Telangana News
-
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట (Sandhya Theatre stampede case) ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టేన్నారు. ఘటన జరిగిన రెండో రోజే బాధిత కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడుంటే ఇంత జరిగేది కాదన్నారు. బన్నీ గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నాడని విమర్శించారు.ప్రతి హీరో అదే చేయాలనుకుంటాడుసోమవారం నాడు మీడియాతో చిట్‌చాట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రతి హీరో తన సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటారు. అలాగే తన అభిమానులకు అభివాదం చేయాలనుకుంటారు. అయితే థియేటర్‌కు వెళ్లేముందే అల్లు అర్జున్ (Allu Arjun) అక్కడి ఏర్పాట్లు చూసుకోవాల్సింది. ఇంటికి వెళ్లి పరామర్శించాల్సిందిఅభిమాని చనిపోయినప్పుడు వెంటనే వారి ఇంటికి వెళ్లి పరామర్శించాల్సింది. ఇక్కడ మానవతా దృక్పథం లోపించినట్లయింది. రెండో రోజే వెళ్లి మాట్లాడుంటే ఇంత జరిగేది కాదు. అల్లు అర్జున్ కాకపోయినా కనీసం టీమ్ అయినా సంతాపం చెప్పాల్సింది. అలాగే సారీ చెప్పడానికి పలు విధానాలుంటాయి. తన పేరు చెప్పలేదని రేవంత్.. బన్నీని అరెస్టు చేశారనడం కూడా పెద్ద తప్పు. రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత. తొక్కిసలాటమనమెంత ప్రముఖులమైనా న్యాయం అందరికీ సమానమే అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే! ఈ ఘటనపై పోలీసులు థియేటర్ యాజమాన్యంతోపాటు అల్లు అర్జున్‌పైనా కేసు నమోదు చేశారు. చదవండి: సంధ్య థియేటర్: పవన్ కల్యాణ్ ఎవర్గ్రీన్ రికార్డ్‌ను కొట్టేసిన 'పుష్ప' -
సీఎం రేవంత్‌తో భేటీ.. అందుకే చిరంజీవి రాలేదు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. గురువారం ఉదయం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలుగు దర్శక నిర్మాతలతో పాటు హీరోలు నాగార్జున, వెంకటేశ్, కిరణ్ అబ్బవరం తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఈ విషయంలో సినీ హీరోలదే బాధ్యత: సీఎం రేవంత్)అయితే ఇండస్ట్రీకి పెద్దన్నగా ఉండే చిరంజీవి(Chiranjeevi) మాత్రం సీఎం భేటీకి దూరంగా ఉన్నాడు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాడు. చిరంజీవి కావాలనే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి భేటీకి దూరంగా ఉన్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏంటంటే.. ప్రస్తుతం చిరంజీవి హైదరాబాద్‌లోనే లేరు. అందుకే చిరంజీవి సీఎం భేటీకి హాజరు కాలేదని ఆయన పీఆర్ వర్గాలు చెబుతున్నాయి.స్నేహం కోసం చెన్నై.. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు వచ్చినా చిరంజీవి ముందు ఉండేవాడు. గతంలో అనేక సార్లు ఇండస్ట్రీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇటీవల టాలీవుడ్లో జరుగుతున్న పరిమాణాలు అందరికి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం..అసెంబ్లీలో సీఎం రేవంత్ సినీ స్టార్లపై కామెంట్స్ చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి, టాలీవుడ్ మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజు రంగంలోకి దిగి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించాడు. అయితే ఈ భేటీలో చిరంజీవి కూడా పాల్గొంటారని ప్రచారం జరిగింది. నిన్నటి వరకు చిరంజీవి హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఖరారు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం చిరంజీవి చెన్నై వెళ్లారు. అక్కడ తన స్నేహితుడి కొడుకు పెళ్లి వేడుకలో పాల్గొననున్నారు. ఆ కారణంతోనే చిరంజీవి సీఎం భేటీకి హాజరు కాలేకపోయాడని ఆయన పీఆర్ టీమ్ చెప్పింది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
సంధ్య థియేటర్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. తొక్కిసలాట ఘటన గురించి తనకు పోలీసులు సమాచారం అందించలేదని అల్లు అర్జున్ చెప్తోంటే.. ఒక మహిళ చనిపోయిందన్న విషయం కూడా హీరోకు తెలియజేశామని పోలీసులు అంటున్నారు. అయినా సరే పట్టించుకోకుండా తన సినిమా పూర్తయ్యేవరకు అల్లు అర్జున్ అక్కడే ఉంటానన్నాడని తెలిపారు.బౌన్సర్లకు వార్నింగ్పదిహేను నిమిషాల తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడన్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పది నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం సంధ్య థియేటర్ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేనన్నారు. అలాగే బౌన్సర్లకు, బౌన్సర్ల ఏజెన్సీలకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులనే తోసుకుని వెళ్తున్న బౌన్సర్లకు అడ్డుకట్ట వేసే అవసరం ఉందన్నారు.(చదవండి: ఒకరు చనిపోయారని చెప్పినా అల్లు అర్జున్ సినిమా చూశాకే వెళ్తానన్నారు: ఏసీపీ)వారిదే పూర్తి బాధ్యతపోలీసులపై, పబ్లిక్పై చేయి వేసినా, ముట్టుకున్నా వారిని వదిలిపెట్టమన్నారు. జనాలను తోసేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా ఓవరాక్షన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లను పెట్టుకున్న వారిదే పూర్తి భాధ్యత అని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. చదవండి: ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ రిక్వెస్ట్.. అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ -
5 లక్ష్యాలతో కాంగ్రెస్.. తెలంగాణ అప్పుల పాలు చేసి ఫామ్ హౌస్ లో రిలాక్స్
-
కాంగ్రెస్ పాలనపై బీజేపీ చార్జ్‌షీట్
-
నేడు పాలమూరులో రైతు పండుగ బహిరంగసభ.. హాజరుకానున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆగ్రహం
-
తప్పిన పెను ప్రమాదం
-
లగచర్ల ఘటనపై సమీక్ష.. పరారీలో ఉన్నవారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు
-
శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ
-
మైనర్ కారు డ్రైవింగ్.. యువతి బలి
-
కాంసన్ హైజెన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం..
-
సామాజిక న్యాయం జరగాలంటే కులగణన అవసరం
-
ప్రధాని మోదీ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
-
రేవంత్ రెడ్డి పదవిపై బీజేపీ Vs కాంగ్రెస్
-
కొడుకు, కోడలు కలిసి తండ్రిపై దాడి
-
తెలంగాణలో గ్రూప్ -1 టెన్షన్..టెన్షన్
-
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
-
సీఎం రేవంత్ కు హరీష్ రావు కౌంటర్
-
మూసీ ప్రక్షాళనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
-
తెలంగాణలో బతుకమ్మ పండుగ సందడి
-
కాసేపట్లో హైకోర్టుకు 'హైడ్రా' కమిషనర్ రంగనాథ్
-
హైడ్రాకు ఇక పూర్తి స్వేచ్ఛ... సంస్థకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ కేబినెట్ సమావేశంలో నిర్ణయం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
భారీ ఎత్తున ఆందోళనకు సిద్ధమైన కౌశిక్ రెడ్డి
-
తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన గాంధీ, కౌశిక్ రెడ్డి ఎపిసోడ్