Kanpur
-
ఇజ్రాయెల్ మెషీన్‌తో చిటికెలో నవయవ్వనం, కట్ చేస్తే రూ. 35 కోట్లు
ఆరుపదుల వయసుదాటినా నవయవ్వనంతో మెరిసిపోవాలి. ముఖం మీద చిన్నముడత కూడా ఉండకూడదు. దీనికోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు కొంతమంది. ఈ క్రేజ్‌నే క్యాష్ చేసుకొంటున్నారు మరికొంతమంది కేటుగాళ్లు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న రూ. 35 కోట్ల ఘరానా మోసం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది.ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రాజీవ్ కుమార్ దూబే , అతని భార్య, రష్మీ దూబే జంట అమాయకులను నమ్మించి వలలో వేసుకుంది. "ఇజ్రాయెల్‌లో తయారైన టైమ్ మెషిన్" ద్వారా అందర్నీ నవ యవ్వనంగా మారుస్తామంటూ కొంతమంది వృద్ధులను బుట్టలో వేసుకుంది. కలుషిత గాలి వల్ల వేగంగా వృద్ధాప్యానికి గురవుతున్నామని, ‘ఆక్సిజన్ థెరపీ’ ద్వారా నెలరోజుల్లో యవ్వనం వస్తుందని చెప్పి నమ్మబలికారు. అలా ఏకంగా 35 కోట్ల రూపాయలను దండుకుంది. ఇందుకోసం కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్ ప్రాంతంలో థెరపీ సెంటర్ - ‘రివైవల్ వరల్డ్ ’ ను ప్రారంభించారు. "ఆక్సిజన్ థెరపీ" తో ఏకంగా 60 ఏళ్ల వ్యక్తిని 25 ఏళ్ల యువకుడిగా మార్చేస్తామని చెప్పారు. ఒక్కో సెషన్‌కు ఆరు వేలు, మూడేళ్ల రివార్డ్ సిస్టమ్ కోసం రూ. 90వేలు... ఇలా రకరకాల ప్యాకేజీలను ఆఫర్ చేశారు. అయితే మోసం ఎన్నాళ్లో దాగదు కదా. బాధితుల్లో ఒకరైన రేణు సింగ్ ఫిర్యాదుతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తాను రూ. 10.75 లక్షలు మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వందలాది మందిని సుమారు రూజ35 కోట్లు మోసం చేశారని కూడా ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి అంజలి విశ్వకర్మ తెలిపారు. ప్రస్తుతం నిందితులు విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. -
భారత్- బంగ్లా టెస్టుకు వర్షం అడ్డంకి.. మూడో రోజు ఆట కూడా డౌటే?
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా ప్రారంభం కాలేదు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రీన్ పార్క్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.అయితే ప్రస్తుతం కాన్పూర్‌లో వర్షం కురవడం లేదు. దీంతో మైదానాన్ని సిద్దం చేసే పనిలో గ్రౌండ్ స్టాప్ పడ్డారు. గ్రీన్ పార్క్ స్టేడియంలో మెరుగైన డ్రైనజీ వ్యవస్ధ లేకపోవడంతో గ్రౌండ్‌ను రెడీ చేసేందుకు సిబ్బందికి కష్టతరం అవుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు అంపైర్లు పిచ్‌ను పరిశీలించనున్నారు. కాగా ఇప్పటికే రెండో రోజు(శనివారం) ఆట కనీసం బంతి పడకుండానే రద్దు అయింది. ఇప్పుడు మూడో రోజు ఆటకు కూడా భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. మళ్లీ వర్షం ఏమైనా తిరుగుముఖం పడితే మూడో రోజు ఆట కూడా రద్దు అయ్యే అవకాశముంది. కాగా బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్బంగ్లాదేశ్షాద్మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్. -
Ind vs Ban 2nd Test: 35 ఓవర్లకే ముగిసిన ఆట
IND vs BAN 2nd test live updates and highlights: టీమిండియా- బంగ్లాదేశ్ తొలి రోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. వర్షం కారణంగా 35 ఓవర్లకే ఆగిపోయింది. దీంతో శుక్రవారం ఆట పూర్తయినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటన విడుదల చేసింది. కాన్పూర్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 35 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఆటంకంటీమిండియా- బంగ్లాదేశ్ రెండో టెస్టు తొలి రోజు ఆటకు ఆటంకం కలిగింది. వెలుతురులేమి కారణంగా ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు.సెంచరీ మార్కు దాటిన బంగ్లాదేశ్34 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 102-3.మొమినుల్ హక్ 36, ముష్ఫికర్ రహీం 5 పరుగులతో ఆడుతున్నారు. అశ్విన్ మ్యాజిక్.. బంగ్లా మూడో వికెట్ డౌన్కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో రూపంలో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన శాంటో.. అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 30 ఓవర్లకు బంగ్లా స్కోర్: 80/3. క్రీజులోకి రహీం వచ్చాడు.నిలకడగా ఆడుతున్న బంగ్లాబంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. తొలి రోజు లంచ్ సమయానికి బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. క్రీజులో మమూనల్ హాక్(17), శాంటో(28) పరుగులతో ఉన్నారు. కాన్పూర్‌లో వర్షం కూడా మొదలైంది.రెండో వికెట్ డౌన్..షాద్మాన్ ఇస్లాం రూపంలో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన షాద్మాన్.. ఆకాష్ దీప్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కెప్టెన్ శాంటో వచ్చాడు. 13 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 37/2తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాబంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. పేసర్ ఆకాష్ దీప్ బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్‌ను పెవిలియన్‌కు పంపాడు. జైశ్వాల్ స్లిప్‌లో అద్బుతమైన క్యాచ్ అందుకున్నాడు. క్రీజులోకి మమూనల్ హాక్ వచ్చాడు.5 ఓవర్లకు బంగ్లా స్కోర్: 13/05 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో షద్మాన్ ఇస్లాం(8), జకీర్ హసన్(0) ఉన్నారు.బౌలింగ్ ఎంచుకున్నభారత్..కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. బంగ్లా మాత్రం రెండు మార్పులు చేసింది. జట్టులోకి టాస్కిన్ ఆహ్మద్, నహిద్ రాణా స్ధానంలో ఖాలీల్ ఆహ్మద్, తైజుల్ ఇస్లాం వచ్చారు. గ్రీన్ పార్క్ పిచ్ కాస్త స్పిన్‌కు అనుకూలించే ఛాన్స్ ఉన్నందన అదనపు స్పిన్నర్‌తో బంగ్లా ఆడుతోంది.తుది జట్లుబంగ్లాదేశ్: షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్టాస్ ఆలస్యంకాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమవ్వాల్సిన రెండో టెస్టుకు వరుణుడు ఆడ్డంకిగా మారాడు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రీన్ ఫీల్డ్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.ప్రస్తుతం వర్షం ఆగడంతో గ్రౌండ్‌ను సిద్దం చేసే పనిలో సిబ్బంది పడ్డారు. దీంతో 9:00 గంటలకు పడాల్సిన టాస్ కాస్త ఆలస్యం కానుంది. మైదానాన్ని అంపైర్లు 9:30లకు పరిశీలించనున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు బయటకు వచ్చి సాధన చేస్తున్నారు. -
భారత్-బంగ్లా రెండో టెస్టు.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!
భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టుకు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27 నుంచి ఇరు జట్ల మధ్య సెకెండ్ టెస్టు ప్రారంభం కానుంది. భారత్ క్లీన్ స్వీప్‌పై కన్నేయగా.. మరోవైపు బంగ్లా ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆట తొలి రెండు రోజుల పాటు కాన్పూర్‌లో భారీ వర్షం కురిసే అవకాశన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27(శుక్రవారం), శనివారం నాడు 90 శాతానికి పైగా వర్షం కురిసే అవకాశం ఉందని ఆక్యూ వెదర్ రిపోర్ట్ చెబుతోంది. ఆదివారం కూడా వర్షం కురవడానికి 50 శాతం ఆస్కారం ఉందని ఆక్యూ వెదర్ రిపోర్ట్ తెలుపుతుంది.ఆఖరి రెండు రోజులకు ఎటువంటి వర్షం ముప్పులేనిట్లు సమాచారం. అయితే భారీ వర్ష సూచన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ ఆప్రమత్తమైంది. ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ నుంచి అదనపు కవర్లను తెప్పించేందుకు యూపీసీఎ సిద్దమైంది. ముందు జాగ్రత్తగా మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచాలని యూపీసీఎ అధికారులు భావిస్తున్నారు. అయితే కాన్పూర్ గ్రౌండ్లో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. దీంతో చిన్నపాటి వర్షం పడిన కూడా మ్యాచ్‌కు తీవ్ర అంతరాయం కలిగే చాన్స్ ఉంది. మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు నిరసనగా ఈ సిరీస్‌ను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిరసనలు చేపట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో కాన్పూర్ స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఇరు జట్లు ఇప్పటికే కాన్పూర్‌కు చేరుకున్నాయి. -
గంభీర్ మరో మాస్టర్ ప్లాన్.. ఇక బంగ్లాకు చుక్కలే?
భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టుకు సమయం అసన్నమైంది. కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పడు రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు తొలి టెస్టులో విఫలమైన బంగ్లాదేశ్ కనీసం కాన్పూర్ టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.మూడేళ్ల తర్వాత..కాగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరగా 2021లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడింది. ఆఖరి సెషన్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో కివీస్ అసాధారణ పోరాటం కనబరిచింది. ఈమ్యాచ్‌తోనే రచిన్ రవీంద్ర కివీస్ తరపున టెస్టు క్రికెట్‌లోకకి అడుగుపెట్టాడు.బంగ్లాకు స్పిన్ ఉచ్చు..ఇక రెండో టెస్టుకు ముందు భారత జట్టు మెనెజ్‌మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకారం.. ఈ మ్యాచ్ కోసం గ్రీన్ పార్క్ మైదానంలో బ్లాక్ సోయిల్ పిచ్‌ను తాయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతం గంభీర్ దగ్గరుండి పిచ్‌ను తాయారు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బ్లాక్ సోయిల్ పిచ్ బౌన్స్ తక్కువగా ఉండి, టర్న్ ఎక్కువగా ఉంటుంది. మ్యాచ్ కొనసాగే కొద్దీ వికెట్ స్లో కానుంది. దీంతో ఈ ట్రాక్‌పై స్పిన్నర్లు పండుగ చేసుకుంటారు. ఈ క్రమంలో భారత స్పిన్ జోడీ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మరోసారి బంగ్లా బెండు తీసే అవకాశముంది. మరోవైపు బంగ్లాలో కూడా షకీబ్, మెహదీ హసన్ వంటి క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు.కాగా చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెడ్ సాయిల్ పిచ్‌ను ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఈ వికెట్ పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్, స్పిన్‌కు సహకరించింది. కానీ నల్లమట్టి పిచ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఈ క్రమంలో కాన్పూర్ టెస్టులో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: IT 2024: జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్! సంజూకు నో ఛాన్స్ -
భారత్-బంగ్లా రెండో టెస్టు.. గ్రీన్ పార్క్ స్టేడియం వద్ద భారీ భద్రత
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌పై టీమిండియా కన్నేసింది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టులో బంగ్లాతో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. అయితే గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ సోమవారం గ్రీన్ పార్క్ స్టేడియం ముందు అఖిలేష్ భారతీయ హిందూ మహాసభ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడెంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బంగ్లా జట్టు బస చేసే హోటల్ వద్ద భద్రతను భారీగా పెంచినట్లు కాన్పూర్ అదనపు పోలీసు కమిషనర్ హరీష్ చందర్ తెలిపారు.యూపీ పోలీస్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ అదనపు భద్రతను ఏర్పాటు ఆయన వెల్లడించారు. అదే విధంగా మ్యాచ్ జరిగే సమయంలో సీనియర్ ర్యాంక్ స్ధాయి ఆధికారులు కూడా బందోబస్తులో ఉంటరాని హరీష్ చందర్ స్పష్టం చేశారు. కాగా రెండో టెస్టు కోసం ఇరు జట్లు మంగళవారం సాయంత్రం కాన్పూర్‌కు చేరుకోనున్నాయి.చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
రైలు పట్టాలపై సిలిండర్.. బయటపడిన మరో కుట్ర
కాన్పూర్: దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను ఉంచి, రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని దుండగులు ప్రయత్నించారు. కాన్పూర్ నుంచి ఫతేపూర్‌కు వెళ్లే ఢిల్లీ హౌరా రైల్వే ట్రాక్‌పై రైల్వే సిబ్బందికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనిపించింది.కాన్పూర్‌లోని ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో లూప్ లైన్లో ఎల్పీజీ సిలిండర్‌ను ఉంచారు. ఈ ఘటన నేడు (ఆదివారం) తెల్లవారుజామున 5.50 గంటలకు జరిగింది. లోకో పైలట్ అసిస్టెంట్, లోకో పైలట్ ప్రమాదాన్ని గుర్తించి, ఎమర్జెన్సీ బ్రేక్ వేయడం ద్వారా రైలును ఆపారు. రైలులోని ఉద్యోగులు ఈ విషయాన్ని ఆర్పీఎఫ్కి, డిపార్ట్మెంట్లోని ఇతర అధికారులకు తెలియజేశారు.ఘటనా స్థలానికి సంబంధించిన చిత్రాలలో రైల్వే ట్రాక్‌పై ఐదు కిలోల గ్యాస్ సిలిండర్‌ను ఉంచడాన్ని గమనించవచ్చు. పైలట్, అసిస్టెంట్ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో రైలును పట్టాలు తప్పించే కుట్ర విఫలమైంది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర మధ్య రైల్వే జోన్‌లోని ప్రయాగ్‌రాజ్ డివిజన్ పీఆర్వో అమిత్ సింగ్‌కు సమాచారం అందించారు.ఇది కూడా చదవండి: పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్- పూణె స్పెషల్ రైలు -
తల లేకుండా మహిళ మృతదేహాం.. యూపీలో కలకలం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో తలలేకుండా.. నగ్నంగా గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించడం కలకలం రేపుతోంది. కాన్పూర్ సమీపంలోని గుజైనా జాతీయ రహదారిపై బుధవారం ఉదయం మహిళ నగ్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాధితురాలిపై అత్యాచారం చేసి, హత్యచేసి రహదారిపై పడేసే ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన వెలుగులోకి వచ్చి 24 గంటలు గడిచినా ఈ కేసులో పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేదు. అయితే ఆమె ఎవరు? అనేది ఇంకా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.బుధవారం ఉదయం 5 గంటలకు తలలేని మహిళ మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. మృతదేహాం పడి ఉన్న ప్రాంతానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. సంఘటన స్థలం దగ్గర ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు కానీ.. హైవేకి అవతలి వైపున ఉన్న ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మృతదేహాన్ని గుర్తించడానికి కొన్ని గంటల ముందు అలాగే ఉన్న ఓ మహిళ నడుచుకుంటూ వెళ్లడం రికార్డయ్యిందని పోలీసులు తెలిపారు. ఫుటేజీలో మహిళ బూడిద రంగు ప్యాంటు ధరించి కనిపించగా.. మృతదేహానికి సమీపంలోనూ బూడిద రంగు దుస్తులముక్కలు కనిపించాయని పేర్కొన్నారు. మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జిల్లాలో మహిళ మిస్సింగ్‌పై తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. అయితే ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: శ్రుతి జీవితంలో మరో పెను విషాదంమరోవైపు ఘటనా స్థలిని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి, ఆమె దంతాలు, ఎముకల నుంచి నమూనాలను సేకరించారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేదా నేరమా? బాధితురాలు స్థానిక మహిళేనా? వేరే ప్రాంతానికి చెందింది అనేది నిర్దారించేందుకు ప్రయత్నిస్తున్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.ఇదిలా ఉండగా ఈ ఘటనపై ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో మహిళలపై జరిగిన మరో షాకింగ్ ఘటన ఇది.. తల లేకుండా.. నగ్నంగా ఉన్న మహిళ మృతదేహాన్ని కాన్పూర్ జాతీయ రహదారిపై గుర్తించారు.. ఈ అంశంపై నిప్పక్షపాతంగా విచారణ జరిపించి.. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే భయపడేలా నిందితులకు కఠిన శిక్ష విధించాలి’ అని డిమాండ్ చేశారు. -
బంతితో చెలరేగిన రింకూ సింగ్.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు
ఇప్పటి వరకు తన బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్న టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్.. ఇప్పుడు తన బౌలింగ్ నైపుణ్యాలతోనూ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. దీంతో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇలాగే నిలకడగా రాణిస్తే భారత జట్టుకు మరో అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దొరికినట్టేనంటూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్ యూపీ టీ20 లీగ్ 2024లో మీరట్ మెవెరిక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ క్రమంలో సారథ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రింకూ... ఆల్‌రౌండ్ ప్రతిభతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల నోయిడా సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 64 పరుగులు చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన విషయం తెలిసిందే. తాజాగా కాన్పూర్ సూపర్‌స్టార్స్‌తో మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.ఏకనా క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ మెవెరిక్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన స్వస్తిక్ చికరా డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అక్షయ్ దూబే సైతం 14 బంతుల్లో 11 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాతి స్థానంలో వచ్చిన మాధవ్ కౌశిక్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. క్రమంగా క్రీజులో పాతుకుపోయి అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. మాధవ్ 18, రితురాజ్ శర్మ 14 పరుగులతో ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను తొమ్మిది ఓవర్లకు కుదించారు. అప్పటికి మెవెరిక్స్ స్కోరు 49-2.26 బంతుల్లో 52 పరుగులువర్షం తగ్గిన తర్వాత మళ్లీ ఆట మొదలుపెట్టగా మాధవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత తొమ్మిది ఓవర్లలో మెవెరిక్స్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.ఈ నేపథ్యంలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కాన్పూర్ సూపర్‌స్టార్స్‌కు 106 పరుగుల లక్ష్యం విధించారు. ఈ క్రమంలో ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిన కాన్పూర్ టార్గెట్ ఛేదించేలా కనిపించింది. అయితే, ఆరో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన మెవెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్.. స్పిన్ మాయాజాలంతో కాన్పూర్ బ్యాటర్లకు వరుస షాకులిచ్చాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్‌కు ఫోర్‌తో స్వాగతం పలికిన శౌర్య సింగ్(5).. ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆదర్శ్ సింగ్, సుధాంశుల వికెట్లు కూడా పడగొట్టాడు రింకూ. ఒకే ఓవర్లో మూడు వికెట్లు(3/7) పడగొట్టి కాన్పూర్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో 7.4 ఓవర్లలోనే కాన్పూర్ కథ(83 రన్స్) ముగియగా.. 22 పరుగుల తేడాతో మీరట్ మెవెరిక్స్ జయభేరి మోగించింది. దీంతో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by UP T20 League (@t20uttarpradesh) -
యూపీలో మరో రైలు ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్-కాన్పూర్ రైల్వే లైన్లో కాస్గంజ్ నుంచి ఫరూఖాబాద్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురయ్యింది. ట్రాక్‌పై ఉంచిన భారీ కర్ర దుంగను ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొంది. దానిని రైలు ఇంజిన్ 550 మీటర్ల దూరంవరకూ ఈడ్చుకెళ్లడంతో ఇంజిన్ ముందు భాగంలో దుంగ ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో డ్రైవర్ రైలును నిలిపివేశారు.ఈ ఘటనలో ప్రమాదమేమీ జరగలేదు. సమాచారం అందుకున్న రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాన్పూర్ డివిజన్లో వారం వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం. గత శుక్రవారం నాడు పంకిలో బండరాయిని ఢీకొనడంతో సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీలన్నీ పట్టాలు తప్పాయి. ఆ ఘటనపై విచారణ కొనసాగుతోంది. తాజాగా కాస్గంజ్ నుండి ఫరూఖాబాద్ వెళ్లే ప్రత్యేక రైలు (05389) భటాసా స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై ఉంచిన భారీ కర్ర దుంగను ఢీకొంది. నాలుగున్నర అడుగుల పొడవున్న దుంగ బరువు 35 కిలోలు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.సెక్షన్ ఇంజనీర్ రైల్వే పాత్ జహీర్ అహ్మద్, ఆర్పీఎఫ్ ఇన్ చార్జి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అంకుష్ కుమార్, ఇంజన్ విభాగానికి చెందిన రాజేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఆ కర్ర దుంగను తొలగించి 33 నిమిషాల తర్వాత రైలును పంపించారు. ఘటనా స్థలానికి 50 అడుగుల దూరంలో ఒక పొలంలో మృతదేహం పడివుండటాన్ని వారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. -
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్
కాన్పూర్/న్యూఢిల్లీ: వారణాసి– అహ్మదాబాద్ మధ్య నడిచే సబర్మతి ఎక్స్‌ప్రెస్ శనివారం యూపీలో పట్టాలు తప్పింది. పట్టాలపైనున్న ఒక వస్తువు రైలింజిన్‌ను బలంగా తాకడంతో 20 బోగీలు పట్టాలు తప్పాయి. కాన్పూర్–భీమ్సేన్ రైల్వే స్టేషన్ల మధ్య తెల్లవారు జామున 2.35 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్దంతో బోగీలు ఊగుతూ, రైలు నిలిచిపోవడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కిపడి లేచారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి అపాయం వాటిల్లలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఘటన అనంతరం ప్రయాణికులందరినీ బస్సుల్లో కాన్పూర్ రైల్వే స్టేషన్‌కు, అక్కడికి నుంచి వేరే రైళ్లలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కుట్ర కోణంలో దర్యాప్తు‘రైలు పట్టాలపైనున్న ఓ వస్తువు ఇంజిన్‌ను తాకినట్లు ఆనవాళ్లున్నాయి. అన్ని ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. యూపీ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు’అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘బండరాయి వంటిదేదో గట్టిగా గుద్దుకోవడంతో ఇంజిన్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతిని, వంగిపోయినట్లు లోకో పైలట్ చెబుతున్నారు. 16వ బోగీ సమీపంలో మాకు దొరికిన వస్తువే ఇంజిన్ దెబ్బతినేందుకు కారణమై ఉండొచ్చు. ఇది సంఘ వ్యతిరేక శక్తుల పని’గా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
చిడతలు వాయిస్తూ బీజేపీ ఎమ్మెల్యే సందడి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ నాలుగో దశ పోలింగ్ సందడిగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌కు చేరుకోవడం ప్రారంభించారు. ఈ దశలో యూపీలోని 13 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో మొత్తం 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు.కాన్పూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మైతాని సందడి చేశారు. చిడతలు, తాళాలు, డోలు వాయిస్తూ ఊరేగింపుగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటర్లందరూ ఉత్సాహంగా బయటకు వచ్చి ఓటేసేలా చైతన్యపరచడానికి ఇలా చేసినట్లు ఆయన వివరించారు. -
Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
కనౌజ్/కాన్పూర్: విపక్షాల ‘ఇండియా’ కూటమి తుపాను ఉత్తరప్రదేశ్‌లోకి దూసుకొస్తోందని ఈ ధాటికి మరోసారి మోదీ ప్రధాని కాలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. యూపీలో 80 స్థానాలకుగాను కనీసం 50 చోట్ల మా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్, కాన్పూర్లలో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్ మాట్లాడారు. ‘‘ దేశ ప్రధానిగా మోదీ మరోసారి పగ్గాలు చేపట్టలేరని లిఖితపూర్వక గ్యారెంటీగా భావించండి. ఇక అంతా అయిపోయింది. బీజేపీ ఓటమి ఖాయం. అందుకు అనుగుణంగానే విపక్షాల కూటమి చాన్నాళ్ల క్రితమే ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించింది. విద్వేష బజార్లలో ప్రేమ దుకాణాలను తెరిచాం. భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర చేశాం. దేశవ్యాప్తంగా విపక్షాల సమావేశాలు నిర్వహించాం’’ అని అన్నారు. పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలతో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్న మోదీ ఆరోపణలపై రాహుల్ స్పందించారు. ‘‘ ఓటర్లు పదేళ్ల నుంచి చూస్తున్నారు. ఒక్కసారైనా మోదీ అదానీ, అంబానీల పేరెత్తలేదు. కానీ ఇప్పుడు ఓటమి సుడిగుండం నుంచి కాపాడతారేమోనని వాళ్ల పేర్లు తొలిసారిగా ప్రస్తావిస్తున్నారు. ఓడిపోతున్నాను.. కాపాడండి అదానీ, అంబానీజీ అంటూ మోదీ ప్రాథేయపడుతున్నారు’’ అని రాహుల్ వెటకారంగా మాట్లాడారు. మోదీకి టెంపో బాగా తెలుసు టెంపోల నిండా అదానీ, అంబానీల నుంచి నగదు మూటలు వచ్చినందుకేæ కాంగ్రెస్ నోరుమూసుకుందని మోదీ అనడంపై రాహుల్.. ‘‘ అంటే మోదీకి తరచూ అదానీ డబ్బులను టెంపోలో పంపిస్తారన్నమాట. ఏ రకం టెంపోలో డబ్బులు పంపిస్తారో ఆయనకు బాగా తెలుసు. టెంపోల గురించి మోదీకి బాగా అవగాహన ఉన్నట్లుంది’’ అని అన్నారు. -
బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
బాకీ తీర్చని ఓ టీనేజర్‌పై సీనియర్లు దాష్టికానికి దిగారు. తీర్చాల్సిన బాకీ కంటే ఎన్నో రెట్ల డబ్బులివ్వాలంటూ బెదిరించారు. ఇవ్వలేనని చెప్పడంతో వేధింపులకు దిగారు. ఆ వేధించడం మరీ హింసాత్మకంగా ఉండడం.. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.ఉత్తరప్రదేశ్ ఎటావాకు చెందిన టీనేజర్.. నీట్ కోచింగ్ కోసం కాన్పూర్ వచ్చాడు. కోచింగ్ సెంటర్లో సీనియర్లతో స్నేహం కుదిరి..వాళ్లు ఉంటున్న ప్లాట్‌కి మకాం మార్చాడు. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ కోసం వాళ్ల దగ్గరి నుంచి రూ.20 వేలు తీసుకున్నాడు. అయితే గేమ్‌లో ఆ డబ్బంతా పొగొట్టుకున్నాడు.దీంతో.. ఆ సీనియర్లు 20 వేలకు బదులు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. సదరు విద్యార్థి చెల్లించకలేకపోయేసరికి.. అతన్ని చిత్రహింసలు పెడుతూ ఆ తతంగం అంతా వీడియో తీశారు. ఆ విద్యార్థినిని కింద పడేసి చితకబాదారు. కాళ్లు మొక్కుతున్నా విడిచిపెట్టకుండా.. బలవంతంగా అతని దుస్తులు విప్పించారు. మర్మాంగానికి ఇటుకను కట్టి వేలాడదీస్తూ వేధించారు. ఈ దాష్టీకం ఇంతటితోనే ఆగలేదు. అతని వెంట్రుకల్ని తగలబెట్టే ప్రయత్నమూ చేశారు.#UttarPradesh: Students preparing for #NEET in #Kanpur brutally beat up their classmate. He was hung by tying a rope around his private part. They tried to burn his hair with fire spray.Actually, the victim student lost 20K in an online game. pic.twitter.com/TO1MhtAt0y— Siraj Noorani (@sirajnoorani) May 7, 2024చివరకు బాధితుడు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎటావా పోలీసులు నిందితులను పిలిపించి.. కేవలం మందలించి వదిలేశారు. ఈలోపు టీనేజర్‌ను వేధించిన వీడియోలు వాట్సాప్ ద్వారా బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వీడియోలో ఉన్న ఆరుగురు నిందితులను గుర్తించి.. అరెస్ట్ చేశారు. ఒక ముఠాగా మారి కోచింగ్‌సెంటర్‌కు వచ్చే విద్యార్థులను వీళ్లు టార్గెట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. -
స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి నానారావ్ పార్కులో బీజేపీ ప్రభుత్వం నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ఎన్నాళ్లయినా అందుబాటులోకి రాకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్‌పాయ్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.కాన్పూర్ పట్టణంలోని నానారావ్ పార్క్ ఎంతో పురాతనమైనది. యోగి ప్రభుత్వం పార్కు నిర్వహణ, సుందరీకరణకు సంబంధించి పలు వాగ్దానాలు చేసింది. వీటిలో స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఒకటి. అయితే ఏళ్లు గడుస్తున్నా ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తికాలేదు. దీనిపై ఎస్పీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్‌పాయ్ నిరసన ప్రదర్శన చేపట్టారు.ఆయన ఒక చిన్న బాత్ టబ్‌తో ఈ పార్కుకు చేరుకుని, దానిని నీటితో నింపారు. ఆ తర్వాత ఆ టబ్‌లో ఆయన కూర్చున్నారు. దానిలోనే ఎంజాయ్ చేస్తూ, స్వీట్లు కూడా తిన్నారు. పైగా పక్కనే ఒక బ్యానర్ తగిలించి, దానిపై ‘రూ.11 కోట్ల విలువైన స్విమ్మింగ్ పూల్ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు’ అని రాశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్విమ్మింగ్ పూల్‌పై సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, నగర ప్రజలు వేసవిలో ఇక్కడ ఎంజాయ్ చేయలేకపోతున్నారని వాపోయారు. ఈ కొలను 2023లోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోలేదన్నారు. దీని నిర్మాణంలో ఆర్థిక సమస్య లుంటే తమకు తెలియజేయాలని, అప్పుడు ప్రజల నుండి విరాళాలు సేకరించి అందజేస్తామన్నారు. -
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాద్లో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలులో ఒక యువకుడు తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో భార్యపై దాడిచేసి, రైలు నుంచి దూకి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను వేడుకున్నారు.బాధితురాలు పుఖ్రాయాన్ పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆమె భర్తతో సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు కట్నం డిమాండ్ చేస్తూ తన భర్త విడాకులు ఇచ్చాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.ఈ ఉదంతం గురించి భోగానిపూర్ పోలీసు అధికారి మాట్లాడుతూ బాధితురాలు రాజస్థాన్‌కు చెందిన మహిళ అని, నఫీజుల్ హసన్ కుమారుడు మహమ్మద్ అసద్ ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఆ తరువాత నుంచి భర్త మహ్మద్ అసద్ అత్తామామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా భర్త తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆమె తెలిపారు. -
‘దోమలు బాబోయ్ దోమలు’.. రైల్వే మంత్రికి ప్రయాణికుని ఫిర్యాదు!
దేశంలోని కొన్ని రైళ్లలో ప్రయాణాలు సాగించే ప్రయాణికులు పలు సమస్యలను ఎదుర్కొంటుండటాన్ని మనం చూసే ఉంటాం. అయితే తొలి కార్పొరేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌లోనూ సమస్యలు వెంటాడుతున్నాయి. దోమల బెడదతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్నో- ఢిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ (82501)లో ప్రయాణం సాగించిన ఒక ఒక ప్రయాణికుడు దోమల బెడద గురించి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు సోషల్ సైట్ ‘ఎక్స్’ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో చలనం కలిగింది. ఈ ఘటనపై 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని తేజస్ రైలు నిర్వహణ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ శర్మ అనే ప్రయాణికుడు ‘ఎక్స్’ ప్లాట్ఫారంలో ‘నేను లక్నో నుండి న్యూఢిల్లీకి తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్పప్పుడు రైలు దోమల నిలయంగా కనిపించింది. ఇది ప్రతిష్టాత్మక రైలులో తలెత్తిన సమస్య. ఈ రైలు ఛార్జీలు విమాన చార్జీలతో సమానంగా ఉన్నాయి’ అంటూ రైల్వే మంత్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో కలకలం చెలరేగింది. దీనిపై వెంటనే దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. -
తండ్రీకొడుకుల మధ్య చిచ్చురేపిన క్రికెట్ మ్యాచ్.. ఛార్జర్ కేబుల్‌తో ఉరేసి..
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాాచ్ను యావత్ క్రికెట్ అభిమానులంతా ఆసక్తికరంగా వీక్షించారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ హై ఓల్టేజ్ పోరును, టీవీ, హాట్‌స్టార్, పలుచోట్ల భారీ స్క్రీన్ల ద్వారా ఉత్కంఠగా చూశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫైనల్ ఫీవర్ దేశం మొత్తాన్ని ఊపేసింది. అయితే వరల్డ్ కప్ తుది పోరు ఓ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టింది. ఇంట్లో టీవీ చూస్తున్న ఓ తండ్రి.. మ్యాచ్ మధ్యలో టీవీ ఆపేశాడన్న కోపంతో కన్న కొడుకుతో వాగ్వాదానికిదిగాడు. ఈ క్రమంలో గొడవ పెద్దది కావడంతో ఆవేశంలో కొడుకును హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం వెలుగుచూసింది,. వివరాలు.. కాన్పూర్‌కు చెందిన గణేష్ ప్రసాద్ అనే వ్యక్తి ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నాడు. ఈ సమయంలో అతడి కుమారుడు దీపక్.. తనకు ఆకలిగా ఉండటంతో త్వరగా వంట చేయాలని కోరాడు. తన మాటలను తండ్రి పట్టించుకోకుండా మ్యాచ్‌లో లీనమైపోవడంతో దీపక్ టీవీని ఆఫ్ చేశాడు. దీంతో గణేష్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి కొడుకుతో గొడవపడ్డాడు. ఇది ఇద్దరి మధ్య కొట్లాటకు దారితీసింది. చదవండి: అయ్యయ్యో..ఎంత విషాదం: మంచికోసం వెళ్లి..మృత్యు ఒడిలోకి! అప్పటికే మద్యం మత్తులో ఉన్న గణేష్ ప్రసాద్.. పక్కనే ఉన్న మొబైల్ ఛార్జర్ కేబుల్‌తో కొడుకును ఉరేసి చంపాండు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. మెట్లపై దీపక్ మృతదేహాన్ని పడి ఉండటాన్ని గుర్తించిన వారి బంధువు.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కాన్పూర్ ఏసీపీ బ్రిజ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్ విషయంలో జరిగిన గొడవే హత్యకు కారణమైందని వెల్లడించారు. నిందితుడు హత్యకు మొబైల్ ఛార్జర్ కేబుల్‌ను ఉపయోగించాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారని చెప్పారు. తండ్రీ కొడుకులిద్దరూ తరుచూ మద్యం సేవించి గొడవ పడుతుంటారని తెలిసినట్లు పేర్కొన్నారు. ఇటీవల దీపక్ తన తల్లిని కొట్టాడంతో గతవారం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. -
దీపావళి విషాదం: యూపీలో పేలిన బాంబు.. ఒకరి మృతి!
దీపావళి రోజున ఉత్తరప్రదేశ్(యూపీ)లోని కాన్పూర్ దేహత్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్ధంతో బాంబు పేలడంతో రసూలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం చెలరేగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలోని కొంతమంది 20 అడుగుల మేర గాలిలో ఎగిరిపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీపావళి రోజు సాయంత్రం రసూలాబాద్ నుంచి కాన్పూర్ నగర్ వెళ్లే రోడ్డులో పలువురు పటాకులు, మిఠాయిలు కొంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి సుఫియాన్ మృతిచెందాడు. సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. గాయపడివారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వారిని కాన్పూర్‌కు తరలించారు. సాధారణ పటాకుల వల్ల పేలుడు సంభవించలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో కూలిన సొరంగం: ప్రమాదంలో 40 మంది కూలీలు? -
దారుణం: విద్యార్థిని ట్యూషన్ టీచర్ ప్రియుడే హతమార్చి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి(17)ని అతని ట్యూషన్ టీచర్ ప్రియుడు హత్య చేశాడు. ఈ ఘాతుకాన్ని కిడ్నాపింగ్గా మార్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను కూడా బాధితుని ఇంటికి పంపించాడని పోలీసులు తెలిపారు. తన ప్రేయసితో పాఠశాల విద్యార్థికి అక్రమ సంబంధం కొనసాగుతోందనే అనుమానంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. రచిత స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రతిరోజు సాయంత్రం టీచర్ రచిత వద్దకు ట్యూషన్‌కి వచ్చేవాడు. ఈ క్రమంలో వీరువురి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానించిన రచిత ప్రియుడు ప్రభాత్ శుక్లా.. ఆ విద్యార్ధిని హత్య చేయాలని పథకం పన్నాడు. టీచర్ రచిత పిలుస్తుందని విద్యార్థిని పిలుచుకువచ్చిన ప్రబాత్ శుక్లా.. అతన్ని ఓ ఒంటరి గదికి తీసుకెళ్లాడు. ఆ గదిలోనే హతమార్చాడు. అనంతరం ఈ దారుణాన్ని కిడ్నాప్‌గా తీర్చిదిద్దడానికి ప్రణాళిక వేశాడు. బాలున్ని సురక్షితంగా ఇంటికి చేర్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను బాధితుని ఇంటి ముందు పడేశాడు. అంతేకాకుండా కేసును ఏమార్చడానికి లేఖపై అల్లా.. అక్బర్ అని పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలుని మృతదేహాన్ని నిందితుని ఇంటిలో కనుగొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో టీచర్ రచిత ప్రమేయం కూడా ఉన్నట్లు ఆమె అంగీకరించిందని వెల్లడించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు ఉద్ధృతం.. జాతీయ రహదారుల దిగ్బంధం -
30 ఏళ్ల మహిళతో తండ్రి సహాజీవనం.. తట్టుకోలేక కొడుకుల కిరాతకం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోరం వెలుగుచూసింది. తండ్రి మరో మహిళతో సహజీవనం చేయడాన్ని తట్టుకోలేని కొడుకు వారి ఇద్దరిని అంతమొందించాలని పథకం వేశాడు. మధ్యలో తాత అడ్డు రావడంతో ముగ్గురిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో తాత, సహజీవనం చేస్తున్న మహిళ మృత్యువాత పడగా.. తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణం కాన్పూర్ దేహత్ జిల్లాలో గురువారం ఉదయం జరిగింది.. పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం.. రామ్ ప్రకాశ్ ద్వివేది(83), అతని కుమారుడు విమల్(63), అతని భాగస్వామి ఖుష్బు(30)కలిసి అమ్రోదా పట్టణంలో నివసిస్తున్నారు. విమల్ 30 ఏళ్ల మహిళతో కలిసి సహజీవనం విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విమల్ కొడుకు లలిత్(42), సోదరుడు అక్షత్(18) గురువారం ఉదయం తండ్రి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. తాత, తండ్రి, మహిళను విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం రామ్ ప్రకాశ్, ఖుష్బును కత్తితో పొడిచి చంపారు. నిందితుల దాడి నుంచి తప్పించుకొని విమల్ ఇంటి నుంచి బయటకు పరుగెత్తాడు. ఈ విషయాన్ని గమనించిన ఇంటి పక్కన ఉండే మున్నా వెంటనే పక్క ఇంట్లో ఉంటున్న విమల్ అన్న కమల్‌కు సమాచారం అందించాడు. అతడువిమల్‌ను జిల్లా ఆసుపత్రికి అటు నుంచి కాన్పూర్‌లోని లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అక్షత్ లలిత్‌లు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 30 ఏళ్ల ఖుష్బుతో తండ్రి సంబంధపై ఇద్దరు కుమారులు అసంతృప్తిగా ఉన్నారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ పాండే తెలిపారు. విచారణలో రామ్‌ప్రకాష్, ఖుష్బులను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని తెలిపారు. -
రొట్టె కోసం రక్తపాతం..అన్నను హత్య చేసిన తమ్ముడు!
యూపీలోని కాన్పూర్‌లో రొట్టె ముక్కకోసం అన్నదమ్ములు రక్తం కళ్లజూసుకున్నారు. రొట్టె కోసం జరిగిన వివాదంలో తమ్ముడు అన్నను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అన్నయ్య.. తమ్ముని కోసం ప్రత్యేకంగా రొట్టెలు తయారు చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అన్నను హత్య చేసిన తమ్ముడు అంతటితో ఆగక సోదరుని మృతదేహంతో ఏమి చేశాడో తెలిస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఈ ఉదంతం కాన్పూర్‌లోని బిల్హౌర్ పరిధిలోని నానామవు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని ఒక ఇంటిలో కల్లూ, భూరా అనే అన్నదమ్ములుంటున్నారు. వీరిలో కల్లూ పెద్దవాడు. అతనికి ఇంకా వివాహం కాలేదు. అయితే అతని సోదరుడు భూరాకు వివాహం జరిగింది. అతని భార్య రక్షాభంధన్ కోసం పుట్టింటికి వెళ్లి, ఇంకా తిరిగి రాలేదు. ఆమె ఇంటిలో ఉన్నప్పుడు భర్తకు, కల్లూకు వంటవండేది. తాజాగా భూరా పనిమీద ఇంటి నుంచి బయటకు వెళుతూ అన్నతో తాను ఇంటికి వచ్చేసరికి రొట్టెలు తయారు చేసిపెట్టాలని కోరాడు. అయితే రాత్రి భూరా ఇంటికి వచ్చేసరికి కల్లూ అతని కోసం రొట్టెలు తయారు చేయలేదు. వెంటనే కోపంతో రగిలిపోయిన భూరా తన అన్నను ‘రొట్టెలు ఎందుకు తయారు చేయలేదని’ అడిగాడు. దానికి సమాధానంగా కల్లూ ‘నువ్వు నాకు రొట్టెలు తయారు చేయలేదు కనుక నేను నీకు రొట్టెలు తయారు చేయలేదు’ అని అన్నాడు. ఈ నేపధ్యంలో వీరిద్దరి మధ్య వివాదం మొదలయ్యింది. ఇంతలో తమ్మడు ఇంటి బయట ఉన్న పెద్ద బండరాళ్లు తీసుకు వచ్చి ఏకధాటిగా అన్నపై దాడి చేశాడు. ఈ దాడిలో అన్న అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న మృతిచెందినా తమ్ముని ఆగ్రహం ఇంకా చల్లారలేదు. అన్న మృతదేహానికి తాడుకట్టి, దానికి లాక్కుంటూ గ్రామం శివారులకు తీసుకువచ్చాడు. అక్కడున్న నదిలోని పడవలో అన్న మృతదేహాన్ని ఉంచి, నది మధ్యలో దానిని వదిలివేశాడు. అయితే తమ్ముడు అన్న మృతదేహాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువెళుతున్నప్పుడు గ్రామానికి చెందిన కొందరు దానిని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ విజయ్ ఢులా మాట్లాడుతూ తమ విచారణలో నిందితుడు.. రొట్టె కోసం తనకు, తన అన్నకు వివాదం జరిగిందని, ఈ నేపధ్యంలోనే తాను అన్నను హత్యచేశానని తెలిపాడన్నారు. నదిలోని కల్లూ మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: ‘హైదరాబాద్ హౌస్’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు? -
జైలు భయంతో బల్లిని మింగేశాడు..!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ వ్యక్తి బల్లిని మింగేశాడు. కాన్పూర్ జిల్లాలోని మల్లవాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అత్యాచార కేసులో అదుపులోకి తీసుకున్న మహేశ్ అనే నిందితున్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. నిందితున్ని రాత్రి సమయంలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ సమయంలోనే మహేశ్ నోట్లో బల్లి ఉండటం చూసి కంగుతిన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తమైన వైద్యులు మహేశ్ కడుపులో నుంచి బల్లిని బయటకు తీశారు. ప్రాణాపాయం ఏం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. అయితే.. ఈ అత్యాచార కేసులో మహేశ్‌పై చేసిన ఫిర్యాదును బాధితురాలు వెనక్కి తీసుకున్నారు. బల్లిని ఎందుకు మింగావని మహేశ్‌ను పోలీసులు అడగగా.. జైలంటే చాలా భయమని తెలిపాడు. అందుకే బల్లని మింగి.. ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఇదీ చదవండి: హరిద్వార్‌లో రాకాసి మేఘం.. చూస్తే..! -
SUV పైన బోటు.. అందులో ఎమ్మెల్యే.. వీడియో వైరల్
లక్నో: ఇటీవల కాన్పూర్ లో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోజులు గడుస్తున్నా నిలిచిపోయిన నీటిని తొలగించడానికి యూపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిరసనగా తన SUV వాహనం మీదకు బోటు ఎక్కించి అందులో కూర్చుని నగరమంతా తిరుగుతూ నిరసన తెలిపారు సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్ పాయ్. కాన్పూర్‌లో ఇటీవల కుండపోతగా వానలు కురిశాయి. దీంతో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు ఆర్య నగర్ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్ పాయ్. తన SUV పైకి ఒక బోటును ఎక్కించి అందులో కూర్చుని తెడ్డు చేతపట్టుకుని నగరమంతా ఈదారు. కాన్పూర్ లోని సరసయ్య ఘాట్ దగ్గర మొదలైన ఈ కార్యక్రమం బడా చౌరాహా, మేష్టన్ రోడ్, మూలం గంజ్ ఎక్స్ ప్రెస్ రోడ్, ఫూల్ బాగ్ మీదుగా కొనసాగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో వీఐపీ రోడ్, సివిల్ లైన్స్, బాబుపూర్వ, రాయ్ పూర్వలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయని ఇక జుహీ బ్రిడ్జి వద్దైతే ఆ వరద ఉధృతికి ఇటీవల ఒక డెలివరీ ఏజెంటు కూడా చనిపోయాడని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో ప్రజలను కూడా లైఫ్ జాకెట్లు, బోట్లు వాడమని సలహా ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు అంతర్జాలంలో హల్చల్ చేస్తోంది. कानपुर में सपा विधायक @AmitabhBajpai का जलभराव को लेकर अनोखा प्रदर्शन। अपनी कार के ऊपर नाव रख उसपर सवार होकर सड़कों पर निकले नगर निगम की विफलता पर किया प्रदर्शन ,उनका कहना है कि बारिश के चलते शहर बन गया था टापू pic.twitter.com/yEO1zFUtf5 — Anurag Verma ( PATEL ) (@AnuragVerma_SP) June 30, 2023 ఇది కూడా చదవండి: మహారాష్ట్ర బస్సు ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు -
కారు దొంగతనం.. డ్రైవింగ్ రాక 10 కి.మీ తోసుకెళ్లి... చివరికి!
ఉత్తర ప్రదేశ్‌లో వింత దొంగతనం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు కలిసి అడ్డదారిలో డబ్బు సంపాదించేదుకు ఓ కారును దొంగతనం చేయాలనుకున్నారు. అనుకున్నట్లే కారును దొంగిలించారు కానీ తరువాతే అసలు విషయం తెలిసింది. ముగ్గురిలో ఎవరికి కూడ డ్రైవింగ్ రాదని.. దీంతో చేసేదేం లేక కారును దాదాపు 10 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్లారు. అమినా చివరకు పోలీసులకు పట్టుబట్టారు. అసలేం జరిగిందంటే.. కాన్పూర్‌లోని దబౌలి ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అమన్ గౌతమ్, సత్యం కుమార్ కాలేజీ విద్యార్థులు. వీరికి అమిత్ వర్మతో పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి మే 7న కారు మారుతి వ్యాన్‌ను దొంగిలించాలని ప్లాన్ చేశారు. పథకం ప్రకారమే కారును దొంగిలించారు. అయితే అక్కడే ఈ ముగ్గురికి కష్టాలు మొదలయ్యాయి. ముగ్గురిలో ఎవరికి కారు డ్రైవింగ్ రాదని అర్థమైంది. అయినా కారును వదిలి వెళ్లాలని అనిపించలేదు. దీంతో కారును నెట్టుకుంటూ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా రాత్రి 10 కిలోమీటర్లు దబౌలి నుంచి కళ్యాణ్పూర్ వరకు వ్యాన్‌ను తోసుకుంటూ వెళ్లారు. 10 కిలోమీటర్ల పాటు కారు తోయడంతో ఇక తమ వల్ల కాదని, నెంబర్ ప్లేట్ తొలగించి, ఓ నిర్మానుష్య ప్రాంతంలో దాచిపెట్టి అక్కడి నుంచి పారిపోయారు. తరువాత వచ్చి ఆ కారును అమ్మేయాలని కుట్ర పన్నారు. చివరికి ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేశారు. ఈ దోపిడీకి అమిత్ స్కెచ్ వేయగా.. దీన్ని వెబ్ సైట్ ద్వారా అమ్మేందుకు సత్యం ప్లాన్ చేశాడని ఏసీపీ భేజ్ నారాయణ్ సింగ్ వెల్లడించారు. ఒకవేళ కారు కొనడానికి ఎవరూ దొరక్కపోతే.. వెబ్ సైట్ ద్వారా విక్రయించాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. చదవండి: స్మార్ట్ టన్నెల్.. సెల్ సిగ్నల్ దొరక్క ప్రాణం పోయింది!