Mahender Reddy
-
ఏఈఈ (సివిల్) ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా ప్రకటించండి
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ– సివిల్) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితా ప్రక టించటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. జాబితాను వెల్లడించేలా ప్రభుత్వం ఒత్తిడి తేవాలంటూ పరీక్ష రాసినవారు బుధవారం కేటీఆర్‌ను కలిశారు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే ఏఈఈ (సివిల్) రాత పరీక్ష నిర్వహించడంతో పాటు సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తి చేసిందన్నారు. 22నెలల క్రితం నోటిఫికేషన్ విడుదలై పరీక్ష జరిగిందని, ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన జాబితాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా విడుదల చేయడం లేదని తెలిపారు. నేతన్న ఆత్మహత్యపై ఆవేదన ఉపాధి లేక సిరిసిల్లలో చేనేత కారి్మకుడు పల్లె యాదగిరి ఆత్మహత్య చేసుకున్నాడని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆత్మ హత్య కాదని ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని మండిపడ్డారు. చేనేత కారి్మకుడి కుటుంబాన్ని ఆదుకు నేందుకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదుపై ఆగ్రహం ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతో విపక్ష ఎమ్మెల్యేలపై అక్రమకేసులు బనాయిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. ప్రజా సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావటమే కౌశిక్‌రెడ్డి చేసిన నేరమా అని నిలదీశారు. అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మిపై ఆసిఫాబాద్ పీఎస్‌లో అక్రమ కేసు నమోదు చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. ఎమ్మెల్యేకు సరైన గౌరవం, ప్రొటోకాల్ ఇవ్వకుండా అడ్డగోలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరికి నిరసన తెలిపినందుకు కేసు నమోదు చేశారా అని ప్రశ్నించారు. -
BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి షాక్
-
హస్తం గూటికి పట్నం దంపతులు!
వికారాబాద్: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి దంపతులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శాలువా, బొకేలతో సన్మానించారు. సీఎం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో త్వర లో నిర్వహించనున్న బహిరంగ సభలో వీరు హస్తం కండువా వేసుకోనున్నట్లు సమాచారం. మహేందర్‌రెడ్డి మద్దతుదారులు చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. తాండూరు నియోజకవర్గంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, సీనియర్ నాయకులు రవి గౌడ్, కరణం పురుషోత్తంరావ్ తదితరులు పట్నం వెంట వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే వెళ్లాలని భావించినా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. అప్పట్లో కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించటంతో పాటు చివరి నిమిషంలో మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌తో నెలకొన్న విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో కొద్ది నెలలుగా బీఆర్ఎస్కు అంటీముట్టనట్లు ఉంటున్నారు. చేవెళ్ల ఎంపీ సీటు కమిట్‌మెంటుతోనే..? మరో నాలుగు నెలల్లో జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఆమె చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు హామీ లభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. కాగా, మహేందర్‌రెడ్డి సోదరుడు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాత్రం తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ‘సాక్షి’కి తెలిపారు. -
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయనపై ఇటీవల సోషల్‌మీడియాలో పలు అవినీతి ఆరోపణలు వ్యాప్తి చెందాయి. దీంతో మహేందర్‌రెడ్డి మంగళవారం తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, నిరాధారమైనవి, సత్యానికి దూరంగా ఉన్నవని తెలియజేశారు. ‘నేను 36 ఏళ్ళకు పైగా ఎలాంటి కళంకం లేకుండా పదవీ విరమణ వరకు అంకిత భావంతో పనిచేశా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రంలో పోలీసు శాఖలో సుధీర్ఘ కాలం పనిచేశా. నా కెరీర్ మొత్తంలో.. నేను క్లీన్ రికార్డ్, ఖ్యాతిని కొనసాగించాను. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశ్యంతో తప్పుడు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధాలు, నిరాధారమైనవి, సత్యానికి దూరంగా ఉన్నాయి. నా ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్న/ సర్క్యులేట్ చేస్తున్న వారందరిపై క్రిమినల్ చర్యలు, పరువునష్టం దాఖలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని మహేందర్‌రెడ్డి తెలిపారు. -
Tspsc: చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని సభ్యులుగా మరో నలుగురిని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ నియామకాలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెంటనే ఆమోదం తెలపడంతో చైర్మన్, సభ్యుల బాధ్యతల స్వీకరణకు లైన్ క్లియరైంది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యులను ప్రభుత్వం త్వరితగతిన నియమించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ పరీక్షల పదేపదే వాయిదాలతో పాటు, పేపర్ లీకేజీల వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇదీచదవండి.. తమిళిసై ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి.. కేటీఆర్ ఫైర్ -
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీ స్ కమిషన్ చైర్మన్ (టీఎస్పీఎస్సీ)గా రాష్ట్ర మా జీ డీజీపీ మహేందర్‌రెడ్డి నియమితులయ్యా రు. అదేవిధంగా కమిషన్‌లో పది మంది సభ్యు ల నియామకానికి అవకాశం ఉండగా.. ప్రభు త్వం చేసిన ప్రతిపాదనల మేరకు ఐదుగురిని సభ్యులుగా నియమించడానికి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ని యమితులైన చైర్మన్, సభ్యుల పదవీ కాలం ఆరే ళ్ల పాటు ఉంటుంది. అయితే 62 ఏళ్లు పైబడిన వారు పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించి.. సెర్చ్ కమిటీ వేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా చర్యలు వేగవంతం చేసింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, తదనంతర పరిణామాల నేపథ్యంలో గతంలో కమిషన్ చైర్మన్‌గా వ్యవ హరించిన బి.జనార్ధన్‌రెడ్డి డిసెంబర్లో రాజీ నామా చేశారు. ఆ తర్వాత ఐదుగురు సభ్యులు కూడా రాజీనామా చేయడంతో కొత్తగా చైర్మన్, సభ్యుల నియామకం అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల్లో పీఎస్సీల పనితీరును అధ్యయనం చేయాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాను స్వయంగా యూపీఎస్సీ చైర్మన్‌తో సమావేశమై టీఎస్పీఎస్సీ నిర్వహణకు సలహాలు సూచనలు కోరారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వాటి పరిశీలనకు సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. దరఖాస్తుల వడపోత అనంతరం సెర్చ్ కమిటీ చైర్మన్, సభ్యుల కోసం కొన్ని పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం. కాగా ఈ మేరకు రాష్ట్ర సర్కారు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 1962 డిసెంబర్ 3న ఆయన జన్మించారు. దాదాపు 36 సంవత్సరాల పాటు సర్వీసులో కొనసాగిన మహేందర్‌రెడ్డి 2022 డిసెంబర్ నెలాఖరులో పదవీ విరమణ చేశారు. టీఎస్పీఎస్సీ టీమ్ ఇదే చైర్మన్: ఎం.మహేందర్‌రెడ్డి(రిటైర్డ్ ఐపీఎస్) సభ్యులు: అనితా రాజేంద్ర (రిటైర్డ్ ఐఏఎస్), అమిర్ ఉల్లా ఖాన్, (రిటైర్డ్ ఇండియన్ పోస్టల్ సర్వీస్), ప్రొఫెసర్ నర్రి యాదయ్య, యరబడి రామ్మోహన్రావు, పాల్వాయి రజినీకుమారి టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల బయోడేటాలు పేరు: ఎం.మహేందర్ రెడ్డి స్వస్థలం : ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం కిష్టాపురం గ్రామం పుట్టిన తేదీ : 1962 డిసెంబర్ 3 సామాజికవర్గం: రెడ్డి (ఓసీ) విద్యార్హతలు: ఆర్ఈసీ వరంగల్ నుంచి బీటెక్ (సివిల్), ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్ హోదా: రిటైర్డ్ డీజీపీ (2022 డిసెంబర్) (1986 బ్యాచ్ ఐపీఎస్) పేరు: అనితా రాజేంద్ర స్వస్థలం : రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్ పుట్టిన తేదీ : 1963 ఫిబ్రవరి 04, బీసీ–బీ (గౌడ) విద్యార్హతలు: బీకాం, ఎంఏ, ఎల్ఎల్ఎం హోదా: రిటైర్డ్ ఐఏఎస్ పేరు: అమిర్ ఉల్లా ఖాన్ స్వస్థలం : హైదరాబాద్ సామాజికవర్గం : ముస్లిం వయస్సు: 58 ఏళ్లు అనుభవం: యూఎన్‌డీపీలో పనిచేస్తున్నారు. ఉర్దూ వర్సిటీ, నల్సార్, ఐఎస్బీ, ఎంసీఆర్హెచ్ఆర్డీలో విజిటింగ్ ప్రొఫెసర్. హోదా: ఇండియన్ పోస్టల్ ఉద్యోగానికి రాజీనామా పేరు: పాల్వాయి రజనీకుమారి స్వస్థలం : సూర్యాపేట పుట్టిన తేదీ: 06–05–1972, ఎస్సీ మాదిగ విద్యార్హతలు: ఎంఏ, బీఈడీ, ఎల్ఎల్బీ హోదా: టీచర్, వీడీఓ, మున్సిపల్ కమిషనర్ పేరు: వై.రామ్మోహన్రావు స్వస్థలం : హైదరాబాద్ పుట్టిన తేదీ : 1963 ఏప్రిల్ 4 సామాజికవర్గం : ఎస్టీ–ఎరుకల విద్యార్హతలు: బీఈ, ఎంబీఏ హోదా: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ జెన్కో పేరు: డాక్టర్ నర్రి యాదయ్య స్వస్థలం: మల్లారెడ్డిగూడెం, యాద్రాది భువనగిరి జిల్లా పుట్టిన తేదీ : 1964–4–10 సామాజికవర్గం: బీసీ–బీ(కురుమ) విద్యార్హతలు: ఎంటెక్ , పీహెచ్డీ హోదా: సీనియర్ ప్రొఫెసర్, జేఎన్టీయూహెచ్, కూకట్పల్లి -
TSPSC చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి.. గవర్నర్ ఆమోదం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చైర్మన్‌గా ఎం. మహేందర్‌రెడ్డిని నియామకం ఖరారైంది. మాజీ డీజీపీ అయిన మహేందర్‌రెడ్డి నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీఎస్పీఎస్సీ సభ్యులుగా రిటైరర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రాంమోహన్‌రావు నియమితులయ్యారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టింగ్ కోసం మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించి.. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసినవారిలోంచి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఆ పేరును గవర్నర్‌కు పరిశీలనకు పంపింది. చివరకు గవర్నర్ ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు. ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్ణాపురంలో జన్మించారు. ఆయన 1968 బ్యాచ్ పోలీస్ సర్వీస్ అధికారి. ఏఎప్పీగా మొదలైన ఆయన కెరీర్ డీజీపీగా పదవీ విరమణ పొందారు. డీజీపీ అనురాగ్ శర్మ పదవీవిరమణ తర్వాత 2017 నవంబర్ 12న ఇన్‌ఛార్జి డీజీపీగా నియమితుడయ్యారు. 2018 ఏప్రిల్10న పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. మహేందర్‌రెడ్డి 2022 డిసెంబర్లో డీజీపీగా పదవీ విరమణ పొందారు. మూడేళ్లకు పైగా తన పదవీ కాలంలో ఆయన రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలోనూ కీలకంగా వ్యవహరించారు. అందుకే 2020లో ఏప్రిల్ 8న దేశంలోని టాప్ 25 ఐపీఎస్ అధికారులతో జాబితాలో 8వ స్థానాన్ని దక్కించుకున్నారు. మహేందర్‌రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైనా.. ఈ ఏడాది డిసెంబర్ వరకే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే.. కమిషన్ నిబంధనల ప్రకారం.. 62 ఏళ్లు దాటితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. -
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి ఏర్పాటైన సెర్చ్ కమిటీ సూచన మేరకు ఆయన పేరును ఖరారు చేసిన సర్కారు.. గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం పంపినట్టు సమాచారం. త్వరలోనే సభ్యుల నియామ కాన్ని కూడా పూర్తిచేసేలా కసరత్తు ముమ్మరం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వేగంగా దరఖాస్తుల పరిశీలన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో కమిషన్‌లో మార్పులు చేయాలని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో యూపీఎస్సీ చైర్మన్, సభ్యులను కలసి చర్చించారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దేందుకు వీలుగా సలహా తీసుకున్నారు. దీనికితోడు రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకంపై సర్కారు దృష్టి పెట్టింది. ఈ పోస్టల కోసం ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. దీంతో ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించి.. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసినవారిలోంచి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది. గవర్నర్ తమిళిసై ఆమోదం పొందగానే.. నియామకాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మహేందర్‌రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైనా.. ఈ ఏడాది డిసెంబర్ వరకే కొనసాగే అవకాశం ఉంది. కమిషన్ నిబంధనల ప్రకారం.. 62 ఏళ్లు దాటితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. మహేందర్‌రెడ్డి 2022 డిసెంబర్లో డీజీపీగా పదవీ విరమణ పొందారు. సభ్యుల ఎంపికపై కసరత్తు రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పాటైన తర్వాత టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి, ఇతర సభ్యులు రాజీనామాలు చేశారు. దీనితో కమిషన్‌లో పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. కమిషన్‌లో చైర్మన్‌తోపాటు పది మంది సభ్యులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గవర్నర్ ఆ పోస్టుల్లో నియామకాలు జరుపుతారు. అయితే చైర్మన్, సభ్యుల పోస్టులకు నామినేటెడ్ పద్ధతిలో కాకుండా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో చైర్మన్ పేరును ఖరారు చేయగా.. సభ్యుల పోస్టుల కోసం దరఖాస్తుల పరిశీలన ముమ్మరంగా కొనసాగుతోందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. పరీక్షలు, ఫలితాలపై ఆశలు టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలతో పలు పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన వాయిదాపడ్డాయి. ప్రధానంగా గ్రూప్–1 మెయిన్స్, గ్రూప్–2, గ్రూప్–3 తోపాటు వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిలిచిపోయాయి. వీటికితోడు వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 30వేల పోస్టుల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షలు నిర్వహించినా.. ఫలితాలు ప్రకటించలేదు. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనకు కమిషన్ చైర్మన్, సభ్యుల నిర్ణయం కీలకం. త్వరగా వారి నియామకాలు పూర్తయితే.. నిలిచిపోయిన ప్రక్రియలన్నీ మొదలవుతాయని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
మన పార్టీ వాళ్లే ఓడించారు!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం వేదికగా పార్టీలోని అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. శుక్రవారం జరిగిన చేవెళ్ల సమావేశంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మన వాళ్లే పనిచేశారని ఓడిన నా యకుడు వ్యాఖ్యానించడం కలకలం రేపింది. తాండూరు అసెంబ్లీస్థానం నుంచి ఓడిపోయిన పైలట్ రోహిత్‌రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై సభా వేదికగానే విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. ఓడిన నేతను వేదికపై ఎలా కూర్చోబెడతారు? సమావేశంలో పైలట్ రోహిత్‌రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడాన్ని పట్నం మహేందర్‌రెడ్డి వర్గీయులు తప్పు పట్టడంతో వివాదం రేగింది. ఓడిపోయిన నాయకున్ని స్టేజీ మీద ఎలా కూర్చోబెడతారని, రోహిత్‌రెడ్డిని కిందికి దించాలని మహేందర్‌రెడ్డి వర్గం పట్టుపట్టింది. అదే సమయంలో మహేందర్ రెడ్డి మాట్లాడేందుకు మైక్ తీసుకోగా, ఆయన వల్లనే ఓడిపోయామని పైలట్ రోహిత్‌రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారని సమాచారం. ఈ సమయంలోనే మహేందర్‌రెడ్డి కారణంగానే తాను ఓడినట్లు రోహి త్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో మహేందర్ రెడ్డి సైతం రోహిత్‌పై విమర్శలు చేసినట్లు చెబుతున్నారు. ఓ సమయంలో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొంది. ఇరువర్గాల కార్యకర్తలు అరుచుకుంటూ కుర్చిలు విసిరేసే వరకు వెళ్లినట్లు సమాచారం. దీంతో వేదికపై ఉన్న మాజీ మంత్రి టి. హరీశ్‌రావు జోక్యం చేసుకొని పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ సమావేశంలో గొడవ పడితే తప్పుడు సంకేతాలు వెళతాయని ఇద్దరినీ సముదాయించి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. రోహిత్‌రెడ్డితో చిన్నపాటి వాగ్వాదం: పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల లోక్‌సభ స్థానానికి రంజిత్‌రెడ్డి మళ్లీ పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సమావేశం అనంతరం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. రంజిత్‌రెడ్డి గెలుపు కోసం కలిసి కట్టుగా పని చేయాలని నిర్ణయించామని, మరోసారి గెలిపిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై కొందరిలో ఆవేదన ఉందని, ఇప్పుడన్నీ సమసిపోయాయన్నారు. ఇల్లు అన్నప్పుడు ఏవో చిన్న చిన్న సమస్యలు సహజమని, అందులో భాగంగానే రోహిత్‌రెడ్డితో చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు చెప్పారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని చేవెళ్ల ఎంపీ జి. రంజిత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల పార్లమెంట్ సన్నాహాక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆరే తన బలం, చేవెళ్ల పార్లమెంట్ ప్రజలే తన బలగమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. -
మేడమ్ చీఫ్ మినిస్టర్
డా.సూర్య రేవతి మెట్టకూరు కథానాయికగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ– ‘‘ఇది సామాజిక చిత్రంలా అనిపిస్తోంది. ఐదు భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘అమెరికాలో చదువుకుని, ఓ సంస్థ స్థాపించి, ఇండియాకొచ్చి ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నాను. సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చెప్పాలని ఈ సినిమా ఆరంభించాను. ఇది పొలిటికల్ చిత్రం కాదు.. పబ్లిక్ మూవీ’’ అన్నారు డా.సూర్య రేవతి. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ బి.కొండకండ్ల, కెమెరా: వల్లెపు రవికుమార్. -
అక్రమాలు అరికట్టేందుకు ‘ఈ మొబైల్ మైనింగ్ యాప్’
సాక్షి, హైదరాబాద్: మైనింగ్ విభాగంలో పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ‘ఈ మొబైల్ మైనింగ్ యాప్’కు రూపకల్పన చేసినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్ఐసీ)తో కలసి గనులు, భూగర్భ వనరుల శాఖ రూపొందించిన మొబైల్ యాప్‌ను శనివారం ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గనుల శాఖ డీఎం కాత్యాయనిదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖనిజాలు, ఇటుక, ఇసుక తదితరాల రవాణా సమయంలో తనిఖీలు చేసి అనుమతులు ఉన్నాయా లేదా? అనే అంశాన్ని గనుల శాఖ సిబ్బంది తక్షణమే తెలుసుకునేందుకు ఈ యాప్ దోహదం చేస్తుందని మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేయడం, అనుమతులు ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో ఖనిజాల తరలింపు.. తదితరాలకు అడ్డకట్ట వేయడంతో పాటు జరిమానాల విధింపునకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. జరిమానా విధింపు, చెల్లింపు అంశాల్లో పారదర్శకతతో పాటు, ఆన్లైన్లో చెల్లింపులు ఈ యాప్ ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఖనిజ రవాణా సమాచారాన్ని డీలర్లు, లీజు హోల్డర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, అనుమతుల నిర్ధారణ కూడా ఈ యాప్ ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఈ యాప్ ఉపయోగంలోకి వస్తే క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసే గనుల శాఖ ఏడీలు, అసిస్టెంట్ జియాలజిస్టులు, టెక్నీíÙయన్లు, రాయల్టీ ఇన్స్పెక్టర్లకు విధుల నిర్వహణ సులభతరమవుతుందని మంత్రి వెల్లడించారు. -
మర్రిగూడ ఎమ్మార్వో మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు
-
బస్సులో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య
తొర్రూరు: ఆర్టీసీ కండక్టర్ బస్సులో ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తోన్న మండల పరిధి కంటాయపాలెం గ్రామానికి చెందిన గార్లపాటి మహేందర్‌రెడ్డి(54) తొర్రూరు టీచర్స్‌కాలనీలో స్థిరపడ్డాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఇటీవల మూడు రోజులు సెలవు పెట్టాడు. వాటిని రద్దు చేసుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు విధుల్లో చేరేందుకు డిపోకు వచ్చాడు. సెక్యూరిటీ కార్యాలయం రిజిస్టర్లో సంతకం పెట్టి బస్సులోకి వెళ్లిన మహేందర్‌రెడ్డి ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి చూడగా బస్సులోని కడ్డీకి ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే డిపో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆర్థిక ఇబ్బందులతోనే కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు చెబుతున్నారు. -
తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా అంజనీకుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. మహేందర్‌రెడ్డి నుంచి డీజీపీగా బాధ్యతలు అందుకున్నారు. అనంతరం డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ దేశానికే ఆదర్శం. ప్రతి అధికారి లీడర్‌గా పనిచేయాలి. క్విక్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రజలకు నిరంతరం రక్షణగా ఉంటాం అని తెలిపారు. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్.. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. 2021 డిసెంబరు 24న ఏసీబీ డీజీ అయ్యారు. అంతకుముందు హైదరాబాద్ నగర కమిషనర్‌గా పని చేశారు. ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ (పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి తరఫున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు. ఐపీఎస్ ట్రైనింగ్‌లో మంచి ప్రతిభ కనబరిచి రెండు కప్పులు గెలుచుకున్నారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, నక్సల్ ప్రాంతంలో పనితీరుకు గానూ ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రపై విస్తృత పరిశోధన చేశారు. 36 ఏళ్లలో13 మంది... 1986 నుంచి ఇప్పటి వరకు అటు ఉమ్మడి రాష్ట్రం, ఇటు విభజన తర్వాత అంజనీకుమార్‌తో కలిపి మొత్తం 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీపీలు/ఇన్చార్జి డీజీపీలు అయ్యారు. వీరిలో 13 మందికి నగర పోలీసు కమిషనర్‌గా పని చేసిన అనుభవం ఉంది. అనురాగ్ శర్మ, మహేందర్‌రెడ్డి నేరుగా ‘సిటీ కమిషనరేట్’ నుంచి ‘డీజీపీ కార్యాలయానికి’ వెళ్లగా... మిగిలిన వారిలో అత్యధికులు ‘వయా’ చేరుకున్నారు. ఏకే మహంతి రోడ్ సేఫ్టీ అథారిటీ నుంచి, అరవిందరావు, ప్రసాదరావు తదితర అధికారులు అవినీతి నిరోధక శాఖకు చీఫ్లుగా పని చేస్తూ డీజీపీలుగా నియమితులయ్యారు. ప్రస్తుతం అంజనీకుమార్ కూడా అదే రూట్లో వెళ్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీజీపీ/ఇన్చార్జి డీజీపీలుగా నియమితులైన ముగ్గురూ సిటీ కమిషనర్లుగా పని చేసిన వారే. అంజనీ కుమార్ నిర్వర్తించిన పోస్టులు ఇవే.. - జనగామ ఏఎస్పీగా పనిచేశారు. - కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ చీఫ్‌గా పనిచేశారు. - ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ చీఫ్‌గా పనిచేశారు. - నిజామాబాద్ డీఐజీగా పనిచేశారు - వరంగల్ ఐజీగా పనిచేశారు. - హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. - తెలంగాణ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా చేశారు. - 2018 మార్చి 12న హైదరాబాద్ కమిషనర్‌గా చేరారు. - 2021 డిసెంబరు 25న ఏసీబీగా డీజీగా నియమితులయ్యారు. -
TS: మహేందర్ రెడ్డి పదవీ విరమణ.. నూతన డీజీపీగా అంజనీకుమార్
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అకాడమీలో పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. మహేందర్ రెడ్డి 36 ఏళ్లపాటు ఐపీఎస్‌గా సేవలందించారు. మహేందర్ రెడ్డి స్థానంలో తెలంగాణ కొత్త డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. మహేందర్ రెడ్డితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు అంజనీకుమార్ చెప్పారు. ఇలాంటి అధికారులు అరుదుగా ఉంటారని, ఎన్నో రకాలుగా మహేందర్ రెడ్డి తనకు ఆదర్శమన్నారు. ఆయన హయాంలో టెక్నాలజీ వ్యవస్థ అభివృద్ధి చెందిందని కొనియాడారు. ప్రతి అధికారి లీడర్‌గా పనిచేయాలని సూచించారు. క్విక్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రజలకు నిరంతరం రక్షణగా ఉంటామన్నారు. ప్రభుత్వం పోలీస్ శాఖకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది.కేసీఆర్ ముందు చూపు వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు దేశానికే ఆదర్శం. ప్రతి పౌరుడిని పోలీస్ అని చెప్పిన మహేందర్ రెడ్డి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తాం. అని అంజనీకుమార్ పేర్కొన్నారు. చదవండి: న్యూ ఇయర్ వేడుకలు.. ఇవి అస్సలు మరవద్దు! -
అటవీ అధికారులు, సిబ్బందికి అండగా నిలవండి
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయి అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతునిచ్చి, భరోసా కల్పించాలని పోలీసు అధికారులకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. తమ పరిధిలోని చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులతో సమావేశమై, వారి సమస్యలను పరిష్కరించాలని పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలను డీజీపీ ఆదేశించారు. పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్పీలతో శుక్రవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో అటవీశాఖ, క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యలపై డీజీపీ సమీక్షించారు. ఈ సమావేశానికి హాజరైన పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ ఆయా అంశాలను గురించి వివరించారు. -
ఆస్పత్రి ఎదుట మంత్రి మల్లారెడ్డి ధర్నా.. కుమారుడి ఆరోగ్యంపై డాక్టర్లు ఏం చెప్పారంటే..
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డికి హైపర్ టెన్షన్ వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే, మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి వద్ద ధర్మాకు దిగారు. తన కొడుకును చూడనివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడిని సీఆర్పీఎఫ్ బలగాలతో కొట్టించారని అన్నారు. తన కుమారుడికి ఏమవుతుందోనని భయంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ సోదాల్లో నగదు, పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి ఇంటివద్ద భారీగా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించి సోదాలు కొనసాగిస్తున్నారు. చదవండి: (కుమారుడికి అస్వస్థత.. ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం) -
కుమారుడికి అస్వస్థత.. ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఐటీసోదాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష్యతోనే ఈ సోదాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీ సోదాల సమయంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి హుటాహుటిన సూరారంలోని ఆస్పత్రికి బయల్దేరి వెళ్లారు. అయితే ఐటీ అధికారులు మల్లారెడ్డిని ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించలేదు. ఈసందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. నేనేమన్నా దొంగ వ్యాపారాలు చేస్తున్నానా అంటూ ఐటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కొడుకును రాత్రంతా ఇబ్బంది పెట్టారు. నా కొడుకును చూడటానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారు. నేనేమైనా క్యాసినోలు ఆడిస్తున్నానా అని ప్రశ్నించారు. 200మంది అధికారులను పంపించి దౌర్జన్యం చేస్తున్నారు. బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అంటూ మండిపడ్డారు చదవండి: (మల్లారెడ్డి కుమారుడికి ఛాతీలో నొప్పి.. ఆస్పత్రికి తరలింపు) -
మల్లారెడ్డి కుమారుడికి ఛాతీలో నొప్పి.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన కుమారులు, బంధువులు, బిజినెస్ పార్ట్నర్స్ ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి ఐటీ దాడుల సందర్భంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, చికిత్సను అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే, మంత్రి ఇంట్లో ఉండగానే.. కేంద్ర పోలీసు బలగాల పహారాలో ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు ప్రారంభమయ్యాయి. మొత్తం 50 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. చదవండి: (మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ దాడులు, కీలక పత్రాలు స్వాధీనం) -
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో..
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 50 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు, అల్లుడి ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి సోదరుడు, వియ్యంకుడి నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలిస్తున్నారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ లావాదేవాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో క్రాంతి బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వర్‌రావు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. చదవండి: (బీఎల్ సంతోష్‌కు మరోసారి నోటీసులు?) -
ప్రపంచానికే మానవ వనరుల శక్తిగా భారత్
సాక్షి, హైదరాబాద్: వివిధ రంగాల్లో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన వారి కోసం ప్రపంచం భారత్ వైపే చూస్తోందని, ప్రపంచానికే మానవ వనరుల శక్తిగా భారత్ రూపొందిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి (సీపీవీ, ఓఐఏ) ఔసాఫ్ సయీద్ పేర్కొన్నారు. విదేశీ వలసలను ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పాస్‌పోర్టు ప్రాంతీయ అధికారులు, ఇతర ఉన్నతస్థాయి అధికారులతో ప్రాంతీయ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన ఔసాఫ్ సయీద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితర రాష్ట్ర అధికారులతో సమావేశమై పాస్‌పోర్టు, ఇమిగ్రేషన్, విదేశీ వీసాలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం భారత ప్రధాన పాస్‌పోర్టు అధికారి ఆమ్‌స్ట్రాంగ్ చాంగ్సన్, సంయుక్త కార్యదర్శి(ఓఈ) బ్రహ్మ కుమార్, హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్యలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. విదేశాలకు వెళ్లి పనులు చేసేందుకు ఆసక్తి చూపే యువత, మహిళలకు తగిన శిక్షణ ఇచ్చి పంపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 12 దేశాలతో ఇప్పటికే మ్యాన్ పవర్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. మరో 15 దేశాలతో సంప్రదింపులు సాగుతున్నా యన్నారు. ప్రతి శనివారం విదేశాలకు వెళ్లే వారికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం పోలీసు శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించే విషయంపై డీజీపీతో చర్చించినట్లు తెలిపారు. తెలంగాణలో పాస్‌పోర్టులు వేగవంతం తెలంగాణలో పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని సయీద్ తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక పోస్టా్టఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రంగా పనిచేస్తుందన్నారు. మరో ఐదు నెలల్లో దేశంలో ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టు (ఈ పాస్‌పోర్టు)ల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అమ్‌స్ట్రాంగ్ చాంగ్సన్ తెలిపారు. -
అమ్నీషియా పబ్ కేసు: సీఎస్, డీజీపీకి మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రాజకీయ నేతల కొడుకులు ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో లైంగిక దాడి ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. కేసులో భాగంగా మంగళవారం.. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అలాగే, సికింద్రాబాద్ లైంగిక దాడి కేసుపై కూడా జాతీయ మహిళా కమిషన్ విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. ఇది కూడా చదవండి: రఘనందన్ రావు.. ఇన్నోవా వీడియో ఎందుకు చూపించలేదు: రేణుకా చౌదరి -
రౌడీషీటర్లకు కార్పెట్ వేస్తావా.. అంతుచూస్తా
సాక్షి, తాండూరు: ‘రౌడీషీటర్లకు కార్పెట్ వేస్తావా..? ఎంత ధైర్యం? నీ అంతు చూస్తా!’ అంటూ తాండూరు సీఐపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివా దాస్పద మయ్యాయి. 3 రోజుల క్రితం జరిగిన భావిగి భద్రేశ్వర జాతరకు ముందుగా మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. అరగంట తర్వాత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వచ్చారు. దాంతో మరో కార్పెట్ వేసి ఎమ్మెల్యేను కూర్చోబెట్టారు. ఇదే మహేందర్‌రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. ప్రొటోకాల్ ఎందుకు పాటించలేదని సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి మహేందర్‌రెడ్డి బూతులు తిట్టారు. ‘నా ముందే రౌడీషీటర్లకు కార్పెట్ ఎలా వేస్తావు’ అని సీఐని నిలదీశారు. ‘రౌడీషీటర్లు ఎవరు ?’ అని సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్యే పక్కన ఉన్నవారంతా వారేనంటూ దుర్భాషలాడారు. ఎమ్మెల్యే రౌడీషీటరా అంటూ సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్సీ మళ్లీ తీవ్ర పదజాలం ఉపయోగించారు. మంచిగా మాట్లాడాలని సీఐ ఎమ్మెల్సీని కోరగా.. ‘నువ్వు ఇసు క అమ్ముకొంటలేవా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ అమ్ముకొంటున్నాన ని సీఐ ప్రశ్నించగా.. త్వరలో పట్టిస్తానని ఫోన్ కట్ చేశారు. సీఐని దూషించిన కేసులో మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు వికారాబాద్ ఎస్పీ తెలిపారు. అధికారులకు ఆడియో తలనొప్పి... జాతర సందర్భంగా జరిగిన తప్పిదాలు పోలీసు ఉన్నతాధికారులకు సమస్యలను తెచ్చిపెట్టాయి. ప్రొటోకాల్ ప్రకారం బందోబస్తు నిర్వహించడంలో విఫలం అయ్యారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఎమ్మెల్సీ, సీఐల మధ్య ఫోన్ సంభాషణ ఆడియో బయటకు రావడం కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టింది. ఈ విషయమై తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ రాజేందర్‌రెడ్డిలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. మహేందర్ రెడ్డిని అడగ్గా.. ‘పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి ప్రొటోకాల్‌ను పాటించట్లేదు. ఫోన్లో నేను తిట్టింది వాస్తవమే’ అని తెలిపా రు. తాండూరు సీఐని మహేందర్‌రెడ్డి దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ క్షమా పణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్స్ ప్రొటెక్షన్ సెల్
సాక్షి,హైదరాబాద్: ట్రాన్స్‌జెండర్స్ రక్షణ కోసం మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘ప్రైడ్ ప్లేస్’పేరుతో దేశంలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్స్ ప్రొటెక్షన్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం లక్డీకపూల్‌లోని మహిళా భద్రతా విభాగం కార్యాలయంలో‘ప్రైడ్ ప్లేస్’లోగోను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..ట్రాన్స్జెండర్ల సమస్యలను పరిష్కరించడంలో ‘ప్రైడ్ ప్లేస్’చాలా ఉపయోగపడుతుందన్నారు. వివక్షకు గురికాకుండా వారి రక్షణకు అన్ని చర్యలను ఈ సెల్ చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, కొంతమంది కానిస్టేబుళ్లు బృందంగా పనిచేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రత్యేక సెల్ ఎప్పటికప్పుడు సంబంధిత కమ్యూనిటీతో చర్చలు జరుపుతూ రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లలో అధికారులకు, సిబ్బందికి రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తుందని తెలిపారు. 2019లో ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఈ సెల్ ఏర్పాటుకు కృషి చేసిన మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ బి.సుమతి, తరుణి ఎన్జీవో బాధ్యులు మమతా రఘువీర్, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ప్రతినిధులను డీజీపీ మహేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
త్వరలో 3,200 మందికి హెడ్‌కానిస్టేబుల్ పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల ప్రకారం 3,200 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి తెలిపారు. అలాగే ఈ అంశంపై పోలీస్ శాఖ సిబ్బంది విభాగం అదనపు డీజీపీ శివధర్‌రెడ్డిని సైతం కలిశామని, పదోన్నతులతోపాటు నోషనల్ సీనియారిటీ సమస్యను సైతం పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని గురువారం గోపిరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న టీఏ మంజూరు చేయించినందుకు డీజీపీకి పోలీస్ సిబ్బంది తరుఫున కృతజ్ఞతలు తెలిపామని, అదే విధంగా పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవుల వ్యవహారాన్ని త్వరగా పరిష్కరించాలని కోరామన్నారు. -
ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి కరోనా పాజిటివ్
తాండూరు: ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కరోనా వైరస్ బారిన పడ్డారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో శనివారం పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణయింది. దీంతో హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇటీవల తనను కలసిన వారంతా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
ప్రజలకు తెలంగాణ పోలీసుల పై నమ్మకం పెరిగింది
-
TS: పబ్స్, హోటళ్లు, క్లబ్‌లు ఇయర్ గైడ్ లైన్స్ పాటించాలి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలు జనవరి 2 వరకు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియతో మాట్లాడుతూ.. తెలంగాణలో పబ్స్, హోటళ్లు, క్లబ్‌లకు న్యూఇయర్ గైడ్ లైన్స్ పాటించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో న్యూ ఇయర్ ఆంక్షలు అమలు అవుతాయని పేర్కొన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ఈ ఆదేశాలను అమలుచేయాలని పోలీసులుకు సూచించారు. న్యూఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని తెలిపారు. కోవిడ్ నిబంధనల్లో ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనలు అమలు చేస్తామని డీజీపీ చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో కరోనా టెస్టులు చేసి, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని, ఎక్కడైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు. విధుల్లో ఉన్న పోలీసులు మాస్కులు ధరించి డ్యూటీ చేయాలని తెలిపారు. పబ్బులు, ఈవెంట్లపై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా పాటించాలని డీజీపీ తెలిపారు. -
‘నువ్వెంత అంటే నువ్వెంత’..పైలట్, పట్నం వాగ్వాదం
తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి సబితారెడ్డి సమక్షంలోనే ‘నువ్వెంత అంటే నువ్వెంత’అంటూ మాటలయుద్ధానికి దిగారు. ఒకదశలో వారు కొట్టుకునేంత పనిచేశారు. ఎమ్మెల్సీ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారంటూ ఎమ్మెల్యే వర్గం అభ్యంతరం తెలపడం గొడవకు దారితీసింది. ఈ ఘటన శుక్రవారం వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తాండూరులో గ్రామపంచాయతీలకు ఫాగింగ్ మెషీన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఎమ్మెల్సీలు పట్నం, సురభి వాణీదేవి హాజరయ్యారు. వేదికపై ఎమ్మెల్సీ వర్గానికి చెందిన మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు ఆశీనులు కాగా, ఎమ్మెల్యే వర్గాని కి చెందిన సర్పంచ్ రాములు, ఎంపీటీసీ సాయిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పెద్దేముల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్ అభ్యంతరం తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న కార్యక్రమానికి ప్రొటోకాల్ ప్రకారం హాజరైతే అభ్యంతరమెందుకని మున్సిపల్ చైర్పర్సన్ ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగి తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో వేదికపై ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ‘నువ్వెంత అంటే నువ్వెంత’అంటూ వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. నేతల గొడవపట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. చివరకు ఇరువర్గాల నేతలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
యాప్ తోడు.. దర్యాప్తు స్పీడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తున్న పోలీస్ శాఖ.. ఆ ప్లాన్‌కు టెక్నాలజీ జోడించి మరింత దూకుడు పెంచింది. అందులో భాగంగా మంగళవారం డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర సీనియర్ అధికారులు ప్రత్యేక యాప్‌ను ప్రారంభించారు. డీఓపీఏఎమ్‌ఎస్ (డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్, అనాలిసిస్, మానిటరింగ్ సిస్టమ్) పేరుతో రూపొందించిన ఈ యాప్‌తో మాదక ద్రవ్యాల నేరస్థుల కట్టడి సులభమవుతుందని డీజీపీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఎన్డీపీఎస్ యాక్ట్ కేసుల విశ్లేషణను సులభం చేసేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించామన్నారు. ఎన్డీపీఎస్ కేసులు, నేరస్థుల సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొస్తే దర్యాప్తు అధికారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. పర్యవేక్షణకు వేదిక తెలిసిన డ్రగ్ నేరస్థులందరి ప్రొఫైల్‌లను రూపొందించడం, వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేయడం ద్వారా దర్యాప్తు వేగవంతం అవుతుందని డీజీపీ తెలిపారు. నేర ప్రవృత్తి ఉన్న, ఎక్కువ నేరాలు చేసే పాత నేరస్థులను మానిటరింగ్ చేయడమూ ఈజీగా ఉంటుందన్నారు. నేరాలు చేస్తున్న ప్రాంతం, డ్రగ్స్ రకం ఆధారంగా నేరస్థులను గుర్తించడం వీలవుతుందని వివరించారు. మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అమ్మకాల హాట్ స్పాట్ల గుర్తింపు, దర్యాప్తు అధికారికి రాష్ట్రంలోని, ఇతర రాష్ట్రాల డ్రగ్స్/మాదకద్రవ్యాల నేరస్థుల సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ కేసుల పర్యవేక్షణకు ఇదో వేదికవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు డీజీపీలు జితేందర్, శివధర్‌రెడ్డి, బాలానాగదేవి, ఐజీలు నాగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, రాజేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నా ఎదుగుదల సర్వేల్ గురుకులం భిక్షే
సంస్థాన్‌నారాయణపురం: ‘నా ఎదుగుదలకు సర్వేల్ గురుకులం చదువే కారణం.. నా జీవితాన్ని మలుపు తిప్పిన గురుకులానికి గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో దేశం గర్వించే స్థాయిలో సేవలందిస్తున్నారు’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలోని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు మంగళవారం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన డీజీపీ ఈ సందర్భంగా బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సర్వేల్ గురుకులంలో చేరకముందు సొంత ఊరు పక్కన ఉన్న జెడ్పీ హైస్కూల్లో చదివానని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా గురుకులాన్ని ప్రారంభించాలన్న పీవీ నరసింహారావు ఆలోచనలకు స్పందించిన నాటి సర్వోదయ నేత మద్ది నారాయణరెడ్డి తన 50 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని చెప్పారు. ఇక్కడి నుంచే రాష్ట్రం, దేశ వ్యాప్తంగా గురుకుల విద్యా వ్యవస్థకు బీజం పడిందన్నారు. -
పెండింగ్ కేసులు పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. విచారణ పేరుతో నెలల కొద్ది కేసులను పెండింగ్‌లో పెట్టొద్దని సూచించారు. నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా దర్యాప్తు ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని జిల్లా ఎస్పీలు, కమిషనర్లు, సీఐడీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న పెండింగ్ కేసుల విచారణ పూర్తి చేసేందుకు జిల్లా ఎస్పీలు, డీఎస్పీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతివారం యూఐ (అండర్ ఇన్వెస్టిగేషన్) మేళా నిర్వహించాలని సూచించారు. నేరస్తుల శిక్షా శాతం పెరిగితే నేరాలు చేయాలంటే నిందితులు భయపడతారని, దీంతో నేర నియంత్రణ సులువు అవుతుందని పేర్కొన్నారు. సాంకేతిక వినియోగం ఎక్కువ కావడంతో సైబర్ నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోయిందని చెప్పారు. సైబర్ క్రైమ్ యూనిట్లలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది మరింత మెళకువలు నేర్చుకుని దర్యాప్తు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ వ్యవహారంలో పోలీసు శాఖ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోందని, అందులో భాగంగా ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణను మరింత పటిష్టం చేయాలని డీజీపీ సూచించారు. ఎక్సైజ్, పోలీస్ సంయుక్తంగా సోదాలు, దాడులు నిర్వహించి గంజాయి రవాణాకు చెక్ పెట్టాలని ఆదేశించారు. సర్వీస్ రూల్స్‌పై డీజీపీ సమీక్ష పోలీసు శాఖలోని సర్వీస్ రూల్స్‌ను సమీక్షించుకోవడంతో పాటు ఏళ్లుగా వేధిస్తున్న కొన్ని రూల్స్‌ను మార్చేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటైంది. రిటైర్డ్ డీఐజీ వై.గంగాధర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఈ కమిటీలో ఉద్యోగ సంబంధిత సర్వీసుపై పట్టున్న రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులతో పాటు సూపరింటెండెంట్లతో రూల్స్‌పై కార్యచరణ రూపొందించారు. కమిటీ అధ్యయనంపై మంగళవారం డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్షించారు. పోలీసు శాఖలోని ప్రధాన విభాగాల్లో అమల్లో ఉన్న రూల్స్, ఉమ్మడి ఏపీ రూల్స్ అన్వయించుకుంటూనే పాత సమస్యలు పరిష్కరించుకునే అంశాలసౌ కమిటీ నాలుగేళ్లు అధ్యయనం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సర్వీస్ రూల్స్‌ను తీసుకొచ్చేందుకు మరో ఆరు నెలల సమయం పడుతుందని కమిటీ తెలిపినట్లు సమాచారం. -
లొంగుబాటలో అన్నలు
సాక్షి, హైదరాబాద్: తుపాకీ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం సాధ్యం కాదని మావోయిస్టులు గ్రహించారని, దీంతో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆజాద్, రాజిరెడ్డిలాంటి అగ్రనేతలు సైతం జన జీవన స్రవంతిలో కలవాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన మావోయిస్టు కీలక నేత హరిభూషణ్ సతీమణి సమ్మక్క అలియాస్ శారద పోలీసులకు లొంగిపోయారు. శుక్రవారం ఆమెకు రూ.5 లక్షల చెక్కును డీజీపీ అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అనారోగ్యం, కోవిడ్ సహా సీజనల్ వ్యాధులు చుట్టుముట్టడంతో లొంగుబాటుకు మావో యిస్టుల నుంచి పెద్ద ఎత్తున సంకేతాలు వస్తున్నాయని వివరించారు. మహబూబ్‌బాద్ జిల్లా గంగారం గ్రామానికి చెందిన సమ్మక్క మైనర్‌గా ఉన్నప్పుడే హరిభూషణ్ ప్రోద్బలంతో పార్టీలో చేరింది. ఆ తర్వాత అతన్నే వివాహం చేసుకుంది. పార్టీ సిద్ధాంతాలతో విభేదించి 2008లో లొంగిపోయింది. అయితే, మరో పెళ్లి చేసుకుంటా నని హరిభూషణ్ బెదిరించడంతో 2011లో మళ్లీ పార్టీలోకి వెళ్ళింది. హరిభూషణ్ ఇటీవల చనిపోవడంతో తిరిగి లొంగిపోయింది. రాజు మృతిపై సందేహాలకు తావులేదు బాలికపై హత్యాచారానికి పాల్పడిన రాజు మృతిపై సందేహాలకు ఏమాత్రం తావు లేదని డీజీపీ స్పష్టం చేశారు. ‘మత్తుమం దుల వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం’అని తెలిపారు. -
‘రాజు’ కోసం వేట: తెలంగాణ పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్
-
‘రాజు’ కోసం వేట: తెలంగాణ పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసులు నిందితుడు రాజు కోసం జల్లెడ పడుతున్నారు. అతడి కోసం భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అన్ని పోలీస్స్టేషన్లకు రాజు ఫొటో పంపించారు. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసు పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. విపక్షాలు విమర్శలు తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండడంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. ఘటన జరిగిన వారమైనా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే.. సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ సమీక్ష చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్‌రెడ్డితో సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి హత్యాచార ఘటనపై సీఎం కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. నిందితుడిని వీలైనంత తొందరగా పట్టుకోండి అని ఆదేశించారు. చట్టపరంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు. చదవండి: నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ ఈ కేసులో డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు రాజు ఫొటోను డిసిప్లే చేయాలని ఆదేశించారు. కమిషనర్లు, ఎస్పీలు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని చెప్పారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక జంట నగరాల పరిధిలో గల్లీగల్లీని గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం వేట కొనసాగుతోంది. సీసీ కెమెరా ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్‌లో బస్సు ఎక్కినట్లు గుర్తించారు. బస్సులో వెళ్లిన రాజు ఎక్కడ దిగారో తెలుసుకుంటున్నారు. వేల సీసీ కెమెరాల ఫుటేజ్‌ను చూస్తున్నారు. టవల్‌తో పాటు టోపీని రాజు మోత్కూరు మార్గంలో పడేసినట్లు గుర్తించారు. ఒక కవర్లో తువ్వాలు, టోపీ, కల్లు సీసా, రూ.700 నగదు ఉన్నట్లు తేలింది. రాజుకు మద్యం అలవాటు ఉండడంతో అన్నీ వైన్‌షాపుల దగ్గర పోలీసులు మఫ్టీలో నిఘా ఉంచారు. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా?: రేవంత్‌రెడ్డి ఇక వీరితో పాటు నగరంతో పాటు సరిహద్దు జిల్లాల్లో రాజు కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు నిందితుడు రాజు ఫొటోలను బస్సులు, ఆటోలకు వాల్ పోస్టర్లు అంటించారు. మరికొన్ని చోట్ల నిందితుడి ఫొటో చూపిస్తూ మీకు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. రాజు ఆనవాళ్లు లభ్యం అయితే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. కొన్నిచోట్ల వాహనదారులను ఆపివేసి తనిఖీలు చేస్తున్నారు కూడా. -
మావోయిస్టులు లొంగిపోవాలి: డీజీపీ మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రం చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మావోల కదలికలు లేకుండా నిర్మూలిస్తామని తెలిపారు. సోమవారం ఆయన కుమ్రంబీమ్ జిల్లా కేంద్రంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోలను నిర్మూలించడానికి 31 టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ గడ్డపై అడుగు పెట్టకుండా మావోలపై చర్యలు చేడుతున్నామన్నారు. కరోనాతో బాధపడుతున్న మావోలు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోతే చికిత్స అందిస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. చదవండి: ఆన్లైన్లో అశ్లీలం.. ‘మేమే నగ్నంగా తయారవుతున్నాం’ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టులు -
తెలంగాణ: లాక్డౌన్ పక్కాగా అమలు.. ఉల్లంఘిస్తే కేసులే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దీని అమలుపై రేంజ్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మాట్లాడుతూ.. సీనియర్ పోలీస్ అధికారులందరూ క్షేత్ర స్థాయిలో ఉండి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. లాక్డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్క్వార్టర్లు, ప్రధాన నగరాల్లో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాపై ఎలాంటి ఆంక్షల్లేవని పేర్కొన్నారు. జాతీయ రహదారులపై రవాణాపై కూడా ఎలాంటి ఆంక్షల్లేవని తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్లు లేదా గుర్తింపు కార్డులు వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు. వ్యవసాయ, గ్రామీణ ఉపాధికి మినహాయింపు.. గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధి హామీ పనులను లాక్డౌన్ నుంచి మినహాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగుల వద్ద శాఖాపరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని తెలిపారు. రాష్ట్రంలో జరిగే వివాహాలకు ఇరు వైపుల వారు 40 మంది మాత్రమే హాజరయ్యేలా చూడాలని చెప్పారు. వివాహాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని పేర్కొన్నారు. అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలన్నారు. కరోనా వాక్సినేషన్‌కు ఎవరైనా వెళ్లాల్సి వస్తే వారి మొదటి డోస్‌కు సంబంధించిన సమాచారం సెల్ఫోన్లో చూసి వెళ్లనివ్వాలని తెలిపారు. నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులు జారీ చేయాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టంతో పాటు ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేయాలని డీజీపీ పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ–పాస్ ద్వారా ప్రత్యేక పాసులు లాక్డౌన్ నేపథ్యంలో వేరే రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ–పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందచేయనున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందచేసే ఈ–పాస్‌ల కోసం htt p://policeportal.tspolice.gov.in/ వెబ్సైట్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. లాక్డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించేవారికి మాత్రమే పాసులు జారీచేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు మాత్రమే పాస్‌లు జారీ చేస్తారని వివరించారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాల నుంచే పాస్‌లు జారీ చేస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఒక కమిషనరేట్ నుంచి మరో కమిషనరేట్ పరిధికి ప్రయాణించే వారికి ప్రయాణం ప్రారంభమయ్యే పరిధిలోని కమిషనరేట్ నుంచే పాసులు జారీ చేస్తారని వివరించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని ఉద్ఘాటించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వారికి పాసులు అవసరం లేదని, వారి ప్రయాణ టికెట్లు చూపిస్తే సరిపోతుందని తెలిపారు. చదవండి: కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా చదవండి: ఏం చేయలేం: వ్యాక్సిన్‌పై చేతులెత్తేసిన ఢిల్లీ -
పోలీసు జాగిలం ప్రత్యేకతలేంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నేర దర్యాప్తు, విపత్తుల సమయంలో పోలీసు జాగిలాల సేవలు ఎంతో కీలకమని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో మంగళవారం జరిగిన 50 పోలీసు జాగిలాలు, 80 మంది జాగిలాల శిక్షకుల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ, సంక్లిష్టమైన కేసుల పరిశోధన, ఛేదనలో అత్యంత కీలక పాత్ర వహించేలా ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసు జాగిలాలు విధుల్లో మరింత ప్రతిభ కనబరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పోలీసు జాగిలాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు జాగిలాలు, శిక్షకులతో కలసి ప్రదర్శించిన విన్యాసాలు, సాహస కృత్యాలు ఆకట్టుకున్నాయి. 8 నెలల పాటు కఠోర శిక్షణ.. మొయినాబాద్ శిక్షణ కేంద్రంలో 50 జాగిలాలకు 8 నెలల పాటు 80 మంది హాండ్లర్స్ (శిక్షకులు) ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 50 జాగిలాలలో ప్రధానంగా లాబ్రడార్, జర్మన్ షెపర్డ్, బెల్జియం మాలినాయిస్, కొకర్ స్పానియల్, గోల్డెన్ రిట్రీవర్ జాతులకు చెందినవి ఉన్నాయి. హోం శాఖకు చెందిన పీఎం డివిజన్ పోలీస్ కె–9 డివిజన్ కన్సల్టింగ్ డైరెక్టర్ పీకే ఛుగ్ ఈ బ్యాచ్ తుది పరీక్షకు ఎగ్జామినర్‌గా హాజరయ్యారు. 12 జాతుల వినియోగం.. ప్రపంచవ్యాప్తంగా 435 రకాల జాతులు ఉన్నాయి. ప్రధానంగా 12 జాతులకు చెందిన జాగిలాలను పోలీసు శాఖ తమ నేర పరిశోధనల అవసరాలకు వినియోగించుకుంటోంది. మన రాష్ట్రంలో లాబ్రడార్, డాబర్మన్, ఆల్సీషియన్, గోల్డెన్ రిట్రీవర్, డాల్మేషన్, జర్మన్ షెపర్డ్ జాతుల జాగిలాల సేవలను మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఎయిర్‌పోర్టులో తనిఖీల కోసం చిన్నగా ఉండే కొకర్ స్పానియల్ జాతి కుక్కలను పోలీసులు వినియోగిస్తున్నారు. కాగా, అకాడమీలో బిహార్‌కు చెందిన 20 జాగిలాలకు అక్రమ మద్యం గుర్తించేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కేంద్రంలో ఇప్పటివరకు 669 జాగిలాలు, 965 హ్యాండ్లర్లు శిక్షణ పొందారు. కార్యక్రమంలో ఏడీజీ (లా అండ్ ఆర్డర్) జితేందర్, ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావు, సైబరాబాద్ సీపీ సజ్జనార్ పాల్గొన్నారు. జాగిలాల ప్రత్యేకతలివే.. శునకాలకు ఘ్రాణ శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, కంటి చూపు 10 రెట్లు అధికం. పోలీసు శాఖకు నేర పరిశోధనలో ఇవి కీలకంగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘ విద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం నివారించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. చదవండి: డిప్యూటీ స్పీకర్ పద్మారావు వ్యాఖ్య చదవండి: అయ్యా నీకో దండం.. -
రసాభాసగా టీఆర్ఎస్ సమావేశం
సాక్షి, వికారాబాద్(యాలాల): టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తాండూరు పట్టణ శివారులోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం టీఆర్ఎస్ యాలాల మండల కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు సభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఇక్కడకు చేరుకున్నారు. ఎంపీపీ బాలేశ్వర్‌గుప్త సమావేశాన్ని ప్రారంభిస్తూ మాట్లాడారు. ఆతర్వాత ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్‌కు మైక్ అందిస్తుండగా.. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిద్రాల శ్రీనివాస్ అడ్డుకున్నారు. ఇది పార్టీకి సంబంధించిన సమావేశమని, ముందుగా పార్టీ అధ్యక్షుడికి మాట్లాడే అవకాశం ఇవ్వరా..? అని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పార్టీ మండల అధ్యక్షుడికి మొదట మాట్లాడే అవకాశం ఇవ్వాలని మైక్ అప్పగించారు. ఇదే సమయంలో తాను రెండు నిమిషాల్లో ప్రసంగం ముగిస్తానని విఠల్ నాయక్ చెప్పడంతో సిద్రాల శ్రీనివాస్ ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మధ్యలో కల్పించుకున్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డిపై సిద్రాల శ్రీనివాస్ మండిపడ్డారు. ‘ఇది యాలాల మండల పార్టీ సమావేశం.. తాండూరు మండలానికి చెందిన వాడివి, నీకు ఇక్కడ ఎలాంటి పని లేదు’ అని గద్దించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ కార్యక్రమంలో మండల అధ్యక్షుడికే అవమానం జరిగితే ఎలా అని అసహనం వ్యక్తంచేస్తూ కొంతమంది సర్పంచ్‌లు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాయకులకు నచ్చజెప్పడంతో సిద్రాల శ్రీనివాస్ ప్రసంగం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల పార్టీకి కొందరు కొత్తబిచ్చగాళ్లు వచ్చారు’అనడంతో.. ఎంపీపీ బాలేశ్వర్‌గుప్త అడ్డుకున్నారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో స్టేజీపై ఇలా మాట్లాడటం తగదన్నారు. రెండు రోజులుగా సమావేశ ఏర్పాట్లు జరుగుతున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా సమయానికి వచ్చి గొడవ చేయడం ఏమిటని నిలదీశారు. ఇలా కార్యక్రమం ముగిసే వరకూ నాయకుల మధ్య వాగ్వాదం కొనసాగింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రోహిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి కలి్పంచుకుని పరిస్థితిని మరింత ఉద్రిక్తం కాకుండా చక్కదిద్దారు. -
ఆ ఇద్దరు సైకోలకు ఉరిశిక్షల వెనుక..
సాక్షి, హైదరాబాద్ : దశాబ్దం క్రితం నగరంలోని అంబర్‌పేటలో ఓ కుటుంబంలో ఐదుగురిని పట్టపగలు చంపినా.. ప్రత్యక్ష సాక్షులు లేరన్న కారణంతో నిందితులకు శిక్ష పడలేదు. రెండేళ్ల కింద హాజీపూర్, గొర్రెకుంట ఘటనల్లో సైకోలకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ రెండు ఘటనల్లోనూ ప్రత్యక్ష సాక్షులు లేకున్నా.. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా న్యాయస్థానం నిందితులకు క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చింది. ఈ రెండు ఘటనల్లోనూ దర్యాప్తు చేసింది తెలంగాణ పోలీసులే. కానీ, శిక్షలు పడటంలో ఎందుకంత మార్పు వచ్చింది? అంటే హాజీపూర్, గొర్రెకుంట కేసుల్లో కోర్టు డ్యూటీ ఆఫీసర్ (సీడీవో) లేదా కోర్టు లైజినింగ్ ఆఫీసర్ పోషించిన పాత్రే. నేరం జరిగిన వెంటనే పోలీసులు దర్యాప్తు చేసిన విధానం ఒక ఎత్తైతే, కోర్టు విచారణ మొదలైన తరువాత నిందితుల నేరం నిరూపించడం మరో ఎత్తు. కోర్టులో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. సాక్షులు ప్రభావితమైనా, తడబాటుకు గురైనా పోలీసుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే, ఈ లోపాన్ని సరిచేయడానికి డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఠాణాల్లో సిబ్బంది పనిని మొత్తం 17 వర్టికల్స్‌గా విభిజించారు. ఇందులో రిసెప్షన్, రైటర్, డయల్ 100, డిటెక్టివ్, క్రైంస్టాఫ్ తదితర విభాగాలు కీలకం. వీటన్నింటిలో సీడీవోల పని కీలకం. ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక ఏటా రాష్ట్రంలో కన్విక్షన్లు పెరిగి డిస్పోజల్స్ తగ్గుతున్నాయి. సెక్షన్లపై శిక్షణ.. 2018 నుంచి వీరిపై డీజీపీ ప్రత్యేక శ్రద్ధ వహించడం ఫలితంగా గతంలో మునుపెన్నడూ చూడని రీతిలో నేరాల్లో న్యాయస్థానాల్లో శిక్షలు పడుతున్నాయి. సీడీవోలుగా రాష్ట్రంలోని అన్ని ఠాణాల నుంచి కానిస్టేబుల్, ఏఎస్సై ర్యాంకు ఆఫీసర్లకు హైదరాబాద్ జేఎన్టీయూలో ప్రత్యేకంగా పలు ఐపీసీ సెక్షన్లు, లీగల్ వ్యవహారాల్లో శిక్షణ ఇచ్చారు. సాక్షుల వాంగ్మూలం రికార్డు, వారికి రక్షణ, వాయిదాలకు హాజరయ్యేలా చూడటం, సాంకేతిక ఆధారాల నివేదిక, చార్జిషీటు సరైన సమయంలో ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసీజేఎస్) ద్వారా కోర్టుకు సమర్పించడం, సీసీ నంబర్ తీసుకోవడం కోర్టు వాయిదాలపై క్యాలెండర్ రూపొందించడం తదితర విధులు అతనే నిర్వర్తించాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో కలసి దర్యాప్తు అధికారులు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)కు న్యాయస్థానం విషయాలు వివరించాలి. వీరు ప్రతీ శనివారం ఠాణాలో సమీక్ష నిర్వహిస్తారు. దీనికి ఎస్‌హెచ్‌వో, దర్యాప్తు అధికారులు హాజరవుతారు. వారంలో కోర్టులో నడిచిన ట్రయల్స్ లోటుపాట్లు, అదనంగా చేయాల్సిన పనులపై చర్చిస్తారు. ఈ నివేదికను డీజీ కార్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు అందజేస్తారు. ‘ఉత్తము’లకు అభినందనలు.. అన్ని వర్టికల్స్తోపాటు సీడీవోల పనితీరుపై సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నిరంతరం డేటా నిర్వహిస్తోంది. ఇక్కడ అధికారులు రాష్ట్రంలోని అన్ని యూనిట్ల నుంచి నిరంతరం వచ్చే నివేదికలు చూసి పొరపాట్లు ఉంటే సరిచేస్తారు. కన్విక్షన్, డిస్పోసల్స్ వివరాలు డేటాబేస్‌లో నమోదు చేస్తారు. సీడీవోల అత్యుత్తమ ప్రతిభను, లోటుపాట్లను పేర్లు లేకుండా అందరికీ అందజేస్తారు. వీరి గణాంకాల ఆధారంగా నెలనెలా డీజీపీ కన్విక్షన్లలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి అభినందనలు పంపుతారు. దీంతో అందరిలోనూ జవాబుదారితనం పెరిగి కేసుల్లో న్యాయస్థానం త్వరగా తీర్పులు వస్తున్నాయని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్చార్జి డీఎస్పీ సత్యనారాయణ వివరించారు. -
లండన్‌ను వెనక్కినెట్టిన హైదరాబాద్
సాక్షి,హైదరాబాద్ : భాగ్యనగరం ఖాతాలో మరో ఘనత చేరింది. ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో రెండో స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. తొలి స్థానంలో మనదేశానికే చెందిన చెన్నై ఉండటం మరో విశేషం. రెండు దక్షిణాది నగరాలకు జాబితాలో చోటు దక్కడం, రెండూ ప్రపంచంలోనే ప్రథమ, ద్వితీయ స్థానాలు దక్కించుకోవడంపై ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. యూకేకి చెందిన ‘సర్ఫ్‌షార్క్’సంస్థ అంతర్జాతీయంగా 130 నగరాల్లో సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. ‘‘ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానం’’అనే నినాదంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం, పోలీసుశాఖ.. సీసీ కెమెరాల ఏర్పాటులో ఈ సరికొత్త మైలురాయి అందుకున్నాయి. నగరంలో ప్రతీ చదరపు కిలోమీటరుకు 480, వెయ్యి మందికి 30 సీసీ కెమెరాలు ఉన్నాయని సర్వే స్పష్టం చేసింది. – సాక్షి,హైదరాబాద్ సురక్షిత నగరం బాటలో! తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. వివిధ బహుళజాతి, అగ్ర దేశాల వ్యాపార, పరిశోధన సంస్థలు భాగ్యనగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో సురక్షిత నగరంగా పేరొందితే పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని భావించారు. 2014లో అమల్లోకి వచ్చిన ప్రజాభద్రతా చట్టం కింద సీసీ కెమెరాల ఏర్పాటును ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లండన్‌ను ఆదర్శంగా తీసుకుని భారీగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సంకల్పించాయి. ఈ క్రమంలో వీటి ఏర్పాటులో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ పోలీస్ నిలిచిన విషయం తెలిసిందే. ఇక నగరాల వారీగా చూస్తే చెన్నై మొదటి స్థానం దక్కించుకుంది. అలాగే హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ఉండే సీసీ కెమెరాల దృశ్యాల పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్వేర్ సైతం నిక్షిప్తం చేయడం మరో ప్రత్యేకత. 10 లక్షల సీసీ కెమెరాలే లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది తెలంగాణ పోలీసుశాఖ సంకల్పం. ఇప్పటిదాకా 6.65 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇందులో 2020లోనే 99,095 అమర్చాం. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటాం. గతేడాది 4,490 కేసుల్లో నేరస్థుల్ని పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకంగా వ్యవహరించాయి. – డీజీపీ డాక్టర్ ఎం మహేందర్‌రెడ్డి సంఖ్య పరంగా చూస్తే చెన్నై కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ సీసీ కెమెరాలున్నాయి. అయితే చెన్నై విస్తీర్ణం 426 చదరపు కి.మీ. కాగా... హైదరాబాద్‌ది 625 చదరపు కి.మీ. అందువల్లే ప్రతి చదరపు కి.మీ.కి ఉన్న కెమెరాల అంశంలో చెన్నై మొదటి స్థానం ఆక్రమించింది. దేశంలో ప్రస్తుతం ఏ నగరంలో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయంటే.. ఢిల్లీ 4,29,500 హైదరాబాద్ 3,25,000 చెన్నై 2,80,000 కోల్‌కతా 13,800 ముంబై 9,800 అçహ్మదాబాద్ 6,281 బెంగళూరు 1,301 కొచ్చి, జైపూర్ 1000 చదరపు కిలోమీటరుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య, అక్కడి జనాభాను ప్రామాణికంగా తీసుకున్న సర్ఫ్‌షార్క్ సంస్థ 130 నగరాలతో జాబితా రూపొందించింది. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రపంచదేశాలతో పోలిస్తే చైనా, భారత్ ముందున్నాయని సర్వే తెలిపింది. చదరపు కిలోమీటరుకు 657 కెమెరాలతో చెన్నై మొత్తం ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత 480 కెమెరాలతో హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకుంది. సర్వేలో టాప్–10లో చోటు సాధించిన నగరాల వివరాలు ఇలా ఉన్నాయి. టాప్‌టెన్ నగరాలివే.. నగరం సీసీ కెమెరా (చదరపు 1,000 కిలోమీటరుకు) మందికి 1 చెన్నై 657 25.5 2 హైదరాబాద్ 480 30.0 3 హర్బిన్ (చైనా) 411 39.1 4 లండన్ (బ్రిటన్) 399 67.5 5 గ్జియామెన్ (చైనా) 385 40.3 6 చెంగ్డూ (చైనా) 350 33.9 7 తైయువాన్ (చైనా) 319 119.6 8 ఢిల్లీ 289 14.2 9 కున్మింగ్ (చైనా) 281 45.0 10 బీజింగ్ (చైనా) 278 56.2 -
టీఆర్ఎస్లో రచ్చ: నువ్వెంతంటే.. నువ్వెంత!
సాక్షి, తాండూరు: ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. సమావేశంలో ఆవేశకావేశాలకు లోనయ్యారు. నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ మాటలయుద్ధానికి దిగారు. ఫలితం గా సమావేశం రసాభాసగా మారింది. తాండూరు మున్సిపల్ సమవేశం సోమవారం చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్ అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరయ్యారు. చదవండి: (ఒకే గొడుకు కిందకు నీటి పారుదల శాఖలు) తాను సూచించిన మూడు అంశాలను తొలగించారని, మున్సిపల్ అభివృద్ధికి తగినట్లుగా ఎజెండాలేదని, దానిని చెత్తబుట్టలో వేయాలని ఎమ్మెల్యే మండిపడ్డారు. అదేసమయంలో కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ ఫ్లోర్ లీడర్లు ఎజెం డా ప్రతులను చించివేశారు. కౌన్సిలర్ల మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు నువ్వెంత.. అంటే నువ్వెంత అంటూ గొడవకు దిగారు. ఈ పరిణామాల మధ్యే ఎమ్మెల్సీ సూచన మేరకు మెజార్టీ కౌన్సిలర్లు ఎజెండాను ఆమోదించారు. కాగా, ఇరువర్గాలకు చెందిన ఇద్దరు నేతలు సమావేశం ముగిసిన తర్వాత కౌన్సిల్ ఎదుట ఘర్షణకు దిగారు. -
వచ్చే ఏడాది 20 వేల పోస్టుల భర్తీ
సాక్షి, కంటోన్మెంట్: తెలంగాణ పోలీసు శాఖలో వచ్చే ఏడాది 20 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నార్త్‌జోన్ పరిధిలోని కార్ఖానా పోలీసుస్టేషన్ నూతన భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గడిచిన ఆరేళ్లలో 27 వేల మంది పోలీసు పోస్టులు భర్తీ చేశామన్నారు. మహిళల భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తూ షీటీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటి సంఖ్యను పెంచుతున్నామని హోం మంత్రి వెల్లడించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బోయిన్‌పల్లిలో ఆగిపోయిన నూతన పోలీసుస్టేషన్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్రంలో నేరాల నిరోధానికే ప్రాధాన్యమిస్తున్నామని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్, నగర కమిషనర్ అంజనీకుమార్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఓలేటి దామోదర్, కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో అల్లర్లకు బీజేపీ కుట్ర?
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలంటూ డీజీపీ మహేందర్‌రెడ్డిని టీఆర్ఎస్ నేతలు కోరారు. ఆదివారం సాయంత్రం డీజీపీని కలిసిన టీఆర్ఎస్ నేతలు... హైదరాబాద్‌లో విధ్వంసానికి బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, సైదిరెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు డీజీపీని కలిశారు. అనంతరం ఈసీ అదనపు సీఈఓ బుద్ధ ప్రకాష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అంతకు ముందునగరంలో అల్లర్లు సృష్టించి ద్వారా వచ్చే సానుభూతితో దుబ్బాక ఉపఎన్నికలో కొన్ని ఓట్లు సాధించాలని బీజేపీ అనుకుంటోందని, ఆ పార్టీ నాయకుల నుంచే తమకు విశ్వసనీయ సమాచారం ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. (రక్తపాతం జరిగేలా బీజేపీ ప్రోత్సహిస్తుంది : కేటీఆర్) -
పీహెచ్డీ పూర్తి చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పీహెచ్డీ పూర్తయింది. శుక్రవారం జేఎన్టీయూ స్నాతకోత్సవంలో ఆయన తన పీహెచ్డీ పట్టా అందుకున్నారు. వర్సిటీ వీసీ ఇన్‌ఛార్జి వీసీ జయేశ్‌రంజన్ పీహెచ్డీ పట్టాను డీజీపీ మహేందర్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆన్లైన్ ద్వారా అధ్యక్ష ఉపన్యాసం చేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ ‘‘ఇంపాక్ట్ ఆఫ్ ఇనర్మేషన్ టెక్నాలజీ ఆన్ పోలిసింగ్’’ పురస్కారం పొందడం ఆనందంగా ఉందన్నారు. పోలీసింగ్, సమాజ భద్రతలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంపై తాను పదేళ్లుగా అధ్యయనం చేస్తున్నానన్నారు. తన పీహెచ్డీ పూర్తి చేయడంలో సహకరించిన గైడ్, ఇతర సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. తన పరిశోధన తెలంగాణ పోలీసులకు ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
శాంతిభద్రతల రక్షణలో దేశానికే ఆదర్శం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పథాన ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం, శాంతి భధ్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆ దిశగా పోలీసుల భాగస్వామ్యాన్ని అభినందించారు. బుధవారం ప్రగతి భవన్లో జరిగిన రాష్ట్ర పోలీసు శాఖ, అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సామాజిక రంగాలలో నిత్యం శాంతిభధ్రతల పరిరక్షణ కోసం అహర్నిషలు కృషి చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహ్మద్ అలీ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, సీఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ శోభ, అటవీశాఖ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జోనల్ ఐజీలు, తెలంగాణ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళల భధ్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకుని పనిచేస్తున్నదని, పోలీసులు మహిళా సంరక్షణ కోసం మరింతగా శ్రమించాల్సిన అవసరముందన్నారు. సమాజాన్ని పీడించే గంజాయి వంటి వాటి ఉత్పత్తి, అమ్మకం, రవాణా వ్యవస్థలను అరికట్టాలన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. కలప స్మగ్లింగును గత పాలకులు సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల కొందరికి అలుసుగా మారిందని, ఐతే దీన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. ఫారెస్టు స్మగ్లింగును అరికట్టడంలో కేవలం అటవీశాఖ అధికారులే కాకుండా సివిల్ పోలీసు వ్యవస్థ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరముందన్నారు. సమాజంలో భాగస్వామ్యమై నేరాలను అరికట్టినట్టు, ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ద్వారా పోలీసులు అడవుల పట్ల అవగాహన పెంచుకుని, స్మగ్లింగు వంటి అటవీ నేరాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. అటవీశాఖ అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని ఈ దిశగా ముందుకు సాగాలని సీఎం సూచించారు. ఎప్పటికప్పుడు ఇరు శాఖల ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించుకుని కలప స్మగ్లింగు నివారణ చర్యల రూపకల్పనకు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలన్నారు. తద్వారా మాత్రమే సమాజానికి మనం అనుకున్న విధంగా సేవ చేయగలుగుతామన్నారు. (చదవండి: అరవై ఏళ్లుగా గోస పడ్డాం...) దళితుల మీద దాడులు శోచనీయం తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీసులు సాధించిన ఘన విజయాల్లో గుడుంబా నిర్మూలన కూడా వుందన్నారు. ఇటీవలి కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ గుడుంబా తయారీ జరుగుతున్నట్టు సమాచారముందని, దాన్ని కూడా తక్షణమే అరికట్టాలన్నారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చిన ఎక్సైజ్, సివిల్ పోలీసులు తిరిగి అదే స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకుగాను రాష్ట్ర ఎక్సైజ్ శాఖతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రజలను ఏమార్చే గ్యాంబ్లింగ్ వంటి సామాజిక దురాచారాలను అరికట్టడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్న వార్తలు వినడం శోచనీయమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుంచి సమాజం దూరం కావాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు. దళితుల మీద దాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని పోలీసులకు సీఎం వివరించారు. ఆ దిశగా ఎప్పటికప్పుడు అప్రమత్తతతో మెలగాలన్నారు. బలహీనుల మీద బలవంతుల దాడులు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసు వ్యవస్థకున్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారుల దగ్గరనుంచి కిందిస్థాయి పోలీసు వరకు సమాజంలో ఒకరిగా భాగస్వాములు కావాలని, చిన్నా పెద్ద తేడా లేకుండా పౌరులందరికి గౌరవాన్ని ఇస్తూ ఫ్రెండ్లీ పోలీసు స్ఫూర్తిని పెంచుకోవాల్సిన అవసరం ప్రతి పోలీసుకున్నదన్నారు కేసీఆర్. (చదవండి: దేవునితోనైనా కొట్లాడుతా!) కారుణ్య నియామకాల్లో ఆలస్యం తగదు తమ దగ్గరికి రక్షణకోసం వచ్చిన అభాగ్యుల పట్ల మానవీయ కోణంలో మెలగాలని సీఎం హితవు పలికారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాల మీద పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి అరికట్టాలని సీఎం చెప్పారు. కష్టపడి సాధించాల్సిన పట్టాలను తప్పుడు దారుల్లో పొందే సంస్కృతి సమాజానికి తప్పుడు సంకేతాలిస్తుందని తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించే ముఠాలు, వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. పోలీసు శాఖలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ సెటిల్ చేసి, సర్వీసు ఆఖరి రోజున గౌరవప్రదంగా ఇంటిదాకా సాగనంపాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి మరోమారు పోలీసు ఉన్నతాధికారులకు గుర్తుచేశారు. తన జీవితకాలం పాటు డిపార్టుమెంటుకు సేవలందించిన ఉద్యోగి రిటైరయితే, వారిని సత్కరించి కారులో ఇంటికాడ దించివచ్చే మంచి సంప్రదాయాన్ని కొనసాగించాలని అన్నారు. పోలీసు శాఖలో కారుణ్య నియామకాలను చేపట్టడంలో ఆలస్యం తగదన్నారు. డ్యూటీలో వుంటూ చనిపోయిన ఉద్యోగి వారసులకు, నిబంధనల ప్రకారం కారుణ్య నియామకానికి అర్హత కలిగిన వారసులకు, తక్షణమే ఉద్యోగం ఇవ్వాలని, దీనిపై వెంటనే కార్యాచరణ చేపట్టాలన్నారు. ఇతర శాఖల్లో ఖాళీలుంటే పరిశీలించి వెయిటింగ్ లిస్టులో వున్న అభ్యర్థులకు ఉద్యోగాలు అందేలా చూడాలని డీజీపీ మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు. (చదవండి: దసరాకు ధరణి) మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వసతులు పోలీసు శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం మరింతగా కృషి జరగాల్సిన అవసరమున్నదని సీఎం తెలిపారు. పోలీసు ఉద్యోగ నియామకాల్లో మహిళల కోసం 33శాతం రిజర్వేషన్లను అమలు పరుస్తున్న నేపథ్యంలో, ఆ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నదన్నారు. అందులో భాగంగా మహిళలు పనిచేసే పోలీసు కార్యాలయాలు స్థలాల్లో ప్రత్యేకించి రెస్ట్ రూములు, వసతులు కల్పించాలన్నారు. హైదరాబాద్‌లో పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేయాలని డీజీపీకి సీఎం సూచించారు. పోలీసు వ్యవస్థలో ఐటీ పాత్రను పెంచి నేరాలను అరికట్టడంలో సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకోవాలని తెలిపారు. దేశానికే తలమానికంగా హైదరాబాద్‌లో నిర్మితమౌతున్న పోలీసు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. -
ఆసిఫాబాద్ జిల్లా: ముగిసిన డీజీపీ టూర్..
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన ఆదివారం ముగిసింది. ఐదు రోజుల పాటు డీజీపీ పర్యటన కొనసాగింది. నిన్నంతా ఎస్పీ క్యాంపు కార్యాలయంలోనే సమీక్షలు జరిపారు. జిల్లా కలెక్టర్ సందీప్ ఝా, ఇంచార్జీ ఎస్పీ సత్యనారాయణ, ఓఎస్డీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎఎస్పీ సుధీంద్రలతో పాటు ఇతర అధికారులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఛత్తీస్గడ్, మహారాష్ట్రల నుంచి తెలంగాణ లోకి మావోయిస్టుల కట్టడి విషయంలో పోలీసులకు డీజీపీ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఎస్ఐ మొదలుకొని జిల్లా ఎస్పీ వరకూ అందరి పనితీరును దగ్గరుండి క్షుణ్ణంగా ఫీల్డ్ లెవల్లో ఆయన పరిశీలించారు. ఓ డీజీపీ స్థాయి అధికారి మావోయిస్టు ప్రాబల్య మారుమూల ప్రాంతాల్లో రోజుల తరబడి ఉండటం అరుదు. డీజీపీ మకాంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అలర్ట్ అయింది. ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాల విస్తృత కూంబింగ్, అనుమానిత ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. (చదవండి: సీరియస్‌గా ఉన్న డీజీపీ, వారే టార్గెట్) ఈ నెల 2న హెలికాప్టర్ లో ఆసిఫాబాద్ కు వచ్చిన డీజీపీ, అదే రోజు ఏజెన్సీలో ఏరియల్ సర్వే నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా మావోయిస్టు ప్రాబల్య అటవీ ప్రాంతంలో ఉండే తిర్యాని మండల పోలీసు స్టేషన్‌ను డీజీపీ రాత్రి పూట ఆకస్మిక తనిఖీ చేశారు. మిగతా రోజుల్లో ఆసిఫాబాద్ కేంద్రంగానే ఉంటూ మావోయిస్టు సెర్చ్ ఆపరేషన్ల పర్యవేక్షణ, సమీక్షలు నిర్వహించారు. ఆరు నెలలుగా ఆసిఫాబాద్ ఏజెన్సీని టార్గెట్ చేసుకొని కేబీఎం (కొమరం భీం మంచిర్యాల) ఏరియా కార్యదర్శి మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ దళం సంచరించడం తెలిసిందే. డివిజన్, ఏరియా కమిటీల పునర్నిర్మాణం, ఆదివాసీ యువకులే లక్ష్యంగా రిక్రూట్ మెంట్ జరుగుతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. జూలై 13, 18 తేదీల్లో తిర్యాని మండలం మంగి, తొక్కిగూడ అడవుల్లో ఎదురు కాల్పులు జరగగా, తృటిలో మావోయిస్టు అడెళ్లు దళం తప్పించుకుంది. మావోయిస్టుల కార్యకలాపాలను సీరియస్‌గా తీసుకున్న పోలీసు బాస్.. ఈ క్రమంలోనే రోజుల తరబడి పర్యటన చేసినట్లు తెలిసింది. క్షేత్ర స్థాయిలోనే ఉంటూ పోలీసులను అప్రమత్తంగా ఉంచడమే లక్ష్యంగా పర్యటన సాగింది. (చదవండి: మావోయిస్టు సుదర్శన్ లొంగిపోతారా..?) -
అపాయింట్మెంట్ లేదని అరెస్ట్ చేశారు
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా డీజీపీ ఇంటికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఘటనాస్థలానికి వెళ్లిక టీ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ డీజీపీ మహేందర్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే సంపత్, అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు మరి కొంతమంది నేతలు శనివారం నగంరలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే వారికి డీజీపీ అపాయింట్మెంట్ మంజూరు చేయకపోవడంతో లోపలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడున్న సిబ్బంది వారిని అరెస్ట్ చేసి నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా అంతకుముందే తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టిన శ్రీశైలం పర్యటన ఉద్రిక్తతంగా మారింది. శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, మల్లు రవిని పోలీసులు అడ్డగించడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. -
వర్షాలతో పోలీస్ శాఖ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అప్రత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు అన్ని జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు డీజీపీ కార్యాలయం నుండి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గత రెండు రోజుల నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తాను కలసి జిల్లాల కలెక్టర్లు సీపీలు, ఎస్పీలతో ఉమ్మడిగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగు సూచనలు, సలహాలను ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ తో పాటు వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లలో పోలీస్ అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అత్యంత ప్రాధాన్యతనివ్వాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినందున క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులందరు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. -
మావోయిస్టులను గట్టి దెబ్బ కొడతాం: డీజీపీ
సాక్షి, ఏటూరు నాగారం: మావోయిస్టులు అభివృద్ది నిరోధకులని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఏటూరు నాగారం సబ్ డివిజన్లోని వెంకటాపురం పోలీస్ స్టేషన్లో ములుగు, భూపాలపల్లికి చెందిన పోలీసు అధికారులతో శనివారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఐపీఎస్, ఐజీ నాగిరెడ్డి ఐపీఎస్, ఐజీ ప్రభాకర్ రావు ఐపీఎస్, ఐజీ నవీన్ చంద్ ఐపీఎస్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్, ఓఎస్డీకే సురేష్ కుమార్, శోభన్ కుమార్, ఏఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్, సాయి చైతన్య ఐపీఎస్, గౌస్ ఆలం ఐపీఎస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మావోయిస్టులు మళ్లీ తెలంగాణలో ప్రవేశించి హింసాత్మక చర్యలకు పూనుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ తరుణంలో తెలంగాణ పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టు ఆగడాలను తెలంగాణ గడ్డ మీద జరగనివ్వబోదని రాష్ట్ర ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అయినటువంటి హరి భూషణ్, దామోదర్ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అమాయక గిరిజనులను బలిపశువులుగా చేస్తున్నారన్నారన్నారు. మావోయిస్టులకు ఎవరూ కూడా సహకరించకుండా ఉండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలోని డాక్టర్లలను, ఇంజనీర్లను, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేసుకునేందుకు పథక రచనతో మావోయస్టులు తిరిగి మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వారు చేసే ప్రయత్నాలను తెలంగాణ పోలీస్ శాఖ సమర్థంగా తిప్పి కొడుతుందని పేర్కొన్నారు. దాదాపు పది సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల కోపాగ్నికి గురై ఇక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోయిన మావోయిస్టులు తిరిగి మళ్ళీ తెలంగాణ ప్రజల కోపానికి గురి కాకూడదని హెచ్చరించారు. తెలంగాణలో ప్రతి గ్రామం రహదారులతో అనుసంధానింపబడి విద్య, వైద్యం వంటి సదుపాయాలను పొందుతూ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్న ఈ సమయంలో మావోయిస్టులు తిరిగి తెలంగాణలో అశాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలకు పాల్పడే మావోయిస్టులకు రానున్న రోజుల్లో తెలంగాణ పోలీస్ శాఖ గట్టి దెబ్బ కొడుతుందని హెచ్చరించారు. నక్సలిజం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే శరవేగంగా అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దూసుకుపోతుందని తెలియజేశారు. -
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనే పరీక్షలు.. పాసులు
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో తెలంగాణలో చిక్కుకున్న వలసకూలీలు, ఇతరత్రా ప్రజలు సొంత వాహనాలు, కార్లు, బస్సులు ఇతర వాహనాల్లో తమ స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వారికి అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారని డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ సర్టిఫికెట్ల ఆధారంగా సరిహద్దు జిల్లాల కలెక్టర్లు ఇచ్చే పాసులతో స్వస్థలాలకు వెళ్లిపోవచ్చన్నారు. సరిహద్దుల వద్ద ఉన్న వైద్యులు ఈ టెస్టులు నిర్వహిస్తారన్నారు. ఈ మేరకు అన్ని చెక్‌పోస్టుల వద్ద ఏర్పాట్లు చేసుకోవాలని డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీ లు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. -
వేరే ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ–పాస్‌లు
సాక్షి, హైదరాబాద్: పర్యాటకం, విద్య, ఉద్యోగం ఇతర కారణాల వల్ల తమ సొంత ప్రాంతానికి వెళ్లలేని వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ–పాస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. తమ సొంత ఊరు, రాష్ట్రం వెళ్లాలనుకునేవారు https://tsp.koopid.ai/epass లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఈ–పాస్ పొందవచ్చని తెలిపారు. ఒక కుటుంబానికి చెందిన వారికి రోజుకు ఒక పాస్ మాత్రమే జారీ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ–పాస్ అవసరమైన వారు సంబంధిత పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, ప్రాంతం, ఇతర వివరాలు పొందుపర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్లైన్లో పొందుపర్చిన వివరాల ఆధారంగా అన్ని అంశాల్ని పరిశీలించిన తర్వాత ఆన్లైన్లోనే ఈ పాసులు జారీ చేస్తామని, వాటి సహాయంతో సొంత ప్రాంతాలకు వెళ్లొచ్చని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. (పోలీసులపై దాష్టీకాలా?) Dear Citizens Who Got Stranded in Telangana due to #LockDown & want to leave for their Homes in other States in India can Apply for E-PASS by submitting required information @ the given link.https://t.co/WCLZ5nScIl After due verification ur E-PASS will b sent to u,to move ahead. pic.twitter.com/yasu3Ck3YG — DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 2, 2020 కోవిడ్ ’ఫ్రీ’ చేసి పంపండి రెవెన్యూ, పోలీస్, మెడికల్ అధికారులతో కూడిన బృందాలు స్క్రీనింగ్ చేయాలి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ ఉత్తర్వులు లాక్డౌన్ కారణంగా ఉండిపోయి ఇప్పుడు తమ స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారిని జాగ్రత్తగా వారి రాష్ట్రాలకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి అంతర్రాష్ట్ర సరిహద్దుకు 2, 3 కిలోమీటర్ల ముందే పరీక్షలు నిర్వహించాలి. రెవెన్యూ, పోలీస్, మెడికల్ అధికారులతో కూడిన బృందం వారందరికీ పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో పరీక్షించాలి. లేవని నిర్ధారిస్తూ ప్రభుత్వం సూచించిన ఫార్మాట్లో సర్టిఫై చేయాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వాహనాలకు కూడా నిర్దేశిత నమూనాలో పర్మిట్లు జారీ చేయాలి. వాహనం నంబర్‌తో పాటు ఎంతమంది ప్రయాణిస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారనే అంశాలను పర్మిట్‌లో పేర్కొనాలి. స్క్రీనింగ్ చేసే బృందాలు అవసరం మేరకు 24 గంటలు పనిచేసే విధంగా సిద్ధం చేసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ఉండేందుకు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించాలని వెల్లడించారు. -
శభాష్.. మంచిర్యాల పోలీసు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో తగాదాల కారణంగా ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ యువతిని కాపాడిన మంచిర్యాల పోలీసులను డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. శ్రీరాంపూర్‌కు చెందిన ఓ యువతి ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తుండగా అది గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. విషయం తెలుసుకున్న డీజీపీ ట్విట్టర్ ద్వారా మంచిర్యాల పోలీసులను అభినందించారు. ప్రజల లాక్డౌన్ సహకారం భేష్ లాక్డౌన్ విధించిన నెలరోజులుగా ప్రజలు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. లాక్డౌన్ సమయంలో భౌతికదూరం పాటిస్తూ నిబంధనలను పాటిస్తున్న పౌరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే పోలీసులకు సహకారం కొనసాగించాలని ఆయ కోరారు. -
కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నాం
-
పోలీస్ సిబ్బందికి డీజీపీ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా విశేష సేవలు అందిస్తున్న పోలీస్ సిబ్బందికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మే 7 వరకు కంటైన్మెంట్ జోన్ల ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హెల్త్, మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి సమన్వయంతో పోలీస్ శాఖ పనిచేస్తుందని డీజీపీ తెలిపారు. లాక్డౌన్లో పోలీస్ సిబ్బంది కృషికి గుర్తింపుగా 10 శాతం ఇన్సెంటివ్స్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. యువత పనిలేకుండా రోడ్లపైకి రాకూడదని ఆయన హెచ్చరించారు. కరోనా నియంత్రణకు రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని.. ప్రతి కాలనీ వారు కేవలం ఒకే ఎంట్రీ ఎగ్జిట్ పెట్టుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. -
వారి రెసిడెన్స్ ప్రూఫ్ తప్పనిసరి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మే 7 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేస్తున్నామని పేర్కొన్నారు. అవసరం లేకుండా బయటకు వచ్చే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. లాక్డౌన్ ఉల్లంఘించిన వారి పాస్‌లను రద్దు చేస్తామన్నారు. ఇప్పటికే ఇచ్చిన పాస్‌లను వెనక్కి తీసుకుని కొత్త పాస్‌లిస్తామని తెలిపారు. (ఇకపై ఆంక్షలు మరింత కఠినం : అంజనీకుమార్) ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పాస్‌లు.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పాస్‌లు ఇస్తామని పేర్కొన్నారు. మూడు కి.మీ వెళ్లే ప్రతిఒక్కరూ రెసిడెన్స్ ఫ్రూఫ్ తీసుకురావాలన్నారు. దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు మాత్రమే వెళ్లాలని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాలని.. సోషల్ డిస్టెన్స్ పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం
-
ఆ కానిస్టేబుల్ త్వరగా కోలుకోవాలి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ విధులు నిర్వహిస్తుండగా తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ రామచంద్రయ్య త్వరగా కోలుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దుండిగల్ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న రామచంద్రయ్య లాక్డౌన్లో భాగంగా విధులు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి నిబంధనలు ఉల్లంఘిం చి వాహనాన్ని ఆపకుండా ముందు కు పోనిచ్చాడు. అతన్ని పట్టుకునేందుకు మరో వ్యక్తి వాహనంపై రామచంద్రయ్య వెంబడించారు. కొద్దిదూరం వెళ్లాక వారి వాహనం అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో గాయపడ్డ రామచంద్రయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తోటి సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. మేం అనుమతివ్వలేదు.. భువనగిరి పట్టణ సమీపంలో రోడ్డుపై ఓ సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు తనిఖీలు చేస్తుండటంపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. వారంతా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని పలువురు ట్విట్టర్లో ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో తామెవరికీ, ఎలాంటి తనిఖీలు చేసే అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. వెంకటేశ్, వరుణ్‌తేజ్‌లకు డీజీపీ కృతజ్ఞతలు లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేస్తూ మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని కాపాడుతున్న పోలీసులు రియల్ హీరోలం టూ సినీ నటులు విక్టరీ వెంకటేశ్, వరుణ్‌తేజ్ చేసిన ట్వీట్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. ‘మీ వ్యాఖ్యలు మాలో ఉత్సాహాన్ని నింపాయి. లాక్‌డౌన్‌కు సహకరించాలంటూ ప్రజలకు మీరు చేసిన విజ్ఞప్తికి ధన్యవాదాలు’అని ట్విట్టర్లో సమాధానం ఇచ్చారు. -
డీజీపీ మహేందర్‌రెడ్డికి అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు బాస్ డీజీపీ మహేందర్‌రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. దేశంలో తమ పనితీరుతో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 25 మంది ఐపీఎస్ అధికారుల జాబితాలో ఆయనకు చోటుదక్కింది. ‘ఫేమ్ ఇండియా, ఆసియా పోస్ట్, పీఎస్‌యూ వాచ్’ మీడియా సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేసి ఈ జాబితా రూపొందించాయి. ఇందులో 1984 బ్యాచ్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అర్వింద్ కుమార్ , రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) చీఫ్ సమత్‌కుమార్ గోయల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డీజీ ఎస్ఎస్ దేశ్వాల్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఆ తరువాత స్థానాల్లో వరుసగా సీఆర్పీఎఫ్ డీజీ మహేశ్వరి, ఎన్ఎస్జీ చీఫ్ అనూప్‌కుమార్‌సింగ్, ఢిల్లీ సీపీ ఎస్ఎన్ సిన్హా, బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే, తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి (8వ స్థానం) ఉన్నారు. 25 అంశాల ఆధారంగా.. మెరుగైన పనితీరుతో సమాజంలో మార్పునకు కృషిచేసిన ఐపీఎస్ అధికారుల గుర్తింపునకు ఈ సంస్థలు అధ్యయనం చేశాయి. ఇందుకోసం 1995కు ముందు బ్యాచ్‌ల్లోని 4వేల మంది ఆఫీసర్ల పనితీరును మదించి, వడపోశాయి. ఈ అధికారుల తొలి పోస్టింగ్ నుంచి ఇప్పటి వరకు వారి పనితీరు, విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాయి. ఇంకా, ఆయా అధికారులపై వివిధ ఏజెన్సీలు రూపొందించిన అంతర్గత నివేదికలు, మీడియా కథనాలు, ఇతర సమాచారం ఆధారంగా 25 అంశాలకు ప్రాధాన్యమిస్తూ టాప్–200 జాబితాను తయారు చేశాయి. దీనిని మళ్లీ మదిస్తూ.. నేరాల కట్టడిలో ఈ అధికారుల పాత్ర, నిజాయతీ, నిష్పక్షపాతంగా విధి నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, దార్శనికత, రెస్పాన్సిబిలిటీ వంటివి ఆధారంగా 25 మంది ఐపీఎస్ అధికారులతో తుది జాబితా రూపొందించాయి. ఈ జాబితాను పీఎస్‌యూ వాచ్ వెబ్సైట్ మంగళవారం ప్రచురించింది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 1986 బ్యాచ్‌కు చెందిన డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డికి 8వ స్థానం దక్కింది. ఉత్తమ పోలీసింగ్‌తో అందరికీ ఆదర్శంగా.. డీజీపీ మహేందర్‌రెడ్డి హయాంలో చేపట్టిన పోలీసింగ్, సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. షీటీమ్స్, విమెన్ సేఫ్టీవింగ్, వర్టికల్ విధానంలో మార్పులు, పాపిలాన్ తరహా సాఫ్ట్వేర్, పాస్‌పోర్టు ఎంక్వైరీలో వేగం, నక్సలిజం పీచమణచడం, సీసీ కెమెరాల ఏర్పాటు, ఫ్రెండ్లీ పోలీసింగ్, ఠాణాలకు ఐఎస్ఓ సర్టిఫికెట్ల సాధన, టెక్నాలజీ వినియోగం వంటి విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన తీసుకున్న శ్రద్ధతో కేసుల దర్యాప్తులో, నిందితులకు శిక్షలు వేయించడంలో తెలంగాణ పోలీస్ విభాగం దేశంలోనే తొలి స్థానంలో నిలుస్తోంది. దేశంలో కీలకమైన నిఘా, సైనిక సంస్థలకు నాయకత్వం వహించే సీనియర్ అధికారుల సరసన డీజీపీ మహేందర్‌రెడ్డి నిలవడం ఆయన చేపట్టిన సంస్కరణల ఫలితమేనని ఆయన కార్యాలయ సిబ్బంది అభివర్ణించారు. ఆయన సంస్కరణలకు పరిశ్రమ వంటివారని ప్రశంసించారు. ఇది తెలంగాణ పోలీస్‌కు దక్కిన గుర్తింపు దేశవ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ అధికారులపై జరిగిన సర్వేలో 25 మంది జాబితాలో నాకు చోటుదక్కడం సంతోషం. కానీ, ఇది నా ఒక్కడితోనే సాధ్యం కాలేదు. మొత్తం తెలంగాణ పోలీసు సిబ్బందికి ఈ గౌరవం దక్కుతుంది. డిపార్ట్మెంటులోని హోంగార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకు అందరి సంకల్పం, పట్టుదల ఈ గుర్తింపు రావడానికి దోహదపడ్డాయి. తెలంగాణ సమాజం కూడా పోలీసులకు ఎంతగానో సహకరిస్తోంది. అందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. – ఎం.మహేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ -
వైద్య సిబ్బందికి రక్షణ కల్పించండి
సాక్షి, హైదరాబాద్: కరోనాపై జరుగుతున్న యుద్ధంలో కీలకంగా ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. వారిపై దాడులు చేసినా, భయపెట్టినా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేశారు.ప్రతి జిల్లాలోనూ కరోనా పాజిటివ్, అనుమానితులకు చికిత్స అందిస్తోన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలతో ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయాలని డీజీపీ పేర్కొన్నారు. ఇందులో అడిషనల్ ఎస్పీ, డీఎస్సీలు, జిల్లా వైద్యాధికారి, కమిషనరేట్లలో డీసీపీలు గ్రూపుల్లో ఉండాలని స్పష్టం చేశారు. వైద్యాధికారులు ఇస్తోన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులు తెలుసుకోవాలని సూచించారు ‘ఈ వాట్సాప్ గ్రూపుల ఏర్పాటుతో గ్రామ స్థాయి నుంచి ప్రజల ఆరోగ్యంపై నిరంతర సమాచారం, కరోనా లక్షణాలు బయటపడ్డా.. వైద్యులతోపాటు, పోలీసులకు సమాచారం తెలియాలని, అప్పుడే సమన్వయం సాధ్యమవుతుందనేది డీజీపీ ఆలోచనగా ఓ ఎస్పీ ర్యాంకు అధికారి వ్యాఖ్యానించారు. -
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తమైంది. మున్ముందు ఎలాంటి క్లిష్ట, అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆ శాఖ సిబ్బందిని ఆదే శించారు. వ్యాధి వేగంగా విస్తరించే ప్రమాదమున్న నేపథ్యంలో సిబ్బంది ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించాలని సూచించారు. దేశవ్యా ప్తంగా తెలంగాణ పోలీసుల పనితీరుపై ప్రశంస లు వస్తున్నాయని చె ప్పారు. శనివారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వ్యాధి వ్యాప్తి ప్రమాదకర దశలో ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. స్టేషన్ వచ్చేవారికి చేతులు కడుక్కునేందుకు సబ్బు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసే సమయంలో హెల్మెట్ తదితరాలు భద్రత కోసం ధరించాలన్నారు. కరోనా అనుమానిత వ్యక్తులను తరలించే సమయంలో 108, వైద్య, రెవెన్యూ, మున్సిపాలిటీ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ అన్ని శాఖలతో ప్రతీ పోలీస్ ఠాణా పరిధిలో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, దాని ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలని సూచిం చారు. లాక్డౌన్ నిబంధ నలు ఉల్లఘించిన వా రిపై కఠినంగా వ్యవ హరించాలని చెప్పా రు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వె ళ్లాక విధిగా స్నానం చేయాలని, కమ్యూనికేషన్ డివైజ్‌లను నిరంతరం శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాం తంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న క్రమంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు సంక్షేమ నిధికి రూ.50 లక్షల విరాళం.. సువెన్ ఫార్మాసూటికల్స్ సీఈఓ వెంకట్ జాస్తి రూ.50 లక్షలు పోలీసు సంక్షేమ నిధికి విరాళమిచ్చారు. శనివారం ఆ చెక్కును డీజీపీ మహేందర్‌రెడ్డికి ఆయన కార్యాలయంలోనే అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో పోలీసు శాఖ నిరం తరం విధులను నిర్వహించడాన్ని ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో నిత్యావసరాలు, మం దులు, తదితరాల రవాణాలో పోలీసులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. -
సామాజిక మార్పు మా లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ‘నేటి విద్యార్థులే భావి పౌరులు.. ముఖ్యంగా డిగ్రీ, పీజీ పూర్తయ్యాక వారే సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తారు. విద్యార్థుల్లో స్త్రీ, శిశు, ట్రాఫిక్, సామాజిక భద్రత విషయాలపై చైతన్యం తేవడం ద్వారా భద్రమైన సమాజం నిర్మించాలన్నది మా లక్ష్యం’అని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన పబ్లిక్ సేఫ్టీ క్లబ్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సమాజంలో భద్రత, రక్షణ ప్రమాణాలను భావితరాలకు అలవాటు చేయాలన్న సంకల్పంతో స్కూళ్లు, డిగ్రీ, పీజీ కాలేజీల్లాంటి దాదాపు 2,500 విద్యా సంస్థల్లో మహిళా, చిన్నారి, రోడ్ సేఫ్టీ లాంటి అంశాలపై అవగాహన కల్పించే బృహత్తర కార్యక్రమానికి విమెన్ సేఫ్టీ వింగ్ శ్రీకారం చుట్టిందని ప్రశంసించారు. సామాజిక మార్పు తేవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్లబ్బుల ద్వారా ఏడాదిలోగా లక్ష మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. మహిళల భద్రతకు తామెంతో ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. అనంతరం పబ్లిక్ సేఫ్టీ క్లబ్‌లకు సంబంధించిన పలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లను డీజీపీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఐజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా పోలీసులు ప్రవర్తించకూడదని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. పటాన్చెరులో బుధవారం కానిస్టేబుల్ అనుచిత ప్రవర్తన నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్లు, ట్రైనింగ్ కళాశాలలు, పోలీస్ బె టాలియన్లు, ఎస్పీలు, ఇతర యూనిట్ అధికారులు, ఎస్హెచ్ఓ, కానిస్టేబుల్, హోంగార్డ్ అధికారులతో కలసి ఒకేసారి వేయి కార్యాలయాలతో అనుసంధానిస్తూ సాయంత్రం దాదాపు 3 గంటల పాటు డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ.. పటాన్చెరులో జరిగిన దురదృష్ట సంఘటనS వల్ల మొత్తం పోలీస్‌శాఖ అప్రతిష్ట పాలయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. నైతిక విలువలు, మానవత తదితర అంశాలపై పోలీస్ అధికారులు, సిబ్బందికి నిరంతరం పునశ్చరణ నిర్వహించాలని సూచించారు. కాగా, పోలీస్ కానిస్టేబుల్ నుంచి అడిషనల్ డీజీ స్థాయి వరకు అధికారులు తమ అభిప్రాయాలను సమావేశంలో వెల్లడించారు. ఈ అభిప్రాయాలపై చర్చించి తగిన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మహేందర్‌రెడ్డి -
నేరం చేయాలంటే భయపడాలి
మన్సూరాబాద్: నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం నేరస్తుల్లో కలిగినప్పుడు నేరాలు చేయడానికి జంకుతారని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ జీఎస్‌ఐటీఐలోని ఎంఎస్.కృష్ణన్ ఆడిటోరియంలో గురువారం కన్వెన్షన్స్ రివార్డ్ మేళాను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులకు రివార్డులు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ మాట్లాడుతూ.. పోలీస్, న్యాయ వ్యవస్థల పై సమాజం పెట్టుకున్న నమ్మకాన్ని సాధించిన వాళ్లమయ్యామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు, ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ, పోలీసు లు, ప్రాసిక్యూటర్స్ క్రిమినల్ జస్టిస్‌లో ఉన్న అన్ని విభాగాలు ప్రజలు ఆశించేలా చట్టప్రకారం నడు చుకోవాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పనిసరిగా దొరికిపోతామనే భయం.. దొరికాక శిక్ష పడుతుందనే నమ్మకాన్ని కలిగించడం మన బాధ్యతన్నారు. నేరం ఎవరు చేసినా నిజాన్ని బ యటకు తెచ్చి న్యాయంగా, ధర్మంగా నేరం చేసిన ప్రతిసారి శిక్ష పడుతుందనే భయం కల్పిస్తే.. సమాజంలో ఎవరైనా నేరం చేయడానికి భయపడతారని తెలిపారు. నేరస్తులను గుర్తించేందుకు, నేరాలను పరిశోధించేందుకు వీలుగా రాష్ట్రంలో 67 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని చె ప్పారు. నేరస్తుడిని అరెస్టు చేయడమే కాకుండ శిక్ష పడేలా చేస్తేనే ప్రజలకు పోలీసులపై గౌరవం పె రుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో విచారణ చేపట్టి నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించిన 226 మంది పోలీసు, న్యాయ అధికారులను శాలువాలు, రివార్డులతో సన్మానించా రు. కార్యక్రమంలో ప్రాసిక్యూషన్స్ రాష్ట్ర డైరెక్టర్ జి.వైజయంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తదితరులు పాల్గొన్నారు. ప్రాసిక్యూటర్‌ను సత్కరిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి. చి్ర‘తంలో మహేశ్ భగవత్ -
తెలంగాణ పోలీసులకు పతకాలు
-
విశిష్ట సేవలందించిన పోలీసులకు పతకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరు వచ్చిందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్రంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ నడుస్తోందన్నారు. తెలంగాణ స్టేట్ పోలీస్ ఆధ్వర్యంలో సర్వీస్ మెడల్స్ డెకరేషన్ పురస్కార కార్యక్రమం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ విధుల్లో విశిష్ట సేవలందించిన పోలీసులకు పతకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం పెరిగిందన్నారు. గత ఆరేళ్ల నుంచి తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండటంతో పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నారు. పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువ నిధులు కేటాయించారని తెలిపారు. పోలీసు అధికారులకు హోంమంత్రి అవార్డులు అందజేయడం శుభపరిణామంగా పేర్కొన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విధుల్లో ప్రావీణ్యం చూపించిన పోలీసు అధికారులకు మెడల్స్ అందించడం గర్వకారణమన్నారు. రాత్రనక, పగలనక, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా డ్యూటీ చేసిన పోలీసు అధికారులకు పతకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కష్టపడి రాష్ట్ర పోలీసు వ్యవస్థకు మంచి పేరు తెచ్చారని పోలీసులను ప్రశంసించారు. పోలీసుల సేవకు వారి కుటుంబాలు అందించే ప్రోత్సాహమే కీలకమన్నారు. 400 మందికి పైగా పోలీసు అధికారులకు ఒకేసారి అవార్డులు ఇవ్వడం రికార్డ్‌గా మిగిలిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గ్యాలంటరీ అవార్డులు, పీఎం సర్వీస్ మెడల్స్, ఉత్తమ సేవా పతకాలు, మహోన్నత సేవా పతకాలు, రాష్ట్ర శౌర్య పతకం, రాష్ట్ర సర్వోన్నత పోలీసు పతకంతో పాటు పలు మెడల్స్‌ను పోలీసులు అందుకున్నారు. మొత్తంగా 418 మంది పోలీసు అధికారులకు పతకాలు బహుకరించారు. -
బాల కార్మికుల బాగోగులు చూడాలి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: బాలలను రకక్షించడం వృత్తిపరంగా ఎంతో సంతృప్తినిస్తుందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే బాలకార్మికులను కాపాడటమే కాకుండా పదేళ్లపాటు వాళ్ల బాగోగులను చూసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం ఆయన డీజీపీ కార్యాలయంలో ‘ఆపరేషన్ స్మైల్’పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్, పోలీసు ఉన్నతాధికారులు జితేందర్, స్వాతి లక్ర, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, పలు శాఖల అధికారులు, అన్ని జిల్లాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అభం శుభం తెలియని చిన్నారులు విధి లేని పరిస్థితుల్లో బాలకార్మికులుగా మారుతున్నారన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది సామాజిక సేవగా అభివర్ణించారు. వృత్తిలో భాగంగా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఆపదలో ఉన్న బాలలను కాపాడంలో ఉండే ఆనందమే వేరన్నారు. బాల కార్మిక వ్యవస్థ, అక్రమ రవాణా చేసే వాళ్లను చట్టపరంగా కఠినంగా శిక్షించాలన్నారు. పిల్లలను అక్రమ రవాణా చేసేవాళ్లు జనవరి, జూన్ మాసాల్లో అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ రెండు నెలల్లో ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ఉంటుందని వారు ముందే జాగ్రత్తపడతారని తెలిపారు. పోలీస్ శాఖ మిగతా శాఖలతో సమన్వయం చేసుకొని అందరూ ఒకే లక్క్ష్యంతో ముందుకెళితే ఆశయం నెరవేరుతుందని వివరించారు. కేవలం రెండు నెలలు కాకుండా ఏడాది మొత్తం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా లేకుండా చేసేందుకు 2015 నుంచి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
తెలంగాణ జైళ్ల సంస్కరణలు దేశానికే స్ఫూర్తి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ జైళ్ల శాఖ పనిచేస్తోందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో గురువారం జరిగిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి డీజీపీ మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ప్రిసనర్స్ స్పోర్ట్స్‌మీట్‌ను డీజీపీ, జైళ్లశాఖ డీజీ రాజీవ్‌త్రివేది ప్రారంభించారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ జైళ్ల సంస్కరణలు దేశానికే స్ఫూర్తి అని ప్రశంసించారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను తీర్చిదిద్దడంలో రాజీవ్ త్రివేది పాత్ర మరువలేనిదన్నారు. రాజీవ్ త్రివేది ఆధ్వర్యంలో జైళ్లశాఖ మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. అలాగే తన సహచరుడు రాజీవ్ త్రివేది డీజీగా ఉండటం.. తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జీవితంలో గుర్తుండిపోయే విషయమన్నారు. రాజీవ్ త్రివేది మంచి క్రీడా వ్యక్తి అని.. క్రీడలు మంచి లక్షణాలను నేర్పిస్తాయన్నారు. క్రీడా స్ఫూర్తితో అందరూ సమిష్టిగా రాణించాలని జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది సూచించారు. తెలంగాణ జైళ్లశాఖను ఉన్నతమైన స్థానంలో తీర్చిద్దుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, వరంగల్, చర్లపల్లి, సెంట్రల్ హైదరాబాద్ రెంజ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అవగాహనతోనే వేధింపులకు చెక్
సాక్షి, హైదరాబాద్ : మహిళల భద్రత–రక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, అప్పుడే వేధింపుల నివారణ సాధ్యమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ‘దిశ’ఘటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం హోంమంత్రి కార్యాలయంలో పలువురు మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపారు. మహిళల భద్రతకు అనుసరించాల్సిన వ్యూహాలు, వారిపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం చర్చించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ– షీటీమ్స్ స్వాతి లక్రా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే.. మహిళలు అదృశ్యమైన కేసుల్లో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే కేసులు నమోదు చేయాలి. పోలీస్స్టేషన్ల పరిధులతో సంబంధం లేకుండా ముందు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలి. షీటీమ్స్ మరింత బలోపేతానికి హాక్ ఐ వినియోగాన్ని పెంచేలా ప్రోత్సహించాలి. హెల్ప్లైన్లు, పోలీసు యాప్స్ వినియోగం పెరిగే లా మహిళల్లో అవగాహన కల్పించాలి. డయల్ 100, 181, 1098, 112 హెల్ప్‌లైన్ నెంబర్లను విద్యాసంస్థల్లో ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వే, మెట్రో, పార్కులు, ఆటో, క్యాబ్‌ల్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ ప్రదర్శించాలి. బాలబాలికలు, ఉద్యోగులకు వేధింపులు లింగసమానత్వంపై అవగాహన తీసుకువచ్చేందుకు ఈ–లెర్నింగ్ కోర్సులు అందుబాటులోకి తేవాలి. సినిమాహాళ్లు, టీవీల్లో లఘుచిత్రాలు, స్లైడ్లు ప్రదర్శించాలి. షీటీమ్స్‌తో కలిసి విద్యాసంస్థల్లో అమ్మాయిలపై వేధింపులపై అవగాహన కల్పించే సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణ. గ్రామం నుంచి జిల్లా స్థాయివరకు అంగన్వాడీ, ఆశా, సెర్ఫ్ తదితర సంఘాలను మహిళా భద్రతపై ప్రచారానికి వినియోగించాలి. పిల్లలు నడుచుకుంటున్న విధానంపై తల్లిదండ్రులతో స్కూలు ఉపాధ్యాయులు చర్చించాలి. -
‘కేసీఆర్ స్పందించాలి.. మహేందర్‌రెడ్డి రాజీనామా చేయాలి’
సాక్షి, హైదరాబాద్: ప్రియాంకారెడ్డి కుటుంబానికి జరిగిన నష్టం దేవుడు కూడా పుడ్చలేనిదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షి టీమ్స్ ప్రియాంకారెడ్డి విషయంలో ఎక్కడికి వెళ్ళాయని ఆయన ప్రశ్నించారు. నిరంతరం నిఘా పెట్టల్సిన పోలీసులు ఈ విషయంలోసంపూర్ణంగా విఫలమయ్యారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను రాజకీయ నాయకులపై నిఘా పెట్టేందుకు ఉపయోగిస్తూ.. ప్రజాభద్రతను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. యావత్తు మహిళాలోకం ప్రియాంకారెడ్డికి న్యాయం చేయాలని గొంతెత్తిందని అన్నారు. ఎంతమంది స్పందించినా సీఎం కేసీఆర్ స్పందించడం లేదని, ఇంతకంటే దుర్మార్గం ఇంకేం లేదని ఆయన అన్నారు. గతంలో జరిగిన సంఘటనల్లో పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతునన్నాయన్నారు. పోలీసుల నిఘా వైఫల్యం, ప్రభుత్వం అసమర్థత వల్లే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డిని తక్షణమే విధులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. డీజీపీ ఇప్పటికీ సంఘటనా స్థలాన్ని పరిశీలించలేదని తప్పుబట్టారు. సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ ఘటన మీద తక్షణం స్పందించాలని అన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారికి వెన్నులో వణుకుపుట్టే చర్యలు ప్రభుతం చేపట్టాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ సూచనమేరకు బాధిత కుటుంబసభ్యులను కలిశానని, పార్లమెంటులో సోమవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని, బాధితుల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి హోదాలో రాలేదు.. : సంజీవ్ కుమార్ ప్రియాంక కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ పరామర్శించారు. ప్రియాంక దారుణ హత్యపై ఆయన సానుభూతి తెలియజేశారు. తాను ఇక్కడికి కేంద్ర మంత్రి హోదాలో.. తాను ఓ వెటర్నరీ డాక్టర్నేనని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు బాధకరమని.. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్తానని వెల్లడించారు. నిందితులకు కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధకరం : దత్తాత్రేయ తెలంగాణలో మహిళలపై వరుసగా జరుగుతున్న ఘటనలు బాధకరమని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో గోకుల్ ఇంటలెక్చువల్ ఫోరమ్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణాలో మహిళలపై జరుగుతున్న ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులకు త్వరగా శిక్ష పడాలన్నారు. -
‘నేరరహిత తెలంగాణే లక్ష్యం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను నేరరహిత రాష్ట్ర్రంగా మార్చడమే లక్ష్యమని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ను సోమవారం డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజల రక్షణ కోసం.. ఐటీపరంగా దేశంలోనే ప్రథమంగా ప్రారంభించామని తెలిపారు. నేరాల నియంత్రణకు రాష్ట్ర్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని డీజీపీ అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన షి టీమ్, భరోసా లాంటి కార్యక్రమాలు విజయవంతమైనట్లు వెల్లడించారు. రక్షణ పరంగా తెలంగాణ రాష్ట్ర్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంటిగ్రేటెడ్ ఆఫ్ పోలీస్ అండ్ పెట్రోలింగ్ ఉపయోగపడుతుందన్నారు. -
ప్రశాంతంగా నిమజ్జనం : డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 35 వేల మంది పోలీసులతో పకడ్బందీగా నిమజ్జనం నిర్వహించారు. పాతబస్తీ, బాలాపూర్, ఖైరతాబాద్ శోభాయాత్రలు ప్రశాంతంగా సాగడంలో సీనియర్ ఆఫీసర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 33 జిల్లాల్లో ప్రతి నిమజ్జనం పాయింట్‌ను లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. అంతకుముందు ఏరియల్ సర్వే ద్వారా మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీతో కలిసి డీజీపీ శోభాయాత్రను పర్యవేక్షించారు. ‘పోలీసు అధికారులు, సిబ్బంది ప్రణాళిక ప్రకారం వ్యవహరించారు. వారికి అప్పగించిన పనులను పకడ్బందీగా, వ్యూహాత్మకంగా పూర్తిచేశారు. ప్రతి ప్రాంతంలో గణేశ్ మండపాల నిర్వాహకులను భాగస్వాములను చేసి ఉత్సవాలను ప్రశాంతంగా పూర్తి చేయడంలో సఫలీకృతులయ్యారు’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. -
‘ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం’
సాక్షి, హైదరాబాద్ : ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం కొనసాగుతోందని, ముందస్తుగా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 5 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. 35వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సహకారంతో ఈ ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్‌లో ముందస్తు చర్యలు తీసుకున్నామని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుగుతోందని తెలిపారు. -
‘కమాండ్ కంట్రోల్’తో భద్రత భేష్
సాక్షి, హైదరాబాద్: నేర పరిశోధనకు అత్యంత కీలకంగా మారిన సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలో అందుబాటులోకి రాబోతుందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో చేపట్టిన అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌తో కలసి శుక్రవారం పర్యవేక్షించారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఎల్ అండ్ టీ సిబ్బందిని కోరారు. ప్రస్తుత కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా హైదరాబాద్‌లో వెయ్యి, సైబరాబాద్‌లో 500 కెమెరాల్ని మాత్రమే పర్యవేక్షించే సదుపాయముందని, అయితే కొత్త కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రెండు వేల కెమెరాల్ని ఏకకాలంలో వీక్షించవచ్చన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా బంజారాహిల్స్‌లో నిర్మితమవుతున్న జంట పోలీస్‌టవర్లలో ఏర్పాటు కాబోయే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాంతరంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటితోపాటు కమ్యూనిటీ పోలీసింగ్, ‘నేను సైతం’ప్రాజెక్టుల కింద కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న లక్షలాది కెమెరాల్నీ ఈ కేంద్రంలో పర్యవేక్షించే వీలు కలుగుతుందన్నారు. 3 కమిషనరేట్లలో ఎల్ అండ్ టీ సంస్థ 10,000 అధునాతన కెమెరాల్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. వేగంగా వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించే ఆటోమేటిక్ కెమెరాల్ని ఇక్కడ అందుబాటులోకి తెస్తున్నారు. కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న కెమెరాల్ని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్టులో భాగంగా మూడు కమిషనరేట్లలో కెమెరాల్ని అమర్చనున్నారు. ఈ కేంద్రంలో దాదాపు 10 లక్షల కెమెరాలకు సంబంధించిన దృశ్యాల్ని నెలపాటు నిక్షిప్తం చేసే భారీ సర్వర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమై సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించేందుకు వీలుగా ఆధునిక హంగులతో వార్‌రూంను ఏర్పాటు చేశారు. -
ఎన్ఆర్ఐ మహిళలు మరింత సేఫ్
సాక్షి, హైదరాబాద్ : విదేశాల్లో వైవాహిక సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు అన్ని రకాల సాయం అందించేందుకు విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్ విభాగం సిద్ధంగా ఉంటుందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం లక్డీకాపూల్‌లోని విమెన్ సేఫ్టీ వింగ్‌లో ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్‌ను ఆయన ప్రారంభించారు. ఎన్ఆర్ఐ మహిళలకు ఎదురయ్యే కుటుంబ వేధింపుల పరిష్కారానికి ఎన్జీవోలు కూడా కలిసిరావాలని పిలుపునిచ్చారు. బాధితులకు న్యాయపరంగా సలహాలు, కౌన్సెలింగ్‌తోపాటు చట్టపరంగా ఈ విభాగం అన్ని రకాల సాయం అందిస్తుందని చెప్పారు. నిందితులకు శిక్షపడేలా, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని వివరించారు. విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. ఈ విభాగం ఎన్ఆర్ఐ బాధిత మహిళల కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్యాప్తు అధికారులకు తగిన ఆదేశాలు, సూచనలు ఇస్తుందని తెలిపారు. ఎన్ఆర్ఐ వివాహాల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారం, భారతీయులుగా వారికి ఉన్న హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. దీనికోసం 14 దేశాల ఎంబసీలు, విదేశాంగ వ్యవహారాల శాఖతో అవగాహన కుదుర్చుకున్నామని వెల్లడించారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి మాట్లాడుతూ.. కేసుల నమోదులో డాక్యుమెంటేషన్ చాలా కీలకమైనదని, ఈ విషయంలో తమ ప్రాసిక్యూటర్లు న్యాయసలహాలు అందజేస్తారని తెలిపారు. విమెన్ ప్రొటెక్షన్ సెల్, ఎస్పీ (సీఐడీ) సుమతి మాట్లాడుతూ.. ఈ విభాగం న్యాయనిపుణులతో బాధితులకు పూర్తి న్యాయం చేసేలా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, నీలా ఎన్జీవో ప్రతినిధి మమతా రఘువీర్, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
చందానగర్ పీఎస్‌ను ఆదర్శంగా తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో ఒకే విధమైన సేవలను అందించేవిధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బాధితులు ఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చందానగర్ పోలీసులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని, ప్రజలను భాగస్వాములను చేస్తూ నేరాల అదుపునకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలలో భద్రతా భావాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో ఇక్కడి సిబ్బంది స్కిల్ డెవలప్మెంట్ను పెంపొందించుకొని సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ని అనుసరిస్తూ, కోర్టులలో ఉన్న పెండింగ్ కేసులను ఎప్పడికప్పుడు క్లియర్ చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లలో ఉన్న పనులను 16 విభాగాలుగా విభజించి, ఒక్కో విభాగానికి ఒక్కో అధికారిని నియమించి వారికీ బాధ్యతలు అప్పజెప్పి నూతన టెక్నాలజీ సహకారంతో నేరస్థులకు శిక్షలు పడేలా చేస్తున్నామన్నారు. ప్రజలే-పోలీసులు, పోలీసులే-ప్రజలు అనే భావన కలిగించిన చందానగర్ పోలీసుల పనితీరుకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు చందానగర్ పీఎస్‌ను ఆదర్శవంతంగా తీసుకొని పనిచేయాలన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభత్వం ఒకేసారి 18 వేల పోలీస్ సిబ్బంది నియామకాలు చేపట్టడం గొప్ప విషయమని డీజీపీ చెప్పారు. -
‘ప్రాణ’హితుడు
ఎంతో మందిని రక్షించిన శివ పోలీసు ఉన్నతాధికారుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. మురుగు నీటిలోని శవాలను వెలికి తీయడంతో పాటు ఎంతోమందిని కాపాడినందుకు మహేందర్‌రెడ్డి నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో శివను అవార్డుతో సత్కరించారు. రాంగోపాల్‌పేట్: అప్పుడు సమయం సాయంత్రం 3 గంటలు.. ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలు ఎప్పటిలాగే ఉన్నాయి. కొంత మంది ఫుట్‌పాత్‌పై నడుస్తూ హుస్సేన్ సాగర్ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఉన్నట్లుండి ఓ 45 ఏళ్ల వ్యక్తి సాగర్ నీళ్లలోకి దూకేశాడు. వెంటనే వాహనదారులు, పాదాచారులు అందరు గుమికూడారు.. అయ్యో ఎవరో దూకేశారు అంటున్నారే తప్ప రక్షించేందుకు ఎవరూ సాహసించడం లేదు. కొద్ది దూరంలో ఉన్న ఓ వ్యక్తి అది గమనించి నీళ్లలోకి నీళ్లలోకి దూకి మునిగిపోతున్న వాడిని ఒడ్డుకు లాక్కొచ్చాడు. కడుపులోని నీళ్లు కక్కించి శ్వాస అందించి ప్రాణాలు కాపాడాడు. మిట్ట మధ్యాహ్నం ఓ మహిళ ట్యాంక్‌బండ్‌పై ఏడ్చుకుంటూ రోడ్డు దాటి వచ్చి హుస్సేన్ సాగర్‌లోకి దూకేసింది. అప్పటికే ఆమె పరిస్థితిని గుర్తించి అనుసరిస్తున్న వ్యర్తి వెంటనే సాగర్‌లోకి దూకి మునిగిపోతున్న ఆమెను బయటకు తీశాడు. ఆమె ప్రాణాలతో భయట పడ్డది కానీ ఆ వ్యక్తి కుడి చేయి భుజం వద్ద ఓ ఇనుప చువ్వ గుచ్చుకుని తీవ్ర గాయమైంది. అయినా అతడిలో ఓ ప్రాణం కాపాడన్న ఆనందం ఉంది తప్ప గాయాన్ని మాత్రం పట్టిచుకోలేదు. ఇలా ఒకరు.. ఇద్దరూ కాదు ఏవేవో సమస్యలతో బాధలతో హుస్సేన్ సాగర్‌లో దూకి ప్రాణాలు తీసుకోవాలని దూకేసిన 107 మందిని అతను రక్షించాడు. అందుకు తన ప్రాణాలు ఫణంగా పెట్టిన అతడి పేరు ‘శివ’. ట్యాంక్బండ్నే అడ్డాగా మార్చుకుని అక్కడే కుటుంబంతో కలిసి ఉంటూ ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా, ఒకవైపు ప్రాణాలు కాపాడుతూ సాగర్‌లో పడిచనిపోయిన వారి మృతదేహాలను వెలికితీయడమే ఒక దైవ కార్యంగా చేపట్టాడా సాహసి. రైలు ప్రమాదాల్లో గాయపడి మరణించిన వారి మృతదేహాలు తరలింపుతో మొదలైన అతడి ప్రస్థానం హుస్సేన్ సాగర్‌లో మృతదేహల వెలికితీతతో పాటు ఎంతో మంది పునర్జన్మ నిచ్చిన వ్యక్తిగా నిలుస్తున్నాడు. సోదరుడి లాంటి వ్యక్తి మరణంతో.. శివ జీవితం మొత్తం ఫుట్‌పాత్ మీదే సాగింది.. సాగుతుంది కూడా. శివకు ఐదేళ్ల వయసులో ఫుట్‌పాత్‌పై తిరుగుతుండగా ఎవరో చాదర్‌ఘట్‌లోని సిధూర్ హాస్టల్లో చేర్చారు. తర్వాత అక్కడి నుంచి ఖైరతాబాద్‌లోని మరో హాస్టల్‌కు మకాం మారింది. లోయర్ ట్యాంక్‌బండ్‌లో నివసించే మల్లేశ్వరమ్మ అనే మహిళ శివను చేరదీసింది. అమె కొడుకు మహేందర్, శివ అన్నదమ్ముల్లా ఉండేవారు. శివ చిన్న వయసులోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాల్లో మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు సాయంగా వెళ్లేవాడు. తర్వాత హుస్సేన్ సాగర్‌లో మృతదేహాలను వెలికి తీసేవాడు. మహేందర్ మృతితో మార్పు తనకు అన్నలాంటి మహేందర్ 2013లో హస్మత్‌పేట్ చెరువులో మునిగి చనిపోయాడు. దాంతో తల్లిలా పెంచిన మల్లేశ్వరమ్మ బాధ చూడలేకపోయాడు శివ. అప్పటి నుంచి నీటిలో మునిపోతున్న వారిని రక్షించాలన్న సంకల్పంతో హుస్సేన్ సాగర్ పరిసరాలనే తన నివాసంగా మార్పుచుకున్నాడు. సాగర్ నీటిలో ఎక్కువ సేపు ఉండడం సాధ్యం కాదు. దాంతో మిత్రుడు పవన్‌తో కలిసి వైజాగ్ సముద్ర జలాల్లో ఈత సాధన చేసి గజ ఈతగాళ్లుగా మారారు. కానీ దురదృష్టవశాత్తు పవన్ ఇదే హుస్సేన్ సాగర్‌లో ప్రమాదవశాత్తు మరణించాడు. ఉపాధి చూపించిన సాగర్ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న శివకు హుస్సేన్ సాగరే ఉపాధి చూపించింది. గణపతి నిమజ్జనాల సందర్భంగా సాగర్‌లో దొరికే ఇనుప చువ్వలు వెలికితీసి వాటిని విక్రయించి ఉపాధి పొందుతుంటాడు. ఇక చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీస్తే పోలీసులు కొంత డబ్బు ఇస్తుంటారు. దాంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు శివ. ఇటీవల సినిమా షూటింగ్‌లకు నటులకు బౌన్సర్‌గా వెళుతూ ఇంకొంత సంపాదించుకుంటున్నానని చెబుతున్నాడు. తన ఏడుగురు సంతానంతో కలిసి ట్యాంక్‌బండ్‌పై ఫుట్‌పాత్, పాడుబడిన లేపాక్షి భవనం వద్ద నివాసం ఏర్పరచుకున్నాడు. శివ కుటుంబానికి లేక్ ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి ఆసరాగా నిలిచారు. ఆమె మేలు ఎప్పటికీ మరచిపోలేనంటున్నాడు శివ. గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌తో ధనలక్ష్మి మాట్లాడి శివ ముగ్గురు కుమారులను రెసిడెన్సియల్ పాఠశాలలో చేర్పించారు. -
నారాయణపురం ఠాణా.. ది బెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు పోలీసుస్టేషన్లకు అరుదైన గుర్తింపు లభించింది. 2018కి సంబంధించి పనితీరు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న వాటిలో 86 ఠాణాలను బెస్ట్ అంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) గుర్తించింది. వీటిలో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం 14వ స్థానంలో, నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీసుస్టేషన్ 24వ స్థానంలో నిలిచాయి. 2015లో ఎంహెచ్ఏ ఆధ్వర్యంలో జరిగిన వార్షిక డీజీపీల సదస్సులో చేసిన అనేక తీర్మానాల్లో ‘ఉత్తమ పోలీసుస్టేషన్ల’గుర్తింపు ఒకటి. మౌలిక వసతులు, పనితీరు, ప్రజల మన్నన తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని దేశంలోని ఉత్తమ ఠాణాలకు అవార్డులు ఇవ్వాలని ఆ సదస్సులో నిర్ణయించారు. దీంతో 2017 నుంచి బెస్ట్ ఠాణాల ఎంపిక మొదలైంది. ఆ ఏడాది హైదరాబాద్ కమిషనరేట్‌లో ఉన్న పంజగుట్ట రెండోస్థానంలో నిలిచింది. సమగ్ర అధ్యయనం తర్వాత ఎంపిక... దేశ వ్యాప్తంగా ఉత్తమ పోలీసుస్టేషన్లను ఎంపిక చేయాల్సిన బాధ్యతల్ని ఎంహెచ్ఏ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాకు అప్పగిస్తుంది. కేంద్రం అధీనంలోని ఈ విభాగం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తుంది. 750 కంటే ఎక్కువ ఠాణాలు కలిగిన రాష్ట్రాల నుంచి మూడు, మిగిలిన రాష్ట్రాల నుంచి రెండు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఒకటి చొప్పున ఎంట్రీలను స్వీకరిస్తుంది. తెలంగాణ నుంచి వెళ్లిన ఎంట్రీల్లో నారాయణపురం, చింతపల్లి పోలీసుస్టేషన్లు ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్‌కు చెందిన ఓ ప్రత్యేక బృందం ఈ ప్రాంతాలకు చేరుకుని దాదాపు 2 నెలల పాటు రహస్యంగా వాటి పనితీరు, మౌలిక సదుపాయాలు, నేరాల నిరోధం, కేసుల్ని కొలిక్కి తీసుకురావడం తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఒక్కో పోలీసుస్టేషన్ పరిధి నుంచి 100 మందిని ఎంపిక చేసుకుని వారి అభిప్రాయాలు తీసుకుంది. వీరిలో ఠాణాకు వచ్చిన బాధితులు, దాని చుట్టుపక్కల నివసించే వారు, పోలీసుస్టేషన్ పరిధిలోని విద్య, వ్యాపార సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థల నుంచి వివరాలు సేకరించింది. అత్యంత క్లిష్టమైన ఎంపిక విధానం... క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఎంపిక విధానం అత్యంత క్లిష్టంగా ఉంటుంది. తొలుత అభిప్రాయాలు సేకరించినప్పుడు కనీసం 80 శాతం మంది పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయాలి. కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, నేరగాళ్లకు శిక్షలు పడుతున్న శాతం, రికవరీలతో పాటు ఠాణా పరిశుభ్రత, పచ్చదనం, అక్కడి పోలీసుల ప్రవర్తన, విధి నిర్వహణ తీరును పరిగణలోకి తీసుకుంటారు. ఈ బృందం పరిశీలించే అంశాల్లో టాయిలెట్స్‌లోని ఫ్లష్‌లు సరిగ్గా పని చేస్తున్నాయా? వంటి చిన్న చిన్నవీ ఉంటాయి. ఇలా చేపట్టిన సమగ్ర అధ్యయనం తర్వాత దేశంలో ఉత్తమంగా నిలిచిన పోలీసుస్టేషన్ల జాబితాను ఎంహెచ్ఏకు అందిస్తుంది. డ్యూటీ మీట్లో అందించే అవకాశం... ఈ పోలీసుస్టేషన్ల జాబితాను వివిధ కోణాల్లో పరిశీలించే ఎంహెచ్ఏ అధికారులు వాటినీ మదిస్తారు. ఈ జాబితాను ఓ నిపుణుల కమిటీకి అందిస్తారు. వీరు చేసే మదింపు తర్వాత తుది ఉత్తమ పోలీసుస్టేషన్ల జాబితా విడుదల అవుతుంది. ఈసారి మొత్తం 86 ఠాణాలు బెస్ట్‌గా గుర్తించగా, వీటిలో రెండు తెలంగాణకు చెందినవి ఉన్నాయి. ఈ మేరకు ఎంహెచ్ఏ నుంచి రాష్ట్ర పోలీసు విభాగానికి వర్తమానం అందింది. ఈ ఠాణాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రోల్‌మోడల్‌గా ప్రకటిస్తారు. 2017కు సంబంధించి పంజగుట్ట పోలీసుస్టేషన్ రెండో స్థానం సంపాదించింది. గత ఏడాది గ్వాలియర్‌లో జరిగిన వార్షిక డీజీపీల సదస్సులో అవార్డును అందించారు. ఈసారి అదే సంప్రదాయం కొనసాగుతుందా లేక జాతీయ స్థాయిలో జరిగే ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్లో ఈ అవార్డుల్ని అందిస్తారా అనేది స్పష్టం కావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. ఇదో అరుదైన గుర్తింపు... రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని సం స్థాన్ నారాయణపురం ఠాణా జాతీయ స్థాయిలో ఉత్తమ ఠాణాగా ఎంపిక కావడం అరుదైన గుర్తింపు గా భావిస్తున్నాం. కమిషనరేట్‌కే తలమానికమైన రాచకొండ గ్రామం ఇదే పోలీసుస్టేషన్ పరిధిలో ఉండటం గమనార్హం. ఈ గ్రామాభివృద్ధికి పోలీసు విభాగం అనేక రకాలైన సహాయసహకారాలు అందించింది. ఈ పోలీసుస్టేషన్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు సీసీటీఎన్ఎస్ వ్యవస్థ అమలు కూడా పక్కాగా సాగుతోం ది. ఈ గుర్తింపు సాధించడంలో సహకరించిన డీజీపీ మహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు. ఈ ఠాణా ఇన్స్పెక్టర్తో పాటు ఏసీపీ, డీసీపీని అభినందిస్తున్నా. – మహేష్ మురళీధర్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్ -
లిస్బన్ క్లబ్ ఘటన.. డీజీపీ ఆరా
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని లిస్బన్ క్లబ్ ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి ఆరా తీశారు. క్లబ్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న హరిణి అనే యువతిని అసాంఘిక కార్యకలాపాలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం, దానికి ఆ యువతి ఒప్పుకోకపోవడంతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలు 100కు ఫోన్ చేసిన తరువాత అక్కడికి వచ్చిన పోలీసులు తనను కాపాడకపోగా, దాడి చేసినవారికి వత్తాసు పలికారని ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా డీజీపీ ఆదేశించారు. పంజాగుట్ట సీఐతో మాట్లాడిన డీజీపీ.. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. కేసుకు సంబంధించిన నివేదిక త్వరగా అందించాలని ఆదేశించారు. బాధితురాలు చేసిన ఆరోపణలు నిజమైతే సదరు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న ఇదివరకే తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురు మహిళలను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు సయీద్ తప్పించుకున్నాడని, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. చదవండి : బట్టలూడదీసి పబ్ డ్యాన్సర్‌ను కొట్టారు..! -
కాల్మొక్తా.. పాసుపుస్తకం ఇప్పించండి
దుగ్గొండి: రైతుకు ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకం అందిస్తామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో రైతులకు న్యాయం జరగడం లేదు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి తనిఖీ నిమిత్తం వచ్చిన వరంగల్ రూరల్ జిల్లా జాయింట్ కలెక్టర్ రావుల మహేందర్‌రెడ్డి కాళ్లపై పడి మైసంపల్లి గ్రామానికి చెందిన రైతు గంగారపు మొగిళి తన పాసుపుస్తకం సమస్యను మొరపెట్టుకున్నాడు. వెంటనే తనకు పట్టా పుస్తకం ఇప్పించి కేసీఆర్ సారు ఇచ్చే పైసలు వచ్చేటట్టు చేయాలని వేడుకున్నాడు. ఇలా పది గ్రామాలకు చెందిన రైతులు తమ సమస్యను జేసీకి వివరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ సమస్యలు ఉన్న భూములకు తప్ప మిగతా రైతుల భూములన్నీంటికి పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తామని చెబుతూ భూములను సర్వే చేయాలని అక్కడికక్కడే సర్వేయర్‌ను ఆదేశించారు. అలాగే, అక్రమాలకు పాల్పడే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రైతులు శాంతించారు. -
మహేందర్‌రెడ్డి, సబితారెడ్డిలను కలిసిన ఎమ్మెల్యే
చేవెళ్ల: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కుటుంబ సభ్యులతో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ హోంశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డిలను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే భార్య జయమ్మ నవాబుపేట జెడ్పీటీసీగా, కోడలు భవాని నవాబుపేట ఎంపీపీగా, కొడుకు శ్రీకాంత్ మొయినాబాద్ జెడ్పీటీసీగా గెలుపొందడంతో వారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఎంపీ రంజిత్‌రెడ్డిని కలిసిన చేవెళ్ల జెడ్పీటీసీ.. నూతనంగా టీఆర్ఎస్ జెడ్పీటీసీగా గెలిచిన మర్పల్లి మాలతీ క్రిష్ణారెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిని కలిశారు. సోమవారం నగరంలోని ఆయన నివాసానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీకి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఎంపీ జెడ్పీటీసీని శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు క్రిష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
లాటరీ ఎమ్మెల్యే.. నాపై విమర్శలా?
బషీరాబాద్: ‘మొన్న తాండూరులో జరిగిన ఎన్నికల్లో లక్కీలాటరీలా.. ఎమ్మెల్యేగా గెలిచినోడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నడు.. నేను లోకల్ కాదని, నన్ను షాబాద్ పంపిస్తానని.. భాష రాదని.. ఎగతాలిచేస్తుండు.. నేను తలుచుకుంటే తాండూరులో బట్టలు ఊడదీసి పంపిస్తా..రాజకీయాల్లో హుందాగా విమర్శించడం నేర్చుకో.. మాజీ మంత్రి మాణిక్‌రావు కూడా ఇలా నాపై విమర్శలు చేయలేదు. నీలా దిగజారి మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు..’’ అంటూ మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బషీరాబాద్ వచ్చిన ఆయన మైల్వార్‌లో నిర్వహించిన సమావేశంలో మొదటిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పిన రోహిత్‌రెడ్డి వారిని మోసం చేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యే పచ్చి అబద్ధాలకోరు.. మూర్ఖత్వంతో అలా మాట్లాడుతున్నాడని విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో సద్విమర్శలు చేస్తే మంచిది.. లేదంటే పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో 18 జెడ్పీటీసీ సీట్లు గెలిచి సునీతారెడ్డి మూడో సారి జెడ్పీ చైర్‌పర్సన్‌గా కాబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే దిక్సూచిలా మారాయన్నారు. ఎన్నికలు ముగిసన వెంటనే.. ఇచ్చిన మాట ప్రకారం రెండింతల పెన్షన్లు, ఎకరాకు రూ.5 వేల రైతుబంధు సాయం అందజేస్తామని స్పష్టంచేశారు.టీఆర్ఎస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పోరవాటి మాట్లు మాట్లాడుతున్నాడన్నారు. కనీసం పెద్దవాళ్లనే సంస్కారం కూడా లేకుండా ఇష్టానుసారం విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం ఎక్మాయి, మంతన్‌గౌడ్‌తండా, క్యాద్గిర, జీవన్గీ, మర్పల్లి, నవల్గా గ్రామాల్లో మహేందర్‌రెడ్డి రోడ్‌షోలు నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, జెడ్పీటీసీ అభ్యర్థి మిరాణం శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాకేశ్, సీనియర్ నాయకుడు రాజుగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, మాజీ ఎంపీపీ కావలి భాస్కర్, అజయ్‌ప్రసాద్, శంకర్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, అబ్దుల్ ఖాలీద్, సుధాకర్‌రెడ్డి, బన్సీలాల్, నర్సిరెడ్డి, హరిసూధన్‌రెడ్డి, శ్రావన్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్, ఎక్మాయి రాజుగౌడ్, సర్పంచులు సీమా సుల్తాన, నారాయణ, వసంతమ్మ, లక్ష్మమ్మ, కోటం నవనీత, డి. నర్సిములు, ఎంపీటీసీ అభ్యర్థులు షాజాదీబేగం, వినోద, శ్రీనివాస్, పుర్మ సునీత తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ సమైక్యతకు నిదర్శనం: డీజీపీ
కాజీపేట అర్బన్: వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో విద్యనభ్యసించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం లభిస్తుందని.. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. కాజీపేటలోని నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వార్షికోత్సవాల ను మంగళవారం అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీజీపీ మాట్లాడుతూ.. వివిధ దేశాల విద్యార్థులు చదువు కోసం ఇక్కడకు వస్తుండటంతో జాతీయ సమైక్యతకు నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు. తాను నాటి ఆర్ఈసీ.. నేటి నిట్‌లో 1990లో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో చేరానని డీజీపీ గుర్తు చేసుకున్నారు. ఆనాటి ప్రిన్సిపాల్ కోటేశ్వర్రావు ప్రోత్సాహంతో పాటు అధ్యాపకులు మానవీయ విలువలతో కూడిన విద్యనందిం చడం ద్వారానే తాను ఈ స్థాయికి ఎదిగానన్నా రు. అప్పట్లో తనకు తెలుగు మాత్రమే వచ్చని పేర్కొన్నారు. ఆర్ఈసీ తనకు ఎంతో నేర్పించి సమాజానికి సేవ చేసే ఉద్యోగమైన డీజీపీ స్థాయికి చేరడానికి దోహదపడిందని తెలిపారు. ప్రపంచంలోనే నిట్ వరంగల్ ప్రత్యేకం ప్రపంచంలోనే నిట్ వరంగల్‌కు ప్రత్యేక గుర్తిం పు ఉందని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు నాంది పలుకుతున్న నిట్‌లో ఏటా ఉత్తమ ప్రతి భ కనబరుస్తున్న విద్యార్ధులకు గోల్డ్ మెడల్స్, క్యాష్ ప్రైజ్ అందించి ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. అనంతరం 27 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 78 మంది విద్యార్ధులకు క్యాష్ ప్రైజ్, ప్రశంసా పత్రాలను డీజీపీ చేతుల మీదుగా అందజేశారు. అలాగే, డీజీపీ మహేం దర్‌రెడ్డిని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు ఘనంగా సన్మానించారు. -
ఏ ఇబ్బంది వచ్చినా 100కు ఫోన్ చేయండి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీసు శాఖను గౌరవ స్థానంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. మహిళ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో కలిసి లక్డీకాపూల్‌లో ఉమెన్ సేఫ్టీ వింగ్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు పలువురు మహిళ ఐపీఎస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. మహిళ భద్రతకి షీ టీమ్స్, క్యాబ్స్, పోలీసు స్టేషన్లు, భరోసా సెంటర్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మహిళల భద్రతపై ఎంత అప్రమత్తంగా ఉన్న ఇంకా దాడులు జరుగుతున్నాయని ఎంపీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలకు ఏ కష్టం వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నేరం జరిగినప్పుడు నిందితులకు తగిన శిక్షపడే విధంగా ఉమెన్స్ వింగ్ ఏర్పాటు చేశామని ప్రకటించారు. విద్యార్థినులు మొబైల్స్‌లో హాక్ ఐ ఆప్లికేషన్ ఉంచుకోవాలని.. పోలీసులతో కలిసి ముందుకు నడవాలని కోరారు. ప్రతి జిల్లాలో కూడా మహిళల కోసం భరోసా సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు. మహిళలకు ఏ కష్టం వచ్చినా 100కి ఫోన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె.. మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత పోలీస్ శాఖకి పెద్ద పీట వేసినట్టు గుర్తుచేశారు. శాంతి భద్రతలను కాపాడటం కష్టం అవుతుందని అప్పటి సీఎం అన్నారని.. కానీ తెలంగాణ ఇప్పుడు శాంతి భద్రతలలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు పోలీసులంటే భయం పోయిందని తెలిపారు. మహిళ భద్రతకు అధిక ప్రాధన్యత ఇస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమెన్స్ వింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా హైదరాబాద్‌లో ఉమెన్స్ సెఫ్టీ వింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ కావాలని ప్రభుత్వం షీ టీమ్స్ ఏర్పాటు చేసిందన్నారు. షీ టీమ్స్ సారథి ఉన్న స్వాతి లక్రాను ఆయన అభినందించారు. తెలంగాణలో తొమ్మిది కమిషనరేట్లు ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు పెద్ద పీట వేశామన్నారు. -
మీడియా ముందుకు మావోయిస్టు అగ్రనేత సుధాకర్
-
ఇంకా ‘ఫిట్’ కాలేదు!
సాక్షి, హైదరాబాద్: వాహనాల ఫిట్నెస్ తనిఖీ కోసం చౌటుప్పల్ సమీపంలోని మల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన ఫిట్నెస్ సెంటర్ ప్రారంభోత్సవానికి నోచుకోవట్లేదు. యంత్రాలతో వాహనాల ఫిట్నెస్ను తనిఖీ చేసి 10 నిమిషాల్లో సర్టిఫికెట్ జారీ చేసే సామర్థ్యం ఈ కేంద్రం ప్రత్యేకత. 95 శాతం పూర్తయిన ఈ కేంద్రాన్ని 2018 మే నెలాఖరుకు ప్రారంభించాలి. కానీ పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వస్తోంది. పనులు పూర్తయి ఏడాది కావొస్తున్నా దీన్ని ప్రారంభించట్లేదు. ఈ సెంటర్ ప్రారంభోత్సవాన్ని పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. జాప్యానికి కారణాలేంటి? ఈ కేంద్రానికి కేటాయించిన ప్రాంతంలోని 10 గుంటల స్థలం వివాదంలో చిక్కుకుంది. ఈ స్థలం తనదంటూ ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. దీంతో దీని ప్రారంభోత్సవంలో జాప్యం నెలకొంటోంది. ఇప్పటిదాకా దాదాపు 70 శాతం మేరకు కొనుగోలు చేసిన యంత్రాలు వృథాగా ఉన్నాయి. వీలైనంత త్వరగా దీన్ని ప్రారంభించాలని, లేకపోతే కోట్లు వెచ్చించి తెప్పించిన యంత్రాలు పనికిరాకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపథ్యం ఇదీ..! రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనానికి ఫిట్నెస్ ఎంతో కీలకం. ఈ విషయంలో రాష్ట్ర రవాణా అధికారులు వాహనాల ఫిట్నెస్ జారీకి ఇంకా మాన్యువల్ విధానాన్నే పాటిస్తున్నారు. దీనివల్ల అనేక అవకతవకలకు ఆస్కారం ఉంది. మామూళ్ల కోసం పలువురు ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ లేని వాహనాలకు పర్మిట్లు ఇస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రానికి అనుమతి, నిధులు సమకూర్చింది. 2014లో ఈ సెంటర్ నిర్మాణానికి కేంద్రం వాటా మేరకు రూ.14.4 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2015 జూన్‌లో చౌటుప్పల్ సమీపంలోని మల్లాపూర్‌లో దాదాపు 10 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ పనులకు అప్పటి రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రోజుకు 250 నుంచి 300 వాహనాలను తనిఖీ చేసి సర్టిఫికెట్లు జారీ చేసే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. రద్దీని బట్టి దీని కెపాసిటీని పెంచుకునే అవకాశం కూడా ఉంది. పూర్తి అత్యాధునిక ఆటోమేటెడ్ యంత్రాలతో వాహనాలకు ఈ కేంద్రంలో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇది దేశంలోనే రెండో కేంద్రం కావడం విశేషం. ఈ సెంటర్లో అవసరమైన వాటిలో ఇప్పటివరకు 70 శాతం యంత్రాలు వచ్చాయి. ఏమేం పరీక్షలు చేస్తారు? ఇక్కడి యంత్రాలన్నీ కంప్యూటర్‌కు అనుసంధానం చేసి ఉంటాయి. సర్టిఫికెట్ల జారీ కూడా కంప్యూటర్ల ద్వారానే జరుగుతుంది. వాహనాల బ్రేకులు, పీయూసీ, ఇంజిన్ కండీషన్, గేర్‌బాక్స్, హెడ్లైట్లను పరీక్షించేందుకు ఇక్కడ అత్యాధునిక యంత్రాలు అమర్చారు. నిర్ణీత ప్రమాణాల మేరకు వాహనాల పరికరాల్లోని లోపాలను ఇవి క్షణాల్లో గుర్తిస్తాయి. -
సాంస్కృతిక సమ్మేళనం.. ప్రగతికి కీలకం
సాక్షి, హైదరాబాద్: అద్భుతమైన సాంస్కృతిక సమ్మేళనం తెలంగాణ ప్రగతికి కీలకమని, అభ్యుదయ రాష్ట్రంలో సాహితీ వేడుకలు ఓ భాగంగా మారాయని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. వివిధ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి తరలివచ్చిన సాహితీవేత్తలు, రచయితలు. మేధావులు హైదరాబాద్ వేదికగా అనేక అంశాలపైన మాట్లాడుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చర్చలు రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయన్నారు. హైదరాబాద్ సాహిత్యుత్సవం తొమ్మిదో ఎడిషన్ వేడుకలు శుక్రవారం బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్స్కూల్లో కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. వందలాది మంది సాహితీప్రియులు, కవులు, రచయితలు, చిత్రకారులు, వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో ఇలాంటి వేడుకలు ఒక భాగమన్నారు. మరోవైపు శాంతిభద్రతలను కాపాడటంలో రాష్ట్ర పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారని చెప్పారు. ఐదు లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఎక్కడ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా క్షణాల్లో పోలీసులు అక్కడికి చేరుకొనేవిధంగా భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేశామని చెప్పారు. పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, వివిధ భాషల సాహిత్యంపైన ఇలాంటి సదస్సులు నిర్వహించడం సంతోషకరమన్నారు. తాను నేర్చుకుంటున్న చైనీష్లోనూ, గుజరాతీ భాషలో కొద్దిసేపు మాట్లాడి ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. హెచ్ఎల్ఎఫ్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్, అజయ్‌గాంధీ, కిన్నెరమూర్తి, తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం వివిధ అంశాలపైన సదస్సులు జరిగాయి. భారత్, చైనా బంధం బలోపేతమవ్వాలి భారత్, చైనా మధ్య సాంస్కృతిక, సాహిత్య సంబంధాలు కొనసాగాలని చైనా రచయిత ఎ.లాయ్ అన్నారు. ‘సమకాలీన చైనీస్ సాహిత్య ధోరణులు’ అంశంపై జరిగిన ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేవలం హిమాలయ పర్వతాలు మాత్రమే విడదీసే రెండు గొప్ప పొరుగు దేశాల మధ్య ఉండాల్సినంత సాహిత్య బంధం లేదనీ, రామాయణం, కొన్ని టాగూర్ పద్యాలు, భారతీయ నవలలు, పాత సినిమాల జ్ఞానంతో తాను ఇక్కడికి వచ్చాననీ తెలిపారు. సంస్కృతం నుంచి అనువాదమైన ఎన్నో బౌద్ధ రచనలు చదివిన జ్ఞానం భారతీయ స్నేహితులతో సంభాషించడానికి సరిపోతుందని చమత్కరించారు. చైనా ప్రభుత్వం రచయితలను నియంత్రించడం లేదనీ, స్వేచ్ఛగా రాయగలుగుతున్నామనీ చెప్పారు. నాజూకుదనం గురించి జరుగుతున్న విపరీత ప్రచారం, చైనా స్త్రీల జీవితంలో తెస్తున్న మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు నవలా రచయిత్రి జి షుయిపింగ్ చైనా రచయితలు గ్వాన్ రెన్షామ్, రంగ్ రంగ్, బెయ్ తా పాల్గొన్నారు. గుజరాతీ సాహిత్యంపై గాంధీ ముద్ర గుజరాతీ సాహిత్యం మహాత్మా గాంధీజీపైన ఎంతో ప్రభావం చూపిందని, అలానే ఆయన ప్రభావంతో అది మరింత సుసంపన్నమైందని ప్రముఖ గుజరాతీ రచయిత సితాన్షుయశస్చంద్ర అన్నారు. ‘గాంధీకి ముందు, గాంధీతోపాటు, గాంధీ తరువాత గుజరాతీ సాహిత్యం’అన్న అంశంపైన ఆయన మాట్లాడారు. గుజరాతీ సాహిత్యంలో నర్సిమెహతాను ప్రాచీన కవిగా పరిగణిస్తారని, అప్పటి సమాజాన్ని ఉన్నదున్నట్లుగా మాత్రమే ఆయన తన సాహిత్యంలో ప్రస్తావించారని చెప్పారు. భారతీయ సాహిత్యాన్ని దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో పరిచయం చేసిన ఘనత గాంధీకే దక్కుతుందన్నారు. అనంతరం ‘గాంధీ సమకాలీనత’అనే అంశంపై జరిగిన మరో చర్చలో డాక్టర్ శంభూప్రసాద్, సుధీర్‌చంద్ర తదితరులు మాట్లాడారు. జాతీయోద్యమ నిర్మాణంలో, గ్రామస్వరాజ్యంలో ఆయన ప్రతిపాదించిన వ్యూహాలు, ఎత్తుగడలు ఎప్పటికైనా ఆచరణయోగ్యమైనవేనన్నారు. నోట్ల రద్దు ఒక న్యూక్లియర్ బాంబ్ అవినీతి నిర్మూలన, నల్లధనం వెలికితీత లక్ష్యంగా రాత్రికి రాత్రి ఒక న్యూక్లియర్ బాం బులా పేల్చిన పెద్ద నోట్ల రద్దు ఆ లక్ష్యాన్ని ఏ మాత్రం నెరవేర్చలేదని ప్రజలు అనేక రకాల బాధలను, ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వచ్చిందని ప్రముఖ ఆర్థికవేత్త రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఇది పూర్తిగా తప్పుడు చర్య అని పేర్కొన్నారు. ఆర్బీఐ సైతం నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్పిందన్నారు. నగదు వల్ల అవినీతి ఉండదని, కేవలం హవాలా వల్లనే అవినీతి జరుగుతుందన్నారు. విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీల ఉదంతాలే అం దుకు నిదర్శనమన్నారు. మరోవైపు ‘మీ టూ’ పైన జరిగిన చర్చలో చిన్మయి, సంధ్యామీనన్, సుతాపపాల్లు మాట్లాడారు. వైరి ముత్తు వేధింపుల అంశాన్ని బయటపెట్టిన తరువాత తనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దాడి జరిగిందని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. మగవారిపై వచ్చే ఫిర్యాదులను సమాజం వెం టనే మరిచిపోతుందని, చాలా విషయాల్లో మహిళలనే ఎత్తుచూపడం వ్యవస్థీకృతమైన లోపమని సంధ్యామీనన్ అన్నారు. వేడుకలలో ఏర్పాటు చేసిన చైనా, గుజరాతీ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మిషన్ కాకతీయ లక్ష్యం నెరవేరలేదు మిషన్ కాకతీయ చేపట్టినప్పుడు తెలంగాణ నీరున్న రాష్ట్రంగా మారుతుందని ఆశించానని, కానీ ఈ పథకం కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లడం వల్ల అవినీతిమయమైందని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ రాజేంద్రసింగ్ అన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మిషన్ కాంట్రాక్టర్ల చేతికి వెళ్లకముందు దేశంలోకెల్లా అద్భుతమైన ప్రాజెక్టుగా భావించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికయినా కాంట్రాక్టర్లను పక్కన పెట్టి కమ్యూనిటీకి ఆ పనులు అప్పగిస్తే పథకం లక్ష్యం నెరవేరుతుందన్నారు. -
‘పంచాయతీ’ పోరులో రూ.కోటి నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతలుగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు రూ.కోటి 78 లక్షల మేర నగదు, రూ.36 లక్షలకు పైగా విలువైన మద్యం, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బుధవారం ఒక్కరోజే వనపర్తి జిల్లాలో రూ.20 లక్షల నగదుతో పాటు, వివిధ జిల్లాల్లో మొత్తం రూ.3.85 లక్షల విలువైన మద్యాన్ని (1500 లీటర్లకు పైగా మద్యం) పట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఇప్పటిదాక అధికారులు, పోలీసులు జరిపిన తనిఖీల్లో ఈ మేరకు నగదుతో పాటు వివిధ వస్తువులు దొరికినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు డీజీపీ మహేందర్‌రెడ్డి నివేదికలు పంపించారు. ఈ నివేదికల ప్రకారం ఇప్పటివరకు 289 ఫిర్యాదులు నమోదుచేసి, వాటిలో 288 ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. 139 కేసుల్లో చర్యలు తీసుకున్నట్లుగా వెల్లడైంది. రాజకీయపార్టీలు, అభ్యర్థుల మధ్య సంబంధాలపై ఆరా తీయగా మొత్తం 40 వరకు బయటపడ్డాయని, వాటిలో జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 14, మెదక్ జిల్లాలో 4, నిర్మల్, భద్రాద్రి, నల్లగొండ, సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో ఉదంతం బయటపడినట్లు ఈ నివేదికను బట్టి తెలుస్తోంది. -
సీఎంతో సహా అందరి నుంచి వసూలు చేసున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న 90 రోజుల పాటు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు వినియోగించిన 33 మంది ప్రజాప్రతినిధుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలైన కిషన్‌రెడ్డి, అక్బరుద్దీన్ ఒవైసీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అప్పటి సీఎల్పీ నేత జానారెడ్డి సహా అందరి నుంచి ఇం టెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) విభాగం నోటీసుల ద్వారా చార్జీలు చెల్లించాలని ఆయా పార్టీల కార్యాలయాలకు లేఖలు రాసిం దని తెలిపారు. ఈ మేరకు సంబంధిత వాహనాలకు చార్జీలతో పాటు, డ్రైవర్ బత్తా వసూలుచేయాలని ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలున్న ట్లు డీజీపీ తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడిన వారిలో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి రూ.7.7 లక్షలు, తక్కువగా ఉపయోగించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు రూ.53 వేలు చెల్లించాల్సి ఉంది. -
‘కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో ప్రభుత్వానికి సంబంధం లేదు’
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో నిఘూ చాలా అవసరమని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. తెలంగాణలో ఎన్నికల నిఘాపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగతంగా ఢిల్లీ వెళ్లినట్టు తెలిపారు. ఈ పర్యటనతో ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. ఖమ్మంలో బతుకమ్మ చీరల పంపిణీపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. ఏపీ పోలీసులు ఇంటెలిజెన్స్ కోసమే వచ్చినట్టు ఇరు రాష్ట్రాల డీజీలు నివేదిక ఇచ్చారని తెలిపారు. మావోయిస్టు కదలికలపై నిఘూ.. సాక్షి, పెద్దపల్లి: రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులతో గురువారం రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలపై సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర పోలీసులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్టు ఆయన తెలిపారు. మావోయిస్టుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికల బందోబస్తుకు కేంద్రం నుంచి అదనపు బలగాలు రాష్ట్రానికి రానున్నుట్టు తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. -
తెలంగాణలో తిరిగితే తప్పేంలేదు..
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం నిర్మూలన ఆపరేషన్లలో భాగమైన ఏపీ పోలీసు సిబ్బంది తెలంగాణలో సంచరించడం చట్ట వ్యతిరేకం కాదని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. ఒకవేళ విధులతో సంబంధం లేకుండా ఏవైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆధారాలుంటే వారిపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా ధర్మపురి, మంచిర్యాలలో ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది సర్వే నిర్వహిస్తూ పట్టుబడిన ఉదంతాలపై వివరణ కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్ జారీ చేసిన నోటీసులకు ఏపీ డీజీపీ సమాధానమిచ్చారు. ఈ ఘటనలపై విచారణ జరిపించామని, ధర్మపురి, మంచిర్యాలలో పట్టుబడింది తమ రాష్ట్ర ఇంటెలిజెన్స్ సిబ్బందేనని తెలిపారు. తమ రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం కానిస్టేబుళ్లను వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన రహస్య పనిపై నియమించామన్నారు. ఈ కానిస్టేబుళ్లు డబ్బులు పంచుతూ పట్టుబడ్డారని వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, వారి వద్ద డబ్బు కూడా లేదని వెల్లడించారు. వారిని స్థానికులు చట్ట విరుద్ధంగా అటకాయిస్తే వారే స్థానిక పోలీసుల జోక్యాన్ని కోరారని తెలిపారు. విచారణ తర్వాత ఎలాంటి తప్పు కనిపించకపోవడంతో పోలీసులు వారిని విడిచిపెట్టారన్నారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన వ్యక్తులు, ఆస్తుల పరిరక్షణ కోసం తమ రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించిన పలు విభాగాలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని, ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం నిర్మూలనకు తమ విభాగాలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైతం మోహరించామన్నారు. ఎన్నికల సర్వే కోసమే..: రాష్ట్ర డీజీపీ శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది ధర్మపురి నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థుల గెలుపోటమలపై సర్వే నిర్వహిస్తూ పట్టుబడ్డారని తమ విచారణలో తేలిందని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది పట్టుబడిన ఉదంతంపై సీఈఓ రజత్‌కుమార్‌కు ఆయన నివేదిక సమర్పించారు. పట్టుబడిన సిబ్బంది వద్ద గుర్తింపు కార్డులు లేవని, వారి ఫోన్ నంబర్లు ఏపీ అదనపు డీజీపీ పేరు మీద రిజిస్టరై ఉన్నాయని వెల్లడించారు. వారి వద్ద నుంచి ఎలాంటి నగదును స్వాధీనం చేసుకోలేదన్నారు. ధర్మపురి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జాడి బాల్‌రెడ్డి స్థానిక టీటీడీ సత్రంలో ఆరు మందికి వసతి కల్పించారని, మూడు బైకులను సైతం సమకూర్చారని తదుపరి విచారణలో తేలిందని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మహాకూటమి తరఫున ధర్మపురిలో పోటీ చేసేందుకు టికెట్లు ఇస్తే టీడీపీ ఇన్చార్జి బాల్‌రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి లక్ష్మణ్‌కుమార్‌ల గెలుపునకు ఉన్న అవకాశాలపై సర్వే చేసేందుకే ముగ్గురు ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది వచ్చినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తేల్చారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంచిపెట్టినట్లు ఏ ఆధారాలు లభించలేదన్నారు. ఈసీ చర్యలెంటో? రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది డబ్బులు పంచిపెడుతూ పట్టుబడ్డారని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈసీ రెండు రాష్ట్రాల డీజీపీల నుంచి నివేదికలు తెప్పించుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది సర్వే జరుపుతూ పట్టుబడ్డారని తెలంగాణ డీజీపీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకోనున్న చర్యలపై ఆసక్తి నెలకొంది. -
సెక్యూరిటీపై డీజీపీని కలిసిన టీ కాంగ్రెస్ నాయకులు
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ నేతలకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జెడ్ క్యాటగిరీ భద్రతతోపాటు, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్ కల్పించాలని డీజీపీని కోరారు. అలాగే పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 4+4 సెక్యూరిటీ కల్పించాలని, భట్టి విక్రమార్కకు ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీని పెంచాలని డీజీపీకి వినతిపత్రం అందజేశారు. వారితో పాటు విజయశాంతి, మధుయాష్కి, గూడూరు నారాయణ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్‌లకు సెక్యూరిటీ కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. డీజీపీని కలిసిన వారిలో టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ ఉన్నారు. దీనిపై స్పందించిన డీజీపీ విధివిధానాలకు అనుగుణంగా నేతలకు భద్రతను కొనసాగిస్తామని వారికి హామీ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కేంద్ర బలగాలకు చెందిన 4+4 సిబ్బందితో భద్రత కల్పించాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిని, రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఈ భద్రతను కొనసాగించాలని పేర్కొంది. -
చట్టానికి లోబడే ఫోన్ల ట్యాపింగ్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ భద్రత, నేరాల నిర్మూల న కోసం కట్టుదిట్టమైన విధివిధానాలకు లోబడే ఫోన్ల ట్యాపింగ్ జరుపుతున్నామని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా, అక్రమ పద్ధతుల ద్వారా ఫోన్ల ట్యాపింగ్‌కు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వ్యవస్థ లో అక్రమాల నిరోధానికి, తటస్థత (చెక్స్ అండ్ బ్యాలñ న్సెస్)ను కాపాడేందుకు చట్టబద్ధ ఏర్పాట్లున్నాయని తెలిపారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేస్తోం దని, విపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకుని పోలీ సు శాఖ వాహనాల తనిఖీలు నిర్వహిస్తోందని మహా కూటమి నేతలు చేసిన ఫిర్యాదుపై వివరణ కోరుతూ డీజీపీకి సీఈవో రజత్‌కుమార్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుకు సంబంధించి కవరిం గ్ లెటర్లో మినహా ఫిర్యాదు ప్రతిలో ఎక్కడా ఫోన్ ట్యాపింగ్ ప్రస్థావన లేదని డీజీపీ పేర్కొనడం గమనార్హం. విపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారా.. లేదా అన్న అంశం పై డీజీపీ సూటిగా సమాధానం చెప్పని నేపథ్యంలో ఈ వివరణపై సంతృప్తి చెందారా అన్న విలేకరుల ప్రశ్నకు సీఈవో స్పందిం చారు. తనకు అన్ని రాజకీయ పార్టీలూ సమానమేనని, ఎవరి పట్ల వివక్ష లేదన్నారు. డీజీపీ వివరణపై సంతృప్తి చెందినట్లు తెలిపారు. ఫోన్ల ట్యాపింగ్ విషయంలో కేంద్ర హోంశాఖ నిబంధనలను అమలు చేస్తున్నామని పేర్కొనడం ద్వారా రాజకీయ పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేయట్లేదని డీజీపీ పరోక్షంగా తెలిపారని అభిప్రాయపడ్డారు. తనిఖీల్లో కక్ష సాధింపు లేదు.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా విపక్ష పార్టీల నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోదండరాం, ఎల్.రమణల వాహనాలను పోలీసులు తనిఖీ చేశారని వచ్చిన ఆరోపణలను డీజీపీ తోసిపుచ్చారు. ఇబ్రహీంపట్నం లోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద నిర్వహిం చిన వాహనాల తనిఖీల్లో టీఆర్ఎస్ మాజీ ఉప సర్పంచ్ పల్లె గోపాల్‌రావు కారు నుంచి రూ.27.35 లక్షలు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణకు వాహన యజమానిని ఆదాయ పన్ను శాఖకు అప్పగించామని డీజీపీ నివేదించారు. -
ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ సూచించారు. రాబోయే ఎన్నికలపై డీజీపీ, కమిషనర్లు, ఎస్పీలతో హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని వాటర్‌బోర్డు కార్యాలయంలోని సమావేశం మందిరంలో చర్చించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతీ బూత్‌స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం, గత ఎన్నికల్లో గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డీజీపీతో పాటు ఎస్పీలు, కమిషనర్లకు వీవీ పాట్స్, ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పించారు. ఎన్నికల కోడ్ వేళ తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన పలు అంశాలపై ఎన్నికల కమిషన్ అధికారులు వివరించినట్లు తెలిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, ఎన్నికల సిబ్బందికి, ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రజత్‌కుమార్ ఆదేశించినట్లు సమాచారం. అభ్యర్థులు ర్యాలీలు, సభలు, మైకులు, ప్రచార రథాల అనుమతులకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు చెందిన సువిధ యాప్ ద్వారా పొందాలని, ఈ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్ పోలీస్ శాఖకు నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేలా ఆదేశిస్తుందని కమిషనర్లు, ఎస్పీలకు ఎన్నికల కమిషన్ అధికారులు సూచించినట్లు తెలిసింది. ఓటర్లు రాజకీయ పార్టీల ప్రలోభాలు, నగదు, గిఫ్టుల పంపిణీ అంశాలను నేరుగా సీ–విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చని, ఈ యాప్‌ను ప్రజలు ఉపయోగించుకునేలా చూడాలని సూచించారు. ప్రశాంతంగా నిర్వహిస్తాం: డీజీపీ జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, రేంజ్ డీఐజీలతో ఎన్నికల అధికారులు సమావేశమయ్యారని, ఈసీ నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా కమిషన్ శిక్షణ ఇచ్చినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. వీవీ పాట్స్, సీ–విజిల్, సువిధ యాప్‌ను పోలీసులు ఎలా వినియోగించుకోవాలో శిక్షణలో సూచించారని చెప్పారు. శిక్షణలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలు ఎలా గుర్తించాలి అనే వాటిపై చర్చ జరిగిందని, భద్రతకు ఎంత మందిని మోహరించాలన్న దానిపై చర్చించామన్నారు. రౌడీ షీటర్ల బైండోవర్లు, లైసెన్స్ ఆయుధాల డిపాజిట్ తదితర అంశాలను వేగవంతంగా అమలు చేస్తామన్నారు. మూడేళ్ల సర్వీసును ఒకే జిల్లాలో పూర్తి చేసుకున్న అధికారులను బదిలీచేయాలని ఈసీ సూచించిందని, నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 17లోపు పోలీసు శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, పక్క రాష్టాల పోలీసులతో కూడా సమన్వయం చేసుకుంటున్నట్లు వివరించారు. -
‘ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో శాసనసభకు జరుగనున్న ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా 17వ తేదీలోగా పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. శుక్రవారం ఈసీతో సమావేశం అనంతరం మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా పోలీసుల, రేంజ్ డీజీలతో సమావేశమయ్యామని, ఈసీ నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని శిక్షణ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. వీవీప్యాట్స్‌తో పాటు సీ విజిల్, సువిధ యాప్‌లను పోలీసులు ఎలా వినియోగించుకోవాలో అనే దానిపై ప్రధానంగా శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలను ఎలా గుర్తించాలి అనే వాటిపై చర్చించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పోలీసులను వినియోగించుకోవాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. ఇప్పటికే రౌడీషీటర్లపై బైండోవర్ కేసులు వంటి చేస్తున్నామన్న డీజీపీ.. లైసెన్స్ తుపాకులను డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అదే సమయంలో ఒకే జిల్లాలో మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని బదిలీలు చేయాలని జిల్లా అధికారులకు సూచించామన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పక్క రాష్ట్రిల పోలీసులతో కూడా సమన్వయం చేసుకుంటామని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. -
చిన్న సమస్య కూడా రానివ్వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికలకు ఏ చిన్న సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని, ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటేసేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఎన్నికల్లో భద్రతకు చేయాల్సిన ఏర్పా ట్లు, బందోబస్తు, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి తదితరాలపై సోమవారం రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో డీజీపీ సమీక్షించారు. సమీక్షలో నార్త్‌జోన్ (వరంగల్) కింద ఉన్న జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, ఐజీ నాగిరెడ్డి, డీఐజీ ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో సున్నిత ప్రాంతా ల్లో జరిగిన అల్లర్లు, గొడవలు, ఇతరత్రా అంశాలపై ఆయా జిల్లాల ఎస్పీలు డీజీపీకి వివరించారు. బూత్‌స్థాయి వరకు భద్రతను పటిష్టం చేయడంతో పాటు ముందుస్తుగా ఆయా ప్రాంతాల్లో ఉన్న నేరగాళ్లు, రౌడీషీటర్లను బైండోవర్ చేయడం, వారిపై నిఘా పెట్టాలని సూచించినట్లు సమాచారం. మావో ప్రభావిత జిల్లాల్లో అలర్ట్.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు మావోలు యత్నించే అవకాశముందని ఇంటెలిజెన్స్ అధికారులు ఎస్పీలు, కమిషనర్లకు సూచిం చినట్లు తెలిసింది. మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో దిగుతున్న ప్రతి అభ్యర్థి భద్రతను పర్యవేక్షించాలని, మావో గెరిల్లా దాడులకు అవకాశం లేకుం డా చూసుకోవాలని, ఇందుకు స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు చేపట్టేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్ ఎన్నికల కమిషన్ సీఈవో రజత్‌కుమార్‌తో సోమవారం భేటీ అయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నట్లు జితేందర్ తెలి పారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బంది ఈ నెల 12 నుంచి శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. -
ఎన్నికలకు పోలీస్ శాఖ రెడీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో పోలీస్‌శాఖ ఆ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటోంది. బందోబస్తు, అందుకు తగిన కార్యాచరణ, బలగాల పరిస్థితి, సిబ్బంది తదితర అంశాలపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. గతంలో ఎన్నికల సందర్భంలో తీసుకున్న చర్యలు, చేపట్టిన బందో బస్తు వివరాలు, మానిటరింగ్, తదితరాలపై నివేదిక రూపొందించబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి తో డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం భేటీ అయ్యారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై సీఎస్‌కు వివరించినట్టు తెలిసింది. బెటాలియన్లు, ఆర్మ్డ్ రిజర్వ్‌లకు... రాష్ట్రంలో 13 స్పెషల్ పోలీస్ బెటాలియన్లున్నాయి. ప్రతి బెటాలియన్‌లో వెయ్యిమంది సాయుధ సిబ్బంది ఉండాలి. కానీ, ఖాళీల కారణంగా ప్రతి బెటాలియన్‌లో 600 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఎన్నికల బందోబస్తుకు సిద్ధంగా ఉండేలా కార్యాచరణ రూపొందించాలని మౌఖికంగా బెటాలియన్ విభాగానికి పోలీస్‌శాఖ నుంచి సూచనలు వెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తం బెటాలియన్ల నుంచి 7 వేల నుంచి 8 వేల మంది సిబ్బంది అందుబాటులో ఉండనున్నట్టు తెలిసింది. ప్రతి జిల్లాలో ఆర్మ్డ్ హెడ్క్వార్టర్లలో 80 నుంచి 100 మంది, కమిషనరేట్లలో 250 నుంచి 300 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. సుమారు 3,500 మంది, బెటాలియన్లు, ఆర్మ్డ్ ఫోర్స్ కలిపి 12 వేల మంది, రాష్ట్రంలోని సివిల్ పోలీసులు సుమారు 40 వేల మంది సిబ్బంది ఎన్నికలకు సిద్ధం కాబోతున్నారు. మొత్తం 60 వేల మంది సిబ్బందితో పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది. రంగంలోకి పారామిలటరీ... ఎన్నికలకు పారామిలటరీ బలగాలను రంగంలోకి దించాల్సి ఉంటుంది. ఇప్పుడు 150 కంపెనీల బలగాలను ఎన్నికలవేళ బందోబస్తు కోసం కేటాయించాలని ఎన్నికల కమిషన్ ద్వారా పోలీస్ శాఖ కోరనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో కంపెనీలో 125 నుంచి 128 మంది సిబ్బంది ఉంటారు. హోంగార్డులు సైతం... రాష్ట్ర పోలీస్ సిబ్బంది, కేంద్ర పారామిలిటరీ బలగాలతోపాటు రాష్ట్రంలో ఉన్న 24 వేల మంది హోంగా ర్డులను ఎన్నికల విధుల్లో నియమించేలా సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా 90 వేల నుంచి లక్ష మంది పోలీస్ సిబ్బందిని ఎన్నికల బందోబస్తులో నియ మించే అవకాశమున్నట్టు తెలిసింది. త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల కోసం బలగాల మోహరింపు తదితరాలపై త్వరలోనే ఎన్నికల కమిషన్‌తో పోలీస్ శాఖ భేటీ కాబో తోంది. ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది సిబ్బందిని మోహరించాలి, సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలెన్ని? వాటిని ఎలా నియంత్రించాలన్న అంశాలపై చర్చించే అవకాశముంది. -
మంత్రుల చాయ్.. చిట్‌చాట్
ఇబ్రహీంపట్నంరూరల్ : నిన్న మొన్నటి వరకు సామాన్య ప్రజలకే కేరాఫ్‌గా మారిన రంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టరేట్ నిర్మాణం సమీపంలోని టీ కొట్టు ఇప్పుడు ప్రధాన్యత సంతరించుకుంది. ఈ కలెక్టరేట్ నిర్మాణం పక్కనే ప్రగతి నివేదన సభ జరగనుంది. సభ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి వచ్చిన మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నగర మేయర్ బోంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు ఈ టీకొట్టు వద్ద ఆగి చాయ్ తాగారు. మిర్చితిని వెళ్లారు. నిత్యం బిజీగా గడిపే నాయకులు సామాన్య ప్రజల మాదిరిగా రోడ్డుపై చాయ్‌తాగడాన్ని అక్కడి వారు ఆశ్చర్యంగా చూశారు. -
ముఖం చూసి పట్టిస్తుంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖ మరో టెక్నాలజీ ఆయుధాన్ని అందిపుచ్చుకుంది. మోస్ట్ వాంటెడ్ నేరస్తులు, పాతనేరస్తులు, తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులు, అదృశ్యమైన చిన్నారులను గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. క్షేత్రస్థాయి దర్యాప్తు అధికారులకు ఈ యాప్ ఎంతో ఉపకరించనుందని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు ముఖ్య కార్యాలయంలో గురువారం ఈ వ్యవస్థను ఆయన ఆవిష్కరించారు. ఈ సర్వీస్‌ను టీఎస్‌కాప్ యాప్‌కు అనుసంధానించినట్లు వెల్లడించారు. 30 సెకన్లలో సర్వర్ నుంచి.. ఈ యాప్‌లో ఇప్పటి వరకు లక్ష మంది పాతనేరస్తుల ఫొటోలు, అదృశ్యమైన వారి ఫొటోలు, దేశవ్యాప్తంగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఫొటోలు అందుబాటులోకి తీసుకొచ్చారు. సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నిందితుల ఫొటోలను సైతం చెక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. తనిఖీల్లో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తి తారసపడితే సంబంధిత వ్యక్తి ఫొటోను తీసుకొని యాప్‌లో సర్వర్‌కు కనెక్ట్ చేస్తే 30 సెకన్లలో సంబంధిత వ్యక్తి పాతనేరస్తుడైనా, అదృశ్యమైన వ్యక్తి అయినా తెలిసిపోతుందని డీజీపీ తెలిపారు. ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల్లోని నేరస్తుల ఫొటోలు, దర్యాప్తు సంస్థల మోస్ట్‌వాంటెడ్, అరెస్ట్‌చేసిన వారి ఫొటోలు అప్డేట్ అవుతాయని, దీంతో ఈ యాప్ టీఎస్‌కాప్‌లోకి అప్డేట్ ఫొటోలను చేరవేస్తుందన్నారు. ఎవిడెన్స్ యాక్ట్ కిందకు రాదు.. ఈ సాంకేతికత ద్వారా గుర్తించిన నిందితుల చార్జిషీట్ దాఖలులో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఆధారాలుగా పేర్కొనలేమని డీజీపీ పేర్కొన్నారు. ఇండియన్ ఎవిడెన్స్ చట్టం ప్రకారం దీన్ని ఆధారం కింద పరిగణించలేమన్నారు. కికీ చాలెంజ్‌పై వార్నింగ్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కికీ చాలెంజ్‌పై డీజీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ప్రాణాంతక చాలెం జ్ను ఎవరు స్వీకరించినా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి ధోరణి వల్ల ఇతరుల ప్రాణాలకు హాని ఉందని, చేసే వారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉండటంతో సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు. -
కఠిన శిక్షలతోనే నియంత్రణ
సాక్షి, హైదరాబాద్: మానవ అక్రమ రవాణాను పోలీస్ శాఖతో పాటు అన్ని విభాగాలు సంయుక్తంగా నియంత్రించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దారుణమైన నేరంగా మానవ అక్రమ రవాణా ఆందోళన కలిగిస్తోందని, చిన్నారులు జీవితాంతం బానిసలుగా బతకాల్సిన పరిస్థితి తలెత్తుతోందని, ఇలాంటి నేరాలు సహించలేనివని పేర్కొన్నారు. రాష్ట్ర సీఐడీ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆ«ధ్వర్యంలో రూపొందించిన ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్–విక్టిమ్ సెంట్రిక్ ఇన్వెస్టిగేషన్ మ్యాన్యువల్’ను సునీతాకృష్ణన్, సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్‌తో కలసి సోమవారం రాష్ట్ర పోలీసు ముఖ్య కార్యాలయంలో డీజీపీ ఆవిష్కరించారు. ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న నేరగాళ్లకు శిక్షపడేలా చేస్తేనే ఈ నేరాలపై నియంత్రణ ఉంటుందన్నారు. వ్యభిచారమే కాకుండా నిర్బంధ కార్మికులుగా వేలాది మంది యువత, చిన్నారులు నలిగిపోతున్నారని, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాల్సి ఉందన్నారు. అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్రాల వారీగా వ్యవస్థీకృతంగా ఈ నేరాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేరాల్లో కీలకమైన వారికి శిక్షలు పడేలా చేస్తేనే బాధితులకు న్యాయం చేసినట్లవుతుందని పేర్కొన్నారు. ప్రజ్వల సంస్థ 20 ఏళ్లుగా ఈ నేరాలపై విశేషంగా కృషిచేస్తోందని, వేలాది మంది బాధితులను అక్కున చేర్చుకొని వారికి అన్ని విధాలుగా సాయం చేస్తోందని ప్రశంసించారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసి, ప్రత్యేక చట్టం వచ్చేలా చేశారని కొనియాడారు. ఇటీవల పార్లమెంట్లో కొత్త ట్రాఫికింగ్ నియంత్రణ చట్టానికి ఆమోదం లభించిందని పేర్కొన్నారు. బాధితులకు రక్షణ, పునరావాసం కల్పించేలా చట్టంలో ఉందని, దీనిపై ప్రతి రాష్ట్రంలో యాంటీ ట్రాఫికింగ్ బ్యూరోలు ఏర్పాటయ్యే అవకాశముందన్నారు. హైదరాబాద్ సౌత్జోన్లో ఇటీవల బాలకార్మిక వ్యవస్థ నుంచి 250 మందిని విముక్తి చేశామని, ఈ కేసులో 14 ఏళ్ల పాటు నిందితులకు శిక్షపడిందని డీజీపీ గుర్తుచేశారు. ముస్కాన్‌తో సత్ఫలితాలు.. సీఐడీ నేతృత్వంలో 2015 నుంచి కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 25,834 మందిని కాపాడినట్లు మహిళా భద్రత విభాగం ఐజీ స్వాతిలక్రా తెలిపారు. వీరిలో 12,483 మందిని తల్లిదండ్రులకు అప్పగించామని, మిగిలిన వారిని రెస్క్యూ హోమ్స్‌కు తరలించినట్లు చెప్పారు. 2014 నుంచి ఇప్పటివరకు మానవ అక్రమ రవాణా కింద 1,397 కేసులు నమోదు కాగా, 1,413 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్, ఆర్గనైజేషన్ అదనపు డీజీపీ రాజీవ్ రతన్ పాల్గొన్నారు. ప్రేమించి మోసం చేశాడు ‘నేను పదోతరగతిలో ఉండగా ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. ఈ విషయం మా తల్లిదండ్రులకు తెలిసి నాకు పెళ్లి చేయాలని భావించారు. దానికి నేను ఒప్పుకోలేదు. దీంతో హైదరాబాద్‌కు వచ్చాను. ఇంటి తాళం లేకపోయే సరికి బయటే ఉన్నాను. దీంతో అతడు వచ్చి తన ఇంటికి వెళ్దామని చెప్పి అన్నంలో మత్తుమందు కలిపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడి స్నేహితులు కూడా దాడిచేసి, వ్యభిచార కూపంలో నన్ను అమ్మేశాడు. పారిపోయేందుకు ప్రయత్నిస్తే తీవ్రంగా గాయపరిచేవారు. సీఐడీ అధికారులు వచ్చి కాపాడారు. నాతో పాటు మరో 25 మందిని కాపాడారు. ఆ తర్వాత ప్రజ్వల హోంకు తరలించారు. ఇప్పుడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటున్నాను. – బాధితురాలు దివ్య ప్రేమగా మాట్లాడి అమ్మేసింది ‘నా తల్లిదండ్రులు మద్యానికి బానిసయ్యారు. ఏ రోజూ నన్ను పట్టించుకోలేదు. దీంతో ఇంటి నుంచి పారిపోయేందుకు బస్టాండ్‌కు వచ్చా. అక్కడ ఓ మహిళ నాతో ప్రేమగా మాట్లాడి కూతురిలా చూసుకుంటానని చెప్పి మోసం చేసి వ్యభిచారకూపంలో అమ్మేసింది. దీంతో నా జీవితం ముగిసిపోయిందనుకున్నా. కానీ సీఐడీ అధికారులు వచ్చి కాపాడారు. ప్రజ్వల హోంకు వచ్చాక టైలరింగ్, వెల్డింగ్ నేర్చుకున్నాను. నాలాగా మోసపోయిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాను’. – బాధితురాలు మనీషా, హైదరాబాద్ హోంమంత్రి గ్రీన్‌చాలెంజ్ స్వీకరించిన డీజీపీ సాక్షి, హైదరాబాద్: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించిన గ్రీన్ చాలెంజ్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి స్వీకరించారు. ఈమేరకు రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో సోమవారం మొక్కలు నాటారు. అదనపు డీజీపీ జితేందర్‌తో కలిసి మొక్కలు నాటి ఖమ్మం, నిజామాబాద్ కమిషనర్లకు, జగిత్యాల ఎస్పీకి మహేందర్‌రెడ్డి గ్రీన్ చాలెంజ్ చేశారు. మొక్కనాటిన హీరో మహేశ్‌బాబు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపుమేరకు పోలీస్ అకాడమీలో సోమవారం హరితహారం నిర్వహించారు. అకాడమీలోనే షూటింగ్లో ఉన్న హీరో మహేశ్‌బాబును మొక్క నాటాల్సిందిగా అకాడమీ డైరెక్టర్ సంతోష్‌మెహ్రా ఆహ్వానించారు. దీనితో మహేష్‌బాబుతో పాటు శిక్షణలో ఉన్న ట్రైనీ సిబ్బంది ఒక్కొక్కరు 5 మొక్కల చొప్పున నాటారు. ఇలా మొత్తం 3వేల మొక్కలు నాటినట్టు సంతోష్‌మెహ్రా తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అకాడమీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పరిష్కరించుకుందాం రండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని లారీల యజమానుల సమస్యల పరిష్కారంపై చర్చలు జరిపేందుకు కేసీఆర్ సర్కారు ముందుకొచ్చింది. లారీల యజమానులను చర్చలకు ఆహ్వానించింది. యజమానుల సంఘం ప్రతినిధులతో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సోమవారం చర్చలు జరపనున్నారు. దీంతో దాదాపు రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సింగిల్ పర్మిట్ విధానానికి ఈ సమావేశంతో మోక్షం కలగనుందని సమాచారం. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్న లారీలకు ఒకసారికి రూ. 1,600 చొప్పున పర్మిట్ ఫీజు వసూలు చేస్తండటంతో లారీ యజమానులపై తీవ్ర ఆర్థికభారం పడుతోంది. ఈ సమస్య పరిష్కారానికి ఏపీని ఒప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొ చ్చిందని తెలియవచ్చింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం, రవాణాశాఖ ఉన్నతాధికారులు సైతం సింగిల్ పర్మిట్ ఒప్పందం అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలంగాణ లారీ యజమానుల సంఘం తెలిపింది. అలాగే ఈ ఏడాది లారీ యజమానులు చెల్లించాల్సిన పన్ను రెండో త్రైమాసికం గడువు ఇప్పటికే ముగిసింది. కానీ సమ్మె కారణంగా లారీలు నడవలేదు కాబట్టి... చెల్లింపు గడువును ప్రభుత్వం ఆగస్టు 15 వరకు పెంచిందని సంఘం పేర్కొంది. సమ్మె విరమణకు ముందు హైడ్రామా? కేంద్రం హామీతో దేశవ్యాప్తంగా సమ్మె విరమిస్తున్నట్లు ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ప్రకటించినా తెలంగాణలో మాత్రం సమ్మె విరమణపై అర్ధరాత్రి దాకా హైడ్రామా నడిచింది. తమ పరిధిలోని అంశాలను పరిష్కరిస్తామని కేంద్రం ప్రకటించగా తెలంగాణ పరిధిలోని అంశాలపై సరైన హామీ రాలేదన్న కారణంగా రాష్ట్ర లారీ యజమానుల సంఘం సమ్మెను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ప్రకటనతో రవాణా మంత్రి లారీ యజమానుల సంఘం నేతలతో మాట్లాడారు. రాష్ట్ర పరిధిలోని డిమాండ్లపై చర్చలు జరిపేందుకు సోమవారం వారిని చర్చలకు ఆహ్వనించారు. దీనికి సీఎం కేసీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో లారీల యజమానుల సంఘం సమ్మె విరమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర పరిధిలో లారీల యజమానుల డిమాండ్లు ♦ రాష్ట్రవ్యాప్తంగా తైబజారు రుసుములను శాశ్వతంగా రద్దు చేయాలి. ♦ లారీ పరిశ్రమలో స్థిరపడేందుకు ముందుకొస్తున్న పేద, మధ్యతరగతి యువతకు ప్రభుత్వమే ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేయాలి. ♦ ఓవర్‌లోడ్ తీసుకెళ్తున్నందుకు లేదా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు న్యాయ విచారణ పూర్తయ్యేదాకా డ్రైవర్ల లైసెన్స్ రద్దు విషయంలో చర్యలు తీసుకోవద్దు. ♦ రాష్ట్రంలో టోల్గేట్ల మధ్య ప్రయాణించే దూరం ఆధారంగానే రుసుములు వసూలు చేయాలి. ♦ ఇద్దరు డ్రైవర్ల విధానం నుంచి మినహాయింపు కల్పించాలి. -
ప్రజాసేవే ఆర్టీసీ లక్ష్యం : మహేందర్‌రెడ్డి
నర్సాపూర్ మెదక్ : ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజాసేవే లక్ష్యంగా తమ సంస్థ పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. గురువారం నర్సాపూర్‌లో డిపో ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ పేద ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. సంస్థ నష్టాల్లో ఉండడంతో దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారని చెప్పారు. నర్సాపూర్ డిపో ఏర్పాటుకు పది కోట్ల రూపాయలను సీఎం మంజూరు చేశారని, ఆరు నెలల్లో డిపోను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మంత్రిని సన్మానించిన యూనియన్ నాయకులు మంత్రి మహేందర్‌రెడ్డిని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రీజినల్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు సంగమేశ్వర్, అహ్మద్, శాఖయ్య, శ్యాంసుందర్‌గౌడ్ తదితరులు శాలువ, పూలమాలలతో సన్మానించారు. డిపో ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. -
హైదరాబాద్ నుంచి ‘కత్తి’ బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే తీవ్రంగా స్పందిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. భావ వ్యక్తీకరణ పేరుతో మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను ఆరు మాసాలపాటు హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటిం చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ, కత్తి మహేశ్‌కు వ్యతిరేకంగా ఆందోళనల పేరుతో మరికొన్ని గ్రూపులు రంగంలోకి దిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందుకు యత్నిస్తున్నాయని, వారికి తామెంత మాత్రం అవకాశం ఇవ్వబోమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎవరైనా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ‘భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కే. దాన్ని సరైన రీతిలో వినియోగించుకోవాలే తప్ప ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించకూడదు. తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్, హాజర్డష్ యాక్టివిటీస్ యాక్ట్ 1980 కింద ఆరు నెలల పాటు కత్తి మహేశ్‌ను రాజధాని నుంచి బహిష్కరిస్తున్నాం. మహేశ్‌ను తన స్వస్థలమైన చిత్తూరు జిల్లా కు తరలించాం. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా హైదరాబాద్‌లో ఉండొచ్చు. కాని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, సమాజాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ఇలాంటి వ్యక్తులకు సహకరించే వారిపైనా చర్యలు తప్పవు’ అని ఆయన హెచ్చరించారు. న్యూస్ చానల్‌పై చర్యలు కత్తి మహేశ్ వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసి ప్రజ ల్లో అశాంతి కలిగేలా వ్యవహరించిన ఓ న్యూస్ చాన ల్‌పై చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. సంబంధిత చానల్ నిర్వాహకులకు షోకాజ్ నోటీస్ జారీ చేశామని, ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన సదరు చానల్‌పై కేబుల్ టీవీ నెట్వర్క్ యాక్ట్ నంబర్–7 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. చానల్ ఇచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చ రించారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా, తీసుకునేలా ప్రేరేపించినా కేసులు నమోదు చేసి కటకటాల్లోకి పంపిస్తామన్నారు. నగర బహిష్కరణ ఉత్తర్వులను ఉల్లంఘించి కత్తి మహేశ్ మళ్లీ నగరంలోకి అడుగుపెడితే మూడేళ్లపాటు జైలు శిక్షకు గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. కేబుల్ టీవీ నెట్వర్క్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలకు రెండేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉందన్నారు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశామని డీజీపీ తెలిపారు. సరైన చర్యలు తీసుకునేలా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. కత్తి మహేశ్ బహిష్కరణ ప్రస్తుతం హైదరాబాద్ వరకే పరిమితమని, అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ విధిస్తామన్నారు. ఏపీలో మీడియాతో మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామన్నారు. కత్తి మహేశ్‌పై ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయన్నారు. ధార్మిక సంఘాలు, ఇతరులు చట్టాలను చేతుల్లోకి తీసు కుని అశాంతికి కారణం కావద్దని, ఏదైనా సమస్య తలె త్తితే దాన్ని పరిష్కరించేందుకు పోలీస్ శాఖ, ప్రభుత్వం ఉందన్నారు. సమావేశంలో నగర కమిషనర్ అంజనీకుమార్, అదనపు డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్, డీఐజీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. కత్తి మహేశ్‌పై కేసు నమోదు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటమే కాకుండా, సీతారాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. టీవీ చర్చా వేదికలో రామాయణాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ సంబంధిత ఆధారాలతో రహ్మత్‌నగర్‌కు చెందిన గడ్డం శ్రీధర్ అనే వ్యక్తి ఈనెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కత్తి మహేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీజీపీని కలసిన బీజేపీ ఎమ్మెల్యేలు కత్తి మహేశ్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్.. రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో డీజీపీని కలిశారు. స్వామి పరిపూర్ణానంద పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతోపాటు ఆయనను గృహ నిర్బంధం చేయడం, ఆయన ఇంటికి తాము వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై ఫిర్యాదు చేశారు. మహేశ్ నగర బహిష్కరణపై రాజాసింగ్ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ నుంచి బహిష్కరించాలని డీజీపీని కోరినట్టు తెలిపారు. యాదాద్రి సందర్శనకు పరిపూర్ణానందకు అనుమతివ్వాలని కోరినట్టు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చెప్పారు. -
అవసరమైతే కత్తి మహేశ్‌కు మూడేళ్ల జైలు
-
కత్తి మహేశ్‌ను అందుకే బహిష్కరించాం : డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : గత నాలుగేళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు వ్యవస్థ తీవ్రంగా కృషి చేస్తోందని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. కేవలం కొందరు వ్యక్తుల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకూడదని భావించి సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను హైదరాబాద్ నుంచి బహిష్కరించినట్లు డీజీపీ వెల్లడించారు. కత్తి మహేశ్ పోస్టులు, ఆపై బహిష్కరణ విషయంపై సోమవారం మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సొంత జిల్లాకు కత్తి మహేశ్ కత్తి మహేశ్ అనే వ్యక్తి టీవీ చానళ్లను, సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పదే పదే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేశ్ వ్యాఖ్యలు, పోస్టులతో మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శాంతి భద్రతలు క్షీణిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కు అయినప్పటికీ సమాజంలో ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని భావిస్తున్నాం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన క్రమంలో హైదరాబాద్ నుంచి కత్తి మహేశ్‌ను 6 నెలలపాటు బహిష్కరించాం. ఆయన సొంత జిల్లా చిత్తూరుకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. చట్టాలను ఉల్లంఘించి ఒకవేళ మళ్లీ అతను నిషేధ సమయంలో హైదరాబాద్‌లో ప్రవేశిస్తే మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది. అంతేగాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కత్తి మహేశ్‌పై నిషేధం విధించాల్సి ఉంటుంది. ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటాం. భారతదేశం నలుమూలల నుంచి ఎక్కడినుంచైనా వచ్చి ఏ ప్రాంతంలోనైనా ఉండొచ్చు. కానీ కత్తి మహేశ్ తరహాలో ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా, వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. శాంతి భద్రతలు బాగుండటం వల్లే తెలంగాణ పౌరులు, ఉద్యోగులు, అన్నివర్గాల వారు అభివృద్ది కోసం వాళ్ల పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఎవరో కొందరు వ్యక్తులు కావాలని పని గట్టుకుని, ప్రసార మాధ్యమాలను వేదికగా చేసుకుని ఇతర వర్గాల మధ్య తగాదాలు పెట్టడం చేయకూడదు. పదే పదే తమకున్న అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే పరిస్తితి తలెత్తింది. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. సహకరిస్తే చర్యలు తప్పవు కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రక్రియలో ఇతర వర్గాలు, మతాలు, ప్రాంతాల వారి మనోభావాలు దెబ్బతినేలా చేస్తే.. ఆయా వ్యక్తులకు సహకరించిన వారిపై సైతం చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇతరత్రా మాధ్యమాల ద్వారా ఏ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా నోటీసులు జారీ చేస్తాం. కత్తి మహేశ్ వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసిన ఓ ఛానల్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. వారిచ్చే సమాధానం బట్టి చర్యలు ఉంటాయి. సెక్షన్ 16, 17 కేబుల్ యాక్ట్ ప్రకారం మేనేజ్మెంట్ రెండేళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చాం. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. సంబంధిత కథనం కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు! -
టీఆర్ఎస్ది రైతు ప్రభుత్వం
ధారూరు: టీఆర్ఎస్ది రైతు ప్రభుత్వమని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ధారూరు మండలంలోని మున్నూరుసోమారంలో రూ.2.95 కోట్లతో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఎమ్మెల్యే సంజీవరావుతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మిషన్ కాకతీయ, నిరంతర ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, రికార్డుల ప్రక్షాళన తదితర కార్యక్రమాలతో చరిత్రలో నిలిచిపోయే పనులు చేశారని కొనియాడారు. మిషన్ కాకతీయ పథకం కింద రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తున్నామని, జిల్లాలోని 1,350 చెరువులు, కుంటల అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ప్రాజెక్టుల ద్వారా గొలుసుకట్టు చెరువులు, కుంటల్లో నీళ్లు నింపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. వ్యవసాయానికి అందిస్తున్న నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం రూ.60 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మోమిన్‌కలాన్, మున్నూరుసోమారం, ఎన్కతల, గెరిగిట్పల్లి గ్రామాల్లో కొత్త సబ్ స్టేషన్లు నిర్మించినట్లు వివరించారు. మున్నూరుసోమారంలో చెరువు మరమ్మతులు, వంతెన నిర్మాణం, సీసీ రోడ్ల కోసం అవసరమైన ప్రతిపాదనలు అందించాలని పీఆర్ డీఈని ఆదేశించారు. ఎమ్మెల్యే సంజీవరావు, ధారూరు పీఏసీఎస్ చైర్మన్ జె.హన్మంత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్‌రెడ్డి, కె.అంజయ్య, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ రాంరెడ్డి, జిల్లా సభ్యుడు రాజేందర్‌రెడ్డి, గ్రామ సర్పంచు బిచ్చన్న, ఎంపీటీసీ దస్తప్ప, విద్యుత్ ఎస్ఈ జానకీరాం, ఏఈ శ్రీనివాస్‌రెడ్డి, గ్రంథాలయ జిల్లా చైర్మన్ కొండల్‌రెడ్డి, వికారాబాద్ ఏఎంసీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, నాయకులు వడ్లనందు, రాములు, రాంచంద్రయ్య, నర్సింహారెడ్డి, అవుసుపల్లి అంజయ్య, లక్ష్మయ్య, చిన్నయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి కాన్వాయ్‌పై బాధిత కుటుంబాల దాడి
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని మంచాల మండలం లింగంపల్లి వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో యువకులు కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆగ్రహాం వ్యక్తం చేసిన బాధితుల బంధువులు మృతదేహాలతో మంచాల రహదారిపై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. భాదిత కుటుంబాలను పరామర్శించేందుకు ఘటనాస్థలానికి వచ్చిన మంత్రి మహేందర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్‌పై ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. మృతులు కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రి బాధిత కుటుంబాలతో చర్చలు జరుపుతున్నారు. ఇది చిత్రీకరిస్తున్న మీడియాపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. కాగా, చెన్నారెడ్డిగూడెంకు చెందిన పదిమంది మహిళలు ప్రతిరోజు కూరగాయలను ఆటోలో వేసుకొని హైదరాబాద్ నగరానికి తీసుకువస్తారు. రోజు వారి మాదిరిగానే సోమవారం కూడా దాదాపు పది మంది మహిళలు అదే గ్రామానికి చెందిన శీను ఆటోలో కూరగాయలు వేసుకొని నగరానికి బయలుదేరారు. మంచాల మండలం లింగంపల్లి వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు ముందు భాగంలో కూర్చున్న మహిళలు అక్కడిక్కడే తుది శ్వాస విడిచారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను ఆటో డ్రైవర్ శీను, సుజాత, మాధవి, మారు, అఫిలీగా గుర్తించారు. -
సమాచారం, సహకారం ఇచ్చి పుచ్చుకోవాలి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: శాంతి భద్రతల పరిరక్షణ, మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, నేరాల నియంత్రణలో రాష్ట్రాల పోలీసు విభాగాలు పరస్పర సమాచార మార్పిడి, సహకారం ఇచ్చి పుచ్చుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం భువనేశ్వర్‌లో సదtరన్ రాష్ట్రాల డీజీపీల భేటీ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు కృషి చేస్తున్న అంశాలు, ప్రణాళికలపై డీజీపీలు చర్చించారు. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణకు అన్ని రాష్ట్రాలు పరస్పర సహకారం తీసుకోవాల్సిందిగా ఈ సదస్సులో అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న టెక్నాలజీ వ్యవస్థపై డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చారు. -
‘రైతుబంధు’ను వదులుకున్న డీజీపీ
సాక్షి, కూసుమంచి/తలకొండపల్లి : రైతుబంధు పథకం ద్వారా వచ్చిన రెండు చెక్కులను డీజీపీ మహేందర్‌రెడ్డి దంపతులు వదులుకున్నారు. మొత్తం రూ.1,59,080 లక్షల విలువ గల చెక్కులను గురువారం తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారు. మహేందర్‌రెడ్డికి ఖమ్మం జిల్లా కిష్టాపురంలో వ్యవసాయ భూమి ఉంది. రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం రూ.81,780 చెక్కు అందించింది. అయితే ఆ మొత్తాన్ని డీజీపీ తిరిగి ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించారు. ఆయన సూచన మేరకు సోదరుడు వెంకటరెడ్డి.. తహసీల్దార్ కృష్ణ, ఏఓ అరుణకుమారిని కలసి చెక్కును అందజేశారు. అలాగే.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని పడకల్ గ్రామంలో డీజీపీ సతీమణి అనిత పేరు మీద సుమారు 19 ఎకరాల భూమి ఉంది. ఇందుకు రూ.77,300 చెక్కును తహసీల్దార్ ఆర్పీ జ్యోతి అందజేశారు. అయితే.. గురువారం ఆ చెక్కును జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డికి డీజీపీ సతీమణి తిరిగిచ్చేశారు. ఆ డబ్బులను ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. -
న్యాయం దక్కకపోతే ఆమరణ దీక్ష
సాక్షి, హైదరాబాద్ : తమపై అధికార పార్టీ, సీఎం కేసీఆర్ కక్షకట్టి హక్కులను హరిస్తున్నారని ఎమ్మెల్యే లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్ ఆరోపించారు. తమను ఎమ్మెల్యేలుగా కొనసాగిస్తూ హైకోర్టు తీర్పునిచ్చినా గన్‌మెన్‌ను కేటాయించకుండా వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. తమ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, దీనిపై డీజీపీ మహేందర్‌రెడ్డిని కలసి వినతి పత్రం అందించామన్నారు. గురువారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కోర్టు తమను ఎమ్మెల్యేలుగా కొనసాగిస్తూ ఇచ్చిన తీర్పుపై సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టారన్నారు. తీర్పు వచ్చి 20 రోజులైనా తమకు గన్‌మెన్‌ను కేటాయించకపోవడం దారుణమన్నారు. పదవుల్లేని టీఆర్ఎస్ నేతలకు గన్‌మెన్‌ను ఇస్తున్నారని.. ఎమ్మెల్యేలమైన మాకు గన్‌మెన్‌ను అడిగితే సెక్యూరిటీ రివ్యూ కమిటీకి సూచి స్తామని డీజీపీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం హత్యకేసుల్లో నిందితులని, వారిపై పోరాటం చేస్తున్న తనకు ఏమైనా జరిగితే ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. న్యాయం దక్కకపోతే డీజీపీ, సీఎస్, అసెంబ్లీ సెక్రటరీలపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు. అక్రమ కేసులు ఆపకపోతే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని డీజీపీని కోరామన్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు తమ గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. -
వదంతులపై స్పందించిన డీజీపీ మహేందర్‌రెడ్డి
-
సుశీల్ కుటుంబాన్ని ఆదుకుంటాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మావోయిస్టుల కాల్పుల్లో మృతిచెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగూడెం ఎస్పీతోపాటు జిల్లా పోలీసులు సుశీల్ కుటుంబానికి ఆర్థిక సాయంగా రూ.2 లక్షలు అందించారు. ఈ చెక్కును సోమవారం రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో సుశీల్ భార్య, కుటుంబీకులకు డీజీపీ అందజేశారు. సుశీల్ భార్యకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక సాయం అందించిన పోలీసులను ఈ సందర్భంగా డీజీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ జితేందర్, పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి, సైబరాబాద్, ఖమ్మం అధ్యక్షుడు సీహెచ్.భద్రారెడ్డి, శ్రీనివాస్, గ్రేహౌండ్స్ డీఎస్పీ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ–ఆఫీస్.. పేపర్ లెస్ వర్క్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో పనులన్నీ ఈ–ఆఫీస్ వ్యవస్థ ద్వారానే నిర్వహించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రతీ ఫైలును కంప్యూటర్ల ద్వారానే ఆపరేట్ చేస్తూ ట్రాకింగ్, ఆమోద నిర్ణయాలు, నోట్ ఫైల్ తదితరాలన్నింటినీ ఆన్లైన్లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పేపర్ వినియోగం లేకుండానే పనులు పూర్తవుతాయని శాఖ భావిస్తోంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ కమిషనరేట్‌లో ఈ–ఆఫీస్‌ను ప్రారంభించారు. దీనికోసం ఇప్పటికే అన్నీ స్టేషన్ల ఎస్‌హెచ్‌వో, ఏసీపీ, డీసీపీ, అదనపు సీపీలకు శిక్షణనిచ్చారు. రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలోని మినిస్టీరియల్ స్టాఫ్, ఎగ్జిక్యూటివ్ స్టాఫ్‌కు శిక్షణ ఇస్తున్నారు. ఇన్‌వార్డు నుంచే ప్రతీ దరఖాస్తుకు నంబర్ ఇవ్వడం, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది, ఏ అధికారి వద్ద ఫైలు ఎన్ని రోజులు పెండింగ్‌లో ఉంది, తదితర వివరాలను ఆన్లైన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. జిల్లా పోలీస్ విభాగాల్లోనూ ఈ–ఆఫీస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో కేఎం ఆటమ్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం కొన్ని విభాగాలకే పరిమితమైంది. ఈసారి మాత్రం పోలీస్ స్టేషన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు అంతా ఆన్లైన్లోనే కార్యకలాపాలు సాగించేలా ఈ–ఆఫీస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిపై పోలీస్ అధికారులందరికీ శిక్షణ ఇవ్వాలని అధికారులను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. దశల వారీగా అన్ని జిల్లాల్లో ఈ–ఆఫీస్ అందుబాటులోకి వస్తుందని డీజీపీ కార్యాలయం తెలిపింది. -
జనసేన పార్టీకి చెడ్డపేరు వచ్చేలా కుట్రలు
-
కుట్ర జరుగుతోందంటూ పవన్ ఆందోళన
సాక్షి, హైదరాబాద్: తనపై, తన పార్టీపై కుట్ర జరుగుతోందంటూ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడల్లా కుట్ర జరుగుతోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిఘా వర్గా హెచ్చరికతో పవన్ కల్యాణ్ ఆగిపోయారని, అందుకే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పవన్ పర్యటనను వాయిదా వేసుకున్నారని జనసేన ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి వెల్లడించారు. తునిలో జరిగిన రైలు విధ్వంసం వంటి చర్యలకు పాల్పడి జనసేన పార్టీకి చెడ్డపేరు వచ్చేలా కుట్ర జరుగుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించి సమాచారం అందించాయి. పక్క రాష్ట్రాల నుంచి కిరాయి మూకలు తెచ్చి అల్లర్లు జరిగాయని, కొన్ని స్వార్థపర శక్తులు ప్రస్తుతం జనసేనను దెబ్బతీసే ప్రయత్నం చేశాయని ప్రకటనలో పేర్కొన్నారు. తొలుత ఈ నెల 21, 22, 23 తేదీల్లో శెట్టిపల్లిలో భూసేకరణ సమస్య, చిత్తూరు పట్టణంలో హైవే రోడ్డు నిర్మాణంలో బాధితులకు జరుగుతున్న అన్యాయం తెలుసుకునేందుకు పర్యటన ఖరారు చేశారు. ఈ నెల 30న కామన్వెల్త్ పోటీల్లో బంగారు పతకం సాధించిన తెలుగు తేజం, గుంటూరు జిల్లావాసి వెంకట రాహుల్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించాలని జనసేన అధినేత పవన్ భావించారు. కానీ నిఘా వర్గాల హెచ్చరికతో ప్రజలు, ప్రజా ఆస్తులకు నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో కార్యక్రమాలను పార్టీ వాయిదా వేసినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. -
వీఐపీల కోసం వారిని ఆపొద్దు..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖుల పర్యటనల నేపథ్యంలో వారి అధికారిక కాన్వాయ్‌ల కోసం అంబులెన్స్‌లతో పాటు అత్యవసర వైద్య సహాయం కోసం వెళుతున్న వారి వాహ నాలను ఆపవద్దని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల కమిషనర్లు ఇవి కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శనివారం జవహర్‌నగర్ ఠాణా పరిధిలోని దమ్మాయిగూడలో జరిగిన ఉదంతం మీడియాతో పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిపై స్పందించిన కేటీఆర్ అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ట్వీటర్ ద్వారా డీజీపీని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మహేందర్‌రెడ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అసలేమైందంటే.. బొల్లారం ప్రాంతానికి చెందిన వ్యాపారి జితేం ద్ర సురానా శనివారం తన ద్విచక్ర వాహనంపై వెళ్తుం డగా దమ్మాయిగూడ చౌరస్తాలో ఓ కారు ఢీ కొట్టింది. ఆయన కిందపడటంతో కుడి మోకాలు కింది భాగం విరిగింది. సురానా తన కుటుంబీకులకు ఫోన్ చేయగా వారు కారు తీసుకుని వచ్చారు. అంతా కలసి సురానను కారులో చేర్చినప్పటికీ ముందుకు వెళ్లడానికి అక్కడున్న పోలీసులు అనుమతించలేదు. ఆ సమయంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర ప్రముఖుల కాన్వాయ్‌లు ఆ మార్గంలో వెళ్లాల్సి ఉంది. దీంతో అర్ధ గంట పాటు తీవ్ర నొప్పితో బాధపడుతున్న సురానా అక్కడే కారులో ఉండిపోవాల్సి వచ్చింది. ఆపై ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేసి విరిగిన కాలును సరిచేశారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో పాటు విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని ట్వీటర్లో ఆదేశించారు. -
పరిధుల ప్రభావం ప్రజలపై వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘రాజధానిలో ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు సాంకేతికంగా వేరైనప్పటికీ ప్రజల దృష్టిలో మాత్రం ఒకటే. ఈ మూడింటిలో ఏకరూప పోలీసింగ్ ఉండాలి’అని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు చరిత్రలో తొలిసారిగా డీజీపీ మూడు కమిషనరేట్ల అధికారులతో భేటీ అయ్యారు. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో బుధవారం ‘యూనిఫాం సర్వీస్ డెలివరీ.. వన్ సిటీ–వన్ సర్వీస్–వన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది సిటిజన్’పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి అధికారులు, సిబ్బందికి కొన్ని కీలక సూచనలు చేయడంతో పాటు అనేక ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు ప్రశాంత జీవనంతో పాటు నేరరహిత సమాజాన్ని, పోలీసుల నుంచి జవాబుదారీతనంతో కూడిన మెరుగైన సేవల్ని కోరుకుంటారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వర్తించేలా ప్రతి పోలీసునూ మార్చాల్సిన బాధ్యత స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరించే ఇన్స్పెక్టర్లదని డీజీపీ స్పష్టం చేశారు. మూడు కమిషనరేట్లలోని ఏ ఠాణాకు వెళ్లినా ప్రజలకు ఒకే రకమైన స్పందన కనిపించాలని, బాధితుల సామాజిక–ఆర్థిక–వ్యక్తిగత హోదాల ఆధారంగా ఈ స్పందన మారకూడదని సూచించారు. సహయం కోరుతూ వచ్చిన బాధితులు/ప్రజలతో పోలీసుల వ్యవహారశైలి సక్రమంగా లేకుంటే ఆ ప్రభావం పోలీసు విభాగం మొత్తమ్మీద ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో మాదిరిగా మిగిలిన రెండింటిలోనూ టెక్నాలజీ వినియోగం పెరగాలని, ఫలితంగా నేరాల నిరోధం, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర రహిత సమాజం ఆవిష్కరించే ప్రయత్నాల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని డీజీపీ పేర్కొన్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ప్రారంభించిన నేను సైతం, కమ్యూనిటీ సీసీ కెమెరాలు వంటి ప్రాజెక్టులు, కమ్యూనిటీ పోలీసింగ్ విధానాలు మిగిలిన చోట్లా అమలు కావాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్న పోలీసు అధికారుల్ని డీజీపీ అభినందించారు. ప్రభుత్వం పోలీసు విభాగానికి అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తోందని, ప్రజలకు మేలైన సేవలు అందిస్తేనే సార్థకత ఉంటుందని సూచించారు. తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న అనేక చర్యలపై రూపొందించిన డాక్యుమెంటరీతో పాటు ప్రజల మన్నన పొందడానికి తీసుకోవాల్సిన అంశాలపై ముద్రించిన ప్రతిని డీజీపీ ఆవిష్కరించారు. సదస్సులో అదనపు డీజీ జితేందర్, హైదరాబాద్ ఇన్చార్జ్ సీపీ డీఎస్ చౌహాన్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు వీసీ సజ్జనార్, మహేష్ ఎం.భగవత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణలో చైల్డ్ ఫ్రెండ్లీ ప్రత్యేక కోర్టు!
సాక్షి, హైదరాబాద్ : లైంగిక వేధింపులకు గురయిన బాలల కోసం దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు అండగా నిలిచేందుకు ఇప్పటికే ప్రత్యేకంగా భరోసా సెంటర్‌ను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కిందని, ఈ భరోసా సెంటర్లో బాధితులకు కౌన్సెలింగ్‌తోపాటు పునరావాసం కల్పిస్తున్నామని ఆయన శనివారం విలేకరులకు తెలిపారు. గత రెండేళ్లలో పోక్సో (POCSO) చట్టం కింద బాలలపై నమోదైన వేధింపుల కేసులను భరోసా సెంటర్లో పరిష్కరించడం జరిగిందని తెలిపారు. కానీ వేధింపుల బారిన పడే బాలలకు అండగా ఉండేందుకు, వారికి సత్వర న్యాయం కల్పించడానికి ప్రత్యేకంగా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటుచేస్తున్నామని, పోక్సో చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టు విచారిస్తుందని ఆయన తెలిపారు. -
ప్రైవేటు బస్సులు రింగురోడ్డు దగ్గరే నిలిపేయాలి
హైదరాబాద్ : రవాణా శాఖ పై మంత్రి మహేందర్ రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మహేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రవాణా శాఖ రూ.3200 కోట్ల రెవెన్యూ టార్గెట్ సాధించిందని తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తున్నామని, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఏపీ రవాణా మంత్రితో కూడా సమావేశం అయ్యామని, త్వరలోనే మళ్లీ ఒకసారి సమావేశం అవుతామని చెప్పారు. ఇక మీదట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నగరంలో రాకుండా రింగ్ రోడ్డు దగ్గరే నిలిపివేయాలని ఆదేశించామని తెలిపారు. రింగ్ రోడ్డు నుంచి నగరం లోపలకు రావడానికి ఆర్టీసీ సర్వీసులు నడిపిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో రవాణా శాఖ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు త్వరలో నిర్మిస్తామని చెప్పారు. త్వరలో పూర్తి స్థాయి రవాణా శాఖ కమిషనర్‌ను నియమిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల కొరత ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. -
నయా జోష్!
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవలSనిర్వహించిన ప్రజాచైతన్య యాత్ర సక్సెస్ కావడంతో వారిలో నూతన ఉత్సాహం నిండింది. దీనికి తోడు ఏఐసీసీ (ఆలిండియా కాంగ్రెస్ కమిటీ)లో జిల్లా నేతలకు చోటు దక్కడంతో కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో గ్రామాల్లో పర్యటించి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ‘ప్రజల వద్దకు ప్రసాదన్న’ పేరుతో గ్రామాల్లో తిరుగుతూ జనంతో మమేకమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొని విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. సాక్షి, వికారాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపి స్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు నియోజకవర్గ కేంద్రా ల్లో ‘ప్రజా చైతన్యయాత్ర‘ పేరుతో ఆ పార్టీ నిర్వహించిన రెండు సభలు విజయవంతం కావడంతో కార్యకర్తలు, నాయకులు నూతన ఉత్సాహంతో ఉన్నారు. దీంతోపాటు సభలకు ప్రజల నుంచి ఆశించినస్థాయిలో స్పందన రావడంతో కేడర్‌లో సమరోత్సాహం పొంగిపొర్లుతోంది. ఈనేపథ్యంలో గ్రామాల్లో విస్తృతంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు నేతలు ఐకమత్యంగా ఉండాలని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. జనానికి చేరువయ్యే యత్నం.. కాంగ్రెస్ నేతలు ప్రజలకు చేరువయ్యే యత్నం చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌కుమార్, ఏ.చంద్రశేఖర్‌లు టికెట్ కోసం పోటీపడుతున్నారు. ఏడాదిగా ‘ప్రజల వద్దకు ప్రసాదన్న’ పేరుతో ప్రసాద్‌కుమార్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల వికారాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ ప్రజాచైతన్యయాత్ర సభకు ఆయనే నేతృత్వం వహించారు. అదేవిధంగా నెలకు నాలుగైదు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయ త్నం చేస్తున్నారు. అదేవిధంగా మరో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ సైతం తరచూ గ్రామా ల్లో పర్యటిస్తున్నారు. ఇద్దరు నేతల పర్యటనలతో గ్రామాల్లో పార్టీ బలం పుంజుకుంటోం దని కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు. వీరికి ‘టికెట్’ పోటీ లేదు.. పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే లు రామ్మోహన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి ఏఐసీసీలో చోటు దక్కింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విప్‌గాను నియమించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన వారంలో దాదాపు నాలుగైదు రోజులు గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. రామ్మోహన్‌రెడ్డికి నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీలో తిరుగులేకపోవడంతో ఆయనకు దాదాపుగా టికెట్ పక్కా అని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి గతేడాది టీడీపీకి రాజీనామా చేసి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొడంగల్‌లో ఆయనకు టికెట్ ఖాయమని నేతలు చెబుతున్నారు. రేవంత్‌రెడ్డితోపాటు ఆయన సోదరులు తిరుపతిరెడ్డి నియోజకవర్గంలో బాగా పర్యటిస్తున్నారు. రేవంత్‌రెడ్డి కేసీఆర్ కుటుంబంపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శల బాణాలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. తాండూరులో పరిస్థితి ఇదీ.. తాండూరు నుంచి మంత్రి మహేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాండూరు నుంచి కాంగ్రెస్‌లో మహారాజుల కుటుంబానికి చెందిన రమేష్‌కే టికెట్ లభించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ప్రజాచైతన్యయాత్ర విజయవంతం కావడంతో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అయితే, మహేందర్‌రెడ్డిని ఢీకొనడం అంత సులభసాధ్యం కాదనేది వాస్తవమని ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. డీసీసీ అధ్యక్షుడి నియామకం ఎప్పుడో..? పరిపాలనా సౌలభ్యం కోసం వికారాబాద్ జిల్లాను అక్టోబరు 11, 2016న ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పటికీ ఉమ్మడి జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా క్యామ మల్లేష్ కొనసాగుతున్నారు. ఆయన జిల్లాలో ఎప్పుడూ పర్యటించిన దాఖలాలులేవు. సభలు, సమావేశాలు జరిగిప్పుడు, లేదా రాష్ట్ర, జాతీయస్థాయి నేతలు వచ్చినప్పుడు మినహాయించి ఏనాడూ పర్యటించలేదు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిని నియమించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి డిమాండ్ పెరుగుతోంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు, త్వరలో సాధారణ ఎలక్షన్స్ సమీపిస్తున్న నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడిని నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ పేరు వినిపించినా కార్యరూపం దాల్చలేదు. ఇటీవల పలువురు జిల్లా నేతలకు ఏఐసీసీలో చోటు దక్కింది. ఎమ్మెల్యేలు టి.రాంమోహన్‌రెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రులు ప్రసాద్‌కుమార్, ఏ.చంద్రశేఖర్లకు ఏఐసీసీ కో ఆప్షన్ సభ్యులుగా నియమించడంతో పార్టీ కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. -
పర్మిట్ లేని బస్సులపై చర్యలు: మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పర్మిట్ లేని బస్సులపై చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ప్రైవేటు బస్సుల నిబంధనలు, ప్రభుత్వ చర్యలపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. జాతీయ రహదారులపై 100 కిలోమీటర్లు, ఆర్అండ్బీ రహదారులపై 60 కిలోమీటర్ల వేగం మించితే కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. పన్ను కట్టకుండా తిరిగిన బస్సులపై 730 కేసులు, పర్మిట్ లేని వాహనాలపై 591 కేసులు, తెలంగాణ పర్మిట్ లేని వాటిపై 432 కేసులు, సరుకు రవాణా ఉల్లంఘనలపై 136 కేసులు, 8 గంటలకు మించి డ్రైవర్లు పని చేసిన వాటిపై 118 కేసులు నమోదు చేశామని వివరించారు. -
లోకేశ్ అవినీతికి సంబంధించిన ఆధారాలున్నాయి
-
లోకేశ్‌పై మరో బాంబు పేల్చిన జనసేన
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌పై జనసేన మరో బాంబు పేల్చింది. మంత్రి లోకేశ్ అవినీతికి సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని జనసేన నేతలు చెబుతున్నారు. ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం లోకేశ్ అవినీతికి సంబంధించి తనకు అన్ని వ్యవహారాలు తెలుసునని, ఆధారాలున్నాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా లోకేశ్ అవినీతి భాగోతం తమకు తెలుసునంటూ జనసేన నేతలు అద్దేపల్లి శ్రీధర్, మహేందర్ రెడ్డి, రియాజ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు జనసేనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఇంకా చెప్పాలంటే ఆ ఎమ్మెల్యేలు ఎవరో కూడా సీఎం చంద్రబాబుకు తెలుసునని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ అవినీతి వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. ఆయన అవినీతిపై ఢిల్లీ స్థాయి ఏజెన్సీతో విచారణ చేపట్టాలని కోరుతామని తెలిపారు. త్వరలో ఏపీ మంత్రులు, వారి కుటుంబ సభ్యుల బండారం బయటపెట్టేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొన్న భూములకు సంబంధించి అన్ని లెక్కలు తమ వద్ద ఉన్నాయని ఆ పార్టీ నేతలు అద్దేపల్లి శ్రీధర్, మహేందర్ రెడ్డి, రియాజ్ వివరించారు. జనసేన పార్టీ ఆవిర్భావసభలో లోకేశ్ అవినీతిపై, చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాలపై పవన్ విమర్శించిన నేపథ్యంలో లోకేశ్, జనసేన మధ్య రాజకీయాలు వేడెక్కాయి. -
4నెలలు..4బాధ్యతలు
సాక్షి, సిటీబ్యూరో: సిటీపోలీస్ కమిషనర్‌గా పని చేస్తున్న మహేందర్‌రెడ్డి డీజీపీగా వెళ్లిన తర్వాత సిటీ బాధ్యతలు స్వీకరించిన వీవీ శ్రీనివాసరావు పేరిట అరుదైన రికార్డులు మిగిలిపోతున్నాయి. సుదీర్ఘకాలం పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్ఏసీ) పోలీసు కమిషనర్‌గా పని చేయడం ఒకటైతే... ఏకకాలంలో నాలుగు పోస్టులను నిర్వహించారు. వీటిలో మూడు అత్యంత కీలకమైనవి కావడం గమనార్హం. గతేడాది నవంబర్ 12 నుంచి సరిగ్గా నాలుగు నెలల పాటు ఎఫ్ఏసీ కమిషనర్‌గా పని చేసిన ఆయన సోమవారం (మార్చ్ 12) అంజనీ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ ప్రస్తుతం ఆయన చేతిలో అసలు పోస్టు అదనపు సీపీతో (శాంతిభద్రతలు) పాటు మరో రెండు ఉన్నాయి. వీటి అప్పగింతలు పూర్తయితే తప్ప పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు బాధ్యతలు తీసుకునే అవకాశం లేదు. దీనికి మరో మూడునాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంజనీ బదిలీతోనే ఆ స్థానంలోకి... ఐజీ హోదాలో ఉన్న వీవీ శ్రీనివాసరావు నగర పోలీసు కమిషనరేట్లోకి అంజనీ కుమార్ స్థానంలోనే వచ్చారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనురాగ్ శర్మ తొలి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో జరిగిన బదిలీల్లో నగర అదనపు పోలీసు కమిషనర్‌గా (శాంతిభద్రతలు) ఉన్న అంజనీ కుమార్ అదనపు డీజీగా (శాంతిభద్రతలు) బదిలీ అయ్యారు. అప్పట్లో ఆక్టోపస్‌లో పని చేస్తున్న వీవీ శ్రీనివాసరావు అంజనీ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అదే బాధ్యతల్లో ఉన్న ఆయన మహేందర్‌రెడ్డి డీజీపీగా వెల్లడంతో ఎఫ్ఏసీ కొత్వాల్ బాధ్యతలు స్వీకరించారు. గతేడాది నవంబర్‌లో మహేందర్‌రెడ్డిని ఇన్చార్జ్ డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే నాటికి నగర పోలీసు కమిషనర్ నియామకంపై ఓ స్పష్టత రాకపోవడంతో శ్రీనివాసరావును ఎఫ్ఏసీ సీపీగా నియమించింది. కొత్త అధికారి నియామకం జరిగినా... ఆయన రాకలో ఆలస్యం జరిగే పక్షంలో సదరు అధికారిని రిలీవ్ చేసేందుకు ఇన్చార్జ్ సీపీని నియమిస్తుంటారు. ఇందుకు సంబంధించి జారీ చేసే ఉత్తర్వుల్లో ఆయనకు హెచ్ఏసీ (హోల్డింగ్ అడిషనల్ చార్జ్) కమిషనర్‌గా నియమిస్తుంది. అంటే... సదరు అధికారి ఆయన విధులను నిర్వర్తిస్తూనే అదనంగా కమిషనర్ బాధ్యతలు చేపట్టాలని అర్థం. పర్యవేక్షణ మినహా హెచ్ఏసీ అధికారికి కొత్వాల్‌కు ఉండే ఇతర అధికారాలు ఉండవు. శ్రీనివాసరావుకు సంబంధించి ప్రభుత్వం అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయనను ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జ్) కమిషనర్‌గా నియమించింది. దీని ప్రకారం ఆయన అదనపు సీపీ బాధ్యతలు కాకుండా పూర్తి స్థాయిలో కొత్వాల్ బాధ్యతలనే నిర్వర్తించారు. ఆ తర్వాత మరోటి. అప్పటికే శ్రీనివాసరావు అదనపు సీపీ బాధ్యతలో పాటు క్రీడల విభాగం అదనపు డీజీ బాధ్యతలనూ నిర్వర్తిస్తున్నారు. ఎఫ్ఏసీ కమిషనర్‌గా నియామకం కావడంతో ఈయన కొత్వాల్‌గా కొనసాగుతూనే మొత్తం మూడు బాధ్యతలను నిర్వర్తించారు. సిటీకి కమిషనర్ నియామకం జరగకుండానే స్పెషల్ బ్రాంచ్ సంయుక్త పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్న ప్రమోద్‌కుమార్‌ను కొన్నాళ్ళ క్రితం ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఈ బాధ్యతల్నీ సైతం శ్రీనివాసరావుకే అప్పగించింది. ఇలా దాదాపు మూడు నెలల పాటు మొత్తం నాలుగు పోస్టులను ఆయన నిర్వర్తించారు. తాజా బదిలీల్లో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్‌గా నియమితులు కావడంతో సోమవారం సీపీ బాధ్యతలను అంజనీ కుమార్‌కు అప్పగించారు. అదనపు సీపీగా (శాంతిభద్రతలు) రానున్న డీఎస్ చౌహాన్, సంయుక్త సీపీగా (స్పెషల్ బ్రాంచ్) తరుష్జోషిలకు సైతం బాధ్యతలు అప్పగించిన తర్వాత శ్రీనివాసరావు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు బాధ్యతలు చేపట్టనున్నారు. అప్పటికే క్రీడల విభాగం అదనపు డీజీ పోస్టు ఆయన చేతిలోనే ఉంటుంది. త్వరలో ప్రభుత్వం పోలీసు విభాగంలో దాదాపు 18 వేల పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో శ్రీనివాసరావుకు కొత్త బాధ్యతలూ అత్యంత కీలకంగా మారనున్నాయి. -
ఆ ఆర్టీఏ అధికారులను సస్పెండ్ చేయండి
సాక్షి, హైదరాబాద్: వాహనాలు మనుగడలో ఉన్న కాలం, వాటి ధరలను మార్చి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దారిమళ్లించిన రంగారెడ్డి జిల్లాలోని బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలోని బాధ్యులైన నలుగురు అధికారులను సస్పెండ్ చేయాలని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన సచివాలయంలో రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ అవినీతి తతంగం పూర్వోత్తరాల గురించి వాకబు చేశారు. ఇలాంటి అవినీతి తంతు మరెక్కడా జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బండ్లగూడ కార్యాలయంలోని పురుషోత్తం అనే అధికారిని రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఖజానాకు నష్టంచేసిన రూ.1.20 కోట్లను రికవరీ చేయాలని పేర్కొన్నారు. ఇకనుంచి వాహనాల ధరలో కృత్రిమ డిస్కౌంట్ ఇచ్చి పన్ను ఎగ్గొట్టే వీలులేకుండా ఆన్లైన్ విధానాన్ని మార్చాలని, ప్రతి ఫైల్‌ను ఏవో స్థాయి అధికారి వరకు పరిశీలించాలని అన్నారు. రవాణా శాఖ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేయకుండా బ్లాక్ చైన్ సాంకేతిక విధానాన్ని అనుసరించాలని పేర్కొన్నారు. సమావేశంలో రవాణాశాఖ కార్యదర్శి సునీల్‌శర్మ, జేటీసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతలపై షీటీమ్స్ ఎక్స్పో
-
మహిళల భద్రత మాది
హైదరాబాద్: ‘మహిళల భద్రత తెలంగాణ ప్రభుత్వానిది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖను అభివృద్ధి చేశాం. శాంతిభద్రతలు అదుపులో ఉంటే రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించనట్లే’ అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీటీమ్స్ నేతృత్వంలో మహిళల భద్రతలపై అవగాహన కల్పించేందుకు ఇక్కడ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో రెండు రోజుల ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోను శనివారం ప్రముఖ నటి రాశీఖన్నా, తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు, అదనపు కమిషనర్(నేరాలు) స్వాతిలక్రా తదితర అధికారులతో కలసి నాయిని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులందరికీ బెంగళూరు రోబో మిత్ర స్వాగతం పలికింది. అనంతరం అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు మిత్ర చెప్పిన సమాధానాలు ఆకట్టుకున్నాయి. పోలీస్‌శాఖకు సహకరిస్తాం.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్న అధికారి స్వాతిలక్రా అని నాయిని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళల భద్రత దృష్ట్యా షీటీమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. షీటీమ్స్ సుదీర్ఘంగా పనిచేస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నాయని చెప్పారు. పోలీస్ శాఖ వల్ల తమ ప్రభుత్వానికి మంచి పేరు, ప్రఖ్యాతులు వచ్చాయన్నారు. పోలీస్‌శాఖకు అన్నివిధాలుగా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. షీటీమ్స్‌పై ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని తెచ్చేందుకు ఈవిధమైన ఎక్స్పోలను నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలోని మెట్రోపాలిటన్ సిటీల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ షీటీమ్స్ పనిచేస్తున్నాయని ప్రశంసించారు. నటి రాశీఖన్నా మాట్లాడుతూ.. మహిళలు, యువతులు లైంగిక వేధింపులను దైర్యంగా ఎదుర్కొని షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. షీటీమ్స్ ఇంతటి మంచి కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. అందరి నుంచి ప్రశంసలు: స్వాతిలక్రా షీటీమ్స్‌కు అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు అందుతున్నాయని షీటీమ్స్ ఇన్చార్జి స్వాతిలక్రా అన్నారు. మహిళలకు మరింత భరోసా కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 2వేల మందికి పైగా ఆకతాయిలను పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చామని, కొందరికి శిక్ష విధించామని వివరించారు. ఆఫీసుల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య 4వేలకు మించి ఉందన్నారు. -
ఇంత తక్కువా..?
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీఎస్డీఎఫ్) అమలు తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేటాయించిన నిధులు, ఖర్చు తీరును సమీక్షించి నివ్వెరపోయింది. మరో నెలన్నరలో వార్షిక సంవత్సరం ముగియనుండగా.. సగం నిధులు కూడా ఖర్చు చేయకపోవడంతో యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల తీరును పరిశీలించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ రామ్‌శంకర్ కఠారియా ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ ఎల్.మురుగన్, సభ్యులు కె.రాములు, యోగేంద్ర పాశ్వాన్, సంయుక్త కార్యదర్శి స్మితా చౌదరి బృందం రెండు రోజులపాటు హైదరాబాద్‌లో పర్యటించింది. ఎస్సీ సంక్షేమ సంస్థలు, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ శాఖలతో వేర్వేరుగా సమావేశమై పరిస్థితిని పరిశీలించింది. 2017–18లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి అమలు తీరును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితోపాటు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షించింది. అయినా మారలేదు.. 2017–18లో ఎస్సీఎస్డీఎఫ్ కింద రూ.14,375 కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు రూ.7 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయడంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. సగం కూడా ఖర్చు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. ఎస్సీ సబ్‌ప్లాన్ అమల్లో ఉన్నప్పుడూ పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు చేయలేదని, ఈసారి ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేసినా పరిస్థితి మాత్రం మారలేదని పేర్కొన్నారు. కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసినప్పుడే దళితులు అభివృద్ధి చెందుతారన్నారు. లక్ష్య సాధనలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ స్పష్టం చేసింది. వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఆర్అండ్బీ, పరిశ్రమలు, రుణ వితరణ శాఖలు పురోగతిలో తీవ్ర వెనుకబాటును ప్రదర్శిస్తున్నాయని అభిప్రాయపడింది. ఎస్సీఎస్‌డీఎఫ్‌లో ఉన్న అన్ని శాఖల పనితీరులో అంతరాలున్నట్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపైనా సమీక్షించింది. డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. దళితులపై దాడులు పెరుగుతున్నాయ్ రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నా యని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. హత్యలు, అత్యాచారాలు ఎక్కువైనట్లు తెలిపింది. పోలీసుల తీరుతో బాధితులు నష్టపోతున్నట్లు అభిప్రాయపడింది. దాడి జరిగిన వెంటనే కేసు నమోదు చేయాలని, కానీ కేసుల నమోదు, దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సభ్యులు పేర్కొన్నారు. అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదైతేనే బాధితులకు పరిహా రం వస్తుందని, కానీ నమోదులో జాప్యం జరగడంతో బాధితులకు పరిహారం సకాలంలో అందట్లేదన్నారు. కేసు నమోదు విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తోందని, బాధితులందరికీ కోర్టును ఆశ్రయించే చైతన్యం ఉండకపోవచ్చని అన్నారు. కేసుల నమోదులో జాతీయ సగటుతో పోల్చితే రాష్ట్రంలో తక్కువగా ఉందని కమిషన్ వైస్‌చైర్మన్ మురుగన్ అన్నారు. అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు, పరిహారం తది తర వివరాలతో నివేదికను సమర్పించాలని రాష్ట్ర పోలీసు శాఖకు స్పష్టం చేసినట్లు చెప్పారు. బాలికల అక్షరాస్యత తగ్గింది రాష్ట్రంలో దళిత బాలికల అక్షరాస్యత క్రమంగా తగ్గుతోందని కమిషన్ తెలిపింది. కారణాలను అన్వేషించాలని, బాలికల అక్షరాస్యత తగ్గడం ప్రమాదకరమని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఎస్సీ బాలికల డ్రాపౌట్ శాతం పెరుగుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పనితీరు బాగుందని సభ్యులు కితాబిచ్చారు. దళిత యువతుల వివాహానికి సంబంధించి అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం సత్ఫలితాలిస్తుందన్నారు. -
‘మిషన్’ పనుల్లో జాప్యం తగదు
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి : మిషన్ భగీరథ పనుల్లో జాప్యం తగదని, పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు రాజేంద్రనగర్‌లోని ఎలిమినేటి మాధవరెడ్డి తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో రంగారెడ్డి జిల్లా మిషన్ భగీరథ సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ రఘునందర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మహేందర్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో అధికారులు అలసత్వం వహించరాదన్నారు. పనులు ఏ మేరకు పూర్తయ్యాయి.. ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పాల్సిన అధికారులు తమ ఇష్టానుసారం మార్చి చివరి నాటికి పూర్తి చేస్తామనడం ఎంతవరకు సమంజసమని మంత్రి ప్రశ్నించారు. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి ముచర్ల ప్రాజెక్టుకు మార్చి 1 వరకు 70 ఎంఎల్డీ కెపాసిటీ గల ట్రీట్మెంట్ ప్లాంట్‌కు అందించేందుకు ప్రణాళికలను పూర్తి చేసుకోవాలని సూచించారు. ముచర్ల ప్రాజెక్టు నుంచి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, షాద్‌నగర్ నియోజకవర్గాలకు నీరును అందించే ప్రయత్నం చేయాలన్నారు. మిషన్ భగీరథ పనులలో భాగంగా షాద్‌నగర్ ప్రాంతంలో భూసేకరణ చేయడంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారని, అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకొని ముందుకు సాగాలన్నారు. మిషన్ భగీరథ పనులలో పైపులైన్ నిర్మాణాలలో ఎలాంటి ఆం దోళనలు జరగకుండా చూడాలన్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మకై పనులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, అంజయ్యయాదవ్, ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలు అన్నారు. మిషన్ భగీరథ పనులు చేపట్టిన పైపులైన్ నిర్మాణంతో పాటు జాయింట్ పనులను కూడా వెంటనే చేపట్టకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. లబ్ధిదారుడికి మేలుజాతి జీవాలను పంపిణీ చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యేలు పశుసంవర్థక శాఖ అధికారులకు సూచించారు. ఈ మేరకు కలెక్టర్ రఘునందన్‌రావు మాట్లాడుతూ... రూ.1.11 లక్షల విలువ గల ఆరోగ్యకరమైన జీవాలను అందిస్తామని, గ్రామీణ ప్రాంతాలలో జీవాల పెంపకానికి అనుగుణంగా 4–5 ఎకరాలలో షెడ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, నరేందర్‌రెడ్డి, సత్యనారాయణ, ఆంజనేయులు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ సమీక్ష అనంతరం బ్యాంకు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సబ్సిడీ రుణాలను అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి లబ్ధిదారుడికి స్థానికంగా ఉన్న అన్ని జాతీయ బ్యాంకులు సకాలంలో రుణాలను అందించి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంకు ఎల్డీఎం శాస్త్రీ, ఆర్బీఐ, ఎస్బీఐ అధికారులు పాల్గొన్నారు. -
శ్రీనివాస్ హత్య కేసులో మళ్లీ దర్యాప్తు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసుపై డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం సమీక్షించారు. వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నుంచి కేసు పూర్తి వివరాలను తెలుసుకున్నారు. శ్రీనివాస్ హత్య నుంచి నిందితుల అరెస్టు వరకు జరిగిన పరిణామాలన్నింటినీ స్టీఫెన్ రవీంద్ర ఓ నివేదిక రూపంలో డీజీపీకి అందించారు. దీంతో.. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు ఏయే అంశాల్లో నిర్లక్ష్యం వహించారు, నిందితుల కాల్‌డేటాలో ఉన్న నంబర్లు ఎవరివి, వారికి నిందితులకు ఉన్న సంబంధమేమిటి, హత్య జరిగిన రోజు, తర్వాతి రోజు పదే పదే వెళ్లిన ఫోన్‌కాల్స్ వివరాలేమిటన్న అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని స్టీఫెన్ రవీంద్రను డీజీపీని ఆదేశించినట్టు తెలిసింది. మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు! శ్రీనివాస్ హత్య జరిగిన జనవరి 24 నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నింటిపైనా డీజీపీ సమీక్షించడంతో కేసు కీలక మలుపు తిరిగినట్లయింది. ఇప్పటివరకు జరిగిన విచారణ అంతా గందరగోళంగా ఉండటం, కాల్‌డేటాను గాలికి వదిలేయడం, నిందితులను కస్టడీలోకి తీసుకోకపోవడం, కాంగ్రెస్ ఆరోపిస్తున్న అంశాలు.. వంటివన్నీ తేలనున్నాయి. ఇన్స్పెక్టర్ అదృశ్యం వెనక ఉన్న కారణాలు, ఒత్తిళ్లు వచ్చి ఉంటే అలా ఒత్తిడి చేసిందెవరన్న దానిపై నివేదిక ఇవ్వాలని కూడా డీజీపీ ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కేసుకు సంబంధమున్న ఎవరినీ వదిలిపెట్టవద్దని, ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకం సన్నగిల్లకుండా విచారణ జరగాలని ఆదేశించినట్టు సమాచారం. డీఎస్పీ, ఇన్స్పెక్టర్లతో ఐజీ భేటీ శ్రీనివాస్ హత్య కేసులో ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన నారాయణ్‌పేట్ డీఎస్పీ శ్రీధర్‌తో పాటు నల్లగొండ టూటౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం ఐజీ స్టీఫెన్ రవీంద్రను కలిశారు. కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. అయితే కాల్‌డేటాను విశ్లేషించడంలో నిర్లక్ష్యం, ఆ కాల్‌డేటాలోని గుర్తించి విచారించకపోవడంపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆరా తీసినట్టు తెలిసింది. అనుమానితులు పరారీ బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో కాల్‌డేటాతో పేర్లు బయటికి వచ్చిన వారంతా పరారీలో ఉన్నట్టు నల్లగొండ పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్టు వెల్లడించారు. ఒకవేళ వారికి హత్యతో సంబంధం లేకుంటే ఎందుకు పరారయ్యారు, కారణాలేమిటన్న దానిపై దర్యాప్తు జరపాలని... రాంబాబు, మల్లేశ్‌ల కాల్‌డేటాలోని మిగతా అనుమానాస్పద నంబర్ల విషయం తేల్చాలని ఇన్స్పెక్టర్, డీఎస్పీలను ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించినట్టు తెలుస్తోంది. -
డీజీపీ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో చేపట్టబో తున్న కార్యక్రమాలు, అమలు చేయాల్సిన పథకాలు మొత్తం కింది స్థాయిలోనే జర గాల్సి ఉంటుంది కాబట్టి ఆ శాఖలో కీల కంగా ఉన్న కానిస్టేబుల్ నుంచి ఎస్పీ స్థాయి అధికారులందరితో డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తొమ్మిది కమిషన రేట్లు, 18 జిల్లా పోలీస్ యూనిట్లలోని వేల మంది సిబ్బంది, అధికారులతో ములాఖత్ అయ్యారు. ప్రతీ స్టేషన్ పరిధిలో నమోదవు తున్న నేరాలు, వాటి నియంత్రణ చర్యలు, టెక్నాలజీ వినియోగం.. ప్రతీ అంశాన్ని సమీక్షించారు. 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలోని అన్ని విభాగా లపై మహేందర్‌రెడ్డి సమీక్ష పూర్తిచేశారు. వాళ్లే వెన్నెముక.. పోలీస్ శాఖ ఏ కార్యక్రమం చేపట్టినా అధికారులతోనే సమీక్షలు జరిగేవి. వెన్నెముకగా ఉన్న సిబ్బందికి ఎలాంటి సమాచారం లేకుండా, కార్య క్రమం ఏంటన్నది కూడా సరిగ్గా తెలియని పరిస్థితులుండేవి. కానిస్టేబుళ్లు, ఎస్ఐలే కీలకం కావడంతో భవిష్యత్‌లో చేపట్టబో తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై డీజీపీ వారికి దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీ పరం గా తీసుకురాబోతున్న మిషన్ 2018పై పూర్తి స్థాయిలో సిబ్బందికి వివరించారు. హైదరా బాద్‌లో నేర నియంత్రణకు చేపట్టిన చర్యలు, అందులో సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమె రాల ఏర్పాటు, లోక్‌అదాలత్, న్యాయ నిపుణుల సలహాలు.. ఇలా అనేక అంశాలపై వివరించారు. సిబ్బందికి రావాల్సిన ప్రోత్సా హకాలు, పదోన్నతులపై క్లారిటీ ఇచ్చారు. ప్రతినెలా పోలీస్‌స్టేషన్‌వారీగా ఉత్తమ సిబ్బంది ఎంపిక, ప్రోత్సాహకం అందించ డంపై నమ్మకాన్ని కల్గించారు. డీజీపీ ప్రతి సబ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడటంతో వారిలో ఆనందం వ్యక్తమైంది. సూచనలు నేరుగా ఇవ్వడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
నేర రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం డీజీపీ
ఉట్నూర్(ఖానాపూర్): పోలీసు వ్యవస్థ నిర్మాణం ప్రజా వ్యవస్థ నిర్మాణంగా మారినప్పుడే సత్ఫలితాలు వస్తాయని, రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రతీ పోలీసు ముందుకు సాగాలని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా అదివారం నార్త్ జోన్ డీఐజీ నాగిరెడ్డి, కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్‌లతో కలిసి ఆయన ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్‌లో పర్యటించారు. అనంతరం నిర్మల్, ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్మాణం ప్రజలకు దగ్గర అయినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రతి పోలీసులు ముందుకు సాగాలన్నారు. పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండేట్లు విధులు నిర్వహించాలన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఒకే తరహాలో సిబ్బంది పని తీరు ఉండేలా మార్పులు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఉట్నూర్ ఏజెన్సీలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంలో పోలీసుల తీరు అభినందనీయమన్నారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, నిర్మల్, కుమురం భీం జిల్లా అదనపు ఎస్పీలు దక్షిణమూర్తి, గోద్రు, డీఎస్పీలు వెంకటేశ్, నర్సింహారెడ్డి, రాములు, సాంబయ్య, సత్యనారాయణ, సీఐలు, ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ధనిక, పేద తేడాలు వద్దు
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): ధనికులు, పేదలు అని తేడా చూపకుండా న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారందరికీ గౌరవ మర్యాదలు ఇవ్వాలని డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లా పోలీసులకు సూచించారు. ఇది పక్కగా అమలైతేనే పోలీసులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. రాష్ట్ర పోలీస్‌శాఖ ప్రవేశపెడుతున్న సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. శుక్రవారం హెలిక్యాప్టర్‌లో జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన ముందుగా డీపీఓలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ జిల్లాలోని 33 పోలీస్స్టేషన్లలో ఒకే రకమైన పౌర సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు టెక్నాలజీని బాగా వాడుతున్నారని, రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయని కితాబిచ్చారు. ఇదంతా ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం ఏర్పాటు చేసుకోవటంతోనే సాధ్యమైందని, దీనిని ఇలాగే కొనసాగించాలని సూచించారు. సీసీ కెమోరాలతో ఉపయోగం ఎంతోఉందని, జిల్లా కేంద్రంతో పాటు, జిల్లాలోని ముఖ్యపట్టణాలలో మరికొన్ని సీసీ కెమోరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తాను ఈ జిల్లాలో ఎస్పీగా పనిచేసిన రోజులను గుర్తు చేశారు. పోలీస్‌శాఖలో ఖాళీలు, మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందిస్తున్న పౌర సేవలు, శాంతిభద్రతల నిర్వహణ వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ కార్తికేయ 2017 సంవత్సరంలో జిల్లాలో పోలీస్‌శాఖ పనితీరు, అచీవ్మెంట్ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పోలీసు సేవలను మెరుగు పరుస్తామని అన్నారు. పోలీసుశాఖ పని పద్ధతుల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడతామని, ఉద్యోగుల్లో నైపుణ్యతను పెంచే కార్యక్రమాలు చేపడతామన్నారు. రాత్రీపగలు తేడా లేకుండా పొలీసు సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. డీపీజీ వచ్చిన హెలికాప్టర్ పాలిటెక్నిల్ మైదానంలో ల్యాండ్ అయ్యింది. డీజీపీ వెంట హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర వచ్చారు. వీరికి నిజామాబాద్ రేంజ్ డీఐజీ ఎన్ శివశంకర్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయ, డిచ్పల్లి బెటాలియన్ కమాండెంట్ ఎన్వీ సాంబయ్య, డీసీపీలు శ్రీధర్‌రెడ్డి, ఆకుల రాంరెడ్డి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుండి డీజీపీ నేరుగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకోగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు సుదర్శన్, శివకుమార్, రఘు, ఎన్ఐబీ ఏసీపీ రవీందర్‌లు స్వాగతం పలికారు. డీజీపీ పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. డీజీపీ పోలీస్ కార్యాలయంలోని సీసీ టీవీ కంట్రోల్ రూంను సందర్శించి, వాటి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్రావు, ఎస్బీ సీఐ వెంకన్న, జిల్లాలోని అన్ని సర్కిళ్ల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. -
నేడు నేరస్తుల సమగ్ర సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురు వారం నేరస్తుల సమగ్ర సర్వే నిర్వహించ నున్నట్లు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం తెలిసారు. పదేళ్ల కాలంలో పోలీసు రికార్డుల్లో ఉన్న నేరగాళ్ళ ఇళ్లకు అధికారులు వెళ్లి వారి వివరాలను నమో దుచేస్తారని తెలిపారు. అలాగే వారి ఇళ్లనూ జియో ట్యాగింగ్ చేసి టీఎస్ కాప్ యాప్‌లో పొందుపరచ నున్నామన్నారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయిల అధికారులు ఈ సర్వేలో పాల్గొనను న్నారు. త్వరలో 18 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. జాబితా ఆధారంగా.. 2008–2017 మధ్య ఒకటి కంటే ఎక్కువసార్లు అరెస్టు అయిన నిందితులు చెప్పిన చిరునామాలతో రూపొందించిన జాబితాల ఆధారంగా సర్వే జరగ నుంది. నేరస్తుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు, కదలి కలు ఏంటి వంటి తదితర వివరాలు సేక రించడంతో పాటు అవసరమైతే సమీపం లో ఉండే బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్ళి ఆరా తీస్తారు. తాజా చిరునామా లతో వారు నివసిస్తున్న ప్రాంతాల వారీ గా జాబితాలు రూపొందిస్తారు. పూర్తయ్యే వరకూ సర్వే నేరస్తుడి ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి టీఎస్ కాప్ యాప్‌లో పొందుపరుస్తారు. గస్తీ నిర్వహించే రక్షక్, బ్లూకోల్ట్ సిబ్బందికి ఇచ్చే ట్యాబ్స్‌లో ఈ యాప్ ఉంటుంది. ఈ ట్యాబ్ ఆధారంగానే నేరగాళ్ళ ఇళ్ళకు ఆయా సిబ్బంది వెళ్ళాల్సి ఉంటుంది. గురువారం సర్వే పూర్తి కాని నేపథ్యంలో పూర్తయ్యేవరకూ కొనసాగుతుందని, ప్రతి నేరస్తుడి ఆచూకీ కనిపెట్టి, వివరాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ సర్వే నేపథ్యంలో స్థాని కులు తమకు సహకరించాలని కోరారు. -
పోలీసు అధికారుల పనితీరుకు రేటింగ్
సాక్షి, మహబూబాబాద్/వరంగల్ క్రైం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో పోలీసు అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు.. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు రాష్ట్రంలో థర్డ్‌పార్టీ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. పోలీస్స్టేషన్లలో అందుతున్న సేవలపై ప్రజల సంతృప్తి ఆధారంగా రేటింగ్ ఇస్తామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలవుతుందని.. ధనిక పేద, ఆడ, మగ తేడాలు లేకుండా ఒకే విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంను ప్రారంభించారు. కమిషనరేట్‌లోని పలు విభాగాలను పరిశీలించారు. జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(ఎన్ఐటీ)లో కమిషనరేట్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు(డీసీపీ), అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ), ఇన్స్పెక్టర్లు, వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. గుమ్ముడూరులోని సర్వేనంబరు 287లో జిల్లా పోలీసు కార్యాలయానికి కేటాయించిన స్థలాన్ని, జిల్లా పోలీసు కార్యాలయాన్ని పరిశీలించారు. -
టెక్నాలజీ ఫ్యూషన్ సెంటర్ ప్రారంభించిన డీజీపీ
హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో టెక్నాలజీ ఫ్యూషన్ సెంటర్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. కొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్, ట్రాఫిక్ కమాండ్ సెంటర్, సోషల్ మీడియా ల్యాబ్, డయల్ హాక్ ఐ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నూతన సాంకేతికతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని వ్యవహారాలను ఫ్యూషన్ సెంటర్‌తో అనుసంధానం చేయవచ్చన్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్‌ను అనుసంధానించవచ్చు అని పేర్కొన్నారు. ఈ ఫ్యూషన్ సెంటర్ నేర శాతాన్ని తగ్గించడానికి దోహదపడుతుందని స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కాగానే ఈ టెక్నాలజీ సెంటర్‌ను అక్కడికి తరలిస్తామని వెల్లడించారు. పోలీసు శాఖ టెక్నాలజీకి మారుపేరుగా మారుతుందని డీజీపీ అన్నారు. జిల్లాల్లో ఉన్న మినీ కమాండ్ కంట్రోల్‌తో ఈ ఫ్యూషన్ సెంటర్‌ను అనుసంధానం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్న విధంగా శాంతి భద్రతలను కాపాడుతామని తెలిపారు. టెక్నాలజీకి మారుపేరుగా మారిన హైదరాబాద్‌కు పెట్టుబడులను ఆకర్షించే విధంగా తమ వంతు కృషి చేస్తామని డీజీపీ పేర్కొన్నారు. -
పోలీసు చేతికి వజ్రాయుధం!
రాష్ట్ర పోలీసుల చేతికి ‘టెక్నాలజీ’వజ్రాయుధం అందింది. నేరాల నియంత్రణ నుంచి పరిశీలన, దర్యాప్తు, విచారణల తీరు దాకా అన్ని అంశాలూ అరచేతిలోనే ఇమిడిపోయేలా ‘టీఎస్ కాప్’అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ స్థాయి పోలీసింగ్‌కు తోడ్పడేలా రూపొందిన ఈ యాప్‌ను సోమవారం హైదరాబాద్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐపీఎస్ అధికారులతో కలసి ఆవిష్కరించారు. దీనిని తొలుత పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లో పరిశీలించగా.. పెట్రోలింగ్ సిబ్బంది, సెక్టార్ ఎస్సైలు, బ్లూకోల్ట్స్ సిబ్బందికి చాలా ఉపయోగపడింది. మంచి ఫలితాలను సాధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి అందుబాటులోకి తీసుకువచ్చారు. పోలీసు శాఖలోని దాదాపు 14 ప్రధాన విభాగాలు టీఎస్ కాప్ యాప్‌ను ఉపయోగించుకునేలా రూపొందించినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. – సాక్షి, హైదరాబాద్ పకడ్బందీ దర్యాప్తునకు అప్పటికప్పుడు ఘటనా స్థలం (ఫీల్డ్)లోనే ఫిర్యాదు తీసుకోవడం, అక్కడే ఫొటోలు, వీడియోలు తీసుకోవడం, సాక్షుల వాంగ్మూలం తీసుకుని యాప్‌లో అప్లోడ్ చేయడం, ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదుల పరిస్థితులను పర్యవేక్షించడం, రోజూ కేసుల దర్యాప్తును పరిశీలించడం ఈ యాప్‌తో చేయవచ్చు. డీఎస్ఆర్లు సైతం యాప్ ద్వారా పంపించడం, స్వీకరించడం, అనాలిసిస్ చేయడం, రిపోర్ట్ అప్డేట్ చేయ డం వంటివాటికీ తోడ్పడుతుంది. సిబ్బంది హెచ్ఆర్ విషయాల్లోనూ.. పోలీసు అధికారులు, సిబ్బంది పే స్లిప్‌లు, లీవ్ మేనేజ్మెంట్, డైలీ పెర్ఫార్మెన్స్, ఆరోగ్య భద్రత స్కీమ్, సర్వీసు రికార్డులు, బదిలీ వ్యవహారాలతో పాటు శిక్షణకు సంబంధించిన అంశాలు కూడా యాప్‌లో అందుబాటులోకి రానున్నాయి. కోర్టులు, విచారణాంశాలు కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లు, విచారణ ఏ దశలో ఉందన్న విషయాలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. కోర్టు కానిస్టేబుళ్లు ప్రతి విషయాన్ని యాప్ ద్వారా అప్డేట్ చేస్తారు. స్టే ఆర్డర్లు, అప్పీళ్లు, పరిష్కరించిన కేసులు, నోటీసులు, సమన్లు, వారెంట్లు, రోజువారీ కేసు డైరీలు వంటివీ పరిశీలించవచ్చు. నిఘా వేయడంలోనూ తోడ్పాటు నేరాలు జరగకుండా ప్రతిక్షణం అప్రమత్తం చేసే ఇంటెలిజెన్స్ డ్యూటీలోనూ టీఎస్ కాప్ యాప్ కీలకం కానుంది. ఇంటిగ్రేటెడ్ పీపుల్స్ ఇన్ఫర్మేషన్ హబ్‌గా ఉపయోగపడుతుంది. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన వ్యూహాలను సైతం ఇంటెలిజెన్స్ విభాగం ఈ యాప్ ద్వారా అధికారులకు చేరవేయనుంది. నేర నియంత్రణకు చర్యలు నేరం జరగకుండా చర్యలు చేపట్టేందుకు కావాల్సిన అంశాలు యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ టవర్లు, ప్రవేశ, నిష్క్రమణ దారులు, లుక్ ఔట్ నోటీసులు, పదే పదే నేరాలకు పాల్పడే వారి జాబితా, నేరస్థలంలో సేకరించాల్సిన ఆధారాలు, నిందితులకు సంబంధించి 360 డిగ్రీ ప్రొఫైల్, ఇతర రాష్ట్రాల్లోని నేరస్తుల జాబితాలు, రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాల సీసీ కెమెరాలు వంటి వాటిని ఈ యాప్ ద్వారా చెక్ చేయవచ్చు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎన్ఫోర్స్మెంట్, చలానాలు, స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలు, సిబ్బంది డ్యూటీలు, ఉల్లంఘనుల జాబితా, ల్యాండ్ మార్క్‌లు, ప్రమాదాల హాట్ స్పాట్లు, వాటి గుర్తింపు, అనాలి సిస్, వాటర్ లాగింగ్ ప్రాంతాలు, పార్కింగ్ వివరాలు తదితర సమా చారాన్ని యాప్‌తో పొందవచ్చు. అందుబాటులో విస్తృత సమాచారం డయల్ 100కు వచ్చే ఫోన్‌కాల్ నుంచి నేరం, దర్యాప్తు, నిందితుల గుర్తింపు, చార్జిషీటు.. శిక్ష పడిన విషయం వరకు ప్రతి అంశంలో టీఎస్ కాప్ యాప్ సిబ్బందికి ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో 54 సర్వీసులను 8 విభాగాలుగా పొందుపరిచారు. యాప్ వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు 2,500 ట్యాబ్‌లు ఇచ్చినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. అయితే ఈ 54 సర్వీసులను యాప్‌లో అందుబాటులో ఉన్న రూల్ ఆఫ్ డ్యూటీ ప్రకారం ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. అన్ని సర్వీసులు అందరు సిబ్బందికి ఓపెన్ కావన్నారు. క్రైమ్ సిబ్బందికి నేర నియంత్రణ, ట్రాఫిక్ వాళ్లకు ట్రాఫిక్ మేనేజ్మెంట్.. ఇలా ఏ విభాగం సిబ్బందికి అవసరమైన సమాచారం వారికి అందుబాటులో ఉంటుందన్నారు. సిబ్బందికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. నేరస్తుల గుర్తింపు, నిర్ధారణ అంశాలు నేరం జరిగిన ప్రాంతంలో అనుమానిత వాహనాలు, వ్యక్తుల వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ చిరునామా పరిశీలన వంటి వివరాలను యాప్ ద్వారా క్షణాల్లో పొందవచ్చు. నేరం చేసిన తీరును బట్టి ఏ ముఠా చేసింది, ఇంతకు ముందు ఈ తరహాలో నేరం జరిగిందా అన్నది పరిశీలించవచ్చు. ముఠాల్లోని నేరస్తులు, వారి హిస్టరీ షీట్ డేటా బేస్ అందుబాటులో ఉంటుంది. శిక్ష అనుభవించి జైల్లోంచి విడుదలైన వారి జాబితా, క్రైమ్ మ్యాపింగ్, ఆన్లైన్ ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ కూడా కీలక తోడ్పాటు ఇవ్వనున్నాయి. శిక్ష పడిన నేరస్తులు, నిందితులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న 16 వేల కోర్టుల నుంచి సమాచారం అందుబాటులో ఉండటం మరో ప్రత్యేకత. అత్యవసర స్పందన (ఎమర్జెన్సీ రెస్పాన్స్) బాధితులు డయల్ 100కు కాల్ చేయడం, కాల్ సెంటర్ నుంచి పెట్రోలింగ్ వాహనాన్ని అలర్ట్ చేయడం ఈ యాప్ సాయంతో సులువవుతుంది. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసు సిబ్బంది ఘటన తీవ్రతను బట్టి యాప్ ద్వారా దగ్గర్లో ఉన్న మిగతా పెట్రోలింగ్ వాహనాలను, దగ్గర్లోని పోలీసు అధికారులను అప్రమత్తం చేయవచ్చు. యాప్‌లోని బజర్ నొక్కడం ద్వారా అదనపు బలగాలను ఘటనా స్థలికి రప్పించుకోవచ్చు. -
పోలీస్ శాఖలో పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్లకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఇయర్ ఎండ్ ట్రీట్ ఇచ్చారు. 2007 బ్యాచ్‌కు చెందిన డైరెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్లకు, కొంత మంది ర్యాంకర్లకు ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జోన్, హైదరాబాద్ జోన్ కలిపి రాష్ట్రవ్యాప్తంగా 410 మంది సబ్ ఇన్స్పెక్టర్లకు ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి లభించింది. వీరిలో అధికంగా 2007 బ్యాచ్‌కు చెందిన సబ్ఇన్స్పెక్టర్లుండగా, వరంగల్ జోన్‌లోని 2009 బ్యాచ్‌కు చెందిన కొంత మంది సబ్ఇన్స్పెక్టర్లు సైతం ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందారు. వరంగల్ జోన్లో 162 మందికి, హైదరాబాద్ జోన్లో 248 మందికి పదోన్నతులు లభించాయి. కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించాలని ఉన్నతాధికారులు భావించారు. అయితే కొంతమంది ఏఆర్, స్పెషల్ పోలీస్ నుంచి సివిల్లోకి కన్వర్షన్ అయిన కానిస్టేబుళ్లు హైకోర్టుకెళ్లి సీనియారిటీపై స్టే తీసుకువచ్చారు. దీంతో పదోన్నతులకు అంతరాయం ఏర్పడినట్లైంది. అయితే సీనియారిటీ జాబితాపై హైకోర్టుకు నివేదికిచ్చిన తర్వాత పదోన్నతుల ప్రక్రియను చేపడతామని ఉన్నతాధికారులు తెలిపారు. -
మిషన్ 2018 - 8 లక్ష్యాలు
సాక్షి, హైదరాబాద్ : పూర్తి భద్రమైన రాష్ట్రం కోసం పోలీసు శాఖ ‘నూతన’ఒరవడి వైపు అడుగులు వేస్తోంది. నూతన సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు, టెక్నాలజీ వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి ‘మిషన్–2018’పేరిట ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంవత్సరాంత మీడియా కాన్ఫరెన్స్‌లో దీనిని విడుదల చేశారు. ఎనిమిది లక్ష్యాలతో ఈ కార్యాచరణను అమలు చేయనున్నట్లు డీజీపీ తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్ కాప్ యాప్‌ను మరింత విస్తృతపరిచి రాష్ట్ర పోలీసులందరికీ అందుబాటులో ఉండేలా ‘టీఎస్ కాప్’యాప్‌ను తీసుకువస్తున్నామని చెప్పారు. పోలీసు సిబ్బందికి నేర నియంత్రణ, దర్యాప్తులో మెళకువల కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్, మహిళల భద్రత, ఎమర్జెన్సీ రెస్పాన్స్, సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సర్వీస్ తదితర వ్యవస్థలన్నింటినీ త్వరలోనే జిల్లా పోలీసు విభాగాల్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సమాజ భద్రత కోసం హైదరాబాద్‌లో అమలుచేస్తున్న ‘నేను సైతం’ కార్యక్రమాన్ని జిల్లాల్లోనూ అమలుచేస్తామని తెలిపారు. డీజీపీ వెల్లడించిన 8 లక్ష్యాలివీ సేవల్లో పురోగతి ప్రజలు సంతృప్తి చెందేలా పోలీసు సేవలను అందించాలని నిర్ణయించారు. ఏదైనా ఘటన జరిగిన ప్రాంతానికి అతి త్వరగా చేరుకునేందుకు కార్యాచరణ అమలు చేస్తారు. పోలీసులు ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నామని డీజీపీ వెల్లడించారు. ఆన్లైన్ సర్వీస్, ఫీడ్ బ్యాక్, కొత్త యాప్స్, పబ్లిక్ అలర్ట్ వంటివి దీని కిందకు వస్తాయని తెలిపారు. సమర్థవంతంగా నేరాల నియంత్రణ సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, ముఠాలు, గ్యాంగులను నియంత్రించడంతోపాటు కొత్తగా పుట్టుకువచ్చే నేరాలను మొగ్గలోనే తుంచేందుకు ‘కంబాట్ ఎగ్జిస్టింగ్ అండ్ ఎమర్జింగ్ క్రైమ్’పేరుతో కార్యాచరణ అమలు చేస్తారు. నేరాల దర్యాప్తులో అధికారులు, సిబ్బందికి మెళకువలు, ప్రొఫెషనలిజం పెంపొందించడం, జాతీయ, అంతర్గత భద్రత వ్యవహారాలు, బెదిరింపులకు తగ్గట్టుగా చర్యలు చేపట్టడం దీనిలో కీలకంగా ఉంటాయని డీజీపీ తెలిపారు. పునర్నిర్మాణం–పటిష్టత ప్రస్తుతం పోలీసు శాఖలో ఉన్న వివిధ విభాగాలను పునర్నిర్మించి మరింత పటిష్టంగా పనిచేసేలా కార్యాచరణ (ఆర్గనైజేషన్ బిల్డింగ్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్) చేపడతారు. ప్రత్యేక విభాగాల పటిష్టానికి కృషి, క్రాక్‌జాక్ సెంటర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, స్టేషన్ హౌజ్ మేనేజ్మెంట్, జెండర్ రీసోర్స్ సెంటర్, ఆన్లైన్ ట్రైనింగ్ మోడల్స్, సిబ్బంది, అధికారుల వైఖరిలో మార్పు తదితర అంశాలు ఈ ప్రణాళిక కిందకు వస్తాయి. వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ పోలీసు సిబ్బందిలో కెరీర్ మేనేజ్మెంట్, శిక్షణకు సంబంధించి ప్రత్యేక అంశాలు దీని కిందకు వస్తాయి. ఉద్యోగి చేసే పనులు, వాటి ఫలితాలు, తగిన ప్రోత్సాహకాలు, సంక్షేమం, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్, ఎఫ్ఎస్ఎల్, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో తదితరాలన్నింటిలో ఈ కార్యచరణ కీలకంగా మారనుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం టెక్నాలజీని వినియోగించుకుని నిఘా (స్మార్ట్ సర్వైలెన్స్), కమాండ్ కంట్రోల్ సిస్టమ్, సైబర్ టెక్నో కమాండ్ సెంటర్, స్మార్ట్ పోలీసింగ్ అంశాలను అందుబాటులోకి తెస్తారు. తద్వారా సైబర్ నేరాల నియంత్రణ, 360 డిగ్రీ ప్రొఫైల్, జియోట్యాగ్ మ్యాపింగ్, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణ, ఇంట్రిగేటెడ్ డేటాబేస్ తదితరాలన్నీ ఎప్పటికప్పుడు, ఎలా పనిచేయాలన్నదాని కోసం ఈ ప్రణాళిక రూపొందించినట్టు డీజీపీ తెలిపారు. కమ్యూనిటీ భాగస్వామ్యం, నిపుణుల పర్యవేక్షణ ప్రజల భాగస్వామ్యం, నిపుణులు సలహాలు, సహాయంతో నేరాల నియంత్రణకు కృషిచేయడం ఈ కార్యచరణలోకి వస్తాయి. ఇందులో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ, నవ సమాజ స్థాపనకు కావాల్సిన అంశాల స్వీకరణ, స్టూడెంట్ పోలీస్ కేడర్ కార్యక్రమాలు, అకడమిక్ ఇన్పుట్స్ ఫార్ములా తదితరాలు ఉంటాయి. రోడ్డు భద్రత, ట్రాఫిక్ మేనేజ్మెంట్ రోడ్డు ప్రమాదాల నియంత్రణ, సమీకృత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ, క్యాష్‌లెస్ చలాన్లు, రోడ్ సేఫ్టీ పోలీస్స్టేషన్లు, గోల్డెన్ అవర్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్, ప్రత్యేక రోడ్‌సేఫ్టీ విభాగం ఏర్పాటు ఈ కార్యాచరణలోకి వస్తాయి. ఇందులో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు, అభివృద్ధి, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక యాప్స్ రూపకల్పన, ఇంటిగ్రేటెడ్ డేటా మెయింటెనెన్స్, ఆటోమేటెడ్ ఎన్ఫోర్స్మెంట్, లైసెన్సుల సస్పెన్షన్ తదితర అంశాలు ఉంటాయి. భద్రమైన ప్రాంతాలుగా మార్చడం (సేఫర్ అవర్ సిటీస్ సేఫర్) సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ, అర్బన్ ప్రాంతాల భద్రతకు పటిష్ట చర్యలు, డిజిటల్ సెక్యూరిటీ సర్వీస్ సెంటర్ ఏర్పాటు, నేర నియంత్రణ కోసం వ్యూహాల రచన, ఉగ్రవాద నియంత్రణకు స్పెషల్ స్క్వాడ్స్, భారీ వాణిజ్య ప్రాంతాలు, భవనాల భద్రతకు స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్ తదితరాలను ఈ ప్రణాళికలో భాగంగా అమలు చేస్తామని డీజీపీ వెల్లడించారు. అంతా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే.. అన్ని జిల్లాల్లోని హెడ్క్వార్టర్లు, ప్రధాన పట్టణాలు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న సీసీ కెమెరాలను అక్కడి కమాండ్ సెంటర్లకు అనుసంధానం చేస్తారని డీజీపీ వెల్లడించారు. ఆ కమాండ్ సెంటర్లను హైదరాబాద్‌లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తామని చెప్పారు. జీపీఎస్ ఆధారిత గస్తీ వాహనాలు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. మరిన్ని వాహనాలు కొనుగోలు చేసి.. జిల్లా పోలీసు యంత్రాంగాలకు అందిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో సోషల్ మీడియా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని.. తద్వారా పుకార్ల నియంత్రణ, వాటి ద్వారా జరిగే నష్టాలను నిరోధించవచ్చని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు క్లూస్‌టీంలు, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్లను త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. -
ప్రజల్లో నమ్మకాన్ని పెంచాం
సాక్షి, హైదరాబాద్ : ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకాన్ని, ధైర్యాన్ని పెంచామని.. ఇందుకోసం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. ఈ ఏడాది నవంబర్ నాటికి రాష్ట్రంలో నమోదైన నేరాలు, ఇతర అంశాలపై శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నేరాలపై ఫిర్యాదులు పెరిగాయని, ప్రజల్లో పోలీసులంటే నమ్మకం ఏర్పడటమే దీనికి కారణమని డీజీపీ చెప్పారు. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది 12.93 శాతం నేరాల పెరుగుదల కనిపిస్తోందని అన్నారు. గ్యాంగ్‌లు, వ్యవస్థీకృత నేరాలను పక్కాగా నియంత్రించామని, మహిళా రక్షణ విషయంలో గణనీయమైన ఫలితాలు సాధించామని చెప్పారు. పోలీసులు యూనిఫాం ధరించిన అధికారులైతే, ప్రజలు యూనిఫాం లేని అధికారులుగా మారాలని డీజీపీ పేర్కొన్నారు. ప్రజల సహకారంతోనే విజయవంతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సభలు, సమావేశాల వంటి పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలతోపాటు బోనాలు, గణేశ్ నిమజ్జనం, రంజాన్ వంటి పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ çపక్కాగా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిందని డీజీపీ చెప్పారు. ఇదంతా ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. చిన్నారుల కళ్లలో వెలుగు.. సీఐడీ నేతృత్వంలో అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలు సాధించినట్టు డీజీపీ తెలిపారు. ఆపరేషన్ స్మైల్ 3వ దఫాలో 4,374 మంది చిన్నారులను బాల కార్మిక కూపాల నుంచి రక్షించినట్లు తెలిపారు. 1,502 మంది చిన్నారులను రాష్ట్రంలో తల్లిదండ్రులకు అప్పగించామని, 2,872 మంది చిన్నారులను వారి సొంత రాష్ట్రాలకు పంపించామని వెల్లడించారు. ఇక ఆపరేషన్ ముస్కాన్ 3వ దఫాలో 2,572 మంది చిన్నారులను కాపాడామన్నారు. వీరిలో 999 మంది చిన్నారుల తల్లిదండ్రులను గుర్తించి అప్పగించామని.. మిగతా చిన్నారులను వారి సొంత రాష్ట్రాలకు అప్పగించామని తెలిపారు. ఆందోళన కల్గిస్తున్న అక్రమ రవాణా.. మహిళల అక్రమ రవాణా ఆందోళనకరంగా పరిణమించిందని డీజీపీ పేర్కొన్నారు. సీఐడీ 2016లో 327 మందిని రక్షించగా.. ఈ ఏడాది నవంబర్ వరకు 394 మందిని రెస్క్యూ చేసిందని తెలిపారు. 2016లో అక్రమ రవాణాపై 207 కేసులు నమోదుచేసి 245 మందిని అరెస్టు చేయగా.. ఈ ఏడాది నవంబర్ వరకు 262 మంది నిందితులను గుర్తించి 238 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇక ఆర్థిక నేరాలకు సంబంధించి 2016లో 7,987 కేసులు నమోదుకాగా.. ఈ ఏడాది నవంబర్ వరకు 9,418 నేరాలు నమోదయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. జిల్లా యూనిట్లకు ‘కొత్త’ శోభ కొత్త జిల్లాల్లోని పోలీస్ యూనిట్లకు వచ్చే ఏడాది చివరికల్లా నూతన కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయని డీజీపీ తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్లు, కమిషనరేట్లు, క్వార్టర్లను నిర్మిస్తున్నామని తెలిపారు. పోలీసు సంక్షేమం విషయంలో ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని.. పోలీస్ వెల్ఫేర్ విభాగం ద్వారా ఈ ఏడాది 346 మంది రూ.2.56 కోట్లు రుణం తీసుకున్నారని చెప్పారు. మావోయిస్టులను నియంత్రించాం మావోయిస్టు కార్యకలాపాలు, ఉగ్రవాదులను నియంత్రించడంలో పోలీస్ శాఖ విజయవంతమైందని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్ నాటికి 54 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా.. 26 మంది లొంగిపోయారని తెలిపారు. అదేవిధంగా 10 ఎదురుకాల్పుల ఘటనలు జరిగాయని, ఐదుగురు మరణించారని తెలిపారు. వివిధ ఆపరేషన్స్‌లో 16 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని.. అందులో నాలుగు ఏకే 47 రైఫిళ్లు, రెండు ఎస్ఎల్ఆర్ తుపాకులు, ఒక ఎస్బీబీఎల్, మూడు పాయింట్ 303 రైఫిల్లు, మూడు పిస్టళ్లు, ఒక తపంచా, రెండు ఇన్సాస్ తుపాకులు ఉన్నాయని వెల్లడించారు. అదేవిధంగా రూ. 20.64 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కర్ణాటక, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన పోలీసులతో కలసి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్ ముఠాలను, నకిలీ కరెన్సీ గ్యాంగులను పట్టుకున్నట్టు చెప్పారు. త్వరలో భారీ రిక్రూట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పోలీసు శాఖకు 18,290 పోస్టులు మంజూరు చేసిందని డీజీపీ తెలిపారు. 3,897 పోస్టులకు త్వరలో నియామక ప్రక్రియ చేపట్టబోతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 10 వేల మంది కానిస్టేబుళ్లు, 500 మంది ఎస్సైలు శిక్షణ పొందుతున్నారని, ఫిబ్రవరి తొలివారంకల్లా ఈ కానిస్టేబుళ్లు విధుల్లోకి వస్తారని చెప్పారు. దీనివల్ల ప్రస్తుత సిబ్బందిపై ఒత్తిడి తగ్గుతుందని, వీక్–ఆఫ్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నామని తెలిపారు. -
'శాంతి భద్రతలకే అత్యంత ప్రాధాన్యం'
సాక్షి, హైదరాబాద్: 2018 లో 8 లక్ష్యాలతో ముందుకెళ్తున్నట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయనిక్కడ శనివారం మీడియాతో మాట్లాడుతూ 2018 పోలీసు శాఖకు ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ-చలాన్, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా యూనిట్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ తరహాలో అన్నీ పీఎస్‌లను తీర్చిదిద్దుతామన్నారు. అన్ని జిల్లాల్లో కమాండ్ కంట్రోలు సెంటర్లు ఏర్పాటు చేసి.. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తామని తెలిపారు. నేరాల సంఖ్య గతంతో పోలిస్తే 12.93 శాతం పెరిగిందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్తామని.. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పని చేస్తున్నామని తెలిపారు. పోలీస్ శాఖలో త్వరలో 18, 290 పోస్టును భర్తీ చేయనున్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. -
కార్మిక శాఖ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పర్మిట్లు ఉండి కనీసం 8 గంటలకు మించి నడిచే ప్రైవేటు వాహనాలను కార్మిక శాఖలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వాహనాలు 2.44 లక్షలుండగా, ఇప్పటివరకు కార్మిక శాఖతో రిజిస్ట్రేషన్ చేయించుకుని టోకెన్ తీసుకున్న వాహనాల సంఖ్య చాలా తక్కువగా ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆర్టీఏ కేంద్ర కార్యాలయంలో రవాణా, కార్మిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హైకోర్టు సూచించిన విధంగా మోటారు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్–1961ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించవద్దని పేర్కొన్నారు. టోకెన్లు తీసుకున్న వాహనాలకు మాత్రమే త్రైమాసిక పన్ను కట్టించుకోవాలని తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు రవాణా పన్నుల లక్ష్యం ఈ ఏడాది రూ.3,401 కోట్లు ఉండగా, ఇప్పటివరకు రూ.2,436 కోట్లు వసూలయిందని అధికారులు మంత్రికి వివరించారు. మహబూబ్‌నగర్, కొమురం భీం ఆసిఫాభాద్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో పన్నుల వసూలు తక్కువగా ఉండటం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అద్దె భవనాల్లో నడుస్తున్న 12 రవాణా శాఖ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణం కోసం జనవరి నాటికి స్థలాన్ని గుర్తించి కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. పర్మిట్ల మోసాలకు పాల్పడే వారు ఎంతటి పలుకుబడి ఉన్న వారైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
మేడారం జాతరకు పక్కా ఏర్పాట్లు
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో జనవరి 31 నుంచి జరగనున్న మేడారం మహాజాతరకు జిల్లా పోలీసు అధికారులు పక డ్బందీ ఏర్పాట్లు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం భూపాలపల్లిలో జిల్లా పోలీసు కార్యాలయ భవనం నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులతో సమావేశమై జాతరలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మేడారం జాతరకు కోటికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున..సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రాఫిక్, శాంతిభద్రతల సమ స్యలు తలెత్తకుండా చూడాలన్నారు. కలెక్టర్, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేసి జాతరను దిగ్విజయం చేయాలన్నారు. ఆయన వెంట కలెక్టర్ ఆకునూరి మురళి, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, గ్రే హౌండ్స్ ఐజీ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సజ్జనార్, వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఉన్నారు. దేశానికే ఆదర్శంగా నిలుపుతాం సాక్షి, కొత్తగూడెం: తెలంగాణ పోలీసు వ్యవస్థను దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టే దిశగా ముందుకు వెళ్తున్నట్లు డీజీపీ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంలో మంగళవారం పర్యటించారు. పోలీసు అధికారులతో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేయాలని పోలీసులకు సూచించినట్టు వివరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ఆ దిశగా ముందుకెళుతున్నట్లు వివరించారు. మారుతున్న పరిస్థితుల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. డీజీపీతో పాటు నార్త్‌జోన్ ఐజీపీ నాగిరెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సజ్జనార్, ఇంటెలిజెన్స్ ఐజీపీ నవీన్‌చంద్, ఐజీ కె.శ్రీనివాసరెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, ఎస్ఐబీ ఎస్పీ నర్సింగరావు, భద్రాచలం ఏసీపీ సునీల్‌దత్ పాల్గొన్నారు. -
పోలీసన్నా.. విచక్షణ ఏదన్నా..
సాక్షి, హైదరాబాద్: ‘అడుసు తొక్కనేల.. కాలు కడుగనేల’.. అన్న సామెత పోలీస్ శాఖలోని కొంతమంది అధికారులకు సరిగ్గా సరిపోయేలా ఉంది. నేరాల నియంత్రణ, టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే నంబర్ వన్ అనిపించుకున్న రాష్ట్ర పోలీస్ శాఖ.. ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకునేలా కనిపిస్తోంది. ఓ వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ అధికారులు, సిబ్బందిని డీజీపీ మహేందర్‌రెడ్డి నడిపిస్తుంటే.. మరోవైపు బాధితులు, నిందితులతో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖను కుదిపేస్తోంది. అదనపు డీసీపీ కొట్టడమేంటి? షార్ట్ ఫిలిం డైరెక్టర్, అందులో నటించిన యువతి మధ్య వివాదంలో మాదాపూర్ అదనపు డీసీపీ గంగారెడ్డి వ్యవహరించిన తీరు పోలీస్ శాఖ తలపట్టుకునేలా చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అదనపు డీసీపీ స్థాయి అధికారి తన్నడం, కొట్టడం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. విషయం మీడియాలో ప్రసారమవ్వడంతో డీజీపీ విచారణకు ఆదేశించారు. గంగారెడ్డిని సైబరాబాద్ ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. ఈ ఇన్స్పెక్టర్ ముందునుంచీ అంతే రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రావు.. బాధితురాలి ఇంటికెళ్లి వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. భర్త హత్య కేసుకు సంబంధించి దివానులో కూర్చొని బాధితురాలు ఫిర్యాదురాస్తుంటే.. ఆయన దివానుకు కాలు పెట్టి దర్జా ప్రదర్శించారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అతన్ని బదిలీ చేసి కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. విచారణకు ఆదేశించారు. గతంలో అబిడ్స్ ఇన్స్పెక్టర్గా పనిచేసినప్పుడూ మహిళా కానిస్టేబుల్‌తో దురుసు ప్రవర్తన వల్ల ఆయన సస్పెండ్ అయ్యారు. నేరేళ్ల ఘటనతో ఇరకాటంలో.. సిరిసిల్లా జిల్లా ‘నేరెళ్ల’ఘటనలో దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారం పోలీస్ శాఖను కుదిపేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రయత్నిస్తుంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అనుభవం లేని అధికారులు చిత్రహింసలకు గురిచేసినట్లు సొంత విభాగం నుంచే విమర్శలొచ్చాయి. ఈ ఘటనలో ఎస్సైపై వేటు వేసినా అధికారుల ప్రవర్తనలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మీడియాపై రుసరుస.. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బందోబస్తులో ఉన్న అప్పటి పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లూ వివాదాస్పదమయ్యారు. ఓ న్యూస్ చానల్ మహిళా రిపోర్టర్‌తో దురుసుగా ప్రవర్తించడంతో జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటీవల ఉస్మానియా వర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి మృతదేహం తరలింపు çసమయంలో ఓ న్యూస్ చానల్ రిపోర్టర్‌ను సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ, ఓయూ ఇన్స్పెక్టర్ అశోక్ పోలీస్ జీపెక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లి 3 గంటలు నిర్బంధించారు. మార్పు రావాల్సిందే.. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చిన డీజీపీ.. అంకితభావ సేవలు, జవాబుదారితనంతో పని చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. వివాదాస్పద ఘటనకు పాల్పడితే ఉపేక్షించేబోనని స్పష్టం చేశారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేలా పని చేయాలని, నేరస్థులపై ఉక్కుపాదం మోపుతూనే మరోవైపు ఫ్రెండ్లీగా విధులు నిర్వహించాలని సూచించారు. అయినా కొంతమంది అధికారులు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న తీరు ఉన్నతాధికారులను ఒత్తిడిలోకి నెడుతున్నట్లు తెలుస్తోంది. -
ఉట్నూర్ సమస్యకు పరిష్కారం!
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీ, లంబాడీల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాంతిభద్రతలు అదుపు తప్ప గా, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయి. కాగా, ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఉట్నూ ర్కు తరలివచ్చింది. శనివారం ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సోమేష్‌కుమార్‌లతో కలిసి హెలికాప్టర్లో ఉదయం ఉట్నూర్‌కు చేరుకున్నారు. సుమారు నాలుగు గంటలపాటు ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో గడిపారు. మొదట ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో, ఆ తర్వాత ఉమ్మడి జిల్లా అధికారులతో, ఆపై ఆదివాసీ, లంబాడీ పెద్దలతో చర్చలు జరిపారు. మీడియాను ఈ సమావేశాలకు అనుమతించలేదు. శాశ్వత పరిష్కారంపై సీఎం దృష్టి: సీఎస్ ఎస్పీ సింగ్ ఆదివాసీ, లంబాడీల ఘర్షణ నేపథ్యంలో పాత ఆదిలాబాద్ జిల్లాలో చిన్నచిన్న సంఘటనలు జరగడంతో శాంతిభద్రతలపై కొంత ప్రభావం చూపిందని సీఎస్ ఎస్పీ సింగ్ అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని అన్నారు. ఆ సందర్భంలోనే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. పోలీసు, అధికారులతో చర్చలు జరిగాయని తెలి పారు. పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సి ఉందన్నారు. ఆయా కమ్యూనిటీ లీడర్లతో ముఖా ముఖి చర్చించామన్నారు. శాంతి స్థాపన కోసం సహకారం అవసరమని కోరగా, అందుకు ఇరువర్గాల పెద్దలు సహకరిస్తామని చెప్పారని తెలిపారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత కలెక్ట ర్లు, ఎస్పీలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చినట్లు చెప్పారు. చర్చల్లో అదనపు డీజీపీ అంజనీకుమార్, కరీంనగర్ డీఐజీ ప్రమోద్‌కుమార్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావు, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, ఐటీడీఏ పీవో, మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఆసిఫాబాద్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎస్పీలు విష్ణు ఎస్.వారియర్, కల్మేశ్వర్‌లు పాల్గొన్నారు. చర్చలపై అసంతృప్తి.. చర్చలపై ఆదివాసీ, లంబాడీలు అసం తృప్తి వ్యక్తం చేశారు. చర్చల అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ చర్చలతో ఎలాంటి ఫలితం దక్కలేదని ఆదివాసీ సంఘం నేత నైతం రవి అన్నారు. హక్కుల సాధన కోసం ఆదివాసీలు శాంతియుతంగా పోరాటం చేస్తామన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని అన్నారు. వారితో కలసి చర్చలకు ఒప్పుకునేది లేదన్నారు. మరో ఆదివాసీ సం ఘం నేత బొంత ఆశరెడ్డి మాట్లాడుతూ చర్చలు పూర్తి కాలేదని, సీఎంను పిలవాలన్నారు. గవర్నర్ ఆదివాసీల దగ్గరికి రావాలన్నారు. లంబాడీ నాయకులు మాట్లాడుతూ లంబాడీలు ఆడపిల్లలను అమ్ముకుంటున్న సంఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయని, 45 రోజులుగా ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లడం లేదని, పరిష్కారం లేనప్పుడు చర్చలు ఎలా ఫలప్రదమవుతాయన్నారు. -
ఉట్నూరులో డీజీపీ, సీఎస్ పర్యటన
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన అల్లర్ల దృష్ట్యా శాంతి భద్రతలను పర్యవేక్షంచేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ శనివారం జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉట్నూరు చేరుకుని పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులతో సీఎస్, డీజీపీ సమావేశమయ్యారు. అదే విధంగా ఆదివాసీ, లంబాడీ నాయకులతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. -
ఇటు పహారా.. అటు ఘర్షణ
సాక్షి, ఆదిలాబాద్/ఆసిఫాబాద్/ఉట్నూర్: ఆదివాసీ, లంబాడీల ఘర్షణ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు బలగాలను భారీగా మోహరించినప్పటికీ ఉద్రిక్తత తగ్గుముఖం పట్టలేదు. ఒకవైపు పోలీసు పహారా కొనసాగుతుండగా, మరోవైపు ఘర్షణలు జరుగుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులతోపాటు బలగాలకు కూడా కంటి మీద కునుకు లేకుండాపోయింది. స్వయంగా డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే సిరికొండ మండలం రాంపూర్‌తండాలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం గమనార్హం. రాంపూర్ తండాలో ఓ వర్గం వారు మరో వర్గానికి చెందిన ఆస్తులకు నష్టం కలిగించటంతో పాటు పత్తి నిల్వలను దహనం చేశారు. జిల్లాలోని మండలాలు, గ్రామాల్లో చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేసినప్పటికీ పహారా లేని తండాలో ఘర్షణ చోటు చేసుకుంటున్నాయి. కాగా, రెండు రోజుల కిందట ఘర్షణల సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఉట్నూర్ మండలం హస్నాపూర్‌కు చెందిన రాథోడ్ జితేందర్ అంత్యక్రియలు గ్రామంలో పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం నిర్వహించారు. లంబాడీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేతలు అమర్‌సింగ్ తిలావత్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ తదితరులు హాజరయ్యారు. మావోయిస్టులు అనుకూలంగా మలుచుకునే అవకాశం: డీజీపీ ఆదివాసీ, లంబాడీల ఘర్షణలను మావోయిస్టులు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ఆయన ఉట్నూర్‌కు వచ్చారు. అదనపు డీజీపీ అంజనీకుమార్, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆయనతో వచ్చారు. ఉట్నూర్‌లోని హస్నాపూర్‌లో ఘర్షణలు జరిగిన ప్రాంతాన్ని, ఆస్తి నష్టాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో పర్యటించి తిరిగి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఉట్నూర్, ఆదిలాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీలో ఘర్షణలను ముందుండి, వెనుకుండి నడిపేవారిని వదిలేది లేదని, బాధ్యుపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి పెట్టామని వివరించారు. కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు, పోలీసు అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు, అన్ని శాఖలను సమన్వయం చేసుకొని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సుస్థిర శాంతిని స్థాపనకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజాఫిర్యాదులను అర్థం చేసుకొని అందరి మనోభావాలను గౌరవిస్తామని వివరించారు. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఎస్పీలుగా పనిచేసిన ఐపీఎస్ అధికారులు మహేశ్ ఎం.భగవత్, తరుణ్‌జోషి, అనిల్‌కుమార్, దేవేంద్రసింగ్ చౌహాన్, ప్రమోద్‌కుమార్ ఘర్షణల నేపథ్యంలో జిల్లాలో భద్రత చర్యలను పర్యవేక్షిస్తుండడం గమనార్హం. -
4 వేల మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి
సాక్షి, హైదరాబాద్ : పోలీస్ శాఖలో 25 ఏళ్లుగా పనిచేస్తున్నా ఒక్క పదోన్నతి కూడా లభించక తీవ్ర నిరాశలో ఉన్న కానిస్టేబుళ్ల ఆవేదనకు అక్షర రూపమిస్తూ ‘సాక్షి’ ప్రధాన సంచికలో ఇటీవల ప్రచురించిన ‘పాతికేళ్లుగా పనిచేస్తున్నా పదోన్నతి లేకపాయె!’కథనం పోలీస్ శాఖను కుదిపేసింది. ఈ కథనం ఆధారంగా ఇంటెలిజెన్స్ అధికారులు అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో విచారణ జరిపించారు. పదోన్నతులు రాకపోవడంపై కానిస్టేబుళ్లలో ఆందోళన నెలకొందని, ఖాళీగా ఉన్న హెడ్‌కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తే వారు సంతోషించడంతోపాటు గౌరవంగా భావిస్తారని ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో పదోన్నతుల కోసం వేచిచూస్తున్న వేలాది మంది కానిస్టేబుళ్లకు తీపికబురు అందిస్తూ పదోన్నతుల ప్రతిపాదన ఫైలుకు ఆమోదం లభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. 4 వేల మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా... రాష్ట్రవ్యాప్తంగా కమిషనరేట్లు, జిల్లాల్లో పనిచేస్తున్న 4 వేల మంది సివిల్ కానిసేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందే వారి జాబితాను వెంటనే సిద్ధం చేసి ఈ నెల 25లోగా పదోన్నతుల ఆదేశాలివ్వాలని పేర్కొన్నారు. అదే విధంగా జనవరి మొదటి వారానికల్లా పదోన్నతులు పొందిన హెడ్ కానిస్టేబుళ్లకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇప్పటికే కొత్త జిల్లాల్లో జీవో నంబర్లు 124, 148 కింద నూతనంగా ఏర్పాటు చేసిన 1,500 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) పోస్టులను పదోన్నతుల రూపంలో భర్తీ చేస్తూ గత నెలలో రిటైర్మెంట్కు ముందు అప్పటి డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశాలిచ్చారు. దీంతో స్వల్ప వ్యవధిలో మొత్తంగా 5,500 మంది పోలీస్ సిబ్బంది పదోన్నతులు పొందినట్లు కానుంది. నిబంధనల ప్రకారం సమయానికల్లా పదోన్నతి పొందే అధికారులు... తమకు రావాల్సిన పదోన్నతులపై మాత్రం నోరుమెదపకపోవడంపై ఇంతకాలం తీవ్ర అసహనంతో ఉన్న కానిస్టేబుళ్ల మనసుల్లో డీజీపీ నిర్ణయం ఆనందం నింపింది. ప్రమోషన్ల తర్వాతే శిక్షణ... గతంలో ఉన్నట్లుగా శిక్షణ అనంతరం పదోన్నతి కాకుండా, పదోన్నతి ఆదేశాలు పొందిన తర్వాతే శిక్షణకు పంపించాలని అన్ని జిల్లాల యూనిట్ ఆఫీసర్లు, కమిషనర్లకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందే సిబ్బంది ఇప్పటివరకు 90 రోజులపాటు శిక్షణ పొందే నిబంధన ఉండేది. అయితే వయసు పైబడిన కానిస్టేబుళ్లకు ఈ శిక్షణ కష్టమవుతుందన్న ఉద్దేశంతో దీన్ని గత డీజీపీ అనురాగ్‌శర్మ 42 రోజులకు తగ్గించారు. -
రన్ ఫర్ హెల్త్..
-
ఎటువంటి ఇబ్బందులూ రావొద్దు!
సాక్షి, హైదరాబాద్: మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న మెట్రో రైలు, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) ప్రాంతం, భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ప్రధాని మోదీ, ఇవాంకా, ఇతర ప్రముఖులు ప్రయాణించే మార్గాలు, పర్యటించే ప్రదేశాలు ఏర్పాట్లపై సమీక్షించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. తొలుత సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేక బస్సులో హెచ్ఐసీసీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ అనంతరం జీఈఎస్ సదస్సు జరిగే హెచ్ఐ సీసీ వేదికను డీజీపీ పరిశీలించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు, మోదీ, సీఎం, ఇవాంకా వచ్చే మార్గాలు, గ్రీన్ చానల్ ఏర్పాటు, డెలిగేట్లు వచ్చే మార్గం తదితరాలపై సమీక్షించారు. ఇక 29న గోల్కొండ కోటలో జీఈఎస్ డెలిగేట్లకు విందు ఇవ్వనున్న ప్రాంతాలను సీఎస్, డీజీపీ పరిశీలించారు. ఆదివా రం నుంచి కోటను అదీనంలోకి తీసుకోవాలని.. ఎవరినీ అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. విందు మెనూను పరిశీలించారు. కోటలో హస్తకళల ప్రదర్శన మాత్రమే ఉంచాలని, అమ్మకాలను జరపవద్దని సూచించారు. సిబ్బంది, అధికారులు ఎప్పటి కప్పుడు సమన్వయం చేసుకోవాలని, ఇబ్బందులు తలెత్త కుండా, ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఇక డీజీపీ మహేందర్ రెడ్డి మెట్రో రైలు డిపో, మియాపూర్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి.. మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమాలపై మెట్రోరైల్ అధికారులతో కలసి సమీక్షించారు. అధికారులతో కలసి మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రతి మెట్రో స్టాప్‌లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాట్లు పరిశీలించారు. సదస్సు నేపథ్యంలో ఆదివారం నుంచి గురువారం వరకు పోలీసు శాఖ డేగకళ్లతో పహారా కాయబో తోంది. ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్‌ల పర్యటన నేపథ్యంలో.. దాదాపు 4 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది భద్రతా వ్యవహారాల్లో నిమగ్న మవుతున్నారు.