
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రం చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మావోల కదలికలు లేకుండా నిర్మూలిస్తామని తెలిపారు. సోమవారం ఆయన కుమ్రంబీమ్ జిల్లా కేంద్రంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోలను నిర్మూలించడానికి 31 టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ గడ్డపై అడుగు పెట్టకుండా మావోలపై చర్యలు చేడుతున్నామన్నారు. కరోనాతో బాధపడుతున్న మావోలు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోతే చికిత్స అందిస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
చదవండి: ఆన్‌లైన్‌లో అశ్లీలం.. ‘మేమే నగ్నంగా తయారవుతున్నాం’
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టులు
Comments
Please login to add a commentAdd a comment