
మహిళా ఆరోగ్యంతోనే సంతోషం
ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ సీడీపీఓ వినితాదేవి
యాచారం: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాల్లో సంతోషం ఉంటుందని ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ సీడీపీఓ వినితాదేవి అన్నారు. మంగళవారం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో మహిళల ఆరోగ్యం, గర్భిణి, బాలింతలకు అందించే పౌష్టికాహారం, చిన్నపిల్లల సంరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తప్పక తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యాచారం ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.