
వాంటెడ్ కాంబినేషన్
హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు ప్రభుదేవాది క్రేజీ కాంబినేషన్. సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన తెలుగు సెన్సేషనల్ మూవీ ‘పోకిరి’ హిందీ రీమేక్ ‘వాంటెడ్’ బాలీవుడ్‌లో చాలా బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసింది. అప్పటికి ఐదారు ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న సల్మాన్ ఖాన్‌కు ఈ చిత్రం చాలా ప్లస్ అయ్యింది. ‘వాంటెడ్’ తర్వాత బాలీవుడ్ టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తూ ప్రభుదేవా అక్కడ స్టార్ డెరైక్టర్ అయ్యారు. అయితే ఆ సినిమా తర్వాత సల్మాన్-ప్రభుదేవా మళ్లీ కలిసి సినిమా చేయలేదు. ఏడేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కానుందని సమాచారం. సల్మాన్ కోసం ప్రభుదేవా ఓ మంచి స్క్రిప్ట్ రెడీ చేశారని వినిపిస్తోంది.