wanted
-
ఎన్కౌంటర్లో వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హతం
ఉత్తరప్రదేశ్‌లో నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్, బీహర్, రతన్‌పురి పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో వాంటెడ్ బీహార్ గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు.వివరాల్లోకి వెళితే బుధవారం అర్థరాత్రి బీహార్‌లోని రతన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఇంచోరా గ్రామం సమీపంలోని అడవిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్), బీహర్, రతన్‌పురి పోలీసులు ముగ్గురు దుండగులను ఎన్కౌంటర్ చేశారు వీరిలో బీహార్ గ్యాంగ్ స్టర్ నీలేష్ రాయ్ ఉన్నారు. రూ. రెండు లక్షల రివార్డు కలిగిన నీలేష్ ఈ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతని సహచరులిద్దరూ పరారయ్యారు.నిందితులకు చెందిన బైక్, రెండు పిస్టల్స్, కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అర్థరాత్రి నోయిడా, బీహార్‌కు చెందిన ఎస్టిఎఫ్ బృందాలు రతన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్పూర్ పోలీస్ పోస్ట్‌లో నేరస్తుల సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఇంతలో బుధానా నుంచి బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారు పోలీసులపై కాల్పులు జరిపి, ఖతౌలీ-బుదానా రహదారి వైపు వేగంగా వెళ్లిపోయారు.పోలీసు బృందం వారిని వెంబడిస్తున్న సమయంలో ఇంచుడ గ్రామం అడవిలో వారి బైక్ స్లిప్ అయ్యి కింద పడిపోయింది. ఇంతలో పోలీసులు కాల్పులు చేయగా ఇద్దరు దుండగులు తప్పించుకున్నారు. పోలీసుల తూటాలకు ఓ యువకుడు(నీలేష్ రాయ్) గాయపడ్డాడు. పోలీసులు బాధితుడిని బుధానా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతను చనిపోయినట్లు ధృవీకరించారు.మృతుడిని బీహార్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడు నీలేష్ రాయ్‌గా గుర్తించామని, బరో రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గధరా బెగుసరాయ్ బీహార్ నివాసి అని ఎస్పీ దేహత్ ఆదిత్య బన్సాల్ తెలిపారు. అతనిపై బీహార్ ప్రభుత్వం రూ.2 లక్షల రివార్డు ప్రకటించింది. నీలేష్‌పై హత్య, దోపిడీ, తదితర 16 తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న నీలేష్ సహచరులిద్దరి కోసం పోలీసులు అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
TS Crime News: నిందితులను గుర్తిస్తే.. వెంటనే ఈ నంబర్‌కి..! : మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్
వరంగల్: వరంగల్ కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో బుధవారం జరిగిన విశ్రాంతి ఆర్టీసీ ఉద్యోగి నాముతాబాజీ రాంచందర్(65) హత్య కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు కనిపిస్తోంది. ఏసీపీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ టి. నరేష్ నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే కరీమాబాద్–వరంగల్ ప్రధాన రహదారిపై ప్లైఓవర్ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు నిందితులు బైక్‌పై పరారీ అవుతున్నట్లు కనిపించింది. నిందితులను గుర్తిస్తే సమాచారం ఇవ్వండి.. రాంచందర్‌ను హత్య చేసిన నిందితులు బైక్‌పై పరారవుతున్న ఫొటోలను విడుదల చేశామని, ఎవరైనా నిందితులను గుర్తించినా, వారి ఆచూకీ తెలిసినా వెంటనే తమకు సమాచారం అందించాలని మిల్స్కానీ ఇన్స్పెక్టర్ టీ. సురేష్ పేర్కొన్నారు. ఈమేరకు నిందితులు హీరో ఫ్యాషన్ బైక్‌పై పరారవుతున్న ఫొటోలను శుక్రవారం విడుదల చేశారు. నిందితులను గుర్తించిన వారు వెంటనే మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ సెల్ నెంబర్ 8712685119, ఐటీ సెల్ వరంగల్ ఇన్స్పెక్టర్ 8712685159, టాస్క్‌ఫోర్స్ వరంగల్ ఇన్స్పెక్టర్ 8712685150, మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ నంబర్ 8712685006 సమాచారం అందజేయాలని కోరారు. -
లాహోర్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది కాల్చివేత
లాహోర్: వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది పరంజిత్ సింగ్ పంజ్వార్(63) పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పుల్లో హతమయ్యాడు. పంజాబ్ ప్రావిన్స్ లాహోర్‌లోని తన నివాసానికి సమీపంలో శనివారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లిన అతడిపై గుర్తు తెలియని దుండగులు దగ్గర్నుంచి కాల్పులకు దిగారు. ఈ ఘటనలో అతడితోపాటు గార్డు కూడా చనిపోయాడు. ఖలిస్తానీ కమాండో ఫోర్స్–పంజ్వార్ గ్రూపునకు ఇతడే నాయకుడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం–2020 ప్రకారం భారత ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. పంజ్వార్ హత్యాఘటనపై వ్యాఖ్యానించేందుకు లాహోర్ పోలీసులు నిరాకరించారు. 1986లో ఖలిస్తానీ కమాండో ఫోర్స్‌లో చేరిన పంజ్వార్ అనంతరం సొంత కుంపటి పెట్టుకుని పాక్‌కు పరారయ్యాడు. పంజాబ్, హరియాణా, చండీగఢ్‌ల్లో జరిగిన పలు పేలుడు ఘటనలకు ఇతడి ప్రమేయం ఉంది. -
మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్న రోజులవి.. నమ్మినవాడే మోసం చేశాడు
అమృతరావు.. తెలుగులో ఒకే ఒక సినిమా చేసింది. అదీ సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో.. అతిథి సినిమాలో మహేశ్‌తో జోడీ కట్టిందీ హీరోయిన్. దానికి ముందు, తర్వాత హిందీ సినిమాలే చేస్తూ బాలీవుడ్లో స్థిరపడిపోయింది. అమృత తన జీవితంలో చోటు చేసుకున్న పలు సంఘటనలను కపుల్ ఆఫ్ థింగ్స్ అనే పుస్తకంలో రాసుకొచ్చింది. అందులో తన మేనేజర్ చేసిన మోసాన్ని ప్రస్తావించింది. "అప్పుడు నేను మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నాను. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నాను. ఒకరోజు సాయంత్రం తాజ్ బంజారా హోటల్లో బోనీ కపూర్‌తో పనిచేసిన వ్యక్తిని చూశాను. అతడు నన్ను చూడగానే హాయ్ అమృతా అంటూ దగ్గరకు వచ్చి పలకరించాడు. ఎలా ఉన్నావు అంటూ బాగోగులు అడిగి, నీకు డేట్స్ సర్దుబాటు అయ్యుంటే మాతో పాటు సల్మాన్ ఖాన్ వాంటెడ్ షూటింగ్లో ఉండేదానివి అన్నాడు. ఆ మాటకు నేను బ్లాంక్ అయ్యాను. అసలు వాంటెడ్ కోసం నన్నెప్పుడు అడిగారని తిరిగి ప్రశ్నించాను. దానికతడు 'అలా అంటావేంటి? వాంటెడ్ కోసం నిన్నే సంప్రదించాం. నీ మేనేజర్‌కు ఫోన్ చేశాం. కానీ ఆయన నీ డేట్స్ సర్దుబాటు చేయడం కష్టమని చెప్పాడు' అని తెలిపాడు. ఆ మాట విని నా గుండె ముక్కలైంది. అంత పెద్ద ఆఫర్ వచ్చిందన్న విషయం మేనేజర్ నాకు చెప్పనేలేదు. నన్ను మోసం చేశాడు. అంత మంచి ఆఫర్ నాదాకా వస్తే నేనెందుకు మిస్ చేసుకుంటాను. కచ్చితంగా డేట్స్ ఇచ్చేదాన్ని. పొమ్మనలేక పొగ బెట్టినట్లు.. తను స్వతాహాగా నా దగ్గర ఉద్యోగం మానేయడానికి బదులు నేనే అతడిని వెళ్లగొట్టేలా చేశాడు. కానీ ఇలా వాంటెడ్ ఛాన్స్ మిస్ చేసి.. మర్చిపోలేని బాధను గిఫ్ట్ ఇచ్చాడు" అని రాసుకొచ్చింది అమృత. 2006లో వచ్చిన పోకిరి సినిమాకు రీమేక్‌గా వాంటెడ్ తెరకెక్కింది. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, ఆయేషా టకియా, వినోద్ ఖన్నా, ప్రకాశ్ రాజ్, ఇందర్ కుమార్, మహేశ్ మంజ్రేకర్ తదితరులు నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సెన్సేషన్ సృష్టించింది. 2009లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. -
ఐదేళ్లుగా అమ్మాయి కోసం చూసి చూసి.. చివరికి ఇలా..!
గత ఐదేళ్లుగా సరైన జోడి కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నా. కానీ, దొరకట్లేదు. సంబంధాల కోసం ఎంతో డబ్బు ఖర్ఛు చేశాం.. ఫలితం లేదు. ఏం చేయను.. తప్పట్లేదు అంటూ ఆ యువకుడు చేసిన పని ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. తనకు నచ్చిన, తనను మెచ్చిన అమ్మాయిని వెతుక్కోవడం కోసం తమిళనాడులోని విల్లపురానికి చెందిన ఎమ్మెస్ జగన్ వినూత్న చర్యకు దిగాడు. ‘పేరు: ఎమ్మెస్ జగన్. వయస్సు: 27 ఏండ్లు. జీతం నెలకు నలభైవేలు. నాకు వధువు కావలెను’ అంటూ కులం, ఇతర వివరాలతో పాటు మధురై అంతటా రోడ్ల కూడళ్లలో బ్యానర్లు, వాల్ పోస్టర్లు వేశాడతను. ఓ కంపెనీలో మేనేజర్‌గా పని చేసే జగన్.. పార్ట్ టైంలో డిజైనర్‌గా కూడా పని చేస్తున్నాడు. నా పనిలో భాగంగా ఎంతో మంది కోసం.. ఎన్నో పోస్టర్లు డిజైన్ చేశా. నా కోసం ఎందుకు డిజైన్ చేసుకోకూడదు అనిపించింది. అందుకే ఇలా అంటున్నాడు ఆ యువకుడు. ఎంతో మంది అమ్మాయిని చూస్తామంటూ డబ్బులు కూడా తీసుకున్నారు. కానీ, ఎవరూ సరిపోయే జోడిని తేలేకపోయారు. అందుకే ఈ ప్రయత్నం అంటున్నాడు అతను. అయితే.. పోస్టర్లు పెట్టాక ఏమైనా సంబంధాలు వస్తున్నాయా? అంటే.. అబ్బే లేదంట. కేవలం.. మ్యారేజ్ బ్రోకర్లు మాత్రమే ఫోన్లు చేస్తున్నారట పాపం. నైంటీస్‌లో పుట్టిన తనకు ఇదొక టఫ్ టైం అంటున్నాడు ఎమ్మెఎస్ జగన్. ఇంటర్నెట్లో మీమ్స్‌తో పాటు కొంతమంది ఫోన్ కాల్స్ చేసి.. పాపం అతన్ని పెళ్లి చూపులంటూ ఏడ్పించారట కూడా. కానీ, ఎవరినీ పట్టించుకోకుండా ఈ ప్రయత్నం ఆపనంటున్నాడు అతను. ఒకవేళ.. త్వరలో మంచి సంబంధం గనుక కుదిరితే.. కృతజ్ఞతలతో మరొక పోస్టర్ తయారు చేస్తాడంట. -
లష్కరే టాప్ ఉగ్రవాది సలీం పర్రే హతం
జమ్మూ/శ్రీనగర్: శ్రీనగర్ శివారులో సోమవారం పోలీసుబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన వాంటెడ్ ఉగ్రవాది సలీం పర్రే హతమయ్యాడు. పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో సలీం పర్రే మృతి చెందినట్లు కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అదేవిధంగా గాసు గ్రామంలో భద్రతాబలగాలతో జరిగిన మరో ఎన్కౌంటర్లో గుర్తు తెలియని ఒక ఉగ్రవాది హతమయ్యాడన్నారు. జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాక్ భూభాగం నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఒక వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) కాల్చి చంపింది. సాంబా జిల్లా పరిధిలోని రామఘర్ సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సోమవారం అనుమానాస్పద కదలికలు కనిపించడంతో బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా జవాన్లు పలుమార్లు హెచ్చరించారు. లక్ష్య పెట్టకుండా ముందుకు వచ్చేందుకు యత్నించిన అతడిని బలగాలు కాల్చి చంపాయని సీనియర్ సైనికాధికారి ఒకరు వెల్లడించారు. -
వైద్యుడు కోరుకున్న సంపద
ఇది చాలా పురాతన సంఘటన. ఒకసారి బుఖారా చక్రవర్తి బాగా జబ్బు పడ్డాడు. రాజవైద్యులు ఎంత వైద్యం చేసినా, ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించలేదు. ఎంతో మంచివాడు, దయార్ద్ర హృదయుడైన చక్రవర్తి జబ్బు పడ్డాడని తెలిసి ప్రజలంతా ఆందోళన చెందసాగారు. గొప్ప గొప్ప వైద్య నిపుణుల చికిత్సకు కూడా జబ్బు ఏ మాత్రం తగ్గలేదు. దీంతో, చక్రవర్తికి సరైన వైద్యం చేసిన వారికి కోరిన బహుమతి ఇవ్వబడుతుందని బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. ఒక యువకుడు రాజదర్బారుకు వచ్చి, రాజుగారికి వైద్యం చేస్తానని ముందుకొచ్చాడు. ఆ యువ వైద్యుణ్ణి చూసి, తమ వల్ల కానిది ఈ కుర్ర వైద్యుడివల్ల ఏమవుతుందని పెద్దవాళ్లంతా గుసగుసలాడుకున్నారు. చక్రవర్తికి కూడా నమ్మకం కుదరలేదు. అయినా ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా సరేనన్నారు. వైద్యం మొదలైంది. కొద్దిరోజుల్లోనే చక్రవర్తి ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వచ్చింది. మరికొద్ది రోజుల్లో లేచి తిరగడం ప్రారంభించాడు. చివరికి పూర్తిగా స్వస్థత పొందాడు. అందరూ సంతోషించారు. ఒకరోజు చక్రవర్తి సభ ఏర్పాటు చేసి యువ వైద్యుణ్ణి ఘనంగా సత్కరించాడు. ‘అపారమైన సంపద, వజ్ర వైఢూర్యాలు సిద్ధంగా ఉన్నాయి. కోరుకున్నది దక్కుతుంది. నీకేం కావాలో కోరుకో’ అన్నాడు. సభికులు, మంత్రులు అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఎంత సంపద కోరుకుంటాడో, ఎంతడిగినా చక్రవర్తి కాదనే ప్రసక్తేలేదు అనుకున్నారు. కొద్ది క్షణాలు యువకుడు కూడా మౌనం వహించాడు. ఆ యువ వైద్యుడు మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ‘‘మహారాజా..! నాకు మీ గ్రంథాలయంలో అధ్యయనం చేసుకోడానికి కొన్నిరోజులు అనుమతించండి.’అన్నాడు. ఈ కోరిక విని సభికులు, మంత్రులే కాదు, స్వయంగా చక్రవర్తి కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. చదువు, అధ్యయనం పట్ల అతనికున్న శ్రద్ధను చూసి ఎంతో అబ్బురపడ్డాడు. కోరినంత సంపద కళ్ల ముందు సిద్ధంగా ఉన్నా, దాన్ని కాదని గ్రంథాలయంలో అధ్యయనం చేసుకోడానికి అనుమతి కోరిన ఆ యువ వైద్యుని సంస్కారానికి సలాం చేశాడు. ఆ యువ వైద్యుడే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్య పితామహుడు ఇబ్నెసీనా అలియాస్ అవెసీనా. – మదీహా -
హోదా కావాలని ఆందోళన
తుళ్లూరు రూరల్ : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు....హోదా సాధన కై పోరాడదాం అంటూ నూతన అసెంబ్లీ వద్ద సోమవారం నవతరం పార్టీ నాయకులు ఆందోళన చేశారు. అసెంబ్లీ నాలుగో గేటు వద్ద నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధికి హోదా చాలా అవసరం అని నినదించారు. అప్రమత్తమైన పోలీసులు వారి నుంచి జెండాలు, ప్లకార్డులు లాక్కొని అదుపులోకి తీసుకున్నారు. -
గెస్టు లెక్చరర్ పోస్టులకు ఆహ్వానం
మైలవరం : మైలవరం వీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లిష్, కామర్స్ (వృత్తి విద్యా కోర్సు ఒఎ) నందు అధ్యాపక పోస్టులలో గెస్టు ఫాకల్టీగా పనిచేడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్. శ్రీరామమూర్తి శుక్రవారం తెలిపారు. గెస్టు ఫాకల్టీలకు గంటకు రూ.150 చొప్పున గరిష్టంగా నెలకు రూ. 10 వేలు గౌరవ వేతనం చెల్లించబడుతుందన్నారు. ఔత్సాహికులు ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలు లోగా దరఖాస్తులు కళాశాల కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తుదారులు 20వ తేదీ 10గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావాలని లె లిపారు. విశ్రాంత అధ్యాపకులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. -
వాంటెడ్ కాంబినేషన్
హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు ప్రభుదేవాది క్రేజీ కాంబినేషన్. సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన తెలుగు సెన్సేషనల్ మూవీ ‘పోకిరి’ హిందీ రీమేక్ ‘వాంటెడ్’ బాలీవుడ్లో చాలా బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసింది. అప్పటికి ఐదారు ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న సల్మాన్ ఖాన్‌కు ఈ చిత్రం చాలా ప్లస్ అయ్యింది. ‘వాంటెడ్’ తర్వాత బాలీవుడ్ టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తూ ప్రభుదేవా అక్కడ స్టార్ డెరైక్టర్ అయ్యారు. అయితే ఆ సినిమా తర్వాత సల్మాన్-ప్రభుదేవా మళ్లీ కలిసి సినిమా చేయలేదు. ఏడేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కానుందని సమాచారం. సల్మాన్ కోసం ప్రభుదేవా ఓ మంచి స్క్రిప్ట్ రెడీ చేశారని వినిపిస్తోంది. -
చేతి వృత్తులు స్వయం ఉపాధికి దోహదం
ఏఎన్‌యూ: చేతి వత్తులు స్వయం ఉపాధికి దోహదం చేస్తాయని వీసీ ఆచార్య ఎ.రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. యూనివర్సిటీ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగం ఆధ్వర్యంలో జేఎంజే ఉజ్వల హోంలో ఆశ్రయం పొందే బాధిత మహిళలకు ఇచ్చిన శిక్షణ ద్వారా నేర్చుకున్న చేతి వత్తుల ఉత్పత్తుల ప్రదర్శన గురువారం యూనివర్సిటీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మహిళలు చేతి వత్తులో నైపుణ్యం పెంపొదించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. స్వయం ఉపాధి పొందటం ద్వారా కుటుంబం, సమాజం అభివద్ధి చెందుతుందని పేర్కొన్నారు. చేతి వత్తుల ద్వారా మహిళలు ఆర్థికంగా పురోభివద్ధి సాధించటంతోపాటు నలుగురికి ఉపాధి కల్పించవచ్చన్నారు. సమాజంలో ఎదురవుతున్న అనేక సవాళ్ళను మహిళలు అధికమించేందుకు స్వయం ఉపాధి సంబంధిత అంశాలు దోహదం చేస్తాయన్నారు. ప్రదర్శనలో ఉన్న వస్తువులను పరిశీలించి వాటిని తయారు చేసిన వారిని, వారికి శిక్షణ ఇచ్చిన వారిని వీసీ అభినందించారు. కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ సరస్వతిరాజు అయ్యర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ ఉత్పత్తుల ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఉజ్వల హోం నిర్వాహకులు సిస్టర్ రోజ్లీనా, రూప తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనివర్సిటీకి చెందిన వివిధ విభాగాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు ప్రదర్శనను వీక్షించి ఉత్పత్తులను కొనుగోలు చేశారు. -
సౌత్ కొరియన్ రీమేక్‌లో..?
సల్మాన్‌ఖాన్ కెరీర్‌కు రీమేక్స్ బాగా కలిసొచ్చాయి. ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ కెరీర్‌కు ‘వాంటెడ్’ అనే రీమేక్ కొత్త టర్నింగ్ పాయింట్. అది మన తెలుగు ‘పోకిరి’కి సల్మాన్ చేసిన హిందీ రూపం. ఆ తర్వాత ‘రెడీ’, ‘కిక్’ లాంటి ద క్షిణాది చిత్రాలను రీమేక్ చేసి తన సక్సెస్ గ్రాఫ్‌ను పెంచుకున్నారాయన. తాజాగా ఆయన ఓ కొరియా చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దాదాపు 22 ఏళ్ల క్రితం సల్మాన్‌ఖాన్‌తో ‘అందాజ్ అప్నా అప్నా’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి తాజాగా కొరియన్ చిత్రం ‘ఓడ్ టు మై ఫాదర్’ రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. ఇందులో సల్మాన్‌ఖాన్ హీరో అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయనకు కథ కూడా చెప్పారట. సల్మాన్‌కు కూడా ఈ కథ నచ్చి చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం. -
’హిందూస్థాన్ చేయండి’
-
వాంటెడ్
-
ఇంటర్నెట్లో మానవమృగాల దాష్టీకం