వరంగల్: వరంగల్ కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్ తోటలో బుధవారం జరిగిన విశ్రాంతి ఆర్టీసీ ఉద్యోగి నాముతాబాజీ రాంచందర్(65) హత్య కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు కనిపిస్తోంది. ఏసీపీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ టి. నరేష్ నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే కరీమాబాద్–వరంగల్ ప్రధాన రహదారిపై ప్‌లైఓవర్ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు నిందితులు బైక్‌పై పరారీ అవుతున్నట్లు కనిపించింది.
నిందితులను గుర్తిస్తే సమాచారం ఇవ్వండి..
రాంచందర్‌ను హత్య చేసిన నిందితులు బైక్‌పై పరారవుతున్న ఫొటోలను విడుదల చేశామని, ఎవరైనా నిందితులను గుర్తించినా, వారి ఆచూకీ తెలిసినా వెంటనే తమకు సమాచారం అందించాలని మిల్స్‌కానీ ఇన్‌స్పెక్టర్ టీ. సురేష్ పేర్కొన్నారు.
ఈమేరకు నిందితులు హీరో ఫ్యాషన్ బైక్‌పై పరారవుతున్న ఫొటోలను శుక్రవారం విడుదల చేశారు. నిందితులను గుర్తించిన వారు వెంటనే మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ సెల్ నెంబర్ 8712685119, ఐటీ సెల్ వరంగల్ ఇన్‌స్పెక్టర్ 8712685159, టాస్క్‌ఫోర్స్ వరంగల్ ఇన్‌స్పెక్టర్ 8712685150, మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ నంబర్ 8712685006 సమాచారం అందజేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment