు వచ్చిన యువతి ప్రేమ గురించి తల్లిదండ్రులకు తెలిపింది. ఇరువైపుల పెద్దలు మాట్లాడి గతేడాది జూలైలో నిశ్చితార్థం చేశారు. మార్చి 2న 2025లో వివాహం కూడా నిశ్చయించారు. గత ఫిబ్రవరి 17న షాపింగ్ కోసం ఫ్రాన్స్ నుండి ఢిల్లీకి వచ్చిన యువతి ఓ హోటల్లో బస చేసింది. ప్రియుడు ప్రేమ్ కూడా వచ్చి యూరోపియన్ సంస్కృతి ప్రకారం పెళ్లికి ముందే ఇద్దరూ శారీరకంగా కలవాలని కథలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. పొద్దున పెళ్లనగా గొడవ వివాహ వేడుకల కోసం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకూ బెంగళూరు గాందీనగర్‌లోని రైల్వే ఆఫీసర్స్ ఎన్‌క్లేవ్‌లోని నంది క్లబ్‌ని బుక్ చేశారు. 28న సంగీత్, మెహందీ వేడుకలను జరిపారు. మార్చి 1న రాత్రి వరుడు, తల్లితండ్రులు గొడవకు దిగారు. రూ.50 లక్షల నగదు, అర్ధ కేజీ బంగారం, ఒక బెంజ్ కారును కట్నంగా ఇవ్వాలని పట్టుబట్టారు. వధువు తండ్రి తన చేత కాదని చెప్పాడు. కొంతసేపటికి వరుని కుటుంబం మొత్తం పరారైంది. తెల్లవారితే జరగాల్సిన పెళ్లి జరగలేదు. ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడు ప్రేమ్, అతని తల్లిదండ్రులు శివకుమార్, రాధలపై కేసు నమోదు చేసుకున్నారు. -
పవన్‌ను కలిసినా జరగని న్యాయం.. తల్లి,కుమార్తె ఆత్మహత్యాయత్నం
సాక్షి,విజయవాడ : అదనపు కట్నం కోసం అత్తింటి అరళ్లు వేగలేకపోతున్నా న్యాయం చేయాలని ఓ బాధితురాలు హోంమంత్రి, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేని అర్జించింది. వాళ్లు పట్టించుకోకపోవడంతో తనకు ఇక చావే శరణ్యమనుకుంది. కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకి ఏం జరిగిందంటే?విజయవాడలో ఆడపిల్లలు పుట్టారని కారణంగా చూపిస్తూ సుభాషిణి అనే మహిళను అత్తమామలు, భర్త, మరిది వేధింపులకు గురి చేసేవారు. ఆ వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లింది. సుభాషిణి తన కుమార్తె (మైనర్)తో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. ఆడపిల్లలు పుట్టారని అదనపు కట్నం కోసం నా భర్త , అత్తమామలు, మరిది వేధిస్తున్నారు. నా భర్తను ఏడాది నుంచి మా ఇంటికి రానివ్వడం లేదు. నన్ను వదిలించుకోవడానికి గతంలో పిచ్చెక్కిందని పిచ్చాసుపత్రిలో చేర్పించారు. జనసేన కార్యాలయం చుట్టూ పది సార్లు తిరిగా. పవన్ కళ్యాణ్‌ను ఓ అన్నలా భావించా. న్యాయం జరుగుతుందనుకుని జనసేన కార్యాలయం చుట్టూ తిరిగా. ఓ పవన్ అభిమానిగా న్యాయం జరుగుతుందని నేను ఆశించా. ఆయన అపాయింట్మెంట్ కోసం ఎంతో ప్రయత్నించా ..దొరకనివ్వలేదు. ఫ్యామిలీ మ్యాటర్లో మేం ఇన్వాల్వ్ అవ్వమన్నారు. న్యాయం కోసం హోంమంత్రి అనితను కలిశా. అక్కడ న్యాయం జరగలేదు. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ... నా సమస్య తీర్చమని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు అప్పగించారు.బోండా ఉమా నా సమస్య తీర్చమని విక్రమ్ పబ్లిషర్స్ చక్రవర్తి దగ్గరకు పంపించారు. విక్రమ్ పబ్లిషర్స్ చక్రవర్తి నన్ను బెదిరించి .. తీవ్ర దూర్భషలాడారు. మేం ఉన్నంత వరకూ నీకు న్యాయం జరగదని చక్రవర్తి బెదిరించారు. నాకు న్యాయం జరగట్లేదు కాబట్టి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాం’ అని వాపోయారు. -
‘గృహ హింస’ వివాదంలో భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్
చండీగఢ్: దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు క్రీడాకారుల దాంపత్యంలో పెను వివాదం రేగింది. కుటుంబ కలహాలతో పరిస్థితి పోలీసు కేసు వరకు వెళ్లింది. హరియాణాకు చెందిన మాజీ కబడ్డీ ఆటగాడు దీపక్ హుడా, భారత బాక్సర్ స్వీటీ బూరాకు 2022లో పెళ్లి జరిగింది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడైన హుడా 2019 నుంచి 2022 వరకు భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అంతేకాకుండా ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్ జట్ల తరఫున బరిలోకి దిగాడు. మరోవైపు స్వీటీ బూరా 2023 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 81 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. అయితే ఇప్పుడు హుడా తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని స్వీటీ పోలీసులను ఆశ్రయించింది. గతంలోనే డిమాండ్ ప్రకారం లగ్జరీ కారును ఇచ్చినా... మరింత డబ్బు కావాలంటూ తనను కొడుతున్నాడని స్వీటీ ఫిర్యాదు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85 ప్రకారం హుడాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి 2–3 సార్లు నోటీసులు జారీ చేసినా... అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ హుడా ఇప్పటి వరకు పోలీసు విచారణకు హాజరు కాలేదు. త్వరలోనే తాను పోలీసుల ముందుకు వస్తానని, అయితే స్వీటీపై తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయనని అతను స్పష్టం చేశాడు. మరోవైపు కేసుపై మరింత సమాచారం ఇచ్చేందుకు స్వీటీ నిరాకరించింది. 2024 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో మేహమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి హుడా ఓటమి పాలయ్యాడు. -
మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌కు వరకట్న వేధింపులు.. భర్త భారత మాజీ కబడ్డీ ప్లేయర్
మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత సవీటి బూరా (Saweety Boora) వరకట్న వేధింపులు ఎదుర్కొంది. ఆమె భర్త, భారత మాజీ కబడ్డీ ప్లేయర్, ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేత, అర్జున అవార్డు గ్రహీత అయిన దీపక్ హూడా (Deepak Hooda), అతని కుటుంబం అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని సవీటి కేసు పెట్టింది. సవీటి ఫిర్యాదు మేరకు హిస్సార్‌లోని (హర్యానా) ఓ పోలీస్ స్టేషన్లో దీపక్ హుడా, అతని కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీపక్ హుడా అదనపు కట్నంతో పాటు ఓ ఫార్చూనర్ కార్ డిమాండ్ చేస్తున్నాడని సవీటి తన ఫిర్యాదులో పేర్కొంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85 కింద దీపక్ హుడా, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీపక్ హుడాకు రెండు, మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఎలాంటి స్పందన పోలీసులు వెల్లడించారు. దీపక్ హుడాపై అదనపు కట్నం వేధింపులు, హింసించడం మరియు దాడి చేయడం వంటి అభియోగాలు మోపబడ్డాయని పోలీసులు వివరించారు. పోలీసుల వాదనపై హుడాను జాతీయ మీడియా ప్రశ్నించగా.. ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. ఈ కారణంగానే నోటీసులకు వివరణ ఇవ్వలేకపోయానని అన్నాడు. తన అనారోగ్యానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లు పోలీసులకు సమర్పించినట్లు తెలిపాడు. త్వరలో పోలీస్ స్టేషన్‌కు వెళ్తానని అన్నాడు. ఈ సందర్భంగా హుడా తన భార్య సవీటిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రస్తుతం ఆమెను కలవడానికి నాకు అనుమతి లేదని అన్నాడు.కాగా, సవీటి బూరా-దీపక్ హుడాల వివాహం 2022లో జరిగింది. దీపక్ హుడా 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రోహ్తక్ జిల్లాలోని మెహమ్ నియోజకవర్గం నుంచి హుడా పోటీ చేశారు. హుడా.. 2016 దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకం, 2014 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకున్న భారత కబడ్డీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతను ప్రో కబడ్డీ లీగ్‌లో కూడా పాల్గొన్నాడు. 32 ఏళ్ల సవీటి 2023లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. గతేడాది ఫిబ్రవరిలో ఆమె భర్తతో కలిసి భాజపాలో చేరింది. గత నెలలోనే సవీటి రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంది. -
‘అమ్మను నాన్నే...’’ గుండెలు పగిలే ఐదేళ్ల కుమార్తె మాటలు, డ్రాయింగ్స్
మహిళలు అనుభవించే గృహహింసకు, వేధింపులకు చాలావరకు చిన్నారులే మౌన సాక్షులుగా ఉంటారు. అమ్మను నాన్న నిరంతరం వేధిస్తూ, కొడుతుంటే.. బిక్కుబిక్కు మంటూ చూస్తారు. చూసీ, చూసీ కొంతమంది తిరగబడతారు. ‘ఖబడ్దార్.. అమ్మమీద చేయి వేస్తే..’ అంటూ అమ్మకు అండగా నిలబడతారు. అమ్మమీద దెబ్బ పడకుండా కాపాడు కుంటారు. అవసరమైతే నాలుగు దెబ్బలు కూడా తింటారు. ఈ విషయంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు మరింత వేగంగా స్పందిస్తారు. కానీ చివరికి ఆ అమ్మ ఇక తనకు లేదని తెలిస్తే.. ఏం చేయాలి? ఏం చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోటి ఆశలతో కాపురానికి వచ్చిన కోడల్ని, బిడ్డ పుట్టిన తరువాత కూడా వేధింపులకు పాల్పడి, దారుణంగా హత్య చేసిందో కుటుంబం. కానీ దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. కానీ ఐదేళ్ల చిన్నారి సాహసంతో వారి పథకం పారలేదు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా కొత్వాలి ప్రాంతంలోని పంచవటి శివపరివార్ కాలనీలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాలు ..యూపీలోని ఝాన్సీలో ఒక వివాహిత మహిళ అనుమానాస్పదంగా మరణించింది. సోమవారం తెల్లవారుజామున తీవ్ర విషమంగా ఉన్న స్థితిలో ఆమెను ఝాన్సీ మెడికల్ కాలేజీకి తీసుకుచ్చారు. చికిత్స పొందుతూ మరణించింది. తమ కోడలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అత్తింటివాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ ఆమె ఐదేళ్ల కుమార్తె తన తండ్రి తన తల్లిని ఎలా చంపాడో వివరిస్తూ ఫోటో గీసి మరీ వివరించింది. ఒక బొమ్మను గీస్తూ తన తండ్రి తన తల్లిని బాగా కొట్టాడని వివరించింది. ఇంకో బొమ్మలొ నానమ్మ తన తల్లిని మెట్లపై నుండి తోసేసిందనీ, తండ్రి గొంతు నులిమినట్టు ఆమె తెలిపింది. ఇది చూసి పోలీసులు కూడా షాకయ్యారు. దీంతో ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పలువురి గుండెల్ని పిండేస్తున్న ఈ మాటలు వైరలవుతున్నాయి. కంటతడిపెట్టించే చిన్నారి మాటలు ‘నాన్నే అమ్మను తీవ్రంగా కొట్టాడు..ఆ తర్వాత ఉరేశాడు. ఇదేంటి అని అడిగినందుకు కావాలంటే నువ్వు చచ్చిపో అన్నాడు’ అని మీడియాకు చిన్నారి దర్శిత చెప్పిన మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అనేకసార్లు తన తల్లిని చంపేస్తానంటూ నాన్న బెదిరించాడని తెలిపింది. అంతేకాదు ఇంకోసారి మా అమ్మను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు అని తాను ఒకసారి నాన్నను ఎదిరిస్తే.. మీ అమ్మ చచ్చాక నీకూ అదే గతి పడుతుంది అంటూ.. తనను కూడా కొట్టేవాడు అంటూ దీనంగా చిన్నారి చెప్పిన వైనం అందర్నీ కలచి వేసింది.భారీ కట్నం, అమ్మాయి పుట్టిందని మరింత వేధింపులుదీంతో తికామ్గఢ్ జిల్లాకు చెందిన మృతురాలి తండ్రి సంజీవ్ త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తమామలు తన కుమార్తెను బాగా వేధించేవారని ఆరోపించారు. తన కుమార్తె సోనాలిని మెడికల్ రిప్రజంటేటివ్‌గా పని చేస్తున్న సందీప్‌తో వివాహం చేశారు. 2019లో వివాహం చేసుకున్నప్పటి నుండి అత్తమామలు కట్నం కోసం నిరంతరం మానసికంగా శారీరకంగా హింసకు గురిచేశారని వాపోయారు. రూ. 20 లక్షల కట్నం ఇచ్చినప్పటికీ, ఆమెను తీవ్రంగా వేధించేవారంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది, అతగాడికి మగపిల్లవాడు కావాలట, అందుకే ప్రసవం తర్వాత తల్లీ బిడ్డల్ని ఆసుపత్రిలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బిల్లు తానే కట్టి ఇంటికి తీసుకెళ్లానని, ఒక నెల తర్వాత అల్లుడు వచ్చాడని చెప్పారు. దీనిపై సోనాలి భర్త సందీప్ బుధోలియాపై గతంలో వరకట్న వేధింపుల కేసు నమోదైంది, కానీ ఆ తరువాత బాగా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో అప్పట్లో రాజీ కుదిరింది.సర్కిల్ ఆఫీసర్ (CO) సిటీ రాంబీర్ సింగ్ ప్రకారం, సందీప్, అతని తల్లి వినీత, అతని అన్నయ్య కృష్ణ కుమార్, అతని వదిన మనీషా మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. భర్త సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
కోడలికి హెచ్ఐవీ ఇంజక్షన్
హరిద్వార్: అడిగినంత కట్నం ఇవ్వలేదని కోడలికి ఏకంగా హెచ్ఐవీ సోకిన ఇంజెక్షన్ ఇచ్చిన అత్తామామల అమానుషత్వమిది. ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌లోని జస్వవాలాలో ఈ దారుణం జరిగింది. నాతిరామ్ సైనీ కుమారుడు అభిõÙక్కు రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోనాల్ సైనీతో పెళ్లయింది. కట్నంగా రూ.15 లక్షల నగదు, కారు ఇచ్చారు. కొంతకాలానికే అత్తమామలు స్కారి్పయో కారు, రూ.25 లక్షలు డిమాండ్ చేయడం ప్రారంభించారు. యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో కోడలిని ఇంటి నుంచి గెంటేశారు. గ్రామంలో పంచాయతీ పెట్టి తిరిగి అత్తారింటికి పంపించారు. శారీరకంగా, మానసికంగా హింసించడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తే హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. భర్తకు మాత్రం నెగిటివ్ వచ్చింది. షాక్‌కు గురైన యువతి తల్లిదండ్రులు అత్తామామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టించుకోకపోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు భర్త, అత్తమామ, ఇతర కుటుంబీకులపై వరకట్న వేధింపులు, దాడి, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
రూ.5 కోట్ల కట్నం సరిపోలేదట.. బెజవాడలో నవవధువుకు వేధింపులు
సాక్షి, విజయవాడ: రూ.5 కోట్లు కట్నం ఇచ్చారు.. అయినా సరిపోలేదంటూ వివాహం జరిగిన రెండు రోజులకే వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు తాళలేని ఆ వధువు విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త, మామపై ఐపీసీ సెక్షన్ 498A, వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 3,4 ల కింది కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టుకు హాజరుపరిచారు. తండ్రీ కొడుకులకు 14 రోజుల రిమాండ్ విధించి.. నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపించారు. విజయవాడ ఆర్టీసీలో కంట్రోలర్‌గా పని చేస్తున్న చెరుకూరి లక్ష్మణరావు కుమారుడు హేమంత్ అజయ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కర్ణాటక రాయచూర్‌లోకి చెందిన ప్రసన్నకుమార్ కుమార్తె లక్ష్మి కీర్తనకి అజయ్‌తో పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి ముందు నగదు, స్థిరాస్థులు, బంగారం, వెండి మొత్తం కలిపి సుమారు రూ.5 కోట్లు కట్నంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 7న రాయచూర్‌లో కీర్తన, అజయ్ వివాహం ఘనంగా జరిగింది. అయితే, వివాహం జరిగిన రెండు రోజులకే లక్ష్మి కీర్తనకి కట్నం వేధింపులు మొదలయ్యాయి. మరో రూ.50 లక్షలు తేవాలంటూ అజయ్, లక్ష్మణరావు వేధింపులకు గురిచేశారు. కట్నం కోసం నవ వధువును తండ్రి, కొడుకులు బంధించడంతో... టార్చర్ భరించలేక.. భవానీపురం పోలీసు స్టేషన్లో నవవధువు ఫిర్యాదు చేసింది. -
అదనపు కట్నం కోసం అత్తమామల వికృత చేష్ట.. కోడలికి ఏకంగా..
లక్నో: అదనపు కట్నం ఇవ్వలేదనే కారణంతో కోడలిపై కక్ష గట్టి దారుణానికి ఒడిగట్టారు అత్తామామలు. తమ కుమారుడికి మరో వివాహం చేయాలనే ఆలోచనతో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేసి హెచ్ఐవీ వైరస్‌తో కలుషితమైన ఇంజెక్షన్లు చేశారు. విషయం తెలుసుకున్న బాధితురాలు కోర్టును ఆశ్రయించడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతికి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్‌తో 2023 ఫిబ్రవరి 15న వివాహమైంది. వివాహం సందర్భంగా సచిన్‌కు రూ.15 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. వీరి పెళ్లి తర్వాత కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇంతలో అత్తింటి వారు స్కార్పియో కారు కొనడానికి తల్లిగారి దగ్గర నుంచి మరో రూ.25 లక్షలు తీసుకురావాలని కోడలిని వేధించారు. ఈ క్రమంలో తాము అంత మొత్తం ఇచ్చుకోలేమని యువతి తల్లిదండ్రులు తెలిపారు. దీంతో, ఆగ్రహానిలోనైన అత్తామామలు.. కోడలిని ఇంటి నుంచి బయటకు పంపించేశారు.అయితే, ఈ విషయం పంచాయతీ పెద్దల వరకు వెళ్లడంతో వారికి నచ్చజెప్పి యువతిని తిరిగి అత్తింటికి పంపారు. కానీ, తీరు మార్చుకోని అత్తమామలు అదనపు కట్నం కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించారు. తమ కుమారుడికి మరో వివాహం చేయాలనే ఆలోచనతో ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే హెచ్ఐవీ వైరస్‌తో కలుషితమైన ఇంజెక్షన్లు చేశారు. కొంత కాలం తర్వాత యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమెకు హెచ్ఐవీ సోకినట్లు వైద్యులు నిర్దరించారు. ఇదే సమయంలో భర్త అభిషేక్‌కు పరీక్షలు చేయగా.. అతడికి హెచ్ఐవీ నెగిటివ్‌గా తేలడంతో బాధితురాలి కుటుంబసభ్యులు ఆమె అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వారు నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు స్థానిక కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు వరకట్న వేధింపులు, దాడి, హత్యాయత్నం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. Bahu is injected with an HIV-infected needle by Bimaru criminal in-laws.In Bimaru Pradesh, a fairly typical incident pic.twitter.com/KiTm2EIDtV— @PoliJester (@PoliJester420) February 15, 2025 -
తను కేసు పెడితే... మీరే జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
నాకు ఇటీవలే పెళ్లయింది. నా భార్యకి నాకు పెళ్ళికి ముందు 7 నెలల పరిచయం ఉంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. కట్నంగా 5లక్షల రూపాయలు ఫోన్ పే ద్వారా తీసుకున్నాను. పెళ్ళి వరకు అంతా బాగానే ఉంది కానీ, తర్వాత తన ప్రతి చిన్న దానికి గొడవ చేస్తుంది. తనకి అందం మీద ఉన్న శ్రద్ధ నా మీద, నా కుటుంబం మీద లేదు. ఊరికే ఫోటోలు దిగుతూ ఉంటుంది. స్కార్ఫ్ కట్టుకోమంటే కట్టుకోను అంటుంది. గొడవ పడిన ప్రతిసారి తలబాదుకుని నేను ఫిజికల్ అబ్యూస్ చేశాను అని వాళ్ళ కుటుంబ సభ్యులతో చెబుతుంది. అందంగా ఉంది, బాగానే సంపాదిస్తుంది అని పెళ్లి చేసుకున్నాను. అందం డబ్బు ఉంటే సరిపోదు, మాట వినే భార్య కూడా అయి ఉండాలి అని అర్థమైంది. మేమిద్దరం ఉద్యోగస్తులమే. నా జీతం 40,000. ఎం.బీ.ఏ చదివాను. తన జీతం 60,000. తను ఎం.సీ.ఏ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఇంట్లో ఖర్చులకు తన జీతం పైసా కూడా ఇవ్వను అంటుంది. తన పెత్తనమే నడవాలి అంటుంది. ఎప్పుడూ తనని పొగుడుతూ ఉండాలి. తనకి నేను కౌన్సిలింగ్ కూడా ఇవ్వలేకపోతున్నాను. విడాకులు తీసుకోవాలి అంటే కనీసం సంవత్సరం ఆగాలి అని ఎక్కడో చదివాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం సూచించగలరు.– ఆదినారాయణ, గుంటూరుఏమిటి? ఐదు లక్షలు వరకట్నం తీసుకున్న మీరు, మీ భార్య మంచిది కాదు, సద్గుణాలు లేవు, నన్ను హరాస్ చేస్తోంది అంటున్నారా? హాస్యాస్పదంగా లేదూ? పైగా కట్నం డబ్బులు ఫోన్‌పే ద్వారా తీసుకున్నారు కదా... తను కేసు పెడితే జైలుకు వెళ్తారేమో చూసుకోండి!ఇకపోతే... విడాకుల గురించి మీరు చదివింది నిజమే. హిందూ వివాహ చట్టం ప్రకారం కనీసం ఒక సంవత్సరం గడవకుండా విడాకుల కోరడం కుదరదు. పరస్పర ఒప్పందంతో విడిపోవాలి అనుకున్నా గాని కనీసం ఒక సంవత్సరం విడివిడిగా ఉంటున్నట్లు చూపించాలి.మీ భార్య ఫోటోలు ఎక్కువ దిగుతుంది, ముఖానికి స్కార్ఫ్ కట్టుకోమంటే వినడం లేదు, తన పెత్తనం నడవాలి అంటుంది, జీతం కూడా నాకు ఇవ్వడం లేదు అని మీరు రాసిన ఈ–మెయిల్ చదివిన తర్వాత, కౌన్సెలింగ్ మీ భార్యకి కాదు మీకు అవసరం అనిపించింది. భార్య మీతో సమానం, మీరు చెప్పినట్లు వినడానికి తను మీ బానిస కాదు. ఇది మీకు తెలిసినట్లుగా లేదు. ఏ విధంగా చూసుకున్నా మీకన్నా తనకే మెరిట్ ఎక్కువ కదా... మీరెందుకు మీ జీతం ఆవిడకి ఇచ్చి ఇంటిని నడపమని చెప్పరు? ఇంటికి యజమాని పురుషుడు మాత్రమే అని అనుకుంటున్నారా? కనీసం మీ మాట తను వినట్లేదు, జీతం ఇవ్వడం లేదు అనకుండా ‘‘కుటుంబ బాధ్యతలు, ఆర్థిక బాధ్యతలు పంచుకోవడం లేదు’’ అనివుంటే నేను బహుశా ఆవిడ వైపు నుంచి కూడా చాలానే తప్పు ఉంది అని అనుకునేవాడిని. చాలామంది పురుషులలో – పురుషుల తల్లిదండ్రులలో కూడా ఈ పురుషాధిక్య భావాలు ఇంకా వుండటం బాధాకరం. మీరు పంపిన ఈ–మెయిల్‌ని బట్టి చూస్తే అందులోని విషయాలు గృహహింస చట్టం – వరకట్న నిషేధ చట్టం కింద నేరాలే! తనది కూడా ఎంతో కొంత తప్పు ఉంది అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్‌తో మీకు నేను ఇచ్చే సలహా ఏమిటి అంటే: ఇద్దరూ కలిసి మంచి ఫ్యామిలీ కౌన్సెలర్ దగ్గర కౌన్సెలింగ్ తీసుకోండి. తప్పు ఎవరిదైనా సరిచేసుకొని హాయిగా వైవాహిక జీవనాన్ని సాగించండి. అప్పటికీ కుదరకపోతే సామరస్యంగా విడిపోండి. ఆౖన్‌లైన్‌లో కట్నం తీసుకున్నారు కాబట్టి కేసులు మీ మీద వేస్తే మీకే నష్టం! -
అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని సీఐపై భార్య ఫిర్యాదు
శాలిగౌరారం: అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతోపాటూ మరో మహిళను రెండో వివాహం చేసుకుని తనను వేధిస్తున్నాడని ఓ మహిళ ఆబిడ్స్ సీఐ నర్సింహపై ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం బండమీదిగూడెంకు చెందిన కప్పల సోమలింగయ్య–అంజమ్మ కుమార్తె సంధ్యకు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామానికి చెందిన కుంభం నర్సింహకు 2012 లో వివాహం జరిగింది. నర్సింహ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆబిడ్స్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు.వివాహ సమయంలో కట్నకానుకలు మొత్తం అప్పజెప్పారు. పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడని సంధ్య ఆవేదన వ్యక్తం చేసింది. తట్టుకోలేక 2024 జూన్‌లో తల్లిగారింటికి వచ్చి తన భర్తపై 2024 డిసెంబర్18న నల్లగొండ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానంది. అక్కడ చర్యలు తీసుకోకపోవడంతో 2024 డిసెంబర్ 24న శాలిగౌరారంలో ఫిర్యాదు చేశానంది.ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో గల తన కుమార్తెను చూసేందుకని ఈ నెల 4న పాఠశాలకు వెళ్లి తన కూతురిని తల్లిగారింటికి తీసుకుని వచ్చానని తెలిపింది. దీంతో తన కుమార్తె కిడ్నాప్‌నకు గురైందని నర్సింహ సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సరూర్‌నగర్ ఎస్ఐ మారయ్య, ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి, మహిళా హెడ్‌కానిస్టేబుళ్లు శుక్రవారం బండమీదిగూడెం వచ్చి తనను విచారించి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారని సంధ్య తెలిపింది.చదవండి: డబ్బులు ఇచ్చి.. భర్త కాళ్లు విరగ్గొట్టించిన భార్య ఈ విషయమై ఆబిడ్స్ సీఐ నర్సింహ వివరణ కోరగా, తన భార్యతో గొడవలు జరుగుతున్నాయిని దీంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించానని తెలిపారు. ప్రస్తుతం తమ కేసు కోర్టులో ఉందన్నారు. -
‘నా చావుకు భార్య, బావమరిది, అత్తలే కారణం’
శాలిగౌరారం: పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రాకపోవడంతో పాటు వరకట్నం వేధింపుల కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేయడంతో మనస్తాపానికి గురై వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లాల గ్రామానికి చెందిన మాదగోని ప్రశాంత్(30)కు సూర్యాపేట పట్టణానికి చెందిన శివజ్యోతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. ప్రశాంత్ నకిరేకల్‌లో మొబైల్‌షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం సాఫీగా సాగిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శివజ్యోతి భర్త ప్రశాంత్‌తో తరచూ గొడవ పడి తల్లిగారింటికి వెళ్లేది. వారం రోజుల క్రితం ఇంట్లో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరగడంతో ప్రశాంత్ శివజ్యోతిపై చేయిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శివజ్యోతి కుమార్తెను తీసుకుని తల్లిగారింటికి వెళ్లింది. వారం రోజులు గడిచినా ఆమె కాపురానికి తిరిగి రాకపోగా వరకట్నం కోసం వేధింపులకు గరిచేస్తున్నారంటూ ప్రశాంత్, అతడి అక్కలపై సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రశాంత్‌తో పాటు అతని బంధువులు, మంగళవారం సూర్యాపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ప్రశాంత్‌ను శివజ్యోతి కుటుంబ సభ్యులు తీవ్రమైన పదజాలంతోపాటూ దూషించడంతో పాటూ దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో మనస్తాపానికి గురైన గురైన ప్రశాంత్ ఇంటికి వచ్చి తన ఆత్మహత్యకు భార్య, అత్త, బావమరిది కారకులని వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి అర్ధరాత్రి సమయంలో వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేటస్ చూసి కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. మృతుడి తండ్రి మాదగోని యాదగిరి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రశాంత్ అంత్యక్రియల్లో అతడి భార్య శివజ్యోతి పాల్గొనకపోవడం గమనార్హం. -
భర్తపై తప్పుడు కేసు.. సుప్రీం కోర్టు సీరియస్
భార్య పెట్టిన వేధింపులు భరించలేక అతుల్ సుభాష్ అనే బెంగళూరు టెక్కీ బలవనర్మణానికి పాల్పడడం.. నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తాను రాసిన సూసైడ్ నోట్ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరాలన్నది అతని కోరిక. అయితే ఈ ఘటన జరిగి 48 గంటలు గడవకముందే.. వైవాహిక చట్టాల దుర్వినియోగంపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.న్యూఢిల్లీ: వ్యక్తిగత పగలతో భర్త, అతని కుటుంబంపై ఓ మహిళ ‘‘వరకట్న వ్యతిరేక చట్టం’’ ప్రయోగించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది అవసరంగా భర్తలను వేధించడం కిందకే వస్తుందని, ఇలాంటి కేసుల విషయంలో ఇకపై తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించింది. ‘‘498ఏ సెక్షన్(వరకట్న వ్యతిరేక చట్టం).. గృహ హింస, వరకట్న వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికే. కానీ, ఈ మధ్యకాలంలో మార్పు కనిపిస్తోంది. చాలామంది మహిళలు తమ గొంతెమ్మ కోర్కెలు నెరవేర్చుకోవడానికి దీనొక్క ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి ధోరణిని ఎంతమాత్రం సహించబోం’’ అని జస్టిస్ బీవీ నాగరత్న, ఎన్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం పేర్కొంది.ఇదీ చదవండి: పేజీల కొద్దీ సూసైడ్ నోట్.. కదిలించిన ఓ భర్త గాథతెలంగాణకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అయితే ఆ తర్వాత ఆ భార్య.. భర్త, అతని కుటుంబం తనను వేధిస్తోందంటూ 498ఏ కింద వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ భర్త హైకోర్టును ఆశ్రయించినా.. ఊరట దక్కలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే తమ పరిశీలనలో ఈ విషయం గుర్తించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.‘‘ఇక్కడ వ్యక్తిగత కక్షతో భర్తపై ఆమె చట్టాన్ని ఆయుధంగా ప్రయోగించాలనుకుంది. ఈ కేసులో భర్తపై నిరాధార ఆరోపణలు చేసిందామె. భర్తను, అతని కుటుంబాన్ని వేధించాలనే ఆమె ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి కేసుల్లో విచారణ సజావుగా జరగాలి. లేకుంటే.. చట్టప్రక్రియల దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు విఫలమైంది. ఈ కేసును కొట్టివేయకపోవడం ఆ ఉన్నత న్యాయస్థానం చేసిన తీవ్ర తప్పిదం.’’ అని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే.. అలాగని.. అన్ని కేసులపై తాము ఈ వ్యాఖ్య చేయడం లేదని, ఇలాంటి వైవాహిక చట్టాల్ని దుర్వినియోగం చేయడంపై మా ఆందోళన’’ అని న్యాయమూర్తులిద్దరూ స్పష్టం చేశారు.ఐపీసీ సెక్షన్ 498ఏ.. జులై 1వ తేదీ నుంచి కాలం చెల్లింది. ఆ స్థానంలో భారతీయ న్యాయ సంహిత(BNS) సెక్షన్ 86 అందుబాటులోకి వచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఘటన జరిగిన మూడేళ్లలోపు ఎప్పుడైనా ఫిర్యాదు నమోదు చేయొచ్చు. -
కోడలు వరకట్నం కేసు పెట్టిందని...
రాంగోపాల్‌పేట్: భర్తతో పాటు అత్తా, మామలపైన కోడలు వరకట్న వేధింపుల కేసు నమోదు చేయించడంతో మనస్థాపం చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు ట్యాబ్లెట్లు, ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నాగోల్‌కు చెందిన తోట భావనారాయణ (52), పద్మావతి (47) భార్యాభర్తలు, వీరి కుమారుడు సుజన్ (23). భావనారాయణ, సుజన్లు ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తుండగా పద్మావతి గృహిణి. సుజన్(23)కు కొత్తగూడెం చుంచుపల్లి ప్రాంతానికి చెందిన కావ్యశ్రీతో ఇదే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన వివాహం చేశారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో కావ్యశ్రీ ఇటీవల చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేయించింది. చుంచుపల్లి పోలీసులు సుజన్‌కు ఫోన్ చేసి తల్లిదండ్రులతో పాటు కౌన్సిలింగ్ కోసం రావాలని ఇటీవల కోరగా రెండు మూడు రోజులు టైం అడిగారు. మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు రావాలని మరో మారు పోలీసులు సూచించారు. దీంతో ఈ నెల 5వ తేదీ ఉదయం ఆన్లైన్ ద్వారా సికింద్రాబాద్ ప్రాంతంలోని తాజ్ ట్రైస్టార్ హోటల్ మూడవ అంతస్తులోని 308 గదిని బుక్ చేసుకుని ముగ్గురు అక్కడ దిగారు. సోమవారం రాత్రి కోడలు కావ్యశ్రీకి ఫోన్ చేసి కేసు విత్‌డ్రా చేసుకోవాలని, లేకపోతే తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసికుంటామని చెప్పారు.ఆ తర్వాత వారి మధ్య సంభాషణ ఏమి జరిగిందో తెలియదు కానీ..మంగళవారం ముగ్గురు డైజోఫాం ట్యాబ్లెట్లు, షుగర్‌కు వాడే ఇన్సులిన్ ఎక్కువ మోతాదులో తీసుకున్నారు. ఉదయం 10.30 గంటల వరకు వీరి గది తలుపులు తెరవకపోవడంతో పాటు హోటల్ సిబ్బంది తలుపు కొట్టినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మరో తాళం చెవితో తాళం తెరిచి చూడగా ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో వెంటనే మహంకాళి పోలీసులకు సమాచారం అందించి వారిని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పద్మావతి సోదరి అక్కడికి చేరుకుని ఆర్థిక పరిస్థితి బాగాలేదని గాం«దీకి తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని వెల్లడించారు. మహంకాళి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
కరీంనగర్‌క్రైం: అదనపు కట్నం తీసుకురావాలనే అత్తింటివారి వేధింపులు భరించలేక ఒక వివాహిత ఉ రివేసుకొని ఆత్మహత్య చే సుకున్న ఘటన కట్టరాంపూర్‌లో చోటుచేసుకుంది. వన్‌టౌన్ సీఐ కోటేశ్వర్ క థనం ప్రకారం.. కరీంనగర్ కట్టరాంపుర్ ప్రాంతానికి చెందిన దొంత అజయ్‌కుమార్‌కు సిద్ది పేట జిల్లా బెజ్జంకి మండలం ఎల్లంపల్లికి చెందిన శ్రావణి(22)తో ఈ ఏడాది ఫిబ్రవరిలో వి వాహం జరిగింది. వివాహ సమయంలోనే పు ట్టింటివారు కట్నం, ఇతర లాంఛనాలు ఇచ్చారు. అయితే, కొద్దిరోజులుగా శ్రావణి భర్త అజయ్‌కుమార్, అత్త ఉపేంద్ర, మామ అంజయ్య కలిసి అదనపు కట్నం కావలని ఆమెను వేధిస్తున్నారు. ఆ వేధింపులు భరించలేక మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తండ్రి సంగెం కొము రయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, వివాహమైన సుమారు ఏడు నెలలకే చనిపోవడంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, బంధువు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. వారిరాకతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న ఏసీపీ నరేందర్, సీఐ కోటేశ్వర్ తమ సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. -
భార్యా భర్తలను కలిపిన లోక్ అదాలత్
సాక్షి, అమరావతి : విభేదాల కారణంగా విడివిడిగా ఉంటున్న భార్యా భర్తలను జాతీయ లోక్ అదాలత్ కలిపింది. ఇందుకు గాను వారిద్దరినీ హైకోర్టు న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ గుహనాథన్ నరేందర్ అభినందించారు. ఈ భార్య భర్తలు విజయవాడకు చెందిన వారు. వీరికి 2008లో వివాహమైంది. ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ భార్య 2022లో పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసులో వారు రాజీపడి కలిసి ఉండేందుకు సిద్ధపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా లోక్ అదాలత్‌లు శనివారం జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా హైకోర్టుతో సహా రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్‌లు నిర్వహించారు. జస్టిస్ నరేందర్ హైకోర్టు ప్రాంగణం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విజయవాడ, మచిలీç³ట్నం న్యాయస్థానాల్లో జరిగిన లోక్ అదాలత్‌లను స్వయంగా పరిశీలించారు. హైకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ తర్లాడ రాజశేఖర్, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో లోక్ అదాలత్ జరగ్గా.. 175 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.2.90 కోట్ల మేర పరిహారాన్ని అందచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 377 లోక్ అదాలత్‌లు నిర్వహించారు. మొత్తం 45,898 కేసులు పరిష్కారం కాగా, రూ.64.72 కోట్లు పరిహారంగా చెల్లించారు. ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన పోషకులు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని సేవాధికార సంస్థ రాష్ట్ర కార్యదర్శి బబిత తెలిపారు. -
పెళ్లయిన ఆరు నెలలకే మహిళ ఆత్మహత్య
మదనపల్లె : ఒకే ఊరిలో వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న అబ్బాయి, అమ్మాయి ఆన్లైన్ వేదికగా పరిచయమై ప్రేమించుకున్నారు. పెద్దల అనుమతితో వివాహం చేసుకుని నూరేళ్ల ప్రయాణం ప్రారంభించారు. అయితే అత్తింటి వేధింపులు ఆ అమ్మాయిని మానసిక వేదనకు గురిచేశాయి. పెళ్లయిన ఆరు నెలలకే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం మదనపల్లెలో వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని రాంనగర్‌కు చెందిన వెంకటరమణ, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె సాయి ప్రియాంక(24) బాబూ కాలనీకి చెందిన శ్రీనివాసులు, ఉష దంపతుల కుమారుడు మణికంఠతో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. కొంతకాలం తరువాత ఇరువురూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించి వివాహం జరిపించారు. కొన్ని రోజుల కిదట మణికంఠ చేనేత పని మానేసి టమాట మార్కెట్లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన అతడు కొద్ది రోజుల కిందట భార్య సాయి ప్రియాంకను వేధించసాగాడు. మంగళవారం రాత్రి మరోసారి కట్నం విషయమై భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. వేధింపులు తీవ్రం కావడంతో రాత్రి అందరూ నిద్రపోయాక ఇంట్లోనే సాయిప్రియాంక చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లవారు జామున గమనించిన కుటుంబ సభ్యులు, తాలూకా పోలీసులు, పుట్టింటివారికి సమాచారం అందించారు. ఎస్.ఐ రవికుమార్ ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దారు రమాదేవి కుటుంబ సభ్యుల వాంగ్మూలం నమోదు చేసి శవ పంచనామా చేశారు.కుటుంబ సభ్యుల ఆందోళనసాయిప్రియాంక మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు తాలూకా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కట్నం కోసం వేధించిన ప్రియాంక భర్త మణికంఠ, మామ శ్రీనివాసులు,అత్త ఉష,తాత మునెప్పలపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ విషయంతో మనస్థాపం చెందిన సాయి ప్రియాంక అత్త ఉష (49) ఇంటివద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. బాధితురాలిని కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై మృతురాాలి తల్లి లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. -
ఘోరం: గర్భిణి అని కూడా చూడకుండా..
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కట్నం కోసం అత్తమామలు కోడలిని హింసించి, అత్యంత దారుణంగా హతమార్చిన ఉదంతం వెలుగుచూసింది. స్థానికంగా ఈ ఘటన సంచలంగా మారింది.వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో రీనా తన్వర్ అనే 23 ఏళ్ల గర్భిణి దారుణ హత్యకు గురైంది. ఆమె చేతులు, కాళ్లు నరికి, మిగిలిన శరీరానికి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న రీనా పుట్టింటివారు తమ కుమార్తెను ఆమె భర్త మిథున్, అత్తమామలు కట్నం కోసం వేధింపులకు గురిచేసి, హత్య చేశారని ఆరోపించారు.ఈ విషాదకర సంఘటన కలిపిత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాండి ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రీనా హత్య గురించి ఆమె కుటుంబసభ్యులకు తెలిపాడు. వెంటనే రీనా తండ్రి రాంప్రసాద్ తన్వర్ పోలీసులతో పాటు తాండి ఖుర్ద్‌కు చేరుకున్నాడు. వీరిని గమనించిన రీనా అత్తమామలు కోడలి చితి దగ్గర నుంచి పారిపోయారు. దీంతో రీనా తండ్రి అక్కడ మండుతున్న చితిని ఆర్పివేసి సగం కాలిన కుమార్తె మృతదేహాన్ని ఒక గుడ్డలో చుట్టారు. అనంతరం పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రీనా తన్వర్‌కు మిథున్ తన్వర్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఏడాదిన్నర వయసున్న కుమార్తె ఉంది. ప్రస్తుతం రీనా నాలుగు నెలల గర్భవతి. రీనా అత్తమామలు అనునిత్యం డబ్బులు డిమాండ్ చేస్తూ, తమ కుమార్తెను వేధిస్తున్నారని ఆమె తండ్రి రాంప్రసాద్ తన్వర్ పోలీసుల ముందు ఆరోపించారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కలిపిత్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రజనీష్ సిరోథియా తెలిపారు. -
విశాఖలో దారుణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న పద్మిని ఆడియో
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. వివాహితను హత్య చేసిన అత్త, మామ, భర్త ఆత్మహత్యగా చిత్రీకరించారు. అత్త,మామ, భర్త, వేధింపులు భరించలేక మృతురాలు పద్మిని.. బంధువులకు ఆడియో రికార్డ్ చేసి పంపించింది. నోటిలో పురుగులు మందు బలవంతంగా పోసి భార్యను భర్త సోమేశ్వరరావు హత్య చేశాడు. ఈ నెల ఒకటో తేదీన ఘటన చోటు చేసుకోగా, కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. భర్త, అత్త మామలను గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు.వరకట్నపు వేధిపులు కేసు ఆడియో ‘సాక్షి’కి చిక్కింది. మృతురాలు పద్మిని తన మావయ్యకి ఆడియో పంపింది. పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకొని రావాలని భర్త వేధింపులకు గురిచేశాడు. పురుగులు మందు నీటిలో పోసి.. భర్త సోమేశ్వరరావు చేతిని అడ్డు పెట్టాడు. 25 సార్లు వాంతులు చేసుకున్న పద్మిని ఆడియో కన్నీరు తెప్పిస్తుంది. -
కోడలి హత్య కేసులో అత్తకు రెండు జీవిత ఖైదులు
ఖలీల్‌వాడి: కట్నం కోసం కొడుకుతో కలిసి కుట్రపన్ని కోడలి కిరాతకంగా హతమార్చిన చేసిన కేసులో బానోత్ పద్మ అనే దోషికి రెండు జీవిత కారాగార శిక్షలు విధిస్తూ నిజామాబాద్ జిల్లా, సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ప్రధాన ముద్దాయి బానోత్ రామ్‌సింగ్ కోర్టు వాయిదాకు గైర్హాజరవడంతో అతనిపై బెయిల్‌కు వీల్లేని అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ముద్దాయి కోర్టుకు హాజరయ్యాక శిక్ష ఖరారు చేయనున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని... నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం శివ తండాకు చెందిన బానోత్ రామ్‌సింగ్... ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన యెండల రాధ సికింద్రాబాద్‌లోని కళామందిర్ షోరూంలో కలిసి పనిచేసేవారు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించి 2020 జనవరి 30న నవీపేట్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. రాధ తల్లిదండ్రులు పేదలు కావడంతో పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇవ్వలేదు. అయితే పెళ్లియిన కొన్ని రోజులకే కట్నం కోసం రాధకు వేధింపులు మొదలయ్యాయి. రూ. లక్ష నగదుతోపాటు బంగారాన్ని తల్లిదండ్రుల నుంచి తేవాలని భర్త, అత్త పద్మ ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ విధించడంతో రామ్‌సింగ్ ఉద్యోగం కోల్పోయాడు. మరో పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా కలిసొస్తుందని భావించాడు. ఇందుకు అడ్డంకిగా ఉన్న భార్యను చంపాలని తల్లితో కలిసి కుట్రపన్నాడు.బైక్‌పై తీసుకెళ్లి.. చుట్టాల ఇంటికి వెళ్లొద్దామని రాధను నమ్మించిన రామ్‌సింగ్, పద్మ ఆమెను బైక్‌పై తీసుకెళ్లారు. దగ్గర దారిలో వెళ్దామంటూ రాధను మాక్లూర్ మండలం రాంచంద్రాపల్లి అటవీ ప్రాంతంలోని బాసం లొద్ది గుట్టపైకి తీసుకెళ్లారు. ముందు నడుస్తున్న రాధపై వెంట తెచ్చుకున్న పెట్రోల్, కిరోసిన్‌ను అత్త పోసింది. వెంటనే రామ్‌సింగ్ అగ్గిపుల్ల గీసి నిప్పంటించడంతో మంటలకు తాళలేక రాధ విలవిల్లాడింది. అయినా ఆమె బ్రతికి ఉండటంతో బండ రాళ్లతో తలపై కొట్టి తీవ్రంగా గాయపర్చారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఒక గుంతలో పడేసి సజీవదహనం చేశారు. ఈ కేసును ఛేదించిన అప్పటి నిజామాబాద్ సౌత్ సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ కుమార్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన జడ్జి తాజాగా ముద్దాయి పద్మకు జైలుశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. వరకట్న వేధింపులు, హత్య చేసినందుకు ఒక జీవితఖైదు విధించడంతోపాటు కుట్ర కేసులో మరో జీవిత ఖైదు, సాక్ష్యాధారాలను మాయం చేసిన నేరానికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రధాన ముద్దాయిపైనా నేరారోపణలు రుజువు అయినట్లు నిర్ధారించారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్ వాదనలు వినిపించారు. -
అత్తింటి ఆరళ్లకు ముగ్గురు బలి
కరీంనగర్ రూరల్: అదనపు కట్నం కోసం అత్తింటివేధింపులను తట్టుకోలేక ఏడాది బిడ్డకు విషగుళికలు ఇచ్చి చంపిందా తల్లి. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని తట్టుకోలేక మృతురాలి తల్లి సైతం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకేరోజు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతితో కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో తీరని విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. బొమ్మకల్ గ్రామ పంచాయతీ విజయ్‌నగర్‌కాలనీలో ఉంటున్న ఉపాధ్యాయ దంపతులు గద్దె వెంకటేశ్వరచారి– జయప్రద(55) తమ చిన్న కూతురు శ్రీజ(25)కు మూడేళ్లక్రితం వరంగల్ జిల్లా మొగ్ధుంపూర్‌కు చెందిన నరేశ్‌తో కట్నకానుకలతో వివాహం జరిపించారు. ఏడాదిపాటు సక్రమంగా కాపురం చేసిన నరేశ్... కొడుకు ఆర్యన్(1) పుట్టాక శ్రీజను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. అత్తమామలు సుజాత–కేశవచారి హింసించడంతో శ్రీజ గత నెల 29న బొమ్మకల్‌లోని పుట్టింటికి వచ్చింది. మంగళవారం ఉదయం 6గంటలకు కొడుకు మొదటి బర్త్‌డే గురించి నరేశ్‌కు శ్రీజ ఫోన్ చేయడంతో అత్తమామలు, భర్త కలిసి తీవ్రంగా దూషించారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శ్రీజ క్రిమిసంహారక మాత్రలను కొడుకు ఆర్యన్‌కు తాగించి ఆ తర్వాత తానూ వేసుకుంది. అపస్మారకస్థితిలో పడి ఉన్న తల్లి, కొడుకులను జయప్రద, వెంకటేశ్వరచారి అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బిడ్డ మృతిచెందగా శ్రీజ చికిత్స పొందుతూ చనిపోయింది. కూతురు, మనవడి మృతిని తట్టుకోలేక జయప్రద ఇంటికివెళ్లి క్రిమిసంహారక మాత్రలు వేసుకుంది. ఆస్పత్రిలో చేరి్పంచగా పరిస్థితి విషమించి మృతి చెందింది. -
విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు
ఆధునిక సమాజంలో కూడా వరకట్న హత్యలు మహిళల జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. లక్షలకు లక్షలు కట్నం పోసి పెళ్ళిళ్లు చేసినా ఆడబిడ్డల తల్లిదండ్రులకు కడుపుకోత తప్పడం లేదు. తాజాగా ఖరీదైన కారు, అదనపు కట్నం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన కలకలం రేపింది. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్నగ్రేటర్ నోయిడాలో ఈ విషాదం చోటు చేసుకుంది టయోటా ఫార్చ్యూనర్ కారు, మరో రూ.21 లక్షల కోసం కోడలు కరిష్మాను దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం రూపింది. బాధితురాలు కరిష్మా సోదరుడు దీపక్ సమాచారం ప్రకారం 2022, డిసెంబరులో కరిష్మా, వికాస్‌కు వివాహమైంది. పెళ్లి సమయంలో వరుడి కుటుంబానికి రూ. 11 లక్షల విలువైన బంగారంతో పాటు ఒక SUVని ఇచ్చింది. అయినా వికాస్ కుటుంబం కొన్నేళ్లుగా మరింత కట్నం డిమాండ్ చేస్తూ వచ్చింది. ఆమెను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేసింది. దీనికితోడు ఆడపిల్ల పుట్టిందనే సాకుతో వారి వేధింపులు మితి మీరి పోయాయి. దీంతో గ్రామ పెద్దల మధ్య రెండు కుటుంబాలు విభేదాలూ పరిష్కారానికి ప్రయత్నించాయి. దీంతో కరిష్మా కుటుంబం రూ. 10 లక్షలు చెల్లించిన వారి వేధింపులు ఆగలేదు, చివరికి ఆమెను పొట్టన బెట్టుకున్నారని దీపక్ ఆరోపించాడు. ఈ మేరకు కరిష్మా సోదరుడు దీపక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, తన భర్త వికాస్, అతని తల్లిదండ్రులు , తోబుట్టువులు తనను కొట్టారని వాపోయిందని తెలిపారు. ఏమైందో తెలుసుకుందామని ఆమె ఇంటికి చేరుకునే సరికే ఆమె శవమై కనిపించిందని ఆరోపించాడు. దీపక్ ఫిర్యాదు మేరకు వికాస్, అతని తండ్రి సోంపాల్ భాటి, అతని తల్లి రాకేష్, సోదరి రింకీ, సోదరులు సునీల్, అనిల్‌లపై వరకట్న హత్య కేసు నమోదైంది. వికాస్, తండ్రి అరెస్ట్ కాగా మిగిలినవారు పరారీలోఉన్నారు. -
ఎస్సైకి దిగువ కోర్టు విధించిన శిక్ష ఖరారు
రాజమహేంద్రవరం రూరల్: వరకట్నం వేధింపుల కేసులో శిక్ష పడిన ఎస్ఐ మల్లులు సతీష్‌కుమార్, అతని తల్లి మల్లుల విజయ శారద లకు దిగువ కోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ రాజమహేంద్రవరం పదవ అదనపు జిల్లా జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎం.నాగేశ్వరరావు తీర్పు నిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2014లో రాజమహేంద్రవరానికి చెందిన శిరీషను హైదరాబాద్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న మల్లుల సతీష్ కుమార్ వివాహం చేసుకున్నాడు. రూ.17 లక్షల కట్నం ఇచ్చి శిరీష తల్లిదండ్రులు ఘనంగా వివాహం జరిపించారు. వివాహమైన కొద్ది రోజులకే నాలుగు అంతస్తుల బిల్డింగ్, డాబా ఇంటిని అమ్మి అదనంగా రూ.కోటి కట్నం తీసుకురమ్మని, రూ.25 లక్షలతో వాహనం కొని ఇవ్వాలని ఎస్సై సతీష్‌కుమార్ డిమాండ్ చేశాడు. అతనితో పాటుగా అతని కుటుంబ సభ్యులు మానసికంగా, శారీరకంగా వేధించమే కాకుండా అడిగినట్టుగా ఇవ్వకపోతే విడాకులు ఇమ్మని, తెల్ల కాగితాలపై, స్టాంప్ పేపర్‌పై సంతకాలు చేయమని వేధించారు. సతీష్‌కుమార్ తన సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి శిరీష వద్ద ఉన్న 35 కాసుల బంగారం తీసుకొని ఆమెను ఇంటి నుంచి గెంటి వేశాడు. రాజమహేంద్రవరం వచ్చిన సతీష్ కుమార్, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం డిమాండ్ చేయడమే కాకుండా శిరీష తల్లిదండ్రులపై దౌర్జన్యం చేశారు. బాధితురాలు రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కోర్టులో సాక్షులను విచారించిన అనంతరం సతీష్‌కుమార్‌కు ఐదేళ్ల జైలు శిక్ష , రూ.17 లక్షల జరిమానా, భార్యను వేధించినందుకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. అత్తగారైన విజయశారదకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.21,000 జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం ఐదవ అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆనాటి న్యాయమూర్తి సీహెచ్‌వీ రామకృష్ణ 2018 ఆగస్టులో తీర్పునిచ్చారు. దీంతో హైదరాబాద్‌లోని పోలీసు ఉన్నతాధికారులు ఎస్సై ఉద్యోగం నుంచి సతీష్‌కుమార్‌ను తొలగించారు. వారు తమకు పడిన శిక్షలపై రాజమహేంద్రవరం పదవ అదనపు జిల్లా జడ్జి కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఎం.నాగేశ్వరరావు మంగళవారం కింద కోర్టులో ఇచ్చిన తీర్పును ఖరారు చేశారు. ఇప్పటికే జిల్లా కోర్టులోనూ, మనోవర్తి కేసులోనూ సతీష్‌కుమార్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. సీనియర్ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటరత్నం బాబు బాధితురాలి తరఫున వాదనలు వినిపించారు. -
వరకట్న వేధింపులతో వివాహిత బలవన్మరణం
అచ్చంపేట: వరకట్న వేధింపులతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడగా.. యువతి తరఫు బంధువులు ఆగ్రహంతో భర్త పై దాడి చేయడంతో మృతిచెందాడు. ఘటనకు సంబంధించి వివరాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన అతికారి సింధు (26), ఖమ్మం జిల్లాకు చెందిన నిమ్మతోట నాగార్జున (28) అచ్చంపేట ప్రగతి డిగ్రీ కళా శాలలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 2021 మార్చిలో హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగార్జున అచ్చంపేటలోని తన బాబాయ్ డాక్టర్ కృష్ణకు చెందిన శ్రీరాంసర్రాం ఆస్పత్రి లో పనిచేస్తున్నాడు. కొంతకాలం వీరి వైవాహిక జీవితం సవ్యంగా సాగింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో గొడ వలు మొదలయ్యాయి. దీంతో కొద్ది రోజులుగా కట్నం తీసుకురావాలని సింధును నాగార్జున, అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సింధు తమ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయతి్నంచింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం శ్రీరాంసర్రాం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు నాగర్‌కర్నూల్‌కు, అక్కడి నుంచి మహబూబ్‌నగర్, చివరికి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. అయితే అప్పటికే సింధు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహం తీసుకువస్తుండగా.. కాగా, సింధు మృతదేహాన్ని భర్త నాగార్జున అ చ్చంపేటకు తీసుకొస్తుండగా ఆమన్‌గల్ సమీపంలో బంధువులు వాహనాన్ని అడ్డగించి నాగార్జునను మరో వాహనంలో తీసుకెళ్లి చితకబాది అచ్చంపేట తీసుకొచ్చారు. అప్పటికే పోలీసులకు విషయం తెలియడంతో సింధు బంధువుల వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన నాగార్జున మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. సింధు, నాగార్జున మృతదేహా లు ఒకే దగ్గర ఉంటే అల్లర్లు జరిగే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు సింధు మృతదేహాన్ని అచ్చంపేట ఆస్పత్రికి, నాగార్జున మృతదేహాన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా తమ కూతురు మృతికి డాక్టర్ కృష్ణ, అతని భార్య, నాగార్జున తల్లి, చెల్లి కారణమని సింధు తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. నాగార్జున బాబాయ్ డాక్టర్ కృష్ణ వరకట్నం డబ్బులు తేవాలని.. లేకపోతే తన కోరిక తీర్చాలని సింధుని వేధించినట్లు పోలీసులకు శనివారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సింధుది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆస్ప త్రుల చుట్టూ తిప్పారని వారు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి ఇరువురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి, అచ్చంపేట సీఐ అనుదీప్, ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు. -
కట్నం ఇవ్వలేదని శోభనం అడ్డుకున్న కుటుంబ సభ్యులు
కర్ణాటక: కట్నం ఇవ్వలేదని శోభనం జరగకుండా అడ్డుకున్న ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులపై వివాహిత బసవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు...బాధిత మహిళకు 2022 జూన్ 6న అవినాశ్ శర్మతో వివాహం జరిగింది. వివాహ సమయంలో వరుడు కుటుంబ సభ్యులు కట్నం వద్దన్నారు. వివాహమై భర్త ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు వరుడి తండ్రి మీ కుటుంబ సభ్యులు తనకు రూ.15 లక్షలు ఇస్తామని తెలిపారని, ఆ డబ్బు ఇవ్వకపోతే మొదటిరాత్రి శోభనానికి అనుమతించేదిలేదని కోడలిని బెదిరించాడు. ఈ విషయం కోడలు తల్లిదండ్రులకు తెలపడంతో డబ్బు ఇవ్వడానికి తల్లిదండ్రులు కొద్దిరోజులు సమయం ఇవ్వాలని కోరారు. 2022 జూన్ 22 తేదీన బాధిత మహిళ తల్లిదండ్రులు రూ.5.8 లక్షలు నగదు ఇచ్చారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. స్నానం చేస్తుండగా గమనించేవారు ఇంతటితో మిన్నకుండిన భర్త కుటుంబ సభ్యులు మిగిలిన రూ.10 లక్షలు ఇవ్వకుంటే ఇంట్లో ఉండనిచ్చేదిలేదని కోడల్ని బెదిరించారు. స్నానం చేస్తుండగా భర్త తండ్రి చాటుగా గమనించేవాడు. దీనిపై కోడలు మామను ప్రశ్నించగా ఎవరికై నా చెబితే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తామని బెదిరించారని మహిళా ఫిర్యాదులో ఆరోపించింది. బాధిత మహిళ మళ్లీ పుట్టింటికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంది. తల్లిదండ్రులు అల్లుడి ఇంటి వద్దకు విచారించగా మేము చెప్పినట్లు వినాలని లేకపోతే ఇప్పుడే రూ.15 లక్షల డబ్బు ఇవ్వాలని తెలిపారు. అనంతరం మహిళ కుటుంబసభ్యులు అక్కడ నుంచి తమ ఇంటికి వెళ్లిపోయారు. నాకు సంబంధించిన పత్రాలు అత్తగారింట్లో ఉన్నాయని వీటి గురించి అడిగితే డబ్బు ఇచ్చి మీ పత్రాలు తీసుకెళ్లాలని తెలిపారని ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. -
పెళ్లయిన ఏడాదికే..
సాక్షి, కరీంనగర్: ఓ యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. వివరాల ప్రకారం పచ్చునూర్ గ్రామానికి చెందిన మానస (25)కు గట్టుదుద్దెనపల్లికి చెందిన పప్పు సంపత్తో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ, ఆరు నెలలకే అదనంగా డబ్బులు తీసుకురావాలంటూ భర్త ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీపావళికి మానస తల్లి గారింటికి వచ్చింది. భర్త డబ్బులు కావాలని వేధిస్తున్నాడని తల్లిదండ్రులతో చెప్పింది. పండుగ మరుసటి రోజు సంపత్ పచ్చునూర్ వచ్చి, డబ్బులివ్వాలని గొడవపడి వెళ్లిపోయాడు. అప్పటినుంచి మానస పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయం చూసి, బయటకు వెళ్లిపోయింది. గురువారం తల్లిదండ్రులు వెతకగా గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో మానస మృతదేహం కనిపించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి కూడా చదవండి: బంధువుల ఇంట్లో.. జరిగే శుభకార్యానికి వెళ్లొస్తూ.. -
అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్త వేధింపులు.. వివాహిత తీవ్ర నిర్ణయం..
సాక్షి, వికారాబాద్: అదనపు కట్నం కోసం భర్త, అత్త పెడుతున్న వేధింపులను భరించలేని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ రామకృష్ణ, ఎస్ఐ సంతోష్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండల పరిధిలోని గొట్లపల్లినికి చెందిన వీరమణి(30)ని మార్చి 16, 2017లో ధారూరుకి చెందిన జక్కెపల్లి లాల్కుమార్కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.20వేల నగదు, 3 తులాల బంగారం, బడి బాసండ్లు ఇచ్చారు. అయితే వీరమణికి.. కార్తీక్(6), కృతిక(3) ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇల్లు కట్టుకోడానికి అదనపు కట్నం తీసుకురావలంటూ అత్త లక్ష్మి, భర్త లాల్‌కుమార్ వేధించసాగారు. ఈ నేపథ్యంలో వీరమణి పుట్టింటివారు ఇంటి నిర్మాణానికి ఆగస్టు 30, 2020న రూ. 2.50 లక్షలు, 2021లో రెండోసారి రూ.3 లక్షలు ఇచ్చారు. డబ్బులు సరిపోలేవని భర్త, అత్త మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయగా మూడు నెలల క్రితం వీరమణి అమ్మ మూడోసారి రూ.2.20 లక్షలు ఇచ్చింది. ఈనెల 24న కూతురు, అల్లుడు కలిసి దసరా పండుగ సందర్భంగా ఇంటికి వచ్చారని అత్త లక్ష్మి(మృతురాలి అమ్మ) పేర్కొంది. కొత్తకారు తీసుకున్నా డబ్బులు తక్కువపడ్డాయి, రూ.50 వేలు కావాలని అల్లుడు లాలుకుమార్ అత్త, బామ్మర్ది వెంకటేశ్‌ను డిమాండు చేశాడు. ప్రస్తుతం మా దగ్గర డబ్బులు లేవని తర్వాత ఇస్తామని చెప్పడంతో కోపోద్రిక్తుడైన లాల్‌కుమార్ ఉన్నపలంగా భార్యను తీసుకుని ఇంటికి వచ్చేసాడు. అదేరోజు రాత్రి భర్త, అత్త కలిసి వీరమణిని డబ్బులు తేవాలంటూ హింసించారు. వేధింపులు భరించలేని వీరమణి బుధవారం మధ్యాహ్నం చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని అదేరోజు మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్త, భర్త కలిసి తన కూతుర్ని అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా హింసించారని, ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురి భర్త, అత్తపై కఠిన చ్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి శవానికి గురువారం పోస్టుమార్టమ్ చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: ఇద్దరితో ప్రేమాయణం.. మరో యువతితో నిశ్చితార్థం.. సినీ ఫక్కీలో పోలీస్ ఎంట్రీతో షాక్! -
‘ప్రేమించి పెళ్లాడిన వాడే కులం తక్కువ దానివని నిందిస్తున్నాడు’
అనంతపురం క్రైం: ‘ప్రేమించి పెళ్లాడిన వాడే కులం తక్కువ దానివని నిందిస్తున్నాడు’ అంటూ బాధితురాలు దిశ మహిళా పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను దిశ పోలీసుస్టేషన్ సీఐ చిన్నగోవిందు వెల్లడించారు. కళ్యాణదుర్గం మండలానికి చెందిన ఎరుకల చందన, ఎన్పీకుంట మండలం పట్టంవారిపల్లికి చెందిన వడ్డే నవీన్ ప్రేమించుకున్నారు. ఇరువురూ పెద్దలను ఎదిరించి ఈ ఏడాది మే 29న కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అనంతపురం నగరంలోని మున్నానగర్‌లో వారు కాపురం పెట్టారు. కొంతకాలం వారి సంసారం సజావుగా సాగింది. అయితే భర్త తరఫువారు వారి సంసారంలో జోక్యం చేసుకోవడంతో చందనకు కష్టాలు మొదలయ్యాయి. వరకట్నం తీసుకురావాలని చందనపై ఒత్తిడి తీసుకువచ్చారు. కులం తక్కువదానివంటూ హేళన చేస్తూ వచ్చారు. రూ.3 లక్షలు తీసుకువస్తే కాపురానికి రావాలని, లేకపోతే ఇంట్లోకి ఉండనివ్వమంటూ దాడి చేశారు. ఈ క్రమంలో పెద్దలు కూడా పంచాయితీలు చేసి ఇరువురికి సర్దిచెప్పారు. అత్తింటికి వెళ్లి డబ్బు తీసుకురావాలని చెప్పడంతో చందన పుట్టింటికి వెళ్లింది. అయితే నవీన్ అక్కడికి వెళ్లి చందన పెళ్లి సమయంలో తీయించుకున్న ఫొటోలను చింపేసి సెల్‌ఫోన్‌ని పగుల గొట్టాడు. నవీన్‌తో పాటు అతని తండ్రి రమణప్ప, బావ నిరంజన్ దాడిలో పాల్గొనడంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ఎస్సీ, ఎస్టీ, వరకట్నం వేధింపుల కింద ఫిర్యాదు చేసినట్లు సీఐ చిన్నగోవిందు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
బావిలోకి తోసి.. భార్య విలవిలలాడుతుంటే వీడియో తీసి..
మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లో ఒక గృహిణి హింసకు గురైన ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కట్నం కోసం ఒక భర్త తన భార్యకు తాడుకట్టి బావిలోకి వదిలాడు. తరువాత ఆమె బావిలో నుంచి కాపాడమంటూ ఆర్తనాదాలు చేస్తుండగా వీడియో తీసి, దానిని భార్య పుట్టింటివారికి పంపాడు. ఈ ఉదంతం జాదవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిర్‌ఖెడా గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాకేష్ కీర్‌కు మూడేళ్ల క్రితం రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా నివాసి ఉషతో వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి రాకేష్ తన భార్యను కట్నం కోసం వేధిస్తున్నాడు.ఈ మధ్య కాలంలో రాకేష్ భార్య విషయంలో మరింత క్రూరంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా తన భార్య ఉషకు తాడు కట్టి బావిలోకి వేలాడదీశాడు. నీటితో నిండిన బావిలో మునిగిన ఆమె భయంతో తనను బయటకు తీసుకురావాలంటూ భర్తను వేడుకుంది. అయితే భర్త ఆమె ఆవేదనను పట్టించుకోకుండా, ఈ దృశ్యాన్ని వీడియో తీశాడు. కొద్దిసేపటి తరువాత చుట్టుపక్కలవారు జోక్యం చేసుకుని ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఉదంతం పోలీసుల వరకూ చేరడంతో వారు నిందితుడు రాకేష్‌ను అరెస్టు చేశారు. జాదవ్ పోలీస్ స్టేషన్ అధికారి అస్లం పఠాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఉదంతంలో నిందితుడు రాకేష్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశామన్నారు. అలాగే రాకేష్‌ను అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టామని, అనంతరం జైలుకు తరలించామన్నారు. ఇది కూడా చదవండి: అది ‘ఇత్తడి నగరం’ ఎందుకయ్యింది? నిత్యం శబ్ధాలు ఎందుకు వినిపిస్తాయి? -
పీఎంకే ఎమ్మెల్యేపై వరకట్నం కేసు
సాక్షి, చైన్నె: పీఎంకే ఎమ్మెల్యే సదాశివం కుటుంబంపై వరకట్నం కేసు నమోదైంది. తనను కొద్దిరోజులుగా వేధిస్తున్నట్లు కోడలు ఇచ్చిన ఫిర్యాదుతో సూరమంగలం మహిళా పోలీసులు మంగళవారం రంగంలోకి దిగారు. వివరాలు.. సేలం జిల్లా మేట్టూరు పీఎంకే ఎమ్మెల్యేగా సదా శివం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు శంకర్‌కు 2019లో సర్కారు కొల్లపట్టికి చెందిన మనోలియాతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడాదిన్నర బిడ్డ ఉంది. ఈ పరిస్థితుల్లో తన భర్త శంకర్, మామ సదాశివం, అత్త బేబి, ఆడపడుచు కలైవాణి వరకట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్నట్లు మనోలియా ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబంపై ఆరు సెక్షన్లతో కేసు నమోదైంది. కాగా విచారణకు రావాలని ఎమెల్యేకు మంగళవారం మహిళా పోలీసు స్టేషన్ అధికారులు సమన్లు జారీ చేశారు. -
వరకట్న వేధింపులకు మహిళ బలి
విశాఖపట్నం: వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గాజువాక పోలీస్ స్టేషన్ పరిధి వాంబే కాలనీలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గాజువాక ఏసీపీ త్రినాథ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వాంబేకాలనీలో నివసిస్తున్న కొత్తకోట లక్ష్మి (27), సంతోష్ దంపతులు. కొద్ది సంవత్సరాల క్రితం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నుంచి ఉపాధి కోసం వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇద్దరూ కూలిపనులు చేసుకుని జీవించేవారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంగళవారం ఉదయం పనికి వెళ్లిన సంతోష్ రాత్రి ఇంటికి వచ్చేసరికి లక్ష్మి ఉరి వేసుకుని ఉండటంతో, వెంటనే ఆమదాలవలసలో ఉంటున్న లక్ష్మి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న గాజువాక పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సంతోష్, లక్ష్మి మధ్య మనస్పర్థలున్నాయని, వరకట్న వేధింపులు కూడా కలహాలకు కారణమని ఇరుగుపొరుగు వారు తెలిపారు. సంతోష్ మద్యానికి బానిసై నిత్యం లక్ష్మిని వేధింపులకు గురి చేసేవాడని తెలియజేశారు. అదనపు కట్నం తేవాలని తమ కుమార్తెను నిత్యం వేధించేవాడని మృతురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏసీపీ త్రినాథ్ కేసు దర్యాప్తు చేయనున్నారు. -
పెళ్లికి ముందే వరకట్న వేధింపులు.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే..
బంజారాహిల్స్: నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు నుంచే వరకట్న వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని రోహిత్ డేవిడ్ పాల్‌కు గత ఏడాది మార్చి 1న కంట్రీక్లబ్‌లో యువతితో నిశి్చతార్థం జరిగింది. ఇందుకోసం అత్తింటివారు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. గతేడాది జూలైలో పెళ్లి చేయాలని నిశ్చయించారు. సదరు యువకుడు పెళ్లి గురించి ఎన్నిసార్లు అడిగినా దాటవేస్తూ వచ్చాడు. ఆయన తల్లి కూడా ఈ పెళ్లి విషయంలో పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. రూ.2 కోట్ల వరకట్నం ఇస్తే చేసుకుంటానంటూ ఇటీవల మెలిక పెట్టాడు. చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితురాలి మేనమామ ఇచి్చన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదైంది.నిశ్చితార్థం సమయంలో బంగారు ఉంగరం, దుస్తుల కోసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినట్లు వాటిని తిరిగి ఇప్పించాల్సిందిగా కోరారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొడుకుకు ఉరేసి.. ఆపై ఉరేసుకొని
బంజారాహిల్స్: మూడేళ్ల బిడ్డ ఆలనాపాలన ఓవైపు... కడుపున పెరుగుతున్న శిశువు ఎదుగుదలను చూసుకోవాల్సిన బాధ్యత మరోవైపు. ఈ క్రమంలో అత్తింటి వారి వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. మరణమే శరణ్యమని భావించింది. ‘అమ్మా... మా అత్త నన్ను చితకబాదింది... ఏం చేస్తారో అని భయమేస్తోంది... చచ్చిపోవాలనిపిస్తోంది’అంటూ రోదిస్తూ తల్లికి ఫోన్ చేసిన 12 గంటల వ్యవధిలోనే బలవన్మరణానికి పాల్పడింది. తన ఒడిలో పడుకున్న బిడ్డకు ముందుగా ఉరేసి ఆ తర్వాత కడుపున ఉన్న బిడ్డతో సహా తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ ఫిలింనగర్‌లోని వినాయకనగర్ బస్తీలో చోటుచేసుకుంది. పెళ్లయిన నెల నుంచే వేధింపులు... మేడిపల్లికి చెందిన శిరీష (23) వివాహం ఫిలింనగర్‌లోని వినాయకనగర్ బస్తీకి చెందిన కారు డ్రైవర్ కావటి విశ్వనాథ్ (32)తో 2019 జూన్ 9న జరిగింది. వివాహ సమయంలో రూ. 8 లక్షల కట్నంతోపాటు 15 తులాల బంగారం ఇచ్చారు. పెళ్లి జరిగిన నెల రోజులకే అత్త బసవమ్మ, భర్త విశ్వనాథ్ విశ్వరూపం చూపించారు. రోజూ కొట్టడంతోపాటు, అదనపు కట్నం తెమ్మంటూ పుట్టింటికి తరచూ పంపేవారు. పుట్టింటికి వచ్చిన శిరీషకు తల్లి లక్ష్మి అప్పుచేసి ఒక్కోసారి రూ. లక్ష చొప్పున అయిదుసార్లు డబ్బులు ఇచ్చి పంపింది. అయినాసరే కూతురు కాపురం బాగుపడకపోగా రోజురోజుకూ వేధింపులు పెరిగిపోయి అత్తతోపాటు భర్త విశ్వనాథ్ తీవ్రంగా కొట్టేవాడు. ఈ నెల 9న పెళ్లి రోజున కూడా ఆమెను చితకబాదాడు. అదనపు కట్నం తేవాలంటూ పుట్టింటికి పంపించేందుకు యత్నించగా ఈసారి ఆమె కాళ్లావేళ్లాపడింది. అయినాసరే ఆ కర్కశ హృదయాలు కరగలేదు. శుక్రవారం ఉదయం 12 గంటలకు తల్లికి ఫోన్ చేసి అత్త కొట్టిందంటూ చెప్పి భోరుమంది. వాళ్ల కదలికలు చూస్తుంటే తనను ఏదో చేసేలా ఉన్నారంటూ ఫోన్ కట్ చేసింది. ఆ తర్వాత తల్లి లక్ష్మి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ అని వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో అల్లుడు విశ్వనాథ్ అత్త లక్ష్మికి ఫోన్ చేసి మీ కూతురు ఉరేసుకుందంటూ చెప్పాడు. కన్నీరుమున్నీరైన మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బస్తీకి పరిగెత్తుకొచ్చారు. కుమార్తెతోపాటు పక్కనే చిన్నారి మనీష్ విగతజీవిగా కనిపించడంతో గుండెలవిసేలా రోదించారు. తన కూతురు వరకట్న వేధింపులతోనే చనిపోయిందని... ఆమె మృతిపై విచారణ జరపాలని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు భర్త విశ్వనాథ్‌పై ఐపీసీ సెక్షన్ 304 (బీ), 498 (ఏ), 3, 4, వరకట్న నిషేధిత చట్టం, రెడ్‌విత్ 109 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అత్త బసవమ్మ, మామ రమే‹Ùలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
‘అదొద్దు.. బుల్లెట్టే కావాలి’.. వరునితోపాటు 50 మందిని బుక్ చేసిన పోలీసులు!
ఉత్తరప్రదేశ్‌లోని దెహాత్కు ఊరేగింపుగా వచ్చిన మగపెళ్లివారు వధువు తండ్రి తమకు బుల్లెట్ బండితోపాటు లక్ష రూపాలయల కట్నం అదనంగా ఇవ్వలేదని వెనుదిరిగారు. ఈ విషయమై పెళ్లి కుమార్తె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడు, అతని తండ్రితో పాటు వారి తరుపు 50 మంది బంధువులపై కేసు నమోదు చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రూరా పోలీస్‌స్టేషన్ పరిధిలోని నౌరంగాబాద్ నివాసి మోతీలాల్ మగపెళ్లి వారు అదనపు కట్నం అడిగారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో తన కుమార్తెకు మున్నూ సింగ్ కుమారుడు బాదల్‌తో వివాహం నిశ్చయమయ్యిందని తెలిపాడు. జూన్ 18న కల్యాణ మండపానికి వరుని తరపు వారంతా వచ్చారన్నాడు. వారికి ఘనంగా స్వాగత సత్కారాలు చేశామన్నాడు. సరిగ్గా పెళ్లి తంతు ప్రారంభమయ్యే సమయానికి మగ పెళ్లివారు అదనపు కట్నం కోసం డిమాండ్ చేశారని తెలిపారు. బుల్లెట్ బండితోపాటు లక్ష రూపాయలు అదనంగా కావాలని కోరారన్నారు. వారు ఉన్నట్టుండి ఇలా అడిగేసరికి అడపెళ్లివారు, మగపెళ్లివారి మధ్య కొట్లాట జరిగిందని తెలిపారు. వరునికి ఇంతకు మునుపే ఒక బైక్ కొనుగోలు చేశామని, అయితే అది వద్దని బుల్లెట్ బండి మాత్రమే కావాలని అడుగుతున్నాడని వధువు తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడు, అతని తండ్రితోపాటు మరో 50 మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: మహిళపై లైంగిక దాడి.. అడ్డుకుందని రైలులో నుంచి తోసివేత! -
ఉంగరం కావాలని మొండికేసిన వరుడు.. అలా అతని తిక్క కుదిర్చిన వధువు!
అక్కడ బంధువులందరి సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. అప్పగింతల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. దీంతో ఆనందంగా వధువును తీసుకుని వరుడు తమ ఇంటికి బయలుదేరాడు. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. వరుడు ఆ నూతన వధువును పుట్టింటికి దిగబెట్టేశాడు. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని అజమ్గఢ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తురక్‌వలీ గ్రామం నుంచి మగపెళ్లివారు ఊరేగింపుగా ఆలమ్‌పురి గ్రామానికి చేరుకున్నారు. ఆడపెళ్లివారు వారికి ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. రాత్రివేళ వివాహతంతు ఘనంగా ముగిసింది. అయితే ఆడపెళ్లివారు వరునికి బంగారు ఉంగరం, గొలుసు ఇచ్చుకోలేకపోయారు. దీంతో వరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. కల్యాణమండపం బయట నిలిపివుంచిన కారు వద్దకు నేరుగా చేరుకున్నాడు. దీంతో వధువు కూడా వచ్చి అదే కారులో కూర్చుంది. వారు ప్రయాణిస్తున్న కారు వరుని ఇంటివైపు బయలుదేరింది. అయితే కొద్దిదూరం వెళ్లాక వధువు పుట్టింటివారికి ఫోను చేసిన వరుడు.. తాము వధువుతోపాటు తిరిగి వెనక్కి వస్తున్నామని చెప్పాడు. కొద్దిసేపటి తరువాత వధువు ఇంటికి చేరుకున్న వరుడు తనకు వెంటనే బంగారు ఉంగరం, గొలుసు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ నేపధ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వధువు తాను అత్తారింటికి వెళ్లేదిలేదని తెగేసి చెప్పింది. తరువాత పెళ్లికూతురి తరపు బంధువులు వరునితోపాటు అతని తండ్రిని, మరో బంధువును తాళ్లతో కట్టేసి, తాము పెళ్లి ఖర్చుచేసిన రూ.6 లక్షలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం పోలీసుల వరకూ చేరింది. పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ పంచాయితీ జరిగిన అనంతరం వరుని తరపువారు అమ్మాయి తరపువారి నుంచి తీసుకున్న కానుకలను తిరిగి ఇచ్చేశారు. అలాగే ఈ పెళ్లికి ఆడపెళ్లివారు ఖర్చుచేసిన దానిలో ఒక లక్షా 90 వేల రూపాయలను తిరిగి ఇచ్చేశారు. దీంతో ఈ వివాహం రద్దయ్యింది. ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారి కేకే అవస్థీ మాట్లాడుతూ ఈ పెళ్లికి సంబంధించి ఇరువర్గాలవారు రాజీమార్గంలో వివాహాన్ని రద్దు చేసుకున్నారని తెలిపారు. -
నిశ్చితార్ధం చెడగొట్టి ఆమెతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు.. ముహుర్తం టైమ్‌కి..
సాక్షి, సంగారెడ్డి: వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ ప్రేమ విషయాన్ని ఇద్దరి ఇళ్లలో చెప్పి ఎంతో కష్టం మీద పెళ్లికి ఒప్పించారు. తీరా.. పెళ్లి సమయానికి వరుడు వివాహ వేడుక నుంచి పారిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. కాగా, వరుడు వెళ్లిపోడానికి కారణం తెలిసి అక్కడున్న వారంత ఖంగుతిన్నారు. ఈ ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన యువతి, కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. అతనికి తమ కూతురుని ఇవ్వడానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అంతేకాకుండా.. ఈ ఏడాది జనవరిలో ఇదే జిల్లా కంగ్టి మండలానికి చెందిన ఓ యువకుడితో అమ్మాయికి నిశ్చితార్థం జరిపించారు. ఇక, తన లవర్ పెళ్లి విషయం తెలుసుకున్న ప్రియుడు రంగంలోకి దిగాడు. నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తికి ఫోన్ చేసి తాను యువతిని ప్రేమిస్తున్నానని, వదిలేయాలని బెదిరించాడు. దీంతో, ఈ విషయాన్ని పెళ్లి కూతురు పేరెంట్స్ చెప్పి అతను పెళ్లికి నిరాకరించాడు. దీంతో, వధువు పేరెంట్స్ చేసేదేమీ లేక.. ప్రియుడితో పెళ్లికి ఒప్పుకున్నారు. అనంతరం, పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం కొండాపూర్ మండలంలోని ఒక గుడిలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే, పెళ్లికి కొద్ది గంటలే సమయం ఉందనగా వరుడు ప్లేట్ ఫిరాయించాడు. తనకు కట్నంగా రూ.15 లక్షలు ఇస్తేనే తాళి కడతానని మొండికేసి కూర్చున్నాడు. దీంతో, అంత ఇవ్వలేమని రూ.6 లక్షలు ఇస్తామని యువతి కుటుంబీకులు చెప్పినా వరుడు వినిపించుకోలేదు. అనంతరం.. అందరి కళ్లుగప్పి పెళ్లి పీటలపై నుంచే పరారయ్యాడు. అతని కోసం ఎంత వెతికినా, ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో బాధిత వధువు కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: త్వరలో సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మధ్య.. వందేభారత్ -
రూ.10 లక్షలు ఇస్తేనే భార్యతో హనీమూన్.. అశ్లీల వీడియోలు తీసి..
ఉత్తర ప్రదేశ్‌లో ఓ కీచక భర్త నిర్వాకం వెలుగులోకి వచ్చింది. భార్యను హానీమూన్ తీసుకెళ్లడానికి అత్తింటి వారిని రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడో ప్రబుద్ధుడు. వారు రూ.5లక్షలు అందజేయగా.. హనీమూన్‌లో భార్య అసభ్యకర వీడియోలు తీసి మరో రూ. 5 లక్షలు కావాలని, లేందంటే వీడియోలు వైరల్ చేస్తానని వారిని బెదిరించాడు. వివరాలు.. పిలీభీత్కు చెందిన యువతికి బుదౌన్‌లోని బిసౌలీ ప్రాంతానికి చెందిన వ్యక్తితో ఫిబ్రవరిలో వివాహమైంది. పెళ్లి తర్వాత తొలి రాత్రి జరుపుకోలేదు. అంతేగాక మూడు నెలలుగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. భర్త ప్రవర్తనపై బాధితురాలు తన అత్తకు చెప్పినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. దీంతో తనకు ఎందుకు దూరంగా ఉంటున్నావని, కారణం ఏంటని భార్య అతన్ని నిలదీసింది. తనకు 10 లక్షలు అదనంగా ఇవ్వాలని అత్తింటి వారిని డిమాండ్ చేశాడు. అలాగైతేనే భార్యను హనీమూన్‌కు తీసుకెళ్తానని తేల్చిచెప్పాడు. కూతురు కాపురం బాగుండాలని కోరుకున్న వధువు తల్లితండ్రులు అల్లుడికి 5 లక్షలు అందించారు. దీంతో అతడు భార్యతో నైనిటాల్‌కు హానీమూన్‌కు వెళ్లాడు. అయితే అక్కడే అతడికి మరో వక్ర బుద్ధి కలిగింది. హానీమూన్‌లో భార్య అశ్లీల వీడియోలు రికార్డు చేశాడు. మరో రూ.5 లక్షలు ఇవ్వకుంటే వాటిని వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తానని బెదిరించాడు. భర్త చేష్టలతో విసిగిపోయిన భార్య పుట్టింటికి చేరుకొని తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. అనంతరం కొత్వాల్ పోలీస్ స్టేషన్లో భర్త, అత్తపై కేసు నమోదు చేసింది. కాగా ఇప్పటికే పెళ్లికి రూ.20 లక్షలు ఖర్చు చేశామని వధువు తల్లిదండ్రులు చెబుతున్నారు. అంతేగాక కూతురు అత్తమామలకు, ఆడపడుచులకు మరో రూ.15 లక్షల విలువైన నగలు బహుమతిగా ఇచ్చామని తెలిపారు. బాధితురాలి ఫఙర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వైద్యుడి నిర్వాకం, భార్యను వదిలేసి యువతితో సంబంధం.. ఆస్పత్రి గోడ దూకి.. -
చిక్కుల్లో ఎమ్మెల్యే.. నా భర్తకు మరో వివాహితతో సంబంధం ఉంది..
భువనేశ్వర్: కేంద్రపడా నియోజకవర్గ ఎమ్మెల్యే, అధికార పార్టీ బిజూ జనతాదళ్ నాయకుడు, మాజీమంత్రి శశిభూషణ్ బెహరా చిక్కుల్లో పడ్డారు. అతని కుటుంబం గృహహింస, వరకట్న వేధింపులు పెడుతున్నారని కోడలు రోనాలి బెహరా(31) బంకి ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2021 మార్చి 3న ఎమ్మెల్యే కుమారుడు సత్యప్రకాష్‌తో ఆమెకు వివాహం జరిగింది. అయితే తన భర్త మరో వివాహితతో సంబంధం కలిగి ఉన్నాడని, సత్యప్రకాష్ తోపాటు అత్తమామలు, ఆడపడుచులు, ఇతర కుటుంబీకులు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఆర్థిక అవసరాలు తీర్చాలని నిరంతరం వేధిస్తున్నారని, తల్లిదండ్రుల నుంచి రూ.40 లక్షలు తీసుకు రావాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. మెట్టినింటికి వచ్చిన 10 రోజులకే పుట్టింటి వారు ఇచ్చిన నగలన్నీ తమకు అప్పగించాలని డిమాండ్ చేశారన్నారు. చెప్పినట్లు వినలేదని దుర్భాషలాడి, మాససికంగా కుంగదీశారని వాపోయారు. అయితే తన కోడలు చేసిన ఆరోపణలను నిరాధారమైనవి, అంతా అవాస్తవమని ఎమ్మెల్యే శశిభూషణ్ కొట్టిపారేశారు. తన కొడుకు, రోనాలి మధ్య కొన్ని విభేదాలు ఏర్పడి ఉండవచ్చన్నారు. మెట్టినింటికి వచ్చిన తర్వాత నామమాత్రంగా నెల రోజులు మాత్రమే ఆమె తమతో ఉన్నారని, అనంతరం తన తండ్రితో కలిసి పుట్టినింటికి వెళ్లి తిరిగి రాలదేని తెలిపారు. వరకట్న డిమాండ్ ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టంచేశారు. -
అత్తింటి వేధింపులకు యువ డాక్టర్ బలి.. కారు ఇస్తామన్నా..
వరంగల్ క్రైం: హనుమకొండ సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో ఫిజియోథెరపీ డాక్టర్ కుందురు నిహారికారెడ్డి (25) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం కేశవాపూర్‌కు చెందిన గంగాధర్‌రెడ్డి నగరంలోని చార్టెడ్ అకౌంటెంట్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఇతనికి వర్ధన్నపేట మండలం కడారిగూడేనికి చెందిన నిహారికారెడ్డితో రెండేళ్లక్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో కట్నం కింద నగరంలో 300 గజాల ప్లాట్, ఇతర కానుకలు ఇచ్చారు. ఎక్సైజ్ కాలనీలో నివాసం ఉంటున్న వీరికి నాలుగు నెలల క్రితం పాప జన్మించింది. ఇటీవల కారు కావాలని గంగాధర్‌రెడ్డి అడగగా అందుకు కూడా నిహారిక తల్లిదండ్రులు అంగీకరించారు. అయినప్పటికీ ఇంకా పెళ్లి లాంఛనాల విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యాభర్తలు వేర్వేరు గదుల్లో నిద్రించారు. గురువారం ఉదయం పాప ఏడు స్తున్నా నిహారికారెడ్డి తలుపు తీయక పోవడంతో భర్తకు అను మానం వచ్చి తలుపులు పగులగొట్టి లోపలి కి వెళ్లేసరికి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఇన్స్పెక్టర్ షూకుర్ ఘట నాస్థలానికి చేరుకుని పరిశీలించారు. భర్త, అత్త, ఆడబిడ్డ దంపతుల వేధింపుల వల్లే తన కూతురు ఆత్మ హత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి మల్లారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. చదవండి: మద్యానికి బానిసై సైకోగా మారి.. కూతుర్ని గొడ్డలితో నరికిచంపిన తండ్రి.. -
పెళ్లయిన నవమాసాలకే ఘోరం.. కడుపులో ఉంది ఆడబిడ్డ అని తెలియడంతో
బెంగళూరు: భర్త వరకట్న దాహానికి నవ వధువు బలైన సంఘటన కర్ణాటకలోని బెంగుళూరు రూరల్ జిల్లాలో చోటుచేసుకుంది. బెంగుళూరు రూరల్ జిల్లా దొడ్డ తాలూకా ఆచార్లహళ్లిలో చోటుచేసుకుంది. తనుశ్రీ (22) మృతురాలు. వివరాలు.. చిక్క బళ్లాపురం జిల్లా చింతామణి తాలూకా జంగమసీగేహళ్లి గ్రామానికి చెందిన తనుశ్రీని దొడ్డ తాలూకా ఆచార్లహళ్లికి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తితో 9 నెలల క్రితం వివాహం జరిపించారు. మొబైల్ షాపు పెట్టుకున్న నవీన్‌కి భారీగా వరకట్నం సమర్పించారు. కానీ ఇంకా కట్నం తీసుకురావాలని తరచూ తనుశ్రీని పీడించేవాడు. ఫిబ్రవరి 9వ తేదీన కూడా తనుశ్రీ పుట్టింటి నుంచి రూ.1.20 లక్షలు నగదు తీసుకువచ్చింది. మరోవైపు ఆమె గర్భం దాల్చగా స్కానింగ్ చేసి కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిసి భర్త, అత్త, మరిది బలవంతంగా అబార్షన్ చేయించారని సమాచారం. ఈ తరుణంలో మంగళవారం తనుశ్రీ ఇంట్లో అనుమానాస్పదంగా ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలింది. భర్త నవీన్, అత్త సువర్ణమ్మ, మరిది కిరణ్‌కుమార్ ఇల్లు వదిలి పరారయ్యారు. చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వడంతో తనుశ్రీ తల్లిదండ్రులు, బంధువులు పరుగున చేరుకున్నారు. తమ బిడ్డను అత్తింటివారే కొట్టి చంపారని విలపించారు.దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సీనియర్ నటి అభినయపై లుకౌట్ నోటీసులు జారీ
కన్నడ నటి అభినయనను అరెస్ట్ చేసేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు. ఆమె తల్లితో పాటు సోదరుడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వరకట్న వేధింపుల కేసులో ఈ ముగ్గురిని దోషులుగా తేల్చిన కోర్టు శాండల్‌వుడ్ నటి అభినయకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. వీరిని కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా గత నెల రోజులుగా ఈ ముగ్గురు కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. దీంతో దోషులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా నటి అభినయ సోదరుడు శ్రీనివాస్‌కు 1998లో లక్ష్మీదేవి అనే మహిళతో వివాహమైంది. అయితే పెళ్లయిన ఆరు నెలల నుంచే అత్తింటివారు తనను వేధించడం మొదలుపెట్టారని లక్ష్మీదేవి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో ఎన్నో మలుపుల అనంతరం 2012లో వీరిని దోషులుగా తీర్పునిచ్చిన న్యాయస్థానం అభినయకు రెండేళ్లు, ఆమె సోదరుడికి రెండేళ్లు, తల్లికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. -
తమిళనాడులో విషాదం.. వరకట్న వేధింపులతో..
సాక్షి, చెన్నై: వరకట్న వేధింపులు తాళలేక బిడ్డతో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన శుక్రవారం తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. విల్లుపురం జిల్లా సెంజి సమీపంలోని కడకల్ తోపుకు చెందిన లాలూ బాషా కుమార్తె ఫిర్దోస్ (22)కు తిరువణ్ణామలై జిల్లా కిలిపెన్నత్తూరుకు చెందిన అబ్దుల్లా(25)తో గతేడాది ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. తిరువణ్ణామలైలోని ఓ దుకాణంలో అబ్దుల్లా పనిచేస్తున్నాడు. ఫిర్దోస్ గర్భం దాల్చడంతో ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. 50 రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు హయాన అని పేరు పెట్టారు. ఈ నెల 2వ తేదీ బిడ్డతో కలిసి ఆవూరులోని భర్త ఇంటికి వెళ్లింది. అనంతరం ఈ నెల 17న తల్లి ఇంటికి తిరిగి వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఫిర్దోస్, చిన్నారి కనిపించకుండాపోయారు. తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. రాత్రి 10 గంటలకు వ్యవసాయ బావిలో చిన్నారి శవమై తేలడాన్ని ఆ ప్రాంత వాసులు గుర్తించి ఫిర్దోస్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. సెంజి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రియదర్శిని, ఇన్స్పెక్టర్ తంగం, సబ్ ఇన్స్పెక్టర్ శంకర సుబ్రమణ్యం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అబ్దుల్లా వరకట్నం తేవాలని వేధించేవాడని తెలిసింది. వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ముండియంబాక్కం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అబ్దుల్లాని అరెస్టు చేశారు. -
ఆమె మరణించిన 15 ఏళ్లకు కీలక తీర్పు ఇచ్చిన కోర్టు
పెళ్లైన ఏడాదిన్నరకే వరకట్న దాహానికి బలైంది. ఎన్నో ఏళ్లుగా కోర్టులో విచారణ సాగిని ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు 15 ఏళ్లకు ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..భారతి అనే మహిళ అక్టోబర్3, 2007న పెళ్లై ఏడాదిన్నరలోపే అసాధారణ పరిస్థితుల్లో చనిపోయింది. దీంతో ఆమె భర్త, అత్త, బావ, మరిదిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఐతే ఆమెను హత్య చేశారనే సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిందితులను తొలుత నిర్దోషులుగా ప్రకటించారు. పోస్ట్‌మార్టం నివేదికలో మాత్రం ఆమె ఊపిరాడక చనిపోయినట్లు ఉంది. అదీగాక దర్యాప్తు అధికారులు సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న వ్యక్తులు గురించి, పైగా పక్కన అద్దెకుంటున్న వారిని విచారించడం వంటివి చేయలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఈ కేసును విచారిస్తున్న కోర్టు ప్రాసిక్యూషన్ వాదనలు విన్న కోర్టు ఎట్టకేలకు దోషలుగా నిర్ధారిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. బాధితురాలు వివాహం అయినప్పటి నుంచి వరకట్న సమస్యలు ఎదుర్కొన్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొంది. మరణానికి ముందు రోజు కూడా వేధింపులకు గురైనట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. అలాగే ఆమె మరణానికి ముందు నిందితులందరిపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ తదితర సాక్ష్యాధారాలు ఆధారంగా భర్త పవన్‌కుమార్, అత్తగారు సత్బిరో, బావ కప్తాన్ సింగ్, బావమరిది దల్జీత్ సింగ్‌లను దోషులగా నిర్ధారించినట్లు కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మృతురాలు వివాహం అయినప్పటి నుంచి చనిపోయేంత వరకు వేధింపులు కొనసాగినట్లు తగిన సాక్ష్యాధారాలు ఉన్నందున వారిని దోషులగా గర్తించినట్లు స్పష్టం చేసింది. ఈ కేసుకి సంబంధించి తదుపరి తీర్పును జనవరి 30కి వాయిదా వేసింది. (చదవండి: అనాథలమని ఆవేదన చెంది.. ముగ్గురు అక్కచెల్లెళ్ల ఆత్మహత్య..) -
భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్
సాక్షి, బంజారాహిల్స్: అదనపు కట్నం కోసం వేధించి భార్య ఆత్మహత్యకు కారకుడైన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లవరం గ్రామానికి చెందిన భవానీ వివాహం నెల్లారి సురేష్‌తో 2019లో జరిగింది. పెళ్ళి జరిగిన కొద్ది రోజుల నుంచే సురేష్ భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. వీరికి మూడేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. వీరు వెంకటగిరి సమీపంలోని భగవతి నగర్లో అద్దెకుంటున్నారు. వివాహ సమయంలో మూడు లక్షల కట్నం, రూ.5 లక్షలు విలువ చేసే బంగారం, రెండెకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అయితే ఉద్యోగం పోగొట్టుకొని పలు వ్యాపారాలు పెట్టి తీవ్రంగా నష్టపోయిన సురేష్ కట్నం కింద ఇచి్చన రెండెకరాల స్థలం అమ్మి డబ్బులు తీసుకురావాలంటూ కొంత కాలంగా వేధించసాగాడు. అప్పటికే బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టారు. రూ. 8 లక్షల వరకు అప్పు చేసి ఇచ్చారు. అయినాసరే నిందితుడి వేధింపులు రోజురోజుకు శృతి మించడంతో గత నెల 30వ తేదీన భవానీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఏలూరి ఝాన్సీ అల్లుడితో పాటు అత్తమామలపై చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు సురేష్‌పై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నిజామాబాద్‌లో కేటుగాడు!.. 250 మందిని షార్జాకి తీసుకెళ్లి.. పత్తా లేకుండా పోయి..) -
Actress Abhinaya: సినీ నటి అభినయకు రెండేళ్ల జైలు శిక్ష
సాక్షి, బెంగళూరు: అన్న భార్యపై వరకట్న వేధింపులకు పాల్పడిన కేసులో సినీ నటి అభినయకు హైకోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. అనుభవ సినిమా ద్వారా ఆమె పేరుపొందారు. వివరాలు.. 1998లో సోదరుడు శ్రీనివాస్‌కు లక్ష్మీదేవి అనే యువతితో పెళ్లయింది. ఆ సమయంలో కట్నం తీసుకోలేదు. తరువాత కట్నం తేవాలని పదేపదే లక్ష్మీదేవిని వేధించారు. లక్ష రూపాయలు డిమాండ్ చేయగా ఆమె రూ. 80 వేలు ఇచ్చింది. అయినప్పటికీ వేధింపులను ఆపలేదు. దీంతో బాధితురాలు 2002లో భర్త, అత్తమామలు సహా అభినయపై బెంగళూరు చంద్ర లేఔట్ పీఎస్‌లో కేసు పెట్టింది. ఈ కేసులో హైకోర్టులో విచారణ సాగుతూ వచ్చింది. మంగళవారం కేసును విచారించిన హైకోర్టు జడ్జి జస్టిస్ హెచ్‌బీ ప్రభాకర్శాస్త్రి నేరం రుజువైనట్లు పేర్కొన్నారు. ఎన్నో మలుపులు ఈ కేసు గతంలో ఎన్నో మలుపులు తిరిగింది. 2012లో కింది కోర్టు కూడా ఈ కేసులో ఐదు మందికి రెండేళ్ల శిక్ష విధించగా, జిల్లా కోర్టు వారి తప్పిదం లేదని శిక్షను రద్దు చేసింది. దీనిని బాధితురాలి కుటుంబం హైకోర్టులో సవాల్ చేయగా విచారణ సాగింది. భర్త శ్రీనివాస్, అత్తమామలు రామకృష్ణ, జయమ్మకు ఐదేళ్లు జైలు శిక్ష, నాలుగో నిందితుడు చలువరాజ్, ఐదో నిందితురాలు అభినయకు రెండేళ్ల శిక్షను విధించారు. చదవండి: (1920 నేపథ్యంలో...) -
పిల్లలే దూరమైతే నా బతుకెందుకు..!
సాకక్షి, హైదరాబాద్: పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.. ఇద్దరు పిల్లలు కలిగినా తరచుగా శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. చివరకు పేగు తెంచుకుని పుట్టిన సొంత బిడ్డలను సైతం దూరం చేయడంతో మానసికంగా కృంగిపోయిన ఆ తల్లి తీవ్ర మనోవేదనకు గురై పిల్లలే నాకు దూరమైతే నేనెందుకు బతకాలి, ఇంకెందుకు నా బతుకంటూ పుట్టింట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సంజయ్న గర్‌లో జరిగింది. భర్త వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం సూసైడ్ నోటు ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు తమ బిడ్డ మృతదేహంతో సంజయ్‌నగర్ బస్తీలోని భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పోలీసులు.. స్థా నికుల కథనం ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం, అంతమ్మ గూడంనకు చెందిన శ్రీలత(30)కు పదేళ్ల క్రితం బాగ్‌లింగంపల్లికి చెందిన సాగర్‌తో వివాహమైంది. వీరికి చెర్రి (7), హని (6) ఇద్దరు సంతానం. డీజే సౌండ్ సిస్టమ్‌ను నడుపుకునే సాగర్, అతని తమ్ముడు గడ్డం సతీష్ ఓ రాజకీయ పారీ్టలో పనిచేస్తున్నారు. వారి తల్లి భాగ్యలక్ష్మి రైల్వేలో ఉద్యోగి. గత కొన్నిరోజులుగా సాగర్ మద్యం సేవించి భార్య శ్రీలతను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు తెలిసింది. కాగా అదనపు కట్నం తీసుకురావాలంటూ తీ వ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అమ్మకు దయ్యం పట్టిందంటూ ఇద్దరు పిల్లలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీలత పుట్టింటికి వెళ్లగా పిల్లలను తనవద్దే ఉంచుకుంటానని చెప్పి భా ర్యకు విడాకులు ఇస్తున్నట్లుగా ఓ అడ్వొకేట్ ద్వారా సాగర్ భార్యకు నోటీసులు పంపినట్లు సమాచారం. పిల్లలే దూరమైతే నేనెందుకు బతకాలి, నాబతుకెందుకు అంటూ ఆమె పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. భర్త ఇంటిముందు బంధువుల ఆందోళన... మంగళవారం ఉదయం 5గంటల నుంచి 6గంటల మధ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న శ్రీలత మృతదేహానికి స్థానిక పోలీసులు భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం శ్రీలత మృతదేహంతో బాగ్‌లింగంపల్లిలోని సంజయ్‌నగర్‌లోని భర్త సాగర్ ఇంటి ఎదుట తల్లిదండ్రులు, బంధువులు సాయంత్రం 4గంటల ప్రాంతంలో వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, సీఐ సంజీవకుమార్, ఎస్సైలు వెంకట్రమణ, శ్రీనివాస్‌రెడ్డి, కిరణ్, సందీప్‌రెడ్డితోపాటు ముషీరాబాద్, గాం«దీనగర్, గోషామహల్ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ సందర్భంగా పోలీసులు, మృతిరాలి బంధువుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక్కడే దహన సంస్కారాలు నిర్వహిస్తామని, కనీసం పిల్లలను తమకు అప్పగించేలా చూడాలని పోలీసులను వేడుకున్నారు. తమకు న్యాయం జరిగేవరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మీంచుకోని కూర్చున్నారు. ఏసీపీ, సీఐలు ఎంత నచ్చజెప్పినా మృతదేహాన్ని నిందుతుని ఇంటిముందు పెట్టుకోని నిరసన వ్యక్తం చేశారు. శ్రీలత ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలంటూ ఓ ఫ్లెక్సీని ఇంటి గేటుకు తగిలించారు. అయితే గడ్డం సాగర్, అతని తమ్ముడు సతీష్‌కు పలువురు రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారని బాధితులు ఆరోపించారు. శ్రీలత మరణానికి కారకులైన వారిని అరెస్టు చేయాలని, అప్పుడు మాత్రమే ఆందోళన విరమిస్తామని మృతిరాలి బంధువులు, తల్లిదండ్రులు స్పష్టం చేశారు. -
భర్త కాదు.. మృగం.. భార్యను దారుణంగా..
సాక్షి, బెంగళూరు: వరకట్న వేధింపులకు మరో అబల బలైన ఘటన నెలమంగల తాలూకా భూసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. శ్రుతి (29) తన భర్త క్రిష్ణమూర్తి చేతిలో హత్యకు గురైంది. శ్రుతి తల్లిదండ్రులు వివాహ సమయంలో రూ.18 లక్షలు వరకట్నం ఇచ్చి అట్టహాసంగా పెళ్లి జరిపించారు. అయితే వివాహం జరిగిన మూడు నెలలు మంచిగానే ఉన్న క్రిష్ణమూర్తి తరువాత అసలు రంగు బయటపెట్టాడు. మరింత వరకట్నం తీసుకురావాలని శ్రుతిని వేధించసాగాడు. క్రిష్ణమూర్తికి అతడి తల్లి లక్ష్మమ్మ, తండ్రి బైలప్ప ఇద్దరూ వంతపాడేవారు. ఈక్రమంలో సోమవారం రాత్రి కట్నం విషయంలో భార్యతో గొడవపడ్డ క్రిష్ణమూర్తి కత్తితో శ్రుతిని దారుణంగా పొడిచి హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యంగ్ జర్నలిస్ట్ మృతి) -
పెళ్లై మూడేళ్లే అంతలోనే....
మైసూరు: మైసూరులో ఇటీవల జిమ్ ట్రైనర్ భార్య వరకట్న వేధింపులకు బలైన ఘటనను మరువక ముందే మరో విషాదం జరిగింది. నగరంలోని ఉదయగిరిలో నివాసం ఉంటున్న తరనుం ఖాన్ (22) అనే వివాహిత అనుమానాస్పదరీతిలో చనిపోయింది. 2019 జూలైలో ఆమెకు సయ్యద్ ఉమర్ అనే వ్యక్తితో పెళ్లయింది. రూ. 7 లక్షల నగదుతో పాటు పెద్దమొత్తంలో బంగారం కట్నంగా ఇచ్చారు. తరువాత కొద్దిరోజులకు మరింత కట్నం తీసుకొని రావాలని భార్యను వేధించడం మొదలు పెట్టారు. తరచూ గొడవలు కూడా జరిగేవి. ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో ఆమె శవమై తేలింది. భర్త, అత్తమామలు, ఆడపడుచులపై మృతురాలి తల్లిదండ్రులు ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యానో కారు ఢీకొని చిన్నారి.. మైసూరు జిల్లాలోని పిరియా పట్టణ తాలూకాలోని హలగనహళ్లి గ్రామంలో ముతాహిర్ పాష కుమార్తె హమ్మరిన్ సహేర్ (5) కారు ఢీకొని చనిపోయింది. బాలిక అమ్మమ్మ ఇంటి ముందు ఆడుకుంటుండగా వేగంగా వచ్చిన టాటా న్యానో కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని పిరియాపట్టణ ఆస్పత్రికి తరలించగా మృతి చెందింది. బెట్టదపుర పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: ఒకేఒక్కడు.. తొలి ఎంపీగా రికార్డులు బద్దలుకొట్టిన తేజస్వీ సూర్య) -
ఒక్కసారి మేమైనా నీకు గుర్తుకు రాలేదా తల్లి?
ఉరవకొండ: ఆస్తి కోసం కడతేరుస్తారనుకోలేదమ్మా.. ఎంతటి నరకయాతన అనుభవించావో కదా.. ఒక్కసారి మేమైనా నీకు గుర్తుకు రాలేదా తల్లి? ఈ దుర్మార్గులను వదిలేసి వచ్చుంటే కంటికి రెప్పలా చూసుకునేవాళ్లం కదమ్మా? అంటూ మృతురాలి తల్లిదండ్రుల రోదనలతో ఉరవకొండ ఆస్పత్రి ఆవరణం మారుమోగింది. అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఉరవకొండలోని మాస్టర్ సీవీవీ నగర్లో నివాసముంటున్న శివరాంపేట మల్లికార్జున కుమారుడు కురుబ వినోద్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన ఓబులేసు, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె శిరీష (26)తో 2020, నవంబర్ 21న వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.2 లక్షల వరకట్నం, 26 తులాల బంగారు నగలను వధువు తల్లిదండ్రులు ఇచ్చారు. పెళ్లి ఖర్చులకు తండ్రి తన భూమిని విక్రయించాడు. అంతేకాక కుమార్తె జీవితం బాగుంటుందని భావించిన అతను బుక్కరాయసముద్రంలో విలువైన ఐదు సెంట్ల స్థలాన్ని శిరీష పేరున రాసిచ్చాడు. అయితే, ఆ స్థలాన్ని తన పేరున రిజిస్టర్ చేసివ్వాలంటూ వినోద్ మొండిపట్టుపట్టాడు. ఈ విషయంగానే తరచూ భార్యను వేధించేవాడు. శారీరకంగా హింసించేవాడు. వినోద్‌తో పాటు అతని తల్లి సుజాత, అక్క భారతి, బావ ధనుంజయ, మేనమామ ప్రకాష్ సైతం శిరీషను చిత్రహింసలకు గురి చేసేవారు. ఏడాది క్రితం గర్భిణి అయిన శిరీషను ఇంట్లోంచి వెల్లగొట్టడంతో పెద్దమనుషుల సమక్షంలో రాజీ కుదిర్చారు. అయినా వినోద్, వారి కుటుంబసభ్యుల్లో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే శిరీష ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పదస్థితిలో ఇంట్లోనే మృతి చెందింది. విషయాన్ని తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు లక్ష్మీదేవి, ఓబులేసు, సోదరుడు శివప్రసాద్ ఆగమేఘాలపై ఉరవకొండకు చేరుకున్నారు. ఆస్పత్రిలోని మార్చరీలో ఉన్న కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శేఖర్, ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. కాగా, మృతురాలికి ఏడాది వయసున్న కుమారుడున్నాడు. -
ఆరేళ్ల క్రితం అదృశ్యమైన పోలీసు ఉద్యోగి ప్రత్యక్షం
నెల్లూరు రూరల్: వరకట్న వేధింపులతో జైలుపాలై ఆరేళ్ల క్రితం అదృశ్యమైన పోలీసు ఉద్యోగి శుక్రవారం నెల్లూరులో ప్రత్యక్షయ్యాడు. జిల్లాలోని ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే శివకుమార్‌సింగ్ నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు పోలీసు కాలనీలోని అపార్ట్మెంట్లో నివశిస్తుండేవాడు. మొదటి భార్య నుంచి విడిపోయి విడాకులు తీసుకున్న అతను తిరిగి గుంటూరుకు చెందిన సుభాషిణిని రెండో వివాహం చేసుకుని పోలీసు కాలనీలో ఉంటుండేవాడు. రెండో భార్యతో కూడా వివాదాలు తలెత్తడంతో ఆమె మహిళా పోలీసుస్టేషన్లో శివకుమార్‌సింగ్‌పై వరకట్న వేధింపుల ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. పోలీసుగా ఉండి జైలులో గడపడంతో భార్య సుభాషిణిపై తీవ్రంగా మనస్తాపం చెందాడు. రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లకుండా ఎవరికీ కనిపించకుండా అదృశ్యమయ్యాడు. దీంతో రెండో భార్య సుభాషిణి సోదరుడు తులసీరామ్‌సింగ్ నెల్లూరు రూరల్ పోలీసులకు 2016లో ఫిర్యాదు చేశాడు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. అతని ఆచూకీ తెలియకపోవడంతో సుభాషిణి గుంటూరుకు వెళ్లి అక్కడే ఉంటుంది. అదృశ్యమైన అతడిని ఈ ఏడాది జూలైలో కేరళలోని ఓ సేవాసంస్థ వారికి కనిపించాడు. అనారోగ్యంతో ఉన్న అతడికి చికిత్స అందించడంతో కోలుకున్నాడు. తాను నెల్లూరులోని పోలీసు కార్యాలయంలో పనిచేస్తున్నట్లు వారికి చెప్పాడు. దీంతో సేవాసంస్థ ప్రతినిధి అతడిని వెంటబెట్టుకుని నెల్లూరు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
498 –ఎ దుర్వినియోగం అవుతోంది.. ఆందోళన వ్యక్తం చేసిన న్యాయమూర్తి
సాక్షి, అమరావతి: వరకట్న వేధింపుల నిరోధానికి తీసుకొచ్చిన ఐపీసీ సెక్షన్ 498–ఎ దుర్వినియోగం అవుతోందని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. అసంతృప్త భార్యలు ఈ సెక్షన్‌ను రక్షణ కవచంగా కాకుండా ఓ ఆయుధంగా ఉపయోగిస్తున్నారని తెలిపింది. భర్త, అతని బంధువులను సులభంగా వేధించేందుకు, అరెస్ట్ చేయించేందుకు ఉపయోగిస్తున్నారని చెప్పింది. చిన్న చిన్న కారణాలతో ఈ సెక్షన్ కింద ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొంది. గుంటూరు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్లో ఓ మహిళ తన భర్త కుటుంబ సభ్యులపై 498 – ఎ కింద పెట్టిన కేసును కొట్టేసింది. పిటిషనర్లపై తదుపరి ప్రొసీడింగ్స్ కొనసాగిస్తే అది కోర్టు ప్రక్రియ దుర్వినియోగమే అవుతుందని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ మాచర్లకు చెందిన షేక్ నూర్జహాన్ చేసిన ఫిర్యాదు మేరకు 2020లో మాచర్ల పట్టణ పోలీసులు ఆమె భర్త, అతని తల్లిదండ్రులు, సోదరులు, వారి భార్యలను నిందితులుగా చేర్చారు. మాచర్ల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. మాచర్ల కోర్టు విచారణ జరుపుతోంది. తమపై నమోదు చేసిన చార్జిషీట్‌ను కొట్టేయాలని కోరుతూ నూర్జహాన్ తోడికోడళ్లు షేక్ ఆరీఫా, ఆయేషా, వారి భర్తలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. ఫిర్యాదుదారు చేసినవన్నీ నిరాధార ఆరోపణలని న్యాయమూర్తి తేల్చారు. అదనపు కట్నం వేధింపుల్లో పిటిషనర్లు ఆమె భర్తకు సహకరించారని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. వారిపై కేసు కొట్టేస్తున్నట్లు తన తీర్పులో పేర్కొన్నారు. చదవండి: (మరో కీలక అడుగు.. విశాఖలో ఆంగ్లియాన్ పారిశ్రామిక, లాజిస్టిక్ పార్క్) -
కానిస్టేబుల్‌తో ఎస్సై ప్రేమాయణం.. పెళ్లి చేసుకొని..
సాక్షి, నెల్లూరు(క్రైమ్): భార్యను వేధించిన ఘటనలో ఓ ఎస్సైపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. వేదాయపాళెం ఎస్సైగా షేక్ మహబూబ్ సుభాని పని చేస్తున్నారు. ఆయన సంతపేటలో విధులు నిర్వహించే సమయంలో కానిస్టేబుల్‌గా ఉన్న ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అదనపుకట్నం కోసం ఆమెను భర్త, అత్తింటివారు వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. గతనెల 9వ తేదీన ఆమెపై భర్త, అత్త దాడి చేశారు. ఈక్రమంలోనే ఎస్సై సెలవు పెట్టి తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. బాధితురాలు ఆ నెల 28న దిశా మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై, అతని కుటుంబసభ్యులపై వేధింపులు, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దిశ మహిళా పోలీసుస్టేషన్ ఎస్సై కె.లేఖా ప్రియాంక కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టారు. చదవండి: (Hyderabad Doctor: పెళ్లికి ముందే మరొక యువతితో సంబంధం.. అయితే..) -
Hyderabad Doctor: పెళ్లికి ముందే మరొక యువతితో సంబంధం.. అయితే..
సాక్షి, హైదరాబాద్: నగర యువతిని వివాహం చేసుకున్న వైద్యుడు పెళ్లయిన వారం రోజుల నుంచే వరకట్న వేధింపులు మొదలెట్టాడు. బాధితురాలు సీసీఎస్ మహిళా ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏపీలోని కాకినాడ సమీపంలో ఉన్న రాయుడుపాలెం రాజీవ్‌నగర్‌కు చెందిన ఆకుల వెంకన్నకు, నగరవాసి అయిన యువతికి గతేడాది జనవరి 7న వివాహమైంది. ఆ సమయంలో రూ.25 లక్షలు కట్నంగా ఇవ్వడంతో పాటు రూ.50 లక్షలకు ఖర్చుతో ఘనంగా పెళ్లి చేశారు. అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు వారం రోజులకే వరకట్న వేధింపులు ఎదురయ్యాయి. వివాహ సమయంలో ఆమెకు పెట్టిన వాటితో పాటు ఒంటిపై ఉన్న నగలు తీసుకున్న అత్తింటి వాళ్లు పుట్టింటి నుంచి మరికొంత తీసుకురమ్మని వేధించారు. ఆమె తన బంధువుతో కలవకుండా దూరంగా బంధించారు. దీంతో చేసేదేమీ లేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పెళ్లికి ముందే మరొక యువతితో సంబంధం ఉందని, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారని, అయితే డబ్బు కోసం తనను పెళ్లి చేసుకున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది. తమ వద్ద నుంచి డబ్బు రాదని తెలుసుకుని మరో వివాహం చేసుకునేందకు సిద్ధమవుతున్నాడని ఆరోపించింది. ఈ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు వెంకన్నతో పాటు అతని తల్లి చక్రవేణి, సోదరులు ఆకుల సూర్య వెంకటేశ్వరరావు, ఆకుల సీతారామయ్య, సోదరి నాగసీత, తండ్రి ఆకుల అర్జున్‌రావు, సమీప బంధువు వెంకట కుమార్ కొప్పిరెడ్డి, అతని సోదరి రావూరి పార్వతిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: భవనం కాదండోయ్.. మరేంటో మీరు తెలుసుకోండి!) -
నువ్వు చచ్చిపోతే నా కొడుక్కి మూడో పెళ్లి చేస్తా...
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు) : నా చావుకు.. భర్త, అత్తమామలే కారణం. భర్త, అత్త అసలు మనుషులే కాదు. ఎన్నో రకాలుగా హింసించారు. నేను చనిపోతే వాళ్లు నా పిల్లలను రోడ్డున వదిలేస్తారు.. అందుకే వారినీ నాతో పాటు తీసుకుపోతున్నా.. తన ఆత్మహత్యకు దారితీసిన నేపథ్యాన్ని ఓ వివాహిత ఇలా సూసైడ్ నోట్లో వివరించడం అందరికీ కంటతడి పెట్టించింది. వివాహితతో పాటు ఏడాది పసికందు అక్షిత శుక్రవారం ఉదయం మృతి చెందగా.. 4 ఏళ్ల తుషిత మృత్యువుతో పోరాడుతోంది. అయితే వీరి మృతికి భర్త మోహన్‌కృష్ణతో పాటు అత్త రామలక్ష్మిగా కుటుంబ సభ్యులు, పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై శైలజ తల్లి అనంతలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీపీ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైనప్పటి నుంచీ వేధింపులే..: ఎంవీపీకాలనీ పోలీసు స్టేషన్ పరిధిలోని కృష్ణా కళాశాల సమీపంలో సంపంగి మోహన్ కృష్ణ తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. 2017లో నగరానికి చెందిన సంపంగి మోహన్‌కృష్ణ.. రాజమండ్రి సమీపంలోని నాతవరానికి చెందిన శైలజ (34)ను వివాహం చేసుకున్నాడు. మోహన్‌కృష్ణకు ఇది రెండో వివాహం. అతను నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో మార్కెటింగ్ డిపార్టుమెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లైన మరుసటిరోజు నుంచి శైలజను అదనపుకట్నం కోసం మోహన్‌కృష్ణ అతని తల్లి రామలక్ష్మి వేధింపులకు గురిచేసే వారు. అత్త సూటిపోటి మాటలతో హింసించడంతో పాటు భర్త రోజూ తాగి వచ్చి కొట్టేవాడు. దీనికి తోడు ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో చిత్రహింసలు మరింత ఎక్కువయ్యాయి. తనకు బాబు కావాలని వేధించేవాడు. నువ్వు చచ్చిపోతే తన కొడుక్కి మూడో పెళ్లి చెస్తానంటూ అత్త వేధించేది. దీంతో పాటు సారి విషయంలోనూ శైలజకు వేధింపులు అధికమయ్యాయి. వివాహం సమయంలో రూ. 5 లక్షల కట్నంతో పాటు రూ.40 వేలు ఆడపడుచు కట్నం, 10 తులాల బంగారు శైలజ పుట్టింటివాళ్లు పెట్టారు. ఇవి సరిపోని మోహన్‌కృష్ణ, అత్త రామలక్ష్మి రూ.2లక్షలు సారి తేవాలని శైలజను టార్చర్ చేశారు. దీంతో తల్లిదండ్రులకు, తోబుట్టువులకు తన పరిస్థితిని చెప్పుకుని శైలజ బాధపడేది. దీంతో కుటుంబ సభ్యులు సారి నిమిత్తం రూ.50 వేలు మోహన్‌కృష్ణకు అందజేశారు. అయిప్పటికీ మిగతా డబ్బులు తీసుకురావాలని నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. చాలా సార్లు చచ్చిపోవాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు ఆమె కుటుంబ సభ్యులకు వివరించింది. పిల్లలతో పాటు ఆత్మహత్యాయత్నం వేధింపులు తట్టుకోలేని శైలజ తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నెల 29న పిల్లలకు దోమలు స్ప్రై తాగించింది. అనంతరం తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఈ విషయాన్ని గమనించిన మోహన్‌కృష్ణ, అతని తల్లి రాత్రి 8 గంటల సమయంలో శైలజను పిల్లలను మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మెడికవర్‌లో చికిత్స పొందుతూ శైలజ, చిన్న కూతురు అక్షితలు శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. పెద్ద కూతురు తుషిత(4) ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. అయితే శైలజ, పాప మృతి సమాచారం తెలు సుకున్న మోహన్‌కృష్ణ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు శైలజ, అక్షితల మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మోహన్‌కృష్ణను కస్టడీలోకి తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
కట్నం కోసం భర్త వికృత రూపం.. డ్రగ్స్ మత్తులో ఫ్రెండ్స్‌తో కలిసి....
సాక్షి, కర్ణాటక: కోట్లాది రూపాయలు ఖర్చుచేసి అంగరంగ వైభవంగా పెళ్లి, అంతకు మించి కట్న కానుకలు. కానీ వరుని కట్నదాహానికి అంతు లేకుండా పోయింది. ఇంకా తేవాలని సతాయిస్తూ, డ్రగ్స్ మత్తులో నరకం చూపించాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన 28 ఏళ్ల బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రైవేటు కంపెనీ ఉద్యోగి సుదీప్‌పై బెంగళూరు బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ యువతికి– సుదీప్‌కు 2021 లో పెద్దలు పెళ్లి చేశారు. వరుని కుటుంబం డిమాండ్ మేరకు వధువు కుటుంబీకులు కోట్లాది రూపాయలు ఖర్చుచేసి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవోపేతంగా పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో రూ.55 లక్షల విలువచేసే మినీ కూపర్ కారు, 200 కిలోల వెండి, 4 కిలోల బంగారు ఆభరణాలను సుదీప్‌కు ముట్టజెప్పారు. కట్నం, పెళ్లి ఖర్చులు కలిపి రూ.6 కోట్లు అయినట్లు తెలిపింది. డ్రగ్స్ మత్తులో అరాచకం ఇంతటితో సంతృప్తి చెందని భర్త సుదీప్, పుట్టింటి నుంచి మరింత డబ్బు తేవాలని భార్యను వేధించాడు. దీంతో యువతి తండ్రి తమ రెండు కంపెనీలను అల్లుని పేరిట రాశారు. ఆ కంపెనీల్లో వచ్చే లాభం సుదీప్ తీసుకునేవాడు. సుదీప్ డ్రగ్స్‌కు బానిస కాగా స్నేహితులను ఇంటికి పిలిపించుకుని డ్రగ్స్ సేవించి మత్తులో భార్య తలపై మూత్రవిసర్జన చేసి వికృతంగా ప్రవర్తించాడు. దీనిని ప్రశ్నిస్తే అసభ్యంగా దూషించేవాడు. ఆమె అత్తమామలకు చెప్పుకోగా వారు కొడుకునే వెనకేసుకొచ్చారు, పైగా నిన్నే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యకు వేధింపులు -
ప్రేమ పెళ్లి, మూడేళ్లు సంసారం.. బయటకు వెళ్దామని తీసుకెళ్లి..
తిరువళ్లరు(చెన్నై): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్లు సంసారం చేశాడు. ఆ తరువాత వరకట్నం కోసం భార్యను వేధించాడు. అందుకు అంగీకరించకపోవడంతో భార్యను చిత్తరు జిల్లా నారాయణవనం కైలాసకోనకు తీసుకెళ్లాడు. హతమార్చి మృతదేహం కనిపించకుండా మాయం చేశాడు. వివరాలు.. తిరువళ్లరు జిల్లా సెంగుడ్రం ప్రాంతానికి చెందిన మదన్, తమిళ్‌సెల్వి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలం పాటు సజావుగా సాగిన వీరి సంసారం, వరకట్నం వేధింపుల వైపు వెళ్లింది. వరకట్నం తేవాలంట మదన్ తరచూ భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలో గత జూన్ 25న తమిళ్‌సెల్వి మాయమైంది. దీంతో ఆందోళన చెందిన తమిళ్‌సెల్వి తల్లిదండ్రులు మణిగండన్, పల్గీస్ సెంగుడ్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అసిస్టెంట్ కమిషనర్ మురుగేషన్, ఇన్స్పెక్టర్ రమేష్ తమిళ్ సెల్వి ఆచూకీ కనుగొనడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కైలాసకోన వైపు కదిలిన కేసు విచారణలో భాగంగానే పోలీసులు మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. గత నెలలో తమిళ్‌సెల్వితో కలిసి చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని కైలాసకోనలోని కొండపైకి వెళ్లానని, అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిపాడు. కోపంలో కత్తితో తమిళ్సెల్విపై దాడి చేశానని.. తీవ్రంగా గాయపడడంతో అక్కడే వదిలేసి ఇంటికి వచ్చినట్లు వెల్లడించాడు. తరువాత ఏం జరిగిందో తనకు తెలియదని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడు. ఆంధ్రాలో పోలీసుల దర్యాప్తు మదన్ ఇచ్చిన వాగ్మూలంతో సెంగుండ్రం పోలీసుల బృందం 20 రోజుల క్రితం కైలాసకోనకు వెళ్లింది. నారాయణవనం పోలీసుల సాయంతో కైలాసకోన కొండపై గాలించారు. ఫలితం కనిపించలేదు. అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు కొండపైకి తమిళ్‌సెలి్వ, మదన్ జంటగా వెళ్లినట్టు నిర్ధారించారు. సుమారు రెండు గంటల తరువాత మదన్ ఒంటరిగా వచ్చినట్లు వీడియోలో రికార్డయింది. కానీ మృతదేహాం కనిపించకపోవడంతో విచారణలో పురోగతి కనిపించలేదు. పోలీసులు పలు కోణాల్లో విచారణ చేసినా ఫలితం కనిపించలేదు. గత నెలలో మదన్ ఫోన్లో ఎక్కువ సార్లు మాట్లాడిన సంతోష్, బందారవిని సైతం విచారణ చేశారు. అయినా తమిళ్‌సెల్వి ఆచూకీ గుర్తించలేకపోయారు. చదవండి: భార్యను ఏడు గంటల పాటు చెట్టుకి కట్టి...చిత్రహింసలకు గురి చేసి.. -
మహిళా సర్పంచ్‌కు వరకట్న వేధింపులు
సాక్షి, జగిత్యాల: భర్తతోపాటు అత్త, మామ, మరిది, ఆడబిడ్డలు, వారి భర్తలు అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ రాజారం సర్పంచ్ మమత పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌కు చెందిన దుర్శెట్టి శ్రీనివాస్, భారతి దంపతుల రెండో కుమార్తె మమతను ధర్మపురి మండలం రాజారం గ్రామానికి చెందిన అశోక్‌కు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి రజనీకాంత్ (5), హిమశ్రీ (3), దాక్షాయని (10 నెలలు) సంతానం. గత ఎన్నికల్లో మమత సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. భర్తతోపాటు అత్త గంగ, మామ శంకర్, మరిది పూర్ణచందర్, ఆడబిడ్డలు ఎదులాపురం వనిత, తునికి అనిత, వీరి భర్తలు ప్రశాంత్, అనిల్ కలిసి అదనంగా రూ.20 లక్షలు కట్నం కావాలని వేధించడంతోపాటు పలుమార్లు మమతపై దాడులు చేశారు. వేధింపులు భరించలేని మమత శనివారం మల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవడంతోపాటు తన వద్దనుంచి భర్త అశోక్ తీసుకెళ్లిన పెద్ద కుమారుడిని ఇప్పించాలని కోరారు. దీంతో ఎస్ఐ నవీన్‌కుమార్ నిందితులపై కేసు నమోదు చేశారు. రైల్వే కాంట్రాక్టర్ -
దారుణం.. కట్నం కోసం స్నేహితులతో కలిసి భార్యపై భర్త గ్యాంగ్ రేప్!
లక్నో: దేశంలో మహిళలపై అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అడిగినంత కట్నం ఇవ్వలేదని ఓ కిరాతకుడు.. తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ అమానుష సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆమె భర్త, అతడి స్నేహితులపై ఛకేరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2020, మార్చి 6 నిందితుడితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె భర్త, ఆడపడుచు రూ.2 లక్షలు, కారు కట్నంగా ఇవ్వాలని వేధిస్తున్నారు. అయితే.. అడిగిన డబ్బు, కారు ఇవ్వలేకపోవటం వల్ల ఆమెను ఓ గదిలో పెట్టి తాళం వేశారు. ఒక రోజు ఆమె భర్త తన ముగ్గురు స్నేహితులను ఇంటికి తీసుకొచ్చాడు. నలుగురు కలిసి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తనను చంపేసేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు సైతం ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ మ్రిగాంక్ పతాక్ తెలిపారు. ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక! -
బురఖా ధరించి కోర్టుకు వచ్చిన వ్యక్తి.. ఎందుకంటే..?
సాక్షి, కరీంనగర్: భార్య తనపై పెట్టిన కట్నం వేధింపుల కేసులో కోర్టు వాయిదాలకు నిందితుడు బుధవారం బురఖా వేసుకొని జిల్లా కోర్టు ఆవరణలోని పీసీఆర్ కోర్టుకు హాజరయ్యేందుకు రావటం సంచలనం రేపింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన పల్లె శ్రీనివాసరెడ్డిపై అతడిభార్య కట్నం వేధింపుల కేసు పెట్టింది. వాయిదాలకు కోర్టుకు హాజరవుతున్నాడు. మధ్యలో ఓ వాయిదాకు హాజరు కాకపోవడంతో కోర్టు అతడిపై వారెంట్ జారీ చేసింది. భార్య తరఫువారితో ప్రాణభయం ఉండటం, వారెంట్‌పై పోలీసులు పట్టుకోకుండా ఉండేందుకు బురఖా ధరించి కోర్టుకు వచ్చాడు. కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. టూటౌన్ పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనివెంట తండ్రి, తల్లి, చెల్లి రాగా.. పోలీసులు అరెస్టు చేయడంతో తండ్రి మల్లారెడ్డి వెంటతెచ్చుకున్న పురుగుల మందు తాగి కిందపడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. తరువాత తనపై ఉన్న వారెంటును తొలగించుకునేందుకు శ్రీనివాసరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు అనుమతి ఇచ్చింది. తన భార్య తప్పుడు కేసు పెట్టి ఇబ్బందికి గురి చేస్తోందని, ప్రాణ భయం ఉండడంతో ఇలా బురఖా ధరించి వచ్చానని శ్రీనివాస్‌రెడ్డి ఏడ్వడం కలవరపరిచింది. (క్లిక్: ‘ఊపిరి’ పోసిన ఎస్ఐ) -
ఎన్నో కలలు..మరెన్నో ఆశలు.. పెళ్లై ఏడు నెలలు తిరగక ముందే..
సాక్షి,చీపురుపల్లి రూరల్(విజయనగరం): ఎన్నో కలలు..మరెన్నో ఆశలు..భర్తతో నిండు నూరేళ్ల బంగారు భవిష్యత్తును ఊహించుకుని మెట్టినింట అడుగు పెట్టిన ఆమె..వివాహమైన ఏడు నెలలు తిరగక ముందే అనంత లోకాలకు చేరుకుంది. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక గరివిడి పట్టణంలోని రామేశ్వర కాలనీకి చెందిన వివాహిత లండ నాగమణి(22) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మూడు నెలల గర్భిణి కావడం విచారకరం. గురువారం రాత్రి జరిగిన ఈ విషాద సంఘటనకు సంబంధించి మృతురాలి మేనమామ ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గరివిడి పట్టణంలోని రామేశ్వర కాలనీ బాగువీధికి చెందిన లండ సన్యాసిరావుతో గరివిడి మండలం కొండదాడి పంచాయతీ చినవెంకటాపురం గ్రామానికి చెందిన నాగమణికి గత ఏడాది డిసెంబర్లో వివాహం జరిగింది. నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ పాసి పండోడు ఆమెను పెంచి వివాహం చేశాడు. వివాహ సమయంలో రూ.2లక్షలు కట్నం కూడా ఇచ్చాడు. పెళ్లై అత్తవారింట అడుగు పెట్టిన నాటి నుంచి భర్త సన్యాసిరావు ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో జీవితం మీద విరక్తి చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఉరివేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సీఐ టి.సంజీవరావు, ఎస్సై బి.మురళి స్థానికులను విచారణ చేశారు. చదవండి: ‘లోన్ యాప్’ ఒత్తిడికి తాతా మనవళ్ల ఆత్మహత్య -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త చేసిన పనికి..
మైసూరు: ప్రేమించి పెళ్లాడిన భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు కట్నం కోసం పెడుతున్న వేధింపులను తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరు జిల్లాలోణి హెచ్.డి.కోటె తాలూకాలోని మచ్చూరుకి చెందిన ఆనంద్ భార్య జ్యోతి (22). వీరు నాలుగేళ్ల కిందట ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. దానిని మనసులో పెట్టుకొని అత్తమామలు కట్నం తీసుకురావాలని జ్యోతిని వేధించేవారు. ఈ విషయం ఆమె.. భర్తకు చెప్పినా పట్టించుకునే వాడు కాదు. ఈ క్రమంలో జ్యోతి విరక్తి చెంది రెండు రోజుల క్రితం ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రికి తరలించగా ఆదివారం ఉదయం మృతి చెందింది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరకుని పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: విహారంలో విషాదం.. పడవ బోల్తాపడి ఒకే ఫ్యామిలీలో 8 మంది మృతి -
టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.30 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’
పలమనేరు (చిత్తూరు): ఒక్కగానొక్క కుమార్తె కావడంతో భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు ఆ తల్లిదండ్రులు. అయితే ఏడాది తిరగకుండానే ఎనిమిది నెలల గర్భిణి అని కూడా చూడకుండా భర్త, అత్తమామలు కలసి రూ.30 లక్షల అదనపు కట్నం కోసం వేధించి బాధిత కుటుంబీకులపై దాడి చేసిన సంఘటన బుధవారం పలమనేరులో వెలుగుచూసింది. వివరాలిలా.. పలమనేరు పట్టణంలోని జిలానీ క్రాస్‌కు చెందిన మహ్మద్ అజాం కుమార్తె మిస్బాల్ అల్‌ఖైర్‌కు పట్టణంలోని మసీదువీధికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ మున్సిపల్ వైస్ చెర్మన్ చాంద్‌బాషా కుమారుడు యూసఫ్ ఖాదీర్‌తో 11 నెలల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు కట్నం కింద కిలో బంగారు, 750 గ్రాములు వెండి, కియా కారు, బుల్లెట్ బండి, 50 జతల దుస్తులు, 50 వాచ్‌లు, లక్షలాది రూపాయలు విలువజేసే వస్తువులను అబ్బాయికి కానుకగా ఇచ్చారు. రెండునెలల పాటు సజావుగా సాగిన వీరి కాపురం, ఆపై రూ.30 లక్షల అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. మత్తుకు బానిసైన భర్తతో వేధింపులు తాళలేక విషయాన్ని బాధితురాలు తన తల్లి, అన్న, పెద్దనాన్నలకు తెలిపింది. వారు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ చేసి కాపురాన్ని సరిదిద్దారు. అయితే మళ్లీ బాధితురాలికి వేధింపులు తప్పలేదు. బాధితురాలు ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి కావడంతో అబార్షన్ చేసుకోవాలని అత్తారింటి బెదిరింపులు మొదలయ్యాయి. దీనిపై ఈ నెల 28న బాధితురాలి కుటుంబీకులపై దాడి జరిగింది. ఫలితంగా తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు మిస్భాల్ అల్‌ఖైర్ ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చదవండి: (సీఎం పీఏ పేరుతో ఫేక్ మెసేజ్‌లు) -
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఇలా చేస్తాడని ఎవరు అనుకోరు
నల్గొండ (సూర్యాపేట) : అత్తింటి వేధింపులకు మరో వివాహిత బలైంది. ఈ విషాదకర ఘటన ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గుంజె పిచ్చయ్య కూతురు రమాదేవి (21), ఇదే మండలం తుమ్మలపెనపహాడ్ గ్రామానికి చెందిన వరికుప్పల విజయ్ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 6 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో కట్నంగా నగదుతో పాటు ప్లాటు, మండల కేంద్రంలో వ్యవసాయ భూమిని ఒప్పుకున్నారు. విజయ్ వృత్తి రీత్యా డ్రైవర్ కావడంతో సూర్యాపేటలో కాపురం పెట్టారు. కాగా, కొద్ది రోజులుగా అదనపు కట్నం తేవాలని భర్త అత్త మామలు రమాదేవిని వేధిస్తున్నారు. భర్త విజయ్ తరచూ చిత్రహింసలు గురి చేస్తుండడంతో రమాదేవి మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14న రాత్రి గుర్తుతెలియని టాబ్లెట్స్ మింగింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున రమాదేవి మృతిచెందింది. మృతురాలి తండ్రి గుంజె పిచ్చయ్య ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదవేందర్‌రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
రెండు నెలల క్రితమే పెళ్లి.. కోడలు రాకతోనే ప్రమాదం జరిగిందని
సాక్షి, కరీంనగర్/ పటాన్‌చెరుటౌన్: అదనపు కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డీఎస్పీ భీంరెడ్డి, సీఐ శ్రీనివాసులురెడ్డి వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా సోఫీనగర్‌కు చెందిన సంయుక్త(24) బీటెక్ పూర్తి చేసింది. సంయుక్తను నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉత్తేజ్ కుమార్‌కు ఇచ్చి ఏప్రిల్ 7న వివాహం చేశారు. ఉత్తేజ్ కొండాపూర్‌లోని యాక్సిస్ బ్యాంక్‌లో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే పెళ్లైన నాలుగు రోజులకే ఇంటి దైవానికి పూజ చేసేందుకు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దీంతో కోడలు రాకతో ప్రమాదం జరిగిందని కొత్తకారు ఇప్పించాలని కోడలిని అత్త వేధించడం మొదలుపెట్టింది. అనంతరం భార్యాభర్తలు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బంధం కొమ్ము గ్రామం శ్రీదామా హిల్స్‌లో కాపురం ఉంటున్నారు. సంయుక్తను తరచూ అత్త లావణ్య, మామ పవన్‌కుమార్ ఫోన్లో పెళ్లి సమయంలో రూ.15లక్షల కట్నం, పది తులాల బంగారం ఇచ్చారని, మరో సంబంధం చేసుకుంటే కట్నం ఎక్కువ వచ్చేదని వేధించేవారు. వీరితో పాటు భర్త కూడా అదనపు కట్నం కోసం వేధించేవాడు. దీంతో ఉత్తేజ్ బుధవారం ఉదయం విధులకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చేసరికి సంయుక్త ఉరేసుకుని కనిపించింది. అమీన్పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి వీరశెట్టి విజయ్‌దర్శన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమ కూతుర్ని ఆమె భర్త ఉత్తేజ్ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని సంయుక్త తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చదవండి: ఇష్టం లేని పెళ్లి చేశారని.. ఆ భర్త ఎంత పనిచేశాడంటే? -
భర్త వేధింపులు.. యువ వైద్యురాలు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యోదయనగర్‌లో వరకట్న వేధింపులకు యువ వైద్యురాలు బలైంది. వివరాల ప్రకారం.. వైద్యురాలు వంగా భారతితో డాక్టర్ కొండగట్టు రమేష్‌కు గత డిసెంబర్లో వివాహమైంది. కాగా, అదనపు కట్నం తేవాలని రమేష్.. భారతిని వేధింపులకు గురిచేశాడు. కొత్తగా మరో ఆసుపత్రి పెడదామంటూ కట్నం కోసం ఆమెను వేధించాడు. ఈ క్రమంలో రమేష్ వేధింపులు భరించలేక యువ వైద్యురాలు భారతి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు బాధితురాలు తండ్రి శంకరయ్య పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రమేష్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
అడిగినప్పుడల్లా అదనపు కట్నం ఇచ్చినా.. సంతోషి దక్కలేదు
ఆదిలాబాద్(నేరడిగొండ): అదనపు కట్నం వేధింపులకు ఓ వివాహిత బలైన ఘటన నేరడిగొండ మండలం రాజుర గ్రామంలో శుక్రవారం జరిగింది. బోథ్ మండలం కండేపల్లి గ్రామానికి చెందిన ప్రకాష్–శ్యామల దంపతుల కూతురు సంతోషి ఉరఫ్ కృష్ణవాణి(26)కి రాజుర గ్రామానికి చెందిన పృథ్వీరాజ్‌తో ఏడాది క్రితం వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ.18.50 లక్షల నగదు, బంగారం, ఇతర లాంచనాలు ముట్టజెప్పారు. మూడు నెలలు సాఫీగా సాగిన కాపురం జీవితంలో అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. దీంతో సంతోషి తల్లిదండ్రులు అదనంగా రూ.6 లక్షలు ఇవ్వడంతోపాటు నిర్మల్‌లో ప్లాట్ కొనుగోలు చేశారు. శుక్రవారం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. ఉదయం 7:30 గంటలకు పృథ్వీరాజ్ తండ్రి ప్రకాష్‌కు ఫోన్ చేసి సంతోషి ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. దీంతో కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన రాజుర గ్రామానికి చేరుకున్నారు. విగతజీవిగా ఉన్న కూతురును చూసి బోరున విలపించారు. ఇంతలో ఇచ్చోడ సీఐ రమేశ్‌బాబు, ఎస్సై మహేందర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి బంధువులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వివరించారు. ఇంతలో ఏఎస్పీ హర్షవర్ధన్ చేరుకుని కుటుంబీకులకు నచ్చజెప్పారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పడంతో వారు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం బోథ్ ఆస్పత్రికి తరలించారు. భర్త పృథ్వీరాజ్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు, ఆడపడుచులు, అల్లుళ్లు చిత్రహింసలు పెట్టి చంపారని ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: సరదాగా మాట్లాడుకుందామని పిలిచి.. -
వారి పాత్ర లేకపోతే ‘లుక్ఔట్’ ఎందుకు?
సాక్షి, అమరావతి: నేరంలో నిందితుల పాత్ర లేదంటూ చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత కూడా ఆ నిందితులపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్వోసీ)ను కొనసాగించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన దంపతులపై గతంలో జారీ చేసిన ఎల్వోసీ కొనసాగించడంపై పోలీసుల తీరును తప్పుపట్టింది. వెంటనే వారిపై ఎల్వోసీ ఉపసంహరించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఇటీవల తీర్పు వెలువరించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్త, వైద్యులైన తన అడపడుచు, ఆమె భర్త తదితరులపై వరకట్న వేధింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారందరినీ నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆడపడుచు, ఆమె భర్తపై పోలీసులు ఎల్వోసీ జారీ చేశారు. ఆ తరువాత వరకట్న వేధింపుల వ్యవహారంలో ఆడపడుచు, ఆమె భర్తకు ఎలాంటి సంబంధం లేదంటూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు వారిద్దరికీ క్లీన్చిట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆడపడుచు, ఆమె భర్త ఉన్నత చదువుల కోసం విదేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఇమ్మిగ్రేషన్ అధికారి వారిని విదేశానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. వారిపై ఎల్వోసీ ఉందని, అందువల్ల విదేశీ ప్రయాణానికి అనుమతించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీంతో ఆ దంపతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ దుర్గాప్రసాద్ వారిపై జారీ చేసిన ఎల్వోసీ ఉపసంహరించాలని పోలీసులను, విదేశం వెళ్లేందుకు అనుమతించాలని ఇమ్మిగ్రేషన్ అధికారిని ఆదేశించారు. కేసు విచారణకు సంబంధించి ఎప్పుడు కోర్టు ఆదేశిస్తే అప్పుడు స్వయంగా హాజరయ్యేలా కింది కోర్టులో హామీ ఇచ్చి, రూ.2.50 లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని పిటిషనర్లను న్యాయమూర్తి ఆదేశించారు. -
ఆ కారులోనే నా బిడ్డ ఆత్మ! దోషికి శిక్ష ఖరారు
కొల్లం: కేరళలో వరకట్న వేధింపులకు బలైన ఆయుర్వేద వైద్య విద్యార్థిని విస్మయ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. కొల్లాం అదనపు సెషన్స్ కోర్టు-1 కిరణ్ కుమార్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 12.5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ మొత్తాన్ని బాధితురాలి తల్లిదండ్రులకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది.వరకట్న వేధింపులకు గురిచేసిఆత్మహత్యకుప్రేరేపించినట్లు విశ్వసించిన కోర్టు కిరణ్ కుమార్‌ను సోమవారం దోషిగా నిర్ధారించింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపుల నేరాలకుగాను ఈ శిక్ష విధించినట్లు అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి-1 సుజిత్ కెఎన్ ,స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి మోహనరాజ్ విలేకరులకు తెలిపారు. ఈకేసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కుమార్‌కు గతంలో ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. పెళ్లయిన కొద్ది రోజులకే ఇంట్లో శవమై కనిపించింది విస్మయ.ఈ ఘటనకు ఒక రోజు ముందు, విస్మయ తన బంధువులకు వరకట్న వేధింపుల గురించి వాట్సాప్ సందేశాలను పంపింది, అలాగే ఆమె శరీరంపై గాయాల ఫోటోలు, కొట్టిన గుర్తుల ఫోటోలను పంపించింది. 2020లో పెళ్లి సందర్భంగా కుమార్‌కి 100 కాసుల బంగారం, ఎకరానికి పైగా భూమితో పాటు 10 లక్షల విలువైన కారు కూడా కుమార్‌కి కట్నంగా ఇచ్చారు. కారు, నచ్చలేదని, వద్దన్న కిరణ్ ఆ పది లక్షల నగదు రూపంలో కావాలని వేధించి, చిత్ర హింసలకు గురి చేయడంతో విస్మయ ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఫిర్యాదు నమోదు చేశారు. వరకట్న వేధింపుల కారణంగానే విస్మయ ఆత్మహత్యకు పాల్పడిందని కేరళ పోలీసులు 500 పేజీలకు పైగా ఉన్న చార్జిషీట్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ అనంతరం కోర్టు తాజా తీర్పును వెలువరించింది. అయితే, దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు అయింది. దీంతో పోలీసులు కిరణ్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ పరిణామంపై స్పందించిన విస్మయ తల్లితండ్రులు త్రివిక్రమన్ నాయర్, సజిత సంతోషం వ్యక్తం చేశారు. అయితే కిరణ్‌కు యావజ్జీవ శిక్ష పడాలని కోరుకున్నారు. అంతేకాదు ఏ కారు అయితే విస్మయ మరణానికి కారణమైందో ఆ కారులోనే ఆమె తండ్రి విచారణకు హాజరయ్యారు. ‘‘నా కూతురు ఆత్మ ఈ కారులోనే ఉంది. ఆమె కోసం సీటు ఎపుడూ ఖాళీగా ఉంచుతా’’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు కోర్టు తాజా తీర్పును పైకోర్టులో సవాల్ చేయనున్నామని కిరణ్ తండ్రి సదాశివన్ పిళ్లై వెల్లడించారు. -
Vismaya Case: నాన్నా! భయమేస్తోంది.. వచ్చేయాలనుంది
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విస్మయ వరకట్న వేధింపుల హత్య కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్త కిరణ్‌ను దోషిగా ప్రకటించింది కొల్లాం న్యాయస్థానం. అంతేకాదు కీలక ఆధారం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. 22 ఏళ్ల విస్మయ అత్తింటి వేధింపులు భరించలేక.. తన ఇంటికి ఫోన్ చేసిన మాట్లాడిన ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ‘‘నన్ను బలవంతంగా ఇక్కడ ఉంచాలని చూస్తే.. మీరు నన్ను మళ్లీ చూడలేరు. నేను ఏదో ఒకటి చేస్తాను. ఇంక భరించలేను. అచా (నాన్న).. నాకు వెనక్కి వచ్చేయాలని ఉంది. నన్ను కొడతారని భయంగా ఉంది’’ అంటూ ఆమె కన్నీటి పర్యంతమైన వాయిస్ ఆ క్లిప్‌లో(మలయాళంలో) ఉంది. అయితే తండ్రి ఆమెను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆమె మాత్రం ఏడుస్తూనే ఉంది. కేరళ కొల్లాంలో ఆయుర్వేద మెడిసిన్ డిగ్రీ స్టూడెంట్ అయిన విస్మయ నాయర్.. కిందటి ఏడాది జూన్ 21న కొల్లాం సస్తమ్కొట్ట సమీపంలోని సస్తమనాదాలో ఉన్న అత్తగారింట్లో విగతజీవిగా కనిపించింది. అదనపు కట్న వేధింపులే ఆమె మృతికి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. వరకట్న వేదింపులతో పాటు గృహ హింస కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీలోని సెక్షన్లతో పాటు వరకట్న వేధింపుల చట్టంలోని సెక్షన్లు చార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. ఈ వ్యవహారంతో విస్మయ భర్త కిరణ్ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఊడింది. ఇంతకాలం బెయిల్ మీద బయట ఉన్నాడతను. ఇక మోటార్ వెహికిల్ డిపార్ట్మెంట్లో పని చేసే కిరణ్‌కి.. కొల్లాంకు చెందిన విస్మయ వీ నాయర్‌ను ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశారు పెద్దలు. అయితే అదనపుకట్నం కోసం ఆమెను వేధించసాగాడు కిరణ్. అప్పటికీ కొత్త కారు కొనిచ్చినప్పటికీ.. తాను ప్రభుత్వ ఉద్యోగినని, వేరే మోడల్ కారు కావాలంటూ ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. ఈ క్రమంలో.. ఆమె ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించడం విషాదాన్ని నింపడంతో పాటు దేశవ్యాప్తంగా వరకట్న మరణాలపై చర్చకు దారి తీసింది. ఇక విస్మయ కేసులో.. ఇవాళ (సోమవారం, మే 23) తీర్పు నేపథ్యంలో.. అతని బెయిల్ రద్దు అయ్యింది. దీంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కొల్లాం అదనపు సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఆడియో, తాను వేధింపులకు గురైనట్లు ఫొటోలు పంపిన విస్మయ.. కీలక ఆధారాలను అందించినట్లు అయ్యింది. ఈ సాక్ష్యాల ఆధారంగా కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది. మంగళవారం అతనికి విధించబోయే శిక్షను ఖరారు చేయనుంది. ఈలోపే అధికారికమో, కాదో క్లారిటీ లేని ఈ ఆడియో క్లిప్ వైరల్ అవుతుండడం గమనార్హం. -
12 ఏళ్ల ప్రేమ.. వరుడికి ‘వరకట్న’ వేధింపులు.. సొంత తల్లిదండ్రులకు షాక్!
ఒకప్పటి కాలంలో పెళ్లి అంటే ఏదో సాధాసీదాగా జరిపించేవాళ్లు. ఒక్క రోజులో వేడుక అయిపోయిది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా వదలకుండా పండుగలా చేసుకుంటున్నారు. పెళ్లి వేడుకలో ఎన్ని మార్పులు వచ్చినా కట్నకానుకల విషయంలో మాత్రం ఏలాంటి మార్పు రాలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ కట్నం విలువ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అబ్బాయి తరపున వారు లక్షల్లో అడుగుతుండటంతో కూతురు సంతోషంగా ఉంటే అదే చాలని భావించిన వధువు తల్లిదండ్రులు అప్పులు చేసి మరి కట్న కానుకలు ముట్టజెపుతున్నారు. తాజాగా పెళ్లి, కట్నం విషయంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మీరట్ జిల్లా కంకర్‌ఖేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని రోహతాలో ముప్పై ఏళ్ల యోగేష్ కుమార్ తన తల్లిదండ్రులతో నివాసముంటున్నాడు. అయితే ఆయన 26 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా వారు కూడా పెళ్లికి ఓకే చెప్పారు. కానీ వధువు నుంచి భారీగా కట్నం కావాలని షరతు పెట్టారు. వధువు కుటుంబ సభ్యులు అంతగా ఇచ్చుకోలేమని చెబుతున్నా.. ఎంతకీ వినిపించుకోవడం లేదు. దీంతో పెళ్లి కాస్తా సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తోంది. చదవండి: జ్ఞానవాపి మసీదు వివాదం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు దీంతో కట్నం కారణంగా పెళ్లి వాయిదా పడుతోందని వరుడు తన తల్లిదండ్రులపై జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ‘నా గర్ల్‌ఫ్రెండ్ మా తల్లిదండ్రులను కాదని నన్ను పెళ్లిచేసుకోలేదు. అలాగే మా తల్లిదండ్రులు కట్నాన్ని తగ్గించేందుకు సిద్దంగా లేరు. వాళ్లు కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇంట్లో వస్తువులు కూడా కావాలంటూ పెద్ద లిస్ట్ ఇచ్చారు. కానీ నా ప్రియురాలి కుటుంబం అంతగా ఆర్థికంగా ఉన్నవారు కారు. ఈ సమస్యకు పరిష్కారం చూపి, నా పెళ్లి జరిపించాలి’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే దీనిపై విచారణ చేయాలంటూ మీరట్ జిల్లా ఎస్పీ కంకర్‌ఖేరా పోలీసులను ఆదేశించారు. యువకుడు తన తల్లిదండ్రులపై కొన్ని ఆరోపణలు చేశాడని, ప్రథమిక విచారణ అనంతరం ఎఫ్ ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. ఈ విషయంపై యోగేష్ మాట్లాడుతూ.. అయిదుగురు అన్నదమ్ముల్లో నేను పెద్దవాడిని. నా తమ్ముళ్లందరు పెళ్లి చేసుకొని స్దిరపడ్డారు. 12 సంవత్సరాలుగా యువతిని ప్రేమిస్తున్నాను. తన చెల్లెలికి కూడా పెళ్లి అయిపోయింది. తల్లిదండ్రులు అధికంగా కట్నం ఇచ్చుకోలేరని తెలిసి యువతి ఇంకా నాకోసం ఎదురుచూస్తుంది. నేను కోర్టులో లేదా ఎప్పుడో ఇంటి నుంచి పారిపోయి ఆ అమ్మాయిని వివాహమాడొచ్చు. కానీ నేను అలా చేస్తే నా తమ్ముళ్లు కూడా అదే నేర్చుకున్నారు. అందుకే అలా చేయలేదు. నా తల్లిదండ్రులు నన్ను కొట్టి ఇంటి నుంచి బయటకు పంపించేశారు. నా సమస్యకు పోలీసులు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. కాగా తమ 30 ఏళ్ల పోలీస్ సర్వీసులో ఇలాంటి కేసు ఎప్పుడూ రాలేదని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అయితే మొత్తం ఈ విషయంపై యువకుడి తల్లిదండ్రులు ఏం స్పందించలేదు. చదవండి: Assam Floods: కొనసాగుతోన్న వరదల బీభత్సం.. 9 మంది మృతి -
తాను నిలబడి.. వేలాది మందిని నిలబెడుతుంది
జార్ఖండ్‌లోని ఘట్శిలకు చెందిన మధుమితా షా అందరు ఆడపిల్లల్లానే రంగురంగుల ఊహలతో తన భర్తతో ఏడడుగులు వేసింది. అనేక ఆశలతో పశ్చిమబెంగాల్లోని అత్తారింట్లో అడుగుపెట్టింది. కొద్దిరోజులు గడిచాక అత్తారింటి వరకట్న వేధింపులతో మధుమిత కలలన్నీ కల్లలయ్యాయి. పెళ్లైన ఆరునెలల తరువాత అత్తమామలు లక్ష రూపాయలు తీసుకురమ్మని పీడించడం మొదలుపెట్టారు. అప్పటికే కూతురి పెళ్లికి ఉన్నదంతా పోగేసి ఖర్చుపెట్టిన మధుమిత తండ్రి అంత పెద్దమొత్తంలో డబ్బులు సర్దుబాటు చేయలేకపోయాడు. పుట్టింటి పరిస్థితులను ఎంత వివరించినప్పటికీ అత్తమామలు వినేవారే కాదు. భర్తకూడా అత్తమామలకు వంత పాడడంతో మధుమిత ఒంటరిదైపోయింది. కొన్నిరోజులపాటు వారిని బతిమిలాడి ఒప్పించడానికి ఎంతో ప్రయాసపడింది. అయినా వారి మనస్సులు కరగలేదు. పైపెచ్చు మధుమితను మరింత హింసించేవారు. దీంతో ‘‘వీరికి ఎంత ఇచ్చినా ధనదాహం తీరదు. ఇక్కడే ఉండి ఊటలా ఊరే వీళ్ల కోరికలు తీర్చలేను. వీళ్లు నన్ను మరింత హింసిస్తారు. ఇలా ఎన్నాళ్లు బాధలు పడాలి’’ అని ఆలోచించి భర్తకు విడాకులు ఇచ్చింది. భర్తతో విడాకులు తీసుకున్న తరువాత మధుమిత చాలా కుంగిపోయింది. పెళ్లయిన ఏడాదికే తన దాంపత్య జీవితం ముక్కలైపోవడం తట్టుకోలేక తీవ్రనిరాశ కు గురైంది. దీనికితోడు పుట్టింటికొచ్చాక చుట్టుపక్కల వాళ్లు అనే మాటలు తనని బాగా ఇబ్బంది పెట్టాయి. తన పరిస్థితిని అర్థం చేసుకోకపోగా తనదే తప్పన్నట్లు చూడడం మధుమితను మరింత బాధించేది. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం వెన్నంటే ఉండి ప్రోత్సహించేవారు. దీంతో మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారైంది. కీ రింగ్స్ నచ్చడంతో... అది 2014 మధుమిత ఓ రోజు జంషెడ్పూర్ వెళ్లింది. రోడ్డుపక్కన కొంతమంది చెక్కతో తయారు చేసిన కీ రింగ్స్‌ను అమ్మడం చూసింది. చెక్కతో అనేక అక్షరాలు, వివిధ రకాల బొమ్మల ఆకారంలో ఉన్న కీ రింగ్స్ మధుమితను బాగా ఆకర్షించాయి. రిటైల్ మేనేజ్మెంట్లో డిప్లొమా చేసిన మధుమితకు చెక్కబొమ్మల బిజినెస్ చేస్తే మంచి లాభాలు వస్తాయన్న ఆలోచన వచ్చింది. వెంటనే మధుమిత గ్రామంలో తనకు తెలిసిన కొంతమంది హస్తకళాకారులను కలిసింది. వారితో మాట్లాడి చెక్కతో కీ రింగ్స్ తయారు చేయమని అడిగింది. మొదట్లో వాళ్లు ఒప్పుకోలేదు. తరువాత ముగ్గురు గిరిజన మహిళలు ముందుకు రావడంతో వారికి కీ రింగ్స్ తయారీ నేర్పించింది. దీంతో వాళ్లు చెక్కతో రింగులు, వివిధ అలంకరణ వస్తువులు తయారు చేయడం మొదలు పెట్టారు. దీనిద్వారా ఆ మహిళలకు మంచి ఆదాయం రావడంతో మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. పిపాల్.. ప్రారంభంలో చెక్కతో కీ రింగులు, ట్రేలు, పెన్ స్టాండ్స్ తయారు చేసి ఎగ్జిబిషన్లలో ప్రదర్శించడం, ఇంటింటికి తిరిగి విక్రయించేవారు. వీరి ఉత్పత్తులకు మంచి స్పందన లభిస్తుండంతో..ఓ ఫర్నీచర్ షాపు పక్కన కొద్దిగా ఖాళీస్థలం ఉంటే షాపు యజమానిని అడిగి.. 2016లో ‘పైపల్ ట్రీ’ పేరిట షాపు ప్రారంభించింది. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఇక్కడి నుంచే విక్రయిస్తోంది. విక్రయాలతో ఒక్కోమహిళ నెలకు సగటున పదిహేను వేల రూపాయలు చొప్పున సంపాదిస్తున్నారు. వీరంతా రెండువందలకు పైగా ఉత్పత్తులను రూపొందిస్తున్నారు. వీటిలో కోస్టర్స్, నేమ్ ప్లేట్స్, ఇంటి అలంకరణ వస్తువులు వంటివి ఎన్నో ఉన్నాయి. పిపాల్ ద్వారా వందలమందికి ఉపాధి కల్పిస్తూనే, ఏడాదికి అరవై లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్న మధుమిత ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. నన్ను నేను నిరూపించుకున్నాను మా వస్తువులకు మంచి డిమాండ్ ఉంది కానీ డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతున్నాం. ఉత్పత్తులను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. నేను కాకుండా జంషెడ్‌పూర్‌లో పదహారు చోట్ల స్కూళ్లలో హ్యాండ్‌క్రాఫ్ట్ మేకింగ్ వర్క్‌షాపులు నిర్వహించి వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనిద్వారా వంటింటికే పరిమితమైన మహిళలు నెలకు ఐదు నుంచి ఏడు వేలరూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇలా వచ్చినదానితో పిల్లల ట్యూషన్ ఫీజులు, రోజువారి ఖర్చులు నెట్టుకొస్తున్నారు. ప్రారంభంలో నా శక్తి సామర్థ్యాలను అంతా అనుమానించారు. కానీ ఈ మహిళలందరి సాయంతో నన్ను నేను నిరూపించుకోగలిగాను. వ్యాపారాన్ని విస్తరించి మరింతమందికి ఆర్థిక చేయూతనిస్తాను’’ అని చెబుతున్న మధుమిత ఆత్మవిశ్వాసాలు అబ్బుర పరుస్తాయి. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని స్నేహితుడినే..
శివమొగ్గ: సొరబకు చెందిన లేఖప్ప (28) అనే వ్యక్తిని కృష్ణప్ప (30) హత్య చేశాడు. మన్మనే గ్రామానికి చెందిన లేఖప్ప సొరబకు వచ్చి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లేఖప్ప ఫోన్ కాల్స్ ఆధారంగా అతని స్నేహితుడు అయిన కృష్ణప్పను అదుపులోకి తీసుకొని విచారించగా తానే చంపినట్లు చెప్పాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పట్టణానికి పిలిపించి హత్య చేసి శవాన్ని పొలాల్లో పడేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా, శివమొగ్గ దగ్గర గురుపురలో గౌడప్ప (35) అనే ప్రైవేటు ఉద్యోగి బైక్‌పై వెళ్తుండగా గూడ్స్ వ్యాన్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందాడు. వరకట్న వేధింపులు, మరో అబల బలి మైసూరు: వరకట్న వేధింపులకు మరో అబల బలైన సంఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హిమ్మావు గ్రామంలో చోటు చేçసుకుంది. గ్రామానికి చెందిన ఉమేష్, బేబి (29)కి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అప్పుడప్పుడు దంపతుల మధ్య కట్నం విషయంగా గొడవలు జరిగేవి. ఇదిలా ఉంటే మంగళవారం తెల్లవారుజామున బేబి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డబ్బు కోసం వేధించడం వల్లనే బేబి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త అలా చేస్తున్నాడని వందన..) -
కీచక పర్వం: కట్నం తేలేదని బంధువులతో కలిసి..
అడిగినంత కట్నం ఇవ్వలేదని ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్యపై బంధువులతో కలిసి సామూహిక అత్యాచారానికి తెగపడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ మృగచేష్టలను వీడియో తీసి.. యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. రాజస్థాన్ భరత్‌పూర్‌లో ఘోరం జరిగింది. అడిగినంత కట్నం తేలేదని ఓ భర్త కిరాతకానికి పాల్పడ్డాడు. లక్షన్నర రూపాయల వరకట్నం పెళ్లైన నాటి నుంచి వేధింపులు ఎదుర్కొంటోంది ఆమె. పేదింటి కుటుంబం కావడంతో కట్నం ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలో ఆమెపై లైంగిక దాడికి తెగబడింది అత్తింటి కుటుంబం. తన బంధువులతో కలిసి భర్త ఆమెను సామూహిక అత్యాచారం చేశాడు. ఆ సమయంలో లైంగిక దాడిని వీడియో కూడా తీశాడు. కట్నం డబ్బు తేకుంటే ఆ వీడియో ద్వారా డబ్బు సంపాదించుకుంటానని ఆమెను బెదిరించాడట. ఈ మేరకు భరత్పూర్ కమాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. ‘‘నీ కుటుంబ సభ్యులు ఎలాగూ కట్నం ఇవ్వలేరూ. కనీసం ఇప్పుడు నీ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసైనా ఆ డబ్బు సంపాదించుకుంటా’’ అని ఆ మానవ మృగం బెదిరింపులకు దిగింది. దీంతో తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించిందామె. నిందితుల్లో ఇద్దరికీ పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు అయ్యానని, మరొకరు ఆమెను ఐదురోజుల కిందట భర్త పిలుస్తున్నాడని చెప్పి కమాన్ ప్రాంతానికి తీసుకొచ్చి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్తోంది. అంతేకాదు పారిపోయి ఇంటికి వచ్చాక కూడా వదలకుండా నిందితులంతా ఆమెపై ఘోరానికి తెబడ్డారట. పరారీలో ఉన్న కీచకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వీడియోను ఎక్కడైనా అప్లోడ్ చేశారా? ఎవరెవరికి పంపారనే వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. చదవండి: ప్రియుడితో పెళ్లికి అడ్డొస్తున్నాడని తండ్రి హత్య.. ఆపై -
కట్నంతో లాభాలెన్నో!
ముంబై: వరకట్నంతో చాలా ప్రయోజనాలున్నాయంటూ పలు ఉదాహరణలను పేర్కొన్న బీఎస్సీ నర్సింగ్ రెండో ఏడాది పాఠ్యపుస్తకం ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది. టీకే ఇంద్రాణి రచించిన సోషియాలజీ ఫర్ నర్సింగ్ పుస్తకంలోని ఒక పేరాలో పేర్కొన్న అంశాలను నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఆ పేజీ ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ ఇంట్లోకి కొత్త కుటుంబసభ్యురాలిగా అడుగుపెట్టేందుకు వరకట్నం ఎంతగానో సాయపడుతుంది. ఇంట్లోకి సమస్త సామగ్రి, వాహనాలు ఇలా అన్నీ కట్నం రూపంలో వచ్చిపడతాయి. అమ్మాయి తన తల్లిదండ్రుల ఆస్తిలో భాగాన్ని ఇలా కట్నంరూపంలో అత్తవారింటికి తెచ్చుకోవచ్చు. కట్నాలు ఇచ్చే స్తోమత లేకే కొందరు తల్లిదండ్రులు అమ్మాయిలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వారు చదివి, ఉద్యోగం సంపాదిస్తే కట్నం డిమాండ్ తగ్గుతుంది. ఇదొక మంచి ప్రయోజనం. అందవిహీన అమ్మాయిలకు మంచి/అందవిహీన అబ్బాయిలతో పెళ్లి అవ్వాలంటే కట్నం ముట్టజెప్పాల్సిందే’ అంటూ పలు వ్యాఖ్యానాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఇలాంటి పాఠ్యపుస్తకాలు ఉండటం మన భారతజాతికే సిగ్గుచేటు’ అంటూ శివసేన మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠ్య ప్రణాళిక నుంచి వెంటనే ఈ పుస్తకాన్ని తొలగించి, సంబంధికులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆమె లేఖ రాశారు. -
ఏడేళ్ల క్రితం వివాహం.. వరకట్న వేధింపులకు వివాహిత బలి
హిందూపురం: వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. అత్తింటి వారి ఒత్తిళ్లు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని లక్ష్మీపురంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై టూటౌన్ సీఐ సూర్యనారాయణ తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపురం తాలుకా పెరేసంద్ర గ్రామానికి చెందిన మోనిసా (34)కు హిందూపురానికి చెందిన రియాజ్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. గత రెండేళ్ల నుంచి భర్తతోపాటు అత్త ఫిరోజ్‌బీ వరకట్నం తీసుకురావాలంటూ ఆమెను వేధిస్తున్నారు. ఈ వేదన తాళలేక మోనిసా బు«ధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు మాత్రం కట్నం కోసం అత్తింటి వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గురువారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. ఆసుపత్రి వద్ద మోనిసా బంధువులతో డీఎస్పీ రమ్య మాట్లాడారు. వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని డీఎస్పీ వివరించారు. -
దుబాయ్‌కి వెళ్లాలని భార్యతో గొడవ.. వసంత తండ్రికి ఫోన్‌చేసి..
పరవాడ (పెందుర్తి), విశాఖపట్నం: వరకట్న వేధింపులు తాళలేక వివాహిత పోలారపు వసంత (21) ఆత్మహత్య చేసుకున్న ఘటన వాడచీపురుపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకొంది. పరవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళానికి చెందిన పోలారపు పార్ధసారథి కుటుంబంతో ఏడేళ్ల క్రితం వలస వచ్చి పరవాడ రామాలయం వీధిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఫార్మాసిటీలో లేబర్ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. పార్ధసారథికి కొడుకు, కుమార్తె వసంత ఉన్నారు. కుమార్తె వసంత ఇంటర్మీడియట్ చదువుకొంది. కళాశాలలో ఆమె చదువుకొంటున్న రోజుల్లో వాడచీపురుపల్లి గ్రామానికి చెందిన పోలవరపు మూర్తి(26)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకొన్నారు. వీరికి రెండేళ్ల గ్రీష్మన, ఏడాది వయసు గల ప్రేమశ్రీ కుమార్తెలు సంతానం. వసంత భర్త మూర్తి కొంత కాలం వెల్డింగు పనులు చేశాడు. ప్రస్తుతం పని లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. వెల్డింగ్ పనిలో అనుభవం ఉన్న మూర్తి దుబాయ్‌లో పని చేయడానికి వెళ్లేందుకు వారం నుంచి సన్నాహాలు చేసుకొంటున్నాడు. ఈ క్రమంలో దుబాయ్ వెళ్లడానికి అవసరమైన డబ్బు కోసం తన భార్య వసంతతో అత్తమామలను రూ.50 వేలు అడిగించాడు. అంత డబ్బు తమ వద్ద లేదని వసంతకు తల్లిదండ్రులు చెప్పేశారు. అయినప్పటికీ డబ్బులు పట్టుకురమ్మని వసంతపై మంగళవారం రాత్రి మూర్తి ఒత్తిడి తేవడంతో మరోసారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అడిగినా ఫలితం లేకపోయింది. చదవండి: (మైనర్‌కు మద్యం తాగించి అఘాయిత్యం... ఆధ్యాత్మిక ‘గురువు’ అరెస్ట్) ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వసంత తల్లిదండ్రులకు మూర్తి ఫోన్ చేసి... మీ అమ్మాయికి బాగోలేదని చెప్పాడు. హుటాహుటిన ఇంటికి చేరుకొన్న తల్లిదండ్రులకు కుమార్తె శవమై కనిపించింది. వెంటనే మృతిరాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరవాడ సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు, ఎస్ఐ పి.రమేష్, తహసీల్దార్ బి.వి.రాణి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఉయ్యాల కోసం ఇంట్లో ఏర్పాటు చేసిన కర్రకు చీరతో మెడకు బిగించుకొని వసంత ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సీఐ ఈశ్వరరావు తెలిపారు. అనాథలైన చిన్నారులు తల్లి మరణం, తండ్రి జైలుపాలు కావడంతో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయిన ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. ఊహ తెలియని గ్రీష్మన (2), ప్రేమశ్రీ(1)కి తల్లి మరలిరాదని తెలియక ఆమె కోసం ఆశగా ఎదురుచూస్తుండడం పలువురి హృదయాలను కలచివేసింది. మరోవైపు వరకట్న వేధింపులు భరించలేకే తమ కుమార్తె వసంత ప్రాణాలు తీసుకొందని మృతురాలి తండ్రి పార్ధసారథి ఆరోపించారు. తన కుమార్తె మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. వసంత మృతదేహానికి పరవాడ తహసీల్దార్ బి.వి.రాణి సమక్షంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వసంత భర్త మూర్తి, అతడి తలిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని సీఐ ఈశ్వరరావు చెప్పారు. పోలవరపు మూర్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. -
వివాహమైన నెలకే వేధింపులు.. తల్లిదండ్రులకు ఫోన్‌చేసి..
చింతకొమ్మదిన్నె (కడప): జీవితాంతం తోడు నీడగా నిలవాల్సిన భర్త వేధింపులు, అత్త మామల సతాయింపులతో ఓ మహిళ చిన్న వయస్సులోనే బలవన్మరణం చెందింది. మండలంలోని కడప–పులివెందుల ప్రధాన రహదారి సమీపంలోని బృందావనం కాలనీలో గురువారం నవిత(24)అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కడప డీఎస్పీ బి. వెంకట శివారెడ్డి కథనం మేరకు సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడురుకు చెందిన నవితకు కడపకు చెందిన వెంకట బాబారెడ్డికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన నెల తర్వాత నుంచి అత్త మామలు, భర్త అదనపు కట్నం కోసం వేధించసాగారు. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలపడంతో అదనపు కట్నం సైతం అందించారు. అయినప్పటికీ ఆమెను మానసికంగా వేధిస్తూ ఇబ్బందులకు గురి చేసేవారు. దీంతో ఆమె మనోవేదనకు గురైంది. గురువారం ఉదయం తల్లి దండ్రులకు ఫోన్ చేసి ఇంటిలో ఉరి వేసుకుని మృతి చెందింది. కడప రూరల్ సీఐ శ్రీరామ శ్రీనివాసులు, సీకె దిన్నె ఎస్ఐ ఎం.మంజునాధ్రెడ్డిలు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. తహసీల్దార్ విజయ్ కుమార్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్సీ తెలిపారు. చదవండి: (మా కుమార్తె ఏం తప్పు చేసింది.. ఎందుకు తీసుకెళ్లరు) -
ఇంతకుముందే పెళ్లి.. నాగరాజుతో సాన్నిహిత్యం.. కట్నం తేవాలంటూ..
సాక్షి, సిద్ధిపేట: వరకట్న వేధింపులకు గర్భిణి బలైంది. ఈ ఘటన సిద్దిపేట పట్టణం లెక్చరర్స్ కాలనీలో చోటుచేసుకుంది. వన్ టౌన్ సీఐ భిక్షపతి వివరాల ప్రకారం కాలనీకి చెందిన మామిడాల విజయలక్ష్మీ, వెంకటనర్సయ్య దంపతుల మూడో కూతురు నవ్య అలియాస్ దివ్య (29)కు ఏడేళ్ల క్రితం ముంబాయికి చెందిన ప్రదీప్‌కుందార్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. భర్త, ఇద్దరు పిల్లలను వదిలి ముంబాయి నుంచి సిద్దిపేటకు వచ్చిన దివ్య, అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న బంజేరుపల్లికి చెందిన నాగరాజుతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ వివాహం చేసుకుని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కాగా కట్నం తేవాలంటూ తరచూ నాగరాజు దివ్యను వేధిస్తుండేవాడు. నెల రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సిద్దిపేట గాంధీనగర్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. దివ్య ప్రస్తుతం 8 నెలల గర్భిణి కావడంతో తండ్రి వెంకటనర్సయ్య బుధవారం ఉదయం దివ్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షల అనంతరం ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. రాత్రి నాగరాజు ఫోన్ చేసి దివ్య చనిపోయిందని చెప్పాడు. దీంతో మహిళ కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి, అచేతనంగా పడి ఉన్న దివ్యను 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కట్నం తేవాలంటూ నాగరాజు తన కూతురుకు ఉరేసి చంపాడని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: విద్యుత్‌శాఖలో మీటర్ల గోల్మాల్.. అసలు విషయం ఏంటంటే.. -
రెండో పెళ్లి.. అడిగిన డబ్బులు తేకుంటే మొదటి భార్యను తీసుకొస్తానని..
సాక్షి, మలక్‌పేట: భర్త వేధింపులు తాళలేక వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ నెల 8న జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన గంగనపల్లి కాశీవిశ్వనాథం కుమార్తె స్వప్న(38)ఎంబీబీఎస్ చదివింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పీహెచ్సీలో వైద్యురాలిగా పని చేస్తున్న సమయంలో మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తితో ఆమెకు పెళ్లైంది. అనివార్య కారణాల వల్ల భర్త నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం 2015 ఏప్రిల్‌లో కర్నూలుకు చెందిన ముత్యాల మద్దయ్య కుమారుడు శ్రీధర్‌తో రెండో వివాహం జరిగింది. రూ.10 లక్షలు నగదు, 14 తులాల బంగారం కట్నం కింద ముట్టజెప్పారు. శ్రీధర్ కూడా డాక్టర్. అతడికి మేనమామ కుమార్తెతో పెళ్లికాగా, విడాకులు తీసుకున్నారు. అప్పటికే వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్వప్నకు కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు రావడంతో హైదరాబాద్‌కు వచ్చింది. «శ్రీధర్ నల్లగొండ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. భార్యాభర్తలు అస్మాన్‌ఘడ్ తిరుమల హిల్స్‌లో ఉంటున్నారు. ఏడాది పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగింది. అదనపు కట్నం తేవాలని, లేదంటే మొదటి భార్యను తీసుకొస్తానని భర్త వేధిస్తుండంతో స్వప్న మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య కూడా యత్నించింది. చదవండి: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో.. 2020 సంవత్సరంలో స్వప్న తల్లి విజయ మృతి చెందగా అప్పటి నుంచి ఆమెకు చెందిన ఇంట్లో వాటా, ఆమె పేరిట ఉన్న నగదు తీసుకురావాలని స్వప్నను శ్రీధర్ ఒత్తిడి చేస్తున్నాడని తండ్రి విశ్వనాథం ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, ఈనెల 8న స్వప్న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె తండ్రికి శ్రీధర్ ఫోన్ చేసి చెప్పాడు. మృతదేహాన్ని పరిశీలించిన కుటుంబసభ్యులు స్వప్న మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిరాలి తండ్రి సైదాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసుపై ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా, స్వప్న ఆత్మహత్య చేసుకుందన్నారు. శ్రీధర్‌పై కట్నం వేధింపుల కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
‘మా బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, భర్తే ఉరేసి చంపాడు’
సాక్షి, హన్మకొండ: హన్మకొండ లో వరకట్న వేధింపులకు బ్యాంకు ఉద్యోగిని బలైంది. భీమారం బ్యాంకు కాలనీలో నివాసం ఉండే గర్భిణిగా ఉన్న బ్యాంక్ ఉద్యోగిని ఆనూష అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. మృతదేహాన్ని హడావిడిగా ఆస్పత్రికి తరలించడంతో అనూష మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే.. హన్మకొండలోని భీమారం బ్యాంక్ కాలనీ లో నివాసం ఉండే అనుషా ప్రవీణ్ దంపతులిద్దరు బ్యాంక్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. 2019లో వీరిద్దరికి వివాహం కాగా ఓ బాబు ఉన్నాడు. ఏమైందో ఏమో కానీ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఆందోళనకు దారితీసింది. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఆమె భర్త ప్రవీణ్ సమాచారం ఇచ్చి హడావిడిగా పుట్టింటివారు కూడా రాకముందే అనూష మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ గా ఉన్న అనూష కుటుంబ కలహాల గురించి ఇటీవలే తమతో మాట్లాడిందని పుట్టింటివారు తెలిపారు. అనూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, భర్తే ఉరేసి చంపి ఆత్మహత్యగా నాటకం ఆడుతున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెళ్లి సమయంలో 20 లక్షల కట్నం, కారు, బైక్ ఇచ్చామని, భూమి కావాలంటే 20 గుంటల భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదనపు కట్నం కోసమే వేధించి భర్త హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనూష మృతదేహం పక్కనే భర్త మృతదేహం ఉండాలని అతని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. -
ప్రేమ పెళ్లి ఆపై వరకట్న వేధింపులు.. ఐదు వారాల గర్భవతి..
సాక్షి, కృష్ణా జిల్లా(పెడన): వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఉరి వేసుకున్న సంఘటన పెడన పట్టణంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని 12వ వార్డు కాపులవీధిలో పిచ్చుక దేవేంద్రకుమార్, కుసుమలక్ష్మి(19) నివాసం ఉంటున్నారు. దేవేంద్రకుమార్ తాపీ పనిచేస్తూ ఉంటాడు. భార్యభర్తల మధ్య తరచూ వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. గురువారం ఉదయం కూడా గొడవ జరగడంతో కుసుమలక్ష్మి తన తల్లి భట్ట నాగేశ్వరమ్మకు ఫోన్ చేసి పరిస్థితి వివరించింది. తాను వస్తున్నానని.. గొడవ పడవద్దని చెప్పి.. కుసుమ ఇంటికి నాగేశ్వరమ్మ బయల్దేరింది. తల్లి ఇంటికి చేరేసరికి కుసుమలక్ష్మి తన ఇంట్లోని దూలానికి చీరతో ఉరి వేసుకుని ఉంది. తల్లి గమనించి చుట్టుపక్కవాళ్లను పిలిచి కుసుమలక్ష్మిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లింది. అయితే అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించిన ఆస్పత్రి సిబ్బంది అవుట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పెడన పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుసుమలక్ష్మి భర్త పిచ్చుక దేవేంద్రకుమార్, అత్త శ్యామలమ్మ, బావ ప్రసాద్, ఆడపడుచు సుహాసినిలు అధికకట్నం కోసం తరచూ వేధించేవారని, ఈ వేధింపులు వల్ల తన కుమార్తె చనిపోయిందని తల్లి నాగేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (బోసినవ్వులు కనుమరుగు: ఏమైందో ఏమో ఒకరితర్వాత ఒకరు..) ఐదు వారాల గర్భవతి.. పట్టణంలోని 9వ వార్డు రాజీవ్‌నగర్‌లో వేర్వేరుగా ఉండే దేవేంద్రకుమార్, కుసుమలక్ష్మిలు 2021 ఏప్రిల్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అందుకు ఇరుపక్షాల పెద్దలు కూడా అంగీకరించారు. మూడు నెలలు దేవేంద్రకుమార్ తల్లిదండ్రుల వద్దే ఉంటూ కాపురం చేశారు. ఆ తర్వాత గొడవలు కావడంతో పెద్దల సూచనలతో 12వ వార్డులోని అద్దె ఇంట్లో కాపురానికి దిగారు. అయినా గొడవలు సద్దుమణగలేదు. తన కుమార్తె ఐదువారాల గర్భవతి అని, బుధవారం ఆస్పత్రికి తీసుకువెళ్లి చూపించానని తల్లి నాగేశ్వరమ్మ కన్నీరుమున్నీరవుతోంది. -
ఆ టీడీపీ నేత.. నిత్య పెళ్లి కొడుకు
పెద్దతిప్పసముద్రం: ఆయన తెలుగుదేశం పార్టీ నేత. పార్టీలో అత్యంత క్రియశీలకంగా వ్యవహరిస్తుంటాడు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో జరిగే పార్టీ కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు పెట్టుకున్నాడు. అయితే ఆయన నిత్య పెళ్లికొడుకన్న విషయం తాజాగా బయటపడింది. డబ్బున్న యువతులకు వల వేసి ప్రేమ పేరుతో వంచించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇలా వరుసగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే ఈ బాగోతాన్ని మూడో భార్య కనిపెట్టింది. రెండో భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం నవాబుకోటకు చెందిన దండుపల్లి వెంకటరమణ కుమారుడు మంజునాథ్. బెంగళూరులో కాంక్రీట్ మిల్లర్లు అద్దెకు ఇస్తుంటాడు. కొంత డబ్బు పోగేసుకుని గ్రామానికి చేరుకున్నాడు. అనంతరం మదనపల్లి సమీపంలోని అంగళ్లులో రజనీ అనే యువతిని సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుని కొన్నాళ్లు కాపురం చేశాక వదిలేశాడు. అనంతరం బెంగళూరు వెళ్లిపోయాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని మ్యారేజ్ బ్యూరో ద్వారా కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్కు చెందిన ఆశా అనే యువతిని ఆరేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఐదేళ్ల పునీతశ్రీ అనే పాప కూడా ఉంది. అనంతరం అదనపు కట్నం పేరిట వేధించి ఆమె వద్ద ఉన్న డబ్బు, నగలతో పరారయ్యాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ధావణగెరేకు చెందిన ప్రియాంక అనే యువతిని వల్లో వేసుకున్నాడు. వంద గ్రాముల బంగారం, రూ.5 లక్షలు కట్నంగా తీసుకుని ఇరు కుటుంబీకుల సమక్షంలో మూడేళ్ల కిందట ధర్మస్థలంలో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో కాన్పు కోసం పుట్టింటికి పంపగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. కట్నం కోసం వేధింపులు ఇదే అదనుగా భావించిన ఆ నిత్య పెళ్లి కొడుకు హుటాహుటిన బెంగళూరులో ఉంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేసి సామాన్లతో సహా స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇల్లు ఎందుకు ఖాళీ చేశావని ఫోన్ ద్వారా భార్య ప్రియాంక ప్రశ్నించగా.. ఇక్కడే కాపురం చేద్దాం.. వచ్చేయ్ అని చెప్పడంతో ఆమె ఏడాది కిందట పాపతో సహా అత్తారింటికి చేరుకుంది. అయితే ఆరు నెలలుగా భర్తతో పాటు అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటికే ఈ ప్రబుద్ధుడి వ్యవహారం ప్రియాంక తెలుసుకుంది. ఆమెకు రెండో భార్య ఆశా కూడా తోడైంది. దీంతో వారు పెద్దతిప్పసముద్రం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మధురామచంద్రుడికి ఫిర్యాదు చేశారు. అయితే వీరు స్థానికంగా నివాసం ఉంటున్నట్టు ఆధార్, రేషన్ కార్డు తదితర ఎలాంటి ఆధారాలూ లేనందున కర్ణాటక రాష్ట్రంలో ఫిర్యాదు చేయాలంటూ వారిని వెనక్కి పంపినట్టు ఎస్ఐ చెప్పారు. -
కట్నం వేధింపులకు మూడు ప్రాణాలు బలి
సాక్షి, పెద్దపల్లి: అత్తింటి వేధింపులకు ఓ అబల బలైంది. అదనపు కట్నం తేవాలన్న వేధింపులతో మనస్తాపానికి గురైన మూడు నెలల గర్భిణి తన 18 నెలల కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. జూలపల్లి మండల కేంద్రానికి చెందిన చిగుర్ల మౌనిక (26)కు ధర్మారం మండలం బంజరుపలిŠల్ గ్రామానికి చెందిన సివిల్ సప్లయిస్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమేశ్‌తో రెండున్నరేళ్ల కిందట వివాహం జరిగింది. ప్రస్తుతం దంపతులిద్దరూ పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్‌లో నివాసం ఉంటున్నారు. వివాహ సమయంలో రమేశ్‌కు రూ.27లక్షలు ముట్టజెప్పారు. అయితే పెళ్లి తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని మౌనికను వేధింపులకు గురిచేస్తున్నాడు. బుధవారం ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన మౌనిక, తన 18 నెలల చిన్నారితో కలిసి పెద్దపల్లి శివారులోని వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం మౌనిక మూడు నెలల గర్భవతి. ముక్కుపచ్చలారని 18 నెలల చిన్నారి, కడుపులో ఉన్న మూడు నెలల కళ్లు తెరవని పసికందుతో సహా మూడు ప్రాణాలు బలవడంతో ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్ఐ రాజేశ్‌లు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బావి నుంచి బయటకు తీయించారు. మౌనిక చావుకు కారణమైన భర్త రమేశ్‌ను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మృతురాలి సోదరుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నవ కళా ఉద్యమం
ప్రపంచంలోని ఎన్నో సామాజిక ఉద్యమాల్లో ‘కళ’ బలమైన పాత్ర నిర్వహించింది. ‘కత్తి కంటే కళ గొప్పది’ అని ఢంకా బజాయించి చెప్పింది. నిరూపించింది. కొన్ని నెలల క్రితం కేరళలో వరకట్న హత్యలు కలకలం సృష్టించాయి. ‘ఎందుకు ఇలా జరుగుతుంది?’ అంటూ చర్చ మొదలైంది. ‘అక్షరాస్యతకు పేరుగాంచిన ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఏమిటి!’ అనే ఆవేదన కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో వరకట్నహింసతో పాటు స్త్రీలపై జరిగే రకరకాల హింసలకు వ్యతిరేకంగా కేరళలో ‘స్త్రీ నవకేరళం’ పేరుతో కళాఉద్యమం మొదలుకానుంది. పాటలు, నాటికలు, స్ట్రీట్ప్లే, చిత్రాలు, కార్టూన్లు, గోడపత్రికలు, సోషల్ మీడియా చాలెంజ్, వీడియోలు రూపొందించడం... మొదలైన వాటిలో వివిధ జిల్లాలో నుంచి ముగ్గురు మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఈ ముగ్గురు తమ జిల్లాలలోని పదిమంది బృందానికి శిక్షణ ఇస్తారు. ఈ కళాఉద్యమానికి సంబంధించి పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం అయింది. కళాబృందాలు జిల్లా కేంద్రం నుంచి మారుమూల పల్లెల వరకు అన్ని ప్రాంతాలకు వెళ్లి తమ కళారూపాలను ప్రదర్శిస్తాయి. దీంతో పాటు గ్రామ ప్రజలతో చర్చా కార్యక్రమం నిర్వహిస్తారు. ‘ఫలాన గ్రామంలో వరకట్న వేధింపులు భరించలేక ఒక అమ్మాయి ఆత్మహత్మ చేసుకుంది...’ అని కళాబృందంలోని ప్రధాన వక్త చర్చ ప్రారంభిస్తుంది. ‘ఇది అన్యాయం... అలా జరగడానికి వీల్లేదు’ అంటాడు ఒక పెద్దాయన. ఆయనతో గొంతు కలుపుతాడు ఒక నవయువకుడు. ఆ వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. అది భవిష్యత్‌కు ఆశావహమైన మార్పు కావచ్చు. ఈ కళా ఉద్యమానికి అంబాసిడర్‌గా నటి నిమిష సజయ ఎంపిక అయ్యింది. ‘ఉద్యోగాలలో లింగవివక్షతను ప్రశ్నించే కళారూపాలు, స్త్రీసాధికారతకు సంబంధించిన కళారూపాలు కూడా మా ప్రచారయాత్రలో చోటుచేసుకుంటాయి’ అంటుంది నిమిష సజయ. -
వరకట్నం సమయానికి చెల్లించలేదని
లక్నో: మహిళలపై వేధింపులు, అకృత్యాలను నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొందరు కేటుగాళ్లలో మార్పులు రావడం లేదు. తాజాగా, వరకట్న దాహనికి ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ ఘటన యూపీలోని కేడీ గ్రామంలో గత బుధవారం చోటుచేసుకుంది. ఖుష్బు అనే యువతికి సమీప గ్రామంలోని యూనస్‌తో వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం వచ్చే నెల ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వరుడు తరపు వారు పెళ్లికి ముందే.. కట్నంగా 5 లక్షల నగదు, ఒక కారును ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, వధువు తరపువారు మొదట అడిగిన కట్నానికి అంగీకరించినప్పటికీ, సమయానికి కట్నం ఇవ్వలేకపోయారు. దీంతో వరుడు తరపు వారు పెళ్లి వేడుకకు అభ్యంతరం తెలిపారు. దీంతో ఖుష్బు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: యూపీలో బీజేపీకి భారీ షాక్.. పార్టీని వీడిన మూడో మంత్రి -
పది నెలల క్రితం ప్రేమ వివాహం.. ఆ తర్వాత ఏమైందంటే?
సాక్షి, ఖమ్మం: ప్రేమ వివాహం చేసుకున్న పది నెలలకే సదరు యువతి బలవన్మరణానికి పాల్పడింది. సీఐ రామకృష్ణ కథనం ప్రకారం..తల్లాడ మండలం లక్ష్మీపురానికి చెందిన బండి మౌనిక పది నెలల క్రితం అదే గ్రామానికి చెందిన ఆర్.నరేంద్రను ప్రేమ వివాహం చేసుకుంది. గత ఐదు నెలలుగా ఖమ్మంలోని వరదయ్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో ఈ నెల 3వ తేదీన మౌనిక ఆత్మహత్యాయత్నానాకి పాల్పడిందంటూ ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రి లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతి చెందింది. అయితే.. ఆమె మెడపై గాట్లు ఉన్నాయని, వరకట్నం కోసం వేధించారని తండ్రి చార్లెస్ ఖానాపురంహ హవేలి స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో నరేంద్రపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టారు. లక్ష్మీపురంలో భర్త ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన తల్లాడ: పోస్టుమార్టం అనంతరం మౌనిక మృతదేహాన్ని స్వగ్రామం లక్ష్మీపురం తీసుకెళ్లారు. భర్త నరేంద్ర పోలీసుల అదుపులో ఉండగా, అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి నాలుగు రోజుల కిందటే ఊరు విడిచి వెళ్లిపోయారు. అటు తరఫు వారు రాలేదని మృతదేహాన్ని నరేంద్ర ఇంటిముందు రాత్రి 9 గంటల వరకు ఉంచడంతో ఉద్రిక్తత నెలకొంది. వైరా సీఐ వసంత్‌కుమార్ ఆధ్వర్యంలో తల్లాడ, వైరా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 10గంటలదాకా సీఐ ఇరువైపుల పెద్దలతో చర్చించారు. -
ఓ తండ్రి ఆలోచన.. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్లిళ్లు
ఈ హెడ్డింగ్‌కి అర్థం తెలుసుకోవాలంటే మనం కేరళకు వెళ్లాలి. అక్కడ ఒక తండ్రి తన కుమార్తెకు పెళ్లి చేయదలిచాడు. కాని పెళ్లికి అనవసర ఖర్చు వద్దనుకున్నాడు. కట్నం ఇవ్వకూడదనుకున్నాడు. ఆ డబ్బును సద్వినియోగం చేయాలనుకున్నాడు. కూతురి పెళ్లికి ఎంత డబ్బు దాచాడో ఆ మొత్తం డబ్బును అదే ముహూర్తానికి మరో ఐదు మంది అమ్మాయిల పెళ్లికి ఖర్చు చేశాడు. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్ళిళ్లు జరిగాయి. ఈ ఆలోచన మనం చేయలేమా? అసలు పెళ్లికి ఖర్చు అవసరమా? పెళ్లి ఖర్చు అనే సామాజిక రుగ్మత నుంచి బయటపడలేమా? ఒక ఆలోచనాత్మక కథనం. ఇటీవల హైదరాబాద్ గోల్కొండ సమీపంలోని ఒక రిసార్ట్‌లో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఖర్చు.. అంటే పెళ్లి జరిపేందుకు అయిన ఖర్చు 2 కోట్లు. ఈ మొత్తంలో లాంఛనాలు లేవు. ఇచ్చిపుచ్చుకున్న ఖర్చూ లేదు. కేవలం కల్యాణ మంటపానికి, భోజనానికి, అతిథి మర్యాదలకి, సంగీత్కి, అలంకరణలకి, అట్టహాసానికి అయిన ఖర్చు అది. ఆ రెండు కోట్లతో మధ్యతరగతి పెళ్లిళ్లు 20 అయినా చేయొచ్చు. పేద పెళ్ళిళ్లు 50 అయినా చేయొచ్చు. పెళ్లి ఇద్దరు స్త్రీ, పురుషులు కలిసే సంతోషకరమైన సందర్భం. దానిని సంతోషంగా చేసుకోవాల్సిందే. ఇరువురి ఆత్మీయులు హాజరవ్వాల్సిందే. కాని ఆ పెళ్లిని ఆసరా చేసుకుని తమ సంపదను, అహాన్ని, హోదాని, పలుకుబడిని నిరూపించాలనుకున్నప్పుడే పేచీ వస్తుంది. వెండి అంచు ఉన్న శుభలేఖలు, వాటితో పాటు ఇచ్చే పట్టుచీరలు, వస్తువులు, భోజనంలో ముప్పై నలభై వంటకాలు, ఖరీదైన వినోద కార్యక్రమాలు ఇవన్నీ పెళ్లి బడ్జెట్‌ను అమాంతం పెంచేస్తాయి. ఉన్నవారికి ఇదంతా తేలికే కావచ్చు. ఇమిటేట్ చేయాలనుకునే వారికి చిక్కొచ్చి పడుతుంది. ఇటీవల కేరళ లో అట్టహాసపు పెళ్ళిళ్లు, అందుకు పెళ్లికొడుకులు మారాము చేయడం, ఘనంగా చెప్పుకోవడానికి బైక్ దగ్గర కారు అడగడం, కట్నం దగ్గర ఆస్తులు అడగడం, అవి వీలు కాకపోతే భార్యను వేధించడం మామూలు అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల కన్నూరులో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. కన్నూరు సమీపంలోని ఎడచ్చేరీకి చెందిన సలీమ్, రుబీనా జంట తమ కుమార్తె రమీజా పెళ్లిని వినూత్నంగా చేయాలనుకున్నారు. గల్ఫ్‌లో ఉద్యోగం చేసే సలీమ్ తన కుమార్తె పెళ్లికి డబ్బు దాచి పెట్టాడు. కాని దానిని కట్నంగా ఇవ్వడం, అట్టహాసపు పెళ్లికి ఖర్చు పెట్టడం వద్దనుకున్నాడు. ఎలాగైనా సరే కట్నం అడగని పెళ్లికొడుకుని వెతికి పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాడు. అలాంటి వరుడే దొరికాడు. దాంతో అతనికి కట్నం డబ్బు మిగిలిపోయింది. దాంతో పాటు పెళ్లి అర్భాటంగా వద్దనుకున్నాడు కాబట్టి ఆ ఖర్చూ మిగిలింది. ఆ మొత్తం డబ్బుతో ఆర్థికంగా వెనుకబడిన ఐదుగురు అమ్మాయిలను ఎంపిక చేసుకుని వారికి అబ్బాయిలను వెతికి తన కుమార్తెకు పెళ్లి జరిగిన ముహూర్తానికే వారికీ పెళ్లి జరిపించాడు. అంతే మొత్తం ఆరు పెళ్ళిళ్లు ఒకే ముహూర్తానికి జరిపించాడు. ఇందులో ఇద్దరు వధువులు హిందువులు కావడంతో వారి పెళ్లి హైందవపద్ధతిలో జరిగింది. ఈ పెళ్ళిళ్లు జరిపించడంలో సలీమ్, రుబీనా దంపతులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఐదుగురు అమ్మాయిలకు తగిన అబ్బాయిలను వెతికారు. అలాగే పెళ్లిలో సొంత కూతురితో పాటు మిగిలిన ఐదుగురికీ సమానంగా 10 సవరల బంగారం పెట్టారు. అందరికీ ఒకేరకమైన పట్టు చీరలు తెచ్చారు. ఇంత చక్కగా డబ్బును సద్వినియోగం చేయడం వల్ల ప్రశంసలు పొందారు. ఇందులో మతసామరస్యం కూడా ఉండటంతో పొగడ్తలు మరిన్ని వస్తున్నాయి. కాలం మారుతుంది. రెండు తీవ్రతలు కనిపిస్తున్నాయి. ఒకటి పెళ్లికి చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం...మరొకటి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం బొకేలు ఇచ్చి పుచ్చుకుని వియ్ ఆర్ మేరీడ్ అనుకోవడం. ఎవరి ఇష్టం వారిదే అయినా పెళ్లి ఖర్చును తగ్గించడం అనేది ఒక అవసరంగా పాటించడం ఆదర్శం అవుతుంది. ఆ ఆదర్శం అందరూ పాటించగలిగితే చాలా కుటుంబాలకు పెళ్లి భారం అనే ఆలోచన తప్పుతుంది. తద్వారా ఆడపిల్లలను కనేందుకు, ఆడపిల్లలను పెంచేందుకు జంకే పరిస్థితి పోతుంది. ‘అమ్మాయి పుడితే ఖర్చు’ అనే మాట ఇంకా ఎంత కాలం? ఆ ఖర్చు పెళ్లి వల్లే కదా? దానిని తేలిక చేయలేమా? సలీం వంటి ఆలోచనలు చేయలేమా? ఆలోచించాలి అందరం. పెళ్లి ఖర్చును తగ్గించడం అనేది ఒక అవసరంగా పాటించడం ఆదర్శం అవుతుంది. ఆ ఆదర్శాన్ని అందరూ పాటించగలిగితే చాలా కుటుంబాలకు పెళ్లి భారం అనే ఆలోచన తప్పుతుంది. -
సిగ్గు పడాల్సిన భారత జాతీయ నేరం వధూహత్య
‘వరకట్నమరణ’ నేరాన్ని మెకాలే కనిపెట్టలేదు. భారతదేశ భర్తలు, అత్తమామలు, ఆడపడచుల అనేక ఘోరనేరాల వల్ల భారత సమాజమే స్వతంత్రదేశంలో దీన్ని కొత్త నేరంగా నిర్వచించింది. సాక్ష్యాలు లేని నాలుగు గోడల మధ్య కుటుంబ సభ్యులే, అంటే పాత నేరగాళ్లు కాదు, సాగించే దారుణమైన హత్యలకు సరైన శిక్షలు విధించడానికి కావలసిన నియమాలు, విధానాలు పార్లమెంటు రూపొందించింది. మనం గొప్పగా చెప్పుకునే అద్భుతమైన వారసత్వ సంస్కృతి, మనమంతా పిలుచుకునే గొప్ప నాగరికత, అంతరిస్తున్న ప్రేమలు, విజృంభిస్తున్న ద్వేషాలు, ధనాశ, క్రౌర్యం నుంచి పుట్టిన కుటుంబ నేరం ఈ ఘోరం. సిగ్గుపడవలసిన సరికొత్త భారత జాతీయనేరం. (చదవండి: తప్పు చేసినా శిక్షకు అతీతులా?) జార్ఖండ్ రాష్ట్రంలో ఒక భర్త రామ్‌సహాయ్ మహతో, అత్త పార్వతీదేవి, మామ నేమా మహతో కలిసి కోడలు ఫుల్వాదేవిని వరకట్నం తేలేదని చంపిన సంఘటన ఇది. రాజ్‌దూత్ మోటార్ సైకిల్, 20 వేలరూపాయల వరకట్నం కోసం వధువును హింసించారు. వేరే అమ్మాయితో పెళ్లి చేస్తామని బెదిరించారు. తండ్రి అంత డబ్బు తేలేడని కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. 1997లో పెళ్లి అయిన కొద్ది నెలలకే ఆమె జీవితం ముగించారు. ఆమెను నదీ తీరానికి తీసుకువచ్చి నదిలోకి తోసి చంపేశారు. కూతురు కనిపించడం లేదని తండ్రి బోధి మహతో ఫిర్యాదు చేశారు. (చదవండి: ‘ట్యాక్స్ పేయర్స్ మనీ’ అంటూ ‘సోషల్ ఆడిట్’!) 1997లో వధువును చంపేశారు. కేసు రిజిస్టర్ అయింది. 20వ తేదీ సెప్టెంబర్ 1999 గిరిడిత్ అడిషనల్ సెషన్‌జడ్జి నేరం రుజువైందని పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. మరో నేరంలో మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలు కావాలని తీర్పులో పేర్కొన్నారు. అంటే కేవలం పదేళ్లే శిక్ష అని అర్థం. 2007లో అంటే ఏడేళ్ల తరువాత హైకోర్టు శిక్షలను నిర్ధారించింది. 14 సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు శిక్షలను సమర్థించింది. ఈలోగా నేమా మహతో (మామ) 2009 సుప్రీం కోర్టులో అప్పీలు కోసం ఎస్ఎల్పీ వేశాడు. కానీ అంతలో మరణించాడు. కనుక ఆయనపై కేసులేవీ ఉండవు. అత్తమీద ఆరోపణలు స్పష్టంగా లేకపోవడం, రుజువులు సరైనన్ని లేకపోవడం వల్ల ఆమెను విడుదల చేశారు. 21 సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సుదీర్ఘ అన్యాయాలస్యం తరువాత న్యాయం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కొహ్లి ఈ అప్పీలు విచారించారు. కొన్ని దేశాల్లో అయితే ఒక శిక్ష తరవాత మరొక శిక్ష అమలవుతుంది. అంటే ఇదే అమెరికాలో అయితే కోడలిని చంపిన ఈ హంతకులకు 13 ఏళ్ల జైలు శిక్ష పడేది. నేర విచారణ దశలో తమ ఇంట్లోంచి వధువు ఏ విధంగా మాయమైపోయిందో చెప్పలేకపోయారు అత్త మామలు, భర్త. ఆమె తనతో నివసించడం లేదని వారు చెప్పినవన్నీ అబద్ధాలని కోర్టు భావించింది. తమతో కాకుండా తన బావతో ఆమె నివసించేదని చెప్పడానికి వారు విఫల ప్రయత్నం చేశారు. ఇంట్లోంచి వెళ్లిపోయిందనీ తరువాత దొరకలేదనే మాటలు కూడా నమ్మశక్యంగా లేవు. వెతకడానికి ఏం ప్రయత్నాలు చేశారో చెప్పలేకపోయారు. నిజంగా ఆమె ఇంటినుంచి మాయమైపోతే ఆమె తల్లిదండ్రులకు చెప్పకపోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం చూస్తే వారి ప్రవర్తనపై అనుమానాలు ధృవపడుతున్నాయి. వరకట్న హత్యలకు ప్రత్యక్ష సాక్షులు ఉండరు. నేరగాళ్లే సాక్షులు. వారి ప్రవర్తన, పరిస్థితులు, ముందు వెనుక వారి వ్యవహారాలు, అంతకుముందు జరిగిన సంగతులు వారి నేరాన్ని పట్టి ఇస్తాయి. మామూలు హత్యలకు ఈ హత్య లకు ఇదీ తేడా. హత్య జరిగిందని చెప్పే సాక్షులు ఉండని పరిస్థితులలో, వీరే హత్య చేసి ఉంటారు అని భావించడానికి తగిన పరిసర సాక్ష్యాలు కోర్టు ముందుంచడం ఒక సవాల్. దీనికిగానూ ప్రాసిక్యూషన్ వారు నీతిమంతంగా, న్యాయంగా, చాలాశ్రద్ధతో కృషి చేయవలసి వస్తున్నది. సెక్షన్ 304 బి ఇండియన్ పీనల్ కోడ్ కింద, నిందితులే నేరం చేసి ఉంటారని భావించడానికి కొన్ని సూత్రాలను ఈ తాజా తీర్పు వివరిస్తున్నది. 1. సాధారణ పరిస్థితుల్లో కాకుండా మరోరకంగా మరణం సంభవించి ఉండటం, కాలిన గాయాలో మరోరకం శారీరక గాయాలో అయి ఉండాలి. 2. పెళ్లయిన ఏడేళ్లలోగా అసాధారణ మరణం జరిగి ఉండాలి. 3. మరణానికి ముందు అప్పుడప్పుడే ఆమె హింసకు గురై ఉండాలి. 4. ఆ హింస, క్రౌర్యం వరకట్నం కోసమో లేక దానికి సంబంధించినదై ఉండాలి. ఇందులో వధువు తండ్రి ఒక్కడే ప్రత్యక్ష సాక్షి. నిందితుడు తన కూతురికి హాని చేస్తానని బెదిరించినట్టు సాక్ష్యం చెప్పాడు. తండ్రి, తమ్ముడు, బావ చేసిన ప్రయత్నాల వల్ల ఆమె శరీర భాగాలు లభించాయి గానీ పోలీసులేమీ చేయలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో దర్యాప్తు అంత పకడ్బందీగా లేదు. కానీ 304బి కింద పరిస్థితుల సాక్ష్యం నిందితుల నేరాన్ని రుజువు చేస్తోంది. ఫుల్వాదేవి పెళ్లయిన కొద్ది నెలలకే కట్నం కోసం హింసకు గురికావడం, కొద్దిరోజులకే అత్తవారింటి నుంచి మాయం కావడం (ఆరోపణ స్థాయిలో కూడా నమ్మలేని మాట), తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం, వధువు సోదరుడు వచ్చినపుడు ఇంటిల్లిపాదీ లేకపోవడం, ఇంటికి తాళం వేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం, ఆమె అస్తిపంజరం నదీ తీరంలో దొరకడం, భర్త, అత్త మామల మాటలు పొంతనలేకుండా ఉండటం వంటి వన్నీ నేరాన్ని పట్టి ఇస్తున్నాయి. ఇది హత్య. సాక్ష్యాలు దొరికితే హత్య అని నిరూపించి సెక్షన్ 302 కింద శిక్షించే వీలుంది. సెక్షన్ 304బి హత్యల వర్గంలోనే ఒక కొత్తరకం నేరం. దీన్ని చట్టం హత్య అనకుండా వరకట్న మరణం అని పేరుపెట్టినంత మాత్రాన ఇది హత్య కాకుండా పోదు. వివాహ వ్యవస్థను నాశనం చేస్తున్నది కుటుంబపెద్దల క్రూర స్వార్థ మనస్తత్వం. (చదవండి: వధువు కంటే వరుడు పెద్దవాడయి వుండాలా!) - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
వరుడ్ని చితకబాదిన వధువు బంధువులు.. అసలు ఏం జరిగిందంటే..
లక్నో: వరకట్న వేధింపులు అనేవి పురాతన కాలం నుంచి ఆడపిల్లలను, వారి తల్లిదండ్రులను పట్టి పీడిస్తున్న సమస్య. ఇవే వేధింపులు ఎక్కువగా మారి హత్యలు, ఆత్మహత్యలకు దారితీసిన ఘటనలు కూడా బోలెడు ఉన్నాయి. తాజాగా ఓ వరుడు అదనపు కట్నం కావాలని అడిగినందుకు పెళ్లి మండపలోనే వధువు తరపు బంధువులు చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ముందు చెప్పిన దానికంటే వరుడి తండ్రి కట్నంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని వధువు తల్లిదండ్రులను డిమాండ్ చేశాడు. అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే పెళ్లిని రద్దు చేస్తానని బెదిరించాడు. అయితే వధువు కుటుంబీకులు ఇప్పటికే రూ.3 లక్షల నగదు, రూ.లక్ష విలువైన డైమండ్ రింగ్ ఇచ్చారు. అయితే అది సరిపోదని తాము అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ వరుడు తండ్రి పట్టుబట్టారు. పెండ్లి సజావుగా జరగాలని వధువు తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వరుడితోపాటు అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన పెండ్లి కుమార్తె కుటుంబ సభ్యులు పెండ్లి కొడుకుపై దాడి చేశారు. అందరు చూస్తుండగానే ఆ వరుడిని చితకబాదారు. ఇదంతా కొందరు వీడియోలో చిత్రీకరించగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లి వరుడి కుటుంబం కేసు నమోదైంది. చదవండి: Vicky Kaushal: పెళ్లైన పది రోజులకే.. ఏంది భయ్యా? విక్కీ కౌశల్‌కు నెటిజన్ల ప్రశ్నలు -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం.. మెట్టినింటి బాధలు పడలేక
సాక్షి, నల్లగొండ: ప్రేమించానని వెంటపడి మాయమాటలు చెప్పాడు.. ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఎదిరించి మరీ వివాహం చేసుకున్నాడు.. మూడు నెలలు గడిచాయో లేదో.. వరకట్నం తీసుకురావాలని తల్లితో కలిసి వేధించాడు.. ఇటు కన్నవారికి దూరమై.. అటు మెట్టినింటి బాధలు తట్టుకోలేక ఆ.. అభాగ్యురాలు మరణశాసనం లిఖించుకుంది. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా డిండి మండల పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం వావిల్‌కొల్ గ్రామానికి చెందిన మబ్బు అలెమ్మ, చిన నాగయ్య దంపతుల కూతురైన శ్రీలత(24), అదే గ్రామానికి చెందిన జుట్టు బొజ్జమ్మ, మొగిలయ్య కుమారుడు చిన్నయ్య ఏదాది కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించి వివాహం చేసుకున్నారు. మూడు మాసాలకే.. వివాహమైన తర్వాత చిన్నయ్య, శ్రీలత దంపతులు గ్రామంలోనే కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, కొంత కాలం సజావుగా సాగిన వీరి కాపురంలో వరకట్నం చిచ్చురేపింది. పుట్టింటి నుంచి కట్నం, బైక్ తీసుకురావాలంటూ చిన్నయ్య తన తల్లి బొజమ్మతో కలిసి వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో, శ్రీలత పుట్టింటికి వెళ్లలేక.. ఇటు భర్త, అత్తల చిత్రహింసలు తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరేసుకుంది. అయితే, అనుమానంతో కుటుంబ సభ్యులు వెతకగా అప్పటికే విగతజీవిగా మారింది. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అత్తింటి వేధింపులతోనే శ్రీలత ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి సోదురుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పోచయ్య తెలిపారు. -
మామ ఉద్యోగ విరమణ.. భార్య గొంతుకు తాడు బిగించి
సాక్షి, రాయచూరు(కర్ణాటక): మూడుముళ్లు వేసి జీవితాంతం తోడుగా ఉంటానని బాసలు చేసిన భర్త కాలముడై భార్య గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన నగరంలోని అంద్రూన్ కిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. సదర్‌బజార్ పోలీస్‌స్టేషన్ సీఐ గుండురావ్ కథనం మేరకు.. రాయచూరులో టీ పోడి విక్రయిస్తున్న ఫజీలుద్దీన్కు తాలూకాలోని సుల్తాన్‌పురకు చెందిన అస్మాబేగం(34)తో 2013 జూన్ 30న వివాహమైంది. పెళ్లి సమయంలో ఏడు తులాల బంగారు, రూ.50వేల నగదు కట్నంగా ఇచ్చారు. ఈ దంపతులకు కుమారులు అన్వరుద్దీన్(7)అరాపథ్(4) ఉన్నారు. అస్మా తండ్రి ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేయగా పింఛన్ డబ్బు చేతికి అందింది. అందులో కొంత మొత్తం తేవాలని ఆస్మాబేగంను భర్త ఫజులుద్దీన్ వేధింపులకు గురి చేశాడు. ఇతనికి తల్లి తాహీర, చెల్లెలు యాస్మిన్లు వంతపాడారు. ఈ క్రమంలో ఫజులుద్దీన్ ఆస్మాబేగం గొంతుకు తాడు బిగించి హత్య చేశాడు. సోమవారం ఈ ఘటన వెలుగు చూసిందని, ఫజులుద్దీన్, అతని తల్లి, చెల్లెలిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఐదేళ్ల క్రితం పెళ్లి.. వరకట్న వేధింపులు.. ఆడపిల్ల పుట్టిందనే కోపంతో..
సాక్షి,కోనేరుసెంటర్(క్రిష్ణా): వరకట్న వేధింపులతోపాటు ఆడపిల్ల పుట్టిందని భర్త తనను విడాకులు ఇమ్మంటున్నాడని ఓ మహిళ వాపోయింది. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి రోజు స్పందన కార్యక్రమం జరిగింది. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అర్జీలు స్వీకరించారు. గుడివాడకు చెందిన ఓ వివాహిత తనకు ఐదేళ్ల కిందట వివాహమైందని, కొంతకాలం సజావుగా ఉన్న భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, భర్తతో పాటు అత్తమామలు హింసిస్తున్నారని వాపోయింది. అధిక కట్నం కోసం పెట్టే వేధింపులకు తోడు ఆడపిల్ల పుట్టిందనే నెపంతో విడాకులు ఇమ్మని బలవంతం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.తనకు న్యాయం చేయాలని వేడుకొంది. స్పందించిన ఎస్పీ ఫిర్యాదును గుడివాడ సీఐకి సిఫార్సు చేసి బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరో ఘటనలో.. కైకలూరుకు చెందిన ఓ వ్యక్తి తాను చేపల చెరువులు సాగు చేస్తూ జీవిస్తుంటానని, ఏడాది కిందట తెలిసిన వ్యక్తికి చెరువులను లీజుకు ఇచ్చానని, లీజు డబ్బులు ఇవ్వకుండా తాత్సారం చేయడంతో పాటు డబ్బులు అడుగుతుంటే చంపుతానని బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరాడు. ఫిర్యాదును పరిశీలించి బాధితుడికి రక్షణ కల్పించాలని కైకలూరు సీఐని ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పోలీసు సిబ్బంది సామరస్యంగా ఆలకించి ఫిర్యాదుల పరిష్కారంలో బాధితులకు భరోసాగా ఉండాలన్నారు. పోలీసులను ఆశ్రయిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని బాధితులకు కలుగజేయాలని చెప్పారు. చదవండి: Road Accident: పరీక్ష రాసే ముందు బాబా దర్శనం కోసం వెళుతూ.. అంతలో టైరు పేలి.. బాధితుల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్ -
కాపురానికి వెళ్లినా వేధింపులు తప్పవు.. పుట్టింట్లో నవవధువు..
సాక్షి, ముత్తారం (పెద్దపల్లి): అదనపు కట్నం వేధింపులకు నవవధువు పుట్టింట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని అడవి శ్రీరాంపూర్‌లో విషాదం నింపింది. కట్నం కింద రూ. 17లక్షలు ఇచ్చి.. ఇతర కానుకలు ముట్టజెప్పినా.. భర్త, అత్తామామల వేధింపులు ఆగలేదు. అదనపు కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళ్తానని పుట్టింట్లో వదిలేయడం.. తల్లిదండ్రుల ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో వారిపై భారం వేయొద్దని కానరాని లోకాలకు వెళ్లింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అడవిశ్రీరాంపూర్‌కు మారం వెంకన్న, సరోజనకు కూతురు పవిత్ర, కుమారుడు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పవితక్రు ఈ ఏడాది ఆగస్టు 21న మంథని మండలం గాజులపల్లికి చెందిన చిందం లక్ష్మి, ఓదెలు కుమారుడు నరేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.17లక్షలు, 17 తులాల బంగారం, ద్విచక్రవాహనం ఇచ్చారు. కాపురంలో పట్టుమని పది రోజులు కాకుండానే నరేశ్‌లో అదనపు కట్నమనే పిశాచి ఆవహించింది. చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..) వివాహం నాటి ఫొటో తనకు ఫర్టిలైజర్ దుకాణంలో నష్టం వచ్చిందని, మరో రూ.10లక్షలు అదనంగా తేవాలని పవిత్రను వేధించసాగాడు. దీనికి నరేశ్ తల్లిదండ్రులతోపాటు తమ్ముడు సురేశ్, బంధువులైన రమేశ్, రావుల చంద్రయ్య, పద్మ సహకరించారు. తనపై భర్త, అత్తామామలు, మరిది దాడి కూడా చేశారని పవిత్ర తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలపగా.. పెద్ద మనుషులను తీసుకెళ్లి పంచాయితీ పెట్టించారు. అందరికీ సర్దిచెప్పి వచ్చారు. అయితే దీపావళి పండుగ నిమిత్తం పవిత్రను పుట్టింట్లో వదిలివెళ్లిన నరేశ్.. అదనపు కట్నం తెస్తేనే కాపురానికి తీసుకెళ్తానని స్పష్టం చేశాడు. చదవండి: (భూత్ బంగ్లాలతో భయం భయం.. అసాంఘిక కార్యకలాపాలకు..) తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడం.. కాపురానికి వెళ్లినా నరేశ్ నుంచి వేధింపులు తప్పవని మనస్తాపానికి గురైన పవిత్ర (24) గురువారం వేకువజామున దూలానికి ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు చూసేసరికే చనిపోయింది. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, సీఐ సతీశ్ సంఘటన స్థలంను పరిశీలించి వివరాలు సేకరించారు. కట్నం వేధింపులతోనే తన కూతురు చనిపోయిందని పవిత్ర తండ్రి ఫిర్యాదు మేరకు పవిత్ర భర్త చిందం నరేశ్, అత్తామామలు చిందం లక్ష్మీ, ఓదెలు, మరిది సురేశ్, రమేశ్, రావుల చంద్రయ్య, రావుల పద్మపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాములు తెలిపారు. చదవండి: (ఎస్సై నిర్వాకం: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. పెళ్లాడాడు.. చివరకు) -
ప్రేమ వివాహం.. భారీగా కట్నకానుకలు అయినా..
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్(వరంగల్): అదనపు కట్నం కోసం భర్త, అత్తమామాల వేధింపులు తాళలేక వివాహిత ముప్పిడి లావణ్య(20) బలైన సంఘటన మండలంలోని కోమటిగూడెంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. కోమటిగూడెం గ్రామానికి చెందిన పర్శ బాలరాజు, యాకమ్మ దంపతుల కుమార్తె అయిన లావణ్య ఇంటర్ చదివి ఇంటి వద్ద ఉండేది. వారి ఇంటి ఎదురుగా ముప్పిడి కొండయ్య, మల్లమ్మ దంపతులు ఉండేవారు. వారి కుమారుడు ముప్పిడి నరేష్ లావణ్యతో ప్రేమలో పడ్డాడు. విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియగా ఇద్దరూ ఒకే కులానికి(ముదిరాజ్) చెందిన వారు కావడంతో 11 నెలల క్రితం వివాహం చేశారు. వివాహ సమయంలో కట్నంగా అర ఎకరం చెలుక, ఐదు తులాల బంగారం, పెళ్లి ఖర్చులకు రూ.లక్ష నగదు ఇచ్చారు. అయితే మొదట్లో బాగానే ఉన్నప్పటికీ ఐదారు నెలలుగా అదనపు కట్నం కోసం లావణ్యను భర్త నరేష్‌తో పాటు అత్తమామలు వేధిస్తున్నారు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నరేష్‌కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. భార్యను బాగానే చూసుకుంటానని పెద్దమనుషులు, పోలీసుల సమక్షంలో చెప్పిన నరేష్ తిరిగి వేధింపులను ప్రారంభించాడు. దాంతో కొద్దిరోజులుగా ఆమె తల్లిగారి ఇంటి వద్దనే ఉంటుంది. అయితే రోజూ మాదిరిగానే వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చిన ఆమె తల్లిదండ్రులు లావణ్య ఇంట్లో ఉరి వేసి ఉండటం గమనించి రోధిస్తూ కిందకుదించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెంది ఉంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి తమ కుమార్తెను ఆమె భర్త నరేష్ ఉరివేసి చంపాడని ఆరోపిస్తూ అతడి ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. అయితే అప్పటికే నరేష్ ఇంట్లో ఎవరూ లేకుండా పరారు కావడంతో రాత్రి వరకూ మృతదేహంతో ఆందోళన చేశారు. మృతదేహంపై పడి తల్లి, బంధువులు పెద్ద ఎత్తున రోదించారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్‌రెడ్డి పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆమెది ఆత్మహత్యనా, హత్య అనే విషయమై గ్రామంలో చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి. కమలాపూర్‌లో మరొకరు.. కమలాపూర్: వరకట్న వేధింపులు తాళలేక కమలాపూర్ మండలకేంద్రానికి చెందిన పబ్బు హారిక (27) అనే వివాహిత గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్‌కు చెందిన పబ్బు పాపయ్య– సుభద్రల కుమారుడు కిరణ్, జక్కు సాంబమూర్తి– కళమ్మల కూతురు హారిక ప్రేమించుకోగా సుమారు ఐదేళ్ల క్రితం ఇరు కుటుంబాలు వారి ప్రేమను అంగీకరించి వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ.లక్ష నగదు, 6 తులాల బంగారం, కల్లు చీరిక రాసిచ్చి ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. ప్రస్తుతం వీరికి మూడున్నర ఏళ్ల కుమారుడు ఉన్నారు. పెళ్లైన కొద్ది కాలం నుంచి అదనపు కట్నం తేవాలంటూ హారికను ఆమె భర్త కిరణ్, అత్త సుభద్ర శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో మూడు విడతలుగా రూ.లక్ష చొప్పున మొత్తం రూ.3 లక్షలు అదనంగా ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 16న కళమ్మతో పాటు ఆమె ఇద్దరు కూతుర్లు సంధ్య, హారికలు మొట్టుపల్లిలో జరిగిన బంధువుల వివాహానికి వెళ్లారు. ఈ నెల 18న కిరణ్ అక్కడికి వెళ్లి హారికతో గొడవపడి ఆమెను తీసుకుని కమలాపూర్‌కు వచ్చాడు. అదే రోజు రాత్రి హారిక ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. తన కూతురు హారిక మృతి పట్ల భర్త కిరణ్, అత్త సుభద్రలపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి తల్లి కళమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. -
వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు..
చట్ట ప్రకారం వరకట్నం ఇచ్చినా, తీసుకున్నా నేరం. 1961, మే 1న మన దేశంలో అధికారికంగా నిషేధించినా.. ఈ చట్టం కేవలం పేపర్ల వరకే పరిమితం అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే.. నేటికీ వరకట్న ఆచారం యధేచ్చగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ డబ్బు, బంగారం, వాహనాలు, పొలాలు, స్థలాలు రూపంలో పద్ధతులు, ఆచారాల పేరిట మగ పెళ్లివారికి సమర్పించుకోవడం రివాజుగా ఉంది. ఐతే ఈ గ్రామంలో పెళ్లిల్లకు డబ్బు, బంగారాభరణాలతోపాటు 21 అత్యంత విషపూరితమైన పాములను కూడా భరణంగా ఇస్తారట. వింతగా అనిపించినా దీని వెనుక ప్రత్యేక కారణం ఉంది. ఆదేమిటో తెలుసుకుందాం.. మధ్యప్రదేశ్‌లోని గౌరియా తెగవారు ఈ వింత ఆచారాన్ని శతాబ్ధాలుగా అనుసరిస్తున్నారు. కూతురికి వివాహం చేస్తే అల్లుడికి విషపూరితమైన 21 పాములను కట్నంగా ఇస్తారట. ఈ విధంగా కట్నం సమర్పించుకోకపోతే ఆ పెళ్లి కొంతకాలానికే పెటాకులౌతుందని వారి నమ్మకం. చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! అంతేకాదు, ఈ తెగ జీవనోపాధికూడా పాములను పట్టడమేనట. పట్టిన పాములను జనాల ముందు ఆడించటం ద్వారా డబ్బు సంపాదిస్తారట. కట్నంగా వచ్చిన పాముల ద్వారా డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆడపిల్ల తండ్రి తన అల్లుడికి పాములను కట్నంగా ఇస్తాడు. అందుకే ఆడపెళ్లివారు మగపెళ్లివారికి కట్నంగా 21 పాములను ఇచ్చుకుంటారు. కట్నంగా తీసుకున్న పాములను కఠిన నియమాలతో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఒకవేళ భద్రపరచిన బాక్సులో పాము మరణిస్తే దాన్ని అశుభంగా పరిగణిస్తారు. అంతేకాకుండా కుటుంబం మొత్తం గుండు చేయించుకుంటారట కూడా. వింత జనాలు.. వింత ఆచారాలని అనుకుంటున్నారా!! దేశ మూలమూలల్లో ఇంకెలాంటి వింత కట్నాలు, భరణాలు ఆచరణలో ఉన్నాయో.. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
ఒకప్పుడు నువ్వులేక నేను లేనన్నాడు.. ఇప్పుడు..
సాక్షి, మహబూబాబాద్ (వరంగల్): ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని, భర్త, అత్తమామలు, ఆడబిడ్డపై ఓ యువతి మానుకోట జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి శుక్రవారం ఫిర్యాదు చేసింది. మహిళా పోలీస్ స్టేషన్ వద్ద బాధిత యువతి వివరాలు వెల్లడించింది. మానుకోట జిల్లాలోని మరిపెడ మండలం తాళ్లఊకల్ గ్రామానికి చెందిన బాషిపంగు శ్రావణి, ఆకుల అశోక్ మూడేళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. అక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం మరిపెడకు వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుండగా భర్త, ఆయన తల్లిదండ్రులు, బంధువులు తనను కులం పేరుతో దూషిస్తున్నారని, వారి కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రూ.20 లక్షల వరకు కట్నం వచ్చేదని అంటూ తనను హింసిస్తున్నారని ఆరోపించింది. తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసిన ఆయన తల్లిదండ్రులు, బంధువులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. గతంలో జరిగిన సంఘటనపై మరిపెడ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు శ్రావణి రోదిస్తూ చెప్పింది. -
ఆ హీరో నాపై పలుమార్లు అత్యాచారం చేశాడు : ప్రముఖ నటి
Kannada TV Actress Files Complaint: ప్రముఖ కన్నడ సీరియల్ నటి( పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) ఓ హీరోపై సంచలన ఆరోపణలు చేసింది. 'కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా కలుసుకున్నాం. అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పలుమార్లు ఇంటికి వచ్చి బలవంతంగా నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా పెళ్లికి ముందు పలుమార్లు నాపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వివాహం గురించి మాట్లాడితే ఏవేవో సాకులు చెప్పి తప్పించుకున్నాడు. స్నేహితులు కూడా ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు గుడిలో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అత్తిరింట్లో భర్త తరపు బంధువులు నరకం చూపించారు. కట్నం తేవాలని ఒత్తిడి చేస్తూ నా కులం పేరుతో దూషించేవారు' అని నటి బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తాను భర్త, అత్తమామల చిత్రహింసలు భరించలేక ఇటీవలె వాళ్ల నుంచి విడిగా ఉంటున్నట్లు తెలిపింది. ఇటీవలె ఈమె ఓ రియాలిటీ షోలో సైతం పాల్గొంది. ప్రస్తుతం ఆమె భర్త సీరియల్స్‌లో హీరోగా చేస్తున్నాడు. అయితే వివరాలు మీడియాకు వెల్లడించడానికి ఆమె నిరాకరించింది. -
పెళ్లికి ముందే అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, బనశంకరి(కర్ణాటక): వివాహానికి ముందు తనపై భర్త అత్యాచారానికి పాల్పడ్డాడని బుల్లి తెరనటి బసవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కట్నం కావాలని కూడా వేధిస్తున్నారని, హత్య చేస్తామని బెదిరిస్తున్నారని భర్త, అతని తల్లిదండ్రుల మీద ఆరోపించింది. వివరాలు... ఇద్దరూ కూడా టీవీ, సినీ రంగంలో రాణించాలని పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయం కాగా, టీవీల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఒకరోజు కలుద్దామని సూచించాడు. సరేనని ఆమె ఇంటికి ఆహ్వానించగా, లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనేకసార్లు వాంఛలు తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని అడగడంతో అప్పటినుంచి దూరంగా ఉండసాగాడు. ఎంతో ఒత్తిడి చేసి స్నేహితులతో ఒప్పించడంతో గుడిలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. అత్తవారింటికి తీసుకెళ్లిన తరువాత.. బలవంతంగా తాళి కట్టానని భర్త చెప్పుకున్నాడు. ఆరోజు నుంచి గొడవలు జరుగుతున్నాయని, కట్నం తేవాలని ఒత్తిడి చేస్తూ కులం పేరుతో దూషిస్తున్నాడని వాపోయింది. తాను తీవ్ర అనారోగ్యం పాలై ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిపింది. పోలీసులు ఇద్దరి నుంచీ సమాచారం సేకరించి దర్యాప్తు చేపట్టారు. -
అత్తారింటికి రమ్మంటే .. భర్తపై వేధింపుల కేసు.. చివరకు..
సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్): వరకట్నం, వేధింపుల కింద భార్య తనపై కేసు పెట్టడంతో మనస్తాపానికి గురైన భర్త రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జడ్చర్లలో మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ కథనం ప్రకారం.. జడ్చర్లలోని వెంకటరమణ కాలనీకి చెందిన ఉదయ్‌కుమార్(30)కు హైదరాబాద్‌లోని లింగంపల్లికి చెందిన అమ్మాయితో 11నెలల కిందట వివాహమైంది. అయితే హైదరాబాద్‌లో ఉన్న తన భార్యను జడ్చర్లకు రావాల్సిందిగా కోరడంతో ఆమె నిరాకరించింది. దీంతో భార్యతో గొడవపడ్డాడు. జడ్చర్లకు వచ్చేసిన అనంతరం భార్య హైదరాబాద్‌లోని పోలీస్‌స్టేషన్‌లో వరకట్నం, తదితర వేధింపులకు సంబందించి భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఉదయ్‌కుమార్‌ను అక్కడికి పిలిపించి విచారించారు. మంగళవారం మరోసారి స్టేషన్‌కు రావాలని, కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుందని పోలీసులు చెప్పి పంపారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఉదయ్‌కుమార్ హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వచ్చి, పట్టణ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి పెద్దఅంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు. -
రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం.. బంగారం ఇవ్వడం ఆలస్యమైందని
సాక్షి, అనంతగిరి(రంగారెడ్డి): మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లికి చెందిన ఊరడి మమత(21) స్థానిక రామయ్యగూడకు చెందిన నవీన్ రెండేళ్ల క్రితం పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో 3 తులాల బంగారం పెడతామని మమత తండ్రి భాగయ్య హామీ ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత ఇస్తామని చెప్పాడు. భాగయ్య ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. కూతురికి బంగారం ఇవ్వడంలో ఆలస్యమైంది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన మమత బంగారం విషయమై తల్లిదండ్రులను అడిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, కొన్నిరోజుల తర్వాత ఇస్తామని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఈనెల 15న మధ్యాహ్నం గుళికల(తిమ్మెట) మందు మింగింది. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఉస్మానియాకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మమత సోమవారం రాత్రి 10గంటలకు చనిపోయింది. వికారాబాద్ తహసీల్దార్ రవీందర్ శవ పంచనామా చేశారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలి భర్త నవీన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: యజమాని షాక్.. నగల దుకాణం గోడకు కన్నం.. -
స్పందన కార్యక్రమం: పుట్టిన బిడ్డ తనది కాదంటున్నాడయ్యా !
కోనేరుసెంటర్: ప్రతిరోజు స్పందనలో వచ్చిన అర్జీలను చట్టపరిధిలో విచారణ జరిపించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రతిరోజు స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా పోలీసులను ఆశ్రయించవచ్చనన్నారు. సమస్య తీవ్రతను బట్టి పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుడివాడకు చెందిన ఓ మహిళ తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని అధిక కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. తనకు కలిగిన బిడ్డ కూడా తనది కాదంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. భర్తపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ విన్నవించింది. బాధితురాలి ఆవేదన ఆలకించిన ఎస్పీ గుడివాడ సీఐకు ఫిర్యాదును బదిలీ చేసి ఆమెకు తక్షణమే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ఫింగర్ ప్రింట్స్ సమస్య.. తక్షణమే స్పందించిన గుంటూరు కలెక్టర్ మీరే మాకు కళ్లు, చెవులు.. మీరే మా బలం: సీఎం జగన్ -
బెడ్రూమ్లోకి వెళ్తే వద్దంటుండు: భర్తపై భార్య ఫిర్యాదు
అహ్మదాబాద్: పెళ్లయిన పది రోజులు బాగానే ఉన్నాడు.. ఆ తర్వాత భర్తలో అనూహ్య మార్పులు. అత్తింటికి వెళ్లిన అమ్మాయికి పక్షం రోజుల్లోనే నరకం కనపడింది. అదనపు కట్నం తీసుకురావాలని భర్తతో పాటు అత్తామామ కూడా వేధింపులకు పాల్పడుతున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి సర్దుకుపోదామని భార్య కలుద్దామని వెళ్తే భర్త చీత్కరిస్తున్నాడు. బెడ్రూమ్లో కూడా సక్రమంగా ఉండడం లేడు. మరోసారి అడగ్గా అతడు భార్యను చితకబాదిన సంఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: ఏసీ హాల్లో ఎందుకు? గ్రౌండ్లో కూడా పెళ్లి చేసుకోండి అహ్మదాబాద్‌కు చెందిన యువతికి ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన వివాహమైంది. పెళ్లయిన పది రోజులకు కట్నం తీసుకురావడం లేదని వేధింపులు మొదలుపెట్టారు. వాటిని భరిస్తూ భర్తతోనే ఉండాలని భావించిన ఆ మహిళ బెడ్రూమ్లోనైనా సక్రమంగా ఉంటాడంటే అదీ లేదు. కోరి కోరి వస్తే కూడా చీత్కరిస్తున్నాడు. ఆ విషయానికి వచ్చేసరికి కోపంతో దాడి చేస్తున్నాడు. ఇక వద్దని బెడ్రూమ్లో వదిలేసి బయటకు వెళ్లేవాడు. చదవండి: బీజేపీ సరికొత్త ప్రయోగం.. వారికి నో ఛాన్స్ ‘నువ్వు అందంగా లేవు’ అని చెప్పి వివాహేతర సంబంధం ఏర్పరచుకుంటానని చెప్పినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో వాపోయింది. ఈ వేధింపులు తాళలేక ఆమె ఆగస్టు 1వ తేదీన పుట్టింటికి వచ్చింది. అయితే పెద్దలు కల్పించుకుని మళ్లీ అత్తింటికి పంపించారు. అయినా కూడా వారిలో మార్పురాలేదు. దీంతో ఆగస్టు 8వ తేదీన పుట్టింట్లో వదిలేశారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గృహహింస చట్టం కింద కేసు నమోదు చేయించింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. -
Karimnagar: అత్తగారింట్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
సాక్షి, కోరుట్ల(కరీంనగర్): ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన అత్తగారింట్లో ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. జిల్లాలోని మెట్పల్లి పట్టణానికి చెందిన ఆడెపు సాయిలక్ష్మి(28)కి పద్నాలుగు నెలల క్రితం కోరుట్లలోని గాం««ధీరోడ్డులో నివాసం ఉండే కొండబత్తిని రామకృష్ణతో వివాహం జరిపించారు. భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఇద్దరూ హోం టు వర్క్ కింద కోరుట్లలోని తమ ఇంట్లో నుంచే పనిచేస్తున్నారు. సాయిలక్ష్మీ ఇటీవల ఉద్యోగం మానేసింది. మరో జాబ్ కోసం ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో విజయవాడలోని ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంట్లో ఎవరూలేని సమయంలో సాయిలక్ష్మీ తనగదిలోకి వెళ్లి లోపల గొళ్లెం పెట్టి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కొంతసేపటికి భర్త రామకృష్ణ వచ్చి సాయిలక్ష్మీ ఆత్మహత్య విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గొళ్లెం తొలగించి గదిలోకి వెళ్లి మృతదేహాన్ని కిందికి దించారు. తహసీల్దార్ సత్యనారాయణ వివరాలు సేకరించారు. అయితే, తమ కూతురు సాయిలక్ష్మీని ఉద్యోగం చేయాలని, అదనంగా కట్నం తేవాలని అత్తింటివారు వేధించారని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆడెపు సత్యనారాయణ–జయలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. చదవండి: YSR Kadapa: ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం -
వ్యాన్ డ్రైవర్‌తో జూనియర్ లెక్చరర్ ప్రేమ పెళ్లి, చివరకు..
సాక్షి, నెల్లూరు (క్రైమ్): ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాది గడవకముందే అత్తింటి వేధింపులకు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్ చర్చి వీధిలో చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఉలవడపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన జె.లక్ష్మికి మానస (28), మౌనిక, మహేంద్ర ముగ్గురు పిల్లలు. ఆమె కూలి పనులు చేసుకుంటూ పిల్లలను ఉన్నత చదువులు చదివించింది. పెద్ద కుమార్తె మానస పద్మావతి విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ధనలక్ష్మిపురంలోని నారాయణ విద్యా సంస్థలో జూనియర్ లెక్చరర్‌గా చేరారు. నెల్లూరు రూరల్ మండలం మాదరాజగూడూరుకు చెందిన మానికల చినబాబు అక్కడే వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మానస, చినబాబు నడమ ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఏడాది కిందట వీరు వివాహం చేసుకున్నారు. మాదరాజగూడూరులో కాపురం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మానస తల్లి మాదరాజ గూడూరు చేరుకుని తన కుమార్తెను బాగా చూసుకోమని అల్లుడు చినబాబుకు విన్నవించి వెళ్లింది. వివాహమైన కొంతకాలం నుంచే అత్తింటి వారు కట్నం కోసం ఆమెను వేధించడం ప్రారంభించారు. భర్త సైతం వారికి వత్తాసు పలకడంతో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. కొద్ది నెలల అనంతరం చినబాబు, మానస నెల్లూరు రామ్‌నగర్‌కు మకాం మార్చారు. రెండు నెలల కిందట అక్కడి నుంచి ఎన్టీఆర్ నగర్ చర్చి వీధిలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. మానస తన ఉద్యోగాన్ని మానేసి ఏపీ సెట్‌కు సిద్ధమవుతోంది. చినబాబు యాక్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల రెండో తేదీ సాయంత్రం దంపతుల నడుమ చిన్నపాటి ఘర్షణ జరిగింది. చినబాబు ఇంటి వెనుక వైపునున్న గదిలో ఉండగా మానస తన గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపు తర్వాత చినబాబు తలుపులు తట్టినా తీయకపోవడంతో కిటీకీలో నుంచి చూడగా మానస ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికులతో కలిసి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా అప్పటికే మానస మృతి చెంది ఉంది. ఈ విషయంపై స్థానికులు గురువారం అర్ధరాత్రి బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం మానస తల్లి నెల్లూరుకు చేరుకుని కన్నీటి పర్యంతమైంది. బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి.మంగారావు తన సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. తహసీల్దార్ వచ్చి మృతదేహానికి శవపంచనామా చేశారు. భర్త, అత్తమామ, ఆడబిడ్డలు తన కుమార్తె మృతికి కారణమని మానస తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతురాలి భర్త, అత్తింటి వారిపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం జీజీహెచ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ మంగారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బైక్ పైన రాలేదని భార్య గొంతుకొసిన భర్త.. -
మంత్రి వేముల పీఆర్వోపై కేసు
-
భార్యపై మంత్రి వేముల పీఆర్వో దాడి.. కేసు నమోదు, వీడియో వైరల్
మంథని(పెద్దపల్లి జిల్లా): భార్యాభర్తల వివాదంలో వ్యవసాయ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పీఆర్ఓగా చెప్పుకుంటున్న తోట శ్రీకాంత్‌పై మంథని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మంథని ఎస్సై చంద్రకుమార్ వివరాల ప్రకారం.. మంథని మండలం గాజులపల్లికి చెందిన కోమలతతో కాల్వశ్రీరాంపూర్ మండలం ఎదులాపూర్‌కు చెందిన శ్రీకాంత్‌తో వివాహమైంది. రెండేళ్లుగా శ్రీకాంత్ కోమలతను కాపురానికి తీసుకెళ్లడం లేదు. ఆదివారం ఎదులాపూర్‌లో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరగాల్సి ఉంది. కోమలత గ్రామ çసర్పంచ్ వద్దకు పిలిపిస్తే శ్రీకాంత్ రాలేదు. భర్తతో కలిసి వెళ్లేందుకు కోమలత సిద్ధంకాగా ఇద్దరిమధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రీకాంత్ కోమలతపై చేయి చేసుకున్నాడు. కోమలత మంథని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శ్రీకాంత్‌పై ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇవీ చదవండి: అదృష్టం వీరికి పిల్లి రూపంలో వచ్చింది ! పగలంతా పెద్ద మనుషులు, రాత్రి అయితే..? -
అదనపు కట్నం కోసం వేధింపులు.. ఎనిమిది నెలల నిండు గర్భిణి పై..
అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు భరించలేక ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన ఎనిమిది నెలలకే మరో వివాహిత తనువు చాలించింది. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబుతుండగా.. అత్తింటివారు హత్య చేశారని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కారణాలేవైనా ఇద్దరు గర్భిణులు ఆత్మ హత్య చేసుకోవడం స్థానికులను కలిచివేసింది. సాక్షి, భీమారం(ఆదిలాబాద్): అత్తింటి వేధింపు తాళలేక మండలంలోని నర్సింగాపూర్(బి) గ్రామానికి చెందిన ఎనిమిది నెలల గర్భిణి దుర్గం రమ్య (20) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. జైపూర్ ఏసీపీ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూర్ మండలం ఓత్కులపల్లి గ్రామానికి చెందిన జుమ్మడి లక్ష్మి, రాజలింగు దంపతుల కుమార్తె రమ్యకు 2020 జూన్ 26న భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన దుర్గం రాజ శేఖర్‌తో వివాహం జరిగింది. ఆ సమయంలో ఒప్పుకున్న ప్రకారం కట్నంతోపాటు 10 గుంటల భూమి ఇచ్చారు. ఆ భూమి అమ్మి డబ్బులు తీసుకురావాలని భర్తతోపాటు అత్తమామలు రమ్యపై ఒత్తిడి తెస్తున్నారు. మరో రూ.50వేలు అదనపు కట్నం తీసుకురావాలని బెదిరింపులకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు పేదవారు కావడంతో అదనపు కట్నం తెచ్చేందుకు ఆమె నిరాకరించడంతో గర్భిణి అని కనికరం చూపకుండా శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో వేధింపులు తాళలేక రమ్య శుక్రవారం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం భీమారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ రమ్య మృతిచెందినట్లు ఏసీపీ నరేందర్ తెలిపారు. మృతురాలి భర్త రాజశేఖర్, అత్తమామలు శశక్క, భూమన్న, మరిది రాకేశ్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితులందరూ పరారీలో ఉన్నారని అన్నారు. చదవండి: పెళ్లయిన ఎనిమిది నెలలకే అఘాయిత్యం -
నవ వధువు ఆత్మహత్య
ముదిగుబ్బ: అదనపు కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే అర్ధాంతరంగా తనువు చాలించింది. పోలీసులు తెలిపిన మేరకు...ముదిగుబ్బ మండలం మల్లమకొట్టాలకు చెందిన శ్రీరాములు, సరళమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. డిగ్రీ వరకు చదువుకున్న పెద్ద కుమార్తె సాదిక (20)కు మూడు నెలల క్రితం బుక్కపట్నం మండలం కృష్ణాపురం నివాసి కేశవతో వివాహమైంది. పెళ్లి సమయంలో 12 తులాల బంగారు నగలు, రూ.5 లక్షలు వరకట్నం కింద ఇచ్చారు. కదిరిలోని ఎస్బీఐ (యోగి వేమన)లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కేశవ.. తన భార్యను కృష్ణాపురంలో తల్లిదండ్రుల వద్ద ఉంచి, వారానికి ఒకసారి మాత్రమే వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో అదనపు కట్నం కింద మూడు తులాల బంగారు నగలు, డబ్బు తీసుకురావాలంటూ అత్త కొండమ్మ, ఆడపడచు, ఆమె భర్తతో పాటు కేశవ కూడా వేధించేవాడంటూ తల్లిదండ్రులకు సాదిక ఫోన్ చేసి చెప్పింది. చదవండి: వ్యాపారి హత్య కేసులో కోగంటి సత్యంకు రిమాండ్ ఈ నెల 22న ఆదివారం సెలవు కావడంతో కేశవ.. కృష్ణాపురం వెళ్లాడు. ఆ సమయంలో అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను కొట్టి పుట్టింటికి పంపాడు. మంగళవారం ఉదయం సాదిక తమ పొలానికి వెళ్లి, తండ్రి శ్రీరాములుకు ఫోన్ చేసింది. తన భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేకపోతున్నానని, జీవితంపై విరక్తితో బావిలో దూకి చనిపోతున్నట్లు చెప్పింది. తండ్రి వారిస్తున్నా వినలేదు. దీంతో అతను వెంటనే పొలంలోని వ్యవసాయ బావి వద్దకు చేరుకున్నాడు. అప్పటికే బావిలో సాదిక మృతదేహం తేలియాడుతోంది. సమాచారం అందుకున్న పట్నం ఎస్ఐ సాగర్, సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. సంఘటనా స్థలాన్ని కదిరి ఇన్చార్జి డీఎస్పీ ప్రసాదరెడ్డి, నల్లమాడ సీఐ యల్లమరాజు, తహసీల్దార్ కరుణాకర్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ ప్రసాదరెడ్డి తెలిపారు. చదవండి: మైనర్ బాలిక కిడ్నాప్.. నోటిలో గుడ్డలు కుక్కి .. -
భర్త దాష్టీకం.. భార్యపై మరుగుతున్న వేడినీళ్లు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మగబిడ్డకు జన్మనివ్వలేదని ఆమెపై మరుగుతున్న వేడినీళ్లు పోశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘సత్యపాల్ అనే వ్యక్తి సంజు(32) అనే మహిళను 2013లో వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు. కాగా చిన్న అమ్మాయి గత సంత్సరం జన్మించింది. ఆ తర్వాత నుంచి సంజూను ఆమె భర్త వేధించేవాడు. అయితే గత కొంత కాలంగా సత్యపాల్ తన భార్య సంజును కట్నం కింద అదనంగా రూ.50 వేలు తీసుకురావాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు. చదవండి: కదులుతున్న కారులో మహిళపై అత్యాచారం అన్నం కూడా పెట్టకుండా హింసిస్తున్నాడు. ఈ ఘటనపై ఇరుకుటుంబాలు పలుమార్లు చర్చించినా నిందితుడు ఖాతరు చేయలేదు. దీనిపై బాధిత మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.’’ అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ బాజ్‌పాయ్ తెలిపారు. కాగా నిందితుడు సత్యపాల్ ఆగష్టు 13న భార్య సంజూపై వేడి నీళ్లు పోసి పరారయ్యాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: Bullet Bandi Song: హుషారుగా డ్యాన్స్.. బెడిసి కొట్టిన బుల్లెట్టు బండి.. వైరల్ వీడియో -
వరకట్న వేధింపులు.. కటక్ ఎంపీపై కోడలు ఫిర్యాదు
భువనేశ్వర్: కటక్ ఎంపీ భర్తృహరి మెహతాబ్‌కి వ్యతిరేకంగా ఆయన కోడలు ఫిర్యాదు చేసింది. ఎంపీతో పాటు ఆయన భార్య మహాశ్వేతా దేవి, కుమారుడు లోక్‌రంజన్ మెహతాబ్ వరకట్న వేధింపులకు పాల్పడుతున్నట్లు భోపాల్ మహిళా పోలీస్ ఠాణాలో గురువారం ఫిర్యాదు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎంపీ కుటుంబ సభ్యులకు తాఖీదులు జారీ చేశారు. 2016 డిసెంబర్ 12న ఎంపీ కుమారుడు లోక్‌రంజన్ మెహతాబ్, భోపాల్‌కి చెందిన సాక్షితో వివాహం జరిగింది. వరకట్న వేధింపులు తాళలేక 2018లో సాక్షి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం న్యూఢిల్లీలోని ఇంట్లో ఉండేందుకు సాక్షిని అనుమతించాలని ప్రత్యర్థులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మెట్టినింటిలో ఉండేందుకు సాక్షి చేసిన ప్రయత్నాలు నిర్వీర్యం కావడంతో భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
దారుణం: వంట చేస్తున్న భార్యపై డీజిల్ పోసిన భర్త
సాక్షి, కొత్తకోట(మహబూబ్‌నగర్): వంట చేస్తున్న భార్యపై భర్త డీజిల్ పోయడంతో మంటలు అంటుకుని భార్య తీవ్రంగా గాయపడింది. అనంతరం చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ సంఘటన బుధవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయిపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు కథనం ప్రకారం... మండలంలోని చిలకటోనిపల్లికి చెందిన రాధిక(20)ను ఏడాది క్రితం వీరాయిపల్లి గ్రామానికి చెందన రమేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి కట్నంగా రూ.50వేలు రెండున్నర తులాల బంగారు కుదుర్చుకున్నారు. పెళ్లిరోజు కట్నం డబ్బులు రూ.50వేలు మాత్రమే రమేష్‌కు ఇచ్చారు. దీంతో కొంతకాలంగా బంగారం తేవాలని రాధికపై ఒత్తిడి తేవడం, అదనంగా కట్నం కావాలని ఇబ్బందిపెట్టేవాడు. మంగళవారం రాత్రి రాధిక ఇంటిముందు కట్టెల పొయ్యిమీద వంట చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రమేష్ కోపోద్రిక్తుడై ఇంట్లో ఉన్న డీజిల్ డబ్బాను తెచ్చి ఒక్కసారిగా రాధిక ఒంటిపై పోశాడు. పక్కనే ఉన్న మంట అంటుకుంది. తాళలేని ఆమె అరుపులు, కేకలు విన్న చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న రాధికను వెంటనే వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సీహెచ్ రాజు ఆస్పత్రికి వెళ్లి రాధికతో వాంగ్మూలం తీసుకున్నారు. ఈ మేరకు హత్యాయత్నం, గృహహింస, వరకట్నం వేధింపుల చట్టం కింద భర్తపై కేసు నమోదు చేశామన్నారు. వీరికి రెండు నెలలబాబు ఉన్నాడని ఎస్ఐ తెలిపారు. -
కట్నంకోసం, నడివీధిలో అమానుషం: షాకింగ్
లక్నో: వరకట్నం నిషేధంపై ఎన్నిచట్టాలు వచ్చినా, వరకట్న వేధింపులు, హత్యలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నంకోసం భార్యను అమానుషంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ వీధుల్లో ఆదివారం పట్టపగలు ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ దారుణాన్ని అడ్డుకోవాల్సిన కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. సుర్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని తుంద్వాల్ గ్రామానికి చెందిన సరస్వతిగా బాధితురాలిని గుర్తించారు. నిందితుడు భర్త మనోజ్‌గా గుర్తించారు. కేవలం తను అడిగిన గేదె, బంగారు గొలుసు తేలేదన్న ఆగ్రహంతో భార్య సరస్వతిని దారుణంగా కొట్టడం ప్రారంభించాడు. పదే పదే తలను నేలకేసి కొట్టాడు. అయినా అతని ఉన్మాదం చల్లారలేదు. ఆ తర్వాత ఆమెను గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించాడని హర్దోయ్ పోలీసులు తెలిపారు. చివరకు స్థానికులు జోక్యం చేసుకుని ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది. క్రూరమైన దాడి వీడియోను చూసిన తర్వాత బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల గేదె, బంగారు గొలుసు కావాలంటూ తన బిడ్డను వేధిస్తున్నాడని తండ్రి వాపోయాడు. అంతేకాదు కోరిక తీర్చకపోతే తీవ్ర పరిణామాలుంటాయంటూ గత వారం రోజులుగా తమని బెదిరించాడని కూడా బాధితురాలి తండ్రి కన్నీరు పెట్టుకున్నారు. 2011లో సరస్వతి మనోజ్ వివాహం చేశామని, మొదట్టో కొన్ని నెలలు బాగున్నారని తెలిపారు. దాదాపు ఆరు నెలల తర్వాత, కట్నం కోసం మానసికంగా, శారీరక హింసకు పాల్పడ్డాడని తెలిపారు. ఇంతకుముందు పలుసార్లు అల్లుడి డిమాండ్లను నెరవేర్చామని, ఇంతలోనే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నాడంటూ రోదించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు నిమిత్తం టీమ్ ఏర్పాటు చేశామనీ, నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నామని సిటీ సర్కిల్ ఆఫీసర్ వికాష్ జైస్వాల్ తెలిపారు. -
లేడీ మోడల్స్‌ని అలా చూపించొద్దు: గవర్నర్
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ శుక్రవారం సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఆభరణాల కంపెనీలు తమ ప్రకటనల్లో మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలుగా చూపించవద్దని సూచించారు. కేరళలో కొన్ని రోజుల క్రితం వెలుగు చూసిన వరకట్న బాధితురాలి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు వెలుగు చూడటం పట్ల ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ ఘటన అనంతరం కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా ఒకరోజు ఉపవాస దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొచ్చిలోని కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ ఏడవ కాన్వొకేషన్ వేడుకకు గవర్నర్ ఆరిఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆభరణాల ప్రకటనల్లో.. మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలా చూపించకూడదు. దీని వల్ల జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ఆభరణాల ప్రకటనల్లో మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలుగా కాకుండా వేరే విధంగా చూపించాలి. ఇలాంటి యాడ్స్‌లో పెళ్లి కుమార్తె ఒంటి నిండ బంగారు ఆభరాణాలు వేసి.. చూపిస్తారు. దాంతో జనాలు పెళ్లి కుమార్తె అంటే ఇంతే అట్టహసంగా.. భారీగా నగలు ధరించాలని భావించే ప్రమాదం ఉంది. కనుక బంగారు ఆభరణాల ప్రకటనల్లో మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలుగా చూపించకండి’’ అని కోరారు. ఇక కాన్వొకేషన్ కార్యక్రమంలో విద్యార్థుల చేత కట్నం తీసుకోము.. ఇవ్వము అని అండర్‌టేకింగ్ తీసుకున్నారు ఆరిఫ్. అంతేకాక విద్యార్థులు కాలేజీలో చేరిన సమయంలోనే వారి వద్ద నుంచి కట్నం ఇవ్వం, తీసుకోం అని బాండ్ తీసుకోవాలన్నారు. మన సమాజంలో వరకట్న దురాచారం బలంగా పెనవేసుకుపోయిందని.. దాన్ని తొలగించడానికి కఠిన చట్టాలతో పాటు జనాల్లో అవగాహన కూడా రావాలన్నారు ఆరిఫ్. -
ఆడపిల్ల పుట్టిందని ఇంట్లోకి రానివ్వని భర్త
సాక్షి,నర్సీపట్నం: ఆడపిల్ల పుట్టిందని భార్యను ఇంట్లోకి రానివ్వకుండా తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో చేసేది లేక పార్వతి అనే మహిళ నర్సీపట్నం మున్సిపాలిటీ పెద బొడ్డేపల్లిలోని తన అత్తవారి ఇంటి వద్ద బుధవారం బైఠాయించింది. ఆమె కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రావికమతం గ్రామానికి చెందిన టి.పార్వతికి నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లికి చెందిన రామకృష్ణతో 2019 మార్చిలో వివాహం జరిగింది. రూ.12 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. రామకృష్ణ విశాఖలో వార్డు సచివాలయం సెక్రటరీగా పని చేస్తున్నాడు. పాప పుట్టి ఏడాదిన్నర అవుతున్నా కాపురానికి తీసుకురాకుండా అత్త, మామలు అడ్డుపడుతున్నారు. ఆడపిల్లల పుట్టిందని, తల్లిపేరు మీద ఉన్న భూమి రాయించుకు రాలేదని కాపురానికి తీసుకురాలేదని పార్వతి తెలిపింది. నెల రోజుల్లో కాపురానికి తీసుకెళ్తానని రావికమతం పోలీసు స్టేషన్లో అంగీకరించిన భర్త ఆ తరువాత పట్టించుకోలేదని వాపోయింది. దీంతో మానసిక వేదనతో తన తల్లి ఇటీవల మృతి చెందిందని, తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తోబుట్టువు వద్ద తలదాచుకుంటున్నానని ఆమె చెప్పింది. బంధువులను వెంట పెట్టుకుని భర్త ఇంటికి వచ్చానని, ఇంటి వద్ద ఉన్న అత్త, మామలు తనను లోపలికి రానివ్వకుండా తలుపులు వేసుకుని బయటకు వెళ్లిపోయారని తెలిపింది. దీంతో న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించినట్టు చెప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు, భర్త తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు పిలిపించిన టౌన్ ఎస్ఐ లక్ష్మణ్‌రావు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
ప్రేమవివాహం.. భార్య గర్భవతి అని కూడా చూడకుండా..
చెన్నై: తమిళనాడులో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎన్నో ఆశలతో తన మనస్సుకి నచ్చిన వ్యక్తితో యువతి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో భర్త, అత్తింటి వారు అదనపు కట్నం తేవాలని వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ యువతి .. ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మధురై జిల్లాలో 19 ఏళ్ల పండిశ్వరి అనే యువతి, తంగరాజ్ అనే వ్యక్తిని ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో...పండిశ్వరి గర్భం దాల్చింది. గత కొన్ని రోజులుగా భర్త , అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించసాగారు. ప్రతిరోజు ఆమెను మానసికంగా, చిత్రహింసలకు గురిచేశారు. భర్త వేధింపులకు తట్టుకోలేక పండిశ్వరి తన తండ్రి వెల్లైస్వామికి విషయాన్ని తెలిపింది. దీంతో యువతి తండ్రి భర్తకు సర్దుబాటు చెప్పడానికి ఆమె ఇంటికి చేరుకున్నాడు. కాగా, యువతి తీవ్రమైన మనస్తాపంతో గత శనివారం (ఆగస్టు7)న కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమెను వెంటనే స్థానిక రాజాజీ ఆసుపత్రికి తరలించారు. ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. అయితే, ఆమె శరీరం వైద్యానికి స్పందించట్లేదని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె గత సోమవారం అర్దరాత్రి మృతి చెందింది. కాగా, బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అల్లుడు, అతని కుటుంబ సభ్యులపై కేసును నమోదుచేశారు. కాగా, నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు మధురై పోలీసులు తెలిపారు. -
వరకట్న హత్యలు: జాగ్రత్త... ఉద్యోగం ఊడుతుంది
ప్రభుత్వం గట్టిగా సంకేతం ఇస్తే ప్రమాదం తలపెట్టేవారు దారికొస్తారు. కేరళ ప్రభుత్వం వరకట్న హత్యల పట్ల చాలా కఠినంగా ఉంది. కొన్నాళ్ల క్రితం సంచనం సృష్టించిన ఆయుర్వేద వైదుర్యాలు విస్మయ మరణంపై విచారణ జరిపిన కేరళ ప్రభుత్వం భర్తను ఉద్యోగం నుంచి తొలగించింది. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్‌గా ఉన్నందుకు అతడు అధిక కట్నం ఆశించాడు. నేడు ఆ ఉద్యోగం పోయింది. ప్రభుత్వం పెన్షన్ కూడా ఇవ్వనని తేల్చి చెప్పింది. అధికారులూ జాగ్రత్త అని హెచ్చరించింది. ఇరవై నాలుగేళ్ల ఆయుర్వేద డాక్టర్ విస్మయ. కేరళలోని కొళ్లం ఆమెది. తల్లిదండ్రులు ఎంతో అపురూపంగా పెంచుకుని మంచి సంబంధం అని కొళ్లంలోని రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్‌లో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న కిరణ్ కుమార్‌కు ఇచ్చి 2020లో పెళ్లి చేశారు. కాని పెళ్లయిన కొన్నాళ్లకే ఇచ్చిన 10 లక్షలు చాలవని ఇంకో పది లక్షలకు వేధించడం మొదలెట్టాడు కిరణ్. కారు ఇస్తే లగ్జరీ కారు ఇవ్వలేదని పేచీ పెట్టాడు. ఆమెను భౌతికంగా గాయపరిచే స్థాయికి వెళ్లాడు. ఇవన్నీ విస్మయ తల్లిదండ్రులకు చెప్పింది. కొన్నాళ్లకు వాళ్ల దగ్గరికే వచ్చి ఉండిపోయింది. మళ్లీ ‘లోకం ఏమనుకుంటుంది’ అనే భయంతో భర్త దగ్గరకు వెళ్లింది. జూన్ 21న ఆమె ఉరి పోసుకొని కనిపించింది. దీనిపై కేరళ అట్టుడికింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెంటనే ఇలాంటివి సహించేది లేదని చెప్పారు. మరోవైపు కిరణ్ పని చేస్తున్న ట్రాన్స్పోర్ట్ శాఖ మరుసటి రోజే అతణ్ణి సస్పెండ్ చేసి మెమో ఇచ్చింది. అంతర్గత విచారణకు ఒక సీనియర్ ఆఫీసర్‌ను నియమించి 45 రోజుల గడువు ఇచ్చింది. కేరళ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనల ప్రకారం కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండూ కాండక్ట్ అతిక్రమణ కిందకు వస్తాయి. విచారణ చేసిన సీనియర్ అధికారి కిరణ్ వాట్సప్ సందేశాలు, ఇతర ఆధారాల ప్రకారం కట్నం కోసం భార్యను వేధించినట్టు తేల్చాడు. నివేదిక వచ్చిన వెంటనే కిరణ్‌ను ప్రభుత్వం ఉద్యోగం నుంచి ఊడబెరికింది. వరకట్నం కేసుల్లో ప్రభుత్వం ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమం. కేరళ ట్రాన్స్పోర్ట్ మంత్రి ఆంటోని రాజు ఒక ప్రకటన చేస్తూ ‘పోలీసు విచారణతో సంబంధం లేకుండానే శాఖాపరమైన ఎంక్వయిరీలో ఈ నిర్ణయం తీసుకున్నాం. కిరణ్ పెన్షన్‌కు అప్లై చేయడానికి కూడా వీలు లేదు. పెన్షన్ ఇవ్వం. అలాగే ఇక మీద అతడు ఏ విధమైన ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అనర్హుడు’ అన్నారు. అంతేకాదు ‘ప్రభుత్వ ఉద్యోగులూ... బహుపరాక్. ఇది ఒక హెచ్చరిక అని తలవండి. వరకట్నం గురించి ఎవరు వేధించినా వారిపై ఇదే చర్య ఉంటుంది’ అన్నారు. కిరణ్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. డిక్లరేషన్ ఇవ్వాలి కేరళ ప్రభుత్వం వరకట్న హత్యల నేపథ్యంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను వరకట్న నిరోధక ప్రధాన అధికారిగా కూడా నియమించింది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులు తమ పెళ్లయిన నెలరోజుల లోపు ‘వరకట్నం తీసుకోలేదు, తీసుకోబోము’ అని తప్పక డిక్లరేషన్ ఇవ్వాలని సర్క్యులర్ పంపింది. దాని మీద వధువు, వధువు తండ్రి, వరుడి తండ్రి కూడా సంతకం పెట్టాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం ప్రతి ఏటా ఇకపై నవంబర్ 26ను ‘వరకట్న వ్యతిరేక దినోత్సవం’గా నిర్వహించనుంది. ఆ రోజున అన్ని స్కూళ్లు, కాలేజీలలో వరకట్న వ్యతిరేక ప్రతిజ్ఞను చేయాలి. వరకట్నం ఒక అనాగరిక చర్య. అది లేని సమాజం కోసం కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందరూ గమనించవలసినవి. -
విస్మయను బలిగొన్న కిరణ్‌కు తగిన శాస్తి.. అయినా సరిపోదు
తిరువనంతపురం: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన విస్మయ మృతి కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త ఎస్. కిరణ్ కుమార్‌కు కేరళ సర్కారు షాకిచ్చింది. అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా కొల్లాం జిల్లాకు చెందిన కిరణ్ కుమార్(30), కడక్కల్‌లోని కైతోడ్ నివాసి అయిన విస్మయ వి నాయర్(23)కు గతేడాది పెద్దలు వివాహం చేశారు. మోటార్ వెహికిల్స్ ఇన్స్పెక్టర్ అయిన కిరణ్‌కు పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చారు విస్మయ తల్లిదండ్రులు. 800 గ్రాముల బంగారం, సుమారు ఒక ఎకరం భూమి, ఖరీదైన కారు ముట్టజెప్పారు. అయితే, పెళ్లైన కొన్నాళ్లకే అదనపు కట్నం కోసం కిరణ్ విస్మయను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. కొత్త కారు, ఇంకొంత నగదు కావాలంటూ శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన పుట్టింటి వాళ్లకు పంపిన విస్మయ, ఈ ఏడాది జూన్‌లో వాష్‌రూంలో విగతజీవిగా కనబడింది. దీంతో అత్తింటి వాళ్లే ఆమెను హతమార్చారని తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా విస్మయ మృతి కేసుతో కేరళలో ఒక్కసారిగా ప్రకంపనలు చెలరేగాయి. సోషల్ మీడియాలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. వరకట్న పిశాచికి వ్యతిరేకంగా మరోసారి ఉద్యమాలు ఉధృతమయ్యాయి. అదే విధంగా విస్మయను బలిగొన్న కిరణ్‌కు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పోలీసులు అతడిని అరెస్టు చేయగా.. ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా కిరణ్‌కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కేరళ రవాణా శాఖా మంత్రి ఆంటోనీ రాజు వెల్లడించారు. ‘‘విస్మయ మృతి కేసులో అరెస్టైన కిరణ్ కుమార్‌పై విచారణకు ప్రభుత్వ విభాగానికి 45 రోజుల పాటు గడువు విధించాం. శుక్రవారం నాటితో అది పూర్తయింది. పోలీసులు సేకరించిన వివరాలు, కిరణ్ వాంగ్మూలం, మిగతా ఆధారాలు అన్నీ.. అతడు సర్వీసు నిబంధనలు ఉల్లంఘించాడని నిరూపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగం నుంచి తీసేశాం’’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో విస్మయను అన్యాయంగా పొట్టనబెట్టుకున్న కిరణ్ కుమార్‌కు తగిన శాస్తి అయ్యిందని, అయితే అతడికి మరింత కఠినమైన శిక్ష పడితేనే ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Savita Punia: ఏడవద్దు.. తలెత్తుకో.. చేయగలిగిందంతా చేశావు! -
‘నీ ఫ్రెండ్స్‌కు చెప్పాలనుకున్నా.. నీ పరువు పోతుందని చెప్పలేదు’
కిరణ్.. నా జీవితంలోకి ఎందుకొచ్చావ్. నిన్ను చేసుకోకముందు సంతోషంగా ఉండేదాన్ని. పెళ్లయ్యాక మనస్ఫూర్తిగా నవ్విన రోజు కూడా గుర్తులేదు. నువ్వు ఎన్నిసార్లు వేధింపులకు గురి చేసినా మావాళ్లకు చెప్పలేదు. నీ ఫ్రెండ్స్‌కు చెప్పాలనుకున్నా.. కానీ, నీ పరువు పోతుందని చెప్పలేదు. – సూసైడ్ నోట్లో వెన్నెల చెన్నూర్: జీవితంపై ఎన్నో ఆశలు.. ఉన్నత చదువులు చదవాలన్న ఆశయం.. ఇంట్లో నలుగురు అమ్మాయిలు కావడంతో ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం. ఇలా ఆ యువతి జీవితం సాఫీగా సాగిపోయేది. అనుకోకుండా ఆమె జీవితంలో ప్రేమ ప్రవేశించింది. ప్రేమ.. పెళ్లి.. ఆత్మహత్య ఏడాదిన్నరలో జరిగిపోయాయి. తన కుటుంబానికి వెలుగు పంచాల్సిన ‘వెన్నెల’చీకటైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కట్నం వేధింపులు, తక్కువ కులమని అత్తింటివారు మాట్లాడే సూటిపోటు మాటలు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, చెన్నూరు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కోటపల్లి మండలం సిర్సా గ్రామానికి చెందిన ఆరె సత్తయ్య–శారదకు నలుగురు కూతుళ్లు. దంపతులిద్దరూ వ్యవసాయ కూలీలే. కుటుంబాన్ని పోషిస్తూనే పెద్ద కుమార్తె పెళ్లి చేశారు. మూడో కుమార్తె వెన్నెల(26)కు చదువుపై ఆసక్తి ఉండటంతో ఉన్నత చదువులు చదివించాలని అనుకున్నారు. మంచిర్యాలలో బీకాం సెకండియర్ చదువుతున్న సమయంలో గ్రామానికే చెందిన పెండ్యాల కిరణ్‌కుమార్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని ప్రాధేయపడ్డాడు. కులాలు వేరని, పెద్దలు పెళ్లికి అంగీకరించరని వెన్నెల చెప్పినా.. మాయమాటలు చెప్పాడు. చచ్చిపోతానని బెదిరించాడు. గ్రామస్తుడే అని నమ్మి వెన్నెల పెళ్లికి అంగీకరించింది. ఇద్దరూ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఎన్నో ఆశలతో కొత్త కాపురం..: వివాహం అనంతరం కిరణ్‌కుమార్–వెన్నెల చెన్నూరులో కాపురం పెట్టారు. అద్దె ఇంట్లో ఉంటూ కిరణ్ క్లాత్‌స్టోర్ నిర్వహిస్తున్నాడు. కోవిడ్ కారణంగా నష్టాలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఎన్నో ఆశలతో కొత్త కాపురంలోకి అడుగు పెట్టిన వెన్నెలకు కొన్ని నెలలకే కష్టాలు ప్రారంభమయ్యాయి. రూ.10 లక్షల కట్నం తేవాలని వెన్నెలను కిరణ్ వేధించడం మొదలుపెట్టాడు. సున్నిత మనస్కురాలైన వెన్నెల భరించలేకపోయింది. పుట్టింటికి వెళ్లలేక, భర్తతో ఉండలేక కుమిలిపోయింది. వెన్నెల మృతదేహం, సూసైడ్ నోట్ చావే పరిష్కారమని.. భర్తతోపాటు అత్తింటివారి వేధింపులు ఎక్కువ కావడంతో ఇక చావే సమస్యకు పరిష్కారమనుకుంది. ఆత్మహత్యకు ముందు మూడు పేజీల సూసైడ్ నోట్ రాసింది. ‘ఇంకో జన్మంటూ ఉంటే మన కులంలోనే పుడుదాం’ అని ముగించి శుక్రవారం భర్త లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన ఇరుగుపొరుగు వారు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులు మృత్యువుతో పోరాడిన వెన్నెల శనివారం రాత్రి మృతిచెందింది. ఆదివారం మృతదేహాన్ని చెన్నూరుకు తీసుకొచ్చారు. సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిరణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని సీర్స గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. వరకట్న వేధింపులు, కులం పేరుతో ధూషించినందుకు కిరణ్‌కుమార్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెన్నూరు సీఐ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. -
‘గర్భంతో ఉందని చూడకుండా ముక్కలు ముక్కలుగా కోశారు’
పట్నా: బిహర్లో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం.. భార్య గర్భంతో ఉందని కూడా చూడకుండా ముక్కలుగా నరికి చంపేసిన అమానవీయ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ ఘటన నలందా జిల్లాలో జరిగింది. నోనియా బిగ్హా గ్రామానికి చెందిన సంజిత్, కాజల్‌కు గతేడాది జూన్ 27న వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నకానుకలు కూడా భారీగానే ఇచ్చారు. ఆ సమయంలో సంజిత్‌కు ఇండియన్ రైల్వేస్‌లో గ్రూప్‌డీ ఉద్యోగం చేస్తుండేవాడు. తాజాగా, అతనికి టీటీఈ గా ప్రమోషన్ వచ్చింది. దీంతో తమకు అదనపు కట్నం కావాలని అత్తింటివారు కొంతకాలంగా కాజల్‌ను వేధించసాగారు. ఆమెను మానసికంగా, శారీరకంగా తీవ్ర హింసలకు గురిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాజల్ తండ్రి అరవింద్ సింగ్ 80వేల రూపాయలను ఆమె భర్తకు ఇచ్చాడు. అయినప్పటికీ వారి వేధింపులు ఆగలేదు. ఆమెను ప్రతి రోజు తీవ్రంగా కొడుతూ మానసిక వేదనకు గురిచేసేవారు. కాగా, గత వారం ఆమెను గర్భవతి అని కూడా చూడకుండా తీవ్రంగా హింసించారు. అంతటితో ఆగకుండా.. ఆమెను బిగ్హా గ్రామంలోని పోలాల్లోకి లాక్కునిపోయారు. అక్కడ ఆమెను ముక్కులు ముక్కలుగా నరికి చంపేశారు. అయితే, జులై 17న చివరిసారిగా తన కూతురితో ఫోన్లో మాట్లాడినట్లు మంజు దేవి చెప్పారు. కాగా, ఫోన్లో మాట్లాడుతూ.. నాకు చాలా భయంగా ఉందని మా అమ్మాయి చెప్పిందని కన్నీటి పర్యంత మయ్యింది. కొన్ని రోజులుగా కాజల్ సెల్‌ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. సంజిత్ కూడా కజల్ కన్పించడంలేదని చెప్పాడు. దీంతో, యువతి తండ్రి అరవింద్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న హిల్సా పోలీసులు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో, నోనియా బిగ్హా గ్రామంలోని పోలాల్లో జులై 20న.. కొన్ని శరీర భాగాలు ముక్కలు, ముక్కలుగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వాటిని కాజల్ శరీర భాగాలుగా అరవింద్ గుర్తించారు. దీంతో, పోలీసులు కజల్ మృతదేహన్ని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, సంజిత్ను, అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న హిల్సా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. -
కేరళ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులంతా ఇకపై
Dowry.. సమాజంలో ఎన్నో అవరోధాలను కలిగిస్తోంది. తల్లిదండ్రులకు ఆడ పిల్ల పుడితే లక్షల కట్నాలు ఎక్కడ ఇవ్వాలని పురిట్లోనే ఆడపిల్లలను చంపేసిన ఘటనలు కోకొల్లలు. అయితే కాలం మారింది. కాలంతో పాటు సమాజంలో కట్టుబాట్లు, ఆచారాలు మారుతున్నాయి. ఆడ పిల్లలు తమకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటున్నారు. అది కూడా కట్నాలకు ఆశ పడని వాడికే తమ మనసు సొంతం అంటున్నారు. తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేరళ ప్రభుత్వంలో పని చేస్తున్న వివాహం కాని పురుష ఉద్యోగులు తాము వరకట్నాన్ని ప్రొత్సహించడం లేదా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా పెళ్లైన నెల రోజుల్లో తాము పని చేస్తున్న విభాగం అధిపతులకు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ డిక్లరేషన్‌లో భార్య సంతకంతో పాటు వధువు, వరుడిల తండ్రి సంతకం ఉండాలని పేర్కొంది. మహిళ, శిశు సంక్షేమ శాఖ కొద్దిరోజుల క్రితం ఈ సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు, అటానమస్, ఇతర సంస్థలకు సంబంధించిన విభాగాల అధిపతులు సైతం ఈ మేరకు డిక్లరేషన్లు తీసుకోవాలని తెలిపింది. ఇక కేరళలో ప్రతి ఏడాది నవంబర్ 26న వరకట్న వ్యతిరేక దినోత్సవంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు స్కూల్స్, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు కట్నం తీసుకోమని ప్రతిజ్ఞ చేయాలని ప్రభుత్వం సూచించింది. గత నెలలో వరకట్నానికి వ్యతిరేకంగా విద్యార్థులందరూ తమ డిగ్రీ తీసుకోవడానికి ముందు బాండ్ ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ సూచించిన సంగతి తెలిసిందే. -
భార్యను చితకబాది, మామ పక్కటెముకలు విరగ్గొట్టిన భర్త
తిరువనంతపుంర: ఓ వైపు కేరళ ప్రభుత్వం వరకట్న నిషేధంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తుంటే మరోవైపు గృహహింస వేధింపులు ఎక్కువయ్యాయి. తాజాగా 31 ఏళ్ల మహిళను కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేయడంతోపాటు ఆమె తండ్రిని చితకబాది అతని పక్కటెముకలను విరగొట్టిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చికి చెందిన మహిళను ఏప్రిల్ 12న ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరిద్దరికి ఇది రెండో వివాహం. కానీ పెళ్లైనప్పటి నుంచి మహిళను భర్త వేధించడం మొదలు పెట్టాడు. అదనపు కట్నం కావాలని. బంగారం కావాలని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ క్రమంలో మహిళ బంగారాన్ని భర్త తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నాడని తెలిసి ఆమె తల్లిదండ్రులు ఆ బంగారాన్ని బ్యాంక్ లాకర్‌కు మార్చారు. ఈ విషయం కాస్తా భర్తకు తెలియడంతో తన తల్లితో కలిసి భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. అంతేగాక భార్యకు అన్నం కూడా పెట్టకుండా బాధపెట్టారు. అక్కడితే ఆగకుండా భార్య బంగారంలో తన వాట తనకు ఇవ్వకపోతే కొల్లాంలో వరకట్న వేధింపులతో బలైన విస్మయ లాగే తను కూడా అదే పరిస్థితిని ఎదుర్కొవాల్సి వస్తుందని భర్త బెదిరించాడు. ఈ క్రమంలో జూలై 9 న తిండి కూడా పెట్టకుండా ఆమెను ఇంటి నుండి బయటకు గెంటేశారు. దీంతో వివాహిత సరాసరీ తన తండ్రి ఇంటికి వెళ్ళడంతో ఈ విషయంపై చర్చించడానికి జూలై 17న మహిళ తండ్రి కూతురు అత్తగారింటికి వచ్చారు. అయితే ఇదే అదునుగా భావించిన అల్లుడు భార్యపై ఇష్టారీతిగా చేయిచేసుకున్నాడు. మధ్యలో అడ్డు వచ్చిన మామని చితకబాది పక్కటెముకలు విరగొట్టాడు. చివరికి బాధిత కుటుంబం జూలై 23 న పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్లు 498 ఎ, 323, 506, 34తో పాటు వరకట్నం నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4 కింద భర్త, అతని తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. కాగా కేరళ ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న పెళ్లి అవ్వని పురుష ఉద్యోగులు వరకట్నం తీసుకోవడం లేదా ప్రోత్సహించడం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు పెళ్లయిన నెలరోజుల్లో సంబంధిత విభాగాల అధిపతులకు డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్‌లో భార్య సంతకంతో పాటు వధువు తండ్రి, వరుడి తండ్రి సంతకాలు ఉండాలని తెలిపింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే సర్క్యలర్ జారీ చేసింది. అయితే తప్పుడు సమాచారాన్ని అందిస్తే చట్టపరమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. -
ఇదేం ఫ్యామిలీరా బాబు..కట్నంగా 21 గోర్లు గల తాబేలు ,నల్ల కుక్క కావాలంట!
పూణె: వరకట్నం అడగడం చట్టప్రకారం నేరమని చెప్తున్నా అమ్మాయిలకి, వారి కుటుంబ సభ్యులకి ఈ సమస్య తప్పట్లేదు. ఇప్పటికీ వరకట్న ఆత్మహత్యలు, వేధింపులు అప్పుడప్పుడు మనం వార్తల్లో వింటూనే ఉంటాం. సాధారణంగా వరకట్నం అంటే ఆస్తులు, డబ్బులు అడుగుతుంటారు. అయితే వెరైటీ కోరికలు కోరి వరకట్నంగా తీర్చమన్నారు ఓ కుటుంబ సభ్యలు. చివరికి కుటుంబమంతా కటకటలాపాలయ్యారు. ఈ ఘటన మహరాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 10న రామనగర్ ప్రాంతంలోని ఒక హాలులో ఓ జంటకు నిశ్చితార్థం అయ్యింది. యువతి కుటుంబం నిశ్చితార్థానికి ముందే 2 లక్షల నగదు, 10 గ్రాముల బంగారం వరకట్నంగా ఇచ్చారు. అయితే, నిశ్చితార్థం తరువాత అబ్బాయి కుటుంబ సభ్యులు వారి వింత కోరికల జాబితాను బయట పెట్టారు. ఆ లిస్ట్ చూస్తే ఇలాంటివి కూడా అడుగుతారా అనిపించేలా ఉన్నాయి. అందులో 21 గోర్లు గల తాబేళ్లు, ఒక నల్ల లాబ్రడార్ కుక్క, ఒక బుద్ధ విగ్రహం, సమై లాంప్‌స్టాండ్, రూ.10 లక్షలు ఇవ్వాలంటూ యువతి కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. ఇవి ఇస్తేనే వివాహం తర్వాత ఉద్యోగం వస్తుందని వాళ్లని నమ్మించారు. అనంతరం యువతి కుటుంబం ఈ కోరికలను తీర్చలేకపోవడంతో ఈ పెళ్లిని వరుడి కుటుంబసభ్యులు రద్దు చేశారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో వారిని అరెస్టు చేశారు. -
12 ఏళ్ల క్రితం వివాహం.. ఇద్దరు కుమారులు.. అదనపు కట్నం తేవాలని..
సాక్షి, సారంగాపూర్(కరీంనగర్): అదనపు వరకట్నం తీసుకురావాలని వేధిస్తున్న భర్త, అత్తామామలపై సారంగాపూర్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ప్రొబేషనరీ ఎస్సై (పీఎస్సై) రజిత కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం గోపాల్రావుపేట గ్రామానికి చెందిన మిర్యాల సుమలతకు సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన మిర్యాల మహేశ్‌తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో మహేశ్‌కు సుమలత తల్లితండ్రులు ఒప్పుకున్న ప్రకారం వరకట్నం ముట్టజెప్పారు. సదరు దంపతులకు ఇద్దరు కుమారులు. కొన్ని రోజులుగా అదనంగా మరో రూ.3 లక్షలు కట్నం తీసుకురావాలని భర్త, అత్త పోశవ్వ, మామ లక్ష్మీనారాయణలు సుమలతను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పీఎస్సై తెలిపారు. -
అదనపు కట్నం తేలేదని.. మరిదితో వివాహేతర సంబంధం..
సాక్షి, నస్పూర్(ఆదిలాబాద్): అత్తారింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై టీ. శ్రీనివాస్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని నాగార్జున కాలనీకి చెందిన దంసాని మమత(22), ఆమె భర్త నవీన్‌కుమార్, మరిధి వేణులు కలిసి ఒకే క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. నవీన్‌కుమార్ మంథనిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, నవీన్ తమ్ముడు వేణుకు తండ్రి లింగయ్య ఉద్యోగం వారసత్వంగా వచ్చింది. ఈ క్రమంలో నవీన్, వేణు, వారి తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం మమతను వేధించసాగారు. అయినా కట్నం తీసుకురాకపోవడంతో మరిధి వేణుతో మమతకు వివాహేతర సంబంధం అంటగట్టారు. దీంతో మనస్తాపం చెందిన మమత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి దంసాని స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పింక్ ప్రొటెక్షన్ ‘సర్వే’యలెన్స్ చెక్ చేస్తారు... చెక్ పెడతారు
జ్వరాలు ఉన్నాయేమోనని ఇంటింటి సర్వే చేయడం తెలుసు. కాని ఇక మీదట కేరళలో గృహ హింస జరుగుతున్నదా అని ఇంటింటినీ చెక్ చేస్తారు. కాలేజీల దగ్గర పోకిరీల పని పడతారు. కట్నం మాటెత్తితే లోపల వేస్తారు. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే చిప్పకూడు తినిపిస్తారు. స్త్రీలకు విరోధులుగా మారిన పురుషులకు గుణపాఠం చెప్పడానికి కేరళ ప్రభుత్వం సోమవారం ‘పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్’ ప్రారంభించింది. ఆ వివరాలు... పోలీస్ వెహికిల్ అంటే మగ డ్రైవర్, మగ ఇన్స్పెక్టర్, మగ కానిస్టేబుల్స్... ఇలాగే ఉంటుంది అన్ని చోట్లా. కాని కేరళలో ఇక మీదట ‘పింక్’ కార్లు కూడా కనిపిస్తాయి. లేడీ డ్రైవర్, లేడీ ఇన్స్పెక్టర్, లేడీ కానిస్టేబుల్స్.... వీళ్లే ఉంటారు. ఈ పింక్ కార్లు రోడ్ల మీద తిరుగుతుంటాయి. తమ కోసం ఈ వాహనాలు రక్షణకు పరిగెత్తుకొని వస్తాయి అనే నమ్మకాన్ని స్త్రీలకు ఇస్తాయి. కేరళలో ఇటీవల గృహ హింస కేసులు, వరకట్న చావులు మితి మీరాయి. ఇప్పటికే అక్కడ స్త్రీల రక్షణకు వివిధ మహిళా పోలీసు దళాలు విధుల్లో ఉన్నా సోమవారం (జూలై 19) ‘పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్’ పేరుతో అక్కడి ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృఢమైన సందేశం ఇచ్చేలా కొత్త దళాలను తిరువనంతపురంలో ప్రారంభించారు. మూడు సంరక్షణలు స్త్రీలకు మూడుచోట్ల భద్రత కల్పించాలని కేరళ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఒకటి పబ్లిక్ ప్లేసుల్లో (రోడ్లు, పార్కులు, బస్‌స్టాప్‌లు..), రెండు ప్రయివేటు ప్లేసుల్లో (నివాస గృహాలు, హాస్టళ్లు...), మూడు సోషల్ మీడియాలో (ఫేస్బుక్, ట్విటర్..)... ఈ మూడు చోట్ల స్త్రీలకు ఏ మాత్రం అసౌకర్యం జరగడానికి వీల్లేకుండా ‘పింక్ ప్రొటెక్షన్’ కింద మహిళా దళాలు అలాగే పురుష దళాలు పరస్పర సహకారంతో పని చేయాలని అక్కడ చర్యలు మొదలయ్యాయి. ఇంటికి వచ్చే ‘పింక్ జనమైత్రి’ గృహ హింస, వరకట్న వేధింపులకు చెక్ పెట్టడానికి కేరళలో మొదలెడుతున్న వినూత్న రక్షణ చర్య ‘పింక్ జనమైత్రి’. సాధారణంగా ఇళ్లల్లో గృహ హింస జరుగుతూ ఉన్నా, వరకట్న వేధింపు జరుగుతూ ఉన్నా అది ఆ ఇంటికి, ఇరుగు పొరుగు వారికీ తెలుస్తూ ఉంటుంది తప్ప స్టేషన్ వరకూ చేరదు. అనేక కారణాల వల్ల, చట్టం సహాయం తీసుకోవచ్చని స్త్రీలకు తెలియకపోవడం వల్ల పోలీసులకు ఈ వేధింపు తెలియదు. అది దృష్టిలో పెట్టుకుని కేరళలోని ప్రతి జిల్లాలోని ప్రతి ఊళ్లోని పంచాయితీ సభ్యులతో ‘పింక్ జనమైత్రి’ కార్యక్రమం కింద మహిళా పోలీసులు ‘టచ్’లో ఉంటారు. ఊళ్లో ఏ ఇంట్లో అయినా స్త్రీలపై హింస జరుగుతుందా ఆరా తీస్తారు. అలాగే ఇంటింటిని సర్వే చేస్తూ ఆ ఇంటి మహిళలతో మాట్లాడతారు. మహిళలు విషయం దాచాలనుకున్నా వారి వొంటి మీద దెబ్బపడి ఉంటే ఆ దెబ్బ పెద్ద సాక్ష్యంగా నిలిచే అవకాశం ఉంది. దాంతో ఆ హింసకు పాల్పడిన కుటుంబ సభ్యులపై చర్యలు ఉంటాయి. ముఖ్యంగా ఇది వరకట్న వేధింపులు ఎదుర్కొనే కోడళ్లకు పెద్ద తోడు అయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులను కూడా ఇంట్లో అడుగుపెట్టనీకుండా కోడళ్లను రాచి రంపాన పెట్టే భర్త, అత్తామామలు ఉంటారు. కాని పోలీసులను రావద్దు అనడానికి లేదు. కోడలు నోరు విప్పి ఏం చెప్పినా అంతే సంగతులు. పింక్ షాడో పెట్రోల్, పింక్ రోమియో కేరళలో స్త్రీలకు నీడలా ఉంటూ వేధించే పురుషులకు సింహ స్వప్నంగా నిలిచేదే ‘పింక్ షాడో పెట్రోల్’. ఇందుకోసమే పింక్ వెహికిల్స్‌ను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్లు పూర్తిగా మహిళా పోలీసులతో తిరుగుతాయి. ‘మా వెహికిల్ వస్తుంటే అల్లరి వెధవలు తోక ముడిచి పారిపోతున్నారు’ అని ఆ వెహికల్స్‌లో విధి నిర్వహిస్తున్న ఒక మహిళా ఇన్స్పెక్టర్ చెప్పింది. ‘అమాయక యువతులకు మాయమాటలు చెప్పి పార్కులకు సినిమాలకు తిరిగే మేక వన్నె పులులు కూడా ఇప్పుడు మా బండ్లు ఎక్కడ పసి గడతాయోనని ఒళ్లు దగ్గర పెట్టుకుంటున్నారు.’ అని కూడా ఆమె అంది. పింక్ షాడో పెట్రోల్ మొదలయ్యాక కేరళలో బీచ్‌ల వద్ద జరిగే క్రైమ్ బాగా తగ్గింది. ఇక ఆడపిల్లలను సిటీ బస్సుల్లో, కాలేజీల దగ్గర, స్కూళ్ల దగ్గర అల్లరి పెట్టేవారి భరతం పట్టడానికే ‘పింక్ రోమియో’ మహిళా పోలీసు దళం పని చేస్తుంది. వీరికి బుల్లెట్లు, సైకిళ్లు కూడా పోలీసు శాఖ సమకూర్చింది. పింక్ హెల్మెట్లతో వీరు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ విధులలో ఉంటారు. అలాగే 24 గంటలూ అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్ నంబర్ కూడా ఉంటుంది. భావజాలం మారాలి ‘ఎన్ని దళాలు ఎన్ని విధాలుగా పని చేసినా అవి దుర్మార్గ పురుషులను నియంత్రించొచ్చుగాని వారిని పూర్తిగా మార్చలేవు. మారాల్సింది పురుషులే. తమకు తాముగా వారు స్త్రీల పట్ల ఎలా వ్యవహరించాలో వారిని ఎంత గౌరవించాలో తెలుసుకోవాలి. అప్పుడే అత్యాచారాలు, హింస, వేధింపులు ఆగుతాయి’ అని పింక్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న ఒక మహిళా ఆఫీసర్ అన్నారు. అవును. అబ్బాయిలకు హైస్కూలు వయసు నుంచే ఇంట్లో, బయట స్త్రీలతో ఎలా వ్యవహరించాలో నేర్పించాల్సిన బాధ్యత కుటుంబానికి ఉంది. వారిని జెండర్ సెన్సిటైజ్ చేయాల్సిన బాధ్యత విద్యా వ్యవస్థకు ఉంది. ఈ రెండు చోట్ల పురుష భావజాలం సంస్కరింపబడిన నాడు పింక్ ప్రొటెక్షన్ అవసరమే ఉండదు. -
వరకట్నానికి వ్యతిరేకంగా గవర్నర్ నిరాహార దీక్ష
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పేరు ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియా, మీడియాలో తెగ వైరలవుతోంది. కారణం ఏంటంటే ఆయన వరకట్నాకి వ్యతిరేకంగా ఒక్క రోజు నిరాహార దీక్ష చేశారు. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్.. తిరువనంతపరంలోని తన కార్యాలయంలో ఈ నిరసన దీక్షకు కూర్చున్నారు. ఇటీవల కేరళలో వెలుగు చూసిన వరకట్న వేధింపులు కేసుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేరళలో పలు ప్రజా సంఘాలు వరకట్నానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టాయి. గాంధీ భవన్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. వారికి సంఘీభావంగా గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కూడా రాజ్‌భవన్‌లో దీక్షకు కూర్చున్నారు. వరకట్నం గురించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే ఆయన దీక్ష చేస్తున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ.. ‘‘అక్షరాస్యలో ముందున్న మన రాష్ట్రానికి ఇది ఎంతో సిగ్గుచేటు. వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరం. అలా చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. మన రాష్ట్రాభివృద్ధిలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి మహిళల గౌరవానికి వరకట్నం భంగం కలిగిస్తుంది. ఏ యువకుడైనా తన పెళ్లికి కట్నం డిమాండ్ చేస్తే అతడు చదువును, దేశాన్ని అవమానించినట్లేనని గాంధీజీ చెప్పారు. ఎవరూ కట్నం తీసుకోబోమని యువత ప్రతిజ్ఞ చేయాలి. వరకట్న వేధింపులకు ముగింపు పలకాలి’’ అని మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ పేర్కొన్నారు. వరకట్నానికి వ్యతిరేకంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఖాన్ అభిప్రాయపడ్డారు. మహిళల గౌరవానికి సంబంధించి కేరళ ప్రభుత్వం చేపట్టిన స్త్రీపక్ష కేరళం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభించిన ఆయన 6 గంటలకు విరమించారు. సాయంత్రం 5 గంటలలకు గాంధీ భవన్‌కు వెళ్లి.. వరకట్నానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన ప్రజా సంఘాలను మద్దతు తెలిపారు. గవర్నర్ ఇలా వరకట్నానికి వ్యతిరేకంగా దీక్ష చేయడం పట్ల జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
15 ఏళ్ల క్రితం వివాహం.. మళ్లీ కట్నం కోసం వేధింపులు..
సాక్షి, నిజాంపేట(మెదక్): అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం నిజాంపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట మండలం పరిధిలోని చల్మెడకు చెందిన పాక మంజుల(35) 15 ఏళ్ల క్రితం నిజాంపేటకు చెందిన పాక నాగరాజుకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లయిన రెండేళ్ల నుంచి మృతురాలిని అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా నాగరాజు వేధించేవాడు. ఈ విషయంపై పలుమార్లు పెద్ద మనుషులు నచ్చజెప్పినా అతడిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మళ్లీ కట్నం కోసం వేధించడంతో భోజనం అనంతరం కుటుంబ సభ్యులు నిద్రపోతున్న సమయంలో మృతురాలు మంజుల తన ఇంటిలోని దూలానికి ఉరి వేసుకొంది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు వచ్చి చూడగా ఆమె అప్పటికే మృతి చెందింది. ఆమె మృతి విషయాన్ని మృతురాలి తండ్రికి తెలిపారు. ఈ విషయంపై మృతురాలి తండ్రి కొత్తల నర్సింహులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు భర్త నాగరాజుపై నిజాంపేట ఇంచార్జ్ ఎస్ఐ రాంచందర్ కేసు నమోదుచేశారు. మృతురాలికి ఇద్దరు కుమారులు సుశాంత్, బద్రీనాథ్ ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్మా ర్టం నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. -
నీ కూతురిని ఇంటికి తీసుకెళ్లు.. లేదంటే చంపేస్తాం!
వరకట్న వేధింపులకు మరో మహిళ బలైపోయింది. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలిని దారుణంగా హతమార్చారు. డబ్బుపై మొహంతో కట్టుకున్న భర్త, అత్తమామలలే కాలయములై వివాహితను కొట్టి, సజీవ దహనం చేశారు. ఈ అమానుష ఘటన పంజాబ్ రాష్ట్రంలో మంగళరం వెలుగు చూసింది. లుధియానా జిల్లాలోని సమ్రాలా ప్రాంతంలో సురిందర్ పాల్ కుటుంబం నివాసముంటోంది. పాల్ తన కుమార్తె మణ్‌దీప్ కౌర్‌ను కాకోవాల్ మజ్రా గ్రామానికి చెందిన బలరాం సింగ్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహం చేశాడు. వీరికి ఏడాది వయసున్న కూతురు ఉంది. పెళ్లైనప్పటి నుంచే మహిళపై అత్తాంటివారి వేధింపులు మొదలయ్యాయి. ఇటీవల అదనపు కట్నం కావాలని మహిళపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో మంగళవారం వివాహిత ఒంటినిండా కాలిన గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే తన కూతురిని అత్తింటివారే చంపారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. కూతురిని పుట్టింటికి తీసుకెళ్లకుంటే ఆమెను చంపేస్తామని అల్లుడు ముందుగానే హెచ్చరించాడని తెలిపాడు. ఒకవేళ తన కూతురిని ముందుగానే ఇంటికి తీసుకువచ్చినట్లయితే, ఆమె ఈ రోజు సజీవంగా ఉండేదని సురిందర్పాల్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘అల్లుడి తండ్రి కాల్ చేసి నా కూతురికి కాలిన గాయాలయ్యాని, ఆమెను సివిల్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. నేను వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. అక్కడి నుంచి నా కూతురిని రాజీంద్ర హస్మిటల్కు రిఫర్ చేశారు. అక్కడికి వెళ్తుండగానే మధ్యలోనే నా కూతురు చనిపోయింది. నేను చివరికి నా కూతురు శవాన్ని చూడాల్సి వచ్చింది. ఆమె తలపై గాయాలు చూసి షాకయ్యాను. శరీరమంతా కాలిన గాయాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన అప్పటినుంచి అత్తారింటివారు తన కూతురిని కట్నం వేధింపులకు గురిచేసేవారని బాధితురాలి తండ్రి వాపోయాడు. ఆమె భర్త బలరాం, వాళ్ల తల్లిదండ్రులు కూతురిపై దాడికి పాల్పడుతున్నారు. మేము ఈ విషయాన్ని గ్రామ పంచాయతీతో లేవనెత్తాము. గ్రామంలోని పంచాయతీ పెద్దలు సమస్యను పరిష్కరించారు. అయినా నా కుమార్తెకు అత్తమామల వేధింపులు తగ్గేలేదని మహిళ తండ్రి ఆరోపించారు. కాగా మన్దీప్ భర్త బలరాం సింగ్, బావ చంద్ సింగ్, అత్త రాజ్వంత్ కౌర్, బావ రాజ్వీందర్ కౌర్, బావమరిది కుల్బీర్ సింగ్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆరు నెలలుగా పుట్టింట్లోనే.. అయినా వదలని భర్త
మైసూరు: కట్న పిశాచుల వేధింపులను భరించలేక ఓ అబల ఆత్మహత్య చేసుకుంది. నంజనగూడు తాలూకాలోని బిళిగెరె గ్రామానికి చెందిన సౌమ్యా (26)కి మూడేళ్ల కిందట మైసూరుకు చెందిన గౌతమ్ అనే వ్యక్తితో పెళ్లయింది. మరింత కట్నం తీసుకురావాలని ఆమెను భర్త అత్తమామలు వేధించడంతో తట్టుకోలేక ఆరునెలల క్రితం పుట్టింటికి వచ్చేసింది. కట్నం తీసుకుని వస్తేనే రావాలని భర్త, అత్తమామలు ఒత్తిడి చేయడంతో జీవితంపై విరక్తి చెందింది. వారు కోరినట్లు మూడు లక్షల నగదు, బంగారం ఇచ్చే పరిస్థితి లేదని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు బిళగెరె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిరాతక టెక్కీ మైసూరు: అదనపు కట్నం తేవాలని భార్యను కొట్టాడో టెక్కీ. ఆమె ఫిర్యాదుతో పోలీసులకు అతిథిగా వెళ్లాడు. మానస గంగోత్రికి చెందిన విశాలాక్షమ్మ, యశోదరాచార్ దంపతుల కుమారుడు ఆనంద్‌కు మూడేళ్ల కిందట మైసూరుకే చెందిన రమ్యతో ఘనంగా పెళ్లి చేశారు. బంగారంతో పాటు భారీగా కటా్నన్ని ఇచ్చారు. తరువాత బెంగళూరు ఉద్యోగం చేస్తూ అక్కడే కాపురం ఉండేవారు. రమ్య గర్భవతి కావడంతో మైసూరులో పుట్టింటికి చేరుకుంది. ఆనంద్‌కు ఖతార్ దేశంలో కొన్నాళ్లు ఉద్యోగం చేసి వచ్చాడు. రమ్యకు ఆడబిడ్డ పుట్టింది. ఈ నెల 2న రమ్య తన తండ్రిని తీసుకుని అత్తవారింటికి వెళ్లగా అదనపు కట్నం తెస్తేనే ఇంట్లోకి రానిస్తామని భర్త అత్తమామలు తెగేసి చెప్పారు. అంతేకాకుండా ఆమెపై పైశాచికంగా దౌర్జన్యం కూడా చేయడంతో చంటిపాప కన్నుకు, ముక్కుకు గాయాలు తగిలాయి. రమ్య మైసూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘరానా భర్తను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
కట్నం కాలనాగు మళ్లీ బుస కొడుతోంది..నేడు కేరళ... రేపు?
‘అమ్మా... కట్నానికి వ్యతిరేకంగా మీరెవరైనా ఉద్యమం లేవదీస్తే నేను వాలెంటీర్‌గా పని చేస్తా’ అన్నారు కేరళ గవర్నర్ ఆవేదనగా. కేరళలో రెండు రోజుల తేడాలో ముగ్గురు వివాహితలు వరకట్న చావులకు లోనయ్యారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వినవచ్చిన వరకట్న చావులు మళ్లీ కేరళ ఘటనలతో చర్చలోకి వచ్చాయి. కట్నం అనే మాట అంతరించిపోలేదు. అది పెట్టే బాధలు గతించి పోలేదు. కాకపోతే ఆ బాంబు కేరళలో ముందు పేలింది. మన చుట్టుపక్కల ఈ వేధింపులను గమనిస్తున్నామా? మొన్నటి జూన్ 21–22 తేదీలలో కేరళలో జరిగిన మూడు వరకట్న చావులు ఇలా ఉన్నాయి. ‘కట్నం’ మాట ఇప్పుడు వాడటం లేదు. ‘ఏమైనా ఫార్మాలిటీలు ఉంటే మాట్లాడుకుందాం’ అంటున్నారు. గత సంవత్సరం పెళ్లయిన విస్మయ అనే ఆయుర్వేద ఫైనల్ ఇయర్ స్టూడెంట్ (కొళ్లం–కేరళ)కు ఆమె తండ్రి ఈ ‘ఫార్మాలిటీస్’లో భాగంగా అల్లుడికి ఒక కారు, 100 సవరల బంగారం, 10 లక్షల డబ్బు. 1.25 ఎకరాల స్థలం ఇచ్చాడు. అల్లుడు కిరణ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. అయితే ఆ సదరు అల్లుడికి కేవలం 11 లక్షల కారు ఇవ్వడం నచ్చలేదు. లగ్జరీ కారు అడిగాడు. కొట్టాడు. ఎలా భరించడం అనుకుందో వాళ్లే చంపేశారో మొన్న జూన్ 21న ఆమె అత్తవారింట్లో మరణించింది. ఆ వెంటనే 24 గంటల వ్యవధిలో తిరువనంతపురం శివారు విజింజంలో 24 ఏళ్ల అర్చన ఒళ్లు కాలి మరణించి కనిపించింది. ఆమె భర్త సురేశ్ ప్లంబర్. 3 లక్షల కట్నం డిమాండ్. మామగారు ఇవ్వలేకపోయారు. అత్తగారింట్లో ఉన్న అర్చనను సురేశ్ ఆ రోజు ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయం లో అతని దగ్గర డీజెల్ బాటిల్ ఉంది. ఆ డీజెల్ పోసుకునే ఆమె ఆత్మహత్య చేసుకుంది (హత్య జరిగింది). ఆ డీజెల్‌ను తాను చీమల్ని చంపడానికి తెచ్చాను అని సురేశ్ చెబుతున్నాడు. మరో కొద్దిగంటల వ్యవధిలో 3 నెలల క్రితం వివాహం అయిన 19 సంవత్సరాల సుచిత్ర (అలెప్పి) అనుమానాస్పదంగా మరణించింది అత్తవారింట్లో. ఆమె భర్త మిలట్రీలో పని చేస్తాడు. ‘మా స్తోమతకు టూ వీలర్ ఇద్దామనుకున్నాం. కారు అడిగారు ఇచ్చాం. 51 సవరల బంగారం పెట్టాం. కాని వాళ్లు ఇంకో పది లక్షలు అడగడం మొదలెట్టారు’ అని సుచిత్ర తండ్రి చెప్పాడు. ఈ మూడు ఘటనలు ఒకే విషయం చెబుతున్నాయి. అమ్మాయిలు ఏమి చదువుకున్నా, ఎలాంటి ఉద్యోగం చేస్తూ ఉన్నా కట్నం ఇవ్వాలి. మగవాళ్లు ఏ పని చేస్తున్నా ఏ ఆర్థిక స్థితిలో ఉన్నా కట్నం డిమాండ్ చేయాలి. కేరళలో అక్షరాస్యత ఎక్కువని అందరికీ తెలుసు. మహిళా అక్షరాస్యత కూడా ఎక్కువ. కాని ఎంత చదువుకున్నా ఈ సాంఘిక దురాచారానికి తల వొంచాలి. పురుషుడు ఈ దురాచారంతో పెత్తనం చేయాలి. భార్యను పాముతో చంపాడు కేరళలో వరకట్న ఘటనలు గత సంవత్సరం మొదలయ్యాయి. మే 7, 2020న కొట్టరక్కాకు చెందిన ఉత్తర అనే వివాహిత పాము కాటుతో మరణించింది. ఆమె వికలాంగురాలు. ఆస్తి కోసం ఆమెను పెళ్లాడిన భర్త సూరజ్ పకడ్బందీగా ప్లాన్ చేసి ఆమె నిద్రలో ఉండగా పాము కాటు వేయించాడు. ఉత్తర తల్లిదండ్రులకు అనుమానం వచ్చి కేసు నమోదు చేయగా నిపుణుల అది పామును పురిగొల్పి వేయించిన కాటుగా నిర్థారించారు. ఆ కేసు ఇప్పుడు తీర్పు స్థాయికి వచ్చింది. ఏమిటి ఈ అడిగేది... ఇచ్చేది... స్త్రీ, పురుషులు సమానం... ఇద్దరూ కలిస్తేనే జీవితం... ఒకరు లేకుండా మరొకరి జీవితం అసంపూర్ణం అనే వాస్తవం అందరికీ తెలిసినా పురుషుడు తాను ధర పలికే వాడుగా ఎందుకు మారాడు? ఆమె విలువ లేనిదిగా ఎందుకు మిగిలింది? ‘పెళ్లి లేకపోతే స్త్రీ బతకలేదు అనే భావజాలం కూరి కూరి ఆమెను నిస్సహాయురాలు చేశారు. ఇల్లు ముఖ్యం అనే భావన కూడా అంతే. ఆర్థిక స్వతంత్రం దీనికి జవాబు అని అంటారు గాని అన్ని ఉద్యోగాలలో స్త్రీలకు ప్రవేశం లేదు. కొన్ని ఉద్యోగాలు చేసే స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. టెన్ టు ఫైవ్ జాబ్ చేస్తూ ఉన్నవాళ్లే పురుషులకు కావాలి. మార్కెటింగ్, ప్రయాణాలు ఉన్నవారిని వద్దంటారు. భర్త, ఇల్లు కోసం ఉద్యోగాలలో ప్రమోషన్లను వద్దనుకునే వేలాది స్త్రీలు ఉన్నారు. సమాజ భావజాలంలో పెద్ద ఎత్తున మార్పు వస్తే గాని ఇది మారదు’ అని ఆ ప్రాంత సామాజిక కార్యకర్తలు అంటున్నారు. స్త్రీల బాధలో స్త్రీల బాధ్యత ఎంత అనే ప్రశ్న కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. కోడలు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో అత్త, ఆడపడుచు, తోడి కోడలు వంటి సాటి స్త్రీలు కొత్త కోడలికి మద్దతుగా ఉంటున్నారా... లేదా పీడనకు లోనవుతుంటే ఆ పీడనకు సమర్థింపుగా ఉంటున్నారా గమనించుకోవాలి అని మహిళావాదులు అంటున్నారు. వరకట్న నిరోధక చట్టం ఉన్నా, గృహ హింస నిరోధ చట్టం ఉన్నా స్త్రీలు నిశ్శబ్దంగా ఈ హింసను అనుభవిస్తూ ఉండటం వల్ల వరకట్న సమస్య లేనట్టే అన్నట్టుగా తెలుగు సమాజం కూడా ఉంది. భరించలేని స్థితికి చేరుకున్న ‘ఫార్మాలిటీస్’ ఎవరికి వారు పరిశీలించుకుంటే ‘నో టు డౌరీ’ అని గట్టిగా ఎలుగెత్తే అవసరం తెలుస్తుంది. కేరళ ఆ మేరకు హెచ్చరిక చేస్తోంది. స్త్రీ, పురుషులు సమానం... ఇద్దరూ కలిస్తేనే జీవితం... ఒకరు లేకుండా మరొకరి జీవితం అసంపూర్ణం అనే వాస్తవం అందరికీ తెలిసినా పురుషుడు తాను ధర పలికే వాడుగా ఎందుకు మారాడు? ఆమె విలువ లేనిదిగా ఎందుకు మిగిలింది? – సాక్షి ఫ్యామిలీ -
15 ఏళ్ల క్రితం వివాహం.. రూ. 20 లక్షల కోసం వేధిపులు.. దీంతో..
సాక్షి, బోయినపల్లి(కరీంనగర్): అదనపు కట్నం వేధింపులు భరించలేక బోయినపల్లిలో వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. చింతలఠాణాకు చెందిన మల్లయ్య కూతురు మాధవి(30)తో బోయినపల్లికి చెందిన అలువాల శ్రీనివాస్‌కు 15 ఏళ్లక్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.5.50 లక్షల కట్నం ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా అదనపు కట్నం కావాలని వేధించడంతో తండ్రి మల్లయ్య భూములు ముంపులోపోతే వచ్చిన డబ్బు రూ.5.75 లక్షలు, 10 తులాల బంగారం ముట్టజెప్పారు. కాగా కొద్దినెలలుగా సిరిసిల్లలో మాధవి తండ్రి మల్లయ్యకు ఉన్న 10 గుంటల భూమిలో 5 గుంటలు కావాలని లేదంటే రూ.20 లక్షలు అదనపు కట్నం తేవాలని మాధవిని భర్త శ్రీనివాస్, అత్త లచ్చవ్వ, ఆడబిడ్డలు రాజేశ్వరి, అంజవ్వ, రాధ, రాజయ్య తదితరులు వేధిస్తున్నారు. 5 గుంటల భూమి లేదా రూ.20 లక్షలు తేవాలని లేదంటే చనిపోవాలని వేధించడంతో మృతిచెందిందని ఆమె తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాధవి భర్త శ్రీనివాస్, అత్త లచ్చవ్వతోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చంద్రమౌళి వివరించారు. చదవండి: నా పిల్లలతో కలిసి అశ్లీల వీడియోలు చూస్తా.. -
వివాహేతర సంబంధానికి అడ్డు చెప్పినందుకు భార్యను రాడ్డుతో దారుణంగా..
పాట్నా: బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని అడ్డుకున్నందుకు భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడో భర్త. బీహార్‌లోని నలంద జిల్లాలో లాహేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌చంద్రపురి ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. డాక్టర్ ధీరేంద్ర కుమార్‌తో సుమన్‌కు గత ఏడాది వివాహం జరిగింది. అయితే కుమార్ రూ.15 లక్షల కట్నం తీసుకురావాల్సిందిగా భార్య సుమన్‌ను బలవంతం చేశాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో కుమార్‌పై భార్య వరకట్న వేధింపుల కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుమార్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంటికి క్రమం తప్పకుండా ఆమెను తీసుకురావడంతో భార్య అడ్డుచెప్పింది. అంతే ఇదే అదునుగా భావించిన నిందితుడు భార్యపై ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన సుమన్ అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: Vitamin C: తక్కువైతే తంటా.. ఎక్కువైతే మంట! ‘ఎక్స్టార్షన్’ గ్యాంగ్.. బ్లాక్మెయిల్ చేసి రూ. 89 లక్షలు -
కేరళలో మరో విస్మయ.. పెళ్లైన మూడు నెలలకే
కేరళలో కొద్ది రోజుల క్రితం విస్మయ అనే 23 ఏళ్ల మహిళ వరకట్న వేధింపులతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సంఘటన మరువక ముందే మరో ఘటన రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. తన అత్తమామల వరకట్న వేదింపుల కారణంగా 19 ఏళ్ల యువతి వివాహం చేసుకున్న దాదాపు మూడు నెలల తర్వాత చనిపోయింది. ఆ యువతి తల్లితండ్రులు మాత్రం కట్నం కోసమే ఆమెను హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. మృతిరాలి పేరు సుచిత్ర. సుచిత్రకు ఈ ఏడాది మార్చి 21న విష్ణుతో వివాహం జరిగింది. ఇప్పుడు వివాహం జరగకపోతే మరో 7 ఏళ్ల తర్వాతే పెళ్లి జరుగుతుందని ఆమె జాతకంలో ఉన్నట్లు తల్లి, తండ్రులు చెప్పారు. సుచిత్ర కుటుంబం కట్నం కింద 51 సెవిరీల బంగారం, బైక్ ను కట్నంగా ఇచ్చారు. అయితే, ఇవి ఏమి ఆమె అత్తమామలకు సరిపోలేదు. మహిళ మామ కారు, రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఆమె తండ్రి సునీల్ తన పెన్షన్ వచ్చాక డబ్బు ఇస్తానని ఆమె అత్తమామలకు వాగ్దానం చేశాడు. "అయితే వివాహం జరిగిన వెంటనే వరుడి కుటుంబం మళ్లీ డిమాండ్ చేయడం ప్రారంభించారు. విష్ణు సోదరికి అత్యవసరంగా డబ్బు అవసరమని చెప్పారు". బంగారు ఆభరణాలను లాకర్ లో ఉంచాలని ఆమె అత్తగారు వేధించారని ఆరోపించారు. ఆమె అత్తగారు కొన్ని ఆభరణాలను తనఖా పెట్టారని ఆమె తల్లి తెలిపింది. బంగారం పేరిట ఇంట్లో మరిన్ని సమస్యలు రావడంతో ఆమెకు బంగారం ఎందుకు ఇచ్చారని అడుగుతూ, ఏడుస్తూ ఒక రోజు నాకు కాల్ చేసినట్లు తల్లి చెప్పింది. సుచిత్ర భర్త విష్ణు భారతీయ సైనిక దళంలో పనిచేస్తాడు. వివాహం జరిగిన నెలన్నర తర్వాత ఉద్యోగంలో భాగంగా జార్ఖండ్ కు తిరిగి వెళ్లాడు. తన భార్యను తన తల్లితండ్రులతో విడిచి పెట్టి వెళ్లాడు. సుచిత్ర తల్లితండ్రులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె తన ప్రాణాలను తీసుకోలేదని ఆరోపించారు. ఆమె తల్లి మీడియాతో మాట్లాడుతూ.. " అసలు ఆమెకు(సుచిత్ర) సరిగ్గా ముడి వేయడం కూడా రాదని, అలాంటి ఆమె ఇలా ఎలా చేయగలదు? అమ్మాయిలు మనుషుల కాదా? ప్రతి ఒక్కరూ అమ్మాయిలతో ఇలా ఎందుకు చేస్తున్నారు. నా కుమార్తె ముందు చాలా భవిష్యత్ ఉంది అని భాదపడింది. ఈ మృతిపై స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్ హెచ్ ఓ) మిథున్ డీ. అసహజ మరణం కింద కేసు నమోదు చేసినట్లు, కేసు దర్యాప్తు అన్నీ విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. చదవండి: అయ్యో పాపం.. విస్మయ ఎలా చనిపోయిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు -
అయ్యో పాపం.. విస్మయ ఎలా చనిపోయిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు
కొల్లాం: కేరళ రాష్ట్రంలో వరకట్న వేధింపులకు బలైన 23 ఏళ్ల యువతి ఘటన చర్చనీయాంశంగా మారింది. కుందనపు బొమ్మ లాంటి ఆ అమ్మాయిని అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబం వేధించిన చిత్రహింసలు చివరకు ఆమె చావుకు కారణమైంది. కడక్కల్ లోని కైతోడ్ కు చెందిన ఎస్.వి. విస్మయ సోమవారం(జూన్ 21) ఉదయం వాష్ రూమ్ లో ఊరి వేసుకొని కనిపించింది. తొలుత అందరూ ఆత్మహత్యాగా భావించినప్పటికి తర్వాత తన సోదరుడికి పంపిన మెసేజ్‌లు, ఫొటోలు బయటపడటంతో అత్తింటి వారే ఆమెను హింసించి చంపినట్టుగా ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అత్తింట్లో ఆమె పడిన క్షోభ అంతా ఇంతా కాదని ఆ ఫొటోలను చూస్తే మనకు స్పష్టం అవుతుంది. ఈ చిత్రాలలో ఆమె ముఖం, చేతులపై గాయాలు ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లాం జిల్లా సస్తంకొట్ట ప్రాంతానికి చెందిన ఎస్ కిరణ్ కుమార్‌కు, విస్మయ వి నాయర్(23) అనే యువతికి మార్చి 2020లో పెద్దల సమక్షంలో వివాహమైంది. అల్లుడు మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండటంతో కూతురిని సంతోషంగా చూసుకుంటాడని విస్మయ తల్లిదండ్రులు కట్నకానుకలు బాగానే ముట్టజెప్పారు. అతనికి కట్నం కింద 100 సెవిరీల బంగారం, ఎకరానికి పైగా భూమి, టయోటా యారిస్ కారును కట్నంగా అల్లుడికి ఇచ్చారు. పెళ్లి అయిన కొద్ది రోజుల తర్వాత హింసించడం మొదలు పెట్టాడు. కిరణ్ తనకు కట్నంగా ఇచ్చిన కారుకు బదులుగా నగదు కావాలని పట్టుబట్టాడు. అతను ఇంతకు ముందు కూడా ఆమెపై దాడి చేసినట్లు తమకు తెలుసునని విస్మయ తండ్రి వర్ధిల్లికమాన్ నాయర్ చెప్పారు. "ఒకసారి అతను ఆమెతో ఇంటికి వచ్చాడు, అందరూ పార్టీ తర్వాత తాగి ఉన్నారు. వారు ఇంటికి చేరుకున్న తర్వాత అతను ఆమెను కొట్టాడు, నా కుమారుడు దాని గురించి అడగడానికి వెళ్ళినప్పుడు, కిరణ్ అతనిని కూడా కొట్టాడు. మేము వెంటనే పోలీసులను ఆశ్రయించాము. అయితే, సర్కిల్ ఇన్ స్పెక్టర్ కిరణ్, మా కుటుంబం మధ్య రాజీ కుదిర్చారు. ఈసారి వదిలేయండి అని తన కుమారుడు చెప్పడంతో ఆ తర్వాత నుంచి నా కుమార్తె మా ఇంట్లోనే ఉంది. కానీ రెండు నెలల క్రితం, ఆమె బీఎఎమ్ఎస్ పరీక్షలు రాయడానికి కళాశాలకు (పండలంలో) వెళ్ళినప్పుడు, కిరణ్ ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు, ఆ తర్వాత నుంచి ఆమె ఇంటికి రాలేదు" అని వర్ధిల్లికమాన్ నాయర్ చెప్పారు. ఆ తర్వాత నుంచి విస్మయ తన తల్లిని మాత్రమే కాల్ చేసేది, తండ్రికి లేదా సోదరుడకి కాల్ చేసేది కాదు. తన తల్లితో భర్త కిరణ్ రోజు హింసించే వాడని, రోజు కొడుతున్నడని ఆమె వాళ్ల అమ్మకు చెప్పది. ఈ విషయం గురుంచి సోదరుడికి, తండ్రికి చెప్పవద్దు అన్నట్లు కూడా చెప్పింది. చాలా రోజుల పాటు నరకయాతన అనుభవించిన విస్మయ చనిపోయే రెండు రోజుల ముందు సరిగ్గా జూన్ 19న తన కజిన్‌కు భర్త కిరణ్ తనను ఎంత వేధిస్తున్నాడో మెసేజ్ చేసింది. తనను జుట్టు పట్టుకుని ఈడ్చి ముఖంపై కొట్టాడని తనకు అయిన గాయాలను చూపిస్తూ ఫొటోలు పంపింది. తనను కిరణ్ కొట్టిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని తాను కూడా ఎవరికీ చెప్పలేదని ఆ మెసేజ్‌ల్లో విస్మయ తెలిపింది. సరిగ్గా రెండు రోజులకే ఆమె అత్త ఇంటి నుంచి విస్మయ తల్లిదండ్రులకు ఫోన్ వెళ్లింది. విస్మయ ఆత్మహత్యకు పాల్పడిందని ఆమెను ఆసుపత్రికి తరలించామని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. విస్మయ సోదరుడు విజిత్ పీ నాయర్ భాదతో ఇది ఒక హత్య అని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు. స్థానిక పోలీసులు గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాధితురాలి సోదరుడు ఆమె ఎదుర్కొన్న వేధింపులకు సంబంధించి మహిళ చిత్రాలు, వాట్సప్ సంభాషణలను పోలీసులకు సమర్పించాడు. ఈ కేసుపై వెంటనే నివేదిక సమర్పించాలని కొల్లం గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్(ఎస్పీ)ని మహిళా కమిషన్ కోరింది. మహిళ కుటుంబం ఎంచుకున్న ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కూడా చేయాలని మహిళా కమిషన్ సభ్యురాలు షాహిదా కమల్ చెప్పారు. చదవండి: బైక్‌తో బీటెక్ విద్యార్థి బీభత్సం.. 8 నెలల నిండు గర్భిణిని -
ఆత్మీయ ఆహ్వానం.. కొత్త కోడలికి మెట్టుకో గిఫ్ట్
వరకట్న పిశాచి మన సమాజంలో ఎందరు ఆడవాళ్లని బలి తీసుకుందో లెక్కేలేదు. భార్య తల్లిదండ్రులంటేనే నడిచే ఏటీఎంలా కనిపిస్తారు కొందరు భర్తలకు. పెళ్లికి ముందే భారీగా కట్నం తీసుకున్నప్పటికి వారి ధనదాహం తీరదు. వివాహం తర్వాత కూడా అదనపు కట్నం తేవాల్సిందిగా వేధింపులకు గురి చేస్తారు. చిత్రహింసలు పెట్టి.. చివరకు ప్రాణాలు తీస్తారు. అత్తమావలు, ఆడపడుచు, భర్తతో సహా అత్తింటివారందరూ ఆమెను కట్నం కోసం వేధింపులకు గురి చేస్తారు. అయితే అందరు ఇలానే ఉంటారు అనుకుంటే పొరపాటే. కొడలిని, కూతురుతో సమానంగా చూసే అత్తింటివారుంటారు. కోడలి నుంచి కట్నం ఆశించడం కాదు.. కన్నవాళ్లని విడిచిపెట్టి.. తమకోసం వచ్చిన కోడలికి.. బదులుగా బహుమతులు ఇచ్చే వారు కూడా ఉంటారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ సంఘటన మన తెలుగు రాష్ట్రాల్లోనే చోటు చేసుకుంది. అయితే ఎక్కడ అనే వివరాలు మాత్ర లేవు. ఇక వివాహం చేసుకుని.. తమ ఇంట్లోకి అడుగుపెడుతున్న కొత్త కోడలికి జీవితాంతం గుర్తుండిపోయే రీతిలో అద్భుతంగా స్వాగతం పలికారు ఈ అత్తింటివారు. మేళతాళాలతో నూతన దంపతులను ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఇంట్లోకి అడుగుపెడుతున్న కోడలికి మెట్టుకొక బహుమతిచ్చారు. ఇక పెద్ద మెట్టు మీద ఏకంగా 50 వేల రూపాయల నగదు ఇచ్చారు. ఈ ఆత్మీయ ఆహ్వానానికి సదరు పెళ్లి కుమార్తె భావోద్వేగానికి గురైంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో నిజమా కాదా తెలియదు కానీ ఇంత మంచి అత్తింటివారు దొరికిన ఆ అమ్మాయి అదృష్టవంతురాలు.. అందరు మీలానే ఆలోచిస్తే.. ఇక ఈ లోకంలో ఆడపిల్లలను వద్దునుకునే తల్లిదండ్రులే ఉండరు అని ప్రశంసిస్తున్నారు. -
దారుణం: కావలసినంత కట్నం తేలేదని కాల్పులు
ఘజియాబాద్: సమాజంలో వరకట్నమనేది సామాజిక దురాచారం. దీని వలన స్త్రీలపై ఊహకందని రీతిలో చిత్రహింసలు, నేరాలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తగినంత కట్నం తీసుకురాలేదని 24 ఏళ్ల భార్యను ఆమె భర్త కాల్చి చంపిన దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ముజఫర్ నగర్ జిల్లాలోని బుధానా తహసీల్ ఉపవాలి గ్రామానికి చెందిన సారికా (24)కు కుల్దీప్ అలియాస్ మింటూతో గత ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. వివాహం అనంతరం ఎక్కువ కట్నం ఇవ్వలేదని భార్య సారికాను కుల్దీప్ నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో జూన్ 1న కుల్దీప్ తన భార్య సారికతో రూ.50 లక్షల కట్నం తీసుకురాలేదని గొడవకు దిగాడు. ఆ సమయంలో అతడు తుపాకీ తీసి భార్యపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలతో సారిక అక్కడికక్కడే మరణించింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని, రక్తపు మడుగులో పడి ఉన్న సారిక మృతదేహాన్ని పోస్టుమాస్టం తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు . బార్యను హత్య చేసిన తర్వాత కుల్దీప్, అతని తండ్రి మూల్‌చంద్ ఇంట్లో నుంచి పారిపోయినట్టు తెలిపారు. పరారీలో ఉన్న తండ్రి, కొడుకును అరెస్టు చేయడానికి పోలీసు బృందాలను పంపినట్టు వెల్లడించారు. కాగా నిందితుడు కుల్దీప్ గతంలో ఓ వ్యాపారవేత్త హత్య కేసులో జైలు శిక్ష అనుభవించినట్టు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: Viral: నేను పులిరాజును.. అయితే నాకేంటి!) -
పెళ్లై ఏడాది కాకముందే.. వేధింపులతో వివాహిత ఆత్మహత్య
సాక్షి, నల్గొండ: ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలలు సంతోషంగానే జీవించారు. కానీ మొదటి పెళ్లి రోజు కూడా చేసుకోకముందే వరకట్నం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ సంఘటన హుజూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన వంగ మౌనిక(20), వంగ నాగరాజు గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా వరకట్న వేధింపులు భరించలేక మౌనిక శనివారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. దీంతో మౌనిక తల్లి సుజాత ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వివరించారు. చదవండి: ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. బాలిక కేకలు వేయడంతో! -
ఆడపిల్ల జన్మించిందని అదనపు కట్నం కావాలట...
సాక్షి, భీమదేవరపల్లి(వరంగల్ అర్బన్): ఆడ పిల్ల జన్మించడంతో అదనపు కట్నం కావాలంటూ తన భర్త వేధిస్తూ ఏడేళ్లుగా తనకు దూరంగా ఉంటున్నాడని ఓ మహిళ ఆరోపించారు. ఈ మేరకు భీమదేవరపల్లి మండలం రసూల్‌పల్లికి చెందిన కన్నెబోయిన రమ్య తన భర్త తిరుపతి ఎదుట శనివారం నిరసనకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 2014లో రసూల్‌పల్లికి చెందిన తిరుపతితో రమ్యకు పెద్దలు వివాహం జరిపించారు. ఏడాది అనంతరం పాప జన్మించడంతో తన భర్త అత్త, మామ అదనపు కట్నం తేవాలంటూ వేధించడం ఆరంభించారు. పలుమార్లు పోలీస్‌స్టేషన్, కోర్టు చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదని వాపోయింది. అయితే, భర్త నుంచి విడిపోవడం ఇష్టం లేకే ఆయన ఇంటి ఎదుట నిరసనకు దిగినట్లు వివరించింది. ఈ నిరసనలో రమ్య వెంట కుమార్తె ఆరాధ్య, తల్లితండ్రులు, బంధువులు కూడా పాల్గొన్నారు. కాగా, కేసు కోర్టులో ఉన్నందున తీర్పు ప్రకారం నడుచుకుంటానని తిరుపతి వివరణ ఇచ్చారు. -
విషాదం: పెళ్లయిన మూడు నెలలకే..
కడప అర్బన్: కడపలోని అలంఖాన్‌పల్లి దస్తగిరిపేటకు చెందిన సావిత్రి(21) అనే మహిళ వివాహమైన మూడు నెలలకే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఈ నెల 25వ తేదీ రాత్రి చోటుచేసుకుంది. మృతురాలి తల్లి పల్లపు నాగలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామానికి చెందిన పల్లపు నాగలక్ష్మమ్మ రెండో కుమార్తె సావిత్రి(21)ని కడప అలంఖాన్‌పల్లి దస్తగిరిపేటకు చెందిన ప్రతాప్‌కు ఇచ్చి ఈ ఏడాది జనవరిలో వివాహం చేశారు. కువైట్ నుంచి వచ్చిన వెంటనే ఆమెను వివాహం చేసుకున్న ప్రతాప్.. అదనపు కట్నం కోసం వేధిస్తుంటే మూడు వారాల క్రితం పుట్టింటికి వెళ్లింది. వారం క్రితం ప్రతాప్ అత్తారింటికి వెళ్లాడు. తన భార్యను పంపించకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించి.. ఆమెను తీసుకుని వచ్చాడు. తర్వాత తల్లి వెంకటమ్మ, చెల్లెలు రాజితో కలిసి భార్యను వేధించసాగాడు. ఈ క్రమంలో ఆమె ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలాన్ని సోమవారం కడప డీఎస్పీ బూడిద సునీల్, సీఐ నాగభూషణం, ఎస్ఐ రాఘవేంద్రారెడ్డి పరిశీలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడికి ఇది మూడో వివాహం నిందితుడైన ప్రతాప్‌కు సావిత్రి మూడో భార్య కావడం గమనార్హం. 2003లో చెన్నూరు మండలం ఖాదర్‌ఖాన్ కొట్టాలుకు చెందిన మల్లేశ్వరిని వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను వేధింపులకు గురి చేయగా, వాస్మోల్ ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తరువాత కోర్టులో కేసు రాజీ అయ్యారు. రెండో వివాహం సావిత్రి అక్క సంజీవరాణిని చేసుకున్నాడు. కొన్ని రోజులకే భర్తతో మనస్పర్థలు ఏర్పడి దూరంగా ఉంటోంది. రెండేళ్ల క్రితం ప్రతాప్ కువైటుకు వెళ్లాడు. అక్కడి నుంచి సావిత్రితో ఫోన్లో మాట్లాడుతూ ప్రేమాయణం సాగించాడు. ఈ ఏడాది జనవరిలో ఆమెను మూడో వివాహం చేసుకున్నాడు. ఆమెను కూడా వేధించి ఆత్మహత్యకు కారణమయ్యాడు. చదవండి: ఉత్పత్తికి ఊపిరి: రెండు ఆక్సిజన్ ప్లాంట్లకు జవసత్వాలు దారుణం: కాచుకోవాల్సిన వారే కాటికి పంపారు.. -
పెళ్లైన ఆరునెలలకే వేధింపులు.. దీంతో ఆ మహిళ..
సాక్షి, వీణవంక(హుజూరాబాద్): అదనపు వరకట్నం తీసుకురావాలంటూ అత్తింటివారు మానసికంగా, శారీరకంగా వేధించడంతో ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వీణవంక మండలం చల్లూరు గ్రామంలో విషాదం నింపింది. ఎస్సై కిరణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చల్లూరుకు చెందిన బొంగోని వీరస్వామి–విజయ దంపతులకు కుమారుడు హరీశ్, కుమార్తె అనూహ్య అలియాస్ కావ్య(24) ఉన్నారు. కావ్యను ఇదే గ్రామానికి చెందిన వరుసకు మేనబావ అయిన తీగల పరమేశ్‌కు ఇచ్చి 2018లో వివాహం చేశారు. రూ.15 లక్షలతోపాటు బైక్, ఇతర సామగ్రి కట్నంగా ఇచ్చి, పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ దంపతులకు కుమారుడు లోకేశ్(15 నెలలు) ఉండగా కావ్య ప్రస్తుతం 5 నెలల గర్భిణి. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమెకు 6 నెలలైనా గడవక ముందే భర్త పరమేశ్, అత్త భూలక్ష్మి, మామ పర్శరాములు, బావ నాగరాజు, తోటి కోడలు సంధ్య, మరిది రాము నుంచి ఛీత్కారాలు ఎదురయ్యాయి. మరో రూ.5 లక్షలు అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించసాగారు. కావ్య ఈ విషయాన్ని పుట్టింటివాళ్లకు చెప్పి, కన్నీరు పెట్టుకుంది. పలుమార్లు ఇరువర్గాల మధ్య పంచాయితీలు కూడా జరిగాయి. ఆ తర్వాత వేధింపులు ఎక్కువవడం, నిత్యం గొడవ జరుగుతుండటంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. ఆదివారం రాత్రి అత్తింట్లోనే చున్నీతో ఉరేసుకుంది. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. తహసీల్దార్ కనకయ్య ఆమె మృతదేహానికి సోమవారం పంచనామా నిర్వహించారు. హుజూ రాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు, జమ్మికుంట రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్సై కిరణ్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని, కావ్య మృతదేహాన్ని పరిశీలించారు. నిందితులపై కేసు.. అత్తింటివారి అదనపు వరకట్న వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి వీరస్వామి ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు నిందితులు ఆరుగురిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
‘కొడుకు పెళ్లైనప్పటి నుంచీ విడిగానే.. మాకు సంబంధం లేదు’
సాక్షి, చెన్నై : తాము విడిగా జీవిస్తున్నట్లు చెప్పి వరకట్నం కేసుల నుంచి భర్త, తల్లిదండ్రులు తప్పించుకుంటున్నట్లు హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. వరకట్నం చిత్రహింసలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న కేసును విచారించిన కడలూరు మహిళా కోర్టు భర్త, అతని తల్లిదండ్రులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ శిక్షకు గురైన తల్లిదండ్రులు మద్రాసు హైకోర్టులో అప్పీలు చేశారు. అందులో కుమారుడికి వివాహమైనప్పటి నుంచి తాము విడిగా జీవిస్తున్నట్లు, కోడలి ఆత్మహత్యకు తమకు సంబంధం లేదని పిటిషన్లో తెలిపారు. తమకు కింది కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి పి.వేల్మురుగన్ విచారణ జరిపారు. ఆ సమయంలో కుమారుడితో కలిసి పిటిషనర్లు కోడలిని హింసించేందుకు ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. దీంతో న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో వరకట్నం చిత్రహింసలతో మహిళల ఆత్మహత్యలు నానాటికీ పెరుగుతున్నాయని, మరోవైపు తాము ఒకటిగా జీవించడం లేదని, విడిగా జీవిస్తున్నట్లు భర్త తల్లిదండ్రులు వరకట్నం కేసుల నుంచి తప్పించుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వారు విడిగా జీవించినా మామగారి ఇంట్లో కారు, బైక్, నగలు, నగదు వరకట్నంగా తీసుకోవాల్సిందిగా కుమారుని రెచ్చగొడుతున్నట్లు తెలిపారు. ఇటువంటి కేసులో తాము విడిగా ఉంటున్నట్లు తెలిపి పలువురు శిక్షల నుంచి తప్పించుకునేందుకు పిటిషన్లు దాఖలు చేస్తున్నారని, కుమారులను సమాజంలో ప్రయోజకులుగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదని తెలిపారు. ఈ కేసులో తల్లిదండ్రులకు కింది కోర్టు విధించిన శిక్షను నిలిపివేయలేమని, ఈ కేసును తుది విచారణకు వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు. చదవండి: తమిళ సినిమాకు షాక్! ఆ సన్నివేశాలు తొలగించాల్సిందేనా? -
అప్పుడేమో ప్రేమ కావాలి.. ఇప్పుడు పైసలు కావాలి
కామారెడ్డి: ఆమె ప్రేమ పెళ్లి చేసుకుంది. కొద్దిరోజులకు భర్త కట్నం తీసుకు రావాలని వేధిస్తుండడంతో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని ఎన్జీవోఎస్ కాలనీలో నివాసం ఉండే నూకలపాటి లావణ్య అదే కాలనీకి చెందిన దేవనంద్ ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మేడ్చల్‌లో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజులు అంతాబాగానే గడిచింది. ఆ తర్వాత దేవానంద్ రూ.5 లక్షలు కట్నం తీసుకురావాలని లావణ్యను వేధించసాగాడు. లావణ్య గర్భం దాల్చడంతో అక్టోబర్‌లో తల్లిగారింటికి వచ్చింది. కట్నం తీసుకువస్తేనే కాపురానికి తీసుకువెళ్తానని తన భర్త వేధిస్తున్నాడని ఆదివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో మధుసూదన్ తెలిపారు. ( చదవండి: డబ్బు ఇవ్వలేదని.. కన్నతండ్రినే బకెట్‌తో కొట్టి.. ) -
కామారెడ్డి: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
సాక్షి, మాచారెడ్డి: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తపై చర్య తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతు భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. ఈ సంఘటన ఆదివారం మండలంలోని బండరామేశ్వర్‌పల్లిలో జరిగింది. కోడలి రాకను గమనించిన అత్త లక్ష్మీ, మామ నారాయణ ఇంటికి తాళం వేసి పరారైనట్లు ఆమె తెలిపింది. వివరాలు ఇలా ఉన్నాయి. బండ రామేశ్వర్పల్లికి చెందిన ఉట్ల శ్రీనివాస్‌కు కామారెడ్డి పట్టణానికి చెందిన గాయత్రి శరణ్యను రెండేళ్ల కింద ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం సందర్భంగా కట్న కానుకలతో పాటు నగదు, బంగారాన్ని అందజేశారు. పెళ్లయిన మూడు నెలల నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని గాయత్రి శరణ్య ఆవేదన వ్యక్తం చేసింది. వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని తనను వదిలించుకోవాలని తనపై ఎన్నో నిందలు వేస్తున్నారని ఆరోపించింది. తనను వేధిస్తున్న భర్తపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. చదవండి: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: ఎంత చెప్పినా వినలేదు! -
20 లక్షలు తీసుకురా..లేకుంటే!
రఘునాథపాలెం: అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని రఘునాథపాలేనికి చెందిన ప్రశాంతి అనే వివాహిత ఫిర్యాదుతో ఐదుగురిపై గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. తన మేనత్త కొడుకు అయిన పారుపల్లి సురేష్‌తో ప్రశాంతికి 2005లో పెళ్లి జరిగింది. ఆ సమయంలో రూ. 10 లక్షలు కట్నం ఇచ్చారు. అయితే, కొన్ని రోజులుగా తమ ఇల్లును అమ్మిడబ్బులు తేవాలని వత్తిడి చేస్తున్నారని, ఇంతటితో ఆగకుండా..రూ.20 లక్షలు ఇస్తేసరి లేకుంటే ప్రాణం తీస్తానని కూడా బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలు ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆడపడుచు భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: భార్య నగలన్నీ ఆమెకు -
ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి.. కట్నంకోసం వేధింపులు
సాక్షి, ఏలూరు: ఫేస్బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. ట్రాన్స్‌జెండర్ అని తెలిసే ప్రేమాయణం సాగించాడు. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ నువ్వు నాకు వద్దంటూ వేధింపులకు పాల్పడడంతో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇంతకీ అతను ఏలూరు సత్రంపాడుకు చెందిన యువకుడు కావటం ఆసక్తిగా మారింది. ఏలూరు సత్రంపాడుకు చెందిన తారక అలియాస్ పండు అనే యువకుడు హైదరాబాద్ ఎల్బీ నగర్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ భూమితో ఫేస్బుక్లో పరిచయం అయ్యి ప్రేమించుకున్నారు. అనంతరం 2020 జనవరిలో పెద్దలను ఒప్పించి మరీ భూమిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా కొనసాగుతుండగా ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం ప్రారంభమైంది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో యువకుడు భూమితో ఉండేందుకు నిరాకరించటంతోపాటు, అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడు తారకను అరెస్టు చేశారు. చదవండి: మృతదేహంతో దాదాపు 10 కిలో మీటర్లు చదవండి: ముందు ఛాటింగ్ .. తర్వాత ఫోన్ -
ఒక్కో డ్రెస్ ధర లక్షల్లో: నువ్వు కూడా మాట్లాడుతున్నావా?
ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందని ఆనందపడే అమ్మానాన్నలు.. అంతలోనే ఆమె ఆలనాపాలనా కంటే కూడా తన భద్రత గురించిన భయాలతోనే ఎక్కువగా ఆందోళన చెందుతారు. పురుషాధిక్య సమాజంలో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నా ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియదు. అందుకే పెళ్లీడు వచ్చిందంటే చాలు... అప్పు చేసైనా సరే ఆమెను ఓ ‘అయ్య’ చేతిలో పెట్టి అత్తవారింటికి సాగనంపాలని ఆరాటపడతారు. ఈ క్రమంలో, బిడ్డను బాగా చదివిస్తే అంతకంటే ఎక్కువ విద్యావంతుడిని అల్లుడిగా తీసుకురావాల్సి వస్తుందనే భావనతో మధ్యలోనే చదువు మాన్పించే సగటు మధ్యతరగతి తల్లిదండ్రులు నేటికీ అనేక మంది ఉన్నారు. అలాంటి వారు కూతురి చదువు కోసం చేయాల్సిన ఖర్చును ఆమె వివాహం కోసం, ముఖ్యంగా వరకట్నం కోసమే పొదుపు చేస్తారు. అంతచేసినా, ఎంత పెద్దమొత్తంలో కట్నకానుకలు ముట్టజెప్పినా నవ వధువులు అత్తారింట్లో సంతోషంగా ఉంటారనే గ్యారెంటీ లేదు. అదనపు కట్నం కోసం వేధిస్తూ కొత్తకోడళ్ల ఉసురు తీసిన అత్తమామలు, భర్తల గురించి ప్రతిరోజూ ఏదోఒక వార్త మన కంటపడుతూనే ఉంటుంది. కాబట్టి, ఆడబిడ్డలను చదివించుకుంటే అత్తారింట్లో సమస్యలు ఎదురైనా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ తమ కాళ్లమీద తాము నిలబడగలిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వరకట్నం అనే దురాచారానికి స్వస్తి పలకాలంటూ, ఐక్యరాజ్యసమితి పాకిస్తాన్ మహిళా విభాగంతో కలిసి ఫ్యాషన్ డిజైనర్ అలీ జీషన్ చేపట్టిన సోషల్ మీడియాలో చేపట్టిన ‘స్టాప్ డౌరీ’ ప్రచారం నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. నుమాయిష్- బ్రైడల్ కోచర్ వీక్ 2021లో భాగంగా అలీ వివాహ దుస్తులను డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించి.. ‘‘అమ్మాయిల చదువు కంటే కూడా వారి పెళ్లి సమయంలో వరుడికి ఇవ్వాల్సిన కట్నాన్నే ప్రథమ ప్రాధాన్యంగా భావిస్తారు. ఆ అదనపు భారాన్ని తగ్గించే సమయం ఆసన్నం అయ్యింది’’ అని ఆయన షేర్ చేసిన వీడియో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. అయితే, కొంతమంది మాత్రం అలీ రూపొందించే దుస్తుల ధర విషయాన్ని ప్రస్తావిస్తూ నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘తల్లిదండ్రులపై పడే భారం గురించి ఇంతలా ఆలోచిస్తున్న అలీ డిజైన్ చేసే ఒక్కో డ్రెస్ ధర వేలల్లో, కొన్నిసార్లు లక్షల్లో కూడా ఉంటుంది. కనీసం 5 లక్షలు పెడితేనే వధూవరులకు ఇష్టమైన దుస్తులు కొనగలుగుతారు. చాలా కుటుంబాల్లో అమ్మాయికి ఇంతకంటే తక్కువే కట్నం ఇస్తారు. అలాంటది, అలీ వరకట్నం గురించి మాట్లాడితే నవ్వొస్తోంది. ఎంతటి నయవంచకుడు తను. ఒక దురాచారం గురించి చెబుతూనే తన బిజినెస్‌ను బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఖరీదైన దుస్తులు వేసి వేయించిన ఈ నాటకం అంతగా పండలేదు’’ అని విమర్శిస్తున్నారు. వీడియోలో ఏముందంటే.. ఆడపిల్ల తల్లిదండ్రులు తొలుత టైర్లతో కూడిన బల్లపరుపు బండిని తీసుకువస్తారు. అనంతం కొత్త కాపురానికి కావాల్సిన వస్తువులన్నీ దానిపై వరుసగా పేరుస్తారు. ఇద్దరూ చెరోవైపు నిల్చుని, బండిని పైకెత్తి, పెళ్లి దుస్తుల్లో ఉన్న కుమార్తెను పిలిచి ఆమెకు దానిని అప్పగిస్తారు. పుట్టింటి వారు ఇచ్చిన కానుకలతో పాటు వరుడు కూడా ఆ బండిపై కూర్చోగా వధువు కన్నీళ్లు పెడుతూనే దానిని లాగే ప్రయత్నం చేస్తుంది. చదవండి: గుర్రంపై ఊరేగుతూ మండపానికి చేరుకున్న వధువు -
ఐఎఫ్ఎస్ భర్తపై ఐపీఎస్ భార్య ఫిర్యాదు
బనశంకరి: భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమె సాదాసీదా మహిళ కాదు, ఓ ఐపీఎస్ అధికారిణి కావడం గమనార్హం. బాధితురాలు బెంగళూరు కబ్బన్‌పార్కు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన 2009 బ్యాచ్‌కు ఐపీఎస్ అధికారిణి వర్తికా కటియార్ బెంగళూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. 2011లో ఆమెకు భారతీయ విదేశాంగ సర్వీసు (ఐఎఫ్ఎస్) అధికారి నితిన్ సుభాష్‌తో వివాహమైంది. భర్త ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేసేవారు. భర్త మద్యపానం, ధూమపానం తదితర దురలవాట్లకు లోనయ్యారని, వీటిని వదలిపెట్టాలని అనేకసార్లు మొరపెట్టుకోగా కోపంతో దాడి చేశాడని వర్తికా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2016లో ఇదే విషయమై దౌర్జన్యం చేసి తన చేయి విరిచాడని తెలిపారు. దీపావళికి కానుక ఇవ్వలేదంటూ విడాకులు కావాలని బెదిరించాడని వర్తికా పేర్కొన్నారు. తన అమ్మమ్మ వద్ద రూ.5 లక్షలు, ఇంటి కొనుగోలుకని రూ. 35 లక్షల నగదు తీసుకున్నాడని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు నితిన్ సుభాష్, అతని కుటుంబసభ్యులు మొత్తం 7 మందిపై వరకట్న వేధింపులు, దాడులు, ప్రాణ బెదిరింపులు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
వరకట్న వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
మొవ్వ(పామర్రు): పచ్చి బాలింతరాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఐదు నెలల ఆమె కుమార్తె తల్లి కోసం ఏడుస్తుండటం స్థానికులను కంట తడిపెట్టించింది. ఈ ఘటన మొవ్వ మండలం కూచిపూడి అగ్రహారంలో చోటు చేసుకుంది. కూచిపూడి ఎస్ఐ జి. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి మండలం యార్లగడ్డ గ్రామానికి చెందిన దుర్గా నాగ సుచరిత (22)కి మొవ్వ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన పెనుమూడి నాగ నరేంద్ర శర్మతో 2018 ఏప్రిల్ 27న వివాహమైంది. వీరికి 5 నెలల చిన్నారి ఉంది. ఇటీవల యార్లగడ్డ నుంచి సారెతో సహా కూచిపూడి గ్రామానికి విచ్చేసిన సుచరితకు అత్తవారింటిలో వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం మృతిచెందింది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు అత్తింటివారు ఫోన్ చేసి చెప్పారు. హుటాహుటిన చేరుకున్న కుటుంబ సభ్యులు కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కుమార్తె మృతికి భర్త నాగ నరేంద్రశర్మ, అతని తల్లి విశాలాక్షిల వరకట్న వేధింపులే కారణమని మృతురాలి తండ్రి చావలి భీమేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా సోమవారం మొవ్వ తహసీల్దార్ డెక్కా రాజ్యలక్ష్మి సమక్షంలో పంచనామ నిర్వహించి మృతదేహాన్ని బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దీపను డొంకన పడేశాడు
డొంకలాంటి ఈ ప్రాంతంలో మూడేళ్ల కుమారుడితో ఇంటి సామాను ముందు కూర్చున్న ఈమె పేరు దీప. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌కు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఓంకార్‌తో 2013లో వివాహమైంది. కొన్నాళ్లు.. కట్నంగా ఇచ్చిన భూమి తన పేరున రాసివ్వలేదని.. మరికొన్నాళ్లు అనుమానంతోనూ వేధించేవాడు. ఒకసారి ఈ వేధింపులపై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం దీప రెండు నెలల గర్భిణి. ఈ క్రమంలో ఈ నెల 3న ఓంకార్ తాగొచ్చి కత్తితో బెదిరించాడు. సర్దిచెప్పడానికి వచ్చిన ఆమె తండ్రి, సోదరుడిపై చెప్పుతో దాడిచేశాడు. అంతేగాకుండా శనివారం ఇంట్లోని సామానంతా కట్నంగా రాసిచ్చిన భూమిలో పడేసి వెళ్లిపోయాడని, అందుకే అక్కడే కూర్చుని న్యాయం కోసం ఆందోళనకు దిగినట్టు దీప వివరించింది. కాగా, పోలీసులు దంపతులిద్దరినీ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.(చదవండి: తనిఖీలు చేస్తున్నారని భార్యను వదిలేసి భర్త పరార్) – కమలాపూర్ -
'చావైనా.. బతుకైనా నీతోనే లావణ్య..’
సాక్షి, సూర్యాపేట క్రైం/కేతేపల్లి: పెళ్లయిన ఆరు నెలలకే ఆమె కలలు కల్లలయ్యాయి. ప్రేమిస్తున్నానని వెంటపడి.. కట్నకానుకలు అసలే వద్దని చెప్పిన వ్యక్తిని పెద్దల సమక్షంలో పెళ్లాడింది.. కానీ పెళ్లయిన నాటి నుంచే భర్త, అత్తమామలు కట్నం కోసం వేధించసాగారు. దీంతో ఆ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.. పోలీసులు, బంధువుల కథ నం ప్రకారం.. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌కు చెందిన ఎడ్ల సుందరయ్యకు నలుగు రు కుమార్తెలు.. వీరిలో పెద్ద కుమార్తె లావణ్య (25) సూర్యాపేటలోని బం ధువుల వద్ద ఉంటూ వెటర్నరీ సైన్స్ చదివింది. ఆ సమయంలోనే సూర్యాపేట చర్చి కాంపౌండ్‌కు చెందిన పెదపంగు ప్రణయ్‌తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా వీరి ప్రేమాయణం సాగింది. ఈ క్రమంలోనే ప్రణయ్‌కి ఏఈఓగా ఉద్యోగం వచ్చింది. సూర్యాపేట మండలం బాలెంలలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రణయ్ లావణ్య తండ్రి సుందరయ్యను కలిసి వారి ప్రేమ విషయం వివరించాడు.. ఎలాంటి కట్న కానుకలు వద్దని.. లావణ్యను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయినా సుందరయ్య వివాహ సమయంలో రూ.4 లక్షలు, 8 తులాల బంగారం, 20 గుంటల సాగు భూమిని కట్నంగా ఇచ్చాడు. పెద్దల సమక్షంలో గతేడాది జూన్ 12న బాప్టిస్టు చర్చిలో వివాహం చేశాడు. ఈ నేపథ్యంలోనే పెళ్లయిన నాటి నుంచి అదనపు కట్నం తేవాలని భర్త ప్రణయ్‌తో పాటు మామ కరుణానిధి, అత్త ఉజ్వల, మరిది సంజయ్.. లావణ్యను వేధించసాగారు. చదవండి: (చేయని నేరానికి బలైపోతున్నా..) లావణ్య మృతదేహంతో ఆందోళన చేస్తున్న బంధువులు భర్త ఇంటి ఎదుట ఆందోళన సూర్యాపేట పట్టణంలోని చర్చి కాంపౌం డ్లో భర్త ప్రణయ్ ఇంటి ఎదుట లావణ్య మృతదేహంతో బంధువులు, కుటుంబీకులు ఆందోళనకు దిగారు. అత్తారింటి వేధింపులు తట్టుకోలేకే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేట పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింపజేశారు. ఎందుకు వదిలి వెళ్లావంటూ ఆఖరి ఫోన్.. కట్నం తేవాలంటూ ఘర్షణ పడి ఈనెల 1న సాయంత్రం భార్య లావణ్యను ప్రణయ్ కొర్లపహాడ్లో అత్తారింటి వద్ద దింపి వెళ్లాడు. దీంతో మనస్తాపం చెందిన లావణ్య.. 2న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. చివరి క్షణాల్లో భర్త ప్రణయ్‌కు ఫోన్ చేసి ‘నన్ను ఎందుకు వదిలేసి వెళ్లావు’అంటూ రోదిస్తూ ప్రశ్నించింది. దీంతో ఆందోళన చెందిన ప్రణయ్.. ఆమె కుటుంబసభ్యులకు విషయాన్ని చెప్పాడు. వెంటనే వచ్చిన కుటుంబీకులు సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి లావణ్యను తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె రాత్రి మృతి చెందింది. లావణ్య తండ్రి సుందరయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి ఎస్ఐ బి.రామకృష్ణ తెలిపారు. చావైనా.. బతుకైనా నీతోనే.. ఇటు భార్య లావణ్య మృతదేహంతో ఆందోళన చేస్తుండగా.. ఇంట్లో ఉన్న ప్రణయ్ పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుం బీకులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ‘అమ్మానాన్న.. నన్ను క్షమించండి.. నా భార్య లావణ్య దగ్గరికి వెళ్లిపోతున్నా.. నా భార్య చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించండి.. చావైనా.. బతుకైనా నీతోనే లావణ్య..’ అంటూ అంతకుముందు ప్రణయ్ సూసైడ్‌నోట్ రాశాడు.. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
‘నన్ను ఎందుకు దూరం పెట్టావు’
సాక్షి సూర్యాపేట: వరకట్న వేధింపులతో నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేటలోని చర్చి కాంపౌండ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సూర్యాపేటకు చెందిన ప్రణయ్ నల్గొండ జిల్లా కొర్లపాడుకు చెందిన లావణ్య ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లికి ముందు బాగా చూసుకున్న ప్రణయ్, వివాహం జరిగినప్పటి నుంచి లావణ్యను వేధించసాగాడు. అదనపు కట్నం తీసుకు రమ్మని ఒత్తిడి చేశాడు. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి నమ్మించి మోసం చేశాడని తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య శనివారం పురుగుల మందు సేవించింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ‘నన్ను ఎందుకు దూరం పెట్టావు. ఎక్కడ ఉన్నావ్. నేను పురుగుల మందు తాగాను’ అంటూ లావణ్య చివరగా ప్రణయ్‌తో ఫోన్లో మాట్లాడిన ఆడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తమ కూతురు ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ కట్నకానుకలు ముట్టజెప్పామని, అయినా అదనపు కట్నం కావాలంటూ ప్రణయ్ వేధించాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ బిడ్డ చావుకు ప్రణయ్ వేధింపులే కారణమని తెలిపారు. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.