మాజీ సీఎం జగన్‌ను కలిసిన అల్లం
మొయినాబాద్: ఐక్యరాజ్య సమితి యూత్ కాన్ఫరెన్స్‌కు ఎంపికై న మెరల్ మెరబ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ నుంచి పది మందికి అవకాశం రాగా.. తెలంగాణ నుంచి మెరబ్ సెలక్ట్ అయ్యారు. ఈమె తండ్రి వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చెందిన కృపావరం.. కొన్నేళ్లుగా మొయినాబాద్‌లోని చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. మెరబ్ ఘట్‌కేసర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాలలో గతేడాది డిగ్రీ పూర్తి చేసింది. 2023లో నిర్వహించిన పరీక్షకు హాజరై.. ప్రస్తుతం జరిగే ఐరాస యూత్ కాన్ఫరెన్స్‌కు ఎంపికై ంది. ఆగస్టు 2 నుంచి 5 వరకు మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగే కాన్ఫరెన్స్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
కందుకూరు: మీర్‌ఖాన్‌పేటలో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నెట్ జీరో సిటీలో కొనసాగుతున్న సభ ఏర్పాట్లను బుధవారం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నర్సింహరెడ్డి, ముదిరాజ్ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి పరిశీలించారు. ఏర్పాట్ల గురించి ఆర్డీఓ సూరజ్‌కుమార్, తహసీల్దార్ గోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి.ప్రభాకర్‌రెడ్డి, ఎండీ అప్జల్‌బేగ్, ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్, ఎస్.పాండు, కె.విష్ణువర్ధన్‌రెడ్డి, కె.మదన్‌పాల్‌రెడ్డి, కె.వెంకటేశ్, ఢిల్లీ కృష్ణ, జి.దర్శన్, ఈ.శ్రీకాంత్‌రెడ్డి, ఎ.జగదీశ్, జి.యదయ్య, దేవేందర్, ప్రశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ నంబర్.. క్యూఆర్ కోడ్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలోని అన్ని ఆస్తులు, యుటిలిటీస్‌కు జీఐఎస్ మ్యాపింగ్ సర్వేతో పాటు దానికి అనుబంధంగా డిజిటల్ డోర్ నంబర్ల ప్రక్రియ కూడా జరుగుతున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు. జీఐఎస్ సర్వే ద్వారా అన్ని ఆస్తుల జియో ట్యాగింగ్ పూర్తయ్యాక అన్ని ఇళ్లకూ ప్రత్యేక క్రమసంఖ్యతో డిజిటల్ డోర్ నంబర్ జారీ అవుతుందని తెలిపారు. దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ప్లేట్లను ఇళ్ల బయట తలుపులకు బిగించనున్నట్లు పేర్కొన్నారు. సాంకేతికత ఆధారంగా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా వాటిని తయారు చేయించనున్నట్లు తెలిపారు. తద్వారా ఈ–గవర్నెన్స్‌కు యాక్సెస్ సులభం కావడంతోపాటు అత్యవసర సమయాల్లో ప్రజలకు తగిన సహాయం అందించేందుకు ఉపకరిస్తుందని పేర్కొన్నారు. అన్ని పబ్లిక్ యుటిలిటీస్‌ను ఒక ఐడీకి కనెక్ట్ చేయడం ద్వారా అన్ని విభాగాల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంటుందని తెలిపారు. మెరుగైన పట్టణ నిర్వహణ, ప్రజా సదుపాయాల కోసం జరుగుతున్న జీఐఎస్ సర్వేకు ప్రజలు సహకరించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి ఆధార్, పాన్ వంటి వ్యక్తిగత వివరాలను క్షేత్రస్థాయి సిబ్బంది సేకరించరు అని పేర్కొన్నారు. ప్రజల గోప్యత, భద్రతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment