IPL 2024: క్రికెట్‌ అభిమానులకు ఆర్టీసి ఎండీ సజ్జనార్‌ గుడ్ న్యూస్.. | TSRTC MD VC Sajjanar Message To Cricket Fans Ahead Of SRH Vs CSK Match In Uppal - Sakshi
Sakshi News home page

IPL 2024: క్రికెట్‌ అభిమానులకు ఆర్టీసి ఎండీ సజ్జనార్‌ గుడ్ న్యూస్..

Published Fri, Apr 5 2024 1:25 PM | Last Updated on Fri, Apr 5 2024 1:46 PM

TSRTC MD VC Sajjanar Message To Cricket Fans - Sakshi

ఐపీఎల్‌-2024 సందర్భంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఈరోజు (05-04-2024) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ని వీక్షించడానికి భారీగా అభిమానులు వెళ్లనున్నారు.

దీంతో స్టేడియం పరసర ప్రంతాల్లో సాధారణ ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి ట్విట్టర్ లో ఆర్టీసి ఎండీ సజ్జనార్‌ "ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి.

ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి #TSRTC నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంట‌లకు ప్రారంభ‌మై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బ‌య‌లుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని #TSRTC యాజమాన్యం కోరుతోందని తెలిపారు".

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement