క్రీడాకారులకు కలెక్టర్‌ అభినందనలు | collector appriciate Players | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు కలెక్టర్‌ అభినందనలు

Published Sat, Aug 6 2016 12:23 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

క్రీడాకారులకు కలెక్టర్‌ అభినందనలు - Sakshi

క్రీడాకారులకు కలెక్టర్‌ అభినందనలు

నల్లగొండ టూటౌన్‌: తాంగ్‌–టా పెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో గత నెల 29 నుంచి ఈ నెల 3వ తేది వరకు జమ్ముకాశ్మీర్‌ లో జరిగిన తాంగ్‌–టా ఫెడరేషన్‌ కప్‌ –2016 జాతీయ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ పి. సత్యనారాయణరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు బంగారు, వెండి, రజిత  పథకాలు సాధించడం గర్వించదగినదన్నారు. ఈ కార్యక్రమంలో తాంగ్‌–టా  జిల్లా అధ్యక్షుడు కందిమళ్ల చలపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కరుణాకర్, టి. హనుమంతరెడ్డి, అంజి, మారుతి అమరేందర్‌రెడ్డి, గాదె ర వీందర్‌రెడ్డి, రాజు, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement