
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో తగాదాల కారణంగా ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ యువతిని కాపాడిన మంచిర్యాల పోలీసులను డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. శ్రీరాంపూర్‌కు చెందిన ఓ యువతి ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తుండగా అది గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. విషయం తెలుసుకున్న డీజీపీ ట్విట్టర్ ద్వారా మంచిర్యాల పోలీసులను అభినందించారు.
ప్రజల లాక్‌డౌన్ సహకారం భేష్
లాక్‌డౌన్ విధించిన నెలరోజులుగా ప్రజలు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. లాక్‌డౌన్ సమయంలో భౌతికదూరం పాటిస్తూ నిబంధనలను పాటిస్తున్న పౌరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే పోలీసులకు సహకారం కొనసాగించాలని ఆయ కోరారు.