appriciate
-
మెరబ్కు సీఎం రేవంత్ అభినందన
మొయినాబాద్: ఐక్యరాజ్య సమితి యూత్ కాన్ఫరెన్స్‌కు ఎంపికై న మెరల్ మెరబ్ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ నుంచి పది మందికి అవకాశం రాగా.. తెలంగాణ నుంచి మెరబ్ సెలక్ట్ అయ్యారు. ఈమె తండ్రి వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చెందిన కృపావరం.. కొన్నేళ్లుగా మొయినాబాద్‌లోని చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. మెరబ్ ఘట్కేసర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాలలో గతేడాది డిగ్రీ పూర్తి చేసింది. 2023లో నిర్వహించిన పరీక్షకు హాజరై.. ప్రస్తుతం జరిగే ఐరాస యూత్ కాన్ఫరెన్స్‌కు ఎంపికై ంది. ఆగస్టు 2 నుంచి 5 వరకు మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగే కాన్ఫరెన్స్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.సీఎం సభ ఏర్పాట్ల పరిశీలనకందుకూరు: మీర్ఖాన్పేటలో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నెట్ జీరో సిటీలో కొనసాగుతున్న సభ ఏర్పాట్లను బుధవారం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నర్సింహరెడ్డి, ముదిరాజ్ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పరిశీలించారు. ఏర్పాట్ల గురించి ఆర్డీఓ సూరజ్‌కుమార్, తహసీల్దార్ గోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి.ప్రభాకర్‌రెడ్డి, ఎండీ అప్జల్‌బేగ్, ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్, ఎస్.పాండు, కె.విష్ణువర్ధన్‌రెడ్డి, కె.మదన్‌పాల్‌రెడ్డి, కె.వెంకటేశ్, ఢిల్లీ కృష్ణ, జి.దర్శన్, ఈ.శ్రీకాంత్‌రెడ్డి, ఎ.జగదీశ్, జి.యదయ్య, దేవేందర్, ప్రశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.డిజిటల్ నంబర్.. క్యూఆర్ కోడ్సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలోని అన్ని ఆస్తులు, యుటిలిటీస్‌కు జీఐఎస్ మ్యాపింగ్ సర్వేతో పాటు దానికి అనుబంధంగా డిజిటల్ డోర్ నంబర్ల ప్రక్రియ కూడా జరుగుతున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు. జీఐఎస్ సర్వే ద్వారా అన్ని ఆస్తుల జియో ట్యాగింగ్ పూర్తయ్యాక అన్ని ఇళ్లకూ ప్రత్యేక క్రమసంఖ్యతో డిజిటల్ డోర్ నంబర్ జారీ అవుతుందని తెలిపారు. దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ప్లేట్లను ఇళ్ల బయట తలుపులకు బిగించనున్నట్లు పేర్కొన్నారు. సాంకేతికత ఆధారంగా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా వాటిని తయారు చేయించనున్నట్లు తెలిపారు. తద్వారా ఈ–గవర్నెన్స్‌కు యాక్సెస్ సులభం కావడంతోపాటు అత్యవసర సమయాల్లో ప్రజలకు తగిన సహాయం అందించేందుకు ఉపకరిస్తుందని పేర్కొన్నారు. అన్ని పబ్లిక్ యుటిలిటీస్‌ను ఒక ఐడీకి కనెక్ట్ చేయడం ద్వారా అన్ని విభాగాల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంటుందని తెలిపారు. మెరుగైన పట్టణ నిర్వహణ, ప్రజా సదుపాయాల కోసం జరుగుతున్న జీఐఎస్ సర్వేకు ప్రజలు సహకరించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి ఆధార్, పాన్ వంటి వ్యక్తిగత వివరాలను క్షేత్రస్థాయి సిబ్బంది సేకరించరు అని పేర్కొన్నారు. ప్రజల గోప్యత, భద్రతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. -
సొంత ఇల్లు కట్టుకోగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది..!
-
జగనన్న నాకు ఇచ్చిన గొప్ప వరం..!
-
శభాష్ వాలంటీర్ నువ్వు సేవా వారియర్..!
-
'మేజర్' సినిమా మాత్రమే కాదు.. ఒక ఎమోషన్: చిరంజీవి
Chiranjeevi Appreciates Adivi Sesh Major Movie Team: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మేజర్'. అడివి శేష్, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. అనురాగ్, శరత్ నిర్మించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి కలెక్షన్లతో పాటు ప్రశంసలు సైతం లభిస్తున్నాయి. మేజర్ మూవీ అద్భుతంగా తీశారంటూ చిత్రయూనిట్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు జనాలు. తాజాగా ఈ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఈ సినిమాను చూసిన చిరంజీవి 'మేజర్' చిత్రబృందాన్ని సోషల్ మీడియా వేదికగా అభినందించారు. మేజర్ ఒక సినిమా మాత్రమే కాదు. అదొక నిజమైన ఎమోషన్. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని హత్తుకునేలా సినిమాను తెరకెక్కించారు. తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇలాంటి మూవీని మహేశ్‌బాబు నిర్మించినందుకు గర్వంగా ఉంది. చిత్రబృందానికి శుభాకాంక్షలు. అని ట్వీట్ చేశారు చిరంజీవి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మంచి సినిమాల గురించి చిరంజీవి ఎప్పుడూ మాట్లాడుతుంటారని, మేకర్స్‌ను ప్రోత్సహిస్తారని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల 'విక్రమ్' మూవీ విజయం సందర్భంగా కమల్ హాసన్‌ను చిరంజీవి సత్కరించిన విషయం తెలిసిందే. చదవండి: కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా రెండేళ్ల తర్వాత తల్లిని కలుసుకున్న హీరోయిన్.. #Major is not a film.Its truly an Emotion Story of a great Hero & Martyr#MajorSandeepUnnikrishnan told in the most poignant way.A must-watch Proud of @urstrulyMahesh for backing such a purposeful film HeartyCongrats to @AdiviSesh @saieemmanjrekar #Sobhita @SashiTikka & Team pic.twitter.com/1lW1m3xmFO — Chiranjeevi Konidela (@KChiruTweets) June 13, 2022 -
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి యూఎస్ కాన్సులేట్ అభినందనలు
-
శభాష్.. మంచిర్యాల పోలీసు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో తగాదాల కారణంగా ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ యువతిని కాపాడిన మంచిర్యాల పోలీసులను డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. శ్రీరాంపూర్‌కు చెందిన ఓ యువతి ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తుండగా అది గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. విషయం తెలుసుకున్న డీజీపీ ట్విట్టర్ ద్వారా మంచిర్యాల పోలీసులను అభినందించారు. ప్రజల లాక్డౌన్ సహకారం భేష్ లాక్డౌన్ విధించిన నెలరోజులుగా ప్రజలు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. లాక్డౌన్ సమయంలో భౌతికదూరం పాటిస్తూ నిబంధనలను పాటిస్తున్న పౌరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే పోలీసులకు సహకారం కొనసాగించాలని ఆయ కోరారు. -
పోలీసులే రియల్ హీరోలు: విజయ్ దేవరకొండ
సాక్షి, హైదరాబాద్: ‘తెర మీదనే మేం హీరోలం.. కానీ, మా నిజమైన హీరోలంటే పోలీసులే’ అని అర్జున్‌రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ అన్నారు. శనివారం ఆయన లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కోవిడ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ‘తెలంగాణ పోలీసులకు తెలుగు సినీపరిశ్రమ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ఇండస్ట్రీ మొత్తం మీ వెనకాలే ఉంది. అత్యవసర సేవలకు ఎక్కడా అంతరాయం కలగకుండా, శాంతి భద్రతలు కాపాడుతూ, కరోనా వైరస్ చైన్‌ను అడ్డుకునేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. మేం తెరమీద మాత్రమే హీరోలం. కానీ, మీరే మా నిజమైన హీరోలు. గత 20 రోజులుగా మీరు లాక్డౌన్ కోసం శ్రమిస్తున్నారు. మా సపోర్ట్ మీకెప్పుడూ ఉంటుంది’ అని అన్నారు. అనంతరం విజయ్ దేవరకొండకు డీజీపీ మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
దాతల సహకారం అభినందనీయం
తుంగతుర్తి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతల సహకారం అభినందనీయమని తుంగతుర్తి బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జోగునూరి సుందర్ రావు అన్నారు. శుక్రవారం ఆ పాఠశాలలలో కళావేదిక నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. మండల కేంద్రానికి చెందిన ఉపసర్పంచ్ బీరపూల నారాయణ తన తండ్రి బీరపూల వెంకటేశం జ్ఞాపకార్థం కళావేదిక నిర్మించడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయంమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ అమనగంటి నగేష్, వడ్లకొండ శ్రీనివాస్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, సురేందర్ రావు, రవీందర్, సుచిత, బాలయ్య, జోసెఫ్, వెంకట్‌రెడ్డి ఉన్నారు. -
దాతల సహకారం అభినందనీయం
నూతనకల్: ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు సహకారం అందించడం అభినందనీయమని పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు తండు వెంకటనారాయణగౌడ్ అన్నారు. మంగళవారం తాళ్లసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు జిల్లా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అమెరికాకు చెందిన ప్రతినిధులు రూ.30వేల విలువైన ఫర్నీచర్, ఇంగ్లిష్ డిక్షనరీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడ్డప్పటికీ మారుమూల ప్రాంతాల్లో విద్యాభివృద్ధి జరగాలనే లక్ష్యంతో పాఠశాలకు సహకారం అందించి దాత్రుత్వాన్ని చాటుకున్న సంస్థ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థులు దాతలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని విద్యారంగంలో రాణించాలని ఆయన కోరారు. ఎన్ఆర్ఐ ప్రతినిధులు నాలుగు టేబుల్స్, 17బేంచీలు, ఇంగ్లిష్ డిక్షనరీలు, చెస్‌బోర్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్‌రెడ్డి, సిద్ధిఖ్పాష, వర్థెల్లి కృష్ణ, సంధ్యారాణి, మధుకర్, వెంకన్న, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాకారులకు కలెక్టర్ అభినందనలు
నల్లగొండ టూటౌన్: తాంగ్–టా పెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గత నెల 29 నుంచి ఈ నెల 3వ తేది వరకు జమ్ముకాశ్మీర్ లో జరిగిన తాంగ్–టా ఫెడరేషన్ కప్ –2016 జాతీయ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులను శుక్రవారం జిల్లా కలెక్టర్ పి. సత్యనారాయణరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు బంగారు, వెండి, రజిత పథకాలు సాధించడం గర్వించదగినదన్నారు. ఈ కార్యక్రమంలో తాంగ్–టా జిల్లా అధ్యక్షుడు కందిమళ్ల చలపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కరుణాకర్, టి. హనుమంతరెడ్డి, అంజి, మారుతి అమరేందర్‌రెడ్డి, గాదె ర వీందర్‌రెడ్డి, రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.