Ranga Reddy District News
-
రోడ్డు కోసం రోడ్డున పడేయొద్దు
కొందుర్గు: ‘రోడ్డు వేయడానికి మేము అడ్డు చెప్ప డం లేదని.. కానీ మా భూములు లాక్కొని మా కు టుంబాలను రోడ్డున పడేయకండి సారూ’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రేడియల్ రోడ్డు–2 నిర్మాణంలో భాగంగా మంగళవారం మండలంలోని ముట్పూర్, ఉమ్మెంత్యాల, జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని లచ్చంపేటలో గ్రామసభలు ఏర్పా టు చేశారు. ఆయా సభలకు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పచ్చని పంట పొలాల్లో నుంచి రోడ్లు వేస్తే తమ బతుకులు సాగేదె లా అని ప్రశ్నించారు. భూములకు బదులు భూము లు ఇవ్వాలని లేదంటే తాము ఎక్కడైనా భూములు కొనేందుకు వీలుగా బహిరంగ మార్కెట్లో పలుకుతున్న ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల అభిప్రాయాలు రికార్డు చేసుకున్నామని, వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఆర్డీఓ సరిత, తహసీల్దార్లు అజాం అలీ, జగదీశ్వర్, డిప్యూటీ తహసీల్దార్ నివేదిత రెడ్డి, సర్వేయర్ ఆంజనేయులు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు అంజయ్య, జ్యోతి పాల్గొన్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు షాద్‌నగర్: పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన శివపార్వతుల కల్యాణోత్సవానికి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, మున్సిపల్ చైర్మన్ బస్వం, నాయకులు కృష్ణ, పెంటయ్య, దామోదర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఒగ్గు కిషోర్, పెద్ది రామ్మోహన్, కానుగు భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో టేకోవర్‌పై సీఎం సమీక్ష
● త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం ● ఇక ఏప్రిల్‌లోనే మెట్రో స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: మెట్రో టేకోవర్‌పై మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్న తాధికారులతో సమీక్షించారు. టేకోవర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మార్చి 31వ తేదీ లోపు మెట్రో మొదటి దశ టేకోవర్‌కు ప్రభుత్వం గడువు విధించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ గడువులోగా స్వాధీన ప్రక్రియ పూర్తి కాకపోవడం రుణాల చెల్లింపులపైనా స్పష్టత లేకపోవడంతో జాప్యం నెలకొంది. ఈ క్రమంలో సీఎం మెట్రో టేకోవర్పైన సమీక్షించారు. మార్చి 31వ తేదీ గడువు ముగిసినందున ఇక ఏప్రిల్‌లో అది పూర్తయ్యే అవకాశముంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో నిర్మించిన మెట్రో మొదటి దశ నిర్వహణ భారం దృష్ట్యా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా కొనసాగలేమంటూ గతేడాది సెప్టెంబర్‌లో ఎల్అండ్టీ సంస్థ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకొనేందుకు ముందుకు వచ్చింది. మెట్రో రెండోదశ నిర్మాణానికి ఎదురైన సాంకేతిక ఆటంకాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొంది. అప్పటి నుంచి వివిధ దశల్లో చర్చలు, సమీక్షలు జరిగాయి. ఆర్థిక అంచనాలపై ఐడీబీఐ, సాంకేతిక అంశాలపై ఢిల్లీ మెట్రోరైల్ సంస్థలు సమగ్రమైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేశాయి. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన రూ.13 వేల కోట్లను తక్కువ వడ్డీతో రీఫైనాన్స్ చేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఎల్అండ్ టీకి అందజేయాల్సిన రూ.2 వేల కోట్ల పెండింగ్ బకాయిలను ప్రభుత్వమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం కూడా లభించింది. రుణాల చెల్లింపుతోపాటు ఎల్అండ్ టీ ఈక్విటీ చెల్లింపు వంటి ప్రక్రియలను త్వరలో పూర్తి చేసి ప్రాజెక్టును స్వాధీనం చేసుకోనున్నారు. దాచిన 13 ఎల్పీజీ సిలిండర్ల పట్టివేత శంషాబాద్: వంటగ్యాస్ కొరతే అక్రమార్కులకు వరమైంది. శంషాబాద్ సర్కిల్లో మంగళవారంరాత్రి టాస్క్‌ఫోర్స్ దాడుల్లో పక్కదారి పట్టిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, పెట్రోలు పట్టుబడింది. వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో రవి అనే కిరాణా వ్యాపారి ఇంట్లో దాచిన 13 ఎల్పీజీ సిలిండర్లు, సుమారు ఎనభై లీటర్ల పెట్రోలును టాస్క్ ఫోర్సు అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. అతడిపై గతంలో ప్రజాపంపిణీ బియ్యం విక్రయానికి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. అగ్ని ప్రమాదం రెండు ద్విచక్ర వాహనాలు, ఆటో దగ్ధం చందానగర్: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో విద్యుదాఘాతం ఏర్పడటంతో కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండనగర్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ఆటో, రెండు ద్విచక్రవాహనాలకు మంటలంటుకుని దగ్ధమయ్యాయి. పక్కన ఉన్న రెండు భవనాలు మంటలకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెంటనే బస్తీ ప్రజలు స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ సంఘటనాస్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడి త్వరతగతిన విద్యుత్‌ను పునరుద్ధరించాలని కోరారు. -
వీధి కుక్కల దాడిలో మేకలు మృత్యువాత
చేవెళ్ల: మేకల మందపై వీధి కుక్కలు దాడి చేయడంతో 18 మేకలు మృతి చెందాయి. మరో నాలుగు త్రీవంగా గాయపడ్డాయి. ఈ సంఘటన మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లిలో చోటు చేసుకుంది. బాధితుడు కకంటి శ్రీశైలం, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవునిఎర్రవల్లికి చెందిన కంకంటి శ్రీశైలం తనకున్న 23 మేకలను మేపుకొంటూ జీవిస్తున్నాడు. గ్రామ సమీపంలోని పొలం వద్ద షెడ్లో ప్రతిరోజు రాత్రి వాటికి కాపలాగా పడుకునేవాడు. సోమవారం రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉన్న అతడు వర్షం పడే సూచన ఉండటంతో షెడ్‌కు తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం వచ్చి చూసే సరికి 18 మృతి చెంది, మరో నాలుగు గాయాలతో కనిపించాయి. వీధి కుక్కలు దాడి చేసి మేకలను ఇష్టానుసరంగా కొరికి చంపేశాయి. బాధితుడు లబోదిబోమంటూ వెట ర్నరీ వైద్యులకు సమాచారం అందించాడు. చేవెళ్ల వెటరర్నీ వైద్యుడు డాక్టర్ తిరుపతిరెడ్డి వచ్చి పరిశీలించాడు. గాయపడ్డ వాటికి వైద్యం చేశారు. వాటి పరిస్థితి కూడా విషమంగానే ఉందని తెలిపారు. రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. -
ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాలి
ఇబ్రహీంపట్నం: కులాంతర వివాహాలు చట్ట విరుద్ధం కాదని, ఆదర్శ వివాహాలను పౌర సమాజం ప్రోత్సహించాలని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు అన్నారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో మంగళవారం చిట్టంపల్లి ప్రసాద్, ఆకుల జయశ్రీల కులాంతర వివాహాన్ని కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆయన కులాంతర వివాహం చేసుకుంటున్న జంటకు పూలదండలు మార్పించి, ప్రమాణ ప్రతాలు చదివించారు. ఈ సందర్భంగా స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. వివాహానికి కులం, మతం అడ్డుగోడలుగా నిలువద్దన్నారు. కుల, మతాంతర వివాహాలు చేసుకున్న వారిపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలను అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కులం కంటే గుణం, మతం కంటే మానవత్వం గొప్పగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సామేల్, కార్యదర్శి ప్రకాశ్ కారత్, ఉపాధ్యక్షుడు అరుణ్‌కుమార్, ప్రముఖ కవి బండి సత్తన్న, ముసలయ్య, పురుషోత్తం, ఆనంద్, స్వప్న, యాదయ్య, కిరణ్, అశోక్ పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
షాబాద్: విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టు కాలనీకి చెందిన సాయికుమార్‌గౌడ్ (35) మంగళవారం నాగరకుంట సమీపంలో మామిడి తోటలో మామిడికాయలు తెంపుతున్నాడు. చెట్టు మధ్యలో విద్యుత్ వైర్లు ఉండడంతో ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సాయికుమార్‌గౌడ్ రెండేళ్లుగా మండల పరిధిలోని హైతాబాద్ వెల్స్పన్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీ కేసులో నిందితులకు రిమాండ్
మొయినాబాద్‌రూరల్: ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి వస్తువులను దొంగలించిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మార్చి 26న రాత్రి బి.శ్రీనివాస్ అలియాస్ శ్రీను, మేకల శివకుమార్ కలిసి కాశీంబౌలిలోని ఓ ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బంగారం, వెండి వస్తువులను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మొయినాబాద్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుల నుంచి బంగారం, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. -
రంజిత్‌రెడ్డికి సీఎం పరామర్శ
చేవెళ్ల: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిని పరామర్శించారు. రంజిత్‌రెడ్డి తల్లి చంద్రకళ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో నగరంలోని వారి ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు. చంద్రకళ చిత్రపటం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. డాక్టరేట్ ప్రదానం షాద్‌నగర్ రూరల్: దేశ రాజధాని న్యూఢిల్లీలో వరల్డ్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రొటెక్షన్ కమిషన్ సభ్యుడిగా మ్యాగ్నెట్ విద్యాసంస్థల అధినేత ఎండీ వాజీద్ పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయనకు గౌరవ డాక్టరేట్ అందజేసి సత్కరించారు. యువతి అదృశ్యం షాబాద్: ఓ యువతి అదృశ్యమైన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రమే ష్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన మేకల వెంకటయ్య కూతురు భావన (20) ఈ నెల 30న ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసింది. అర్ధరాత్రి తండ్రికి మెలకువ వచ్చి చూడగా కూతురు కనిపించలేదు. చుట్టు పక్కల, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు ఆమె ఒంటిపై పింక్ కలర్ టాప్, వైట్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపాడు. అదే గ్రామానికి చెందిన పసుల శ్రీకాంత్ అనే యువకుడిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో .. మొయినాబాద్‌రూరల్: యువతి అదృశ్యమైన సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌కు చెందిన తోక భార్గవి (19) ఈ నెల 30న ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పనికి వెళ్లిన తల్లి వచ్చి చూడగా కూతురు కనిపించకపోవడంతో బంధువులు, స్నేహితులు, చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కనుల పండువగా కల్యాణం
మొయినాబాద్: పచ్చని తోరణాలు.. పూల పందిరి.. మంగళవాయిద్యాలు.. వేద పండితుల మంత్రోశ్చరణల మధ్య వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చిలుకూరు బాలా జీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అర్థరాత్రి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ సోనియా దర్శన్, వైస్‌చైర్మన్ గరుగు రాజు, కౌన్సిలర్లు శ్రీలత రాంచందర్, జగపతి, శిరీష కిరణ్, అనసూయ నర్సింహ దంపతులు స్వామివారు, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి దేవాలయం సమీపంలోని మండపంలో వేంచేయించారు. అనంతరం అమ్మవార్లను సైతం ఊరేగింపుగా స్వామివారి చెంతకు తీసుకెళ్లి ఎదురుకోళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు నృత్యాలు చేస్తూ కార్యక్రమాన్ని రక్తికట్టించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఆలయ గర్భగుడి వెనకభాగంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో ఆసీనులను చేశారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ముందుగా విశ్వక్సేనుని ఆరాధించి శుద్ధివచనం, పుణ్యహవచనాలు నిర్వహించారు. మంగళవారం స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అమ్మవార్లను జగవాహనంపై గ్రామంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, పరవాస్తు రామాచారి, నరసింహన్, కన్నయ్య, కిట్టు, మురళి, సురేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
యువత దేశానికి వెన్నెముక
● డ్రగ్స్‌కు బానిసలు కావొద్దు ● ఎస్పీ స్నేహ మెహ్ర కొడంగల్: నేటి యువత దేశానికి వెన్నెముకలా వ్యవహరించాలని, యువశక్తిని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్ మాఫియా పన్నుతున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అరైవ్ –అలైన్, డ్రగ్స్ నివారణ అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. పలువురికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డ్రగ్స్ ఊబిలో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరా గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. వివరాలు తెలిపిన వారి పేర్లు అత్యంత గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ప్రతిరోజూ ఉపాధి కోసం బయటకు వెళ్లే వ్యక్తులు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకోవడమే అర్రైవ్–అలైన్ ప్రాజక్టు ప్రధాన లక్ష్యమని అన్నారు. వాహనదారులు, డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. డ్రైవింగ్ చేసే సమయంలో కంటి చూపు స్పష్టంగా ఉండడం అత్యంత కీలకమన్నారు. డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. తద్వారా ప్రమాదాలు నివారించేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములునాయక్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ, ఎంవీఐ వసంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రగతి ప్రణాళిక’ను పక్కాగా చేపట్టాలి
కందుకూరు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనులను పకడ్బందీగా చేపట్టాలని డీఆర్డీఓ శ్రీలత ఆదేశించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మంగళవారం ఆమె పర్యటించారు. ముందుగా కొత్తూర్‌లోని నర్సరీ, ఈజీఎస్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మీర్ఖాన్పేటలో ప్రభుత్వ భవనాలను సందర్శించి పలు సూచనలు చేశారు. నర్సరీ, పల్లె ప్రకృతి వనం, కంపోస్టు యాడ్, కమ్యూనిటీ ప్లాంటేషన్, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ముచ్చర్లలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. వెటర్నరీ, వైద్య ఆరోగ్యశాఖ సబ్ సెంటర్ భవనాలను సందర్శించి పనుల ప్రగతిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళికలో భాగంగా పూర్తి చేయాల్సిన పనులను వేగవంతం చేయాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం తగదన్నారు. ఆమె వెంట ఎంపీడీఓ సరిత, ఎంపీఓ గీత, ఏపీఓ రవీందర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
108 అంబులెన్స్ తనిఖీ
కందుకూరు: మండల కేంద్రంలో 108 అంబులెన్స్ వాహనాన్ని మంగళవారం జిల్లా అంబులెన్స్ నిర్వహణాధికారి రాజాబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుతో పాటు వారి పని తీరును పరిశీలించారు. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా ఉందా లేదా అని పర్యవేక్షించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటు లో ఉంటూ అత్యవసర సమయంలో ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి వారి వద్దకు చేరు కోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో 108 సిబ్బంది సురేందర్, షఫీ పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి మంచాల: అభివృద్ధి పనుల నిర్వహణలో నాణ్యత పాటించాలని ఈఈ (పీఆర్) సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆరుట్ల, మంచాల గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులు, మంచాలలో స్కూల్ భవన నిర్మాణ పనులు, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం మంచాల పంచాయతీ కార్యాలయం, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం పనులు చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎంవీ ప్రసాద్, ఎంపీడీఓ బాలశంకర్, ఎంపీఓ ఉమారాణి, ఆయా పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిలో బోర్డు ఏర్పాటు హయత్‌నగర్: అబ్దుల్లాపూర్‌మెట్టు మండలం మునుగనూరు సర్వే నంబర్ 44లోని ప్రభుత్వ భూమిలో మంగళవారం రెవెన్యూ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించి బోరు వేసి నిర్మాణం చేసేందుకు ప్రయత్నించడంతో సమాచారం అందుకున్న జీపీఓ సుప్రియ ఆక్రమణదారులను హెచ్చరించారు. అయినా వారు పనులను కొనసాగిస్తుండంతో బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రభుత్వ భూములను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని, ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. షాద్‌నగర్ చౌరస్తా పరిశీలన షాద్‌నగర్: పట్టణ చౌరస్తాను మంగళవారం హెచ్ఎండీఏ అధికారులు మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వంతో కలిసి పరిశీలించారు. ఎక్కడి వరకు విస్తరించవచ్చు అన్న విషయంపై ఆరా తీశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, కౌన్సిలర్లు అప్పి, పెంటయ్య, దిలీప్, నాయకులు ముబారక్, సాధిక్, మహబూబ్ తదితరులు ఉన్నారు. -
పట్టా భూములు ఇచ్చేది లేదు
కందుకూరు: పట్టా భూములు ప్రభుత్వానికి ఇచ్చేది లేదని తిమ్మాయిపల్లి రైతులు తేల్చి చెప్పారు. ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిధిలోని అన్నోజిగూడలో తిమ్మాయిపల్లి రెవెన్యూ సర్వే నంబర్లు 1 నుంచి 13 వరకు ఉన్న పట్టా భూములు 63 ఎకరాలతో పాటు సర్వే నంబర్లు 14, 15లో ఉన్న ప్రభుత్వ భూమిని సేకరించడానికి గ్రామసభ నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు భూములు ఇచ్చి సహకరించాలని ఈ సందర్భంగా ఆర్డీఓ వారికి సూచించారు. న్యాయమైన పరిహారం అందుతుందని తెలిపారు. కొద్ది విస్తీర్ణంలో ఉన్న పట్టా భూములను తీసుకుంటే తాము ఏవిధంగా జీవించాలో చెప్పాలని రైతులు వాపోయారు. అసైన్డ్ భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని పట్టా భూములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని స్పష్టం చేశారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీఓ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, డీఏ శంషొద్దీన్, సీఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్ సురేష్, ఉప సర్పంచ్ ఢిల్లీ పద్మకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తేల్చి చెప్పిన రైతులు -
ఎవరి వాటా వారికే!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆస్తుల అసెస్మెంట్లో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అడిగినంత ముట్టజెప్పిన వారికి ఒకలా.. లేని వారికి మరోలా పన్నులు వేస్తున్నారు. ఒకే తరహా ఆస్తికి రెండు రకాలు వసూలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా పట్టణ, గ్రామాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షించాల్సిన జిల్లా అధికారులు ఆఫీసు గేటు దాటి బయటికి తొంగి చూడటం లేదు. ఏదైనా ఫిర్యాదు అందితే మినహా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా 111 జీఓ పరిధిలోని మున్సిపాలిటీలు సహా పంచాయతీల్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కళ్లముందే అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా కళ్లప్పగించి చూడటం, తర్వాత ఇంటి నంబర్ల కేటాయింపు, ఆస్తుల అసెస్మెంట్ పేరుతో ఒక్కో నిర్మాణం నుంచి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా వసూలైన మొత్తంలో సంబంధిత జిల్లా స్థాయి అధికారులకు సైతం వాటాలు అందుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోకపోగా..పరోక్షంగా సహకరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటికి పాత తేదీల్లో కొత్తగా ఇంటినంబర్లు జారీ చేస్తున్నారు. ఆస్తుల అసెస్మెంట్ పేరుతో స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాల్స్, వ్యాపార, వాణిజ్య సముదాయాల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లను సైతం డొమెస్టిక్ విభాగంలో నమోదు చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో వసూళ్లు అంతంతే.. ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, కొత్తూరు, షాద్‌నగర్, శంకర్పల్లి, చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీల పరిధిలో 50 వేలకుపైగా గృహాలు, ఐదు వేలకుపైగా వాణిజ్య, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వీటి నుంచి ఆశించి నస్థాయిలో పన్నులు వసూలు కావడం లేదు. ఇక్కడ ఆస్తిపన్ను వసూళ్లు ఇప్పటి వరకు 75 శాతం కూడా మించలేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆస్తుల అసెస్మెంట్స్, హోర్డింగులు, ట్రేడ్ లైసెన్సులు, భవన నిర్మాణాలకు అనుమతుల జారీ రూపంలో వచ్చే నిధులు సిబ్బంది జీతభత్యాలకే సరిపోతుంది. డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు, మంచినీటి పైపు లైన్లు, పార్కుల వంటి చిన్నచిన్న అవసరాలకు ప్రభుత్వం వద్ద చేయి చాచాల్సి వస్తోంది. షాద్‌నగర్, ఆమనగల్లు, కొత్తూరు మున్సిపాలిటీలకు అతి తక్కువ ఆదాయం సమకూరుతోంది. వచ్చిన ఆదాయం సిబ్బంది వేతనాలకు కూడా సరిపోవడం లేదు. అభివృద్ధి పథకాలపై ప్రభుత్వంపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. ఇక శంషాబాద్ మున్సిపాలిటీలో పన్నులను రెట్టింపు వడ్డిస్తున్నారు. ఇది పూర్తిగా 111 జీవో పరిధిలో ఉండడం, నిర్మాణాలకు అనుమతులు లేకపోవడమే కారణం. ఇల్లీగల్ భవనాలకు అపరాధ రుసుంతో వడ్డిస్తున్నారు. ఫలితంగా ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే ఇక్కడ ఆస్తిపన్ను డబుల్ అవుతోంది. అయినా నిధుల కొరత తప్పడం లేదు. ఇటీవల కొత్తగా ఏర్పడిన మొయినాబాద్, చేవెళ్లలో నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆస్తుల అసెస్మెంట్లో చేతివాటం 141 పంచాయతీల్లో వందశాతం వసూళ్లు జిల్లాలో 526 పంచాయతీలు ఉండగా, వీటిలో 2,70,708 ఆస్తులు ఉన్నాయి. అసెస్మెంట్, ఆస్తి పన్ను వసూళ్ల ద్వారా ఆయా పంచాయతీల ఖాతాల్లోకి మొత్తం రూ.78,06,021 నగదు వచ్చి చేరింది. ఇదిలా ఉంటే ఆస్తిపన్ను వసూళ్లు 141 గ్రామ పంచాయతీల్లో వందశాతం దాటడం విశేషం. 15వ ఆర్థిక సంఘం నుంచి మూడు విడతల్లో ఆయా పంచాయతీల ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఒక్కో పంచాయతీలో రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నిధులు ఉన్నాయి. ఆస్తిపన్ను వసూళ్ల ద్వారా ఖాతాలో నిల్వలు మరింత పెరిగిపోయాయి. ఇతర పంచాయతీలతో పోలిస్తే అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లీపూర్‌లో 57 శాతం, చేవెళ్ల మండలం రేగడిఘనపూర్ 55 శాతం, కేశంపేట మండలంలోని వేములనర్వ్లో 47 శాతం ఆస్తిపన్ను వసూళ్లతో వెనుకబడి ఉండటం కొసమెరుపు. పంచాయతీ ఖాతాల్లో పుష్కలంగా నిధులు ఉండటంతో వీటిని కొల్లగొట్టేందుకు పలువురు కార్యదర్శులు అడ్డ దారులు తొక్కుతున్నారు. గతంలో చేయని పనులకు చేసినట్లు నకిలీ బిల్లులు పెడుతున్నట్లు ఫిర్యాదులు లేకపోలేదు. -
‘ప్రజా పాలన’ను జయప్రదం చేయాలి
చేవెళ్ల: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యాచరణ పనులు పక్కాగా జరగాలని మున్సిపల్ ప్రజాపాలన ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి అన్నారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంగళవారం ఆమె మున్సిపల్ కమిషనర్ వెంకటేశంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ఉన్న యాక్షన్ ప్లాన్, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అన్నిశాఖల అధికారుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా వార్డు అధికారులు పాల్గొన్నారు. -
అధికారం కాదు.. కమ్యూనిస్టులే శాశ్వతం
● ప్రజా సమస్యలు ఉన్నన్ని రోజులు ఎర్రజెండా ఉంటుంది ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ● దివంగత ఎమ్మెల్యే కొండిగారి రాములుకు ఘన నివాళి ఇబ్రహీంపట్నం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. స్థానిక భారత్ గార్డెన్లో మంగళవారం ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు సంతాపసభ నిర్వహించారు. నివాళులర్పించిన అనంతరం కూనంనేని మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ప్రతీ చట్టం వెనక కమ్యూనిస్టుల పాత్రం ఉందన్నారు. మే డే రోజు పీఎం అయినా సీఎం అయినా ఎర్రజెండానే ఎగురవేయాన్నారు. కమ్యూనిస్టులను అణిచివేయాలని ఆనాడు హిట్లర్ చూస్తే.. నేడు కేంద్రంలోని అమితాషా చూస్తున్నాడని ఆరోపించారు. మావోయిస్టులను తాత్కాలికంగా అమితాషా అణిచివేయవచ్చు.. కానీ కమ్యూనిస్టులను అణిచివేయలేడన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటేనే కమ్యూనిస్టులు ఉన్నట్లు కాదని.. ప్రజా సమస్యలు ఉన్నన్ని రోజులు వాటి పరిష్కారానికి పోరాడేందుకు కామ్రేడ్లు ఉంటారని స్పష్టంచేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కమ్యూనిజమే శాశ్వతమని, కమ్యూనిస్టులు లేని సమాజామాన్ని ఊహించలేమని తెలిపారు. పేదరిక నిర్మూలనే అసలైన ప్రజాపాలన అన్నారు. పేదవారిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలకు సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి సీపీఐ చేరాలన్నారు. నిస్వార్థ ప్రజా సేవకుడు మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాములు సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.హేమంతరావు, రవీంద్రచారి, జిల్లా కార్యదర్శి జంగయ్య, కావలి నర్సింహ్మ, ముత్యాల యాదగిరిరెడ్డి, ప్రభులింగం, ఓరుగంటి యాదయ్య, రామస్వామి, సురేష్, శివరాల లక్ష్మయ్య, నీలమ్మ, సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల చేతుల్లో దేశ భవిష్యత్తు
ఇబ్రహీంపట్నం: దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని.. అలాంటి విద్యార్థులు ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ అన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం రోడ్డు భద్రతపై అరైవ్, అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా మెలగాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీటు బెల్ట్ తప్పక ధరించాలన్నారు. యువత, ప్రజలు రోడ్డు భద్రతను పాటించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ జితేందర్‌రెడ్డి, స్థానిక ఎస్హెచ్ఓ మహేందర్‌రెడ్డి, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు తదితరుకపాల్గొన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
షాబాద్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన షాబాద్ పోలీస్ సేష్టన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మల్లారెడ్డిగూడ సమీపంలోని రోడ్డు పక్కన బ్రిడ్జి వద్ద మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తు పడితే షాబాద్ పోలీస్ స్టేషన్ 87126 63450, 87125 68402 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
అతివేగం ప్రాణాంతకం
అబ్దుల్లాపూర్‌మెట్: అతివేగంగా వాహనాలు నడుపుతున్న యువత ప్రమాదాల్లో ప్రాణా లు కోల్పోతున్నారని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. గుంతపల్లిలోని అవంతి విద్యాసంస్థల ఆవరణలో సోమవారం ‘యుఫోరియా 2026’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కళాశాల చైర్మన్ శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ నందీష్, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం.ప్రియాంక, ఎండీ శ్రవణ్ కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. జేఎన్టీయూ డైరెక్టర్ డాక్టర్ ఆర్.శ్రీదేవి, విర్చుసా క్యాంపస్ లీడ్ అభిషేక్ దోయిజోడే, ప్రొఫెసర్ టీవీ నారాయణ, కళాశాల డైరెక్టర్ జయప్రద, శేషతల్పసాయి, ఉమాపతిరెడ్డి, రాజ్‌కమల్, షేక్ అజ్మల్ హుస్సేన్ పాల్గొన్నారు. -
కస్టమర్లపై అదనపు వడ్డింపులు
టిఫిన్లపై రూ.10, టీపై రూ.5 ● గ్యాస్ కొరతే కారణమంటున్న హోటళ్ల నిర్వాహకులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు.. జిల్లాలోని టీ, టిఫిన్ సెంటర్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మార్కెట్లో వాణిజ్య సిలిండర్ల కొరత ఏర్పడటం, వంటగ్యాసుకు అదనపు చెల్లింపులు చేయాల్సి వస్తుండటంతో వ్యాపారులు ఆ భారాన్ని వినియోగదారులపై రుద్దుతున్నారు. నిన్న మొన్నటి వరకు రూ.10 ఉన్న టీ ధర.. తాజాగా రూ.15 పెంచేశారు. ప్లేటు ఇడ్లీ, వడ, దోశకు సైతం అదనపు చెల్లింపులు తప్పడం లేదు. ఒక్కో ప్లేటుకు రూ.పది అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అదేమంటే బహిరంగ మార్కెట్లో వంట గ్యాస్ దొరకడం లేదని, బ్లాక్మార్కెట్లో ఒక్కో సిలిండర్‌కు రూ.3 నుంచి రూ.5 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని నిర్వహకులు చెబుతున్నారు. గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే మెజార్టీ టీస్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మూతపడ్డాయి. ఉన్నవాటిలోనూ ధరలను అమాంతం పెంచడం గమనార్హం. ఇంట్లో వంట చేసుకునే తీరిక లేక హోటల్లో కడుపునింపుకుందామని భావించే వారు పెరిగిన ఈ ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు. కొరత పేరుతో కొట్టేస్తున్నారు.. జిల్లాలో 14 లక్షలకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఉండగా, వీటిలో మూడు వేలకుపైగా వాణిజ్య సిలిండర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మెజార్టీ టీ స్టాల్స్, చైనీస్ పాస్ట్ ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్ల నిర్వహకులు వాణిజ్య అవసరాలకు కూడా డొమెస్టిక్ గ్యాసునే ఉపయోగించే వారు. ఇరుగు పొరుగు వారి సిలిండర్లను రీఫిల్ చేసి.. తమ అవసరాలు తీర్చుకునే వారు. అమెరికా, ఇజ్రాయిల్ కూటమి– ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఆయిల్ దిగుమతులు తగ్గిపోయాయి. ప్రభుత్వం వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు విధించింది. కొన్ని గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, డెలివరీ బోయ్స్ దీన్ని అవకాశంగా తీసుకున్నారు. వినియోగదారుల పేరున రీఫిల్ బుక్ చేసి, వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఒక్కో సిలిండర్‌ను రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆయా హోటళ్లు, టిస్టాల్ నిర్వాహకులు వీటిని అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఆ భారాన్ని కస్టమర్లపై రుద్దుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయా ఏజెన్సీలు/డెలీవరీ సర్వీసులపై నిఘా ఉంచాల్సిన విజిలెన్స్ అధికారులు సైతం వారిచ్చే అమ్యామ్యాలకు అలవాటుపడి అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు లేకపోలేదు. -
ముగిసిన వార్డుసభ్యుల శిక్షణ
మొయినాబాద్‌రూరల్: గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులందరూ సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు అధికారులతో కలిసి కృషి చేయాలని ఎంపీడీఓ సంధ్య, ఎంపీఓ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మొయినాబాద్ రైతు వేదికలో వార్డుసభ్యుల శిక్షణ ముగింపు సమావేశంలో ఆమె వారు పాల్గొని వార్డుసభ్యులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఐదు రోజులుగా మండలంలోని తొమ్మిది గ్రామాలకు చెందిన 80 మంది వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధిపై వారికి క్షుణ్ణంగా అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శులు, వార్డుసభ్యులు, ఉపసర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి 33 అర్జీలు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ వహించి, ఫిర్యాదులను వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డితో కలిసి సోమవారం ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన 33 ఫిర్యాదులను ఆయా శాఖలకు పంపించారు. భూ సేకరణపై ఫిర్యాదు యాచారం: ఫార్మాసిటీ, ఫ్యూచర్‌సిటీ, గ్రీన్ ఫీల్డ్ రోడ్ల నిర్మాణం పేరుతో వ్యవసాయ భూములను లాక్కుంటున్నారని కుర్మిద్ద గ్రామ గిరిజన రైతులు సోమవారం నేషనల్ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కుర్మిద్ద గ్రామ పంచాయతీ పరిధిలోని మంగలిగడ్డ, మర్లకుంట తండాలకు చెందిన గిరిజన రైతులు మైదాన ప్రాంత సేవాలాల్ సేన అధ్యక్షుడు రఘురామ్ రాథోడ్ ఆధ్వర్యంలో నేషనల్ ఎస్టీ కమిషన్ బానోత్ హుస్సేన్ నాయక్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కాలనీ రహదారుల కబ్జా హైడ్రా ప్రజావాణిలో 58 ఫిర్యాదులు సాక్షి, సిటీబ్యూరో : కాలనీల్లో రహదారులను కబ్జా చేసేస్తున్నారు. డెడ్ ఎండ్ కాలనీ రోడ్డుంటే.. ఇరువైపులా ప్లాట్లున్న వారు ఆ దారినే మూసేస్తున్నారు. కొత్తగా పక్కన లే ఔట్లు వేసిన వారు.. ఇప్పటికే ఉన్న వరద, మురుగు కాలువలకు ఆటంకాలు సష్టిస్తున్నారు. కుంట్లూరు సర్వే నం. 204లో దాదాపు 15 ఎకరాల మేర 800 ప్లాట్లతో అంజానాద్రినగర్ పేరిట లే ఔట్ వేశారు. పక్కనే లే ఔట్ వేసిన వారు తమ లే ఔట్లోకి జరిగి రహదారితో పాటు కొన్ని ప్లాట్లు మాయం చేశారంటూ అంజనాద్రి ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేశారు. తుర్కయాంజల్ నాగార్జున సాగర్ రోడ్డుకు ఆనుకుని ఉన్న మన్నెగూడ విలేజ్‌లో రహదారిని ఆక్రమించారని.. రోడ్డు మీద ట్రాన్స్ఫార్మర్, గుడికి చెందిన ప్రహరీ నిర్మించారని ప్రజావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్లాట్లకు ఎల్ ఆర్ ఎస్ కూడా వచ్చిందని.. అందులో రోడ్డు కూడా ఉందని.. ఇప్పుడు కావాలంటే రోడ్డును కొనుక్కోవాలని అక్కడివారు చెబుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. సాహేబ్‌నగర్‌లో మహలక్ష్మీనగర్ కాలనీ పక్కన కమర్షియల్ లేఔట్ వేసిన వారు మురుగుతో పాటు వరద కాలువను మూసేయడంతో తమ ప్రాంతం నీట మునుగుతోందని ఫిర్యాదు చేశారు. నాచారం – మల్లాపూర్ ప్రధాన రహదారిలో ఆక్రమణలు జరుగుతున్నాయని.. రోడ్డు మీదకు వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారని మైలార్‌దేవుపల్లిలోని టీఎన్జీవో కాలనీలో 1200ల గజాల పార్కును కబ్జా చేశారని ఫిర్యాదులందాయి. ఇదే కాలనీలో 40 ఫీట్ల రహదారిని కూడా కబ్జా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బుద్వేల్ పత్తికుంటకు వెళ్లే వరద కాలువను కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు అందింది. ఇలా హైడ్రా ప్రజావాణికి మొత్తం 58 ఫిర్యాదులందగా.. వాటిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి పరిష్కార బాధ్యతలను అధికారులకు అప్పగించారు. -
యువకుడి అదృశ్యం
షాబాద్: పెట్రోల్ పంపులో పనిచేయడానికి అని చెప్పి ఈనెల 26న ఇంటి నుంచి వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సర్ధార్‌నగర్‌కు చెందిన కొమ్ము అక్షయ్ కుమార్ (18) నాలుగు నెలలుగా షాద్‌నగర్‌లోని ఓ పెట్రోల్ బంకులో కూలీగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఈ నెల 26న పంపులోకి వెళ్తున్నానని చెప్పి, తిరిగి రాలేదు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం షాద్‌నగర్ రూరల్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన సోమవారం షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్‌పల్లి శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ సుశీల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామ శివారులో గుర్తు తెలియని సుమారు (55) ఏళ్ల వయస్సు ఉన్న మృతదేహాన్ని గమనించిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు భిక్షాటన చేస్తూ పరిసర ప్రాంతాల్లో నివసించే వ్యక్తి అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై బూడిద రంగు చొక్కా, ఎర్ర రంగు అండర్వేర్ ఉన్నాయన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిస్తే షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు. నీటి గుంతలో మృతదేహం చేవెళ్ల: హస్తేపూర్ సమీపంలోని ఓ నీటి గుంతలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. నీటి గుంతలో శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటకు తీయగా 30– 40 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తిగా గుర్తించారు. కుడి చేతిపై చిన్న పచ్చబొట్టు, చేతికి ఎరుపు రంగు దారం, మెడలో ఎరుపు దారంతో కూడిన రుద్రాక్ష, కుడి కాలిపై, నడుముపై నలుపు రంగు దారం కలిగి ఉన్నాయని తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని సూచించారు. బాలిక ఆత్మహత్య బంజారాహిల్స్: తల్లి మందలించిందని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. బీహార్‌కు చెందిన ఉద్గర్ మండల్ కుటుంబం బంజారాహిల్స్ సయ్యద్‌నగర్‌లో నివాసముంటోంది. కూతురు దీపాకుమారి (14) ఎన్బీటీనగర్లోని శ్రీసాయిరాం హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుకుంటోంది. కొంతకాలంగా చుట్టుపక్కల ఇళ్లకు తరచూ వెళుతుండటంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక సోమవారం తెల్లవారుజామున తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దివ్యాంగ యువతిపై లైంగికదాడి అత్తాపూర్: ఇంట్లో ఎ వ్వరూ లేనిసమయంలో ఓ వ్యక్తి సమీప బంధువైన దివ్యాంగ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. బార్కస్ చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహమ్మద్ అఖీల్(35) మద్యానికి బానిస కావడంతో భార్య, ముగ్గురు పిల్లలు ఇతనికి దూరంగా ఉంటున్నారు. హసన్‌నగర్‌లో అఖీల్ సోదరి కుంటుంబం నివాసం ఉంటోంది. వారితోపాటు ఆడపడుచు (మూగ యువతి, దివ్యాంగురాలు) కూడా ఉంటోంది. ఇదిలా ఉండగా అఖీల్ తరచూ సోదరి ఇంటికి వచ్చేవాడు. ఈ నెల 28న ఉదయం 9 గంటల సమయంలో సోదరి కుటుంబసభ్యులందరూ బయటకువెళ్లగా యువతి మాత్రమే ఇంట్లోనే ఉంది. ఇది గమనించిన మహమ్మద్ అఖీల్ లోపలికి వెళ్లి ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత కుటుంబసభ్యులు రావడంతో క్షమించమని ప్రాధేయపడి పరారయ్యాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు రంగంలోకి దిగి 48 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
షూటింగ్ పోటీలో మెరిసిన సీఐ
కాంస్య పతకం కై వసం.. అభినందించిన సీపీ ఇబ్రహీంపట్నం రూరల్: షూటింగ్ పోటీల్లో ఫ్యూచర్‌సిటీ సీఐ జేమ్స్‌బాబు అరుదైన ఘనత సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకం కై వసం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ బోపాల్‌లో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 0755 ఇండియా ఓపెన్ కాంపిటిషన్ (ఎయిర్ రైఫిల్, పిస్టల్) మార్చి 11 నుంచి 17 వరకు జరిగాయి. ఈ టోర్నీలో ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ ఐటీసెల్ ఇన్చార్జిగా పని చేస్తున్న సీఐ జేమ్స్‌బాబు రాణించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్‌బాబు సీఐని అభినందించారు. విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ క్రీడల్లో ప్రతిభ చూపి, పోలీసుశాఖకు వన్నె తెచ్చా వని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి టీవీఏఈ జేఏసీ రాష్ట్ర నాయకుడు కావలి వెంకటేశ్ షాద్‌నగర్: విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ రాష్ట్ర నాయకుడు కావలి వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో ఆర్టిజన్లు సమ్మె చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఆర్టిజన్లు ఎంతో ఎదురు చూస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆర్టిజన్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయకుండా సమస్యలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్ కార్మికులందరినీ విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆంజనేయులు, ప్రభాకర్‌రెడ్డి, శేఖర్, యాదగిరి, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు
షాద్‌నగర్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం అన్నారు. సోమవారం పట్టణంలోని 27వ వార్డు న్యూసిటీ కాలనీలో మున్సిపల్ చైర్మన్ బస్వం, కౌన్సిలర్ మురళీమోహన్ పర్యటించి కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను శుభ్రం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అన్ని వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం -
డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్ట్
శంకర్పల్లి: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్ఓటీ, స్థానిక పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన పొన్నాల సిద్దార్థ్(27) సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్‌లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్నేళ్లుగా డ్రగ్స్‌కు అలవాటు పడిన సిద్దార్థ్ గోవా నుంచి మాదకద్రవ్యాలను తీసుకొచ్చి పబ్‌లు, క్లబ్‌లతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అమ్ముతున్నాడు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన సాఫ్ట్వేర్ చలవాడి హిమంత్ కృష్ణవంశీ(30) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా.. సిద్దార్థ్‌కు పరిచయమయ్యాడు. వీరికి నాచారానికి చెందిన రొయ్యల వ్యాపారి అవదూత విష్ణుతేజ(36) జతయ్యాడు. ముగ్గురూ ముఠాగా ఏర్పడి గోవా నుంచి 39.72 గ్రాముల కొకై న్, 3గ్రాముల గంజాయి తీసుకుని మోకిల పీఎస్ పరిధిలోని ఇంద్రారెడ్డినగర్ మీదుగా వెళ్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఆదివారం వాహన తనిఖీలు చేస్తుండగా, ముగ్గురూ డ్రగ్స్‌తో పట్టుబడ్డారు. వీరి నుంచి మాదకద్రవ్యాలతో పాటు కారు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, సోమవారం చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్ నిమిత్తం సంగారెడ్డి జైలుకు తరలించారు. -
న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచాలి
చేవెళ్ల: న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెంచేలా పనిచేయాలని చేవెళ్ల ఏడీజే కోర్టు జిల్లా అదనపు న్యాయమూర్తి బృంగి శ్రీనివాసులు, సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి దశరథ రామయ్య, జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి వియకుమర్ ఉపాధ్యాయ బార్ అసోసియేషన్ నూతన పాలకవర్గానికి సూచించారు. స్థానిక కోర్టు ఆవరణలో సోమవారం బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన న్యాయమూర్తులు మాట్లాడుతూ.. కక్షిదారులకు స్వతర, ఖచ్చితమైన న్యాయ సేవలు అందించడానికి కృషిచేయాలన్నారు. సీనియర్ న్యాయవాది రాంరెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల కోర్టుకు జిల్లాలో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. బార్ అధ్యక్షుడు పాటి మధుసూదన్‌రెడ్డితో పాటు పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.చంద్రశేఖర్, ఎన్,మాధురి, ప్రధాన కార్యదర్శి పి.మల్లేశ్‌యాదవ్, జాయింట్ సెక్రటరీ ఈ.రవీందర్‌రెడ్డి, ట్రెజరర్ జనార్దన్, స్పోర్ట్స్ అండ్ కల్చరర్ సెక్రటరీ ఎ.ప్రభాకర్‌రెడ్డి, లైబ్రేరియన్ టి.మహేశ్, ఇ.కవిత, ఎగ్టిక్యూటివ్ కమిటీ సభ్యులు మహేశ్, సుదర్శన్, ఆనంద్, ప్రవీణ్‌రెడ్డి, మనీషారెడ్డి, కె. ప్రవీణ, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
‘పీఠం’ ముడి వీడేనా..?
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసింది. గత నెల 11న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించగా 13న ఫలితాలు వచ్చాయి. 16న సమావేశం నిర్వహించి కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెంటనే జరగాల్సిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు.. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి తిరుగుబాటుతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య వివాదాలు రాజుకోవడంతో ఫిబ్రవరి 17న ఏర్పాటు చేసిన ఎన్నిక సైతం పడింది. ఈ వివాదాలు న్యాయస్థానాలకు చేరాయి. ఈ దశలో నాలుగువారాలలోపు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని గత మార్చి 3న కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. ముందుగా కౌన్సిలర్లుకు నోటీసులు ఇచ్చి ఏప్రిల్ 4న మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఏదైనా కారణంతో ఆ రోజు వాయిదా పడితే మరుసటి రోజు(5వ తేదీ) నిర్వహించాల్సి ఉంటుంది. ఈసారైన పీఠముడి వీడేనా.... ఽఅధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లు మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ఎత్తులు జిత్తులు వేస్తుండటంతో ఈ వివాదం రోజురోజుకు ముదురింది. బీఆర్ఎస్కు మెజార్టీ కౌన్సిలర్లు ఉన్నా వివిధ వివాదాలతో ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపు బాట పట్టారు. ఈసారైన పీఠం ముడి విడుతుందా లేక మళ్లీ వివాదాల్లో చిక్కుకొని వాయిదా పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తేలాలంటే వచ్చే 4వ తేదీ వరకు వేచిచూడాల్సిందే. -
రైతులకు రుణాలు ఇచ్చి సహకరించండి
● రికవరీ చేసి సహకార సంఘానికి న్యాయం చేయండి ● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి షాబాద్: రైతులకు వ్యవసాయ సీజన్‌ల్లో రుణాలు ఇచ్చి వారి పెట్టుబడికి చేదోడు వాదోడుగా ఉండాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి సంఘం ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన రుణాలను సకాలంలో రికవరీ చేసి సంఘం అభివృద్ధికి సహకరించాలన్నారు. సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని సూచించారు. సంఘం ప్రత్యేక అధికారి మాట్లాడుతూ.. మండల రైతులు అన్ని రకాలుగా సంఘానికి ఉపయోగపడుతున్నారని, రుణాల రికవరీ విషయంలో కొంత నిదానంగా ఉన్నారన్నారు. సహకార సంఘం సీఈఓ శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం 1400 మంది రైతులకు అధిక రుణాలు అందించిన్నట్లు చెప్పారు. 828 మంది రైతులకు స్వల్పకాలిక రుణాలు ఇచ్చామన్నారు. మొత్తం 51 శాతం వరకు రుణాలు ఇచ్చామని, 45 శాతానికిౖ పెగా రికవరీ చేశామన్నారు. మరో నెల రోజుల్లో మరికొంత రికవరీ జరుగుతుందని హామీనిచ్చారు. కార్యక్రమంలో సీఈఓ శివకుమార్‌రెడ్డి, సర్ధార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్‌రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంజీవరెడ్డి, సర్పంచులు అశోక్, ప్రభాకర్‌రెడ్డి, చెన్నయ్య, మహేందర్‌గౌడ్, తదితరులు ఉన్నారు. -
మీటర్ సేల్స్ పెంపే లక్ష్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘డిస్కంలో మీటర్ల కొరత ఉన్నమాట వాస్తవమే. కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, స్టకప్, బర్డ్డన్ మీటర్లను మార్చాల్సిందిగా కోరుతూ వినియోగదారుల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. కొత్త కనెక్షన్ల జారీ సహా పాడైన మీటర్లను మార్చేందు ప్రత్యేక చర్యలు చేపట్టాం. విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో భాగంగా మీటర్ల సమీకరణకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. పారదర్శకతకు పెద్దపీటవేస్తున్నాం. ఇందుకు సీనియర్ సీఈలతో ఓ కమిటీని ఏర్పాటు చేశాం’ అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఈ మేరకు సోమవారం టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఇప్పటికే 58 కొత్త సబ్స్టేషన్లు(33/11 కేవీ) సహా 57 ఫీడర్లు (33 కేవీ) ఏర్పాటు చేశాం. 119 పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచాం. అదనంగా మరో 442 ఫీడర్లు(11కేవీ) సహా మరో 3,262 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నాం. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మలను తొలగించాం. ఏదైనా సాంకేతిక సమస్యతో కరెంట్ సరఫరా నిలిచిపోతే.. వెంటనే సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలను కూడా సిద్ధం చేసుకున్నాం. సేవలన్నీ ఆన్లైన్లోనే.. కొత్త కనెక్షన్ల జారీ, ప్యానల్‌బోర్డు, డీటీఆర్‌ల మంజూరు, వర్క్ ఎస్టిమేషన్లలో అక్రమ వసూళ్లకు పూర్తిగా చెక్పెట్టబోతున్నాం. వర్క్ ఎస్టిమేషన్ మొదలు.. కొత్త కనెక్షన్ల జారీ వరకు ఇలా అన్ని దరఖాస్తులను ఆన్లైన్లోనే స్వీకరిస్తాం. వర్క్ ఎస్టిమేషన్లలో ఒక యూనిఫాం విధానాన్ని తీసుకురాబోతున్నాం. ఏఐతో నష్టాలకు చెక్.. అన్ని విభాగాల్లోనూ ఏఐ ఆధారిత సేవలను వినియోగించుకోబోతున్నాం. సబ్ స్టేషన్ల వారీగా గత మూడేళ్ల డేటాను విశ్లేషించబోతున్నాం. ప్రతీ డీటీఆర్‌ను ఏఐ తో అనుసంధానం చేయబోతున్నాం. విద్యుత్ నష్టాలకు కారణాలను గుర్తించడంతో పాటు భవిష్యత్తు డిమాండ్‌ను అంచనా వేసి, సబ్స్టేషన్లు, ఫీడర్లు, డీటీఆర్లను ఏర్పాటు చేయనున్నాం. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవల కోసం మరో 260 ఆస్పత్రులతో అవగాహన ఒప్పందంకుదుర్చుకున్నాం. డిస్కం తాజా నిర్ణయంతో 8,229 మంది రిటైర్డ్, 20,261 సర్వీసు ఇంజనీర్లు లబ్ధిపొందే అవకాశం ఉంది. ప్రై వేటు మీటర్ రీడర్ల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయించాం.పారదర్శకంగా విద్యుత్‌పరికరాల కొనుగోలు పెరిగిన విద్యుత్ డిమాండ్ విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఎంత డిమాండ్ వచ్చినా.. తట్టుకుని సరఫరా చేసే సామర్థ్యం డిస్కంకు ఉంది. గతేడాది టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 11,017 మెగావాట్ల డిమాండ్ నమో దు కాగా, ఈ ఏడాది మార్చి 13న రికార్డు స్థాయిలో 11,318 మెగావాట్లు నమోదైంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో గతేడా ది 4,352 మెగావాట్లు నమోదు కాగా, ఈ ఏ డాది మార్చి 3న 4,421 మెగావాట్లు రికార్డైంది. వచ్చే రోజుల్లో రోజు గరిష్ట విద్యుత్ డిమాండ్ ఐ దు వేల మెగావాట్లు దాటుతుందని అంచనా వే శాం. ఆ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం. -
రూ.కోటి విలువైన హష్ ఆయిల్ స్వాధీనం
ఇద్దరు నిందితుల అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి మహేశ్వరం: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువ చేసే సుమారు 9.4 కిలోల హష్ ఆయిల్(గంజాయి నుంచి తయారు చేసే నూనె)ను స్థానిక, ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్లో డీసీపీ నారాయణరెడ్డి సోమవారం విలేకరులకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జీడిమడుగుల మండలం సంకులమిడ్డె గ్రామానికి చెందిన కొరాబు చంటిబాబు, ఒడిశాకు చెందిన రాజారావు నుంచి హష్ ఆయిల్ సేకరించి(డ్రగ్) సేకరించి, నగరంలోని గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా సరఫరా చేయడానికి ప్రయత్నించారు. మార్చి 29న ఆదివారం సాయంత్రం 6 గంటలకు మహేశ్వరం గేటు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సమయంలో పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో చంటిబాబు వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా పది పాలిథిన్ కవర్లలో ఉన్న హష్ ఆయిల్‌తో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి పరారీలో ఉన్నారు. పట్టుబడిన హష్ ఆయిల్ విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని తెలిపారు. నిందితుడు చంటిబాబుపై ఏపీలోని కంచరపాలెం, అనాకపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో నాలుగు ఎన్డీఎఫ్ కేసులు నమోదయ్యాయి. యువత, విద్యార్థులు డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని డీసీపీ సూచించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలన్నారు. డ్రగ్స్, గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే మహేశ్వరం జోనల్ కంట్రోల్ 8712662664 నంబర్‌కు లేదా 100 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. ఆపరేషన్‌లో ప్రతిభకనబర్చిన అధికారులు, పోలీసులను ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషర్ సుధీర్‌బాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఎస్ఐలు ప్రసాద్, రాఘవేందర్, ధనుంజయ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026
మొయినాబాద్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం బాలాజీ స్వామి గోప వాహన, హనుమంత వాహన సేవలు అందుకున్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారిని మొదటగా గోపవాహనంపై, తరువాత హనుమంత వాహనంపై ఆసీనులను చేసి ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా వేదపారాయణం, పూజలు, మంగళహారతి సేవలు అందించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, నరసింహన్, కిట్టు, కృష్ణమూర్తి, మురళి, కన్నయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారిని సూర్యప్రభ వాహనం, గరుడ వాహనంపై ఊరేగించి సేవలు అందించనున్నారు. రాత్రి 11 గంటలకు స్వామివారి కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తారు. ఇబ్రహీంపట్నం రూరల్: ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సెర్ప్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లీలాకుమారి అన్నారు. సెర్ప్ జిల్లా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్యను ప్రోత్సహించడానికి ఉల్లాస్ అమ్మకు అక్షరమాల పేరుతో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని పంచాయతీల పరిధిలో మహిళలకు అక్షరాభ్యాసం చేయించి అక్షరాలు నేర్పించారు. అనంతరం సర్టిఫికెట్లు అందజేశారు. మండలంలోని నాగన్‌పల్లిలో కార్యక్రమాన్ని సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ లీలాకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్షరాస్యత పెంపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో అందరికీ చదువు తప్పనిసరి అని పేర్కొన్నారు. వేలి ముద్రలు వేయకుండా సంతకాలు చేయాలని సూచించారు. చదువే జ్ఞానం చదువే వెలుగని, గ్రామాల్లో ఎక్కడ చూసినా చదువుకున్న వారే కనిపించాలన్నారు. కనీసం అక్షర అవగాహన ఉంటే మంచిదన్నారు. కార్యక్రమంలో ఏపీఎం సాంబశివుడు, సీసీలు సత్తయ్య, మల్లేష్, అశోక్, ఆనంద్, జంగమ్మ, హరిలాల్, వీఓఏలు, గ్రామ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్: ఎల్పీజీ గ్యాస్ కొరతకు ప్రత్యా మ్నాయంగా బయో మాస్ పెల్లెట్స్ తయారు చేస్తున్నట్టు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బయో మాస్ పెల్లెట్ వుడ్ గ్యాసిఫియర్ను మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో ఆదివారం ప్రారంభించారు. స్థానిక హోటల్ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా తయారు చేసిన బయో మాస్ పెల్లెట్ వుడ్ గ్యాసిఫియర్ బాగా పనిచేస్తుందని.. చాలా మందికి నచ్చి ప్రొడక్షన్ పెంచాలని అడుగుతున్నారన్నారు. ఈ గ్యాసిఫియర్ ప్రైమరీ ఫైర్, సెకండరీ ఫైర్ రెండు రకాలుగా పనిచేస్తుందన్నారు. వ్యవసాయ వ్యర్థాలు బయో వుడ్ గ్యాసిఫియర్ ఇందనంగా వాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, కౌన్సిల్ సభ్యుడు సన్వెల్లి ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్ షాబాద్ కిషన్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచ్ వెంకటేశ్‌గౌడ్, మాజీ సర్పంచ్ రత్నం, నాయకులు మోర నర్సింహారెడ్డి, రవీందర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తుర్కయంజాల్: యువ క్రికెటర్లు క్రమశిక్షణ, కఠినశ్రమ, సరైన మార్గదర్శకత్వంతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అండర్ –19 భారత జట్టు ఆటగాడు అక్షత్ రెడ్డి అన్నారు. ఆదిబట్ల సర్కిల్ పరిధి బ్రాహ్మణపల్లి, జేబీ బృందావన్ కాలనీలోని స్మార్టీ క్రికెట్ అకాడమీలో ఆదివారం నూతన క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ అకాడమీ ద్వారా భవిష్యత్తులో మంచి క్రికెటర్లు తయారు కావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ కొంతం మధుసూదన్ రెడ్డి, ప్రొఫెషనల్ సీనియర్ కోచ్‌లు ఎస్.మల్లేశ్ యాదవ్, రమేష్ గౌడ్, అజయ్ రైనా, దయానంద్ పటేల్, పలువురు అండర్–19, హెచ్‌సీఏకి ప్రాతనిధ్యం వహించిన క్రికెటర్లు పాల్గొన్నారు. -
బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రైవేటు భూమిలోకి అక్రమంగా చొరబడి భయబ్రాంతులకు గురి చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదిబట్ల ఎస్ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. నాదర్గుల్ సర్వే నంబర్ 613లో కోహినూర్ వెంచర్లోకి అదే ప్రాంతానికి చెందిన మహేశ్, రాజు, భాస్కర్, ప్రభాకర్, తిరుపతి భాస్కర్, శివప్రసాద్‌తో పాటు మరి కొందరు ఆదివారం మధ్యాహ్నం చొరబడి సెక్యూరిటీ వారిని బెదిరింపులకు గురి చేశారు. మహ్మద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉల్లాస్ పరీక్షలు కేశంపేట: వయోజన వి ద్యాశాఖ ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్న అక్షరమాల కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులకు విద్య నేర్పి ంచారు. వీరికి ఆదివారం వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. మండలంలో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 1600 మంది మహిళలు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 1260 మంది హాజరయ్యారు. మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ, వేములనర్వ గ్రామాల్లో ఉన్న పరీక్ష కేంద్రాలను వయోజన విద్యా కేంద్రం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ అనిత పరిశీలించారు. -
వైభవంగా ఉత్సవాలు ప్రారంభం
కడ్తాల్: మండల కేంద్రంలోని శ్రీ సీతారామాలయంలో విజయ గణపతి, జ్ఞాన సరస్వతి, సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలిరోజు ఆదివారం శ్రీశైలం చంద్రశేఖర శివాచార్య మహాస్వామి శిష్య బృందంతో పాటు, అంగడి మఠం భువనేశ్వర్స్వామి, శివశ్రీ జ్ఞానేశ్వర శాస్త్రి, శ్రీమాన్ శ్రీరంగం అరేష చార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, ఆలయ ప్రవేశం, మహాగణపతి విశ్వక్సేన ఆరాధన, గౌరిపూజ, పుణ్యాహవాచనం, శివుడి రుద్రాభిషేకం, అఖండ దీపారాధన మహా మంగళహారతి, మంత్రపుష్ప, తీర్థ ప్రసాద వితరణ తదితర పూజలు జరిపించారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణదాతలు బస్వారాజ్ రాజమణి దంపతులు, అర్చకులు రామశర్మ, నాయకులు సంతోష్, మల్లేశ్, భక్తులు పాల్గొన్నారు. -
ఆమె చదువు.. ఇంటికి వెలుగు
● మహిళలు వందశాతం అక్షరాస్యత సాధించాలి ● అక్షరమాల కార్యక్రమంలో వక్తలు ఆమనగల్లు: మహిళలు వందశాతం అక్షరాస్యత సాధించాలని, అప్పుడే వారి ఇంటితో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని వక్తలు అన్నారు. అక్షరాస్యత పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘ఉల్లాస్– అమ్మకు అక్షరమాల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆదివారం గ్రామీణ ప్రాంతాల నిరక్షరాస్యుల్లో అక్షర వెలుగులు నింపడానికి అక్షరాస్యత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు తలకొండపల్లి మండలం లింగరావ్‌పల్లి, చీపునుంతల గ్రామాల్లో నవభారత సాక్షరత పరీక్షలు నిర్వహించారు. లింగరావ్‌పల్లి సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, చీపునుంతల సర్పంచ్ లక్ష్మమ్మ, నాయకులు వెంకట్‌రెడ్డి, జంగయ్య, భాగ్య, శ్రీజ, సాత్విక, రబ్బాని, రాజు, లావణ్య, అశ్వని, నర్సింహ, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మహేశ్ తదితరులు పాల్గొన్నారు. నిరక్షరాస్యత నిర్మూలనకు.. మంచాల: ప్రతి ఒక్కరూ అక్షరాస్యులుగా మారాలని సర్పంచ్ ఏర్పుల మానస వినయ్ అన్నారు. ఆదివారం గ్రామంలో ఉల్లాస్– నవ భారత్ సాక్షరత కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా అక్షరమాల నేర్చుకున్న పొదుపు సంఘం సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. వయోజన విద్య కేంద్రాలు, రాత్రి బడులు చేపడుతోందని చెప్పారు. వయసుతో సంబంధం లేకుండా సీ్త్ర, పురుషులు చదువు నేర్చుకోవాలని సూచించారు. ఎంఈఓ రాందాస్, ఏపీఎం శేఖర్, సీసీలు కృష్ణ, చంద్రిక, వీఓఏలు పాల్గొన్నారు. -
నేడు డయల్ యువర్ డీఎం
ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో సోమవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామని మేనేజర్ సూజాత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 1 వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. డిపో పరిసర ప్రాంతాల ప్రజలు తమ సలహాలు, సూచనలు ఇచ్చి డిపో అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. రక్షణ చట్టం ఆమోదం హర్షణీయం కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గణేశ్‌గౌడ్ కడ్తాల్: తెలంగాణ శాసనసభలో న్యాయవాదుల రక్షణ చట్టం ఆమోదం పొందడం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కానం గణేశ్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగితే.. ప్రశ్నించే గొంతుకలైన న్యాయవాదుల రక్షణకోసం పీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రజాపాలనలో న్యాయవాదులకు గౌరవం, భద్రత, స్వాతంత్య్రం పరిరక్షించే దిశగా అడుగులు పడ్డాయని, దీనికి ఈ చట్టమే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు.. చట్టం అమలుకు మద్దతు పలికిన వారందిరికీ కృతజ్ఞతలు తెలిపారు. జీపీ భవనం మంజూరు చేయాలని వినతి ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వీరన్నపల్లి గ్రామ పంచాయతీ భవనం కోసం నిధులు మంజూరు చేయాలని నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లురవిని సర్పంచ్ రామకృష్ణయాదవ్ కోరారు. ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో పలువురు నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. నాయకులు మిన్నాల డేవిడ్, రాఘవేందర్, లక్ష్మణ్‌యాదవ్ ఉన్నారు. -
గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు ఇస్తాం
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంచాల: గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గుండెమోని మల్లేశ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మతండా గ్రామస్తులు ఆయనను కలిశారు. గ్రామంలో గాడివంపు ప్రాజెక్ట్ నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్లు, అర్హులైన వారిందరికి పింఛన్లు మంజూరు చేయాలని, సీసీరోడ్లు, అండర్ డ్రైనేజీ నిర్మాణాలను నిధులు ఇవ్వాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పటికే తండాకు రూ.35 లక్షలకు పైగా నిధులు ఇచ్చామని, మరిన్ని ఇస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీధర్‌నాయక్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అమర్ నాథ్, వార్డు సభ్యులు నరేష్ నాయక్, బాలు నాయక్, నాయకులు హరికిషన్ నాయక్, వసురాం, హీరలాల్, సీతారాం నాయక్ పాల్గొన్నారు. -
అక్షరాస్యతతోనే హక్కుల సాధన
యాచారం: సంపూర్ణ అక్షరాస్యతతోనే రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకునే అవకాశం ఉంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మండల పరిధిలోని చౌదర్పల్లిలో ఆదివారం అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం పేదలకు ఎన్నో అవకాశాలను కల్పించిందని, కానీ అక్షరాస్యత లేకపోవడంతో అన్యాయాలపై ప్రశ్నించే అవకాశం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా విద్యనందించే ఎన్నో విద్యాలయాలు ఏర్పాటు చేసిందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని సూచించారు. అంబేడ్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు జేబీ రాజు మాట్లాడుతూ.. రాజ్యాంగ ఫలాలు దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అంతకు ముందు మాల్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద లింగం కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల దాత జుట్టు శ్రీశైలం, చౌదర్పల్లి సర్పంచ్ రాజుగౌడ్, వివిధ పార్టీల నాయకులు బిలకంటి చంద్రశేఖర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, నడుకుడి కృష్ణ, ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కొండ్రు యాదగిరి మృతి తీరని లోటు ఇబ్రహీంపట్నం రూరల్: మాదిగ ఉద్యమానికి కొండ్రు యాదగిరి లేని లోటు తీరనిదని మందకృష్ణ మాదిగ అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన కొండ్రు యాదగిరి మూడు రోజుల క్రితం మృతి చెందాడు. మరణవార్త తెలుసుకున్న మంద కృష్ణమాదిగ ఆదివారం ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లారు. యాదగిరి చిత్రపటానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట నాయకులు జుట్టు సతీష్, మంద సుధాకర్, రమేష్, గణేశ్, అయోధ్య, అంజయ్య తదితరులు ఉన్నారు. మహనీయుల విగ్రహాలు ఆవిష్కరణ కొందుర్గు: మండలంలోని పర్వతాపూర్‌లో మహా త్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఆదివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆవిష్కరించారు. విగ్రహాల దాతలు ప్రభావతి, భీమయ్య దంపతులను సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహోన్నత వ్యక్తులను గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బోయ అశోక్, అంబేడ్కర్ యువజన సంఘం సభ్యుడు రాధాకృష్ణ, నాయకులు అందె బాబయ్య, కృష్ణారెడ్డి, కృష్ణ, సుందర్, జగన్, మంగులాల్‌నాయక్, బల్వంత్ రెడ్డి, మల్లేష్ గౌడ్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
మీ ఆరోగ్యం.. మీ చేతుల్లోనే
మున్సిపాలిటీ మాజీ చైర్మన్ నిరంజన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: ‘మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. నాణ్యమైన ఆహారం తీసుకుంటూ.. నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు’ అని ఆదిబట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. డివిజన్లో ఆదివారం మర్రి ఆధ్వర్యంలో శ్యామ్ ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా 240 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, 2డీఎకో, రక్త పరీక్షలు చేశారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. ఉచిత మెగా ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆహార నాణ్యతలేమితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. దీంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగి మరింత ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కలమ్మ జంగయ్య, మాజీ కో ఆప్షన్ సభ్యుడు పల్లె గోపాల్‌గౌడ్, ఇబ్రహీంపట్నం జెట్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, కౌన్సిలర్ లావణ్య పాండురంగారెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శ్రీశైలం, వైద్యులు రంగరాజ్, శ్రీనివాస్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
హష్ ఆయిల్ పట్టివేత
మహేశ్వరం: హష్ ఆయిల్ తరలిస్తున్న వ్యక్తిని మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 9.402 కిలోల ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీశైలం జాతీయ రహదారి మహేశ్వరం గేటు వద్ద చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా జీడిమడుగుల మండలం సంకులమిద్దె గ్రామానికి చెందిన కొరాబు చంటి హష్ ఆయిల్‌ను బ్యాగులో పెట్టుకొని హైదరాబాద్‌కు తరలిస్తూ ఆదివారం రాత్రి మహేశ్వరం గేటు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎస్ఓటీ పోలీసులు విచారించి బ్యాగును తనిఖీ చేశారు. బ్యాగులో సుమారు 9.402 కిలోల ఆయిల్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓటీ, మహేశ్వరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి చేయూత ఆమనగల్లు: మున్సిపాలిటీ పరిధి విఠాయిపల్లి గ్రామానికి చెందిన సబావత్ పంతునాయక్ ఇంటి నిర్మాణానికి బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్ చేయూతనందించారు. నిర్మాణానికి కావాల్సిన సిమెంట్ బస్తాలను అందజేశారు. మాజీ సర్పంచ్ సాలయ్య, నాయకులు శంకర్‌నాయక్, వెంకట్‌రెడ్డి, చంద్రునాయక్, జంగాచారి, మల్లయ్య, కిశోర్, మల్లేశ్, వీరేశం, శ్రీను, గోపి, అనిల్ ఉన్నారు. ఆ ఆలయాలను సంరక్షించండి ఇబ్రహీంపట్నం రూరల్: జేబీ వెంచర్‌లోని పురాతన దేవాలయాలను కాపాడాలని హిందు వాహిని నాయకులు కోరారు. ఆదివారం వెంచర్‌లోని సోమనగుట్ట దేవస్థానాన్ని సందర్శించి మాట్లాడారు. ఆలయంతో పాటు గుట్టను ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. చౌడమ్మ తల్లి, మల్లికార్జున స్వామి విగ్రహాలను తొలగించాలని చూస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్నం ఠాణాలో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించి ఆలయాన్ని సంరక్షించడంతో పాటు.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాగు నీటి సమస్యను అధిగమిస్తాం మంచాల: గ్రామంలో తాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆరుట్ల సర్పంచ్ మానుపాటి శోభ కుమార్ అన్నారు. ఆదివారం గ్రామంలో పర్యటించారు. 40 బోరు బావులను గుర్తించారు. నీటి సమస్య తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు, ప్రజల సహకారంతో నీటి వనరులు ఉన్న చోట బోరు బావులకు మోటార్లు బిగిస్తున్నామని తెలిపారు. నీటిని పొందుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, వార్డు సభ్యులు పున్నం రాము, బాలమణి, పద్మ, జంగయ్య, మౌనిక, మమత, నాయకులు జానీ పాష, చిందం రఘుపతి, జంగయ్య, పాండు పాల్గొన్నారు. -
వంట గ్యాస్, పెట్రోల్ కొరత లేదు
ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో శనివారం సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్యాస్ సరఫరాకు ఎలాంటి కొరత లేదని, తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా అవసరం మేరకు సమయానికి గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అవసరం లేకుండా బుకింగ్ చేయడం ద్వారా సరఫరా వ్యవస్థపై ఒత్తిడి ఏర్పడుతుందన్నారు. బుకింగ్ చేసిన తర్వాత సంబంధిత ఏజెన్సీలు వినియోగదారుల ఇళ్ల వద్దకే సిలిండర్ సరఫరా చేస్తాయని తెలిపారు. ఎవరూ కూడా ఏజెన్సీలు, గోదాముల వద్దకు వెళ్లొద్దన్నారు. బంకుల వద్ద బారులు తీరి కొరత ఉందని సమస్యలు సృష్టించొద్దని, అధిక మోతాదులో తీసుకొని ఇళ్లలో నిల్వ చేసుకోవద్దని తెలిపారు. సరఫరాపై ఏజెన్సీలు, బంకుల యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, సివిల్ సప్లై శాఖ అధికారి వనజాత, సంక్షేమ శాఖ అధికారులు రామేశ్వరిదేవి, కేశురాం, వ్యవసాయ శాఖ అధికారి ఉష తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి -
నేడు రెండు వేల మందికి పరీక్ష
యాచారం: డ్వాక్రా సంఘాల్లోని ఐదో తరగతిలోపు చదువు రాని మహిళలు నేడు ఆయా గ్రామాల్లో పరీక్ష రాయనున్నారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో అక్షరాస్యత లేని 4,500 మంది మహిళలను గుర్తించారు. రాత్రిపూట అడల్ట్ ఎడ్యుకేషన్ ద్వారా మహిళలకు చదువు నేర్పించారు. అందులో రెండు వేల మందిని మొదటి దఫా కింద ఆదివారం రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష రాయిస్తారు. అందుకు గాను శనివారం మండల ఐకేపీ కార్యాలయంలో మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ రాధారాణిలు పరీక్ష నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. పరీక్షలో పాసైన మహిళలకు సర్టిఫికెట్లు అందజేస్తారు. ప్రతి డ్వాక్రా మహిళ అక్షరాస్యత సాధించడం కోసం కృషి చేస్తున్నామని ఎంపీడీఓ తెలిపారు. -
గౌరవం ఇవ్వలేదని నిరసన
యాచారం: పరిపాలన వ్యవహరాల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కనీస సమాచారంతో పాటు, ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదని మాల్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలు దొంతగోని స్వాతి నిరసన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నల్ల గుడ్డతో కళ్లకు గంతలు కట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఒకటో వార్డు సభ్యురాలిగా గెలిచినప్పటికీ తన వార్డు పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ఏ పనులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. తనను అవమానపర్చుతున్న సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిగా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. -
గాలివాన.. హైరానా
మహేశ్వరం: మండల పరిధిలోని నందుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను డివిజన్ హౌసింగ్ డీఈ భిక్షు, ఏఈ చైతన్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిర్మాణాలను వేగిరం చేయాలని అన్నారు. పనుల ఫొటోలను అప్లోడ్ చేస్తే బిల్లులు దశలవారీగా లబ్ధిదారుల అకౌంట్లో జమ అవుతాయన్నారు. త్వరితగతిన పూర్తి చేసి బిల్లులు పొందాలని సూచించారు. ప్రభుత్వ నియమాల ప్రకారం నిర్మాణం చేపట్టాలని, నిబంధనలు అతిక్రమించి చేస్తే బిల్లులు రావని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దేశపాగ నర్సింహలు, ఉప సర్పంచ్ షేక్ ఎజాస్, పంచాయతీ కార్యదర్శి జానయ్య తదితరులు పాల్గొన్నారు. -
169 కేసులు పరిష్కారం
ఇబ్రహీంపట్నం: స్థానిక న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 169 కేసులు పరిష్కారమయ్యాయి. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో 77, మంచాల పరిధిలో 23, యాచారం పరిధిలో 27, ఫార్మాసిటీ పరిధిలో 8, మాడ్గుల పరిధిలో 34 కేసులు పరిష్కారం అయినట్లు 15వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి. ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ యువకుడి మృతి ఆమనగల్లు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మృతి చెందిన సంఘటన పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. మారుతి షోరూం ఎదురుగా హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో పల్లపు చరణ్(20) అక్కడికక్కడే మృతిచెందాడు. మండలంలోని మంగళపల్లి చెన్నకేశవ కాలనీకి చెందిన చరణ్ స్థానిక పట్టణంలో ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఆయన బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు సందర్శించి వివరాలు సేకరించారు. కాగా హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి మరమ్మతులు చేస్తుండటంతో ఒకవైపు రోడ్డును మూసి ఉంచి రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు డీజిల్ వాహనం, గ్యాస్ సిలిండర్లు, ఎర్రమట్టి సీజ్ అనంతగిరి: అక్రమ రవాణా, వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా శనివారం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్కే అన్వర్ పాషా ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్‌ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నగరంలోని మియాపూర్‌కు చెందిన గో ల్కొండ రాజు ట్యాంకర్‌ను, డ్రైవర్లు గొనెళ్ల కిరణ్, అనిగెల అనిల్ అదుపులోకి తీసుకున్నట్లు చెప్పా రు. వీరిపై చెన్గోముల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మన్నెగూడ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఎర్రమట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను టాస్క్ ఫోర్స్ బృందం పట్టుకున్నట్లు వివరించారు. వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో దా డి చేసి 4 డొమెస్టిక్ ఫుల్ సిలిండర్లు, 14 ఖాళీ సిలిండర్లు, 6 కమర్షియల్ సిలిండర్లను సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్ప వని ఎస్పీ హెచ్చరించారు. చిరువ్యాపారులను ఆదుకోండి ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షుడు గుల్షన్ కొడంగల్ రూరల్: రోడ్డు విస్తరణలో డబ్బాలు తొలగించడంతో జీవనోపాధి కోల్పోయిన చిరువారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బీ గుల్షన్ కోరారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నందారం ప్రశాంత్‌కుమార్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. చిరు వ్యాపారుల సమస్యలను చైర్మన్‌కు వివరించారు. స్పందించిన చైర్మన్ బాధితులకు అండగా ఉంటానని, వారం రోజుల్లో కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్‌ను చిరువ్యాపారులు, గుల్షన్ సన్మానించారు. కార్యక్రమంలో ఎండీ సర్తాజ్ హుస్సేన్, సయ్యద్ మహమూద్, ఎండీ జహంగీర్, ఎండీ అక్తర్, ఎండీ కబీర్, నారాయణ, సుందర్, సయ్యద్ అర్షద్ అలీ ఖాద్రి పాల్గొన్నారు. రేపు జిల్లా స్థాయి సెలక్షన్స్ అనంతగిరి: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులకు రేపు(సోమవారం) వికారాబాద్‌లో జిల్లాస్థాయి సెలక్షన్స్ ఉంటాయని క్రీడల విభాగం జిల్లా అధికారి ఎంఏ సత్తార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద యం 9.30 గంటలలోపు పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్‌కు హాజరుకావాలని సూచించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫాం, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, 3వ తరగతి బోనాఫైడ్, ప్రొగ్రెస్ కార్డు, కులం సర్టిఫికె ట్, సైజ్ ఫొటోలతో రావాలని సూచించారు. తైబజారు వేలం.. బొంరాస్‌పేట: మండలంలోని తుంకిమెట్ల ఆదివారపు సంతకు ఈ నెల 30న వేలం నిర్వహించనున్న ట్లు సర్పంచ్ ఎల్లమ్మ శనివారం తెలిపారు. ఉద యం 11గంటలకు గ్రామ రైతు వేదికలో వేలం ఉంటుందన్నారు. పాట దక్కించుకున్న వారు ఏప్రిల్ ఒకటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు తైబజారు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనాలని ఆమె కోరారు. -
లక్ష్యాన్ని అధిగమిద్దాం
అనంతగిరి: రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం సేకరణ లక్ష్యాన్ని అధిగమించాలని అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు రావొద్దన్నారు. జిల్లాలో 129 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున కాంటాలు, గన్నీ బ్యాగులు, ఎప్పటికప్పుడు ధాన్యం రవాణాకు లారీలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూడాన్నారు. వివిధ ఏజెన్సీల ద్వారా లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, పది వేల మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్ల సేకరించాలని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, పౌరసరఫరాల శాఖ అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్‌కృష్ణ, జిల్లా రవాణా అధికారి వెంకట్‌రెడ్డి, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ వెంకటరమణారెడ్డి, డిప్యూటీ డీఆర్డీఓ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
యువత క్రీడల్లో రాణించాలి
చేవెళ్ల: యువత క్రీడల్లో రాణించాలని చేవెళ్ల ఎ మ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని దామరగిద్ద వార్డులో శనివారం 7వ జిల్లాస్థాయి, ఓపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్–2026 పోటీలను ఆయన మున్సిపల్ చైర్పర్సన్ దేవరి సమతావెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడాకారులను తగిన విధంగా పోత్రహిస్తుందన్నారు. గ్రామీణ స్థాయిలో ఉండే యువత మంచి క్రీడాకారులుగా తల్లిదండ్రులు, దేశానికి పేరు తీసుకువచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. టోర్నమెంట్ నిర్వహిస్తున్న యూత్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు తాల్లపల్లి నర్సింలు, పైండ్ల మధుసూదన్‌రెడ్డి, బండారి శైలజఆగిరెడ్డి, మాజీ సర్పంచులు మధుసూదన్‌గుప్తా, వెంకటేశంగుప్తా తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
అంతా.. రామమయం
ముత్యాల తలంబ్రాలు.. బాజాభజంత్రీలు.. అశేషభక్త జనవాహిని నడుమ లోక కల్యాణ కారకుడు, జగదబి శ్రీరాముడి కల్యాణోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా పలు ఆలయాలు, కూడళ్లలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిపించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదంతో ఆ పరిసరాలన్నీ మార్మోగాయి. రామనామంతో భక్తులు తన్మయంలో మునిగిపోయారు. పలుచోట్ల అన్నప్రసాద వితరణ నిర్వహించి, శోభాయాత్ర చేపట్టారు. – సాక్షి, నెట్వర్క్ -
పక్కాగా.. పారదర్శకంగా..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రైతులకు అత్యంత పారదర్శకమైన, సులభమైన సేవలు అందించేందుకు ప్రభు త్వం సమీకృత భూ భారతి పోర్టల్ (ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్స్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టం)ను ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది. ఇందుకు ప్రయోగాత్మకంగా జిల్లాలోని ఆమనగల్లు మండలాన్ని ఎంపిక చేసింది. ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎన్ఐసీ, సర్వే విభాగాలను ఇకపై ఒకే గొడుగు కిందికి తేనుంది. ఈ పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. తర్వాత జిల్లాలోని మిగిలిన మండలాల్లోనూ దీన్ని అమలు చేయబోతోంది. దీనిలో భాగంగా ప్రతి సర్వే నంబర్‌కు ఆధార్ నంబర్ తరహాలోనే భూధార్ నంబర్ జారీ చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఐదు గ్రామాల్లో సర్వే చేయించి, భూధార్‌ను కేటాయించారు. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో లాగిన్ అయిన వెంటనే సంబంధిత సమాచారమంతా లభిస్తోంది. ఈ పోర్టల్‌లో ప్రధానంగా సమాచార, సర్వే, కరెక్షన్, అప్పీల్, రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు సిటిజన్ డ్యాష్‌బోర్డు సేవలు పొందొచ్చు. భూ భారతిలో 36 మాడ్యూల్స్ ఉండగా, భూ భారతిలో ఒకే గొడుగు కిందికి తెచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో కమతానికి ఒక్కో నంబర్ కందుకూరు డివిజన్ పరిధిలోని ఆమనగల్లు మండలంలో 13 గ్రామ పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ ఉంది. భూ సమస్యలకు సంబంధించి భూ భారతి పోర్టల్‌కు ఇప్పటి వరకు 6,595 దరఖాస్తులు అందాయి. వీటిలో 3,089 సమస్యలకు పరిష్కార మార్గం చూపించారు. 2,536 అభ్యర్థనలను అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతం పోర్టల్‌లో 275 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో తహసీల్దార్ వద్ద 149 పెండింగ్‌లో ఉండగా, ఆర్డీఓ వద్ద 25, అదనపు కలెక్టర్ వద్ద 71, కలెక్టర్ వద్ద 30 దరఖాస్తులు ఉన్నాయి. క్షేత్రస్థాయి నుంచి రిపోర్టులు రాక కొన్ని నిలిచిపోతే..అధికారుల అలసత్వంతో మరికొన్ని ఆగిపోయాయి. త మ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదు. పెద్దల సిఫార్సులు, అడిగినంత ముట్టజెప్పిన వాళ్లకు పెద్దపీట వేస్తూ సాధారణ, మధ్య తరగతి భూ బాధితులను ఏళ్ల తరబడి ఆఫీసు చుట్టూ తిప్పుకొంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమీకృత భూభారతి పోర్టల్‌లో భాగంగా ప్రభుత్వం ఈ మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, లావణి, భూదాన్, వక్ఫ్ భూములతో పాటు పట్టా భూములకు సర్వే నంబర్ల వారీగా పక్కాగా హద్దులు నిర్ధారించి, ఆ వివరాలను భూభారతి పోర్టల్ సహా సబ్‌రిజిస్ట్రార్ పోర్టల్, సర్వే లాండ్స్ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. హద్దుల నిర్ధారణతో పాటు విస్తీర్ణంలో హెచ్చు తగ్గుల సమస్య కూడా పరిష్కారం కాబోతోంది. ప్రతి కమతానికి ఒక ప్రత్యేక నంబర్‌ను కేటాయించడం ద్వారా భూ యజమాని పేరు సహా విస్తీర్ణం, పక్కాగా నిర్ధారించిన హద్దులు, మ్యాప్, భూ స్వ రూపం తెలిసిపోతోంది. సర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు.. ఇక అన్నీ ఒకే గొడుగు కిందకు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా ఆమనగల్లు మండలం ఎంపిక ప్రతి సర్వే నంబర్‌కు ఆధార్ తరహా భూధార్ నంబర్ కేటాయింపు -
ఎస్ఓటీ పోలీసుల దాడులు: మద్యం బాటిళ్ల స్వాధీనం
యాచారం: మండల పరిధిలోని నస్దిక్‌సింగారంలో శుక్రవారం ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. శ్రీరామనవమి రోజు మద్యం విక్రయించరాదని నింబంధనలు ఉన్నప్పటికీ గ్రామంలో రాజు అనే వ్యక్తి మద్యం విక్రయిస్తున్నాడని సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. అతని ఇంట్లో 50 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. యాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యతగా విధులు నిర్వర్తించాలి శంషాబాద్ డీసీపీ రమేష్ ఇబ్రహీంపట్నం రూరల్: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని శంషాబాద్ డీసీపీ రమేష్ పేర్కొన్నారు. ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై సీఐ రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆదిబట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి కృషి కందుకూరు: గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని మండలంలోని గుమ్మడవెల్లి సర్పంచ్ పల్స మహేశ్‌గౌడ్ అన్నారు. శుక్రవారం గ్రామంలో హెచ్ఎండీఏ నిధులు రూ.10 లక్షలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మౌనికసంతోష్, వార్డు సభ్యులు ప్రమీల మహేందర్‌గౌడ్, తిరుమలేష్, అనసూయయాదయ్య, నాయకులు మహేందర్, శ్రీనివాస్‌గౌడ్, బాబురావు, నరసింహగౌడ్, యాదయ్య, అరవింద్, శ్రీశైలంగౌడ్, అల్లె యాదయ్య, సంజీవ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రం ప్రారంభం కందుకూరు: మండల పరిధిలోని తిమ్మాపూర్‌లో అమేజాన్ సంస్థ పునరుద్ధరించిన అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. అక్కడ చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ శాంతిశ్రీ, సర్పంచ్ అంజమ్మ, ఉప సర్పంచ్ సంధ్య, అమేజాన్ మేనేజర్ తాతాజీ, రిషిక, పార్థసారథి, సురేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శ్రీలత, శోభ, సువర్ణ, స్థానిక నాయకులు అమరేందర్‌రెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు. -
బైక్‌పై వెంబడించి.. గోవులను కాపాడి
● మూగజీవాలను తరలిస్తున్న కంటైనర్ల పట్టివేత ● పోలీసులకు అప్పగించిన హిందూవాహిని, బజరంగ్దళ్ సభ్యులు షాద్‌నగర్‌రూరల్: అక్రమంగా గోవులను తరలిస్తు న్న కంటైనర్లను హిందూవాహిని, బజరంగ్దళ్ సభ్యులు పట్టుకున్నారు. బైక్‌పై వెంబడించి గోవు లను అక్రమంగా తరలిస్తున్న మూడు కంటైనర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. శ్రీరామనవమి సందర్భంగా హిందూవాహిని సభ్యులు గురువారం అర్థరాత్రి పట్టణంలోని ముఖ్యకూడలిలో తోరణాలు కడుతున్నారు. అదే సమయంలో మూడు కంటైనర్లు వెళ్తున్నాయి. అనుమానం వచ్చిన వారు కంటైనర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా డ్రైవర్లు వాహనాలను ఆప కుండా అతివేగంగా వెళ్లారు. దీంతో అనుమానం వచ్చిన హిందూవాహిని, బజరంగ్దళ్ సభ్యులు ద్విచక్రవాహనాలతో వెంబడించి రెండు కంటైనర్లను పట్టుకోగా ఒక కంటైనర్ ఆపకుండా వెళ్లిపోయింది. పట్టుకున్న రెండు కంటైనర్లలో చూడగా అందులో 48 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. గోవులను వెంటనే చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణలోని శ్రీకృష్ణ గోశాలకు తరలించారు. విషయం తెలియడంతో మరో వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు గోశాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ సీతారాం తెలిపారు. -
వెల్లివిరిసిన మతసామరస్యం
● శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు ● నిర్దవెళ్లిలో కులమతాలకు అతీతంగా ఉత్సవాలు కేశంపేట: మండల పరిధిలోని నిర్దవెళ్లిలో ముస్లింలు మతసామరస్యం చాటారు. శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలోని హనుమాన్ మందిరంలో నిర్వహించిన ఉత్సవాల్లో అందరితో కలిసిపోయారు. స్వామివారి కల్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ సేవా కార్యక్రమంలో పాల్గొని హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ చెదురువెళ్లి భాస్కర్‌గౌడ్ మాట్లాడుతూ.. పల్లెల్లోని ప్రజలందరూ కులమతాలకు అతీతంగా సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉమాపతి, పల్లాటి కృష్ణయ్య, మైనార్టీ నాయకులు మక్బూల్, జబ్బార్‌ఖాన్, జాహేద్, పాష, బదృద్దీన్, అమేర్, మెహిజ్, అజహర్, గ్రామస్తులు సురేందర్, రంగయ్య, వెంకటయ్య, నారాయణరెడ్డి, మల్లేశ్ పాల్గొన్నారు. -
పుస్తకావిష్కరణ
మహేశ్వరం: శ్రీవత్స వనమాలి సేవా ఫౌండేషన్ తరఫున ప్రచురించిన శ్రీనివాస అను ‘గ్రహ’ నవరత్నాలు పుస్తకాన్ని త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆవిష్కరించారు. ముచింతల్‌లోని ఆశ్రమంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న అనంతరం జీయర్ స్వామిని ఎస్వీఎస్ఎఫ్ నిర్వాహకులు కలిసి ఆశీస్సులు తీసుకుని స్వామీజీ చేతికి ఈ పుస్తకాన్ని అందజేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ విభీషణశర్మ రచించిన ఈ పుస్తకంలో వేంకటేశ్వర సుప్రభాతంలోని తొమ్మిది శ్లోకాలను నవగ్రహాలతో అన్వయించి, సుప్రభాత శ్లోకాలను చదవడం ద్వారా శ్రీనివాసుని అనుగ్రహంతో గ్రహ దోషాలు తొలగిపోతాయని ఈ పుస్తకంలో రచయిత భాష్యం చెప్పారు. వేంకటేశ్వరస్వామి ఆధీనంలోనే నవగ్రహాలు ఉంటాయన్నది ఈ పుస్తకంలోని సారాంశం. చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత అక్కడకు వచ్చిన భక్తులకు ఉచితంగా వితరణ చేశారు. -
శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026
షాబాద్: సీతారాంపూర్‌లో కల్యాణోత్సవానికి హాజరైన భక్తులుతుర్కయంజాల్: అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్సవ విగ్రహాలు కల్యాణం.. రామణీయంమామిడి తోరణాలు.. పూల పందిళ్లు.. ముత్యాల తలంబ్రాలు.. బాజాభజంత్రీలు.. వేదపండితుల మంత్రోచ్చరణలు.. అషేశభక్తజన సందోహం మధ్య రాములోరి కల్యాణోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామనామస్మరణతో ఊరూవాడా మార్మోగాయి. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడ చూసినా కోలాహలం నెలకొంది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. -
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
అంగన్వాడీ కేంద్రం ప్రారంభం కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో పునరుద్ధరించిన అంగన్వాడీ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ● చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు ● విశ్వక్సేనుడి ఆరాధనతో ప్రారంభించిన అర్చకులు మొయినాబాద్: చిలుకూరు బాలాజీ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు శుక్రవారం రాత్రి అంకురార్పణ చేశారు. ఆలయ ప్రధాన మండపంలో స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదట సెల్వర్ కూత్తు.. వేద మంత్రోశ్చరణతో ఆల యాన్ని శుద్ధి చేశారు. అనంతరం పుట్ట బంగారం (పుట్టమన్ను) తెచ్చి హోమగుండాలు ఏర్పాటు చేశారు. అందులో నవధాన్యాలు, పాలికలు కలిపి హోమాలు వెలిగించారు. అనంతరం విశ్వక్సేనుడి ఆరాధన, పుణ్యహవచన కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించిన అనంతరం యజ్ఞం చేపట్టారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. పూజా కార్యక్రమాలు తిరుమల కిరణాచారి, రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, నరసింహన్, కన్నయ్య, కిట్టు, మురళి పాల్గొన్నారు. నేడు ధ్వజారోహణం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణం, శేషవాహనం నిర్వహించనున్నారు. ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతునికి ప్రత్యేక పూజలు నిర్వహిచి ధ్వజస్తంభానికి గరుడ పఠాన్ని ఆరోహణం చేస్తారు. గరుడ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులకు ప్రసాదం పంపిణీ ఉండ దని ఆలయ అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఇంగ్లిష్‌పై అవగాహన అవసరం
పీఆర్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు ఇంగ్లిష్‌పై అవగాహన అవసరమని తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు గుర్రం ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఆదిబట్ల ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇంగ్లిష్ లర్నింగ్ ఎగ్జిబిషన్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు పుస్తకాల ద్వారా మాత్రమే కాకుండా ప్రాక్టికల్‌గా కూడా ఆంగ్లం నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. హెచ్ఎం పరమేశ్, కాంప్లెక్స్ హెచ్ఎం కళా శ్రీనివాస్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. -
చిరుత సంచారం ఆనవాళ్లు లేవు
ఫారెస్ట్ రేంజ్ అధికారి రవిప్రకాశ్ మొయినాబాద్‌రూరల్: నక్కలపల్లిలో చిరుత సంచరించిన ఆనవాళ్లు కనిపించలేవని మృగవని నేషనల్ పార్క్ ఫారెస్ట్ రేంజ్ అధికారి రవిప్రకాశ్ అన్నారు. మంగళవారం సాయంత్రం నక్కలపల్లిలో చిరుత సంచరిస్తుందని పలువురు చూసినట్లు పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన ఆయన బుధవారం గ్రామాన్ని సందర్శించారు. సర్పంచ్ యాదయ్య, ఉపసర్పంచ్ నిరంజన్‌గౌడ్, గ్రామస్తులతో కలిసి చిరుత పులి కనిపించినట్లు చెప్పిన స్థలాన్ని పరిశీలించారు. పాదల ముద్రల ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. -
మహిళ అదృశ్యం
కొత్తూరు: ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని తీగాపూర్ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ నర్సయ్య తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన హంసమ్మ(49) ఈ నెల 24న ఉదయం కోడలితో పడింది. విషయం తెలుసుకున్న ఆమె కొడుకు తల్లి, భార్యకు సర్ధిచెప్పి పని నిమ్తితం బయటకు వెళ్లాడు. కొడుకు వెళ్లిన కాసేపటికి తల్లి హంసమ్మ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. గతంలోనూ గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయి పది రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనిగ పంటకు నిప్పంటించిన దుండగులు కొందుర్గు: పండించిన పంటకు గుర్తు తెలియన వ్యక్తులు నిప్పంటించిన ఘటన చౌదరిగూడ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు అబ్దుల్ ఖదీర్ శనిగ పంట సాగు చేశాడు. ఇటీవల పంటను కోసి కుప్పగా ఉంచాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. బుధవారం రైతు అబ్దుల్ ఖదీర్ ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. మజ్జిగ పంపిణీ ట్యాంకర్ బీభత్సం– ఒకరి మృతి మణికొండ: వాటర్ ట్యాంకర్ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిలుచున్న కార్లతోపాటు పలువురిని ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... టీ గ్రిల్ జంక్షన్ వైపు నుంచి కోకాపేట వైపు వేగంగా వస్తున్న నీటి ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డు పక్కన తన కారులో ఎక్కుతున్న భద్ర(30) అనే వ్యక్తిని ఢీ కొట్టింది. అతని తల, కాళ్లకు తీవ్ర గాయాలు కావటంతో రక్తస్రావం కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత మరో కారును ట్యాంకర్ ఢీ కొట్టింది. అందులో ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి తరలించారు. ట్యాంకర్ డ్రైవర్ ఎం.శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. మండీ బిర్యానీ తిని ఆస్పత్రి పాలు కాప్రా: ఏఎస్‌రావునగర్‌లోని ఓ మండీ హోటల్లో బిర్యానీ తిన్న నలుగురు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నాలుగు రోజుల క్రితం హోటల్‌కు వెళ్లి మండీ బిర్యానీ తిని ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు మొదలవ్వడంతో జమ్మిగడ్డలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. మండీ బిర్యానీ తినడం వల్లే ఆస్పత్రి పాలయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, విషయం తెలుసుకున్న ఫుడ్ సెక్యూరిటీ అధికారులు సదరు హోటల్‌ను పరిశీలించేందుకు వెళ్లగా, అది మూసి ఉంది. హోటల్ మూసి ఉండటంతో ఏమీ తెలుసుకోలేకపోయామని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని కాప్రా సర్కిల్ ఇన్చార్జ్ ఫుడ్ సెక్యూరిటీ అధికారిణి మిలీషా తెలిపారు. -
ఎండల్లో.. వానొచ్చే..
హయత్‌నగర్/చంపాపేట: ఎల్బీనగర్ పరిధిలో బుధవారం వర్షం దంచికొట్టింది. పలు చోట్ల వరద నీరు ఏరులై పారింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోత ఉక్కిబిక్కిరి చేయగా సుమారు గంట పాటు గాలి, వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. అక్కడక్కడా గాలికి చెట్లు నేలకొరిగాయి. రహదారి పక్కన పార్కింగ్ చేసిన కారుపై భారీ వృక్షం కూలిన ఘటన చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్ సింధూర హోటల్ సమీపంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కారును పార్కింగ్ చేసి షాపింగ్‌కు వెళ్లాక ఈ ఘటన జరిగింది. స్థానికులు ఆందోళనతో పరుగులు తీశారు. కారులో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది భారీ వృక్షాన్ని తొలగించారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు
బోయినిపల్లి కూరగాయల మార్కెట్ వద్ద నిరసన చేపట్టిన రైతులు చేవెళ్ల: కూరగాయల మార్కెట్లలో ఎదరవుతున్న సమస్యలపై ప్రశ్నించిన రైతులు, రైతు నాయకులపై కేసులు పెట్టడం సరకాదని రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం చేవెళ్ల ప్రాంతానికి చెందిన పలువురు రైతులు సికింద్రాబాద్‌లోని బోయినిపల్లి కూరగాయల మార్కెట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్లో రైతుల వద్ద నుంచి రూ.వందకు కమీషన్ రూ.4 తీసుకోవాలని ఇతర రాష్ట్రాల కూరగాయలు సీజన్లో తీసుకురావద్దని, సంచుల బరువు తగ్గించవద్దని, అమవాస్యకు, కమీషన్ ఏజెంట్లు మరణించినచో వారి సంతాపంగా మార్కెట్ మొత్తం మూసివేయవద్దనే అంశాలపై రైతుల పక్షాన నిలబడి 2019 అక్టోబర్‌లో నిరసన తెలిపితే అప్పట్లో కమీషన్ ఏజెంట్లు, అప్పటి మార్కెట్ కార్యదర్శి పద్మహర్షలు రైతులపై కక్షపూర్తిగా కేసులు పెట్టించి ఏడేళ్లుగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారన్నారు. కమీషన్ ఏజెంట్ల అక్రమాలపై ప్రభుత్వం, అధికారులు స్పందించాలన్నారు. లేదంటే రైతు నాయకులమంతా కలిసి కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో రైతులు చింపుల సత్యనారాయణరెడ్డి, యాలాల కరుణాకర్‌రెడ్డి, సి.మల్లేశ్, కె.రాజిరెడ్డి, శ్రీరాంరెడ్డి తదితరులు ఉన్నారు. -
స్టీల్ కంపెనీలో భారీ పేలుడు
● ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు ● కార్మికులకు స్వల్ప గాయాలు ● తప్పిన పెను ముప్పు పరిగి: మండలంలోని లక్ష్మీదేవిపల్లి సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. మంటలు ఎగసిపడి దట్టమైన పొగ అలముకుంది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో సమీప పొలాల్లోని రైతులు, పరిశ్రమలోని కార్మికులు భయాందోళనకు గురయ్యారు. బట్టీ వద్ద పని చేస్తున్న కొంత మంది కార్మికులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ప్రమాద స్థలం వద్దకు ఎవ్వరినీ అనుమతించలేదు. తొలుత లారీ టైరు పేలిందని యాజమాన్యం చెప్పుకొచ్చింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంకటేశ్వరి, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలు తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని కార్మికులు వాపోయారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. కార్మికులు మృత్యువాత పడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని పరిశ్రమను మూసి వేయాలని డిమాండ్ చేశారు. -
కోనేటిలో పడి గుర్తు తెలియని వృద్ధురాలి మృతి
మహేశ్వరం: కొనేరులో పడి గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన బుధవారం మండల కేంద్రంలో శివగంగ ఆలయ కొనేరులో చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలో కొలువుదీరిన శివగంగ రాజరాజేశ్వర ఆలయానికి ఉదయం భక్తులు వచ్చారు. ఈ సమయంలో గుర్తు తెలియని వృద్ధ మహిళ కొనేరులో పడినట్లు గుర్తించిన భక్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలి మృతదేహాన్ని బయటకు వెలికితీసి కేసు నమోదు చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలు ఎరుపు చీర, చేతికి పచ్చబొట్లు, బంగారు రంగు గాజులు, మెడలో ఎరుపు రంగు పూసల గొలుసు ధరించి ఉంది. మృతురాలి వయస్సు 55–65 సంవత్సరాల మధ్యన ఉంటుందని.. సంబంధీకులు ఎవరైనా ఉంటే మహేశ్వరం పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు. వివరాలకు ఎస్హెచ్ఓ 87126 62368, 87126 62404 నంబర్లలో సంప్రదించాలన్నారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు అనంతగిరి: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందులో భాగంగా బ్లాక్ స్పాట్లను గుర్తించాలని ఎస్పీ స్నేహమెహ్ర ఆదేశించారు. బుధవారం వికారాబాద్‌లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతిభద్రతలు, పెండింగ్ కేసులు, నేరాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసులపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దొంగతనాల నియంత్రణకు, కేసుల ఛేదనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చోరీ సొత్తు రికవరీ చేసి బాధితులకు అందేలా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. మహిళలు, బాలల భద్రతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాపాలనా – ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బీ రాములు నాయక్, డీఎస్పీలు జానయ్య, శ్రీనివాసులు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. రూ.10 లక్షలతో గ్రామైక్య భవనం సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం -
కొర్రీలు లేకుండా రుణమాఫీ చేయాలి
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి మాడ్గుల: రైతులకు కొర్రీలు లేకుండా రుణమాఫీ చేసి రైతు భరోసా పూర్తిగా అందజేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతం మాధవరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూరియాను యాప్ ద్వారా అందించే విధానంలో లోపాలను సరిదిద్ది, సమయానికి సులభతరంగా పంటకు సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. పాలక వర్గాలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటాన్నారని.. తక్షణమే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో పంట బీమా పథకాన్ని రూపొందించి అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సూదిని రంగారెడ్డి, రైతు సంఘం నాయకులు బిచ్చయ్య, విజయ్, నరేందర్, నర్సింహ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా వృక్ష కల్యాణం
కడ్తాల్: మానవాళికి ప్రాణ వాయువు అందిస్తున్న వృక్షాలపై ప్రతి ఒక్కరూ ప్రేమాభిమానం, గౌరవభావం కలిగి ఉండాలని సీజీఆర్ చైర్పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, సీజీఆర్ వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని అన్మాస్‌పల్లి సమీపంలోని శ్రీరామేశ్వర వీరాంజనేయ జ్ఞాన సరస్వతి ఆలయ ఆవరణలో, సీజీఆర్ చైర్ పర్సన్ లీలాలక్ష్మారెడ్డి దంపతులు ‘రావిచెట్టు–వేప చెట్టు’కు వృక్ష కల్యాణం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వృక్షాలు భగవంతుడి ప్రతి రూపాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనునాయక్, ఉప సర్పంచ్ మహేశ్‌యాదవ్, పంచాయతీ కార్యదర్శి ఇందిరా, మాజీ సర్పంచ్ శంకర్, వేద పండితులు వెంకటేశ్వర శర్మ, నాయకులు జగన్‌గౌడ్, వెంకటయ్యగౌడ్, పాపిరెడ్డి, భజ్యా శ్రీనునాయక్, తదితరులు పాల్గొన్నారు. -
చమురు కొరత.. బంకుల మూత
బంకుల వద్ద భారీ ‘క్యూ’ శంకర్పల్లి: యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఉంటుందని వదంతులు పెద్దఎత్తున వ్యాప్తి చెందడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా అవకాశం ఉన్న బంకుల్లో పెట్రోల్, డీజిల్ కోసం కిలోమీటర్ల కొద్ది క్యూలు కడుతున్నారు. దీనికి తోడు కొంతమంది డబ్బాలను తీసుకొచ్చి, పెట్రోల్, డీజిల్‌లను తీసుకొని వెళ్తుండడం గమనార్హం. అయితే నిబంధనల ప్రకారం డబ్బాలలో ఇంధనం పోయకూడదని ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. పలుచోట్ల రోజు కంటే ఎక్కువ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు అవుతుండడంతో నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీ గోదాం వద్ద వందల కొద్దీ జనాలు తమ ఖాళీ సిలిండర్లతో క్యూలు కట్టి, తీసుకెళ్తున్నారు. కొరత వదంతులపై బంకు యజమానులతో మాట్లాడగా.. గతంలో మాదిరే ఇంధనం వస్తుందని, జనాలు అవసరం లేకున్నా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లడంతో ఇబ్బంది తలెత్తుందన్నారు. మొయినాబాద్: రెండు రోజులుగా పెట్రోల్, డీజీల్ కోసం బంకుల్లో వాహనదారులు బారులు తీరుతున్నారు. వినియోగదారులు వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకోవడంతోపాటు డబ్బాల్లో నింపుకొంటున్నారు. బుధవారం సాయంత్రం వరకు భారీగా వాహనాలు క్యూకట్టాయి. సాయంత్రం 5 గంటల తరువాత స్టాక్ అయిపోవడంతో ఒక్కొక్కటిగా బంకులన్నీ మూసివేసి నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఇబ్బంది పడుతున్న వాహనదారులు -
యాక్షన్ ప్లాన్‌తో గ్రామాల అభివృద్ధి
చేవెళ్ల: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌తో గ్రామాల అభివృద్ధి చెందుతాయని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) సురేశ్‌మోహన్ అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని రేగడిఘనాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, క్రీడా ప్రాంగణాలను సందర్శించి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిప్పని మాధవిరాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఈదులపల్లి మహేశ్వరిరాములు, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు ఉన్నారు. డీపీఓ సురేశ్‌మోహన్ -
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
కార్పొరేషన్ ఈడీ పద్మావతి ఇబ్రహీంపట్నం రూరల్: ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్సీ కార్యచరణ ప్రణాళిక 2025–26 గాను రవాణా రంగం కింద ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు రైతులకు సబ్సిడీ రుణాలు అందించనున్నట్లు కార్పొరేషన్ ఈడీ పద్మావతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 2 వరకు ఎస్సీ నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె కోరారు. వ్యవసాయ పథకంలో వ్యవసాయ డ్రోన్, వ్యవసాయ యంత్రములు, పశుపోషణ పాడి పరిశ్రమ, పట్టు పరిశ్రమ, తోటల పెంపకం, కిసాన్ నర్సరీ, అయిల్‌పామ్ సాగు, బోర్ బావితో సబ్ మెర్సిబుల్ పంపు సెట్, సర్వీస్ కనెక్షన్ కోసం రూ.70 వేల–రూ.5 లక్షల వరకు సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు. ఆహార భద్రత కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రము, లైసెన్స్ ఉండాలి. ఎలక్రిక్ట్ ద్విచక్ర వాహనాలను గిగ్ కార్మికులకు ప్రాధాన్యత, దివ్యాంగులు సదరమ్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, భూమి ధ్రువీకరణ పత్రాలను ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. షాద్‌నగర్‌రూరల్: ఫీ ఫర్ స్టెమ్ తెలంగాణ, స్టెల్లార్ స్కాలర్షిప్ అవార్డులను షాద్‌నగర్ ప్రభుత్వ గురుకుల డిగ్రీ, పీజీ మహిళా కళాశాల నుంచి ఇద్దరు అందుకున్నారు. హైదరాబాద్‌లోని విజ్ఞాన్ కళాశాల, ఇంటర్నేషనల్ సంస్థ సహకారంతో బుధవారం నిర్వహించిన కల్పన ఫీ ఫర్ స్టెమ్ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వారికి అవార్డులు అందజేశారు. ఈ అవార్డు కింద ఒక్కొక్కరికి రూ.5 వేల నగదు, ల్యాప్‌టాప్ అందజేశారు. అవార్డులు అందుకున్న పూజ, మానసను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతా పోలే, కోఆర్డినేటర్ అఫ్రోజ్ జహాన్, పరమేశ్వరి తదితరులు అభినందించారు. శాసన సభ సమావేశాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ రైతులకు అదనంగా స్ప్రింక్లర్లు మంజూరు చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని వెల్దండ, కడ్తాల మండలాలకు గోదాములు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని.. అవసరమైన టార్పాలిన్ కవర్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే తమ నియోజకవర్గానికి 1,500 స్ప్రింక్లర్లు మంజూరు చేసిందని, అదనంగా మరో 2,000 యూనిట్లు మంజూరు చేయాలని కోరారు. 28 మంది బృందంలో ఎస్జీటీ బాలాజీ చేవెళ్ల: ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధి పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి విద్యావిధానాలపై అవగాహన కల్పించేందుకు 28 మంది ఉపాధ్యాయుల బృందాన్ని ఫిన్లాండ్ పర్యటనకు ఎంపిక చేసింది. ఈ జాబితాను మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇ.నవీన్ నికోలస్ విడుదల చేశారు. హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఉన్న ఈ బృందంలో దామరగిద్ద ప్రాథమికోన్నత పాఠశాల ఎస్జీటీ కొయిలకొండ బాలాజీ ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యూకేషనల్ ఎక్చేంజి ప్రోగ్రాంలో భాగంగా తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం నూతన విద్యావిధానం అమలుచేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో విద్యావిధానాలను పరిశీలించి, ఉత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకంతో ఎంపిక చేసిన విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
సెంట్రల్ సివిల్ పెన్షనరీ రూల్స్ అమలు చేయండి
రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యానారాయణ ఇబ్రహీంపట్నం రూరల్: రిటైర్డ్ ఉద్యోగులకు సెంట్రల్ సివిల్ పెన్షనరీ రూల్స్ అమలు చేయాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం డీఆర్ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ శర్మ, జనరల్ సెక్రెటరీ సుధాకర్, ప్రధాన కార్యదర్శి రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. తైబజార్ వేలం వాయిదా యాచారం: మాల్ పశువుల సంత నిర్వహణ వేలం బుధవారం పంచాయతీ కార్యాలయం వద్ద పోటాపోటీగా జరిగింది. పలువురు వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. సర్పంచ్ అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో మండల పంచాయతీ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. పలువురు పోటీపడగా అందులో మాల్ గ్రామానికి చెందిన నిమ్మరాజు జంగయ్య రూ.1.05 లక్షలకు దక్కించుకున్నాడు. కాగా తైబజార్ వేలం వాయిదా పడింది. -
మరింత జఠిలం
స్టీల్ కంపెనీలో పేలుడు పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ● రాక్‌షీట్ జోన్లో ఆశించిన స్థాయిలో ఇంకని వర్షపు నీరు ● సరూర్‌నగర్, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్‌లలో 12 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలాలు ● ‘సాక్షి’తో భూగర్భ జలవనరులశాఖ అధికారి మాధవరావు సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘నెత్తిన నిండు కుండలా తొనికిసలాడే జంట జలాశయాలు ఉన్నా.. వాటి కింది భాగంలోని గండిపేట, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలాల్లోని భూగర్భ జలాలు వేగంగా పాతాళానికి పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కురిసిన ప్రతీ వర్షపు నీటిబొట్టును ఒడిసి పట్టినప్పుడే.. భూగర్భ జలాల మనుగడ కొనసాగుతుంది. లేదంటే భవిష్యత్ తరాలకు మరిన్ని ఇబ్బందులు తప్పవు’అని భూగర్భ జల వనరులశాఖ జిల్లా అధికారి మాధవరావు అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే.. ఈ ఏడాది భూగర్భజల మట్టం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ.. అధిక వినియోగం ఆ నీటి మట్టాన్ని మరింత లోతుకు దిగజార్చుతోంది. ప్రధానంగా గండిపేట పరిసర ప్రాంతాల్లోని కోకాపేట్, నియోపోలీస్, శేరిలింగంపల్లి ఏరియాల్లో నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక్కడ 70 మీటర్ల లోతుకు వెళ్తే కానీ.. ఆనవాళ్లు కన్పించడం లేదు. 24 బేసిన్లు.. 90 ఫీజో మీటర్లు భూగర్భ జలాల అధ్యయనం కోసం జిల్లాను 24 బేసిన్లుగా విభజించాం. ఒక్కో మండలంలో మూడు చొప్పున జిల్లా వ్యాప్తంగా 90 ఫీజో మీటర్లను ఏర్పాటు చేశాం. ఆయా ఫీజో మీటర్లను సెన్సార్ టెలిమెట్రీ సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేశాం. ఆయా బోరుబావుల్లో ఉన్న నీటిమట్టాన్ని ప్రతీనెలా రికార్డు చేస్తున్నాం. జిల్లాలో పట్టణీకరణ, నిర్మాణాలు ఎక్కువగా ఉన్న గండిపేట, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మణికొండ, నియోపోలీస్, కోకాపేట వంటి ప్రాంతాలన్నీ పూర్తిగా రాతిపొరలతో కూడి ఉన్నాయి. వీటి నెత్తిన జంట జలాశయాలున్నా.. రాక్‌షీట్, కాంక్రీట్ జంగిల్ వల్ల ఆశించిన స్థాయిలో నీరు ఇంకని పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ 250 అడుగులు దాటితే కానీ నీటి ఆనవాళ్లు కన్పించడం లేదు. కాంక్రీట్ జంగల్‌గా మారడంతో.. వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి. సీసీ రోడ్లు, భారీ నిర్మాణాలతో పూర్తిగా కాంక్రీట్ జంగల్‌గా మారింది. సెప్టెంబర్/అక్టోబర్ మాసాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ.. భూమి పొరల్లోకి ఆశించిన స్థాయిలో నీరు ఇంకకపోవడం.. చెరువులు, కుంటల్లో ఉన్న కొద్దిపాటి నీరు కూడా కన్పించకుండా పోతోంది. డిసెంబర్ చివరిలో కొంత ఆశాజనకంగా కన్పించిన భూగర్భ జలాలు.. మార్చి చివరి నాటికి మరింత లోతుకు పడిపోయాయి. శేరిలింగంపల్లిలో డిసెంబర్లో 11.93 మీటర్ల లోతులో కన్పించిన నీటి ఆనవాళ్లు.. ఫిబ్రవరి చివరి నాటికి మరింత లోతుకు పడిపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే మూడు మీటర్ల లోతుకు పడిపోయింది. ఇక సరూర్‌నగర్, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్‌లలో 9 మీటర్ల నుంచి 12 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం. సాధారణంగా వ్యవసాయ మోటార్లు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణ ప్రాంతాల్లోనే వేగంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతీ ఇంటికి విధిగా ఒక రీచార్జి గుంతను తవ్వాలి. ఇంటిలోని బోరుబావిలో నీరు పుష్కలంగా ఉండాలంటే వాన నీటి ఇంకుడు గుంతలే ఏకై క మార్గం. నాలుగు నుంచి ఆరు అడుగుల విస్తీర్ణం, ఎనిమిది అడుగుల లోతులో గుంతను తవ్వుకోవాలి. గుంత కింది నుంచి 4 అడుగుల వరకు 40 ఎంఎం కంకర వేసుకోవాలి. ఆ తర్వాత రెండు అడుగులు 20 ఎంఎం కంకర, ఆపైన దొడ్డు ఇసుక వేసుకోవాలి. గుంట చుట్టూ గోడకట్టాలి. ఇంటిపై కురిసిన వర్షపు నీరు పైపుల ద్వారా నేరుగా గుంతలో పడేలా చేసుకోవడం ద్వారా భూగర్భజలాలను పెంచుకోవచ్చు. పాడైన బోరు బావుల చుట్టూ తవ్వుకుని, కేసింగ్‌పైపు చుట్టూ కంకర, ఇసుకను అమర్చి, పైపు చుట్టూ చిన్న చిన్న రంద్రాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భజలాలను పెంచుకోవచ్చు. వరదనీటిని ఊరి చివరలో వట్టిపోయి వృథాగా ఉన్న పాడుబడ్డ బావిలోకి మళ్లించడం ద్వారా కూడా భూగర్భ జలాలను పెంచుకోవచ్చు. -
5
కొత్తగా మరో..సాక్షి, రంగారెడ్డి జిల్లా: నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జిల్లాలో కొత్తగా మరో ఐదు అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 24,46,265 మంది ఉండగా, 2024 డిసెంబర్ నాటికి కేవలం 18 ఏళ్లు నిండిన ఓటర్ల సంఖ్యే 35,91,987కు చేరడం గమనార్హం. వీరిలో 526 గ్రామ పంచాయతీల పరిధిలో 7,94,653 మంది ఓటర్లు ఉండగా, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 1,75,974 మంది ఉన్నారు. మిగిలిన 25,51,793 మంది పూర్తిగా నగరంలోనే ఉన్నారు. శేరిలింగంపల్లిలో రెండు అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల జాబితాలో శేరిలింగంపల్లి మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఉన్నాయి. చేవెళ్ల, కల్వకుర్తి, షాద్‌నగర్‌లలో రెండున్నర లక్షల లోపు ఓటర్లు మాత్రమే ఉన్నారు. అత్యధిక ఓటర్లు ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి గచ్చిబౌలి, మియాపూర్ కేంద్రాలుగా మరో రెండు నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ నాలుగింట్లో మరో మూడు రాజేంద్రనగర్‌లో కొత్తగా శంషాబాద్ ఏర్పడనుంది. మహేశ్వరం నుంచి కొత్తగా సరూర్‌నగర్ పేరుతో మరో నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్బీనగర్ నుంచి కొత్తగా హయత్‌నగర్ పేరుతో మరో నియోజకవర్గం పుట్టుకొచ్చే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నంలో కొంత భాగాన్ని కూడా దీనిలో కలిపే చాన్స్ లేకపోలేదు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న ఎనిమిది నియోజకవర్గాల సంఖ్య 13కు చేరే అవకాశం ఉంది. ఈ మేరకు కొత్త నేతలకు అవకాశాలు లభించనున్నాయి.2024 డిసెంబర్ నాటికి ఓటర్లు ఇలా.. నియోజకవర్గం ఓటర్లు చేవెళ్ల 2,02,005 కల్వకుర్తి 2,41,762 షాద్‌నగర్ 2,36,338 ఇబ్రహీంపట్నం 3,27,589 మహేశ్వరం 5,46,577 రాజేంద్రనగర్ 5,81,937 ఎల్బీనగర్ 5,93,712 శేరిలింగంపల్లి 7,32,506జిల్లా పరిధిలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు త్వరలో నియోజకవర్గాల పునర్విభజన! 8 నుంచి 13కు చేరే అవకాశం మారనున్న రాజకీయ ముఖచిత్రం -
నిర్మాణ పనులు వేగిరం చేయాలి
● రాష్ట్ర విద్యా శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ● ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ పరిశీలన మంచాల: వచ్చే నెల 11న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. మండలంలోని ఆరుట్లలో కొనసాగుతున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే ఆరుట్ల మాదిరిగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. నిరుపేదలకు నాణ్యమైన విద్య అందించడమే గాకుండా కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పాఠశాలలను నిర్వహించి మార్పు తేవాలని ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్వహణ కోసం సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఎఫ్ ఫోరం సభ్యులు పద్మషా, ప్రధానోపాధ్యాయుడు గిరధర్గౌడ్, ఉప సర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోండి
యాచారం: ఫార్మాసిటీ భూసేకరణలో నష్టపోయిన రైతులకు మెరుగైన పరిహారం అందజేసి, ఆదుకోవాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కలెక్టర్ నారాయణరెడ్డిని కోరారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఫార్మాసిటీ భూ బాధిత గ్రామాలైన నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద, తాడిపర్తి గ్రామాల రైతులతో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బలవంతపు భూసేకరణతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. వివాదాల్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించి తగిన పరిహారం అందజేయాలని అన్నారు. స్పందించిన కలెక్టర్ త్వరలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు తాడిపర్తి సర్పంచ్ నీలం ఝాన్సీ రైతు భరోసా నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పల్లె వినయ్, దార సత్యం, కొత్త రవి, సామ నిరంజన్, నాగని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి, డ్రగ్స్ కదలికలపై నిఘా పెట్టండి
కడ్తాల్: జిల్లాలోని కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో గంజాయి, డ్రగ్స్ మాదకద్రవ్యాల వినియోగం కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ఎకై ్సజ్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ ప్రణవిని కలిసి వినతిపత్రం అందజేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణ, వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లోని యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, నేరాల పెరుగుదల, రోడ్డు ప్రమాదాల వంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆమె దృష్టికి తెచ్చారు. ఆయా మండలాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి డ్రగ్స్, గంజాయి కదలికలను అరికట్టాలని కోరారు. ఈ మేరకు అసిస్టెంట్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ధర నిమ్మదిరిగేలా.. సాక్షి, సిటీబ్యూరో: మార్కెట్లో నిమ్మకాయల ధరలు దిమ్మతిరిగిపోతున్నాయి. అకాల వర్షాలు, ఉత్పత్తులు పడిపోవడంతో వంటి కారణాలతో ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్లో ఒక నిమ్మకాయ రూ.10 పలుతోంది. దారుషిఫా హోల్‌సేల్ మార్కెట్లో 25 కిలోల నిమ్మకాయల బస్తా ప్రస్తుతం రూ.2,000 నుంచి రూ.3,500 చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ నాణ్యత నిమ్మకాయలు టోకు మార్కెట్లో బస్తాకు రూ.1,500 నుంచి రూ.1,800కు అమ్ముడవుతున్నాయి. స్థానిక మధ్యవర్తులు రైతుల నుంచి నిమ్మకాయలను కొనుగోలు చేసి ఢిల్లీ వ్యాపారులకు అమ్ముతున్నారు. అక్కడ వారికి మంచి ధర లభిస్తోంది. దీని కారణంగా స్థానికంగా సరఫరా కూడా తగ్గిపోయాయి అని చాదర్‌ఘాట్‌లోని నిమ్మ వ్యాపారి సయ్యద్ రఫీ చెప్పారు. -
బంకుల్లో బారులు
మొయినాబాద్: ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోయాయనే వదంతులతో వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కోసం పరుగులు తీశారు. బంకుల్లో భారీగా వాహనాలు క్యూకట్టాయి. మంగళవారం మొయినాబాద్‌లోని పెట్రోల్ బంకుల్లో భారీగా వాహనాలు క్యూకట్టాయి. దేశంలో పెట్రో నిల్వలు తగ్గాయని.. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ రావడంలేదని రెండు రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో బంకులకు పరుగెత్తి డబ్బాలు, బబుల్స్‌లో పోయించుకుంటున్నారు. వాహనా ల్లోనూ ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం పరుగులు -
బీజేపీతోనే దేశాభివృద్ధి
శంకర్పల్లి: దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ అన్నారు. మండలంలోని ప్రొద్దటూరులో మంగళవారం నిర్వహించిన పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలోని కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మండల, మున్సిపల్ అధ్యక్షులు లీలావతి, దయాకర్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రాములు, పరమేశ్వర్‌రెడ్డి, సురేశ్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. రూ.1.81 కోట్లు పలికిన తైబజార్ వేలంతుక్కుగూడ: తైబజార్ (వారపు పశువుల సంత) బహిరంగ వేలం 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను మంగళవారం తుక్కుగూడ వార్డు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహించారు. ఈ వేలంలో రూ.కోటి 81 లక్షల 71 వేలకు రావిర్యాల గ్రామానికి చెందిన బోధ పాండురంగారెడ్డి దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా శంషాబాద్ సర్కిల్ డీసీ సుమన్‌రావు పాండురంగారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో శంషాబాద్ సర్కిల్ ఎస్టేట్ అధికారి టి.పర్వతాలు, టీఐ మల్లేష్, వ్యాపారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. ఆ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించండి ఆమనగల్లు: హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు రోడ్డును ఆరులేన్లుగా విస్తరించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో మంగళవారం హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణపై మాట్లాడారు. రోడ్డు రెండు లేన్లుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విస్తరణకు నిధులు మంజూరయ్యాయా.. అయితే పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై ఫిల్మ్‌సిటీ దాటిన తరువాత కిలోమీటర్ దూరంలో విద్యాసంస్థలు అధికంగా ఉన్నాయన్నారు. విద్యార్థులు రోడ్డు దాటడానికి ఇబ్బందులు పడుతున్నందున ఫుట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మించాలని కోరారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. -
ప్రగతి ప్రణాళిక పక్కాగా ఉండాలి
సాక్షి రంగారెడ్డి జిల్లా: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్‌తో కలిసి జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీల వారీగా పారిశుద్ధ్య పనులు, విద్యుత్‌కు సంబంధించిన మరమ్మతులు, భవనాల మరమ్మతులు, పెయింటింగ్ వంటి పనులు పూర్తి చేయాలన్నారు. కార్యాలయాల పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్ పూర్తి చేయాలని, ఏ ఒక్క శాఖలో ఒక్క ఫైల్ కూడా పెండింగ్‌లో ఉండకూడదన్నారు. మంజూరైన పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు వాటి పరిసరాలు సైతం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఫైళ్లు క్లియర్ చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో తమకు నిర్దేశించిన పనులు పూర్తి చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం వేసవి కాలం అయినందున ఏ ఒక్కచోట కూడా తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, పైపు లీకేజులు లేకుండా చూడాలని, ఎక్కడా నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట బోరు మోటార్లు, హ్యాండ్ పంపులు, ఇతర తాగునీటి వనరులకు మరమ్మతు పనులు జరిపించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీఓలు సమన్వయంతో, సమష్టిగా పని చేయాలని కోరారు. సమావేశంలో డీఆర్ఓ సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేశ్ మోహన్, సీపీఓ సౌమ్య, డీఆర్డీఏ పీడీ శ్రీలత, వ్యవసాయాధికారి ఉష, పౌరసరఫరాల అధికారి వనజాత, మేనేజర్ హరీష్, మిషన్ భగీరథ, ఆర్అండ్ బీ, సంక్షేమ శాఖ అధికారులు రామరావు, నవీన్ కుమార్ రెడ్డి, కేశురాం, కె.రామేశ్వరి దేవి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నారాయణరెడ్డి -
ప్రజావాణి అర్జీలను నిర్లక్ష్యం చేయొద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను హెచ్చరించారు. సమీకృత కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ వారం మొత్తం 53 ఫిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మున్సిపాలిటీ, మండల అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. న్యాయబద్ధంగా భూసేకరణ చేపట్టాలి టీజీఐఐసీకి తిమ్మాపూర్‌లో చేపడుతున్న భూ సేకరణ చట్టబద్ధంగా నిర్వహించాలని రైతులు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 38,162లో ఒరిజినల్ రైతులకు అన్యాయం చేయొద్దన్నారు. ఎంజాయ్మెంట్ సర్వేకు పూర్తి భిన్నంగా చేపడుతున్నారని, క్షేత్ర స్థాయిలో వచ్చి చాలామంది రైతులకు గుంట నుంచి రెండు ఎకరాల వరకు తగ్గించారన్నారు. ఇలా చేయడంతో పరిహారం తక్కువగా వస్తోందని వాపోయారు. రైతులకు పాసుపుస్తకాల్లో ఉన్నట్లు పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో రైతులు రామచంద్రయ్య, యాదయ్య, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. -
జానపద కళాకారుడు అశోక్ మృతి
పలువురి సంతాపం తాండూరు టౌన్: తాండూరు పోతరాజుగా పేరు తెచ్చుకున్న జానపద కళాకారుడు అశోక్ గుండె పోటుతో మృతి చెందాడు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఛాతీలో నొప్పి పెరగడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఆయన మృతితో తాండూరులో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన పాశ్చాత్య, జానపద నృత్య ప్రదర్శన లతో అనేక స్టేజి ప్రోగ్రాంలు ఇచ్చారు. సుమారు 300 సార్లు పోతురాజు వేషం వేశారు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం పోతరాజు వేషంతో నృత్య ప్రదర్శన ఇచ్చారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 9 జాతీయ స్థాయి అవార్డులు, కళాపోషక అవార్డు, నాట్యశ్రీ అవార్డు, కల్పశ్రీ నాట్యకళా విభూషణ అవార్డు, ఉత్తమ జానపద కళాకారుడిగా తెలంగాణ ప్రభుత్వ అవార్డు తదితరాలను ఆయన సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా 23 చిన్న బడ్జెట్ సినిమాల్లో కూడా నటించారు. జబర్దస్త్ కామెడీ షోలో 9 ఎపిసోడ్లలో నటించారు. ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీని స్థాపించి, అనేక మంది యువతీ, యువకులకు జానపద నృత్యంలో శిక్షణ ఇచ్చి, ఉత్తర, ఈశాన్య భారత్‌లో అనేక ప్రదర్శనలు ఇప్పించారు. మృతుడు అశోక్‌కు భార్య, కొడుకు ఉన్నారు. తాండూరు పోతరాజుగా పేరు పొందిన అశోక్ మృతి పట్ల పలువురు అభిమానులు, కళాకారులు, పట్టణ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కలప వాహనం సీజ్ ధారూరు: అక్రమంగా కలప తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని సోమవారం అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. ధారూరు ఫారెస్టు పరిధిలోని ముద్దాయిపేట్ నుంచి పరిగి పట్టణానికి కలప తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సంగాయిపల్లి తండాకు రమావత్ రాజు అనుమతి లేకండా కలప రవాణ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్యక్రమంలో ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు కనకరాజు, కాశయ్య, వాచర్లు శ్రీధర్, నర్సింగ్, అఫ్రీది పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ బరువులో తేడా విచారణ చేపట్టిన అధికారులు అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ సరఫరా చేసిన గ్యాస్ సిలిండర్ నిర్ణీత బరువు కంటే తక్కువగా ఉండటాన్ని గమనించిన ఓ వినియోగదారుడు పంపిణీదారులను ప్రశ్నించారు. దీంతో పాటు సంబంధిత అధికారులకు సమాచారం అందించాడు. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సదరు వినియోగదారుని వద్ద గ్యాస్‌ను చెక్ చేయగా ఫుల్ సిలిండర్ బరువు(గ్యాస్‌తో కలిసి) ఉండాల్సిన బరువు కంటే సుమారు కిలో తక్కువగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం అధికారులు సదరు గ్యాస్ గోదాం వద్దకు వెళ్లి ఇతర సిలిండర్లను చెక్ చేశారు. అక్కడ సిలిండర్లు సరైన బరువు ఉన్నట్లు గుర్తించారు. తక్కువ బరువు వచ్చిన గ్యాస్‌ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. వినియోగదారుల ఫిర్యాదుతో పరిశీలించగా నిర్ణీత బరువు కంటే తక్కువగా ఉండటాన్ని గమనించామని తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేసిన ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన తెలిపారు. -
ఉంటే సరి.. లేదంటే రద్దే మరి!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూం ఇళ్లు పొంది, వాటిలో నివసించని లబ్ధిదారులపై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారులు ఇప్పటికే ఆయా నిర్మాణాల్లోని లబ్ధిదారులపై సర్వే చేశారు. అర్హులతో పాటు నకిలీలకు నోటీసులు జారీ చేశారు. అర్హులంతా ఈనెల 31లోగా ఆయా ఇళ్లలోకి వచ్చి చేరాలని, లేదంటే ఏప్రిల్ మొదటి వారం తర్వాత కేటాయింపులు రద్దు చేయాలని నిర్ణయించింది. వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి, ఆయా నివాసాలను కేటాయించాలని భావిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు లేకపోవడంతో వారి కోసం జిల్లాలోని శంకర్పల్లి, తట్టి అన్నారం, బండరావిర్యాల, తిమ్మాయిగూడ, హత్తిగూడ, మన్సాన్పల్లి, నార్సింగి సహా మొత్తం పది ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. మూడేళ్ల క్రితమే జీహెచ్ఎంసీ అధికారుల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేసి, ఆయా ఇళ్లను కేటాయించారు. ఇళ్లు పొందిన మెజార్టీ లబ్ధిదారులు ఇప్పటికీ గృహ ప్రవేశాలు చేయలేదు. గత నవంబర్‌లో 3,098 మంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశారు. పట్టణానికి, పని ప్రదేశానికి ఈ నిర్మాణాలు దూరంగా ఉండటం, సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో మెజార్టీ లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. చేతిలో పట్టా ఉన్నా.. అర్బన్ ప్రాంతాల్లోని నిర్మాణాల పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని నందనవనం, మీర్‌పేట, కుర్మల్‌గూడ, వనస్థలిపురం, నాగోలు వంటి ప్రాంతాల్లోని ఇళ్లను అనర్హులు ఆక్రమించేశారు. వీరికి స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో ఇతర ప్రాంతాల్లోని అర్హులను అడ్డుకుంటున్నారు. అనర్హులను ఖాళీ చేయించకపోవడంతో అర్హులైన లబ్ధిదారులు సొంతింటికి దూరమయ్యారు. గత నవంబర్‌లో హౌసింగ్, రెవెన్యూ అధికారులు ఆయా ఇళ్లను తనిఖీ చేసి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఇప్పటికీ ఖాళీ చేయలేదు. కరెంట్ సరఫరా, మంచినీటి కనెక్షన్లు అధికారికంగా ఇవ్వకపోయినప్పటికీ .. సమీపంలోని విద్యుత్ వైర్ల నుంచి దొంగతనంగా విద్యుత్‌ను వాడుతున్నారు. మంచినీటి పైపులైన్లకు మోటార్లు బిగించి నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా నందనవనంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కళ్లముందే కరెంట్ చౌర్యం జరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. చేతిలో ప్రభుత్వం జారీ చేసిన ఇళ్ల మంజూరు పత్రం ఉన్నా ఇంట్లోకి అడుగు పెట్టలేని పరిస్థితి. ఖాళీగా ఉన్నవి కొత్తవాళ్లకు.. ‘ఇళ్లు పొందిన లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లలో తప్పకుండా నివసించాలి. లేదంటే ఏప్రిల్ మొదటి వారం తర్వాత రద్దు చేస్తాం. అంతేకాదు నిర్మాణం పూర్తై..ఖాళీగా ఉన్న ఇళ్లను అర్హులకు మార్చి 31లోగా కేటాయించాలి’ అని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ‘అధికారులు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎల్–2 జాబితాలోని పేదలను గుర్తించి, వారికి ఆయా ఖాళీ ఇళ్లను కేటాయించాలి. ఇందిరమ్మ కమిటీల సహాయంతో ఎంపిక చేసిన లిస్టును జిల్లా మంత్రి ఆమోదంతో గజిటెడ్ ఆఫీసర్ ద్వారా ధ్రువీకరణ చేసి మంజూరు చేయాలి. ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇళ్లు పొంది, గృహ ప్రవేశం చేయని వారిని గుర్తించి, వారికి మరోసారి నోటీసులు జారీ చేయాలి. అయినా ముందుకు రాని వారి పేర్లను ఏప్రిల్ మొదటి వారం తర్వాత రద్దు చేసి, వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలి’ అని ఆదేశించారు. గృహ ప్రవేశం చేయని డబుల్ బెడ్రూం లబ్ధిదారులు -
వీరుల ఆశయ సాధనకు కృషి చేయాలి
షాద్‌నగర్‌రూరల్: దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన విప్లవవీరుల ఆశయ సాధనకు యువత ముందుకు సాగాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన భగత్‌సింగ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ 95వ వర్థంతిని పురస్కరించుకొని చేపట్టిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ ఆమంచినాగేశ్వర్ హాజరై భగత్‌సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రంకోసం ఎందరో వీరులు అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సమాజంలో సమానత్వం, శోషణరహిత వ్యవస్థకోసం పోరాడిన గొప్ప విప్లవకారులని కొనియాడారు. భగత్‌సింగ్ తన రచనలు, ప్రసంగాలతో సామాజిక అసమానతలు, కుల వివక్ష, ఆర్థిక దోపిడీపై తీవ్రంగా స్పందించారని గుర్తు చేశారు. భగత్‌సింగ్ కలలు కన్న సమాజ నిర్మాణంకోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. విద్యారంగాన్ని రక్షించుకోవడానికి విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈనగంటి వెంకటేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో ఎంఈఓ మనోహర్, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప, ప్రజా సంఘాల నాయకులు కుర్మయ్య, వెంకటరమణ, రాజు, నర్సింలు, జనార్దన్, శ్రీనునాయక్, ఈశ్వర్‌నాయక్, శ్రీకాంత్, పవన్‌చౌహాన్, ఆకాష్నాయక్, లక్ష్మణ్‌కుమార్, చంద్రమౌళి, లక్ష్మి, మహ్మద్‌బాబు, రాజు, చరణ్, బబ్లూ, అజయ్‌రెడ్డి, యశ్వంత్, ఆదిల్ పాల్గొన్నారు. -
రాంమనోహర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
హుడాకాంప్లెక్స్: భారతదేశ రాజకీయ సామాజిక చరిత్రలో దేశభక్తి విలువలకు కట్టుబడి ఉన్న మహనీయుడు డాక్టర్ రాంమనోహర్ లోహియా అని సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి అన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం కొత్తపేట చౌరస్తాలో డాక్టర్ రాంమనోహర్ లోహియా జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పాశం యాదగిరి మాట్లాడుతూ.. మహిళా విద్య, సామాజిక సమానత్వం, రాజకీయ స్వచ్ఛతపై రాంమనోహర్ లోహియా ఆలోచనలు అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య సమానత్వం తీసుకురావాలని లోహియా పోరాడారని గుర్తు చేశారు. గ్రామ స్వరాజ్యం రావాలన్నిది ఆయన కల అన్నారు. కాచం సత్యనారాయణ మాట్లాడుతూ.. లోహియా స్థాపించిన సోషలిస్టు పార్టీలో ఆయనకు ప్రధానమైన ఇద్దరు శిశ్యులు ములాయం యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిలంచాలని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడుతున్న బీసీ నాయకులు రాంమనోహర్‌లోహియా ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగితే తెలంగాణ రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా మొత్తం బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో నాటి నుంచి నేటి వరకు తన వెంట ఉండి ముందు నడిపించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్‌రెడ్డి, టీయూసీసీ చైర్మన్ మురళీధర్దేశ్పాండె, పల్లె వినయ్‌కుమార్, బీరెల్లి వెంకటరెడ్డి, ఉప్పల శ్రవణ్‌కుమార్ దర్శన్, కూర రమేష్, శ్రీనివాస్, శైలజ, మధు, నర్సిరెడ్డి, శేఖర్, కోటి, మహేందర్, రాజుయాదవ్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు, ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. -
అంతా పథకం ప్రకారమే..
షాద్‌నగర్‌రూరల్: బండరాయితో మోది మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. ఫరూఖ్‌నగర్ మండలం దేవునిపల్లి పంచాయతీ పరిధిలోని రంగారెడ్డిగూడకు చెందిన శోభ (33) కొన్నేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండకు చెందిన రాజును కులాంతర వివాహం చేసుకుంది. వారికి బాబు మహేందర్ ఉన్నాడు. కొంత కాలం తరువాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అనంతరం నాలుగేళ్ల క్రితం శోభ మహబూబ్‌నగర్‌లోని వీరన్నపేటకు చెందిన నర్సింలును రెండో వివాహం చేసుకుంది. వారికి పాప మమత ఉంది. కొంత కాలం సాఫీగా సాగిన వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. దీంతో శోభ ఆరు నెలల క్రితం కూతురిని తీసుకొని పుట్టింటికి వచ్చి అక్కడే ఉంటుంది. తిరిగి తన వద్దకు రావాలని భర్త పలుమార్లు కోరినా శోభ వినిపించుకోలేదు. ఈ క్రమంలో శోభ ఇతరులతో చనువుగా ఉంటోందని, ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతోందని నర్సింలు అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా ఆమెను అంతమొందించాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న కొడుకు మహేందర్‌కు సైకిల్ ఇప్పిస్తా, పాపను తీసుకొని మహబూబ్‌నగర్‌కు రావాలని శోభకు ఫోన్ చేశాడు. మహబూబ్‌నగర్‌కు వచ్చిన వారిని తీసుకొని మార్గమధ్యలో మద్యం కొనుగోలుచేసి తన గదికి తీసుకెళ్లాడు. గది బయట వరండాలో భార్యభర్తలు మద్యం తాగే సమయంలో మరోసారి గొడవ జరిగింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నర్సింలు భార్య తలపై రాయితో బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం ఎవరికీ తెలియకుండా అర్థరాత్రి వరకు భార్య మృతదేహాన్ని గదిలో దాచిపెట్టాడు. తరువాత శవాన్ని మూటకట్టి బైక్ ట్యాంక్‌పై పెట్టుకొని, కూతురును కూర్చోపెట్టుకొని రంగారెడ్డిగూడ సమీపంలోని వ్వయసాయ పొలంలో పడేసి వెళ్లాడు విచారణ ప్రారంభించిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నర్సింలు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన గ్రానైట్రాయి, ధరించిన చొక్కాను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. హత్య కేసును ఛేదించడంలో కీలకంగా వ్యహరించిన పట్టణ సీఐ సీతారాం, ఎస్ఐ సుశీల, పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. భార్యను హత్య చేసిన భర్త కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఏసీపీ లక్ష్మీనారాయణ నిందితుడికి రిమాండ్ -
కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ
కొత్తూరు: కారును టిప్పర్ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్ శివారులో ఉన్న ఐఓసీఎల్ పెట్రోల్‌బంకు ఎదురుగా జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలుకు చెందిన షేక్ తల్హా అహ్మద్(23) తన కారులో ఇదే ప్రాంతానికి చెందిన తన స్నేహితులు షేక్ అమాన్ బాషా, రజాక్, సమీర్, అసీల్తో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరాడు. తిమ్మాపూర్ శివారులోని ఐఓసీఎల్ పెట్రోల్ బంకు వద్దకు రాగానే రోడ్డు విస్తరణ పనుల కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇదే సమయంలో ముందు వెళ్తున్న ఓ లారీ బంకులోకి మళ్లడంతో అహ్మద్ కారును ఆపాడు. ఇదే రూట్లో వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టడంతో కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో పాటు అందులో ఉన్న ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం కారణంగా హైదరాబాద్ వైపుకు వెళ్లే రోడ్డులో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఐదుగురికి స్వల్ప గాయాలు -
మెగా వైద్య శిబిరానికి స్పందన
మొయినాబాద్: మున్సిపల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మొయినాబాద్ పీహెచ్సీలో సోమవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సోనియాదర్శన్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మున్సిపాలిటీతో పాటు వివిధ గ్రామాల నుంచి 368 మంది ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గైనకాలజీ, డెంటల్, జనరల్ మెడిసిన్, ఆర్థోపె డిక్, చిన్నపిల్లల స్పెషలిస్టు వైద్యులు వచ్చినవారికి వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ లలితాదేవి, ప్రోగ్రాం అధికారి పూనం, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీనివాస్, మండల వైద్యాధికారి అన్నపూర్ణ, ఎంపీడీఓ సంధ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గరుగు రాజు, కౌన్సిలర్లు గీతావనజాక్షి, జగపతి, సీహెచ్ఓ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ యాదయ్య, నాయకులు షాబాద్ దర్శన్, రాంచందర్, సూరి, యాదగిరి, కిరణ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేవీ రాడార్ స్టేషన్‌తో దేశ భద్రత
పనులను పరిశీలించిన నౌకాదళ అధికారులు పూడూరు: మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న నేవీ రాడార్ స్టేషన్ పనులను సోమవారం భారత నౌకాదళ వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాడార్ స్టేషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ ప్రాజెక్టు దేశ భద్రతకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని పేర్కొన్నారు. -
వక్ఫ్ భూముల నోటిఫికేషన్‌పై చర్చ
చేవెళ్ల: ఆలూరులో ఇండస్ట్రియల్ పార్కుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న వక్ఫ్ బోర్డు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని తహసీల్దార్ కృష్ణయ్య అన్నారు. చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఆలూరు గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఆలూరులోని 1,248 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించిన నోటిఫికేషన్‌పై చర్చించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇక్కడి భూముల్లో రాబోయే కంపెనీలతో ఈ ప్రాంత అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. రైతులు సాగు చేసుకుంటున్న వక్ఫ్ బోర్డు భూములు ఎప్పటికీ రైతులకు పట్టా కాదని, ఇవి వక్ఫ్, ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయన్నారు. ప్రభుత్వానికి ఎప్పుడు అవసరమైనా తీసుకునే అవకాశం ఉంటుందని గుర్తించాలన్నారు. సాగు చేసుకుంటున్న రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలి, పరిహారం తదితర విషయాలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తుందన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, భూములు తీసుకుంటే తమ జీవనం కష్టమవుతుందని తెలిపారు. భూమికి బదులు భూమి ఇచ్చే విధంగా చూస్తే మేలు జరుగుతుందన్నారు. న్యాయం జరిగేలా కృషి చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. గ్రామసభలు పెట్టి రైతుల అభిప్రాయలు సేకరించి పరిహారం గురించి తెలియజేస్తామని చెప్పారు. అందరూ ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు కౌలంపేట శేఖర్, యాదిరెడ్డి, కసిరే వెంకటేశ్, తోట చంద్రశేఖర్, బర్ల బుచ్చయ్య, బాబర్, రాంచంద్రయ్య, రాములు, అనంతరాములు, కృష్ణ, వెంకటేశ్ పాల్గొన్నారు. -
డయాలసిస్ సేవలను పునరుద్ధరిస్తాం
డీసీహెచ్ఎస్ అనురాగిణి చేవెళ్ల: చేవెళ్ల ఆస్పత్రిలో నిలిచిపోయిన డయాలసిస్ సేవలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని డీసీహె చ్ఎస్ అనురాగిణి అన్నారు. డయాల సిస్ సేవలు నిలిచిపోయినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు సోమవారం ఆమె ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. డయాలసి స్ రోగులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా పాలియేటివ్ కేర్ కేంద్రంలో సేవలను కొనసాగించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆమె సిబ్బందికి సూచించారు. వారంరోజుల్లో యథావిధిగా సేవలు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారి వెంట మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతావెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ కాసుల రాములుగౌడ్, కౌన్సిలర్లు బండారి శైలజఆగిరెడ్డి, ఎం.శ్రీనివాస్, తాళ్లపల్లి, నర్సింలు, కృష్ణానాయక్ తదితరులు ఉన్నారు. పంటలు ఎండిపోకుండా చూడండి అసెంబ్లీలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా చూడాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. శాసనసభలో సోమవారం ఆయన మాట్లాడారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు వనపర్తి నియోజకవర్గంలోని బుద్ధారం వరకు వస్తున్నాయని, ఇక్కడ ఐదు మోటార్లకు గాను 3 మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. వేరుశనగ పంట తీయడానికి ఇబ్బందులు కలుగుతున్నాయని, 15 రోజులుగా నీరు రావడం లేదన్నారు. కల్వకుర్తి రైతులకు వెంటనే సాగునీరు అందించి పంటలను కాపాడాలని కోరారు. -
స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఇవ్వండి
మండలిలో ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి షాద్‌నగర్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందని ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. శాసనమండలిలో సోమవారం ఆయన మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేస్తుందేమోనని తాము భావిస్తున్నామని అన్నారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఎప్పటిలోపు పూర్తి చేస్తారో స్పష్టం చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం పేరుతో మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను అమలు చేయాలని కోరారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం, పెన్షన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పెన్షన్లు అందిస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. పంచాయతీ కారోబార్లను జూనియర్ సెక్రటరీలుగా గుర్తించి వారికి గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించినా నేటికీ ఇవ్వడం లేదన్నారు. పంచాయతీ కార్మికులకు రూ.15వేలు వేతనం చెల్లించాలని, ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలని, పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
వాహనం బోల్తా పడి వ్యక్తి మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు మోమిన్‌పేట: బోలెరో వాహనం బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మోమిన్‌పేటలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ భరత్ భూషణ్ కథనం మేరకు.. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన అజీం(30) తనతో పాటు అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గుండోల్ల మల్లప్పతో కలిసి బోలెరో వాహనంలో జీవాలు వేసుకొని మోమిన్‌పేట మండలం సయ్యద్ అల్లీపూర్‌కు బయలుదేరాడు. మొరంగపల్లి మలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ ముస్తాఫా అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనం నడపడంతోనే చెట్టును ఢీ కొట్టినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో అజీం అక్కడికక్కడే మృతి చెందాడు. గొర్రెల కాపరి మల్లప్ప, డ్రైవర్ ముస్తాఫాకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మృతుడి బావ ఫకృద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన ప్రారంభం తాండూరు టౌన్: పట్టణంలోని ఇందిరానగర్‌లో పునర్మించిన సీతారామచంద్ర స్వామి ఆలయంలో దేవతల విగ్రహాల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. స్థానిక భద్రేశ్వర్ చౌక్‌లోని హనుమాన్ మందిరం నుంచి సీతారాముల విగ్రహాలను బాజాభజంత్రీలతో, భక్తుల కోలాహలం నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం నవగ్రహ పూజ, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్ఠాపన, హోమ కార్యక్రమాల అనంతరం మూలవిరాట్లకు జలాధివాసం గావించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయకుంటే పోరాటం
ఇబ్రహీంపట్నం: పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే పోరాటాలు తప్పవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వరకు చేపట్టిన పాదయాత్రను సోమవారం ఇబ్రహీపట్నంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయా ప్రభుత్వాలు తుంగలో తొక్కాయన్నారు. రామోజీ ఫిలింసిటీలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వారికి స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించి, వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. యాచారం, మంచాల మండలాల్లో పేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వాలు లాక్కొనే ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు సాగుచేసుకుంటున్న రావిరాల గ్రామ పరిధిలోని భూములకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అర్హులైన పేదలందరికీ పింఛన్లు ఇవ్వాలని, ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. పాదయాత్ర ఇబ్రహీంపట్నం నుంచి శేరిగూడ, మంగళ్‌పల్లి, కొంగరకలాన్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. పార్టీ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో సామేల్, రాంచందర్, ఎ.నర్సింహ, కె. జగన్, కె.భాస్కర్, ఎం.చంద్రమోహన్, డి.జగదీశ్, జంగయ్య, ఎ. నర్సింహ, ఎల్లేష్, శేఖర్, శ్యామ్‌సుందర్, సీహెచ్ జంగయ్య, కె. నర్సింరెడ్డి, కిషన్, బుగ్గరాములు తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో సర్కార్ విఫలం ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు భూపాల్ విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. మంగళ్‌పల్లి మీదుగా కొంగరకలాన్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.సామేలు, రాంచందర్, డి.జగదీష్, చంద్రమోహన్, కందుకూరి జగన్, నర్సింహ, మండల కార్యదర్శులు జంగయ్య, అలంపల్లి నర్సింహ, బుగ్గరాములు, దయ్యాల కిషన్, పి.జగన్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, అంజయ్య, శ్యామ్‌సుందర్, నర్సిరెడ్డి, బాల్‌రాజ్, నర్సింహ, శేఖర్, ఎల్లేష తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
‘ఆశ’లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సాయిబాబా కొత్తూరు: ఆశవర్కర్లకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బీస సాయిబాబా డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో మండల మెడికల్ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశవర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 28 చలో కమిషనరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. కరోనా మొదలుకొని ప్రభుత్వం అమలుచేసే ప్రతీ పథకం విజయవంతం కావడంలో ఆశల పాత్ర ఎంతగానో ఉందన్నారు. అలాంటి వారికి నేటికి కనీస వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం శ్రమ దోపిడికి పాల్పడుతుందన్నారు. వెంటనే వారికి నెలకు రూ.18 వేల వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్‌తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలని పక్షంలో విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశలు మంజుల, కమల, అనిత, చైతన్య, శశిరేఖ, శ్రీవాణి, నవనీత, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంచాలి ఇబ్రహీంపట్నం రూరల్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, అధ్యక్షుడు రుద్రకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కనీస వేతనం రూ.18వేలకు పెంచాలని, ఐసీడీఎస్‌లకు సరిపడా నిధులు కేటాయించాలని, ఎన్ఐసీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అంసెబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని, ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని, ఒంటిపూట బడిని నిర్ణయించి, టీచర్స్, హెల్పర్స్ ఇద్దరికీ ఒకేసారి మే నెలంతా సెలవులు ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, స్వప్న, జిల్లా నాయకులు చుక్క మోహన్, రాజ్యలక్ష్మి, నాగమణి, అనిత, రమణమ్మ, సౌభాగ్య, శశికళ, సంతోష, మమత, ప్రేమలత, భాగ్యలక్ష్మి, పాపమ్మ, జ్యోతి, శివలీల తదితరులు పాల్గొన్నారు. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన స్కూటీ వ్యక్తికి గాయాలుమొయినాబాద్: స్కూటీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి కాలు విరిగింది. ఈ సంఘటన హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్ చౌరస్తాలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన అఫ్సర్ స్కూటీపై నగరం నుంచి మొయినాబాద్‌కు వస్తుండగా హిమాయత్‌నగర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే స్కూటీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అతని కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్సకోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
సమస్యల పరిష్కారానికి పాదయాత్ర
సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య ఇబ్రహీంపట్నం: ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కరించాలని నిర్వహించే ఈ పాదయాత్రను పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఇబ్రహీంపట్నంలో ప్రారంభిస్తారని, కలెక్టరేట్ వరకు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. అర్హులై వారందరికీ ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, భూ సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరించాలని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఇవ్వాలని, ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని తదితర డిమాండ్లతో పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.జగదీశ్, కందుకూరి జగన్, మున్సిపల్ కార్యదర్శి ఎల్లేష్, నాయకులు నర్సింహ, విజయ్ పాల్గొన్నారు. -
మార్కెట్ పేరుతో రియల్ వ్యాపారం
ప్రభుత్వానికి మార్కెట్ కట్టే ఉద్దేశం లేదు. చదును చేసి, స్వాధీనంలో ఉన్న భూములను వదిలేసి.. వివాదాలున్న భూములను ఎంపిక చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో? మార్కెట్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు యత్నిస్తోంది. ఇక్కడ ఎకరం రూ.6 నుంచి రూ.10 కోట్లు పలుకుతోంది. ఖరీదైన ఈ భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. బలవంతపు భూసేకరణకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించం. – కందాల బలదేవ్రెడ్డి, రైతు నాలుగు తరాలుగా అనేక కుటుంబాలు ఈ భూములను నమ్ముకుని బతుకుతున్నాయి. 12 ఏళ్లుపైబడి పేదలు జీవనం కొనసాగిస్తే..వాటిని ముట్టుకునే అధికారం ఎవరికీ లేదు. ఔటర్‌రింగ్ రోడ్డు సహా ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేపట్టినా..పేదల భూములే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పనంగా కట్టబెడుతోంది. పేదల భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం. బాధిత రైతులకు అండగా నిలబడతాం. ఇప్పటికే సేకరించి రెడీగా ఉన్న భూమిలోనే మార్కెట్ కట్టాలి. – ఈటల రాజేందర్, ఎంపీ, మల్కాజిగిరి -
డ్రగ్స్ దందాకు కేరాఫ్ బీఆర్ఎస్
షాద్‌నగర్: రాష్ట్రంలో డ్రగ్స్ దందాకు బీఆర్ఎస్ పార్టీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ అంకెల గారడీతో ప్రజలను మోసం చేసిందని అన్నారు. బంగారు తెలంగాణను చేస్తామని చెప్పి అప్పుల ఊబిలో ముంచిందన్నారు. ఇటీవల ఫాంహౌస్‌లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో బీఆర్ఎస్ నేతల డ్రగ్స్ వ్యవహారం బట్టబయలైందని, దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోందన్నారు. కాంగ్రెస్ అఽధికారంలోకి వచ్చాక ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతు భరోసా, రైతు బీమా ద్వారా వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. సమావేశంలో నాయకులు రఘు నాయక్, శ్రీకాంత్‌రెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్, కృష్ణారెడ్డి, వీరేశం, హరినాథ్‌రెడ్డి, సుదర్శన్‌గౌడ్, రవికుమార్‌గుప్తా, రాజు, కుమార్‌గౌడ్ పాల్గొన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
కొహెడ భూములపై నజర్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొహెడ పండ్ల మార్కెట్ భూములపై ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. ఎలాంటి వివాదాలు లేని, ఇప్పటికే చదును చేసి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ భూములను అగ్గువకే కొట్టేసేందుకు తెరవెనుక కుట్ర జరుగుతోంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)ను కొత్తగా తెరపైకి తీసుకొచ్చింది. మార్కెటింగ్‌శాఖ చేతుల్లో ఉన్న ఈ భూములను టీజీఐఐసీకి బదిలీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యామ్నాయంగా ఇదే రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 167/1లో 239 ఎకరాలను పండ్ల మార్కెట్‌కు కేటాయించనున్నట్లు వెల్లడించింది. చుట్టూ అనేక వివాదాలు, కొండలు, గుట్టలతో కూడిన ఈ భూములను కేటాయించడమంటే పండ్ల మార్కెట్ నిర్మాణ పనులను మరింత కాలం సాగతీయడమే అవుతుందని మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న ప్రత్యామ్నాయ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని ఇప్పటికే పొజిషన్లో ఉన్న రైతులు స్పష్టం చేస్తున్నారు. పదిహేను రోజులుగా తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు రైతుల ఆందోళనలు.. మరోవైపు ప్రభుత్వ ప్రత్యామ్నాయ ప్రకటనల నేపథ్యంలో మార్కెట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కొత్తపేట నుంచి కొహెడకు.. నగరంలోని కొత్తపేటలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పండ్లమార్కెట్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో కొహెడకు తరలించింది. అప్పటికే సర్వే నంబర్ 507, 548లో 170 ఎకరాలు సేకరించి మార్కెటింగ్‌శాఖకు అప్పగించింది. ఎకరాకు రూ.7.44 లక్షల చొప్పున 44 మంది రైతులకు రూ.13 కోట్లు నష్టపరిహారం సైతం చెల్లించింది. అప్పట్లోనే రూ.20 లక్షలకుపైగా ఖర్చు చేసి ఇక్కడ తాత్కాలిక షెడ్లు వేసింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి ఆయా షెడ్లన్నీ నేలకూలి, మార్కెట్‌కు వచ్చిన మామిడికాయలు పూర్తిగా పాడయ్యాయి. ప్రత్యామ్నాయంగా బాటసింగారం ట్రక్ పార్కుకు మార్చారు. నెలకు రూ.66 లక్షల చొప్పున ఇప్పటి వరకు రూ.24 కోట్లకుపైగా అద్దె చెల్లించారు. గత ప్రభుత్వం మార్కెట్ నిర్మాణం కోసం రూ.450 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,900 కోట్ల అంచనా వ్యయంతో 199 ఎకరాల్లో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేసింది. పీపీఏ విధానంలో దేశంలోనే అతిపెద్ద మార్కెట్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఒకవైపు డీపీఆర్‌ను సిద్ధం చేసి.. మరోవైపు ఈ భూములను టీజీఐఐసీకి కేటాయిస్తూ కేబినెట్ ఇటీవల తీర్మా నం చేయడం చర్చనీయాంశమైంది. ఆ భూమి చుట్టూ అనేక వివాదాలు నిజానికి సర్వే నంబర్ 167/1లోని 239 ఎకరాలను నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2007లోనే రాజీవ్ గృహకల్ప పథకం కింద ఇంటి గ్రేటెడ్ టౌన్‌షిప్‌ల కోసం కేటాయించింది. మార్కెట్ ధర ప్రకారం గజానికి రూ.350 చొప్పున బదలాయించింది. అనంతరం హౌసింగ్‌బోర్డు ఈ భూములను దిల్ (దెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్)కు అప్పగించింది. ఆ సంస్థ ఈ భూములను పట్టించుకోకపోవడంతో మళ్లీ ఇటీవల హౌసింగ్ బోర్డు స్వాధీనం చేసుకుంది. తమకు నష్టపరిహారం చెల్లించాలని అప్పట్లోనే రైతులు డిమాండ్ చేశారు. ఆయా భూముల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టక పోవడంతో వాటిని రైతులే సాగు చేసుకుంటూ వస్తు న్నారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో వారంతా ఆందోళన బాటపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఎత్తుపల్లాలతో కూడిన ఈ భూమిలో మార్కెట్ నిర్మించాలంటే ప్రభుత్వం కూడా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. న్యాయపరమైన చిక్కులను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొహెడ పండ్ల మార్కెట్ పనులపై అనిశ్చితి నెలకొంది. పనులు ఎప్పుడు మొదలు పెడతారనే ప్రశ్నకు ఇటు మార్కెటింగ్‌శాఖ అధికారుల వద్ద కానీ, అటు ప్రభుత్వ పెద్దల వద్ద కానీ ఆశించిన సమాధానం లేదు. మార్కెట్ నిర్మించకుండా విలువైన ఈ భూములను పెద్దలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందనే ఆరోపణలు లేకపోలేదు. వివాదం లేనివి టీజీఐఐసీకి బదలాయించే యత్నం పండ్ల మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా మరోచోట కేటాయించనున్నట్లు ప్రకటన ఏళ్లుగా పొజిషన్లో ఉన్న రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరణ -
కొండిగారి రాములు సేవలు ఎనలేనివి
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు నియోజకవర్గానికి చేసిన సేవలు మరవలేనివని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ కేంద్రంలో ఆదివారం జరిగిన రాములు దశదిన కార్యక్రమానికి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కమ్యూనిస్టువాదిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాములు నిరంతరం నియోజకవర్గ అభివృద్ధిని కోరుకున్నారన్నారు. ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అనంతరం రాములు కుమారులు త్రిలోక్(కౌన్సిలర్), కిరణ్‌కుమార్‌ను పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రమేష్, నిట్టు జగదీశ్వర్, భరత్‌కుమార్, ఎండీ సుల్తాన్, ఆకుల సురేష్, మల్లేష్‌యాదవ్, ముత్యాల చిన్న, శివసాయి, ప్రవీణ్, వీరేష్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్: చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకుడు రంగరాజన్ నగరంలోని సైనిక్‌పురిలో ఆదివారం జరిగిన 108 శ్రీరామ భక్తి గీతాల గాన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వరరాజ భారతీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామ భజనలు, కీర్తనలు, నామసంకీర్తనలు చేశారు. భక్తులందరినీ ఆధ్యాత్మిక భక్తి రసంలో ముంచిన భక్తి సంగీత కార్యక్రమం ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యాభారతి, రంగరాజన్‌ను సన్మానించారు. తెలంగాణ సేవా ప్రముఖ్ శివశంకర్ షాబాద్: హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ సేవా ప్రముఖ్ శివశంకర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని నాగర్‌గూడ పీఎస్ఆర్ గార్డెన్లో ఆదివారం ఉప మండల హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా శివశంకర్‌తోపాటు శ్రీమతి శ్రీలత, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అష్ట తీర్థస్వామిజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని చెప్పారు. పంచ పరివర్తనలో భాగంగా ప్రకృతిని కాపాడుకోవాలని, పౌర విధులు పాటించాలన్నారు. హిందువు అనేది మతం కాదు, ఇది ఒక ధర్మం అని వివరించారు. అనంతరం భగవద్గీత పారాయణం చేశారు. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శ్రీనివాస్, గోపాల్‌రెడ్డి, యాదివరెడ్డి, ప్రసాద్, మల్లేష్, ప్రవీణ్, గూడెం రమేష్, వెంకట్‌రెడ్డి, ప్రశాంత్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్‌రూరల్: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని ఆదివారం సర్పంచ్ల సంఘం మండల ప్రధాన కార్యదర్శి, కాశీంబౌలి సర్పంచ్ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ‘ప్రశిక్షణ మహాభియాన్’
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లి గూడలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 20 నుంచి నిర్వహిస్తున్న జిల్లా అర్బన్ పరిధిలోని ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించిన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్– 2026 శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర సంఘటన మహామంత్రి చంద్రశేఖర్ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్‌జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, నిర్మాణం, కార్యకర్తల అభివృద్ధి, బూత్ స్థాయి బలోపేతం వంటి అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించాలన్నదే శిక్షణ తరగతుల ఉద్దేశమన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు బోల్గాం యశ్పాల్ గౌడ్, బండారు భాస్కర్, ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, నందికొండ గీతారెడ్డి, రుద్రారం శంకర్, కార్యదర్శులు నరేష్ యాదవ్, సుందర్ నారాయణ, నూతి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, రంగ నరసింహ గుప్తా, మొద్దు లచ్చిరెడ్డి, నాయకోటి పవన్ కుమార్ పాల్గొన్నారు. -
కొత్తిమీర.. లేదాయె ధర
చేవెళ్ల: పండించిన పంటలకు ధర లేకపోవటంతో ఓ రైతు మార్కెట్లోనే తన పంటను పారబోశాడు. కొత్తిమీర పంట కన్నీరు పెట్టిస్తోందని మండలంలోని కుమ్మెర గ్రామానికి చెందిన వీరేశం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు ఉన్న రెండు ఎకరాల్లో రూ.లక్ష ఖర్చు చేసి కొత్తిమీర పంటను సాగు చేశాడు. రెండు రోజులుగా రోజుకు వంద బాక్స్‌ల చొప్పున నగరంలోని గుడిమల్కాపూర్ మార్కెట్‌కు తరలించాడు. మార్కెట్లో ధరలు లేకపోవటంతో రూ.వందకు మూడు బాక్స్‌ల చొప్పున విక్రయిస్తున్నారు. ఆదివారం ఉదయం మార్కెట్‌కు వంద బాక్స్‌ల కొత్తిమీర తీసుకెళ్తే కొనే వారు లేకపోవటంతో పారబోసినట్లు తెలిపాడు. నిత్యం పొలంలో నుంచి వంద బాక్స్‌లు తీసేందుకు కూలీలకు, మార్కెట్‌కు తరలించేందుకు రవాణా ఖర్చులు అన్ని కలిపి రూ.10 వేలకు పైగానే అవుతున్నాయని, కనీసం దారి ఖర్చులు సైతం రాలేని దుస్థితి ఉందని వాపోయాడు. బాక్స్ ధర కనీసం రూ.200కు పైగా ఉంటేనే రైతులకు పెట్టుబడులైనా మిగులుతాయని పేర్కొన్నాడు. -
రైతు ఉత్సవాలను వీక్షించిన అధికారులు
చేవెళ్ల: రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని, ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రారంభించారని మున్సిపల్ చైర్పర్సన్ దేవరి సమతావెంకట్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని రైతువేదిక వద్ద ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లాలో జరిగిన రైతుభరోసా నిధుల విడుదల, ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, ఆయిల్‌పామ్ రిఫైనరీ పరిశ్రమకు శంకుస్థాపన కార్యక్రమాలు వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు ప్రత్యేక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రైతుల ఆదాయం పెంచేవిధంగా అయిల్‌పామ్ తోటలపై రాయితీలను అందిస్తూ వాటికి అనుగుణంగా మార్కెట్ సౌకర్యాలను కల్పించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. రైతు భరోసా పథకం నిధులను చెప్పినట్లుగా రాష్ట్రవ్యాప్తంగా 22వ తేదీన రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. అయితే రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు మాత్రం కనిపించలేదు. కేవలం అధికారులు, ప్రజాప్రతినిధులే ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించి వెళ్లిపోయారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్ నర్సింలు, సర్పంచ్‌లు సింగప్పగూడ రవి, ఎన్కేపల్లి మహిపాల్‌రెడ్డి, రావులపల్లి రాంచంద్రయ్యగౌడ్, మండల వ్యవసాయాధికారి శంకర్‌లాల్, ఏఈఓలు మౌనిక, బాల కోటేశ్వర్రావు, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
మున్సిపల్ చైర్పర్సన్ దేవరి సమతావెంకట్‌రెడ్డి చేవెళ్ల: మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ దేవరి సమతావెంకట్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధి దామరగిద్ద 9వ వార్డులో ఆదివారం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాజీ సర్పంచ్ మధుసూదన్‌గుప్తా తన సొంత నిధులతో రామాలయం వద్ద సీసీరోడ్డు వేయిస్తున్నారు. ఈ మేరకు కౌన్సిలర్ తాళ్లపల్లి నర్సింలు ఆధ్వర్యంలో ఆమె కౌన్సిలర్లతో కలిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాయకులు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంతో వారి పట్ల నమ్మకం పెరుగుతుందన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేయాలన ఆలోచన ఉన్న వారు సమస్యల పరిష్కారంలో ముందుంటారని తెలిపారు. అనంతరం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న మధుసూదన్‌గుప్తాను వారందరూ అభినందించారు. మాజీ సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం శ్రీరామనవమికి ముందే ఆలయం వద్ద రోడ్డును వేయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు బండారి శైలజఆగిరెడ్డి, ఎం.కల్యాణి, ఎం.శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వెంకటేశంగుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, వైస్ చైర్మన్ బి.రాములు, వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు. -
స్పష్టత ఇస్తేనే ఇచ్చేది
● మెరుగైన పరిహారం ఇవ్వాలని గ్రీన్ ఫీల్డ్ రోడ్డు భూబాధితుల డిమాండ్ ● ఆరో రోజుకు చేరిన గిరిజన రైతుల దీక్ష యాచారం: గ్రీన్ ఫీల్డ్ రోడ్డులో భూములు కోల్పోతున్న తమకు మెరుగైన పరిహారం ఇవ్వాలని రైతులు చేపట్టిన రిలే దీక్ష కొనసాగుతోంది. మండలంలోని కుర్మిద్ద గ్రామ రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేయ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్(330 అడుగుల) రోడ్డు నిర్మాణ పనులకు అడ్డంకింగా మారింది. మర్లకుంట, మంగళిగడ్డ, పోతుబండ తండాలకు చెందిన 90 మంది గిరిజన రైతులకు పలు సర్వే నంబర్లల్లో 200 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇందులో 60 మంది రైతులకు చెందిన 35 ఎకరాల పట్టా భూమి గ్రీన్ ఫీల్డ్ రోడ్డులో పోతుంది. మూడు తండాలకు చెందిన రైతులకు చెందిన 200 ఎకరాల పట్టా భూమి సేకరణలో రైతుల అంగీకారం లేకుండానే అధికారులు ఫార్మాసిటీకి సేకరించారు. పరిహారం చెల్లింపుపై స్వష్టత లేదు. గతంలోనే 200 ఎకరాల పట్టా భూమికి సంబంధించి పరిహారాన్ని ఆథారిటీలో జమ చేసిన అధికారులు, రైతుల పేర్లపై ఉన్న భూరికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చేశారు. టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన భూరికార్డులను తమ పేర్లపై మార్చాలని ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న ఫలితం లేకుండా పోతుంది. పైగా ఆ భూములు మీవి కానే కావు.. పరిహారం ఆథారిటీలో జమ చేశాం, రికార్డులు టీజీఐఐసీ పేరు మీద ఉన్నాయని అధికారులు అంటున్నారు. పనుల మొదలుతో దీక్ష గత వారం కింద అధికార యంత్రాంగం కుర్మిద్ద గ్రామ రెవెన్యూ పరిధిలోని పట్టా భూముల్లో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం యంత్రాలతో పనులు మొదలు పెట్టారు. దీంతో రైతులు కనీసం సమాచారం లేకుండానే, పరిహారం చెల్లింపుపై స్వష్టత లేకుండానే పనులు ఎలా ప్రారంభిస్తారని గిరిజన రైతుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో రిలే దీక్షలకు దిగారు. స్థానిక గిరిజన రైతులకు మద్దతుగా రాష్ట్ర గిరిజన సంఘం సేవాలాల్ సంఘాల నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. గిరిజనుల దీక్ష ఆదివారం ఆరో రోజుకు చేరింది. న్యాయమైన పరిహారం చెల్లిస్తే గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు కావాల్సిన భూమి ఇస్తామని, కానీ టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన మిగితా 175 ఎకరాలకు పైగా పట్టా భూమి రికార్డులను మా పేర్లపై మార్చాలని రైతులు ఆందోళనకు దిగారు. కుర్మిద్ద గ్రామంలో ఓ వర్గానికి చెందిన ఒక ఎకరా భూమిని కూడా తీసుకోలేదు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అసైన్డ్ భూమితో పాటు పట్టా భూములు తీసుకుంటే ఎట్లా బతికేది అని రైతులు పేర్కొంటున్నారు. గిరిజనుల దీక్షతో ఏం చేయాలో తెలియక అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం
షాద్‌నగర్‌రూరల్: గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైన సంఘటన శనివారం రాత్రి షాద్‌నగర్ పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆలయ సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు(70) అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకొని ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు పట్టణంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. ఎస్పీ స్నేహమెహ్ర సీరియస్‌తో రంగంలోకి పోలీసులు -
వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం
మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య కొత్తూరు: నిత్యం వ్యాయామం, యోగ సాధన చేసే వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం పట్టణంలో నిర్వహించిన 2కే రన్‌ను ఆమె ప్రారంభించారు. ఇందులో భాగంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవనంలో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించడం లేదన్నారు. దీంతో తరచూ అనారోగ్యాల బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారన్నారు. నిత్యం యోగ, ఇతర వ్యాయామాలు సాధన చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న 90 రోజుల కార్యక్రమంలో పనులకే కాకుండా ఆరోగ్యం పట్ల కూడా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 2కే రన్‌ను నిర్వహించినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కమిషనర్ బాలాజీ, కౌన్సిలర్లు కోస్గి శ్రీనివాస్, సోమ్లానాయక్, నాయకులు దేవేందర్‌ముదిరాజ్, నర్సింహ, ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ‘నవోదయ’లో రేయాన్ విద్యార్థుల ప్రతిభ నాగోలు: జవహర్ నవోదయ ఫలితాల్లో నాగోలు బండ్లగూడలోని రేయాన్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు జాతీయ ర్యాంకుతోపాటు పలు జిల్లా స్థాయి ర్యాంకులు సాధించారని ఆ సంస్థ అధినేత జి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అరన్ దేవాన్ష్ ఆలిండియా మొదటి ర్యాంక్, పానుగంటి నవతేజ రంగారెడ్డిజిల్లా ఫస్ట్ ర్యాంకు, మెదక్ జిల్లాకు చెందిన డి.అమూల్య జిల్లాస్థాయిలో మూడో ర్యాంక్, ఖమ్మం జిల్లాకు చెందిన అయాన్ వేదిక్ జిల్లా స్థాయిలో నాలుగో ర్యాంక్, మహబూబ్‌నగర్‌కు చెందిన చెర్రీస్ జిల్లా స్థాయిలో ఏడో ర్యాంకు సాధించారని పేర్కొన్నారు. 26 ఏళ్లుగా నాణ్యమైన విద్య అందిస్తూ అనేకమంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లినట్టు డైరెక్టర్లు జనార్థన్ రెడ్డి, ఉమారెడ్డి పేర్కొన్నారు. కలప రవాణా చేస్తున్న వాహనం సీజ్ ధారూరు: అనుమతి లేకుండా కలపను తరలిస్తున్న వాహనాన్ని ఆదివారం అటవీ అధికారులు సీజ్ చేశారు. డిప్యూటీ ఫారెస్టు రేంజర్ హేమ తెలిపిన వివరాల ప్రకారం.. ధారూరు గ్రామానికి చెందిన కమ్మరి రమేశ్ తన వాహనంలో అక్రమంగా కలప తరలిస్తుండగా ప్రొటక్షన్ వాచర్స్‌తో కలిసి తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా దుంగలు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ వైర్ల చోరీ తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో పొలాల వద్ద బోరు మోటార్ల విద్యుత్ వైర్లను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. రైతుల తెలిపిన ప్రకారం.. గ్రామ శివారులో రైతులు బోరు మోటార్ల కింద వరి సాగు చేస్తున్నారు. శనివారం రాత్రి వైర్లను దొంగిలించినట్లు గుర్తించిన రైతులు ఆదివారం పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
షాబాద్: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చందనవెళ్లిలో తలారి లక్ష్మమ్మ ఇందిరమ్మ ఇంటిని, కొత్త కాలనీకి వేస్తున్న ఫార్మేషన్ రోడ్డు పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోనే నిరుపేదల సొంత ఇంటి కల సాకారం అవుతుందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అవినీతికి తావు లేకుండా, పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని, మరో మూడు విడతల్లో మిగిలిన వారికి ఇళ్లు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్పంచ్‌లు నవనీతస్వామి, స్వరూపమహేందర్గౌడ్, యాదిరెడ్డి, నర్సింలు, ప్రభాకర్‌రెడ్డి, యాదయ్య, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రవీందర్‌నాయక్, బేగరి యాదయ్య, భార్గవ్‌రామ్, బండ శ్రీకాంత్‌గౌడ్(కిట్టు), కృష్ణ, రాఘవాచారి, తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి -
సంతను వినియోగించుకోవాలి
షాద్‌నగర్‌రూరల్: గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సంతను ప్రజలు వినియోగించుకోవాలని ఎశమోని కృష్ణ్డ అన్నారు. ఆదివారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్దలో ఆయన ఆధ్వర్యంలో నూతనంగా సంతను ఏర్పాటు చేశారు. ఈ సంతను గ్రామపెద్దలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంతలో రైతులు పండించిన పంటలు, అనేక రకాల ఉత్పత్తులు ఒకేచోట లభిస్తాయన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నూతనంగా సంతను ఏర్పాటు చేసేందుకు గ్రామపంచాయితీ పాలకవర్గం నిర్ణయం తీసుకుందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మిరాము, గ్రామపెద్దలు అన్మారి వెంకటయ్య, దయాసాగర్, రాధాకృష్ణ, శ్రీశైలం, మల్లేశ్, పటాన్పాషా, చోటేభాయ్, తవుడు వెంకటేశ్, కార్యదర్శి జైపాల్‌రెడ్డి, వార్డుసభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ ఎశమోని కృష్ణ -
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
మంచాల: ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన ఓ యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచాల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెనమోని భాస్కర్(30) వృత్తి రీత్యా ఎలక్ట్రీషన్. ఇటీవల ఆయన తల్లి చనిపోవడంతో ఇంట్లో ఒక్కడే ఉంటున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలు దాటినా ఆయన బయటకు రాలేదు. దీంతో చుట్టుపక్కల వారు గమనించి ఊర్లో ఉన్న అతడి అన్న బాలరాజు, అక్క లక్ష్మికి విషయం చెప్పారు. వారు వెంటనే వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా చీరతో ఉరి వేసుకొని వేళాడుతూ విగతజీవిగా భాస్కర్ కనిపించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు సైతం ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్డుకు మరమ్మతులు మొయినాబాద్: మున్సిపల్ 9వ వార్డు జీవన్‌గూడలో అధ్వానంగా మారిన రోడ్డుకు కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ మరమ్మతులు చేయించారు. జీవన్‌గూడలో రెండు నెలల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. పైపులు వేసేందుకు గాను కాలనీలో రోడ్డును తవ్వారు. కానీ పనులు పూర్తయిన తరువాత మట్టితో గుంతలు పూడ్చి చదును చేయకుండా అలాగే వదిలేశారు. కాగా నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి మట్టి కొట్టుకుపోయి రోడ్డు గుంతలమయంగా మారడంతో గ్రామస్తుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆదివారం 9వ వార్డు కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ దగ్గరుండి మొరం పోయించి గుంతలు పూడ్చివేయించారు. -
హైటెన్షన్ తీగలు తాకి టపాసుల లారీ దగ్ధం
కొత్తూరు: గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలనే తపనతో డ్రైవర్ చేసిన తప్పిదానికి టపాసుల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ విద్యుదాఘాతంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన మండల పరిధిలోని పెంజర్లలో శనివారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం శివకాశి నుంచి టపాసుల లోడ్‌తో ఓ లారీ మహేశ్వరం, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టపాసులు అన్లోడ్ చేసేందుకు బయలుదేరింది. కాగా లారీ డ్రైవర్ మహేశ్వరంలో సూచించిన చిరునామాకు త్వరగా చేరుకునేందుకు పెద్ద రహదారిని వదిలి చిన్న రోడ్డు మీదుగా వెళ్తుండగా పెంజర్ల శివారులో లారీకు హైటెన్షన్ వైర్లు తగలి మంటలు చెలరేగాయి. కాసేపటికి గుర్తించిన డ్రైవర్లు అయ్యప్పన్, సత్తివేలు వెంటనే లారీను రోడ్డు పక్కన నిలిపి బయటకు దిగారు. మంటల తాకిడికి లారీలో ఉన్న టపాసులు మొత్తం భారీ శబ్దంతో పేలిపోయాయి. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల తాకిడితో సమీపంలోని పంటలకు సైతం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశారు. సంఘటన స్థలాన్ని షాద్‌నగర్ డీసీపీ శీరిష, ఏసీపీ లక్ష్మీనారాయణ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సయ్య తెలిపారు. -
నేటి నుంచి ‘రైతు భరోసా’
ఎకరాకు రూ.ఆరు వేల చొప్పున జమ సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా నగదు ఆదివారం నుంచి రైతుల ఖాతా ల్లో జమ కానుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. తొలి దశలో ఎకరంలోపు రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది. ఆ తర్వాత రెండు, మూడు దశల్లో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నారు. నిజానికి యాసంగికి ముందే ఈ సహాయం అందజేయాల్సి ఉంది. పలు సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. నేటి నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేయ నుంది. రంగారెడ్డిజిల్లాలో 2,83,709 లక్షల మంది రైతులు ఉండగా, వీరు 6,35,502 ఎకరాలకుగాను సాయం పొందనున్నారు. ఈ జిల్లా రైతుల ఖాతాల్లో రూ.318 కోట్లకుపైగా జమకానుండగా, వికారాబాద్ జిల్లాలో 3,27,561 మంది రైతులు ఉండగా, వీరు 6,45,166 ఎకరాలకు రైతుభరోసా పొందనున్నారు. కొత్తగా మరో 15,784 మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి ఖాతాల్లో రూ.387 కోట్లకుపైగా జమకానుంది. ఈ కార్యక్రమాన్ని రైతులు వీక్షించేందుకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఆయా రైతు వేదికల్లో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేశారు. సంతాప సభను విజయవంతం చేయండి సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య ఇబ్రహీంపట్నం: దివంగత ఎమ్మెల్యే కొండిగారి రాములు ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర నాయకులు కె.నర్సింహ, ఒ.యాదయ్య పిలుపునిచ్చారు. శనివారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ.. పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాములు సాదాసీదాగా జీవనం సాగించి రైతులు, కార్మికులు, పేదల పక్షాన పోరాడారని గుర్తు చేశారు. ఈ నెల 31న నిర్వహించనున్న సంతాప సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నీలమ్మ, శివకుమార్, రాజు, ఎం.నర్సింహ, జె.నర్సింహ తదితరులు పాల్గొన్నారు. పండుగ పూట విషాదం స్కూటీపై నుంచి పడి ఎలక్ట్రీషియన్ దుర్మరణం పహాడీషరీఫ్: పండుగ పూట జరిగిన ప్రమా దం ఓ ముస్లిం కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శని వారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్ఐ ఎంఎస్ఆర్వీ ప్రసాద్ తెలిపిన ప్రకారం.. మెహదీపట్నం సాబెర్ నగర్ మహవీర్ కాలనీకి చెందిన మహ్మద్ ఇషాక్ కుమారుడు మహ్మద్ అమన్(23) ఎలక్ట్రీషియన్. ప్రస్తుతం ఆయన షాహిన్‌నగర్ వాదే సాల్హెహీన్ బస్తీలో నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం 7.30 గంటలకు అమన్ తన యాక్టివాపై ఎర్రకుంట నుంచి ఇంటికి వెళుతున్నాడు. జాతర మండి హోటల్ వద్దకు రాగానే వేగం, నిర్లక్ష్యంగా వచ్చిన హోండా షైన్ బైక్ ఒక్కసారిగా మలుపుతీసుకోవడంతో వెనుక నుంచి వస్తున్న అమన్ ద్విచక్రవాహనంపై నుంచి కిందపడి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. మృతుడికి వరుసకు సోదరుడు తౌహిద్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్ గౌడ్ -
మళ్లీ తెరపైకి ఆలూరు భూసేకరణ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ నోటిఫికేషన్లు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఐటీ, ఇండస్ట్రియల్ జోన్ల పేరుతో ఇప్పటికే రైతుల నుంచి పెద్ద మొత్తంలో భూములను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. తాజాగా మరికొన్ని భూములను సేకరించేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఏపీలో ప్రతిపాదనల దశలో ఉన్న చేవెళ్ల ఆలూరు పారిశ్రామిక కారిడార్ అంశం తాజాగా మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. పారిశ్రామిక కారిడార్ సహా రేడియల్ రోడ్ల కోసం 1,248.22 ఎకరాలను సేకరించనున్నట్లు ప్రకటించింది. అదే విధంగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో 1,179 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని భావించి, ఆ మేరకు తొలి నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. ప్రభుత్వ తాజా ప్రకటనతో ఏళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పన పేరుతో ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, వక్ఫ్ భూములే లక్ష్యంగా ఈ నోటిఫికేషన్లు వెల్లడిస్తుండటంతో ఇప్పటి వరకు ఆ భూములపై ఆధారపడిన పేదలు రోడ్డున పడాల్సి వస్తోంది. సాగులో ఉన్న రైతులు ప్రభుత్వం 2016 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించింది. రైతులు మాత్రం ఇందుకు ససేమిరా అంగీకరించడం లేదు. రైతులు నిరాకరిస్తున్నా.. ముందుకే ఫార్మాసిటీ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కందుకూరు, కడ్తాల్, యాచారం మండలాల్లో 14 వేల ఎకరాలను సేకరించింది. మరో ఏడు వేల ఎకరాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఫార్మాసిటీని రద్ధు చేసి, దాని స్థానంలో 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్‌సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లు, ఫ్యూచర్‌సిటీ, ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల పేరుతో ఇప్పటికే యాచారం, కందుకూరు, కడ్తాల్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మండలాల్లో భారీగా భూములను సేకరించింది. కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో సర్వే నంబర్ 38లో 350 ఎకరాలు సహా సర్వే నంబర్ 162లో 217 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లిలో 195.5 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేయగా, కందుకూరు మండలం తిమ్మాయిపల్లి సర్వే నంబర్ తొమ్మిది లోని 439 మంది రైతుల నుంచి 366.4 ఎకరాలు, మహేశ్వరం మండలం కొంగరకుర్దు సర్వే నంబర్ 289లోని 94 మంది రైతుల నుంచి 277.06 ఎకరాలు, యాచారం మండలంలోని 638 మంది రైతుల నుంచి 821.11 ఎకరాలు భూసేక రణకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కుర్మిద్ద, మర్లకుంటతండ, మొండిగౌరెల్లి తదితర గ్రామాల రైతులు తమ భూములను ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. ఫార్మాసిటీ కోసం ఇప్పటికే తమ వద్ద ఉన్న అసైన్డ్ భూములన్నీ ఇచ్చేశాం. మిగిలిన కొద్ది పాటి పట్టాభూములను కూడా సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆయా గ్రామాల రైతులు వరుస ఆందోళనలు చేపడుతున్నారు. నాలుగైదు రోజులుగా రిలే దీక్షలు ప్రారంభించారు. తాజాగా మరో రెండు నోటిఫికేషన్లు ఉమ్మడి జిల్లాలో ఇండస్ట్రియల్, ఐటీ పార్కులను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భూ సేకరణ కోసం వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఏళ్ల క్రితమే ప్రతిపాదనల దశలో ఉన్న చేవెళ్ల మండలం ఆలూరు రెవెన్యూ పరిధిలోని ఇండస్ట్రియల్ పార్కును తాజాగా తెరపైకి తెచ్చింది. 1248.22 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం.. ఆలూరు–1లో 52 సర్వే నంబర్ల నుంచి 510.8 ఎకరాలు, ఆలూరు–2లోని 35 సర్వే నంబర్ల నుంచి 380.38 ఎకరాలు, ఆలూరు–3లోని 31 సర్వే నంబర్ల నుంచి 357.16 ఎకరాల వక్ఫ్ భూముల సేకరణకు నోటిఫికేషన్ చేసింది. ఏళ్ల క్రితమే సమసిపోయిందనుకున్న అంశం మళ్లీ తెరపైకి రావడంతో ఇప్పటి వరకు ఆయా భూములను సాగు చేసుకుంటున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక వికారాబాద్ జిల్లా పరిగి కేంద్రంగా 1,179 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని భావించి, ఆ మేరకు తొలి దశలో 159 ఎకరాల భూములను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అక్కడి రైతుల్లో కూడా ఆందోళన మొదలైంది. లగచర్ల ఘటన ఇంకా పూర్తిగా మరిచిపోక ముందే మరో పారిశ్రామికవాడ పేరుతో నోటిఫికేషన్ వెలువడటం ఆయా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. 1248.22 ఎకరాలుసేకరించనున్నట్లు ప్రకటన -
రైతుల పక్షాన పోరాడుతాం
తుర్కయంజాల్: ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల ఓట్లతోనే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారనే విషయం మరిచారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదిబట్ల సర్కిల్ పరిధి కొహెడలో భూ బాధితుల సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన మహాధర్నాకు సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తరతరాలుగా పేదలు సాగు చేసుకుని ఉపాధి పొందుతున్న భూములను ప్రభుత్వం లాక్కోవడంతో వారు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పండ్ల మార్కెట్, రిజిస్ట్రేషన్ కార్యాలయా ల నిర్మాణానికి సర్వే నెంబర్ 167/1లో పేదలు సా గు చేసుకునే భూములకు బదులుగా ప్రభుత్వ ఆధీ నంలో ఉన్న భూములను కేటాయించాలని డిమాండ్ చేశారు. భూములను కోల్పోతున్న రైతులకు పూర్తి స్థాయిలో నష్ట పరిహారం అందించాలని, లేదంటే రైతుల పక్షాన బీజేపీ పోరాడటానికి సిద్ధంగా ఉందని హెచ్చచరించారు. అంతకు ముందు రైతులు ప్రభు త్వ నిర్ణయానికి నిరసనగా ఎడ్ల బండ్లతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తుర్కయంజాల్ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి, నాయకులు కందాల బలదేవ్ రెడ్డి, సానెం అర్జున్ గౌడ్, బచ్చిగళ్ల రమేశ్, కొత్త రాంరెడ్డి, జగన్, రైతులు పాల్గొన్నారు. -
డయాలసిస్ సేవలు పునరుద్ధరించాలి
జిల్లా వైద్యాధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిపోయిన డ యాలసిస్ సేవల విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మె ల్యే కాలె యాదయ్య స్పందించారు. ఈ విషయమై శనివారం ప్రచురితమైన వా ర్తలతో ఆయన వెంటనే ఆ స్పత్రిలోని డయాలసిస్ కేంద్రానికి చేరుకున్నారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రికి సమీపంలోనే ఉన్న పాలియేటివ్ కేర్ సెంటర్లో సేవలు పునరుద్ధరించాలని ఆదేశించారు. జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారి(డీసీఎహెచ్ఎస్) అనురాగిణితో ఫోన్లో మాట్లాడి షిఫ్టింగ్ చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన ఆమె ఆదివారం పరిశీలించి బాధితులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట చేవెళ్ల మున్సిపల్ చైర్పర్సన్ దేవరి సమతావెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ కె.రాములుగౌడ్, కౌన్సిలర్లు శైలజాఆగిరెడ్డి, ఎం.శ్రీనివాస్, కృష్ణనాయక్, ఏఎంసీ చైర్మన్ పెంటయ్యగౌడ్, వైస్ చైర్మన్ బి.రాములు, నాయకులు చింటు తదితరులు ఉన్నారు. -
పెళ్లికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదం
పూడూరు: బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు వెళ్తూ ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్ మండలం పల్సాపూర్ పరిధిలో పలుగురాళ్ల తండాకు చెందిన కిషన్‌నాయక్ నగరంలో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం ఆయన తన భార్య కవిత ముగ్గురు పిల్లలతో నగరం నుంచి బొంరాస్‌పేట్ మండలం బొట్లవోనితండాలో ఆదివారం జరిగే వారి బంధువుల పెళ్లికి ఆటోలో బయలు దేరారు. మార్గమధ్యలో పూడూరు మండల పరిధిలోని రాకంచర్ల సమీపంలోకి రాగానే పరిగి నుంచి వస్తున్న ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఆటో నడుపుతున్న కిషన్‌నాయక్‌కు తీవ్రగాయాలు కాగా, వారి పిల్లలైన పూజ, శ్రీనివాస్, అక్షితలకు గాయాలయ్యాయి. కవితకు స్పల్వగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను 108లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో నడుపుతున్న కిషన్‌నాయక్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు పిల్లలతో సహా దంపతులకు గాయాలు -
రాధాకృష్ణ ట్రస్ట్ చేయూత
కడ్తాల్: మండల పరిధిలోని పెద్దారెడ్డిచెరువుతండాకు చెందిన వడ్త్యావత్ నంద్యానాయక్ ఆకస్మికంగా మృతిచెందాడు. బాధిత కుటుంబాన్ని శనివారం ఉదయం రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్‌నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ట్రస్ట్ తరఫున ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఎక్వాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇంద్రానగర్తండాలో మృతి చెందిన సభావత్ లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం చేశారు. స్థానిక నాయకులు మహేశ్‌యాదవ్ తనవంతుగా రూ.5 వేలు సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనునాయక్, నాయకులు వెంకటయ్య, రాజునాయక్, మల్లేశ్, శ్రీశైలం, గోపీ, బాలు, మహేశ్ తదితరులు ఉన్నారు. తండా అభివృద్ధే ధ్యేయంకడ్తాల్: గానుగుమర్లతండాను అభివృద్ధే ధ్యే యమని సర్పంచ్ సేవ్యానాయక్ అన్నారు. తండాలోని 2వ వార్డులో జీపీ నిధులతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి సర్పంచ్ భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలో మౌ లిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించడంతో పాటు నీటి సమస్య లేకుండా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అఖిల, గణేశ్, శ్రీను, స్వప్న, రాజు, నాగార్జున్, కవిత, గోపీ, చాంది, పాండు, భీమన్, సకృ, కిషన్, హీరాసింగ్, లాలునాయక్, శ్రీను, జీవన్ తదితరులు ఉన్నారు. -
భవన నిర్మాణం ప్రారంభం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వెంకట్రావ్‌పేటలో నూతనంగా చేపట్టిన గ్రామ సమాఖ్య భవన నిర్మాణాన్ని శనివారం సర్పంచ్ ఇమ్మడి మహేశ్ ప్రారంభించారు. రూ.10 లక్షలతో భవనాన్ని నిర్మిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రశాంత్, మాజీ సర్పంచ్ రమేశ్, స్థానికులు రమేశ్, అరుణ, సత్యం, శంకరయ్య, హుస్సేన్, శ్రీనివాసులు, లింగం, సంతోష, రాజు, బాగ్యమ్మ, యాదయ్య, సువర్ణ, సంతోష తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆమనగల్లు మండలం శెట్టిపల్లి లో మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులను సర్పంచ్ తెలగమల్ల జంగమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణప్రసాద్, స్థానిక నాయకులు వెంకటయ్య, దామోదర్‌రావ్, యాదయ్య, రా ములు, రమేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు భూములివ్వం
యాచారం: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి భూము లు ఇచ్చేది లేదని కుర్మిద్ద గిరిజన రైతులు స్పష్టం చేశారు. సాగు నేలలు ఇవ్వమని వారు చేస్తున్న దీక్ష శనివారానికి ఐదో రోజుకు చేరింది. దీక్షకు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు అంగోత్ రాంబాబు నాయక్, రాష్ట్ర కార్యదర్శి లక్పతి నాయక్‌లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు రద్దుచేయడంతో పాటు.. సాగు భూములను తీసుకోమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘం నేతలు కిషన్‌నాయక్, రైతులు పాల్గొన్నారు. విద్యుదాఘాతానికి గురై యువకుడి మృతి పరిగి: విద్యుదాఘాతానికి గురైన ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మున్సిపల్ పరిధిలోని రుక్కుంపల్లి గేట్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం బడెంపల్లితండాకు చెందిన మూడవత్ సురేశ్(28) కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి పనికి వెళ్తానని చెప్పి బయలు దేరిన కుమారుడు విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి అతడి తల్లిదండ్రుల రోదనల మిన్నంటాయి. వికారాబాద్‌లో లేబర్ పని ఉందని వెళ్లే క్రమంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు మొక్కజొన్న పంటలోని వెళ్లగా.. పందుల బెడద నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రేమపెళ్లి చేసుకున్న దంపతులపై దాడి ● అన్న కూతురుతో పాటు ఆమె భర్తను గాయపర్చిన బాబాయి ● నవాబుపేట పీఎస్‌లో కేసు నమోదు నవాబుపేట: తన అ న్న కూతురు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి దంపతులిద్దరిపైనా దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గంగ్యాడ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి శివకుమార్.. ఇదే ఊరికి చెందిన ఊర కురువ బుచ్చయ్య కూతురు స్వాతిని ప్రేమించి, గతేడాది జూన్ 24న పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించడంతో గ్రామంలోనే ఉంటున్నారు. ఉగాది పండుగ సందర్భంగా మూడు రోజుల క్రితం స్వాతి తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఇది ఇష్టం లేని ఆమె బాబాయి కురువ పరమేశ్ బుధవారం ఉదయం స్వాతిపై చేయిచేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శివకుమార్ వాళ్ల ఇంటికి వెళ్లి నా భార్యను ఎందుకు కొట్టావని నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పరమేశ్ కట్టెలు, రాళ్లతో దాడిచేసి శివకుమార్‌ను సైతం గాయపర్చాడు. బాధితుడి కుటుంబ సభ్యులు అతన్ని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. గురువారం నవాబుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పుండ్లిక్ తెలిపారు. ఇదిలా ఉండగా శివకుమార్‌కు తీవ్రగాయాలైనప్పటికీ ఆస్పత్రిలో పనిచేసే ఓ వైద్యుడు సాధారణ దెబ్బలే తగిలాయంటూ తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే కాలె యాదయ్యను కలవగా ఆయన ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. పూర్తి స్థాయి విచారణ జరిపి, న్యాయం జరిగేలా చూడాలని కోరారు. -
దళితులకు ద్రోహం చేసిన ప్రభుత్వం
ఇబ్రహీంపట్నం: బడ్జెట్లో కోత విధించి.. దళితులను ప్రభుత్వం మోసం చేసిందని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు ఆరోపించారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. 2025– 26 బడ్జెట్లో దళితులకు రూ.40 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. 2026– 27లో కేవలం రూ.11,784 కోట్లు మాత్రమే కేటాయించిందని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఎక్స్‌గ్రేషియాలు వేలాది మందికి అందలేదన్నారు. ఎస్సీ జనాభా 18 శాతం ఉండగా.. నిధుల కేటాయింపు అరకొరేనన్నారు. మూడేళ్ల కాలంలో దళితుల కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులు, పెట్టిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య మాట్లాడుతూ.. బడ్జెట్ తగ్గించడాన్ని ఖండిస్తుందన్నారు. జానాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సామేల్, ప్రకాశ్‌కారత్, మనోహర్, ఆనంద్, వీరేశం, ఎల్లేష్, శంకర్, గణేశ్, యాదగిరి, విజయ్, జగన్‌లు పాల్గొన్నారు.కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు -
కాంగ్రెస్‌తో పేదింటి కల సాకారం
ఆమనగల్లు: కాంగ్రెస్ పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నిరుపేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందన్నారు. మేడిగడ్డతండా పరిధిలోని గుడితండాలో కవిత, రవీందర్ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజలలో పాల్గొన్నారు. కవిత, రవీందర్ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేడిగడ్డతండా సర్పంచ్ రాజేశ్వరి, ఉపసర్పంచ్ విజయ్‌రాథోడ్, మాజీ సర్పంచ్ అంబర్‌సింగ్, నాయకులు మల్లేశ్ నాయక్, సీతారాం, ప్రేమలత, మల్లేశ్, తావుర్యా, దేవ, శ్రీను, హర్య తదితరులు పాల్గొన్నారు. -
మొబైల్ చూస్తూ డ్రైవింగ్
ఇబ్రహీంపట్నం: మొబైల్ ఫోన్ చూస్తూ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతో చెట్టు కింద కూర్చున్న మహిళలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. నల్గొండ జిల్లా తిరుమలగిరికి చెందిన గుగులోతు మహేశ్ వెటర్నరీ మెడిసిన్ సేల్స్‌మెన్. శేరిగూడలో ఓ వెటర్నరీ దుకాణంలో ఆర్డర్ కోసం వచ్చిన ఆయన గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఎదుట నుంచి ప్రయాణిస్తున్నాడు. సెల్‌ఫోన్ చూస్తూ కారు నడపడంతో అదుపుతప్పి పక్కనే చెట్టుకింద కూర్చున్న మహిళలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అలివేలు, పోచమ్మ కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. పెంటమ్మ, లక్ష్మమ్మ స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను నగరం సమీపంలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కాగా డ్రైవర్ మహేశ్ కళ్లు తిరగడంతో వాహనం అదుపుతప్పిందని పోలీసులకు వివరించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. ● చెట్టు కింద కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లిన కారు ● ఇద్దరికి తీవ్రంగా.. మరో ఇద్దరికి స్వల్పగాయాలు -
ఒంటి పూట.. కావొద్దు ఆక్రందనబాట
● వేసవి దృష్ట్యా పిల్లల విషయంలో అప్రమత్తత ● బయటకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే దౌల్తాబాద్: వేసవి కాలం దృష్ట్యా పాఠశాలలకు ఈనెల 16వ తేదీ నుంచి ఒంటి పూట బడులు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం సెలవు కావడంతో పిల్లలు ఆటలాడేందుకు బయటకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఆనందం వెన్నంటే విషాదాలు పొంచి ఉండే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించి పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒంటి పూట బడుల సమయంలో పిల్లలు సరదాలకు అలవాటు పడి తల్లిదండ్రులు వారించినా ఇంటి పట్టున ఉండేందుకు సుముఖత చూపరు. ఇంట్లో చెప్ప పెట్టకుండా సరదా కోసం బయటకు వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువ. వారిని ఓ కంట పెట్టాల్సిన అవసరం ఉంది. సరదా మాటున ప్రమాదం మధ్యాహ్నం పాఠశాలలకు సెలవు కావడంతో పిల్లలు సరదాగా బావుల్లో, చెరువుల్లో స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు నేర్చుకోవడానికి వెళ్తుంటారు. సరదా మాటున ప్రమాదం పొంచి ఉందనే విషయం తల్లిదండ్రులు గ్రహించాలి. ఈత నేర్చుకునే క్రమంలో బావులు, చెరువులు, కుంటలు వాగులు లోతును అంచనా వేయక అందులోకి దిగుతారు. తీరా దిగాక లోతు ఎక్కువగా ఉండడం, మట్టి పేరుకుపోయి ఉండడం తదితర కారణాల వల్ల చిన్నారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులు పర్యవేక్షణలోనే ఈత నేర్చుకోవాలి. అలాగే ఎండలో తిరగడం వలన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. వడదెబ్బకు గురవ్వడం జ్వరం వంటివి రావొచ్చు. కాబట్టి నీడ పట్టునే ఉండేలా చూడాలి. ద్విచక్రవాహనాలు, సైకిళ్లు అంటే పిల్లలకు ఇష్టం ఎక్కువ. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వాటిని నడుపుతూ రోడ్డెక్కితే ప్రమాదాల బారిన పడే అవకాశంంది. కాబట్టి వాటికి దూరంగా ఉంచాలి. అవసరమైతే పెద్దలు పక్కనే ఉంటి వాటిని నడపడం నేర్పాలి. జాగ్రత్తలు తీసుకోండి ● ఒంటిపూట బడి వదలాగానే మధ్యాహ్నం వేళ పిల్లలకు అవసరమైతే తప్పా బయటకు పంపొద్దు. ● ఈ సమయంలో వీలును బట్టి తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపేందుకు అధిక సమయం కేటాయించాలి. ● ఇంటి పట్టున ఉండే పిల్లలకు వారి పని(హోంవర్క్)లో సహాయం చేయాలి. ● పాఠశాల నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చాక చిన్నారులకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. నీతి కథలు స్ఫూర్తిగాథలు చదివే విధంగా ప్రోత్సహించాలి. ● అవసరమైతే నీడ పట్టున ఆడుకునే ఆటలకు ప్రాధాన్యం చెప్పాలి. చదరంగం, క్యారమ్స్ వంటి ఆటలు ఆడేలా చూడాలి. -
తల్లీకూతురి కిడ్నాప్‌కు యత్నించిన రౌడీషీటర్
మీర్‌పేట: వాకింగ్ చేస్తున్న తల్లి, కూతురును కిడ్నాప్‌కు యత్నించిన వ్యక్తిని మీర్‌పేట పోలీసులు రిమాండ్‌కు తరలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. అల్మాస్గూడ మధురాపురికాలనీకి చెందిన శ్రావణి (34) టీచర్. ఈ నెల 19న 9.30 గంటల ప్రాంతంలో ఆమె కుమార్తె (11)తో కలిసి ఇంటి వద్ద వీధిలో వాకింగ్ చేస్తుండగా గతంలో పరిచయం ఉన్న కొడంగల్‌కు చెందిన సంపత్‌కుమార్‌రెడ్డి కారులో వచ్చి శ్రావణి కూతురును కారులోకి లాగేందుకు యత్నించగా వెంటనే అప్రమత్తమైన శ్రావణి ప్రతిఘటించింది. దీంతో సంపత్‌కుమార్‌రెడ్డి శ్రావణిపై దాడి చేయడంతో ఆమె స్పృహ తప్పగా, ఇద్దరిని కారులో ఎక్కించుకున్నాడు. ఔటర్మీదకు తీసుకెళ్తుండగా శ్రావణి తేరుకోగా అరిస్తే చంపేస్తానని వారిద్దరిని బెదిరించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారు నిలిపారు. సమీపంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం కనిపించడంతో తల్లికూతుర్లు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు వారిని మీర్‌పేట ఠాణాలో అప్పగించారు. సందీప్‌కుమార్‌రెడ్డి గతంలో పలుమార్లు వేధించాడని, ప్రాణహాని ఉందని శ్రావణి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతన్ని రిమాండ్‌కు తరలించారు. సందీప్‌రెడ్డిపై కొడంగల్, ఎల్బీనగర్, మహబూబ్‌నగర్, మీర్‌పేట పోలీస్స్టేషన్ల పరిధిలో కేసుల్లో నిందితుడని, గతంలోనే రౌడీషీట్ నమోదైనట్లు ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిందితుడికి రిమాండ్ -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ఇబ్రహీంపట్నం రూరల్: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్ అన్నారు. హామీలు తక్షణమే అమలు చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజ్‌భూపాల్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు నేటికీ పెంచలేదన్నారు. కల్యాణలక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతు భరోసా, రైతు బీమా కరువయ్యాయన్నారు. కాంగ్రెస్ మీద నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే నేడు మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, భూభారతి రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు దరఖాస్తులు సమర్పించినప్పటికీ వారి సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. గ్రామాల్లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు, వీధి దీపాల వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ రాజీలేని పోరాటాలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, పార్టీ మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు పోరెడ్డి నర్సింహారెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్, నారాయణయాదవ్, దయానంద్‌గౌడ్, నిట్టు శ్రీశైలం పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్ -
కేంద్రం నిధులతోనే అభివృద్ధి
కొందుర్గు: కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లేడ్ చౌదరిగూడ మండలం ఎదిర గ్రామంలో అరబిందో ఫార్మా కంపెనీ సహకారంతో ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగుకాల్వలు, తాగునీటి సరఫరాకు సంబంధించిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తోందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ వికసిత్ భారత్– 2047 కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ఇందుకోసం అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎదిర రాజు, నాయకులు అందె బాబయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, వెంకటేశ్ గుప్తా, సుధాకర్ రావు, శంకర్, అశోక్, శివారెడ్డి పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కల సాకారం
మహేశ్వరం: పేదలకు సొంతింటి కలను నిజం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రామచంద్రగూడ సర్పంచ్ కాట్రావత్ దేవినాయక్ అన్నారు. శుక్రవారం ఆమె గ్రామంలో ఆరు ఇందిరమ్మ ఇళ్లను గృహం ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదల ప్రభుత్వం అన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గ్రామంలో ప్రతీ వార్డులో సీసీ రోడ్లు, యూజీ పనులు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఉపాధి హామీ ఏపీఎం పరిమిళ, ఉప సర్పంచ్ అంగోత్ భాస్కర్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంగోత్ కృష్ణ నాయక్,ఎల్గని సిద్దేశ్వర్ గౌడ్, కాట్రావత్ దేవేందర్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ కాటారం అభిలాశ్ గౌడ్. వెంకటేశ్ గౌడ్,శంకర్ నాయక్, చంద్రు, రెడ్యా, పంచాయతీ కార్యదర్శి జయదీప్, గ్రామస్తులు పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తోందని గంగారం సర్పంచ్ మునావత్ దేవేందర్ నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మంఖాల శ్రీనాథ్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు పాండు నాయక్, నాయకులు రవి నాయక్, ధర్మ, గోపి, శ్రీనివాస్, భాస్కర్, దేవా, కార్యదర్శి నవీన్ యాదవ్ పాల్గొన్నారు. -
‘ఫ్యూచర్’ కోసం..
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: తెలంగాణ వార్షిక బడ్జెట్లో ఉమ్మడి జిల్లాపై వరాల జల్లు కురిపించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌సిటీ డెవలెప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) సహా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ కింద మూసీ, ఈసీల సంగమంలో వివిధ అభివృద్ధి పనులు, కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్‌సిటీ పోలీసు కమిషనరేట్‌కు సైతం భారీగా నిధులు కేటాయించింది. మరుగున పడిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. కొడంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొంది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ జోన్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు సమకూర్చనుంది. దేశవిదేశీ కంపెనీలను ఇక్కడికి తీసుకొచ్చి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించనుంది. జిల్లా వాసులకు మరింత మెరుగైన, సత్వర వైద్యసేవలు అందించేందుకు ఈ ఏడాది చివరి నాటికి ఎల్బీనగర్ టిమ్స్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించి, ఆ మేరకు మౌలిక సదుపాయాల కల్పన కోసం బడ్జెట్లో తగిన ప్రాధాన్యత కల్పించింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి.. యాచారం, కడ్తాల్, కందుకూరు మండలాల్లోని 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్‌సిటీ నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీని అభివృద్ధి కోసం ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఇక్కడ మౌలిక సదుపాయల కల్పన కోసం బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించింది. రేడియల్ రోడ్ల నిర్మాణం, ఫ్యూచర్‌సిటీని నేరుగా ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి, భూగర్భ విద్యుత్ లైన్లు, పర్యావరణ అనుకూల స్మార్ట్ గ్రిడ్లతో సుస్థిర అభివృద్ధికి నిదర్శనంగా నిలువనుందని ప్రకటించింది. స్కిల్ వర్సిటీకి రూ.30 కోట్లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం కోసం ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఈ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.30 కోట్లు కేటాయించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఐటీఐలను ఈ వర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చి, విద్యార్థి దశలోనే పరిశ్రమలకు కావాల్సిన స్కిల్స్‌ను నేర్పించనుంది. ప్రాణహిత–చేవెళ్లకు రూ.526 కోట్లు గోదావరి నదిపై తుమ్మిహెట్టి వద్ద నిర్మించనున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ.526 కోట్లు కేటాయించింది. బీఆర్ఎస్ హయాంలో మరుగున పడేసిన ఈ ప్రాజెక్టుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2026–27 వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించి మళ్లీ ఊపిరి పోసినట్లైంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.1,800 కోట్లు కేటాయించింది. కానీ పథకంలో భాగంగా షాద్‌నగర్ నియోజకవర్గం జిల్లెడు చౌదరిగూడం మండలంలో 1,512 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతల పెట్టిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పేరును ప్రస్తావించ కపోవడం విస్మయం కలిగిస్తోంది. నారాయణపేట్–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రూ.1,101 కోట్లు కేటాయించి జిల్లాలోని ప్రాజెక్టుకు పెద్దపీట వేసింది. డిండి ఎత్తిపోతల పథకానికి రూ.600 కోట్లు కేటాయించి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని పంట పొలాలకు నీళ్లు అందించే శివన్నగూడం ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చింది. ‘ఫ్యూచర్’ కమిషనరేట్‌కు రూ.250 కోట్లు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్‌సిటీ పోలీసు కమిషనరేట్ భవనానికి రూ.250 కోట్లు కేటాయించింది. పోలీసుల జీతభత్యాలు, ఇతర ఖర్చుల కోసం మరో రూ.40 కోట్లు కేటాయించింది. అభివృద్ధికి బాటలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసేలా ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయ, నీటి పారుదల, రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో ప్రగతిశీల అభివృద్ధితో పాటు మహిళా సంక్షేమం, యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల, మైనారిటీల అభ్యున్నతికి కేటాయింపులు హర్షణీయం. – డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మండలి చీఫ్ విప్ జిల్లాకు తీరని అన్యాయం ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్. జిల్లాకు తీరని అన్యాయం చేసే విధంగా ఉంది. రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చిపెడుతున్న జిల్లాకు ఆశించిన విధంగా నిధులు కేటాయించకపోవడం దారుణం. వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కేటాయింపులు లేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. – బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు విద్యకు అంతంతే.. బడ్జెట్లో విద్యకు జరిగిన కేటాయింపులు 8.2 శాతమే. వీటితో నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రారంభం సాధ్యమవుతుందా..? అనేక గురుకులాలు ఇంకా ప్రైవేటు భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత హెల్త్ కార్డ్స్ ప్రక్రియ సాఫీగా సాగడం లేదు. – వై.కరుణాకర్ రెడ్డి, ఎస్టీయూటీఎస్ నాయకుడు అంకెల గారడీ బడ్జెట్ అంకెల గారడీని తలపించేలా ఉంది. క్షేత్ర స్థాయిలో సామాన్యుడికి చేరేది అత్యల్పం. ప్రజలను మభ్య పెడుతున్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం కంటే అధికంగా ఉన్న బీసీలకు కేవలం 3.8 శాతం మాత్రమే కేటాయించారు. బీసీ సబ్ ప్లాన్ ఊసే లేదు. వ్యవసాయ రంగంలో గతేడాది కంటే కోత విధించడం అన్యాయం. – ఓరుగంటి యాదయ్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎఫ్సీడీఏకు రూ.300 కోట్లు పోలీసు కమిషనరేట్‌కు రూ.40 కోట్లు రేడియల్‌రోడ్లు.. పారిశ్రామికవాడలకు ప్రత్యేక నిధులు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు ప్రాధాన్యత బడ్జెట్లో ఉమ్మడి జిల్లాపై వరాల జల్లు -
జాతర వైభవంగా నిర్వహిద్దాం
● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ● రథ చక్రాలకు పూజలు తాండూరు: ఉగాది పర్వదినం రోజున పట్టణంలోని భావిగి భధ్రేశ్వర దేవాలయ జాతర మొదటి ఘట్టాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథ చక్రాలకు పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింహులు, ఆలయ కమిటీ సభ్యులు, వీరశైవ సమాజం సభ్యులు పాల్గొన్నారు. -
జిల్లాకు డ్రగ్స్ కళంకం!
వికారాబాద్: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో కొకై న్ దొరికిన నేపథ్యంలో జిల్లాలో చర్చ మొదలైంది. రెండు రోజుల క్రితం మొయినాబాద్ సమీపంలోని ఫాంహౌస్‌లో పైలెట్‌తోపాటు ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ, ఇతర నేతలు ఈగల్ టీమ్‌కు చిక్కిన విషయం తెలిసిందే. డ్రగ్స్ తీసుకోవడంతోపాటు పోలీసులపై కాల్పులు జరిపిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేనే డ్రగ్స్ ఘటనలోనూ ముఖ్య పాత్ర ఉండటంతో జిల్లాలో ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతోంది. దీంతో ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కిపెడుతున్నారు. జిల్లాలోనూ డ్రగ్స్ మూలాలు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇటీవలి కాలంలో రిసార్ట్స్, ఫాంహౌస్ కల్చర్ పెరిగిపోయింది. వీకెండ్స్‌లో నగరం నుంచి వేల సంఖ్యలో సాఫ్ట్వేర్లు, ఇతర పర్యాటకులు వచ్చి రాత్రిళ్లు బస చేసేందుకు జిల్లా కేంద్రానికి అనుకుని ఉన్న రిసార్ట్స్‌ను ఎంచుకుంటున్నారు. గతంలో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఓ రిసార్ట్స్ కూడా పైలెట్ అండదండలతోనే ఏర్పాటు చేశారనే ఆరోపణలు వచ్చాయి. మన టీంలు ఎక్కడ? మొయినాబాద్ ఫాంహౌస్‌పై ఈగల్, ఎస్ఓటీ టీంలు దాడి చేసి డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న బడాబాబు లను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక బృందాల పనితీరుపై చర్చ మొదలైంది. ఇటు పోలీసులు అటు ఎకై ్సజ్ శాఖలోనూ ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ బృందాలు ఉన్నాయి. వీరు అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్తీ టీ పౌడర్, గుట్కాలు పట్టుకోవడంలాంటి వాటికే పరిమితమవున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పు డు ఒకటి అరా గంజాయి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. వాటి మూలాల జోలికి వెళ్లరనే అపవాదు ముటగట్టుకున్నారు. గంజా సరఫరా చేస్తున్నది ఎవరు? వారి వెనక ఉన్నదెవరు అనే కోణంలో దర్యాప్తు సాగడం లేదు. వ్యసనపరులను పట్టుకోవడంతో సరిపెడుతున్నా రు. ఎలాంటి అనుమతులు లేని రిసార్ట్స్ జోలికి వెళ్లరు. వాటిలో రాత్రిళ్లు మద్యం తాగి చిందులు వేయడం, అనంతగిరి పారెస్టులో ఉన్న వన్య ప్రాణు లు బయపడేలా డీజేలు పెట్టడం, డ్యాన్సులు చేయ డం లాంటివి యథేచ్ఛగా సాగిస్తున్న చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా రిసార్ట్స్ నిర్వహిస్తున్నా అధికారులకు పట్టడం లేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి అక్రమం అంటూ సీజ్ చేస్తున్నారు. ఐదారేళ్ల తర్వాత అక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఒక వేళ సీజ్ చేసినా నెల తిరక్కుండానే మళ్లీ తెరుచుకోవడం అధికారుల పని తీరుకు అద్దం పడుతోంది. అక్రమ ఫాంహౌస్లపై నిగ్గుతేలుస్తామ ని కమిటీలు వేసినా నివేదికలు మాత్రం బయటపెట్టరు. ఎలాంటి చర్యలు కూడా ఉండవు.. తప్పులు కళ్ల ముందే కనిపించినా పట్టించుకోరు.. ఇది జిల్లాలో కొంత కాలంగా నడుస్తున్న తీరు. ఎకై ్సజ్, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాలు సమర్థవంతంగా పని చేస్తే మొయినాబాద్ లాంటి ఘటనలు అనేకం వెలుగు చేసే అవకాశం లేకపోలేదని స్థానికులు బాహాటంగానే అంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా.. రిసార్ట్స్ ఏర్పాటు చేయాలంటే ముందుగా పోలీసు, గ్రామ పంచాయతీ, డీపీఓ, రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్, ఫారెస్టు తదితర శాఖల నుంచి అనుమతులు, ఎన్ఓసీలు పొందాలి. కానీ నిర్వాహకులు ఇవేవీ పట్టించుకోకుండా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. పర్యాటకుల నుంచి ఒక్కరోజుకు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. వికారాబాద్ సమీపంలో వైల్డర్నెస్ క్యాప్ సైట్, పెంగ్విన్, మూన్లైట్ అడ్వెంచర్, టిక్కి విలేజ్, నేచర్ రిట్రీట్, హరివిల్లు, అవని ఫార్మ్ పేరిట రిసార్ట్స్ నిర్వహిస్తున్నారు. గతంలో పూడూరు మండల పరిధిలోని పలు రిసార్టులకు అనుమతులు లేకపోవడంతో అధికారులు మూసివేశారు. నెల తిరక్కుండనే ఓపెన్ కావడం విమర్శలకు తావిస్తోంది. వికారాబాద్‌లో డ్రగ్స్ మూలాలున్నట్లు అనుమానాలు రిసార్ట్స్, ఫాంహౌస్‌లలో దందా పట్టించుకోని ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు -
వస్తోంది ‘భరోసా’
సాక్షి, రంగారెడ్డిజిల్లా : ఉగాది పర్వదినం రోజు ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఈ 22 నుంచి ఖాతాల్లో రైతు భరోసా జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఎకరానికి రూ.6 వేల చొప్పున నగదును పంట సాయంగా అందజేయనుంది. మూడు విడతల్లో నగదు జమ చేయనుంది. ఈ మేరకు గురువా రం ఉగాది వేడుకలను పురస్కరించుకుని పంచాంగ పఠనం కార్యక్రమం అనంతంరం సీఎం చేసిన ఈ ప్రకటనతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ఐదున్నర లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మొదటి విడతలో ఒక ఎకరం వరకు, రెండో విడతలో రెండు ఎకరాల వరకు, మూడో విడతలో ఆ తర్వాతి విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. ఏప్రిల్ చివరి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం 2.5 ఎకరాలలోపు రైతులు : 1.56,355 2.5 నుంచి 5 ఎకరాల లోపు : 56,853 ఐదు నుంచి పది ఎకరాల లోపు : 25,888 పది నుంచి 25 ఎకరాల లోపు : 7,118 25 ఎకరాలకుపైగా ఉన్న రైతులు : 744 రంగారెడ్డి జిల్లాలో ఇదీ లెక్క -
అర్హులకు పథకాలు
చేవెళ్ల: ఉగాది రోజున పేదలు సగర్వంగా సొంతింటిలోకి అడుగుపెట్టడం శుభ సూచకమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం ఆయన మున్సిపల్ పరిధిలోని మొండివాగులో అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ సమతారెడ్డి, మిషనర్ వెంకటేశ్ం, ఊరెళ్ల కౌన్సిలర్లు మల్లేశ్, సువర్ణలతో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తుందన్నారు. సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అర్హులందరికీ దశలవారీగా ఇళ్లు అందుతాయన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాముగౌడ్, కౌన్సిలర్లు శైలజ, డి.గోపాల్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, వీరేందర్‌రెడ్డి, నాయకులు శివకుమార్, వెంకట్‌రెడ్డి, ఆగిరెడ్డి, శివప్రసాద్, రాజు, జహంగీర్, చందు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోనే సొంతింటి కల సాకారం ఇండిరమ్మ ఇల్లు ప్రారంభం కొత్తూరు: కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని కొత్తూరు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన పెంజర్ల గ్రామంలో సర్పంచ్ జగన్‌తో కలిసి నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంతన్‌రెడ్డి, నాయకులు రాజేందర్‌రెడ్డి, రమేశ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
వెనుక నుంచి వేగంగా వచ్చి..
● స్కూటర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ● అక్కడికక్కడే సెక్యూరిటీ గార్డు దుర్మరణం మొయినాబాద్: వెనుకనుంచి అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు స్కూటర్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కనకమామిడి గ్రామానికి చెందిన పంచాలింగాల బాల్‌రెడ్డి (43) జేబీఐటీ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం కనకమామిడి నుంచి మొయినాబాద్‌కు స్కూటర్‌పై వెళ్తుండగా తాజ్ సర్కిల్ హోటల్ వద్దకు రాగానే మెహిదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చేవెళ్ల నుంచి మెహిదీపట్నం వెళ్తూ అతివేగంతో వచ్చి స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో బాల్‌రెడ్డి రోడ్డుపై పడగానే బస్సు వెనుక చక్రాలు అతని తలపై నుంచి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఉగాది పండుగరోజే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. మృతునికి భార్య అరుణ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరకత శివాలయం సన్నిధిలో రిటైర్డ్ ఐజీ
శంకర్పల్లి: మండల పరిధిలోని చెందిప్పలో వెలసిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని గురువారం రిటైర్డ్ ఐజీ మల్లారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అనంతరం శివలింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రిటైర్డ్ ఐజీ దంపతులకు శేష వస్త్రం, ఆలయ ప్రతిమను బహూకరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐజీ మాట్లాడుతూ.. పురాతన మరకత శివాలయం ఎంతో అద్భుతంగా ఉందన్నారు. మల్లారెడ్డి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ట్రాన్స్‌కో, ఏసీబీ, హౌసింగ్ కార్పొరేషన్ విభాగాల్లో పని చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు హన్మంతు, భీంరెడ్డి, అర్చకుడు ప్రమోదు తదితరులు పాల్గొన్నారు. 23న భగత్‌సింగ్ విగ్రహావిష్కరణ షాద్‌నగర్: పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఈ నెల 23న భగత్‌సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు ప్రజా సంఘాల నాయకులు గురువారం తెలిపారు. విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వర్ హాజరు కానున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎన్రాజు, శ్రీను నాయక్, ఈశ్వర్, కుర్మయ్య, వెంకటరమణ, శ్రీకాంత్, నర్సింలు, సత్యం, కరుణాకర్, జనార్ధన్, బాలు నాయక్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరామ శోభాయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
షాద్‌నగర్: హిందూవాహిని ఆధ్వర్యంలో ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన శ్రీరామ శోభాయాత్రకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, బీజేపీ నాయకులు బండారి రమేష్, అందె బాబయ్య, శ్రీవర్ధన్‌రెడ్డి, చెట్ల వెంకటేశ్, ప్యాట అశోక్, వెంకటేశ్వర్‌రెడ్డి, మురళి, మహేశ్, శేఖర్, రాఘవేందర్, మంగ శ్రీశైలం, రమేష్, రాజశేఖర్, శీలం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యతిరేక శక్తులకే ‘పరాభవం’
మొయినాబాద్: ‘పరాభవం అంటే సంస్కృతంలో అవమానం, చెడు ప్రభావం అనే అనుభూతి ఉంది. అది భగవంతుడికి వ్యతిరేకంగా ఉండే శక్తులకే పరాభవం. ధర్మ ఆచరణ చేసేవారికి పరాభవమే ఒక ఆశీర్వాదం’ అని చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్ పేర్కొన్నా. ఉగాది సందర్భంగా గురువారం చిలుకూరు బాలాజీ దేవాలయంలో పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దైవ నింద, దైవ ధూషణ చేసేవారికి పరాభవం ఉంటుందని తెలి పారు. ఈ సంవత్సరం గురువారం రోజు పుట్టడంతో గురువుగారు రాజుగా ఉంటారని.. నవనాయకుల్లో ఏడుగురు శుభులు, ఇద్దరు పాపులు ఉంటారన్నారు. ఏడు శుభాలు, రెండు అశుభాలు ఉంటాయన్నారు. 70 శాతానికి పైగా శుభమే ఉంటుందన్నారు. ఈసారి విశేషమైన వర్షాలు ఉంటాయని.. సువృష్టి ఉంటుందని.. అనావృష్టి ఉండదని.. కొన్ని ప్రదేశాల్లో కుంభవృష్టి ఉంటుందని చెప్పారు. జల ప్రళయాలకు సంబంధంలేదని.. కరువు కాటకాలు ఉండవు.. అతివృష్టి ఉండదన్నా రు. ఈ సంవత్సరం దాన ధర్మాలు ఎక్కువగా చేయాలని.. భగవంతునిపైన చింతన పెంచే విధంగా అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని.. విద్యాదానం చేయాలని సూచించారు. సీ్త్ర జాతి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. పంచాంగ పఠనం చేసే ముందు రంగరాజన్ భావోద్వేగానికి గురయ్యారు. గత నెల 27న తన తండ్రి సౌందరరాజన్ మరణించారని, 25 ఏళ్లుగా పంచాంగ పఠనం చేస్తున్న తాను మొదటిసారి తండ్రి పర్యవేక్షణ లేకుండా పఠనం చేస్తున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరణ కలియుగ దైవం చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల పత్రికను గురువారం ఆవిష్కరించారు. పంచాంగ పఠనం అనంతరం స్వామివారి పాదాల వద్ద బ్రహ్మోత్సవాల పత్రికను ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పెద్దలు, అర్చకుల చేతులమీదుగా పత్రికను ఆవిష్కరించి కావలి వంశానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు గుండు గోపాల్‌కు మొదటి పత్రికను అందజేశారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 3 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ స్వామి, అర్చకులు పాల్గొన్నారు. చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ -
లారీ కిందకు దూసుకెళ్లిన కారు
● సంతాపూర్ ఉప సర్పంచ్ దుర్మరణం ● మరొకరి పరిస్థితి విషమం ● ఏపీలో దుర్ఘటనపెనుకొండ రూరల్: టమాట పైరు కోసం వచ్చిన కేశంపేట ప్రాంతానికి చెందిన ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కేశంపేట మండలం సంతాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ అంజయ్య(45), తన పొలంలో టమాట సాగు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో కర్ణాటక సరిహద్దున ఉన్న నర్సరీల్లో టమాట పైరు కొనుగోలు చేసేందుకు సమీప బంధువు శ్రీకాంత్‌తో కలసి కారులో ఆదివారం రాత్రి బయలుదేరాడు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఏపీ లోని పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో.. డ్రైవర్ శ్రీనివాసులు నియంత్రణ కోల్పోవడంతోలారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసుతో పాటు పక్కనే ముందు సీటులో కూర్చున్న అంజయ్య తీవ్రంగా గాయపడ్డారు. కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న కియా పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులనుపెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అంజయ్య మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసుకు ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి రెఫర్ చేశారు. వెనుక సీటులో ఉన్న మరో వ్యక్తి శ్రీకాంత్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఘటనపై కియా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
విజయ డెయిరీ ప్రారంభం
షాద్‌నగర్‌రూరల్: పట్టణంలోని నాగులపల్లి రోడ్డు(10వ వార్డు)లో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ డెయిరీ సెంటర్‌ను సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంలో భాగంగా డెయిరీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలందరూ స్వచ్ఛమైన విజయ డెయిరీ పాలు, పాల పదార్థాలను వాడుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో జిల్లాలో ప్రభుత్వం ద్వారా మరిన్ని సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, మున్సిపల్ చైర్మన్ అగ్గనూరి బసవేశ్వర్, కౌన్సిలర్లు శ్రావణి, మురళీమోహన్, కమిషనర్ సునీత, మోహన్, మురళీ, ధన్‌రాజ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకుడికి నివాళి చేవెళ్ల: సర్ధాన్నగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడి హఠాన్మరణం బాధాకరమని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. షాబాద్ మండలంలోని సర్ధార్నరగ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పలాది శ్రీనివాస్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలిసుకున్న పట్నం అవినాశ్‌రెడ్డి, మండల నాయకులతో కలిసి సోమవారం గ్రామానికి వచ్చి మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు సర్పంచ్ మామిడి కీర్తిహరీశ్, శ్రీరామ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రామ్మోహన్‌గుప్తా తదితరులు ఉన్నారు. అదేవిధంగా మండలంలోని లింగారెడ్డిగూడలో గ్రామ సర్పంచ్ పొన్న సుధాకర్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి దశదిన కర్మలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. గ్యాస్ ధరల పెంపుతో పేదలపై భారం రైతు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్‌గౌడ్ మొయినాబాద్: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి.. గ్యాస్ సిలిండర్లనూ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్‌గౌడ్ డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా–ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ ధరలు పెంచడం దారుణమన్నారు. గ్యాస్ ధరల పెంపుతో పేదలపై తీవ్ర భారం పడుతుందన్నారు. గ్యాస్ బుకింగ్ విధానంలో తెచ్చిన మార్పులను సవరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కె.శ్రీనివాస్, నాయకులు యాదగిరి, ఖాసింబాయ్, మోహన్‌రెడ్డి, సురేశ్, బాలమణి, పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
మొయినాబాద్‌రూరల్: అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చేవెళ్ల ఫైర్ స్టేషన్ అధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, గ్రామస్తులకు చేవెళ్ల ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పాల్గొని వంట గ్యాస్ సిలిండర్, ఎలక్ట్రికల్, ఆయిల్ మంటలు జరిగే సమయంలో తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు. ప్రయోగపూర్వకంగా మంటలు ఆర్పే విధానాన్ని చేసి చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రమాదాలు జరిగిన వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ఫైర్ అధికారులను సన్మానించారు. కార్యక్రమంలో ఫైర్ ఆపరేటర్ గోపాల్, సర్పంచ్ పెద్దవీటి అర్చనఅజయ్రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దవీటి విజయ్‌రెడ్డి, ఉపసర్పంచ్ ప్రభాకర్, వార్డుసభ్యులు పాల్గొన్నారు. -
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
చేవెళ్ల: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం షాబాద్ మండలంలోని సోలిపేటలో రూ.40 లక్షలతో సీసీరోడ్డు, హైతాబాద్, చందనవెల్లి గ్రామాల్లో రూ.20 లక్షల నిధులతో సీసీరోడ్లకు శంకుస్థాపన, సోలిపేటలో ఇందిరమ్మ ఇళ్లు, చందనవెళ్లిలో చలివేంద్రంను ఆయన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభు త్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గ్రామాల్లో ఎ లాంటి సమస్యలు ఉన్న వాటిని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్ధార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, సర్పంచులు రాజేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నవనీతస్వామి, శాంతమ్మయాదయ్య, స్వరూప మహేందర్‌గౌడ్, రాజునాయక్, చెన్నయ్య, మాణిక్యం, నా యకులు జనార్ధన్‌రెడ్డి, నరేందర్, మహేందర్‌రెడ్డి, రమేశ్, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య -
విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలి
ఏబీవీపీ నాయకుల డిమాండ్ చేవెళ్ల: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుర్వ మహిపాల్ అన్నారు. చేవెళ్లలో సోమవారం నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి 9,500ల కోట్ల స్కాలర్షిప్లు, ఫీజురీయంబర్స్మెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి విద్యపైనే ఆధారపడి ఉంటుందని తెలిసి కూడా విద్యారంగాన్ని పట్టించుకోకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెలలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 15శాతం బడ్జెట్లో కేటాయింపులు ఉండేలా చూడాలన్నారు. వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో ఏబీవీపీ నాయకులు హారిక, అనిల్, ప్రశాంత్, లోకేశ్, జైపాల్ పాల్గొన్నారు. అక్రమ అరెస్ట్‌లతో నిరసనను ఆపలేరు సీఐటీయూ జిల్లా నేత సాయిబాబా కొత్తూరు: అక్రమ అరెస్ట్‌లతో అంగన్వాడీల ఉద్యమాలను ప్రభుత్వం ఆపలేదని సీఐటీయూ జిల్లా నాయకుడు బీసా సాయిబాబా అన్నారు. అంగన్వాడీల సమస్యలు, డిమాండ్ల సాధనకు సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఉద్యమాన్ని అడ్డుకోవాలనే కుట్రతో అంగన్వాడీలు, మద్దతు తెలుపుతున్న నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం అణిచివేతకు నిదర్శనమన్నారు. అంగన్వాడీలకు నెలకు రూ.18 వేల వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో విడతల వారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అంగన్వాడీలు ప్రేమలత, సుజాత, అనిత, నారాయణమ్మ, అరుంధ ఉన్నారు. -
పశుపోషణతో అదనపు ఆదాయం
షాద్‌నగర్: పశుపోషణతో రైతులు అదనపు ఆదా యం ఆర్జించవచ్చునని పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య వర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్ కిషన్‌రావు అన్నారు. సోమవారం నందిగామ మండలం మేకగూడ, సంఘీగూడ, పిట్టలగూడ గ్రామాల్లో రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి, నాట్కోపరిశ్రమ, సహకారంతో ఉచిత పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులకు పశుపోషణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించడంలో పశు సంపద కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రభుత్వం రైతులకు సాంకేతిక, ఆర్థిక, నైతిక మద్దతును అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని, ప్రోత్సాహాన్ని రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాడి రైతులు విధిగా పశువైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని అన్నారు. జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. మేకగూడలో చాలా మంది రైతులు పాడిపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. సరైన పోషణ పద్దతులు, పశు ఉత్పత్తుల నిర్వాహణలో అవగాహన లేక ఆఽశించిన స్ధాయిలో లాభాలను పొందలేకపోతున్నారని అన్నారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో 158 పశువులకు ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల డీన్ డాక్టర్ మాధురి, డాక్టర్ విష్ణువర్ధన్, సర్పంచ్‌లు మారు రాజు నాయక్, కొమ్ము కృష్ణ, పాల్గొన్నారు. పీవీ నర్సింహారావు పశువైద్య వర్సిటీ వీసీ డాక్టర్ కిషన్‌రావు -
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం తరలించొద్దు
మహేశ్వరం: ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మహేశ్వరం మండల కేంద్రంలోనే కొనసాగించాలని కలెక్టర్ నారాయణరెడ్డికి మహేశ్వరం మండల పరిధిలోని సర్పంచ్‌లు, బీఆర్ఎస్ నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జీహెచ్ఎంసీ పరిధిలోకి తరలించే ఆంశాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1995 నుంచి నియోజకవర్గ కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కొనసాగుతోంది. దీంతో కందుకూరు, కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలు, ఇతర ప్రాంతాలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. సిరిగిరిపురం రెవెన్యూ సర్వే నెంబర్ 71లో ఉన్న ప్రభుత్వ భూమిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నిర్మాణం చేయాలని కోరారు. ఇప్పటికే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్డీఓ, తహసీల్దార్ స్థలాన్ని పరిశీలించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ నారాయణరెడ్డి ఆర్డీఓతో మాట్లాడి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్, పీఏసీఎఎస్ మాజీ చైర్మన్లు పి.అంబయ్య యాదవ్, మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ దేవరంపల్లి వెంకటేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్రోళ్ల చంద్రయ్య, దేవులా నాయక్, కుమార్ నాయక్, రమేశ్, రవి నాయక్, కృష్ణ, అజాం, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌కు విన్నవించిన సర్పంచ్‌లు, నాయకులు -
ఆలయ భూములు ఆక్రమిస్తే చర్యలు
చేవెళ్ల: ఆలయ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని దేవాదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ ఎ.చంద్రశేఖర్ అన్నారు. చేవెళ్ల వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి చేవెళ్ల పరిధిలోని మల్కాపూర్‌లో సర్వే నెంబర్లు 10 నుంచి 29, 31, 33, 127, 140, 141, 230 నుంచి 238, 273, 274, 275, 366లలో గల 77.30 ఎకరాల భూమిపై కోర్టులో కేసు కొనసాగింది. 2025 డిసెంబర్ 23న ఈ భూములు దేవాదాయశాఖకే చెందుతాయని హైకోర్టు తీర్పు వచ్చిందన్నారు. ఈ తీర్పు ప్రకారం మల్కాపూర్‌లో ఉన్న ఈ భూమిని సోమవారం దేవాదాయశాఖ అధికారులు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి పోలీసుల సమక్షంలో ఈ భూములలో బోర్డులు పాతారు. ఈ భూములను సాగు చేసుకుంటున్న గ్రామానికి చెందిన కొంత మంది రైతులకు దేవాదాయశాఖకు మధ్య ఏళ్ల తరబడిగా కేసు కొనసాగింది. ఇన్నాళ్లు రైతులు ఈ భూములు తమవే అంటూ సాగు చేసుకుంటూ వస్తుండటంతో కోర్టు తీర్పు ఆధారంగా ఈ భూ ములను దేవాదాయశాఖ ఆధీనంలోకి తీసుకుందని చెప్పారు. ఇక నుంచి ఈ భూములు దేవదాయశాఖ ఆధీనంలో ఉంటాయని వీటిపై ఎవరికి ఎలాంటి అధికారం లేదని చెప్పారు. ఈ బోర్డులను ఎవరైనా తీసినా భూఆక్రమనకు యత్నించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సర్వేలో దేవా దాయశాఖ ఈఓ టి.నరేందర్, పలు దేవాలయాల కార్యనిర్వహణ అధికారులు, చేవెళ్ల ఆలయ ధర్మకర్తలు దేవుని వామనాచార్యులు, పూజారులు అనంతచార్యులు శ్రీపాదు, చేవెళ్ల సీఐ భూపాల్‌శ్రీధర్, ఎస్ఐ తేజశ్రీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రమౌలి, అధికారులు, సిబ్బంది గ్రామస్తులు ఉన్నారు.దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ చంద్రశేఖర్ -
పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన అవసరం
డీఎల్పీఓ సాంబిరెడ్డి కడ్తాల్: పంచాయతీరాజ్ చట్టంపై వార్డు సభ్యులకు సంపూర్ణ అవగాహన ఉండాలని కందుకూర్ డీఎల్పీఓ సాంబిరెడ్డి సూచించారు. సోమవారం కడ్తాల్ రైతువేదికలో పంచాయతీ వార్డు సభ్యులకు వారం రోజుల పాటు రెండో విడత శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభ్యులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ లాలయ్య, శిక్షణ అధికారులు రమేశ్, మౌనిక, ప్రసాద్ మైసిగండి, మక్తమాదారం, మర్రిపల్లి, ముద్వీన్, నార్లకుంటతండా, న్యామతాపూర్, పల్లెచెలకతండా, పీవీబీయితండా, రేఖ్యతండా, సాలార్‌పూర్, వాస్‌దేవ్‌పూర్ గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఇంధన ఇబ్బందులు షురూ మంచాల: గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే వంట గ్యాస్‌కు ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెట్రోల్, డీజిల్ సైతం దొరకడం కష్టంగా మారింది. మండల కేంద్రంలోని సాయి చంద్ర ఫిల్లిం స్టేషన్లో రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ అందుబాటు లేదు. దీంతో సిబ్బంది ‘నో స్టాక్ ’బోర్డు తగిలించారు. గ్రామాల్లో పెట్రోల్, డీజిల్ విక్రయించే కిరాణ దుకాణాదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
గ్యాస్ కొరత లేదు
కలెక్టర్ నారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలో గృహ అవసరాలకు గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు అవసరమైన నిల్వలను అందుబాటులో ఉన్నాయని, ఎల్పీజీ సిలిండర్లు పక్కదారి పట్టకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక మానిటరింగ్ కమిటీ పనిచేస్తోందని, బుకింగ్‌లు, స్టాక్‌పై రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ అధికారి ఆధ్వర్యంలో కంట్రోల్ రూం కొనసాగుతోందని, 7989868271 నంబరులో సంప్రదించాలని, సామాజిక మధ్యమాల్లో ప్రచారమవుతున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. ‘జల వనిత’కు సత్కారం ఆమనగల్లు: జల జీవన్ మిషన్ అమలులో విశేష కృషి చేసిన ఆమనగల్లు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన తెలగమల్ల ఆనంద జలవనితగా ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన జల మహోత్సవ్ (2016)లో పాల్గొన్న ఆమెను సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డి ఘనంగా సత్కరించారు. తెలంగాణ నుంచి ముగ్గురు మహిళా సర్పంచ్‌లు, ముగ్గురు జల వనితలు, ముగ్గురు స్వయం సహాయక బృందాల సభ్యులు జలమహోత్సవ్లో పాల్గొన్నారని, ఇందులో ఆనంద ఉండటం అభినందనీయమ కొనియాడారు. ఈ కార్యక్రమంలో చెన్నంపల్లి సర్పంచ్ తెలగమల్ల ప్రశాంతి రవికుమార్ తదితరులు ఉన్నారు. కుంగ్‌ఫూలో సత్తాచాటిన షాద్‌నగర్ విద్యార్థులు షాద్‌నగర్: జాతీయ స్థాయి కుంగ్‌ఫూ పోటీల్లో షాద్నర్ విద్యార్థులు సత్తాచాటారు.పట్టణంలో ని ఠాగూర్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో సోమవారం కుంగ్‌ఫూ మాస్టర్ బాల్‌రాజ్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన పోటీల్లో న్యూపవర్ కుంగ్‌ఫూ అకాడమీ విద్యార్థులు ప్రేమ్‌కుమార్, రా హుల్ కట్ట ఉత్తమ ప్రతిభ కనబరిచి, ట్రోఫీలు సొంతం చేసుకున్నారు. మాస్టర్ అహ్మద్‌ఖాన్, గ్రాండ్ మాస్టర్ వీరాచారి విజేతలకు బహుమతులు అందజేశారు. నిందితులకు నాలుగు రోజుల జైలు మోమిన్‌పేట: పీటీ కేసు నిందితులకు నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ భరత్‌భూషన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని కాస్లబాదు గ్రామానికి చెందిన సండ్ర మొగులయ్య, సండ్ర కిష్టయ్య పరస్పరం గొడవపడి ఠాణలో ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేశా మన్నారు. వారిని వికారాబాద్ కోర్టులో హాజరుపరచగా స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రెండో తరగతి కోర్టు జడ్జి మాయ బ్రహ్మనర్సింహ నిందితులకు నా లుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. -
బడంగ్పేట్లో ఏసీబీ సోదాలు
బడంగ్పేట్: బడంగ్‌పేట సర్కిల్– 16 కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో 15 మందితో కూడిన బృందం కార్యాలయానికి చేరుకుని సోదాలు మొదలుపెట్టింది. ముందుగా డీసీ సరస్వతి చాంబర్లోకి వెళ్లి విచారణ ప్రారంభించింది. అనంతరం డీఈ వెంకన్న, మేనేజర్ శ్రీధర్‌రెడ్డిని పిలిపించిన అధికారులు అదే చాంబర్లో విచారణ చేపట్టారు. ఏసీబీ టీం వచ్చిందనే సమాచారం తెలియగానే టౌన్‌ప్లానింగ్ చాంబర్లో ఉన్న ఏసీపీ కిరణ్‌కుమార్ అక్కడినుంచి వెళ్లిపోయి, ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత అతన్ని పిలిపించి టౌన్‌ప్లానింగ్ సెక్షన్లో విచారణ చేశారు. డీసీ, డీఈ చాంబర్, ఏఈ సెక్షన్లలో రాత్రి 11 గంటల వరకు సుదీర్ఘ విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ విలేకరులతో మాట్లాడుతూ.. బడంగ్‌పేట కార్పొరేషన్లో పలు ఫైళ్లు తారుమారు చేశారని, ఈ వ్యవహారంలో పెద్దఎత్తున (రూ.30 కోట్ల) అవినీతి జరిగిందని పలు పత్రికలు, టీవీ చానళ్లతో పాటు నేరుగా ఫిర్యాదులు అందడంతో ఎంకై ్వరీకి వచ్చామన్నారు. శివారు కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం కాకముందు, విలీన సమయంలో చేపట్టిన పనులు, ఇచ్చిన అనుమతులపై ఆరా తీశారు. విలీన సమయంలో పనులు చేయకుండానే బిల్లులు ఇవ్వడం, కొన్ని బిల్లులు మైనస్‌లో పెట్టి, బిల్లులు ఇవ్వాలని తిరిగి జీహెచ్ఎంసీకి పంపించడంతో పాటు టౌన్‌ప్లానింగ్ నుంచి ఇచ్చిన పర్మిషన్ల వివరాలను నమోదు చేసుకున్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే కేసులు నమోదు చేస్తామని, కేసు నమోదైతే సదరు అధికారులు సస్పెండ్ అయినట్లేనని తెలిపారు. ప్రతీ ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. ఇదిలా ఉండగా బడంగ్‌పేట సర్కిల్ అధికారుల అవినీతి గుట్టు బయటిపెట్టి, దొంగల భరతం పట్టాలని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటోనని స్థానికంగా చర్చ సాగుతోంది. ఈనేపథ్యంలో విజిలెన్స్ పనితీరుపై సైతం ఏసీబీ దృష్టిసారించిందని, ఈ విషయంలోనూ లోతైన విచారణ చేస్తోందని సమాచారం. -
కొకౌన్ లాయా!
మొయినాబాద్: మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలం కేసులో పోలీసులు కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. విందులో వినియోగించిన కొకై న్ ఎవరు సరఫరా చేశారు.. ఎంత కాలం నుంచి ఇక్కడ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి.. ఇక్కడికి తరచూ ఎవరెవరు వస్తుంటారు..? తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. అజీజ్‌నగర్‌లోని రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన డ్రగ్స్ పార్టీని ఈగల్ టీం భగ్నం చేసిన విషయం తెలిసిందే. విందు ప్రారంభం కాగానే ఎస్ఓటీ,స్థానిక పోలీసులతో కలిసి ఫాంహౌస్‌కు చేరుకున్న ఈగల్ బృందానికి ఊహించని ఘటన ఎదురైంది. పోలీసులు లోనికి వెళ్లగానే కాల్పుల శబ్దం రావడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. తాము పోలీసులమని చెబుతున్నా పట్టించుకోకుండా నాలుగు రౌండ్లుఫైరింగ్ జరపడంపై నిర్ఘాంతపోయారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఫాంహౌస్‌లోకి వెళ్లడం, ఫైరింగ్‌కు పాల్పడిన వ్యక్తితో పాటు ఘటనా స్థలంలో ఉన్నవారిని అక్కడి నుంచి తరలించడం చకచకా జరిగిపోయాయి. ఈ కేసులో రోహిత్‌రెడ్డి, అతని తమ్ముడు రితీష్‌రెడ్డితో పాటు ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్‌శర్మను ఆదివారం రాత్రి రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్ కోర్టు జడ్జి వీరికి 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు వెళ్లారు. ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్‌తోపాటు మరో ఏడుగురికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిన విషయం తెలిసిందే. గతంలో జరిగిన పార్టీలపై ఆరా.. రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఎప్పుడెప్పుడు పార్టీలు జరిగాయనే విషయాలపై పోలీసులు పకడ్బందీగా వివరాలు సేకరిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తర్వాత ఇక్కడ పలుమార్లు విందులు జరిగినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాల్పుల ఘటన నేపథ్యంలో ఫాంహౌస్ వ్యవహారాలపై ప్రతీ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. నెలలో రెండు మూడు సార్లు రోహిత్‌రెడ్డి తన ఫాంహౌస్‌లో పార్టీలు నిర్వహిస్తుంటారని తెలుస్తోంది. వచ్చిన ప్రతీసారి కొత్త వ్యక్తులే వస్తారని, ఒకసారి వచ్చిన వారు మళ్లీ రావడం అరుదేనని ప్రచారం. ఇలా ఇప్పటి వరకు వచ్చిన వారి వివరాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. పార్టీల సందర్భంగా విదేశీ మద్యం, గాంజా, డ్రగ్స్ వినియోగించారా..? ఒకవేళ వినియోగిస్తే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు తెచ్చారు. ఎవరెవరు తీసుకున్నారు అనే అంశాలను రాబడుతున్నారు. ఫాంహౌస్‌పై నిఘా... వరుస వివాదాల నేపథ్యంలో రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలం అనంతరం ఇక్కడికి ఎవరెవరు వచ్చారనే విషయాలను తెలుసుకునేందుకు గస్తీ కాస్తున్నారు. డ్రగ్స్ పార్టీతో ఇంకా ఎవరికై నా సంబంధం ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.డ్రగ్స్ సరఫరాపై కూపీ లాగుతున్న పోలీసులు -
బాలికల విద్య సమాజానికి అవసరం
షాద్‌నగర్ డీసీపీ శిరీష షాద్‌నగర్ రూరల్: మహిళలు చదువుకున్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని షాద్‌నగర్ డీసీపీ శిరీష అన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్బీఐ సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికల విద్య సమాజానికి ఎంతో అవసరం అన్నారు. విద్యార్థినులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం డీఓఏ సుశీందర్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందన్నారు. రోటరీ క్లబ్ జోనల్ కోఆర్డినేటర్ సురేంద్రనాథ్ మాట్లాడుతూ.. పది జిల్లాలోని దాదాపు 550 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు సానిటరీ న్యాప్కిన్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తాండ్ర విశాల శ్రవణ్‌రెడ్డి, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రాజశేఖర్, ఎంఈఓ మనోహర్, ప్రధానోపాధ్యాయురాలు పద్మనళిని, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు గోవింద్పుట్ట, గవర్నర్ గోపీనాథ్‌రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ, గోవింద్, శ్రీకాంత్‌రెడ్డి మధుబాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా‘వాణి వినండి’.. పరిష్కారం చూపండి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో డీఆర్ఓ సంగీతతో కలిసి ప్రజల వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్జీదారులకు ఖచ్చితమైన సమాధానం ఇవ్వడంతో పాటు పరిష్కారం చూపాలన్నారు. అప్లికేషన్లను పెండింగ్‌లో పెట్టకూడదని సూచించారు. ప్రజావాణికి 52 ఫిర్యాదులు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేశామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
గ్యాస్ కొరతపై సీపీఐ నిరసన
ఇబ్రహీంపట్నం: గ్యాస్ సిలిండర్ల కొరత, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై ఇబ్రహీంపట్నంలో సోమవారం సీపీఐ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కావలి నర్సింహ్మ, మండల కార్య దర్శి కావలి సురేష్ మాట్లాడుతూ.. పెట్రో, గ్యా స్ సిలిండర్ల కొరతతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం సాకుతో అన్ని రకాల వస్తువులపై ధర లు పెంచారని ఆరోపించారు. ఇదే పరిస్థితులు కొనసాగితే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు శ్రీకాంత్, కిరణ్, అభి, అజయ్, రాజు, మధు పాల్గొన్నారు. -
దొరకని గ్యాస్.. హోటళ్లు క్లోజ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం మంటలు మన టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లను తాకాయి. ఇప్పటికే గృహ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంచిన విషయం తెలిసిందే. డిమాండ్‌కు సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో సిలిండర్ల కోసం ఆయా ఏజెన్సీల ముందు జనం క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఉన్న సిలిండర్లు ఖాళీ కావడం, కొత్తగా బుక్ చేసినప్పటికీ సకాలంలో సరఫరా లేకపోవడంతో చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు చేతినిండా పనితో బిజీగా ఉన్న వంటమనుషులు, సప్లయర్లు ప్రస్తుతం పని లేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అధికారుల ప్రకటనలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. గ్యాస్‌కు కొరత లేదని, ఆ ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తుండటం గమనార్హం. ఇరుగు పొరుగు సహకారం కరువే జిల్లాలోని మూడు ఆయిల్ కంపెనీల పరిధిలో 14.93 లక్షలకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. వీటిలో 12 వేలకుపైగా కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ఫిబ్రవరి చివరి నాటికి రోజుకు సగటున 22 వేల రీఫిల్స్ బుకింగ్స్ ఆర్డర్స్ ఉండగా, ప్రస్తుత సంక్షోభంలో ముందస్తు బుకింగ్స్ 26 వేలకు చేరడం విశేషం. నిన్న మొన్నటి వరకు ఖాళీగా ఉన్న సిలిండర్లను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నింపి పెట్టుకుంటుండటమే ఇందుకు కారణమని తెలిసింది. మెజార్టీ టిఫిన్ సెంటర్లు, టీస్టాల్ యజమానులు కమర్షియల్ కనెక్షన్లు తీసుకోలేదు. బంధువులు, ఇరుగు, పొరుగు వారి నుంచి ఖాళీ సిలిండర్లను సేకరించి, రీఫిల్ చేసుకుని వాడుకునే వారు. వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు పెంచడం, కొత్త కనెక్షన్ల మంజూరుకు నిరాకరిస్తుండటం, ప్రస్తుతం ఇరుగు పొరుగు నుంచి కూడా ఆశించిన సహకారం లభించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో టిఫిన్ సెంటర్లు, టీస్టాల్ యజమానులు తమ హోటళ్లను మూసి వేస్తున్నారు. ఇంట్లో పిండి వంటలు బంద్ వంటింట్లో గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్న వాళ్లు పిండి వంటలు బంద్ చేశారు. బయటి ఫుడ్డుతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని భావించి తమ పిల్లలకు వివిధ రకాల స్నాక్స్ చేసి పెట్టే తల్లులు ప్రస్తుతం పండ్లు, రెడీమేడ్ బేకరీ ఫుడ్డును బాక్సుల్లో సర్దుతున్నారు. వారం, పది రోజులకోసారైనా ఇంట్లో తయారు చేసుకునే పిండివంటలను గ్యాస్ ఎక్కువ ఖర్చవుతుందనే భయంతో మానేశారు. ఆలస్యమైతే కాల్ చేయండి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని ఆయిల్ కంపెనీలు సూచించాయి. కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. డెలివరీ ఆలస్యమైతే ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 1800–2333–555 లేదా 77189 55555కు, భారత్ గ్యాస్ కస్టమర్లు 1800–22–4344 లేదా 77150 12345కు, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు 1800– 2333–555 లేదా 94936 02222కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. నిలిచిన కివి పండ్ల దిగుమతులు యుద్ధ వాతావరణం బాటసింగారం పండ్ల మార్కెట్‌పైనా ప్రభావం చూపుతోంది. ఇరాన్ నుంచి ఇక్కడి మార్కెట్‌కు కివీ, యాపిల్, కర్జూర పండ్లు దిగుమతి అవుతుంటాయి. యుద్ధం కారణంగా దిగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం బాటసింగారం మార్కెట్ సహా నగరంలోని ఏ పండ్ల మార్కెట్లో కూడా కివీ పండ్లు దొరకడం లేదు. న్యూజిలాండ్, ఇటలీ, ఫ్రాన్స్ నుంచి కొద్ది మొత్తంలో దిగుమతి అవుతున్నా నగరవాసులు అవసరాలు తీర్చలేకపోతున్నాయి. ఇరాన్ నుంచి యాపిల్ దిగుమతి లేకపోవడంతో సిమ్లా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాపిల్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. అదనపు చార్జీల వడ్డన అంతో ఇంతో గ్యాస్ నిల్వలు ఉన్న హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు అమాంతం ధరలు పెంచేశాయి. నిన్న మొన్నటి వరకు ఓ సాధారణ టిఫిన్ సెంటర్లో ప్లేటు ఇడ్లీ, వడ, పూరి ధర రూ.40 ఉండగా, ప్రస్తుతం రూ.60 వరకు పెంచారు. సింగిల్ టీ ధర రూ.10 నుంచి రూ.15కు పెంచేశారు. అదేమంటే గ్యాస్ సర్ చార్జీ అంటున్నారు. మెజార్టీ హోటళ్లలో మెనూలోని ఐటెమ్స్ సగానికి తగ్గించారు. గ్యాస్ ఎక్కువ ఖర్చయ్యే ఆహార పదార్థాలను వండడం మానేశారు. తక్కువ సమయంలో ఉడికే ఆహార పదార్థాలనే రెడీ ఫర్ ఈట్ ప్లేస్‌లో ఉంచుతున్నారు. ఇక కేటరింగ్ సంస్థలు సైతం ధరలను అమాంతం పెంచేశాయి. రోజుకు కనీసం వెయ్యి మందికి 20 రకాల ఐటమ్స్ సరఫరా చేసేవారు రెండు మూడింటితో సరిపెడుతున్నారు. జిల్లాలో గ్యాస్ వినియోగం ఇలా మూతపడుతున్న టిఫిన్ సెంటర్లు.. టీ స్టాళ్లు తెరిచి ఉన్న వాటిల్లోనూ అదనపు చార్జీల వడ్డన రోజురోజుకూ మరింత ముదురుతున్న సంక్షోభం -
గుంతల రోడ్డు.. నరక ప్రయాణం
● పోల్కంపల్లి రహదారి పనులు చేపట్టండి ● సీపీఎం జిల్లా నాయకుడు జగన్ ఇబ్రహీంపట్నం రూరల్: పోల్కంపల్లి– రాయపోల్ అధ్వాన రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఎం పార్టీ జిల్లా నాయకులు పీ.జగన్ డిమాండ్ చేశారు. గుంతలయమమైన రోడ్డులో ప్రయాణం నరక ప్రాయంగా మారిందన్నారు. రోడ్డు మరమ్మతు చేయాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోతులు ఏర్పడి రోడ్డు రూపం కోల్పోయిందన్నారు. మరమ్మతు పనులు చేయించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో రోడ్డు పునరుద్ధరణకు రూ.56 లక్షలు మంజూరయ్యాయని, అయినా పనులు చేపట్టడం లేదన్నారు. ఇరాన్– ఇరాక్ యుద్ధం నేపథ్యంలో ప్రజలకు గ్యాస్ కష్టాలు వచ్చాయని, అవసరాల మేరకు సరిపడా బండను సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు చెరుకూరి నర్సింహ, శాఖ కార్యదర్శులు నర్సింహ, కరుణాకర్‌రెడ్డి, యాదయ్య, నాయకులు గూడెం అశోక్, బాల్‌రాజ్, ధనేశ్వర్, శ్రీనివాస్, పాండు, వెంకటేశ్, శివ, జంగయ్య, యాదగిరి, బాలయ్య, బలరాం తదితరులు పాల్గొన్నారు. -
హాం ఫట్
బొంరాస్‌పేట: ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో అందినకాడికి ఇసుకను తోడేస్తూ అక్రమార్కులు రూ.కోట్లకు పడగలేస్తున్నారు. అప్పట్లో తుంకిమెట్ల, కొత్తూరు, ఏర్పుమళ్ల తదితర గ్రామాలు తండాల్లో పూర్తిగా ఇసుకను తోడేశారు. ప్రస్తుతం కాగ్నావాగు పరివాహక గ్రామాలు, బొంరాస్‌పేట, మహంతీపూర్, మద్దమడుగుతండా, దుప్చర్ల గ్రామాల్లోనే టిప్పర్ల కొద్దీ ఇసుకను పగలు, రాత్రి తరలిస్తున్నారు. ఇందుకు అధికారులు, నాయకులకు సైతం ముడుపులు చేరుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలనకు వచ్చిన జిల్లా, రాష్ట్రస్థాయి అధికారుల బృందం కళ్లేదుట తుంకిమెట్లలో టిప్పర్ల కొద్దీ ఇసుక డంపులున్నా పట్టించుకోలేదు. సదరు సీఐ, ఎస్ఐల వాహనాలు చూస్తూ వెళ్లారు. చివరకు స్థానికుల చొరవతో డంపులు సీజ్ చేయించారు. సఖ్యత కరువు సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో నియోజకవర్గానికి రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల భవనాలు, వంతెనలు, ప్రహరీలు ఇలా ప్రతి మండలంలో పనులు జరుగుతున్నాయి. కానీ మరోవైపు రెండేళ్లుగా విచ్చలవిడిగా రోజుకు 50 నుంచి 80 టిప్పర్ల ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల మధ్య పొంతన లేకపోవడంతో ఇసుక అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. పోలీసు సిబ్బందిలో ఇద్దరు ఇసుక అక్రమ రవాణాకు ఇన్ఫార్మర్లుగా ఉంటున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. గోరంత అనుమతి రూ.కోట్ల నిధులతో నిర్మాణాలు చేస్తున్న బడా కాంట్రాక్టర్లు గోరంత అనుమతి తీసుకొని కొండంతగా తవ్వుకుంటున్నారు. కొడంగల్, పరిగి తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి తరలించిన ఇసుకను నిల్వ చేసి యథేచ్ఛగా రూ.లక్షలకు అమ్ముకుంటున్నారు. మండల కేంద్రంతోపాటు బొట్లోనితండా, మద్దిమడుగుతండా, తుంకిమెట్ల ఇసుక రవాణా కేసమే టిప్పర్లు, దుప్చర్ల, మహంతీపూర్, నాగిరెడ్డిపల్లి, తదితర గ్రామాలు తండాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మామూళ్ల మత్తులో అధికారులు మునిగి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతోపాటు మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. బరితెగిస్తున్న ఇసుకాసురులు నిత్యం టిప్పర్ల కొద్దీ తరలింపు రూ.కోట్లకు పడగలెత్తుతున్న అక్రమార్కులు పట్టించుకోని అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటాం ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో రెవెన్యూకు పోలీసు, మైనింగ్ అధికారులు సహకరించాలి. రెవెన్యూ పరంగా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. డంపులు సీజ్ చేసి వేలం నిర్వహిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అభివృద్ధి పనులకు అనుమతులిస్తున్నాం. అక్రమదందా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు. – పద్మావతి, తహసీల్దార్, బొంరాస్‌పేట -
యువకుడిని బలిగొన్న వివాహేతర సంబంధం
కుల్కచర్ల: వివాహేతర సంబంధం ఓ యు వకుడిని బలిగొంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డె రమేశ్(22)కు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం ఉంది. గతంలో కుటుంబ సభ్యులు మందలించడంతో రమేశ్ ఆమెను దూరంగా పెట్టాడు. కానీ కొంతకాలంగా ఆమె యువకుడికి ఫోన్ చేస్తూ ఇబ్బందులకు గురిచేసేంది. ఈ క్రమంలో 13వ తేదీ సాయంత్రం ఫోన్ చేసి రమేశ్‌ను పిలిపించుకుంది. అదే సమయంలో మాటువేసిన సదరు మహిళ కుటుంబసభ్యులు(అన్న, తమ్ముడు, భర్త) రమేశ్‌ను తీవ్రంగా కొట్టడంతో అక్కడి నుంచి ఎటో పారిపోయాడు. దీంతో మనస్తాపంతో అతడు ఆదివారం చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. ఈ మేరకు తన కొడుకు మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి సత్యమ్మ కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు.


