ఉత్తరప్రదేశ్‌లో నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్, బీహర్, రతన్‌పురి పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో వాంటెడ్ బీహార్ గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు.
వివరాల్లోకి వెళితే బుధవారం అర్థరాత్రి బీహార్‌లోని రతన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఇంచోరా గ్రామం సమీపంలోని అడవిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్‌టీఎఫ్), బీహర్, రతన్‌పురి పోలీసులు ముగ్గురు దుండగులను ఎన్‌కౌంటర్ చేశారు వీరిలో బీహార్ గ్యాంగ్ స్టర్ నీలేష్ రాయ్ ఉన్నారు. రూ. రెండు లక్షల రివార్డు కలిగిన నీలేష్ ఈ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతని సహచరులిద్దరూ పరారయ్యారు.
నిందితులకు చెందిన బైక్, రెండు పిస్టల్స్, కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అర్థరాత్రి నోయిడా, బీహార్‌కు చెందిన ఎస్‌టిఎఫ్ బృందాలు రతన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్‌పూర్ పోలీస్ పోస్ట్‌లో నేరస్తుల సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఇంతలో బుధానా నుంచి బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారు పోలీసులపై కాల్పులు జరిపి, ఖతౌలీ-బుదానా రహదారి వైపు వేగంగా వెళ్లిపోయారు.
పోలీసు బృందం వారిని వెంబడిస్తున్న సమయంలో ఇంచుడ గ్రామం అడవిలో వారి బైక్ స్లిప్ అయ్యి కింద పడిపోయింది. ఇంతలో పోలీసులు కాల్పులు చేయగా ఇద్దరు దుండగులు తప్పించుకున్నారు. పోలీసుల తూటాలకు ఓ యువకుడు(నీలేష్ రాయ్) గాయపడ్డాడు. పోలీసులు బాధితుడిని బుధానా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతను చనిపోయినట్లు ధృవీకరించారు.
మృతుడిని బీహార్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడు నీలేష్ రాయ్‌గా గుర్తించామని, బరో రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గధరా బెగుసరాయ్ బీహార్ నివాసి అని ఎస్పీ దేహత్ ఆదిత్య బన్సాల్ తెలిపారు. అతనిపై బీహార్ ప్రభుత్వం రూ.2 లక్షల రివార్డు ప్రకటించింది. నీలేష్‌పై హత్య, దోపిడీ, తదితర 16 తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న నీలేష్ సహచరులిద్దరి కోసం పోలీసులు అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment