లక్నో: దేశంలో మహిళలపై అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అడిగినంత కట్నం ఇవ్వలేదని ఓ కిరాతకుడు.. తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ అమానుష సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆమె భర్త, అతడి స్నేహితులపై ఛకేరీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2020, మార్చి 6 నిందితుడితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె భర్త, ఆడపడుచు రూ.2 లక్షలు, కారు కట్నంగా ఇవ్వాలని వేధిస్తున్నారు. అయితే.. అడిగిన డబ్బు, కారు ఇవ్వలేకపోవటం వల్ల ఆమెను ఓ గదిలో పెట్టి తాళం వేశారు. ఒక రోజు ఆమె భర్త తన ముగ్గురు స్నేహితులను ఇంటికి తీసుకొచ్చాడు. నలుగురు కలిసి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తనను చంపేసేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు సైతం ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ మ్రిగాంక్ పతాక్ తెలిపారు.
ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక!
Comments
Please login to add a commentAdd a comment