Gangster
-
యూఎస్‌లో అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కానీ హత్య కేసులో కాదు!
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రస్తుతం అన్మోల్ను అయోవా రాష్ట్రంలో ఉన్న పొట్టావట్టమీ కౌంటీ జైలుకు తరలించింది. అయితే అక్రమ పత్రాలతో అమెరాకలోకి ప్రవేశించిన కేసులో అతడిని పోలీసీలు అరెస్ట్ చేశారు. అన్మోల్ బిష్ణోయ్ తమ నిర్భంధంలో ఉన్న విషయాన్ని కూడా అమెరికా ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది.ఈ క్రమంలో ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అమెరికాలోని ఎఫ్‌బీఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీతో టచ్‌లో ఉంది. అతడిని తమకు అప్పగించాలని ఎన్ఐఏ అభ్యర్థించింది. అయితే యూఎస్ అధికారులు అరెస్ట్ చేసింది భారత ప్రభుత్వం ఆరోపిస్తున్న కేసులకు సంబంధించినది కాదు కాబట్టి అతడిని ఇప్పల్లో భారత్‌కు అప్పగించే అవకాశం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించారు.కాగా అన్మోల్ బిష్ణోయ్ 2002లో పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిక్ హత్య కేసుతో సహా అనేక కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 14న సల్మాన్‌ఖాన్ ఇంటివద్ద కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దానికి బాధ్యత వహిస్తూ అన్మోల్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు.బిష్ణోయ్ తరచుగా అమెరికా, కెనడా మధ్య ప్రయాణిస్తూ ఉంటాడు. పంజాబ్‌లోని ఫజిల్కాకు చెందిన బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్ట్‌తో భారత్ నుంచి పారిపోయి కెనడాలో ఉన్నట్లు గతంలో భావించారు. అతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ), భారత యాంటీ టెర్రర్ యూనిట్ దాఖలు చేసిన రెండు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఎన్ఐఏ దాఖలు చేసిన కేసులో ఆన్మోల్‌ను అప్పగించాలని ముంబై పోలీసులు కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. అతనిపై మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. మనీ లాండరింగ్ చేస్తున్నాడనే అనుమానంతో అతడిపై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. అన్మోల్ బిష్ణోయ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అంతేగాకుండా సిద్ధిఖీ హత్యకు ముందు సైతం షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. ఈక్రమంలో అతడి గురించి సమాచారం ఇచ్చినవారికి ఈ రివార్డు ఇస్తామని ఎన్ఐఏ తెలిపింది. -
గ్యాంగ్స్టర్ల స్థావరాలపై ఢిల్లీ పోలీసుల దాడులు
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ల అరాచకాలను అరికట్టేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, కౌశల్ చౌదరి గ్యాంగ్, హిమాన్షు భావు గ్యాంగ్, కాలా జాతేడి, హషీమ్ బాబా, చేను గ్యాంగ్, గోగి గ్యాంగ్, నీరజ్ బవానియా, టిల్లూ తాజ్‌పురియా గ్యాంగ్‌లతో సంబంధమున్న వాంటెడ్ నేరస్థుల రహస్య స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు.ఢిల్లీలోని ఔటర్ ఢిల్లీ, ద్వారకా ఏరియా, ఈశాన్య ఢిల్లీ, నరేలా, కంఝవాలా, సంగమ్ విహార్ తదితర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసు బృందాలు దాడులు నిర్వహించాయి. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ బృందం, ప్రత్యేక పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. గ్యాంగ్స్టర్లతో సంబంధం ఉన్న పలువురు షూటర్లు, హెంచ్మెన్లను అదుపులోకి తీసుకున్నారు.ఢిల్లీలోని గ్యాంగ్స్టర్లు ఇటీవలి కాలంలో తమ అనుచరుల ద్వారా కాల్పులు, హత్యా ఘటనలకు పాల్పడుతున్నారు. 2024 అక్టోబరులో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన ఏడుగురు షూటర్లను అరెస్టు చేసింది. వీరిని పంజాబ్, ఆ చుట్టుపక్కల రాష్ట్రాలలో అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.బాబా సిద్ధిఖీ కేసులో అరెస్టయిన షూటర్లను స్పెషల్ సెల్ విచారిస్తోంది. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. 2022లో నమోదైన రెండు ఎన్ఐఏ కేసుల్లో అతనిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇది కూడా చదవండి: ‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా -
దావూద్ బాటలో.. బిష్ణోయ్ నేరసామ్రాజ్యం
న్యూఢిల్లీ: ముంబైలో ఎస్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య దరిమిలా దీనివెనక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తముందనే వార్తలు వినిపిస్తున్నాయి. గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌తో సహా పలువురు పేరుమోసిన గ్యాంగ్స్టర్లపై ఎన్ఐఎ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో పలు కీలక వివరాలున్నాయి.లారెన్స్ బిష్ణోయ్‌కు సంబంధించిన టెర్రర్ సిండికేట్ మునుపెన్నడూ లేని విధంగా విస్తరించిందని ఎన్ఐఏ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. దావూద్ ఇబ్రహీం 90వ దశకంలో చిన్న చిన్న నేరాలకు పాల్పడుతూ, తన నెట్‌వర్క్‌ను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాడో.. అదే మార్గాన్ని లారెన్స్ బిష్ణోయ్ కూడా అనుసరించాడు. దావూద్ ఇబ్రహీం డ్రగ్స్ స్మగ్లింగ్, టార్గెట్ కిల్లింగ్, దోపిడీ రాకెట్లతో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆ తర్వాత పాక్ ఉగ్రవాదులతో పొత్తు పెట్టుకుని, తన నెట్వర్క్ విస్తరించాడు. కాగా దావూద్ ఇబ్రహీం ఏర్పాటు చేసిన డి కంపెనీ మాదిరిగానే బిష్ణోయ్ గ్యాంగ్ చిన్న చిన్న నేరాలు చేస్తూ ఇప్పుడు ఆరు దేశాలకు విస్తరించింది.బిష్ణోయ్ గ్యాంగ్‌లో 700 మందికి పైగా షూటర్లు ఉన్నారని, వారిలో 300 మంది పంజాబ్‌కు చెందినవారని ఎన్ఐఎ తెలిపింది. బిష్ణోయ్, గోల్డీ బ్రార్ గ్యాంగ్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను విరివిగా వినియోగించుకుంలాయి. బిష్ణోయ్ ముఠా 2020-21 మధ్యకాలంలో దోపిడీల ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. ఆ డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించింది.ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం బిష్ణోయ్ గ్యాంగ్ ఒకప్పుడు పంజాబ్‌కు మాత్రమే పరిమితమైంది. ఆ తరువాత గోల్డీ బ్రార్‌తో జతకట్టి హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ ముఠాలతో పొత్తు పెట్టుకుంది. బిష్ణోయ్ గ్యాంగ్ ప్రస్తుతం ఉత్తర భారతదేశం, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్‌లలో విస్తరించింది. సామాజిక మాధ్యమాలు, ఇతర పద్ధతుల ద్వారా వీరు యువతను తమ ముఠాలో చేర్చుకుంటారు. ఈ ముఠా అమెరికా, అజర్బైజాన్, పోర్చుగల్, అరబ్, రష్యా వరకూ వ్యాపించింది.కొద్ది రోజుల క్రితం లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ సహా మొత్తం 16 మంది గ్యాంగ్స్టర్లపై ఎన్ఐఏ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దానిలోని వివరాల ప్రకారం గోల్డీ బ్రార్ కెనడా, పంజాబ్, ఢిల్లీలో ముఠాలను నిర్వహిస్తున్నాడు. రోహిత్ గోద్రా రాజస్థాన్, మధ్యప్రదేశ్, అరబ్ కంట్రీలోని ముఠాలను పర్యవేక్షిస్తుంటాడు. అన్మోల్ బిష్ణోయ్ పోర్చుగల్, అమెరికా, ఢిల్లీ , మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్‌లకు కమాండ్‌గా ఉన్నాడు. ఈ ముఠాకు ఆయుధాలు మధ్యప్రదేశ్‌లోని మాల్వా, మీరట్, ముజఫర్‌నగర్, యూపీలోని అలీగఢ్, బీహార్‌లోని ముంగేర్, ఖగారియా నుంచి వచ్చి చేరుతుంటాయి. అలాగే పాక్‌లోని పంజాబ్ జిల్లాతో పాటు అమెరికా, రష్యా, కెనడా, నేపాల్ దేశాల నుంచి కూడా ఈ ముఠాకు ఆయుధాలు అందుతుంటాయని ఎన్ఐఏ గుర్తించింది.ఇది కూడా చదవండి: సల్మాన్‌కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య? -
గ్యాంగ్ వార్
చంద్రశేఖర్ రాథోడ్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్’. ఈ చిత్రంలో కాశ్వీ కాంచన్ హీరోయిన్గా నటించారు. అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్యనారాయణ ఇతర లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం అక్టోబరు 25న రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ– ‘‘టీజర్, ట్రైలర్ బాగున్నాయి’’ అన్నారు. ‘‘అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీఎఫ్టీ కోర్సు చేశాను. ‘దిల్’ రాజుగారు మా సినిమా ట్రైలర్ చూసి బాగుందన్నారు’’ అన్నారు చంద్రశేఖర్. ‘‘రెండు గ్యాంగ్స్ మధ్య జరిగే వార్ ఈ సినిమా’’ అన్నారు అభినవ్. -
ఇక ర్యాలీని మళ్లీ జైలు వైపు తిప్పండి
-
జైలు నుంచి విడుదలైన కాసేపటికే మళ్లీ అరెస్టైన గ్యాంగ్‌స్టర్.. ఎందుకంటే!
ఓ గ్యాంగ్‌స్టర్ అత్యుత్సాహంతో లేనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నాడు. ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆనందంలో జైలు నుంచి అతని అనుచరులు భారీ ర్యాలీ చేపట్టారు. రోడ్డుపై కార్లలో ఊరేగించారు. దీంతో పోలీసులు మళ్లీ గ్యాంగ్‌స్టర్‌పై చర్యలు చేపట్టారు. అతడిపై కేసు నమోదు చేసి మళ్లీ జైలుకు తరలించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ హర్షద్ పాటంకర్ హత్యాయత్నం, దొంగతనాలు, డ్రగ్స్ వంటి కేసుల్లో గతంలో అరెస్టయ్యాడు. జులై 23న అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి మద్దతుదారులు భారీ ర్యాలీ చేపట్టారు. బేతేల్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకూ ‘కమ్ బ్యాక్’ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హర్షద్ సన్‌రూఫ్ కారులో వెళ్తుండగా.. పలు కార్లు, సుమారు 15 ద్విచక్ర వాహనాలు అతడిని అనుసరించాయి. ఈ సందర్భంగా కారు రూఫ్ నుంచి హర్షద్ తన మద్దతుదారులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.ఇందుకు సంబంధించిన వీడియోని అతడి మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్‌గామారి పోలీసుల దృష్టికి చేరింది. దీంతో పోలీసులు హర్షద్‌పై చర్యలు చేపట్టారు. అనధికారిక ర్యాలీని నిర్వహించి రోడ్డుపై గందరగోళం సృష్టించినందుకు గానూ హర్షద్‌తోపాటు ఆరుగురు మద్దతుదారులపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. -
చోటా షకీల్ బంధువు ఆరిఫ్ షేక్ మృతి
అండర్ వరల్డ్ డాన్ ఛోటా షకీల్ బంధువు ఆరిఫ్ షేక్ అలియాస్ ఆరిఫ్ భాయిజాన్ ముంబైలో గుండెపోటుతో మృతి చెందాడు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో అరెస్టయిన ఆరిఫ్ షేక్.. ఛోటా షకీల్‌కు బావ వరుస అవుతాడు.ప్రస్తుతం ఆరిఫ్ ఆర్థర్ రోడ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనికి అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో పోలీసులు చికిత్స నిమిత్తం ముంబైలోని జెజె ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరీఫ్ మృతి చెందాడు.అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని సహచరుడు ఛోటా షకీల్‌కు ఆరిఫ్ సహాయం అందించాడనే ఆరోపణలున్నాయి. 61 ఏళ్ల ఆరిఫ్ షేక్‌ను 2022 మేలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. గత రెండేళ్లుగా ఆర్థర్ రోడ్ జైలులో ఆరిఫ్ శిక్ష అనుభవిస్తున్నాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి కారణంగా ఆరిఫ్ షేక్‌ను జూన్ 21న ఆస్పత్రికి తరలించారు. ఆరీఫ్‌కు ఇద్దరు సంతానం అని తెలుస్తోంది. -
ఎన్కౌంటర్లో వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హతం
ఉత్తరప్రదేశ్‌లో నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్, బీహర్, రతన్‌పురి పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో వాంటెడ్ బీహార్ గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు.వివరాల్లోకి వెళితే బుధవారం అర్థరాత్రి బీహార్‌లోని రతన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఇంచోరా గ్రామం సమీపంలోని అడవిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్), బీహర్, రతన్‌పురి పోలీసులు ముగ్గురు దుండగులను ఎన్కౌంటర్ చేశారు వీరిలో బీహార్ గ్యాంగ్ స్టర్ నీలేష్ రాయ్ ఉన్నారు. రూ. రెండు లక్షల రివార్డు కలిగిన నీలేష్ ఈ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతని సహచరులిద్దరూ పరారయ్యారు.నిందితులకు చెందిన బైక్, రెండు పిస్టల్స్, కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అర్థరాత్రి నోయిడా, బీహార్‌కు చెందిన ఎస్టిఎఫ్ బృందాలు రతన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్పూర్ పోలీస్ పోస్ట్‌లో నేరస్తుల సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఇంతలో బుధానా నుంచి బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారు పోలీసులపై కాల్పులు జరిపి, ఖతౌలీ-బుదానా రహదారి వైపు వేగంగా వెళ్లిపోయారు.పోలీసు బృందం వారిని వెంబడిస్తున్న సమయంలో ఇంచుడ గ్రామం అడవిలో వారి బైక్ స్లిప్ అయ్యి కింద పడిపోయింది. ఇంతలో పోలీసులు కాల్పులు చేయగా ఇద్దరు దుండగులు తప్పించుకున్నారు. పోలీసుల తూటాలకు ఓ యువకుడు(నీలేష్ రాయ్) గాయపడ్డాడు. పోలీసులు బాధితుడిని బుధానా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతను చనిపోయినట్లు ధృవీకరించారు.మృతుడిని బీహార్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడు నీలేష్ రాయ్‌గా గుర్తించామని, బరో రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గధరా బెగుసరాయ్ బీహార్ నివాసి అని ఎస్పీ దేహత్ ఆదిత్య బన్సాల్ తెలిపారు. అతనిపై బీహార్ ప్రభుత్వం రూ.2 లక్షల రివార్డు ప్రకటించింది. నీలేష్‌పై హత్య, దోపిడీ, తదితర 16 తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న నీలేష్ సహచరులిద్దరి కోసం పోలీసులు అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
ఉగ్రవాది గోల్డీ బ్రార్ బతికే ఉన్నాడు
వాషింగ్టన్: పంజాజీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాది గోల్డీ బ్రార్ మృతి చెందినట్లు వచ్చిన వార్తలను అమెరికాలోని కాలిఫోర్నియా పోలీసులు కొట్టిపారేశారు. గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని చెప్పారు. ప్రెస్నో సిటీలో మంగళవారం సాయంత్రం రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో గోల్డీ బ్రార్ మరణించాడని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, హతుడిని 37 ఏళ్ల జేవియర్ గ్లాండీగా ప్రెస్నో పోలీసులు బుధవారం గుర్తించారు. గోల్డీ బ్రార్ హతమైనట్లు భారత మీడియాలోనూ ప్రసారమైంది. -
అన్సారీ అంత్యక్రియలు పూర్తి
లక్నో: గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు శనివారం యూపీలోని గాజీపూర్‌లో ముగిశాయి. వేలాది మంది అన్సారీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమలు చేశారు. కొందరు శ్మశాన వాటికలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. అన్సారీ సోదరుడు, ఎంపీ అఫ్జల్ అన్సారీ, ఘాజీపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆర్యక అఖౌరీ మధ్య ఈ సందర్భంగా కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. -
Mukthar Ansari : ‘‘అన్సారీ మరణంతో మాకు న్యాయం జరిగింది’’
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ మృతితో తమకు న్యాయం జరిగిందని 2005లో అన్సారీ చేతిలో హత్యకు గురైన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు. కృష్ణానందరాయ్ కుమారుడు పియూష్ రాయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్సారీ మృతితో తమ కుటుంబం సంతోషంగా ఉందని చెప్పారు. ‘బాబా గోరక్నాథ్ దయతోనే మాకు న్యాయం జరిగింది. రంజాన్ నెలలోనే అన్సారీకి దేవుడు తగిన శిక్ష విధించాడు. పంజాబ్‌లోని జైళ్లలో ఉండి కూడా అన్సారీ అక్కడి నుంచి నేరాలకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌కు వచ్చిన తర్వాత అతడికి తగిన శాస్తి జరిగింది. ప్రతిపక్షాలకు కేవలం రాజకీయాలు కావాలి. ఒక క్రిమినల్‌కు ఆయా పార్టీల నేతలు మద్దతు పలకడం దారుణం’అని పియూష్ రాయ్ వ్యాఖ్యానించారు. అన్సారీ నేరాల వల్ల గాయపడ్డ కుటుంబాలకు ఇప్పుడు న్యాయం జరిగిందని, తాము సంతోషంగా ఉన్నామని ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ భార్య అల్కా రాయ్ అన్నారు. ఇదీ చదవండి.. అన్సారీపై విష ప్రయోగం -
Mukhtar Ansari: అన్సారీపై విష ప్రయోగం?
లక్నో: బాందా జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ (63) గురువారం కన్నుమూశారు. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన ఆయనకు చికిత్స అందుతుండగానే.. గుండెపోటుకు గురై చనిపోయినట్లు దుర్గావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే.. కుటుంబ సభ్యులు మాత్రం అన్సారీ మృతిపై సంచలన ఆరోపణలకు దిగారు. ముఖ్తార్ అన్సారీపై విషప్రయోగం జరిగిందని.. 2005 నుంచి బాందా జైలులో ఉన్న ఆయనపై విషప్రయోగం జరగడం ఇప్పుడు రెండోసారి ఆయన సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. ‘జైలులో అన్సారీకి ఆహారంలో విషం కలిపి ఇచ్చారు. సుమారు 40 రోజుల పాటు ఆహారంలో విషం కలిపారు. మార్చి 19వ తేదీన ఆయన తిన్న ఆహారంలో విషం కలిసింది. అందుకే ఆయన ఆరోగ్యం ఆందోళనకంగా మారి ఆస్పత్రిలో చేరారు’ అని అఫ్జల్ అన్సారీ అంటున్నారు. తన తండ్రికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్ కుమారుడు ఉమర్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై కోర్టును సంప్రదిస్తానని చెప్పారు. ‘ మా నాన్న(ముఖ్తార్)పై విష ప్రయోగం జరుగుతోందన్న విషయాన్ని మేము గతంలో కూడా చెప్పాం. ఇప్పుడూ కూడా అదే చెబుతున్నాం. మార్చి 19న మా నాన్న( ముఖ్తార్)కు రాత్రి భోజనంలో విషం కలిపారు. మేము ఈ విషయంలో కోర్టును సంప్రదిస్తాం. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’ అని ఉమర్ తెలిపారు. బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం విషయమించటంతో ఆయన్ను మంగళవారం బాందాలోని దుర్గావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఆయనపై విష ప్రయోగం జరిగిందా? అనేదానిపై వైద్యులు స్పందించలేదు. బందా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఇవాళ ముఖ్తార్ అన్సారీ మృతదేహానికి శవపరీక్ష జరగనుంది. ఆపై ఈ ఆరోపణలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ యూపీలోని మౌకు చెందిన అన్సారీపై గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. అందులో 15 హత్య కేసులు ఉన్నాయి. 1980ల్లో గ్యాంగ్ సభ్యుడిగా చేరిన అన్సారీ 1990ల్లో సొంతంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మౌ, ఘాజీపుర్, వారణాసి ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ దోపిడీలు, కిడ్నాపులకు పాల్పడేది. 2004లో అన్సారీ వద్ద మెషిన్ గన్ బయటపడడంతో పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో గతేడాది ఏప్రిల్‌లో కోర్టు ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారన్న అభియోగాల నేపథ్యంలో ఈ నెల 13న కోర్టు జీవితఖైదు విధించింది. ఐదుసార్లు మౌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్ రెండు సార్లు బీఎస్పీ తరఫున ఎన్నికయ్యారు. ఆయన మృతికి ఆ పార్టీ ఎక్స్(ట్విటర్)లో సంతాపం ప్రకటించింది. అన్సారీ మృతితో యూపీ మొత్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. బాందా, మౌ, ఘాజీపుర్, వారణాసి జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలతో పాటు, సెంట్రల్ రిజర్వ్ బలగాలను మోహరించినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ముఖ్తార్ అన్సారీ మృతిపై దర్యాప్తు జరగాలి: మాయావతి జైలులో ముఖ్తార్ అన్సారీపై మృతిపై ఆయన కుటుంబం వ్యక్తం చేస్తున్న భయాలు, విష ప్రయోగానికి సంబంధించి ఆరోపణలపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ వేదిక స్పందించారు. ‘ ముఖ్తార్ మృతి దార్యప్తు జరగాలి. మృతికి సంబంధించిన వాస్తవాలు బయటకు రావాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. मुख़्तार अंसारी की जेल में हुई मौत को लेकर उनके परिवार द्वारा जो लगातार आशंकायें व गंभीर आरोप लगाए गए हैं उनकी उच्च-स्तरीय जाँच जरूरी, ताकि उनकी मौत के सही तथ्य सामने आ सकें। ऐसे में उनके परिवार का दुःखी होना स्वाभाविक। कुदरत उन्हें इस दुःख को सहन करने की शक्ति दे। — Mayawati (@Mayawati) March 29, 2024 -
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
లక్నో: జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ(63) గురువారం గుండెపోటుకు గురై బందా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మృతి చెందారు. అంతకుముందు, రాత్రి 8.25 గంటల సమయంలో అన్సారీ ఆరోగ్యం విషమించడంతో అధికారులు బందా జిల్లా జైలు నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల బృందం చికిత్సలు చేస్తుండగానే ఆయన గుండెపోటుకు గురై చనిపోయినట్లు బందా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ పీటీఐకి తెలిపారు. దీంతో, ఉన్నతాధికారులు ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. బందా, మౌ, గాజీపూర్, వారణాసి జిల్లాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. పొట్టలో నొప్పిగా ఉందని చెప్పడంతో మంగళవారం కూడా ఆస్పత్రిలో 14 గంటలపాటు ఉంచినట్లు అధికారులు చెప్పారు. జైలులో ఆయనపై విష ప్రయోగం జరిగిందని ఇతడి సోద రుడు, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. 5సార్లు ఎమ్మెల్యే.. 60కిపైగా కేసులు మౌ సదర్ స్థానం నుంచి రెండుసార్లు బీఎస్పీ తరఫున, రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి సొంతపార్టీ క్వామీ ఏక్తా దళ్ తరఫున మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వివిధ ఆరోపణలపై యూపీ, పంజాబ్ జైళ్లలో 2005 నుంచి శిక్ష అనుభవిస్తున్నారు. ఈయనపై 60కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. యూపీలోని వివిధ కోర్టులో 2022 నుంచి ఇతడిపై ఉన్న 8 కేసుల్లో తీర్పులు వెలువరించాయి. ప్రస్తుతం బందా జైలులో ఉన్నారు. -
చర్మం ఒలిచి..చెప్పులు కుట్టించి..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జర్ అనే మాజీ గ్యాంగ్‌స్టర్ తన తల్లిపై ఉన్న ప్రేమను అచ్చంగా రామాయణంలో శ్రీరాముడు పేర్కొన్నట్లుగా చాటాడు. ఏకంగా తన చర్మాన్ని ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించి కానుకగా ఇచ్చాడు! ఇందుకుగల కారణాన్ని అతను వివరించాడు. గతంలో నేరప్రవృత్తి కారణంగా పోలీసు కాల్పుల బారినపడ్డ గుర్జర్ ఆ తర్వాత నిత్యం రామాయణ పారాయణంతో పూర్తిగా మారిపోయినట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా శ్రీరాముని పాత్ర నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని.. తల్లికి చర్మంతో చెప్పులు కుట్టించినా ఆమె రుణం తీర్చుకొనేందుకు చాలదని శ్రీరాముడు స్వయంగా పేర్కొన్న మాట తనను ఎంతగానో ఆకర్షించిందని గుర్తుచేసుకున్నాడు. అందుకే తాను తల్లికి తన చర్మంతో చెప్పులు కుట్టించాలని నిర్ణయించుకున్నట్లు గుర్జర్ చెప్పుకొచ్చాడు. ఇంట్లో వారికి చెప్పకుండా ఆస్పత్రిలో చేరి తన కాలి తొడ చర్మాన్ని సర్జరీ చేయించి తొలగించుకున్నానని.. ఆ చర్మాన్ని చెప్పులు కుట్టే వ్యక్తికి ఇచ్చి చెప్పులు చేయించానన్నాడు.గత వారం ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తన తల్లికి ఈ చెప్పులను బహూకరించగా వాటిని చూసి ఆమె కన్నీటిపర్యంతమైందని గుర్జర్ తెలిపాడు. తల్లిదండ్రుల పాదాల చెంతనే స్వర్గం ఉంటుందనే విషయాన్ని సమాజానికి చాటిచెప్పాలనే ఈ పని చేశానన్నాడు. ‘తండ్రి స్వర్గానికి నిచ్చెనయితే తల్లి ఆ మార్గాన్ని చేరుకొనే వ్యక్తి’ అని గుర్జర్ పేర్కొన్నాడు. -సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఆ మాజీ సీఎం చెప్పారనే.. 60 ఏళ్ల వయసులో పెళ్లి!
‘‘లాలూజీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాం. ఆ భార్యాభర్తలు మనస్పూర్తిగా ఆయన మమ్మల్ని ఆశీర్వదించారు.. అది చాలూ..’’ అంటూ సంతోషంగా మీడియా ముందు మాట్లాడారు 60 ఏళ్ల అశోక్ మహతో. ఈ వయసులో పెళ్లా.. దానికి లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి దిగ్గజ నేత ఆశీర్వాదం ఎందుకు అనుకుంటున్నారా?.. ఎన్నికలు వస్తున్నాయి కదా.. అందుకేనట! నవాదా జిల్లాకు చెందిన అశోక్ మహతో.. మాజీ గ్యాంగ్‌స్టర్. సంచలన కేసుల్లో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాదే విడుదలయ్యాడు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరాడు. అందుకోసం ముంగేర్ స్థానం ఎంచుకున్నాడు. ఇదే స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ, జేడీయూ నేత లాలన్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఎలాగూ.. ఆర్జేడీ మద్దతు ఉంది. టికెట్ దక్కే అవకాశం లేకపోలేదు. కానీ.. అన్నేళ్లు జైలు శిక్ష అనుభవించి రావడం, కొన్ని కేసులు పెండింగ్‌లో ఉండడంతో చట్టపరంగా సాధ్యం కావడం లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిశారు. ఇక్కడే లాలూ తన మార్క్ రాజకీయం చూపించారు. ‘వివాహం చేసుకుని నీ భార్యను పోటీ చేయించు’ అని లాలూ సలహా ఇచ్చారు. అంతే.. ఢిల్లీకి చెందిన కుమారి అనిత(46) అనే మహిళను మంగళవారం రాత్రి పాట్నా శివారులో ఉన్న ఓ గుడిలో కుటుంబ సభ్యులు, తన మద్దతుదారుల మధ్య పెళ్లి చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆ నవవధువు, వరుడు లాలూ ఇంటికి వెళ్లారు. మాజీ సీఎం జంట లాలూ-రబ్రీదేవీల ఆశీర్వాదం తీసుకున్నారు. బయటకు వచ్చిన ఆయన వాహనాన్ని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి.. ఆర్జేడీ టికెట్ ఇస్తుందా? లాలూ హామీ ఇచ్చారా? మీ భార్యను ఎన్నికల బరిలో దింపబోతున్నారా?.. హడావిడిగా వివాహం చేసుకోవడానికి కారణాలేంటి?.. ఇలా ప్రశ్నలతో ఆ పెళ్లి కొడుకును ఉక్కిరి బిక్కిరి చేశారు. అయితే అశోక్ మాత్రం తెలివిగా ‘ ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ఆర్జేడీ నుంచి పోటీ చేస్తాం’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ब्याह रचाने के बाद नई नवेली दुल्हन के साथ लालू का आशीर्वाद लेने पहुंचे कुख्यात अशोक महतो, टिकट के लिए 62 की उम्र में खरमास में रचाई है शादी#ASHOKMAHTO #BiharPolitics #Bihar #BiharNews pic.twitter.com/VqrEn1zeSb — FirstBiharJharkhand (@firstbiharnews) March 20, 2024 VIDEO Credits: FirstBiharJharkhand షేక్‌పురా జేడీయూ ఎమ్మెల్యే రణధీర్ కుమార్ సోనీపై హత్యాయత్నం ఆరోపణలతోపాటు నవాదా జైలు బద్దలుగొట్టిన కేసులో నేరస్థుడిగా అశోక్ మహతో 17ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2023లో జైలు నుంచి ఆయన విడుదలయ్యాడు. ఇక.. 1997లో దాణా కుంభకోణంలో లాలూ రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు తన భార్య రబ్రీదేవిని బీహార్‌కు ముఖ్యమంత్రిని చేసింది తెలిసిందే. -
పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఒక్కటైన గ్యాంగ్‌స్టర్, రివాల్వర్ రాణి
న్యూఢిల్లీ: సమాజంలో ప్రముఖ వ్యక్తుల పెళ్లిళ్లు జరిగినపుడు భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రత కనిపించడం సహజం. కానీ కరడుగట్టిన నేరగాడి పెళ్లి తంతును పోలీసులే దగ్గరుండి జరిపించిన ఘటనకు దేశ రాజధాని వేదికైంది. పెరోల్‌పై తిహార్ జైలు నుంచి బయటికొచ్చిన గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జథేడీ వివాహ వేడుక విశేషమిది. వివరాల్లోకి వెళ్తే సందీప్ డజనుకుపైగా హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసుల్లో నిందితుడు. గ్యాంగ్‌స్టర్ అయిన సందీప్ నాలుగేళ్లుగా లేడీ డాన్‌గా పేరుబడ్డ అనురాధాతో ప్రేమాయణం నడుపుతున్నాడు. మరో గ్యాంగ్‌స్టర్ ఆనంద్పాల్సింగ్ ముఠా సభ్యురాలైన అనురాధాపై మనీ లాండరింగ్, బెదిరింపు వసూళ్లు వంటి అరడజనుదాకా కేసులు ఉన్నాయి. బెయిల్ మీద ఇప్పటికే అనురాధా విడుదలకాగా సందీప్‌కు కేవలం ఆరు గంటల పెరోల్ లభించింది. ఈ సమయంలోనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఢిల్లీ ద్వారకా సెక్టార్–3లోని సంతోష్ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌ను బుక్‌చేశారు. సందీప్ న్యాయవాది రూ.51,000కు ఈ ఫంక్షన్‌ను బుక్‌చేశారు. సందీప్, అనురాధాలు వేర్వేరు నేరముఠాలకు చెందిన వ్యక్తులు కావడంతో పెళ్లివేడుకలో గ్యాంగ్‌వార్ జరిగే ఆస్కారముందని పోలీసులు భావించారు. నాలుగు అంచెల రక్షణ ఢిల్లీ, హరియాణా పోలీసులు ఫంక్షన్‌హాల్‌ను శత్రుదుర్బేధ్యంగా మార్చేశారు. ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు, కీలక ప్రాంతాల్లో సీసీకెమెరాలు అమర్చారు. డ్రోన్లను రంగంలోకి దింపారు. ఫంక్షన్ హాల్ పరిసరాల్లో 250కిపైగా పోలీసులు మొహరించారు. పెళ్లిరోజు రానే వచ్చింది. హరియాణాలోని సోనీపట్ నుంచి బ్లాక్ ఎస్యూవీ వాహనంలో వధువు అనురాధా, పోలీసు బందోబస్తు నడుమ వరుడు సందీప్ పెళ్లిమండపానికి చేరుకున్న విధానం అచ్చం ఓటీటీ థ్రిల్లర్‌ను తలపించింది. కవరేజీ కోసం చేరుకున్న మీడియా ప్రతినిధులు, రక్షణగా చుట్టుముట్టిన పోలీసులు, వధూవరుల తరఫున హాజరైన కొందరు నేరగాళ్ల సమక్షంలో మంగళవారం వివాహం ఆడంబరంగా జరిగింది. వివాహం తర్వాత సందీప్‌ను పోలీసులు మళ్లీ తిహార్ చెరసాలకు తీసుకెళ్లారు. పెళ్లి వేడుకలో నాలుగు అంచెల భద్రతా వలయాన్ని పోలీసులు సృష్టించారు. బంధువులు వస్తే వెంట గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలి. వారి పేర్లు పోలీసుల వద్ద ఉన్న జాబితాతో సరిపోలాలి. ఆ తర్వాత వేడుకలో పాల్గొననిస్తారు. సెల్ఫోన్లను మండపంలోకి పోలీసులు అనుమతించలేదు. స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్, హరియాణా క్రైమ్ ఇన్వెస్టిగేన్ ఏజెన్సీ, ఢిల్లీ స్పెషల్ వెపన్స్ టెక్నిక్స్ విభాగాల పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. ‘రివాల్వర్ రాణి’, ‘మేడమ్ మింజ్’గా పేరొందిన 39 ఏళ్ల అనురాధాను 2020 సంవత్సరం నుంచి 40 ఏళ్ల సందీప్ ప్రేమిస్తున్నాడు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ఇతను సన్నిహితుడు. అతడి తలపై రూ.7 లక్షల రివార్డ్ ఉంది. 2021లో పోలీసులు అతడిని అరెస్ట్‌చేశారు. గతంలో కస్టడీ నుంచి ఒకసారి సందీప్ తప్పించుకున్నాడు. అది పునరావృతం కాకూడదనే పెరోల్‌పై బయట ఉన్నంతసేపు సందీప్‌పై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. గ్యాంగ్‌వార్‌ను ఎదుర్కొనేందుకు మండపంలో పోలీసులు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించారు. కేసుల బాధ నుంచి విముక్తి పొందాక సాధారణ జీవితం గడపాలని ఇద్దరం భావిస్తున్నట్లు అనురాధా చెప్పారు. -
250 మంది పోలీసుల బందోబస్తు మధ్య గ్యాంగ్స్టర్ల పెళ్లి..
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జాతేడి, మహిళా క్రిమినల్ అనురాధ చౌదరి అలియాస్ 'మేడమ్ మింజ్'ల వివాహం మంగళవారం ఢిల్లీఓ జరిగింది. ద్వారకా సెక్టార్-3లోని సంతోష్ గార్డెన్, బాంక్వెట్ హాల్ వీరి పెళ్లి వేదికగా మారింది.. సందీప్ తరఫు న్యాయవాది రూ.51వేలు చెల్లించి ఈ హాల్‌ను బుక్ చేశాడు. ఈ వివాహానికి సందీప్ కుటుంబం 150 మంది అతిథులను ఆహ్వానించాడు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్, బెయిల్‌పై ఉన్న ఓ మహిళా క్రిమినల్‌కు వివాహం నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించారు. గ్యాంగ్‌స్టర్‌కు ఉన్న నేర చరిత్ర, కేసులను దృష్టిలో పెట్టుకొని గ్యాంగ్‌వార్ జరిగే అవకాశం, లేదా కస్టడీ నుంచి నిందితుడు తప్పించుకునేందుకు తావివ్వకుండా ఢిల్లీ పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, స్పెషల్ స్టాఫ్, క్రైమ్ బ్రాంచ్‌ల బృందాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, సాయుధ బలగాల మోహరించారు. 250 మందికి పైగా పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. వేదిక ప్రవేశం వద్ద రెండు డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశామని, వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరూ దాని గుండా వెళ్లాల్సి ఉంటుందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా హరియాణాలోని సోనిపట్‌కు చెందిన సందీప్ ఒకప్పుడు అతని తలపై రూ. 7 లక్షల రివార్డుతో వాంటెడ్ క్రిమినల్. తీహార్ జైల్లోఉ న్న సందీప్.. పెళ్లి కోసం ఢిల్లీ కోర్టు ఆరు గంటల పెరోల్ ఇచ్చింది. ఇక ‘రివాల్వర్ రాణి' గా పేరొందిన అనురాధ చౌదరి అనేక కేసుల్లో నిందితురాలిగా ఉంది. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నారు. నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు సందీప్ అత్యంత సన్నిహితుడు. ఇతడిపై దోపిడీ, హత్య, హత్యాయత్నం వంటి కేసులున్నాయి. -
Canada: భారత సంతతి వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు
ఒట్టావా: కెనడా రాజధాని నగరం ఒట్టావాలో భారత సంతతి వ్యాపారవేత్త ఇంటిపై దాడి జరిగింది. వ్యాపారవేత్త ఇంటిపై దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడికి పాల్పడింది పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ అలియాస్ సతిందర్‌జిత్ సింగ్ గ్రూపునకు చెందిన మనుషులుగా అనుమానిస్తున్నారు. మాస్కులు ధరించిన వ్యక్తులు వ్యాపారవేత్త ఇంటిలోకి కాల్పులు జరుపుతున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత్, కెనడాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌గా పేరున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో గోల్డీ బ్రార్ గ్యాంగ్‌కు సంబంధాలున్నాయి. అయితే వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులకు పాల్పడింది తామేనని ఇప్పటివరకు గోల్డీ బ్రార్ గ్యాంగ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. భయపెట్టి బలవంతపు వసూళ్లకు(ఎక్స్టార్షన్) పాల్పడేందుకే వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. కెనడాలో గ్యాంగ్స్టర్లు ఎక్స్‌టార్షన్‌కు పాల్పడటం ప్రస్తుతం సాధారణంగా మారిపోవడం గమనార్హం. ఇదీ చదవండి.. ట్రంప్ ప్రపంచానికే ముప్పు -
'ఇటు చెన్నై... అటు ముంబై' వార్‌కు దిగిన మన గ్యాంగ్‌స్టార్స్
బాక్సాఫీస్‌ను లూటీ చేయడానికి గ్యాంగ్‌స్టర్‌గా మారారు కొందరు స్టార్స్. వెండితెరపై ఈ హీరోలు గ్యాంగ్‌వార్ చేస్తున్నారు. గ్యాంగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రాల్లో గ్యాంగ్‌స్టర్స్‌గా మారిన ఆ కోలీవుడ్ గ్యాంగ్‌స్టార్స్ గురించి తెలుసుకుందాం. గ్యాంగ్‌స్టర్ రంగరాయ గ్యాంగ్‌స్టర్ రంగరాయ శక్తివేల్ నాయకర్‌గా మారారు కమల్‌హాసన్. ‘థగ్ లైఫ్’ సినిమాలో కమల్‌హాసన్ చేస్తున్న పాత్ర పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. 1987లో చేసిన ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’) చిత్రం తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. 37 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న ఈ సినిమాలో త్రిష, దుల్కర్ సల్మాన్, ‘జయం’ రవి, నాజర్, గౌతమ్ కార్తీక్, జోజూ జార్జ్, ఐశ్వర్యా లక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ‘నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. కాయల్ పట్టినమ్. నన్ను క్రిమినల్, గుండా, యాకుజా అని పిలుస్తారు. యాకుజా అంటే జపాన్ భాషలో గ్యాంగ్‌స్టర్ అని అర్థం’ అంటూ ‘థగ్ లైఫ్’లోని తన పాత్ర గురించి ఈ సినిమా టైటిల్ టీజర్ అనౌన్స్మెంట్ వీడియోలో చెప్పుకొచ్చారు కమల్. ఆర్. మహేంద్రన్, కమల్‌హాసన్, మణిరత్నం, ఎ. శివ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరకర్త. 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. స్టూడెంట్ టు గ్యాంగ్‌స్టర్ ‘సూరరై పోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా!’) వంటి సందేశాత్మక బయోపిక్ తీసిన తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర ఓ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ చేయనున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ మూవీలో సూర్యతో పాటు దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్ వర్మ లీడ్ రోల్స్ చేస్తారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అవుతుంది. చెన్నై, తిరుచ్చి లొకేషన్స్‌తో పాటు హర్యానాలో కూడా కొంత షూటింగ్ ప్లాన్ చేశారట. ఇక కథ రీత్యా స్టూడెంట్ స్థాయి నుంచి గ్యాంగ్‌స్టర్ వరకు ఎదిగే వ్యక్తి పాత్రలో సూర్య కనిపిస్తారని కోలీవుడ్ సమాచారం. 2డీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌ను ఆరంభించారు సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్. ఇది జీవీ ప్రకాశ్‌కు నూరవ చిత్రం కావడం విశేషం. ఇటు చెన్నై... అటు ముంబై తమిళనాడులో ఒకటి, ముంబైలో మరొకటి... ఇలా రెండు గ్యాంగ్‌లు మెయిన్టైన్ చేస్తున్నట్లున్నారు హీరో ధనుష్. ముందు తమిళనాడుకు వెళితే... ధనుష్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాయన్’. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సందీప్ కిషన్, కాళిదాసు, సెల్వ రాఘవన్, ప్రకాశ్‌రాజ్, దుషారా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముగ్గురు అన్నదమ్ములు (ధనుష్, సందీప్ కిషన్, కాళిదాసు)ల మధ్య నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా అట ‘రాయన్’. ధనుష్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రం, ఆయనకు కెరీర్లో యాభైవ చిత్రం కావడం విశేషం. ఓ గ్యాంగ్‌స్టర్ చెఫ్‌గా ఎందుకు కొత్త జీవితం ప్రారంభించాల్సి వచ్చింది? గ్యాంగ్‌స్టర్ గొడవలు అతని కుటుంబాన్ని, జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయనే అంశాలు ‘రాయన్’ చిత్రంలో ఉంటాయని టాక్. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు ముంబై గ్యాంగ్స్టర్స్ మాఫియా నేపథ్యంలో సాగే ‘డీఎన్ఎస్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నారని తెలిసింది. నాగార్జున ఓ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్. కథ రీత్యా ధనుష్, నాగార్జున ఈ సినిమాలో గ్యాంగ్స్టర్స్ రోల్స్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పుస్కూరు రామ్మోహన్, సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ధారావి’ అనే టైటిల్‌ను పరిశీ లిస్తున్నారట మేకర్స్. ఈ సినిమా 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలతో పాటు గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తమిళంలో మరికొన్ని చిత్రాలు రానున్నాయి. -
పెళ్లి వేడుకలో కాల్పులు.. పాక్ గ్యాంగ్‌స్టర్ మృతి
లాహోర్: పాకిస్థాన్‌లో మరో గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. లాహోర్ అండర్‌వరల్డ్ డాన్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ చీఫ్ అమీర్ బలాజ్ టిపును ఓ దుండగుడు కాల్చివేశాడు. ఆదివారం లాహోర్‌లోని చంగ్ ప్రాంతంలో ఓ వివాహ వేడుకకు హాజరైన అమీర్‌తోపాటు మరో ఇద్దరు అతిథులపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన ఆమీర్ సహాయకులు ఎదురు కాల్పులు జరపగా ఆ కాల్పుల్లో షూటర్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన వారిని హుటాహుటిన జిన్నా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అమీర్ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆయనపై దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. కాగా 2010లో అల్లమా ఇక్బాల్ విమానాశ్రయంలో జరిగిన ఘోరమైన తుపాకీ కాల్పుల్లో ఆమీర్ తండ్రి ఆరిఫ్ అమీర్, అలియాస్ టిప్పు ట్రక్కన్వాలా మృతిచెందాడు. బలాజ్ తాత కూడా గతంలో గొడవలో పాత్ర ఉన్నవాడే. వీరి కుటుంబం మొత్తం హింసాత్మక చరిత్రను కలిగి ఉంది. -
ఒక్క ప్లాట్ రూ.200 కోట్లు.. భారీగా ఎగబడ్డ జనం - ఎందుకో తెలుసా?
కరోనా మహమ్మారి తరువాత రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందింది. గత కొంతకాలం నుంచి ఢిల్లీ NCR, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, పూణే, చెన్నై, బెంగళూరు నగరాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటేస్తున్నాయి. ఇండియాలోనే ఇలా ఉంటే.. అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో రియల్ ఎస్టేట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల USAలో ప్లాట్ ఏకంగా రూ.200 కోట్లకు పలికినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని చాలామంది ధనవంతులు ప్లోరిడాలోని మయామీ బీచ్ దగ్గర ఇల్లు కట్టుకోవాలని కలలు కంటారు. ఇటీవల అక్కడ ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేయడానికి వందలాదిమంది ఎగబడ్డారు. దీంతో అది 23.9 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ ఏకంగా రూ.200 కోట్లకంటే ఎక్కువ. నిజానికి రూ.200 కోట్లకు పలికిన ఆ స్థలంలో ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్ 'ఏఐ క్యాప్‌వన్' నివసించాడు, అతడు చనిపోయిన తరువాత అతని భవనం నేలమట్టం చేసారు. ఆ స్థలానికి అంత రేటు పలకడానికి కారణం అక్కడ గ్యాంగ్‌స్టర్ నివాసముండటమే అని కొందరు భావిస్తున్నారు. ఈ స్థలం మొత్తం 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అక్కడ నివాసముండటం వల్ల ఆ స్థలం బాగా పాపులర్ అయింది. దీంతో ఆ స్థలం గురించి చాలామందికి తెలిసింది. అందులోనూ అది పూర్తిగా ఖాళీ స్థలం కావడం వల్ల ఎక్కువమంది తమకు నచ్చినట్లు ఇల్లు కట్టుకోవచ్చని ఎగబడ్డారు. 2021లో ఈ స్థలం విలువ 10.75 మిలియన్లని.. ఆ తరువాత ఇప్పుడు ఆ భూమి విలువ రెట్టింపు ధరకు పలికినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు - వాటివైపే కొనుగోలుదారుల చూపు! -
మార్కెటింగ్ స్కామ్ నేపథ్యంలో ‘గ్యాంగ్ స్టర్’
గ్రానైట్ స్లాబులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ వ్యాపార రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత వేలు మురుగన్. ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్ స్టర్’. రామ్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి నెలలో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వేలు మురుగన్ మాట్లాడుతూ మార్కెటింగ్ స్కామ్ అనే నూతన పాయింట్ పై సినిమా అంతా నడుస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి పాయింట్ పై సినిమా రాలేదని చెప్పాలి. ఇందులో హీరోలు ఎవరు? విలన్స్ ఎవరు? అనేది క్లైమాక్స్ వరకు తెలియదు. ప్రతి పాత్ర ఎంతో ఇంట్రస్టింగ్ గా క్యూరియాసిటీ కలిగించే విధంగా ఉంటుంది. దర్శకుడు రామ్ ప్రభ సినిమాను ఎంతో ఇంట్రస్టింగ్ గా తెరకెక్కించారు. ప్రజిన్ పద్మనాభన్ , జీవా మరియు విజయ్ విశ్వ ముఖ్య పాత్రలో నటించారు. అలాగే సాయిధన్య, మోహన సిద్ధి, షాలిని హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నాం. ముగ్గురు కూడా అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటారు. ఆర్టిస్టులందరూ తమ పాత్రలకు తగ్గట్టుగా పోటీపడుతూ నటించారు. కచ్చితంగా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ గ్యాంగ్ స్టర్ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది అనడంలో సందేహం లేదు’ అన్నారు. -
పెళ్లి రోజే.. సొంత ముఠా చేతిలో గ్యాంగ్‌స్టర్ హతం..
పుణె: గ్యాంగ్‌స్టర్ శరద్ మోహోల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆర్ధిక వివాదాల నేపథ్యంలో సొంత ముఠా సభ్యులే ఆయన్ను కాల్చి చంపారు. ఈ ఘటన పుణెలో శుక్రవారం చోటుచేసుకుంది. హత్య దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. వివరాలు.. గ్యాంగ్‌స్టర్ శరద్ మోహల్ (40)కు, అతడి గ్యాంగ్ సభ్యులకు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో శరద్ మోహోల్, అతని గ్యాంగ్ పుణెలోని కొత్రుడ్ రోడ్డుపై నడస్తూ వస్తున్నారు. చిన్న సందులోకి వెళ్లిన తర్వాత శరద్‌పై తన ముఠా సభ్యులు తుపాకీతో కాల్పులు జరిపారు. గఅతని ఛాతీకి ఒక బుల్లెట్, భుజానికి రెండు బుల్లెట్లు తగిలి కిందపడిపోయాడు. నిందితులు వెంటనే అతన్ని పక్కకు లాక్కెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న శరద్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు . కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి మూడు తుపాకులు, మూడు మ్యగజైన్లు, అయిదు రౌండ్ల బుల్లెట్లను ను స్వాధీనం చేసుకున్నారు. శరద్ మోహల్‌పై ఎన్నో దోపీడి, హత్య కేసులు ఉన్నాయి. డబ్బు, భూ వివాదాల కారణంగానే అతడిని హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. .దీనిపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో స్పందిస్తూ.. మొహోల్‌ను అతని అనుచరులే చంపారని ఇది గ్యాంగ్ వార్ కాదన్నారు. -
Goldy Brar: ఇక ఉగ్రవాదిగా గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్
ఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలన, తీవ్రవాద కార్యకలాపాల కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు అతడిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న గోల్డీ బ్రార్‌కు నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. గోల్డీ బ్రార్‌కు ఉగ్రవాద సంస్థలతోపాటు పలు హత్యలతో సంబంధం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), 1967 ప్రకారం గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. దేశంలోని పలువురు ప్రముఖులను హత్య చేసేందుకు కొన్ని హంతక ముఠాలకు డ్రోన్ల ద్వారా అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తన అనుచరులతో పంజాబ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని గోల్డీ బ్రార్ ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. అతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. గోల్డీ బ్రార్ నేపథ్యం.. సతీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పంజాబ్‌లోని శ్రీ ముక్త్సార్ సాహిబ్‌లో 1994లో జన్మించాడు. ఇతడి తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్. తొలిసారిగా సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన లారెన్స్ బిష్ణోయ్‌తో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ హత్య గురించి గోల్డీ బ్రార్‌కు ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్ లాండాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. 33 ఏళ్ల లఖ్బీర్ ఖలిస్తానీ గ్రూప్ ‘బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్’ (బీకేఐ)కి చెందిన గ్యాంగ్‌స్టర్. 2021లో మొహాలిలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్‌పై రాకెట్ దాడి ప్రణాళికలో భాగస్వామ్యుడు. అదే విధంగా 2022 డిసెంబరులో తరన్ తరణ్‌లోని సర్హాలి పోలీస్ స్టేషన్లో జరిగిన ఆర్పీజీ దాడి ఘటనలోనూ లాండా పాత్ర ఉంది. అతను అనేక ఇతర తీవ్రవాద కార్యకలాపాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. లఖ్బీర్ స్వస్థలం పంజాబ్ కాగా గత కొన్నేళ్లుగా కెనడాలో స్థిరపడ్డాడు. భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన కుట్రల్లో అతని హస్తం ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో లఖ్బీర్ సన్నిహితులతో సంబంధం ఉన్న 48 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), పంజాబ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సోదాల అనంతరం కొంత మందిని అరెస్టు చేశారు. అయితే సెప్టెంబర్ 21న ఒక వ్యాపారిపై ఇద్దరు దుండగులు దాడి చేయడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. తాను లాండ హరికే అని చెప్పుకుంటూ ఓవ్యక్తి తనకు ఫోన్ చేసి రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు సదరు వ్యాపారి పోలీసులకు చెప్పడంతో వారు దాడులు చేపట్టారు చదవండి: డామిట్! కథ అడ్డం తిరిగింది.. నితీశ్‌ను తప్పించబోయి చిత్తయిన లలన్ -
సింగర్ ఎల్లీ మంగట్ హత్యకు కుట్ర..అర్షదీప్ ముఠా సభ్యుల అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మయూర్ విహార్‌లో సోమవారం ఉదయం జరిగిన స్వల్ప ఎదురుకాల్పుల అనంతరం గ్యాంగ్‌స్టర్ అర్షదీప్ సింగ్ ముఠాకు చెందిన ఇద్దరు షార్ప్షూటర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిని రాజ్‌ప్రీత్ సింగ్(25), వీరేంద్ర సింగ్(22)గా గుర్తించారు. పంజాబీ గాయకుడు ఎల్లీ మంగట్ను చంపేందుకు వీరు పథక రచన చేసినట్లు వెల్లడించారు. ఎన్కౌంటర్ సమయంలో అయిదు రౌండ్ల వరకు తుపాకీ కాల్పులు జరపగా, రెండు బుల్లెట్లు పోలీసు అధికారి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను తాకాయన్నారు. ప్రతిగా పోలీసులు ఆరు రౌండ్ల వరకు జరిపిన కాల్పుల్లో వీరేంద్ర సింగ్ కుడి కాలికి గాయమైంది. ఎన్కౌంటర్ అనంతరం నిందితులిద్దరినీ ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించామన్నారు. వీరి నుంచి రెండు రివాల్వర్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్, చోరీ చేసిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
గ్యాంగ్‌స్టర్, మాజీ ఎమ్మెల్యే అన్సారీకి షాక్, పదేళ్ల జైలు, భారీ జరిమానా
Mukhtar Ansari: యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ టర్న్డ్ పొలిటీషియన్,మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ మరోసారి భారీ షాక్ తగిలింది. ముఖ్తార్ అన్సారీ హత్య, హత్యాయత్నం కేసుల్లో దోషిగా తేల్చిన ఘాజీపూర్ కోర్టు శుక్రవారం పదేళ్ల జైలుశిక్ష, భారీ జరిమానా విధించింది. 2009 గ్యాంగ్స్టర్స్ యాక్ట్ కేసులో అన్సారీని గురువారం ఘాజీపూర్ జిల్లా ప్రత్యేక న్యాయమూర్తి (ఎంపీ-ఎమ్మెల్యే) అరవింద్ మిశ్రా అన్సారీని దోషిగా ప్రకటించారు. బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. అన్సారీ అనుచరుడు, సోనూ యాదవ్‌ను కూడా దోషి తేల్చింది. సోనుకు 5 సంవత్సరాల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది. అయితే దీనిపై హైకోర్టులో అప్పీలు చేస్తామనీ, తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని ముఖ్తార్ అన్సారీ తరఫు న్యాయవాది లియాఖత్ తెలిపారు. 2009లో కపిల్ దేవ్ సింగ్ హత్యకు కుట్ర పన్నిన ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు మీర్ హసన్ అనే వ్యక్తిపై దాడికి సంబంధించిన మరో కేసు కూడా ఉంది. ఘాజీపూర్‌లోని కరంద పోలీస్ స్టేషన్లో ముఖ్తార్‌పై గ్యాంగ్‌స్టర్ కేసు నమోదైంది. అయితే 2011, 2023లో ఈ రెండు కేసుల్లో అన్సారీని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అన్సారీకి 1996లో విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) నాయకుడు నందకిషోర్ రుంగ్తా, 2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ను హత్య చేసిన కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ముఖ్తార్ అన్సారీ మౌ సదర్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. #WATCH | Ghazipur additional district government counsel (criminal) Neeraj Srivastava says, "A case was registered against Mukhtar Ansari and his aide Sonu Yadav in 2010. In connection with that case, both the accused were pronounced guilty yesterday and today arguments on the… https://t.co/hVsOHFXn9a pic.twitter.com/fK2QZq71Ii — ANI UP/Uttarakhand (@ANINewsUP) October 27, 2023 -
19 ఏళ్లకే గ్యాంగ్‌స్టర్‌గా, ఎన్ఐఏకి చుక్కలు: ఇపుడు ఇంటర్ పోల్ రంగంలోకి
న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన 19 ఏళ్ల గ్యాంగ్‌స్టర్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్) రెడ్ కార్నర్ నోటీసు జారీ ఏసింది. నకిలీ పాస్‌పోర్ట్‌తో రెండేళ్ల క్రితం అమెరికాకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్ యోగేష్ కాద్యాన్‌పై నేరపూరిత కుట్ర, హత్యాయత్నం లాంటి అభియోగాలతో తాజాగా ఈ నోటీసు లిచ్చింది. యోగేష్ చిన్న వయస్సులోనే ఆధునిక ఆయుధాలను ఉపయోగించడంలో నిపుణుడని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న గ్యాంగ్‌లో ఇతను కూడా చేరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం యుఎస్‌లోని బాబిన్హా గ్యాంగ్‌లో చేరిన కాద్యాన్‌కు ఖలిస్తానీ ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయని, అత్యాధునిక ఆయుధాల వినియోగంలో ఆరితేరిపోయాడనే తీవ్ర ఆరోపణలూ ఉన్నాయి. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) ఈ నేపథ్యంలోనే ఇండియాలో కాద్యాన్ ఇల్లు, ఇతర రహస్య స్థావరాలపై ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)దాడులు చేసింది. అలాగే అతని ఆచూకీ తెలిపిన రూ.1.5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. తాజాగా ఇంటర్‌పోల్ కూడా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. అంతకుముందు, విదేశాలకు పారిపోయాడని భావిస్తున్న మరో గ్యాంగ్‌స్టర్ హిమాన్షు అలియాస్ భౌపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. వీరంతా ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను తొలగించి, అమెరికా, కెనడాలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. (హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం) కాగా గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌లో NIA ఇటీవల వేగం పెంచింది. దీంతోచాలా మంది గ్యాంగ్స్టర్లు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోవడమో, లేదా యోగేష్ కడియన్ మాదిరిగా నకిలీ పాస్‌పోర్ట్‌లతో భారతదేశం నుండి పారిపోయారు. గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై అహ్మదాబాద్ జైలులో ఉన్నాడు. ఈ కేసును ఎన్ఐఎ దర్యాప్తు చేస్తోంది. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో బిష్ణోయ్ ప్రధాన నిందితుడు. (కొవ్వు ఇంజక్షన్లు: శరీరం కుళ్లిపోయి..వికృతంగా.. చావే మేలు అనుకున్నా.!) గత నెలలో పంజాబ్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ (సుఖ దునేకే) కెనడాలో తామే హత మార్చామని లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించడంతో అతను ఇటీవల మళ్లీ వార్తల్లో నిలిచాడు. గతంలో కూడా పలు మార్లు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
గ్యాంగ్‌స్టర్ సునీల్ నాహక్ హత్య
ఒడిశా: గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న గంజాం జిల్లాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సునీల్ నాహక్ గురువారం రాత్రి కుదలాలో గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఏఎస్పీ రమేష్ చంద్ర సెఠి తెలిపిన వివరాల మేరకు.. అస్కా పోలీసుస్టేషన్ పరిధి బొడగాం గ్రామానికి చెందిన గ్యాంగ్‌స్టర్ సునీల్ నాహక్‌ను కుదలా పోలీసుస్టేషన్ పరిధి ధర్మగడ గ్రామంలో దుండగులు మారణాయుధాలతో హత్యచేసి పరారయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు తరలించారు. హత్యకు గురైన సునీల్ నాహక్ కొద్ది నెలల క్రితం అస్కాలో హనుమాన్ కోయన్కి సంబంధించి డబుల్ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అలాగే ఆయనపై వివిధ పోలీసుస్టేషన్లలో పదుల సంఖ్యలో గంజాయి కేసులు, పలు నేరారోపణలు ఉన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన నిందితులను గాలిస్తున్నారు. -
అమెజాన్ మేనేజర్ హత్య వెనుక 'మాయా గ్యాంగ్'.. అసలేంటిది..?
ఢిల్లీ: అమెజాన్ మేనేజర్ హత్యా ఉదంతంలో భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేనేజర్ హర్‌ప్రీత్ గిల్‌ను హత్య చేసింది కేవలం 18 ఏళ్ల వడిలో అడుగుపెట్టిన ఓ యువకుడి నాయకత్వంలోని మాయా గ్యాంగ్ పనేనని పోలీసులు గుర్తించారు. నిందితులు ఇప్పటికే పలు కేసుల్లో నేరస్థులుగా ఉన్నట్లు తెలిపారు. మహమ్మద్ సమీర్(18).. నాలుగు మర్డర్ కేసుల్లో బాల్యనేరస్థునిగా శిక్షను అనుభవిస్తున్నాడు. అతని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోనూ తుపాకీలకు పోజులిస్తూ, కాల్చడం వంటి ఫొటోలు ఉన్నాయి. అమెజాన్ మేనేజర్ హర్‌ప్రీత్‌ను హత్యచేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన ఇద్దరిలో ఒకరు సమీర్ కాగా.. మరొకరు 18 ఏళ్ల బిలాల్ గని. గని గతేడాది హత్య, దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని చిల్డ్రన్స్ అబ్జర్వేషన్ హోమ్‌కు పంపారు. కాని బయటకు వచ్చి వెల్డింగ్ షాప్‌లో పని చేస్తున్నాడు. Bhajanpura murder: Delhi Police nabs 18-year-old man, says case solved Read @ANI Story | https://t.co/CwwQ54udMf#BhajanpuraCase #DelhiPolice pic.twitter.com/JjWFK7aA5M — ANI Digital (@ani_digital) August 31, 2023 అమెజాన్ మేనేజర్ హత్య.. ఢిల్లీకి చెందిన హర్‌ప్రీత్ గిల్ అనే 36 ఏళ్ల వ్యక్తి అమెజాన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటలకు తన మేనమామ గోవింద్‌తో కలిసి సుభాష్ విహార్‌లోని ఇరుకైన సందులో బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారికి ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొంతమంది యువకులు ఎదురయ్యారు. ఇరుకైన సందులో ట్రాఫిక్ సమస్యపై వచ్చిన గొడవలో నిందితులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. హర్‌ప్రీత్ గిల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మేనమామ గోవింద్‌కు చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు వెళ్లడించారు. ఇదీ చదవండి: ఢిల్లీలో ఘోరం.. అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. -
ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ అరెస్టు..
లక్నో: ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ విజయ్ మిశ్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. బీఎస్పీ శాసన సభ్యుడు రాజు పాల్ హత్య కేసులో ఉమేశ్ ప్రధాన సాక్షిగా ఉన్నాడు. అయితే.. ఉమేశ్‌ను అతీక్ అహ్మద్ కుమారుడు మరికొందరితో కలిసి హత్య చేశారు. ఈ వ్యవహారంలో ఉమేశ్ పాల్ లొకేషన్‌ను లాయర్ విజయ్ షేర్ చేసినట్లు గుర్తించారు. శనివారం రాత్రి లక్నోలోని తాజ్ హోటల్ బయట అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉమేశ్ హత్య సంబంధిత వీడియోలు ఉత్తరప్రదేశ్‌లో గతంలో వైరల్ అయ్యాయి. దుండగులు ఉమేశ్ ఇంటి వద్దే దాడి చేసి హత్య చేశారు. ఈ హత్యపై అప్పట్లో యూపీ అసెంబ్లీలో దుమారం రేగింది. ఉత్తరప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనల అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో మాఫియాను అంతం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తదనంతర కాలంలో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని కుమారుడు ఎన్కౌంటర్లో హత్యకు గురయ్యారు. ఉమేశ్ హత్య కేసులో అతీక్ భార్య పర్వీన్ కూడా నిందితురాలుగా ఉన్నారు. 2019లో తాను జైలులో ఉన్నప్పుడే హత్యకు కుట్ర పన్నినట్లు అతీక్ గతంలో వాంగ్మూలాన్ని ఇచ్చాడు. జైలులో ఉన్నప్పుడే పర్వీన్ సందర్శించి ఫోన్‌ను ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఆ ఫోన్‌తోనే ఉమేశ్ హత్యకు కుట్ర జరిగిందని వెల్లడించాడు. ప్రస్తుతం పర్వీన్ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇదీ చదవండి: కేరళలో అమానుషం.. ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసి హత్య.. -
హత్య కేసులో చోటా రాజన్‌కు ఊరట
ముంబై: ట్రేడ్ యూనియన్ లీడర్ దత్తా సామంత్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌ను నిరపరాధిగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 1997లో జరిగిన ఈ హత్యకు చోటా రాజన్ కుట్ర పన్నాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు వెల్లడించింది. సామంత్ తన జీపులో పంత్ నగర్ నుంచి ఘట్కోపర్ వెళుతుండగా మోటార్‌బైక్‌పై వచి్చన దుండగులు ఆయనపై 17 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో సామంత్ అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్య వెనుక చోటా రాజన్ హస్తం ఉందంటూ ప్రాసిక్యూషన్ కేసు నమోదు చేసింది. అయితే అందుకు గల సాక్ష్యాధారాలను సమరి్పంచడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో ప్రత్యేక న్యాయమూర్తి బి.డి.షెల్కె రాజన్‌కు కేసు నుంచి విముక్తి కలి్పంచారు. అతనిపై మరిన్ని కేసులు పెండింగ్‌లో ఉండడంతో విడుదలయ్యే అవకాశాల్లేవు. -
పోలీసుల కళ్లలో కారం కొట్టి.. ప్రతీకార హత్య!
క్రైమ్: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపింది ప్రత్యర్థి గ్యాంగ్. రాజస్థాన్ భరత్‌పూర్‌లో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన.. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు దీనిని ప్రతీకార హత్యగానే ప్రకటించారు. కుల్దీప్ అనే గ్యాంగ్ స్టర్ బీజేపీ నేత కృపాల్ జఘిన హత్య కేసులో ప్రధాన నిందితుడు. సెప్టెంబర్ 4, 2022లో ఈ హత్య జరగ్గా.. ఆ మరుసటిరోజే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కుల్దీప్ను అరెస్ట్ చేశారు. అయితే.. పోలీసుల కస్టడీలో ఉన్న కుల్దీప్, సహనిందితుడు విజయ్‌పాల్‌ను ఇవాళ జైపూర్ జైలు నుంచి భరత్పూర్ కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఓ వాహనంలో దూసుకొచ్చిన ప్రత్యర్థులు పోలీసుల కళ్లలో కారం కొట్టి.. కుల్దీప్ను కాల్చి చంపారు. మొత్తం పదిహేను రౌండ్ల కాల్పులు జరిపారు. కుల్దీప్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. విజయ్‌పాల్ గాయపడగా.. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. జైపూర్-ఆగ్రా నేషనల్ హైవేపై అమోలీ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపాక నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసుల బృందం.. సమీపంలోని గ్రామం నుంచి దుండగుల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
మాఫియా స్థలాల్లో పేదవారికి ఇళ్ళు.. దటీజ్ యోగి..
లక్నో: ఇటీవల హత్య చేయబడ్డ యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కబ్జా చేసిన స్థలాన్ని హస్తగతం చేసుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద 76 ఫ్లాట్లను నిర్మించి పేదలకు అందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కబ్జా చేసిన స్థానాలను తిరిగి గవర్నమెంట్ పరం చేసిన యూపీ ముఖ్యమంత్రి ఆ స్థలాల్లో పేదలకు ఇళ్ళు కట్టిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద మొత్తం 76 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేశారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్యతో కలిసి సందర్శించిన యోగి నిర్మాణాన్ని పరిశీలించి ఆ ఫ్లాట్ల తాళాలను లాటరీ పద్దతిలో ఎంపిక చేసిన లబ్దిదారులకు అందజేశారు. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 41 చదరపు మీటర్లు ఉన్న ఈ ఫ్లాట్ల కోసం 6000 మంది దరఖాస్తు చేసుకోగా అర్హులైన 1590 మందిని మాత్రమే లాటరీకి ఎంపిక చేశారు. ఈ సందర్బంగా యోగి మాట్లాడుతూ... 2017కు ముందు భూబకాసురులు ఇష్టానుసారంగా భూములను కబ్జా చేస్తుంటే నిర్భాగ్యులైన పేదవారు అలా చూస్తుండడం తప్ప ఏమీ చేయలేకపోయేవారని అన్నారు. అలాంటి ల్యాండ్ మాఫియాను అణచి అదే స్థలాలలో పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వడం కంటే గొప్ప విజయం మరొకటి లేదని అన్నారు. మొత్తానికి దోపిడీదారులు, అక్రమార్కుల ఆటలు కట్టించి దగాపడ్డ వారికి న్యాయం చేస్తూ యూపీ సీఎం యోగి అభినవ రాబిన్ హుడ్ అనిపించుకుంటున్నారు. #Prayagraj | Uttar Pradesh CM #YogiAdityanath interacts with children at the site of the flats that will be handed over to the poor shortly. The flats have been built on land confiscated from slain gangster-turned-politician #AtiqAhmed, in Prayagraj (via ANI) pic.twitter.com/1ZOeSrh3Ho — Hindustan Times (@htTweets) June 30, 2023 -
'తగ్గేదేలే..! విజయం సాధిస్తాం.. సల్మాన్‌ను చంపేస్తాం..'
ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. సల్మాన్‌ను చంపేస్తామని కెనడాకు చెందిన పరారీలో ఉన్న కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ హెచ్చరించాడు. సల్మాన్ తమ కిల్ లిస్ట్‌లో ఉన్నాడని వెల్లడించాడు. హీరో సల్మాన్‌ను చంపేస్తామని గత మార్చిలోనే మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్యూలో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్ సింగర్, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసే వాలా హత్యలో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ కీలక సూత్రధారి అని ఆరోపణలు కూడా ఉన్నాయి. 'మేము ఇంతకు ముందే చెప్పాం. ఒక్క సల్మాన్‌నే కాదు.. జీవించి ఉన్నతం కాలం మా శత్రువులను చంపేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. సల్మాన్‌ను మాత్రం ఖచ్చితంగా చంపేస్తాం. అందుకు మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయ్. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం.' అని గోల్డీ బ్రార్ తెలిపారు. గత మార్చిలోనే సల్మాన్ ఖాన్ సన్నిహితుడైన ప్రశాంత్ గుంజాల్కర్‌కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. హీరో సల్మాన్‌ను చంపేస్తామని అందులో పేర్కొన్నారు. గతంలో అరెస్టైన లారెన్స్ భిష్ణోయ్ అంశంలో గోల్డీ బ్రార్ సల్మాన్‌తో మాట్లాడాలనుకుంటున్నట్లు ఆ మెయిల్లో కోరారు. అప్పట్లో ఆ మెయిల్‌లపై గ్యాంగ్‌స్టర్ లారెన్స్ భిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. #EXCLUSIVE | Gangster #GoldyBrar's open threat to Salman Khan; man running India's biggest gang network speaks to India Today's @arvindojha. Here's the detailed report. #5ivLive with @nabilajamal_ - https://t.co/pEYfdF77O1 pic.twitter.com/dF0V2Bnnnq — IndiaToday (@IndiaToday) June 26, 2023 కెనడాలో టాప్ 25 మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఉన్నాడు. ప్రస్తుతం బ్రార్ కెనడాలోనే ఉన్నారని చాలా మంది విశ్వసిస్తారు. ఇండియాలో చాలా క్రిమినల్ నేరాల్లో అతని హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. కెనడాలో మాత్రం అతనిపై ఎలాంటి క్రిమినల్ నేర చరిత్ర ఆధారాలు లేనట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: రెచ్చిపోయిన దొంగలు.. గన్‌తో బెదిరించి.. కారును అడ్డగించి.. వీడియో వైరల్.. -
ఎంత పెద్ద గాంగ్ స్టార్ అయితేనేంటీ? నేను ఫైటర్ ను
-
లక్నో కోర్టు ఆవరణలో గ్యాంగ్‌స్టర్ హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సివిల్ కోర్టు ఆవరణలో పట్టపగలే దారుణం జరిగింది. గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవా దారుణ హత్యకు గురయ్యాడు. లాయర్ దుస్తుల్లో వచ్చిన షూటర్లు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనలో ఒక పోలీసు, ఓ మైనర్ బాలిక గాయపడ్డారని, నిందితుడిని అక్కడికక్కడే పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ క్రిమినల్ కేసులో జీవాను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని లక్నో పోలీస్ కమిషనర్ ఎస్బీ శిరాద్కర్ తెలిపారు. కాల్పులు అనంతరం కోర్టు ఆవరణలో పోలీసులను భారీగా మోహరించారు. గాయపడిన కానిస్టేబుల్, బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా, కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి అనుచరుడైన జీవా (48) ముజఫర్‌నగర్ జిల్లా వాసి. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బ్రహ్మ్ దత్తా ద్వివేది హత్య కేసులో నిందితుడు. మరో 24 కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. 1997 ఫిబ్రవరిలో ఫరూఖాబాద్ జిల్లాలో ద్వివేది హత్యకు గురయ్యాడు. ద్వివేదితోపాటు అతని గన్‌మెన్ హత్య కేసులో ట్రయల్‌కోర్టు జీవాను దోషిగా నిర్ధారించింది. జీవిత ఖైదు విధించింది. కోర్టు ఆవరణలోనే కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. శాంతిభద్రతల పరిరక్షణలో, భద్రతా ఏర్పాట్లో్ల విఫలమయ్యాయని ఆరోపించారు. -
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు
లక్నో: ముప్పై ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ నేత సోదరుడి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్– రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీకి వారణాసి కోర్టు జీవిత ఖైదు విధించింది. 1991 ఆగస్ట్ 3వ తేదీన కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ సోదరుడు అవధేశ్ రాయ్ వారణాసిలోని ఆయన ఇంటిగేటు వద్దే హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి అన్సారీతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవధేశ్ రాయ్ హత్య కేసును విచారించిన ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక జడ్జి అవనీశ్ గౌతమ్ అన్సారీకి జీవిత ఖైదుతోపాటు రూ.1.20 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు లాయర్ ఒకరు చెప్పారు. బందా జైలులో ఉన్న అన్సారీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరయ్యారు. వేర్వేరు రాష్ట్రాల్లో 61కి పైగా క్రిమినల్ కేసులను అన్సారీ ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు ఆరు కేసుల్లో దోషిగా తేలింది. ఒక కేసుకు సంబంధించి ఏప్రిల్‌లో ఘాజీపూర్ కోర్టు అన్సారీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. యూపీలోని మౌసదర్ స్థానం నుంచి అయిదు పర్యాయాలు అన్సారీ ఎమ్మెల్యే అయ్యాడు. 2022 ఎన్నికల్లో ఆయన కొడుకు అబ్బాస్ అన్సారీ సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. -
32 ఏళ్లనాటి కేసులో గ్యాంగ్‌స్టర్ ముఖ్తర్ అన్సారీకి జీవిత ఖైదు
ఉత్తరప్రదేశ్: 32 ఏళ్ల నాటి హత్య కేసులో ఐదుసార్లు ఎమ్మెల్యే, గ్యాంగ్‌స్టర్ ముఖ్తర్ అన్సారీకి వారణాసి కోర్టు జీవిత ఖైదు విధించింది. దాంతో పాటు లక్ష రూపాయల జరిమానాను కూడా విధించింది. అతనిపై నమోదైన 61 కేసుల్లో ఇది ఆరో కేసు. అతడు నిందితుడిగా ఉన్న మరో 20 కేసులు విచారణ దశలో ఉన్నాయి. ముఖ్తర్ అన్సారీకి గత ఏప్రిల్‌లోనే ఓ కిడ్నాప్, హత్య కేసులో పదేళ్ల జైలు శిక్ష పడింది. అతనిపై అనేక క్రిమినల్ కేసులు, భూకబ్జాలు, హత్య, దోపిడీ కేసులు నమోదయ్యాయి. అన్సారీ రాజకీయంలోకి రాకముందు 1991లోనే కాంగ్రెస్ నాయకుడి హత్య కేసులో నిందితునిగా ఉన్నాడు. 1991 ఆగష్టు 3న మాజీ ఎమ్మెల్యే అజయ్ రాజ్ సోదరుడు అవదేశ్ రాయ్‌ని దుండగులు కాల్చి చంపారు. ఈ కేసులో ముఖ్తర్ అన్సారీ, భీమ్ సింగ్, ఎమ్మెల్యే అబ్దుల్ కలీమ్‌తో సహా మరో ఇద్దరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కేసులో ముఖ్తర్ అన్సారీని వారణాసి కోర్టు మే19 దోషిగా తేల్చి, తీర్పును రిజర్వ్ చేసింది. ఉత్తరప్రదేశ్ చరిత్రలోనే సంచలనమైన బీజేపీ నాయకుడు కృష్ణానంద్ రాయ్ హత్య కేసులోనూ అన్సారీ నిందితుడిగా ఉన్నాడు. ముఖ్తర్ అన్సారీ 1996, 2002, 2007,2012తో సహా 2017లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇతని కుమారుడు అబ్బాస్ అన్సారీ 2022లో ఎస్బీఎస్పీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుత తీర్పుతో అవదేశ్ రాయ్ సోదరుడు అజయ్ రాజ్ సంతోషం వ్యక్తం చేశారు.'32 ఏళ్ల పోరాటానికి నేటికి దోషికి శిక్ష పడింది. ప్రభుత్వాలు మారాయి. అన్సారీ మరింత బలపడ్డారు.నేను, నా తల్లిదండ్రులు, సోదరుడు అవదేశ్ పిల్లలు ఎంతో ఓర్పుతో పోరాడాము' అని ఆయన అన్నారు. ఇదీ చదవండి:మంచు పెళ్లలు విరిగిపడి మహిళ మృతి -
గ్యాంగ్ స్టార్ గా మహేష్ బాబు...!
-
అతీక్, అతని సోదరుడిపై ఉన్న 152 కేసులు క్లోస్!
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు ఖాలిద్ అజీమ్(అశ్రఫ్) ఏప్రిల్ 15న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇద్దరూ మరణించడంతో వీరిపై ఉన్న 152 పెండింగ్ కేసులను క్లోస్ చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు నిర్ణయించారు. ఈ ఇద్దరి డెత్ రిపోర్టును కోర్టుకు సమర్పించి కేసులన్నీ మూసివేయనున్నారు. 152 కేసుల్లో అతీక్పైనే 102 కేసులున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈకేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో ఒక్క కేసులో మినహా అతీక్ ఎందులోనూ దోషిగా తేలలేదు. బెదిరింపులు, ప్రలోభాలతో శిక్ష పడకుండా చూసుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా అతీక్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇతనితో పాటు అనుచరులపైనా యూపీలోని యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. రౌడీ షీటర్లను ఎన్కౌంటర్లలో కాల్చిపడేసింది. వాళ్ల ఇళ్లను కూడా కూల్చివేసింది. అతీక్‌పై 1979లోనే తొలిసారి హత్య కేసు నమోదైంది. అప్పుడు అతని వయసు 15 ఏళ్లే కావడం గమనార్హం. అలాగే అతని సోదరుడు అశ్రఫ్పై 1992లో తొలి కేసు నమోదైంది. వీరిద్దరిపై చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్‌పాల్ హత్యకు సంబంధించిన కేసు నమోదైంది. కాగా.. అతీక్, అతని సోదరుడిపై ఉన్న కేసులు క్లోస్ చేస్తున్నప్పటికీ వీటిలో ఇతర నిందితులపై అభియోగాలు అలాగే ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. న్యాయపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. చదవండి: బ్రిడ్జిపైనుంచి పడిపోయిన బస్సు.. 14 మంది దుర్మరణం.. 20 మందికి గాయాలు -
ఆనంద్ మోహన్ విడుదల.. బిహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై బిహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. హత్య కేసులో దోషిగా ఉన్న అతన్ని ఉన్నట్టుండి జైలు నుంచి విడుదల చేయడంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా తెలంగాణ చెందిన జీ కృష్ణయ్య బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న సమయంలో ఆనంద్ మోహన్ అనుచరులు జరిపిన మూకదాడిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ఆనంద్ యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఇటీవల బిహార్ ప్రభుత్వం జైలు మన్యువల్ నిబంధనల్లో మార్పులు చేసింది. 14 ఏళ్లకు మించి జైల్లో ఉన్న 27 ఖైదీలను విడుదల చేయడానికి ఏప్రిల్ 24న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జాబితాలో 15 ఏళ్లుగా శిక్షను అనుభవిస్తున్న ఆనంద్ పేరు కూడా ఉంది. దీంతో ఈ ఏప్రిల్ 27న తెల్లవారుజామునే గ్యాంగ్‌స్టర్ సహస్ర జైలు నుంచి బయటకొచ్చారు. ఆనంద్ మోహన్ విడుదలను ఐఏఎస్ కృష్ణయ్య భార్య ఉమా వ్యతిరేకించారు. తన విడుదలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అమె పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వొన్నత న్యాయస్థానం బిహార్ సర్కార్‌కు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. చదవండి: రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 యుద్ధవిమానం.. ముగ్గురు మృతి -
యూపీలో ఎన్కౌంటర్.. మరో గ్యాంగ్‌స్టర్ హతం
లక్నో: యూపీలో కరుడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్స్టర్లను ఏరివేసే పనిలో పడింది సీఎం యోగి ఆదిత్యనాత్ ప్రభత్వం. యోగీ సీఎం అయ్యాక మార్చి 2017 నుంచి ఇప్పటి వరకు 183 మంది గ్యాంగ్స్టర్లు ఎన్కౌంటర్లో మరణించారు. ఇటీవల సైతం రాజకీయవేత్తగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో గ్యాంగ్‌స్టర్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. జాతీయ రాజధాని ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గ్యాంగ్‌స్టర్‌గా పేరుమోసిన అనిల్ దుజానాను ఉత్తర ప్రదేశ్‌కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మీరట్‌లో కాల్చి చంపారు. పశ్చిమ యూపీకి చెందిన అనిల్ దుజానాపై హత్యలు, దోపిడీలు, భూ కబ్జాలు వంటి కేసులు నమోదయ్యాయి. మొత్తం 60కి పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2012 నుంచి జైల్లో ఉంటున్నాడు. హత్య కేసులో బెయిల్ పొంది వారం రోజుల క్రితమే దుజానా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే తనపై నమోదైన హత్య కేసులో కీలక సాక్షులలో ఒకరిని బెదిరించడం ప్రారంభించాడని పోలీస్ వర్గాలు తెలిపాయి. సాక్షిని చంపాలని ప్లాన్ చేసుకున్నట్లు పేర్కొన్నాయి. దీంతో అతడిని అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. మీరట్‌లోని ఓ గ్రామంలో దుజానా, అతని గ్యాంగ్ దాగి ఉందని తెలియడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకన్న గ్యాంగ్‌స్టర్ ఎస్టీఎఫ్ బలగాలపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసు బృందంఎదురు కాల్పులు జరిపిందని ఈ ఆపరేషన్‌లో దుజానా మరణించినట్లు పేర్కొన్నారు. చదవండి: హెలిప్యాడ్ వద్ద మంటలు.. మరోసారి డీకే శివకుమార్‌కు తప్పిన ప్రమాదం -
కారు ఓవర్టేక్ చేశామని అతీక్ నా తమ్ముడ్ని చంపేశాడు.. 27 ఏళ్ల తర్వాత..
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదురుడు అశ్రఫ్ ఏప్రిల్ 15న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే అతీక్ మాఫియా డాన్‌గా ఉన్నప్పుడు చేసిన అరాచాకాలను కొందరు బాధితులు ఇప్పుడు వెల్లడిస్తున్నారు. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ తమకు వెన్నులో వణుకుపుడుతోందని భయాందోళన వ్యక్తం చేశారు. అతీక్ సోదరుడు అశ్రఫ్ ప్రయాణిస్తున్న కారును ఓవర్టేక్ చేసినంందుకు తన తమ్ముడ్ని అతీక్ దారుణంగా హత్య చేశాడని విజయ్ కుమార్ అనే వ్యక్తి వెల్లడించాడు. చిన్న చిన్న తప్పులకు కూడా అతీక్ కోర్టులో ఇలాంటి దారుణమైన శిక్షలు ఉండేవని ఆనాటి రోజులను గుర్తు చేసుకుని బోరున విలపించాడు. (చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఫేక్..! ఆప్ నేతకు క్షమాపణలు చెప్పిన ఈడీ..) 'మీ జీవితంలో జరిగే కొన్ని ఘటనలు జీవితాంతం మిమ్నల్ని వెంటాడుతుంటాయి. ఆరోజు ఏం జరిగిందో నాకు ఇంకా గుర్తుంది. అంత్యక్రియల్లో పాల్గొని నేను నా తమ్ముడు కారులో ఇంటికి వెళ్తున్నాం. ఈ క్రమంలో మా ముందు ఉన్న కారును ఓవర్టేక్ చేశాం. అయితే అందులో అతీక్ సోదరుడు అశ్రఫ్ ఉన్నాడని మాకు తెలియదు. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత అతీక్ మమ్మల్ని ఇంటికి పిలిపించాడు. నా గురించి తెలియదా? మీరు తప్పు చేశారు? అని అన్నాడు. నా తమ్ముడ్ని ప్రాణాలతో విడిచిపెట్టమని నేను ఎంత బతిమిలాడినా కనికరించకుండా నిర్దాక్షిణ్యంగా చంపాడు.' అని విజయ్ వివరించాడు. 1996లో ఈ ఘటన జరిగింది. అప్పుడు అతీక్ గ్యాంగ్‌స్టర్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్నాడు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో అతను చెప్పిందే వేదం. అతడ్ని ఎవరూ ఎదిరించే సహాయం కూడా చేసేవారు కాదు. దీంతో అతీక్ అరాచాకాలకు హద్దే లేకుండా పోయింది. 27 ఏళ్లుగా ఈ ఘటనపై నోరువిప్పని విజయ్ కుటుంబం.. ఇప్పుడు అతీక్ హతమవ్వడంతో తమ గోడు వెల్లబోసుకుని కన్నీటిపర్యంతమైంది. చదవండి: పోలీసుల నీచ బుద్ధి.. యువతిపై ఇద్దరు కానిస్టేబుళ్ల అత్యాచారం -
తీహార్ జైల్లో ఘర్షణ.. గ్యాంగ్‌స్టర్ టిల్లు మృతి
ఢిల్లీ: రోహిణి కోర్టు కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి, గ్యాంగ్‌స్టర్ టిల్లు తజ్‌పూరియా Tillu Tajpuriya మృతి చెందాడు. తీహార్ జైల్లో జరిగిన గ్యాంగ్ వార్‌లో అతను చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణం పోయిందని వెల్లడించారు. తీహార్ జైలులో గత రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ప్రత్యర్థి గ్యాంగ్ చేతిలో తజ్‌పూరియా తీవ్రంగా గాయపడ్డాడు. యోగేష్ తుండా, అతని అనుచరులు ఇనుప రాడ్లతో ఈ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. పోలీసులు అన్ని ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరగాల్సి ఉంది. Delhi's Rohini court shootout accused jailed gangster Tillu Tajpuriya killed after he was attacked by rival gang members Yogesh Tunda and others in Tihar jail. He was taken to Delhi's Deen Dayal Upadhyay Hospital, where he was declared dead. Further investigation underway by… pic.twitter.com/70cVYUD0rk — ANI (@ANI) May 2, 2023 ఢిల్లీలో మోస్ట్ వాండెటెడ్ అయిన గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని కిందటి ఏడాది సెప్టెంబర్‌లో రోహిణి కోర్టు ప్రాంగణంలోనే కాల్చి చంపారు ఇద్దరు దుండగులు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్ టిల్లు తజ్పూరియానే. అప్పుడు మండోలా జైలు నుంచే అతను జితేందర్ హత్యకు ప్రణాళిక వేయడం గమనార్హం. అయితే.. జితేందర్‌ను కాల్చిచంపిన ఇద్దరు దుండగులు అప్పుడే పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. వీరిని ఉమాంగ్ యాదవ్, వినయ్‌గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా టిల్లుకు వీరిద్దరూ సమాచారం ఇచ్చినట్టు వెల్లడైంది. ఇదీ చదవండి: సంచలనంగా చనిపోయిన వ్యక్తి లేఖ! -
బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్‌స్టర్‌కు పదేళ్ల జైలు..
లక్నో: బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కిడ్నాప్, హత్య కేసులో గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ ముఖ్తర్ అన్సారీని దోషిగా తేల్చింది ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు. అతనికి 10 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అన్సారీ సోదరుడు, బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీని కూడా న్యాయస్థానం దోషిగా తేల్చింది. అతనికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. 2005లో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేశారు అన్సారీ సోదరులు. వీరిపై అనేక నేరారోపణలు ఉన్నాయి. 2001 ఉస్రి ఛట్టి గ్యాంగ్ వార్ ఘటనకు సంబంధించి కూడా ఈ ఏడాది జనవరిలోనే ముఖ్తర్పై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో పాటు ఇతర కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. తీర్పు అనంతరం రాయ్ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరిగిందన్నారు. ప్రస్తుతం యూపీలో మాఫియా, గ్యాంగ్స్టర్లు అంతమయ్యారని పేర్కొన్నారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. అప్రూవర్‌గా మారిన కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు! -
తెలుగు ఐఏఎస్ అధికారిని పొట్టనబెట్టుకున్న...గ్యాంగ్‌స్టర్‌ను వదిలేశారు!
పట్నా: అతనో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్. మాజీ ఎంపీ కూడా. పేరు ఆనంద్ మోహన్. దాదాపు 30 ఏళ్ల కింద బిహార్‌లో ఏకంగా ఐఏఎస్ అధికారిపైకే మూకను ఉసిగొల్పి అత్యంత పాశవికంగా రాళ్ల దాడి చేయించి పొట్టన పెట్టుకున్నాడు. ఆ కేసులో 15 ఏళ్లుగా జీవితఖైదు అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేస్తూ నితీశ్‌కుమార్ సర్కారు వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఏకంగా జైలు నిబంధనలనే మార్చేసింది! ఆనంద్‌తో సహా పలు తీవ్ర నేరాలకు పాల్పడి జీవితఖైదు అనుభవిస్తున్న మరో 26 మంది దోషుల విడుదలకు సోమవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం పెరోల్ మీద ఉన్న అతడు ఆ సమయంలో తన కుమారుడైన ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ నిశ్చితార్థ వేడుకను ఆస్వాదిస్తున్నాడు! నితీశ్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బిహార్‌లోని రాజకీయ తదితర రంగాల ప్రముఖులంతా అందులో పాల్గొన్నారు. తనకు విముక్తి ప్రసాదిస్తున్నందుకు నితీశ్‌కు ఆనంద్ మోహన్ కృతజ్ఞతలు తెలిపాడు. త్వరలో డెహ్రాడూన్‌లో జరిగే కొడుకు పెళ్లిని కూడా దగ్గరుండి జరిపించుకుంటానంటూ హర్షం వెలిబుచ్చాడు. పెరోల్ ముగియడంతో మంగళవారం జైలుకు తిరిగి వెళ్లిన అతను బుధవారం రెమిషన్‌పై విడుదల కానున్నాడు. నితీశ్ సర్కారు నిర్ణయంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఎస్పీ, బీజేపీతో పాటు ఐఏఎస్ అధికారుల సంఘం కూడా దీన్ని తీవ్రంగా తప్పుబట్టగా అధికార జేడీ(యూ) మాత్రం సమర్థించుకుంది. క్షమాభిక్ష జాబితాలో మైనర్‌పై అత్యాచారం కేసులో దోషి ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్, పలు తీవ్ర క్రిమినల్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న జేడీ(యూ) మాజీ ఎమ్మెల్యే అవధేశ్ మండల్ కూడా ఉన్నారు. ఏం జరిగింది? 1994లో లాలుప్రసాద్ యాదవ్ హయాంలో బిహార్‌లో చోటా శుక్లా అనే కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ను ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన గ్యాంగ్‌స్టర్ బ్రిజ్ బిహారీ ప్రసాద్ సానుభూతిపరులు దారుణంగా కాల్చి చంపారు. మండల్ రిజర్వేషన్లపై దేశమంతా అట్టుడుకున్న వేళ అగ్రవర్ణ భూమిహార్ అయిన శుక్లా హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. డిసెంబర్ 5న శుక్లా అంతిమయాత్ర సందర్భంగా ఆనంద్ మోహన్ పిలుపు మేరకు వేలాది మంది రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి దిగారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న గోపాల్‌గంజ్ కలెక్టర్ అయిన తెలంగాణకు చెందిన దళిత ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యను కార్లోంచి బయటికి లాగి రాళ్లతో విచక్షణారహితంగా కొట్టి పొట్టన పెట్టుకున్నారు. ఆనంద్ మోహన్ దగ్గరుండి మరీ వారిని ఈ దాడికి ప్రేరేపించినట్టు చెబుతారు. ఈ కేసులో జైల్లో ఉండగానే ఎంపీగా గెలిచాడు. 2007లో కింది కోర్టు మరణశిక్ష విధించింది. దాంతో స్వతంత్ర భారత చరిత్రలో మరణశిక్ష పడ్డ తొలి రాజకీయ నాయకునిగా రికార్డుకెక్కాడు. తర్వాత దాన్ని పట్నా హైకోర్టు జీవితఖైదుగా మార్చింది. అప్పట్నుంచీ అతడు జైల్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల హత్యకు, అత్యాచారాలకు పాల్పడ్డవారికి రెమిషన్ మంజూరు చేయరాదన్న నిబంధనను నితీశ్ సర్కారు తాజాగా తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర జైలు మాన్యువల్‌ను సవరిస్తూ ఏప్రిల్ 10న నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఆనంద్ మోహన్ విడుదల కోసమేనని అప్పట్నుంచీ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నితీశ్‌తో అతని బంధం ఇప్పటిది కాదు. వారిద్దరూ సమతా పార్టీ సహ వ్యవస్థాపకులు. కృష్ణయ్య...అట్టడుగు నుంచి ఎదిగిన తెలుగు తేజం మూక దాడికి బలైన ఐఏఎస్ జి.కృష్ణయ్య తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నిరుపేద దళిత కుటుంబంలో పుట్టారు. ఇల్లు గడిచేందుకు తండ్రితో పాటు కూలి పనికి వెళ్లారు. జర్నలిజం కోర్సు చేసిన అనంతరం కొంతకాలం క్లర్కుగా, లెక్చరర్‌గా పని చేశారు. 1985లో సివిల్స్ ర్యాంకు కొట్టి ఐఏఎస్‌గా బిహార్ క్యాడర్‌కు ఎంపికయ్యారు. పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. రోజూ విధిగా ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకునేవారు. ఆయన దొరికిన తొలి పోస్టింగే బందిపోట్లకు, కిడ్నాపర్లకు స్వర్గధామంగా పిలిచే వెస్ట్ చంపారన్ జిల్లాలో! తన పనితీరుతో జిల్లాకున్న చెడ్డపేరుతో పాటు దాని రూపురేఖలనే సమూలంగా మార్చేశారని అక్కడ ఇప్పటికీ చెప్పుకుంటారు. తర్వాత నాటి సీఎం లాలు సొంత జిల్లా గోపాల్‌గంజ్ కలెక్టర్‌గా ఉండగా హత్యకు గురయ్యారు. అప్పుడాయనకు కేవలం 35 ఏళ్లు! ఈ దారుణంపై సీఎం హోదాలో లాలు పేలవ స్పందన తీవ్ర విమర్శలపాలైంది. కృష్ణయ్యకు నివాళులర్పించేందుకు వచ్చిన లాలును వెళ్లిపొమ్మని ఆయన భార్య ఉమా దేవి తెగేసి చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. నేరగాళ్లను జైళ్లలోంచి విడుదల చేసి విచ్చలవిడిగా సమాజంపైకి ఉసిగొల్పే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఎక్కడుంటుందన్న ఆమె ప్రశ్న చాలాకాలం అందరి మనసులనూ తొలిచేసింది. ఇప్పటికీ మాఫియా రాజ్యమే కృష్ణయ్య భార్య ఉమ ఆవేదన ఆనంద్ మోహన్ విడుదల వార్తతో దివంగత ఐఏఎస్ కృష్ణయ్య భార్య ఉమ షాకయ్యారు. తన గుండె పగిలిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం కొన్ని రాజ్‌పుత్ ఓట్ల కోసం ఒక దారుణమైన ఒరవడికి నితీశ్ సర్కారు శ్రీకారం చుట్టిందని దుయ్యబట్టారు. ‘‘ఆనంద్ మోహన్ మరణశిక్ష ఇతర నేరగాళ్లకు ఓ హెచ్చరికలా, నికార్సైన అధికారులకు భరోసాగా ఉంటుందని ఆశపడ్డా. కానీ దాన్ని జీవితఖైదుకు తగ్గించారు. దానికే నేను తల్లడిల్లిపోతే ఇప్పుడేమో ఆ శిక్షనూ రద్దు చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ బిహార్‌లో మాఫియా రాజ్యమే నడుస్తోందని మరోసారి రుజువైంది. ప్రభుత్వాధికారులపై దాడులకు తెగబడేందుకు నేరగాళ్లకు ఇది మరింత ప్రోత్సాహమిస్తుంది. ఆనంద్ మోహన్ వంటి నేరగాళ్లు, వాళ్ల కుటుంబీకులే ఇంకా తమకు రాజకీయ ప్రాతినిధ్యం వహించాలా అన్నది రాజ్‌పుత్‌లు ఆలోచించుకోవాలి’’అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని ఈ నిర్ణయం రద్దయ్యేలా చూడాలని కోరారు. ‘‘ఇలాంటి కేసుల్లో దోషులు జీవితాంతం జైల్లో గడపాల్సిందే. అందుకే నితీశ్ సర్కారు నిర్ణయంపై పట్నా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉంది. దీనిపై నా భర్త బ్యాచ్ ఐఏఎస్ అధికారులతో చర్చిస్తున్నా’’అని వెల్లడించారు. కృష్ణయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు. తండ్రిని కోల్పోయేనాటికి వారికి పెద్ద కూతురు నిహారికకు ఏడేళ్లు, చిన్నమ్మాయి పద్మకు ఐదేళ్లు. వారిని తీసుకుని ఉమ హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా రిటైరయ్యారు. నిహారిక బ్యాంక్ మేనేజర్‌గా, పద్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అతీక్ హత్య కేసులో ఐదుగురు పోలీసుల సస్పెన్షన్
ప్రయాగ్‌రాజ్: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ పోలీసు వలయం మధ్యే హత్యకు గురవడాన్ని యూపీ పోలీస్ విభాగం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేస్తున్న సిట్ సిఫార్సు మేరకు ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్టు ఉన్నతాధికారి ఒకరు బుధవారం చెప్పారు. సస్పెన్షన్ వేటు పడిన వారిలో షాగంజ్ పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ అశ్వనీకుమార్ సింగ్, ఒక సబ్ఇన్స్పెక్టర్, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గత శనివారం ప్రయాగ్‌రాజ్‌లో రాత్రివేళ మెడికల్ చెకప్ కోసం అతీక్, అతని సోదరుడు ఆష్రాఫ్‌లను పోలీసులు వైద్యకళాశాలకు తీసుకెళ్తుండగా మీడియా సమక్షంలోనే ముగ్గురు నేరగాళ్లు పాయింట్‌బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపి హత్యచేయడం తెల్సిందే. -
తండ్రి పోలీసు, భర్త కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్.. అతీక్ భార్య పర్వీన్ ఎక్కడున్నారు?
లక్నో: పోలీసు కస్టడీలో ఉండగా దుండగుల చేతిలో హత్యకు గురైన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ భార్య షాయిస్తా పర్వీన్(51)కోసం ఉత్తర ప్రదేశ్‌లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. ఇప్పటికే పర్వీన్‌ను పట్టిస్తే రూ.50 వేల రివార్డు ఇస్తామని యూపీ పోలీస్ శాఖ ప్రకటించింది. అయితే అతిక్, అష్రఫ్ అంత్యక్రియల సమయంలో పర్వీన్ లొంగిపోతారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆమె హాజరుకాలేదు. అతిక్ హత్య నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో పోలీసులు ఆమె కోసం జల్లెడపడుతున్నారు. కాగా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే షైస్తా తన కొడుకు అసద్, భర్త అతిక్ ఇద్దరిని కోల్పోయింది. అసద్ పోలీసు ఎన్కౌంటర్లో మరణించిన రెండు రోజుల తర్వాత, అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను ప్రయాగ్‌రాజ్‌లో మీడియా ముసుగులో వచ్చిన ముగ్గురు వక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ నేరానికి పాల్పడ్డ లవ్లేష్ తివారి(22), అరుణ్ మౌర్య(18), మోహిత్ అలియాస్ సన్నీ(23)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలపై దర్యాప్తునకు యూపీ సీఎం యోగి ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిటీని, సిట్‌ను నియమించారు. భర్తను హత్య చేశారని తెలియగానే షాయిస్తా పర్వీన్ వెక్కివెక్కి ఏడ్చారని, అనంతరం ఆమె కళ్లు తిరిగి పడిపోయారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: గ్యాంగ్‌స్టర్ అతిక్ హత్య.. తొలిసారి స్పందించిన యూపీ సీఎం ఎవరీ షాయిస్తా పర్వీన్? షాయిస్తా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. 1996లో అతిక్‌ని పెళ్లి చేసుకునే ముందు షాయిస్తా ప్రపంచం కూడా పూర్తిగా భిన్నంగా ఉండేది. ఇంటర్ పూర్తి చేసిన ఆమెకు అంతకుముందు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం లేదు. అయితే 2009 నుంచి షాయిస్తా పేరు మీద ప్రయాగ్‌రాజ్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు చీటింగ్ కేసులు కాగా ఒకటి హత్య కేసు. మొదటి మూడు కల్నల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో నమోదవ్వగా నాలుగోది ఉమేష్ పాల్ హత్య కేసు. ఫిబ్రవరి 24న హత్యకు గురైన ఉమేష్ కేసులో ప్రధాన నిందితుల్లో షాయిస్తా ఒకరు. ఈమెతోపాటు భర్త అతిక్ అహ్మద్, ఇద్దరు కుమారులు, సోదరుడు అష్రఫ్ కూడా ఈ కేసులో నిందితుగా ఉన్నారు. 2021లో షైస్టా AIMIMలో చేరారు. అనంతరం 2023 జనవరిలో బీఎస్పీలో చేరారు. ఈ సమయంలో తన భర్త అతిక్ ఎస్పీ అగ్రనేతతో స్నేహం కారణంగా క్రమశిక్షణ నేర్చుకోలేకపోయాడని తెలిపింది. అతిక్ ఎప్పుడూ బీఎస్పీని ఇష్టపడేవాడని.. ఆ పార్టీ అగ్రనేతలకు కూడా సహాయం చేశాడని చెప్పుకొచ్చారు. అయితే తరువాత జరిగిన మేయర్ ఎన్నికలో శాయస్తాను పోటీ చేయకూడదని మాయావతి నిర్ణయించుకున్నారు. ఉమేష్ పాల్ హత్యకు ప్రణాళిక రచించడం, దాన్ని అమలు చేయడంతో షాయిస్తా కీలకంగా వ్యహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదిలా ఉండగా అతీక్ నేరసామ్రాజ్యాన్ని నడపడంలో పర్వీన్ కీలకంగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. అతీఖ్ అహ్మద్ జైలులో ఉండగా మాఫియా సభ్యులతో అక్రమ వ్యవహారాలన్నీ ఆమెనే చక్కబెట్టారని తేలింది. సీఎం యోగికి షైస్తా లేఖ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పర్వీన్ రాసిన లేఖ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్, అష్రఫ్‌లను తప్పుగా ఇరికిస్తున్నారని లేఖలో ఆమె పేర్కొంది. ఉమేష్ పాల్ హత్యకు మంత్రి నంద్ గోపాల్ గుప్తా కీలక సూత్రధారి అని ఆరోపించారు. అయితే పర్వీన్ ఫిబ్రవరి 27న లేఖ రాయగా.. అతిక్ మరణానంతరం వెలుగులోకి వచ్చింది. సీఎం ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోకపోతే నా భర్త, బావమరిది, కొడుకులను చంపేస్తామని లేఖలో రాసింది. చదవండి: క్రిమినల్ కథా చిత్రమ్.. అతీక్ అహ్మద్‌కు వ్యవస్థ మొత్తం దాసోహమైందా? -
చావును ముందే ఊహించిన అతీక్ అహ్మద్? రెండు వారాల క్రితమే రహస్య లేఖ!
ప్రయాగ్‌రాజ్/న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ తన చావును ముందే ఊహించినట్లున్నాడు. అందుకే రెండు వారాల ముందే ఓ లేఖ రాసి సీల్డ్ కవర్లో భద్రంగా దాచిపెట్టాడు. తాను చనిపోతే దాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి(సీజేఐ), యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అందజేయాలని కోరాడు. ఈ విషయాన్ని అతీక్ న్యాయవాది విజయ్ మిశ్రా మంగళవారం వెల్లడించారు. ‘‘అందులో ఏముందో నాకు తెలియదు. అతీక్ కోరిక మేరకు సీల్డ్ కవర్లో సీజేఐకి, సీఎంకు పంపుతా’’ అని చెప్పారు. హత్యపై సుప్రీంకోర్టులో 24న విచారణ అతీక్ సోదరుల హత్యోదంతంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘‘దీన్ని అత్యవసరంగా విచారణకు స్వీకరించండి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సాగేలా చూడండి. 2017 నుంచి యూపీలో జరిగిన 183 పోలీస్ ఎన్కౌంటర్లపై ఎంక్వైరీకి ఆదేశించండి’’ అని న్యాయవాది విశాల్ తివారీ మంగళవారం సుప్రీంకోర్టును కోరారు. దీనిపై ఏప్రిల్ 24న విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. యోగి పాలనలో ఆరేళ్లలో ఎన్కౌంటర్లలో 183 మంది నేరగాళ్లు హతమయ్యారని యూపీ స్పెషల్ డీజీపీ (శాంతిభద్రతలు) ప్రకటించడం తెల్సిందే. మరోవైపు, ప్రయాగ్‌రాజ్‌లో అతీక్ లాయర్నని చెప్పుకుంటున్న దయాశంకర్ మిశ్రా నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు బాంబు విసిరారు. ఎవరికీ హాని జరగలేదు. ఇక ఏ మాఫియా బెదిరించలేదు: యోగి లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇకపై ఎలాంటి మాఫియా కూడా బెదిరింపులకు పాల్పడబోదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అతీక్ సోదరుల హత్య నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంగళవారం లక్నో, హర్దోయీ జిల్లాల్లో టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుపై కేంద్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా యోగి మాట్లాడారు. ‘‘గతంలో రాష్ట్రాన్ని మాఫియా, నేరగాళ్లు కష్టాలపాలు జేశారు. ఇప్పుడు వాళ్లే కష్టాలు పడుతున్నారు’’ అన్నారు. ‘సమాజ్‌వాదీ పార్టీ హయాంలో 2012–2017 మధ్య రాష్ట్రంలో 700 అల్లర్ల ఘటనలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు బీఎస్పీ హయాంలో 364కు పైగా జరిగాయి. మా ప్రభుత్వం వచ్చాక 2017 నుంచి ఒక్క అల్లర్ల ఘటన లేదు. కర్ఫ్యూ లేదు. పరిశ్రమలు, వ్యాపారాలకు అనువైన వాతావరణం నెలకొంది. పెట్టుబడిదారుల భద్రత మా బాధ్యత’’ అని చెప్పారు. -
కుమారుడి సమాధి పక్కనే అతీక్ ఖననం.. పటిష్ఠ భద్రతతో అంతిమయాత్ర
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదురుడు అష్రఫ్‌ల అంత్యక్రియలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఆయన స్వస్థలం ప్రయాగ్‌రాజ్‌లోని కసారి మసారి శ్మశాన వాటికలో ఇద్దరిని ఖననం చేశారు. పటిష్ఠ బందోబస్తు నడుమ, అతికొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలో అతీక్ అంతిమయాత్ర సాగింది. ఈ సమయంలో ప్రయాగ్‌రాజ్‌లోని ప్రతి వీధిలో పోలీసు, ఆర్‌ఎఎప్, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఇదే శ్మశాన వాటికలో అతీక్ కుమారుడు అసద్‌ను కూడా ఖననం చేశారు. ఆ సమాధి పక్కనే తండ్రిని ఖననం చేశారు. అతీక్ తల్లిదండ్రులను సమాధులు కూడా ఇదే శ్మశానవాటికలో ఉన్నాయి. Uttar Pradesh | Bodies of mafia-turned-politician Atiq Ahmed and his brother Ashraf Ahmed brought to Kasari Masari burial ground in Prayagraj where they will be buried. They were shot dead yesterday, in Prayagraj, by three shooters while they were surrounded by bevy of police… pic.twitter.com/kqtaWfy9ir — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 16, 2023 శనివారం రాత్రి వైద్య పరీక్షల కోసం ప్రయాగ్‌రాజ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లిన అతీక్, అతని సోదరుడు అష్రఫ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మీడియా, పోలీసుల ఎదుటే ముగ్గురు యువకులు వీరిపై తుపాకులతో దాడి చేసి పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. అనంతరం ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. ఈ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా.. పేరు ప్రఖ్యాతుల కోసమే తాము అతీక్, అతని సోదరుడ్ని అందరిముందే హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. వీరు ఏం పని చేయకుండా బలాదూర్‌గా తిరుగుతూ డ్రగ్స్‌కు బానిసయల్యారని కుటుంబసభ్యులు తెలిపారు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
యూపీలో పేరు మోసిన గ్యాంగ్ స్టార్ అతీక్ అహ్మద్ హత్య
-
పోలీసు వలయం మధ్య, మీడియా సాక్షిగా... అతీక్ సోదరుల హత్య
ప్రయాగ్‌రాజ్: చుట్టూ వలయంగా పోలీసులు. ఎదురుగా మీడియా. విలేకరుల ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఇంతమందీ చూస్తుండగానే ముగ్గరు యువకులు శరవేగంగా దూసుకొచ్చారు. పిస్టళ్లు తీసి నేరుగా తలలకు గురి పెట్టి పాయింట్ బ్లాంక్‌లో కాల్పులకు దిగారు. అంతే...! పేరుమోసిన గ్యాంగ్‌స్టర్, మాజీ రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్ (60), ఆయన సోదరుడు అష్రఫ్ అక్కడికక్కడే నేలకొరిగారు. ఇద్దరి శరీరాలూ తూటాలతో తూట్లు పడ్డాయి. తాము పుట్టి పెరిగిన, నేర సామ్రాజ్యానికి కేంద్రంగా మలచుకున్న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోనే వారి కథ అలా ముగిసిపోయింది. అతీక్ మూడో కుమారుడు అసద్‌ను గురువారమే యూపీ పోలీసులు ఝాన్సీలో ఎన్కౌంటర్ చేయడం తెలిసిందే. అతని అంత్యక్రియలు శనివారం ఉదయమే ప్రయాగ్‌రాజ్‌లో ముగిశాయి. వాటిలో పాల్గొనాలన్న అతీక్ కోరిక తీరకపోగా రాత్రికల్లా సోదరునితో సహా తానూ కడతేరిపోయాడు. మీడియా, పోలీసుల సాక్షిగా జరిగిన ఈ జంట హత్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. యూపీలో సీఎం యోగి సారథ్యంలో సాగుతున్న ఎన్కౌంటర్ల పరంపరకు ఇది కొనసాగింపంటూ విపక్షాలు దుయ్యబడుతున్నాయి... మీడియాతో మాట్లాడుతుండగానే... పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ అయిన అతీక్‌పై 100కు పైగా క్రిమినల్ కేసులున్నాయి. 2005 నాటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకు ప్రధాన సాక్షి ఉమేశ్‌పాల్‌ను హత్య చేసిన కేసులో విచారణ నిమిత్తం అతీక్ సోదరులను పోలీసులు ఇటీవలే అహ్మదాబాద్ సెంట్రల్ జైలు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అసద్ అంత్యక్రియలు జరిగిన ప్రదేశానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధూమన్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో వారిని శనివారం రోజంతా విచారించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో పోలీసులు ఎంఎల్ఎన్ వైద్య కళాశాలకు తరలించారు. చేతులకు బేడీలతో ఉన్న సోదరులిద్దరూ అక్కడికి చేరుకున్న మీడియాతో మాట్లాడుతూ ముందుకు నడుస్తున్నారు. కుమారుని అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు కదా అని ప్రశ్నించగా, ‘పోలీసులు తీసుకెళ్లలేదు. ఏం చేస్తాం?’ అని అతీక్ బదులిచ్చారు. ‘అల్లా తానిచ్చిన దాన్ని వెనక్కు తీసుకున్నాడు’ అని అష్రఫ్ అన్నారు. ‘అసలు విషయం ఏమిటంటే గుడ్డు ముస్లిం (అతీక్ అనుచరుని పేరు)...’ అంటూ ఏదో చెబుతుండగానే రెప్పపాటులో నాటకీయ పరిణామాలు జరిగిపోయాయి. మీడియా ముసుగులో వారితో పాటు నడుస్తున్న ముగ్గురు యువకులు ఉన్నట్టుండి పిస్టళ్లు తీశారు. నేరుగా వారిపైకి కాల్పులకు దిగారు. ఒకడు ముందు అతీక్ తలపై కాల్చాడు. విస్మయంతో చూస్తున్న అఫ్రష్ తలపైకి మరో తూటా దూసుకెళ్లింది. దాంతో సోదరులిద్దరూ మీడియాతో మాట్లాడుతున్న వాళ్లు మాట్లాడుతున్నట్టుగానే కుప్పకూలిపోయారు. వారితో పాటున్న పోలీసులు కాల్పులు జరుగుతుంటే తలోవైపు చెదిరిపోయారు. ఆ వెంటనే హంతకులు ముగ్గురూ కుప్పకూలిన అతీక్ సోదరుల దగ్గరికి వెళ్లి వారిపై తూటాల వర్షం కురిపించారు. అంతలో తేరుకున్న పోలీసులు వారివైపు దూసుకొచ్చారు. హంతకుల్లో ఇద్దరు చేతులు పైకెత్తి వారికి లొంగిపోయారు. మూడో వ్యక్తి కొద్ది దూరం పరిగెత్తినా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యాకాండతో మెడికల్ కాలేజీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ మొత్తం ఉదంతం మీడియా కెమెరాల్లో లైవ్‌గా రికార్డయింది. హంతకులను లవ్లేశ్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యగా గుర్తించారు. వారిని విచారించాకే ఏ విషయమూ తెలుస్తుందని పోలీసులు తెలిపారు. వారు వాడిన మూడు బైకులను, ఘటనా స్థలి నుంచి రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో మాన్సింగ్ అనే కానిస్టేబుల్, ఏఎన్ఐ విలేకరి స్వల్పంగా గాయపడ్డట్టు చెప్పారు. అతీక్ సోదరుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాల్పుల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నతస్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. ముందుజాగ్రత్తగా ప్రయాగ్‌రాజ్‌లో 144 సెక్షన్ విధించారు. ఈ ఘటనకు సంబంధించి 17 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. దీనిపై యూపీ ప్రభుత్వం త్రిసభ్య జ్యుడీషియల్ కమిషన్ వేసింది. (చదవండి: కరోనాతో చనిపోయాడని అధికారులు చెప్తే.. బతికొచ్చి బిత్తరపోయేలా చేశాడు!) నలుగురు కొడుకులూ పోలీసుల అదుపులోనే మారిన పరిస్థితుల నేపథ్యంలో తనకు, సోదరునికి, కుమారులకు ప్రాణ హాని తప్పదని అతీక్ కొద్ది రోజులుగా భయపడుతూనే ఉన్నారు. కనీసం తన కుటుంబంలోని ఆడవాళ్లకు, పిల్లలకు హాని తలపెట్టొద్దని ఇటీవలే పోలీసులకు విజ్ఞప్తి కూడా చేశారు. అతీక్ పెద్ద కుమారుడు ఉమర్ లఖ్‌నవూ జైల్లో, రెండో కొడుకు అలీ ప్రయాగ్‌రాజ్‌లోనే నైనీ జైల్లో, నాలుగో కొడుకు ఆజం, ఐదో కొడుకు అబాన్ జువనైల్ హోమ్‌లో ఉన్నారు. నేరప్రదేశ్: అఖిలేశ్ అతీక్ సోదరుల హత్యను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ‘‘యూపీలో నేరాలు తారస్థాయికి చేరాయి. ఉత్తరప్రదేశ్ నేరప్రదేశ్గా మారింది’’ అంటూ అఖిలేశ్ మండిపడ్డారు. అతీక్ సమాజ్‌వాదీ నుంచే ఎంపీగా నెగ్గారు. ముగిసిన అసద్ అంత్యక్రియలు అతీక్ అహ్మద్ మూడో కుమారుడు అసద్ అంత్యక్రియలు శనివారం ఉదయం ప్రయాగ్‌రాజ్‌లో పటిష్ట పోలీసు భద్రత నడుమ ముగిశాయి. అందులో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని శుక్రవారమే అతీక్ మేజిస్ట్రేట్‌ను అనుమతి కోరగా శుక్రవారం సెలవు కారణంగా విజ్ఞాపన ఇంకా మేజిస్ట్రేట్ దగ్గరే పెండింగ్‌లో ఉండిపోయింది. ఈ వినతిని శనివారం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ విచారించాల్సి ఉండగా ఆలోపే అసద్ అంత్యక్రియలు ముగిశాయి. దీంతో అంత్యక్రియలకు అతీక్ వెళ్లడం వీలుకాలేదని అతని లాయర్ వెల్లడించారు. పటిష్ట భద్రత ఉన్నా బంధువుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిగాయని అసద్ మేనమామ ఉస్మాన్ చెప్పారు. (చదవండి: యూపీలో వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది...) -
తీహార్ జైలులో గ్యాంగ్‌వార్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో శుక్రవారం ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి ముఠా సభ్యుడు ప్రిన్స్ తేవాతియా మృతిచెందాడు. సాయంత్రం 5 గంటలకు జైలులో ఇరు వర్గాల మధ్య గ్యాంగ్‌వార్ జరిగినట్లు తెలిసింది. తేవాతియా కత్తిపోట్లకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని దీన్‌దయాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఘర్షణలో గాయపడిన మరో ఐదుగురు ఖైదీలను అధికారులు ఆసుపత్రికి తరలించారు. -
యూపీ ఎన్కౌంటర్: ‘సరైన శిక్ష పడింది.. నా కుమారుడి శవం కూడా అక్కర్లేదు’
లక్నో: యూపీలోని ఝాన్సీలో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిపిన ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్, షూటర్ గులామ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన మరుసటి రోజు, గులాం తల్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది. కొడుకు ఎన్‌కౌంటర్‌పై మీడియాతో మాట్లాడిన గులామ్ తల్లి ఖుస్నుదా .. ఈ చర్య ఖచ్చితంగా సరైనదని, ఇది గ్యాంగ్స్టర్లుకు, నేరస్థులందరికీ గుణపాఠంగా పనిచేస్తుందని చెప్పారు. కాగా అసద్, గులాం ఇద్దరూ ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. ఫిబ్రవరిలో యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో పట్టపగలు పాల్‌ను కాల్చి చంపిన రోజు నుంచి వారిద్దరూ పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు గురువారం ఎన్కౌంటర్లో హతమర్చారు. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌తో కలిసి తన కొడుకు నేరాలు చేస్తున్నాడనే విషయం తనకు తెలియదని ఆమె అన్నారు. "అతను చాలా మంచివాడు, కానీ గత కొన్ని నెలలు నుంచి ఈ ఘోరాలకు పాల్పడి ఉండచ్చని" చెప్పింది. గులామ్ మృతదేహాన్ని తీసుకుంటుందా అని అమెను ప్రశ్నించగా.. కుమారుడి మృతదేహాం తనకు అక్కర్లేదని తెగేసి చెప్పింది. హతమైన షూటర్ గులాం సోదరుడు రహీల్ హసన్ మాట్లాడుతూ.. "మా వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా, పోలీసులకు అందజేశాం. అతని కోసం పోలీసులు నిరంతరం వెతుకుతున్నారని మాకు తెలుసు. నాకు కూడా అరగంట క్రితం ఎన్కౌంటర్ గురించి తెలిసింది. అతను ఎప్పటినుంచో కుటుంబంతో సంబంధాలను తెంచుకున్నాడు. అతిక్ కోర్టుకు హాజరైనప్పుడల్లా, గులాం అతనిని కలవడానికి వెళ్ళేవాడని చెప్పాడు. #WATCH | Prayagraj, UP: "The action taken by the government is absolutely correct. All gangsters and criminals will take a lesson from this. I had no idea that he (my son) used to work for gangster Atiq Ahmed. I will not receive his body, maybe his wife will receive it," says… pic.twitter.com/9oqwnwYd2i — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 14, 2023 -
తండ్రిని తప్పించేందుకు ప్లాన్ చేసి.. చావును కొనితెచ్చుకున్న అసద్..!
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతిఖ్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్‌ను యూపీ పోలీసులు గురువారం ఉదయం ఎన్కౌంటర్లో హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన అనంతరం పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. తన తండ్రిని అహ్మదాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తరలించే సమయంలో పోలీస్ కాన్వాయ్‌పై దాడి చేసి అతడ్ని తప్పించాలని అసద్ ప్లాన్ చేశాడని చెప్పారు. దీని కోసమే అతడు కొద్ది రోజులుగా ఝాన్సీలో మకాం వేసినట్లుపేర్కొన్నారు. అతిఖ్ గ్యాంగ్ పోలీస్ కాన్వాయ్‌పై దాడి చేసి అతడ్ని తప్పించవచ్చని నిఘా వర్గాలు కచ్చితమైన సమాచారం అందించాయని యూపీ అదనపు డీజీ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. అందుకే అతిఖ్‌ను తీసుకెళ్లే మార్గాన్ని జల్లెడపట్టినట్లు వివరించారు. తనను ఎన్కౌంటర్ చేస్తారేమోనని భయంగా ఉందని అతిఖ్ అహ్మద్ పదే పదే చెప్పడంతో తన తండ్రిని ఎలాగైనా తప్పించాలని అసద్ భావించాడని, అందుకే ఎంతటి చర్యకైనా పాల్పడేందుకు సిద్ధపడ్డాడని అధికారులు చెప్పారు. ఈ దాడికి పథకం పన్నేందుకు కాన్వాయ్ వెళ్లే మార్గంలో అసద్ ఝాన్సీలో రెక్కీ కూడా నిర్వహించాడని పేర్కొన్నారు. మార్చి చివర్లోనే ఝాన్సీలో అసద్ కదలికలను యూపీ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పసిగట్టినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. వెంటనే ఆ జిల్లాకు వెళ్లి పలువురిని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పాయి. గత వారం కూడా అసద్ ఝాన్సీలో ఉన్నట్లు అధికారులు తెలుసుకున్నారు. ఫిబ్రవరి 24న ఉమేష్ పాల్ హత్య అనంతరం అసద్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం 50 రోజలకుపైగా గాలించారు. అయితే తండ్రిని కాపాడడం కోసం ప్రయత్నించి అతడు ఊహించని విధంగా పోలీసుల చేతికి చిక్కి ఎన్కౌంటర్లో హతమయ్యాడు. గురువారం ఉదయం అసద్‌తో పాటు అతని అనుచరుడ్ని పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. అతడ్ని కిలోమీటర్ పాటు వెంబడించిన అనంతరం పోలీసులపై కాల్పులకు పాల్పడటంతో షూట్ చేసి చంపారు. కుమారుడు ఎన్కౌంటర్లో చనిపోయాడని తెలిసి తండ్రి అతిఖ్ అహ్మద్ కన్నీటిపర్యంతమయ్యాడు. తన వల్లే కొడుకు చనిపోయాడని వాపోయాడు. చదవండి: ఉత్తర ప్రదేశ్‌లో సంచలన ఎన్కౌంటర్: కోర్టుకు అతిఖ్.. అదే టైంలో కొడుకు ఎన్కౌంటర్ -
Atiq Ahmed: గ్యాంగ్‌స్టర్ అతిఖ్ కొడుకు ఎన్కౌంటర్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఇవాళ జరిగిన ఓ ఎన్కౌంటర్ సంచలన చర్చకు దారి తీసింది. లోక్‌సభ మాజీ ఎంపీ, జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిఖ్ అహ్మద్ కొడుకు అసద్‌ను యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అహ్మద్‌ను.. ఝాన్సీ వద్ద పోలీసులు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. గురువారం అతిఖ్‌ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలోనే.. ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్ హత్య కేసులో ఉమేశ్ పాల్ అనే లాయర్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉమేశ్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని ఆయన ఇంటి వద్ద దారుణంగా హత్య చేశారు. ఉమేశ్‌తో పాటు దాడిని అడ్డుకోబోయే ప్రయత్నం చేసిన ఆయన సెక్యూరిటీ సిబ్బందిని సైతం దుండగులు చంపేశారు. ఈ కేసులో అసద్‌తో పాటు గులాం అనే ఇద్దరు నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో.. వీళ్ల కోసం గాలిస్తున్న యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందానికి ఝాన్సీ వద్ద గురువారం బైక్‌పై పారిపోతున్న వీళ్లు కంటపడ్డారు. ఈ క్రమంలో వాళ్లను పట్టుకునే యత్నం చేసిన పోలీసులపై ఇద్దరూ కాల్పులు ప్రారంభించగా.. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో అసద్‌తో పాటు గులాం కూడా చనిపోయాడు. వీళ్లిద్దరిపై ఐదేసి లక్షల రూపాయల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, కొత్త సెల్ఫోన్లు, సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్‌ను 2006లో కిడ్నాప్ చేశాడనే కేసు అతిఖ్ అహ్మద్‌పైనా ఉంది. ఈ కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అయిన అతిఖ్ అహ్మద్‌కు కిందటి(మార్చి) నెలలో శిక్ష కూడా పడింది. సుమారు వంద కేసుల్లో నిందితుడైన అతిఖ్ అహ్మద్.. యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌పేరుతో తననూ చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ సైతం అతిఖ్ కుటుంబ సభ్యుల ఇళ్లపై సోదాలు నిర్వహించింది కూడా. అతిఖ్ అలహాబాద్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గాడు కూడా. -
నేను ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే మీరే కారణం.. థ్యాంక్స్: గ్యాంగ్‌స్టర్
లక్నో: ఉమేష్ పాల్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్‌ను బుధవారం గుజరాత్ సబర్మతి జైలు నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జైలుకు తరలించారు అధికారులు. ఈ సమయంలో పలు మీడియా సంస్థలు పోలీసుల వాహనాలను అనుసరించాయి. అతిక్ అహ్మద్‌ను సురక్షితంగా జైలుకు తీసుకెళ్లేంత వరకు కెమెరాలతో రికార్డు చేశాయి. దీంతో తాను ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే మీడియానే కారణమని అతిక్ అహ్మద్ అన్నారు. అందుకు మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. మీరు భయపడుతున్నారా అని అడిగిన ఓ ప్రశ్నకు అతడు ఈమేరుక సమాధానం ఇచ్చాడు. అలాగే ఉమేష్ పాల్ హత్య కేసుతో మీకున్న సంబంధం ఏంటి? మీ కుటుంబం పరిస్థితి ఎలా ఉంది? అని మీడియా అడగ్గా.. తన ఫ్యామిలీ నాశనం అయిందని అతిక్ బదులిచ్చాడు. జైలులో ఉన్న తనకు కుటుంబసభ్యులు ఎలా ఉన్నారో.. ఎక్కడ ఉంటున్నారో ఎలా తెలుస్తుందని అన్నాడు. Rajasthan | Prayagraj Police convoy taking criminal-turned-politician-mafia Atiq Ahmed from Sabarmati Jail to Prayagraj, to present him in a murder case, took a halt in Bundi. pic.twitter.com/ntwPenvf6v — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 11, 2023 2006లో ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో అతిక్ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు దోషులుగా తేలారు. వీరికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అతిక్ సోదరుడు ఖలీద్ అజీమ్‌తో పాటు మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 2006లోనే జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య ఘటనలో ఉమేష్ పాల్ కీలక సాక్షిగా ఉన్నాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేష్ పాల్ ప్రయాగ్ రాజ్‌లోని తన నివాసం ఎదుట దారుణ హత్యకు గురయ్యాడు. కొంతమంది దుండగులు ఆయనను తుపాకులతో కాల్చిచంపారు. అతిక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడు అశ్రఫ్లే ఈ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. #WATCH | Bundi, Rajasthan: "My family has been ruined...I was in jail what will I know about it (Umesh Pal murder case)," says criminal-turned-politician-mafia Atiq Ahmed while being taken from Sabarmati Jail to Prayagraj pic.twitter.com/LTc869VdxQ — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 11, 2023 చదవండి: నేను ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే మీరే కారణం.. థ్యాంక్స్: గ్యాంగ్‌స్టర్ -
హస్తినకొస్తే అంతం చేస్తాం
ముంబై: ఓ గ్యాంగ్‌స్టర్ బృందం తనను చంపేస్తానని బెదిరించిందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. బెదిరింపుల అంశంపై వెంటనే ముంబైలో పోలీసులకు ఆయన ఫిర్యాదుచేశారు. ముంబైలో ఉండే సంజయ్‌రౌత్ ఢిల్లీకొస్తే ఏకే47 తుపాకీతో కాల్చిపడేస్తామని హెచ్చరిస్తూ ఆయనకు వాట్సాప్‌లో సందేశం పంపారు. ఈ ఘటనలో ముంబై పోలీసులు పుణేకు చెందిన 23 ఏళ్ల రాహుల్ తలేకర్‌ను అరెస్ట్‌చేశారు. కంజుర్మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో రౌత్ సోదరుడు, ఎమ్మెల్యే సునీల్ ఇచ్చిన ఫిర్యాదు, పోలీసు అధికారి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ రౌత్‌కు రాహుల్ తలేకర్ ముందుగా ఫోన్లో బెదిరించేందుకు ప్రయత్నించాడు. అది కుదరకపోవడంతో వాట్సాప్‌లో బెదిరిస్తూ మెసేజ్ చేశాడు. ‘రౌత్ హిందువులకు శత్రువు. నువ్వు ఢిల్లీలో కనిపించావంటే ఏకే47తో చంపేస్తా. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే నీకు పడుతుంది. లారెన్స్ నుంచి వచ్చిన హెచ్చరిక ఇది. నీ, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ల మరణం తథ్యం. ఇది ఫిక్స్’ అని హెచ్చరించాడు. మూసేవాలాను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బృందం చంపేసిందని ఆరోపణలు ఉన్న విషయం తెల్సిందే. దీంతో మెసేజ్‌లో పేర్కొన్న లారెన్స్‌ను లారెన్స్ బిష్ణోయ్‌గా పోలీసులు భావిస్తున్నారు. తలేకర్‌ను అరెస్ట్‌చేసిన పోలీసులు అతనిని విచారిస్తున్నారు. సోషల్‌మీడియా ద్వారా బిష్ణోయ్ గురించి తెల్సుకుని, మద్యం తాగిన మైకంలో అతను రౌత్‌కు బెదిరింపు సందేశం పంపినట్లు కేసు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు వార్తలొచ్చాయి. పాత్రా చావల్ కేసులో అరెస్టయి కస్టడీలో ఉన్నప్పుడు తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని, వీటిని భయపడేది లేదని రౌత్ స్పష్టంచేశారు. రౌత్‌ను హత్య చేస్తామని బెదిరింపులు రావడాన్ని మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్రమైన అంశంగా పరిగణించాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే డిమాండ్‌చేశారు. -
అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు
ప్రయాగ్‌రాజ్(యూపీ): 2006 నాటి ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్‌స్టర్–రాజకీయ నేత అతీక్ అహ్మద్, మరో ఇద్దరికి కఠిన జీవిత ఖైదు విధిస్తూ ఎంపీ–ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. తలా రూ.1 లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. అతీక్‌పై నమోదైన 100కు పైగా కేసుల్లో శిక్ష పడిన మొట్టమొదటి కేసు ఇదే. ఇదే కేసులో అతీక్ సోదరుడు ఖాలిద్ అజీం అలియాస్ అష్రఫ్, మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. తీర్పుపై హైకోర్టుకు వెళతామని అతీక్ పోలీస్ వ్యాన్ నుంచి విలేకరులతో అన్నాడు. కోర్టు తీర్పు అనంతరం పోలీసులు ముగ్గురినీ వేర్వేరు వ్యాన్లలో నైని జైలుకు తరలించారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు హత్య కేసులో అహ్మద్ తదితరులు నిందితులు. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్‌ను అతీక్ కిడ్నాప్ చేసి, బెదిరించాడు. ఈ కేసులో అతీక్ జైలుపాలయ్యాడు. -
జైలు నుంచి రాను..ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధించండి
గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ గుజరాత్ జైలులో ఉన్నాడు. అతన్ని విచారణ నిమిత్తం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కోర్టుకు తరలించాల్సి ఉంది. తన ప్రాణాలకు హాని అంటూ బయటకు వచ్చేందుకు నిరాకరిస్తున్నాడు. గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న తనను ప్రయాగ్‌రాజ్‌కు తీసుకువెళ్తుండగా..ఎన్‌కౌంట్‌లో చంపేస్తారని భయపడుతున్నట్లు అధికారిక వర్గాలు తెలపాయి. అతిక్‌పై కిడ్నాప్, హత్య కేసులు ఉన్నాయి. ఈ కేసు విషయమై విచారణ నిమిత్తం కోర్టుకి హాజరు కావల్సి ఉండగా..అతిక్ మాత్రం ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫర్సెన్స్ ద్వారా ఖరారు చేయండి అని వేడుకుంటున్నాడు. వాస్తవానికి ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్‌కు మార్చి 28న కోర్టులో శిక్ష ఖరారు కానుంది. ఐతే ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న మరో వ్యక్తి ఈ నెల ప్రారంభంలోనే ఎన్కౌంటర్ కాల్పుల్లో చనిపోయాడు. దీంతో అతిక్‌లో భయాలు మొదలయ్యాయి. అతన్ని ఈ రోజు తెల్లవారుజామున కస్టడీలోకి తీసుకోవడానికి ఉత్తర పోలీసులు బృందం సబర్మతి జైలుకి చేరుకోగా..అతిక్ వచ్చేందుకు నిరాకరించాడు. అతడిని కస్టడీకి తీసుకోవడానికి జైలు అధికారులతో అధికారుల బృందం సుదీర్ఘంగా చర్చించింది. అయితే దీనికి సుప్రీం కోర్టు క్లియరెన్స్ అవసరమని జైలు అధికారులు చెప్పినట్లు సమాచారం. కాగా, ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ అన్నారు. అయినా కోర్టు ఆదేశాల మేరకు తాము నడుచుకుంటున్నామని, కోర్టు ఏది చెబితే అదే చేస్తాం అని బ్రజేష్ అన్నారు. ఇదిలా ఉండగా, 2005లో బీఎస్పీ శాసనసభ్యుడు రాజుపాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్ ప్రధాన నిందితుడు. హత్యలో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్‌ను హత్య చేసినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొటున్నారు. ఐతే సాక్షి ఉమేష్‌పాల్ అపహరణకు గురై కిడ్నాప్ కేసు విచారణ రోజే పట్టపగలే హత్యకు గురయ్యాడు. ఈ ఉమేష్‌పాల్‌ని చంపిన వ్యక్తి విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దీంతో అతిక్‌లో భయాలు మొదలయ్యాయి. తనను కూడా విచారణ పేరిట ప్రయాగ్‌రాజ్‌కి తరలిస్తుండగా..ఎన్కౌంటర్లో చంపేస్తారేమోనని భయపడుతున్నాడు అతిక్. అతను తరుఫున న్యాయవాది కూడా విచారణ మాదిరిగానే కోర్టు నిర్ణయాన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారే శిక్ష విధించాలని అలహాబాద్ హైకోర్టులో దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతిక్ అహ్మద్ 100కు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. (చదవండి: అపూర్వమైన ప్రతిపక్ష ఐక్యతకు నాంది పలికింది: శశి థరూర్) -
చంపుతామని బెదిరించినప్పుడు సల్మాన్ డబ్బులు ఆఫర్ చేశాడు:గ్యాంగ్‌స్టర్
ముంబై: గతేడాది మేలో జరిగిన పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇది తమ పనేనంటు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో అతని పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అయితే సిద్ధూ హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపుతామని ఓ బెదిరింపు లేఖ ఆయనకు చేరింది. సిద్దూ మూసేవాలను చంపినట్లే నిన్నూ హత్య చేస్తాం అని అందులో ఉంది. లేఖపై పేరు లేకపోయినప్పటికీ ఇది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే అని అందరికీ అర్థమైంది. కొన్నేళ్ల క్రితమే కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని ఇతడు బెదిరించడం తీవ్ర దుమారం రేపింది. అయితే సల్మాన్‌ను చంపేందుకు రూ.4లక్షలు పెట్టి తుపాకీ కూడా కొన్నట్లు లారెన్స్ బిష్ణోయ్ చెప్పాడు. ఆయన తమ సమాజాన్ని అమమానించాడని, అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. లేదంటే సల్మాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. అలాగే సల్మాన్‌ను బెదిరించినప్పుడు ఆయన తమకు భారీగా డబ్బు కూడా ఆఫర్ చేశాడని, కానీ తాము తిరస్కరించామని తెలిపాడు. 'సల్మాన్ ఖాన్‌పై మా సమాజంలో తీవ్ర ఆగ్రహం ఉంది. ఆమన మమ్మల్ని అవమానించాడు. అతనిపై ఓ కేసు కూడా ఉంది. కానీ ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదు. ఇప్పటికీ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. నాకు ఎవరి సాయం అవసరం లేదు. సల్మాన్‌పై నాకు చిన్నప్పటి నుంచే కోపం ఉంది. ఆయన అహాన్ని అతి త్వరలో లేదా ఆ తర్వాత దెబ్బతీస్తా. ఆయన మా పవిత్ర దేవాలయానికి వచ్చి క్షమాపణలు చెప్పాలి. అప్పుడు మా సమాజం క్షమిస్తే.. నేను ఏమీ అనను..' అని లారెన్స్ బిష్ణోయ్ ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ చెప్పాడు. WATCH | अपना नाम बड़ा करने के लिए सलमान खान को धमकी देता है लॉरेंस बिश्नोई ? जानिए क्या बोला @RubikaLiyaquat | @akhileshanandd | @jagwindrpatial LIVE - https://t.co/4StwkoboMD#OperationDurdantOnABPNews #LawrenceBishnoi #SalmanKhan pic.twitter.com/OaTqFxdNC9 — ABP News (@ABPNews) March 14, 2023 చదవండి: 'మేడం చాలా క్యూట్‌గా ఉన్నావ్..' అంటూ మహిళా పోలీస్‌ను వేధించిన ఆకతాయి.. -
శేషన్నపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీంకు సుదీర్ఘకాలం కుడిభుజంగా మెలిగిన ముద్దునూరి శేషయ్య అలియాస్ శేషన్నపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ మేరకు సిటీ కొత్వాల్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. శేషన్నపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఠాణాల్లో 11 కేసులు ఉన్నాయి. 2004లో అచ్చంపేటలో వి.రాములు, 2005లో మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ టీచర్ కనకాచారి, అదే ఏడాది అక్కడే చెంచు గోవిందు, 2011లో పహాడీషరీఫ్‌లో శ్రీధర్‌రెడ్డి, బొగ్గులకుంటలో పటోళ్ల గోవర్థన్‌రెడ్డి, 2013లో అచ్చంపేటలో మాజీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, 2014లో నల్లగొండలో మాజీ నక్సలైట్ కొనాపురి రాములు హత్య కేసులతోపాటు పలు బెదిరింపుల కేసులు శేషన్నపై ఉన్నాయి. 2016లో నయీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇటీవల నగరంలో బెదిరింపుల దందా చేయడానికి వచ్చిన శేషన్నను గోల్కొండ పోలీసులు సెప్టెంబర్ 27న అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడి వద్ద నాటుతుపాకీ, తూటాలు లభించాయి. హుమాయున్‌నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్లాకు ఇతడు గతంలో తుపాకీ సరఫరా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. శేషన్నపై ఆంధ్రప్రదేశ్‌లోనూ అనేక కేసులు ఉన్నాయి. ఇతడి నేరచరిత్రను పరిగణనలోకి తీసుకున్న కొత్వాల్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. -
రాజస్తాన్ గ్యాంగ్‌స్టర్ హత్య.. వెలుగులోకి మరో దారుణం
రాజస్తాన్ గ్యాంగ్ వార్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ రాజు థెట్‌తో సహా ఇద్దరు వ్యక్తులు కాల్పుల్లో చనిపోగా, మరోకరు గాయపడిన సంగతి తెలిసిందే. పోలీసుల నివేదిక ప్రకారం శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్ రాజు ఇంటివద్దే నలుగురు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపినట్లు తేలింది. ఐతే ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ రాజు తోపాటు మృతి చెందిన మరో వ్యక్తి తారాచంద్ కద్వాసర్‌గా పోలీసులు గుర్తించారు. అతడు తన కుమార్తెను కోచింగ్ సెంటర్లో చేర్చేందుకు ఆ ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో అతని బంధవు కూడా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో అనేక హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ థెట్ సోదరుడు కూడా ఇక్కడే హాస్టల్ నడుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్యాంగ్‌స్టర్ రాజుతేత్‌కు రాష్ట్రంలో షెఖావతి ప్రాంతంలో మరో మఠాతో వైరం ఉంది. ఈ హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో నిందితుడు థెట్‌పై కాల్పులు జరిపి.. బాటసారులను, సాక్ష్యులను భయపెట్టడానికి గాల్లో కాల్పులు జరుపుకుంటూ వెళ్లిపోతున్నట్లు కనిపించింది. ఇదిలా ఉండగా హత్య జరిగిన వెంటనే... లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా పరిచయం చేసుకున్న రోహిత్ గోదారా అనే వ్యక్తి ఫేస్బుక్లో ఈ హత్యకు తానే బాధ్యుడునంటు ప్రకటించుకున్నాడు. అంతేగాక ఆనంద్‌పాల్ సింగ్, బల్బీర్ బానుదా హత్యలకు ప్రతీకారంగా గ్యాంగ్‌స్టర్ రాజుని హతమార్చినట్లు తెలిపాడు. (చదవండి: వీడియో: గ్యాంగ్‌వార్.. పట్టపగలు బుల్లెట్ల వర్షం.. గ్యాంగ్‌స్టర్ రాజు దారుణ హత్య) -
చనిపోయిన దోమలను తీసుకుని కోర్టుకు హాజరైన గ్యాంగ్‌స్టర్
ముంబై: చనిపోయిన దోమలను ఒక ప్లాస్టిక్ బాటిల్ నిండా నింపుకుని కోర్డుకు వచ్చాడు గ్యాంగ్‌స్టర్ ఎజాజ్ లక్డావాలా. వాటిని జడ్జికి చూపిస్తూ దోమతెర కావాలని కోరాడు. సదరు గ్యాంగ్‌స్టర్ ఎజాజ్ లక్డావాలా పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం మాజీ సహచరుడు. అతనిపై మహారాష్ట్రలో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. లక్డావాలాని 2020లో పోలీసులు అరెస్టు చేసి నావీ ముంబైలోని తలోజా జైల్లో పెట్టారు. ఈమేరకు లక్డావాలా సెషన్ కోర్టులో దోమతెర కావాలంటూ అప్పీల్ పెట్టుకున్నాడు. అందుకోసం అని కోర్టుకి చనిపోయిన దోమలను ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేసుకుని తీసుకువచ్చి...కోర్టులో చూపిస్తూ తాను తన సాటి ఖైదీలు వీటితో ఇబ్బందిపడుతున్నామని చెప్పాడు. పోలీసులు భద్రతా దృష్ట్యా దోమతెరలు అందించడం లేదని వాపోయాడు. ఐతే కోర్టు ఆ ఆపీల్ని తిరస్కరించింది. దోమతెరకు బదులు ఓడోమోస్ వంటి దోమల నివారిణులను ఉపయోగించుకోవాల్సిందిగా సూచించింది. అంతేగాక జైలు అధికారులు దోమల బెడద అరికట్టే చర్యలను తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి పలు ఫిర్యాదులు గతంలో కోర్టు ముంగిటకి వచ్చాయి. ఐతే వాటిలో కొందరికి దోమతెర వెసులుబాటు కల్పించారు కానీ కొందరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌కి మాత్రం ఆ వెసులుబాటు ఇవ్వడం లేదు. (చదవండి: దోపిడికి గురయ్యాను కాపాడాలంటూ ఎమర్జెన్సీ కాల్! తీరా చూస్తే...) -
సిద్ధూ హత్య కేసు: పోలీసు కస్టడీ నుంచి గ్యాంగ్‌స్టర్ ఎస్కేప్!
ఛండీగఢ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితుడు, గ్యాంగ్‌స్టర్ దీపక్ అలియాస్ టిను పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. శనివారం రాత్రి పోలీసు కస్టడీ నుంచి దీపక్ తప్పించుకుని పారిపోయినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ ఇవ్వెస్టిగేషన్ ఏజెన్సీ(సీఐఏ) సిబ్బంది ప్రైవేటు వాహనంలో మాన్సా నుంచి కపుర్థలా జైలుకు రాత్రి 11 గంటల ప్రాంతంలో తరలిస్తున్న క్రమంలో అదును చూసి పోలీసుల నుంచి తప్పించుకున్నాడని చెప్పారు. కస్టడీ నుంచి తప్పించుకున్న దీపక్.. గ్యాంగ్‌స్టర్, ప్రధాన నిందితుడు లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడు. సిద్ధూ మూసేవాలా హత్య కేసుకు పథకం రచించటం నుంచి అమలు చేసే వరకు పాల్గొన్నట్లు భావిస్తున్న 15 మంది జాబితాలో దీపక్ పేరును చేర్చారు పోలీసులు. ప్రొడక్షన్ వారెంట్‌పై ఢిల్లీ పోలీసులు కొద్ది రోజుల క్రితమే దీపక్‌ను పంజాబ్ తీసుకొచ్చారు. శనివారం జరిగిన సంఘటనతో పోలీసుల నుంచి దీపక్ పారిపోవటం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. గతంలో 2017లో అంబాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు దీపక్. ఆ సమయంలో పెప్పర్ స్ప్రే ఉపయోగించి పారిపోయాడు. ఓసారి ఆసుపత్రికి తీసుకెళ్లగా తప్పించుకున్నాడు. ఇదీ చదవండి: సిద్ధూ మూసేవాలా తండ్రిని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు -
గగుర్పాటు కలిగించే ‘గ్యాంగ్‌స్టర్’ చీకటి కోణం.. కానీ ఇప్పుడు..
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం)/తూర్పుగోదావరి: ప్రతాప్‌సింగ్.. ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్.. షార్ప్ కిల్లర్ కూడా. జైలు జీవితం అతడిలో పశ్చాత్తాపాన్ని కలిగించింది. పరివర్తన చెందిన అతడు ఇప్పుడు యోగా గురువుగా మారి ఎందరికో యోగా నేర్పుతూ.. తనలా ఎవరూ కాకూడదనే సందేశాన్ని ఇస్తున్నాడు. అతడి గతాన్ని పరికిస్తే.. ఉత్తరాఖండ్‌లోని ఫితోడ్ గఢ్ గ్రామంలోని ఉన్నత కుటుంబంలో జన్మిచాడు ప్రతాప్‌సింగ్. తండ్రి ఆర్మీ అధికారి. అన్న కూడా ఆర్మీలో చేరి అధికారి స్థాయికి ఎదిగాడు. తాను కూడా ఆర్మీలో చేరాలని ప్రతాప్‌సింగ్ కలలుకన్నా నెరవేరలేదు. చదవండి: అమెరికా అబ్బాయికి, ఆంధ్రా అమ్మాయికి నిశ్చితార్థం పోలియో వల్ల వచ్చిన అవిటితనం కారణంగా కలని నెరవేర్చుకోలేకపోయాడు. దానికి తోడు సవితి తల్లి సూటిపోటి మాటల్ని భరించలేక ఇంటినుంచి పారిపోయి చిన్నతనంలోనే ఢిల్లీ చేరుకున్నాడు. ఓ గ్యాంగ్‌స్టర్ వద్ద చేరి 15 సంవత్సరాలకే దోపిడీలు, కిడ్నాప్‌లు చేశాడు. ప్రతాప్ సింగ్ గ్యాంగ్ ఆగడాల కారణంగా ఢిల్లీ కల్యాణ్‌పూర్‌లో అడుగుపెట్టాలంటే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎవరినైనా చంపాలనుకుని సుపారీ తీసుకుంటే వారికి చావు మూడినట్టే. అతీ సమీపానికి వెళ్లి గురి చూసి కాల్చి చనిపోయాడనుకుని నిర్ధారించుకున్న తరువాతే ఆ గ్యాంగ్ అక్కడ నుంచి వెళ్తుందనే పేర్కొంది. జైలులోనే పరివర్తన పదహారు హత్య కేసులతో సంబంధం ఉన్న ప్రతాప్‌సింగ్ ఏలూరు జిల్లా పినకడిమిలో జరిగిన హత్య కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. 2017లో ఖైదీలలో పరివర్తన తీసుకుని రావడానికి ప్రణవ సంకల్ప సమితి ఆధ్వర్యంలో యోగా నేర్పించారు. అందులో ఇంటర్మీడియెట్, టెన్త్ చదివిన 30 మందిని ఎంపిక చేశారు. 6వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ప్రతాప్‌సింగ్ తాను యోగా నేర్చుకుంటానని పట్టుపట్టడంతో అతడికీ యోగా నేర్పించారు. 9 నెలల శిక్షణలో ధ్యానం, జపం నేర్చుకుని పరివర్తన చెందాడు. చెడు మార్గాన్ని వీడి నూతన జీవితం వైపు ప్రయాణిస్తానని, తిరిగి ఎప్పుడూ అటూవైపు వెళ్లనని దృఢంగా నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే శిక్షా కాలం పూర్తయ్యాక నలుగురికీ యోగా నేర్పుతూ అదర్శప్రాయంగా ఉంటున్నాడు. గుంటూరులో కలెక్టర్ తన యోగా విన్యాసాలను చూసి మెచ్చుకున్నారని.. తాను గ్యాంగ్‌స్టర్‌ని అయినా.. తనలో వచ్చిన మార్పు చూసి కలెక్టర్ మెచ్చుకోవడం కంటే సంతృప్తి తనకు ఏముంటుందని ప్రతాప్‌సింగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అనర్థాలను వివరిస్తూ.. ఇప్పుడు యోగా శిక్షకుడుగా పలువురికి యోగా నేర్పుతూ తనలా ఎవరి జీవితం చీకటి కోణంలోకి వెళ్లకూడదని ప్రతాప్‌సింగ్ హితవు చెబుతున్నాడు. యోగాతోపాటు చెడు వ్యసనాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ పలువురిలో పరివర్తన తీసుకొస్తున్నాడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల వేళ రాజమహేంద్రవరంలోని అనం కళా కేంద్రంలో మంగళవారం ప్రణవ యోగ సంకల్ప సమితి వ్యవస్థాపకుడు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగా గురువులను సత్కరించారు. ఇదే కార్యక్రమంలో ప్రతాప్‌సింగ్‌ను నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్‌కుమార్ సన్మానించారు. -
సల్మాన్ ఖాన్ లాయర్‌కు బెదిరింపు లేఖ.. వదిలిపెట్టేది లేదంటూ..
జైపూర్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాయర్ హస్తిమల్ సరస్వత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. జోధ్‌పూర్ కోర్టులోని తన చాంబర్ బయట ఈ లేఖ లభించింది. లేఖలో ‘గాయకుడు మూసేవాలకు పట్టిన గతే నీకూ పడుతుంది. మేము ఎవరినీ వదిలిపెట్టము. మీ కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టం’ అని రాసి ఉంది కృష్ణజింకను వేటాడిన కేసులో జోధ్‌పూర్ హైకోర్టులో లాయర్ హస్తిమల్ సల్మాన్ తరుపున వాదిస్తున్నారు. బెదిరింపు లేఖ నేపథ్యంలో జోధ్‌పూర్ పోలీస్ స్టేషన్లో లాయర్ ఫిర్యాదు చేశారు. దీంతో సల్మాన్ లాయర్‌కు భద్రతను పెంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అయితే లేఖలో చివరన ఎల్బీ, జీవీ అనే అక్షరాలు రాసి ఉండటంతో ఇది గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ల పేర్లను సూచిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో మే 29న పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురైన విషయం తెలిసిందే. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ గత నెలలో సిద్ధూ మూస్ వాలా హత్యకు తనదే బాధ్యత అంటూ ప్రకటించాడు. అంతేగాక మరో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో కలిసి ఈ పనిచేసినట్లు ఆరోపించారు. ఇదిలా ఉండగా సరిగ్గా నెల కిందట కూడా సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌లను చంపుతామంటూ బెదిరింపు లేఖలు వచ్చాయి. దీనిపై సల్మాన్ బాంద్రా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. -
లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్..
పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య బాలీవుడ్లో కలకలం రేపింది. ఈ మర్డర్‌ను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పనే అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేశారు. వీరిలో లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు సిద్ధేష్ కాంబ్లే కూడా ఉన్నాడు. అయితే సిద్ధేష్ను విచారించిన పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. హిందీ చిత్రపరిశ్రమలోని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ను కిడ్నాప్ చేయాలని ఈ ముఠా అనుకుందట. కరణ్ జోహార్‌ను అపహరించి ఆయన నుంచి రూ. 5 కోట్లకుపైగా డబ్బు రాబట్టాలని ప్లాన్ వేశారట. ప్రస్తుతం ఈ అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సల్మాన్‌కు పోలీసులు భద్రత కూడా పెంచారు. ఇంతకుముందు కూడా 2018లో కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు చంపేస్తామన్నా బెదిరింపులు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్‌ను టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చదవండి: 👇 రానున్న 'కాఫీ విత్ కరణ్' షో 7వ సీజన్.. టీజర్ రిలీజ్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ -
సింగర్ సిద్ధూ హత్య.. సల్మాన్‌కు లారెన్స్ వార్నింగ్.. అప్రమత్తమైన పోలీసులు
Gangster Lawrence Bishnoi Life Threat To Salman Khan: గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్ణోయ్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ను చంపేది తనేనని గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్యకు లారెన్స్ బిష్ణోయ్ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుండగా 2018లో సల్మాన్‌ను రాజస్థాన్‌లో చంపేస్తానంటూ లారెన్స్ చేసిన ఓపెన్ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది.. ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టూడే ఈ వీడియోను తాజాగా వెలికితీసింది. చదవండి: రామారావు ఆన్‌డ్యూటీ పదేపదే వాయిదా, నిర్మాత, హీరో మధ్య మనస్పర్థలే కారణం? దీంతో లారెన్స్ కామెంట్స్ బాలీవుడ్ మీడియాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కాగా 2018లో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రం చట్టం కేసులో లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అతడి సహాయకులకు ఢిల్లీ హైకోర్డు రిమాండ్ విధించింది. దీంతో బిష్ణోయ్ అతడి సహాయకులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు తరలిస్తుండగా కోర్డు వెలుపల మీడియాతో లారెన్స్ సల్మాన్ చంపేస్తానంటూ ఈ కామెంట్స్ చేశాడు. ‘ప్రస్తుతం నేను ఏం చేయలేదు. ఒకసారి నేను యాక్షన్ తీసుకుంటే ఏమౌతుందో తెలుస్తుంది. నేను ఎలాంటి నేరం చేయకపోయిన నన్ను నిందితుడిని చేశారు. రాజస్థాన్‌లో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాను. అప్పుడు నేను ఏంటో తెలుస్తుంది. అప్పుడు మీరేం చేస్తారో చూస్తా’ అంటూ బహింరంగంగా సవాలు విసిరాడు. కాగా జోధ్‌పూర్ అడవి సమీపంలో కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. అయితే లారెన్స్ బిష్ణోయ్ కమ్మునిటీలో కృష్ణ జింకను దైవంగా భావిస్తారట. ఈ నేపథ్యంలో బిష్ణోయ్, సల్మాన్‌ను టార్గెట్ చేసినట్లు తెలిసింది. చదవండి: విశాఖలో రణ్‌బీర్, జక్కన్న సందడి, వీడియో వైరల్ ఈ వీడియోలో లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు అతడి సహాయకుడు, గ్యాంగ్‌స్టర్ సంపత్ నేహ్రా కూడా కనిపించాడు. అయితే బిష్ణోయ్ కామెంట్స్‌కు ముందు సంపత్ నేహ్రా సల్మాన్ ఇంట్లో రెక్కీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నేహ్రాను, అతడి గ్యాంగ్‌ను పోలీసులు ముందుగానే అరెస్ట్ చేశారు. కాగా బిష్ణోయ్ సంబంధాలు ఇతర దేశాలకు కూడా వ్యాపించాయి. దీంతో 5 రాష్ట్రాల్లో 700 మంది షూటర్లు ఉన్న ఈ ముఠా ఇతర ముఠాలతో సత్ససంబంధాలను పెంచుకుంటుంది. నిత్యం పంజాబీ ఆర్టిస్టులపై దాడులకు పాల్పడుతూ పంజాబ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల పోలీసులకు తలనొప్పిగా మారింది ఈ ముఠా. -
గ్యాంగ్‌స్టర్ పూజారి భారత్‌కు అప్పగింత
ముంబై: ముంబై, కర్ణాటకలో పలు బెదిరింపులకు పాల్పడిన కేసుల్లో ప్రధాన నిందితుడు, 15 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న గ్యాంగ్‌స్టర్ సురేశ్ పూజారిని ఫిలిప్పీన్స్ పోలీసులు అరెస్ట్‌చేసి భారత్‌కు అప్పగించారు. అక్టోబర్‌లో అతడిని ఫిలిప్పీన్స్‌లో అరెస్ట్‌చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అతడిని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), సీబీఐ అధికారులు థానెలో నమోదైన కేసు విచారణ నిమిత్తం ముంబైకు తరలించారు. చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ బెదిరింపుల కేసులో అతడిని 25వ తేదీ దాకా మహారాష్ట్ర యాంటీ–టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) కస్టడీకి అప్పగిస్తూ థానెలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రాజేంద్ర బుధవారం ఉత్తర్వులిచ్చారు. మహారాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు థానెలో నమోదైన 23 కేసులను మహారాష్ట్ర ఏటీఎస్‌కు బదలాయించారు. చాలా కేసుల్లో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న పూజారిని అరెస్ట్‌చేయాలంటూ గతంలో ముంబై, థానె పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీచేశారు. -
అత్యాచారం కేసులో హార్దిక్ పాండ్యా.. ? గ్యాంగ్‌స్టర్ భార్య సంచలన ఆరోపణలు..!
Dawood Ibrahim Wife Aide Accuses Hardik Pandya and Rajiv Shukla: టీ20 ప్రపంచకప్-2021లో ఆశించిన మేర రాణించకపోవడంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్నుమా భాటి.. హార్ధిక్ పాండ్యాతో పాటు మునాఫ్ పటేల్, పృథ్వీరాజ్ కొఠారీ, మాజీ బీసీసీఐ చైర్మన్ రాజీవ్ శుక్లాలపై సంచలన ఆరోపణలు చేసింది. సదరు వ్యక్తులంతా తనను లైంగిక వేధింపులకు గురి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబైలోని సాంతా క్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. COMPLAINT COPY EXCLUSIVE‼️ https://t.co/Nj2U9UoA8P pic.twitter.com/o5uWCoDfLx — Sameet Thakkar (@thakkar_sameet) November 10, 2021 తన భర్త రియాజ్ భాటి స్వప్రయోజనాల కోసం అతని వ్యాపార భాగస్వామ్యులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసేవాడని, అలా కొందరు హై ప్రొఫైల్ సెలబ్రిటీల వద్దకు తనను పంపాడని రెహ్నుమా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, రెహ్నుమా ఇచ్చిన ఫిర్యాదులో సరైన అడ్రస్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే, హార్ధిక్.. గతంలో ‘కాఫీ విత్ కరణ్ షో’లో వివాదాస్పద కామెంట్లు చేసి ఓ మ్యాచ్ నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హార్ధిక్.. భార్య నటాశాతో కలిసి మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. చదవండి: "గంగూలీతో విభేదాలు నిజమే.." రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు -
కోర్టులో కాల్పుల మోత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో న్యాయస్థానంలో కాల్పులు జరగడం, ముగ్గురు మరణించడం కలకలం సృష్టించింది. విచారణ కోసం తీసుకొచి్చన వ్యక్తిని అతడి ప్రత్యర్థులు కోర్టు గదిలో కాల్చి చంపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండుగులు హతమయ్యారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం 30 ఏళ్ల జితేంద్ర గోగి ఢిల్లీలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్. పలు కేసుల్లో ప్రధాన నిందితుడు. దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తను రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరించిన వ్యవహారంలో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్నాడు. ఈ కేసు విచారణలో భాగంగా జడ్జి ఎదుట ప్రవేశపెట్టడానికి శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు రోహిణి కోర్టులోని 207నంబర్ గదికి తీసుకొచ్చారు. ఇద్దరు దుండగులు న్యాయవాదుల దుస్తుల్లో లోపలికొచ్చి పిస్టోళ్లతో గోగిపై కాల్పులు జరిపారు. దాదాపు ఆరు తూటాలు శరీరంలోకి దూసుకెళ్లడంతో గోగికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరపడంతో ఆ ఇద్దరు దుండుగులు హతమయ్యారు. చికిత్స కోసం గోగిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దుండగుల కాల్పుల్లో కోర్టు గదిలో ఉన్న ఓ మహిళా న్యాయవాది కాలులోకి తూటా దూసుకెళ్లింది. రోహిణి కోర్టులో జరిగిన కాల్పులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని ఢిల్లీ బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. భద్రతను పెంచేదాకా తాము కోర్టులకు హాజరు కాబోమని న్యాయవాదులు తేల్చిచెప్పారు. గోగిపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు అతడి ప్రత్యర్థి టిల్లూ తాజ్పూరియా వర్గానికి చెందినవారేనని, వారిలో ఒకడిపై రూ.50 వేల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. వారిద్దరిని ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌కు చెందిన రాహుల్, బక్కర్వాలా గ్రామానికి చెందిన మోరిస్‌గా గుర్తించారు. జితేంద్ర గోగి, టిల్లూ తాజ్పూరియా అలియాస్ సునీల్ అలీపూర్, సోనిపట్ పట్టణాల్లో దోపిడీ రాకెట్లు నడిపేవారు. ఇరు వర్గాల మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగాయి. కాల్పులు చోటుచేసుకున్నాయి. గత ఆరేళ్లలో ఇరు వర్గాలకు చెందిన వారు పది మందికిపైగా మృతి చెందారు. కళాశాల నుంచే కక్షలు జితేంద్ర గోగి, టిల్లూ తాజ్పూరియా మధ్య కళాశాల స్థాయి నుంచే వైరం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరూ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు విద్యార్థి రాజకీయాల్లో చేరారు. తరచూ గొడవలకు దిగేవారు. శత్రుత్వం పెరిగిపోయింది. 2012లో టిల్లూ స్నేహితుడు వికాస్‌ను గోగి వర్గం కాల్చి చంపేసింది. 2015లో సోనిపట్ పోలీసులు టిల్లూను అరెస్టు చేశారు. ప్రస్తుతం సోనిపట్ జైల్లోనే ఉన్నాడు. టిల్లూను ఎలాగైనా అంతం చేయాలని గోగి ఎప్పటి నుంచో యత్నిస్తున్నాడు. 2016లో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న గోగి తదనంతరం టిల్లూ వర్గంలో చాలామందిని హతమార్చాడు. సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ఆందోళన రోహిణి కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ పటేల్‌తో మాట్లాడారు. కోర్టు గదిలో కాల్పులు, దుండగుల మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులతో, బార్ అసోసియేషన్‌తో చర్చించి, న్యాయస్థానం కార్యకలాపాలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. న్యాయస్థానాలతోపాటు న్యాయవాదులు, న్యాయమూర్తుల రక్షణకు సుప్రీంకోర్టు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు. ఈ అంశం వచ్చేవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. -
రూ. కోటి ఇవ్వు లేదా చంపేస్తాం: గ్యాంగ్‌స్టర్
జైపూర్: సినిమాల్లో విలన్ల మాదిరే నిజ జీవితంలో కూడా కొందరు వ్యక్తులు నేరాలకు పాల్పడుతున్న సంఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే.. చంపుతామనని బెదిరించే వారు కూడా ఉంటారు. తాజాగా ఇలాంటి ఒక సంఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ ఓ గ్యాంగ్‌స్టర్ బిల్డర్‌ని బెదిరిస్తున్నాడు.(చదవండి: సీఎం పదవికి రాజీనామా: నాలుగో వ్యక్తి రూపానీ.. ముందు ముగ్గురు ఎవరంటే) వివరాల్లోకెళ్లితే.. జైపూర్‌కు చెందిన బిల్డర్ నిశ్చల్ భండారికి కొన్ని రోజుల క్రితం ఒక రోజు ఒక అపరిచిత వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. సదరు వ్యక్తి తన పేరు లారెన్స్ బిష్ణోయ్ అని, తీహార్ జైలు నుంచి ఫోన్ చేస్తున్నాని చెప్పాడు. తనకు కోటి రూపాయలు కావాలని రెండు రోజుల్లోగా ఆ మొత్తాన్ని రెడీ చేయాలని హెచ్చరించాడు. సదరు బిల్డర్ ఇంటి చుట్టూ తన మనుషులు ఉన్నారని ఈ విషయం పోలీసులకు చెప్పే సాహసం చెయ్యెద్దంటూ బెదిరించాడు. ఈ క్రమంలో నిశ్చల్ భండారికి సెప్టెంబర్ 9న ఆ అపరిచిత వ్యక్తి నుంచి మరోసారి కాల్ వచ్చింది. కానీ భయంతో సదరు బిల్డర్ కాల్ రీసివ్ చేసుకోలేదు. దాంతో వేరువేరు వాట్సప్ నెంబర్లతో మెసెజ్‌లు, ఫోన్ కాల్స్ చేశాడు నిందితుడు. ఆఖరికి బిల్డర్ నిశ్చల్ భండారి భయంతో శుక్రవారం పోలీస్టేషన్‌కి వెళ్లి విషయం చెప్పాడు. నిందితుడి నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించమంటూ పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.(చదవండి: "యూ బ్లడీ ఫూల్" అంటూ.. మాట్లాడుతున్న బాతులు) -
గ్యాంగ్ స్టర్ గంగరాజు: ‘ఏమో ఇలాగా’ అనే పాట విడుదల..!!
వరుస విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న హీరో లక్ష్ చదలవాడ. 'వలయం' వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ హీరో ప్రస్తుతం మరో వైవిధ్యభరితమైన సినిమా చేస్తున్నాడు. `గ్యాంగ్‌స్టర్ గంగరాజు` అనే వెరైటీ సినిమాతో మరొకసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంభందించిన ఫస్ట్‌లుక్ విడుదల కాగా ప్రేక్షకులను ఈ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ లుక్ ఎంతో డిఫరెంట్‌గా ఉండడంతో పాటు ఆసక్తికరంగా ఉందని ప్రేక్షకులు తెలియజేశారు. మంచి అభిరుచి గల దర్శకుడు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాకి సంభందించిన తొలి పాటను విడుదల చేసింది చిత్ర బృందం. 'ఏమో ఇలాగా' అంటూ మొదలయిన ఈ పాట ను హేమచంద్ర ఆలపించగా, భాస్కర భట్ల రచించారు. అనీష్ మాస్టర్ కోరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరణ కాగా ప్రముఖ ఆడియో సంస్థ మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదల అయ్యింది. లక్ష్ చదలవాడ హీరోగా నటించిన వలయం సినిమాలోని నిన్ను చూశాకే అనే పాట 12 మిలియన్స్ కు చేరుకోవడం విశేషం. -
తీహార్ జైల్లో గ్యాంగ్‌స్టర్ ప్రాణం తీసిన చెంపదెబ్బలు
సాక్షి, న్యూఢిల్లీ: తీహార్ జైల్లో అధికారులు గ్యాంగ్‌స్టర్ అంకిత్ గుజ్జర్‌ను కొట్టి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి నరేందర్ మీనా, ఇద్దరు అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఓ వార్డెన్‌ను డైరెక్టర్ జనరల్ (ఢిల్లీ జైళ్లు) సందీప్ గోయల్ సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అంకిత్ గుజ్జర్(29) ఉత్తర ప్రదేశ్ బాగ్‌పత్‌లోని ఖేలా గ్రామానికి చెందినవాడు. అతడిపై హత్య, దోపిడీతో సహా పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. చదవండి: లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించి యువతిపై అత్యాచారం ఏం జరిగింది? తీహార్ జైలు సూపరింటెండెంట్ నరేందర్ మీనాతో అంకిత్ గుజ్జర్ గొడవ పడినట్లు సమాచారం. దీంతో అతడిని జైలులో వేరే గదికి తరలించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు చెంపదెబ్బ కొట్టుకోవడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. దీంతో నరేందర్ మీనా, ఇతర జైలు అధికారులు కలిసి అంకిత్ గుజ్జర్, ఇద్దరు సహచర ఖైదీలను 50 కర్రలతో కొట్టారు. అంకిత్ గుజ్జర్ తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు అతడిని డీడీయూ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. కానీ జైలు సూపరింటెండెంట్ అతడిని అక్కడికి తీసుకెళ్లడానికి నిరాకరించాడు. అంకిత్ గుజ్జర్‌కి పెయిన్ కిల్లర్ ఇవ్వడంతో.. అతడు మరణించినట్లు పత్రాల్లో పేర్కొన్నారు. కానీ అతని శరీరం మీద తీవ్రమైన గాయాలు ఉన్నట్లు శవపరీక్షలో తేలింది. ఇక నిందితుడు ముందుగానే సీసీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: మహిళపై అత్యాచారం.. భర్తను వదిలిపెట్టాలని ఒత్తిడి -
మధ్యప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ నిరోధక బిల్లు.. 10 ఏళ్ల జైలు శిక్ష.. ఆస్తుల జప్తు
భోపాల్: మంద బలం, అధికార బలం కోసం కొందరు తహతహలాడుతుంటారు. ఓ పది మంది రౌడీలను వెంటేసుకుని ఓ గ్యాంగ్‌కు లీడర్ అయిపోతారు. డబ్బుల కోసం జనాలను పీడిస్తూ.. వివిధ నేరాలకు పాల్పడుతూ.. అడ్డు అదుపు లేకుండా ప్రర్తిస్తారు. అయితే ఇకపై గ్యాంగ్‌స్టర్‌గా మారాలంటే వారి వెన్నుల్లో వణుకు పుట్టించే ఓ చట్టాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసురానుంది. మధ్యప్రదేశ్‌లో వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా "మధ్యప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ నిరోధక బిల్లు" ను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుందని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. ఈ చట్టం ప్రకారం.. గ్యాంగ్స్టర్లకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు ఆస్తులను అటాచ్ చేయడం జరుగుతుందని అన్నారు. లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, పేకాట డెన్లు నిర్వహిస్తున్న వారిని కట్టడి చేయడానికి ఈ చట్టం తీసుకు రానున్నట్లు ఆయన చెప్పారు. -
రిక్షా తొక్కే స్థాయినుంచి.. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా...
భువనేశ్వర్ : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హైదర్ శనివారం పోలీసుల కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. చౌద్వార్ సర్కిల్ జైలు నుంచి బరిపద జైలుకు తరలిస్తుండగా అతడు తప్పించుకోవటానికి ప్రయత్నించటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలోనే అతడు మృత్యువాతపడ్డాడు. దాదాపు 10 సంవత్సరాలకు పైగా రాష్ట్ర పోలీసులను ముప్పతిప్పలుపెట్టిన అతడు జీవితపు తొలినాళ్లలో రిక్షా నడిపేవాడు. అతడి పూర్తి పేరు రఫ్పియన్ షేక్ హైదర్. 1990నుంచి 2000 సంవత్సరం వరకు వరుస హత్యలు, కిడ్నాపులతో గ్యాంగ్‌స్టర్‌గా హైదర్ పేరు మార్మోగింది. అయితే, రెండు హత్యల్లోనే నేరుగా ఇన్వాల్వ్ అయ్యాడు. మిగిలిన అన్ని నేరాలను అతడి గ్యాంగ్ చేసింది. రెండు హత్యల్లోనూ అతడి యావజ్జీవ శిక్ష పడింది. జైలులో ఉంటూనే తన గ్యాంగ్‌తో నేరాలకు పాల్పడేవాడు. 1991లో గ్యాంగ్‌స్టర్ బుల సేతిని కోర్టు ఆవరణలో కాల్చి చంపటంతో హైదర్ పేరు రాష్ట్రమంతటా మారుమోగింది. 1997లో పోలీసుల కాల్పుల్లో ఓ సారి తీవ్రంగా గాయపడ్డాడు. 2005లో హైదర్ గ్యాంగ్ ఓ ఇద్దరు వ్యక్తుల్ని కాల్చి చంపింది. ఈ నేరంలో పోలీసులు హైదర్‌ను అరెస్ట్ చేశారు. 2011లో కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించింది. 2017లో సెక్యూరిటీ కారణాల వల్ల అతడ్ని ఘర్పాదా జైలునుంచి శంబల్పుర్ జైలుకు తరలించారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రి చేరిన హైదర్ ఏప్రిల్ 10న అక్కడినుంచి పారిపోయాడు. కానీ, పోలీసులు పట్టుకుని కటక్‌లోని చౌద్వార్ జైలుకు తరలించారు. అయితే, కొన్ని భద్రతా కారణాల వల్ల శనివారం అతడ్ని చౌద్వార్ నుంచి బరిపద జైలు తరలించటానికి వ్యానులో ఎక్కించారు. ఈ నేపథ్యంలో హైదర్ తప్పించుకోవటానికి ప్రయత్నించగా పోలీసులు కాల్చిచంపారు. -
జైల్లో కాల్పుల కలకలం.. గ్యాంగ్‌స్టర్ మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చెలరేగి కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు హతమయ్యారు. ఇద్దరు ఖైదీలను తోటి ఖైదీ కాల్చి చంపడంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గ్యాంగ్ వార్ ఘటనపై నివేదక అందజేయాలని డివిజనల్ కమిషనర్ డీకే సింగ్, చిత్రకూట్ ఐజీ, జైళ్ల శాఖ డీఐజీ సంజీవ్ త్రిపాఠిలను ఆదేశించారు. మృతి చెందిన ఖైదీలను అన్షు దీక్షిత్, మిరాజుద్దీన్ అలియాస్ మిరాజ్ అలీ, ముకీం కాలాగా పోలీసులు ప్రకటించారు. మిరాజ్ అలీ, ముకీం కాలాని అన్షు దీక్షిత్ తుపాకీతో కాల్చి చంపేశాడు. మరికొందరు ఖైదీల తలకు తుపాకీ గురిపెట్టి చంపుతానని బెదిరించడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దీక్షిత్ ప్రాణాలు కోల్పోయాడని సీనియర్ పోలీసు అధికారి సత్యనారాయణ్ తెలిపారు. అయితే జైల్లోకి తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై విచారణ చేపట్టినట్లు ఆయన చెప్పారు. అందరూ కరుడుగట్టిన నేరస్తులని.. వారిపై చాలా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. అయితే ఈ ఘటనపై జిల్లా జైలర్ ఎస్పీ త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో ఖైదీల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో సిబ్బంది ఆపేందుకు యత్నించారని.. ఆ సమయంలో దీక్షిత్ జైలు అధికారి రివాల్వర్ లాక్కుని తోటి ఖైదీలపై కాల్పులు జరిపాడని అన్నారు. అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో దీక్షిత్ చనిపోయాడని చెప్పారు. అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో గ్యాంగ్ వార్ కారణంగానే కాల్పుల ఘటన చోటుచేసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. యూపీలోని షామ్లీకి చెందిన ముకీం కాలా హత్యలు, దోపిడీలు, వసూళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రాజకీయ నేతగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ ముఠాలో మిరాజ్ అలీ కీలక సభ్యుడిగా తెలుస్తోంది. సీతాపూర్‌కి చెందిన కాంట్రాక్ట్ కిల్లర్ అన్షు దీక్షిత్ గతంలో గ్యాంగ్ స్టర్ మున్నా బజరంగి వద్ద పనిచేసినట్లు సమాచారం. మిరాజ్ అలీని మార్చి 20న వారణాసి జైలు నుంచి చిత్రకూట్ జైలుకి మార్చారు. కాలాని సహరాన్పూర్ నుంచి ఈ నెల 7న ఇక్కడికి తరలించినట్లు తెలుస్తోంది. దీక్షిత్ 2019 నుంచి ఇదే జైలులో ఉంటున్నాడు. చదవండి: ఆస్పత్రిలో పక్కా ప్లాన్: సెంట్రీ బిర్యానీలో మత్తు మందు కలిపి -
పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్‌స్టర్