లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసులను కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌లో హతమయిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ అతడిని ఈరోజు ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలించేందుకు తీసుకెళ్లారు. అయితే మరో గంటలో కాన్పూర్ చేరతామనగా.. వికాస్ దూబేను తీసుకెళ్తున్న వాహనం భారీ వర్షం కారణంగా హైవే మీద బోల్తా పడింది. ఈ క్రమంలో తప్పించుకోవడానికి ప్రయత్నించిన వికాస్ దూబేను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
ఈ క్రమంలో హైవే మీద వెళ్తున్న కొందరు ప్రయాణికులు దీని గురించి మాట్లాడుతూ.. అక్కడ మాకు తుపాకులు పేలిన శబ్దం వినిపించింది. అక్కడికి వెళ్లి చూడాలని ప్రయత్నించాం కానీ పోలీసులు మమ్మల్ని వెనక్కి పంపిచారు అని ఆశిష్ పాశ్వన్ అనే వ్యక్తి తెలియజేశాడు. ఆ తర్వాత కాసేపటికి ప్రైవేట్ వెహికల్‌లో అందరు ఆస్పత్రికి వెళ్లారని తెలిపాడు. ఇదిలా ఉండగా వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అతడిని విచారిస్తే.. రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే యోగి ప్రభుత్వం వికాస్ దూబేని ఎన్‌కౌంటర్ చేసిందని ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. (అచ్చం అందులో ఉన్నట్లే దూబే హతం!)
Comments
Please login to add a commentAdd a comment