breaking news
Ranga Reddy District Latest News
-
పీఎస్‌లో సమాచారమివ్వాలి
సంక్రాతి పండుగకు ఇతర గ్రామాలకు వెళ్లే ప్రజలు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. కుటుంబ సమేతంగా ఊరెళ్తుండడంతో చాలా రోజులు ఇళ్లకు తాళాలు వేసి ఉంటే చోరీలకు అవకాశం ఉంది. ముందస్తు సమాచారం ఇస్తే ప్రెటోలింగ్ సిబ్బందికి ప్రత్యేక నిఘా ఉంచుతారు. అనుమానితులు కనిపిస్తే డయల్ 100కి సమాచారం ఇవ్వాలి. – కాంతారెడ్డి, సీఐ, షాబాద్ విషయాన్ని షేర్ చేయొద్దు సంక్రాంతికి స్వగ్రామాలకు వెళుతున్న వారు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. సోషల్ మీడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు. ఊరెళ్లే ముందు ఇంటి ఆవరణలో ఉన్న లైట్లు వేసి వెళ్లాలి. డోరు తాళం వేసి కర్టన్ను వేయడం మర్చిపోవద్దు. తెలిసిన వారికి ఇంటిని గమనించమని చెప్పండి. – విజయ్‌కుమార్, సీఐ, షాద్‌నగర్ -
హైడ్రా కూల్చివేతలపై స్థానికుల ఆగ్రహం
మియాపూర్: మియాపూర్ మక్తమహబూబ్‌పేట గ్రామంలోని సర్వే నంబర్ –44లో ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా అధికారులు మియాపూర్ పోలీసుల బందోబస్తుతో ఆదివారం కంచె ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అక్కడ పోలీసులు, స్థానికుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. హైడ్రా అధికారులు సర్వే నంబర్ –44లో కబ్జాకు గురైన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేస్తుండగా స్థానిక కాలనీ వాసులు, వ్యాపార సముదాయాల నిర్వాహకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రక్కనే ఉన్న వాణిజ్య షెడ్లను కూల్చివేసేందుకు వెళ్లగా అధికారులను షెడ్ల నిర్వాహకులు అడ్డగించి ఇది ప్రైవేటు స్థలమని, మీరు ఎలా కూల్చుతారని హైడ్రా అధికారులు, పోలీసులను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. సర్వే నంబర్ – 44లోని భూమిపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో స్టే కొనసాగుతుందని, గతంలో హైకోర్టులోని రెండు బెంచీలు ఇది ప్రైవేటు భూమిగా పేర్కొందని తెలిపారు. ఈ నెల 12న ఈ కేసుపై సుప్రీం కోర్టులో వాదన జరగనుందని తెలిపారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఎలా షెడ్లు కూల్చివేస్తారని ప్రశ్నించారు. హైడ్రా అధికారులు తమ వ్యాపార సముదాయాలను కూల్చివేస్తే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కోర్టు కేసులో ఉన్న భూమిపై కూల్చివేతలు చేపట్డడంపై కాలనీ వాసులు, వ్యాపార సముదాయాల నిర్వాహకులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో హైడ్రా అధికారులు వాణిజ్య వ్యాపారాల షెడ్లను విడిచి వాటి పక్కనుండి కంచే ఏర్పాటు చే శారు. సుమారు 15 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. -
వడ్డెర్ల సంక్షేమానికి చేయూతనివ్వండి
కడ్తాల్: అన్ని రంగాల్లో వెనుకబడిన తమకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయాలని జిల్లా వడ్డెర సంఘం మహిళా అధ్యక్షురాలు డేరంగుల జ్యోతి, వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు వరికుప్పల రాజు, యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు రాఘవేందర్ ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలో వడ్డె ఓబన్న జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ్యోతి, రాఘవేందర్ హాజరై, ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన యోధుడు వడ్డె ఓబన్న అని గుర్తు చేశారు. ఆయన పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. బీసీ కోటాలో ఉన్న వడ్డెరలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వడ్డె రాజు, పుష్ప, నాగార్జున, యాదయ్య, సత్యనారి, శ్రీకాంత్, శ్రీను, రాజు, సత్తయ్య తదితరులు ఉన్నారు. -
మాంజాతో మజాక్‌లొద్దు
షాబాద్: పతంగి ఎగురవేయడానికి వినియోగించే నిషేధిత చైనా మాంజా ప్రమాదకరంగా మారుతోంది. ఎగురవేసే వారి చేతి వేళ్లు తెగుతున్నాయి. పైగా రహదారులపై వెళ్తున్న వారి మెడకు బిగుసుకుపోవడంతో గొంతు దగ్గర గాయాలవుతున్నాయి. ఏటా రాష్ట్ర వ్యాప్తంగా మంజాతో గొంతు తెగి గాయాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ఇచ్చారు. పిల్లలు ఇప్పటి నుంచే పతంగి సంబురాలు మొదలు పెట్టారు. వాటిని ఎగరేస్తున్న సమయంలో బాలురు తమ భద్రతను మరుస్తున్నారు. సాధారణంగా పిల్లలకు ప్రమాదాలపై అవగాహన తక్కువ. ఎలా జాగ్రత్తగా ఉండాలనే విషయం తెలియక సంబురాల్లో మునిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీనిపై షాబాద్ సీఐ కాంతారెడ్డి సూచనలు అందించారు. పతంగుల సందడి పతంగుల సందడి ప్రారంభమైంది. మార్కెట్లో దుకాణాలు సైతం వెలిశాయి. గాలిపటాలు అధునాతన డిజైన్లలో లభిస్తున్నాయి. దీంతో చిన్నారులు, యువకులు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. గాలిపంటం సైజ్, నాణ్యతను బట్టి రూ.5 నుంచి రూ.25 వరకు అందుబాటులో ఉన్నాయి. రంగు కాగితాలతో చేసిన పతంగులను సైజ్‌ను బట్టి రూ.5 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. ప్రత్యేకంగా క్లాత్‌తో తయారుచేసిన భారీ పతంగులను రూ.130 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే పతంగులను ఎగరేయడానికి ఉపయోగించే(ధారం) మాంజాలలో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఇలా చేయాలి ● గాలిపటం ఎగరేయడానికి విశాల మైదానం ఎంపిక చేసుకోవాలి. ● పిల్లలంతా కలిసి గాలిపటం ఎగురవేస్తుంటే ఎవరైనా ఒకరు వారిని పర్యవేక్షించాలి. ● తక్కువ కఠినత్వం ఉన్న మాంజా లేదా ధారం ఉపయోగించినా చేతి వేళ్లకు బట్ట, గౌజ్‌లు వేసుకుంటే గాయం నుంచి తప్పించుకోవచ్చు. ● విద్యుత్ తీగలు, భవనాలు, వృక్షాలు.. ఇలా ఎతైన ప్రదేశాల్లో పడిన పతంగుల కోసం వెళ్లడం మానుకోవాలి. ● పతంగి ఎగురుతున్న సమయంలో ఎటూ చూసుకోకుండా పరుగెడుతూ గుంతలు, కాల్వల్లో పడకుండా, వాహనాల కారణంగా గాయపడకుండా వాటిని వదిలేయడం మంచిది. ● పెద్దవి ఫ్యాన్సీ రకం గాలిపటాలకు బదులు తేలికపాటివి వినియోగించేలా చూడాలి. పతంగి సంబురం.. కావొద్దు విషాదం పిల్లలకు తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పాలి గాలిపటాలు ఎగరేస్తున్న సమయంలో గమనించాలి జాగ్రత్తలు మరవొద్దు తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యం కనిపెడుతూ ఉండాలి. భవనాలు, గోడలు, బాల్కనీల పైనుంచి గాలిపటాలు ఎగరేయొద్దు. గాలి వీచిన దిక్కు పతంగి ఎగురుతుంది. దానిపైనే శ్రద్ధ పెట్టి నడిస్తే పడిపోయే ప్రమాదం ఉంది. గల్లీలు, భారీ భవన సముదాయాలు, విద్యుత్ తీగలు, సెల్‌ఫోన్ టవర్ల సమీపంలో గాలి పటాలు ఎగరేసే సాహసం చేయొద్దు. పతంగి విద్యుత్ తీగలు, స్తంభాలు, వృక్షాలపై పడితే తీసుకునే ప్రయత్నం చేయొద్దు. గాలి పటాన్ని తీసుకునే ప్రయత్నంలో ప్రమాదాలకు గురవుతున్నారు. -
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
చేవెళ్ల: రాబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని, పార్టీకోసం పనిచేసే వారికి సముచిత స్థానం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నగరంలోని ప్రగతి భవన్లో ఆదివారం చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లి వార్డుకు చెందిన బీజేపీ మాజీ సర్పంచ్ శ్యామలయ్య తన అనుచరులతో మాజీ మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి కేటీఆర్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. జిల్లాలో బలమైన నాయకురాలిగా సబితారెడ్డి మీకు అండగా ఉంటుందని చెప్పారు. సబితారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో పార్టీ నాయకులు ఐకమత్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు పి.కార్తీక్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు. -
నేడు మంత్రుల పర్యటన
చేవెళ్ల: నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో సోమవారం మంత్రుల పర్యటన ఉంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లిలో కోట్లరూపాయల అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నట్లు చెప్పారు. జిల్లా ఎమ్మెల్యేలు, పలువురు జిల్లా నాయకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇటీవల గెలిచిన ఐదు మండలాల సర్పంచులకు చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో మంత్రుల చేత సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కందుకూరు: స్వామి వివేకానంద సేవారత్న పురస్కారం–2026 మండల పరిధిలోని కొత్తగూడ మాజీ సర్పంచ్ సాధ మల్లారెడ్డి అందుకున్నారు. స్వామి వివేకానంద 164వ జయంతిని పురస్కరించుకుని సమాజ సేవ, ప్రజా సేవలో విశిష్ట సేవలందిస్తున్నందుకు గాను ఆయనకు తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం (టీఐఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చేతుల మీదుగా అవార్డు అందజేశారు. టీఐఎఫ్ సంస్థ ప్రతినిధులు డాక్టర్ రాజనారాయణముదిరాజ్, మహ్మద్ అక్తర్అలీ, డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా నాయకుడు కొంతం జంగారెడ్డి తదితరులు మల్లారెడ్డిని అభినందించారు. ఇబ్రహీంపట్నం: దండుమైలారం గ్రామానికి చెందిన పోకల్‌కార్ కిషన్‌ప్రసాద్‌జీ హైదరాబాద్ సర్కిల్ ఉత్తమ పోస్ట్‌మాన్‌గా అవార్డు దక్కించుకున్నారు. రాష్ట్రంలో పోస్ట్‌మాన్‌గా ఉత్తమ సేవలందిస్తున్న 12 మందిని ఎంపిక చేశారు. అందులో వనస్థలిపురం పోస్టాఫీస్‌లో పోస్టుమాన్‌గా పనిచేసే దండుమైలారం గ్రామానికి చెందిన పి. కిషన్‌ప్రసాద్‌జీ ఎంపికయ్యారు. నగరంలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలంగాణ పోస్టు మాస్టర్ జనరల్ మేనేజర్ (పీఎంజీ) సుమిత్రఅయోధ్య, హైదరాబాద్ పోస్టల్ డిపార్టమెంట్ సీనియర్ సూపరింటెండెంట్ హేమలత చేతుల మీదుగా కిషన్‌ప్రసాద్ అవార్డు అందుకున్నారు. కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మను ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు యాదగిరిస్వామి, స్థానిక నాయకులు తులసీరాంనాయక్, సాయికుమార్ ఉన్నారు. మంచాల: ఉపాధ్యాయుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నట్టు తపస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఒడ్నాల రాజశేఖర్, తెల్కపల్లి పెంటయ్య అన్నారు. నగరంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తారి రాజిరెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు జె.కరుణాకర్‌రెడ్డితో పాటు వివిధ మండలాలకు చెందిన సంఘం బాధ్యులు తపస్‌లో చేరారు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
వరి.. తగ్గుతోంది మరి!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: వరి పంట సాగు జిల్లాలో భారీగా తగ్గింది. చెరువులు, కుంటలు, బోరు బావుల కింద యాసంగిలో 1.57 లక్షల ఎకరాలు సాగు అవుతుందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ ఇప్పటి వరకు 32 వేల ఎకరాలకు మించలేదు. బోరుబావుల కింద మాత్రమే కాదు మూసీ పరీవాహక ప్రాంతాల్లోనూ సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం. తగ్గిన సాగు విస్తీర్ణం జిల్లాలో 2,127 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటి కింద 71,115 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఇక బోరు బావులు, మూసీ, ఈసీ వాగులకు ఇరువైపులా మరికొంత సాగవుతోంది. 2022–23 వానాకాలంలో 4,28,479 ఎకరాల్లో పంట సాగవ్వగా, అదే యాసంగిలో 1.41,228 ఎకరాలు సాగైంది. 2023–24 యాసంగిలో 1,25,600 ఎకరాలు.. 2024 యాసంగిలో 1,39,754 ఎకరాల్లో పంట సాగైంది. ఇక 2025–26 యాసంగిలో 1.57 లక్షల ఎకరాలు సాగవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు 4,390.255 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచింది. అంచనాల మేర పంట సాగు లేకపోవడం విశేషం. నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షాలు పుష్కలంగా కురిశాయి. భూగర్భ జలాలు కూడా అనూహ్యంగా పెరిగాయి. సాగు విస్తీర్ణం పెరగక పోగా, మరింత తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఎరువుల పంపకం కోసం ప్రభుత్వం ఫెర్టియాప్ను అందుబాటులోకి తెచ్చింది. పంట సాగు చేసిన రైతులు యూరియా కోసం ఈ యాప్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 32 లక్షల ఎకరాలు మాత్రమే పంటసాగైనట్లు ఈ యాప్ ద్వారా తేలింది. కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్లు.. ● ఐటీ అనుబంధ సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో జిల్లాలోని భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ కారణంగా పంట భూములు వ్యవసాయేతర భూములుగా మారుతున్నాయి. ● నిన్నటి వరకు పచ్చని పంట పొలాలు, పండ్ల తోటలతో ఆహ్లాదంగా కనిపించిన భూములు ఎత్తయిన భవనాలతో గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులుగా మారుతున్నాయి. ● కూలీల ఖర్చు పెరగడం, దిగుబడి తగ్గడం, చీడపీడల సమస్య వేధిస్తుండటంతో మెజార్టీ రైతులు సాగుకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు పండ్లు, పూలు, కాయగూరలు పండిన భూముల్లో పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. ● ఇప్పటికే సరూర్‌నగర్, బాలాపూర్, హయత్‌నగర్, గండిపేట్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలాలు పూర్తిగా పట్టణీకరణ జరిగిపోయాయి. ● అంతో ఇంతో పంటలు పండిన శంషాబాద్, మహేశ్వరం, అబ్దుల్లాపూర్‌మెట్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోనూ 80 శాతం పంట భూములు వ్యవసాయేతర భూములుగా మారాయి. కేవలం 20 శాతం భూముల్లోనే పంటలు సాగవుతున్నాయి. ● మంచాల, మాడ్గుల, ఆమనగల్లు, కేశంపేట, కొందుర్గు, షాబాద్, యాచారం మండలాల్లో మాత్రమే పంటలు సాగవుతున్నాయి. చేవెళ్ల, కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, జిల్లెడు చౌదరిగూడ, మండలాల్లో 50 శాతం భూములు ఇప్పటికే వ్యవసాయానికి దూరమయ్యాయి. జిల్లాలో భారీగా పడిపోయిన సాగు అంచనాలు తలకిందులు 1.57 లక్షల ఎకరాలు అంచనా 32 వేల ఎకరాలకు మించని వైనం గణనీయంగా తగ్గిన విస్తీర్ణం పట్టా, అసైన్డ్ భూమి మొత్తం ఫార్మాసిటీ కోసం తీసుకున్నారు. దీంతో పంటల సాగు పూర్తిగా తగ్గిపోయింది. రైతులు, వ్యవసాయ కూలీలు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఊరు విడిచి పట్నం వెళ్లి బతుకుతున్నాం. – బొక్కా శ్రీధర్‌రెడ్డి, రైతు, తాడిపర్తి, యాచారం మండలంకూలీల ఖర్చు పెరిగి పెట్టు బడి కూడా రావడం లేదు. మార్కెట్లో పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతుల కంటే దళారులే ఎక్కువగా లాభం పొందుతున్నారు. గతంలో ఏడు ఎకరాల్లో పూలు, కూరగాయలు పండించే వాళ్లం. ఇప్పుడు మూడు ఎకరాల్లో వరి పంట మాత్రమే సాగు చేస్తున్నా. – నరేందర్, రైతు, చౌదరిగుడ, శంషాబాద్ -
వడ్డెర్ల సంక్షేమానికి.. అన్ని రంగాల్లో వెనుకబడిన వడ్డెర్ల సంక్షేమా నికి కృషి చేయాలని వడ్డెర సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు కోరారు.
‘పల్లె’టూరుకు.. షాద్‌నగర్: పండక్కి సొంతూళ్లకు వెళ్లేవారు కొందరు.. బంధువుల వద్దకు వెళ్లే వారు మరికొందరు.. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇంటికి వచ్చేవారు ఇంకొందరు.. సెలవులు కావడంతో సరదాగా టూర్లు వెళ్లే వారు మరికొందరు.. ఇలా అంతా ఒక్కసారిగా ప్రయాణం మొదలు పెట్టడంతో షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ టోల్గేట్ వద్ద వేలాది వాహనాలు క్యూ కడుతున్నాయి. రహదారులపై రద్దీ సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. రహదారులు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, అనంతపురం, కడప తదితర ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహబూబ్‌నగర్, గద్వాల వైపు వెళ్లే వారు 44వ జాతీయ రహదారి పై నుండి వెళ్తున్నారు. కొందరు హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్నారు. దీంతో షాద్‌నగర్ పరిధిలో ఉన్న జడ్చర్ల ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ప్లాజా వద్ద ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. నిమిషానికి 30 వాహనాలు షాద్‌నగర్ మీదుగా ఉన్న 44వ జాతీయ రహదారిపై పండగ సందర్భంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. శనివారం సాయంత్రం నుంచి క్రమక్రమంగా సొంతూళ్లకు వెళ్తున్నారు. శనివారం అర్ధరాత్రి 12 నుంయి ఆదివారం సాయంత్రం 5గంటల వరకు 30వేల వాహనాల టోల్ గేటు నుంచి వెళ్లాయి. అంటే నిమిషానికి సుమారు 30 వాహనాలు టోల్ గేట్ దాటినట్లు లెక్క. ఒక్కో వాహనంలో సుమారు నలుగురు ప్రయాణించినా 17 గంటల్లో 30వేల వాహనాల్లో లక్షా 20వేల మంది గమ్యస్థానాలకు చేరినట్లు అంచనా. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని టోల్గేట్ వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. 12 గేట్ల ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్ రుసుము చెల్లించేందుకు ప్రత్యేక గేటును ఏర్పాటు చేశారు. పండగ సందర్భంగా బస్సుల్లో వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో షాద్‌నగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అదనపు బస్సులు నడిపిస్తున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు పయనం రాయికల్ టోల్గేట్ వద్ద వాహనాల క్యూ కిటకిటలాడుతున్న బస్టాండ్లు -
ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకొని
కేశంపేట: బతుకుదెరువు కోసం రాష్ట్రానికి వలస వచ్చిన కూలీ ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటు పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. బిహార్ రాష్ట్రంలోని బేర్కియాకు చెందిన గుడ్డు కుమార్‌యాదవ్(20) కేశంపేట గ్రామంలోని రాఘవేందర్ వద్ద రెండు నెలల పనులకు చేరాడు. అయితే ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటు పడిన కుమార్‌యాదవ్ కూలీ డబ్బులను పోగొట్టుకునేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 6న పని చేసే ప్రదేశం నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆదివారం కేశంపేట గ్రామ శివారులోని వాగు సమీపంలో చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలను సేకరించారు. చెట్టుకు ఉరివేసుకున్న వ్యక్తి కుమార్యాదవ్గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజ్‌కుమార్ తెలిపారు. వలస కూలీ ఆత్మహత్య -
సర్పంచుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
తుక్కుగూడ: జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్పంచుల సంఘాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శివశంకర్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షురాలు మాధవిరాంరెడ్డి, ప్రధాన కార్య దర్శులుగా ఈ.రవి, పద్మకృష్ణ, ఉపాధ్యక్షులుగా గోపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, గోపాల్, కార్యనిర్వాహక కార్యదర్శిగా శ్రీనుతో పాటు మరికొంత మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ చాంబర్స్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ పాల్గొన్నారు. వాహనం ఢీకొని వ్యక్తి మృతి కొత్తూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామికవాడ రోడ్డుపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ గోపాలకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన హనుమంతు(44) కొంత కాలంగా తీగాపూర్ శివారులో ఉన్న ఓ పరిశ్రమలో పనిచేస్తూ క్వాటర్స్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా శనివారం విధులకు వెళ్లకుండా పాత జాతీయ రహదారి కూడలి వద్దకు వచ్చి తిరుగు ప్రయాణంలో కాలినడకన వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతుడి ఆచూకీ తెలుసుకుని కుటుంబ సభ్యులకు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి సత్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వివరించారు. యువకుడి దారుణ హత్య నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు కొత్తూరు: గుర్తు తెలియని ఓ యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన కొత్తూరు పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని శివానగర్ కాలనీలోని ఖాళీ స్థలంలో ఓ యువకుడి మృతదేహం పడి ఉందనే స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్నట్లు తెలిపారు. కాగా ప్రాథమిక విచారణలో భాగంగా ఓ ప్యాసెంజర్ ఆటోలో ఐదుగురు యువకులు కలిసి మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి మద్యం తాగి గొడవ పడ్డట్లు తెలిసిందన్నారు. గొడవలో భాగంగా ఒకరిని నలుగురు యువకులు రాయి, ఖాళీ మద్యం బాటిళ్లతో కొట్టి హత్యకు పాల్పడ్డట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించినట్లు పేర్కొన్నారు. క్లూస్‌టీం, సాంకేతికత సహకారంతో త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు. -
కురుమలు రాజకీయంగా ఎదగాలి
మీర్‌పేట: కురుమలు అన్ని వర్గాలను కలుపుకొని, రాజకీయంగా ఎదగాలని మాజీ ఎమ్మెల్సీ, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం అన్నారు. కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధాల దశరథ అధ్యక్షతన ఆదివారం మీర్‌పేటలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సంఘం భవన నిర్మాణం కోసం ఎకరం స్థలం కేటాయించాలని త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడతానని అన్నారు. కొన్ని జిల్లాల్లో భవనాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో కురుమలు పోటీ చేసి కార్పొరేటర్లుగా విజయం సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సదానందం, ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, బాలాపూర్ మండల అధ్యక్షుడు ఇక్కె సత్యనారాయణ, మీర్‌పేట, జిల్లెలగూడ అధ్యక్షులు దేవరింటి వెంకటేశ్ కురుమ, సిద్ధాల జగదీష్ కురుమ, చినింగి బాలయ్య, నారి సత్యనారాయణ, అచ్చెన యాదగిరి కురుమ, మేకల ప్రశాంత్, ప్యాట నర్సింహ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం -
పండుగ పూట జరభద్రం
షాద్‌నగర్/షాబాద్: అసలే సంక్రాంతి పండుగ సెలవులు.. ప్రజలు ఇళ్లు విడిచి ఊరెళ్తే దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉంది. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడే ప్రమాదం ఉంది. శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు అప్రమంతగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తే మేలు ఊరికి వెళ్తున్న వారు జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో ఉండటం లేదని చుట్టుపక్కల వారితోపాటు పోలీసులకు తెలియజేయాలి. కుటుంబ సభ్యులందరూ వెళ్తే విలువైన ఆభరణాలు తమ వెంట తీసుకెళ్లాలి. బ్యాంకు లాకర్స్‌లో భద్రపర్చుకోవడం ఉత్తమం. ఇంట్లో ఎవరూ లేనప్పుడు విలువైన వస్తువులను బీరువాలో ఉంచవద్దు. ఎక్కువ మొత్తంలో నగదు లేకుండా చూసుకోవాలి. పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే రాత్రిపూట పెట్రోలింగ్ సమయంలో నిఘా ఉంచేందుకు ఆస్కారం ఉంటుంది. రాత్రిపూట గ్రామాలు, కాలనీల్లో అనుమానాస్పదంగా సంచరించే వారిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలి. వృద్ధులు, చిన్న పిల్లలు రాత్రివేళలో ఇంట్లో ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించాలి. ఇంటి బయట, హాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. వాహనాలను రోడ్డుపై కాకుండా ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోవాలి. ఇంటి తాళాలు రహస్య ప్రదేశంలో దాచిపెట్టాలి. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ సంక్రాంతి సెలవులకు ఊరెళ్తే అప్రమత్తతంగా ఉండాలని పోలీసుల సూచనలు -
ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌గా సుజాత
ఇబ్రహీంపట్నం: స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్‌గా సుజాత శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆ స్థానంలో ఉన్న వెంకటనర్సప్ప ఉప్పల్ ఆర్టీసీ స్టోర్ ఆఫీసర్‌గా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా డిపోలో కొత్తగా వచ్చిన సుజాతకు స్వాగతం పలుకుతూ, బదిలీపై వెళుతున్న వెంకటనర్సప్పకు వీడ్కోలు పలుకుతూ సన్మాన కార్యక్రమాన్ని సిబ్బంది నిర్వహించారు. డివైడర్‌ను ఢీ కొట్టి.. షూటింగ్ బస్సు బోల్తా హయత్‌నగర్: డివైడర్‌ను ఢీ కొట్టిన ఓ షూటింగ్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున హయత్‌నగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బిగ్ పిక్చర్స్‌కు చెందిన షూటింగ్ బస్ విశాఖపట్నం నుంచి మణికొండకు వెళ్తుంది. ఈ క్రమంలో పెద్దఅంబర్‌పేట్ వద్ద జాతీయ రహదారి ఫ్లైఓవర్ ఎక్కే క్రమంలో డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి, సహాయకుడు పుట్టా బీసన్న మాత్రమే ఉన్నారు. డ్రైవర్ చేతికి స్వల్ప గాయమైంది పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా బస్సును పక్కుకు తప్పించారు. కేసు దర్యాప్తులో ఉంది. బకాయి చెల్లిస్తే ఏడాదిపాటు రెంట్ ఫ్రీ కొందుర్గు: తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అద్దె బకాయి రూ.6.20లక్షలు చెల్లిస్తే ఏడాది పాటు రెంటు తీసుకోనని భవన యజమాని కోనేరు శ్రీనివాస్ అన్నారు. జిల్లేడ్ చౌదరిగూడ ఎంపీడీఓ కార్యాలయం కొంతకాలంగా గ్రామానికి చెందిన కోనేరు శ్రీనివాస్‌కు చెందిన భవనంలో కొనసాగుతోంది. ఆయనకు ప్రభుత్వం నుంచి రూ.6.20లక్షలు అద్దె బకాయి రావాల్సి ఉంది. ఈ సందర్భంగా శుక్రవారం అఖిల పక్ష నాయకులు తీర్మానం చేసి ఆ ప్రతిని డిప్యూటీ సీఈఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, కావలి రాజు, చంద్రబాబు గౌడ్, హఫీజ్, ఆంజనేయులు, నర్సింగ్‌రావు, వెంకటేశ్ పాల్గొన్నారు. -
సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ
నందిగామ: సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తూరు మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కల్వకుర్తికి చెందిన సంధ్యారాణి, కార్యనిర్వహక అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి, ఉపాధ్యాక్షులుగా ప్రవీణ్, పొగాకు రాంగోపాల్, కార్యదర్శిగా వెంకటేశ్ యాదవ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాధవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు భూమన్న యాదవ్ తెలిపారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు జగన్, శ్రీరాములు, రవీందర్, శ్రీశైలం యా దవ్, దయానంద్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఉపాధ్యక్షులుగా వెంకటయ్య, లక్ష్మణ్ కేశంపేట/శంకర్పల్లి: సర్పంచ్ల సంఘం జిల్లా ఉపాధ్యాక్షులుగా కేశంపేట మండలం లింగధన సర్పంచ్ నాగిళ్ల వెంకటయ్య, శంకర్పల్లి మండలం ఇరుకుంట తండా సర్పంచ్ పాత్లోత్ లక్ష్మణ్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కటి వెంకటేశ్ హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో వారికి నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన కమిటీకి, సర్పంచ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోప్లారం, మొకిల సర్పంచ్‌లు నరేందర్‌రెడ్డి, శేఖర్ పాల్గొన్నారు. -
వృద్ధుడు అదృశ్యం
మొయినాబాద్‌రూరల్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్ధుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన రాములు(75) ఈ నెల 7న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో ఆయన భార్య ఈశ్వరమ్మ చుట్టుపక్కల, బంధువుల వద్ద వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ లభిస్తే 72888 62866 నంబర్లో సమాచారం అందించాలని కోరారు. -
డ్రగ్స్ ఫ్రమ్ ఢిల్లీ!
● ఇద్దరు నైజీరియన్లు సహా నలుగురు అరెస్ట్ ● రూ.20 లక్షల విలువైన మాదకద్రవ్యాలు సీజ్ ● ఓ విదేశీయుడి వద్ద పలు గుర్తింపు కార్డులు స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: నైజీరియా నుంచి వివిధ రకాలైన వీసాలపై ఉత్తరాదికి వచ్చి... వీటితో పాటు పాస్‌పోర్టు గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తూ... డ్రగ్ పెడ్లర్స్‌గా మారిన ఇద్దరిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 లక్షల విలువైన 150 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నామని, వీరిలో ఓ నైజీరియన్ వద్ద ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులు ఉన్నాయని డీసీపీ వైభవ్ గైక్వాడ్ రంగనాథ్ పేర్కొన్నారు. బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. అరెస్టు కావడంతో మకాం మార్చి... నైజీరియాకు చెందిన ఛిడీ ఇజాయ 2014లో మెడికల్ అటెండెంట్ వీసాపై ఢిల్లీ వచ్చాడు. దీని గడువు అదే ఏడాది పూర్తికాగా... పాస్‌పోర్టు కూడా ఎక్స్పైర్ అయింది. నగరానికి వచ్చి తలదాచుకున్న ఇతడు డ్రగ్స్ దందా మొదలెట్టారు. 130 గ్రాముల కొకై న్, 32 గ్రాముల ఎండీఎంఏతో 2019లో గోల్కొండ ఎకై ్సజ్ అధికారులకు చిక్కాడు. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తన మకాం ఢిల్లీకి మార్చాడు. గోవాలోనూ డ్రగ్స్ సరఫరా చేస్తూ అరెస్టు అయ్యాడు. నాగేశ్వరన్ పేరుతో పలు గుర్తింపుకార్డులు పొందాడు. డ్రగ్స్ సరఫరా కొనసాగిస్తున్న ఇతడిపై 2024లో అంబర్‌పేట ఠాణాలో కేసు నమోదైనా పోలీసులకు చిక్కలేదు. టూరిస్ట్‌గా వచ్చి రెస్టారెంట్ పెట్టి... అదే దేశానికి చెందిన ఒబసీ జేమ్స్ విక్టర్ 2011లో టూరిస్ట్ వీసాపై ముంబై వచ్చాడు. ఇతడి వీసా, పాస్‌పోర్టు రెండూ ఎక్స్పైర్ అయిపోయాయి. అక్రమంగా నివసిస్తూ తొలినాళ్లల్లో వస్త్ర వ్యాపారం చేసినా ఆపై ఢిల్లీలో ‘విలియమ్ ఆఫ్రికన్ రెస్టారెంట్’ పేరుతో హోటల్ పెట్టి ఓ యువతినీ వివాహం చేసుకున్నాడు. ఛిడీ ఇజాయ నివసించే భవనంలో నివసిస్తుండటంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇరువురూ కలిసి ఢిల్లీలోనే ఉండే క్రీస్ అనే నైజీరియన్ నుంచి ఎండీఎంఏ సహా డ్రగ్స్ ఖరీదు చేసి సబ్ పెడ్లర్స్‌కు విక్రయిస్తున్నారు. కొన్నిసార్లు నేరుగా వచ్చి, మరికొన్ని సార్లు పార్సిల్ చేసి నగరంలోని సబ్–పెడ్లర్స్, కస్టమర్లకు పంపిస్తున్నారు. డెలివరీ చేయడానికి వచ్చి... ఇటీవల నగరం నుంచి ఎండీఎంఏ కోసం వీరికి ఆర్డర్ వచ్చింది. దీంతో సరుకు తీసుకున్న ఇరువురూ డెలివరీ చేయడానికి టోలీచౌకి ప్రాంతానికి వచ్చారు. దీనిపై హెచ్–న్యూకు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్, ఎస్ఐ సి.వెంకట రాములు తమ బృందాలతో రంగంలోకి దిగారు. టోలిచౌకి పోలీసుల సాయంతో ఇరువురినీ అరెస్టు చేసి, డ్రగ్, గుర్తింపుకార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఛిడీ ఇజాయ వద్ద లభించిన గుర్తింపుకార్డులు అసలైనవిగానే ఉన్నాయని, ఇవి ఎలా వచ్చాయనేది ఆరా తీస్తున్నామని డీసీసీ గైక్వాడ్ తెలిపారు. ఈ కేసులో సబ్–పెడ్లర్స్, కస్టమర్లను గుర్తించామని, వారినీ నిందితులుగా చేర్చి గాలిస్తున్నట్లు వివరించారు. నగరంలో మాదకద్రవ్యాల క్రయవిక్రయాల వివరాలు తెలిస్తే 8712661601కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు
● పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ● ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం: నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ నూతన కార్యాలయ భవనంతోపాటు, రూ.7.40 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రూ.2.50 కోట్ల డిస్ట్రిక్ మినిరల్ ఫండ్‌తో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలలోపు మరో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. చెరువు కట్ట సుందరీకరణ, పాత పట్టణంలోకి వచ్చే ప్రధాన రోడ్డును విస్తరించి, సెంట్రల్ లైటింగ్‌కు రూ.50 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఎవరి జీవనోపాధి దెబ్బతినకుండా రోడ్డు విస్తరణ పనులు చేస్తామన్నారు. తాను ఎన్నికలప్పుడు హామీలిస్తుంటే కొంతమంది ఎగతాళి చేసారని, ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే జీర్ణించుకోవడం లేదన్నారు. ఇబ్రహీంపట్నం టౌన్లో అక్రమంగా ప్రభుత్వ భూమిలో ఓఆర్సీ తెచ్చుకొని వెంచర్ చేసి ప్లాట్లను విక్రయిస్తుంటే, వాటిని ఆపినట్లు వివరించారు. ప్రభుత్వ భూమిని దిగమింగాలని చూసిన వారి నుంచే కొనుగోలుదారులకు డబ్బులిప్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ సునీతారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌గౌడ్, ఏసీపీ కేపీవీ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, ట్రైనీ అడిషనల్ కలెక్టర్ వీణ, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. -
భార్య బలవన్మరణానికి కారణమైన భర్తకు ఐదేళ్లు జైలు
రూ.4 వేల జరిమానా కందుకూరు: భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తకు కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.4 వేల జరిమానా విధించింది. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని రాచులూరుకు చెందిన(ప్రస్తుతం తిమ్మాపూర్ గ్రామంలో నివాసం) కొంగర కృష్ణ, సంతోష దంపతులు. కృష్ణ మద్యానికి అలవాటై తరచూ భార్యను వేధించేవాడు. ఈక్రమంలో 2013 మార్చి 27న ఉదయం 7 గంటల సమయంలో భార్యను కొట్టడంతో మనస్తాపానికి గురైన ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన ఇరుగు పొరుగు వారు ఆమెను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. 13 ఏళ్లుగా కోర్టులో కేసు ఉండగా శుక్రవారం జిల్లా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చాడు. కేసు ముగియడానికి సహకరించిన అప్పటి ఎస్ఐలు జి.నాగరాజు, డి.నాగార్జున, సిబ్బంది బి.మహాలక్ష్మి, అనిల్, జి.మహేశ్‌బాబు, సీహెచ్ యాదగిరి, లైజాన్ ఆఫీసర్ టి.వెంకటరమణకు కృతజ్ఞతలు తెలిపారు. చెట్టును ఢీకొట్టిన కారు ఇద్దరికి గాయాలు కేశంపేట: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ఆమనగల్లుకు చెందిన వెంకటేశ్, సునీత పనినిమిత్తం షాద్‌నగర్‌కు వచ్చి తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పాపిరెడ్డిగూడ శివారులోకి రాగానే కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
నందిగామ: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి ఏఐజేఏసీటీఓ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం కొత్తూరు మండల కేంద్రంలో పలువురు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రఘుపాల్ మాట్లాడుతూ.. సర్వీస్‌లో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ పెన్షన్ పథకం రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసి, పాఠశాలల విలీనం, మూసివేతలకు వ్యతిరేకంగా ఆల్ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్(ఏఐజెఏసీటీఓ) ఇచ్చిన పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఏఐజేఏసీటీఓ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పొరాటాలకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రఘుపాల్ -
డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన శిరీష
నందిగామ: షాద్‌నగర్ జోన్ డీసీపీగా సీహెచ్ శిరీష శుక్రవారం నందిగామ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె జోన్ పరిధిలోని ఎస్హెచ్ఓలతో సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి పోలీసు కృషి చేయాలని, ప్రజలకు చేరువగా ఉంటూ సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్హెచ్ఓలు ప్రసాద్, నర్సయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. షాద్‌నగర్‌లో నూతనంగా కార్యాలయం ఏర్పాటయ్యే వరకు నందిగామ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయం నుంచి శిరీష విధులు నిర్వర్తించనున్నారు. తుక్కుగూడ: మున్సిపల్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. తాము పడుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించాలని మండలి చైర్మన్‌ను కోరినట్టు తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ట్రెజరర్ శ్రీధర్‌రెడ్డి, టీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.పర్వతాలు తదితరులు ఉన్నారు. ఆమనగల్లు: మున్సిపల్ పరిధిలోని సాకిబండతండాలో శుక్రవారం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వే పనులను మరోసారి గిరిజన రైతులు అడ్డుకున్నారు. తండాలో సర్వే కోసం రెవెన్యూ అధికారులతో పాటు వివిద శాఖల అధికారులు రావడంతో రైతులు తమకు ఇచ్చే నష్టపరిహారం తేల్చిన తరువాతే సర్వే జరపాలని కోరారు. ఆమనగల్లు తహసీల్దార్ ఫయీంఖాద్రితో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కండె హరిప్రసాద్ మాట్లాడారు. రైతులకు నష్టపరిహారం ప్రకటించాకే సర్వే చేయాలని సూచించారు. సర్వేను వెంటనే నిలిపివేయండి కడ్తాల్: గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు సర్వే పనులను వెంటనే నిలిపివేయాలని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జర్పుల దశరథ్‌నాయక్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని ఎక్వాయిపల్లి సమీపంలో శుక్రవారం గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు సర్వే పనులు చేపడుతున్నారనే సమాచారం అందుకున్న ఆయన అక్కడికి చేరుకున్నారు. నిర్వాసితులతో కలిసి వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనునాయక్, కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు. షాద్‌నగర్: సేవే లక్ష్యంగా కమ్మ సంఘం నాయకులు ముందుకు సాగాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్‌రావు పిలుపునిచ్చారు. పట్టణ శివారులోని ఎన్‌హెచ్ 44 హోటల్లో శుక్రవారం కమ్మ సమైఖ్య వేదిక ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభేదాలను పక్కనపెట్టి అందరూ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. కమ్మజాతి అభ్యున్నతికి, కార్పొరేషన్ ఏర్పాటు కోసం పని చేయాలన్నారు. కార్యక్రమంలో కమ్మ సమైఖ్య వేదిక డివిజన్ కమిటీ అధ్యక్షుడు మన్నవసాంబ శివరావు, ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ, కోశాధికారి కాపా వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలి
తుక్కుగూడ: పాఠశాల విద్యార్థులు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని డీఈఓ సుశీందర్‌రావు సూచించారు. తుక్కుగూడ బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులు తయారు చేసిన వంటకాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం భాస్కర్‌రెడ్డి, శృతిలయ అకాడమీ చైర్మన్ చిత్తరంజన్‌దాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
క్రీడాకారులను గుర్తించేందుకే సీఎం కప్
చేవెళ్ల: పల్లె నుంచి ప్రపంచ స్థాయి వరకు విజేతలు అనే నినాదాంతో ప్రభుత్వం సీఎంకప్ క్రీడా పోటీలు నిర్వహిస్తోందని జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి (డీఎస్డీఓ) వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణ కేంద్రంలో శుక్రవారం సీఎం కప్ టార్చ్ రిలే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు ఆరోగ్యాన్ని ఇవ్వడంతోపాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో విడతల వారీగా పోటీలు నిర్వహించటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన పీఈటీలు, పీడీలు నాగసంధ్య, సరిత, ప్రవీణ్, మల్లేశ్, సీఆర్పీలు, విద్యార్థులు పాల్గొన్నారు. డీఎస్డీఓ వెంకటేశ్వర్లు -
ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో..
● కుమారుడికి విషమిచ్చి ఆపై బలవన్మరణం ● తీరని విషాదం నింపిన ఘటన మీర్‌పేట: చిన్ననాటి నుంచి ఉమ్మడి కుటుంబంలో పెరిగింది.. ప్రేమానురాగాల మధ్య పెద్దదైంది.. ఉన్నత చదువులు చదివి.. ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది.. పండంటి బాబుకు జన్మనిచ్చింది.. గోరు ముద్దలు తినిపిస్తూ.. ఆప్యాయతానురాగాలు పంచుతూ బిడ్డే సర్వస్వంగా బతికింది.. ఏం కష్టం వచ్చిందో ఏమో చేజేతులా విషమిచ్చి.. తానూ బలవన్మరణానికి పాల్పడింది. ఇది చూసి తట్టుకోలేని ఆ ఇల్లాలి తల్లి సైతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది.. కన్న కొడుకును చంపేసి.. తానూ ఉరేసుకున్న ఈ విషాదకర ఘటన తీవ్రంగా కలిచివేసింది. బంధువులు విషాదంలో మునిగిపోయారు. ప్రేమానురాగాల మధ్య పెరిగి.. సుష్మిత స్వగ్రామం నల్లగొండ జిల్లా రామన్న పేట మండలం సిరిపురం. కాగా యశ్వంత్ రెడ్డిది గుర్రంపోడు మండలం పాల్వాయి. చిరు ప్రాయంలోనే తండ్రి దూరం కావడంతో సుష్మితను తల్లి లలిత అల్లారు ముద్దుగా పెంచింది. మొదటి నుంచీ ఉమ్మడి కుటుంబం కావడంతో పెద్దనాన్నలు, మేనత్తలు, ఇతర బంధు వుల మధ్య ఆత్మీయంగా పెరిగింది. బీటెక్, ఎంబీఏ పూర్తి చేసి కొంతకాలం ఉద్యోగం కూడా చేసింది. సమీప బంధువైన యశ్వంత్‌రెడ్డికి ఇచ్చి రెండున్నరేళ్ల క్రితం అన్ని లాంఛనాలతో ఘనంగా వివాహం జరిపించారు. వివాహమైన కొంత కాలం నుంచే మీ బంధువుల విషయాలు మాట్లాడొద్దని, వారె వరూ మన దగ్గరకు రావొద్దని భర్త యశ్వంత్‌రెడ్డి పెట్టిన నిబంధనలే సుష్మిత ఈ నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించాయనేది పుట్టింటివారి ఆరోపణ. నెల రోజుల్లో నిర్వహించాల్సిన కుమారుడి జన్మదిన వేడుక విషయంలోనూ తాజాగా భార్యాభర్తల మధ్య జరిగిన చర్చ కూడా కారణమై ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా కన్న తల్లే బిడ్డకు విషమివ్వడం వెనుక గల కారణాలు.. ఆ తల్లి ఎంత మనోవేదనకు గురై ఉంటుందోననే సందేహాలు చర్చనీయాంశమయ్యాయి. -
సౌరశక్తే మన భవిష్యత్తు
● టీజీ రెడ్కో రాష్ట్ర చైర్మన్ డాక్టర్ శరథ్ మాడ్గుల: సూర్యుడే మన శక్తి.. సౌరశక్తి మన భవిష్యత్తు అని టీజీ రెడ్కో చైర్మన్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం టీజీ రెడ్కో ఆధ్వర్యంలో గృహజ్యోతి లబ్ధిదారులకు సోలార్ విద్యుత్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహజ్యోతి లబ్ధిదారులకు గ్రామంలో వారి ఇళ్లపై 2కే వాట్స్ సోలార్ సిస్టమ్‌తో 240 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందన్నారు. కార్యక్రమంలో టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ వేణుగోపాల్, విక్రమ్, తహసీల్దార్ వినయ్ సాగర్, విద్యుత్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
సారు.. మాట మార్చారు
శంకర్పల్లి: ప్రభుత్వ సర్వేయర్ చేసిన భూ సర్వే కాపీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మోకిల తండా పాలక వర్గ సభ్యులు, గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదటగా తహసీల్దార్ సురేందర్ కార్యాలయానికి రాకపోవడంతో ఆయన ఖాళీ కుర్చీకి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత డిప్యూటీ తహసీల్దార్ బాలకృష్ణారెడ్డితో మాట్లాడగా ఆయన గంట తర్వాత సర్టిఫైడ్ సర్వే కాపీ ఇస్తానని చెప్పడంతో తండావాసులు వేచి చూశారు. ఫోన్ రాకతో మారిన మాట ఇదిగో కాపీ.. అదిగో కాపీ అని గంటసేపు కాలయాపన చేసిన డిప్యూటీ తహసీల్దార్ చివరికి కాపీని సిద్ధం చేశారు. అంతా ఓకే అని కాపీ ఇద్దామనుకునే సమయంలో ఉన్నతాధికారుల నుంచో లేక మరెవరి నుంచో ఫోన్ కాల్ రావడంతో వెంటనే మాట మార్చారు. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున సర్వే కాపీని ఇవ్వలేనని, రీ సర్వే చేసిన తర్వాత ఇస్తామని చెప్పారు. దీంతో తండావాసులు మండిపడ్డారు. డిప్యూటీ తహసీల్దార్‌ని చుట్టు ముట్టి వాగ్వాదానికి దిగారు. ఎవరితోనే కుమ్మకై ్క సర్వే కాపీ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఐ శ్రీనివాస్ గౌడ్ జోక్యం చేసుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి బయటకు పంపారు. ఏమిటీ వివాదం.. తండాలోని సర్వేనంబర్ 76లో పంచాయతీ భవనం ఉంది. దాని వెనకాల సుమారు 500 గజాల స్థలం ఉండగా.. అది తనదే అంటూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గతంలో నిర్మాణాలు చేపట్టాడు. దీనిని గత నెల 25న గ్రామస్తులు కూల్చివేయగా.. ఇరువర్గాల వారు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. గ్రామ పాలకవర్గం సర్వే 76లో ప్రభుత్వ సర్వే చేసి, పంచాయతీ స్థలాన్ని కాపాడాలని వినతిపత్రం అందించగా.. వారు జనవరి 3న అధికారికంగా సర్వే చేశారు. రిపోర్టు కాపీని పాలకవర్గానికి అందించడానికి అధికారులు సుముఖంగా లేకపోవడం తండావాసులకు ఆగ్రహం తెప్పించింది. దీనిపై పలుమార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు. పంచాయతీ స్థలం విషయమై నెలకొన్న వివాదం సర్వే కాపీ ఇవ్వాలని తండావాసుల ఆందోళన గంట తర్వాత ఇస్తానన్న డిప్యూటీ తహసీల్దార్ ఫోన్ కాల్ రాకతో మారిన మాట వాగ్వాదానికి దిగిన ఆందోళనకారులు -
మదర్‌లో అక్రమాలపై విచారణ చేపట్టాలి
● 2015 నుంచి మొదలైన అక్రమాల పర్వం ● నష్టాలను లాభాలుగా చూపించి బ్యాంకు రుణాలు పొందారు ● డెయిరీ ప్లాంట్‌తో సహా, చిల్లింగ్ సెంటర్ల ఆస్తులు తాకట్టులో ఉన్నాయి ● మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి సాక్షి, యాదాద్రి: నల్లగొండ–రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (నార్ముల్ మదర్ డెయిరీ)లో 2015 నుంచి జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఆయన శుక్రవారం భువనగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలను మాజీ చైర్మన్ మాటల్లోనే.. తాను 2024లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేనాటికి డెయిరీ రూ.35.15 కోట్ల నష్టాల్లో ఉన్నట్టు జనరల్‌బాడీ తీర్మానంలో చూపించారు. అప్పటికే డెయిరీ ఆస్తులు బ్యాంకుల్లో తాకట్టుపెట్టారు. ఈ ఆస్తులను జప్తు చేస్తారనే భయంతో గత పాలకవర్గం నష్టాలను, లాభాలుగా చూపించి బోగస్ ఆడిట్ రిపోర్టు రూపొందించి రిపోర్ట్‌ను డీసీఓకు పంపారు. అనుమానం వచ్చిన డీసీఓ పాత ఆడిట్ రిపోర్ట్ లెక్కలను బయటకు తీయడంతో అసలు బండారం బయట పడింది. ఏకంగా రూ.10 కోట్లు అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. నష్టాలకు ఆదాయపన్ను కట్టారు డెయిరీ నష్టాలు ఏటేటా పెరిగిపోతూ రూ.46 కోట్లకు చేరింది. నష్టాలు చూపిస్తే బ్యాంకుల నుంచి రుణాలు పొందడం కష్టమని భావించి డెయిరీ రూ.8.50కోట్లు లాభాల్లో ఉన్నట్టు దానికి ఇన్‌కం టాక్స్ రూ.2.70 కోట్లు కట్టినట్టు రికార్డులు చూపారు. తాను చైర్మన్‌గా ఎన్ని కయ్యే నాటికి డెయిరీ రూ.35 కోట్లు నష్టాల్లో ఉన్నట్టు జనరల్ బాడీ తీర్మానంలో చూపారు. కానీ, అదే తీర్మానంలో రూ.1.84 కోట్లు లాభాల్లో ఉందని, దానికి రూ.45 లక్షలు ఆదాయపన్ను కట్టినట్టు మ రో లెక్క పత్రం తయారు చేశారు. డెయిరీలో ఎండీ అవినీతికి పాలకవర్గంలోని డైరెక్టర్లు మద్దతుగా నిలిచారు. రూల్స్ ప్రకారం పాలు డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ ఒకే రేటు ఫిక్స్ చేస్తారు. కానీ, ఎండీ మాత్రం పాలవకర్గం తీర్మానం కాపీని టాంపరింగ్ చేశారు. లీటర్‌కు రూ.2 అదనంగా చెల్లించి నలుగురు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ప్రతి నెలా లక్షల సొమ్ము కాజేశారు. విచారణను సైతం తొక్కిపెట్టారు. ప్రతి నెలా రూ.4 కోట్ల నష్టం మదర్ డెయిరీ నష్టం నెలకు రూ.4కోట్ల చేరింది. డెయిరీ ఆస్తుల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయి. 2009లో చిట్యాల చిల్లింగ్ సెంటర్ పరిధిలో కొనుగోలు చేసిన భూముల విలువ అసలు ధర ఎకరా రూ.5.75లక్షలు మాత్రమే. కానీ, డెయిరీ రికార్డుల్లో భూముల విలువ అమాతంగా రూ.16 లక్షలకు పెంచారు. రైతులకు రూ.1.50కోట్లు చెల్లించి, భూముల కొనుగోలు పేరుతో అక్రమంగా రూ.5 కోట్లు కాజేశారు. రూ.35 కోట్లు నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడేందుకు చిట్యాల ఆస్తులు అమ్మేందుకు ప్రయత్నిస్తే 295 మంది పాల సంఘాల చైర్మన్ల సంతకాలు పెట్టించి కోర్టులో కేసువేశా రు. మళ్లీ ఇప్పుడు అదే భూమిని అమ్ముతామని కొత్త పాలకవర్గం అంటుంది. రైతుల సంస్థను కాపాడడానికి ఎంతదూరమైనా వెళ్లి పోరాటం చేస్తా. నష్టాల్లో ఉన్న డెయిరీని కాపాడేందుకు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)తో మదర్ డెయిరీ పాలకవర్గం ఢిల్లీ వెళ్లి ఒప్పందం చేసుకుంది. కానీ, ఎన్డీడీబీ ఎంటర్ అయితే డైరక్టర్లు, ఎండీ కృష్ణల ఆదాయానికి గండిపడుతుందని అడ్డుకున్నారు. -
నిషేధమైనా వదలం!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నిషేధిత భూములకు రెక్కలొచ్చాయి. తప్పుడు పత్రాలతో విలువైన భూములు పరాధీనం అవుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. అప్పటి వరకు 22 ఏ జాబితాలో ఉన్న భూములు రాత్రికి రాత్రే పట్టా భూములుగా మారుతున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల సంతకాలను ఫోర్జరీ చేసి.. నకిలీ ఓఆర్సీ పత్రాలు సృష్టిస్తున్నారు. వక్ఫ్, ఇనాం, జాగీర్దార్, భూదాన్, దేవాదాయశాఖల భూములు అన్యాకాంత్రం అవుతున్నాయి. ఆక్రమించి వాటికి నకిలీ పత్రాలు సృష్టించి వెంచర్లు, విల్లా ప్రాజెక్టులకు అప్పగిస్తున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు వీరికి పరోక్షంగా సహకరిస్తుండటం వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే రూ.వందల కోట్ల విలువైన భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మచ్చుకు కొన్ని .. ● కొంగరకుర్దు ఏ–1 (రావిర్యాల) రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 85,86,88,89లో 584.34 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. ఇక్కడ ఎకరం రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల విలువ చేస్తుంది. 1954 నుంచి ఇప్పటి వరకు పట్టా కాలంలో సయ్యద్ షారాజ్ ఖత్తార్ హుస్సేన్ దర్గా పేరు ఉంది. 2008లో వక్ఫ్ బోర్డు ఓ గెజిట్ కూడా విడుదల చేసింది. ఇప్పటికే 58 ఎకరాలకు తప్పుడు పత్రాలు సృష్టించిన అక్రమార్కులు తాజాగా మరో 110 ఎకరాలను కొల్లగొట్టేందుకు తెరవెనుక పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఇదే రెవెన్యూ పరిధిలోని ఓ అమ్యూజ్మెంట్ పార్క్‌కు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 82/అ/1లో 11.17 ఎకరాల వక్ఫ్ భూ మిని సైతం నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలతో వెంచర్ చేశారు. కలెక్టరేట్‌కు అత్యంత సమీపంలో జరుగుతున్న భూదోపిడీని అడ్డుకున్న వారే లేరు. ● అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తట్టి అన్నారంలో 600పైగా ప్లాట్లు విక్రయించేందుకు ఓ స్థిరాస్తి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏడేళ్ల క్రితం రెండెకరాల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు తహసీల్దార్ కార్యాలయం నుంచి అనుమతి పొందారు. ఆ పక్కనే ఉన్న మరో ఎకరానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఆర్డీఓ అనంతరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి అనుమతి కోసం హెచ్ఎండీకు సమర్పించగా అనుమతులు జారీ కావడం విశేషం. ఆరా తీస్తే అసలు విషయం బయటికి వచ్చింది. ● అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం సర్వే నంబర్ 376లో 220 ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ గతంలో వెంచర్ చేశారు. ప్రజావసరాల కోసం లక్ష గజాలను కేటాయించారు. కొంతమంది నకిలీ కన్వర్షన్ ప్రొసీడింగ్స్ సృష్టించి ఈ భూములను కొల్లగొట్టారు. విక్రయించేందుకు యత్నించగా గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నకిలీ ప్రొసీడింగ్‌గా తేలింది. ● మహేశ్వరం మండలం రావిర్యాల రెవెన్యూ సర్వే నంబర్ 354, 355లో 584 ఎకరాల జాగీర్దార్ భూములు ఉన్నాయి. జాగీర్దార్ల వ్యవస్థ రద్దుతో ఆ భూమి ప్రభుత్వాధీనంలోకి వచ్చింది. రెవెన్యూ అధికారులు 22ఎ జాబితాలో చేర్చారు. 2007లో ఇందులోని 172 ఎకరాలు వక్ఫ్‌బోర్డు ఆస్తిగా ప్రకటించారు. ఇదే సమయంలో తాము జాగీర్దార్ వారసులమంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కేసు కోర్టు పరిధిలో ఉండగానే కొంతమంది నకిలీ ప్రొసీడింగ్స్, ఓఆర్సీలు సృష్టించి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఇందుకు రిజిస్ట్రేషన్ అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ● ఆదిబట్ల పరిధిలోని ఓ విలువైన భూమి ప్రభుత్వానిదిగా గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చారు. ఆ భూమికి నకిలీ ఓఆర్సీలు సృష్టించి జాబితా నుంచి తొలగించారు. స్థానిక ఎమ్మెల్యే జోక్యంతో తిరిగి ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు. ● హయత్‌నగర్–ఇంజాపూర్ రోడ్డులోని సర్వే నంబర్ 191లో సర్కారు భూమి ఆక్రమణకు గురవుతోంది. లారీల కొద్ది మట్టిని పోసి, భూమిని కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ● మహేశ్వరం రెవెన్యూ సర్వే నంబర్ 461లో 128 ఎకరాల ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కళ్లుపడ్డాయి. స్వర్గీయ ఇందిరాగాంధీ హయాంలో దీనిలో 19 ఎకరాలను ఓ మాజీ సైనికోద్యోగితో పాటు స్థానిక ఎస్సీలు, కావలోనిబాయి తండా గిరిజనులకు సీలింగ్ పట్టాలు ఇచ్చింది. విలువైన ఈ భూములపై రియల్టర్ల కన్నుపడింది. నకిలీ పత్రాలు సృష్టించి, భూములను విక్రయించేందుకు యత్నిస్తున్నారు. మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం రెవెన్యూ సర్వే నంబర్లు 210,211,212లోని 16 ఎకరాల్లో రాఘవేంద్ర కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 1986లో వెంచర్ చేసి విక్రయించింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 50 గిరిజన కుటుంబాలు ఈ భూములను కొన్నాయి. విలువైన ఈ భూములపై కన్నేసిన కొంత మంది పెద్దలు గిరిజనులను రాత్రికి రాత్రి బయటికి పంపారు. కరెంట్ నిలిపివేసి, బౌన్సర్లను పెట్టి ఏళ్ల క్రితమే నిర్మించుకున్న ఇళ్లను కూలగొట్టారు. నిషేధిత భూములకు రెక్కలు వక్ఫ్, ఇనాం, జాగీర్దార్ భూములకు ఎసరు నకిలీ పట్టాలు.. ఓఆర్సీలు సృష్టించి ఆక్రమణలు రిటైర్డ్ ఉద్యోగుల సంతకాలతో పత్రాలు తయారీ విలువైన భూములను కొల్లగొడుతున్న రియల్టర్లు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు -
రండి.. చేరండి
ముందస్తు అడ్మిషన్ల అంశాన్ని విద్యార్థి సంఘాలతో పాటు పలువురు తల్లిదండ్రులు బోర్డు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదు. కార్పొరేట్ యాజమాన్యాలు ఇచ్చే ఆఫర్లకు కక్కుర్తి పడి అటువైపు కనీసం కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు లేకపోలేదు. చదువు, ర్యాంకుల పేరుతో ఇప్పటికే విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి పరోక్షంగా వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న కాలేజీ యాజమాన్యాలపై కనీస చర్యలు తీసుకోలేదు. ఎవరైనా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే సదరు కాలేజీ యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి, అనుమతులు రద్దు చేయాల్సిన పోలీసులు, బోర్డు అధికారులు కలిసి ఉల్టా బాధిత కుటుంబ సభ్యులపైనే కేసులు పురమాయిస్తున్నారు. చివరికి వారితో రాజీ కుదుర్చి.. యాజమాన్యాలతో వారు లబ్ధిపొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మెరిట్ టెస్టుల పేరుతో కాలేజీలకు పెద్ద ఎత్తున విద్యార్థులను రప్పించి స్థానికంగా ట్రాఫిక్‌కు కారణమవుతున్నారు. పిల్లలను వెంట తీసుకొచ్చిన తల్లిదండ్రులు తమ వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండటంతో ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెరిట్ టెస్టుల సమాచారాన్ని కనీసం స్థానిక ట్రాఫిక్ పోలీసులకు కూడా అందించడం లేదు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించబోతున్నారు. పరీక్షల నిర్వహణ ప్రారంభమే కాలేదు.. ఫలితాలే రాలేదు.. కానీ అప్పుడే పలు కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు పోటీపడి అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. పిల్లలు చదువుతున్న పాఠశాలల నుంచి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి మెరిట్ స్కాలర్షిప్ టెస్టుల పేరుతో విద్యార్థులను వీకెండ్లో కాలేజీ క్యాంపస్‌లకు రప్పిస్తున్నాయి. మాయమాటలతో తల్లిండ్రులను మభ్యపెడుతున్నాయి. కాలేజీలో పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయని, ముందస్తు బుకింగ్‌తో ఫీజులో రాయితీ ఉంటుందని, అదే ఏప్రిల్ తర్వాత కాలేజీ ట్యూషన్ ఫీజు డబుల్ అవుతుందని చెప్పి అడ్మిషన్ల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నాయి. తల్లిదండ్రులు వారి మాటలకు నమ్మి, తమ పిల్లల భవిష్యత్ బాగుండాలన్న తపనతో ఏమీ ఆలోచించకుండా వారు అడిగినంత చెల్లించి సీటును ముందే బుక్ చేసుకుంటుండటం విశేషం. బోర్డు నిబంధనలు బేఖాతార్ జిల్లాలో 18 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, రెండు ఎయిడెడ్, మరో 221 ప్రైవేటు, రెసిడెన్షియల్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. మెజార్టీ రెసిడెన్షియల్ కాలేజీలు తట్టిఅన్నారం, కొత్తపేట్, ఎల్బీనగర్, హయత్‌నగర్, మన్సూరాబాద్, వనస్థలిపురం, కోహెడ, ఆదిబట్ల, కొంగరకుర్దు, రావిర్యాల, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోనే ఉన్నాయి. ఆయా కాలేజీలన్నీ ఇరుకై న అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. డే స్కాలర్, సెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ విభాగాల వారీగా విభజించి ఎంచుకున్న కోర్సు, క్యాంపస్‌ను బట్టి ఫీజులు నిర్ణయించాయి. రెసిడెన్షియల్‌కు రూ.3 లక్షలుగా నిర్ణయించగా, సెమీ రెసిడెన్షియల్‌కు రూ.1.50 లక్షలు, డేస్కాలర్‌కు రూ.90 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇవి కాకుండా బుక్ మెటీరియల్, డ్రెస్సులకు అదనంగా మరో రూ.30 వేలు చార్జి చేస్తున్నాయి. బోర్డు నిబంధనకు విరుద్ధంగా మార్కెటింగ్ ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో గత విద్యార్థులు సాధించిన ర్యాంకులను సాకుగాా చూపించి ముందస్తు అడ్మిషన్లకు తెరతీశాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆయా కాలేజీల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థిపై సదరు ఏజెంట్‌కు రూ.25వేల వరకు కమీషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అప్పుడే అడ్మిషన్ల వేట! పదో తరగతి పరీక్షలు మొదలే కాలేదు.. ఇంటర్లో ప్రవేశాలకు ప్రచారం షురూ పరిమిత సీట్లు.. ఫీజులో రాయితీల పేరుతో విద్యార్థులకు వల మెరిట్ టెస్టుల పేరుతో పరీక్షలు.. తర్వాత తల్లిదండ్రులకు ఫోన్లు -
సర్కార్ కుట్రలను తిప్పికొడతాం
● బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాను లేకుండా చేయడానికి కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాను కనుమరుగు చేసే కుట్రలను తిప్పికొట్టేందుకు జిల్లా ప్రజలను ఏకం చేసి పోరాడతామని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. జిల్లా ఉనికి లేకుండా చేయడానికి శివారు మున్సిపాలిటీలను అడ్డగోలుగా గ్రేటర్లో విలీనం చేయడం, అస్తవ్యస్తంగా పోలీస్ కమిషనరేట్ల విభజన చేసే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించిందని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి పేరు మీద 1978లో ఏర్పడిన జిల్లా పేరు లేకుండా చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు సహించరన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మామ జైపాల్ రెడ్డి పేరున కొత్త జిల్లాను ఏర్పాటు చేయడానికి ఈ అస్తవ్యస్త తతంగానికి తెరలేపారని దుయ్య బట్టారు. తన మామ పేరు పెట్టుకోవడానికి తన ప్రాంతంలో జిల్లాను ఏర్పాటు చేసుకో వాలి కానీ ఉన్న జిల్లాను ఆగం జిల్లాను దెబ్బతీసేందుకు, తద్వారా ఇక్కడి ఆదాయాన్ని కొల్లగొట్టేందుకు జరుగుతున్న కుట్రలపై జిల్లా ప్రజలు అప్రమత్తమై ఉద్యమానికి సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనరేట్ల అస్తవ్యస్త విభజన కారణంగా ప్రస్తుతం ఉన్న పోలీసులు ఇబ్బందులు పడుతున్నారని, రేపటి పోలీసు ఉద్యోగాల నియామకాల్లో జిల్లా యువతకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పడిన జిల్లాను, పోలీస్ కమిషనరేట్లను అడ్డగోలుగా విభజిస్తే జిల్లా ఉద్యోగులకు, నిరుద్యోగులకు, యువతకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యోగులతో చర్చించకుండా చేసే ఇలాంటి దిక్కుమాలిన పనులను వెంటనే మానుకోవాలని హితవు పలికారు. -
తుర్కయంజాల్ను సర్కిల్‌గా ప్రకటించాలి
తుర్కయంజాల్: ఎల్బీనగర్ సర్కిల్‌కు ఆనుకుని ఉన్న తుర్కయంజాల్ను సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్ జోన్లో చేర్చడం సరైన నిర్ణయం కాదని, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ అన్నారు. ఆ పార్టీ తుర్కయంజాల్ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాగర్ రహదారిపై నిర్వహించిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాను మూడు ముక్కలుగా చేసి, హైదరాబాద్‌లో కలపాలనే ఆలోచనను వెంటనే మానుకోవాలని హితవు పలికారు. అధికారుల అవగాహన లోపం, అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్యం కారణంగా 20 వేల ఓట్లతో తుర్కయంజాల్, 60వేలకు పైగా ఓట్లున్న తొర్రూర్‌ను ఒక డివిజన్‌గా చేసి ఆదిబట్ల సర్కిల్లో కలపడంతో ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పును సరిదిద్దుకుని తుర్కయంజాల్ను సర్కిల్‌గా ప్రకటించడంతో పాటు, ఎల్బీనగర్ జోన్లో చేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ధర్నాతో ఉదయం వేళ రద్దీగా ఉండే సాగర్ రహదారిపై కిలోమీటరుకు పైగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులకు సర్దిచెప్పి ట్రాఫిక్‌ను సరిచేశారు. కార్యక్రమంలో రైతు సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, మాజీ కౌన్సిలర్ కరాడి శ్రీలత అనిల్, నాయకులు తూళ్ల నర్సింహ గౌడ్, కొండ్రు పురుషోత్తం, నోముల కార్తీక్ గౌడ్, మల్లెల ప్రేమ్ సాయి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై ధర్నా -
ప్రభుత్వ స్థలంపై ‘ప్రైవేటు’ కన్ను!
హుడాకాంప్లెక్స్: ప్రభుత్వ భూములపై ప్రైవేటు వ్యక్తులు కన్నేశారు. బై నంబర్లతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి రూ.45 కోట్ల విలువైన స్థలాన్ని కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రెవెన్యూ వ్యవస్థలోని కొంత మంది అధికారులు సైతం వీరికి పరోక్షంగా సహ కరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సరూర్‌నగర్ మండలం కొత్తపేట పాపడం హోటల్ వెనుక భాగంలోని సర్వే నంబర్ 9/1లో 3వేల గజాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇక్కడ గజం ధర రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. బై నంబర్లు సృష్టించి.. ఇప్పటికే ఇక్కడ 900 గజాలను ఫైర్ స్టేషన్‌కు కేటాయించారు. మిగిలిన 2,100 గజాల స్థలంలో బొమ్మనగండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆట స్థలంగా వినియోగించుకునేవారు. నిజానికి ఈ సర్వే నంబర్లోని భూమికి గతంలోనే ఏడీ సర్వే చేసి హద్దులు నిర్ధారించారు. ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ ఓ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న ఓ రియల్టర్ విలువైన ఈ భూమిపై కన్నేశాడు. 9/1/2 సర్వే నంబర్‌తో క్లెయిమ్ చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విలువైన భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి, కబ్జాదారుల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. అది పూర్తిగా ప్రభుత్వ భూమే. ఇప్పటికే కొంత ఫైర్‌స్టేషన్‌కు కేటాయించి అడ్వాన్స్ పొజిషన్ కూడా ఇచ్చాం. మిగిలిన భూమిని ఇతర ప్రజావసరాలకే కేటాయించాలని నిర్ణయించాం. సెంటు కూడా వదిలేది లేదు. అవసరమైతే కోర్టుల్లో ప్రభుత్వం తరపున గట్టిగా కొట్లాడటానికి సైతం వెనుకాడబోం. – వేణుగోపాల్, తహసీల్దార్, సరూర్‌నగర్ సరూర్‌నగర్ సర్వే నంబర్ 9/1లో 3వేల గజాల సర్కార్ భూమి బై నంబర్లతో కాజేసేందుకు ప్రయత్నాలు పావులు కదుపుతున్న రియల్టర్లు -
హక్కుల సాధనకు పోరాడుదాం
షాద్‌నగర్‌రూరల్: బీసీల హక్కుల సాధనకు సంఘటితంగా పోరాడుదామని జాతీయ బీసీ సేన అధ్యక్షుడు బర్క కృష్ణ యాదవ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని సంఘం కార్యాయంలో గురువారం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ సామాజిక వర్గానికి ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని, అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో బీసీలు వెనకబడ్డారని అన్నారు. హక్కుల సాధనకు బీసీలంతా ఏకతాటిపైకి రావాలన్నారు. అనంతరం సంఘం నూతన కమిటీలను ఎన్నుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల డివిజన్ ఉపాధ్యక్షుడిగా లింగం యాదవ్ ఎన్నికయ్యారు. షాద్‌నగర్ పట్టణంలోని మూడో వార్డులో బీసీ సేన మహిళా కమిటీ అధ్యక్షురాలిగా శారద, ఉపాధ్యక్షురాలిగా కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శిగా బాలమణి, కార్యదర్శిగా యాదమ్మ, కోశాధికారిగా లత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు జయ శ్రీకాంత్, వరప్రసాద్ యాదవ్, సరస్వతి, పద్మ, మధు, శ్రీశైలం, పూజారి శ్రీశైలం పాల్గొన్నారు. జాతీయ బీసీ సేన అధ్యక్షుడు బర్క కృష్ణ యాదవ్ -
పల్లె ప్రగతి పనులు భేష్
ఇబ్రహీంపట్నం రూరల్: ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రగతి పనులు బాగున్నాయని మధ్యప్రదేశ్ అధికారులు బృందం కితాబు ఇచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జిల్లా స్థాయి, బ్లాక్ స్థాయి అధికారులు బృందం ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని ఎల్మినేడు, తులేకలాన్ గ్రామాల్లో పర్యటించింది. జిల్లా ఏపీడీ చరణ్‌గౌతమ్, యాంకర్ పర్సన్ వీసీ శ్వేత ఆధ్వర్యంలో బృందం పర్యటించింది. అభివృద్ధి కార్యక్రమాల తీరుతెన్నులను పరిశీలించింది. ముందుగా ఎల్మినేడులో ఉపాధి హామీ నిధులతో చేసిన కమ్యూనిటీ, ఎవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనం, నర్సరీ పెంపకం, పంచాయతీ భవన నిర్మాణం, నాటుకోళ్ల పెంపకానికి సంబంధించిన పనులను బృందం సభ్యులు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ రకాల పనుల గురించి, అభివృద్ధి కార్యక్రమాలపై స్థానిక అధికారులు వివరించారు. అనంతరం తులేకలాన్‌లో ఉపాధి హామీ నిధుతో పండ్ల తోటల పెంపకం, పల్లె ప్రకృతం వనం నిర్వహణ, నర్సరీ, కంపోస్టు యార్డు, వైకుంఠధామం, జేబీ వెంచర్లో చెరువుల తవ్వకాలు పరిశీలించారు. ప్రజా అవసరాల కోసం చేపట్టిన పనులు బాగున్నాయని కొనియాడారు. ఇక్కడ చేపట్టిన పనులను తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తులేకలాన్ సర్పంచ్ సామ అశ్విని రవీందర్, ఎల్మినేడు సర్పంచ్ యాదమ్మ, తులేకలాన్ ఉప సర్పంచ్ డి.జగదీష్, మాజీ సర్పంచ్ యాదగిరి, ఎంపీఓ ఉష, ఏపీఓ తిరపతాచారి, టీఏ రవి తదితరులు పాల్గొన్నారు. కితాబిచ్చిన మధ్యప్రదేశ్ అధికారుల బృందం -
సహకార సంఘాలతో ఆర్థికాభివృద్ధి
షాద్‌నగర్‌రూరల్: సహకార సంఘాలతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని సహకార భారతి రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర సహకార సమితి కార్యాలయంలో గురువారం నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీరామలింగేశ్వర స్వామి సహకార సంఘాల ద్వారా గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రామంలో యువతకు వృత్తి నైపుణ్యతపై శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. ఎవరిపై ఆధార పడకుండా స్వతహాగా వ్యాపారాలు నిర్వహించుకునేలా ప్రోత్సహించాలన్నారు. ముల్కనూరు గ్రామీణ సహకార బ్యాంకు అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సహకార సమితి పరిధిలోని 42 సంఘాలకు గాను 18 సర్పంచ్‌లు, 16 ఉప సర్పంచ్‌లు, 110 వార్డు సభ్యులుగా ఎన్నిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామాల్లో 20 ఏళ్లుగా పొదుపు సహకార సంఘాలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. సేవా భారతి క్షేత్ర సేవా ప్రముఖ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సహకార సంఘాల ద్వార నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జగన్మోహన్రెడ్డి, రమేష్‌గుప్తా శ్రీనివాస్, లక్ష్మయ్య, రాంరెడ్డి, శేఖర్ యాదవ్, శ్రీశైలం యాదవ్, తిరుపతయ్య, మధుసూదన్‌గౌడ్, సుమంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సహకార భారతి రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి -
క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యం
శ్రీశైలం జాతీయ రహదారిపై.. తుక్కుగూడ: డివిజన్ కేంద్రంలో సీఎంకప్ టార్చి రిలేను గురువారం జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వర్ రావు ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి శ్రీశైలం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈఓ కస్నా నాయక్, హెచ్ఎం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టార్చ్ రిలేకు స్వాగతం అబ్దుల్లాపూర్‌మెట్: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ రిలే హయత్‌నగర్ మండలం మీదుగా పెద్దఅంబర్‌పేటలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్దకు రాగానే ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, ఎంఈఓ జగదీశ్వర్ పాల్గొన్నారు. -
హష్ ఆయిల్ విక్రయం..ఇద్దరి అరెస్టు
శంషాబాద్ రూరల్: హష్ ఆయిల్ విక్రయించేందుకు యత్నిస్తుండగా ఇద్దరిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి కథనం ప్రకారం... ఏపీలోని విశాఖపట్నం ఓల్డ్ గాజువాకకు చెందిన డింబకేశ్వర నాగప్రణవ్(26) నగరానికి వచ్చి డ్రైవర్‌గా పనిచేస్తూ ఊట్పల్లిలోని బంధువుల ఇంట్లో నివాసముంటున్నాడు. ఇతను కొన్నాళ్ల కిందట జైలులో ఉన్నప్పుడు గంజాయి కేసులో శిక్ష అనుభవిస్తున్న విశాఖపట్నం చౌడవరం నివాసి యశ్వంత్‌తో పరిచయం ఏర్పడింది. ప్రణవ్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2024లో శ్రీకాకుళం ఇచ్ఛాపురంవాసి యెర్ర శ్రీనివాసులు(21)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి పాతబస్తీలో గంజాయిని కొనుగోలు చేసి సేవించేవారు. గత డిసెంబర్ 30న యశ్వంత్ ద్వారా ప్రణవ్ గోవాకు వెళ్లి రెండు సీసాల హష్ ఆయిల్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఊట్పల్లిలోని తన నివాసానికి సమీపంలో కొంతమంది గంజాయి, హష్ ఆయిల్ సేవిస్తున్నట్లు గమనించాడు. ఈ క్రమంలో ఈ నెల 7న వారి వద్దకు శ్రీనివాసులతో కలిసి వెళ్లి హష్ ఆయిల్‌ను విక్రయిస్తామనంటూ బేరసారాలకు దిగాడు. అప్పటికే అక్కడ నిఘా వేసిన పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న హష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జీవాలకు టీకాలు తప్పనిసరి
కడ్తాల్: గొర్రెలు, మేకలు వ్యాధుల బారిన పడకుండా పెంపకందారులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ సూచించారు. మండల కేంద్రంలో మశూచి టీకా(పాక్స్) కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ భిక్షపతి, మండల పశువైద్యాధికారి భానునాయక్తో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గొర్రెలు, మేకలు పాక్స్ వ్యాఽధి బారిన పడకుండా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. టీకాలు వేయడం ద్వారా జీవాల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయన్నారు. గొర్రెల, మేకలపెంపకందారులు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు మండల కేంద్రంలో 776 గొర్రెలు, 172 మేకలకు టీకాలు వేయించారు. కార్యక్రమంలో గొర్రెల పెంపకందారుల సంఘం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, ఉప సర్పంచ్ యాదగిరిరెడ్డి, వార్డు సభ్యులు గణేశ్‌గౌడ్, కృష్ణ, మహేశ్, నాయకులు జహంగీర్‌బాబా, జహంగీర్‌అలీ, మల్లేశ్‌గౌడ్, మల్లయ్య, బుచ్చయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కట్టడాలపై చర్యలకు వినతి
మీర్‌పేట: బడంగ్‌పేట సర్కిల్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు కట్టకు ఆనుకుని కొనసాగుతున్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని స్థానికులు కోరుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారి కావడం, వంద ఫీట్ల రోడ్డు ఫుట్‌పాత్, కట్టను ధ్వంసం ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తాము గతంలోనే మీర్‌పేట కార్పొరేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని, అయితే ఇది జీహెచ్ఎంసీ పరిధిలో ఉండడంతో వారు చర్యలు తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం మీర్‌పేటను జీహెచ్ఎంసీలో విలీనం చేసి బడంగ్‌పేట సర్కిల్లో చేర్చారని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఇదే విషయమై గురువారం మాజీ కార్పొరేటర్ గజ్జెల రాంచందర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ త్రిల్లేశ్వరరావుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
గిరి పెట్టి.. గురి తప్పి!
స్థానికంపంచాయతీ ఎన్నికల్లో పోటీదారులను వెంటాడుతున్న అప్పులు ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామాల్లో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. గెలిచినవారు సంతోషంతో పాలనాబాధ్యతలు చేపట్టారు. ఓడిన అభ్యర్థులు తమ ఓటమి గల కారణాలను అన్వేషిస్తున్నారు. తమ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచిన వారెవ్వరని సమీక్ష చేసుకుంటున్నారు. గతేడాది డిసెంబర్ 17వ తేదీన ఇబ్రహీంపట్నం డివిజన్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థులు ఎవరైనా గెలుపే లక్ష్యంగా ఖర్చుకు వెనుకాడకుండా పెట్టారు. డబ్బులు పంచి ఓట్లు రాబట్టాలనే సంకల్పంతో ఆయా రాజకీయ పార్టీల మద్దతుదారులు ముందుకెళ్లారు. స్థాయికి మించి అప్పులు తేవడంతో వాటిని ఎలా తీర్చాలని ఆవేదన చెందుతున్నారు. 14 గ్రామాల్లో డబ్బే డబ్బు! గ్రామ పంచాయతీ ఎన్నికలు గతంలో వ్యక్తులు, పార్టీల మద్దతును బట్టి గెలుపు, ఓటముల నిర్ణయం జరిగేవి. ప్రస్తుతం ఎక్కడ చూసిన డబ్బులు ఉంటే చాలు గెలుపు మాదే అనే ధీమాలో ఉన్నారు. ప్రజాస్వామ్యం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు ఈసారి గ్రామ పంచాయతీ పోరు మరో ఎత్తులాగా ఉంది. ఇబ్రహీంపట్నం మండలంలో 14 గ్రామ పంచాయతీల్లో ఈ ఎన్నికలు మహా హాట్ గురు అన్నట్లు జరిగాయి. గతంలో రాజకీయాలు నిస్వార్థంగా ఉండేవి. ప్రస్తుతం విచక్షణ రహితంగా అప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్నికలు జరిగాయంటే నమ్మాల్సిందే. మండలంలోని దండుమైలారం, ముకునూర్, నెర్రపల్లి, రాయపోల్, పోల్కంపల్లి, నాగన్‌పల్లి, ఉప్పరిగూడ, పోచారం, చర్లపటేల్‌గూడ, కర్ణంగూడ, ఎల్మినేడు, తుర్కగూడ, కప్పపహాడ్, తులేకలాన్ గ్రామాల్లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు చేసిన అధికారులు డబ్బులు వీపరీతంగా ఖర్చు చేశారు. తక్కువలో తక్కువగా ఓటుకు రూ.1,500 నుంచి మొదలుకొని ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇచ్చి కొనుగోలు చేసినట్లు ఓడిన అభ్యర్థులు, గెలిచిన సర్పంచ్‌లు బాహాటంగా చెబుతున్నారు. ఒక్కో అభ్యర్థి రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చు చేశారంటే అతియోశక్తి కాదు. భూములు తనఖా పెట్టి! గ్రామాల్లో సర్పంచులుగా పోటీ చేసిన వారిలో 90 శాతం మంది అప్పులు తెచ్చి ఎన్నికల బరిలో నిలిచారు. తమకున్న వ్యవసాయ పొలాలను గిరి పెట్టి నూటికి రూ.2 నుంచి రూ.10 వరకు వడ్డీ చొప్పున కోట్లాది రూపాయలు తెచ్చుకున్నారు. గెలవాలనే వ్యామోహంలో పడి డబ్బులు అవసరానికి లేకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి చేతులు కాల్చుకుంటున్నారు. వీరిలో మరి కొందరూ విలువైన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తెచ్చుకున్నారు. ఓడిన అభ్యర్థులు, గెలిచిన సర్పంచ్‌లు సమానంగా అప్పుల పాలయ్యారు. ఇప్పుడు ఇద్దరూ ఎలా అప్పులు తీర్చాలని అంతర్మథనంలో పడ్డారు. వ్యాపారాలు నడవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు వస్తాయా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు నిధులు వస్తాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైన ఈ సారి సర్పంచ్‌లో ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థులు అప్పుల నుంచి ఎలా బయట పడాలనే ఆలోచనలో పడ్డారు. సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలిచేందుకు భారీగా ఖర్చు అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి పంచిన వైనం ఓడిన వారికి, గెలిచిన వారికీ తప్పని తిప్పలు -
ఓసీల సింహగర్జనకు తరలిరండి
హుడాకాంప్లెక్స్: వరంగల్‌లో జరిగే ఓసీల సింహగర్జనను విజయవంతం చేయాలని ఆ సంఘం జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి గుప్తా పిలుపునిచ్చారు. బుధవారం కొత్తపేట్‌లో గోల్డెన్ టీం వాకర్స్ సమక్షంలో ఏర్పాటు చేసిన చలో వరంగల్ ఓసీ సింహగర్జన భారీ బహిరంగ సభకు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓసి జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పశుపతి గుప్తా హాజరయ్యారు. రాష్ట్రంలో అగ్రకుల సామాజిక వర్గాల పేద ప్రజల హక్కుల సాధన కోసం ఈ నెల 11న ఆదివారం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో లక్ష మందితో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు తరలిరావాలని విజ్ఞప్తి చేశా రు. కార్యక్రమంలో గోల్డెన్ టీం వాకర్స్ సభ్యులు సాంబమూర్తి, ఆనంద్గుప్తా, రాజేష్, దయాకర్ గుప్తా, ఏవీరావు, శ్రీనివాస్, ఎన్.శ్రీనివాస్, వెంకటేశం, సముద్రాల రంగయ్య, అమర్నాథ్, భాస్కర్, తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
కూరగాయల హబ్‌గా జిల్లా
యాచారం: రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాను కూరగాయల హబ్‌గా మార్చేందుకు రైతు కమిషన్ కృషి చేస్తోందని.. ఇందులో భాగంగా రైతులకు ప్రోత్సాహం అందించేందుకు సర్కార్ కావాల్సిన నిధులు మంజూరు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన మొండిగౌరెల్లి, గడ్డమల్లయ్యగూడ, చౌదర్పల్లిలో కూరగాయల సాగు చేపట్టిన రైతులతో బుధవారం యాచారం రైతువేదికలో సమావేశం ఏర్పాటు చేశారు. మూడు గ్రామాలకు చెందిన 169 మంది రైతులకు, మంచాల మండలానికి చెందిన వంద మంది రైతులకు ప్లాస్టిక్ క్రేట్స్, వర్మీ కంపోస్టు యూనిట్లు, తేనెటీగల బాక్స్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ.. మహానగరం చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో కూరగాయల సాగును పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. రైతుల ఆర్థిక ప్రగతికి నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉద్యాన, వ్యవసాయాధికారులు రైతులకు అండగా ఉండి ప్రోత్సహించాలని సూచించారు. నూతన సర్పంచ్‌లు రైతుల ఆర్థిక ప్రగతి కోసం కృషి చేయాలని కోరారు. త్వరలో రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని తెలిపారు. వ్యవసాయ పరికరాల స్టాల్స్ పరిశీలన రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలు తాము తయారు చేసే వ్యవసాయ సామగ్రి, పరికరాలను యాచారం రైతు వేదిక వద్ద ప్రదర్శనకు పెట్టారు. వీటిని పరిశీలించిన రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి రైతులకు ఎలా ఉపయోగపడుతాయి, రాయితీ ఎంత ఇస్తారని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, రాములు నాయక్, కమిషన్ అధికారులు హరి వెంకటప్రసాద్, స్రవంతి, శ్రావణి, ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ జేడీఏ సునీత, జిల్లా వ్యవసాయాధికారి ఉష, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అధికారి సురేశ్, వివిధ శాఖల అధికారులు శైలజ, అరుణ, సుజాత, రవినాథ్, నవీన, శ్వేత, రాజశేఖర్ పాల్గొన్నారు. సాగు పెంపునకు ప్రభుత్వ ప్రోత్సాహం రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి -
ప్రతీ బోరు సర్వే చేయాలి
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ ప్లానింగ్ అధికారి సౌమ్య కొందుర్గు: మండల పరిధిలోని వ్యవసాయ బోర్లను సర్వేచేసి రిపోర్ట్ ఇవ్వాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ ప్లానింగ్ అధికారి సౌమ్య సూచించారు. బుధవారం కొందుర్గు తహసీల్దార్ కార్యాలయంలో జీపీఓల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో వ్యవసాయ బోర్ల వివరాలను తెలుసుకున్నారు. 2017 లెక్కల ప్రకారం 2,741 బోరుబావులున్నాయని.. ఇప్పటికి కేవలం 1,015 బోర్లు మాత్రమే సర్వే చేశారన్నారు. మిగిలిన బోర్లన్నీ వెంటనే సర్వేచేసి రిపోర్టు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆజంఅలీ, ఏపీఓ నర్సింగ్‌రావు పాల్గొన్నారు. మొయినాబాద్‌రూరల్: మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని 108 అంబులెన్స్ వాహనాన్ని రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఈఎంఈ రాజాబాబు తనిఖీ చేశారు. బుధవారం మున్సిపల్ కేంద్రంలో ఉన్న వాహనం కండిషన్, ఎక్విప్మెంట్స్, మెడిసిన్స్‌ను తదితరాలను పరిశీలించారు. హుడాకాంప్లెక్స్: ఇస్కఫ్ జిల్లా మొదటి మహాసభను సరూర్‌నగర్ మండలం శంకర్‌నగర్ కాలనీ కమిటీ హాల్లో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇస్కఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ శాంతిని కోరుతూ సంఘం ముందుకెళ్తుందని, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ నిరంతరం శాంతి కోసం పనిచేస్తుందన్నారు. ఈ నెల 11న బేగంపేట టూరి జం ప్లాజాలో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నుకున్నా రు. గౌరవాధ్యక్షుడిగా జిల్లాల కృష్ణ, అధ్యక్షుడిగా మహబూబ్, ప్రధాన కార్యదర్శిగా సక్రు నాయక్, కోశాధికారిగా వెంకట్రాంరెడ్డి, ఉపాధ్యక్షులుగా కరీం, ఏఎల్.నరసింహ, సంపత్, అసిస్టెంట్ సెక్రెటరీగా కమలమ్మ, సీహెచ్ శంకర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతగిరి: సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆఫీసర్ నవీన్‌కుమార్ బసురి అన్నారు. బుధవారం డీఆర్డీఏ కార్యాలయంలో పీఎంఎఫ్ఎంఈ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ పథకంపై విస్తృతంగా ప్రచారం చేపట్టి లబ్ధిదారుల కు ప్రయోజనం చేకూరేలా చూడాలని ఆదేశించారు. అనంతరం డీఆర్డీఏ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరించారు. వ్యక్తిగత యూనిట్లకు 35 శాతం రాయితీతో గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సి డీ అందుబాటులో ఉందన్నారు. ఎఫ్పీఓలు, స్వయం సహాయక సంఘాలు, ప్రొడ్యూసర్ గ్రూపు లు గరిష్టంగా రూ.3 కోట్ల వరకు రాయితీ పొందవచ్చని తెలిపారు. యంత్రాల కొనుగోలుతోపాటు బ్రాండింగ్, ప్యాకేజింగ్, లేబెలింగ్ మా ర్కెటింగ్ లింకేజీల కోసం ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు జిల్లా పరిశ్రమల కేంద్రం లేదా జిల్లా రిసోర్స్ పర్సన్ ఫణిభూషణ్‌ను లేదా సెల్ నంబర్ 7780119648లో సంప్రదించాలన్నారు. -
మున్సిపాలిటీల్లో సత్తా చాటుదాం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్ చేవెళ్ల: Ð]l¬°Þ-ç³ÌŒæ G°²-MýSÌZÏ ½gôæï³ çÜ™é¢ ^ésêÌS° B ´ëÈt hÌêÏ A«§ýlÅ-„ýS$yýl$ Æ>gŒæ-¿¶æ*´ë-ÌŒæVúyŠæ A¯é² Æý‡$. ç³rt׿ MóS…{§ýl…ÌZ° ÒÆý‡-Ķæ$Å-V>-Æð‡z¯ŒSÌZ ´ëÈt Ð]l¬°Þ-ç³ÌŒæ A«§ýlÅ-„ýS$yýl$ A™ðl¢-ÍÏ A¯]l…-™Œæ-Æð‡yìlz B«§ýlÓ-Æý‡Å…ÌZ º$«§ýl-ÐéÆý‡… ´ëÈt Ð]l¬QÅ ¯éĶæ$MýS$ÌS çÜÐ]l* ÐólÔèæ… HÆ>µr$ ^ólÔ>Æý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> Æ>gŒæ¿¶æ*-´ëÌŒæ VúyŠæ, Ð]l*i GÐðl$ÃÌôæÅ MóSG‹Ü Æý‡™èl²… Ð]l*sêÏ-yýl$™èl*.. hÌêÏÌZ Ð]l¬°Þ-´ëÍ-sîæ-ÌSOò³ M>ÚëĶæ$ gñæ…yé GVýS$-Æý‡ÐólõÜ…-§ýl$MýS$ ´ëÈt MýS–íÙ ^ólÝù¢…-§ýl-¯é²Æý‡$. C…§ýl$MýS$ º*™Œæ-Ýë¦Æ‡$$ ¯]l$…_ ¯éĶæ$-MýS$Ë$, M>Æý‡Å-MýSÆý‡¢Ë$ MýSÍ-íÜ-MýSr$tV> ç³°^ól-Ķæ*ÌS° çÜ*_…-^éÆý‡$. A°² Ý릯éÌZÏ ´ëÈt ¯]l$…_ A¿ýæÅ-Æý‡$¦Ë$ ´ùsîæ ^ólõÜ…-§ýl$MýS$ çÜÐ]l*-Ķæ$™èl¢… M>Ðé-ÌS-¯é²Æý‡$. ÒÇMìSవీవవÒÇMìS ´ëÈt A…yýlV> A…yýlV> E…r$…-§ýl-°.. Ñf-Ķæ*-°MìS Ð]l$…yýlÌS ¯éĶæ$-MýS$Ë$, M>Æý‡Å-MýS-Æý‡¢Ë$ ç³°^ól-Ķæ*ÌS° çÜ*_…-^éÆý‡$. ^ólÐðlâýæÏ, Ôèæ…MýS-ÆŠ‡ç³ÍÏ, Ððl¬Æ‡$$-¯é»ê§Šæ Ð]l¬°Þ-ç³ÌŒæ ï³u>-ÌS¯]l$ ½gôæï³ OMðSÐ]lçÜ… ^ólçÜ$MýS$…-r$…§ýl-¯é²Æý‡$. {ç³fË$ M>…{VðS‹Ü, ½B-ÆŠ‡-G-‹ÜÌS¯]l$ ¯]lÐól$à ç³Çíܦ† Ìôæ§ýl¯é²Æý‡$. Æ>{çÙt…ÌZ° M>…{VðS‹Ü {糿¶æ$™èlÓ… {ç³gê çÜÐ]l$çÜÅ˯]l$ ç³sìæt…^èl$MøÐ]lyýl… Ìôæ§ýl°, {糆糄ýS ´ë{™èl ´ùíÙ…^èlyýl…ÌZ ½BÆŠæG‹Ü §éÆý‡$׿…V> ÑçœËÐ]l$Ð]l#™ø…§ýl° G§ólªÐé ^ólÔ>Æý‡$. Æ>¯]l$¯]l² Ð]l¬°Þç³ÌŒæ, Ð]l$…yýlË, hÌêÏ ç³ÇçÙ™Œæ G°²MýSÌZÏ Ððl$gêÈt Ý릯éÌZÏ ½gôæï³ A¿¶æÅÆý‡$¦Ìôæ ÑfĶæ$… Ý뫨Ýë¢Æý‡° «©Ð]l* Ð]lÅMýS¢…^ólÔ>Æý‡$. MóS…{§ýl…ÌZ° ¯]lÆó‡…{§ýl Ððl*© {糿¶æ$™èlÓ… AÐ]l$Ë$ ^ólçÜ$¢¯]l² çÜ…„óSÐ]l$ ç³£ýlM>Ë$ OÆð‡™èl$Ë™ø ´ër$ A°² Ð]lÆ>YË {ç³fËMýS$ A…yýlV> °Ë$çÜ$¢¯é²Ä¶æ$° ™ðlÍ´ëÆý‡$. D çÜÐ]l*-Ðól-Ôèæ…ÌZ ´ëÈt Æ>çÙ‰ ¯éĶæ$MýS$Ë$ MýS…fÆý‡Ï {ç³M>ÔŒæ, Ð]l$…yýlÌS Ð]l*i A«§ýlÅ-„ýS$yýl$ ´ëyýl$-Æý‡…-V>-Æð‡yìlz ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY¯é²Æý‡$. భూములమ్మి.. పాలన శంకర్పల్లి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఆస్తులు, భూములు అమ్మి పాలన కొనసాగిస్తున్నారని.. రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్ ఎద్దేవా చేశారు. బుధవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ గార్డెన్స్‌లో పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దయారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడితో పాటు శంకర్పల్లి మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, జిల్లా మాజీ అధ్యక్షుడు అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ముఖ్య నాయకుల నుంచి సమస్యలు, ఫిర్యాదులు స్వీకరించారు. రాజ్‌భూపాల్‌గౌడ్ మాట్లాడుతూ.. మరో మూడు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, పార్టీ ఎవరికి టికెట్టు కేటాయించిన తమకే వచ్చిందని భావించి కష్టపడి పని చేయాలని సూచించారు. అదే విధంగా పలు విధాలుగా సర్వే చేసిన తర్వాతనే గెలుపు గుర్రాలను గుర్తించి, పార్టీ టికెట్టు ఇస్తామని, ఎట్టి పరిస్థితుల్లో శంకర్‌పల్లిలో చైర్మన్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేయాలన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఇంటింటికీ వివరించాలన్నారు. సమావేశానికి మహిళా మోర్చా నాయకులు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 50 శాతం టికెట్లు మహిళలకు కేటాయిస్తే ఒక్క మహిళా నేత సమావేశానికి హాజరుకాకపోవడం బాధాకరమన్నారు. అనంతరం కేఎస్ రత్నం మాట్లాడుతూ.. ప్రాణం ఉన్నంత వరకు బీజేపీలోనే ఉండి ప్రజా సేవ చేసుకుంటానన్నారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్‌రెడ్డి, రాములు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వాసుదేవ్ కన్నా, నాయకులు ప్రతాప్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సురేశ్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
పారిశ్రామికవాడ భూముల్లో సర్వే
దుద్యాల్: మండల పరిధిలోని హకీంపేట్, లగచర్ల గ్రామాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు భూములు కోల్పోయిన రైతుల పొలాల్లో ఉన్న ప్రకృతి సిద్ధమైన ఆస్తులకు సంబంధించి సర్వేను బుధవారం చేపట్టినట్లు తహసీల్దార్ కిషన్ తెలిపారు. రెండు గ్రామాలకు సంబంధించి 30 మంది రైతుల పొలాల్లో పెద్ద పెద్ద చెట్లు, బోరు బావులు, పొలాల వద్ద నిర్మించుకున్న షెడ్లు ఉన్నట్లు చెప్పారు. ఆస్తులకు సంబంధించి వివరాలను అంచనా ప్రకారం విలువ కట్టి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందించిన తర్వాత రైతులకు పరిహారం చెక్కులు అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాఘవేందర్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి రమేశ్, హార్టికల్చర్ అధికారి సురేందర్, రైతులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత బొంరాస్‌పేట: మండల పరిధిలోని మెట్లకుంటలో వాగుల లలితకు సీఎంఆర్ఎఫ్ కింద రూ.50వేల చెక్కు ను బుధవారం అందజేశారు. ఆమె అనారోగ్యంతో ఉండగా ఆస్పత్రిలో ఆపరేషన్ ఖర్చు లకుగాను ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును సర్పంచు ఉమాదేవి ఇచ్చారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, నాయకులు నర్సింలునాయుడు, ఉపసర్పంచ్ రత్నం, హాజీమలంగ్బాబా తదితరులున్నారు. ఏడు గేదెల అపహరణ రూ.ఏడు లక్షల వరకు నష్టపోయిన రైతు పరిగి: గుర్తు తెలియని దుండగులు ఏడు గేదెలను ఎత్తుకెళ్లిన సంఘటన మున్సిపల్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని సయ్యాద్‌మల్కాపూర్ గ్రామానికి చెందిన పాడి రైతు శివానంద్ పాడిపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజు మాదిరిగానే పొలం దగ్గర మంగళవారం సాయంత్రం పాలు పితికి షెడ్డులో గేదెలను కట్టివేసి ఇంటికి వచ్చాడు. ఉదయం వెళ్లి చూడగా షెడ్డులో ఒక్క గేదె కూడా లేదు. చూసి అవాకై ్కన రైతు చుట్టు పక్కల వెతికిన ఆచూకీ లభించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. పొలం దగ్గరకు డీసీఎంను తీసుకెళ్లి గేదెలను ఎత్తుకెళ్లినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఏడు గెదెలను డీసీఎంలో ఎక్కించి, ఒక్క గేదె ఎక్కక పోవడంతో చితక బాదినట్టు గాయాలున్నాయి. చుట్టు పక్కల సీసీ కెమెరాలను పోలీసులు పరిశీస్తున్నారు. సుమారు రూ.ఏడు లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మోహనకృష్ణ తెలిపారు. బస్సులో బంగారు ఆభరణాలు చోరీ హయత్‌నగర్: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలి బ్యాగులో నుంచి సుమారు 7 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ విద్యానగర్ కాలనీకి చెందిన రాణెమ్మ రామంతాపూర్‌లో ఉండే కుమారుడు అశ్విన్ కుమార్ ఇంటికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు 4 తులాల బంగారు ఆభరణాలు తీసుకెళ్లింది. మంగళవారం చౌటుప్పల్‌కు వెళ్లేందుకు ఎల్‌బినగర్‌కు వచ్చింది. తనతో పాటు నగలు ఉన్న బ్యాగుతో ఆర్టీసి బస్సు ఎక్కింది. బస్సులో బ్యాగును పరిశీలించగా ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆమె హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాధు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇళ్లు కూల్చడమే ప్రజాపాలనా..?
మొయినాబాద్ రూరల్: పేదలు, గిరిజనుల ఇళ్లను కూల్చడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందిస్తున్న ప్రజాపాలనా అని లంబాడా హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు ముడావత్ రాంబల్‌నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం సమీపంలో కూల్చివేసిన ఇళ్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్ అనుమతులతో నిర్మించుకున్న గిరిజనుల ఇళ్లను కూల్చివేయడం సరికాదని మండిపడ్డారు. కోర్టు స్టేను సైతం పట్టించుకోకుండా దౌర్జన్యంగా ఇళ్లను నేలమట్టం చేశారని, కనీసం సామగ్రి తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్‌తో పాటు జాతీయ ఎస్టీ కమిషన్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేశారన్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ పోరాడుతామని స్పష్టంచేశారు. తిరుపతిరెడ్డి ఫాంహౌస్ నిర్మాణానికే గిరిజనుల ఇళ్లను కూల్చేశారని ఆరోపించారు. ఎల్‌హెచ్‌పీఎస్ అధ్యక్షుడు రాంబల్‌నాయక్ -
మొదలైన రాజకీయ వేడి
● మున్సిపల్ ఎన్నికలపై పార్టీల ఫోకస్ ● రిజర్వేషన్లపై నెలకొన్న ఉత్కంఠ ● ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న ఆశావహులు ఇబ్రహీంపట్నం: ఎట్టకేలను మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో రాజకీయ పక్షాల్లో వేడి రాజుకుంది. గతడాది నుంచి ప్రత్యేక అధికారులు పాలనలో పురపాలక సంఘాలు కొనసాగుతున్నాయి. ఈ నెల మొదటి తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా అధికారికంగా వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో ఏవైన తప్పులు, అడ్రస్ మార్పులు, ఇతర వార్డుల్లో నమోదు తదితర అభ్యంతరాలుంటే స్వీకరించేందుకు 8వ తేదీ వరకు గడువు విధించడంతో వాటి పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. మున్సిపల్ స్థాయి రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఓటర్ల తుది జాబితా ఈ నెల 10న వెలువడనుంది. దీంతో ఎన్నికలు జరగడం ఖాయమని.. అవి ఈ నెల చివర్లోనా లేక ఫిబ్రవరిలోనా అనే సందేహం తీరాలంటే నోటిఫికేషన్ వస్తేనే స్పష్టంకానుంది. పార్టీలకు అతీతంగా మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయా పార్టీల మద్దతుతో పలువురు అభ్యర్థులు బరిలో నిలబడిన సంగతిని చూశాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఆయా పార్టీల గుర్తులపై జరుగుతాయి. పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా లేక మారుస్తారా అనే అంశంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు ఎలా వస్తాయోన్న బెంగ ఆశావహుల్లో నెలకొంది. రిజర్వేషన్లు మారుతాయనే ఉద్దేశంతోనే పలువురు ఆశావహులున్నారు. ఆయా మున్సిపాలిటీల్లోని మెజార్టీ వర్గాలు ఏ వార్డుల్లో ఉన్నారో నాయకులు పరిశీలిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖారారు చేసిన అనంతరం వార్డుల వారీగా రిజర్వేషన్లను ప్రకటిస్తారనే చర్చ కొనసాగుతుంది. అందరి చూపు పొత్తులపైనే.. రాజకీయ పార్టీలు ఎవరితో జత కడుతారో ఇంకా స్పష్టం కాలేదు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎంలు ఈ ఎన్నికల్లో తలపడనున్నాయి. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యనే అసలైన పోరు ఉండే అవకాశం ఉంది. బీజేపీ కొన్ని వార్డుల్లో బలంగా ఉండగా, ఇతర పార్టీలతో జతకడితేనే సీపీఎం అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుంది. పలు వార్డుల్లో అభ్యర్థుల విజయాలపై సీపీఎం, బీజేపీలు ప్రభావం చూపే ఆస్కారం ఉందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఏది ఏమైన పురపాలక సీట్లను సాధించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయా పార్టీల మద్దతు కోసం ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్లు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. రిజర్వేషన్లు ప్రకటిస్తేనే పొత్తుల అంశంపై కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆశావహుల్లో రిజర్వేషన్లు, ఆయా పార్టీల పొత్తుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. -
కార్మికుల సమస్యలపై పోరాడుతాం
చేవెళ్ల: విద్యుత్‌శాఖలో పనిచేసే కార్మికుల సమస్యలపై టీజీఎస్పీడీసీఎల్–1535 యూనియన్ పోరాడుతుందని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిగౌడ్ అన్నారు. చేవెళ్లలోని విద్యుత్‌శాఖ సబ్‌డివిజన్ కార్యాలయం వద్ద బుధవారం ఇబ్రహీంబాగ్ డివిజన్ నూతన కమిటీ, సబ్ డివిజన్ల కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్‌శాఖలో పనిచేసే కార్మికులకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1535 స్టేట్ యూనియన్ పనిచేస్తోందని చెప్పారు. నూతనంగా ఎన్నికై న కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపి యూనియన్ ప్రతిష్టత కోసం పనిచేయాలని సూచించారు. డివిజన్ అధ్యక్షుడిగా ఎం.మహిపాల్, ఉపాధ్యక్షుడిగా కమలాకర్, ప్రధా న కార్యదర్శిగా ఎల్.సతీశ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కె.శివకుమార్, కోశాధికారిగా నరేశ్, సబ్ డివిజన్ చేవెళ్ల అధ్యక్షుడిగా బి.రాంచంద్రయ్య, మోకిల సబ్‌డివిజన్ అధ్యక్షుడిగా డి.శేఖర్ నియమితులయ్యా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు వెంకటయ్య, యాదగిరి, కృష్ణ, భిక్షపతి, మల్లికార్జున్, రవీందర్‌రెడ్డి, భీమయ్య, మాణిక్యం, రాజేందర్, శేఖర్, పాండు, సతీశ్, నరేశ్ పాల్గొన్నారు. టీజీఎస్పీడీసీఎల్–1535 యూనియన్ అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్ -
సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి
త్రిదండి చిన జీయర్ స్వామిషాద్నగర్రూరల్: ప్రపంచ శాంతికి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని త్రిదండి చిన జీయర్ స్వామి అన్నారు. బుధవారం ఆయన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని దేవునిపల్లిలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుర్వ లలితమల్లేశ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. పత్య్రేక పూజల అనంతరం చిన జీయర్ స్వామి మాట్లాడుతూ.. ప్రపంచంలో భారతదేశం ఏకై క హిందూ దేశమని.. మనదేశంలో సనాతన ధర్మానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. భగవంతుడి సేవ లో తరించిన వారికి ముక్తి లభిస్తుందన్నారు. ఏజన్మలో చేసుకున్న పుణ్యఫలమో మీ గ్రామం దేవుని (దేవునిపల్లి) పేరుతో ఉందన్నారు. అనంతరం ఆయన గ్రామస్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. అన్నింటికి వేదమే మూలం కొందుర్గు: సృష్టిలో ప్రక్రియలన్నింటికీ మూలం వేదాలేనని త్రిదండి చిన జీయర్ స్వామి అన్నారు. జిల్లేడ్ చౌదరిగూడ మండలం తూంపల్లి వేదగిరిగుట్ట రజతోత్సవాల కార్యక్రమంలో భాగంగా సనాతన వేదయజ్ఞ మహారథయాత్ర ప్రారంబోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతిలో ప్రతీ చర్య ఒక యజ్ఞం అన్నారు. అన్నింటికి మూలం ఓంకారం అన్నారు. మహిళలకు అగ్రస్థానం వైదిక ధర్మం సమాజంలో మహిళలకు అగ్రస్థానం ఇచ్చిందన్నారు. పూర్వం మహిళలకు ఆలయ ప్రవే శం ఉండేదికాదని.. స్వామి రామానుజులు మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించారన్నారు. ఈ కార్యక్రమానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి హాజరై మాట్లాడా రు.ఈ కార్యక్రమంలో వేదగిరి వ్యవస్థాపకుడు మర్రి కృష్ణారెడ్డి, సర్పంచ్ రామచంద్రయ్య పాల్గొన్నారు. -
ఊరెళ్తున్నారా.. జాగ్రత్త!
● సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లనున్న ప్రజలు ● దొంగతనాల నివారణకు పోలీసుల చర్యలు ● కరపత్రాలు, సోషల్ మీడియాలో ప్రచారం చేవెళ్ల: సంక్రాంతి సంబురాలు నిర్వహించేందుకు ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రతిఒక్కరూ పండుగను సొంతూరిలో తమ తల్లిదండ్రులు, ఆత్మీయుతతో జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఉండేవారు తమ స్వగ్రామాలకు సంక్రాంతికి వెళ్తారు. ఇంటికి తాళం వేసి వెళ్లడంతో దొంగలు తమ చేతికి పని చెప్పే అవకాశం లేకపోలేదు. సొంతూర్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్‌సిటీ, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో దొంగతనాల నివారణ కోసం కరపత్రాలు, సోషల్ మీడియాల ద్వారా పోలీసులు ప్రచారం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఏసీపీ కిషన్, సీఐలు భూపాల్ శ్రీధర్, ఉపేందర్‌లు వేరువేరుగా జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ మేరకు ఏసీసీ పలు సూచనలు అందించారు. ఈ నియమాలు పాటించాలి ● ఇంట్లో, హాస్టల్లో విలువైన వస్తువులు డబ్బులు, బంగారం, వెండి ఆభరణాలు ఉంటే వాటిని బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకోవాలి. ● ఇంటి తలుపులకు, ప్రధాన ద్వారాలకు సెంట్రల్ లాక్సిస్టమ్తోపాటు సెక్యూరిటీ అలారం, మోసన్ సెన్సార్లు ఏర్పాటు చేసుకోవాలి. ● వాహనాలను ఇంటి లేదా, హాస్టల్ పార్కింగ్‌లోనే నిలుపాలి. చక్రాలకు చైన్, సెంట్రల్ లాక్ సిస్టమ్ అమర్చుకోవటం మంచిది. ● ద్విచక్ర వాహనాలకు జీపీఎస్ ట్రాకర్‌ని అమర్చుకోవాలి. ● సోషల్ మీడియాలో మీ ప్రయాణపు తాలూకు వివరాలను స్టేటస్‌గా పెట్టుకోవద్దు. ● ఇరుగుపొరుగు వారిని మీ ఇంటిపై ఓ కన్ను వేసి ఉంచమని చెప్పండి. ● ముందుగానే మీ పేపర్బాయ్ని, పాలు వేసేవారిని రావొద్దని చెప్పాలి. ● ప్రధాన ద్వారానికి వేసిన తాళాలు కనపడకుండా కర్టెన్స్ వేసి పెట్టాలి. ● ప్రధాన ద్వారంతోపాటు కిటికీల తలుపులు విధిగా వేయవలెను. ● ఏదైనా ఒకగదిలో లైటు వేసి ఉంచాలి. ● ప్రతి ఇంటికి, ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు అమర్చుకొని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షించాలి. ● మీరు ఊరికి వెళ్లే విషయాన్ని అపరిచుతులతో పంచుకోవద్దు. ● అనుమానితులు ఎవరైనా మీ కాలనీలో, ఇంటి చుట్టూ తిరుగున్నా, ఏదైనా అత్యవసర సమయంలో పోలీస్‌స్టేషన్‌కు లేదా డయల్ 100కు కాల్ చేయాలన్నారు. ● పోలీస్‌శాఖ సూచిస్తున్న సూచనలు పాటించి దొంగతనాల నివారణకు సహకరించాలి. -
ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
చేవెళ్ల: బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని దేవుని ఎర్రవల్లికి చెందిన రాంచంద్రయ్య(35) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం పనికి వెళ్లిన ఆయన రాత్రి 8 గంటల సమయంలో చేవెళ్ల నుంచి ఇంటికి తన బైక్‌పై వెళ్తున్నాడు. దేవునిఎర్రవల్లి గేట్ సమీపంలోకి రాగానే ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలతో పడిపోయిన ఆయన్ను ఎవరూ గమనించలేదు. బుధవారం ఉదయం అటుగా వెళ్తున్న వారు పొదల్లో బైక్‌ను గమనించి దగ్గరకు వెళ్లి పరిశీలించగా ఓ వ్యక్తి పడిపోయి ఉన్నాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు యాలాల: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ సాయి శ్రీనిజ తెలిపారు. బుధవారం మండలంలోని దేవనూరు, గోరేపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో పంచాయతీ వన నర్సరీ, ప్రకృతి వనం, పంచాయతీ రికార్డులు, మండల పరిషత్ భవనాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పంచాయతీ పాలక వర్గాలు ఏర్పాటు అయినందున, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామన్నారు. అవసరమైన చోట ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. అనంతరం దేవనూరు సర్పంచ్ రేణుకాదేవి, గోరేపల్లి సర్పంచ్ లక్ష్మీ ఎంపీడీఓను మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పావనిరెడ్డి, ఈసీ శ్రావణ్‌కుమార్, నాయకులు కిషన్‌రావు, మల్లేశం తదితరులు ఉన్నారు. -
సర్వైకల్పై టీకాస్త్రం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: గర్భాశయ ముఖ ద్వార(సర్వైకల్) కేన్సర్‌కు కారణమైన హ్యుమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ)పై టీకాస్త్రాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసింది. వైరస్‌ను నిర్వీర్యం చేసే టీకాను ఉచితంగా ఇచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లాలోని 24 పట్టణ, 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా 77 బస్తీ దవాఖానాల్లో పని చేస్తున్న 3,300 మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 14 నుంచి 15 ఏళ్ల లోపు వయసున్న బాలికలు 1.17 లక్షల మంది ఉన్నట్లు అంచనా. ఒక్కో బాలికకు ఒక డోసు చొప్పున(0.5 ఎంఎల్)టీకాను ఎడమ చేతికి ఇవ్వనున్నారు. ఈ హెచ్‌పీవీ వ్యాక్సిన్ వైరస్(83 శాతం రక్షణ ఇస్తుంది)ను దరిచేరనీయదని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆందోళన కలిగిస్తున్న కేసులు ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి ఓపీలో రోజుకు సగటున వందకుపైగా కొత్త కేన్సర్ కేసులు వస్తుండగా, వీటిలో 40 శాతం సర్వైకల్ కేన్సర్ కేసులే. ఇక్కడ ఏటా 10 నుంచి 12 వేల మందికి చికిత్స అందిస్తుండగా, వీటిలో 13 శాతం మంది గర్భాశయముఖ ద్వార కేన్సర్‌తో బాధపడుతున్నారు. హెచ్‌పీవీ మహిళల్లో గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు కారణమవుతోంది. మహిళల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారిన ఈ సర్వైకల్ కేన్సర్‌కు హెచ్‌పీవీ టీకాతో చెక్ పెట్టాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఆ మేరకు అన్ని పట్టణ, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు సహా బస్తీ దవాఖానాల్లోనూ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కేసులను ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేసే అవకాశం ఉంది. అదే సెకండ్ స్టేజీలో గుర్తిస్తే 80 శాతం అవకాశం ఉంటుంది. మూడో దశలో 40 శాతం, నాలుగో దశలో 15 శాతం మాత్రమే కాపాడేందుకు అవకాశం ఉంటంది. అవగాహన లోపంతో చాలా మంది దీన్ని గుర్తించలేకపోతున్నారు. ఒక వేళ అనుమానించినా మెజార్టీ మహిళలు అవమానంగా భావించి బయటికి చెప్పుకోలేక పోతున్నారు. తీరా ప్రాణాల మీద కొచ్చిన తర్వాత చికిత్స కోసం ఆస్పత్రికి వస్తున్నారు. ఆ దశలో వైద్యులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. కీమో, రేడియేషన్ థెరపీలు, సర్జరీలు చేసినా ఫలితం ఉండటం లేదు. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు చెక్ బాలికల భవిష్యత్‌పై వైద్యారోగ్యశాఖ నజర్ జిల్లాలో 14 నుంచి 15 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి జిల్లాలో 1.17 లక్షల మంది బాలికలకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్లు అంచనాజిల్లాలో 376 కేసులు దేశంలో ఏటా 1.30 లక్షల కేన్సర్ కేసులు నమోదవుతుండగా, వీటిలో 70 శాతం కేసులు ఫోర్త్స్టేజీలో గుర్తించినవే. ఫలితంగా ఏటా 77,348 మంది కేన్సర్‌తో మృత్యువాతపడుతున్నారు. ఎన్సీడీ సర్వే ద్వారా జిల్లాలో 376 కేన్సర్ కేసులను గుర్తించారు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో ఫస్ట్ డోసు కీమో థెరపీ పూర్తి చేసుకున్న వారిని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలోని డే కేర్ కేన్సర్ కీమో థెరపీ సెంటర్‌కు తరలించి వారికి అక్కడే రెండో డోసు కీమో చికిత్సలు అందిస్తున్నారు. దీంతో ఒక్కో బాధితురాలికి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు లబ్ధి చేకూరుతోంది. ఇలా ప్రతి రోజూ పది నుంచి 15 మంది బాధితులకు ఇక్కడ కీమో సేవలు అందిస్తున్నారు. ప్రైవేటులో రూ.2 వేల నుంచి రూ.9 వేల వరకు ఖరీదు చేసే ఈ టీకాలను వైద్య ఆరోగ్యశాఖ ఉచితంగా అందజేయనుంది. ఇప్పటికే గుర్తించిన లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వరుసగా 90 రోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగనుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంటనే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సర్వం సిద్ధం చేసింది. -
గ్రేటర్లో విలీనం సరికాదు
● ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలి ● మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హయత్‌నగర్: గ్రామాల అడ్డగోలు విలీనంపై ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఏకమై పోరాటానికి సిద్ధం కావాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. హెచ్ఎండీఏ పరిధిలోని రైతు సమస్యలపై అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రామ జేఏసీ నాయకుడు కొత్త రాంరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా, గ్రామాలను నగరంలో విలీనం చేయడం సరికాదన్నారు. అడ్డగోలు విలీనం కారణంగా కొహెడ వంటి పెద్ద పంచాయతీలు ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. కొహెడ గ్రామాన్ని తొర్రూర్ డివిజన్ పరిధిలోకి చేర్చి దూరంగా ఉన్న శంషాబాద్ జోన్లో కలపడం సరికాదని.. కొహెడ పేరిట డివిజన్ ఏర్పాటు చేసి ఎల్బీనగర్ జోన్లో కలపాలనే గ్రామస్తుల డిమాండ్ సమంజసమైందేనని స్పష్టంచేశారు. ప్రభుత్వ అవసరాలకు భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన లేఅవుట్లో ఎకరాకు 500 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, కొహెడ భూములను కన్జర్వేషన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్లోకి మార్చాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న విలీన ప్రక్రియతో జిల్లా ఉనికిని కోల్పోయే దుస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. వందల ఎకరాల్లో ఉన్న కొహెడలోని ప్రభుత్వ భూములను సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇవ్వకుండా పండ్లు, చేపల మార్కెట్లకు ఇవ్వడం ఇక్కడి ప్రజలకు అన్యాయం చేయడమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి, నాయకులు బాల్‌రెడ్డి, ప్రతాప్, బల్‌దేవ్‌రెడ్డి, రంగారెడ్డి, నర్సిరెడ్డి, కార్తీక్‌గౌడ్, శ్రీలత అనిల్, బాల్‌రెడ్డి, అర్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్ జాబితాలో తప్పులను సరిచేస్తాం
ఆర్డీవో అనంతరెడ్డి ఇబ్రహీంపట్నం: ఓటర్ జాబితాలో దొర్లిన తప్పులను సరిచేయిస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. ఓటర్ జాబితాపై బీఎల్ఓలు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసే అంశాలపై బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలను రాజకీయపక్షాల నేతలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఇంకా సమయం ఉన్నందునా ఓటర్ జాబితాలో దొర్లిన పొరపాట్లను సరిచేస్తామన్నారు. ఈ మేరకు ఓటర్ జాబితాపై బీఎల్ఓలకు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ సునితారెడ్డి, ఎంపీఓ ఉషాకిరణ్, బీఎల్‌ఓలతోపాటు బీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్‌రావు, నిట్టు జగదీశ్వర్, నౌస్ శివ, టీడీపీ నాయకుడు జలమోని రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
కూలీకి వెళ్లిన వ్యక్తి అదృశ్యం
ఇబ్రహీంపట్నం రూరల్: కూలీ పనికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన ఆదిబట్ల ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. తుర్కయంజాల్ వైఎస్ఆర్ నగర్ కాలనీలో నివాసం ఉండే అచ్చన ఐలయ్య (55) సైదాబాద్‌లోని కూరగాయల మార్కెట్లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే డిసెంబర్ 24న సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఐలయ్య భార్య పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 87126 62364, 87126 62671, 87126 62382, 97058 69064 నంబర్లలో సమాచారం ఇవ్వాలని కోరారు. తాగుడుకు బానిసైన.. పహాడీషరీఫ్: తాగుడుకు బానిసైన వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిపల్లి రంగనాయకుల కాలనీకి చెందిన సబావత్ నర్సింహ(49) కూలీ పని చేస్తుంటాడు. రెండు నెలల క్రితం పనికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి, తిరిగి ఇంటికి రాలేదు. అతని ఆచూకీ కోసం సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనిపై అతని భార్య మంగ బుధవారం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇతని ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్లో గాని సమాచారం ఇవ్వాలని సూచించారు. రైతులకు న్యాయం చేస్తాం ఆర్డీఓ అనంత్‌రెడ్డి యాచారం: భూములు కోల్పోయిన రైతులకు అన్యాయం చేయమని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సర్వే ఏర్పాటు చేసే భూములను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూములు కోల్పోయే ఏ రైతు కు కూడ అన్యాయం కానివ్వమని తెలిపారు. ఫ్యూచర్‌సిటీ, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణ పనులతో ఈ ప్రాంతం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆర్డీఓ వెంట యాచా రం తహసీల్దార్ అయ్యప్ప ఉన్నారు. -
షార్ట్‌సర్క్యూట్‌తో ఆటోలో మంటలు
చేవెళ్ల: ప్రమాదవశాత్తు మొక్కజొన్న పొట్టుతో వెళ్తున్న ఆటో ట్రాలీలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకొని కాలి బుడిదయింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని చేవెళ్ల అగ్నిమాపక కేంద్రం ఎదుట బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌కు చెందిన కాంతిరెడ్డి తన ఆటోను మండలంలోని గుండాల పరిధిలోని డెయిరీ ఫాంలో అద్దెకు ఆటో నడిపిస్తున్నాడు. ధర్మసాగర్ గ్రామం నుంచి మొక్కజొన్న పొట్టును ఆటోలో తీసుకు వస్తుండగా పట్టణకేంద్రంలోని జూనియర్ కళాశాల సమీపంలోకి రాగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చేలరేగాయి. వెంటనే అప్రమత్తమై ఆపేశాడు. అప్పటికే మంటలు ఆటోలో ఉన్న మొక్కజొన్న పొట్టుకు అంటుకొని ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి వేశారు. అప్పటికే మొక్కజొన్న పొట్టు మొత్తం కాలి బూడిదయింది. ఆటో డ్రైవర్ అప్రమత్తంతో కిందికి దిగిపోవటంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
31 మేకల అపహరణ
బషీరాబాద్: అర్ధరాత్రి అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ చేసింది. రెండు గ్రామాల్లోని ఇద్దరు రైతులకు చెందిన మేకల మందలను దోచుకెళ్లింది. తీవ్ర కలకలం రేపిన ఈ చోరీ మండలంలోని కంసాన్పల్లి(ఎం), మల్కన్‌గిరి గ్రామాల్లో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కంసాన్పల్లి(ఎం) గ్రామానికి చెందిన కుర్వ మాసప్ప, మల్కన్‌గిరి గ్రామానికి చెందిన మాల పొట్ట నర్సప్ప అనే రైతులకు చెందిన 31 మేకలు బుధవారం తెల్లారేసరికి కొట్టాల్లో నుంచి మాయమయ్యాయి. బషీరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. కుర్వ మాసప్ప ఆయన కొడుకు శ్రీశైలం, కూతురు అనిత మేకలు కాస్తూ జీవిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఇంటి ముందు పాకలో 24 మేకలను కట్టేశారు. ఉదయం లేచి చూడగా మంద మొత్తం మాయమైంది. సుమారు రూ.3.60 లక్షల విలువ చేసే మేకలు చోరీకి గురికావడంతో కుటుంబం ఉపాధి కోల్పోయి రోడ్డున పడింది. నిద్రలేచే లోపే మల్కన్‌గిరి గ్రామానికి చెందిన నర్సప్ప వ్యవసాయ పనులతో పాటు 27 మేకలను సాకుతున్నాడు. అయితే మంగళవారం అర్ధరాత్రి కొట్టంలోని మేకలు ఒక్కసారిగా అరుపులు పెట్టాయి. దీంతో పది నిమిషాల తర్వాత బయటకు వచ్చి చూడగా కొట్టంలోని మేకలన్నీ అరుస్తూ కనిపించాయి. అప్పటికే వాహనం శబ్దం కూడా వినిపించడంతో మేకలను లెక్క పెట్టగా అందులో ఏడు పెద్ద మేకలు కనిపించలేవు. దీంతో వాటిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. తనకు రూ.1.50 లక్షల వరకు నష్టం జరిగిందని రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్ఐ నుమాన్‌అలీ విచారణ ముమ్మరం చేశారు. మేకలను ఎత్తుకెళ్లింది అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మేకలను బొలెరా వాహనంలో తరలించినట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో రాకార్డు అయినట్లు పేర్కొన్నారు. కంసాన్పల్లి, మల్కన్‌గిరి గ్రామాల్లో అంతర్రాష్ట్ర దొంగల హల్ చల్ రూ.5 లక్షల నష్టమని బాధితుల ఆందోళన దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు -
వెనుజులాపై అమెరికా దాడి సరికాదు
ఇస్కఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ హుడాకాంప్లెక్స్: వెనిజులా దేశ సార్వభౌమత్వాన్ని హరించేవిధంగా, అధ్యక్షుడు నికోలస్ మడూరో, ఆయన కుటుంబ భద్రతకు ముప్పుగా మారిన అమెరికా సైనిక చర్యలను నిరసనకారులు తీవ్రంగా ఖండించారు. శాంతి కోసం, అధ్యక్షుడు మడూరోను వెంటనే విడుదల చేయాలని, వెనిజులా అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ఆపాలంటూ నినాదాలు చేశారు. సరూర్‌నగర్‌లో చేప్టిన ఈ కార్యక్రమంలో ఇస్కఫ్(ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్) రాష్ట్ర అధ్యక్షుడు రేఖల గోపాల్ మాట్లాడుతూ.. అమెరికా చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, అధ్యక్షుడు నికోలస్ మడూరో, ఆయన కుటుంబాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెనిజులాపై అమెరికా దాడిని తాము వ్యతిరేకిస్తున్నామని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందని ఆయన అన్నారు. సామ్రాజ్యవాద శక్తుల అన్యాయ చర్యలను అడ్డుకోవడానికి ప్రపంచం ఏకతాటిపై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు గడ్డివాములు దగ్ధం
ఆమనగల్లు: మేడిగడ్డతండాకు చెందిన నేనావత్ సోమ్ల, నేనావత్ మల్లయ్య నాయక్‌కు చెందిన రెండు గడ్డివాములు మంగళవారం ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనను గుర్తించిన గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పారు. ఈ సంఘటనలో దాదాపు రూ.60వేలు విలువైన పశుగ్రాసం దగ్ధమైందని రైతులు వాపోయారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కండె హరిప్రసాద్, బీజేపీ నాయకులు కర్నాటి విక్రంరెడ్డి, నర్సింహ, చెన్నకేశవులు, రవిరాథోడ్, నందు తదితరులు బాధితులను పరామర్శించారు. యువకుడు అదృశ్యం పహాడీషరీఫ్: యువకుడు అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జల్పల్లి వాదే ముస్తఫా బస్తీకి చెందిన మహ్మద్ గౌస్ కుమారుడు మహ్మద్ సల్మాన్(24) తుక్కుగూడలోని పాన్‌షాప్‌లో పని చేస్తుంటాడు. రోజు మాదిరిగానే ఈ నెల 5వ తేదీన ఉదయం షాప్‌నకు వెళుతున్నానని చెప్పి వెళ్లిన సల్మాన్ రాత్రయి నా ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళనకు గురైన కు టుంబ సభ్యులు సాధ్యమైన అన్నిప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో సోమవారం రాత్రి తల్లి సాజెదా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్లో గాని సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ లభ్యం కేశంపేట: అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ మంగళవారం లభ్యమైంది. సీఐ నరహరి తెలిపిన ప్రకారం.. సోమవారం నిర్ధవెళ్లికి చెందిన కావలి మహేశ్ ఇంట్లో తల్లి, భార్యతో గొడవపడి మనస్తాపంతో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లభ్యంకాకపోవడంతో భార్య మహేశ్వరి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యమైన మహేశ్ శ్రీశైలం ఆలయానికి వెళ్లినట్టు అక్కడి నుంచి కుటుంబ సభ్యులకు మంగళవారం సమాచారం ఇచ్చాడు. 10న సర్పంచ్ల సంఘం చైతన్య సదస్సు పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి చేవెళ్ల: సర్పంచ్ల సంఘం చైతన్య సదస్సును విజయవంతం చేయాలని పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మధుసూదన్‌గుప్తా ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్‌లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 10న జెడ్పీ కార్యాలయం వద్ద పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల సర్పంచ్‌లతో సర్పంచ్ల సంఘం జిల్లా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా, గ్రామాలు అభివృద్ధి సాధించాలన్నా ప్రభుత్వం నుంచి నిధుల విడుదల ప్రధానమన్నారు. జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధిక మొత్తంలో నిధులు వెళ్తుంటాయని అ నిధుల్లో మన జిల్లా అభివృద్ధికి సర్పంచ్‌లకు ప్రత్యేక నిధి కేటాయించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంఘంలోకి సర్పంచులు అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. ఈ చైతన్య సదస్సులో సర్పంచ్‌లకు అవగాహన కల్పించి జిల్లా కమిటీని ఎన్నుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి, సర్పంచ్‌లు జి.ప్రభాకర్‌రెడ్డి, రాంచంద్రయ్యగౌడ్, రామస్వామి, నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు తీరవే!
వనరులున్నా.. తాండూరు మున్సిపాలిటీలో పాలకులు మారుతున్నా సమస్యలు మాత్రం తొలగడం లేదు. వాణిజ్య పరంగా పరిణితి సాధించిన ప్రాంతంలో మౌలిక సదుపాయాలు సైతం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాండూరు: వ్యవసాయం.. సిమెంట్ పరిశ్రమలు.. నాపరాతి వ్యాపారంలో అంతర్జాతీయ స్థాయిలో తాండూరు ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పండే కంది పప్పునకు భౌగోళిక గుర్తింపు(జీఐ) సైతం లభించింది. వ్యాపార, వాణిజ్య కేంద్రంగా తాండూరు పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోంది. 16 శతాబ్దంలో కాగ్నానది తీరం వద్ద వెలసిందని చరిత్రకారులు అంటున్నారు. తాండూరు నిజాం పాలన ముగిసిన తొలి నాళ్లలోనే మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. నాటి నుంచి మున్సిపాలిటీ విస్తరిస్తూ వస్తోంది. తాండూరు మున్సిపల్ కేంద్రంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వ్యాపారాలు కొనసాగుతున్నాయి. తాండూరు, బషీరాబాద్ మండలాల్లో నాపరాతి నిక్షేపాలు, పెద్దేముల్లో సుద్ద(తెల్ల మట్టి,) ఎర్రమట్టి నిక్షేపాలు ఉన్నాయి. సరిహద్దులో ఐదు సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. 17 శతాబ్దంలో అక్కన్న మాదన్నలు కాగ్నానది తీరంలో చిన్న కోటను ఏర్పాటు చేసుకున్నట్లు ఆనవాళ్లున్నాయి. 1953లో తొలి మున్సిపాలిటీ తాండూరు మున్సిపాలిటీగా 1953లో ఆవిర్భవించింది. తొలి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముదెళ్లి నారాయణరావు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. గుల్బర్గా జిల్లా నుంచి తాండూరు విడిపోయి ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది. అప్పుడు హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఏకై క పురపాలక సంఘం తాండూరు ఒక్కటే. తరువాత 1978లో హైదరాబాద్ జిల్లాను రెండుగా విభజించారు. 1978లో ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లాలో కూడా ఏకై క మున్సిపాలిటీ తాండూరు మాత్రమే. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రంగారెడ్డి జిల్లా విభజనతో వికారాబాద్ జిల్లాలోకి తాండూరు చేరింది. మున్సిపల్లో 36 వార్డులు ఉన్నాయి. మున్సిపల్ విస్తరణలో భాగంగా పట్టణ శివారులోని ఎన్టీఆర్ కాలనీ, రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, కాగ్నానది తీరం వద్ద ఉన్న రెడ్డి కాలనీలు 2019లో విలీనం అయ్యాయి. ప్రస్తుతం తాండూరు మున్సిపాలిటీలో ప్రజలకు కనీస సౌకర్యాలను అందడం లేదనే విమర్శలు వినిపిస్తోన్నాయి. ప్రస్తుతం మున్సిపాలిటీలో 77,110 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 37,547 మంది, మహిళలు 39,558 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. పట్టణంలో ప్రధాన సమస్యలు ● తాండూరు పట్టణంలో ఉన్న నాపరాతి పరిశ్రమలను పారిశ్రామిక వాడకు తరలించకపోవడంతో వాతావరణ కాలుష్యం అధికంగా ఉంది. ● పట్టణంలో ఉన్న లారీ పార్కింగ్ లేకపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. భారీ వాహనాల కారణంగా ప్రజలకు ఇబ్బంది. పార్కింగ్ కోసం కేటాయించిన స్థలంలో అభివృద్ధి నిలిచిపోయింది. ● పట్టణంలోకి వాహనాలు రాకుండా దారి మళ్లించేందుకు బైపాస్ రోడ్డుకు నిధులు మంజూరు అయినా ఇప్పటివరకు పూర్తి చేయలేదు. ● మున్సిపల్లో అండన్ గ్రౌండ్ డ్రైనేజీ లేక పోవడంతో పారిశుద్ధ్య వ్యవస్థ అధ్వానంగా మారింది. ● కూరగాయల మార్కెట్ లేకపోవడంతో రోడ్లపైనే విక్రయాలు సాగుతున్నాయి. ● జనాభా సాంద్రతను బట్టి పట్టణంలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేక పోవడం. ● మున్సిపల్ పరిధిలో ఉన్న పార్కుల నిర్వహణ సరిగా లేక పోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. ● పట్టణంలో ఉన్న మినీ స్టేడియం గతంలో సబ్ కలెక్టర్ కార్యాలయానికి కేటాయించారు. దీంతో క్రీడా ప్రాంగణం లేక యువత ఆటలకు దూరమవుతున్నారు. ● చిలుకవాగు ప్రక్షాళన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ● మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో అంతర్గత రోడ్లు, మురుగు కాల్వలు లేక ప్రజల ఇబ్బందులు పడుతున్నారు. ● శివారు ప్రాంతాలలోని కాలనీలలో పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు వ్యవస్థ లేదు. ● తాండూరు–పాత తాండూరు మార్గంలోని రైల్వే బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి. ఖనిజ సంపదతో తాండూరులో వాణిజ్యం జోరు మౌలిక సదుపాయాలు లేక ప్రజల అవస్థలు పప్పు ధాన్యసిరి కేంద్రంగా ఖ్యాతి -
మట్టి తరలిస్తున్న టిప్పర్ సీజ్
కేశంపేట: అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు సీజ్ చేశారు. సీఐ నరహరి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పుట్టోనిగూడ శివారు నుంచి సోమవారం రాత్రి ఓ టిప్పర్‌లో మట్టి తరలిస్తున్నారు. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు మట్టితరలింపునకు సంబంధించి అనుమతి పత్రాలు అడగ్గా ఎటువంటి పత్రాలు లేవని చెప్పాడు. దీంతో వాహనాన్ని పీఎస్‌కు తరలించారు. కొత్తూరు మండల పరిధిలోని సిద్దాపూర్ నుంచి మంగళిగూడ శివారులోకి అక్రమంగా మట్టిని తరలిస్తుండగా పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు వాహణాన్ని ఠాణాకు తరలించారు. పెట్రోలింగ్ పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నరహరి తెలిపారు. -
మట్టి పిసికిన చేతులతో మైనింగ్‌లో డాక్టరేట్
కొందుర్గు: మట్టి పిసికిన గిరిజన యువకుడు మైనింగ్‌లో డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. జిల్లేడ్ చౌదరిగూడ మండలం మల్కాపహాడ్ పంచాయతీ అనుంబంధ గ్రామం వాచ్యాతండాకు చెందిన వాలీబాయ్, శంకర్‌నాయక్ దంపతులకు అనూష, కవితతో పాటు వెంకటేష్, సురేశ్ సంతానం. వీరు కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు కూతుళ్ల వివాహం చేశారు. కుమారులు తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటూ కూలి పనులు చేస్తూనే చదువుకున్నారు. పెద్ద కుమారుడు వెంకటేశ్ పెద్దషాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. చిన్న కొడుకు సురేశ్ సర్కారు పాఠశాలలోనే చదివి ప్రస్తుతం పీహెచ్డీ అందుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక, ఉన్నత విద్య పూర్తి చేసిన ఆయన ఇంటర్మీడియెట్ ఓ కార్పొరేట్ కళాశాలలో ఉచితంగా చదివాడు. కొత్తగూడ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో బీటెక్, ఐఐటీ దన్బాద్ జార్ఖండ్‌లో ఎంటెక్ చేశాడు. ప్రస్తుతం నాగ్‌పూర్‌లో కోల్ ఇండియా లిమిటెడ్ కంపనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తూనే చదువును కొనసాగించిన సురేశ్ ‘తక్కువ ఖర్చుతో కూడిన సెన్సార్లను ఉపయోగించి ఉపరితల బొగ్గు గనుల్లో వాయు కాలుష్య పర్యవేక్షణ, సైబర్ భౌతిక వ్యవస్థలో స్థిరమైన అభివృద్ధి విధానం’అనే అంశంలో పీహెచ్డీ పట్టా పొందాడు. -
ప్రభుత్వాన్ని ప్రశ్నించేది బీజేపీయే
చేవెళ్ల: ప్రజా సమస్యలపై ప్రశ్నించి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్ష హోదా బీజేపీదేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని దేవుని ఎర్రవల్లి వార్డుకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు వికారాబాద్‌లో ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ను ప్రజలు నమ్మడం లేదని.. దీంతో బీజేపీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. పార్టీ పటిష్టతకు నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేలా బూత్‌స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. పార్టీకోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మున్సిపల్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, దేవునిఎర్రవల్లి నాయకులు, మున్సిపల్నాయకులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి -
తప్పులు లేకుండా తుదిజాబితా
ఇబ్రహీంపట్నం రూరల్: మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా ముసాయిదాపై ఎలాంటి అభ్యంతరాలున్నా వెంటనే తెలపాలని లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్ కోరారు. మంగళవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశారన్నారు. ముసాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. ఫిర్యాదులను వెంటనే పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు నిర్వహించి జనవరి 10న తుది జాబితా విడుదల చేస్తామన్నారు. బీఎల్ఓలు, బీఎల్ఏల సమన్వయం అవసరం ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో వ్యవహరించి జాబితాను తయారు చేయాలన్నారు. వివాహం చేసుకుని వెళ్లినా, ఇళ్లు మారినా, మృతి చెందిన వారి పేర్లను తొలగించాలని సూచించారు. ఓటరు జాబితాలో తప్పులు దొర్లకుండా తుది జాబితా రూపొందించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిషనల్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, పీడీ మెప్మా వెంకట సత్యనారాయణ, బీఆర్ఎస్ నుంచి వేణుగోపాల్, నిట్టు జగదీశ్వర్, శ్రవణ్, దేవదాసు, బీజేపీ నుంచి మల్లారెడ్డి, మల్లేశ్, నారాయణ యాదవ్, లక్ష్మీపతిగౌడ్, టీడీపీ నుంచి జెలమోని రవీందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
విజయ్ హజారె ట్రోఫీలో షాద్‌నగర్ యువకుడి ప్రతిభ
షాద్‌నగర్‌రూరల్: విజయ్ హజారె ట్రోఫీ 2025–26లో ఎలికట్టవాసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బద్దుల కృష్ణయ్య, విజయ దంపతుల కుమారుడు సునీల్ యాదవ్ ఇటీవల బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ్ హజారె ట్రోఫీకి ఎంపికయ్యాడు. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో ఆయన అరుణాచల్ ప్రదేశ్ జట్టు నుంచి బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి ఆల్ రౌండర్ ప్రతిభను కనబరిచాడు. చివరి మూడు బంతుల్లో మూడు పరుగులను(నాటౌట్) చేయడంతో పాటుగా 8.2 ఓవర్లలో కేవలం 37 పరుగులు ఇచ్చి బౌలింగ్‌లో బెస్ట్ ఎకనామిక్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా సునీల్ యాదవ్‌ను అరుణాచల్‌ప్రదేశ్ కోచ్ ఆర్.అనంత్ అభినందించారు. ప్రస్తుతం సునీల్ తెల్లాపూర్‌లోని స్పోర్ట్ అండ్ స్పార్క్ క్రికెట్ అకాడమీలో ప్రీతంరెడ్డి, భీమరాజు ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాడు. భవిష్యత్‌లో ఐపీఎల్ మ్యాచ్, ఇండియన్ టీంలో ఆడాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. -
మాంజా..
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026మృత్యు పంజాషాద్నగర్: సంక్రాంతి అనగానే అందరికి గుర్తుకు వచ్చేది గాలి పటాలు. సెలవుల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా సరదాగా వీటిని ఎగురవేస్తుంటారు. ఎక్కడ చూసినా రంగురంగుల గాలి పటాలు ఎగురుతూ కనిపిస్తుంటాయి. గాలి పటాలను ఎగురవేసేందుకు సంప్రదాయ దారాన్ని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ ఆదారం బలంగా లేక తెగిపోతాయని కొందరు చైనా మాంజాలను వినియోగిస్తుంటారు. ఈ మాంజా మనుషులు, జంతువులకు, పక్షులకు ముప్పు తెచ్చిపెడుతోంది. నిషేధిత చైనా మాంజాను కొందరు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చైనా మాంజా తయారీ ● పలు రసాయనాలతో తయారు చేసే మాంజాలో ప్రమాదకరమైన గాజుపొడి, అల్యూమినియం ఆకై ్సడ్ కలుపుతారు. ● దారం గట్టిగా, తెగిపోకుండా ఉండేందుకు వివిధ రంగుల మిశ్రమంతో సింథటిక్ ఫైబర్‌ను వినియోగిస్తున్నారు. ● వేరే పతంగి దారాన్ని కోసేందుకు గాజు పొడి కలుపుతారు. ● ఈ మాంజా దారం నీరు, భూమిలో కరగదు. గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు చైనా మాంజాను టాంగూస్ మాంజా అని కూడా పిలుస్తారు. మనునుషులతో పాటు జంతువులకు, పక్షులకు సైతం ముప్పు తెస్తున్న చైనా మాంజాతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం 2016లో చైనా మాంజా వాడకాన్ని నిషేధించింది. అయినా గుట్టు చప్పుడు కాకుండా కొందరు వ్యాపారులు చైనా మాంజాను విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లోని కిరాణా దుకాణాలు మొదలుకుని అంతటా విరివిగా లభిస్తుండడంతో పోలీసులు, అఽధికారులు విసృతంగా తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దంపతులకు గాయాలు రోడ్డుపై పడిన మాంజా గతంలో ఓ ప్రమాదానికి కారణమైంది. షాద్‌నగర్‌లో భార్యాభర్తలు బైక్‌పై వెళ్తుండగా మాంజాను గమనించి భార్య భర్త గొంతుకు తగిలే ప్రమాదం ఉందని గ్రహించి తన చేతిని అడ్డు పెట్టింది. ఈ ఘటనలో మాంజా దారం కారణంగా ఇరువురూ గాయపడ్డారు. ఇటీవల మీర్‌పేట ప్రశాంత్‌నగర్ కాలనీలో హైటెన్షన్ వైర్‌కి చిక్కుకున్న గాలి పటాన్ని కర్రతో తీసేందుకు యత్నించిన ఓ బాలుడు విద్యుదాఘాతంతో గాయాల పాలయ్యాడు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యుత్ శాఖ విడుదల చేసిన కార్టూన్లు నిషేధిత చైనా దారంతో ప్రమాదాలు దుకాణాల్లో గుట్టుగా విక్రయాలు ప్రాణాలకు ముప్పు తెస్తున్న టాంగూస్ మాంజా మెటాలిక్ మాంజాలకు కరెంట్ పాస్ అవుతుంది. అవి విద్యుత్ తీగలపై పడితే కరెంట్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద పంతంగులు ఎగురేయొద్దు – వినోద్‌కుమార్, ట్రాన్స్‌కో ఏఈ, షాద్‌నగర్‌టౌన్ నిషేధిత చైనా మాంజా విక్రయించినా, ఉపయోగించిన చర్యలు తీసుకుంటాం. దుకాణాలపై నిఘా ఉంచాం. నిబంధనలు అతిక్రమించి మాంజాను విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు. – విజయ్‌కుమార్, సీఐ, షాద్‌నగర్ టౌన్ -
నేడు రైతులకు అవగాహన కార్యక్రమం
జిల్లా వ్యవసాయ అధికారి ఉష కొత్తూరు: యాసంగి సీజన్‌కు సంబంధించి యూరియా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని రైతులు అపోహలకు గురికావొద్దని జిల్లా వ్యవసాయ అధికారి ఉష తెలిపారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ రైతువేదికలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం సంక్షేమ పథకాలను పొందడానికి తప్పక రైతురిజిస్ట్రీ (గుర్తింపు) కార్డులను పొందాలన్నారు. కార్డు నమోదు కోసం రైతులు సమీపంలోని మీసేవా కేంద్రాల్లో, వ్యవసాయ అధికారి కార్యాలయంలో తమ పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌కార్డు జిరాక్స్, మొబైల్ నంబర్ వివరాలను ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గోపాల్, ఏఈఓ సుమలత, రైతులు, తదితరులు పాల్గొన్నారు. బస్తీల జేఏసీ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్ మొయినాబాద్‌రూరల్: పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం సరికాదని తెలంగాణ బస్తీల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ బోసుల శ్రీనివాస్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేవారు. పెద్దమంగళారం రెవెన్యూ సర్వే నంబర్ 110, 111, 112లో రాఘవేంద్ర సొసైటీ 1986లో వెంచర్ వేసి 150 మందికి అమ్మిన ప్లాట్లను కూల్చిన విషయం విదితమే. మంగళవారం శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రేవంత్‌రెడ్డి సోదరులు తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి పేదల ఇళ్లను కూలుస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి సోదరులు ఫామ్‌హౌస్‌ల కోసం పేద ఇళ్లను కూల్చడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. పోలీసులకు, జాతీయ ఎస్టీ కమిషన్, రాష్ట్ర ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు గిరిజనుల వెంట ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీల జేఏసీ వైస్ చైర్మన్ ఈద చెన్నయ్య, హైదరాబాద్ చైర్మన్ బుర్ర రాముగౌడ్, రమేశ్, తేజావత్ లక్ష్మీనాయక్ తదితరులు పాల్గొన్నారు. మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి చేవెళ్ల: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. ఏ ముఖ్యమంత్రి వచ్చినా రంగారెడ్డి జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను అమ్ముతున్నా జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించటం లేదని మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండలిలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంకోసం రంగారెడ్డి జిల్లా భూములు అమ్ముతున్నారని ఈ భూముల అమ్మకాల్లో వచ్చిన నిధుల్లో జిల్లా అభివృద్ధికి 30శాతం నిధులు ఇవ్వాలని కోరారు. ఈ జిల్లా ప్రజాప్రతినిధిగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన తనను, తనలాంటి జిల్లా నాయకులను ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారని.. వారికి సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం అమ్మకాలు చేపట్టగా వచ్చిన నిధి నుంచి జిల్లా అభివృద్ధికి 30 లేదంటే 20శాతం నిధులను ప్రత్యేకంగా కేటాయించాలని కోరారు. మండలిలో పీఎంఆర్ ప్రస్తావించిన అంశంపై పార్టీలకు అతీతంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
యంగ్ ఇండియా పాఠశాలలు దేశానికే ఆదర్శం
షాద్‌నగర్: రాష్ట్రంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా పాఠశాలలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సోమ వారం ఆయన మాట్లాడుతూ..పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో నిర్మిస్తోందని తెలిపారు. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గులో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రూ.150 కోట్ల తో అత్యాధు నిక హంగులతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. లూయిస్ బ్రెయిలీకి ఘన నివాళి షాద్‌నగర్: అంధుల జీవితాల్లో లూయిస్ బ్రెయిలీ వెలుగులు నింపారని ఎన్పీఆర్డీ సంఘం జిల్లా అద్యక్షుడు ఆశన్నగారి భుజంగరెడ్డి అన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని సోమవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రెయి లీ లిపి ద్వారా దృష్టి లోపం ఉన్న వారికి విద్య లో, ఉద్యోగాల్లో సమాజంలో స్వతంత్రంగా ఎదగడానికి మార్గం ఏర్పడిందని అన్నారు. ప్రతి పాఠశాల, ప్రతి గ్రంథాలయంలో బ్రెయి లీ పుస్తకాలు అందుబాటులో ఉంచాలని కోరా రు. వికలాంగులు దయతో కాదు హక్కులతో జీవించాలని, సమాజంలో అన్ని వర్గాలకు కల్పించే విధంగా సమాన అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, యాదయ్య, చెన్నయ్య, శ్రీకాంత్, శంకర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ కార్యాలయాలు ఒకేచోట ఏర్పాటు చేయాలి ఆమనగల్లు: మండల కేంద్రంలో అన్ని డివి జన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కల్వకుర్తి ఎ మ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ..జిల్లాల పునర్వి భజనలో భాగంగా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని మూడు మండలాలను నాగర్‌కర్నూల్ జి ల్లాలో, నాలుగు మండలాలను రంగారెడ్డి జిల్లాలో చేర్చారని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో చేర్చిన వాటి లో మూడు మండలాలు ఒకవైపు ఒక మండలం మరోవైపు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాలకు ఆర్డీఓ కార్యాలయం కందుకూరులో, ఆర్టీఓ కార్యాలయం షాద్‌నగర్‌లో, ఎస్టీఓ, ఎస్ఆర్ఓ కార్యాలయాలు మహేశ్వరంలో ఉన్నాయని వివరించారు. మాడ్గుల మండలాన్ని ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో ఉంచారన్నారు. ప్రజల సౌలభ్యం కోసం అన్ని డివిజన్ కార్యాలయాలను ఆమనగల్లు మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. మహిళా యోజన పథకానికి దరఖాస్తుల ఆహ్వానం తుక్కుగూడ: ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనార్టీ, సంక్షేమ అధికారి కె.నవీన్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన్లకు చెందిన మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక పురోగతి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ పథకం కింద బైకులు, ఈ–బైకు లు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల వారు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారు రూ.2 లక్షల ఆదాయం కలిగి ఉండాలన్నారు. 21 నుంచి 55 సంవత్సరాలు కలిగి ఉన్న వారు అర్హులని చెప్పారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఓబీఎంఎంఎస్ సైట్లో ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారం ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని హార్డ్ కాపీలను ఎంపీడీఓ లేదా మున్సిపల్, జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో అందజేయాలని ఆయన సూచించారు. -
ప్రతిపక్షాలది దుష్ప్రచారం
చేవెళ్ల: గ్రామాల్లో ఉండే పేదలకు ఉపాధి కల్పించటం, గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా జీ రామ్ జీ అనే పథకాన్ని తీసుకు వచ్చిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పథకానికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ పథకం అమలైతే కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుందని గ్రహించి తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని విమర్శించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చలేదని, కొత్త పథకాన్ని తీసుకు వచ్చినట్లు స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తోందన్నారు. ఈ పథకానికి 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తోందని 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయన్నారు. ఈ పథకంతో పేదలకు మరింత లాభం చేకూరే విధంగా ఉండాలనే మోదీ కొత్త పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్‌రెడ్డి, నాయకులు కుంచం శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, శర్వలింగం, కృష్ణాగౌడ్, అశోక్, పత్తి సత్యనారాయణ, జయశంకర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అభ్యంతరాల వెల్లువ
తప్పుల తడక.. అసంబద్ధం సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపల్ ఓటర్ల ముసాయిదాపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. వార్డుల కూర్పు.. ఓటర్ల జాబితా తయారీ పూర్తి అసంబద్ధంగా ఉన్నట్లు రాజకీయ పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పక్కపక్క ఇళ్లలో ఉన్న ఓటర్లను వేర్వేరు వార్డుల్లో నమోదు చేయడం, చనిపోయిన వారి పేర్లు జాబితాలో దర్శనమివ్వడం, ఒకే వ్యక్తికి రెండు మూడు ఓట్లు ఉన్నట్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఒకరి పేరుతో మరొకరి ఫొటోలు ప్రచురితం కావడం వంటివి చోటు చేసుకున్నాయి. ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది. ఇటీవల ఓటర్ల ముసాయిదాను ఆయా మున్సిపాలిటీల్లో ప్రకటించింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలోని ఆయా రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తుంది. లోపాలను సరిదిద్ది ఈ నెల 10న తుదిజాబితాను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రాఫ్ట్‌లపై ఆరోపణలు జిల్లాలో మూడు కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు ఉండగా, ప్రభుత్వం ఇటీవల మాడు కార్పొరేషన్లు సహా ఎనిమిది మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. ప్రస్తుతం మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, షాద్‌నగర్, ఆమనగల్లు, కొత్తూరు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలు మిగిలాయి. జనవరి 1న డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రకటించి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అధికారులు రూపొందించిన డ్రాఫ్ట్ పూర్తి అసంబద్ధంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏడు మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులు ఉండగా, 236 పోలింగ్ కేంద్రాలను ప్రకటించారు. 87,197 మంది పురుషులు, 88,113 మంది మహిళలు, ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. కాలనీల వారీగా కాకుండా ఇంటి నంబర్ల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంతో చనిపోయిన ఓటర్ల పేర్లు దర్శనమిచ్చాయి. ఒక వార్డులో పక్కపక్కనే ఉన్న రెండు కుటుంబాల ఓట్లు వేర్వేరు వార్డుల్లో కన్పించడం చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు, పేర్లలోనూ అనేక తప్పులు దొర్లాయి. మచ్చుకు కొన్ని.. -
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
మొయినాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనకోసం వీరోచిత పోరాటం చేసిన ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వి.పాండుగౌడ్ అన్నారు. మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో సోమ వారం తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వ ర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు ఐడీ కార్డులు, 250 గజాల ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా హామీలు అమలు చేయడం లేదన్నారు. వెంటనే అమలు చేయలేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఉద్యమకారుల ఫోరం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి యాలాల మహేశ్వర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి రమేష్, మండల అధ్యక్షుడు న్యాలటి మహిపాల్ పాల్గొన్నారు. -
గోడు పట్టదా..!
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణి కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి..అర్జీలు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించండి.. అని కలెక్టర్ ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమంలో సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. జిల్లా నలుమూలల నుంచి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల నుంచి మొదలు ఎంతోమంది బాధితులు తమ గోడు చెప్పుకోవడానికి కలెక్టరేట్‌కు వస్తున్నారు. కాగితాల మీద రాతలే తప్ప తమ పనులు పరిష్కారం కావడం లేదని బాధితులు పేర్కొంటున్నారు. అక్కడికి వెళ్తే ఇక్కడికి.. ఇక్కడికి వెళ్తే అక్కడికి తిప్పి పంపుతున్నారని.. ప్రజావాణికి పొద్దున వస్తే సాయంత్రం దాకా క్యూ లైన్లో నిలబడి కాళ్లు గుంజుతున్నాయని, అయినా ఓపిక పట్టి ఫిర్యాదు చేసినా ఫలితం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘అయ్యా మా గోడు పట్టించుకోండి’ అని వాపోతున్నారు. దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలి ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ కనబరచాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమం కేవలం సమస్యలు విని, దరఖాస్తులు స్వీకరించే విధంగా కాకుండా పరిష్కారాల వేదికగా నిలిచేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. ఈ వారం 45 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కాగా, ప్రజావాణిని ప్రాజెక్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్ రాకేష్ రెడ్డి పరిశీలించారు. దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి తిరుగుతున్నాం -
డీ అడిక్షన్ సెంటర్లో యువకుడి మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: డీ అడిక్షన్ కేంద్రంలో చికిత్స పొందుతున్న యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఆదిబట్ల సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. సంతోష్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు బొంగ్లూర్ సమీపంలోని రాఘవేంద్ర హోమ్స్‌లో హైదరాబాద్ డీ అడిక్షన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడకు చెందిన చౌహాన్ సంతోష్ పవన్‌సింగ్ (29) అనే యువ కుడిని ఐదు రోజుల క్రితం ఇక్కడ చేర్పించారు. ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం సంతోష్ తల్లికి ఫోన్ చేసిన నిర్వాహకులు మీ కుమారుడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించామని చెప్పారు. వారు వచ్చేసరికి సంతోష్ చనిపోయాడు. తన కొడుకు శరీరంపై తీవ్రగాయాలు, రక్తపు మరకలు ఉన్నాయని, అతన్ని ఉద్దేశపూర్వకంగా కొట్టి చంపారని మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. అయితే ఇక్కడ కొనసాగుతున్న డీఅడిక్షన్ సెంటర్‌కు ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. -
రైతులకు న్యాయం చేయండి
షాబాద్: ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతి కోసం రైతుల నుంచి తీసుకున్న భూములకు ప్రతిగా ఇవ్వాల్సినవి ఇచ్చి న్యాయం చేయాలని శాసనమండలిలో సోమవారం చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి ప్రస్తావించారు. షాబాద్ మండలంలో పరిశ్రమల కోసం భూములిచ్చిన రైతుల పరిస్థితిని వివరించారు. పారిశ్రామిక ప్రగతి కోసం మండలంలో సుమారు 3వేల ఎకరాల ప్రభుత్వ భూమిని 2వేల మంది రైతుల నుంచి సేకరించి కంపెనీలకు అప్పగించడం జరిగిందన్నారు. చందనవెల్లిలో 650 మంది రైతుల నుంచి 1,200 ఎకరాలు, సీతారాంపూర్‌లో 600 మంది నుంచి 1,150 ఎకరాలు, హైతాబాద్, మాచన్‌పల్లి గ్రామాలకు చెందిన 300 మంది రైతుల నుంచి 500 ఎకరాలు, పెద్దవేడు గ్రామానికి చెందిన 70 మంది రైతుల నుంచి 150 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. వాటిలో వెల్స్పన్, ఆమేజాన్ లాంటి బడా కంపెనీలు పరిశ్రమలు స్థాపించాయన్నారు. భూములు కోల్పోయే సమయంలో రైతులకు ఎకరా భూమికి ఒక గుంట, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. -
ఎకరాకు రూ.కోటి చెల్లించండి
ఆమనగల్లు: గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న సాకిబండతండా గిరిజనులకు ఎకరాకు రూ.కోటి ఇవ్వాలని ఆ తండాకు చెందిన పలువురు రైతులు కోరారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డిని రైతులు పత్యానాయక్, రవిరాథోడ్, బాలునాయక్, మణిపాల్‌నాయక్, శంకర్‌నాయక్, పాండునాయక్, ఇంద్రారెడ్డి, విజేందర్, గణేశ్ తదితరులు కలిసి వినతిపత్రం అందించారు. ఎకరాకు రూ.కోటి పరిహారంతో పాటు ఫ్యూచర్‌సిటీలో 500 గజాల నివాసస్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు తొలగించిన రెవెన్యూ అధికారులు శంకర్పల్లి: ప్రభుత్వ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను శంకర్పల్లి రెవెన్యూ అధికారులు జేసీబీల సాయంతో సోమవారం కూల్చివేశారు. తహసీల్దార్ సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని జన్వాడలో గల సర్వే నంబర్ 192లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో కొంత మంది వ్యక్తులు అక్రమంగా నాలుగు నిర్మాణాలను చేపట్టారు. దీనిపై ఇప్పటికే పలువురు తహసీల్దార్‌కి ఫిర్యాదు చేయగా.. సిబ్బందిని పంపి, విచారణ చేయించారు. అక్రమ నిర్మాణాలు నిజమేనని గుర్తించి, సోమవారం జేసీబీల సాయంతో కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం, కట్టడాలు జరపడం నేరమని, ఎవరైనా అతిక్రమిసే్త్ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సురేందర్ హెచ్చరించారు. ఉద్యమ కేసులు ఎత్తివేయాలి చీఫ్ సెక్రటరీకి పీసీబీ సభ్యుడి వినతి చేవెళ్ల: గత ప్రభుత్వ హయాంలో చేవెళ్ల జిల్లా ఏర్పాటుకోసం పార్టీలకు అతీతంగా నాయకులు, యువకులు, రైతులు చేసిన ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయించే విధంగా చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావును కోరారు. సోమవారం నగరంలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింపుల మాట్లాడుతూ.. 2016లో జిల్లాల విభజన సమయంలో అసెంబ్లీ, పార్లమెంట్ కేంద్రంగా ఉన్న చేవెళ్లను కూడా జిల్లా చేయాలనే డిమాండ్‌తో పార్టీలు, కులాలు, వర్గాలకు అతీతంగా ప్రజలు ఏకమై ఉద్యమించారని అన్నారు. శాంతియుతంగా జరిగిన నిరసన కార్యక్రమాలపై పోలీసులు దాదాపు 300 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న అమాయకులు కోర్టు విచారణలు, పోలీసు సమన్లను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కనకమామిడి ఆలయంలో చోరీ రూ.1.15 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తస్కరణ మొయినాబాద్‌రూరల్: గర్భగుడిలో ఉన్న ఆభరణాలతో పాటు హుండీ పగులగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కనకమామిడి సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు పక్కనే ఉన్న మల్లన్న దేవాలయం, చౌరస్తాలోని అయ్యప్ప దేవాలయంలో ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. కనకమామిడి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి బంగారు ఆభరణాలతో పాటు రెండు హుండీల్లో ఉన్న సుమారు రూ.1.15 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న మల్లన్న దేవాలయంలోనూ హుండీ పగులగొట్టి నగదు తస్కరించారు. అయ్యప్ప దేవాలయంలోనూ దోపిడీకి యత్నించి వెనుదిరిగారు. చోరీ దృశ్యాలు సీసీ పుటేజీల్లో రికార్డయ్యాయి. కాగా దొంగలను పట్టుకొని సొమ్మును రికవరీ చేయాలని కనకమామిడి వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కొండా లక్ష్మీకాంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
ఇక మున్సిపల్ పోరు!
ఆమనగల్లు: మున్సిపల్ పోరుకు రాజకీయ పార్టీలు సై అంటున్నాయి. పురపాలక సంఘం ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అందులో భాగంగా ఈనెల 10న మున్సిపాలిటీ ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. అలాగే 11న ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరుకు సన్నద్ధమవుతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులతో ఎన్నికలు జరుగుతుండటంతో అభ్యర్థుల ఎంపిక కీలకం కానుంది. కాగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో ఆమనగల్లు మున్సిపాలిటీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మున్సిపాలిటీగా ఏర్పాటు ఆమనగల్లు మేజర్ గ్రామ పంచాయతీని రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 2న మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. దీంతో పాటు విఠాయిపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపారు. ఆమనగల్లు, జంగారెడ్డిపల్లి, విఠాయిపల్లి, ముర్తుజపల్లి, సంకటోనిపల్లి, సాకిబండతండా, నుచ్చుగుట్టతండా, చంద్రాయణపల్లి తండాలతో మున్సిపాలిటీ విస్తరించింది. 2020లో 14,785 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 16,984 మందికి పెరిగారు. గత ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులు మున్సిపాలిటీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రిజర్వేషన్లపై నాయకుల్లో టెన్షన్ పెరిగింది. గత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా.. లేదా మారుస్తారా అనే సందిగ్ధం నెలకొంది. రిజర్వేషన్లు ఎలా ఉన్నా పోటీ చేయాలని కొంతమంది ఆశావహులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. తమకు అవకాశం వస్తే పోటీ చేయాలని లేదా తమ సతీమణులను రంగంలోకి దింపాలని కొందరు చూస్తున్నారు. ప్రస్తుతం పోటీ చేసేందుకు వివిధ పార్టీల నుంచి పలువురు నాయకులు పావులు కదుపుతున్నారు. పార్టీల ఎన్నికల బాట మున్సిపల్ ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలు సన్నద్దమవుతున్నాయి. మెజార్టీ కౌన్సిలర్లు గెలుపొంది చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ ఎన్నికలలో ఆమనగల్లు మున్సిపాలిటీలో త్రిముఖ పోరు కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్ఎస్లు పోరులో నిలవనున్నాయి. ఇప్పటికే బీజేపీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించి వార్డుల వారీగా కొందరు నాయకులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. వారు ఇంటింటికీ తిరుగుతూ బీజేపీకి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా బీఆర్ఎస్ నాయకులు బస్తీబాట పేరుతో మున్సిపాలిటీలో వివిధ వార్డుల్లో తిరుగుతూ ప్రజలను కలుసుకుంటున్నారు. అయితే అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌లో మాత్రం ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. ఈ సారి ఆమనగల్లు మున్సిపాలిటీని దక్కించుకుని తీరుతామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చైర్మన్ పదవి కోసం పెద్ద నాయకులు పోటీ పడుతుండటంతో ఈసారి పోరు రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఓటర్ల వివరాలు ఆమనగల్లు మున్సిపాలిటీలో పార్టీల సన్నద్ధం పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్న నేతలు ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాలు -
పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్‌గా గణేశ్‌గౌడ్
కడ్తాల్: మండల పరిధిలోని చల్లంపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది కానం గణేశ్‌గౌడ్ పీసీసీ లీగల్ సెల్(న్యాయ, మానవ హక్కుల, సమాచార హక్కు) స్టేట్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన్ని నియమిస్తూ పీసీసీ లీగల్ సెల్ స్టేట్ చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గణేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన సీడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశీచంద్‌రెడ్డికి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వంశీచంద్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, నాయకులు సురేందర్‌రెడ్డి, బీచ్యానాయక్, నరేందర్ తదితరులు ఉన్నారు. పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశీచంద్‌రెడ్డి నాయకులకు సూచించారు. ఆయన నివాసంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహలతో పాటు పలువురు నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. -
ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కార్తీక్‌రెడ్డి మొయినాబాద్: రాబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్లోని అంజనాదేవి గార్డెన్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే అత్యధికంగా గెలవడం అందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పార్గీ గుర్తులపై జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవేనని, కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసి అత్యధిక సీట్లు గెలిచి మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రజల్లోకి వెళ్లాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, మాజీ సర్పంచ్‌లు శ్రీహరియాదవ్, నరోత్తంరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు మాణిక్‌రెడ్డి, శ్రీనివాస్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్లు డప్పు రాజు, రవుఫ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అసైన్డ్ భూములకు పట్టాలివ్వాలి
ఇబ్రహీంపట్నం రూరల్: అసైన్డ్ రైతులకు శాశ్వత పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. రేగడి దోస్వాడ, మక్తగూడ గ్రామాల సర్పంచ్‌లు పావని రమణారెడ్డి, మాన నారాయణరెడ్డిల ఆధ్వర్యంలో సోమవారం రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. రెండు గ్రామాల సర్వే నంబరు 102లో 272 ఎకరాల భూసేకరణ కోసం ప్రభుత్వం చూస్తుందన్నారు. వీటిని ప్రభుత్వం లాక్కోవద్దన్నారు. అసైన్డ్ రైతులకు శాశ్వత పట్టాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందన్నారు. భూములు లాక్కోవాలని చూస్తే రేగడి దోస్వాడ మరో లగచర్లగా మారుతుందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల సీపీఎం కార్యదర్శి దేవేందర్, సర్పంచులు రాములు, శ్రీనివాస్, నాయకులు రామచంద్రయ్య, శ్రీనివాస్, జంగయ్య, శేఖర్, రాజారత్నం, రాజేష్, సదానందం, రవి, రైతులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య -
ఒడిశా కూలీ అదృశ్యం
ఇబ్రహీంపట్నం రూరల్: కూరగాయల మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పి ఓ ఒడిశా కూలీ అదృశ్యమైన సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. మమ్మరాజుగూడ సమీపంలో ఎల్బీ బ్రిక్స్‌లో కూలీగా పని చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన జయంతి పహారియా గత నెల 28న కూరగాయల మార్కెట్‌కు వెళ్తున్నాని చెప్పి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబీకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’ షాద్‌నగర్‌రూరల్: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు షాద్‌నగర్ డిపో మేనేజర్ ఉష సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, సలహాలను తెలియచేయాలని కోరారు. 99592 26287 నంబర్లో సంప్రదించాలని ఆమె సూచించారు. అనుమతి లేని వెంచర్ తొలగింపు కొందుర్గు: అనుమతులు తీసుకోకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని డీఎల్పీఓ మల్లారెడ్డి హెచ్చరించారు. సోమవారం కొందుర్గు శివారులో అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న వెంచర్లో నిర్మించిన ప్రహరీని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా వెంచర్ ఏర్పాటు చేస్తే విధిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్, ఉపసర్పంచ్ చంద్రశేఖర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రైలుకింద పడి యువకుడి మృతి షాద్‌నగర్‌రూరల్: రైలుకింద పడి యువకుడు మృతి చెందిన సంఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్వర్ కథనం ప్రకారం.. కొందుర్గు మండలం చిన్న ఉమ్మెంత్యాల గ్రామానికి చెందిన పద్మారం నరేందర్(28) గత ఏడేళ్లక్రితం అదే గ్రామానికి చెందిన స్వప్నను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తరువాత నరేందర్ ప్లంబర్ పనిచేస్తూ మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లిలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. కొంత కాలం సాఫీగా సాగిన వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరిగేవి. దీంతో మనస్తాపం చెందిన నరేందర్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని తెలుసుకున్న రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. -
గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్‌నగర్ బిస్మిల్లా కాలనీకి చెందిన నసీమా బేగం(54) గతేడాది ఆగస్టు 24న కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. చుట్టు పక్కల గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో, ఆమె కుమారుడు జావిద్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి పహాడీషరీఫ్: ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతిచెందిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్‌పురా ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన సయ్యద్ అబ్దుల్లా హుస్సేనీ(52) సోమవారం మధ్యాహ్నం పహాడీషరీఫ్‌లో నివాసం ఉండే తన సోదరి ఇంటికి టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై వస్తున్నాడు. మార్గమధ్యలో పహాడీషరీఫ్ వై జంక్షన్ వద్దకు రాగానే బైపాస్ రోడ్డు నుంచి వేగంగా వచ్చిన కల్వకుర్తి డిపోనకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న ఎస్సై ఫైసల్ అహ్మద్ ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలపాలైన హుస్సేన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ జంక్షన్ వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేని కారణంగా అమాయకుల ప్రాణాలు పోవడం పరిపాటిగా మారింది. -
ట్రస్టు ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం
పనులు నిలిపేయాలని కమిషనర్ ఆదేశం ఆమనగల్లు: మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఉన్న శాంతినగర్ కాలనీలో ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను సోమవారం బీఆర్ఎస్ నాయకుడు నాగిళ్ల జగన్ ప్రారంభించారు. రెండు రోజుల క్రితం బస్తీబాటలో భాగంగా కాలనీలో మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో రూ.10 లక్షలు సొంత నిధులతో నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారాయణ, సైదులు, అహ్మద్, అప్రోజ్, శ్రీరామ్, అలీం, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అనుమతి లేకుండా సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడంతో మున్సిపల్ కమిషనర్ శంకర్ నిలిపివేయాలని ఆదేశించారు. శాంతినగర్ కాలనీలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్‌లైన్ డ్రైనేజీ పనులకు టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన చెప్పారు. దీంతో పనులు ఆపివేయాలని సూచించారు. ఆపకుండా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. -
షాద్‌నగర్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి
షాద్‌నగర్‌రూరల్: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాన్ని కలుపుతూ షాద్‌నగర్‌ను నూతన జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ఎమ్మె సంతోష్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని జిల్లా సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో కలిపి ఉంటుందని, పట్టణ ప్రాంతాలకు ప్రాధాన్యం పెరుగుతుండగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడిపోతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అవసరమైన సాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక సదుపాయాలు సకాలంలో అందక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లా కేంద్రం ప్రజలకు దూరంలో ఉండటంలో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి గ్రామీణ ప్రాంతాలను విడదీసి ఫ్యూచర్ సిటీ పరిధిలోని ప్రాంతాలను కలుపుతూ నూతన షాద్‌నగర్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం వెంటనే మొగిలిగిద్ద, చించోడ్, చేగూరు గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేయడంతో పాటుగా షాద్‌నగర్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా సాధన సమితి ప్రధాన కార్యదర్శి దర్గ వెంకటేశ్, పట్టణ అధ్యక్షుడు కాసోజు శివకుమార్, నాయకులు శరత్కృష్ణ, ఆదిత్య వర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ఎమ్మె సంతోష్ -
ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇవ్వాలి
తుర్కయంజాల్: ఎన్నికల హామీల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్ డిమాండ్ చేశారు. సోమవారం రాగన్నగూడలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి, రెండేళ్లు గడుస్తున్నా నేటికి దాని ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిచడంతో ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అనంతరం కార్మికులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు నర్సింహ, ఆటో ట్రాలీ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ధర్మారెడ్డి, కోశాధికారి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూగజీవాల రక్తం సేకరించి విక్రయం
కీసర: మూగ జీవాల నుండి అక్రమంగా రక్తాన్ని సేకరిస్తున్న ముఠాను కీసర పోలీసులు గుట్టురట్టు చేశారు. కీసర సీఐ ఆంజనేయులు తెలిపిన మేరకు.. నాగారం సత్యనారాయణ కాలనీలో మటన్, చికెన్ షాప్‌లో సోనూ మాంసం విక్రయిస్తుంటాడు. సోనూ, అతని ఉద్యోగి అఖిల్ ఇద్దరు వ్యక్తులు నిబంధనలకు విరుద్దంగా మూగ జీవాల నుండి రక్తం సేకరిస్తున్నారు. ఈ సేకరించిన రక్తాన్ని నగరంలోని ఓ సంస్థకు విక్రయించి ల్యాబోరేటరీలలో ఉపయోగించే షీప్ బ్లడ్ అగర్ ప్లేట్స్ తయారీకి వినియోగిస్తున్నట్లు తెలిసింది. మూగజీవాల నుండి రక్తాన్ని సేకరించిన వ్యక్తులు నిబంధనల ప్రకారం వెటర్నరీ వైద్యులు అయి ఉండాలని కానీ ఈ మాంసం విక్రయ కేంద్రంలో నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్ వ్యక్తులు రక్తాన్ని సేకరిస్తున్నారని విచారణలో తేలింది. ఇది చట్ట ప్రకారం నేరం. ఈ మేరకు ఇద్దరు నింధితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
దివ్యాంగులకు అండగా ఉంటాం
చాదర్‌ఘాట్: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఆదివారం మలక్‌పేటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుతో పాటు పాఠ్యపుస్తకాలు బ్రెయిలీ లిపిలో అందజేస్తామని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. పది రోజులలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేయనున్నట్లు తెలిపారు. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వికలాంగుల సంక్షేమానికి రూ. 100 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ అనితరామచంద్రన్, వికలాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ బి.శైలజ, జీఎం ప్రభంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ -
త్వరితగతిన పూర్తి చేయాలి
జిల్లా నేతలకు ఎన్నికల సమయంలోనే సాగునీటి ప్రాజెక్టులు గుర్తొస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా సాగు నీటి ప్రాజెక్టులపైన చర్చ జరుగుతూనే ఉంది. ఉత్తర తెలంగాణలో మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం వివక్షకు తావులేకుండా పనులు చేపట్టాలి. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పూర్తి చేసి జిల్లా రైతాంగానికి సాగునీరందించాలి. జిల్లా నేతలు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. – ఎం.నాగేశ్వర్, టీ జేఏసీ చైర్మన్, వికారాబాద్ జిల్లా -
చెక్‌డ్యాంకు చెర
చెక్‌డ్యాం కూల్చేయడంతో సుద్ద గుంతలోకి చేరిన నీరు ధారూరు: మైనింగ్ మాఫియా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ నిధులతో నిర్మించిన చెక్‌డ్యాంలను సైతం అక్రమార్కులు నేలమట్టం చేశారు. అక్రమంగా మైనింగ్ చేపట్టిన ప్రాంతాన్ని ఆదివారం తరిగోపుల సర్పంచ్ అంజిలయ్య గ్రామస్తులతో కలిసి పర్యటించగా విస్తుబోయే అంశాలు దర్శనమిచ్చాయి. కొండాపూర్‌ఖుర్దు–తరిగోపుల మధ్య పీర్ల కత్వపై వ్యవసాయ భూములకు సాగునీరందించేందుకు ప్రభుత్వం చెక్‌డ్యాంను నిర్మించింది. చెక్‌డ్యాం కింద సుద్ద ఉండటంతో మైనింగ్ మాఫియా చెక్‌డ్యాంకు కూల్చేశారు. ఆనవాళ్లు కనబడకుండా జేసీబీతో నేల చదును చేసేసారు. సుద్ద తవ్వి వ్యర్థాలతో నింపేసారు. చెక్‌డ్యాం కూల్చేయడంతో అక్కడున్న నీరంతా పక్కనే ఉన్న సుద్ద గుంతలోకి చేరింది. ఈ గుంతను సైతం పూడ్చేందుకు సుద్ద వ్యర్థాలను వేస్తున్నట్లు గుర్తించారు. సుద్ద తవ్వకాలతో వాగులోకి వ్యర్థాలు చేరి నీరు కలుషితమవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. తవ్వకాలు, లారీల్లో తరలింపుతో దుమ్మ, ధూళి వ్యాపించి నీరు, పంటలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సుద్ద మాఫియాను నిలువరించడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెకండ్యాంను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వీధి కుక్కల దాడిలో నాటు కోళ్లు మృతి
నందిగామ: వీధి కుక్కల దాడిలో నాటు కోళ్లు మృతి చెందిన ఘటన స్థానిక మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..నందిగామకు చెందిన శివగళ్ల పరుశురాం పెంచుతున్న నాటు కోళ్ల షెడ్డులోకి శనివారం రాత్రి కుక్కల గుంపు జొరబడి సుమారు 150 కోళ్లను కొరికేశాయి. ఆదివారం ఉదయం లేచి చూసేసరికి అవి మృతి చెంది ఉన్నాయి. ఈ ఘటనను చూసి బాధితుడు లబోదిబోమన్నాడు. ఇంటి వద్ద నాటు కోళ్లను పెంచుతూ ఉపాధి పొందుతున్న తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం పహాడీషరీఫ్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..జల్పల్లి కార్గోరోడ్డులోని బాబా కాంట సమీపంలో ఓ వ్యక్తి పడి ఉన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడని గుర్తించారు. మృతుడి సంబంధీకులెవరైనా ఉంటే పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్లో గాని సంప్రదించాలని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు. ఇంట్లోకి చొరబడి యువతిపై కత్తితో దాడి ● ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్న యువకుడు ● నిందితుడి అరెస్ట్ మణికొండ: నిన్ను ప్రేమిస్తున్నా.. నా ప్రేమను అంగీకరించాలని ఓ యువకుడు ఓ యువతి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడిచేశాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. అలకాపూర్ టౌన్షిప్లో ఓ యువతి(21) మరో ఇద్దరు యువతులతో కలిసి ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటుంది. అదే భవనంలో కొనసాగుతున్న ఓ హోటల్లో వెయిటర్‌గా పర్వతాల రోహిత్(23) పనిచేస్తున్నాడు. ఈనెల 1న యువతి కొత్త సంవత్సరం వేడుకల అనంతరం అర్ధరాత్రి ఇంటికి వచ్చింది. అప్పటికీ ఆమె మిత్రులు రాకపోవటంతో తలుపు తెరచి ఉంచి నిద్రకు ఉపక్రమించింది. రెండు నెలలుగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్న రోహిత్ అదే అదనుగా ఇంట్లోకి చొరబడ్డాడు. యువతి అతన్ని గమనించి అరవటంతో కత్తితో దాడి చేశాడు. ఈదాడిలో యువతి చేతికి గాయమైంది. అయినా అతను అసభ్యంగా ప్రవర్తించి పరారయ్యాడు. దీంతో బాధితురాలు ఈనెల 2 నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈవిషయమై సెక్టార్ ఎస్సై మునీందర్‌ను వివరణ కోరగా యువతిపై కత్తితో దాడి, అసభ్యంగా ప్రవర్తించిన రోహిత్‌పై ఫిర్యాదు వచ్చిందని, నిందితునిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అత్యాధునిక ఆవిష్కరణలు ఎంతో అవసరం మహిళా శిశు సంక్షేమ శాఖా కార్యదర్శి అనితా రామచంద్రన్ రాయదుర్గం: తెలంగాణ ప్రభుత్వం ఒక శక్తివంతమైన మార్పునకు నాంది పలుకుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా కార్యదర్శి అనితా రామచంద్రన్ స్పష్టం చేశారు. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్బంగా ఆదివారం అసిస్టివ్ టెక్నాలజీ (ఏటీ) సమ్మిట్ ను హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్ వేదికగా నిర్వహించారు. సౌలభ్యత విషయంలో ముందుండాలంటే సాంకేతిక నైపుణ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని దాదాపు 18 లక్షల మంది దివ్యాంగ పిల్లల అవసరాలను తీర్చడానికి అత్యాధునిక ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమన్నారు. అసిస్టెక్ ఫౌండేషన్ సీఈఓ ప్రతీక్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పరికరాలను లబ్ధిదారులకు అందించారు. -
జాతీయ స్థాయికి ఎంపిక
మొయినాబాద్ రూరల్: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు కాశీంబౌలి గ్రామంనుంచి ఎం.జశ్వంత్‌రెడ్డి ఎంపికవ్వడం అభినందనీయమని సర్పంచ్ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి నుంచి 10వ తేదీ వరకు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో నిర్వహించనున్న సీనియర్ నేషనల్ వాలీబాల్ చాంపియన్‌షిప్ పోటీలకు తెలంగాణ జట్టుకు ఆడటం సంతోషకరమన్నారు. జాతీయస్థాయిలో గెలుపొంది రాష్ట్రానికి, గ్రామానికి కీర్తి తీసుకరావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తాళం వేసిన ఇంట్లో చోరీ ● అర తులం బంగారం, ఐదు తులాల వెండి, రూ.20వేల నగదు అపహరణ ● కేసు నమోదు శంకర్పల్లి: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన ఆదివారం శంకర్పల్లి పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని వివేకానంద నగర్లో నివాసం ఉండే రవి(35) ప్రైవేటు ఉద్యోగి. ఈ నెల 2న రవి ఇంటికి తాళం వేసి, కుటుంబంతో కలిసి తన బంధువు గ్రామమైన స్టేషన్ గొల్లగూడకి వెళ్లాడు. తిరిగి ఆదివారం ఇంటికొచ్చి చూసేసరికి తాళం పగులగొట్టకుండా దుండగులు ఇంటి పైకప్పు నుంచి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా తాళం పగులగొట్టి అర తుల బంగారం, 5తులాల వెండి, రూ. 20వేల నగదు అపహరించినట్లు గుర్తించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ..
చేవెళ్ల: అంత్యక్రియలకు వెళ్లి వస్తూ మార్గమధ్యలో బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంతారం గేట్‌సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం గోనుర్ గ్రామానికి చెందిన కావలి లాలప్ప(50) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం తెలిసిన బంధువు మృతి చెందారని గ్రామానికి చెందిన స్నేహితులతో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. మార్గమధ్యలో చేవెళ్ల మండలంలోని అంతారం గేట్ వద్దకు రాగానే మూత్ర విసర్జన కోసం కారు ఆపారు. లాలప్ప మూత్రవిసర్జన చేసి తిరిగి వస్తూండగా వేగంగా హైదరాబాద్ వైపు నుంచి వికారాబాద్‌వైపు వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లాలప్ప తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. రోడ్డుపై పడిపోయిన అతడిని గుర్తించిన స్నేహితులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి -
కల సాకారమయ్యేనా!
వికారాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా పరిస్థితి దీపం చుట్టూ చీకట్లే అన్న చందంగా తయారయింది. నగరానికి కూతవేటు సమీపంలో ఉన్న జిల్లా అభివృద్ధిలో మాత్రం అందనంత దూరంలో ఉండి పోయింది. పాలకుల పాపం.. నోరు విప్పని నేతలతో జిల్లా ముఖచిత్రంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లా రూపు రేఖలు.. స్థితిగతులు మార్చి ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాయనుకున్న ప్రాజెక్టులు.. ఎన్నికల హామీలుగానే మిగిలిపోతున్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి జిల్లాకు చెందిన ప్రాజెక్టులు తెరపైకి రావడం.. ఎన్నికలు ముగిసిన వెంటనే కనుమరుగవడం రెండు మూడు దశాబ్దాలుగా పరిపాటయింది. ప్రస్తుతం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు లేనప్పటికీ శాసనసభలో చర్చంతా జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టులపైనే. పాలమూరు ఎత్తిపోతల పథకం, మూసీనది ప్రక్షాళన అంశాలపై అసెంబ్లీలో దుమారం రేగుతుంది. ఇలా సందర్భం వచ్చినప్పుడు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవటం మినహాయిస్తే ప్రాజెక్టు పనులు పూర్తి కావడంలేదు. జిల్లాకు సాగునీరందటంలేదు. ‘ఉత్తి’పోతలేనా? ప్రభుత్వం ఏదైనా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం ఇదే సంప్రదాయం కొనసాగించింది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేకు రూ.6.91 కోట్లు కేటాయించగా నిపుణులు సర్వే చేసి డిజైన్ వివరాలు వెళ్లడించారు. ఈ ప్రాజెక్టుకోసం మొత్తం 115 టీఎంసీ నీటిని కేటాయించగా అందులో 45 టీఎంసీల కెపాసిటీతో పరిగి నియోజకవర్గంలో రిజర్వార్లు కట్టేందుకు ప్రణాళిక చేశారు. ఇందులో గండీడ్, కుల్కచర్ల మండలాల పరిఽధిలో నిర్మించే రిజర్వాయర్ సామర్థ్యం 35 టీఎంసీలు కాగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లక్ష్మిదేవిపల్లి, పరిగి మండల పరిధిలోని రావులపల్లి శివారులో జాయింట్‌గా నిర్మించే రిజర్వాయర్ పది టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో జిల్లాకు 2,46,154 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. అనంతరం అధికారం చేపట్టిన బీఆర్ఎస్ సర్కార్ పలుమార్లు డిజైన్ మారుస్తూ వెళ్లింది. చివరకు జిల్లాకు గ్రావిటి ద్వారానే నీరందిస్తామని చెప్పి అదికూడా పూర్తిచేయలేదు. పాలమూరు పరిధిలో రెండు రిజర్వాయర్ల నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ గంపెడు మట్టికూడా తీయలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్టు రీడిజైన్ చేసి జిల్లాకు నీరందిస్తామని రెండో బడ్జెట్లో పేర్కొంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో లక్ష్మిదేవిపల్లి, రావులపల్లి జాయింట్‌గా పది టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తామంటున్నారు. ఇటీవలి బడ్జెట్లో పేర్కొన్నట్టుగా కేపీ లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తిచేసి పొలాలు తడపాలని జిల్లా రైతులు కోరుతున్నారు. జిల్లాలకు చెందిన ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ కొర్రీలు పెడుతూ కొండెక్కిస్తున్నారు. సర్వేలు, రీడిజైన్లు, కేసులు అంటూ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దశాబ్దాల నుంచి సర్వేలు, ఎన్నికల హామీలకే పరిమితం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 50 టీఎంసీల కేటాయింపులున్న ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును గత సర్కారు రీడిజైన్ పేరుతో అటకెక్కించి జిల్లాకు మొండిచేయి చూపింది. పూడూరు మండల పరిధిలోని రాకంచర్లలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు అతితక్కువ ధరకు పేదల నుంచి వంద ఎకరాల భూ సేకరణ చేసి హడావుడిగా ప్రారంభించారు. ఇక్కడ నాలుగైదు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసినా ఏ ఒక్క స్థానికుడికి ఉపాధి కల్పించలేదు. గండీడ్ మండల పరిధిలోని నంచర్లలో ఏర్పాటు చేస్తామన్న పారిశ్రమిక వాడ శిలాఫలకానికే పరిమితమయింది. తాండూరులో కంది బోర్డు ఏర్పాటు సైతం ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. ప్రస్తుతం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యక్తులు సీఎంగా, స్పీకర్‌గా కొనసాగుతున్నవారైనా జిల్లా అభివృద్ధికి పాటుపడాలని జిల్లావాసులు కోరుతున్నారు. ప్రాజెక్టుల హామీలు ‘నీటి’మూటలేనా? సర్వేలకే పరిమితమైన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ‘ప్రాణహిత–చేవెళ్ల’ కథ కంచికి అసెంబ్లీ సమావేశాల్లో దుమ్మెత్తి పోసుకుంటున్న పాలక, ప్రతిపక్షాలు మూసీ ప్రక్షాళనలో జిల్లాకేంద్రం తెరపైకి -
నిధుల కేటాయింపు
ఇటీవలి బడ్జెట్లోనే కేపీ లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్లో నిధుల కేటాయింపునకు ఉపముఖ్యమంత్రి నుంచి హామీ తీసుకున్నాం. గతంలో దివంగత సీఎం వైఎస్ఆర్ తన విజ్ఞప్తి మేరకే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పరిధిలో వికారాబాద్ జిల్లాను చేర్చారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అటకెక్కించింది. ఈ ప్రాజెక్టుల విషయంలో సీఎం, ప్రభుత్వ పెద్దలు, సంబంధిత మంత్రితో నిరంతర సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నాం. పాలమూరు–ఎత్తిపోతల, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులను నిర్మించి రైతులకు నీరందిస్తాం. – రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి ● -
‘పుర’ పోరుకు సన్నద్ధం
మొయినాబాద్: పల్లెపోరు ముగియడంతో రాజకీయ పార్టీలు పట్టణ పోరుకు సమాయత్తమవుతున్నాయి. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులంతా పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికలపై పార్టీల నాయకులు, ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాయి. మరోవైపు రిజర్వేషన్లపై స్థానికంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. గత ఏడాది 28న మొయినాబాద్ మండలంలోని 9 పంచాయతీల విలీనంతో మొయినాబాద్ మున్సిపాలిటీ ఏర్పడింది. ఇందులో మొయినాబాద్, సురంగల్, పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, హిమాయత్‌నగర్, అజీజ్‌నగర్, ఎనికేపల్లి, ముర్తూజగూడ గ్రామాలను విలీనం చేశారు. అప్పటి నుంచి ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతోంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో మొదటిసారి ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీల్లో ఉన్న హేమాహేమీ నాయకులంతా మున్సిపాలిటీ పరిధిలోనే ఉండటంతో వారంతా ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వార్డుల విభజన జరగడంతో రిజర్వేషన్లకోసం ఎదురుచూస్తున్నారు. రాజకీయ పార్టీల సమావేశాలు మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సమాయత్తమయ్యాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ మున్సిపల్ పరిధిలోని పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల వివరాలు సేకరించాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. పార్టీలో రెండు గ్రూపులు ఉండటంతో టికెట్ల విషయంలో ఏ గ్రూపునకు ప్రాధాన్యత దక్కుతుందోననే చర్చ జరుగుతోంది. ఎవరికివారు ఊహాగానాలు కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఎలా ఉంటాయనేదానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మొత్తం 26 వార్డులు ఉండగా ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఎవరికి వారు ఊహాగానాల్లో మునిగిపోయారు. పెద్దమంగళారం, చిలుకూరు, హిమాయత్‌నగర్, అజీజ్‌నగర్ వంటి పెద్ద గ్రామాల్లో 4–6 వార్డులు ఉండటంతో రిజర్వేషన్లు తమకు కలిసి వస్తాయని ఆయా గ్రామాల నాయకులు అంచనా వేస్తున్నారు. ప్రధాన పార్టీల నాయకులు ఏ వార్డులో రిజర్వేషన్ కలిసొస్తే ఆ వార్డులో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు నాయకులు ఇప్పటి నుంచే ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో వార్డుల్లో తిరుగుతూ అందరినీ పలకరిస్తూ వెళ్తున్నారు. రిజర్వేషన్లు ఎవరికి కలిసొస్తాయో.. ఎవరికి రిక్తహస్తం చూపుతాయో ఎన్నికల షెడ్యూల్ వచ్చేవరకు వేచిచూడాల్సిందే. సమాయత్తమవుతున్న రాజకీయ పార్టీలు నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు రిజర్వేషన్లపై చర్చోపచర్చలు ఎదురు చూస్తున్న ఆశావహులు -
‘కోల్డ్’వార్!
● 80% కేసుల్లో దగ్గు, జలుబు లక్షణాలు ● వాతావరణ ప్రభావంతో ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు ● ఫ్లూ, ఆర్ఎస్వీ, అడినో వైరస్ ప్రభావం ● యాంటీబయాటిక్ సిరప్లు వాడొద్దంటున్న వైద్యులు సాక్షి, సిటీబ్యూరో: చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిలోనూ ఒకే రకమైన సమస్య. దగ్గు, జలుబు, గొంతు, ఒళ్లునొప్పులు, జ్వరం లక్షణాలతో ఆస్పత్రుల దారి పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దగ్గుకు ప్రధానంగా ఇన్ఫెక్షన్, ఎలర్జీ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, గాలి కాలుష్యం, ఆహారపు అలవాట్లు, పరిసరాల అపరిశుభ్రత వంటి అంశాలు అనారోగ్య సమస్యలకు కారణాలుగా కనిపిస్తున్నాయంటున్నారు. గత 20 రోజుల్లో వైరల్ జ్వరాలు, ఇన్ఫెక్షన్లు ప్రధానంగా ఫ్లూ, ఆర్ఎస్వీ, అడినో వైరస్ ప్రభావం కనిపిస్తోంది. ఆస్పత్రుల ఓపీలో సుమారు 80 శాతం మందికిపైగా పిల్లలు దగ్గు, జ్వరం, జలుబు బాధితులే ఉంటున్నారంటున్నారు. నెల రోజులుగా జలుబు, దగ్గు ఉంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. తీవ్ర ఇబ్బందుల్లో పిల్లలు, వృద్ధులు.. నవంబర్, డిసెంబర్లలో వణికించిన న్యుమోనియా వ్యాప్తి అదుపులోకి వచ్చిందనుకుంటుండగా.. తాజాగా పిల్లలు, వృద్ధులను దగ్గు, గొంతునొప్పి, జలుబు, జ్వరం, తలనొప్పి వంటివి వేధిస్తున్నాయి. పిల్లల ఆసుపత్రుల్లో అత్యధిక శాతం మంది ఇన్ఫెక్షన్, అలర్జీలతో వచ్చే రుగ్మతలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వైద్యులంటున్నారు. ఫ్లూతో వచ్చే వ్యాధులకు యాంటీబయాటిక్స్ వినియోగించవద్దని, దీని వల్ల రోగం తగ్గదని చెబుతున్నారు. ఆక్సిజన్‌తో కూడిన నెబ్యులైజర్, జ్వరం సిరప్ వంటివి వైద్యుల సూచనల మేరకు వినియోగించాలని, కేవలం బ్యాక్టీరియాతో వచ్చిన ఇన్ఫెక్షన్లకు మాత్రమే యాంటీబయాటిక్స్ పని చేస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పెర్ఫ్యూమ్, స్మోకింగ్, ఫేస్ పౌడర్‌తో.. ఎక్కువగా డస్ట్, పెర్ఫ్యూమ్, ముఖానికి రాసుకునే పౌడర్, దోమల నివారణకు వినియోగించే వివిధ రకాల లిక్విడ్లు, రూం స్ప్రే, స్మోకింగ్ వంటివి ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఇంట్లో ఫ్యాన్, కూర్చునే ఫర్నిచర్, తిరిగే గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గదిలో తేమ వాతావరణం లేకుండా వెచ్చగా ఉండే విధంగా చూసుకోవాలి. రహదారి పక్కగా ఉన్న ఇళ్లలో వాయు కాలుష్యం ప్రభావం చూపిస్తుంది. ఐస్‌క్రీం, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వేడి ఆహారం, మరిగించిన నీరు తీసుకోవడం ఉత్తమం. -
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ పాఠ్యాంశాల బోధనపై దృష్టి సారించింది. నిర్దేశిత గడువులోగా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఈనెల 16 నుంచి విద్యార్థుల
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి సుమారు 49 వేల మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు సిలబస్ పూర్తి చేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనలో వేగం పెంచారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గంట పాటు అదనపు తరగతులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు పాఠ్యాంశాలను బోధిస్తూనే మరోవైపు విద్యార్థులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. సబ్జెక్టులు/పాఠ్యాంశాల వారీగా వీక్లీ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులను రెగ్యులర్‌గా స్కూలుకు రప్పించడంతో పాటు చదువులో వెనుకబడిన వారిని గుర్తించి, అర్థం కాని అంశాలను మళ్లీ వివరించనున్నారు. సబ్జెక్టులను బట్టిపట్టించే కంటే.. వారికి అవగాహన కల్పించడంపైనే దృష్టి పెట్టనున్నారు. మెరుగైన ఫలితాల కోసం.. గత ఏడాది జిల్లా నుంచి 51,792 మంది వార్షిక పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 121 మంది వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 3,732 మంది బాలురు, 2,552 మంది బాలికలు ఫెయిల్ అయ్యారు. మెజార్టీ విద్యార్థులు గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. 2024లో సాధించిన ఉత్తీర్ణతతో (91.01శాతం) పోలిస్తే.. 2025లో (87.84 శాతం) 3.17 శాతం తగ్గింది. ఫలితంగా రాష్ట్రస్థాయిలో జిల్లా ర్యాంకు 31వ స్థానానికి దిగజారాల్సి వచ్చింది. 18 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే వందశాతం ఫలితాలు వచ్చాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా విద్యాశాఖ ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలో 4,950 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. హాజరు శాతాన్ని పెంచేందుకు ఎఫ్ఆర్ఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉపాధ్యాయుడు ఉదయం పాఠశాలలో అడుగు పెట్టింది మొదలు సాయంత్రం విడిచి వెళ్లే సమయం వరకు ఆన్లైన్లో పక్కాగా రికార్డు చేస్తోంది. ఫలితంగా ఉపాధ్యాయుల హాజరుశాతం గణనీయంగా మెరుగుపడి, విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అం దేలా చూస్తోంది. తనిఖీల విషయంలో మండల విద్యాధికారుల పనితీరును ఎప్పటికప్పుడు విశ్లేషిస్తోంది. శంకర్పల్లి, తలకొండపల్లి, మంచాల ఎంఈఓలు ఈ విషయంలో కొంత వెనుకబడినట్లు గుర్తించి, వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 16 నుంచి పదో తరగతి పునశ్చరణ తరగతులు ఆ లోపే సిలబస్ పూర్తి చేసేలా కసరత్తు సబ్జెక్టుల వారీగా వీకెండ్ పరీక్షలు చదువులో వెనుకబడిన విద్యార్థుల గుర్తింపు ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు జిల్లా విద్యాశాఖ ప్రణాళికలు గతంలో ఒక సబ్జెక్టుకు మరో సబ్జెక్టు పరీక్షకు మధ్య ఒక రోజు గ్యాప్ మాత్రమే ఉండేది. వెంటనే పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు ఒక సబ్జెక్టులో చేసిన పొరపాట్లను మరో సబ్జెక్టులో దొర్లకుండా జాగ్రత్తపడే అవకాశం ఉండేది కాదు. ఏడాదంతా చదివిన అంశాలను ఒక్క రోజులోనే ఎలా తిరగేస్తారు? ప్లానింగ్ ప్రకారం చదువుకునే అవకాశం ఉండేది కాదు. చదివిన అంశాన్ని అర్థం చేసుకుని, అవగాహన చేసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవారు. ఈ ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఎస్ఎస్ఈ బోర్డు వార్షిక పరీక్షల తేదీల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంది. ఒక సబ్జెక్టుకు, మరో సబ్జెక్టుకు మధ్య కనీసం నాలుగు రోజుల సమయం ఉండేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఒకసారి చదివిన అంశాలను మళ్లీ పునశ్చరణ చేసుకునేందుకు విద్యార్థులకు ఇది మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. – సుశీందర్‌రావు, డీఈఓ -
హాకీ చాంపియన్ మనోళ్లే..
● రన్నరప్‌గా నిలిచిన మహబూబ్‌నగర్ జిల్లా జట్టు ● అట్టహాసంగా అండర్–19 పోటీలు హుడాకాంప్లెక్స్: మానసిక ఉల్లాసానికి, శారీరక ధ్రుడత్వానికి క్రీడలు దోహదం చేస్తాయని తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ అన్నారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్టేట్ లెవల్ 69వ అండర్–19 హాకీ పోటీలు ఆదివారం సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ గ్రౌండ్లో అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుండి 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీల్లో రంగారెడ్డి జిల్లా విన్నర్ కాగా మహబూబ్‌గర్ రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు విజయ్‌కుమార్ బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్‌తో పాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపారు. స్టేట్ లెవల్లో గెలుపొందిన క్రీడాకారులకు మార్చిలో గచ్చిబౌలిలో జరిగే అంతర్జాతీయా క్రీడా పోటీలను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కృష్ణమూర్తి గౌడ్, వీఎం హోమ్ సెక్రటరీ రామారావు, లక్ష్మీపార్వతి తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్‌ఫీల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం
ఆమనగల్లు: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధిత రైతులకు న్యాయం చేస్తామని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో ఆదివారం ఆమనగల్లు, కడ్తాల మండలాల పరిధిలోని ముద్విన్, ఎక్వాయిపల్లి, మర్రిపల్లి, కోనాపూర్, ఆకుతోటపల్లి గ్రామాలకు చెందిన బాధిత రైతులతో వారు సమావేశం నిర్వహించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. భూమికి భూమి ఇవ్వాలని లేదా ఎకరాకు రూ.కోటి పరిహారం అందించాలని కోరారు. రైతులకు అండగా ఉంటామని, ఎవరూ ఆందోళన చెందొద్దని ఎంపీ మల్లురవి అన్నారు. బాధిత రైతుల డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎక్వాయిపల్లి సర్పంచ్ కరుణాకర్‌గౌడ్, మర్రిపల్లి సర్పంచ్ ఈర్లపల్లి రవి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకుర్ల రవికాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంచాల: గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పిలుపుని చ్చారు. మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ బలపర్చిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరి స్థితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం సంక్షేమ పథకాలను కూడా సక్రమంగా అమ లు పర్చడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆ పాత్ర సక్రమంగా పోషించడం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు గోగిరెడ్డి లచ్చిరెడ్డి, బోసుపల్లి ప్రతాప్, వెంకట్ రెడ్డి, నారాయ ణ యాదవ్, జిల్లా నాయకులు దన్నె భాషయ్య, జంగయ్య గౌడ్, మండల అధ్యక్షుడు నూకం రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. కొందుర్గు: వేదగిరి వేదపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి మార్చి 2 వరకు నిర్వహించనున్న సనాతన వేదయజ్ఞ మహా పాదయాత్ర జిల్లేడ్ చౌదరిగూడ మండలం తూంపల్లిలోని వేదగిరిగుట్టపై ప్రారంభమవుతుందని వేదగిరి సంస్థాపకుడు మర్రి కృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామానుజ చినజీయర్‌స్వామి హాజరై యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. రథయాత్ర నేరుగా రామేశ్వరం చేరుకుని అక్కడి నుంచి శ్రీనగర్ వరకు 16 రాష్ట్రాల మీదుగా 54 రోజుల పాటు 9,500 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని వివరించారు. బొంరాస్‌పేట: తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం (టీఆర్‌జేకేఎస్) రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఈనెల 6న హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు ఆసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు వంగ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు ఆయా జిల్లాల్లోని జానపద కళాకారుల సంఘం మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో ఈ సమావేశం ఉంటుందన్నారు. కళాకారుల సంక్షేమనిధి, ఆర్థిక భరోసా, భద్రత గుర్తింపు కార్డు అందజేత, పలువురికి సన్మానం తదితర అంశాలపై చర్చింనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఆసంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రమణకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంచు లింగయ్య, మహిళా విభాగం నాయకులు కవిత, సునీత, శ్రీదేవి తదితరులు హాజరవుతారని చెప్పారు. -
ఐక్యంగా రాజ్యాధికారం సాధించాలి
ఆమనగల్లు: బీసీలంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం దిశగా ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. కడ్తాల్‌లో ఆదివారం తెలంగాణ యువజన సంఘాల ఐక్య వేదిక, వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్డు సభ్యులు ఆత్మీయ సత్కారం కార్యక్రమానికి ఆయనతో పాటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీ అట్రాసిటీయాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీలకు దక్కాల్సిన హక్కులు, వాటాల కోసం బీసీ సంక్షేమ సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ప్రభుత్వం రిజర్వేషన్ల పేరిట బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఐకమత్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోగలుగుతామన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. బీసీలను మోసం చేస్తే ఊరుకోం యాచారం: రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను మోసం చేస్తే ఊరుకునేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. మండల పరిధిలోని నానక్‌నగర్‌లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం క్రికెట్, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. అనంతరం బీసీ సంఘం నేతలతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసిందన్నారు. రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఇబ్రహీంపట్నం డివిజన్ అధ్యక్షుడు సంగెం రాజు, నానక్‌నగర్ సర్పంచ్ సంగెం చైతన్య పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య -
వార్డుల విభజనలో అన్యాయం
చేవెళ్ల: మున్సిపాలిటీ ఏర్పాటులో భాగంగా చేసిన వార్డుల విభజనలో మల్కాపూర్‌కు అన్యాయం చేశారని ఎంపీటీసీ మాజీ సభ్యుడు బక్కరెడ్డి రవీందర్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పలువురు గ్రామస్తులు, నాయకులతో కలిసి శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మల్కాపూర్ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపిన అధికారులు వార్డుల విభజనలో అన్యాయం చేశారన్నారు. గ్రామాన్ని రెండు వార్డులు (4, 12)గా విభజించారని, ఇది సక్రమంగా జరగలేదని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా చేసిన, అసంబద్ధ విభజనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల్లో వార్డులు సీరియల్‌గా ఉండగా, తమ గ్రామానికి సంబంధించిన వార్డులను మాత్రం 4, 12గా విభజించడం ఏమిటని ప్రశ్నించారు. -
నాటుబాంబు కొరికి జింక మృతి
కడ్తాల్: గుర్తు తెలియని వ్యక్తులు అడవి పందు ల కోసం పెట్టిన నాటుబాంబు పేలి జింక మృతి చెందిన సంఘటన చరికొండ పంచాయతీ పరిధిలోని బోయిన్గుట్టతండా సమీప అటవీ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది. ఫారెస్ట్ అధికారుల వివరాల ప్రకారం.. అటవీ ప్రాంతంలోని వ్యవసాయ పొలాల వద్ద అడవి పందుల కోసం పెట్టిన నాటు బాంబు(పూస)ను కొరకడంతో ఓ జింక తీవ్రంగా గాయపడి, చనిపోయింది. శనివారం మధ్యాహ్నం పొలం పనులకు వెళ్లిన రైతులకు దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా జింక కళేబరం కనిపించింది. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో సెక్షన్ అఫీసర్ మహ్మద్ హుస్సేన్ అక్కడికి చేరుకుని, పశువైద్యాధికారి డాక్టర్ భానునాయక్ ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. నాటుబాంబు పేలడంతోనే జింక నోటిభాగం దవడలు పగిలి, తీవ్ర రక్త స్రావంతో మృతి చెందినట్లు నిర్ధారించారు. భూ తగాదాల్లో ఎనిమిది మందికి రిమాండ్ పూడూరు: భూ తగాదాల నేపథ్యంలో కర్రలతో దాడికి పాల్పడిన ఘటన చన్గోముల్ ఠాణా పరిధిలో జరిగింది. కంకల్ గ్రామానికి చెందిన పట్లోళ్ల నవీన్‌రెడ్డి తన సోదరులతో కలిసి శుక్రవారం పొలం పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన చింతకింది యాదయ్య, శ్రీకాంత్, శ్రీనివాస్ వచ్చి పొలం తమదంటూ గొడవకు దిగారు. మాటామాటా పెరిగి వారు నవీన్‌రెడ్డి సోదరు లు దామోదర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, యాదవరెడ్డిపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎనిమిది మందిని రిమాండ్‌కు తరలించారు. -
గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు
ఆమనగల్లు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం మున్సిపల్ పరిధిలోని సాకిబండతండాలో రెవెన్యూ, అటవీశాఖ, ఇరిగేషన్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సర్వే పనులు చేపట్టారు. దాదాపు కిలోమీటరు సర్వే పనులు పూర్తి చేశారు. ఇదే సమయంలో శనివారం తండాకు చెందిన గిరిజన రైతులు వచ్చి సర్వేను అడ్డుకున్నారు. భూమి కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.కోటి ఇవ్వాలని, కుటుంబంలో ఒకరి కి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, ఫ్యూచర్ సిటీలో 500 గజాలస్థలం ఇవ్వాలని కోరారు. రైతులు సర్వేను అడ్డుకోవడంతో వివిధ శాఖల అధికారులు సిబ్బంది వెనుదిరిగారు. పశు పోషణలో జాగ్రత్తలు తప్పనిసరి షాద్‌నగర్: పశు పోషణలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ ఏడీ డాక్టర్ విజయ్‌కుమార్ సూచించారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడలోని గోపాలమిత్ర కేంద్రంలో శనివారం ఉచిత పశు వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ..సాధారణంగా పాడి పశువులు అల్ప ఉష్ణోగ్రతలతో అసౌకర్యానికి గురవుతుంటాయని, చలికాలంలో తీవ్రమైన మా ర్పులు వస్తుంటాయని అన్నారు.ఏవైనా మా ర్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని పశువైద్యులను సంప్రదించి చికి త్స చేయించాలని తెలిపారు. అనంతరం ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్‌కుమార్, ఉప సర్పంచ్ అశో క్, పశువైద్యాధికారులు డాక్టర్ సునీత, డాక్టర్ ముక్కంటి రాజ్ తదితరులు పాల్గొన్నారు. రేపు అథ్లెటిక్స్ పోటీలు హుడాకాంప్లెక్స్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5న జిల్లా స్థాయి సబ్‌జూనియర్, అండర్–20 అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ ఇ.గోపి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. అండర్–8, అండర్–10, అండర్–12, అండర్–14, అండర్–20 విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పూర్తి వివరాల కోసం జిల్లా అథ్లెటిక్స్ కోచ్ తిప్పాన సాయిరెడ్డిని 97038 38987 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కన్హాలో ప్రారంభమైన బ్యాడ్మింటన్ పోటీలు నందిగామ: మండల పరిధిలోని కన్హా శాంతి వ నంలోని హార్ట్ఫుల్నెస్ గోపీచంద్ బ్యాడ్మింట న్ అకాడమీ (హెచ్జీబీఏ)లో యూనెక్స్–సన్‌రైజ్ ఆల్ఇండియా ఆధ్వర్యంలో జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్–2026ను శనివారం ప్రారంభించినట్లు కన్హా పీఆర్ఓ చంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీ వరకు క్రీడలు కొనసాగుతాయని, పోటీ ల్లో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అండర్–19 విభాగంలో 1,100 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు.10న ఫైనల్ పోటీలు ఉంటాయన్నారు. శనివారం 280 మ్యాచ్‌లు నిర్వహించినట్లు వివరించారు. ఆ ఊరి పేరు మార్చండి దోమ: దొంగ ఎన్కేపల్లి పేరు కారణంగా విద్యావేత్తలు, విద్యార్థులు మానసికంగా బాధపడుతున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దోమ మండలం దొంగ ఎన్కేపల్లి పేరును సంజీవనగర్గా మార్చాలని కోరారు. గ్రామంలో సంజీవస్వామి పురాతన ఆలయం ఉందని ఆ పేరును గ్రామానికి పెట్టా లని విన్నవించారు. గతంలో ఇదే విషయాన్ని మంత్రులు, కలెక్టర్ దృష్టికి తెచ్చినట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపా డేలా దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం తగదు
ఇబ్రహీంపట్నం: విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గురునానక్ విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు. బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థి రాము హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడాన్ని నిరసిస్తూ శనివారం గురునానక్ యూనివర్సిటీ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన రాము యూనివర్సిటీ యాజమాన్యం వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివిస్తున్న తల్లిదండ్రులకు తీరని వ్యథను మిగులుస్తున్న, ఈ ఘటనపై గురునానక్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని, రాము ఆత్మహత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు. ఇటీవల కాలంలో గురునానక్ యూనివర్సిటీలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పోరెడ్డి నర్సింహ్మారెడ్డి, అర్జున్‌రెడ్డి, ముత్యాల భాస్కర్, నాయిని సత్యనారాయణ, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు జక్క రవీందర్‌రెడ్డితోపాటు టేకుల రాంరెడ్డి, నారాయణయాదవ్, రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ముత్యాల మహేందర్ పాల్గొన్నారు. గురునానక్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ యూనివర్సిటీలో ఆత్మహత్యలపై బీజేపీ మహాధర్నా -
సీపీఐ మహా సభకు తరలిరావాలి
● పార్టీ నేతల పిలుపు ● జీపు జాత ప్రారంభం చేవెళ్ల: ఖమ్మం పట్టణంలో ఈనెల 18న నిర్వహించనున్న సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య కోరారు. పట్టణంలోని శంకర్పల్లి చౌరస్తాలో శనివారం జీపుజాతను ప్రారంభించారు. పార్టీ నియోజకవర్గ కె.రామస్వామి అధ్యక్షతన జీపు జాత కొనసాగుతుందని తెలిపారు. భారత గడ్డపై సీపీఐ ఆవిర్భవించి వంద వసంతాలు పూర్తయ్యాయన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ అనుక్షణం పోరాడిందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.ప్రభులింగం, జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సత్యనారాయణ, నాయకులు వడ్ల మంజుల, జయమ్మ, సుధాకర్‌గౌడ్, సత్యనారాయణ, సాయిలు, పోచయ్య, శ్రీను, మహేందర్, పెంటయ్య, లలిత, యాదమ్మ, భాగ్యమ్మ, నర్సయ్య తదితరులు ఉన్నారు. శతాబ్ది ఉత్సవాలకు తరలిరావాలి శంకర్పల్లి: ఖమ్మంలో ఈనెల 18న నిర్వహించనున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.రామస్వామి అన్నారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జీపు జాత శనివారం శంకర్‌పల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వందేళ్లు ప్రజల పక్షాన సీపీఐ ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూసిందని తెలిపారు. ఖమ్మంలో 5లక్షల మందితో జరిగే సభను విజయవంతం చేయాలని, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభులింగం, వడ్ల సత్యనారాయణ, శంకర్పల్లి మండల అధ్యక్షుడు సుధీర్, నాయకులు సత్తిరెడ్డి, గోపాల్‌రెడ్డి, మంజుల, లలిత, వెంకటమ్మ, నర్సింలు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంటికో మనిషి రావాలి.. కొత్తూరు: సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఈ నెల 18న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు పర్వతాలు పిలుపునిచ్చారు. కొత్తూరులో శనివారం ఆయన పలువురు నాయకులతో కలిసి జీపు యాత్రను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... ఖమ్మంలో నిర్వహిస్తున్న సభకు ఇంటికో మనిషి.. ఊరికో బండిలో రావాలన్నారు. దేశంలో రాజరిక వ్యవస్థ, భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి ప్రజల పక్షాన సీపీఐ చేసిన పోరాటాలు, ఉధ్యమాలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటాయన్నారు. ఈ పోరాటాల్లో వందల సంఖ్యలో కమ్యునిస్టులు అమరులైనట్లు తెలిపారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు మండలం నుంచి భారీ సంఖ్యలో కమ్యూనిస్టులు, అభిమానులు, కార్మిక సంఘాల నాయకులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుద్దుల జంగయ్య, షకీల్, ఎల్లయ్య, మహ్మద్ హుస్సేన్, మైసయ్య, తదితరులు పాల్గొన్నారు. -
కూల్చివేతల వెనక మాఫియా
● సమగ్ర విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలి ● మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం డిమాండ్ మొయినాబాద్: పైసా పైసా కూడబెట్టి గిరిజనులు కట్టుకున్న కలల ఇళ్లను, వారి కళ్ల ముందే కూల్చివేయడం వెనక రాజకీయ, రియల్ ఎస్టేట్ మాఫియాలు ఉన్నాయని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం రెవెన్యూలో గిరిజనుల ఇళ్ల కూల్చివేతపై శనివారం హిమాయత్‌నగర్ చౌరస్తాలోని కంజర్ల మాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. గిరిజనుల ఇళ్లను కూల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. గిరిజనుల ప్లాట్లపై పొలిటికల్, రియల్ మాఫియా కన్ను పడిందని మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెబుతున్న అధికారులు, కూల్చివేతల వద్ద బౌన్సర్లు ఎందుకు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బౌన్సర్లు వచ్చి.. గిరిజనులను ఇళ్లలోనుంచి బయటకు లాగేసి భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. మున్సిపల్ అధికారులు ముందస్తు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాశ్, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, బాకారం సర్పంచ్ వెంకటేశ్, నాయకులు శ్రీనివాస్, సుధీంద్ర ఉన్నారు. పేదలపైనే ప్రతాపమా.. గిరిజనులు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసిన మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం సర్వే నంబర్ 210, 211, 212లో మున్సిపల్ అధికారులు కూల్చివేసిన గిరిజనుల ఇళ్లను శనివారం పలువురు సీపీఎం నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 111 జీవో సాకుతో మున్సిపల్ అధికారులు పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పెద్దల ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లు, కమర్షియల్ బిల్డింగ్‌ల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రాజుగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాసరాజు, సరేష్రెడ్డిలకు తొత్తుగా మారారని మండిపడ్డారు. రియల్ బ్రోకర్లపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని.. మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, నాయకులు మహేందర్, ప్రభుదాస్, రాజేందర్, చెన్నయ్య, నర్సింహ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కింది చిత్రంలో ఉన్నది హస్తినాపురం జెడ్పీరోడ్డు లోని ఓ టిఫిన్‌సెంటర్. ఇక్కడ ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఫాస్ట్‌ఫుడ్ విక్ర యిస్తుంటారు. కమర్షియల్ సిలిండర్‌కు బదులు.. ఇలా డొమెస్టిక్ వినియోగిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న సిల
సివిల్ సప్లయ్ విభాగం వాట్సాప్ గ్రూపుల్లో ఇటీవల ఓ ‘జీపే స్కానర్’ చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. డీలర్ల సంక్షేమం పేరుతో అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో 919 రేషన్ షాపులు ఉండగా, ఒక్కో షాపు నుంచి నెలకు రూ.2000 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి నెలా రూ.18.32 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా వసూలైన మొత్తంలో ఉన్నతాధికారుల వరకు వాటాలు అందుతున్నట్లు సమాచారం. అసోసియేషన్‌లోని ఓ కీలక నేత ద్వారా వీటిని సేకరించి, సివిల్ సప్లయ్ ఏఎస్ఓ, డీఎస్ఓ సహా జిల్లా ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇక్కడ పని చేసిన ఓ అదనపు కలెక్టర్ సైతం వీరి నుంచి ముడుపులు పుచ్చుకున్నట్లు ప్రచారం ఉంది. పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం, ఇతర నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాల్సిన విజిలెన్స్ విభాగం సైతం వీరితో కుమ్మకై ్కనట్లు ఆరోపణలు లేకపోలేదు.గ్యాస్.. బిజినెస్!సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లను అందజేస్తోంది. దీపం, ఉజ్వల పథకాల కింద ఉచితంగా అందజేసిన సిలిండర్లతో పాటు ప్రైవేటు సిలిండర్లు కూడా ఉన్నాయి. జిల్లాలో గృహ, వాణిజ్య కనెక్షన్లు 12 లక్షలకుపైగా ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, గాయత్రీనగర్, జెడ్పీరోడ్డు, బీఎన్‌రెడ్డి, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, ఆమనగల్లు, షాద్‌నగర్, శంకర్పల్లి, తుక్కుగూడ, జల్పల్లి, పెద్ద అంబర్పేట్, తుర్కయంజాల్, ఆదిబట్ల తదితర ప్రాంతాల్లోని ఏజెన్సీల పరిధిలో గృహ అవసరాల కోసం వినియోగించాల్సిన వంట గ్యాస్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు ఏజెన్సీలు, డెలీవరీ బోయ్స్ సహకరిస్తుండటంతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. వినియోగదారుల పేరున బుక్ చేసి.. రెండు మూడు నెలలకు ఒక సిలిండర్ మాత్రమే వినియోగించే వారి నుంచి గ్యాస్‌బుక్‌లను సేకరించి, వారి పేరున సిలిండర్లను బుక్ చేస్తున్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ వినియోగదారుల ఖాతాల్లో నమోదవుతుండటంతో వారు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏజెన్సీలు, డెలివరీ బోయ్స్ దీన్ని అవకాశంగా తీసుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. నిజానికి 14.2 కిలోల గృహ సిలిండర్ ధర రూ.925 కాగా, 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,820 ఉంది. వినియోగదారుల పేరున సిలిండర్ బుక్ చేసిన ఆయా సిలిండర్లను హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీస్టాళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఒక్కో సిలిండర్‌పై రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలు/ డెలివరీ పాయింట్లపై నిరంతరం నిఘా పెట్టాల్సిన సివిల్ సప్లయ్ విజిలెన్స్ విభాగం వారికి పరోక్షంగా వారికి సహకరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీల నుంచి ప్రతి నెలా వారికి ముడుపులు ముట్ట జెబుతుండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కదారి పడుతున్న సబ్సిడీ సిలిండర్లు హోటళ్లలో యథేచ్ఛగా ‘డొమెస్టిక్’ వినియోగం ఏజెన్సీలు.. డెలీవరీ బాయ్స్‌తో వ్యాపారుల కుమ్మక్కు పేదల పేరుతో బుక్ చేసి దర్జాగా విక్రయం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న సివిల్ సప్లయ్ విజిలెన్స్ -
సావిత్రీబాయి సేవలు చిరస్మరణీయం
ఇబ్రహీంపట్నం రూరల్: విద్యార్థులకు విద్యాబోధనతో పాటు సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సావిత్రీబాయి పూలే జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘ సంస్కర్తగా సావిత్రిబాయి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్య అజ్ఞానాన్ని దూరం చేస్తుందని తెలియజేస్తూ బాలికా విద్యను ప్రోత్సహించారని, మహిళల హక్కుల కోసం తనవంతు కృషి చేశారని తెలిపారు. మహనీయులను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధన దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 13 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సావిత్రీబాయి పూలే జయంతి వేడుకలను శనివారం షాద్‌నగర్‌లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. – షాద్‌నగర్ కలెక్టర్ నారాయణరెడ్డి -
‘సహకారం’ కుదింపు
యాచారం: ఉమ్మడి జిల్లాలో కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఏర్పాటును సర్కార్ కుదించింది. డీసీసీబీ పరిధిలో ప్రస్తుతం 56 పీఏసీఎస్‌లు ఉన్నాయి. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మరో 20కి పైగా కొత్తవి ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సహకార శాఖ ఉన్నతాధికారులు ఆయా మండలాల్లో పర్యటించి 25కు పైగా పంచాయతీలున్న మండలాల్లో ఒకటి చొప్పున మాత్రమే పీఏసీఎస్‌లు ఉన్నట్లు గుర్తించారు. మారుమూల గ్రామాల నుంచి మండల కేంద్రాల్లో ఉన్న వాటికి రైతులు రావడానికి ఇష్టపడకపోగా, సమీపంలోనే ఉన్న ఎస్బీఐ, యూనియన్ తదితర బ్యాంకుల్లో సేవలు పొందేవారు. పీఏసీఎస్‌ల సేవలను ప్రతి రైతుకు అందజేయాలనే ఉద్దేశంతో పెద్ద మండలాల్లో రెండు చొప్పున ఏర్పాటుకు నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పాటుకు ఆసక్తి చూపించ లేదు. కొత్తగా పదింటికే సర్కార్ మొగ్గు ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్‌ల్లో నాలుగు లక్షలకు పైగా రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఏటా డీసీసీబీ ద్వారా రూ.3వేల కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయి. పౌల్ట్రీ, డెయిరీఫాం, మేకల, గొర్రెల పెంపకానికి రైతులకు రూ.కోట్లలో రుణాలు అందజేస్తున్నారు. కొన్నేళ్లుగా పీఏసీఎస్‌ల ద్వారానే రైతులకు యూరియాతో పాటు ఇతర ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నారు. ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్ల విక్రయాలతో మంచి ఆదాయమే వస్తోంది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు తదితర నియోజకవర్గాల్లో కొత్తగా పీఏసీఎస్‌ల ఏర్పాటుకు అవకాశాలున్నా పది మాత్రమే ఏర్పాటు చేసేందుకు సర్కార్ నిర్ణయించినట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ ద్వారా సర్కార్‌కు ప్రతిపాదనల ఫైలు వెళ్లింది. త్వరలో గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కొత్తవాటికి ఫ్యూచర్‌సిటీ గ్రహణం జిల్లాలో కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ఫ్యూచర్‌సిటీ అడ్డుగా మారింది. ప్రస్తుతం 37 ఉండగా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొత్తగా మరో 15 ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. యాచారం, కందుకూరు, మహేశ్వరం, మంచాల, ఆమనగల్లు, కడ్తాల్, చౌదరిగూడెం, షాద్‌నగర్ మొయినాబాద్, తలకొండపల్లి, కొత్తురు, కేశంపేట తదితర మండలాల్లో కొత్తవాటికి అవకాశాలు ఉండగా, ప్రస్తుతం ఆయా మండలాలను కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్‌సిటీలో భాగస్వామ్యం చేసింది. ఈ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో అసైన్డ్, ప్రభుత్వ భూములతో పాటు పట్టా భూములను సేకరించే అవకాశాలు ఉండడంతో కొత్తవి ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండదని భావిస్తోంది. పదవులపై ఆశలు సహకార సంఘాలను రద్దు చేసిన ప్రభుత్వం మళ్లీ ఎన్నికల నిర్వహించాలా.. లేదంటే నామినేటెడ్ కింద పదవులను ఎంపిక చేయాలా అనే నిర్ణయాన్ని ప్రకటించలేదు. రద్దు చేసిన వెంటనే సహకార శాఖ అధికారులను పీఏసీఎస్‌లకు ఇన్చార్జిలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహించినా.. నామినేటెడ్ అయినా పదవులు ఖాయమనే భరోసాతో ఆశావహులు ఉన్నా రు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ప్రస న్నం చేసుకునే పనిలో మునిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏర్పాటయ్యే కొత్త పీఏసీఎస్‌లు రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా.. రేవంత్‌రెడ్డి సర్కార్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సహకార సంఘాలపై నిర్ణయం తీసుకుంటుంది. పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించాలా.. లేదా నామినేటేడ్ పద్ధతిలో డైరెక్టర్లు, చైర్మన్లను ప్రకటించాలా అనే విషయమై త్వరలో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. – కొత్తకుర్మ సత్తయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ -
ప్రణాళికతో గ్రామాల అభివృద్ధి
● చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ● తంగడపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేవెళ్ల: గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని నియోజకవర్గంలోని అన్ని మండలాల అభ్యున్నతికి ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని తంగడపల్లిలో రూ.50 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువస్తానని తెలిపారు. నూతన పాలక వర్గం సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పామెన రాములు, కాంగ్రెస్ నాయకకులు తదితరులు పాల్గొన్నారు. తప్పిన పెను ప్రమాదం బషీరాబాద్: ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం మధ్యాహ్నం సేడం నుంచి తాండూరు వస్తున్న ఆర్టీసీ బస్సు(టీజీ34జడ్0076) బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలోకి రాగానే ముందలి టైర్ బ్లాస్ట్ అయ్యింది. అప్రమత్తమైన డ్రైవర్ నాగేంద్రప్ప బస్సును నిలిపివేశాడు. ఈ ఘటనలతో బస్సులో ప్రయాణిస్తున్న 25మంది ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బస్సు వేగంగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మెకానిక్ వచ్చి మరో టైర్ అమార్చడంతో ప్రయాణికులతో బస్సు తాండూరుకు బయలుదేరింది. -
ఎంబీబీఎస్‌లే!
శంకర్ దాదా ● నకిలీ వైద్యులు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అధికం ● మెడికల్ కౌన్సిల్ వార్షిక నివేదికల్లో వెల్లడైన వాస్తవంసాక్షి, సిటీబ్యూరో: మహా నగరానికి నకిలీ వైద్యుల బెడద పట్టుకుంది. అత్యంత అభివృద్ధి చెందిన నగరంగా హైదరాబాద్ దూసుకెళుతోంది. ప్రపంచ స్థాయిలో మెడికల్ టూరిజాన్ని ఆకర్షిస్తోంది. క్షేత్ర స్థాయిలో వైద్యం మాత్రం గ్రామీణ ప్రాంతాలకంటే ఘోరంగా ఉంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నివేదికలు దీన్నే ప్రతిబింబిస్తున్నాయి. గడచిన రెండేళ్ల వార్షిక నివేదికలను పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా మూడు జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 34, మేడ్చల్ 32, హన్మకొండలో 30 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఒక్కో ఎఫ్ఐఆర్లో రెండు నుంచి ఐదు కేసులు ఉంటాయని మెడికల్ కౌన్సిల్ సభ్యులు చెబుతున్నారు. మిగతా జిల్లాల్లో సుమారుగా ఏడాదికి సింగిల్ డిజిట్‌లోనే ఉన్నాయి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో అర్హత లేని వ్యక్తులు వైద్యం చేయడం, అనధికారికంగా క్లినిక్‌లు, నర్సింగ్ హోంలు నిర్వహించడం, నిషేధిత స్టెరాయిడ్స్, అబార్షన్ కిట్లు, ప్రమాదకరమైన యాంటీబయాటిక్స్, హార్మోనల్ ట్యాబ్లెట్లు వినియోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఏటా పది వేల మంది వైద్యులు.. రాష్ట్రంలో మొత్తం 65 వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కళాశాలలు 36 ఉండగా, ప్రైవేటువి 29 ఉన్నాయి. ఏటా పది వేల మంది వైద్య విద్యార్థులు పట్టా పొందుతున్నారు. నగరంలో 260 బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలు, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్, ఇతర కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికి నకిలీ వైద్యుల ప్రభావం ఇంత పెద్ద ఎత్తున ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. వైద్యాధికారులు, మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై తెలంగాణ మెడికల్ ప్రాక్టిసనర్స్, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో గ్రేటర్ పరిధిలోని ఓ డీఎంహెచ్ఓ నిబంధనలు పాటించని ఆసుపత్రికి రూ.50 వేల జరిమానా విధించారు. ప్రజారోగ్యానికి నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా నకిలీల మకిలీ వదలడంలేదు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే లక్ష్యంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పని చేస్తోంది. అర్హత లేని వ్యక్తులు వైద్యం చే యడం, అనుమతులు లేకుండా క్లినిక్స్, నర్సింగ్‌హోంల నిర్వహణ, నిషేధిత మందుల వినియోగంపై విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి కేసులునమోదు చేస్తున్నాం. తదుపరి చర్యల కోసం ఆయా జి ల్లా వైద్యాధికారులకు అప్పగిస్తున్నాం. నకిలీ వైద్యులతో సమాజానికి నష్టం జరుగుతోంది. అవసరం లేకపోయినా పవర్ ఫుల్ మందులు రాస్తున్నారు., స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్‌తో భవిష్యత్తులో తీవ్ర ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. – మహేష్‌కుమార్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ -
ఒడిశా టు హైదరాబాద్
కారులో గంజాయి తరలింపు మొయినాబాద్: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అజీజ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి ప్రాంతానికి చెందిన పబిత్ర సర్కార్, అమ్రితో పరమాణిక్ శనివారం ఒడిశా నుంచి 22 కిలోల గంజాయిని కారు (ఓడీ 02 బీఎల్ 3033)లో హైదరాబాద్‌కు తరలిస్తు న్నారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి మొయినాబాద్ మున్సిపల్ పరి ధిలోని అజీజ్‌నగర్ సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అనుమానంతో కారును తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. 22 కిలోల గంజాయి, కారును స్వాధీనం చేసుకుని, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి పింటు, ఎన్క అనే వ్యక్తుల నుంచి తీసు కుని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘సర్కిల్’ తరలింపు సరికాదు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల సర్కిల్ కార్యాలయాన్ని ఆదిబట్ల హెడ్‌క్వార్టర్‌లోనే నడిపించాలని అఖిలపక్ష నాయకులు కోరారు. తరలింపును నిరసిస్తూ శనివారం ఆదిబట్ల కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాత్రికిరాత్రే ఆదిబట్ల నుంచి రాగన్నగూడకు కార్యాలయాన్ని తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఆదిబట్ల హైటెక్ నగరంగా ఎదుగుతుంటే ఓర్వలేక ఈ పని చేశారని విమర్శించారు. ఆదిబట్ల నుంచి కలెక్టరేట్ దగ్గరగా ఉంటుందని, శంషాబాద్ వెళ్లడం కూడా సులభమేనని తెలిపారు. కార్యాలయం తరలించడానికి కారణమైన డిప్యూటీ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రాజకీయాలకు అతీతంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, పల్లె రజినీకాంత్‌గౌడ్, శ్రావణ్‌గౌడ్, శ్రీశైలం, జమ్మరాజు, సాయిబాబా, బాబు, పాండురంగారెడ్డి, నర్సింహ, బీఆర్ఎస్ నాయకులు పల్లె గోపాల్‌గౌడ్, సుధాకర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, భాస్కర్, బీజేపీ నాయకులు కోరె శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
కడ్తాల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కృషి చేస్తోందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ముద్వీన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో టీఎస్ యూటీఎఫ్ కడ్తాల్ మండల శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను సంఘం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపాల్‌నాయక్ మాట్లాడుతూ అధ్యాయనం, ఆధ్యాపనం, సామాజిక స్పృహ అనే లక్ష్యాలతో హక్కులు బాధ్యతలు ఉద్యమ నేత్రాలుగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి టీఎస్‌యూటీఎఫ్ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నిర్మల, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శంకర్‌నాయక్, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఉపాధ్యక్షుడు మల్లయ్య, సభ్యులు నర్సింహ మూర్తి, రాజు, సత్యనారాయణ, రఘుపతి, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్ -
సిటీలో మరో స్టీల్ బ్రిడ్జి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ఎలివేటెడ్ స్టీల్‌బ్రిడ్జి కారిడార్ నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది. వీఎస్టీ నుంచి అశోక్‌నగర్ వరకు నిర్మించిన బ్రిడ్జి తరహాలోనే ప్యారడైజ్– శామీర్‌పేట్ మధ్య 18.18 కి.మీ మేర బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు రూ.4,263 కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ బేకమ్ దక్కించుకుంది. రానున్న రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. వెస్ట్ మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూంకుంట మీదుగా శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు నిర్మించే ఈ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్ మీదుగా రాజీవ్ రహదారికి రాకపోకలు సాగించవచ్చు. నగరానికి ఉత్తరం వైపున మేడ్చల్ రూట్లో ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు చేపట్టిన మరో ఎలివేటెడ్ కారిడార్‌తో రెండు మార్గాల్లోనూ ప్రయాణ సదుపాయాలు మెరుగుపడతాయి. స్టీల్ బ్రిడ్జి ఎలివేటెడ్ కారిడార్ ఇలా.. ● ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 18.18 కి.మీ నిర్మాణంలో 11.52 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ వద్ద 6 లేన్లతో టన్మెల్ నిర్మించనున్నారు. తిరుమలగిరి, అల్వాల్ వద్ద రెండు చోట్ల వాహనదారులు బ్రిడ్జిపైకి ప్రవేశించేందుకు, నిష్క్రమించేందుకు ఎంట్రన్స్, ఎగ్జిట్లు ఉంటాయి. ● ఈ ప్రాజెక్టు కోసం 9.35 కి.మీల మార్గంలో 114.50 ఎకరాల రక్షణశాఖ భూములను, 8.35 కి.మీ.మార్గంలో 78.39 ఎకరాల ప్రైవేట్ భూ ములను సేకరించారు. 967 నిర్మాణాలను తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉంటుంది. వేగిరంగా డెయిరీఫామ్ కారిడార్.. ప్యారడైజ్ జంక్షన్ నుంచి మేడ్చల్ రూట్లో డెయిరీఫామ్ వరకు 5.40 కి.మీ వరకు చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు వేగిరంగా కొనసాగుతున్నాయి. ఈ కారిడార్ పనులు 36 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మీదుగాా మెదక్, నిజామాబాద్ మార్గంలో రాకపోకలు సులభతరమవుతాయి. ప్యారడైజ్ టు శామీర్‌పేట్ 18.18 కి.మీ మేర వంతెన రూ.4,263 కోట్ల అంచనా త్వరలో పనులు ప్రారంభం రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం చర్యలు చేపట్టిన హెచ్ఎండీఏ -
స్సీకర్‌కు శుభాకాంక్షలు
అనంతగిరి: వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ శాసన సభ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ను సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందజేసి.. అవగాహన కల్పించి పరిగి: ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎంవీఐ వీరేంద్రనాయక్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన వాహనదారులకు పుష్పగుచ్ఛం అందజేసి, అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, పోర్ వీలర్ చోదకులు సీటుబెల్టు పెట్టుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు గుర్తించండి ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు -
అడ్డొచ్చిన మృత్యువు
మహేశ్వరం: రోడ్డుపై అడవి పంది అడ్డురావడంతో తప్పించబోయి ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరికీ తీవ్ర గాయాలయాయి. ఈ సంఘటన మండల పరిధిలోని ఆకన్‌పల్లి గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. పోరండ్ల గ్రామానికి చెందిన తేరటి శ్రీకాంత్(27), సంగెం గిరిబాబు అలియాస్ గిరీశ్(34), దయ్యాల శివ కలిసి తుక్కుగూడకు పని నిమిత్తం ఉదయం వెళ్లారు. గిరీశ్ టవేరా కారులో వెళ్తుండగా ఆకన్‌పల్లి గ్రామ సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా అడవి పంది అడ్డు రావడంతో తప్పించబోయారు. డ్రైవర్ గిరీశ్ సడన్ బ్రేక్ వేసి స్టిరింగ్‌ను కుడివైపునకు తిప్పడంతో కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్, గిరీశ్‌లకు బలమైన గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శివకు సైతం తీవ్ర గాయాలయాయి. విషయం తెలుసుకున్న మహేశ్వరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులకు తెలియజేశారు. గాయాలపాలైన శివను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోర్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. గిరీశ్‌కు ఇద్దరు కుమార్తెలు, ప్రస్తుతం భార్య గర్భంతో ఉంది. ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి గ్రామానికి చేరుకొని మృతదేహాలను నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు తమవంతు కృషి చేస్తామని ఆమె తెలిపారు. మాజీ ఎంపీపీ కోరుపోలు రఘుమారెడ్డి మృతదేహాలకు నివాళులర్పించారు.● అడవి పందిని తప్పించబోయిపల్టీ కొట్టిన కారు ● అక్కడిక్కడే ఇద్దరి దుర్మరణం, ఒకరికి గాయాలు -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి
ఆమనగల్లు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మహేశ్వరం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి గురువారం కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరు: నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీలు జానకీరెడ్డి, చంద్రశేఖర్‌తో కలిసి బుధవారం రాత్రి 12 గంటలకు మండల పరిధిలోని కొత్తూర్ గేట్ వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కందుకూరు, మహేశ్వరం సీఐలు సీతారామ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు జంక్షన్ సమీపంలో.. కొత్తూరు: పట్టణంలోని నాట్కో జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో ఫ్యూచర్‌సిటీ పోలిస్ కమిషనర్ సుధీర్‌బాబు పాల్గొన్నారు. శంషాబాద్, మహేశ్వరం డీసీపీలు రాజేష్, నారాయణరెడ్డితో కలిసి ఆయన కేక్ కట్‌చేశారు. కార్యక్రమంలో సీఐ నర్సయ్య, ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. హిమాయత్‌నగర్ చౌరస్తాలో.. మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్ చౌరస్తాలో పోలీసులు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొన్నారు. ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్‌బాబు కేక్ కట్‌చేసి అందరిలో ఉత్సాహం నింపారు. రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్‌గౌతమ్, చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల కూల్చివేతపై ఫిర్యాదు
మొయినాబాద్: ఇళ్ల కూల్చివేతపై గిరిజన బాధితులు పోలీస్‌స్టేషన్ మెట్లెక్కారు. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం రెవెన్యూలో ఉన్న రాఘవేంద్ర సొసైటీలో ఇతర ప్రాంతాలకు చెందిన 50 గిరిజన కుటుంబాలు ప్లాట్లు కొనుగోలు చేసి కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు, హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులతో వెళ్లి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ ఇళ్లను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ ఇళ్లు కూల్చడానికి శ్రీనివాస్‌రాజు, సురేష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాజుగౌడ్ కారణమంటూ గురువారం బాధితులు మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్లాట్లు చేసిన భూమిని శ్రీనివాస్‌రాజు, సురేష్‌రెడ్డి రాఘవేంద్ర సొసైటీ నుంచి ఎలా కొంటారని.. తాము నిర్మించుకున్న ఇళ్లు, ప్లాట్ల ప్రహరీలను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. తామంతా ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని.. కరెంటు మీటర్లు తీసుకున్నామని.. కొందరికి ఇంటి నంబర్లు కూడా వచ్చాయని తెలిపారు. అలాంటి ఇళ్లను మున్సిపల్ అధికారులు ఎందుకు కూల్చారో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం తెల్లవారుజామున వంద మంది పోలీసులు, వంద మంది బౌన్సర్లు వచ్చి తమను ఇళ్లు ఖాళీ చేయాలని భయభ్రాంతులకు గురిచేశారని.. మున్సిపల్ అధికారులు వచ్చి అక్రమంగా నిర్మించారంటూ సీసీ కెమెరాలు, కరెంటు ఆఫ్ చేసి జేసీబీలతో కూల్చివేశారని తెలిపారు. అక్రమ నిర్మాణాలైతే అధికారులు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తాము కొనుగోలు చేసిన ప్లాట్లను ఇతరులకు అప్పజెప్పేందుకు మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. తమ ఇళ్లు కూల్చివేయడానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. -
ఆశావహుల సందడి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పురపోరుకు రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల్లో ‘హస్తం’ హవా కొనసాగడంతో అదే ఊపుతో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓటర్ల జాబితా సిద్ధం చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లోని అధికారులు వార్డుల వారీగా ఉన్న ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయాల్లో డ్రాప్ట్ పబ్లికేషన్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 10న ఓటర్ల తుదిజాబితాజిల్లాలో 14 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు ఉండగా, వీటిలో మీర్పేట్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, నార్సింగి, మణికొండ, పెద్ద అంబర్పేట్, తుర్కయంజాల్, తుక్కుగూడ, శంషాబాద్, జల్పల్లి, ఆదిబట్ల మున్సిపాలిటీలను ప్రభుత్వం ఇటీవల జీహెచ్ఎంపీలో విలీనం చేసింది. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను రద్దు చేసి, వార్డులను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన మొయినాబాద్, చేవెళ్ల సహా మరో ఐదు మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారమే మున్సి పాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ.. 2025 అక్టోబర్ జాబితా ప్రకారమే ఓటరు జాబితా ఉంటుందని ప్రకటించింది. గురువారం ఆయా మున్సి పాలిటీల్లో డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రకటించింది. ఈ నెల 5 వరకు ఆయా రాజకీయ పార్టీల నుంచి ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనుంది. ఈ నెల 10న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది. రిజర్వేషన్లు రావడమే తరువాయి మున్సిపాలిటీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తుండటంతో ఆశావహులు పోటీకి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయా మున్సిపల్ కేంద్రాల్లో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. నిన్న మొన్నటి వరకు మున్సిపాలిటీని పట్టించుకోని వారు సైతం ప్రస్తుతం అక్కడే మకాం వేసి కూర్చొంటున్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సరి చూసుకుంటున్నారు. ముఖ్య నేతల కంటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. వార్డులు, మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు కావడమే ఆలస్యం.. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారు. పురపోరుకు సన్నాహాలు వార్డుల వారీగా ఓటర్ల జాబితా మున్సిపాలిటీల్లో వెలిసిన ఫ్లెక్సీలు వార్డుల్లో నేతల పర్యటనలు పార్టీ పెద్దల కంట్లో పడేందుకు ఎవరికివారు తాపత్రయం మున్సిపాలిటీ వార్డులు పోలింగ్ కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఆమనగల్లు 15 30 8,475 8,509 – 16,984 చేవెళ్ల 18 36 12,579 12,791 1 25,371 ఇబ్రహీంపట్నం 24 50 12,741 13,252 – 25,993 మొయినాబాద్ 26 31 16,172 15,988 1 32,161 షాద్‌నగర్ 28 59 26,679 26,,723 1 53,403 శంకర్పల్లి 15 30 10,551 10,850 – 21,401 మొత్తం 126 236 87,197 88,113 03 1,75,313 -
పల్లెవించేలా..
‘కొత్త’ కోలాహలం నూతన సంవత్సర వేడుకలను జిల్లావాసులు ఘనంగా జరుపుకొన్నారు. బుధవారం అర్ధరాత్రి కేక్‌లు కట్‌చేసి.. బాణసంచా కాల్చి.. పార్టీల్లో మునిగి తేలారు. గురువారం వేకువజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనాల కోసం భక్తులు బారులు తీరారు. ఎటు చూసినా కోలాహలం కనిపించింది. నిధులు లేక నీరసించిన పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీపి కబురు అందించారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నేరుగా సర్పంచ్‌లకే అందిస్తామని ప్రకటించారు. కేంద్ర నిధులతో సంబంధం లేకుండా చిన్న పంచాయతీలకు రూ.5లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున విడుదల చేస్తామన్నారు. సీఎం ప్రకటనతో సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – షాద్‌నగర్/షాబాద్ పంచాయతీలకు రెండేళ్లుగా పాలక వర్గాలు లేకపోవడంతో నిధులు నిలిచిపోయాయి. పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. చాలా గ్రామాలకు సరైన ఆదాయ వనరులు లేక ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు పూర్తయి పాలక వర్గాల ప్రమాణ స్వీకారం సైతం ముగిసింది. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నిధుల్లేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఇచ్చిన విధంగానే పంచాయతీలకు సైతం సీఎం ఫండ్ నుంచి ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల కొడంగల్ సభలో ప్రకటించారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ నిధులు మంజూరైతే పంచాయతీల్లో అభివృద్ధి పనులకు అడుగుపడే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న సర్పంచ్‌లు పెద్ద పంచాయతీలు తప్ప మిగితా పంచాయతీల ఖజానాలో డబ్బులు లేవు. బాధ్యతలు చేపట్టే సమయంలో చాలా గ్రామాల్లో నిధులు లేక పలువులు సర్పంచ్‌లు పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడం, ఫర్నిచర్ కొనుగోలుకు సొంత డబ్బులు వెచ్చించారు. తాగునీటి పైప్లైన్ల మరమ్మతులు, మోటార్ల నిర్వహణ, ట్రాక్టర్ల మరమ్మతుల కోసం నిధులు లేవు. ప్రత్యేక నిధులు వస్తే కొన్ని పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ నిధుల కోసం కొత్త సర్పంచ్‌లు ఆశగా ఎదురు చూస్తున్నారు. రూ.42కోట్ల స్పెషల్ నిధులు జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ లెక్కన రూ. 42 కోట్ల మేర నిధులు రానున్నాయి. దీంతో గ్రామాల్లో తిష్ట వేసిన పలు సమస్యలకు పరిష్కార మార్గం దొరకనుంది. ప్రణాళికలు.. తీర్మానాలు ప్రత్యేక అభివృద్ధి నిధులతో పల్లెల్లో చేపట్టే పనులపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. ఇందు కోసం మూడు నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో అభివృద్ధి పనులపై సర్పంచులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొత్త పాలక వర్గాలతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించి తీర్మానాలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో అభివృద్ది పనులు చేపట్టనున్నారు. గ్రామాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తామని సీఎం ప్రకటించడం హర్షణీయం. గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. – వాకిటి నవకిరణి, సర్పంచ్, ఎలికట్ట, ఫరూఖ్‌నగర్ రెండేళ్లుగా పాలకవర్గాలు లేక అభివృద్ధి కొంత కుంటుపడింది. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతాం. ప్రభుత్వం మంజూరు చేసే నిధులను ప్రజలకు కనీస వసతులు కల్పించేందుకు ఖర్చు చేస్తాం. – అంజయ్య, సర్పంచ్, ముట్పూరు, కొందుర్గు ముఖ్యమంత్రి ఇస్తామన్న రూ.10 లక్షలతో కొంతైనా అభివృద్ధికి అవకాశం లభిస్తుంది. ఇప్పటికై తే గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది వేతనాలు చెల్లించిన తర్వాత మిగులు నిధులను ప్రజల కనీస అవసరాలకు వినియోగిస్తాం. పారదర్శకంగా అభివృద్ధి పనులకు ఉపయోగిస్తాం. – కేతావత్ రాజునాయక్, సర్పంచ్ మద్దూరు, షాబాద్ పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు లేవు. గతంలో మాజీ సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు, కార్యదర్శులు చేసిన పనులకు సంబంధించి రూ.లక్షల్లో బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో సీఎం ప్రకటన కొంత ఊరటనిచ్చింది. – కుమ్మరి లావ్యణ, సర్పంచ్, సంకెపల్లిగూడ, షాబాద్ పంచాయతీలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నేరుగా గ్రాంట్లు విడుదల చేస్తామన్న సీఎం జిల్లాకు రానున్న రూ.42కోట్లు హర్షం వ్యక్తం చేస్తున్న కొత్త పాలక వర్గాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కొత్త సర్పంచ్లుజిల్లాలో మొత్తం జీపీలు – 526 చిన్న పంచాయతీలు – 210పెద్ద పంచాయతీలు – 316 -
‘మత్తు’ దందాకు చెక్..!
రాజేంద్రనగర్: తన గుడారం పక్కనే గంజాయి మొక్కలను పెంచుతున్న యువకుడిని రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన మేరకు.. బిహార్‌కు చెందిన రాజేందర్ (30) తల్లిదండ్రులు, సోదరితో కలిసి రోడ్లపై వన మూలికలను విక్రయిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతంలో తాత్కాలిక గూడారాలను వేసుకొని నివసిస్తున్నాడు. కిస్మత్‌పూర్‌లోని ఖాళీ స్థలంలో కొద్ది రోజులుగా గుడారాలను వేసుకొని నివస్తున్నాడు. తన గుడారం పక్కనే గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగాయి. గంజాయి మొక్కలు కనిపించకుండా పరదాలను ఏర్పాటు చేశారు. ఈ విషయమై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెళ్లి తనిఖీలు చేపట్టగా అవి గంజాయి మొక్కలుగా నిర్ధారించారు. దీంతో వాటిని ధ్వంసం చేసి రాజేందర్‌ను అదుపులోకి స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్‌తో పట్టుబడ్డ యువతి బంజారాహిల్స్: వెకేషన్ కోసమో, హాలిడే ట్రిప్ కోసమో చాలా మంది గోవాకు వెళ్తుంటారు. అందరిలాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గోవాకు వెళ్లింది. అయితే ట్రిప్ ఎంజాయ్ చేసి రాలేదు. డ్రగ్ పెడ్లర్స్‌తో పరిచయాలు పెంచుకుని దందాలోకి దిగింది. గుట్టుచప్పుడు కాకుండా గోవా నుంచి సిటీకి డ్రగ్స్ సరఫరా చేస్తూ వ్యాపారాన్ని విస్తరించింది. న్యూ ఇయర్ కోసం చేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితురాలిని అరెస్టు చేశారు. నిందితురాలిని బంజారాహిల్స్‌కు చెందిన హస్సాగా గుర్తించారు. గోవా నుంచి ఎండీఎంఏ, ఎల్ఎస్డీ సరఫరా చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు నైజీరియన్ సరఫరాదారుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. హస్సా 2024 డిసెంబర్లో గోవా పర్యటనలో భాగంగా డ్రగ్స్ పెడ్లర్స్‌తో పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాగటర్ క్లబ్లో ఎండీఎంఏ వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు చెప్పారు. 2025 మార్చి నుంచి పలుమార్లు గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హస్సా డిసెంబర్ 26న సియోలిమ్, మాపూసాలో ఎండీఎంఏ, ఎల్ఎస్డీ అందజేసినట్లు తేలింది. హైదరాబాద్‌కు చెందిన మరికొందరితో కలిసి డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఎన్డీపీఎస్ కేసులో గతంలో అరెస్టయినట్లు చెప్పారు. నగరంలో మత్తు దందా నిర్వహిస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్, గంజాయి కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిందితులు వారి కళ్లుగప్పి సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త దారుల్లో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారు. ఓ యువకుడైతే ఏకంగా బహిరంగ ప్రదేశాల్లో గంజాయి మొక్కలు పెంచుతుండగా.. మరో యువతి ఏకంగ్రా డ్రగ్స్ విక్రయిస్తోంది. ఇక ఇద్దరు యువకులు కొకై న్ తరలిస్తుండగా పట్టుబడ్డారు.గంజాయి మొక్కలు పెంచుతున్న యువకుడు డ్రగ్స్విక్రయిస్తూ యువతి కొకై న్ తరలిస్తుండగాఇద్దరు యువకులు వేర్వేరు ప్రాంతాల్లో నిందితుల అరెస్ట్ -
అవిశ్వాస గళం!
● మదర్ డెయిరీ చైర్మన్‌పై డైరెక్టర్ల గుర్రు ● ప్రత్యేక సమావేశం కోసం నోటీసుహయత్నగర్: నల్లగొండ –రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (నార్ముల్ మదర్‌డెయిరీ) పాలక వర్గంలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. రైతులకు బకాయిలు చెల్లించడంలో విఫలం అయ్యాడంటూ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి రాజీనామా చేయాలని మెజారిటీ సభ్యులు వారం రోజులగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాలకమండలి ప్రత్యేక సమావేశం పెట్టాలని 11 మంది సభ్యులు గురువారం ఎండీకి నోటీసు ఇచ్చారు. డెయిరీని సమస్యల నుంచి గట్టెక్కించడంలో చైర్మన్ విఫలం అయ్యాడని భావిస్తున్న సభ్యులు ఆయనను పదవి నుంచి దించేందుకు వారం రోజులుగా పావులు కదుపుతున్నారు. రాజీనామాకు చైర్మన్‌ను ఒప్పించాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం ఈ మేరకు డిసెంబర్ 31న సమావేశం కావాలని డెయిరీ కార్యాలయానికి సభ్యులు హాజరు కాగా చైర్మన్ రాలేదు. దీంతో ఎలాగైనా చైర్మన్‌ను తొలగించాలనే ఉద్దేశంతో ప్రత్యేక సమావేశానికి నోటీసు ఇచ్చినట్లు సమాచారం. అప్పుల నుంచి డెయిరీని రక్షించుకోవడం కోసం ఎన్డీడీబితో ఒప్పందం చేసుకుంటామని గత జనరల్ బాడీ మీటింగ్‌లో ప్రకటించిన చైర్మన్ ఒప్పందం చేసుకోవడంలో విఫలమయ్యాడని, దీంతో రైతులకు బకాయిలు పెరిగిపోయి పాలుపోయడం తగ్గించారని డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే డెయిరీ మనుగడ కష్టం అని భావిస్తున్నారు. ఒప్పందం చేసుకోవడానికి ఎన్డీడీబీ వెనకడుగు వేయడం.. అప్పుల భారం పెరిగిపోవడం.. రైతులు పాలు పోయడం తగ్గించడం.. మార్కెట్లో సేల్స్ తగ్గడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు కొత్తగా మరో చైర్మన్ ఎన్నుకోవడమే మార్గమని డైరెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఉరేసుకొని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
పహాడీషరీఫ్: చెట్టుకు ఉరేసుకొని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వెలుగుజూసింది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ నుంచి కొత్తపేటకు వెళ్లే రూట్లోని పొల్లాల్లో ఓ చెట్టుకు వ్యక్తి ఉరేసుకొని ఉన్న విషయమై గురువారం సాయంత్రం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తి తాడుతో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు హిందువు అని, వయసు 50–55 నడుమ ఉంటుందని, మృతదేహాన్ని బట్టి ఉరేసుకొని రెండు మూడు రోజులు అయి ఉంటుందని పోలీసులు తెలిపారు. గ్రీన్ కలర్ లుంగీ, తెలుపు రంగు చొక్కా ధరించాడని, మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు నిర్ధారించారు. ఇతని సంబంధీకులెవరైనా ఉంటే బాలాపూర్ పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బైక్ అదుపు తప్పి ఇద్దరు విద్యార్థుల మృతి మణికొండ: ఒకే కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు బైక్‌పై వెలుతుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు.ఈ సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. హిమాయత్‌నగర్‌లో శ్రీ చైతన్య డీమ్డ్ కళాశాలలో బీసీఏ మూడవ సంవత్సరం చదువుతున్న రామంతాపూర్‌కు చెందిన కావ్య, వికారాబాద్ జిల్లా మల్కాపూర్‌కు చెందిన టి. కౌశిక్‌రెడ్డిలు స్నేహితులు. బుధవారం బైక్‌పై కౌశిక్‌రెడ్డి నివాసానికి బయలుదేరారు. పోలీస్ అకాడమీ దాటిన తరువాత తన బైక్‌ను వేగంగా నడపటంతో అది అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న డీసీఎంను ఢీ కొట్టాడు. దాంతో తీవ్ర గాయాలై కావ్య అక్కడికక్కడే మృతి చెందింది. కౌశిక్‌రెడ్డికి సైతం తీవ్ర గాయాలు కావటంతో లంగర్‌హౌస్‌లోని రెనోవా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించాడు. మృతురాలి అన్న సాయి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నార్సింగి పోలీసులు తెలిపారు. ‘ఈ మార్కులు అప్పట్లో చాలా కష్టం’ డీజీపీ శివధర్‌రెడ్డి, కొత్వాల్ సజ్జనర్ సాక్షి, సిటీబ్యూరో: ‘మా రోజుల్లో నూటికి 40, 50 శాతం రావడమే గగనమయ్యేది. ఆ స్థాయిలో మార్కులు వస్తే చాలని పరితపించే వాళ్లం. అయితే నేటి తరం విద్యనభ్యసించడంలో పోటీ పడుతోంది. అందుకే 90 నుంచి 95 శాతం మార్కులు సాధించగలుగుతోంది’ అని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి అన్నారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్టుల పిల్లలకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం స్కాలర్ షిప్స్, ప్రశంసా పత్రాలు అందిస్తూ ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జలవిహార్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... ‘కష్టపడి ప్రతిభను చాటిన వారికి ఇచ్చే ఇలాంటి గౌరవం వారికి మరింత ప్రోత్సాహంగా నిలుస్తుందన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులోనూ ఉన్నత విజయాలు సాధించాలని పేర్కొన్నారు. నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ మాట్లాడుతూ... జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ క్లబ్ చూపుతున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సీఎస్బీ ఐఏఎస్ అకాడెమీ నిర్వాహకురాలు బాల లత, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరికుప్పల రమేష్, కోశాధికారి రమేష్ వైట్లలతో పాటు కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. -
కొత్తేడాది.. ఆలయాలకు పోటెత్తి
● చిలుకూరులో మార్మోగిన గోవింద నామస్మరణ ● భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు మొయినాబాద్: కొత్త సంవత్సరం.. కొంగొత్త ఆశలు.. భక్తుల అడుగులన్నీ చిలుకూరు వైపే.. నూతన ఏడాది మొదటి రోజు దైవ సన్నిధిలో గడపాలని.. కోరికలు నెరవేర్చుకోవాలని జనమంతా చిలుకూరు బాట పట్టారు. తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీని దర్శించుకోవడానికి గురువారం భక్తులు పోటెత్తారు. ఎటు చూసిన భక్తజనం.. గోవింద నామస్మరణలు, కీర్తనలతో చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణమంతా మార్మోగింది. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే అనుమతించడంతో అప్పటికే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రద్దీ కొనసాగింది. దీంతో స్వామివారిని దర్శించుకోవడానికి నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి ప్రవేశించే ముందే మహిళ లు, పురుషులను వేర్వేరు క్యూలైన్లలో పంపించారు. ఎటు చూసినా భక్తజనమే చిలుకూరు బాలాజీ దేవాలయ పరిసరాల్లో ఎటు చూసినా భక్తజనమే కనిపించారు. నగరంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాలాజీని దర్శించుకున్నారు. వాహనాల పార్కింగ్ నుంచి ఆలయానికి చేరుకోవడానికి వేర్వేరు దారులు ఏర్పాటు చేయడంతో ఎక్కడా ఇబ్బంది లేకుండా భక్తులు నేరుగా వచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకుడు రంగరాజన్ పర్యవేక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా సుమారు లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అర్చకులు తెలిపారు. పటిష్ట బందోబస్తు బాలాజీ దేవాలయానికి భారీగా భక్తులు తరలిరావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్‌గౌతం, చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. సుమారు వంద మంది పోలీసులు, వంద మంది వాలంటీర్లతో బందోబస్తు నిర్వహించారు. భారీగా భక్తులు రావడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. పెద్ద సంఖ్యలో కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాల్లో రావడంతో చిలుకూరు నుంచి అప్పా జంక్షన్ వరకు ట్రాఫిక్ ప్రభావం కనిపించింది. హిమాయత్‌నగర్‌లో కొంత సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వాహనాలను రోడ్ల పక్కన నిలుపనీయకుండా చేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కిటకిటలాడిన ‘మైసిగండి’ కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువైన మైసమ్మ దేవతను గురువారం భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరం కావడంతో ఆలయ పరిసరాలు భక్తజనంతో నిండిపోయాయి. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సందడితో పరిసరాలు కిటకిటలాడాయి. పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
ఎకరా వరికి రెండు బస్తాలే!
షాబాద్: వానాకాలం పంటలకు సకాలంలో యూరియా అందక రైతులు ఇబ్బంది పడ్డారు. చాలా మంది అదనుకు ఎరువు వేయలేకపోయారు. దీంతో దిగుబడిపై ప్రభావం చూపింది. చాలాచోట్ల అన్నదాతలు యూరియా కోసం రోడ్లెక్కారు. ఈ నేపథ్యంలో యాసంగిలో అలాంటి సమస్య రావొద్దని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యాసంగి సీజన్లో సకాలంలో ఎరువులు అందించడంతో పాటు వాడకాన్ని నియంత్రించేందుకు యూరియా బుకింగ్ యాప్‌ను తెచ్చింది. ఇంటి నుంచే బుకింగ్ చేసి సమీప దుకాణాల్లో ఎరువులు స్వీకరించవచ్చు. యాసంగి సాగు ఇలా జిల్లాలో యాసంగి సీజన్లో 3.80 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా. వరి 1.30 లక్షల ఎకరాలు, మొక్క జొన్న లక్ష ఎకరాలు, శనగ 50 వేల ఎకరాలతోపాటు పప్పు ధాన్యాలు, ఇతర పంటలు కూడా ఉన్నాయి. ఈ పంటలకు 28 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇప్పటికే 11 వేల టన్నుల నిల్వలున్నాయి. అవసరమైతే మరిన్ని సరఫరాలు చేస్తారు. మార్గదర్శకాలు ముఖ్యం రైతులు తమ అవసరాల ప్రకారం కాకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మాత్రమే యూరియా పొందుతారు. యాప్‌లో పంట వివరాలు, ఎకరాల సంఖ్య నమోదు చేస్తే అవసరమైన బస్తాలు, సమయాలు సూచిస్తుంది. శాస్త్రవేత్తల సిఫారసు ప్రకారం ఎకరానికి వరికి 2 బస్తాలు, మొక్కజొన్నకు 3 బస్తాలు, జొన్నకు 2 బస్తాలు, శనగకు ఒక బస్తా కేటాయిస్తారు. బుకింగ్ తర్వాత సమీప దుకాణాల్లో స్వీకరించవచ్చు. యాప్ వినియోగం మొబైల్లో యాప్ తెరిచి సిటిజన్ లాగిన్ ఎంపికలో మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. రాష్ట్రం, జిల్లా, సీజన్(రబీ, ఖరీఫ్), పాస్‌బుక్ నంబర్, పంటల వివరాలు నమోదు చేయాలి. ఆధారంగా బస్తాల సంఖ్య, 15 రోజుల్లో దశలవారీ సరఫరా వివరాలు కనిపిస్తాయి. పాస్‌బుక్ లేని కౌలు రైతులు ఆధార్‌తో నమోదు చేసుకోవచ్చు. బుకింగ్ ఐడీతో దుకాణంలో డబ్బు చెల్లించి ఎరువులు పొందాలి. విడతల వారీగా సరఫరా రైతులు ఒకేసారి కాకుండా విడతలు వారీగా యూరియా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయిదెకరాల్లో భూమి ఉన్న రైతులు రెండు విడతల్లో 5 నుంచి 20 ఎకరాల భూమి ఉన్న రైతులు మూడు విడతల్లో, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం భూమి ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియా తీసుకెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. యూరియా బుకింగ్ యాప్‌లో పట్టా పాసుపుస్తకం నంబర్ నమోదు చేయగానే లింక్ చేసిన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది నమోదు చేయగానే సదరు రైతుకు ఎన్ని ఎకరాలు ఉంది, ఏ పంట వేశారనే వివరాలతో పాటు ఆ పంటకు ఎంత యూరియా అవసరమనే సమాచారం, బుకింగ్ ఐడీ వస్తుంది. అనంతరం ఫర్టిలైజర్, సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బుకింగ్ కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. ఇబ్బందులు ఇలా ● రైతులందరి వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడం. ● నమోదుపై అవగాహన కొరవడటం, స్మార్ట్ ఫోన్లు ఉన్నా.. రీచార్జీ సమస్యలు తలెత్తడం. ● పల్లెల్లో సరైన నెట్వర్క్ లేకపోవడం. ● ఫోన్లకు తరుచూ వచ్చే సందేశాలకు ఎలా స్పందించాలో తెలియకపోవడం. ● దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ మోసగాళ్లు విజృభించే అవకాశం లేకపోలేదు. ● ఫోన్ పే, గూగుల్ పేకు సంబంధించిన పిన్ నంబర్ ఇతరులకు చెప్పాల్సి రావడం. అక్రమాలకు అడ్డుకట్ట యూరియా విక్రయాల్లో అక్ర మాలను అరికట్టడం, నిజమైన రైతులకు సకాలంలో అందించడమే నూతన యాప్ లక్ష్యం. మోతాదుకు మించి వాడకానికి అడ్డుకట్టు పడటంతో పాటు భూసార పరిరక్షణ సాధ్యపడుతుంది. వ్యాపారులు, రైతులకు యూరి యా బుకింగ్ యాప్‌పై అవగాహన కల్పించాం. – విజయచంద్ర, ఏఓ, షాబాద్ నూతన యాప్‌తోనే యూరియా పంపిణీ అక్రమాల అడ్డుకట్టకు చర్యలు రైతులు, డీలర్లకు అవగాహన ఇష్టానుసారం వాడకానికి చెక్ సదస్సులు నిర్వహిస్తున్న అధికారులు -
కలెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్ నారాయణరెడ్డిని పలువురు అధికారులు గురువారం ఆయన చాంబర్లో కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. విషెస్ తెలిపిన వారిలో అదనపు కలెక్టర్లు కె.చంద్రారెడ్డి, శ్రీనివాస్‌తో పాటు డీఆర్ఓ సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా వైద్యాధికారి కె.లలితాదేవి, డీపీఓ సురేష్‌మోహన్ తదితరులు ఉన్నారు. రోడ్డు భద్రత కరపత్రాల ఆవిష్కరణ ఇబ్రహీంపట్నం రూరల్: రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో గురువారం రోడ్డు భద్రత మాస వేడుకలకు సంబంధించి కరపత్రాలను, బ్రోచర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీటీసీ, ఎంవీఐ, ఏఎంవీఐలు, ఈఈఅర్అండ్బీ బృందంతో పాటు మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు . క్యాలెండర్ ఆవిష్కరణ ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను గురువారం కలెక్టర్ నారాయణరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, శ్రీనివాస్, సంగీత, సంఘం జిల్లా అధ్యక్షుడు రామారావు, కార్యదర్శి శ్రీనేష్‌కుమార్, మాజీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జింక మాంసం కేసులో వెలుగులోకి కొత్త విషయం
రాజేంద్రనగర్: అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించిన జింక మాంసం కేసు విచారణలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కామాటిపురాకు చెందిన మహ్మద్ అబ్బు హుస్సేన్ కొన్ని రోజులుగా జింక మాంసాన్ని తీసుకొచ్చి చికెన్ సెంటర్ నిర్వాహకుడైన మహ్మద్ ఇర్ఫానుద్దీన్కు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం హుస్సేన్ పరారీలో ఉన్నాడని రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ రేంజ్ అటవీ అధికారి టి.వీరేశం వెల్లడించారు. గగన్‌పహాడ్‌లోని అటవీ శాఖ కార్యాలయంలో గురువారం విలేకర్లతో మాట్లాడుతూ..పట్టుబడిన జింక మాంసం కృష్ణజింకగా నిర్ధారించామన్నారు. కొన్ని రోజులుగా కామాటిపురాకు చెందిన హుస్సేన్ జింక మాంసాన్ని తీసుకొచ్చి ఇర్ఫాన్‌కు అందిస్తున్నాడన్నారు. ఇర్ఫాన్ తన చికెన్ సెంటర్లో కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు. అటవీ శాఖ చట్టం 1972 ప్రకారం నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అటవీ జంతువులను చంపినా వాటి మాంసాన్ని తిన్న, విక్రయించిన నేరమన్నారు. ఈ కేసుల్లో నిందితులకు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా ఉంటుందన్నారు. -
పుట్టిన రోజునే మృతి
తాండూరు రూరల్: అయ్యప్ప మాలధారణలో ఉన్న ఓ యువకుడు పుట్టిన రోజునే చనిపోయిన విషాద ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాజులపురం నర్సింహారెడ్డి, లావణ్య దంపతులకు ఇద్దరు కొడుకులు. వీరిలో పెద్ద కుమారుడు కౌశిక్‌రెడ్డి(20) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం నార్సింగి పీఎస్ పరిధిలోని ఆరె మైసమ్మ వద్ద బైక్‌పై వెళ్తూ ఆగి ఉన్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన అతన్ని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. సాయంత్రం స్థానిక శ్మశానవాటికలో నిర్వహించిన అంత్యక్రియల్లో బంధువులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చి అంతిమ వీడ్కోలు పలికారు. పుట్టిన రోజునే చనిపోవడంతో బాధిత తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇదిలా ఉండగా మృతుడి కళ్లను దానం చేశారు. -
కొకై న్ తరలిస్తున్న ఇద్దరు యువకులు
మణికొండ: డ్రగ్స్‌తో ఇద్దరు వ్యక్తులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజమండ్రికి చెందిన శ్రీనివాస్(46), గోవాకు చెందిన విజయ్‌లు పుప్పాలగూడలోని గోల్డెన్ టెంపుల్ వద్ద డ్రగ్స్‌తో సంచరిస్తున్నారనే సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరపగా వారి వద్ద ఏడు గ్రాముల కొకై న్ లబించింది. ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా శ్రీనివాస్ డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. దాంతో వారిద్దరితో పాటు లబించిన కొకై న్, రెండు సెల్ ఫోన్లను నార్సింగి పోలీసులకు అప్పగించారు. వారు ఎవరికి కొకై న్ సరఫరా చేసేందుకు వచ్చారు..ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం నడిపిస్తున్నారు, వీరితో పాటు వారి గ్యాంగ్‌లో మరెంత మంది ఉన్నారనే కోణంలో ఎస్ఓటీ పోలీసులతో పాటు నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇళ్ల కూల్చివేత వివాదాస్పదం
● అధికారులు కోర్టు స్టేను పట్టించుకోలేదని బాధితుల ఆవేదన ● తమ ప్లాట్లు, ఇళ్లు వదిలి వెళ్లేది లేదంటున్న గిరిజనం మొయినాబాద్: అక్రమ నిర్మాణాలంటూ మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతల అంశం వివాదాస్పదంగా మారింది. కోర్టు స్టే(మధ్యంతర ఉత్తర్వులు) ఉండగానే మున్సిపల్ అధికారులు ఇళ్లు, ప్లాట్ల ప్రహరీలు కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 2026 జనవరి 20 వరకు కోర్టు స్టే ఉందని.. మున్సిపల్ అధికారులు, పోలీసులు, బౌన్సర్లతో వచ్చి దౌర్జన్యంగా తమ ఇళ్లు కూల్చారని వాపోతున్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం రెవెన్యూ సర్వే నంబర్ 210, 211, 212లో ఉన్న 16 ఎకరాల భూమిని రాఘవేంద్ర సొసైటీ కొనుగోలు చేసి లేఅవుట్ చేసింది. 2019 నుంచి సొసైటీ సభ్యులు హర్షవర్ధన్‌రావు, హరికిరణ్ వద్ద సుమారు 50 మంది గిరిజనులు ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇప్పటికే పది మంది ఇళ్లు నిర్మించుకున్నారు. మిగిలిన వారు తమ ప్లాట్ల చుట్టూ ప్రీకాస్ట్వాల్ నిర్మించుకున్నారు. అయితే ఇటీవల కొంత మంది ఈ భూమి తమదని.. ఇళ్లు, ప్లాట్లు ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించడంతో.. వెంటనే హైకోర్టును ఆశ్రయించగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని బాధితులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో వచ్చి తమ ఇళ్లను కూల్చివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిద్రలేవకముందే పోలీసులు, బౌన్సర్లు ఇళ్లలోకి చొరబడి తమను బయటకు లాగేశారని.. బూతులు తిడుతూ తమ సెల్ ఫోన్లు లాక్కున్నారని బాధితులు వాపోయారు. గిరిజనులనే టార్గెట్? పెద్దమంగళారం రెవెన్యూలోని రాఘవేంద్ర సొసైటీలో ప్లాట్లు కొనుగోలుచేసి ఇళ్లు నిర్మించుకున్న గిరిజనులనే మున్సిపల్ అధికారులు టార్గెట్ చేశారు. పది ఇళ్లతోపాటు వారు కొనుగోలు చేసిన ప్లాట్ల చుట్టూ నిర్మించిన ప్రీకాస్ట్ వాల్స్ మాత్రమే కూల్చివేశారు. అదే సొసైటీలోని మిగిలిన ప్లాట్ల చుట్టూ వేసిన ఫ్రీకాస్ట్వాల్స్ను కూల్చకపోవడంపై బాధితులు గిరిజనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నోటీసులు సైతం ఇవ్వకుండా రాత్రి వచ్చి ఇళ్లు కూల్చి తమను రోడ్డున పడేశారని ఆవేదన చెందారు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూనే.. ఇళ్లు కూల్చివేసినా బాధిత గిరిజనం రాత్రంతా అక్కడే పడిగాపులుకాశారు. చిలికి వణుకుతూ కూల్చిన ఇళ్ల ఎదుట పడుకున్నారు. రాఘవేంద్ర సొసైటీ ద్వారానే మేము ప్లాట్లు కొనుగోలు చేశామని.. ఎవరు వచ్చినా ఇక్కడి నుంచి కదిలేదని లేదని భీష్మించుకున్నారు. ఈ కూల్చివేతలపై బుధవారం బాధితులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. మొదటి నుంచి వివాదాస్పదమే రాఘవేంద్ర సొసైటీ 1986లో రైతుల వద్ద భూములు కొనుగోలు చేసి లేఅవుట్ చేసి కొంత మందికి ప్లాట్లు విక్రయించింది. సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రంగారెడ్డి 1998లో ఈ భూమిని శ్రీనివాస్‌రాజు, సురేశ్‌రెడ్డికి అగ్రిమెంట్ చేశాడు. రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కోర్టుకు వెళ్లిన శ్రీనివాస్‌రాజు, సురేశ్‌రెడ్డి 2011 డిక్రీ తెచ్చుకుని కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పటి నుంచే రాఘవేంద్ర సొసైటీ భూములపై వివాదం కొనసాగుతోంది. లేఅవుట్లో ముందుగా ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఇతరులకు విక్రయించడంతో చేతులు మారాయి. ఈ క్రమంలోనే 2019 నుంచి గిరిజనులు ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం గిరిజనుల ఇళ్లు కూల్చడంలో మొయినాబాద్ మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు స్పష్టమవుతుంది. కోర్టు ఉత్తర్వులతో కూల్చివేతలు చేపట్టామని చెప్పిన అధికారులు వాటిని మీడియా చూపడం లేదు. మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్, టౌన్‌ప్లానింగ్ అధికారి వాణి కూల్చివేతలకు సంబంధించిన విషయాలను మీడియా ప్రతినిధులకు చెప్పడానికి వెనుకాడుతున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రతిని చూపించాలని మీడియా ప్రతినిధులు కోరగా సమాదానం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. అధికారుల తీరును బట్టి చూస్తే కూల్చివేతల వెనుక ప్రభుత్వ పెద్దలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షాద్‌నగర్ నియోజకవర్గం చౌదరిగూడలో భూమిని అమ్ముకుని రెండేళ్ల క్రితం ఇక్కడ వంద గజాల ప్లాటు కొని ఇల్లు కట్టుకున్నాం. మంగళవారం తెల్లవారు జామున నిద్రలేవకముందే పోలీసులు, బౌన్సర్లు ఇళ్లలోకి వచ్చి భయబ్రాంతులకు గురిచేశారు. నేను గర్భిణిని అని చెప్పినా బలవంతంగా బయటకు లాగేశారు. సెల్ఫోన్లు గుంజుకున్నారు. పిల్లలను బయటకు లాగేసి జేసీబీతో ఇళ్లు కూల్చివేశారు. – నందిని, బాధితురాలు లక్షలు పెట్టి ప్లాట్లు కొన్నాం.. ఇళ్లు కట్టుకున్నాం. విద్యుత్ కనెక్షన్లు, ఇంటి నంబర్లు ఇచ్చారు. అధికారులు, పోలీసులు రాత్రి సమయంలో వచ్చి కూల్చివేయడం సరికాదు. మేం ప్రభుత్వ భూమిని ఆక్రమించామా..? ఇళ్లు కూల్చివేసినా మేము ఎక్కడికీ వెళ్లం. – చందు, బాధితుడు -
ఆగయా.. నయా సాల్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కాల చక్రంలో మరో వసంతం కనుమరుగయింది. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. కొత్త ఆశలు.. కొంగొత్త ఆశయాలతో జిల్లా వాసులు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విందులు, వినోదాల్లో మునిగితేలిన వారంతా 2025కు వీడ్కోలు పలికారు. సరిగ్గా అర్థరాత్రి 11.59 నిమిషాలు దాటిన తర్వాత ఒక్క సారిగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొట్టారు. కేకులు కట్ చేసి స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా ప్రతి ఒక్కరూ.. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ఇదే సమయంలో కొంత మంది యువతీ, యువకులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టామనే ఆనందంతో పాటు విషాదం కూడా జిల్లా వాసులను వెంటాడింది. డిసెంబర్ 31 పేరుతో రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా పీకలదాక మద్యం సేవించి వాహనాలపై ప్రయాణించి ప్రమాదాలకు గురయ్యారు. ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్న వారు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కారు. ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం నేతలు ప్రణాళికలు రచిస్తుండగా, కాలం కలిసి రావాలని, పంటలు పుష్కలంగా పండాలని రైతులు, సంక్షేమ పథకాలు అందాలని ఆయా లబ్ధిదారులు ఆకాంక్షిస్తున్నారు. డిసెంబర్ చివరి మూడు రోజులు మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదు ఎకై ్సజ్ జిల్లాలు ఉండగా, వీటి పరిధిలో 20 ఎకై ్సజ్ పోలీస్టేషన్లు ఉన్నాయి. 2023 డిసెంబర్ చివరి మూడు రోజుల(రూ.208.70 కోట్లు)తో పోలిస్తే... 2024లో రూ.75 లక్షలు తగ్గింది. మొత్తం రూ.207.95 కోట్లు వచ్చింది. అదేవిధంగా గత ఏడాది అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది స్వల్పంగా పెరిగింది. భూభారతి సదస్సుల నిర్వహణ నాకు అంత్యంత సంతృప్తిని ఇచ్చింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం లభించడం సంతోషాన్ని కలిగించింది. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో రైతును నొప్పించకుండా, ఒప్పించి వారి నుంచి భూములు సేకరించాలని 2026కు టార్గెట్ పెట్టుకున్నా. వీలైనంత వరకు సాగుకు యోగ్యం కానీ భూములనే సేకరించాలని భావిస్తున్నా. ఎప్పటిలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలను అర్హులకు అందజేయడమే లక్ష్యంగా పని చేస్తా. పరిపాలనలో పారదర్శకతను పెంచి జిల్లాకు మంచి పేరు తీసుకువస్తా. జిల్లావాసులంతా లక్ష్యాలను నిర్ధేశించుకోవాలి. సవాళ్లను అధిగమించి, విజయాలను కై వసం చేసుకోవాలి. కొత్త సంవత్సరం ప్రతీ ఒక్కరికి గెలుపును అందించే సంవత్సరం కావాలని ఆకాంక్షిస్తున్నా. – నారాయణరెడ్డి, కలెక్టర్ ప్రశాంతమైన వాతావరణంలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించి, ఈ ఏడాది వందశాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. అంతేకాదు ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఇవే ఫలితాలను పునరావృతం చేయాలని భావిస్తున్నాం. జనవరి నుంచి పదోతరగతి విద్యార్థులకు పునశ్ఛరణ తరగతులు నిర్వహించనున్నాం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తాం. – సుశీందర్‌రావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఆడపిల్లల ఆరోగ్యానికి అభయమివ్వడమే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యం. జనవరి రెండో వారంలో హెపీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మాకంగా ప్రారంభించబోతున్నాం. 14–15 ఏళ్లలోపు వయసున్న 1.17 లక్షల మంది బాలికలను ఇప్పటికే గుర్తించాం. వారందరికీ హెపీవీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తాం. అనైతిక వైద్య సేవలను నిఘా పెంచాం. వీటి తనిఖీలకు 45 బృందాలను సిద్ధం చేశాం. జిల్లా వ్యాప్తంగా 3,300 వైద్య సిబ్బంది పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డ్యూటీలో ఉండాల్సిందే. విధులకు గైర్హజరయ్యే వైద్య సిబ్బందిపై సీరియస్ యాక్షన్ ఉండబోతోంది. – డాక్టర్ కె.లలితాదేవి, డీఎంహెచ్ఓ 2025కి ఘనంగా వీడ్కోలు.. 2026కు గ్రాండ్ వెల్కం మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి నేతలు ప్రణాళికలు కాలం కలిసి రావాలని రైతులు.. పథకాలు అందాలని ప్రజల ఆకాంక్ష జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పినప్రజాప్రతినిధులు, అధికారులు -
ముగిసిన పత్రీజీ ధ్యాన మహాయాగం
కడ్తాల్: మండల కేంద్ర సమీపంలోని కై లాసపురి మహేశ్వర మహాపిరమిడ్ క్షేత్రంలో పదకొండు రోజుల పాటు కొనసాగిన పత్రీజీ ధ్యాన మహాయాగం వేడుకలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా గురుమాత స్వర్ణమాల పత్రి ప్రసంగిస్తూ.. పత్రీజీ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని సూచించారు. ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ధ్యాన సంబురాలను విజయవంతం చేసిన ప్రతీ పిరమిడ్ మాస్టర్‌కు, ధ్యానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ధ్యానులందరికి నూతన సంవత్సర సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 డిసెంబర్లో పత్రీజీ మౌన ధ్యాన మహాయాగం మరింత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం పిరమిడ్ ట్రస్ట్ సభ్యులను, ధ్యాన గురువులను, మాస్టర్లను, సంగీత విధ్వాంసులను, కళాకారులను, ట్రస్ట్ చైర్మన్, సభ్యులతో పాటు పరిణిత పత్రి ఘనంగా సన్మానించారు. సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు దాట్ల హన్మంతరాజు, సభ్యులు దామోదర్‌రెడ్డి, శ్రీరాంగోపాల్ హనమంతరావు, మాధవి, లక్ష్మి, నిర్మల, బాలకృష్ణ, సాగర్, శివప్రసాద్ ఉన్నారు. ఈ ఏడాది మౌనధ్యాన మహాయాగం -
నేడు మహాద్వార దర్శనం
● చిలుకూరుకు తరలిరానున్న భక్తజనం ● భారీగా ఏర్పాటు చేస్తున్న అర్చకులు, పోలీసులు మొయినాబాద్: నూతన సంవత్సరం మొదటి రోజు గురువారం చిలుకూరు బాలాజీ దేవాలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ప్రతీ సంవత్సరం జనవరి 1న సుమారు లక్షకు పైగా భక్తులు బాలాజీని దర్శనానికి విచ్చేస్తుంటారు. ఈ ఏడాది సైతం అదే స్థాయిలో వచ్చే అవకాశం ఉండడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అర్చకులు, పోలీస్ శాఖ తగిన ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్, భక్తుల క్యూలైన్లుకు సంబంధించి తగిన ఏర్పాటు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు ఆలయ సమీసానికి వచ్చేలా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆలయ ప్రాంగణంతోపాటు బయట భక్తుల క్యూలైన్ల కోసం బారీకేడ్లు ఏర్పాటు చేశారు. స్వామి వారి దర్శనానికి నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులందరికీ మహాద్వార దర్శనం ఉంటుంది. గురువారం తెల్లవారు జామున 4గంటల నుంచే భక్తుల దర్శనానికి అనుమతించనున్నారు. 22 ఎకరాల్లో పార్కింగ్ చిలుకూరుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాలను గుర్తించారు. ఆలయ అర్చకులు, పోలీసులు కలిసి ఆలయ పరిసరాల్లో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి అందులో వాహనాలు పార్కింగ్ చేసేందుకు చదును చేయించారు. ఆలయం సమీపంలో సుమారు 22 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అదనపు సర్వీసులు నూతన సంవత్సరం మొదటి రోజు చిలుకూరు బాలాజీ ఆలయానికి టీజీఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రతి రోజు మెహదీపట్నం నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయానికి 12 బస్సులు 60 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రతీ 12 నిమిషాలకు ఒక సర్వీసు ఉంటుంది. గురువారం అదనంగా మరో పది బస్సులను 50 ట్రిప్పులు నడుపుతామని మెహదీపట్నం డిపో మేనేజర్ కృష్ణమూర్తి తెలిపారు. భారీ బందోబస్తు చిలుకూరు బాలాజీ ఆలయానికి గురువారం భారీ సంఖ్యలో భక్తులు తరలిరానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు వంద మంది పోలీసులతోపాటు మరో వంద మంది వలంటీర్లతో బందోబస్తు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు జనవరి 1న చిలుకూరు బాలాజీని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశాం. మహా ప్రదక్షిణలు ఉండవు. భక్తులు నాలుగు వరసల్లో మహాద్వార దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశాం. –రంగరాజన్, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు -
నిర్లక్ష్యం చేస్తే సహించం
ఇబ్రహీంపట్నం రూరల్: జీహెచ్ఎంసీని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన శంషాబాద్ జోన్ పరిధిలోని ఆదిబట్ల సర్కిల్ కొంగరకలాన్, బొంగ్లూర్ ఔటర్సర్వీస్రోడ్డు సమీప ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లకు సూచించారు. నగర పారిశుద్ధ్య మెరుగుదలకు అన్ని స్థాయిల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రానున్న రోజుల్లో చెరువులు, నాలాలు, ఫుట్‌పాత్‌లు, పార్కుల క్లీనింగ్, వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్ద పేరుకుపోయిన చెత్త తొలగింపు పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ చంద్రకళ, డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ -
ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి
ఇబ్రహీంపట్నం: ఆర్య వైశ్యులందరూ రాజకీయంగా ఎదగాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. నగర సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై 2026 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి మాట్లాడారు. ఆర్యవైశ్యులకు రేవంత్ సర్కార్ అన్నివిధాల అండగా నిలుస్తుందన్నారు. మలక్‌పేట ఎమ్మెల్యేగా గతంలో తను కొనసాగినప్పుడు ఆర్కే పురంలోని అష్టలక్ష్మీ దేవాలయానికి సంపూర్ణ సహకారం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు టికెట్ల కేటాయింపులో తనవంతు సహకారం ఉంటుందన్నారు. అనంతరం ఆ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడారు. మున్సిపల్, జీహెచ్ఎంసీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్యవైశ్యులు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ఆర్ గణేశ్‌గుప్తా, చింతల రవికుమార్ గుప్తా, ఉప్పల శారద, పసునూరి శ్రీనివాస్‌గుప్తా, సురేష్‌గుప్తా, బిల్లకంటి కిరణ్కుమార్గుప్తా, ఎ వెంకటేశ్, కే మల్లిఖార్జున్, సామ్రాజ్యలక్ష్మీ, కే. సత్యనారాయణ, సురేష్, లక్ష్మణ్, రమేష్, లక్ష్మయ్య, రమాదేవిలు పాల్గొన్నారు. ఉన్నతి, శిక్ష ఫౌండేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ ఆమనగల్లు: తలకొండపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఉన్నతి అండ్ శిక్ష (యూఎస్) ఫౌండేషన్ నూతన క్యాలెండర్‌ను తహసీల్దార్ రమేశ్, ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర సుధాకర్‌రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బండి రఘుపతి, సభ్యులు శ్రీరాములు, రమేశ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
విధులకు ఎగనామం
హెచ్ఎం వేతనంలో కోత బషీరాబాద్: అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఎక్మాయి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సుప్రియ వేతనంలో అధికారులు కోత పెట్టారు. ఎవరి అనుమతి తీసుకోకుండానే బుధవారం ఆమె స్కూల్‌కు రాలేదు. మరో టీచర్ సౌమ్య కూడా సెలవులో ఉండడంతో పాఠశాల మూతపడింది. ఉదయమే వచ్చిన విద్యార్థులు ఆవరణలో ఆడుకుంటూ కనిపించడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. టీచర్లు రాలేదని చెప్పడంతో, ఫోన్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మైల్వార్ కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటయ్య ఎక్మాయి ప్రైమరీ పాఠశాల(హరిజన్వాడ)కు చేరుకుని విచారణ జరిపారు. హెచ్ఎం సుప్రియ రాలేదని తెలుసుకున్న మరో టీచర్ సౌమ్య మధ్యాహ్నం విధులకు హాజరయ్యా రు. కనీస సమాచారం ఇవ్వకుండా, విధు లను నిర్లక్ష్యం చేసిన సుప్రియ వేతనంలో ఒ కరోజు జీతం కోత విధించామని, ఎంఈఓ ఆదేశంతో ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రభు త్వ ఉపాధ్యాయులు విధులకు సరిగ్గా రాకుండా తమ పిల్లల జీవితాలలో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడ్డారు. -
ఆత్మహత్య చేసుకుంటున్నానని..
● డయల్ 100కు ఫోన్ ● వెంటనే స్పందించి కాపాడిన కానిస్టేబుల్స్ మహేశ్వరం: ఆత్మహత్య చేసుకుంటున్నానని డయల్ 100కు ఫోన్ చేసిన వ్యక్తిని మహేశ్వరం పోలీసులు కాపాడారు. ఈ ఘటన మండల పరిధిలోని కోళ్లపడకల్‌లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కేశంపేట మండలం కొత్తపేట్‌కు చెందిన గడ్డమీది కుమార్ ఘట్టుపల్లిలోని అత్తగారింటికి వచ్చాడు. భార్య, అత్తమామలో గొడవపడిన కుమార్ కోళ్లపడకల్–ఘట్టుపల్లి మార్గంలో చెట్లపొదల్లోకి వెళ్లి డయల్ 100కు కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పడంతో పోలీసులు నా లుగు నిమిషాల్లోనే అక్కడకు చేరుకుని బాధితుడి కాపాడారు. బాధితుడిని సురక్షితంగా కుటుంబ స భ్యులకు అప్పగించి గొడవ పడొద్దని సూచించారు. -
నయా జోష్!
ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని ఆయా మండలాల్లో నూతన సంవత్సర వేడుకలు బుధవారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. దీని కోసం చిన్నా, పెద్ద, యువత సిద్ధమయ్యారు. పాత సంవత్సరానికి వీడ్కోలు, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అర్ధరాత్రి వరకు వేడుకలు నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సాయంత్రం మార్కెట్లు, చికెన్, మటన్ దుకాణాలు, బేకరీల్లో కొనుగోలు దారులతో సందడి వాతావరణం నెలకొంది. ఇంటిముందు ముగ్గులు వేయడానికి మహిళలు రంగులను సిద్ధం చేసుకున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. పాత సంవత్సరానికి వీడ్కోలు చిన్న, పెద్ద తేడాలేకుండా అర్ధరాత్రి వరకు వేడుకలకు ఏర్పాట్లు -
బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం
యువకుడు దుర్మరణం మొయినాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మరో ప్రమాదం చోటుచేసుకుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ సమీపంలోని తాజ్ హోటల్ ఎదుట బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని మల్కాపూర్‌కు చెందిన బక్కారెడ్డి రఘునాథ్‌రెడ్డి(23) తండ్రి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. సాయంత్రం 3.20 గంటల సమయంలో తన బైక్‌పై మొయినాబాద్ నుంచి చేవెళ్ల వైపు ప్రయాణిస్తుంగా తాజ్ హోటల్ ఎదుట ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం(లారీ), బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడ్డ అతని తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మల్కాపూర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. -
అతివేగంతో అదుపుతప్పిన కారు
ఒకరు మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు మహేశ్వరం: అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహేశ్వరం ఠాణా పరిధి మెహబ్బత్‌నగర్ గేటు సమీపంలో శ్రీశైలం రహదారిపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. కందుకూరు మండలం నేదునూరుకు చెందిన సిరిగిరి ప్రవీణ్ చారి(38) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి 11 గంటలకు ప్రవీణ్ అతని స్నేహితులతో కలిసి కందుకూరు గేటు నుంచి స్విఫ్ట్ డిజైర్ కారులో హైదరాబాద్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మోహబ్బత్‌నగర్ గేటు సమీపంలోని సామ సంజీవరెడ్డి ఫంక్షన్ హాలు వద్దకు రాగానే కారును అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ప్రవీణ్ చారి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మాధవన్‌జీ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సాగునీరందించడమే లక్ష్యం
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని అన్ని మండలాలకు సాగునీరందించడమే లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సాక్షితో మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ప్రకటించగా, ఏడవ గ్యారంటీగా తను కల్వకుర్తికి సాగునీరందించనున్నట్లుగా చెప్పారు. పెండింగ్‌లోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ82 కాల్వ పనులను పూర్తి చేయించి ఆమనగల్లు, మాడ్గుల, వెల్దండ మండలాల్లో 35వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ఆయన చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలకు సాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు. నియోజక వర్గంలో ఈ ఏడాది దాదాపు రూ.600 కోట్లతో బీటీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ఆమనగల్లులో డివిజన్ కార్యాలయాల ఏర్పాటు, అపరిష్కృతంగా ఉన్న జూనియర్ కాలేజీ భవన నిర్మాణం చేపడతామని ఆయన పేర్కొన్నారు. తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో రూ.125 కోట్లతో చేపట్టే ఇంటిగ్రెటేడ్ స్కూల్ నిర్మాణ పనులను వచ్చే ఏడాదిపూర్తి చేయిస్తామన్నారు. తనపై విమర్శలు వచ్చిన వాటిని పట్టించుకోకుండా కల్వకుర్తి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని ఆయన వెల్లడించారు. -
నిషేధిత జాబితా నుంచి తొలగించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: రాందాస్‌పల్లి రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 41 పట్టా భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్ ఆధ్వర్యంలో బుధవారం రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్‌తో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం వారు కలెక్టర్‌తో రైతుల సమ్యలు వివరించారు. వారందరూ చిన్న, సన్నకారులేనని వారి భూములను నిషేధిత జాబితాలో ఉంచడం బాధాకరమన్నారు. యేండ్ల తరబడి ఈ సమస్య ఉందని, రెవెన్యూ సదస్సుల్లో కూడా రైతులందరూ అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారని గుర్తు చేశారు. వందల మంది రైతులు తమ భూములను సాగు చేసుకోలేక, అవసరాల కోసం అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారన్నారు. కనీసం రైతుబంధు, రైతుబీమా కూడా మంజూరు కావడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్‌ను కోరిన రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
పత్రీజీ ఆశయ సాధనకు కృషి చేయాలి
ధ్యానులతో కలిసి వేడుకల్లో పరిణిత ప్రతి తదితరులు కడ్తాల్: ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగ కారిణి, సత్యజ్ఞాన ప్రసాధిని అంటూ ధ్యాన జగత్తుకు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ నిరంతరం కృషి చేసేవారని ధ్యానగురువు పరిణిత పత్రి అన్నారు. మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రంలో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగాలు మంగళవారానికి పదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పత్రీజీ ఆశయ సాధనకు, ధ్యానమయ ప్రపంచ కోసం ప్రతి ధ్యాని, ప్రతి పిరమిడ్ మాస్టర్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు. -
వ్యక్తి అదృశ్యం
కేశంపేట: భార్యాభర్తలు గొడవపడటంతో భర్త అదృశ్యమైన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నక్క యాదయ్య, కేతమ్మ దంపతులు. సోమవారం పొలం వద్ద ఇద్దరూ గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన యాదయ్య ఎటో వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం యాదయ్య కుమారుడు నక్క గణేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యుడు జనార్దన్ దుద్యాల్: గణితంపై భయం వీడి ఆలోచనతో నేర్చుకోవాలని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యుడు జనార్దన్ సూచించారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని కుదురుమల్ల జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన గణిత మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన గణిత ఆకారాలను పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి పరిశీలించారు. అనంతరం జనార్ధన్ మాట్లాడుతూ.. గణిత శాస్త్రం అంటే విద్యార్థులకు తెలియని భయం ఉంటుంది. సూత్రాలను నేర్చుకుంటే గణితం సులువు అని చెప్పారు. విద్యార్థులు ధైర్యంగా గణితాన్ని నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పూర్ణచందర్ రావు, సర్పంచ్ లాలప్ప, ఉప సర్పంచ్ ఝాన్సీలక్ష్మి, మాజీ సర్పంచ్ రఘుపతి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జనార్ధన్ గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ విజయలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయ బృందం తరదితరులు పాల్గొన్నారు. నేటి అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు సాక్షి, సిటీబ్యూరో: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో బుధవారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి, సాధారణంగా ప్రతిరోజూ రాత్రి 11 గంటలకు ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి సర్వీ సు బయలుదేరుతుంది. కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ప్రారంభ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్, నాంపల్లి, ఫలక్‌నుమా, లింగంపల్లి తదితర స్టేషన్ల నుంచి ప్రయాణికుల డిమాండ్, రద్దీకి అనుగుణంగా ఎంఎంటీఎస్ రైళ్లు బుధవారం రాత్రి ఆలస్యంగా నడవనున్నాయని పేర్కొన్నారు. -
అశాసీ్త్రయంగా డివిజన్ల పునర్విభజన
అబుల్లాపూర్మెట్: జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల చేపట్టిన డివిజన్ల పునర్విభజన అశాసీ్త్రయంగా ఉందని పెద్దఅంబర్‌పేట, కుంట్లూర్ వార్డులకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. పెద్దఅంబర్‌పేటలో పార్టీ సీనియర్ నాయకుడు దండెం రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఈదమ్మల బలరాం, పలువురు మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారులు, ప్రభుత్వం అవగాహనారాహిత్యానికి డివిజన్ల విభజనే నిదర్శనమన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్దఅంబర్‌పేట, ఆదిబట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీలను ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసి చిన్నాభిన్నం చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి సోయి లేదా అని ప్రశ్నించారు. డివిజన్ల విభజన విషయంలో ఎన్ని అభ్యంతరాలు వినిపించినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. 52 వేల ఓటర్లతో పెద్దఅంబర్‌పేట, 12 వేల ఓటర్లతో కుంట్లూర్ డివిజన్లను విభజించడం చూస్తుంటేనే అధికారులు, ప్రభుత్వ పనితీరు అర్థమవుతోందన్నారు. రెండు డివిజన్లను నాగోల్ సర్కిల్లో కాకుండా సమీపంలో ఉన్న హయత్‌నగర్ సర్కిల్లో కలపాలని డిమాండ్ చేశారు. శాసీ్త్రయ పద్ధతితో డివిజన్ల పునర్విభజన చేపట్టాలని లేని పక్షంలో సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ సర్పంచ్ కళ్లెం ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాశం దామోదర్, మండల కోటేశ్వర్ రావు, బ్రహ్మానంద రెడ్డి, దేసారం బాలకృష్ణ గౌడ్, పిల్లి నగేష్ యాదవ్, గౌని భాస్కర్ గౌడ్, ఇర్ఫాన్, జోర్క రాము, శేఖర్, రవికాంత్, కర్ణాకర్, రాము, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ -
సంబరాలపై నిఘా
నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరుపుకొనేందుకు అంతా సిద్ధమయ్యారు. గ్రామాలు, పట్టణాల్లో యువతతోపాటు పిల్లలు, మహిళలు కొత్త సంబురాలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి వేడుకల నిర్వహణపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు, పెట్రోలింగ్, తనిఖీలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. నిబంధనలు అతిక్రమించి వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. – మొయినాబాద్ హైదరాబాద్ మహానగరంతోపాటు శివారు ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. నగర శివారుల్లోని మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి ప్రాంతాల్లో ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లు అధికంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లో డిసెంబర్ 31 రాత్రి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈసారి సైతం సంబరాలకు భారీ ఏర్పాట్లే జరుగుతున్నాయి. వేడుకలు నిర్వహించేవారు ముందుగానే పోలీసుల అనుమతి తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు పదిహేను రోజుల నుంచే చెబుతున్నారు. ఇప్పటి వరకు కొన్ని రిసార్ట్స్‌ల్లో నిర్వహించే వేడుకలకే అనుమతి తీసుకున్నట్లు తెలిసింది. ఫాంహౌస్‌ల్లో ఇప్పటి వరకు అనుమతులు తీసుకోలేదని సమాచారం. అయితే అనుమతి లేకుండా వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పాటించాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. పోలీసుల సూచనలు ● నూతన సంవత్సర వేడుకలకు ముందస్తు అనుమతి తీసుకోవాలి. ● రోడ్లు బ్లాక్ చేసి సంబరాలు నిర్వహించొద్దు. ● టపాసులు పేల్చొద్దు, డీజేలు నిషేధం. ● మైనర్స్‌కు వాహనాలు ఇవ్వొద్దు. ● మద్యం మత్తులో వాహనాలు నడపొద్దు. ● మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించొద్దు. ● ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు. ● ఇళ్లు, ప్రైవేటు ఆస్తులపై, వీధి దీపాలపై రాళ్లు వేడయం, అద్దాలు పగులగొట్టడం నేరం. ● ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ తీసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేయడం నేరం. ● నిషేధిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయి. ● మద్యం దుకాణాలు నిర్ణీత సమయంలోనే మూసి వేయాలి. ● మైనర్లకు మద్యం విక్రయించొద్దు. ● బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో మద్యం తాగితే కేసులు నమోదు. ● న్యూ ఇయర్ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు ఆర్థిక నష్టం కలిగించే అవకాశం ఉంది. ఆన్లైన్లో, అపరిచితులకు వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పిన్ నంబర్లు ఇవ్వొద్దు. విస్తృత తనిఖీలు డిసెంబర్ 31 రాత్రి జరిగే కొత్త ఏడాది వేడుకల సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనాల తనిఖీలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లో నిర్వహించే వేడుకల్లో డ్రగ్స్, విదేశీ మద్యం వినియోగించే అవకాశం ఉండటంతో వాటిపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయనున్నారు. కొత్త ఏడాది వేడుకలపై పోలీసుల నజర్ ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌పై ప్రత్యేక దృష్టి అనుమతి లేకుండా నిర్వహిస్తే కేసులు డ్రంకెన్ డ్రైవ్, వాహనాల తనిఖీలకు సిద్ధం హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరిక నూతన సంవత్సర వేడుకలు జరుపుకొనేవారు ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దు. పోలీసుల సూచనలు తప్పనిసరి పాటించాలి. ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌పై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. అనుమతి లేకుండా మద్యం వినియోగించినా.. డ్రగ్స్, గంజాయి వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటాం. – కిషన్, ఏసీపీ, చేవెళ్ల -
బీటెక్ విద్యార్థిని దుర్మరణం
అబ్దుల్లాపూర్‌మెట్: పరీక్షలు రాసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న గణేశ్‌తో కలిసి బండల హంసలేఖ (22), దీప్తి అనే ఇద్దరు విద్యార్థినులు పిగ్లీపూర్ గ్రామంలోని అన్నమాచార్య కళాశాలలో పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తున్నారు. బ్రిలియంట్ కమాన్ నుంచి ముకుంద డెయిరీ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హంసలేఖ, దీప్తి కిందపడగా, ఇదే సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ వెనుక చక్రాల కింద పడిన హంసలేక అక్కడికక్కడే చనిపోయింది. దీప్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గణేశ్‌కు సైతం గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మరో ఇద్దరికి గాయాలు లారీ చక్రాల కింద పడటంతో అక్కడికక్కడే మృత్యువాత రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం -
ఆటోలో పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత
పహాడీషరీఫ్: ఆటోలో మరిచిపోయిన విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌ను పహాడీషరీఫ్ పోలీసులు బాధితురాలికి సురక్షితంగా అందజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్ గ్రామానికి చెందిన షబానా భాను(55) మంగళవారం సాయంత్రం కిషన్బ్యాగ్లో ప్యాసింజర్ ఆటో ఎక్కి పహాడీషరీఫ్‌లో దిగింది. ఆ సమయంలో తులం బంగారం, రూ.10 వేల నగదు ఉన్న బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయింది. ఇంటికి వెళ్లాక గమనించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వెంటనే ఆటో స్టాండ్‌కు వెళ్లి వాకబు చేయగా మహ్మద్ అమీర్ హుస్సేన్ ఆటోలో బ్యాగ్ లభ్యమైంది. విషయాన్ని ఆటోడ్రైవర్ కూడా గమనించలేదు. ఈ సందర్భంగా పోలీసులు బ్యాగ్‌ను బాధితురాలికి అందజేశారు. మొయినాబాద్: బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి, హత్యచేసిన వ్యక్తికి న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.21 వేల జరిమానా విధించింది. కేసు విచారణ చేపట్టిన రాజేంద్రనగర్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువర్చింది. మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద మండలం శాంతినగర్‌కు చెందిన వడ్ల సంతోష్ మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరులో నివాసం ఉంటూ దుస్తుల వ్యాపారం చేసేవాడు. 2016 డిసెంబర్ 4న చిలుకూరు గ్రామానికి చెందిన మైనర్ బాలుడు(9)పై అత్యాచారం చేసి, హత్య చేశాడు. శవాన్ని నీటి ట్యాంకులో వేశాడు. బాలుడు కనిపించడం లేదని స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడు హత్యకు గురైనట్లు గుర్తించారు. నిందితున్ని అరెస్టు చేసి విచారణ చేపట్టడంతో బాలున్ని ప్రలోభపెట్టి లైంగిక దాడికి పాల్పడి హత్యచేసినట్లు తెలిసింది. ఈ కేసును రాజేంద్రనగర్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. సతోష్ నేరస్తుడని సాక్ష్యాధారాలతో రుజువు కావడంతో జీవిత ఖైదు విధించింది. మీర్‌పేట: సుంకం చెల్లించకుండా (నాన్ డ్యూటీ పెయిడ్) ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మీర్‌పేట ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి సరూర్‌నగర్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఏఈ ఎస్.జీవన్ ఆధ్వర్యంలో మంగళవారం పహాడీషరీఫ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో గోవా, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న 229 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని, 12 మందిపై కేసులు నమోదు చేశారు. ● ఒకరి అరెస్టు ● 15 కిలోల మాంసం, తల స్వాధీనం అత్తాపూర్: జింక మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సులేమాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫానుద్దీన్ జింక మాంసం అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అతడి షాప్‌పై దాడి చేసి 15 కిలోల జింక మాంసం, జింక తల, జింక తోలు, రూ. 3500 నగదును స్వాధీనం చేసుకున్నారు. పెబ్బేరు నుంచి జింకలను నగరానికి తీసుకువచ్చి స్థానికంగా వధించి రూ.800కు కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను పెబ్బేరుకు చెందిన ఆలీ అనే వ్యక్తి వద్ద జింకలను కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. అత్తాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న జింక మాంసం, తలను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఇర్ఫానుద్దీన్కు జింకలను విక్రయిస్తున్న ఆలీ కోసం గాలింపు చేపట్టారు. అతడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఫ్యూచర్’లోకి ఆ ఠాణాలు
చేవెళ్ల: డివిజన్లోని ఐదు పోలీస్స్టేషన్లు కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ పరిధిలోకి మారాయి. డివిజన్లో ఒక డీసీపీ, రెండు ఏసీపీ, ఆరు పోలీస్స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. ప్రస్తు తం చేవెళ్ల ఏసీపీ ఒకటి ఉండగా కొత్తగా మొయినాబాద్ ఏసీపీ స్థానం ఏర్పాటైంది. ఈ రెండు ఏసీపీల పరిధితో డీసీపీ స్థానం మొయినాబాద్ పేరుతో ఏర్పడింది. చేవెళ్ల, మోకిల, శంకర్పల్లి పోలీస్స్టేషన్లు చేవెళ్ల ఏసీపీ పరిధిలోకి.. మొయినాబాద్, షాబాద్, శంషాబాద్‌లోని పెద్దషాపూర్ మొయినాబాద్ ఏసీపీ పరిధిలోకి రానున్నాయి. కాగా, కొత్తగా ఏర్పాటవుతున్న ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి రానున్న మూడు కొత్త డీసీపీలు ఆయా నియోజకవర్గాల పేరుతో ఏర్పాటవుతుండగా చేవెళ్ల డీసీపీ మాత్రం మొయినాబాద్ పేరుతో రావటంపై అన్ని పార్టీల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల పేరు లేకపోవడంపై చర్చించుకుంటున్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న కమిషనరేట్‌ను, డీసీపీలు, ఏసీపీల పరిధిని స్వాగతిస్తున్నట్టు అధికార పార్టీ నాయకులు తెలిపారు. అదే క్రమంలో చేవెళ్ల పేరుపై మాత్రం ఎమ్మెల్యే కాలె యాదయ్య దృష్టికి తీసుకెళ్లి పోలీస్ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రిని కలిసి చర్చించేలా.. చేవెళ్ల డీసీపీగా కొనసాగించేలా చూస్తామని చెబుతున్నారు. -
‘ఫ్యూచర్’ కమిషనరేట్ ప్రారంభం
ఇబ్రహీంపట్నం పీఎస్ సందర్శనఇబ్రహీంపట్నం రూరల్: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ను రాష్ట్రంలోనే ఉత్తమ కమిషనరేట్ గా తీర్చిదిద్దుతామని సీపీ సుధీర్‌బాబు అ న్నారు. కలెక్టరేట్ మొదటి అంతస్తులో ఏర్పా టు చేసిన ఫ్యూచర్ సిటీ నూతన కమిషనరేట్ కార్యాలయాన్ని మంగళవారం సా యంత్రం ఆయన ప్రారంభించారు. అనంతరం మొద టి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచ దేశాలకుతెలిసేలా ప్రభు త్వం ఇటీవల గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కొత్తగా నాలుగు పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేసిందని వివరించారు. ఇందులో భాగంగా ప్రాంభమైన ఫ్యూచర్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షిస్తామని, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ వ్య వస్థలతో కలిసి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పని చేస్తామని తెలిపారు. విజబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్సిబులిటీతో మంచి సేవలందిస్తామన్నారు. కమిషనరేట్ పరిధిలో 22 పోలీస్ స్టేషన్లు ఉంటాయని వెల్లడించారు. మూడు జోనల్ డీసీపీలు, ఎస్ఓటీ, క్రైం, ట్రాఫిక్ బృందాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. వరల్డ్ క్లాస్ కమిషనరేట్ భవనం నిర్మించిన తర్వాత సొంత భవనంలో నుంచి సేవలందిస్తామన్నారు. మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ జానకిరెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐలు రవికుమార్, మహేందర్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, నందీశ్వర్‌రెడ్డి, మధు తదితరులు నూతన సీపీకి పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఇబ్రహీంపట్నం: శాంతియుతవాతావరణం నెలకొల్పడంలో, సమాజాభివృద్ధిలో పోలీసులదే కీలకపాత్ర అని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. కలెక్టరేట్లో కమిషనరేట్ కార్యాలయాన్ని ప్రారంభించి, బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. వివిధ అంశాలపై పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్‌రెడ్డి ఉన్నారు. -
వెలుగులు.. మరకలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూ బాధితులకు ఈ ఏడాది కూడా నిరీక్షణ తప్పలేదు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో జూన్ 2న భూ భారతి పోర్టల్ తీసుకొచ్చింది. అంతకు ముందే ఊరూరా సదస్సులు నిర్వహిహి ంచి అవగాహన కల్పించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ధరణి పోర్టల్ తీసుకురాగా, రెండు లక్షల అర్జీలు వచ్చాయి. వీటిలో 1.80 లక్షల వినతులను క్లియర్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 17,646 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి లోపభూయిష్టంగా ఉందని పేర్కొంటూ.. ఆర్ఓఆర్–2025 తీసుకొచ్చి ధరణి స్థానంలో భూ భారతి అందుబాటులోకి తెచ్చింది. కొందుర్గు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. గ్రామ సదస్సుల్లో భాగంగా 21 వేలకుపైగా అర్జీలు స్వీకరించింది. ఇప్పటికీ మెజార్టీ దరఖాస్తులు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ బాధితులు ఏడాదిగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా వారికీ నిరీక్షణ తప్పడం లేదు. వైద్య ఆరోగ్యశాఖకు తీరని మచ్చ కొత్తపేట అలకనంద ఆస్పత్రి వేదికగా కిడ్నీ మార్పిడీ చికిత్సల రాకెట్ జనవరిలో వెలుగు చూసింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు, స్వీకర్తలను రప్పించి ఎలాంటి అనుమతులు పొందకుండా గుట్టుగా చికిత్సలు చేసింది. కొత్తపేటలో తీగలాగితే.. శ్రీలంకలో డొంక కదిలింది. అప్పట్లో ఈ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఈ కిడ్నీ రాకెట్ స్కాం.. మాయని మచ్చని మిగిల్చింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందాల వరుస తనిఖీలతో నకిలీ వైద్యుల చలామణి ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. విషాదం నింపిన ‘భూమిక’ కేశంపేట మండలం వేములనర్వ్కు చెందిన మన్నాడ విజయలక్ష్మి అలియాస్ భూమిక(36) మే మూడో వారంలో ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందింది. ఉస్మానియా విశ్వవిద్యాయలంలో పీజీ చేస్తూ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆమె ఆదివాసుల కష్టాలను చూసి చలించిపోయింది. 2013–14లో అజ్ఞాతంలోకి వెళ్లి 12 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పని చేసి.. చివరకు ఈ ఏడాది ఎన్కౌంటర్లో కన్నుమూసింది. తెలంగాణ ఉద్యమంలో ఆమెతో కలిసి ఓయూ మిత్రులు దిగిన ఫొటోలు ఆమె మరణం తర్వాత సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సంక్షేమం నిర్వీర్యం సంక్షేమం లేక ఆ శాఖలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి.ఒకప్పుడు వివిధ సంక్షేమ పథకాల ప్ర కటన, లబ్ధిదారులతో కళకళలాడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖలు ఈ ఏడాది కేవలం విద్యార్థుల ఉపకార వేతనాల మంజూరు, వసతి గృహాల కు నిత్యావసరాల పంపిణీకే పరిమితమయ్యాయి. వ్యవసాయం, హార్టికల్చర్, పశు సంవర్థకశాఖల్లో ఆశించిన ప్రగతి లేదు. మైనింగ్ విభాగం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాలేదు. కళ్లముందే ఖరీదైన మైనింగ్ కరిగిపోతున్నా.. రాయల్టీ చెల్లించకుండా కంకర, రోబోసాండ్, మట్టి అమ్మకాలు జరుగుతున్నా పట్టించుకోలేదు. మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం.. అంతకు మించి అక్రమ వసూళ్లు ఈ ఏడాది ఆ శాఖను పూర్తిగా వెనుకబడేలా చేశాయి. కొంత మోదం.. మరికొంత ఖేదం కొన్ని పరిణామాలు జిల్లా ప్రజలకు తీపిని పంచితే.. మరికొన్ని చేదును మిగిల్చాయి. ఎప్పటిలాగే 2025 సైత కొంత మోదం.. కొంత ఖేదం అన్నట్లుగా సాగింది. 200 యూనిట్లలోపు గృహాలకు ఉచిత విద్యుత్ సరఫరా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపగా.. వివిధ ప్రాజెక్టుల పేరుతో చేపట్టిన భూ సేకరణ అనేక మందికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ముఖ్యంగా పారిశ్రామికవాడలు, గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులు రైతులను ఆందోళనకు గురి చేశాయి.


