busses
-
డబుల్ డెక్కర్ వద్దే వద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లపై గంభీరంగా విహరించిన ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కనిపించటం లేదు. గతంలో తీవ్ర నష్టాలు రావటంతో వాటిని క్రమంగా వదిలించుకున్న ఆర్టీసీ, ఇక డబుల్ డెక్కర్ బస్సుల ఊసును పూర్తిగా తెరమరుగు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అశోక్‌లేలాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీతో ఉన్న టెండర్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్టు తెలిసింది. అప్పట్లో.. కేటీఆర్ కోరిక మేరకు నగరంలో 2004 చివరి వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. నిర్వహణలో నష్టాలు పెరుగుతుండటంతో వాటిని ఆర్టీసీ పక్కన పెట్టేసింది. మూడేళ్ల క్రితం నగరవాసి ఒకరు పాత డబుల్ డెక్కర్ ఫొటోను షేర్ చేస్తూ, నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపితే బాగుంటుందని సామాజిక మాధ్యమం ద్వారా కోరారు.దీనికి నాటి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి, ఆ బస్సులు నడిపే అవకాశాన్ని పరిశీలించాలని రవాణా శాఖను కోరారు. దీనికి రవాణాశాఖ సై అనటంతో ప్రయోగాత్మకంగా కొన్ని డబుల్ డెక్కర్ బస్సులు కొని నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. చాలా రోడ్లపై ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ వంతెనలు ఏర్పడటంతో, వాటిని నడిపేందుకు ఇబ్బంది లేని కొన్ని మార్గాలను ఎంపిక చేసింది. సుచిత్ర మీదుగా సికింద్రాబాద్–మేడ్చల్ మధ్య, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్–పటాన్చెరు, అమీర్‌పేట మీదుగా కోటి–పటాన్చెరు, సీబీఎస్–జీడిమెట్ల, దుర్గం చెరువు కేబుల్ వంతెన మీదుగా నడపాలని నిర్ణయించింది. ఇక దేశంలోని పలు నగరాలకు డబుల్ డెక్కర్ బస్సులను సరఫరా చేస్తున్న స్విచ్ మొబిలిటీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ధర విషయంలోనూ ఆర్టీసీతో చర్చలు జరిపి ఖరారు చేసింది. సర్కారు మార్పుతో మారిన సీన్ అంతా.. ఓకే అనుకుని బస్సులు సరఫరా చేసే వేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఫ్లైఓవర్లు, పాదచారుల వంతెనలతో డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ ఇబ్బందే కాకుండా నష్టాలు రావటం తథ్యమన్న భావనతో ఉన్న ఆర్టీసీ నాటి మంత్రి కేటీఆర్ కోరిక మేరకు అయిష్టంగానే వాటి కొనుగోలుకు ఒప్పుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు తెలిసింది. ఓల్వో లాంటి విదేశీ బ్రాండ్ బస్సుల నిర్వహణనే భారంగా భావిస్తున్న ఆర్టీసీ.. ఏకంగా ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.2 కోట్లయ్యే డబుల్ డెక్కర్ బస్సుల జోలికి పోవద్దని నిర్ణయించుకుంది. స్విచ్ మొబిలిటీ సంస్థకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్ కోసం డబుల్ డెక్కర్ బస్సుల తయారీ ప్రయత్నాన్ని విరమించుకుందని తెలుస్తోంది. ఆ బస్సులను ఆర్టీసీకి ఇవ్వొచ్చు కదా.. ప్రస్తుతం నగరంలో హెచ్ఎండీఏ 6 డబు ల్ డెక్కర్ బస్సులు తిప్పుతోంది. వాస్తవానికి పర్యాటకుల పేరుతో అవి రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నాయి. అంత ఖరీదైన బస్సులను ఇలా వృథాగా తిప్పే బదులు.. వాటిని సాధారణ ప్రయాణికుల సర్విసులుగా వినియోగిస్తే, ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా ప్రభు త్వం ఆలోచించి ఆ బస్సులను హెచ్ఎండీఏ నుంచి ఆర్టీసీకి స్వాధీనం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆర్టీసీలో కొత్తగా సెమీ డీలక్స్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్టీసీ కొత్తగా మరో కేటగిరీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఎక్స్‌ప్రెస్– డీలక్స్ కేటగిరీల మధ్య.. సెమీ డీలక్స్ పేరుతో వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. తద్వారా టికెట్ల ఆదాయం కాస్త పెరుగుతుందని, సిబ్బందికి వేతన సవరణతో పెరిగే భారం పూడుతుందని భావిస్తోంది. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇటీవల ఆరు బృందాలతో రెండు దఫాలుగా మేధోమథనం నిర్వహించి, సూచనలను స్వీకరించింది. అందులోంచి ముఖ్యమైన, అమలు చేయదగిన వాటిని గుర్తించింది. సెమీ డీలక్స్ సర్వీసు కూడా అందులో ఉన్నట్టు సమాచారం. వేతన సవరణ భారంతో.. ఆర్టీసీ సిబ్బందికి రెండు వేతన సవరణ (పీఆర్సీ)లు బకాయి ఉంది. అందులో ఒకదాన్ని అమలు చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌ను కూడా ప్రకటించింది. వచ్చే నెల నుంచే ఇది అమల్లోకి రానుంది. సంస్థపై రోజుకు రూ.కోటి వరకు వేతన భారం అదనంగా పెరగనుంది. దీనితో ఆ మేర ఆదాయాన్ని పెంచుకోవడంపై ఆర్టీసీ దృష్టి సారించింది. ఎక్స్‌ప్రెస్‌ల కంటే కాస్త ఎక్కువగా.. ప్రస్తుతం ఆర్టీసీలో బాగా డిమాండ్ ఉన్న కేటగిరీ.. ఎక్స్‌ప్రెస్ సర్వీసు. మిగతా కేటగిరీ బస్సుల కంటే వీటి సంఖ్య ఎక్కువ. దీనిపై ఉన్న డీలక్స్ సర్వీస్ బస్సుల సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు ఈ రెండు కేటగిరీల మధ్య సెమీ డీలక్స్ పేరుతో కొత్త కేటగిరీ ప్రారంభించాలన్నది ఆలోచన. ఎక్స్‌ప్రెస్ బస్సుల కంటే కొంత ఎక్కువ చార్జీతో టికెట్ ధరలు ఖరారు చేయాలని భావిస్తున్నారు. తక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్న బస్సులను గుర్తించి.. వాటిని ఈ కొత్త కేటగిరీకి తగ్గట్టుగా మార్చి నడుపుతారు. దీనితో రోజువారీ టికెట్ ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ బస్సులతో పోలిస్తే.. మరికొంత దూర ప్రాంతాలకు వీటిని తిప్పుతారని.. సీట్లు కూడా కాస్త మెరుగ్గా పుష్బ్యాక్ తరహాలో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. మహాలక్ష్మితో తగ్గిన టికెట్ వసూళ్లు రాష్ట్రంలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీకి నేరుగా వసూలయ్యే టికెట్ ఆదాయం భారీగా తగ్గింది. సంస్థకు టికెట్ల ద్వారా రోజుకు రూ.16 కోట్ల వరకు సమకూరే ఆదాయం.. రూ.పదిన్నర కోట్లకు పడిపోయింది. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది. కానీ ఇంకా ప్రభుత్వం నుంచి ఈ నిధుల విడుదల మొదలుకాలేదు. దీనితో టికెట్ ఆదాయం పెంపుపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. -
IPL 2024: క్రికెట్ అభిమానులకు ఆర్టీసి ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్..
ఐపీఎల్-2024 సందర్భంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు (05-04-2024) సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ని వీక్షించడానికి భారీగా అభిమానులు వెళ్లనున్నారు. దీంతో స్టేడియం పరసర ప్రంతాల్లో సాధారణ ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి ట్విట్టర్ లో ఆర్టీసి ఎండీ సజ్జనార్ "ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి #TSRTC నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని #TSRTC యాజమాన్యం కోరుతోందని తెలిపారు". క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా… pic.twitter.com/FxQT9joKAl — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 5, 2024 -
‘అద్దె బస్సు’ డిమాండ్లు పరిశీలిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అద్దె బస్సు నిర్వాహకుల డిమాండ్లను పరిశీలించి వాటి అమలు సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. వారం రోజుల్లో నివేదికను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాక రద్దీ విపరీతంగా పెరగటంతో ఐదు రకాల సమస్యలు ఎదురవుతు న్నాయని, వాటిని పరిష్కరించాలంటూ కొద్దిరోజులుగా అద్దె బస్సు యజ మానులు కోరుతున్నారు. అయినా ఆర్టీసీ స్పందించటం లేదని ఆరో పిస్తూ శుక్రవారం నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. గురువారం ఉదయం అద్దె బస్సు యజమానుల సంఘం ప్రతినిధులు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయి సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆయన వెంటనే ఎండీతో మాట్లాడి, సంఘం ప్రతినిధులతో చర్చించాలని స్పష్టం చేశారు. చర్చలు జరిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంత్రి ఆదేశాల మేరకు బస్‌భవన్‌లో ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులతో కలిసి సంఘం ప్రతినిధులతో చర్చించారు. బస్సుల్లో రద్దీ ఎక్కువై డీజిల్ వినియోగం పెరిగినందున కేఎంపీల్ను జిల్లా సర్వీసుల్లో 4.50కి, సిటీలో 4కు మార్చాలని, టైర్లు ఎక్కువగా అరుగుతున్నందున ఆర్టీసీకి అందించే బల్క్ ధరలకే తమకూ కొత్త టైర్లు కేటాయించాలని, ఓవర్ లోడింగ్‌తో నిర్వహణ ఖర్చులు పెరిగినందున అద్దె మొత్తాన్ని రూ.3 చొప్పున పెంచాలని వారు కోరారు. దీనిపై కమిటీ వేసి అమలు సాధ్యాసాధ్యా లపై నిర్ణయం తీసుకుంటామని ఎండీ సజ్జనార్ వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు సమ్మె ప్రతిపాదనను సంఘం ప్రతినిధులు విరమించుకున్నట్టు సమావేశానంతరం ఎండీ ప్రకటించారు. యధావిధిగా బస్సులు నడుస్తాయని, సంక్రాంతికి ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉంటాయని, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఇబ్బందుల్లేకుండా కొనసాగుతుందని వెల్లడించారు. సమావేశంలో ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, వినోద్, అధికారులు మైపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి సహా పలువురు బస్సు యజమానుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ శుభవార్త
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా తేదిల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది. “బతుక్మమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కొరకు సంస్థ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ని సంప్రదించాలి.” టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు. దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని #TSRTC నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 21, 2023 -
బస్సులో మొదట మహిళ ఎక్కితే.. కలిసిరాదా..? ఇది ఏం మూఢత్వం..?
భువనేశ్వర్: శాస్త్ర సాంకేతికత పెరిగినా మనిషి మూఢత్వాన్ని వదలడంలేదు. ఎవరో ఎదురువస్తే మంచిదంటూ, మరెవరో వస్తే చెడు జరుగుతుందంటూ కొందరు భావిస్తున్నారు. ఏదో ఒక విధంగా ఏదో ఒక వర్గంపై వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఒడిశాలో ఎదురైంది. కొత్తగా తీసుకువచ్చిన బస్సుల్లో మహిళలను మొదటి ప్యాసింజర్‌గా ఎక్కకుండా ఆపేసిన ఘటనపై ఒడిశా మహిళా కమిషన్ మండిపడింది. ఇలాంటి వివక్షను ఆపేయాలని రవాణా డిపార్ట్మెంట్కు సూచనలు చేసింది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా తీసుకువచ్చిన బస్సుల్లో మహిళలను మొదటి ప్యాసింజర్‌గా ఎక్కకుండా భువనేశ్వర్‌లోని బారాముండా బస్సు స్టేషన్లో ఆపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాజిక కార్యకర్త ఘాసిరామ్ పాండా రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కమిషన్ రాష్ట్ర రవాణా యంత్రాంగానికి తగు సూచనలు చేసింది. మహిళలు మొదటి ప్యాసింజర్‌గా ఎక్కితే.. ఆ రోజు బస్సుకు ప్రమాదమో లేక తక్కువ వసూలు చేయడమో జరుగుతుందని భావించడం వివక్షాపూరితం అంటూ తెలిపింది. ఇది పూర్తిగా మూఢత్వం అని పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన మహిళా కమిషన్.. మహిళలను తొలి ప్రయాణికులుగా ఎక్కేందుకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని రవాణాశాఖకు సూచనలు చేసింది. గతంలోనూ ఈ తరహా ఘటనలు వెలుగుచూసినట్లు గుర్తుచేసింది. ఇకముందు మహిళా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా వారి గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు తమ మొదటి ప్యాసింజర్‌గా మహిళలనూ అనుమతించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సిబ్బందికి ఈ మేరకు అవగాహన కల్పించాలని కోరింది. బస్సుల్లో మహిళల రిజర్వేషన్‌ను 50 శాతానికి పెంచాలని మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ -
తెలంగాణ ఆర్టీసీ బస్సులు డొక్కుడొక్కు.. అద్దె బస్సులపై కన్ను?
సాక్షి, హైదరాబాద్: బస్సులు సరిపోక ఇబ్బంది పడుతున్న ఆర్టీసీ అద్దె బస్సులను కొనుక్కునే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 3,100 అద్దె బస్సులు కొనసాగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు సొంతంగా బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిచ్చి తిప్పుతున్న విషయం తెలిసిందే. 2019లో ఆర్టీసీలో సమ్మె జరిగిన సమయంలో ప్రభుత్వం వాటిని పెంచుకునేందుకు అనుమతించి టెండర్లు పిలవడంతో వాటి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కానీ ఇప్పుడు వాటిల్లో చాలా బస్సులు నడవటం లేదు. వాటిని కొనేందుకు ఆర్టీసీ ఆలోచిస్తోంది. వాటినే ఎందుకు? ఆర్టీసీ కొన్నేళ్లుగా సరిపడినన్ని బస్సులు కొనటం లేదు. 2015లో 800 బస్సులు కొనటం మినహా ఆ తర్వాత కొత్తవి సమకూర్చుకోలేకపోయింది. దీంతో క్రమంగా ఉన్న బస్సులు పాతబడి డొక్కుగా మారిపోయాయి. గత్యంతరం లేక వాటినే మరమ్మతు చేసుకుంటూ, నిత్యం మెయింటెనెన్స్ పనులు జరుపుతూ నెట్టుకొస్తోంది. కొన్ని సరిగా నడవని పరిస్థితి ఉంది. ఆదివారం వికారాబాద్ శివారులో అనంతగిరి గుట్ట దిగుతూ ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఇది డొక్కు బస్సు కావటం వల్లనే అదుపు తప్పిందని కార్మిక సంఘాలు ఆరోపణలు ఎక్కుపెట్టాయి. ఇలాంటి బస్సులు దాదాపు రెండున్నర వేలున్నాయని పేర్కొంటున్నారు. ఇటీవలే 675 కొత్త బస్సుల కోసం టెండర్ల ప్రక్రియ ముగిసింది. అవి వచ్చే మార్చి నాటికి చేతికందబోతున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న కొరతను అవి తీర్చలేవు. ఈ నేపథ్యంలో అద్దె బస్సులవైపు ఆర్టీసీ దృష్టి సారించింది. నిష్క్రమించినవి 600 కొన్ని నెలలుగా గిట్టుబాటు ఉండటం లేదంటూ అద్దె బస్సు నిర్వాహకులు క్రమంగా వైదొలుగుతూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 600 బస్సులు అలా అర్టీసీ నుంచి నిష్క్రమించాయి. ఇంకా చాలామంది యజమానులు వాటిని విరమించుకునే యత్నంలో ఉన్నారు. ఆరేడేళ్ల వయసున్న బస్సులను వారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల ధరకు విద్యాసంస్థలు, ఇతర సంస్థలకు అమ్ముకుంటున్నారు. ఆర్టీసీ అదే కొత్త బస్సు కొనాలంటే రూ.35 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తుంది. తక్కువ ధరలో వస్తున్నందున ఆ బస్సులను కొని సొంత వర్క్‌షాపులో మెరుగుపరిస్తే కనీసం ఏడెనిమిదేళ్ల వరకు ఇబ్బంది ఉండదనేది అధికారుల యోచన. ఆ బస్సుల కొనుగోలు ఎంతవరకు సరైన నిర్ణయమనేది తేల్చేందుకు ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చే నిర్ణయం ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. ఈలోపు ఎన్ని అద్దె బస్సులు అమ్మకానికి ఉన్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. ఇదీ చదవండి: ఆరోగ్యశ్రీ కింద.. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం -
చట్టానికి దొరక్కుండా... ఆన్లైన్ గేమింగ్
సాక్షి, హైదరాబాద్: కలర్ ప్రిడెక్షన్ గేమ్.. లోన్ యాప్స్.. నిర్వహణలో ఉన్న లోపాల కారణంగానే విషయం పోలీసు కేసుల వరకు వెళ్లిందని చైనీయులు భావిస్తున్నారా? అంటే అవుననే జవాబు చెబుతున్నారు సైబర్ క్రైమ్ అధికారులు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ విషయంలో చట్టానికి దొరక్కుండా వ్యవహారాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో అందుబాటులోకి వస్తున్న ఆన్లైన్ గేమ్స్‌లో అత్యధికం చైనీయులకు సంబంధించినవే అని స్పష్టం చేస్తున్నారు. తాజా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ గేమింగ్ యాప్స్‌పై చర్యలకు అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు. గెలిపిస్తూ బానిసలుగా మార్చి.. ఎదుటి వ్యక్తికి తమ గేమ్‌కు బానిసలుగా మార్చడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. వీటికి ఆకర్షితులవుతున్న వాళ్లు (ప్రధానంగా యువత) వాటిని ఇన్స్టాల్ చేసుకుని ఆడటం మొదలెడుతున్నారు. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తుంటాయి. దాని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. మొదట వాటిని ఫ్రీగా ఇచ్చి.. ఇలా తమ గేమ్‌కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్‌లో ఓడిపోయేలా చేస్తారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన వారిలో కలిగిస్తారు. దీనికోసం టిప్స్ ఇస్తున్నామంటూ కొన్ని యూసీ పాయింట్లను ఉచితంగా ఇస్తారు. ఆడే వ్యక్తి వీటికి అలవాటుపడిన తర్వాత యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ సందేశాలు పంపిస్తారు. వాటికి అవసరమైన రుసుం డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లించాలని షరతు పెడతారు. అప్పటికే ఈ గేమ్స్‌కు బానిసలుగా మారుతున్న వాళ్లు తప్పనిసరై డబ్బు చెల్లించి ముందుకు వెళ్తున్నారు. ఆ గేమ్ ఉచితం కావడంతో... ఇలా భారీ మొత్తాలు కోల్పోయిన అనేక మంది బాధితులు, వారి తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయిస్తున్నారు. వీరి ఫిర్యాదులతో కేసులు నమోదు చేస్తున్నప్పటికీ చర్యలకు మాత్రం ఆస్కారం ఉండట్లేదు. గేమ్ ఆడటానికి డబ్బు వసూలు చేస్తే ఆ కంపెనీపై చర్యలు తీసుకోవచ్చు. అందుకే గేమ్‌ను ఉచితంగా అందిస్తున్న చైనా కంపెనీలు యూసీ పాయింట్ల పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. ఆ గేమ్ ప్రారంభంలో ఎక్కడా ఈ చెల్లంపుల విషయం ఉండదు. ఈ నేపథ్యంలోనే కొన్ని గేమింగ్ యాప్స్‌పై గేమింగ్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉండట్లేదు. జీపీఎస్ మార్చడంతో ఇబ్బంది ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమింగ్‌కు రాష్ట్రంలో అనుమతి లేదు. ఇక్కడ ఎవరైనా ఆ యాప్‌ను ఓపెన్ చేస్తే.. జీపీఎస్ ఆధారంగా విషయం గుర్తించే నిర్వాహకులు గేమ్‌కు అక్కడ అనుమతి లేదంటూ స్క్రీన్‌పై సందేశం కనిపించేలా చేస్తారు. దీంతో వీటికి బానిసలుగా మారిన అనేక మంది ఫేజ్ జీపీఎస్ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ (చదవండి: నష్టాలకు సాకు... బస్సులకు బ్రేక్) -
ఆప్ సర్కార్‌పై మరో దర్యాప్తు.. ‘బస్సుల’పై సీబీ‘ఐ’
న్యూఢిల్లీ: ఆప్ సర్కారుపై మరో దర్యాప్తుకు తెర లేచింది. ఢిల్లీలో 1,000 లో–ఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. టెండరింగ్, బస్సుల కొనుగోలుకు ఢిల్లీ రవాణా కార్పొరేషన్(డీటీసీ) ఆధ్వర్యంలో వేసిన కమిటీకి రవాణా మంత్రిని చైర్మన్‌గా నియమించారు. ఇది ముందస్తు ఒప్పందంలో భాగంగానే జరిగిందని ఎల్జేకు ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారిందని అందులో ఆరోపించారు. దీనిపై ఎల్జే వివరణ కోరగా అక్రమాలు నిజమేనని ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ నివేదిక సమర్పించారు. ఎల్జే ఆదేశాల మేరకు సీబీఐ ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. రెండు ఫిర్యాదులను కలిపి సీబీఐ విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించారు. బస్సుల కొనుగోలులో అవినీతి జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. కేజ్రీవాల్, అవినీతి.. పర్యాయపదాలు: బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అవినీతి అనేవి పర్యాయపదాలుగా మారిపోయాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. సీఎం పదవిలో ఇంకా కొనసాగే అర్హత కేజ్రీవాల్‌కు ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. భాటియా ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ప్రతి విభాగం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కేజ్రీవాల్ మిత్రులకు లబ్ధి చేకూరేలా కాంట్రాక్టులు, టెండర్లు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. నిన్న ఎక్సైజ్ పాలసీలో, ఇప్పుడు బస్సుల కొనుగోలులో అవినీతి బయటపడిందని చెప్పారు. కేజ్రీవాల్ కరడుగట్టిన నిజాయతీపరుడు కాదు, కరడుగట్టిన అవినీతిపరుడని ప్రజలు భావిస్తున్నారని భాటియా వ్యాఖ్యానించారు. బస్సుల కొనుగోలు విషయంలో ‘ఆప్’ సర్కారు కేవలం కొన్ని కంపెనీలకు లాభం కలిగేలా టెండర్ నిబంధనలను, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా విమర్శించారు. ఇదీ చదవండి: డిగ్రీ పరీక్షలు రాయనున్న ప్రధాని మోదీ, ఎంఎస్ ధోని! -
భక్తుల వద్దకే మేడారం బస్సులు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం 51 ప్రాంతాల నుంచి 3,845 బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ బస్సులు అమ్మవారి గద్దెలకు చేరువగా వెళతాయని చెప్పారు. భక్తులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ఐదారు కిలోమీటర్ల దూరంలో వాటిని నిలిపి ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తు చేశారు. మేడారం జాతర నేపథ్యంలో శుక్రవారం ఆయన బస్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. చదవండి: మేడారంలో ‘గుడిమెలిగె’ 30 మంది భక్తులు ఒకేచోట ఉంటే.. వారి చెంతకే బస్సును పంపుతామని, కావాల్సిన వారు 040–30102829 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. మేడారంలో 50 ఎకరాల్లో బేస్ క్యాంపు, తాత్కాలిక బస్టాండ్, క్యూలైన్లు, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన టాయిలెట్ల వసతి ఏర్పాటు చేశామని వివరించారు. మేడారం జాతర వివరాలు, బస్సుల సమగ్ర సమాచారం, సమీపంలో ఉండేందుకు హోటల్ వసతి, చార్జీలు, ఇతర విభాగాల వివరాలతో.. కిట్స్ కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ప్రారంభించారు. -
TSRTC: ‘అదనం’ లేదు
ఆర్టీసీ బస్సులు గత 5 రోజుల్లో 1.30 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. ఆర్టీసీపై ప్రజల్లో అభిమానం ఉందనడానికి ఇదే నిదర్శనం. పండుగ వేళ మిగతా వాళ్లు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితంగా ప్రయాణించి సంస్థకు అండగా నిలవాలి. ప్రయాణికులు తమ భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్టవుతుంది. –ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సాక్షి, హైదరాబాద్: పండుగకు ఊరెళ్లాలంటే జేబులు గుల్లకావడం ఖాయం. ప్రైవేటు ట్రావెల్స్ రెండు మూడు రెట్లకుపైగా చార్జీలు వసూలు చేస్తే.. ఆర్టీసీ కూడా టికెట్ రేటుపై 50శాతం అదనంగా తీసుకునేది. దసరా సహా ప్రతి పండుగకూ మామూలు సర్వీసులను తగ్గించి పండుగ స్పెషల్ బస్సులు వేసేది. కానీ ఈసారి దసరాకు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. సాధారణ బస్సులతోపాటు స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ టికెట్ ధరలనే వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆదరణ పెంచుకునేందుకు కొన్నాళ్లుగా ఆర్టీసీ కునారిల్లుతూ వస్తోంది. సంస్థ నిర్వహణ లోపాల కారణంగా ప్రయాణికుల ఆదరణ తగ్గింది. పండుగల సమయంలోనే కాదు సాధారణ రోజుల్లోనూ.. ఆర్టీసీ కంటే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకే గిరాకీ ఎక్కువగా ఉండటం పెరిగింది. ఈ పరిస్థితిని మార్చడంపై సంస్థ కొత్త ఎండీ సజ్జనార్ దృష్టిపెట్టారు. ఇందుకు దసరా పండుగ సమయాన్ని అవకాశంగా మార్చుకోవాలని నిర్ణయించారు. సాధారణంగా పండుగల సమయంలో ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్‌తో నడిపే ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధర 50 శాతం అదనంగా ఉంటుంది. ఈసారి కూడా అదనపు రుసుముతో స్పెషల్ బస్సులు తిప్పాలని అధికారులు భావించినా.. సజ్జనార్ దీనిని వ్యతిరేకించారు. పండుగల సమయంలో లక్షల మంది బస్సుల్లో సొంతూర్లకు వెళతారని, ఇలాంటి సమయంలో అదనపు వసూలును వదిలేయడం వల్ల ప్రజల్లో ఆర్టీసీపై ఆదరణ పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు నిత్యం ఆర్టీసీ బస్సులు ఎక్కితే.. ఆక్యుపెన్సీ రేషియో, ఆదాయం ఆటోమేటిక్‌గా పెరుగుతాయని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు అదనపు చార్జీలేవీ లేకుండానే స్పెషల్ బస్సులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదనపు రాబడి తక్కువ.. చెడ్డపేరు ఎక్కువ.. ఆర్టీసీకి రోజువారీ టికెట్ ఆదాయం గరిష్టంగా రూ.13 కోట్ల వరకు ఉంటుంది. కోవిడ్‌కు ముందు (సమ్మె కాలం కాకుండా) ఈస్థాయి ఆదాయం నమోదైంది. దసరా పండుగకు మూడు రోజుల ముందు, తర్వాత అదనపు బస్సుల వల్ల మరికొంత ఆదాయం పెరుగుతుంది. ఇందులో టికెట్ చార్జీలపై 50శాతం ఎక్కువ ధర తీసుకోవడం వల్ల.. ఆర్టీసీకి అదనంగా సమకూరేది రోజుకు రూ.40 లక్షలేనని అంచనా. ఈ మాత్రం ఆదాయం కోసం.. అదనపు చార్జీల బాదుడు అంటూ ప్రజల్లో చెడ్డపేరు వస్తోందని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. సజ్జనార్ ఈ అంశాలన్నింటినీ పరిశీలించి, అదనపు బాదుడు వద్దనే నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నాయి. అలా ప్రయాణికులను తరలించొద్దు పండుగ వేళ డిమాండ్‌ను ఆసరాగా తీసుకుని కొందరు సాధారణ ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తున్నారని అధికారులు గుర్తించారు. తెలుపురంగు నంబర్ ప్లేట్ ఉన్న (నాన్ కమర్షియల్) వాహనాల్లో ప్రయాణికులను తరలించడం నేరమని.. అలాంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపడతామని ప్రకటించారు. ఇటీవల ఆర్టీసీ–రవాణా శాఖ అధికారుల సంయుక్త తనిఖీల్లో 20 వాహనాలను పట్టుకుని సీజ్ చేశారు. నాన్–కమర్షియల్ వాహనాల్లో ప్రయాణించేప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే బీమా కూడా రాదని అధికారులు పేర్కొంటున్నారు. -
ఊళ్లకు బస్సులు బంద్!
►ఇది మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ– మద్దూర రహదారి. ఈ రెండు మండలాల పరిధిలో 65 ఊళ్లున్నాయి. గతంలో ఆరు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు, మరో ఆరు అద్దె బస్సులు నడిచేవి. ఇప్పుడు కేవలం మూడే ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. అవి కూడా పది, ఇరవై ఊళ్ల్లకే, కొన్ని సమయాల్లోనే నడుస్తున్నాయి. దీంతో జనం ఆటోలు, జీపుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ►నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రం నుంచి చెన్నంపల్లికి కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న జీపు ఇది. ఊళ్లకు బస్సులు లేక ప్రయాణికులు జీపులో, టాప్‌పైన కూడా కూర్చుని వెళ్తున్న దుస్థితి ఉంది. నాగర్‌కర్నూల్ డిపో పరిధిలో 77 పల్లె వెలుగు బస్సులుండగా.. వాటిలో 47 అద్దె బస్సులే. ఇప్పుడవి నడవకపోతుండటం, ఆర్టీసీ బస్సులు ఎక్కువగా ప్రధాన రోడ్లకే పరిమితం కావటంతో పల్లెలకు బస్సులు సరిగా నడవడం లేదు. సాక్షి, హైదరాబాద్: ‘పల్లె బస్సు’మొహం చాటేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారవాణాకు కీలకమైన పల్లె వెలుగు బస్సు ఆగిపోయింది. ఒకటీ రెండు కాదు.. వేల ఊళ్లకు బస్సులు సరిగా నడవడం లేదు. ప్రధాన మార్గాల్లోని ఊర్లు, కొన్ని ముఖ్యమైన మండల కేంద్రాలు, గ్రామాలకు మాత్రమే బస్సులు తిరుగుతున్నాయి. చిన్న గ్రామాలు, ప్రధాన రోడ్లకు దూరంగా ఉన్న ఊళ్లు, మారుమూల పల్లెలకు కొద్దినెలలుగా బస్సులు రావడం లేదు. దగ్గరిలోని పట్టణానికి వెళ్లాలన్నా, ఇతర ఊళ్లకు పోవాలన్నా ఆటోలు, జీపులే దిక్కు అవుతున్నాయి. క్రమంగా ఆ ఊళ్లు ప్రజా రవాణాకు పూర్తిగా దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్, సూపర్‌లగ్జరీ వంటి సర్వీసుల నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్నా.. ఎక్కువ శాతం జనాభాకు పల్లె వెలుగు బస్సులే ఆధారమని, అవి లేకుంటే ఎలాగనే విమర్శలు వస్తున్నాయి. నష్టాలు, బకాయిలతో.. ఆర్టీసీలో ప్రస్తుతం 3,645 పల్లె వెలుగు బస్సులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలను అనుసంధానించి, ప్రజల రవాణా అవసరాలను తీర్చాల్సినవి అవే. ఆ బస్సులు సరిపోవడం లేదు. మరో రెండు వేల బస్సులు అదనంగా వస్తేనే ఊర్లకు ప్రజారవాణా సరిగా అందే పరిస్థితి. కానీ కొత్త బస్సులు రావడాన్ని పక్కనపెడ్తే.. ఉన్న బస్సులే ఆగిపోవడంతో జనం ఆగమాగం అవుతున్నారు. మొత్తం పల్లెవెలుగు బస్సు ల్లో ఆర్టీసీ సొంత బస్సులు 1,935 కాగా, మిగతావి ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దె రూపంలో తీసుకుని నడుపుతున్న బస్సులు. గతంలో అద్దె బస్సులు పరిమితంగా ఉండేవి. 2019లో జరిగిన ఆర్టీసీ సమ్మె తర్వాత వాటి సంఖ్య 3,300కు పెరిగింది. ఇందులో పల్లె వెలుగు సర్వీసుల కింద నడుస్తున్నవి 1,710 బస్సులు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటంతో అద్దె బస్సులకు బిల్లుల చెల్లింపు కొంతకాలంగా నిలిచిపోయింది. దానికితోడు కరోనా లాక్డౌన్లు, జనం ప్రయాణాలు తగ్గిపోవడంతో ఆర్టీసీ పరిస్థితి మరింత దిగజారింది. అద్దె బస్సుల బకాయిలు రూ.100 కోట్లకు చేరుకున్నాయి. ఇటీవలే రూ.25 కోట్లు మాత్రం చెల్లించారు. అయితే అద్దె బస్సులు తిరిగితే ప్రతి నెలా బకాయిలు పెరుగుతూనే ఉంటాయన్న ఉద్దేశంతో కొన్నింటిని ఆపేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. అద్దె బస్సుల్లో ఎక్స్‌ప్రెస్, లగ్జరీ సర్వీసులను కొనసాగించి.. పల్లె వెలుగు బస్సులను నిలిపివేసింది. దీంతో కేవలం ఆర్టీసీ సొంత పల్లె వెలుగు బస్సులు మాత్రమే గ్రామాలకు తిరుగుతున్నాయి. ఉన్నవన్నీ ప్రధాన రూట్లకే పరిమితం కొన్నేళ్లుగా ఆర్టీసీ సొంతంగా బస్సులు కొనటం లేదు. పాతవి మూలనపడిన కొద్దీ అద్దె బస్సులను తీసుకుంటూ తిప్పుతోంది. ఇప్పుడు అద్దె బస్సులు ఆగిపోవడంతో.. పల్లె వెలుగు బస్సుల్లో చాలా వాటిని ప్రధాన రూట్లకు మళ్లించింది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో రెండువేల జనా భా ఉన్న తాడూరు గ్రామానికి ఇటీవలి వర కు ఆరు పల్లె వెలుగు బస్సులు వచ్చేవి. సిద్దిపేట వెళ్లాలన్నా, మండల కేంద్రం చేర్యాలకు వెళ్లాలన్నా అవే ఆధారం. కానీ ఇప్పుడు ఒక్క బస్సు కూడా రావటం లేదు. ఇలాంటి ఊళ్లు ఇప్పుడు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అలుగామ–సిర్సా గ్రామాల మధ్య పరిస్థితి. గతంలో బస్సులు తిరిగిన ఈ రహదారిలో ఇప్పుడన్నీ ప్రైవేటు వాహనాలే కనిపిస్తున్నాయి. బడులు లేవని చెప్తూ.. మొత్తం పల్లె వెలుగు బస్సుల్లో వెయ్యి సర్వీసుల వరకు పాఠశాల విద్యార్థుల కోసం కేటాయించారు. బడుల వేళలకు అనుగుణంగా వాటి సమయాలు నిర్ధారించి ఊళ్లకు తిప్పేవారు. ఇప్పుడు కోవిడ్ వల్ల బడులు మూసి ఉండటంతో ఆ ట్రిప్పులన్నింటినీ రద్దు చేశారు. బడి సమయాల కోసం ఒక్కో బస్సు కనీసం మూడు, నాలుగు ట్రిప్పులు తిరిగేవి. అంటే ఈ లెక్కనే మూడు, నాలుగు వేల ట్రిప్పులు రద్దయ్యాయి. విద్యార్థుల సౌకర్యం కోసం వేసినా.. వాటిలో సాధారణ ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ప్రయాణించేవారు. వారికీ రవాణా వసతి దూరమైంది. ప్రయాణం.. ప్రమాదం ఊళ్లలో ఇటీవల ఆటోలు, జీపుల సంఖ్య పెరిగింది. యువతకు ఉపాధి పేరుతో అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. చాలామంది యువకులు సరిగా డ్రైవింగ్ రాకున్నా ఆటోలు, జీపులు నడుపుతున్నారు. దానికితోడు పరిమితికి మించి జనాన్ని ఎక్కించుకోవడం, రోడ్లు బాగోలేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతు న్నాయి. ఇప్పుడు పల్లె వెలుగు బస్సు ల్లేక జనం పూర్తిగా ఆటోలు, జీపులనే ఆశ్రయించాల్సి వస్తోంది. వాటిని నడిపేవారు అడ్డగోలుగా జనాన్ని ఎక్కిస్తున్నారు. ఇలాంటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగితే ఏమిటన్న ఆం దోళన వ్యక్తమవుతోంది. మరోవైపు వీటిని అడ్డుకుంటే రవాణా వసతి ఉండదన్న ఉద్దేశంతో అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అన్నిచోట్లా అదే దుస్థితి ►మంచిర్యాల జిల్లాలో ఏకైక బస్సు డిపో మంచిర్యాల. ఇక్కడ 141 బస్సులున్నాయి. అందులో 61 అద్దెబస్సులు కాగా.. 80 ఆర్టీసీ సొంత బస్సులు. నిత్యం 25 వేల మంది ప్రయాణిస్తుంటారు. రోజుకు సగటున 23 లక్షల ఆదాయం వచ్చేది. కరోనా రెండో వేవ్ నాటి నుంచి అంటే నాలుగు నెలలుగా అద్దె బస్సులు నడవటం లేదు. మొత్తం 323 గ్రామాలకుగాను 120 రూట్లు ఉన్నా.. ప్రస్తుతం 58 రూట్లలోనే బస్సులు నడిపిస్తున్నారు. పల్లె ప్రాంతాలకు బస్సులు లేక ఇబ్బంది ఎదురవుతోంది. ►మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని కొండాపూర్ జనాభా 4 వేలకుపైనే. అయినా ఈ ఊరికి ఒక్క బస్సు కూడా రావటం లేదు. జనం ఊరుదాటాలంటే ప్రైవేటు వాహనం ఎక్కాల్సిందే. ►వరంగల్ రీజియన్ పరిధిలోని 9 డిపోల పరిధిలో 239 పల్లె వెలుగు రూ ట్లు ఉన్నాయి. ప్రస్తుతంఅందులో 136 రూట్లకు సర్వీసులు నడవటం లేదు. ►యాదగిరిగుట్ట డిపో పరిధిలో పల్లె వెలుగు సర్వీసులకు సంబంధించి అద్దె బస్సులు 38కాగా, ఆర్టీసీ సొంత బస్సు లు 9 మాత్రమే. ఇప్పుడు అద్దె బస్సు లన్నీ నిలిచిపోవడంతో గ్రామాలకు ప్రజారవాణా ఆగిపోయింది. ►ఉమ్మడి మెదక్ జిల్లాలో 239 ఆర్టీసీ సొంత పల్లె వెలుగు బస్సులే తిరుగుతున్నాయి. 234 అద్దె బస్సులు నిలిచిపోయాయి. ►మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ సొంత పల్లె వెలుగు బస్సులు 453 మాత్రమే తిరుగుతున్నాయి. 389 అద్దె బస్సులు ఊళ్లకు వెళ్లటం లేదు. -
విశాఖ జిల్లాలో రోడ్డెక్కనున్న 100 ఎలక్ట్రికల్ బస్సులు
-
రేపటి నుంచి తెలంగాణకు బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
-
మొబైల్ టాయిలెట్లు.. మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్లకూ సౌకర్యం
సాక్షి, బంజారాహిల్స్: నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో టాయిలెట్లు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అందుబాటులో టాయిలెట్లు లేకపోవడంతో పాటు పిల్లలకు పాలు ఇచ్చే సందర్శకులు, రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్లే వారు పడుతున్న ఇబ్బందులు గమనించిన జీహెచ్ఎంసీ మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా నెక్లెస్ రోడ్లో మొబైల్ టాయిలెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల నెక్లెస్ రోడ్‌కు వచ్చే వేలాది మంది పర్యాటకులతో పాటు ఇక్కడ వ్యాపారాలు కొనసాగించే మహిళలకు ఎంతగానో ఉపయోగం చేకూరనుంది. ఇప్పటి వరకు టాయిలెట్లు అందుబాటులో లేకపోవడంతో పడుతున్న ఇబ్బందులకు ఈ నిర్ణయంతో తెరపడినట్లైంది. ►నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్సులను మొబైల్ టాయిలెట్లుగా మార్చారు. ►నగరంలోని ఏడు ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ►వీటిలో ప్రత్యేకంగా స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ►మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్లకు కూడా ఈ మొబైల్ టాయిలెట్లలో సౌకర్యం కల్పించారు. ►ఇప్పటికే 30 మొబైల్ టాయిలెట్లు నగర వ్యాప్తంగా అందుబాటులో ఉండగా... ఖైరతాబాద్ జోన్‌కు కొత్తగా మరో ఐదు మొబైల్ టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు. ►రద్దీ ప్రాంతాలు, సభలు, సమావేశాలు జరుగుతున్న ప్రాంతాల్లో, సందర్శనా స్థలాల్లో, పర్యాటక ప్రాంతాల్లో, పార్కుల వద్ద ఈ మొబైల్ టాయిలెట్లను ఉపయోగిస్తారు. ►వీటిలో మహిళలకు రెండు, పురుషులకు ఒకటి, ట్రాన్స్‌జెండర్స్‌కు ఒకటి చొప్పున నాలుగు యూరినల్స్‌ను ఏర్పాటు చేశారు. ►ఇక పాలిచ్చే మహిళలకు ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ►ఈ మొబైల్ టాయిలెట్ వెనుకాల స్నాక్స్, కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిల్స్ విక్రయానికి గాను ఒక షాపును ఏర్పాటు చేశారు. ►సోలార్ పవర్ విధానం కల్పించిన ఈ మొబైల్ టాయిలెట్ నిర్వహణను ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చారు. ►ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇవ్వడం ద్వారా ఈ మొబైల్ టాయిలెట్ ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ►నిరుపయోగ ఆర్టీసీ బస్సులను మొబైల్ టాయిలెట్లుగా రూపొందించిన నేపథ్యంలో ఇక్కడ విజయవంతమైతే మరిన్ని బస్సులను మొబైల్ టాయిలెట్లుగా తయారు చేయనున్నారు. ►బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజ గుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, లక్డీకాపూల్, రవీంద్రభారతి తదితర ప్రాంత్లాలో కూడా నిరుపయోగ ఆర్టీసీ బస్సులను మొబైల్ టాయిలెట్లుగా మార్చే దిశలో కసరత్తు జరుగుతుంది. ఇందు కోసం ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ►ఈ మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు హర్షణీయమని మహిళలు అంటున్నారు. ►మరిన్ని చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చదవండి: God Of Mischief: లోకి గురించి మీకు ఈ విషయాలు తెలుసా! -
ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై బిడ్లు ఆహ్వానించిన ఏపీఎస్ ఆర్టీసీ
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఎలక్ట్రిక్ బస్సులను ప్రొత్సహించే దిశగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం, 350 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ భావిస్తోంది. ఈ బస్సుల నిర్వహణకు బిడ్స్ ఆహ్వనించామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. అయితే, విశాఖకు 100, విజయవాడ, కాకినాడలకు 50 చొప్పున ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించారు. అమరావతి, తిరుపతి, తిరుమలకు 50 చొప్పున ఈ బస్సులను కేటాయించారు. వీటిని ఉపయోగించడం వలన 50 శాతం బ్యాటరీ ధరలు తగ్గడంతో పాటు, నిర్వహణ ఖర్చు కూడ తగ్గుతుందని పేర్కొన్నారు. కేంద్రం ఎలక్ట్రిక్ బస్సుల ప్రోత్సాహకానికి రూ. 55 లక్షలు అందించనుంది. ఈ బస్సుల నిర్వహణకు ఈ నెల 9వ తేదీ బిడ్స్ దాఖలు చేయడానికి చివరితేదీగా నిర్ణయించారు. చదవండి: వ్యాక్సినేషన్ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం జగన్ -
వామ్మో.. బస్సు కుదుపు ఎంత పనిచేసింది!
సాక్షి, సుల్తాన్‌బజార్: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శనివారం సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.... ఎస్ఆర్నగర్ హాస్టల్లో ఉంటున్న పవన్‌చైతన్య (23) బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన బస్సులో (రూట్ 218 బి) పటాన్చెరువు నుంచి దిల్సుఖ్నగర్ వెళ్తున్నాడు. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో బస్సు కుదుపుకు రాక్‌సైడ్ విండోవద్ద కూర్చున్న పవన్‌చైతన్య ఒక్కసారిగా ఎగిరి పడటంతో తలకు, కుడిపక్క తీవ్ర గాయమైంది. దీంతో తీవ్ర రక్తస్రావమైన పవన్‌చైతన్య ఒక్కసారిగా కుప్పకూలాడు. విషయం తెలుసుకున్న తోటి ప్రయాణికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పవన్ చైతన్యను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పవన్‌చైతన్య మృతిచెందారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రయాణికుడు మృతిచెందాడనే అనుమానంతో డ్రైవర్ గంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మేఘా ఒలెక్ట్రా మెగా డీల్: మరో 350 ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, హైదరాబాద్ : ఎలక్ట్రిక్ బస్సుల (ఈవి) తయారీలో అగ్రగామీగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకుంది. పూణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎల్)కు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనుంది. ఈ మేరకు సంబంధిత అధికారులు గురువారం (28.01.2021) ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ హితం కోసం కాలుష్యాన్ని తగ్గించే దిశలో కేంద్ర ప్రభుత్వ ఫేమ్- 2 పథకంలో భాగంగా ఈ బస్సులను సరఫరా చేయనుంది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) / ఓపేక్స్ మాడల్ ప్రాతిపదికన 12 సంవత్సరాల పాటు ఈ 350 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టనుంది. ఈవీ ట్రాన్స్ ఈ 350 ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నుండి సేకరించనుంది. ఈ 350 బస్సులను ఏడు నెలల్లో ఒలెక్ట్రా సంస్థ అందించనుంది. అందిస్తుంది. కాంట్రాక్ట్ కాలంలో ఈ బస్సుల నిర్వహణ బాధ్యతలు కూడా ఎవీ ట్రాన్స్ పరిధిలోనే ఉంటుంది. మొత్తంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ దాదాపు 1250 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనున్నది. బీఎంటీసీ బిడ్డింగ్ లో ఎల్-1 గా నిలిచిన ఒలెక్ట్రా ఇక భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన గ్రీన్ సిటీ బెంగళూరులో సైతం 300 బస్సులను సరఫరా చేయడానికి పిలిచిన టెండర్లలో ఒలెక్ర్టా సంస్థ ఎల్-1 గా నిలిచింది. ఫేమ్-2 పథకంలో భాగంగా బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థ (బీఎంటీసీ) 300 విద్యుత్ బస్సులకు గాను నిర్వహించిన టెండర్ లో అతి తక్కువగా బిడ్డింగ్ కోట్ చేసి ఎల్-1 గా నిలిచింది. ఈ 300 ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ)/ఓపేక్స్ మాడల్ ప్రాతిపదికన 12 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా చేపడుతుంది. ఈవీ ట్రాన్స్ కి 300 బస్సుల సరఫరాకు అనుమతి లభించిన వెంటనే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ నుంచి 12 నెలల కాలంలో సేకరిస్తుంది. పూణే మహానగర్ పరివహన్ మహామండల్ లిమిటెడ్ నుండి 350 ఎలెక్ట్రిక్ బస్సుల ఆర్డర్ దక్కించుకున్నందుకు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) సీఈఓ అండ్ సీఎఫ్ఓ శరత్ చంద్ర సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ “ఇప్పటికే ఎవీ ట్రాన్స్ ఇప్పటికే పూణేలో 300 ఎలెక్ట్రిక్ బస్సులను నడుపుతున్నామని ఈ కొత్త బస్సుల రాకతో ఈ సంఖ్య 650 లకు చేరిందన్నారు. దేశంలోని ఒక రాష్ర్టంలో అత్యధికంగా బస్సులను సరఫరా చేసిన ఘనత ఒలెక్ర్టాకే చెందుతుందని తెలిపారు. ఒలెక్ర్టా ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ర్టాలలో ప్రయాణికులను గమ్యం చేరుస్తున్నాయి. దేశంలో మొట్టమొదటి సారిగా ఒలెక్ర్టా బస్సు 13,000 అడుగుల (3,962.4 మీ) ఎత్తు ఉన్న రోహ్తాంగ్ పాస్ వరకు ప్రయాణం చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. 12 మీటర్ల పొడవు ఉన్న ఈ ఏసీ బస్సులో డ్రైవర్, 33 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో పాటు వీల్ చెయిర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ నియంత్రిత ఎయిర్ సస్పెన్షన్ తో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం పొందగలరు. ప్రయాణికుల రక్షణ కొరకు బస్సులో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా బస్సులో వీల్ చెయిర్ ర్యాంప్, ఎమర్జెన్సీ బటన్, యూఎస్ బీ సాకెట్ ను కూడా ఏర్పాటు చేశారు. బస్సులో అమర్చిన లిథియమ్-ఇయాన్ (Li-ion) బ్యాటరీని ఒకసారి చార్జింగ్ ద్వారా దాదాపు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ అత్యాధునిక సాంకేతిక ఎలక్ట్రిక్ బస్సులో ఉన్న ప్రత్యేకమైన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ద్వారా ప్రయాణంలో ప్రతిసారి బ్రేక్ వేసినప్పుడు కోల్పోయిన చార్జింగ్ ను కొంతమేరకు తిరిగి పొందుతుంది. ఇందులో ఉన్న అతి శక్తివంతమైన ఏసీ చార్జింగ్ వ్యవస్థ ద్వారా బ్యాటరీ 2 నుంచి 5 గంటల్లో మొత్తం చార్జింగ్ అవుతుంది. -
ఒలెక్ట్రాకు మరో 150 బస్‌ల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీ అయిన ఒలెక్ట్రా తాజాగా 150 ఎలక్ట్రిక్ బస్‌ల సరఫరాకై కాంట్రాక్టు పొందింది. దీని విలువ సుమారు రూ.300 కోట్లు. 12 నెలల్లో ఈ బస్‌లను సరఫరా చేస్తారు. ఫేమ్–2 కింద 150 ఎలక్ట్రిక్ బస్లకై పుణే మహానగర్ పరివాహన్ మహామండల్ ఇటీవల నిర్వహించిన టెండర్లలో ఎంఈఐఎల్కు చెందిన మరో అనుబంధ కంపెనీ ఈవీ ట్రాన్స్ లోయెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. ఈవీ ట్రాన్స్ ఈ బస్‌లను ఒలెక్ట్రా నుంచి కొనుగోలు చేసి.. పుణే మహానగర్ పరివాహన్ మహామండల్‌కు అద్దె ప్రాతిపదికన సరఫరా చేస్తుంది. మొత్తం 900 బస్‌లు.. తాజా ఆర్డర్‌తో కలిపి దేశవ్యాప్తంగా వివిధ రోడ్డు రవాణా సంస్థలకు ఒలెక్ట్రా సరఫరా చేయనున్న ఎలక్ట్రిక్ బస్‌ల సంఖ్య 900లకుపైగా చేరుకుంది. పుణే మహానగర్ పరివాహన్ మహామండల్‌కు 12 మీటర్ల పొడవున్న బస్‌లను సరఫరా చేస్తారు. బస్‌లో 33 సీట్లు, ఒక వీల్ చైర్ ఏర్పాటు ఉంది. ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్ చేస్తే ట్రాఫిక్నుబట్టి 200 కిలోమీటర్ల వరకు బస్ ప్రయాణిస్తుంది. కాంట్రాక్టు కాల పరిమితి 10–12 ఏళ్లు. ఈ కాలంలో బస్‌ల నిర్వహణ బాధ్యత సైతం ఈవీ ట్రాన్స్ చేపడుతుంది. ఇప్పటికే పుణే నగరంలో ఈవీ ట్రాన్స్ 150 ఎలక్ట్రిక్ బస్‌లను నిర్వహిస్తోందని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సీఈవో, సీఎఫ్‌వో శరత్ చంద్ర బుధవారం తెలిపారు. కొత్త కాంట్రాక్టుతో ఈ సంఖ్య 300లకు చేరుకుందని, దేశంలో ఇదే అత్యధికమని అన్నారు. -
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికులు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం శుభవార్తను అందించింది. దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 3000ల ప్రత్యేక బస్సులు నడుపాలని నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. ఈ ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు అందుబాటులో ఉండనున్నట్లు టీఎస్ ఆర్టీసీ సోమవారం నాటి ప్రకటనలో తెలిపింది. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, ఎస్సార్ నగర్ అమీర్ పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్ పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడవునున్నాయి. పండగ రద్దీ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ చేసుకోవాలని ఆర్టీసీ సూచించింది. (అదనంగా మరో 900 ప్రత్యేక రైళ్లు) -
ఢిల్లీలో మహిళల భద్రతకు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మహిళల భద్రత పెంపొందించే దిశగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. బస్సుల్లో మహిళల భద్రత కోసం మార్షల్స్ సంఖ్యను దాదాపు 10వేలు పెంచుతున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో ప్రభుత్వ వాహనాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పథకంలో భాగంగా కేజ్రీవాల్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘ఈరోజు నేను మీకు ప్రభుత్వ వాహనాల్లో మహిళల భద్రత బాధ్యతను అప్పగిస్తున్నాను. దీని వల్ల వారు బస్సుల్లో తమ ఇంటిలో ఉన్నట్లు భావించి ప్రయాణం చేస్తారు’అని సోమవారం త్యాగరాజ స్టేడియంలో నూతనంగా నియామకమైన మార్షల్స్నుద్దేశించి మాట్లాడారు. మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే సహించకూడదని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఢిల్లీలో 3,400 మంది మార్షల్స్ ఉన్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
బస్సుల్లో వేలాడుతూ.. కత్తులతో విద్యార్థుల వీరంగం
సాక్షి, చెన్నై: నగరంలో కాలేజీ విద్యార్థులు చెలరేగిపోతున్నారు. కత్తులు ప్రదర్శిస్తూ.. ప్రమాదకరమైనరీతిలో బస్సులో ఫుట్‌బోర్డింగ్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. తాజాగా చెన్నైలోని రాజధాని కళాశాల విద్యార్థులు వీరంగం వేశారు. నడుస్తున్న బస్సులో వేలాడుతూ.. ప్రమాదకరరీతిలో కత్తులు ప్రదర్శించారు. అంతేకాకుండా బస్సులోని అమ్మాయిలను ఏడిపిస్తూ వెకిలీ చేష్టలకు పాల్పడ్డారు. విద్యార్థుల ఆకతాయి చర్యలతో బస్సులోని తోటి వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆకతాయిల భరతం పట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బస్సులో కత్తులతో హల్చల్ చేస్తున్న వారిని గుర్తించి.. వారి కోసం గాలిస్తున్నారు. -
ఘాట్‌రోడ్డుపై ఇరుక్కున్న బస్సులు
సారంగాపూర్(జగిత్యాల): సారంగాపూర్–బీర్పూర్ మండలాల మధ్య ఉన్న ఘాట్ రోడ్డుపై బుధవారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఇరుక్కున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. జగిత్యాల నుంచి జన్నారం వెళ్తున్న బస్సు, జన్నారం నుంచి జగిత్యాల వస్తున్న మరో బస్సు సారంగాపూర్ వైపు ఉన్న ఆంజనేయ ఆలయ సమీపంలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఒకదానికొకటి ఆనుకొనిపోయాయి. రెండు బస్సుల డ్రైవర్లు వెనక్కి తీసుకుని వారివారి గమ్యస్థానాలకు వెళ్లినట్లు కండక్టర్ సుంకరిపల్లి అశోక్ తెలిపారు. -
పర్మిట్ లేని బస్సులపై చర్యలు: మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పర్మిట్ లేని బస్సులపై చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ప్రైవేటు బస్సుల నిబంధనలు, ప్రభుత్వ చర్యలపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. జాతీయ రహదారులపై 100 కిలోమీటర్లు, ఆర్అండ్బీ రహదారులపై 60 కిలోమీటర్ల వేగం మించితే కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. పన్ను కట్టకుండా తిరిగిన బస్సులపై 730 కేసులు, పర్మిట్ లేని వాహనాలపై 591 కేసులు, తెలంగాణ పర్మిట్ లేని వాటిపై 432 కేసులు, సరుకు రవాణా ఉల్లంఘనలపై 136 కేసులు, 8 గంటలకు మించి డ్రైవర్లు పని చేసిన వాటిపై 118 కేసులు నమోదు చేశామని వివరించారు. -
స్మార్ట్ బస్సులు వచ్చేశాయి!?
ఇప్పటివరకూ కలలు కంటున్న స్మార్ట్/సెల్ఫ్ డ్రైవింగ్ బస్సులు ప్రజలకు అందుబాటులోకి వచ్చేశాయి. పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బస్సులు శనివారం ఉదయం నుంచి చైనాలోని షెన్జెన్ సిటీలో పరుగులు తీస్తున్నాయి. అత్యంత ఆధునాతన నగరమైన షెన్జెన్లో దాదాపు 70 శాతం ఐటీ సంస్థలున్నాయి. ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల కొసం ఈ స్మార్ట్ బస్సులును అధికారులు ప్రవేశపెట్టారు. రెండు కిలోమీటర్ల పరిధిలో.. ఈ బస్సులు ప్రయాణిస్తాయి. స్మార్ట్ బస్సులు.. కనిష్టంగా 10 కి.మీ. గరిష్టంగా 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. స్మార్ట్ బస్సులకు జీపీఎస్ ఆంటెన్నా, హై రెజ్యుల్యూషన్తో కూడిన హెచ్డీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఆటో సెన్సార్ టెక్నాలజీ ద్వారా పాదచారులను ఈ బస్సు ఢీ కొట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడితే.. బస్సులో ఉండే డ్రైవర్.. స్మార్ట్ నుంచి మ్యాన్యువల్ డ్రైవింగ్‌కు మార్చి బస్సును నడిపిస్తాడు. ఈ స్మార్ట్ బస్సులను షెంజెన్ ఇంజినీరింగ్ టెక్నాలజీ గ్రూప్ రూపోందించడం విశేషం.