Warangal District Latest News
-
నాణ్యతా ప్రమాణాల పరిశీలన
కమలాపూర్: కమలాపూర్ పీహెచ్సీ పరిధి గూడూరు, ఉప్పల్ పీహెచ్సీ పరిధి గుండేడు, ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (ఏఏఎం)లను జాతీయ నాణ్యతా ప్రమాణాల కోసం ఎన్‌క్వాస్ రాష్ట్ర కన్సల్టెంట్ వినయ్ మంగళవారం పరిశీలించారు. ఇందులో భాగంగా.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల భవన నిర్మాణం, హెర్బల్ గార్డెన్, బయో మెడికల్ వేస్టేజీ, రోగులకు అందుతున్న సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేసి వాటి బలోపేతానికి నాణ్యతా ప్రమాణాలు పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమాల్లో ఎన్హెచ్ఎం ప్రోగ్రాం అధికారి ఎండీ.రుక్మోద్దీన్, జిల్లా నాణ్యతా ప్రమాణాల ఇన్చార్జ్ మేనేజర్ సాగర్, వైద్యాధికారి డాక్టర్ పద్మజ, ఏఏఎం వైద్యులు సంయుక్త, మాధవి, సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా శివపార్వతుల రథోత్సవం
మడికొండ: మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక రథంపై ప్రతిష్టించి వైభవంగా రథోత్సవం నిర్వహించారు. మడికొండలోని ప్రధాన వీధుల్లో ఉరేగించారు. రథానికి భక్తులు ఎదురేగి నీళ్లు ఆరబోసి మంగళ హారతులతో స్వాగతం పలికారు. రథోత్సవంలో భాగంగా కోలాటం, గొల్లడప్పులు, భజన బృందాలు, చిరుతల రామాయణం, నృత్యాల మధ్య రథోత్సవం సాగింది. వేడుకల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి కే.శేషుభారతి, అర్చకులు రాగిచేడు అభిలాష్శర్మ, పరశురాం విష్ణువర్ధనచార్యులు, సత్యనారాయణ శర్మ, మణిశర్మ, చైర్మన్ పైడిపాల రఘుచందర్, ధర్మకర్తలు బైరి రాజుగౌడ్, దండిగం శ్రీనివాస్, బోగి కేదారి, వస్కుల ఉమ, రోడ్డ దయాకర్, మాడిశెట్టి జ్ఞానేశ్వరి, కుర్ల మోహన్, తొట్ల రాజుయాదవ్ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాను అగ్రభాగాన నిలపాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పని చేసి జిల్లాను అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో అగ్రభాగాన నిలపాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని డైరీని ఆవిష్కరించారు. అనంతరం టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములై కలెక్టర్ మార్గదర్శకంలో సంపూర్ణ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం హనుమకొండ సిటీ ఉద్యోగుల క్యాలెండర్, పంచాయతీ కార్యదర్శుల క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ నాయకులు బైరి సోమయ్య, వేణుగోపాల్, పనికెల రాజేశ్, శ్యాంసుందర్, రామునాయక్, మోయిజ్, ల క్ష్మీప్రసాద్, ప్రణయ్, పృధ్వీ, పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, నరేశ్, నాయకులు రాజమౌళి, సురేశ్, రాజేశ్‌ఖన్నా, రాజ్యలక్ష్మి, సింధురాణి, పావని, శ్రీలత ఉన్నారు. విస్తృత అవగాహన కల్పించాలి దివ్యాంగులకు ఇస్తున్న సదరం ధ్రువీకరణ పత్రానికి బదులు ప్రత్యేక యూనిక్ డిజబిలిటీ ఐడెంటిఫికేషన్ కార్డు (యూడీఐడీ) జారీ నేపథ్యంలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో యూడీఐడీ మార్గదర్శకాలపై అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో డీఆర్డీఓ మేన శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య, ఎంజీఎం సూపరింటెండెంట్ అంబి శ్రీనివాస్, జిల్లా సంక్షేమాధికారి జయంతి పాల్గొన్నారు. అర్హుల జాబితాను సిద్ధం చేయండి జిల్లాలో ‘మిషన్ వాత్సల్య’ పథకానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మిషన్ వాత్సల్య పథకం అర్హుల ఎంపికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. తల్లిదండ్రులు లేని బాలబాలికలకు మొదటి ప్రాముఖ్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, బాల రక్షాభవన్ జిల్లా కో–ఆర్డినేటర్ సీహెచ్ అవంతి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్చార్జ్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, సీడబ్ల్యూజీ మెంబర్ సుధాకర్, ఎఫ్ఎంఎంఎస్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, ప్రొటెక్షన్ ఆఫీసర్ మౌనిక, శిశుగృహ ఇన్చార్జ్ మేనేజర్ మాధవి, సోషల్ వర్కర్లు శ్రీనివాసులు, సునీత, చైతన్య పాల్గొన్నారు. -
ఐలోని మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కించారు. ఈఏడాది జనవరి 2025 నుంచి 44 రోజులకుగాను.. హుండీల్లో రూ.42,64,669, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా.. రూ.1,35,94,297లు రాగా.. మొత్తం రూ.1,78,58,966ల నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. హుండీల్లో లభ్యమైన వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలోనే వేసి సీల్ చేసినట్లు తెలిపారు. లెక్కింపులో కానిస్టేబుళ్లు పి.రమేశ్, శ్రీనివాస్, ప్రశాంత్, ఒగ్గు పూజారులు మజ్జిగ అశోక్, రాములు, మహబూబాబాద్ శ్రీలక్ష్మీవేంకటేశ్వర సేవా సమితి సభ్యులు, దేవాలయ అర్చక, సిబ్బంది తదితరులున్నారు. -
5
నిమిషాలు ఆలస్యమైనా అనుమతివిద్యారణ్యపురి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు నిర్ధేశించిన సమయం ఉదయం 9గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చినవారిని అనుమతించబోరు. ఈసారి పరీక్ష కేంద్రాన్ని గుర్తించేలా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను కూడా ముద్రించారు. ఈ మేరకు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారంనుంచి ఇంటర్ ఫస్టియర్, 6వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. మంగళవారం అన్ని పరీక్ష కేంద్రాల్లో సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. హనుమకొండ జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తంగా 39,980మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరికోసం 55 సెంటర్లు ఏర్పాటు చేశారు. 55 మంది చీఫ్‌సూపరింటెండెంట్లను, 55 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను 1050మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల కేంద్రాలకు 42మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. వరంగల్ జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి 12,321 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. వీరికి 26 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. అన్నిచోట్లా నిఘా అన్ని సెంటర్లలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటుచేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రధాన ద్వారం వద్ద, ప్రిన్సిపాల్ గది, వరండా, ఒకవేళ పరీక్ష పూర్తయ్యాక వేరే గదిలోజవాబు పత్రాల ప్యాకింగ్ చేస్తే అక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని హై దరాబాద్‌లోని ఇంటర్‌బోర్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. సంబంధిత ఉన్నతాధికారులు అక్కడి నుంచే ప్రతీ పరీక్ష కేంద్రంలోకి వచ్చి వెళ్లేవారు ఎవరనేది పరిశీలించే అవకాశం ఉంది. సెంటర్ సమీపంలో 144 సెక్షన్, జిరాక్స్ సెంటర్ల మూసివేత ఉంటుంది. కేంద్రాల్లో వసతుల కల్పన పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీటి సదుపాయం కల్పించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నారు. పరీక్షల సమయానికనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 8–15 గంటలనుంచే లోనికి అనుమతిస్తారు. ఫోన్లు అనుమతించరు. ఫీజుల పేరుతో కళాశాల యాజమాన్యం హాల్‌టికెట్ ఇవ్వకుంటే.. టీజీబీఐఈ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం క ల్పించారు. ఆ హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని, అలా ఎవరైనా హాల్‌టికెట్‌తో వచ్చినా అనుమతించాలని ఇప్పటికే డీఐఈఓ సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. నేటినుంచి ఇంటర్ పరీక్షలు కేంద్రాల్లో అన్ని వసతులు పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 చట్టం అమలు వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల పరిఽధిలో 163 బీఎన్ఎస్ చట్టం అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండడం, ర్యాలీలు, సభలు, ధర్నాలు, సమావేశాలు, ఊరేగింపులు చేయడం నిషేధమని పేర్కొన్నారు. పరీక్ష సమయాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, ఎవరైనా ఉత్తర్వులు అత్రికమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రెవెన్యూ అధికారుల సర్వే
కమలాపూర్: మండలంలోని శ్రీరాములపల్లిలో రెవెన్యూ అధికారులు మంగళవారం సర్వే నిర్వహించారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చిలువేరు శ్రీనివాస్‌పై కలెక్టర్‌కు గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే చేశారు. గ్రామంలోని 286/సీ/2లో 9 గుంటలు, 287/ఏ/2లో 1.11 ఎకరాలు, 287/ఈ/2లో 26 గుంటల చొప్పున మూడు సర్వే నంబర్లలో మొత్తం 2.06 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని శ్రీనివాస్ గతేడాది సెప్టెంబర్‌లో తన పేరిట విరాసత్ పట్టా చేయించుకున్నాడని, తాము అదే భూములను 30, 40 ఏళ్ల క్రితం కొని ఇళ్లు నిర్మించుకున్నట్లు, పట్టా రద్దు చేసి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కలెక్టర్, ఆర్డీఓ ఆదేశాల మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు ఇన్చార్జ్ తహసీల్దార్ శోభారాణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సర్వేయర్ గోపీకృష్ణ గ్రామానికి వెళ్లారు. ఆభూములను సర్వే చేసి భూముల్లో ఉన్న ఇళ్లు ఎన్ని, ఖాళీ స్థలం ఎంత? అనే వివరాలతో లొకేషన్ మ్యాప్ రూపొందించారు. సర్వే నివేదికను ఆర్డీఓకు అందజేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా.. భూములకు ఇంటినంబర్లు ఎలా కేటాయించారు? శ్రీనివాస్ పాస్‌బుక్ ఎందుకు రద్దు చేయకూడదో పూర్తి ఆధారాలతో పంచాయతీ కార్యదర్శి ఈనెల 7న హనుమకొండ ఆర్డీఓ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. -
శిల్పకళ అద్భుతం..
ఖిలా వరంగల్: కాకతీయుల నిర్మాణ శైలి, నల్ల రాతితో రూపొందించిన శిల్ప కళ వెరీ అద్భుతం అని స్టేట్ ఆర్కియాలజీ ఆఫ్ మైసూర్ ఎ.దేవరాజ్, హైదరాబాద్ సర్కిల్ కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ హెచ్.దేశాయ్ అన్నారు. ఖిలా వరంగల్ కోటను వారు మంగళవారం సాయంత్రం సందర్శించారు. కాకతీయుల ఖ్యాతిని కొనియాడారు. వారి వెంట కేంద్ర పురావస్తుశాఖ కోట ఇన్చార్జ్ శ్రీకాంత్, టీజీ టీడీసీ కోట ఇన్చార్జ్ గట్టికొప్పుల అజయ్, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ జాగిలాల పాత్ర కీలకం: సీపీవరంగల్ క్రైం: నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు నూతనంగా వచ్చిన పోలీస్ జాగిలాలను సీపీ మంగళవారం పరిశీలించారు. గత నెలలో మొయినాబాద్‌లోని పోలీస్ జాగిలాల శిక్షణా కేంద్రంలో శిక్షణను పూర్తి చేసుకుని వచ్చిన ఐదు పోలీస్ జాగిలాలు వరంగల్ కమిషనరేట్ పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో చేరి విధులు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. పేలుడు పదార్థాలను పసిగట్టే ఈ ఐదు జాగిలాల్లో మూడు బెల్జియన్ మాలినోస్, రెండు గోల్డెన్ రీట్రీవర్ జాతులకు చెందినవి ఉన్నాయి. నూతనంగా వచ్చిన ఈ జాగిలాలకు సంబంధించిన పూర్తి వివరాలను సీపీకి హ్యాండ్లర్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేశ్‌కుమార్, ఆర్ఐ శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, హ్యాండ్లర్లు రాజేశ్‌కుమార్, వెంకన్న, సురేశ్, దిలీప్ పాల్గొన్నారు. కెరీర్ కౌన్సెలింగ్ సెల్ డైరెక్టర్‌గా చిర్ర రాజు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్ సెల్ నూతన డైరెక్టర్‌గా తెలుగు విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిర్ర రాజు నియమితులయ్యారు. ఈమేరకు రిజిస్ట్రార్ వి.రామచంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ పదవిలో రాజు ఏడాదిపాటు కొనసాగుతారు. ఆయన కేయూ పాలకమండలి సభ్యుడిగా కూడా ఉన్నారు. 30 ఏళ్లు దాటిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలిహసన్పర్తి: 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లుగా నిర్ధారణ అయితే చికిత్స ప్రారంభించాలని సూచించారు. హసన్‌పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా డేను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి డీఎంహెచ్ఓ అప్పయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాధి నిరోధక టీకాలను వందశాతం విజయవంతం చేయాలన్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీ, కుష్ఠు వ్యాధిగ్రస్తులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి తగిన సేవలందించాలని సూచించారు. అసంక్రమిత వ్యాధులపై అవగాహన నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి భార్గవ్, వైద్యులు కృతిక, సురేశ్, హెల్త్ సూపర్వైజర్ లచ్చు, మేరీ, రుతమ్మ, ఫార్మసిస్ట్ అజిత, స్టాఫ్‌నర్స్ విజయకుమారి, హెల్త్ అసిస్టెంట్ సంతోశ్, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuహన్మకొండ: విద్యుత్ లైన్లకు నేరుగా కొక్కాలు తగిలించి, దొంగచాటుగా విద్యుత్ లైన్ల నుంచి వైరులాగి విద్యుత్ చౌర్యానికి పాల్పడడం చూశాం. గతంలో మీటర్ ఉత్పత్తిలో సాంకేతిక లోపంతో టీవీ రిమోట్ ద్వారా మీటర్ రీడింగ్‌ను నిలిపివేసిన ఘటనలూ చూశాం. ప్రస్తుతం వరంగల్ మహానగరంలో గతానికి భిన్నంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఘటనలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. టీజీ ఎన్పీడీసీఎల్ ఇంజనీర్లకు సవాల్ విసిరినట్లుగా సాగుతున్న విద్యుత్ చౌర్యం సాగుతున్న తీరు విద్యుత్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రధానంగా గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న త్రీ ఫేజ్ మీటర్ల ద్వారా కొందరు వినియోగదారులు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఘటనలు విస్తుగొలుపుతున్నాయి. చౌర్యం ఇలా.. విద్యుత్ లైన్ ద్వారా మీటర్లకు సర్వీస్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. అదే మీటర్ నుంచి విద్యుత్ బయటకు వస్తుంది. మీటర్ లోపలకు వెళ్లి, బయటకు విద్యుత్ సరఫరా జరిగినప్పుడు మీటర్లో యూనిట్లు నమోదు అవుతాయి. విద్యుత్ మీటర్లో ఉండే ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ మీటర్లోకి వెళ్లడం, మీటర్ నుంచి వినియోగానికి బయటకు రావడం జరుగుతుంది. ఇదే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మీటర్‌లోని మదర్ బోర్డుకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా జరుగుతోంది. దీంతో విద్యుత్ రీడింగ్ నమోదవుతుంది. త్రీ ఫేజ్‌లో ఏ ఫేజ్‌లో విద్యుత్ అధికంగా వినియోగమవుతుందో మదర్ బోర్డుకు వెళ్లే ఆ ఫేజ్ వైర్‌ను కట్ చేస్తున్నారు. దీంతో మీటర్లో యూనిట్లు తక్కువగా నమోదు అవుతున్నాయి. మదర్ బోర్డుకు వెళ్లే ఫేజ్వైర్ను కట్ చేయడం వల్ల కరెంట్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదు. దీన్ని గుర్తించాలంటే మీటర్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తేనే సాధ్యమవుతుంది. గుర్తించారిలా.. ఎన్పీడీసీఎల్లోని విద్యుత్ సర్వీస్‌ల ప్రత్యేక విభాగం నిరంతరం తనిఖీలు చేస్తుంటుంది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం హనుమకొండ నయీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌ను తనిఖీ చేయగా ఈవిద్యుత్ చౌర్యం సంఘటన వెలుగు చూసింది. టాంగ్ టెస్టర్ ద్వారా మూడు ఫేజ్‌లు పరీక్షించగా.. ఒక ఫేజ్‌లో విద్యుత్ మదర్ బోర్డుకు చేరడం లేదని గుర్తించారు. ఈ క్రమంలో ఎన్పీడీసీఎల్ ఆపరేషన్, డీపీఏ విభాగం వారు గ్రూపులుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో హనుమకొండ అడ్వొకేట్స్ కాలనీలోని ప్రముఖ విద్యాసంస్థతోపాటు, హనుమకొండ చౌరస్తాలో బట్టల షాపు, అశోక హోటల్ సమీపంలోని బిర్యానీ సెంటర్‌తో పాటు మొత్తం 12 విద్యుత్ సర్వీసులు ఇదే విధంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతోపాటు వరంగల్‌లో ఒక్కరికే చెందిన రెండు బేకరీల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్యాంపరింగ్ చేస్తామని తిరుగుతున్న బృందాలు.. విద్యుత్ మీటర్ రీడింగ్ తగ్గిస్తామని ప్రత్యేకమైన నిపుణులు నగరం, పట్టణాల్లో తిరుగుతున్నారని విద్యుత్ అధికారులు తెలిపారు. రూ.10 వేలు ఇస్తే మీటర్ రీడింగ్ నమోదు కాకుండా చేస్తామని చెబుతున్నారని, ఇప్పటి వరకు విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారంతా డబ్బులు చెల్లించి ఆ ప్రత్యేక నిపుణులచే విద్యుత్ మీటర్ల టాంపరింగ్‌కు పాల్ప డినట్లు తెలుస్తోంది. విద్యుత్ విజిలెన్స్ విభాగం అధికారులు మీటర్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్న వారి కోసం శోధిస్తున్నారు. తనిఖీలు విస్తృతం చేశాం... అత్యంత చాకచక్యంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఇది నేరం. రూ.10 వేలు ఇస్తే యూనిట్లు తక్కువగా నమోదయ్యేలా మీటర్లో మార్పులు చేస్తామని కొందరు తిరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి వారిపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి విద్యుత్ చౌర్యానికి పాల్పడినా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం – జి.సాంబరెడ్డి, డీఈ, హనుమకొండ టౌన్ మీటర్‌ను పరిశీలిస్తున్న విద్యుత్ అధికారులు నాలుగు రోజుల్లో హనుమకొండ నగరంలో 1119 సర్వీస్‌లు తనిఖీ చేశారు. ఇందులో 12 సర్వీస్‌లు విద్యుత్ చౌర్యానికి పాల్పడినట్లు గుర్తించారు. ఆపరేషన్ విభాగానికి చెందిన 57, డీపీఈకి చెందిన 15 ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి.నగరంలో ఆధునిక సాంకేతికతతో విద్యుత్ చౌర్యంన్యూస్రీల్ తనిఖీల్లో గుర్తించి విస్తుపోతున్న ఎన్పీడీసీఎల్ అధికారులు ఇప్పటివరకు 12 కేసులు నమోదు దొంగతనం చేసేది త్రీ ఫేజ్ మీటర్ల వినియోగదారులే.. -
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
వరంగల్: మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీఓ) అసోసియేషన్ బాధ్యులు మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఆదివారం సెలవు ఉంటుందని.. కానీ, మహిళలకు సెలవు అనేది ఉండదన్నారు. కుటుంబ సభ్యుల క్షేమం, శాఖాపరమైన అభివృద్ధిలో భాగంగా మహిళ నిరంతరం శ్రమిస్తుందని పేర్కొన్నారు. ఒత్తిడి అనేది మహిళలకే కాదు పురుషుల్లో కూడా ఉంటుందని, వారికి కూడా వైద్యశిబిరం అవసరమని గుర్తు చేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని, మనకోసం మనం ఆలోచించినప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతామని తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. వాటిని అధిగమించాలంటే ప్రేరణ తరగతులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్ మోహ న్‌రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాంరెడ్డి, ఫణికుమార్, అనురాధ, నీరజ, డీఆర్ఓ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, డీర్డీఓ కౌసల్య, డీపీఓ కల్పన, ఉద్యోగ సంఘాల నాయకులు డాక్టర్ ప్రవీణ్‌కుమార్, రాజేశ్‌కుమార్, రాజకుమార్, రామ్‌కిషన్, వేణుగోపాల్, డాక్టర్ మౌనికరాజ్, డాక్టర్ షఫీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద కలెక్టరేట్లో వైద్య శిబిరం ప్రారంభం -
పైసలు రాలే!
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025– 8లోuదుగ్గొండి: రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గత సంవత్సరం నవంబర్ 6 నుంచి జిల్లాలోని 315 గ్రామాలు, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1.79 లక్షల కుటుంబాలను 1,200 మంది ఎన్యుమరేటర్లను, 119 మంది సూపర్వైజర్లు సర్వే చేశారు. ఒక్కో ఎన్యుమరేటర్ 150 ఇళ్లు సర్వే చేశారు. నవంబర్ 28 వరకు ఇంటింటి సర్వే పూర్తిచేసి డిసెంబర్ 10 వరకు 600 మంది ఆపరేటర్లు డేటా ఎంట్రీ పూర్తి చేశారు. మూడు నెలలుగా ఎదురుచూపులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా పనిచేసిన ఎన్యుమరేటర్లకు రూ.10 వేలు, సూపర్వైజర్లకు రూ.12 వేల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే చేసిన అనంతరం వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే డాటా ఎంట్రీ ఆపరేటర్లర్లకు ఒక్కో దరఖాస్తుకు రూ.30 చొప్పున చెల్లించాల్సి ఉంది. సర్వే పూర్తి మూడు నెలలు దాటినా ఒక్కపైసా రాలేదని, తాము నిద్రాహారాలు మాని పనిచేశామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేసిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, ఆపరేటర్లకు మొత్తం రూ.1,79,98,000 చెల్లించాల్సి ఉంది. సర్వే కోసం రూ.168 కోట్లు విడుదల చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెప్పి రెండు నెలలు దాటినా నేటికి అడుగు ముందుకు పడలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సర్వే వేతనాలు విడుదల చేయాలని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కోరుతున్నారు. న్యూస్రీల్ఈఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు జటబోయిన శివ. దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన ఇతడు సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తులను ఆన్లైన్ చేయడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా నియమితులయ్యాడు. దరఖాస్తుకు రూ.30 చొప్పున వస్తాయని 10 రోజులపాటు నిద్రాహారాలు లేకుండా పనిచేశాడు. 692 దరఖాస్తుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేశాడు. ఇందుకు రూ.20,760 రావాల్సి ఉంది. డబ్బుల కోసం పలుమార్లు మండల కేంద్రానికి వెళ్లి ఎంపీడీఓను కలిశాడు. డబ్బులు రాలేదు.. వచ్చాక ఇస్తాం అని చెప్పడంతో ఇక లాభం లేదని అడగడం మానేశాడు. ఇది ఒక్క శివ పరిస్థితి కాదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా అందని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే వేతనాలు మూడు నెలలు గడిచినా విడుదల కాని నిధులు ఆందోళనలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లుజిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు.. కుటుంబాలు 1.79 లక్షలు సర్వే చేసింది 1,200 మంది ఎన్యుమరేటర్లు, 119 మంది సూపర్వైజర్లు డేటా ఎంట్రీ చేసింది 600 మంది ఆపరేటర్లు రావాల్సిన వేతనాలు రూ.1,79,98,000 -
ఇళ్ల జాబితాలో అవకతవకలుంటే చర్యలు
● పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి హన్మకొండ చౌరస్తా: ‘ఇది ప్రజా ప్రభుత్వం. పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లల్లో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవు’ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ కమిటీభ్యులతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ పథకం అమలులో లీడర్ అయినా.. కేడర్ అయినా పైసలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. -
రేపటి నుంచి పదో తరగతి ప్రీఫైనల్స్
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని టెన్త్ విద్యార్థులకు గురువారం నుంచి 15వ తేదీ వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు టైంటేబుల్ విడుదల చేశారు. జిల్లాలోని డీసీఈబీ (డిస్ట్రిక్ట్ పరీక్ష బోర్డు) నుంచి ఎంఈఓ కార్యాలయాలకు ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచుతారు. అక్కడి నుంచి హెచ్ఎంలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాగా.. హనుమకొండ జిల్లాలో టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షల్ని 12,010 మంది విద్యార్థులు రాయనున్నట్లు డీఈఓ వాసంతి, డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్ సోమవారం తెలిపారు. -
ఇంటర్ పరీక్షలకు 26 కేంద్రాలు
కాళోజీ సెంటర్: జిల్లాలో బుధవారం నుంచి నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పా ట్లు చేసినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఉదయం 9 నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ప్రథమ సంవత్సరం పరీక్షకు 4,967 మంది జనరల్ విద్యార్థులు, 848 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 26 కేంద్రాలను ఏర్పాటు చేసి, 26 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 26 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 8 మంది అదనపు సూపరింటెండెంట్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్, 260 మంది ఇన్విజిలేటర్లు, 52 మంది ఏఎన్ఎంలు, పోలీస్ సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. సందేహాలు ఉంటే విద్యార్థులు 897708164 హెల్ప్ డెస్క్ నంబర్‌కు ఫోన్‌చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 చట్టం అమలు వరంగల్ క్రైం: ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల పరిఽధిలో 163 బీఎన్ఎస్ చట్టం అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండడం, ర్యాలీలు, సభలు, ధర్నాలు, సమావేశాలు, ఊరేగింపులు చేయడం నిషేధమని పేర్కొన్నారు. పరీక్ష సమయాల్లో జిరా క్స్ సెంటర్లను మూసివేయాలని, ఎవరైనా ఉత్తర్వులు అత్రికమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ -
రేపటి నుంచి టెన్త్ ప్రీఫైనల్స్
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని టెన్త్ విద్యార్థులకు గురువారం నుంచి 15వ తేదీ వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు టైంటేబుల్ విడుదల చేశారు. జిల్లాలోని డీసీఈబీ (డిస్ట్రిక్ట్ పరీక్ష బోర్డు) నుంచి ఎంఈఓ కార్యాలయాలకు ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచుతారు. అక్కడి నుంచి హెచ్ఎంలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాగా.. జిల్లాలో 287 పాఠశాలల నుంచి 4,803 మంది బాలురు, 4,434 మంది బాలికలు పరీక్షలకు హాజరుకానున్నారు. ఐలోని మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు ఐనవోలు: ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కించారు. ఈఏడాది జనవరి 2025 నుంచి 44 రోజులకు గాను.. హుండీల్లో రూ. 42,64,669, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా.. రూ.1,35,94,297లు రాగా.. మొత్తం రూ.1,78,58,966 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. హుండీల్లో లభ్యమైన వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలోనే వేసి సీల్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. లెక్కింపులో కానిస్టేబుళ్లు పి.రమేశ్, శ్రీనివాస్, ప్రశాంత్, ఒగ్గు పూజారులు మజ్జిగ అశోక్, రాములు, మహబూబాబాద్ శ్రీలక్ష్మీవేంకటేశ్వర సేవా సమితి సభ్యులు, దేవాలయ అర్చక, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం డబ్బులు ఇవ్వాలని ఆందోళన
నల్లబెల్లి: మండల కేంద్రంలో ఐకేపీ కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను ఇవ్వాలని ఓ రైతు కుటుంబ సభ్యులు మదర్ థెరిస్సా మండల సమాఖ్య కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేశారు. వారి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గాజుల రాజేందర్ సన్నధాన్యం పండించాడు. 309 బస్తాలను కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టాడు. నిర్వాహకులు అడిగిన పత్రాలను అందించాడు. అయితే నిర్వాహకులు రైతు ఖాతాలో డబ్బులు జమ చేయకుండా తమ ఖాతాలో జమ చేసుకున్నారు. ధాన్యం డబ్బులు ఇవ్వాలని కోరడంతో నిర్వాహకులు కాలయాపన చేస్తూ దాటవేస్తున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతు కుటుంబ సభ్యులు సమాఖ్య కార్యాలయం గేటుకు తాళం వేసి ట్రాక్టర్ అడ్డుపెట్టి ఆందోళన చేశారు. డబ్బులు ఇచ్చే వరకు ఆందోళన విరమించేంది లేదని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న నర్సంపేట రూరల్ సీఐ సాయిరమణ, దుగ్గొండి ఎస్సై వెంకటేశ్వర్లు రైతు కుటుంబ సభ్యులతో చర్చించారు. నిర్వాహకులతో మాట్లాడి రూ.1.38 లక్షలు ఇప్పించారు. దీంతో వారు ఆందోళన విరమించారు. -
6 నుంచి కొమ్మాల బ్రహ్మోత్సవాలు
గీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 6 నుంచి 20 వరకు వైభవంగా జరుగనున్నాయి. జిల్లాలోనే ప్రత్యేకత సంతరించుకున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 8 గంటలకు అధ్యయనోత్సవంతో ప్రారంభం కానున్నాయి. 7న ఉదయం 5 గంటలకు సుప్రభాతం, బిందె తీర్థం పూజలు, 8న నిత్యనిధి, పరమపదోత్సవం, 9న ఉదయం 10 గంటలకు సూత్తందాది, శాత్తుమర, అంకురారోహణం, రక్షాబంధనం, దీక్షా వస్త్రాధారణ, అగ్నిప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచారి తెలిపారు. 10న రాత్రి భూదేవి, నీలాదేవితో స్వామి వారి కల్యాణం వైభవంగా జరుగనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎదుర్కోళ్లు, అశ్వవాహన సేవ ఉంటాయని తెలిపారు. 11 నుంచి 13 వరకు పలు పూజా కార్యక్రమాల అనంతరం 14న హోలీ పండుగ నుంచి జాతర ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. 18న స్వామివారి రథోత్సవం ఉంటుందని చెప్పారు. అమ్మవార్లతోపాటు స్వామి వారిని గుట్ట దిగువకు తీసుకెళ్లి ప్రత్యేక పూజల అనంతరం వారిని రథంపై కూర్చుండబెట్టి గుట్టచుట్టూ తిప్పే కార్యక్రమం ఉంటుందన్నారు. 19న స్వామివారిని విశ్వనాథపురానికి తీసుకెళ్లి పారువేట, శ్రీపుష్పయాగం, నాగవెల్లి నిర్వహిస్తామని వివరించారు. 20వ తేదీన స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని, జాతర ఉగాది పర్వదినం వరకు కొనసాగుతుందన్నారు. 10న లక్ష్మీనర్సింహస్వామివారి కల్యాణం 14న జాతర ప్రారంభం 20న ముగియనున్న ఉత్సవాలు -
పోలీస్ జాగిలాల పాత్ర కీలకం: సీపీ
వరంగల్ క్రైం: నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు నూతనంగా వచ్చిన పోలీస్ జాగిలాలను సీపీ మంగళవారం పరిశీలించారు. గత నెలలో మొయినాబాద్‌లోని పోలీస్ జాగిలాల శిక్షణ కేంద్రంలో శిక్షణను పూర్తి చేసుకుని వచ్చిన ఐదు పోలీస్ జాగిలాలు వరంగల్ కమిషనరేట్ పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో చేరి విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాయి. పేలుడు పదార్థాలను పసిగట్టే ఈ ఐదు జాగిలాల్లో మూడు బెల్జియన్ మాలినోస్, రెండు గోల్డెన్ రీట్రీవర్ జాతులకు చెందినవి ఉన్నాయి. నూతనంగా వచ్చిన ఈ జాగిలాలను సంబంధించిన పూర్తి వివరాలను సీపీకి హ్యాండ్లర్లు వివరించారు. జాగిలాలకు మెరుగైన వసతి కల్పించాలని సీపీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేశ్‌కుమార్, ఆర్ఐ శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జ్, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, హ్యాండ్లర్లు రాజేశ్‌కుమార్, వెంకన్న, సురేశ్, దిలీప్ పాల్గొన్నారు. -
‘నీట్’కు కేంద్రాలను గుర్తించాలి
వరంగల్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)–2025 నిర్వహణకు జిల్లాలో పరీక్ష కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మే 4న జరిగే నీట్‌కు, కేంద్రాల ఎంపిక, కనీస సౌకర్యాల కల్పనపై మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని సుమారు 6,300 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయనున్నారని, ఇందుకోసం 20 గదుల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు/కళాశాలలను గుర్తించాలని సూచించారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు అనువుగా ఉండే ఫర్నిచర్, వెంటిలేషన్, తాగునీరు, సీసీ టీవీల పర్యవేక్షణ, దివ్యాంగులకు సౌకర్యవంతంగా ఉండే వాటిని పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీ రవీందర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఈఓ జ్ఞానేశ్వర్, పరీక్షల కోఆర్డినేటర్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
సీఐ రంజిత్రావుకు నగదు పురస్కారం
మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగిలి శ్రీపాల్‌రెడ్డి గెలుపుసాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. నర్సిరెడ్డి ఎలిమినేట్ కాకముందు గెలుపు కోటా ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి కూడా లేవు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. శ్రీపాల్‌రెడ్డికి వచ్చిన 2,870 రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపారు. చివరికి శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించారు. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బందిఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నల్లగొండ ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో సోమవారం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బండిల్స్ కట్టడం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 3 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో అధికారులు మొత్తం చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక్క ఓటును గెలుపు కోటాగా నిర్ణయించారు. మొత్తం 24,135 ఓట్లు పోలవగా 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటాను 11,821గా నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్‌రెడ్డికి అత్యధికంగా 6,035 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు సరిపడా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. చివరికి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠే.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. 15వ రౌండ్ నుంచి ఉత్కంఠ మరింతగా పెరిగింది. శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నా ద్వితీయ స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డికి చేరువలో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి రాగలిగినా సుందర్రాజు ఎలిమినేషన్‌తో ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ తరువాత పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డిలను ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోవడంతో చివరకు అలుగుబెల్లి నర్సిరెడ్డిని కూడా ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత శ్రీపాల్‌రెడ్డిని గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్లో ఓట్లు పెరిగాయి ఇలా... మొదటి ప్రాధాన్యతలో ప్రధాన అభ్యర్థులైన పింగిలి శ్రీపాల్‌రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డికి 4,437 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పూల రవీందర్‌కు 3,115, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289, సుందర్రాజుకు 2,040 ఓట్లు మాత్రమే వచ్చాయి. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఇలా 14వ రౌండ్ వరకు ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు చేయగా శ్రీపాల్‌రెడ్డికి అప్పటివరకు 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు వచ్చాయి. అంటే.. 14వ రౌండ్‌వరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులనుంచి మరో 130 రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి లభించాయి. ఈ రౌండ్ తరువాత సుందర్రాజును ఎలిమినేట్ చేసి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ● 15వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి ఒక్కసారే 781 ఓట్లు పెరిగాయి. దీంతో ఆయన ఓట్లు 6,916కి చేరుకున్నాయి. రెండోస్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా 5,205 ఓట్లకు చేరుకున్నారు. హర్షవర్ధన్‌రెడ్డి 4,799 ఓట్లకు చేరుకోగా, పూల రవీందర్ 3,617 ఓట్లకు, సరోత్తంరెడ్డి 2,645 ఓట్లకు చేరుకున్నారు. ఈ రౌండ్లో అయిదుగురికి ఓట్లు పెరిగినప్పటికీ శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ఆయన దరిదాపుల్లో మిగతా అభ్యర్థులు ఎవరూ లేరు. ● పులి సరోత్తంరెడ్డి ఎలిమినేషన్ తరువాత చేపట్టిన 16వ రౌండ్లోనూ శ్రీపాల్‌రెడ్డికి అదే స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో 757 ఓట్లు పెరిగాయి. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి, 5,660 ఓట్లకు చేరుకోగా, హర్షవర్ధన్‌రెడ్డి 5,309 ఓట్లకు, పూల రవీందర్ 3,992 ఓట్లకు చేరుకున్నారు. ● పూల రవీందర్ ఎలిమినేషన్ తరువాత 17వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 1,348 ఓట్లు పెరిగి, 9,021 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 6,448 ఓట్లకి చేరుకోగా, మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి 6,034 ఓట్లకు చేరుకున్నారు. ● హర్షవర్ధన్‌రెడ్డి ఎలిమినేషన్ తరువాత 18వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 2,078 ఓట్లు పెరిగి, 11,099 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 8,448 ఓట్లకు చేరుకున్నారు. బరిలో శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి మాత్రమే మిగిలారు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో వచ్చిన 2,870 ఓట్లు కలుపుకొని శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు.న్యూస్‌రీల్ రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీ 19మంది బరిలో ఉన్నా ఐదుగురి మధ్యనే సాగిన పోటీ అభ్యర్థుల ఎలిమినేషన్ సమయంలో పెరిగిన ఉత్కంఠ -
మరింత చేరువగా ఆరోగ్య సేవలు
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: కలెక్టరేట్ ఐడీఓసీ భవనంలోకి వైద్య ఆరోగ్య కార్యాలయం ఉండడం ద్వారా ప్రజలకు మరింత చేరువగా వైద్య ఆరోగ్య శాఖ సేవలు అందనున్నాయని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లోకి మార్చిన వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సోమవారం కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో వివిధ విభాగాలను పరిశీ లించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయకుమార్, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహనరావు, పీఓడీటీసీ కె.లలితాదేవి, హిమబిందు పాల్గొన్నారు. ఈజీఎస్ పనులు త్వరగా పూర్తి చేయండి జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా మండలాల్లో చేపట్టిన నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఈజీఎస్, పంచాయతీరాజ్ శాఖ అధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతి, నిర్దేశిత లక్ష్యాల గడువుపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈజీఎస్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ శంకరయ్య, డీఈ శ్రీనివాసరావు, ఎంపీడీఓలు, పీఆర్ ఏఈలు, తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
విద్యారణ్యపురి: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 5 నుంచి ఫస్టియర్, 6వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్, జనరల్, ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 39,980 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 7, టీఎస్ రెసిడెన్షియల్ జూనియర్‌కళాశాల 1, టీఎస్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు 2, మోడల్ స్కూళ్లు 3, ప్రైవేట్ అండ్ అన్ ఎయిడెడ్ కళాశాలలు 42 మొత్తం 55 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 55 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 55 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల పరీక్ష కేంద్రాలకు 42 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. ఇన్విజిలేటర్లను 1,050 మందిని నియమించారు. సెల్ఫ్ సెంటర్లు లేవు. సమస్యాత్మక కేంద్రాలు కూడా లేవు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. పకడ్బందీగా నిర్వహించేందుకు.. పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్రాన్ని బట్టి 3 నుంచి 5 వరకు సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఆయా కెమెరాలు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లుంటే పరీక్షల సమయంలో వాటిని మూసేస్తారు. పోలీస్‌బందోబస్తు కొనసాగనుంది. ముందుగానే చేరుకోవాలి.. ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం లేటయినా.. అనుమతించరు. ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల్ని అనుమతించరు. విద్యార్థులు ఆన్లైన్ నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్నా.. ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తారు. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవి.. హనుమకొండ జిల్లాలో పరీక్షలకు సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా.. విద్యార్థులు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. చంద్రమౌళి, సూపరింటిండెంట్ 9491559360, పి.సుచిరిత, సీనియర్ అసిస్టెంట్ 9966440775, వికాస్, జూనియర్ అసిస్టెంట్ 9502743435లో సంప్రదించవచ్చు. వరంగల్ జిల్లాలో.. కాళోజీ సెంటర్: ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ విద్యాశాఖ వరంగల్ జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి 12,321 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు, వీరికి 26 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేసినట్లు వివరించారు. జిల్లాలోని 26 పరీక్ష కేంద్రాల్లో 26 మంది ఛీఫ్ సూపరింటెండెంట్లు, 26 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 8 మంది అదనపు సూపరింటెండెంట్లు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్, నలుగురు సిట్టింగ్ స్క్వాడ్లు, 260 మంది ఇన్విజిలేటర్లు, 52 మంది ఏన్‌ఎంలు, పోలీస్ శాఖ సిబ్బందిని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఏవైనా సందేహాలున్నా.. 92402 05555 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు. పకడ్బందీగా ఏర్పాట్లు.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. మూడు టీంలు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నాలుగు బృందాల సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాం. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణకు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ ఉంటుంది. డీఐఈఓ కన్వీనర్‌గా, ఇద్దరు ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉంటారు. హైపవర్ కమిటీ కూడా ఉంటుంది. కలెక్టర్ చైర్మన్‌గానూ, పోలీస్ కమిషనర్, ఇంటర్ విద్య ఆర్జేడీ డెక్, డీఐఈఓ, సీనియర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లు ఇద్దరు సభ్యులుగా ఉంటారు. విద్యార్థులు ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా చర్యలు తప్పవు. – ఎ.గోపాల్, డీఐఈఓ రేపటి నుంచి ఎగ్జామ్స్ షురూ హనుమకొండ జిల్లాలో 39,980 మంది వరంగల్ జిల్లాలో 12,321 విద్యార్థులు కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా నిమిషం నిబంధన, 144 సెక్షన్ అమలుహనుమకొండ జిల్లాలో ఇలా.. ఫస్టియర్ జనరల్ : 18,397 ఒకేషనల్ : 1,146 సెకండియర్ జనరల్: 19,480 ఒకేషనల్ : 957 మొత్తం విద్యార్థులు : 20,437 వరంగల్ జిల్లాలో..ఫస్టియర్ జనరల్ : 4,967 ఒకేషనల్ : 848 సెకండియర్ జనరల్: 5,739 ఒకేషనల్ : 767 మొత్తం : 12,321 -
9న జిల్లా స్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: ఈనెల 9న హనుమకొండ జిల్లా స్థాయి చదరంగ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమల్‌కింగ్ చెస్ అకాడమీ చైర్మన్ జి.రాంప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–7, 9, 11, 13, 15 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయని తెలిపారు. విజేతలకు నగదు పురస్కారం, ట్రోఫీలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ హంటర్‌రోడ్‌లోని న్యూసైన్స్ డిగ్రీ కళాశాల ఆవరణలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకునేందుకు 96760 56744 మొబైల్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. భవిత కేంద్రం తనిఖీ..విద్యారణ్యపురి: హనుమకొండ మండలంలోని ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు సంబంధించిన భవిత కేంద్రాన్ని సోమవారం డీఈఓ డి.వాసంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల సర్వేను పూర్తి చేసి విద్యార్థుల అవసరాలను గుర్తించి నమోదు చేయాలని సమ్మిళిత ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో డీఈఓ వెంట సమ్మిళిత విద్య జిల్లా కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, ఎంఈఓ నెహ్రూ, సమ్మిళిత ఉపాధ్యాయురాలు రజనీ తదితరులు పాల్గొన్నారు. పంచేంద్రియాల్లో ముఖ్యమైనవి చెవులు హన్మకొండ: పంచేంద్రియాల్లో చెవులు ముఖ్య మైనవని హనుమకొండ వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య అన్నారు. సోమవారం హనుమకొండ సమ్మయ్యనగర్‌లోని లష్కర్‌సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. చెవి, వినికిడి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. చెవి ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు అశ్రద్ధ వహించకుండా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. సమావేశంలో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి అహ్మద్, లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హైదర్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, సోషల్ వర్కర్ నరేశ్, హెచ్ఈఓ శ్రీనివాస్‌రెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు బాబు, శ్రీనివాస్, ఏఎన్ఎంలు ఆశవర్కర్లు పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్లో ఉచిత వైద్యశిబిరం వరంగల్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసో సియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా నేడు (మంగళవారం) ఉదయం 10గంటలకు ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి ఫణికుమార్, మహిళా విభాగం ప్రతినిధులు అనురాధ, నీరజ సోమవారం తెలిపారు. ఈ ఉచిత వైద్యశిబిరంలో వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన మహిళా అధికారులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే మహిళా దినోత్సవ వేడుకలు ఈనెల 7న నిర్వహించనున్నట్లు తెలిపారు. టెండర్ల గడువు పొడిగింపు వరంగల్: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పత్రాల ముద్రణకు నిర్వహిస్తున్న టెండర్ గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు జెడ్పీ సీఈఓ జి.రాంరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ కార్యాలయంలో స్టేషనరీ, పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ పత్రాల ముద్రణకు ఆధీకృత డీలర్ల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. -
ఆర్ఆర్ఆర్ సదస్సులో మేయర్, కమిషనర్
వరంగల్ అర్బన్: రాజస్తాన్ రాష్ట్రం జైపూర్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో సోమవారం మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బల్దియా వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెడ్యూస్, రీయూస్, రీసైక్లింగ్ (ఆర్ఆర్ఆర్) విధానాల్ని నిర్వహిస్తున్న తీరుపై మేయర్ వివరించారు. ‘యూఎల్ బీ లో 3–ఆర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్క్యూలర్ ఎకానమీ’ అంశంపై కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ శ్రీనివాస్ విద్యారణ్యపురి: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచాలని హనుమకొండ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్ కోరారు. జిల్లాలో 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా నియమితులైన ఎస్జీటీలకు హనుమకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మూడురోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం సోమవారం సాయంత్రం ముగిసింది. ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాఠ్యపుస్తకాల వినియోగం, తరగతి గదిలో బోధనకు సంబంధించి అభ్యసన సామర్థ్యాల, పాఠ్య ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక సమ్మెటివ్ మూల్యాంకనం, డిజిటల్ కంటెంట్‌ను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలని సూచించారు. సమావేశంలో రిసోర్స్ ఉపాధ్యాయులు పి.చంద్రయ్య, శ్రీపాల్‌రెడ్డి, శ్యాంసుందర్, పున్నం చందర్, డీఎల్‌ఎంటీ రఘు తదితరులు పాల్గొన్నారు. -
ఎండలకు జాగ్రత్త
● జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను ఐనవోలు: ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం 8 గంటల్లోపే పనిలోకి రావాలని, జాగ్రత్తగా పనులు చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) మేన శ్రీను సూచించారు. సోమవారం మండలంలోని పంథిని, పున్నేలు, ఐనవోలు గ్రామాల్లో ఉపాధి పనులను డీఆర్డీఓ పర్యవేక్షించారు. పంథినిలో రోడ్డు పని, పున్నేలు, ఐనవోలులో జరుగుతున్న ఫారం పాండ్, నర్సరీ పనులను ఆయన పరిశీలించారు. కూలీలతో మాట్లాడుతూ.. ప్రతీరోజు రూ.300 వేతనం వచ్చేలా కొలతల ప్రకారం పని చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో కనీసం 50 మంది కూలీలతో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. టార్గెట్ ప్రకారం కాకుండా తక్కువ లేబర్‌తో పని చేయించే ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీఓ నక్క కుమారస్వామి, ఈసీ ప్రదీప్, టీఏలు నీరజ, రమేశ్, కార్యదర్శులు అశోక్, మాలతి, ఎఫ్‌ఏలు రాజు, ఎలేంద్ర, జ్యోతిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఆర్ఆర్ సదస్సులో మేయర్, కమిషనర్
వరంగల్ అర్బన్: రాజస్తాన్ రాష్ట్రం జైపూర్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో సోమవారం మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాక డే, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నా రు. గ్రేటర్ నగర మేయర్ గుండు సుధారాణి బల్ది యా వ్యాప్తంగా నిర్వహిస్తున్న విధానాలైన రెడ్యూస్, రీయూస్, రీసైక్లింగ్ (ఆర్ఆర్ఆర్) విధానాల్ని నిర్వహిస్తున్న తీరు ఇప్పటి వరకు అమలు చేసిన పద్ధతుల్ని వివరించారు. ‘యూఎల్ బీ లో 3–ఆర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్క్యూలర్ ఎకానమీ’ అంశంపై జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
పీఏసీఎస్‌లకు ప్రత్యేక అధికారులు
నర్సంపేట: జిల్లాలోని నర్సంపేట డివిజన్లోని పలు సొసైటీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జిల్లా కోఆపరేటివ్ అధికారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నర్సంపేట డివిజన్లో 13 సొసైటీలు ఉండగా ఇందులో చెన్నారావుపేట సొసైటీకి ప్రత్యేక అధి కారిగా వెంకటేశ్వర్లు, నెక్కొండ పీఏసీఎస్‌కు కీర్యానాయక్, ఖానాపురం పీఏసీఎస్‌కు రవికిరణ్, దుగ్గొండి మండలం నాచినపల్లికి విజయ్‌భాస్కర్‌రెడ్డి, నల్లబెల్లి పీఏసీఎస్‌కు రాజును ప్రత్యేక అధికారులుగా నియమించారు. అయితే డివిజన్లో ఆరు మండలాల్లో 13 పీఏసీఎస్ సొసైటీలు ఉండగా కేవలం ఐదు సొసైటీలకు మాత్రమే ప్రత్యేక అధికారులను నియమించడంతో పలువురు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు, రైతుల పేరిట అక్రమ రుణాలు పొందారని ఆరోపణలు రావడంతోనే ప్రత్యేక అధికారులను నియమించారని పలువులు చర్చించుకుంటున్నారు. ఈ సొసైటీలకు ప్రత్యేక అధికారులను కేటాయిస్తే మిగతా ఎనిమిది సొసైటీల పరిస్థితి ఎలా ఉంటుందోనని అంటున్నారు. మరో ఆరు నెలలు పాలకవర్గాలు పాలించేనా లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా? అని డివిజన్ రైతులు వాపోతున్నారు. -
వరంగల్
మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 202550 రోజులు..48 బ్రేక్ డౌన్లు సాంకేతిక సమస్యలు, డ్రైవర్ల అనుభవ రాహిత్యంతో ఎలక్ట్రిక్ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. సుమారు 50 రోజుల్లో 48 బ్రేక్ డౌన్లు అయ్యాయి. – 8లోuసాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. నర్సిరెడ్డి ఎలిమినేట్ కాకముందు గెలుపు కోటా ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి కూడా లేవు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. శ్రీపాల్‌రెడ్డికి వచ్చిన 2,870 రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపారు. చివరికి శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించారు. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బందిఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నల్లగొండ ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో సోమవారం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బండిల్స్ కట్టడం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 3 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో అధికారులు మొత్తం చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక్క ఓటును గెలుపు కోటాగా నిర్ణయించారు. మొత్తం 24,135 ఓట్లు పోలవగా 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటాను 11,821గా నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్‌రెడ్డికి అత్యధికంగా 6,035 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు సరిపడా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. చివరికి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠే.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. 15వ రౌండ్ నుంచి ఉత్కంఠ మరింతగా పెరిగింది. శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నా ద్వితీయ స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డికి చేరువలో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి రాగలిగినా సుందర్రాజు ఎలిమినేషన్‌తో ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ తరువాత పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డిలను ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోవడంతో చివరకు అలుగుబెల్లి నర్సిరెడ్డిని కూడా ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత శ్రీపాల్‌రెడ్డిని గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్లో ఓట్లు పెరిగాయి ఇలా... మొదటి ప్రాధాన్యతలో ప్రధాన అభ్యర్థులైన పింగిలి శ్రీపాల్‌రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డికి 4,437 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పూల రవీందర్‌కు 3,115, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289, సుందర్రాజుకు 2,040 ఓట్లు మాత్రమే వచ్చాయి. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఇలా 14వ రౌండ్ వరకు ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు చేయగా శ్రీపాల్‌రెడ్డికి అప్పటివరకు 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు వచ్చాయి. అంటే.. 14వ రౌండ్‌వరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులనుంచి మరో 130 రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి లభించాయి. ఈ రౌండ్ తరువాత సుందర్రాజును ఎలిమినేట్ చేసి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ● 15వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి ఒక్కసారే 781 ఓట్లు పెరిగాయి. దీంతో ఆయన ఓట్లు 6,916కి చేరుకున్నాయి. రెండోస్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా 5,205 ఓట్లకు చేరుకున్నారు. హర్షవర్ధన్‌రెడ్డి 4,799 ఓట్లకు చేరుకోగా, పూల రవీందర్ 3,617 ఓట్లకు, సరోత్తంరెడ్డి 2,645 ఓట్లకు చేరుకున్నారు. ఈ రౌండ్లో అయిదుగురికి ఓట్లు పెరిగినప్పటికీ శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ఆయన దరిదాపుల్లో మిగతా అభ్యర్థులు ఎవరూ లేరు. ● పులి సరోత్తంరెడ్డి ఎలిమినేషన్ తరువాత చేపట్టిన 16వ రౌండ్లోనూ శ్రీపాల్‌రెడ్డికి అదే స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో 757 ఓట్లు పెరిగాయి. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి, 5,660 ఓట్లకు చేరుకోగా, హర్షవర్ధన్‌రెడ్డి 5,309 ఓట్లకు, పూల రవీందర్ 3,992 ఓట్లకు చేరుకున్నారు. ● పూల రవీందర్ ఎలిమినేషన్ తరువాత 17వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 1,348 ఓట్లు పెరిగి, 9,021 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 6,448 ఓట్లకి చేరుకోగా, మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి 6,034 ఓట్లకు చేరుకున్నారు. ● హర్షవర్ధన్‌రెడ్డి ఎలిమినేషన్ తరువాత 18వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 2,078 ఓట్లు పెరిగి, 11,099 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 8,448 ఓట్లకు చేరుకున్నారు. బరిలో శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి మాత్రమే మిగిలారు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో వచ్చిన 2,870 ఓట్లు కలుపుకొని శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు.న్యూస్రీల్ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగిలి శ్రీపాల్‌రెడ్డి గెలుపు రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీ 19మంది బరిలో ఉన్నా ఐదుగురి మధ్యనే సాగిన పోటీ అభ్యర్థుల ఎలిమినేషన్ సమయంలో పెరిగిన ఉత్కంఠ -
విద్యుత్ సరఫరాలో ఆటంకం కలగొద్దు
వరంగల్: యాసంగి పంటల సంరక్షణకు రాబోయే 10రోజులు అప్రమత్తంగా ఉండి ఎత్తిపోతల పథకా లకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. సో మవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో సీఎస్ వివిధ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. యాసంగి పంటలకు సాగునీటి సరఫరా, గురుకులాల్లో రెగ్యూలర్‌గా తనిఖీలు తదితర అంశాలపై మాట్లాడారు. యాసంగి పంటలకు రిజర్వాయర్ల నుంచి విడుదల చేసిన ప్రతీచుక్కను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. గురుకులాల్లో తనిఖీ చేసి విద్యార్థులకు నా ణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే 10 రోజుల పాటు అప్రమత్తంగా ఉంటూ నీటి సరఫరా పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, హార్టికల్చర్ అధికారి సంగీతలక్ష్మి, నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు -
ప్రీ ఫైనల్ పరీక్షలు ఉదయం వేళల్లో నిర్వహించాలి
నర్సంపేట: టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలను ఉదయం వేళల్లోనే నిర్వహించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా విద్యాశాఖాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడారు. వేసవి నేపథ్యంలో మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 వరకు పరీక్ష సమయం నిర్ణయిస్తూ విద్యాశాఖ సర్క్యూలర్ విడుదల చేయడాన్ని ఖండించారు. రంజాన్ మాసానికి పరీక్షలతో ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తా రు.తక్షణమే పరీక్షల వేళలు మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి రాకం రాకేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బో ల్ల అజయ్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి రైతుల గోడు పట్టదా?
పర్వతగిరి: రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోడు పట్టదా? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం మండలంలోని రావూరు గ్రామంలో ఎండిన వరి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆకేరు వాగు చెక్‌డ్యాం ఎప్పటికీ నీటితో కళకళలాడుతుండేదన్నారు. ఈ చెక్‌డ్యాం మీద కొత్తపల్లి, ల్యాబర్తి, బంధనపల్లి, కొత్తూరు, రోళ్లకల్, రావూరు, పర్వతగిరి, కల్లెడ, అన్నారం, సోమారం, జామస్థాన్పురం, మడిపల్లి, గుర్తూరు గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయం చేస్తూ సుమారు వెయ్యి ఎకరాల పైచిలుకు పంట సాగు చేసుకునేవారన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ కమలాపంతులు, మాజీ సర్పంచ్‌లు బండి సంతోష్, ఆమడగాని రాజుయాదవ్, విజయ్, మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు, ఆమ్లానాయక్, నరేష్, లక్ష్మినారాయణ, గడ్డి యాకయ్య, చింతల శ్రీనివాస్, బూర శ్యామ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
● జిల్లాలో 26 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ● హాజరు కానున్న 12,321 మంది విద్యార్థులు ● ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకాళోజీ సెంటర్: ఈనెల 5 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని, ఏమైన సందేశాల నివృత్తికి 9240205555 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 12,321 మంది పరీక్షలకు హాజరుకానున్నారని, వీరికి 26 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 4,967 మంది, ఒకేషనల్ 848 మంది మొత్తం 5,815 విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,739 మంది, ఒకేషనల్ 767 మంది మొత్తం 6,506 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. వార్షిక పరీక్షల దృష్ట్యా ప్రతీ సెంటర్లో సీసీ కెమెరాలు అమర్చినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు 26 పరీక్ష కేంద్రాలకు 26 సీఎస్‌లు, 26 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, 8 మంది అదనపు సూపరింటెండెంట్స్, 3 ఫ్లైయింగ్ స్వ్కాడ్, 4 సిట్టింగ్ స్వ్కాడ్, 260 మంది ఇన్విజిలేటర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్నిశాఖల అధికారులు సహకరించాలన్నారు. -
దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
వరంగల్: ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అ న్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణిలు ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరి ష్కరించాలని, పరిష్కరించలేని దరఖాస్తులను ఎందుకు పరిష్కరించలేదో దరఖాస్తుదారుడికి తెలియజేయాలన్నారు. గ్రీవెన్స్‌లో భూ సంబంధిత సమస్యలు 23, కలెక్టరేట్ సూపరింటెండెంట్ 15, జిల్లా వ్యవసాయశాఖ 11,జీడబ్ల్యూఎం 2,డీసీఎస్ఓ 5 (మొత్తం 88) దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి,ఉమారాణి,డీ ఆ ర్డీఓ కౌసల్యదేవి,జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి,జిల్లా వ్య వసాయశాఖ అధికారి అనురాధ,డీసీఓ నీరజ, డీపీ ఓ కల్పన,డీఎంఓ సురేఖ,అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రజావాణిలో 88 వినతులు -
అర్ధ శతాబ్దపు జ్ఞాపకాలు
నల్లబెల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదు దశాబ్దాల తర్వాత పూర్వ విద్యార్థులు సందడి చేశారు. 1974–75 సంవత్సరంలో ఏడో తరగతి చదివిన వారంతా ఒక్కచోట కలిశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించి గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మొత్తం 32 మంది విద్యార్థులకు 22 మంది విద్యార్థులు హాజరుకాగా నలుగురు అనారోగ్యంతో రాలేకపోయారు. మిగిలిన ఆరుగురు మరణించారు. సమావేశమైన విద్యార్థులు మొదట సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. పాఠశాలలో అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గురువు జమ్ములపుడి రంగారెడ్డికి విద్యార్థులు పాదపూజ చేసి సన్మానించారు. చిరునామాలు, ఫోన్ నంబర్లను తీసుకున్నారు. పూర్వ విద్యార్థిని మంతెన ప్రమీద స్నేహితులకు పుష్పగుచ్ఛాలు, బహుమతులు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. నల్లబెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు సందడి చేసిన 1974–75 సంవత్సరం బ్యాచ్ ఏడో తరగతి విద్యార్థులు -
ఎత్తిపోతలు.. ఎప్పటికో..!
సాక్షిప్రతినిధి, వరంగల్: ...ఏడాదిలో 300 రోజులు 60 టీఎంసీల నీటిని వినియోగించుకుని తొమ్మిది జిల్లాల్లో 5.57 లక్షల ఎకరాలకు నీరందించే జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం.. ఇరవయ్యేళ్లయినా అసంపూర్తిగానే ఉంది. మూడో దశలో భూసేకరణ చేపట్టని కారణంగా సుమారు ఆరేళ్లుగా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టు 91 శాతం వరకు పూర్తయినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతుండగా.. కీలకమైన 9 శాతం పనులు పూర్తి చేయడానికి భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఉన్నతాధికారులు 2024 ఆగస్టులో ప్రాజెక్టును పరిశీలించారు. సమీక్ష నిర్వహించి వెంటనే భూసేకరణ చేపట్టి పూర్తి చేస్తామని ప్రకటించినా.. ఆదిశగా అడుగులు పడలేదు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2004లో శ్రీకారం చుట్టింది. తొమ్మిది జిల్లాల్లో సుమారు 5.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఎక్సర్సైజ్ మూడోదశను దాటించలేకపోతున్నది. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలతోపాటు కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల పరిధి 37 మండలాలకు చెందిన 5,56,722 ఎకరాలకు నీరందించడం లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 3,16,634 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో 2,40,088 ఎకరాల ఆయకట్టుకు నీరందాల్సి ఉంది. భూసేకరణే సమస్య.. ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి రైతులు ఎక్కువ పరిహారం డిమాండ్ చేయడం, కోర్టు కేసులు వంటివి అడ్డంకిగా మారాయి. ఫలితంగా ప్రాజెక్టు అంచనా వ్యయం విపరీతంగా పెరుగుతోంది. మొత్తం 33,224 ఎకరాలకు 30,268 ఎకరాలు సేకరించగా.. జనగామ నియోజకవర్గంలో 945 ఎకరాలు, పాలకుర్తిలో 826, గజ్వేల్‌లో 230, నర్సంపేటలో 131, వర్ధన్నపేటలో 168 ఎకరాలు.. ఇలా 2,957 ఎకరాల సేకరణ జరగాల్సి ఉంది. పెరిగిన అంచనా వ్యయం 2004లో రూ.6,016 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్ నాటికే రూ.14,729.98 కోట్లకు పెరిగింది. మూడు దశల్లో 16 ప్యాకేజీల్లో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.14,188 కోట్లు ఖర్చయినట్లు అధికారులు వెల్లడించారు. 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత భూసేకరణతో పాటు ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరోసారి అంచనాలు పెంచి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. అయితే ఈమేరకు అధికారులు రూ.17,500 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచడం.. లేదంటే రైతులను ఒప్పించడం.. ఏదో ఒకటి జరిగితేనే భూసేకరణ ముందుకు సాగి.. ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. ‘దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చిలోపు వందశాతం పూర్తి చేసి.. అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్ఓసీ కోసం ఛత్తీస్‌గఢ్ సర్కారును ఒప్పిస్తాం. ధరలు పెరగడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణకు ఇబ్బందిగా మారింది. అయినా వెంటనే చేపట్టి దేవాదుల పూర్తి చేస్తాం.’ – 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలివి.●ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలి.. దేవాదుల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. ఇరవయ్యేళ్లవుతున్నా అసంపూర్తి ప్రాజెక్టుగానే ఉంటున్నది. అలాగే రెండువేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే నక్కలతూముకు కాల్వలు నిర్మించి నీటిని సరఫరా చేయాలి. – బొడ్డు ప్రతాప్, రైతు, ధర్మసాగర్ భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది.. ప్రభుత్వ మార్గదర్శకాలు, కలెక్టర్ ఆదేశాల మేరకు భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. జనగామ జిల్లాలో 200 మంది రైతులకు టోకెన్లు ఇచ్చాం. మిగతా ప్రాంతాలు, గ్రామాల్లోనూ మాట్లాడుతున్నాం. 2026 మార్చి నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా రైతులను సంప్రదించి భూసేకరణ చేస్తున్నారు. – సుధాకర్, ఎస్ఈ, దేవాదుల ప్రాజెక్టుదేవాదుల మూడో దశకు భూసేకరణే అసలు సమస్య ఇరవయ్యేళ్లయినా అసంపూర్తిగానే ప్రాజెక్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రుల పర్యటన హామీలు, ఆదేశాలు.. అయినా పూర్తికాని భూసేకరణ రూ.6వేల కోట్ల నుంచి రూ.17,500 కోట్లు.. పెరిగిన అంచనా వ్యయం -
నేడు కంఠమహేశ్వర స్వామి కల్యాణోత్సవం
గీసుకొండ: మండలంలోని ఎలుకుర్తిహవేలి గ్రామంలో కంఠమహేశ్వరస్వామి–సురమాంబాదేవి కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండో రోజు ఆదివారం గౌడకుల దీక్షాస్వాములు, మహిళలు బిందెలతో నీటిని తీసుకుని ఆలయానికి చేరుకుని జలాభిషేకం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, నవగ్రహ, వాస్తు పూజ, గండుదీపం, గణపతి హోమం అనంతరం సురమాంబాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రాత్రి భక్తి సురమాంబాదేవి నాటకాన్ని ప్రదర్శించారు. సోమవారం బోనాలతో తరలివెళ్లి ఆలయం వద్ద స్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తామని పూజారులు ఏరుకొండ శ్రీనివాస్, యెలగంగూరి రఘువర్మ తెలిపారు. మంగళవారం ఎల్లమ్మ, మైసమ్మ తల్లులు, మోకు ముస్తాదు, కులవృక్ష పూజలు, గావుపట్టి బలిహరణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల్లో మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, కుల సంఘం పెద్దలు బొడిగె శోభన్, సదానందం, భీమగాని రాంచందర్, యాదగిరి, గోసుగొండ జంగయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు ఘన నివాళి వరంగల్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆదివారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద.. మాజీ స్పీకర్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంట్లో సామగ్రి ధ్వంసం ● ఐదుగురిపై కేసు నమోదు ● ప్రేమ వివాహంతో దాడులు, ప్రతిదాడులు సంగెం: ప్రేమ వివాహం విషయంలో దాడులు, ప్రతిదాడులతో కేసులు నమోదవుతున్నాయి. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ భవానీనగర్‌లో ఉండే వల్లెపు సాంబమూర్తి పెద్ద కూతురు సుష్మితను సంగెం మండలం కాట్రపల్లి శివారు వడ్డెరగూడేనికి చెందిన ఆలకుంట ఎల్లయ్య చిన్న కుమారుడు అరుణ్ గత నెల 27న ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన కూతురును అరుణ్ కిడ్నాప్ చేశాడని సాంబమూర్తి సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అరుణ్ తండ్రి ఎల్లయ్య, తల్లి కోమల, అన్న రాజ్‌కుమార్ భయపడి చింతలపల్లిలోని ఎల్లయ్య అక్క కమలమ్మ ఇంటికి వెళ్లి ఉన్నారు. శనివారం అరుణ్, సుష్మిత ప్రేమ వివాహం చేసుకుని సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చినట్లు తెలుసుకుని ఆదివారం ఎల్లయ్య కుటుంబంతో వడ్డెరగూడెంలోని ఇంటికి వెళ్లాడు. ఇంటి పైకప్పు పెంకులు, ముందు రేకులు, ఇంట్లోని ద్విచక్రవాహనం, టీవీ, ఫ్రిజ్, కూలర్ సుమారు రూ.65 వేల విలువైన సామగ్రిని సుష్మిత తల్లిదండ్రులు వల్లెపు సాంబమూర్తి, రజిత, బంధువులు పూలమ్మ, భవాని, చంద్రమ్మ ధ్వంసం చేశారని ఆలకుంట ఎల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అరుణాచలానికి బస్సు హన్మకొండ: అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు వరంగల్–1 డిపో మేనేజర్ వంగల మోహన్‌రావు తెలిపారు. ఈనెల 12న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి రాజధాని ఏసీ బస్సు బయలుదేరి 14న అరుణాచలం చేరుకుంటుందన్నా రు. 15న హనుమకొండకు చేరుకుంటుందని పేర్కొన్నారు. 99592 26047, 7382855793 నంబర్లలో సంప్రదించాలన్నారు -
గ్రీవెన్స్‌లో 873 వినతులు పెండింగ్
మొక్కల రక్షణ బాధ్యత అధికారులదే..వరంగల్: కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌లో కలెక్టర్, అధికారులకు ప్రజలు వినతులు సమర్పిస్తున్నారు. వినతులను కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తారు. అధికారులు వినతులపై దృష్టిసారిస్తే క్షేత్రస్థాయిలోని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. ఇక్కడ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మండల కేంద్రాల్లో వినతులు సమర్పిస్తున్నారు. జిల్లాలో ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది.. మళ్లీ మావద్దకే వచ్చారంటూ మండలస్థాయి అధికారులు ఎగతాళి చేస్తున్నట్లు పలువురు బాధితులు వాపోతున్నారు. ప్రతివారం గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి, సాధ్యం కాని వాటిపై ఫిర్యాదుదారులకు వివరంగా చెబితే మరోసారి వచ్చే అవకాశాలు ఉండవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 17 వరకు గ్రీవెన్స్‌లో 11,915 వినతులు సమర్పించారు. ఇందులో 11,042 వినతులను వివిధ శాఖల అధికారులు పరిష్కరించారు. వివిధ కారణాల వల్ల మరో 873 ఫిర్యాదులు అపరిష్కృతంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయో చెప్పరు? అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వినతులపై స్పందిస్తున్నా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా), పోలీసుశాఖలు పెద్దగా స్పందించకపోవడం విశేషం. ‘కుడా’కు 105 వినతులు రాగా మొత్తం పెండింగ్‌లోనే ఉన్నాయి. అదేవిధంగా ఈస్ట్‌జోన్ డీసీపీకి 96 వినతులు వచ్చాయి. 53 పరిష్కారం కాగా 43 పెండింగ్‌లో ఉన్నాయి. నర్సంపేట ఏసీపీ పరిధిలో వచ్చిన 50 ఫిర్యాదుల్లో 7 మాత్రమే పరిష్కారం కాగా మామునూరు ఏసీపీ పరిధిలో 34 వినతులు రాగా మొత్తం పెండింగ్‌లో ఉన్నాయి. ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయన్న దానిపై స్పష్టత లేకపోవడంతో బాధితులు మళ్లీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. గ్రీవెన్స్‌లో వచ్చిన వినతులు, పరిష్కారమైనవి, పెండింగ్‌లో ఉన్న అర్జీల వివరాలు..నేడు కలెక్టరేట్లో ప్రజావాణి వరంగల్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేడు (సోమవారం) ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతులు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావాలని కలెక్టర్ సూచించారు. వచ్చిన అర్జీలు 11,915.. పరిష్కారమైనవి 11,042 ‘కుడా’, పోలీస్ శాఖల నో రెస్పాన్స్శాఖ వినతులు పరిష్కారం పెండింగ్ జీడబ్ల్యూఎంసీ 471 349 122 జెడ్పీ సీఈఓ 141 30 111 కుడా 105 00 105 డీసీపీ ఈస్ట్‌జోన్ 96 53 43 ఏసీపీ నర్సంపేట 50 7 43 ఏసీపీ మామునూరు 34 00 34 ఎంజీఎం 4,694 4,669 25 ఆర్సీఓ(బాలుర గురుకులం) 93 60 33 జిల్లా రిజిస్ట్రార్ 57 25 32 డీఆర్డీఓ 922 916 6 అంగన్వాడీ 357 353 4 ఆరోగ్యశ్రీ 7 4 3 డీపీఓ 463 460 3 -
6 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు
కాళోజీ సెంటర్: జిల్లాలో ఈనెల 6 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 287 పాఠశాలల నుంచి 4,803 మంది బాలురు, 4,434 మంది బాలికలు పరీక్షలకు హాజరుకానున్నారు. 6వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 3.15 గంటల వరకు ఫస్ట్ లాంగ్వేజ్, 7న సెకండ్ లాంగ్వేజ్, 10న థర్డ్ లాంగ్వేజ్, 11న మ్యాథమెటిక్స్, 12న ఫిజికల్ సైన్స్, 13న బయాలాజికల్ సైన్స్, 15న సోషల్ స్టడీస్ పరీక్ష ఉంటుందని విద్యాశాఖాధికారులు తెలిపారు. పబ్లిక్ పరీక్షలకు 49 కేంద్రాలు టెన్త్ వార్షిక పరీక్షలు ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నారు. జిల్లాలోని 287 పాఠశాలల నుంచి 9,237 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే పరీక్షల కోసం 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 550 మంది ఇన్విజిలేటర్లు, 50 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 49 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి.. ఈనెల 21 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 6 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎంఈఓలు, పాఠశాలల హెచ్ఎంలకు గైడ్ చేశాం. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాం. – మామిడి జ్ఞానేశ్వర్, డీఈఓ4న కలెక్టరేట్లో మహిళా దినోత్సవం వరంగల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ బాధ్యులు నిర్ణయించారు. వేడుకల్లో రెండు జిల్లాల మహిళా గెజిటెడ్ అధికారులు పాల్గొంటారు. వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, ప్రావీణ్య అనుమతితో ఈనెల 4, 5 తేదీల్లో వేడుకలు నిర్వహించనున్నారు. 4న వరంగల్ కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మెడికవర్ హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. అదేరోజు మధాహ్నం 2 గంటలకు హనుమకొండ ఐడీఓసీలోని టీజీఓ భవన్లో మహిళా గెజిటెడ్ అధికారులకు క్రీడాపోటీలు, 5న హనుమకొండ కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ● -
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu ‘దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చిలోపు వందశాతం పూర్తి చేసి.. అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్ఓసీ కోసం ఛత్తీస్‌గఢ్ సర్కారును ఒప్పిస్తాం. ధరలు పెరగడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణకు ఇబ్బందిగా మారింది. అయినా వెంటనే చేపట్టి దేవాదుల పూర్తి చేస్తాం’. ధర్మసాగర్లో దేవాదుల ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ న్యూస్‌రీల్ 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలివి. -
ఎయిర్పోర్ట్ క్రెడిట్ రేవంత్‌కు దక్కదు
హన్మకొండ: వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ వీసమెత్తు కూడా సీఎం రేవంత్‌రెడ్డికి దక్కద ని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. విమానాశ్రయాన్ని తాను తీసుకొచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపర్చడమేనన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఎయిర్ స్ట్రిప్డ్గా ఏర్పాటు చేశారని, తాను స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు 1976, 1978 కాలంలో వాయుదూత్ సర్వీస్ నడిచేదన్నారు. 1980లో మూతపడిందని, అప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటే మామునూ రు ఎయిర్పోర్ట్ మరోలా ఉండేదన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర మంత్రి ప్రపుల్ పటేల్‌కు లేఖ రాస్తే శంషాబాద్‌కు 150 కిలోమీటర్ల వరకు విమానాశ్రయం పెట్టొద్దని జీఎంఆర్‌తో 25 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నట్లు జవాబు ఇచ్చారన్నా రు. తెలంగాణ ఆవిర్భావం కాగానే కేసీఆర్ విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేశారని, ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ కొట్లాట చూస్తుంటే నవ్వొస్తున్నద ని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, పులి రజనీకాంత్, నయీముద్దీన్ పాల్గొన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ -
ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి
● నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ శ్రీనివాసరావు హన్మకొండ: ప్రభుత్వం వెంటనే మానవహక్కుల కమిషన్, లోకాయుక్త చైర్మన్లను నియమించి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ అయిలినేని శ్రీనివాసరావు కోరారు. ఆదివారం హనుమకొండ నయీంనగర్‌లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్(ఎన్జీఓ) రాష్ట్ర స్థాయి సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్, వరంగల్ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ మానవ హక్కులకు ఎక్కడ భంగం కలిగినా తమ సంస్థ వెంటనే స్పందిస్తుందన్నారు. హక్కులకు భంగం కలిగించినా, సమాజానికి, పర్యావరణానికి, మానవ హక్కులకు ఎలాంటి నష్టం చేకూర్చినా అండగా నిలుస్తామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజ్ చౌహాన్, సోషల్ మీడియా ఇన్చార్జ్ పరకాల సమ్మయ్య గౌడ్, ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు ప్రశాంత్‌రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ మాటూరి రవీందర్‌గౌడ్, ప్రతినిధులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి
● బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వరంగల్ అర్బన్ : పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. నగర పరిధిలో కొనసాగుతున్న శానిటేషన్ నిర్వహణ పనులను ఆమె ఆదివారం ఉదయం 5 గంటలకు 3వ డివిజన్, హనుమకొండ అశోకా జంక్షన్, అంబేడ్కర్ జంక్షన్ ప్రధాన రహదారి ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త తరలించే ట్రాక్టర్ డ్రైవర్ లాగ్ బుక్, రహదారిని శుభ్రం చేసే స్వీపింగ్ మిషన్ల లాగ్ బుక్ పరిశీలించారు. -
టీజీఓస్ ఆధ్వర్యాన మహిళా దినోత్సవం
వరంగల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీఓస్) వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యులు ఆదివారం నిర్ణయించారు. రెండు జిల్లా ల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, ప్రావీణ్య అనుమతి తో ఈనెల 4, 5 తేదీల్లో వేడుకలు నిర్వహించనున్నారు. 4న వరంగల్ కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మెడికవర్ ఆస్ప త్రి సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. అదేరోజు మధాహ్నం 2 గంటలకు హనుమకొండ ఐడీఓసీ లోని టీజీఓ భవన్లో మహిళా గెజిటెడ్ అధికారుల కు క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. 5వ తేదీన హనుమకొండ సమీకృత కలెక్టరేట్లో అంతర్జాతీ య మహిళా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. -
గ్రీవెన్స్‌లో 873 వినతులు పెండింగ్
వరంగల్: కలెక్టరేట్లో ప్రతీ సోమవారం ని ర్వహిస్తున్న గ్రీవెన్స్‌లో కలెక్టర్, అధికారులకు ప్రజలు వినతులు సమర్పిస్తున్నారు. వినతులను కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తారు. అధికారులు వినతులపై దృష్టిసారిస్తే క్షేత్రస్థాయిలోని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. ఇక్కడ సమస్యలు పరి ష్కారం కాకపోవడంతో మండల కేంద్రాల్లో వినతులు సమర్పిస్తున్నారు. జిల్లాలో ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది.. మళ్లీ మావద్దకే వచ్చారంటూ మండలస్థాయి అధికారులు ఎగతాళి చేస్తున్నట్లు పలువురు బాధితులు వాపోతున్నారు. ప్రతీ వారం గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి, సాధ్యం కాని వాటిపై ఫిర్యాదుదారులకు వివరంగా చెబితే మరో సారి వచ్చే అవకాశాలు ఉండవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 17 వరకు గ్రీవెన్స్‌లో 11,915 వినతులు సమర్పించారు. ఇందులో 11,042 వినతులను అధికారులు పరిష్కరించారు. వివిధ కారణాల వల్ల మరో 873 ఫిర్యాదులు అపరిష్కృతంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయో చెప్పరు? అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వినతులపై స్పందిస్తున్నా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా), పోలీసుశాఖలు పెద్దగా స్పందించకపోవడం విశేషం. ‘కుడా’కు 105 వినతులు రాగా మొత్తం పెండింగ్‌లోనే ఉన్నాయి. అదేవిధంగా ఈస్ట్‌జోన్ డీసీపీకి 96 వినతులు వచ్చాయి. 53 పరిష్కారం కాగా 43 పెండింగ్‌లో ఉన్నాయి. నర్సంపేట ఏసీపీ పరిధిలో వచ్చిన 50 ఫిర్యాదుల్లో 7 మాత్రమే పరిష్కారం కాగా మామునూరు ఏసీపీ పరిధిలో 34 వినతులు రాగా మొత్తం పెండింగ్‌లో ఉన్నాయి. ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయన్న దానిపై స్పష్టత లేకపోవడంతో బాధితులు మళ్లీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. గ్రీవెన్స్‌లో వచ్చిన వినతులు, పరిష్కారమైనవి, పెండింగ్‌లో ఉన్న అర్జీల వివరాలు.. శాఖ వినతులు పరిష్కారం పెండింగ్ జీడబ్ల్యూఎంసీ 471 349 122 జెడ్పీ సీఈఓ 141 30 111 కుడా 105 00 105 డీసీపీ ఈస్ట్‌జోన్ 96 53 43 ఏసీపీ నర్సంపేట 50 7 43 ఏసీపీ మామునూరు 34 00 34 ఎంజీఎం 4,694 4,669 25 ఆర్సీఓ(బాలుర గురుకులం) 93 60 33 జిల్లా రిజిస్ట్రార్ 57 25 32 డీఆర్డీఓ 922 916 6 అంగన్వాడీ 357 353 4 ఆరోగ్యశ్రీ 7 4 3 డీపీఓ 463 460 3 వచ్చిన అర్జీలు 11,915.. పరిష్కారమైనవి 11,042 ‘కుడా’, పోలీస్ శాఖల నో రెస్పాన్స్ -
నేడు వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్
వరంగల్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేడు(సోమవారం) ఉదయం 11 గంటలకు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతులు సమర్పించేందుకు కలెక్టరేట్ కు రావాలని కలెక్టర్ సూచించారు. హనుమకొండ ప్రజావాణి రద్దు హన్మకొండ అర్బన్ : నేడు(సోమవారం) హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు. శ్రీపాదరావుకు ఘన నివాళిహన్మకొండ అర్బన్/వరంగల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని ఆదివారం హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, రెండు జిల్లాల డీఆర్ఓలు వైవీ.గణేష్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బీఎస్ఎల్.సౌజన్య ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మొదటి పేపర్, 5న రెండోపేపర్, 7న మూడో పేపర్, 10న నాలుగో పేపర్, 12న ఐదో పేపర్, 15న ఆరో పేపర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం 4,914 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. 25 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నేడు కలెక్టరేట్‌లోకి డీఎంహెచ్ఓ కార్యాలయంహన్మకొండ అర్బన్: ఊరు చివరనున్న హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎట్టకేలకు కలెక్టరేట్ ఐడీఓసీ భవనంలోకి మారనుంది. ఇంతకాలం ఉన్న అడ్డంకులు తొలగించుకుని కలెక్టరేట్ రెండో అంతస్తులో కేటాయించిన ఎస్ 14, 16, 17 గదుల్లోకి రానుంది. అధికారికంగా సోమవారం కలెక్టర్ ప్రావీణ్య కార్యాలయాన్ని ప్రారంభించనుండగా.. ఇప్పటికే పాత డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి సామగ్రి తరలించారు. అలాగే ఈనెల 4న క్షేత్రస్థాయిలో వైద్యాధికారులతో నిర్వహించే సమాశాన్ని కూడా కలెక్టరేట్ చేపట్టనున్నట్లు డీఎంహెచ్ఓ వైద్యాధికారులకు సమాచారం పంపించారు. అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సుహన్మకొండ: అరుణాచలం గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ వంగల మోహన్‌రావు ఆదివారం తెలిపారు. ఈనెల 12న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి రాజధాని ఏసీ బస్సు బయల్దేరి 14న అరుణాచలం చేరుకుంటుందన్నారు. 15న జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం దర్శనం అనంతరం హనుమకొండకు చేరుకుంటుందని పేర్కొన్నారు. చార్జీ పెద్దలకు రూ.6వేలు, పిల్లలకు రూ.4,500గా నిర్ణయించినట్లు వివరించారు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం 99592 26047, 94941 07944 నంబర్లలో సంప్రదించాలని ఒక ప్రకటనలో కోరారు. -
జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు వివరాలు
లిఫ్టు చేయాల్సిన నీరు : 60.00 టీఎంసీలు వ్యవసాయానికి నీరు : 56.71 టీఎంసీలు తాగునీటి వినియోగం : 2.97 టీఎంసీలు పారిశ్రామిక నీటి సరఫరా : 0.32 టీఎంసీలు ఇందుకు అవసరమైన విద్యుత్ : 495.55 మెగావాట్లు స్థిరీకరించిన ఆయకట్టు : 5,56,722 ఎకరాలు సాగులోకి వచ్చిన ఆయకట్టు : 3,16,634 ఎకరాలు 2005–06లో ప్రాజెక్టు అంచనా వ్యయం : రూ.6016 కోట్లు 2008–09లో సవరించిన అంచనా వ్యయం : రూ.9427.73 కోట్లు 2016–17లో సవరించిన వ్యయం : రూ.13445.44 కోట్లు సవరించిన వ్యయ ప్రతిపాదనలు : రూ.14729.98 కోట్లు అయిన మొత్తం ఖర్చు : రూ.14,188 కోట్లు ప్రతిపాదనల్లో తాజా అంచనా వ్యయం : రూ.17,500 కోట్లు -
భూసేకరణే సమస్య..
ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి రైతులు ఎక్కువ పరిహారం డిమాండ్ చేయడం, కోర్టు కేసులు వంటివి అడ్డంకిగా మారాయి. ఫలితంగా ప్రాజెక్టు అంచనా వ్యయం విపరీతంగా పెరుగుతోంది. మొత్తం 33,224 ఎకరాలకు 30,268 ఎకరాలు సేకరించగా.. జనగామ నియోజకవర్గంలో 945 ఎకరాలు, పాలకుర్తిలో 826, గజ్వేల్‌లో 230, నర్సంపేటలో 131, వర్ధన్నపేటలో 168 ఎకరాలు.. ఇలా 2,957 ఎకరాల సేకరణ జరగాల్సి ఉంది. పెరిగిన అంచనా వ్యయం 2004లో రూ.6,016 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్ నాటికే రూ.14,729.98 కోట్లకు పెరిగింది. మూడు దశల్లో 16 ప్యాకేజీల్లో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.14,188 కోట్లు ఖర్చయినట్లు అధికారులు వెల్లడించారు. 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత భూసేకరణతో పాటు ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరోసారి అంచనాలు పెంచి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. అయితే ఈమేరకు అధికారులు రూ.17,500 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచడం.. లేదంటే రైతులను ఒప్పించడం.. ఏదో ఒకటి జరిగితేనే భూసేకరణ ముందుకు సాగి.. ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. -
మామునూరు ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత
● పోటాపోటీగా ప్రధాని మోదీ, రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు ● బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్యతోపులాటఖిలా వరంగల్: మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్ల నిధులు విడుదల చేసిన నేపథ్యంలో శనివారం ఎయిర్పోర్ట్ వద్దకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. బీజేపీ శ్రేణులు పీఎం మోదీ ఫ్లెక్సీకి, కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఒకరి వేదికపైకి ఒకరు చొచ్చుకురావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎయిర్పోర్ట్ అభివృద్ధి తమ వల్లే అని ఇరు పార్టీల నేతలు పరస్పరం దూషణలతో తోపులాడుకున్నారు. పోలీ సులు చేరుకుని ఇరువర్గాలను పంపించి ఎయిర్పోర్ట్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. -
– వివరాలు 8లోu
సింగర్ గీతామాధురి పాటకు కేరింతలు కొడుతున్న విద్యార్థులురంగులద్దుతున్న విద్యార్థులునిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న ‘స్ప్రింగ్‌స్ప్రీ–25’ వేడుకలు రెండోరోజు శనివారం కలర్ఫుల్గా సాగాయి. దేశవ్యాప్త వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ సంస్కృతీ సంప్రదాయాల ప్రదర్శనలతో పోటీ పడ్డారు. గీతామాధురి, మ్యాడ్–2 రాకతో ప్రోషో అదిరిపోయింది. కొరియో నైట్‌లో విద్యార్థులు స్టెప్పులతో సందడి చేశారు. ఈ వేడుకలు ఆదివారం ముగియనున్నాయి. – కాజీపేట అర్బన్ -
క్యాన్సర్‌పై జాగ్రత్త అవసరం
వరంగల్ లీగల్: క్యాన్సర్‌పై జాగ్రత్త అవసరమని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ సూచించారు. వరంగల్ కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్ సహకారంతో అవగాహన, వ్యాధి స్క్రీనింగ్ టెస్ట్‌లను నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిర్మలా గీతాంబ హాజ రై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మంచి ఆహారపు అలవాట్లు, నిత్యం వాకింగ్, మద్యపానం, పొగాకుకు దూరంగా ఉంటే క్యాన్సర్‌ను జయించవచ్చని సూచించారు. అనంతరం వైద్యులు న్యాయవాదులకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు మనీష శ్రావణ్ ఉన్నమ్, న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు సాయికుమార్, క్షమాదేశ్‌పాండే, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తీగల జీవన్‌గౌడ్, మాతంగి రమేశ్‌బాబు, ప్రతిమ హాస్పిటల్ డాక్టర్ సుమిత్ర తిప్పాని, చౌకత్, ఉద్యోగులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మహిళా న్యాయమూర్తులకు క్రీడా పోటీలు ఈనెల 8న జరిగే మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ ఆధ్వర్యంలో శనివారం మహిళా న్యాయమూర్తులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబతోపాటు న్యాయమూర్తులు మనీష శ్రావణ్ ఉన్నమ్, క్షమా దేశ్‌పాండే, శ్రావణ స్వాతి ఉల్లాసంగా పాల్గొని చెస్, షటిల్ ఆడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ ఉచిత వైద్య శిబిరం ప్రారంభం -
భూతగాదాల్లో తలదూర్చొద్దు..
పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా వరంగల్ క్రైం: భూతగాదాల్లో తలదూర్చొదని పోలీస్ కమిషనర్ అంబర్కిశోర్ ఝా పోలీసులకు సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా శనివారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న చైన్ స్నాచింగ్ కేసులను త్వరగా పరిష్కరించి నేరస్తులను పట్టుకోవాలని చెప్పారు. బెయిల్‌పై బయటకు వచ్చి వాయిదాలకు రాని నేరస్తులను కనిపెట్టి వారిని కోర్టులో హాజరు పర్చాలన్నారు. నిందితుల అరెస్ట్‌లో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. రాత్రి వేళ్లల్లో నిరంతరం పెట్రోలింగ్ చేపట్టాలని ఆదేశించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులు సరైన సమయంలో సెంటర్లకు చేరేలా ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. అనంతరం పోలీస్స్టేషన్ల వారీగా సమీక్షించిన సీపీ.. ఆస్తి, ఫోక్సో, మిస్సింగ్, గంజాయి, రోడ్డు ప్రమాద కేసుల స్థితిగతులపై తెలుసుకున్నారు. డీసీపీ షేక్ సలీమా, రవీందర్, రాజమహేందర్‌నాయక్, ఏఎస్పీ చైతన్, మనన్భట్తో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
ఎంజీఎంలో కార్మికుల ఆందోళన
ఎంజీఎం: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎంజీఎంలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో సెక్యురిటీ కాంట్రాక్ట్ టెండర్ దక్కించుకున్న సంస్థకు బిల్లులు నాలుగు నెలలుగా రావడంలేదని.. ప్రస్తుతం ఆ సంస్థ తమకు వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని కార్మికులు వాపోయారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు వరంగల్ కలెక్టర్ సత్యశారదను కలిసి సమస్యను వివరించారు. స్పందించిన ఆమె.. నాలుగు రోజుల్లో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించి విధుల్లో చేరారు. -
ఉద్యోగుల సమస్యలకు త్వరలో పరిష్కారం
హన్మకొండ అర్బన్: ఉద్యోగుల సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు టీఎన్జీఓస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓస్ భవన్లో శనివారం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కేంద్ర సంఘం నేతలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. సీఎం దృష్టికి ఉద్యోగుల సమస్యలు తీసుకెళ్లినట్లు తెలిపారు. త్వరలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారని, సీఎంపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఆకుల రాజేందర్ నాయకత్వంలో హనుమకొండ జిల్లా యూనియన్ బలోపేతానికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్ర సంఘం సహకారంతో జిల్లా స్థాయి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్‌లను ఘనంగా సన్మానించారు. జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి ఫనికెల రాజేశ్, గౌరవ అధ్యక్షులు శ్యాంసుందర్, రామునాయక్, రాజీవ్ ఇతర నాయకులు ఉన్నారు. -
భద్రకాళి చెరువు పనులపై బడా నాయకుల కన్ను?
క్యూబిక్ మీటర్‌కు రూ.162.56 నుంచి రూ.71.83కు తగ్గింపు● పట్టుబట్టి రేట్లు తగ్గించినట్లు ప్రచారం ● అనుకూల కాంట్రాక్టర్‌కు కట్టబెట్టే యత్నం ● అందుకే.. టెండర్ల దశలోనే బాలారిష్టాలు ● మరోసారి 5వ తేదీ వరకు టెండర్ల తేదీ పొడిగింపు సాక్షిప్రతినిధి, వరంగల్: భద్రకాళి చెరువులో పూడికతీత, మట్టి తరలింపు పనులకు మహూర్తం కుదరడం లేదు. యాభై ఏళ్ల తర్వాత పూడిక తీసేందుకు సుమారు మూడున్నర నెలల క్రితం చెరువు నుంచి నీళ్లు ఖాళీ చేశారు. వెంటనే టెండర్ ద్వారా చెరువు నుంచి పూడిక మట్టి తవ్వకం, లోడింగ్, తరలింపు పనులు చేపట్టేందుకు నిర్ణయం జరిగింది. ఈమేరకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో సమీక్ష కూడా నిర్వహించారు. నీటి పారుదల శాఖ ద్వారా మొత్తం రూ.13,00,09,046 వ్యయంతో రెండు పనులకు రెండు నెలల వ్యవధిలో రెండు పర్యాయాలు టెండర్లు పిలిచినా పనులు ఖరారు కాలేదు. అయితే ఇతర కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వెనుక అసలు మతలబు.. కొందరు ప్రజాప్రతినిధులు తమ అనుచరులు, అనుకూలురైన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించే క్రమంలో ప్రయత్నాలు చేస్తుండడమేనన్న ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో మొదట మట్టి తవ్వకం, తరలింపు పనులకు క్యూబిక్ మీటర్ ధర రూ.162.56 ప్రకటించిన అధికారులు.. సవరణ, సాంకేతిక కారణాల పేరిట క్యూబిక్ మీటరుకు రూ.71.83లుగా ఖరారు చేశారన్న చర్చ జరుగుతోంది. రేట్ల తగ్గింపుపై అనుమానాలు.. భద్రకాళి చెరువు పూడిక పనుల ఖరారులో ఆలస్యం కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినా అధికారులు.. మొదట ఇద్దరు టెండర్లు వేస్తే తక్కువ కోట్ చేశారని రద్దు చేశారు. ఆతర్వాత క్యూబిక్ మీటర్‌కు రూ.162.56 ఉన్న ఽరేటును రూ.71.83లు తగ్గించి.. నాన్ యూజ్ ఫుల్ సాయిల్‌గా గుర్తించి జీఎస్టీ, మెటీరియల్ కాస్ట్ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కాంట్రాక్టర్లు తక్కువ కోట్ చేశారని మొదట టెండర్లు రద్దు చేసిన అధికారులు.. క్యూబిక్ మీటర్‌కు రూ.90.73 (సగానికి పైగా) తగ్గించడం పథకం ప్రకారమేనన్న చర్చ జరుగుతోంది. ఓ వైపు కొందరు ప్రజాప్రతినిధులు ఈ పనులపై కన్నేసి అనుకూలురకు ఇప్పించే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతోందనే ప్రచారం ఉండగా.. మరోవైపు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారి బంధువుకు కావాలని పట్టుపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. వేసవి ఎండలు ముదురుతున్న నేపథ్యంలో.. ఖాళీ అయిన భద్రకాళి చెరువు కారణంగా నగరంలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు హైదరాబాద్ నుంచి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేస్తుండగా.. కలెక్టర్లు సైతం ఇరిగేషన్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పనుల చేజిక్కించుకునేందుకు కొందరు ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు, ఒత్తిళ్ల కారణంగా టెండర్ల ఖరారులో ఆలస్యం జరుగుతోందన్న ప్రచారం బాగా జరుగుతోంది. సెలవుల వల్ల గడువు పొడిగింపు.. పూడికతీతలో వచ్చే నల్లమట్టి కొనుగోలుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 5 వరకు పొడిగించాం. మొదట ఫిబ్రవరి 17 నుంచి 28 వరకు సమయం ఇచ్చాం. అయితే వరుస సెలవులు రావడంతో డీడీలు తీసుకునే చివరి తేదీని ఫిబ్రవరి 28 నుంచి ఈనెల 5 వరకు పొడిగించాం. మట్టి కావాల్సిన వ్యక్తులు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. – ఎం.శంకర్, ఈఈ, నీటిపారుదలశాఖ నక్కలగుట్ట డివిజన్వాయిదాల టెండర్లు.. భద్రకాళి చెరువులో పూడికతీత, మట్టి తరలింపు పనులకు జనవరి 5, 10 తేదీల్లో టెండర్లు పిలిచారు. పూడిక తవ్వడం, లోడింగ్ పనులకు రూ.3,49,11,446 కేటాయించారు. అలాగే పూడిక మట్టిని తరలించేందుకు క్యూబిక్ మీట రుకు రూ.162.56 చొప్పున 5.85 లక్షల క్యూబి క్ మీటర్లకు రూ.9,50,97,600 చెల్లించేలా.. మరో టెండర్ పిలిచారు. ఈపనుల కోసం కాంట్రాక్టర్లు వ్యూహాత్మకంగానే ముందుకు రాలేద న్న చర్చ జరుగుతోంది. ఈసమయంలో మట్టి తవ్వకం, లోడింగ్ పని కంటే.. పూడిక మట్టి తరలించే పనికి సంబంధించిన టెండర్ నోటిఫికేష న్లో నిబంధనలు కఠినంగా ఉన్నాయని కాంట్రాక్టర్లు ఆసక్తి చూపట్లేదని అధికారులు చెప్పుకొచ్చారు. పూడికతీత, లోడింగ్, తరలింపు పనులను అత్యవసరంగా భావించిన అధికారులు రెండోసారి టెండర్లు పిలిచినా ఫలితం లేదు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఫిబ్రవరి 28న టెండర్ల దాఖలుకు చివరి తేదీగా మరోసారి టెండర్లు పిలిచారు. తాజాగా మార్చి 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు. -
ఆర్ఆర్ఆర్ సదస్సుకు మేయర్, కమిషనర్
వరంగల్ అర్బన్: ‘చెత్త రెడ్యూస్, రీ యూజ్, రీసైక్లింగ్(ఆర్ఆర్ఆర్) సిటీస్–2.0’పై రాజస్తాన్ రాజధాని పింక్ సిటీ జైపూర్‌లో ఈనెల 2 నుంచి 12వ రీజినల్ సదస్సు జరగనుంది. ఈ మేరకు వరంగల్ నగర మేయర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సీఎంహెచ్ఓ రాజారెడ్డికి ఆహ్వానం అందింది. జీడబ్ల్యూఎంసీ పరిధి 66 డివిజన్ల వ్యాప్తంగా అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులు, చెత్త శుద్ధీకరణ, స్వచ్ఛ వరంగల్ కార్యక్రమాలపై సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ జేడీగా సాంబశివరావుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివేకానంద రీసెర్చ్‌స్కాలర్స్ హాస్టల్ జాయింట్ డైరెక్టర్‌గా డాక్టర్ అంకశాల సాంబశివరావు నియమితులయ్యారు. ఈమేరకు శనివారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను సాంబశివరావు అందుకున్నారు. -
పడిపోతున్న భూగర్భ జలం
హన్మకొండ: హనుమకొండ జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పెరిగిన భూగర్భ జలాలు నవంబర్ నుంచి క్రమేపీ తగ్గుతున్నాయి. సెప్టెంబర్ చివరన 2.94 మీటర్ల లోతులో ఉండగా నవంబర్ 4.16, డిసెంబర్ 4.81, జనవరి 5.93, ఫిబ్రవరి చివరన 6.30 మీటర్ల దిగువకు పడిపోయాయి. అక్టోబర్ తర్వాత వర్షాలు లేవు. నవంబర్ నుంచి యాసంగి వ్యవసాయ పనులు మొదలయ్యాయి. జిల్లాలో అన్ని పంటలు కలిపి 1,77,437 ఎకరాల్లో సాగు చేయగా.. ఇందులో వరి 1,19,270 ఎకరాలు, మొక్కజొన్న 57,498, వేరుశనగ 473, పొగాకు 62, కంది 35, మినుము 24, మిగతా పంటలు సింగిల్ డిజిట్లో సాగయ్యాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న సాగుకు నీటి వినియోగం పెరిగింది. దీనికితోడు జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు లేవు. దీంతో భూగర్భ జలమట్టం పడిపోతున్నది. గత ఏడాది ఫిబ్రవరి చివరన జిల్లా సగటు భూగర్భ జలమట్టం 6.17 మీటర్లు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 6.30 మీటర్లకు పడిపోయింది. అత్యధికంగా ఐనవోలులో 21.76 మీటర్లకు, నడికూడ మండలం చర్లపల్లిలో 12.50 మీటర్లకు పడిపోయింది. మండలాల వారీగా.. భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌లో 5.51 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. జగన్నాథపూర్ 9.54, కొత్తపల్లి 8.56, వంగర 9.45, ధర్మసాగర్ మండలం ధర్మాపూర్ 3.53, ధర్మసాగర్ 2.89, పెద్ద పెండ్యాల 8.43. నారాయణగిరి 3.53, ఎల్కతుర్తి 7.51, హనుమకొండ 6.04, హసన్‌పర్తి మండలం నాగారం 7.89, సీతంపేట 3.42, ఎల్లాపూర్ 2.94, ఐనవోలు మండలం పున్నేలు 3.86, పంథిని 4.69, ఐనవోలు 21.76, కమలాపూర్ మండలం శనిగరం 6.11, వేలేరు మండలం పీచర 9.42, వేలేరు 2.76, ఆత్మకూరు 2.76, దామెర 3.49, నడికూడ మండలం చర్లపల్లి 12.42, నడికూడ 2.84, పరకాల 3.48, శాయంపేట మండలం పత్తిపాకలో 4.78 మీటర్ల లోతులో భూగర్భజలాలున్నాయి. గత నెలలో సగటు 5.93 మీటర్లు ప్రస్తుతం 6.30 మీటర్లు దిగువన నీరు -
క్యాన్సర్‌పై జాగ్రత్త అవసరం
వరంగల్ లీగల్: క్యాన్సర్‌పై జాగ్రత్త ఎంతో అవసరమని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ సూచించారు. వరంగల్ కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్ సహకారంతో క్యాన్సర్‌పై అవగాహన, స్క్రీనింగ్ టెస్ట్‌లను నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిర్మలా గీతాంబ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మంచి ఆహారపు ఆలవాట్లు, నిత్యం వాకింగ్, మద్యపానం, పొగాకుకు దూరంగా ఉంటే క్యాన్సర్‌ను జయించవచ్చని సూచించారు. అనంతరం వైద్యులు న్యాయవాదులకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు మనీష శ్రావణ్ ఉన్నమ్, న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు సాయికుమార్, క్షమాదేశ్‌పాండే, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తీగల జీవన్‌గౌడ్, మాతంగి రమేశ్‌బాబు, ప్రతిమ హాస్పిటల్ డాక్టర్ సుమిత్ర తిప్పాని, చౌకత్, ఉద్యోగులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ ఉచిత వైద్య శిబిరం ప్రారంభం -
రాష్ట్రస్థాయి పోటీల్లో నిషిత ప్రతిభ
దుగ్గొండి: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శర్మ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫిక్షన్ కథల పోటీల్లో నాచినపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని నిషిత ప్రతిభకనబరిచిందని ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో ఆమె మాట్లాడుతూ కౌమార బాలికల కోసం శర్మ సంస్థ నిర్వహించిన పోటీల్లో 8వ తరగతి విద్యార్థిని నిషిత రాసిన ‘మనభవిష్యత్.. మనచేతిలోనే’ అంశానికి ప్రథమ బహుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు శర్మ సంస్థ నుంచి అందిన నగదు బహుమతిని ఎంఈఓ వెంకటేశ్వర్లు శనివారం నిషితకు అందించారు. విద్యార్థినిని పాఠశాల ఉపాధ్యాయులు వెలిదండి సుమలత, సుధీర్‌కుమార్, మధుసూదన్, శ్రీనివాస్, గీత, మాధవరావు, కమల అభినందించారు. 6 నుంచి ‘కొమ్మాల’ బ్రహ్మోత్సవాలుగీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 6 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తర్వాత 10వ తేదీ రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం, 14న హోలీ పండుగ నుంచి జాతర ప్రారంభం అవుతుందని, 18న స్వామివారి రథోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. జాతర ఉగాది వరకు కొనసాగుతుందని తెలిపారు. బాధ్యతలు చేపట్టిన ఎస్ఈలుహన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పి.మధుసూదన్‌రావు, వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా గౌతమ్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు హనుమకొండ ఎస్ఈగా పని చేసిన వెంకటరమణ చీఫ్ ఇంజనీర్ పదోన్నతిపై కార్పొరేట్ కార్యాలయానికి వెళ్లగా ఆ స్థానంలో వరంగల్ ఎస్ఈగా పని చేస్తున్న పి.మధుసూదన్‌రావును బదిలీ చేశారు. అలాగే కార్పొరేటర్ కార్యాలయం ఆపరేషన్ విభాగం–1 జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న గౌతమ్ రెడ్డిని వరంగల్ ఎస్ఈగా నియమితులయ్యారు. విద్యార్థుల్లో విలువలను పెంపొందించాలి : డీఈఓనర్సంపేట రూరల్: విద్యార్థుల్లో విలువలను పెంపొందించాలని డీఈఓ జ్ఞానేశ్వర్ అన్నారు. లక్నెపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన స్ఫూర్తి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే మంచి అలవాట్లను అవర్చుకోవాలని, చదువులో రాణించాలని సూచించారు. అదేవిధంగా గురిజాల జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సదానందం ప్రసంగించారు. బెదిరించిన వారిపై కేసుసంగెం: చంపుతామని బెదిరించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ప్రేమ వివాహం చేసుకోవడానికి గత నెల 27న ఇంటి నుంచి వెళ్లిపోయింది. కాట్రపల్లి శివారు వడ్డెరగూడేనికి చెందిన ఆలకుంట రంజిత్‌కు సదరు యువతి మేనత్త కూతురు. రంజిత్‌తోపాటు అదేగ్రామానికి చెందిన రాకేశ్, రజినీకాంత్, వల్లేపు రాజేశ్ ఆమెను వెతికేందుకు శనివారం చింతలపల్లికి వెళ్లారు. రైల్వేగేట్ వద్దకు వెళ్లేసరికి చింతలపల్లికి చెందిన అల్లెపు శ్యాం, కార్తీక్, మల్లేశ్ వారిని అడ్డుకుని దూషించి దాడి చేశారు. మళ్లీ ఇటువైపు వస్తే చంపుతామని బెదిరించారని రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్యాం, కార్తీక్, మల్లేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
‘యూడీఐడీ’పై అవగాహన కల్పించాలి
వరంగల్: ఆన్లైన్లో యూడీఐడీ కార్డుల దరఖా స్తుపై దివ్యాంగులకు అవగాహన కల్పించాలని సెర్ప్ సీఈఓ దివ్యదేవ రాజన్ సూచించారు. యూడీఐడీ, సోలార్ విద్యుత్ ప్లాంట్ల డీపీఆర్‌పై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓలు, ప్రభుత్వ ప్రధా న ఆస్పత్రుల పర్యవేక్షకులు, సంక్షేమ శాఖ అధికా రులతో శనివారం ఆమె హైదరాబాద్ నుంచి వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ మాట్లాడుతూ యూడీఐడీ పోర్టల్, ఆన్లైన్, మీసేవ కేంద్రాల్లో యూనిక్ డిజబిలిటీ ఐడీ(యూడీఐడీ) కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. గతంలో జారీ చేసిన సదరం సర్టిపికెట్లకు యూడీఐడీ కార్డులు మంజూరు చేసినట్లు వివరించారు. దివ్యాంగులు కచ్చితమైన చిరునామాతో www. swaralambanacard.gov. inలో దరఖాస్తు చేసుకుంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ లాగిన్లోకి వెళ్తుందని తెలిపారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారులు ఇచ్చిన సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుందని వివరించారు. షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం దివ్యాంగులు మెడికల్ క్యాంపునకు హాజరైతే ప్రత్యేక వైద్యులు పరిశీలించి వైకల్య శాతాన్ని నిర్ణయిస్తారని తెలిపారు. అనంతరం సర్టిఫికెట్ మంజూరు చేస్తారని చెప్పారు. సర్టిఫికెట్ ఎలాంటి ట్యాంపరింగ్ జరగకుండా వెబ్సైట్లో అప్లోడ్ చేసి సంతకం చేసిన ధ్రువీకరణ ప్రతులను హాస్పిటల్, డీఆర్డీఓ కార్యాలయాల్లో భద్రపరచాల ని తెలిపారు. దరఖాస్తులో నింపిన చిరునామాకు యూడీఐడీ కార్డు స్పీడ్‌పోస్ట్ ద్వారా పంపిస్తారని పేర్కొన్నారు. సర్టిఫికెట్‌ను యూడీఐడీ పోర్టల్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. సర్టిఫికెట్ల జారీకి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ప్రధాన ఆస్పత్రుల సూపరింటెండెంట్, అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సెర్ప్ సీఈఓ దివ్యదేవ రాజన్ -
లక్ష్యం.. వంద శాతం
ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025– 8లోuనల్లబెల్లి: గ్రామాల్లో ఆస్తి పన్ను వసూళ్లను పంచాయతీ అధికారులు వేగవంతం చేశారు. ఈ నెల 31 వరకు వందశాతం పన్నులు వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా అధికారులు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే 71 శాతం పూర్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి పన్నులే ప్రధాన ఆదాయ వనరు. ఈ నేపథ్యంలో ఇంటి, నల్లా పన్నుల వసూళ్లపై పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇవి సకాలంలో వసూలైతే ప్రగతి సాధ్యమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధులు అరకొరగా విడుదల చేయడంతో ఇంటి, నల్లా పన్నుల వసూలు కీలకంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా 30 రోజుల గడువు మాత్రమే ఉంది. ఎలాగైనా ఈ నెలాఖరు వరకు వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు అధికారులు ప్రణాళికతో ముందుకుపోతున్నారు. ప్రజాపాలన, ఆర్థిక, సామాజిక సర్వే, ఇందిరమ్మ ఇళ్ల సర్వే, స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్ల విధులు నిర్వర్తించిన పంచాయతీ సిబ్బంది పన్ను వసూళ్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించారు. ఇంకా వసూలు చేయాల్సింది రూ.1,40,02,198 జిల్లాలోని 11 గ్రామీణ మండలాల్లో 315 గ్రామ పంచాయతీలున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు రూ.51,67,650 బకాయిలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,33,25,942 కాగా.. గత ఆర్థిక సంవత్సరం కలిపి మొత్తం రూ.4,84,93,592 పన్నుల వసూలు లక్ష్యంగా ఉంది. ఇప్పటి వరకు రూ.3,44,91,394 పన్నులు వసూలు చేశారు. ఇంకా రూ.1,40,02,198 వసూలు పూర్తి చేస్తామని పంచాయతీ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.న్యూస్రీల్గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై సిబ్బంది ప్రత్యేక దృష్టి టార్గెట్ రూ.4,84,93,592.. వసూలైంది రూ.3,44,91,394 మరో 30 రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం జిల్లాలో 11 గ్రామీణ మండలాలు.. 315 గ్రామ పంచాయతీలుమండలాల వారీగా గ్రామపంచాయతీలు, పన్నుల వసూళ్ల వివరాలు (రూ.ల్లో)..మండలం గ్రామపంచాయతీలు లక్ష్యం వసూలైంది వసూలు కావాల్సిందిచెన్నారావుపేట 30 34,07,013 23,34,018 10,72,995 దుగ్గొండి 34 45,86,374 31,76,118 14,10,256 గీసుకొండ 21 40,64,628 33,50,679 7,13,949 ఖానాపురం 20 43,50,036 32,21,544 11,28,492 నల్లబెల్లి 29 38,29,273 23,32,474 14,96,799 నర్సంపేట 19 45,20,719 35,98,614 9,22,105 నెక్కొండ 39 55,58,602 41,25,115 14,33,487 పర్వతగిరి 33 47,61,995 34,44,269 13,17,726 రాయపర్తి 39 54,12,419 27,46,405 26,66,014 సంగెం 33 43,72,240 34,93,779 8,78,461 వర్ధన్నపేట 18 36,30293 26,68,379 9,61,914 -
ఐకమత్యంగా ఉంటేనే ప్రయోజనం
వరంగల్ చౌరస్తా: పద్మశాలి కులస్తులంతా ఐకమత్యంగా ఉంటేనే కులానికి ప్రయోజనం చేకూరుతుందని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, నగర మేయర్ సుధారాణి అన్నారు. ఈనెల 9న హైదరాబాద్ నాంపల్లి జింఖానా గ్రౌండ్లో నిర్వహించే 17వ అఖిల భారత పద్మశాలి సంఘం, 8వ తెలంగాణ ప్రాంతీయ మహా సభ నేపథ్యంలో శనివారం వరంగల్ చౌర్బౌళిలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో సంఘం వరంగల్, హన్మకొండ జిల్లాల అధ్యక్షులు లయన్ ఆడెపు రవీందర్, బచ్చు ఆనంద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహా సభ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుల బలం చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి, ప్రభాకర్‌రావు దంపతులను సత్కరించారు. సమావేశంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి, ప్రధాన కార్యదర్శి రాంచందర్‌రావు, నాయకులు వడ్నాల నరేందర్, గుండేటి నరేందర్, ఈగ వెంకటేశ్వర్లు, వైద్యం రాజగోపాల్, తవుటం రవీందర్, పోరండ్ల కష్ణ ప్రసాద్, కందికట్ల ప్రశాంత్, కేదాశి వెంకటేశ్వర్లు, గడ్డం భాస్కర్, డీఎస్.మూర్తి, కుసుమ సతీశ్, వంగ సూర్యనారాయణ, గడ్డం కేశవమూర్తి, పులికంటి రాజేందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి -
చిన్నారుల హాజరు శాతాన్ని పెంచాలి
నల్లబెల్లి: అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలామృతాన్ని పంపిణీ చేస్తూ చిన్నారుల్లో రక్తహీనత, పోషణ లోపాలను నివారించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా సంక్షేమ అధికారి రాజమణి అన్నారు. నర్సంపేట సీడీపీఓ మధుమరిమతో కలిసి అర్వయ్యపల్లిలో నల్లబెల్లి, రుద్రగూడెం సెక్టార్ల సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించని వారిని సున్నితంగా మందలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లబ్ధిదారులకు క్రమం తప్పకుండా పోషకాహారాన్ని అందించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో ఆటాపాటలతో విద్యనందిస్తూ ప్రీస్కూల్ పిల్లల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను ప్రజలకు వివరించాలని టీచర్లను కోరారు. బాలామృతం ప్రయోజనాలపై తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో సూపర్వైజర్ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా సంక్షేమ అధికారి రాజమణి -
కలర్‌ఫుల్.. ఫెస్ట్
నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న స్ప్రింగ్ స్ప్రీ–25 వేడుకలు రెండోరోజు శనివారం కలర్ఫుల్గా సాగాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ సంస్కృతీ సంప్రదాయాల ప్రదర్శనలతో పోటీ పడ్డారు. గీతామాధురి, మ్యాడ్–2 రాకతో ప్రోషో అదిరిపోయింది. కొరియో నైట్‌లో విద్యార్థులు స్టెప్పులతో సందడి చేశారు. ఈ వేడుకలు ఆదివారం ముగియనున్నాయి. – కాజీపేట అర్బన్– వివరాలు 8లోu -
విద్యుదాఘాతంతో వివాహిత మృతి
చెన్నారావుపేట: విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందిన సంఘటన గొల్లభామతండాలో శని వారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన గుగులోత్ మంగ్యా భార్య సునీత (38) రోజు వారీగా వ్యవసాయ పనులకు వెళ్లి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఇంటిలో ఉన్న తీగను ప్రమాదవశాత్తు తాకడంతో విద్యుత్ సరఫరా జరిగి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త మంగ్యా, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సునీత మృతితో గొల్లభామతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇల్లు కట్టుకుంటే బతికేది.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాలో మంగ్యా, సునీత దంపతులకు ఇల్లు మంజూరుకాగా పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఆగిపోయాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టింది. గ్రామ పెద్దలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇంటి స్థలంలోనే తాత్కాలికంగా తడకలతో రేకులషెడ్డు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటిలో పేలిపోయి ఉన్న విద్యుత్ తీగలు గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి గురై సునీత మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇల్లు నిర్మించుకుంటే బతికేది అని తండావాసులు పేర్కొన్నారు. గొల్లభామతండాలో విషాదఛాయలు -
మామునూరు ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత
ఖిలా వరంగల్: మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్ల నిధులు విడుదల చేసిన నేపథ్యంలో శనివారం ఎయిర్పోర్ట్ వద్దకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బీజేపీ శ్రేణులు పీఎం మోదీ ఫ్లెక్సీకి, కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. ఒకరి వేదికపైకి ఒకరు చొచ్చుకురావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్పోర్ట్ అభివృద్ధి తమ వల్లే అంటే.. ఇరు పార్టీల నేతలు పరస్పరం దూషణలతో తోపులాడుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించారు. ఎయిర్ పోర్ట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోటాపోటీగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట -
నమూనా ఇందిరమ్మ ఇంటి పనుల పరిశీలన
సంగెం: మండల కేంద్రంలోని చేపట్టిన నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను జిల్లా హౌసింగ్ పీడీ గణపతి, డీఈలు లాల్‌కిషన్, విష్ణువర్ధన్‌రెడ్డి శనివారం పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని పీడీ అధికారులను ఆదేశించారు. చంద్రుగొండలో చోరీనెక్కొండ: మండలంలోని చంద్రుగొండలో చోరీ జరిగింది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాంకాల రేణుక గత నెల 27న గొర్రెకుంటలో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్లింది. తిరిగి శనివారం ఉదయం ఇంటికి చేరుకోగా చోరీ జరిగిందని గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్స్ నిపుణులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. బీరువాలోని సుమారు 7.5 గ్రాముల బంగారు, 12 తులాల వెండి నగలు, రూ.29 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారని రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
యువతలోని ప్రతిభ వెలికితీసేందుకు
యువతలోని ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు వేదికగా స్ప్రింగ్ స్ప్రీ–25 నిలువనుంది. సంగీతం, నృత్యం, కళలు, వినోదం పలు రంగాల్లోని ప్రతిభను వెలికితీసేందుకు కల్చరల్ ఫెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థుల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు సినీనటుడు బ్రహ్మానందం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. – డి.శ్రీనివాసాచార్య, నిట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కలర్ఫుల్గా కల్చరల్ ఫెస్ట్నాటి ఆర్ఈసీ 1978లో ప్రారంభమైన స్ప్రింగ్‌స్ప్రీ నేడు దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద కల్చరల్ఫెస్ట్గా పేరుగాంచింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సంస్కృతీసంప్రదాయాలను పంచుకునే వేదికగా ఏర్పాటు చేసిందే ఈ వేడుక. నిట్‌లో 41 వసంతోత్సవ వేడుకలను స్ప్రింగ్‌స్ప్రీ–25గా జరుపుకుంటున్నాం. మూడు రోజుల పాటు కల్చరల్ఫెస్ట్ను కలర్ఫుల్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. – బిద్యాధర్ సుబుదీ, నిట్ డైరెక్టర్ ● -
ఆ అధికారులపై చర్యలు ఉండేనా?
● స్టేషన్లలో పంచాయితీలకే ప్రాధాన్యం ● డీజీపీకి ఫిర్యాదుల వెల్లువ ● వివాదంగా మారుతున్న కమిషనరేట్ పరిధి కొందరు అధికారులు తీరు వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కొంతమంది పోలీస్ అధికారులపై వస్తున్న ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అక్రమార్జనే ధ్యేయంగా చేస్తున్న పనులు వివాదాస్పదమవుతున్నాయి. బాధితులకు అండగా ఉండాల్సిన వీరు అక్రమార్కులకు దన్నుగా నిలుస్తున్న సందర్భాలు వెలుగు చూస్తున్నాయి. భూ పంచాయితీల్లో జోక్యంపై ఉన్నతాధికారులు హెచ్చరించినా కొందరిలో మార్పు రావడం లేదు. దీంతో ఏకంగా బాధితులు నేరుగా రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను కలిసి గోడు వెల్లబోసుకుంటున్నారు. తాజాగా మామునూరు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఒంటేరు రమేశ్‌పై డీజీపీకి ఫిర్యాదు అందింది. కొన్ని రోజుల క్రితం ఆత్మకూరు ఇన్స్పెక్టర్ సంతోశ్ తనను పోలీస్‌స్టేషన్‌కు రావొద్దని ఇష్టారీతిన దూషించినట్లు పేర్కొంటూ ఓ బాధితుడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఓ సీనియర్ ఇన్స్పెక్టర్ భూ కబ్జాకు పాల్పడి, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మరో బాధితుడు సీఎం నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నిఘా విభాగం అధికారులతో విచారణ చేయిస్తున్నారు. కొందరు అధికారులకు స్వర్ణయుగం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు మిస్టర్ కూల్‌గా పేరుంది. దీన్ని ఆసరాగా.. అవకాశంగా తీసుకుంటున్న కొంతమంది పోలీస్ అధికారులు భూ పంచాయితీలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా సకాలంలో చర్యలు ఉండకపోవడం, వారిని కట్టడి చేయకపోవడం వల్ల చివరికి ఫిర్యాదులు డీజీపీ వరకు వెళ్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పోస్టింగ్‌ను అడ్డుపెట్టుకొని అడ్డుగోలుగా సంపాదిస్తున్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కమిషనరేట్‌లో కొంతమందికి ప్రస్తుతం సర్ణయుగం నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరిహద్దు వివాదం.. కమిషనరేట్‌కు మచ్చ? ఈనెల 20న రాత్రి అమ్మవారిపేట, భట్టుపల్లి మధ్య యువవైద్యుడిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో మిల్స్‌కాలనీ, మడికొండ పోలీస్ స్టేషన్ల అధికారులు, కాజీపేట, వరంగల్ ఏసీపీలు సరిహద్దు విషయంలో పడిన గొడవ వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు మాయని మచ్చగా మారినట్లు ప్రచారం సాగుతోంది. బాధితుడు రక్తపుమడుగులో ఉండగానే ఈ పరిధి తమది కాదంటే తమది కాదని అధికారులు వాగ్వాదానికి దిగడంతోపాటు ఎవరూ సరైన సయయంలో స్పందించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి ఓ బెల్ట్‌షాప్ యజమానిని నువ్వు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం కోనుగోలు చేస్తావని పోలీసులు తెలుసుకొని సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడం ఆ అధికారుల పనితీరుకు అ ద్దం పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చర్యలు ఎందుకు ఉండట్లేదు? వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న కొంతమంది అధికారులు నిబంధనల గీతను దాటుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు రావడం సహజమైనప్పటికీ విచారణలో నిజం తెలిసినా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అధికారులు కాస్త ముదురు... పరకాల సబ్ డివిజన్ పరిధిలో భూ పంచాయితీలకు వేదికై న ఓ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వాటికే ప్రాధాన్యం ఇచ్చినా.. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. అదే సబ్ డివిజన్ పరిధిలో ఓ ఇన్స్పెక్టర్ తన మద్యం మామూళ్లను పెంచుకుని దుకాణాల యజమానులకు ఫోన్లు చేసి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. సదరు అధికారి తీరుపై ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. దీంతోపాటు ఇటీవల విధుల్లో చేరిన కొత్త కానిస్టేబుళ్లను నోటికి వచ్చినట్లు తిడుతున్నట్లు సమాచారం. మామునూరు సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఓ అధికారి మామూళ్లను పెంచడం, ఇన్స్పెక్టర్కు పంచడం, పంచాయితీల్లో దండుకొని వాటాలు పంచడంలో ఘనాపాటిగా పేరుంది. ఇన్స్పెక్టర్ సైతం భూపంచాయితీల్లో మునిగిపోగా, సదరు సబ్ ఇన్స్పెక్టర్ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌కు భూ పంచాయితీల్లో పెట్టింది పేరు. నిత్యం వందలాది ఫిర్యాదులు. ఏ ఫిర్యాదును ముట్టుకున్నా భూ వివాదమే. దీంతో ఓ అడుగు ముందుకేసి సదరు ఇన్స్పెక్టర్ వాటి పంచాయితీలకు మొదటి ప్రాధాన్యం.. ఆ తర్వాతే లా అండ్ ఆర్డర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హనుమకొండ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో సదరు ఇన్స్పెక్టర్ నిబంధనలు ఎలా ఉన్నా భూ పంచాయితీల్లో తనకు నచ్చని వర్గంపై కేసు నమోదు చేయడం, మరో వర్గాన్ని భయబ్రాంతులకు గురిచేయడం అలవాటుగా మార్చుకున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి నివేదికలు కొంతమంది పోలీస్ అధికారులపై స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నప్పటికి వారు చేస్తున్న దందాలపై నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోకపోవడంపై కొంతమంది ఆ శాఖ అధికారులే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కొంతమంది ఎమ్మెల్యేలు సైతం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాష్ట్ర ఉన్నతాధికారుల సూచనల మేరకు భూ పంచాయితీల్లో తలదూరుస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటారా..లేదా అన్నది వేచి చూడాల్సిందే. -
సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకోవాలి
● అంతర్రాష్ట్ర యువజన సమ్మేళనంలో కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ: రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలతో పాటు రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ–కేరళ అంతర్రాష్ట్ర యువజన సమ్మేళనం జరిగింది. ఈకార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ పి.ప్రావీణ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల వారు ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఇదొక మంచి అవకాశమన్నారు. కేరళ యువత తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను, కేరళ సంస్కృతీ సంప్రదాయాలను ఇక్కడి యువత తెలుసుకోవాలని సూచించారు. తాను కూడా కేరళ రాష్ట్రాన్ని పలుమార్లు సందర్శించానని కలెక్టర్ గుర్తు చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన కేరళ యువతకు డ్రెస్, టోపీలతో కూడిన కిట్లను ఆమె అందించారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పురవీధి సేవలో మల్లికార్జునుడు
ఐనవోలు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు గురువారం మల్లికార్జునస్వామికి వాహన సేవ, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. నిత్య పూజలతో పాటు ఉదయం రావణ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మాఢ వీధుల్లో ఊరేగించారు. సాయంత్రం రథోత్సవం, పురవీధి సేవ, రథాంగ హోమం తదితర కార్యక్రమాలు వేద పండితులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఈఓ అద్దంకి నాగేశ్వర్ రావు, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్ శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, జూనియర్ అసిస్టెంట్ కిరణ్‌కుమార్, ఆలయ అర్చక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ పోలింగ్
సాక్షిప్రతినిధి, వరంగల్/విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ కొనసాగింది. టీచర్లు, అధ్యాపకులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉండగా 10,401 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, మొత్తంగా 92.95శాతం పోలింగ్ నమోదైంది. హనుమకొండ జిల్లాలోని 15 పోలింగ్ కేంద్రాల్లో కలిపి 5,215 మంది ఓటర్లు ఉండగా.. 4,780 మంది (91.66శాతం) తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్లగొండ జిల్లా కేంద్రంలో మార్చి 3న జరగనుంది. హనుమకొండలోని యూనివర్సిటీ లా కాలేజీ, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రాల్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య పోలింగ్ సరళని పరిశీలించారు. వివిధ పోలింగ్ కేంద్రాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి పరిశీలించారు. హనుమకొండలోని యూనివర్సిటీ లా క ళాశాల పోలింగ్ కేంద్రంలో అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. కేడీసీలో నాలుగు పోలింగ్ కేంద్రాలు హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అశోక్ సెంటర్ నుంచి బస్టాండ్ రోడ్డులో ఈ కళాశాల ఉంది. కళాశాల సమీపంలో రహదారికి ఇరువైపులా కొంత దూరం వరకు అభ్యర్థుల మద్దతుదారులు టెంట్లు వేసుకొని పోలింగ్ చిట్టీలు రాసిచ్చారు. ఈ మార్గం సాధారణంగానే నిత్యం రద్దీగా ఉంటుంది. అభ్యర్థుల మద్దతుదారులు, ఓటర్లతో మరింత రద్దీగా కనిపించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. వివిధ పోలింగ్ కేంద్రాలను టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, పూల రవీందర్, పులి సరోత్తంరెడ్డి, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, సుందర్రాజు యాదవ్, యోల చంద్రమోహన్ వేర్వేరుగా సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పట్టభద్రుల్లో కొరవడిన చైతన్యం పట్టభద్రుల్లో చైతన్యం కొరవడడంతో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది. హనుమకొండ జిల్లాలోని నాలుగు మండలాలైన భీమదేవరపెల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, వేలేరు మండలాల్లో 4,585 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా.. 1,780 మంది ఓటర్లు (38.82శాతం) ఓటు వేశారు. పరిశీలించిన సీపీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను సీపీ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. హసన్‌పర్తి, ఎల్కతుర్తి మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై ఏసీపీలు, ఇన్స్పెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ జిల్లాలో.. సాక్షి, వరంగల్ : వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లో 2,352 మంది ఓటర్లకు గానూ 2,214 మంది (94.13 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారద.. సెంట్రల్ డీసీపీ షేక్ సలీమాతో కలిసి వరంగల్ పట్టణంలోని ఇస్లామియా కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. శాయంపేటలో పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్‌కు సీల్ వేస్తున్న సిబ్బంది హనుమకొండ, వరంగల్ జిల్లాలో ఉత్సాహంగా ఓటేసిన ఉపాధ్యాయులు నల్లగొండలోని స్ట్రాంగ్‌రూమ్‌కు బ్యాలెట్ బాక్సుల తరలింపు పలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారులు, సీపీ ఉమ్మడి వరంగల్‌లో జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ వివరాలు.. జిల్లా ఓటర్లు పోలైనఓట్లు శాతం జనగామ 1,002 945 94.31 హనుమకొండ 5,215 4,780 91.66 వరంగల్ 2,352 2,214 94.13 మహబూబాబాద్ 1,663 1,571 94.47 జేఎస్ భూపాలపల్లి 329 308 93.62 ములుగు 628 583 92.83 -
శివున్ని తలచి.. నిప్పులపై నడిచి
ఎల్కతుర్తి: మండలంలోని సూరారం గ్రామ శివారు సింగరాయ విశ్వేశ్వరాలయంలో శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. గురువారం తెల్లవారుజామున అగ్ని గుండాల ప్రవేశం జరిగింది. జాగారం చేసిన భక్తులు దేవదేవున్ని తలుస్తూ నిప్పులపై నడిచి భక్తిని చాటుకున్నారు. మండల కేంద్రంలోని వీరభద్రస్వామి శివాలయంలో అన్నపూజ జరిగింది. నెయ్యి, తేనె, పెరుగన్నం కలిపిన నైవేద్యంతో శివలింగాన్ని అలంకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు పూర్ణాహుతి, కుంకుమాభిషేకం, అన్నపూజ నిర్వహించారు. మహాశివరాత్రి రోజు అంగరంగ వైభవంగా జరిగిన శివకల్యాణం అనంతరం ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరులను వాహనంపై ఎక్కించి గ్రామ పర్యటన నిర్వహించారు. దీంతో భక్తులు కొబ్బరికాయలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించారు. -
ఘనంగా రుద్రేశ్వరుడి నాగవెల్లి
హన్మకొండ కల్చరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరస్వామి రుద్రేశ్వరీ అమ్మవారికి బుధవారం రాత్రి కల్యాణం నిర్వహించారు. మూడో రోజు గురువారం నాగవెల్లి నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ, అర్చకుడు సందీప్, ప్రణవ్ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నూతనవస్త్రాలతో అలంకరించి పూజలు చేశారు. వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. నేడు అన్నపూజ.. శుక్రవారం ఉదయం రుద్రేశ్వరస్వామికి 51 కిలోల పెరుగన్నంతో అన్నపూజ, అనంతరం భక్తులకు మహాన్నదానం జరుగుతుందని ఆలయ ఈఓ అనిల్‌కుమార్ తెలిపారు. తెలుగు బీఓఎస్ చైర్మన్‌గా శంకరయ్యకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ఇన్చార్జ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా ఆ విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మంథిని శంకరయ్య నియమితులయ్యారు. ఈమేరకు గురువారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో తెలుగు విభాగం బీఓఎస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ ఏటూరు జ్యోతి మృతి చెందడంతో వేకెన్సీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఆస్థానంలో శంకరయ్యను నియమించారు. ఉత్తర్వులను వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా శంకరయ్య అందుకున్నారు. నాటక పోటీల విజేతలకు బహుమతుల ప్రదానంహన్మకొండ కల్చరల్: హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో సహృదయ సంస్థ ఆధ్వర్యంలో నాలుగురోజులుగా నిర్వహించిన తెలుగు భాష ఆహ్వాన నాటక పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బుధవారం రాత్రి 11 గంటలకు సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహరబాబు అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో నాటక పోటీల విజేతలకు అందించారు. గుంటూరుకు చెందిన అమరావతి ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘చిగురు మేఘం’ నాటకానికి మొదటి, కొలకలూరుకు చెందిన శ్రీసాయి ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘జనరల్ బోగీలు’ నాటకానికి ద్వితీయ బహుమతి అందించారు. ఉత్తమ నటుడు, నటి, క్యారెక్టర్ నటుడు, హాస్యనటుడు, రచన, దర్శకుడు, సంగీతం, రంగాలంకరణ తదితర విభాగాల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో సహృదయ సభ్యులు మల్యాల మనోహర్, కుందావజ్జుల కృష్ణమూర్తి, వనం లక్ష్మీకాంతారావు, ఎన్వీఎన్ చారి, జూలూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
హనుమకొండ
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20257కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ప్రతీ ఏడాది మాదిరిగా విద్యార్థులే నిర్వాహకులుగా మూడు రోజులపాటు వసంతోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ–25) నిర్వహించనున్నారు. నేటి(శుక్రవారం) నుంచి మార్చి 1, 2 తే దీల్లో నిర్వహించే కల్చరల్ ఫెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. నిట్‌లో ప్రపంచంలోని పలు ప్రాంతాల విద్యార్థులు చదువుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా నిలుస్తున్న ఈక్యాంపస్లో వివిధ దేశాల సంప్రదాయాలను పరస్పరం పంచుకునేందుకు 1978లో వసంతోత్సవం ప్రారంభమై.. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్గా పేరుగాంచింది. దేశవ్యాప్త ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. తొలిరోజు: శుక్రవారం సాయంత్రం అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో హాస్యనటుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత, పద్మశ్రీ బ్రహ్మానందం విద్యార్థులతో చిట్‌చాట్. రెండో రోజు: శనివారం ప్రోషోలో భాగంగా ఇండియన్ రాక్‌బ్యాండ్ వార్డెక్స్ ఫ్యూజన్ మ్యూజిక్‌తో అలరించనున్నారు. డైరెక్టర్ కట్స్‌లో సినీ డైరెక్టర్లతో చిట్‌చాట్. అల్యూర్లో భాగంగా ఫ్యాషన్ షో, నుక్కడ్ నాటక ప్రదర్శన మూడో రోజు: ముగింపులో భాగంగా ఆదివారం పాపులర్ సింగర్ అమిత్ త్రివేది హిందీ, ఇంగ్లిష్ సంగీత విభావరి. నిపుణులతో బైక్‌స్టంట్స్. ఈసారి థీం లేదు: స్ప్రింగ్ స్ప్రీ వేడుకలను ప్రతీ ఏడాది ప్రత్యేక థీంతో నిర్వహించేవారు. 2022లో సృష్టిగా, 2023లో కళాధ్వనిగా, 2024లో రాసంగేన్ థీం (ఇతి వృత్తం) తో నిర్వహించారు. ఈసారి అదేపేరుతో స్ప్రింగ్ స్ప్రీ–25ను నిర్వహించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. నేటి నుంచి నిట్‌లో ‘స్ప్రింగ్ స్ప్రీ–25’ మార్చి 2 వరకు నిర్వహణ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్ హాజరుకానున్న పలు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు ప్రారంభించనున్న హాస్యనటుడు బ్రహ్మానందం -
వసంతోత్సవానికి వేళాయె..
నేటి నుంచి నిట్‌లో ‘స్ప్రింగ్ స్ప్రీ–25’ ● మార్చి 2 వరకు నిర్వహణ ● దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్ ● హాజరుకానున్న పలు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు ● ప్రారంభించనున్న హాస్యనటుడు బ్రహ్మానందం కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ప్రతీ ఏడాది మాదిరిగా విద్యార్థులే నిర్వాహకులుగా మూడు రోజులపాటు వసంతోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ–25) నిర్వహించనున్నారు. నేటి (శుక్రవారం) నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించే కల్చరల్ ఫెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. నాటి ఆర్ఈసీ నేటి నిట్‌లో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా నిలుస్తున్న నిట్‌లో వివిధ దేశాల సంస్కృతీసంప్రదాయలను పరస్పరం పంచుకునేందుకు 1978లో ప్రారంభమైన వసంతోత్సవం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్గా పేరుగాంచింది. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరుకానున్నారు. -
ముగిసిన ఉభయ రాష్ట్రాల నాటక పోటీలు
వర్ధన్నపేట: భారతీయ నాటక కళాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటక పోటీలు బుధవారం రాత్రి ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై బహుమతులు అందజేశారు. ఇందులో ప్రథమ బహుమతి శ్రీసాయి ఆర్ట్స్ కలకులూరు వారి ‘జనరల్ బోగీలు’, ద్వితీయ బహుమతి ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారి ‘కిడ్నాప్’, తృతీయ బహుమతి విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ‘స్వేచ్ఛ’ ప్రదర్శన నిలిచింది. అలాగే ఉత్తమ నటుడు, నటి, హాస్యనటుడు, రచన, దర్శకుడు, సంగీతం, ప్రతినాయకుడు, బాలనటుడు, ఉత్తమ ఆహార్యంతో పాటు పలు విభాగాల్లో ఎంపికై న విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందించారు. నాటక రంగాన్ని ప్రోత్సహించడం అభినందనీయం అంతరించి పోతున్న నాటక రంగానికి భారతీయ నాటక కళాసమితి జీవం పోస్తుందని, 50 ఏళ్లుగా నాటక రంగాన్ని ప్రోత్సహించడం అభినందనీయమని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అనేక మంది కళాకారులకు వేదికగా భారతీయ నాటక కళాసమితి నిలిచిందన్నారు. భారతీయ సంస్కృతీసంప్రదాయాల పరిరక్షణ కళారంగంతోనే సాధ్యమన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే నాగరాజు తన తల్లిదండ్రుల పేరున అన్నదానం చేశారు. కళాసమితి అధ్యక్షుడు ఎండీ అప్సర్, కార్యదర్శి ఈగ సాంబయ్య, సభ్యులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనగా ‘జనరల్ బోగీలు’ బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు -
పోలింగ్ ప్రశాంతం
సాక్షి, వరంగల్: వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉండగా 10,401 మంది ఓటు హ క్కును వినియోగించుకోగా, మొత్తంగా 92.95 శాతం పోలింగ్ నమోదైంది. వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లో 2,352 మంది ఓటర్లకు గానూ 2,214 మంది (94.13 శాతం) తమ ఓటు హ క్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి పరిశీలించింది. ఈ ఎన్నికలో సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, సంగంరెడ్డి సుందర్ రాజుయాదవ్, పులి సరోత్తం రెడ్డి, పింగిలి శ్రీపాల్ రెడ్డి, వెంకటస్వామి తదితరులు మొ త్తం 19 మంది బరిలో ఉన్న విషయం తెలిసిందే. నల్లగొండకు బ్యాలెట్ బాక్స్‌లు... గురువారం ఎన్నికలను పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం బుధవారం మధ్యాహ్నం వరకే పో లింగ్ కేంద్రాలకు బ్యాలెట్ పత్రాలతో పాటు ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న సిబ్బందిని ప్రత్యేక బస్సుల ద్వారా జిల్లాలోని 13 మండలా ల్లోని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జ ర్వర్, సెక్టోరియల్ అధికారులు పనిచేశా రు. అలాగే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఏ ర్పాటు చేసిన లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని వీక్షించారు. సెంట్రల్ డీసీపీ షేక్ సలీమాతో కలిసి వరంగల్ ప ట్టణంలోని ఇస్లామియా కళాశాలలో ఏ ర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఓటర్లకు కల్పించిన మౌలిక వసతుల గురించి వాకబు చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు జిల్లాలోని 13 మండలాల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా బ్యాలెట్ పత్రాలను బందోబస్తు మధ్య నల్లగొండ జిల్లా కేంద్రానికి తరలించారు. జిల్లాలో పోలింగ్ ప్ర శాంతంగా ముగిసిందని కలెక్టర్ తెలిపారు.జిల్లాలోని 13 మండలాల్లో 94.13 శాతం నమోదు మొత్తం 2,352 ఓటర్లకుగాను 2,214 మంది ఓటింగ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ తీరును పరిశీలించిన కలెక్టర్ సత్యశారద నల్లగొండకు తరలిన బ్యాలెట్ బాక్సులుఉమ్మడి వరంగల్‌లో జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ వివరాలు.. జిల్లా ఓటర్లు పోలైనఓట్లు శాతం జనగామ 1,002 945 94.31 హనుమకొండ 5,215 4,780 91.66 వరంగల్ 2,352 2,214 94.13 మహబూబాబాద్ 1,663 1,571 94.47 జేఎస్ భూపాలపల్లి 329 308 93.62 ములుగు 628 583 92.83– మరిన్ని ఫొటోలు 9లోu -
పొదుపు చేసుకుంటేనే ఆర్థికాభివృద్ధి
సంగెం: మహిళలు పొదుపులు చేసుకుంటే ఆర్థికాభివృద్ధిని సాధిస్తారని ఆర్బీఐ లీడ్ బ్యాంకు జిల్లా అధికారి పల్లవి అన్నారు. గురువారం సంగెం మండలంలోని పల్లారుగూడలో మచ్చాపూర్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా మహిళలకు అవగాహన సదస్సును నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉన్నట్టుగా ఆర్థికంగా ముందుండాలన్నారు. ఏ అవసరం నిమిత్తం రుణం తీసుకున్నరో అందుకోసమే ఉపయోగించుకుని, రుణ వాయిదాలను సకాలంలో చెల్లించి సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే జీవన జ్యోతి, సురక్ష బీమా, అటల్ పెన్షన్ యోజన పథకాలను అర్హత కలిగినవారు ఉపయోగించుకోవాలన్నారు. ఏటీఎం కార్డు నంబర్, సీవీవీ నంబర్ ఎవరికీ చెప్పవద్దన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే 1930కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీబీ హవేలి రాజు, నోడల్ అధికారి శ్రీనివాస్, ఎఫ్ఎల్సీ కౌన్సిలర్లు ప్రేమ్‌కుమార్, భాస్కరచారి, బ్యాంకు మేనేజర్ స్వాతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్బీఐ లీడ్ బ్యాంకు జిల్లా అధికారి పల్లవి -
వరంగల్
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025ప్రయోగాల పాఠశాల.. దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నూతన ఆవిష్కరణలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. – 8లోuఆ అధికారులపై చర్యలు ఉండేనా..? ● స్టేషన్లలో పంచాయితీలకే ప్రాధాన్యం ● డీజీపీకి ఫిర్యాదుల వెల్లువ ● వివాదంగా మారుతున్న కమిషనరేట్ పరిధిలోని కొందరు అధికారులు తీరు వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కొంతమంది పోలీస్ అధికారులపై వస్తున్న ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అక్రమార్జనే ధ్యేయంగా చేస్తున్న పనులు వివాదాస్పదమవుతున్నాయి. బాధితులకు అండగా ఉండాల్సిన వీరు అక్రమార్కులకు దన్నుగా నిలుస్తున్న సందర్భాలు వెలుగు చూస్తున్నాయి. భూ పంచాయితీల్లో జోక్యంపై ఉన్నతాధికారులు హెచ్చరించినా కొందరిలో మార్పు రావడం లేదు. దీంతో ఏకంగా బాధితులు నేరుగా రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను కలిసి గోడు వెల్లబోసుకుంటున్నారు. తాజాగా మామునూరు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఒంటేరు రమేష్‌పై డీజీపీకి ఫిర్యాదు అందింది. కొన్ని రోజుల క్రితం ఆత్మకూరు ఇన్స్పెక్టర్ సంతోశ్ తనను పోలీస్‌స్టేషన్‌కు రావద్దని ఇష్టారీతిగా దూషించినట్లు పేర్కొంటూ ఓ బాధితుడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఓ సీనియర్ ఇన్స్పెక్టర్ భూ కబ్జాకు పాల్పడి, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మరో బాధితుడు సీఎం నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నిఘా విభాగం అధికారులతో విచారణ చేయిస్తున్నారు. కొందరు అధికారులకు స్వర్ణయుగం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు మిస్టర్ కూల్‌గా పేరుంది. దీనిని ఆసరాగా.. అవకాశంగా తీసుకుంటున్న కొంతమంది పోలీస్ అధికారులు భూ పంచాయితీలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా సకాలంలో చర్యలు ఉండకపోవడం, వారిని కట్టడి చేయకపోవడం వల్ల చివరికి ఫిర్యాదులు డీజీపీ వరకు వెళ్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పోస్టింగ్‌ను అడ్డుపెట్టుకొని అడ్డుగోలుగా సంపాదిస్తున్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కమిషనరేట్‌లో కొంతమందికి ప్రస్తుతం సర్ణయుగం నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరిహద్దు వివాదం.. కమిషనరేట్‌కు మచ్చ? ఈనెల 20న రాత్రి అమ్మవారిపేట, భట్టుపల్లి మధ్య యువవైద్యుడిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో మిల్స్‌కాలనీ, మడికొండ పోలీస్ స్టేషన్ల అధికారులు, కాజీపేట, వరంగల్ ఏసీపీలు సరిహద్దు విషయంలో పడిన గొడవ వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు మాయని మచ్చగా మారినట్లు ప్రచారం సాగుతోంది. బాధితుడు రక్తపుమడుగులో ఉండగానే ఈ పరిధి తమది కాదంటే తమది కాదని అధికారులు వాగ్వాదానికి దిగడంతోపాటు ఎవరూ సరైన సమయంలో స్పందించలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు ఓ బెల్ట్‌షాప్ యజమానిని నువ్వు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం కొనుగోలు చేస్తావని తెలుసుకొని సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడం ఆ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. చర్యలు ఎందుకు ఉండటం లేదు...? వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న కొంతమంది అధికారులు నిబంధనల గీతను దాటుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు రావడం సహజమైనప్పటికీ విచారణలో నిజం తెలిసినా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. న్యూస్రీల్ఈ అధికారులు కాస్త ముదురు... పరకాల సబ్ డివిజన్ పరిధిలో భూ పంచాయితీలకు వేదికై న ఓ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వాటికే ప్రాధాన్యం ఇచ్చినా.. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. అదే సబ్ డివిజన్ పరిధిలో ఓ ఇన్స్పెక్టర్ తన మద్యం మామూళ్లను పెంచుకుని దుకాణాల యజమానులకు ఫోన్లు చేసి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. సదరు అధికారి తీరుపై ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. దీంతోపాటు ఇటీవల విధుల్లో చేరిన కొత్త కానిస్టేబుళ్లను నోటికి వచ్చినట్లు తిడుతున్నట్లు సమాచారం. మామునూరు సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఓ అధికారి మామూళ్లను పెంచడం, ఇన్స్పెక్టర్కు పంచడం, పంచాయితీల్లో దండుకొని వాటాలు పంచడంలో ఘనాపాటిగా పేరుంది. ఇన్స్పెక్టర్ సైతం భూపంచాయితీల్లో మునిగిపోగా, సదరు సబ్ ఇన్స్పెక్టర్ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ భూ పంచాయితీల్లో పెట్టింది పేరు. నిత్యం వందలాది ఫిర్యాదులు. ఏ ఫిర్యాదును ముట్టుకున్నా భూ వివాదమే. దీంతో ఓ అడుగు ముందుకేసి సదరు ఇన్స్పెక్టర్ వాటి పంచాయితీలకు మొదటి ప్రాధాన్యం.. ఆ తరువాతే లాండ్ అర్డర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హనుమకొండ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో సదరు ఇన్స్పెక్టర్ నిబంధనలు ఎలా ఉన్నా భూ పంచాయితీల్లో తనకు నచ్చని వర్గంపై కేసు నమోదు చేయడం, మరో వర్గాన్ని భయబ్రాంతులకు గురిచేయడం అలవాటుగా మార్చుకున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి నివేదికలు.. కొంతమంది పోలీస్ అధికారులపై స్థానిక ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నప్పటికి వారు చేస్తున్న దందాలపై నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోకపోవడంపై కొంతమంది ఆ శాఖ అధికారులే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కొంతమంది ఎమ్మెల్యేలు సైతం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాష్ట్ర ఉన్నతాధికారుల సూచనల మేరకు భూ పంచాయితీల్లో తలదూరుస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటారా..లేదా అన్నది వేచి చూడాల్సిందే. -
అందని వేతనాలు
నల్లబెల్లి: పాఠశాల పరిసరాలు, టాయిలెట్స్ శుభ్రం చేస్తూ.. చెట్లకు నీళ్లు పడుతూ.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్న స్కావెంజర్లు వేతనాలు అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఏడు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కూలీ పనులకు వెళ్లినా పూట గడవడం ఇబ్బందిగానే ఉండడంతో పలుచోట్ల ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆర్థికసాయం చేస్తుండగా.. ఇప్పటికై నా వేతనాలు విడుదల చేయాలని స్కావెంజర్లు కోరుతున్నారు. జిల్లాలో 637మంది స్కావెంజర్లు ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తాత్కలికంగా జిల్లాలో 13 మండలాల్లో 637 మంది స్కావెంజర్లను జూలై 2024లో నియమించింది. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా వీరికి వేతనాలు అందించాలని నిర్ణయించింది. అయితే ఎంపికైన నాటి పాఠశాల పరిసరాలు శుభ్రం చేయ డం, టాయిలెట్స్ క్లీన్ చేయడం, చెట్లకు నీరు పట్టడం తదితర పనులు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వేతనం చెల్లిస్తామంటే ఆశతో పనులు చేస్తున్న స్కావెంజర్లకు వేతనాలు సక్రమంగా రాకపోవడంతో నిరాశే మిగిలింది. ఏడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో నిరుత్సాహాని కి గురవుతున్నారు. వేతనాలు సక్రమంగా చెల్లించకపోడంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నామని సంబందిత అధికారులను వేడుకున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వేతనాలు అందించేలా కృషి చేయాలని కోరుతున్నారు.ప్రతి నెల వేతనాలు ఇవ్వాలి విద్యార్థులకు ప్రశాంత వాతావరణం కల్పిస్తున్న మాకు ఏడు నెలలుగా వేతనాలు అందడంలేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వేతనం అందిస్తామని అమ్మ ఆదర్శ కమిటీ వారు చెప్పి పనిలో పెట్టుకున్నారు. వారు చెప్పిన పనులన్నీ చేస్తున్నాం. వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణకు అప్పులు చేస్తున్నాం. అధికారులు స్పందించి వేతనాలు ఇచ్చేలా చూడాలి. – కనకం శిరీష, స్కావెంజర్, పీఎస్ నల్లబెల్లి పెండింగ్ వాస్తవమే.. పాఠశాలల్లో స్కావెంజర్లను ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా నియమించింది. స్కావెంజర్ల గౌరవ వేతనం చెల్లింపులు పెండింగ్ వాస్తవమే.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా త్వరలోనే గౌరవ వేతనాలు చెల్లిస్తాం. – జ్ఞానేశ్వర్, డీఈఓ●కూలికెళ్లినా.. పూటగడవడంలేదంటున్న స్కావెంజర్లు జీతాలు రాక ఏడు నెలలు.. కుటుంబ పోషణ కష్టంగా ఉందని ఆవేదన జిల్లాలో స్కావెంజర్ల వివరాలు.. మండలం స్కావెంజర్ల సంఖ్యచెన్నారావుపేట 37 దుగ్గొండి 36 గీసుగొండ 42 ఖానాపుర్ 28 ఖిలా వరంగల్ 78 నల్లబెల్లి 36 నర్సంపేట 59 నెక్కొండ 49 పర్వతగిరి 39 రాయపర్తి 54 సంగెం 36 వరంగల్ 91 వర్ధన్నపేట 52 మొత్తం 637వేతనాలు ఇలా.. విద్యార్థుల సంఖ్య చెల్లించాల్సిన వేతనం 1 నుంచి 30 వరకు రూ.3 వేలు 31 నుంచి 100 వరకు రూ.6 వేలు 101 నుంచి 250 వరకు రూ.8 వేలు 251 నుంచి 500 వరకు రూ.12 వేలు