సాక్షి, హైదరాబాద్: పర్మిట్ లేని బస్సులపై చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ప్రైవేటు బస్సుల నిబంధనలు, ప్రభుత్వ చర్యలపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
జాతీయ రహదారులపై 100 కిలోమీటర్లు, ఆర్‌అండ్‌బీ రహదారులపై 60 కిలోమీటర్ల వేగం మించితే కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. పన్ను కట్టకుండా తిరిగిన బస్సులపై 730 కేసులు, పర్మిట్ లేని వాహనాలపై 591 కేసులు, తెలంగాణ పర్మిట్ లేని వాటిపై 432 కేసులు, సరుకు రవాణా ఉల్లంఘనలపై 136 కేసులు, 8 గంటలకు మించి డ్రైవర్లు పని చేసిన వాటిపై 118 కేసులు నమోదు చేశామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment