UNO
-
Bangladesh: ‘అవన్నీ ప్రభుత్వ హత్యలే’.. దడపుట్టిస్తున్న ఐక్యరాజ్యసమితి రిపోర్టు
బంగ్లాదేశ్‌లో గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ఎగసిపడింది. అనంతరం జరిగిన పరిణామాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ఒక నివేదికను వెలువరించింది. నాడు చెలరేగిన హింసలో 1,400 మంది హతమయ్యారని ఆ నివేదిక బయటపెట్టింది. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని పరోక్షంగా పేర్కొంది. నాడు బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న మానవహక్కుల ఉల్లంఘనల ఉదంతాలను కూడా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం ఆ నివేదికలో తెలియజేసింది.బంగ్లాదేశ్‌లో 2024లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. నాటి షేక్ హసీనా ప్రభుత్వం.. నేటి మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాల కాలంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలను ఈ నివేదికలో వివరంగా పొందుపరిచారు.2024 విద్యార్థి ఉద్యమంలో సుమారు 1,400 మంది హతమయ్యారని నివేదిక పేర్కొంది. భద్రతా దళాలు చిన్నారులతో సహా పలువురు నిరసనకారులను కాల్చిచంపాయని తెలిపింది.తిరుగుబాటు తొలి రోజుల్లో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం 150 మంది మరణాలను మాత్రమే నిర్ధారించింది. అయితే ఈ నివేదికలోని వివరాల ప్రకారం వందలాదిగా సాగిన చట్టవిరుద్ధ హత్యలు, ఏకపక్ష అరెస్టులు, నిర్బంధాలు మొదలైనవన్నీ షేక్ హసీనా ప్రభుత్వంతో పాటు భద్రతా అధికారుల సహకారంతోనే జరిగాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఈ నివేదికలో పేర్కొంది.ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కూడా మతపరమైన మైనారిటీలపై హింసను ప్రోత్సహిస్తున్నదని ఆ నివేదిక ఆరోపించింది. మహిళలు వారి నిరసనను వ్యక్తం చేయకుండా నిరోధించేందుకు వారిపై శారీరక దాడి, అత్యాచారం చేస్తామని పోలీసులు బెదిరించారని కూడా నివేదిక పేర్కొంది. నిరసనలను అణిచివేసే నెపంతో రాజకీయ నేతలు, భద్రతా అధికారులు ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారని మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ పేర్కొన్నారు. విద్యార్థి నేత, అమరవీరుడు అబూ సయీద్ హత్య కూడా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆ నివేదిక పేర్కొంది.ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్ -
International Day of Education 2025 దీని ప్రాముఖ్యత, ఏడాది థీమ్ ఇదే!
International Day of Education 2025 : ప్రతీ ఏడాది జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. జనవరి 24ని అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 2018 డిసెంబర్ 3, 2018న ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధి, సమానత్వాన్ని తీసుకురావడంలో విద్య ప్రాముఖ్యతను గుర్తించడం, అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం.నైజీరియాతో సహా 58 సభ్య దేశాల మద్దతుతో వచ్చిన ఈ చారిత్రాత్మక తీర్మానం, విద్య ప్రాప్యత , ప్రతి వ్యక్తికి దాని లోతైన ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన అవసరం అని నొక్కి చెబుతుంది.International Day of Education.To grow is to become wise, and the foundation of wisdom is learning.#UGC #Education #InternationalDayofEducation@PMOIndia @EduMinOfIndia @PIB_India pic.twitter.com/Eam5G2Jiq6— UGC INDIA (@ugc_india) January 24, 2025మానవ అభివృద్ధిలో విద్య పాత్రను గుర్తించడంతోపాటు, సమానమైన నాణ్యమైన విద్యను ప్రాథమిక మానవ హక్కుగా ప్రోత్సహించేలా జనవరి 24, 2019న తొలి సారి అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్నారు.అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025, థీమ్ఈ సంవత్సరం, అంతర్జాతీయ విద్యా దినోత్సవం థీమ్ "ఏఐ అండ్ ఎడ్యుకేషన్‌గా నిర్ణయించారు. ఆటోమేషన్ ప్రపంచంలో మానవ విలువను పరిరక్షించడం". అంటే ఆటోమేషన్ యుగంలో రోజు రోజుకి అభివృద్ది చెందుతున్న సాంకేతిక తీరుతెన్నులు, పురోగతులు అర్థం చేసుకోవడం, అటువంటి వ్యవస్థలు మానవ నిర్ణయాలు, విద్యా కార్యకలాపాలను ఎలా ప్రభావితం చేస్తాయో ప్రశ్నించడం, విద్యలో కృత్రిమ మేధస్సును పెంచడం ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం.విద్య ప్రాముఖ్యతపేదరికం,లింగ సమానత్వంతో సహా అనేక సమస్యలను పరిష్కరించడంలో విద్య చాలా అవసరం. వ్యక్తిగత అభివృద్ధి, సామూహిక పురోగతిని పెంపొందిస్తుంది. శాంతిని నిర్మించడానికి విద్య ప్రాథమికమైనదని యూఎన్జీఏ పేర్కొంది. సమానమైన నాణ్యమైన విద్యను అందించడం, అందరికీ జీవితాంతం అవకాశాలను ప్రోత్సహించడంతోపాటు, ఆయా వ్యక్తులు సమాజాలు విద్యకు ప్రాధాన్యతనిచ్చి పెట్టుబడి పెట్టడానికి ఇది పిలుపు.విద్యమనిషిని మనస్సును శక్తివంతం చేస్తుంది. భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. ఈ అంతర్జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నేర్చుకోవడంలోని శక్తిని గుర్తిద్దాం. సెలబ్రేట్ చేసుకుందాం. అది అందరికీ చేరేలా చూసుకుందాం. ఇదీ చదవండి : National Girl Child Day 2025: నీ ధైర్యమే.. నీ సైన్యమై..! -
‘ఐక్యరాజ్య సమితి’లో ఎంపీ విజయసాయిరెడ్డి
ఢిల్లీ, సాక్షి: వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సందర్శించారు. అంతకు ముందు.. జనరల్ అసెంబ్లీ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ ప్రవచించిన శాంతి, అహింస, ఐక్యత ప్రపంచానికి ఆదర్శమైందని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ కు భారత ప్రతినిధి బృందంలో విజయసాయిరెడ్డి సభ్యులుగా వెళ్లిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ అవకాశంపై ఆయన స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. This week, I am in New York as part of India’s Non-Official Delegation to the 79th Session of the UNGA. Engaging with global stakeholders on critical issues of peace and conflict, we have had the opportunity to interact with UN organizations and representatives from the Permanent… pic.twitter.com/2pMdbTiTvX— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2024శాంతి, అంతర్యుద్ధాలు.. లాంటి ఎన్నో అంశాలపై భారత్, ఇతర దేశాల ప్రతినిధులు సాధారణ అసెంబ్లీలో మాట్లాడతారు. నవంబర్ 23వ తేదీ దాకా ఈ సెషన్ జరగనుంది.Offered floral tributes at the Mahatma Gandhi Bust on the United Nations Lawn during the 79th Session of the UNGA. A moment to honor the ideals of peace, nonviolence, and unity that continue to inspire the world. #UNGA79 #MahatmaGandhi #PeaceForAll #GlobalUnity pic.twitter.com/elppFhiAun— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2024 -
హెజ్బొల్లాను అంతమే మా లక్ష్యం: నెతన్యాహు
లెబనాన్ సరిహద్దుల్లో పని చేస్తున్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బందిని టార్గెట్‌గా ఇజ్రయెల్ సైన్యం దాడులు చేస్తుందని వస్తున్న ఆరోపణలను ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలన్నీ అసత్యాలని స్పష్టం చేశారు. ప్రధాని నెతన్యాహు మీడియతో మాట్లాడుతూ.. లెబనాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య నెలకొన్న క్రమంలో ఐక్యరాజ్యసమితి శాంతిపరిక్షణ సైనికుల సిబ్బందిని ఆ ప్రాంతంలో తాత్కాలికంగా విధులు ఉపసంహరించుకోవాలని మరోసారి కోరారు.‘‘హెజ్బొల్లా లక్ష్యాలపై దాడి చేస్తున్న సమయంలో లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ(UNIFIL) సిబ్బందికి హాని కలిగించకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ సైన్యం కృషి చేస్తోంది. అయితే ఉద్రిక్తతలు కొనసాగుతున్న లెబనాన్ సరిహద్దు ప్రాంతాన్ని తాత్కాలికంగా విడిచిపెట్టాలని యూఎన్‌ఎఫ్‌ఐఎల్‌ను ఇజ్రాయెల్ పదేపదే కోరుతోంది. హెజ్బొల్లా టెర్రరిస్టులను నిర్మూలించేందుకు లెబనాన్‌లోకి దాడులో ప్రారంభించిన రోజున ఈ విషయాన్ని యూఎన్‌ఎఫ్‌ఐఎల్ సభ్యులకు తాను విజ్ఞప్తి చేశాను... మా పోరాటం యూఎన్‌ఎఫ్‌ఐఎల్, లెబనాన్ ప్రజలతో కాదు. ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి లెబనాన్ భూభాగాన్ని ఉపయోగించుకునే.. ఇరాన్ అనుబంధ హెజ్బొల్లా గ్రూప్‌తో మా సైన్యం పోరాటం చేస్తుంది. మా హమాస్ మారణకాండ జరిగిన తర్వాత నుంచి దాడులు చేస్తూనే ఉంది. అయితే లెబనాన్‌లో హెజ్బొల్లా గ్రూప్‌ను అంతం చేయటమె ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లక్ష్యం’’ అని అన్నారు.చదవండి: కెనడా ప్రధాని ట్రూడో నోట మళ్లీ పాత పాటే.. -
లెబనాన్ సరిహద్దులో 600 మంది సైనికులు.. భారత్ ఆందోళన
దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ జరుపుతున్న కాల్పుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల భద్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ మిషన్‌లో 600 మంది భారతీయ సైనికులు ఉన్నారు. వీరంతా ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో 120 కిలో మీటర్ల బ్లూ లైన్ వెంబడి ఉన్నారు. దీంతో అక్కడి ఉన్న భారత్ సైనిక భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. భారత్ ఓ ప్రకటన విడుదల చేసింది.‘‘ బ్లూ లైన్ వెంబడి భద్రతా పరిస్థిలు వేగంగా క్షీణించటంపై మేం ఆందోళన చెందుతున్నాం. అక్కడ నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉన్నాం. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రాంతాల్లో దాడుల ఉల్లంఘనకు పాల్పడవద్దు. యూఎన్ శాంతి పరిరక్షకుల భద్రత కోసం అక్కడ తగిన చర్యలు తీసుకోవాలి’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ సైన్యం యూఎన్ఐఎఫ్ఐఎల్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న అబ్జర్వేషన్ టవర్‌పై దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇద్దరు యూఎన్ శాంతి పరిరక్షకులు గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటనలో పేర్కొంది.‘‘ అదృష్టవశాత్తూ ఇద్దరు శాంతి పరిరక్షకులు గాయపడ్డారు. వారు చికిత్స కోసం ఆస్పత్రిలో ఉన్నారని తెలిపింది.హిజ్బుల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లా హత్య తర్వాత ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితి పెరిగింది. ఇజ్రాయెల్ సైన్యం ఈ ప్రాంతంలో దాడులు చేయటతో అక్కడే ఉన్న యూఎన్ శాంతి పరిరక్షకులకు ప్రమాదకరంగా మారింది.అయితే.. యూఎన్ఐఎఫ్ఐఎల్ సైనికుల పోస్టులకు సమీపంలో హెజ్బొల్లా బలగాలు ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆరోపణలు చేస్తోంది.చదవండి: ట్రంప్‌పై ఒబామా విమర్శలు.. అమెరికాకు కమలా హారిస్ కావాలి -
ఇరాన్ దాడులు.. ఐరాస చీఫ్‌పై ఇజ్రాయెల్ నిషేధం
టెల్ అవివ్: తమ దేశంపై ఇరాన్ భారీ మిసైల్స్‌తో దాడి చేస్తే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్రంగా ఖండించటంలో విఫలమయ్యారని ఇజ్రాయెల్ మండిపడింది. ఆంటోనియో గుటెర్రెస్ను ‘పర్సనా నాన్ గ్రేటా’గా ప్రకటించింది. ఆయన తమ దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తున్నామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పోషల్ మీడియాలో ఓ పోస్ట్‌లో పేర్కొంది.‘‘ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన హేయమైన దాడిని నిస్సందేహంగా ఖండించలేని ఎవరైనా ఇజ్రాయెల్ గడ్డపై అడుగు పెట్టే అర్హత లేదు. హమాస్, హెజ్బొల్లా, హౌతీలు ఇప్పుడు ఇరాన్ నుంచి ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు ఐరాస సెక్రటరీ జనరల్ మద్దతు ఇస్తున్నారు. ఐక్యరాజ్యసమితి చరిత్రలో ఆంటోనియో గుటెర్స్ ఒక మాయని మచ్చగా మిగిలిపోతారు. ఆంటోనియో గుటెర్స్ ఉన్నా.. లేకపోయినా.. ఇజ్రాయెల్ తన పౌరులను రక్షించుకుంటుంది. అదేవింధంగా దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటుంది’’ అని ఇజ్రాయెల్ పేర్కొంది.మంగళవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ సుమారు 400 బాలిస్టిక్ మిసైల్స్‌తో భీకరంగా దాడులు చేసింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్.. తమ ఐరన్ డోమ్ వ్యవస్థతో ఇరాన్ మిసైల్స్‌ను అడ్డుకున్నట్లు ప్రకటించింది.చదవండి: ఇరాన్ దాడులు.. బంకర్లోకి ఇజ్రాయెల్ ప్రధాని పరిగెత్తారా? -
పాక్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది: జైశంకర్
న్యూయార్క్: జమ్ము కశ్మీర్‌పై పాకిస్తాన్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈక్రమంలో భారత్.. పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తగిన ఫలితం తప్పకుండా అనుభవిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. సరిహద్దు ఉగ్రవాదమే పాకిస్తాన్ విధానం అంటూ ఎద్దేవా చేశారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ..‘కశ్మీర్ అంశంపై పాక్ ప్రధాని షరీఫ్ విచిత్రమైన వాదనలు చేశారు. పాక్ తీరుపై భారత్ వైఖరిని నేను స్పష్టం చేస్తున్నా. సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. పాక్ విధానం ఎప్పటికీ సఫలం కాదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశం తగిన ఫలితం అనుభవించక తప్పదు. అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని పాకిస్తాన్ ఖాళీ చేయడం ఒక్కటే రెండు దేశాల మధ్య ఉన్న ఈ సమస్యకు పరిష్కారం. పాకిస్తాన్ దేశ ఆవిర్భావం నుంచి అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇందుకు ఉగ్రవాదాన్ని ఎంచుకోవడం కూడా ఒక కారణం. రాజకీయాలతో మతోన్మాదాన్ని ప్రేరిపిస్తున్న ఆ దేశంలో తీవ్రవాదం, దాని ఎగుమతుల పరంగానే జీడీపీ కొలవాలి అని స్పష్టం చేశారు.ఇక, అంతకుముందు.. ఐరాస జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ.. కశ్మీర్ అంశంలో అక్కసు వెళ్లగక్కారు. కశ్మీర్లో పరిస్థితిని పాలస్తీనాతో పోల్చారు. ఆర్టికల్ 370 గురించి ప్రస్తావించారు. ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్ ప్రజలు సైతం స్వేచ్ఛ, నిర్ణయాధికారం పోరాటం చేస్తున్నారు. భారత్ చట్ట విరుద్ధంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ హెచ్చరిక.. ఇరాన్ కీలక నిర్ణయం -
‘నెలసరి’ సెలవులకూ వేతనం: గళమెత్తిన ప్రియదర్శిని
నెలసరి లేదా పీరియడ్, ఈ సమయంలో మహాళలు అనుభవించే బాధ, వేదన వారికే మాత్రమే తెలుసు. ఇన్ని రోజులూ అదేదో పాపంలాగా, దేవుడిచ్చిన శాపంలాగా అనుకుంటూ ఆడవాళ్లు పంటి బిగువున ఆ బాధనంతా భరిస్తూ వచ్చారు. కానీ ఆ సమయంలో వారు పడే కష్టాలు ఇంట్లోని పురుషులకు, సమాజానికి కూడా అర్థం కావాలనే ఆరాటం ఎన్నాళ్ల నుంచో ఉంది. ఇందులో భాగంగా వచ్చిందే పీరియడ్ పెయిడ్ లీవ. దీనిపై ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని (Ranjeeta Priyadarshini) ఐక్యరాజ్యసమితి (UN) సమావేశంలో గళమెత్తారు. నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆమె కోరారు. దీంతో జీతంలో కోత పడుతుందనే సంకోచం, భయం లేకుండా వారు సెలవు తీసుకోగలుగుతారని ఆమె తెలిపారు.రంజీతా ప్రియదర్శిని, న్యూయార్క్‌లోని 79వ యుఎన్‌జిఎలో జరిగిన ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో మహిళలకు చెల్లింపు రుతుస్రావ సెలవుల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నెలసరి విషయంలో సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. పెయిడ్ పీరియడ్ లీవ్‌ల కోసం ఆమె పోరాడుతున్నారు. తాను పని చేస్తున్నపుడు తనకెదురైన అనుభవం నుంచే ఆలోచన వచ్చినట్టు ప్రియదర్శిని తెలిపారు. ఈ సందర్బంగా తన అనుభవాన్ని పంచుకున్నారు. పీరియడ్స్ సమయంలో తన ఇబ్బంది కారణంగా సెలవు కోరినపుడు తనపై అధికారినుంచి అవమానాన్ని ఎదుర్కొన్నారు. దీంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆమె ప్రయత్నాలు రుతుక్రమ ఆరోగ్యం, మహిళల పరిస్థితిపై చర్చకు దారితీసింది.. మార్పునకు పునాది పడింది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రుతుక్రమం సమయంలో మహిళలను అర్థం చేసుకునేందుకు, అవగాహన పెంచేందుక బాటలు వేసింది. మరోవైపు ఇదే అంశంపై త్వరలో బాలీవుడ్ చిత్రం కూడా విడుదల కానుంది. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య కిల్లింగ్ లుక్స్, తొలిసారి అలియా అదుర్స్ -
ప్రకృతిని కాపాడుకుందాం, ఈ పనులు అస్సలు చేయకండి!
పర్యాటకులు ప్రతి ఒక్కరూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. అది అభిరుచి. అలాగే ప్రకృతిని ప్రేమించాలి. అది బాధ్యత. ఎకో టూరిజమ్‌లో ఏం చేయాలి, ఏం చేయకూడదనే నియమావళి స్పష్టంగా ఉంది. ప్రతీ సంవత్సరం సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని 1970లో ఎంపికచేశారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం. పర్యాటకం ప్రాధాన్యత, సామాజిక, సాంస్కృతిక , ఆర్థిక అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో అవగాహన కల్పించడం, పర్యావరణానికి హాని కలిగించే ప్లాలాస్టిక్ బాటిళ్లు, ఒకసారి వాడి పారేసే పాలిథిన్ కవర్లను తీసుకెళ్లరాదు.పిల్లలు, డయాబెటిస్ పేషెంట్లు, పెద్దవాళ్లతో వెళ్లేటప్పుడు బ్రెడ్, బిస్కట్, చాక్లెట్ల వంటివి దగ్గర ఉంచుకోవడం తప్పనిసరి. అలాంటప్పుడు తమతో తీసుకువెళ్లిన నాన్ డీ గ్రేడబుల్ వస్తువులను పర్యాటక ప్రదేశంలో పడవేయకుండా అక్కడ ఏర్పాటు చేసిన మున్సిపాలిటటీ డస్ట్బిన్లలో వేయాలి. పవిత్రస్థలాలు, సాంస్కృతిక ప్రదేశాలు, స్మారకాలు, ఆలయాలు ప్రార్థనామందిరాలు ఇతర ధార్మిక ప్రదేశాలలో స్థానిక విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరించాలి.నేచర్ ప్లేస్‌లకు వెళ్లినప్పుడు శబ్దకాలుష్యాన్ని నివారించాలి. రేడియో, టేప్‌రికార్డర్, డీజే, మైక్‌లు పెద్ద సౌండ్‌తో పెట్టకూడదు. మలమూత్ర విసర్జన కోసం గుడారాల వంటి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకునేటప్పుడు వాటర్బాడీలకు కనీసం వంద అడుగుల దూరాన్ని ΄ాటించాలి. అలాగే విసర్జన తర్వాత మట్టి లేదా ఇసుకతో కప్పేయాలి.పర్యాటక ప్రదేశాల్లో ఫొటోలు తీసుకునేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించరాదు. వారితో కలిసి ఫొటో తీసుకోవాలనుకుంటే వారి అనుమతితో మాత్రమే తీసుకోవాలి. వారికి తెలియకుండా వారిని ఫ్రేమ్‌లోకి తీసుకునే ప్రయత్నం చేయరాదు.చెట్ల ఆకులు, కొమ్మలు, గింజలు, కాయలు, పూలను కోయరాదు. ఇది నేరం కూడా. నియమాన్ని ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. ముఖ్యంగా హిమాలయాల వంటి సున్నితమైన ప్రదేశాల్లో జీవవైవిధ్యత సంరక్షణ కోసం నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. నది, కాలువ, సరస్సు, తటాకాల్లో సబ్బులతో స్నానం చేయడం, దుస్తులు ఉతకడం నిషిద్ధం.నిప్పు రవ్వలు ఎగిరిపడితే అడవులు కాలిపోతాయి. కాబట్టి అడవులలో వంట కోసం కట్టెలతో మంట వేయరాదు. అలాగే సిగరెట్ పీకలను కూడా నేలమీద వేయకూడదు.అడవుల్లో ఆల్కహాల్, డ్రగ్స్ సేవనం, మత్తు కలిగించేవన్నీ నిషేధం. స్థానికులకు చాక్లెట్లు, స్వీట్స్, ఆహారపదార్థాల ఆశ చూపించి వారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదు. అలాగే ఆయా ప్రదేశాల్లో నెలకొన్న సంప్రదాయ విశ్వాసాలను గౌరవించాలి. వారి అలవాట్లను హేళన చేయరాదు. -
మెరబ్కు సీఎం రేవంత్ అభినందన
మొయినాబాద్: ఐక్యరాజ్య సమితి యూత్ కాన్ఫరెన్స్‌కు ఎంపికై న మెరల్ మెరబ్ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ నుంచి పది మందికి అవకాశం రాగా.. తెలంగాణ నుంచి మెరబ్ సెలక్ట్ అయ్యారు. ఈమె తండ్రి వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చెందిన కృపావరం.. కొన్నేళ్లుగా మొయినాబాద్‌లోని చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. మెరబ్ ఘట్కేసర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాలలో గతేడాది డిగ్రీ పూర్తి చేసింది. 2023లో నిర్వహించిన పరీక్షకు హాజరై.. ప్రస్తుతం జరిగే ఐరాస యూత్ కాన్ఫరెన్స్‌కు ఎంపికై ంది. ఆగస్టు 2 నుంచి 5 వరకు మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగే కాన్ఫరెన్స్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.సీఎం సభ ఏర్పాట్ల పరిశీలనకందుకూరు: మీర్ఖాన్పేటలో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నెట్ జీరో సిటీలో కొనసాగుతున్న సభ ఏర్పాట్లను బుధవారం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నర్సింహరెడ్డి, ముదిరాజ్ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పరిశీలించారు. ఏర్పాట్ల గురించి ఆర్డీఓ సూరజ్‌కుమార్, తహసీల్దార్ గోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి.ప్రభాకర్‌రెడ్డి, ఎండీ అప్జల్‌బేగ్, ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్, ఎస్.పాండు, కె.విష్ణువర్ధన్‌రెడ్డి, కె.మదన్‌పాల్‌రెడ్డి, కె.వెంకటేశ్, ఢిల్లీ కృష్ణ, జి.దర్శన్, ఈ.శ్రీకాంత్‌రెడ్డి, ఎ.జగదీశ్, జి.యదయ్య, దేవేందర్, ప్రశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.డిజిటల్ నంబర్.. క్యూఆర్ కోడ్సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలోని అన్ని ఆస్తులు, యుటిలిటీస్‌కు జీఐఎస్ మ్యాపింగ్ సర్వేతో పాటు దానికి అనుబంధంగా డిజిటల్ డోర్ నంబర్ల ప్రక్రియ కూడా జరుగుతున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు. జీఐఎస్ సర్వే ద్వారా అన్ని ఆస్తుల జియో ట్యాగింగ్ పూర్తయ్యాక అన్ని ఇళ్లకూ ప్రత్యేక క్రమసంఖ్యతో డిజిటల్ డోర్ నంబర్ జారీ అవుతుందని తెలిపారు. దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ప్లేట్లను ఇళ్ల బయట తలుపులకు బిగించనున్నట్లు పేర్కొన్నారు. సాంకేతికత ఆధారంగా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా వాటిని తయారు చేయించనున్నట్లు తెలిపారు. తద్వారా ఈ–గవర్నెన్స్‌కు యాక్సెస్ సులభం కావడంతోపాటు అత్యవసర సమయాల్లో ప్రజలకు తగిన సహాయం అందించేందుకు ఉపకరిస్తుందని పేర్కొన్నారు. అన్ని పబ్లిక్ యుటిలిటీస్‌ను ఒక ఐడీకి కనెక్ట్ చేయడం ద్వారా అన్ని విభాగాల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంటుందని తెలిపారు. మెరుగైన పట్టణ నిర్వహణ, ప్రజా సదుపాయాల కోసం జరుగుతున్న జీఐఎస్ సర్వేకు ప్రజలు సహకరించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి ఆధార్, పాన్ వంటి వ్యక్తిగత వివరాలను క్షేత్రస్థాయి సిబ్బంది సేకరించరు అని పేర్కొన్నారు. ప్రజల గోప్యత, భద్రతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. -
World Elder Abuse Awareness Day : మెయింటెనెన్స్ హక్కులు, ఆసక్తికర సంగతులు
ఈ రోజు (జూన్ 15) ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం (WEAAD, world elder abuse awareness day) జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్ (INPEA) జూన్ 2006లో వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డేని స్థాపించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ దీనిని డిసెంబర్ 2011లో అధికారికంగా గుర్తించింది. వృద్ధులపట్ల గౌరవాన్ని పెంపొందిస్తూ, వృద్ధుల పట్ల నిర్లక్ష్యం ఎదుర్కొనే వేధింపులు దోపిడీ గురించి అవగాహన పెంచడమే ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం లక్ష్యం.ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది వృద్ధులు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్నారు. సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. కుటుంబం సంక్షేమం, అభివృద్ధి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన వారికి జీవిత చరమాంకంలో సముచిత స్థానం లభించడం లేదు సరికదా, వృద్ధులపై జరుగుతున్న పలురకాల హింస,దాడులు బాధాకరం. భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వృద్ధులు వేధింపులను ఎదుర్కొంటున్నారు.ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం, భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వృద్ధులు వేధింపులకు గురవుతున్నారు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, నాగ్‌పూర్, కాన్పూర్ , మదురై సహా అనేక నగరాలను ఈ సర్వేలో చేర్చారు. అందిన నివేదిక ప్రకారం, 73శాతం మంది యువకులు వృద్ధుల పట్ల చెడుగా ప్రవర్తిస్తున్నారు, దాడికి పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మందిలో ఒకరు ఈ వేధింపులకు గురవుతున్నారు.కన్నబిడ్డల్నితల్లిదండ్రులు ఎంత అప్యాయంగా, ప్రేమగా పెంచి, ఆసరాగా ఉన్నట్లే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడం ప్రతి బిడ్డ విధి. కానీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తోంది. ఆస్తి కోసం, శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నారు. సామాన్య మానవుల నుంచి కార్పొరేట్ కుటుంబాల దాకా ఇలాంటి సంఘటనలను ప్రతీనిత్యం చూస్తూనే ఉన్నాంWEAAD 2024 థీమ్: అత్యవసర పరిస్థితుల్లో వృద్ధులపై ప్రత్యేక దృష్టి అనేది ఈ ఏడాది థీమ్. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, సాయుధ పోరాటాలు , కోవిడ్ -19 లాంటి సంక్షోభ పరిస్థితుల్లో వృద్ధులు ఎదుర్కొనే ప్రత్యేక సవాళ్లను ఇది నొక్కి చెబుతుంది. అత్యవసర సమయాల్లో వృద్ధుల నిర్దిష్ట అవసరాలు పరిష్కరించడం చాలా కీలకమనే విషయాన్ని తెలియజేస్తుంది.వృద్ధులు లేదా సీనియర్ సిటిజన్ల హక్కులను, కుటుంబ సభ్యులతోపాటు, సమాజం కూడా గుర్తించాలి. వృద్ధులకు విలువనిచ్చి, వారిని గౌరవించే సమాజాన్ని సృష్టించేందుకు కుటుంబ సభ్యులతో పాటు సమాజం, సాంఘిక సంఘాలు ఐక్యంగా ఉంటూ, వృద్ధులు శారీరకంగా, భావోద్వేగంగా, ఆర్థికంగా ఎలాంటి అభద్రతా భావం లేకుండా గౌరవంగా జీవించగలిగే ప్రపంచాన్ని నిర్మించాలి.చట్టాలుసీనియర్ సిటిజన్స్ చట్టం 2007 ప్రకారం సీనియర్ సిటిజన్ల చట్టపరమైన హక్కులు సీనియర్ సిటిజన్‌ను ఎక్కడైనా వదిలిపెట్టడం చట్టరీత్యా నేరం. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పాలని, అలాగే సీనియర్ సిటిజన్లకు తగిన వైద్య సంరక్షణను అందించాలని కూడా ఈ చట్టం చెబుతుంది.ఈ చట్టంలోని సెక్షన్ 20 ప్రతి హిందువు తన/ఆమె జీవితకాలంలో తన/ఆమె వృద్ధులైన లేదా బలహీనమైన తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యతను విధిస్తుంది. కాబట్టి, వృద్ధులు లేదా బలహీనంగా ఉన్న తల్లిదండ్రులను కాపాడుకోవడం కొడుకులు, కుమార్తెలు ఇద్దరి బాధ్యత ఉంటుంది.తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం, 2007 కింద, వారు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌లో దరఖాస్తును ఫైల్ చేయవచ్చు. పిల్లలు లేదా బంధువులు వీరిని జాగ్రత్తగా చూసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టు గుర్తిస్తే, వారికి నెలవారీ మెయింటెనెన్స్ చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయవచ్చు. ఎంత మెయింటెనెన్స్ చెల్లించాల్సి ఉంటుందో అనేది కూడా కోర్టు విచారణ చేసిన నిర్ణయిస్తుంది దరఖాస్తు తేదీ నుండి మెయింటెనెన్స్ మొత్తంపై వడ్డీ (5-8 శాతం) తో కలిపి చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించవచ్చు. కోర్టు ఆర్డర్ తర్వాత కూడా మెయింటెనెన్స్ అందకపోతే ఏదైనా ఇలాంటి కోర్టు (మెయింటెనెన్స్ ట్రిబ్యునల్)కి వెళ్లి, ఆర్డర్‌ను అమలు చేయడంలో సహాయం కోసం అడగవచ్చు. -
UNSC: బైడెన్ తీర్మానాన్ని స్వాగతించిన హమాస్
న్యూయార్క్: గాజా యుద్ధంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమతి భద్రతామండలిలో అగ్రరాజ్యం అమెరికా సోమవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. రష్యా మినహా మిగతా 14 భద్రతా మండలి సభ్య దేశాలు ఈ కాల్పుల విరమణ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు.మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని హమాస్ స్వాగతించింది. కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు అమలు చేసే ప్రణాళికకు మద్దుతుగా ఉంటామని, అది కూడా పాలస్తీనా ప్రజలకు డిమాండ్లకు అనుగుణంగా ఉంటుందని ఆశిస్తున్నామని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది.మే 31న ఇజ్రాయెల్ చొరవతో మూడు దశల కాల్పుల విరమణ ప్రణాళికను రూపొందించినట్లు అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ‘ఈ రోజు మేము శాంతి కోసం ఓటు వేశాం’ అని ఐరాసలో యూఎస్ అంబాసిడర్ లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ అన్నారు. ఇక ఈ తీర్మానాన్ని ఇజ్రాయెల్ సైతం అంగీకరించింది. హమాస్ కూడా ఈ తీర్మానాన్ని అంగీకరించాలని కోరింది. హమాస్, పాలస్తీనా మధ్య అంతర్జాతీయంగా కాల్పుల విరమణ కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు పక్షాలు అంగీకరించనట్లు తెలుస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి శాంతి ఒప్పదం కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు పలువురు అంతర్జాతీయ నేతలతో సమావేశం అయిన అనంతరం ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. ఇక.. ఈ తీర్మాణంపై రష్యా విమర్శలు గుప్పించింది. ఇజ్రాయెల్ నుంచి వివరణాత్మక ఒప్పందాలు లేకపోవడాన్ని రష్యా ఎత్తిచూపింది. తీర్మానం ప్రకారం.. కాల్పుల విరణమ ప్రణాళిక మూడు దశల్లో కొనసాగుతుంది. మొదటి దశలో ఇజ్రాయెల్ బందీలు, పాలస్తీనా ఖైదీల మార్పిడితో కూడిన కాల్పుల విరమణ ఉంటుంది. రెండో దశలో ఇరుపక్షాలు శత్రుత్వానికి శాశ్వతంగా ముగింపు పలకాలి. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. మూడో దశలో గాజా పునర్నిర్మాణంపై దృష్టి పెట్టే ప్రణాళికను అమలు చేయటం జరుగుతుంది. -
Israel-Hamas war: గాజాపై ఇజ్రాయెల్ దాడులు... 18 మంది దుర్మరణం
డెయిర్ అల్ బలాహ్(గాజా): సెంట్రల్ గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. నుసెయిరత్‌లో ఐరాస శరణార్థి శిబిరం నడుస్తున్న స్కూలుపై గురువారం జరిపిన దాడిలో 33 మంది చనిపోయిన విషయం తెల్సిందే. ఇజ్రాయెల్ సైన్యం డెయిర్ అల్ బలాహ్, జవాయిడా పట్టణాల్లోనిసెయిరత్, మఘాజి శరణార్థి శిబిరాలపై శుక్రవారం రాత్రి జరిపిన దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నట్లు అల్–హక్సా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, గురువారం నుసెయిరత్‌లోని స్కూల్‌పై జరిపిన దాడిని ఇజ్రాయెల్ సమర్థించుకుంది. స్కూల్ భవనంలోని రెండు, మూడు అంతస్తుల్లో జరిగిన లక్షిత దాడుల్లో మృతి చెందిన వారిలో 9 మంది మిలిటెంట్లు ఉన్నట్లు వివరించింది. రెండు రోజులుగా జరుపుతున్న దాడుల్లో మిలిటెంట్ల సొరంగాలను, మౌలిక వసతులను ధ్వంసం చేసినట్లు ఆర్మీ తెలిపింది. -
గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
హమాస్ బలగాలను అంతం చేయటమే లక్ష్యంగా.. గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడిలో ఐక్యరాజ్య సమితిలో పనిచేసే ఓ భారతీయ వ్యక్తి మృతి చెందినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఆ వ్యక్తి తన వాహనంలో రఫాలోని యూరోపియన్ హాస్పటల్‌కు వెళ్తుతున్న క్రమంలో ఒక్కసారిగా జరిగిన దాడిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటుతో ఉన్న మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఇక.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఐక్యరాజ్య సమితికి చెందిన తొలి వ్యక్తి మరణంగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.మరణించిన వ్యక్తి ఐక్యరాజ్య సమితిలోని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విభాగానికి( DSS) చెందిన భారతీయ వ్యక్తిగా తెలుస్తోంది. మృతి చెందిన వ్యక్తి భారత దేశానికి చెందిన మాజీ ఆర్మీ సైనికుడని సమాచారం.Today a @UN vehicle was struck in Gaza, killing one of our colleagues & injuring another. More than 190 UN staff have been killed in Gaza.Humanitarian workers must be protected.I condemn all attacks on UN personnel and reiterate my urgent appeal for an immediate humanitarian…— António Guterres (@antonioguterres) May 13, 2024‘‘ఐక్యరాజ్య సమితి చెందిన డీఎస్ఎస్ విభాగంలోని సభ్యుడు మరణించటం చాలా బాధాకరం. ఈ ఘటనలో మరో సభ్యుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. రఫాలోని యూరోపియన్ ఆస్పత్రికి తమ వాహనంలో వెళ్తున్న క్రమంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది’’ అని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అంటోనియో గుటెర్రెస్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.ఈ దాడి ఘటనను యూఎన్ఓ జనరల్ సెక్రటరీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ తీవ్రంగా ఖండించారు. యూఎన్ఓ సిబ్బందిపై జరిగిన అన్ని దాడులపై దర్యాప్తు చేస్తామని అన్నారు. అదేవిధంగా డిఎస్ఎస్ విభాగానికి చెందని సభ్యుడి మరణం పట్ల యూఎన్ఓ జనరల్ సెక్రటరీ గుట్రెస్ సంతాపం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. -
Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
టెల్ అవీవ్: ఒకవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపితే.. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం దాడుల్ని కొనసాగించాలనే నిర్ణయించింది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) యుద్ధ ట్యాంకులు గాజావైపున ఉన్న రఫా క్రాసింగ్‌ను ఆక్రమించాయి. గాజా పోరులో ఈ ఆక్రమణ కీలక ఘట్టమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ రఫా క్రాసింగ్ నుంచే ఆదివారం రాత్రి హమాస్ దళాలు దక్షిణ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించాయి. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందడంతో ఐడీఎఫ్ తన ఆపరేషన్‌ను ప్రారంభించింది. రఫా క్రాసింగ్ ఆక్రమణ విషయాన్ని ఇజ్రాయెల్ తమకు తెలియజేసిందని ఈజిప్టు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. అంతకు ముందు..రఫాపై సోమవారం ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న వేళ.. హమాస్ సంస్థ కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విరమణ ఒప్పందం.. తమ కీలక డిమాండ్లకు అనుగుణంగా లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. మరోవైపు కాల్పుల విరమణ కోసం కైరోలో జరుగుతున్న చర్చల్లో ఇజ్రాయెల్ యథావిధిగా పాల్గొంటోంది. కొసమెరుపు ఏంటంటే.. ఆ చర్చలు కొనసాగుతున్న వేళలోనే ఇజ్రాయెల్ యుద్ధ కేబినెట్ సమావేశమై రఫాపై మిలిటరీ ఆపరేషన్‌కు పచ్చజెండా ఊపింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆక్రమణతో రఫా క్రాసింగ్ మీదుగా ఈజిప్టు నుంచి గాజాకు చేరుకుంటున్న మానవతా సాయం ఆగిపోయిందని పాలస్తీనా క్రాసింగ్స్ అథారిటీ ప్రతినిధి వేల్ అబు ఒమర్ తెలిపారు. ఈ పరిణామంపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అమెరికా మాత్రం ఇజ్రాయెల్ చర్యను పరిమితమైన ఆక్రమణగానే పేర్కొంటోంది. -
పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వ తీర్మానం.. వీటో పవర్ వాడిన అమెరికా
ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలని కోరుతూ పాలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని అమెరికా అడ్డుకుంది. తీర్మానంపై ఓటింగ్ సమయంలో అగ్రరాజ్యం అమెరికా వీటో పవర్‌ను వినియోగించింది. 193 దేశాలు సభ్యతం గల ఐరాసలో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై గురువారం భద్రతా మండలిలో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ సందర్భంగా 12 కౌన్సిల్ సభ్యదేశాలు పాలస్తీనా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఇక.. బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అమెరికా వీటో ఉపయోగించటంతో ఈ తీర్మానం వీగిపోయింది. ‘రెండు దేశాల సమస్య పరిష్కారానికి అమెరికా ఎప్పుడూ మద్దుతు ఇస్తుంది. ఈ ఓటు పాలస్తీనా ప్రత్యేక దేశానికి వ్యతిరేకమైంది కాదు. అయితే ఇరు దేశాల మధ్య పత్యక్ష చర్చల ద్వారా మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుంది’ అని యూఎన్‌లో యూఎస్ డిప్యూటీ రాయబారి రాబర్ట్ వుడ్ భద్రతామండలికి తెలిపారు. తీర్మానాన్ని అమెరికా వీటో చేయటంపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తీవ్రంగా ఖండించారు. ‘పాలస్తీనా శాశ్వత సభ్యత్వానికి సంబంధించిన తీర్మానాన్ని అమెరికా వీటో చేయటం చాలా అనైతికం, అన్యాయం’ అని అన్నారు. ‘ఈ తీర్మానంపై ఆమోదం పొందలేదనే విషయం పాలస్తీనా ప్రయత్నాన్ని తగ్గించదు. అదే విధంగా పాలస్తీనా సంకల్పాన్ని ఓడించదు. మా ప్రయత్నం ఆగదు’ అని యూఎన్‌లో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ ఒకింత భావోద్వేగంతో అన్నారు. -
ఐరాసలో సంస్కరణలకు మద్దతు ఇస్తాం: అమెరికా
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు తాము పూర్తి మద్దతు ఇస్తామని అమెరికా వెల్లడించింది. ఐరాస, ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు చేయడాని అమెరికా మద్దతు ఇస్తుందని అగ్రరాజ్య విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు. బుధవారం మీడియాతో వేదాంత్ పటేల్ మాట్లాడారు. ఇటీవల ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రస్తావనకు సంబంధించి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు వేదాంత్ పటేల్ సమాధానం ఇచ్చారు. ‘ఇప్పటికే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అమెరికా అధ్యక్షడు ఈ విషయం గురించి మాట్లాడారు. అదేవిధంగా ఐరాస కార్యదర్శి సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. మనం ప్రస్తుతం 21 శతాబ్దంలో ఉన్నాం. దానిని ప్రతిబింబించేలా ఐరాసతో పాటు దాని అనుబంధ సంస్థల్లో తప్పకుండా మార్పులు అవసరం. ఐరాస సంస్కరణలకు తాము(అమెరికా) కచ్చితంగా మద్దతు ఇస్తాం. అయితే ఎలాంటి సంస్కరణలు చేయాలో అనే ప్రత్యేకమైన సూచనల తమ వద్ద లేవు. కానీ, ఐరాసలో మార్పులు అవసరమని మేం కూడా గుర్తించాం’ అని వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు. ఇక... జనవరిలో ఐక్యరాజ్యసమితి పనితీరుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్న విషయం తెలిసిందే. భద్రతా మండలిలో భారత్ వంటి దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఎలాన్ మస్క్ తప్పుబట్టారు. అదీకాక.. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ విమర్శలు గుప్పించారు. ‘ఐరాస, దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడకపోవడమే అసలు సమస్య. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’ అని ఆయన ఎక్స్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక.. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో ఐక్యరాజ్యసమితి స్థాపించారు. ఐరాసకు అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భద్రతా మండలిలో ఎటువంటి మార్పులూ చోటుచేసుకోకపోవటం గమనార్హం. అయితే శక్తివంతమైన వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లే కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కోసం ఇండియా పట్టుబడుతున్నా దక్కటం లేదు. ఐదింట నాలుగు దేశాలు భారత్‌కు అనుకూలంగానే ఉన్నప్పటికీ పొరుగుదేశం చైనా అడ్దుకుంటోంది. -
‘ఐఎస్ఐఎస్’కి అడ్డాగా ఆఫ్రికా దేశాలు?
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఇప్పుడు కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది. గత కొన్నేళ్లుగా అల్లకల్లోలంగా మారిన పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఇప్పుడు ‘ఐఎస్ఐఎస్’కి అనువైన గమ్యస్థానాలుగా మారుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. పేదరికం,ఆకలితో పాటు పశ్చిమ ఆఫ్రికా దేశాలు అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్నాయి. నైజర్, మాలి, బుర్కినా ఫాసో వంటి పశ్చిమ ఆఫ్రికా దేశాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకుని ఈ దేశాలలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో నెలకొన్న రాజకీయ అస్థిరతతో పాటు అక్కడి తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ స్థావరాలు ముప్పుగా పరిణమించాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘ఐఎస్ఐఎస్’ విదేశాల్లో దాడులు చేయాలనుకుంటోందనే సమాచారం తమకు నిఘా వర్గాల ద్వారా అందిందని, అలాగే ఆ సంస్థ ఉగ్రవాదులు ఆఫ్రికన్ దేశాలను తమ కొత్త స్థావరంగా ఏర్పాటు చేసుకుంటున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. -
ముంబై దాడుల సూత్రధారి అబ్దుల్ సలాం భుట్టావి మృతి
లష్కరే తోయిబా(LeT) వ్యవస్థాపకుడు, ముంబై దాడుల సూత్రధారి అబ్దుల్ సలాం భుట్టావి మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి(UNO)ప్రకటించింది. లష్కరే తోయిబా వ్యవస్థపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్‌కు డిప్యూటీగా వ్యవహరించిన సలాం భుట్టావి మరణించినట్లు యూఎన్ఓ భద్రతా మండలి నిర్ధారించింది. ఈ మేరకు ఓ ప్రకటన వెల్లడించింది. 2008 ముంబై 26/11 దాడుల కుట్రదారుల్లో ఒకరైన సలాం భుట్టావి గుండెపోటుతో 2023 మేలో మృతి చెందినట్లు పేర్కొంది. పాకిస్తాన్ ప్రభుత్వ కస్టడిలో ఉన్న భుట్టావి పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిధేలో మరణించారు. లష్కరే తోయిబా చేసిన ముంబై దాడుల్లో 166 మంది మృతి చెందగా.. సుమారు 300 మంది గాయపడ్డారు. ఐఖ్య రాజ్య సమితి నిషేధించిన మహమ్మద్హఫీజ్ సయీద్‌ను ముంబై దాడుల ఘటనకు సంబంధించి విచారించడం కోసం తమకు అప్పగించాలని పాకిస్థాన్‌ను భారత్ ఇటీవల కోరిన విషయం తెలిసిందే. చదవండి: అమెరికా, బ్రిటన్ మూల్యం చెల్లించుకోవాల్సిందే.. హెచ్చరించిన హౌతీలు -
డిసెంబరులో కరోనాతో 10 వేలమంది మృతి!
కరోనా ఇన్ఫెక్షన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్నాయి ప్రత్యేకించి కరోనా జెఎన్.1 వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. సింగపూర్, అమెరికాలో కరోనా వేవ్ అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. భారతదేశంలో కూడా గడచిన 50 రోజుల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలోనే పెరిగాయి. ఇటీవలి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల్లో జనం జాగ్రత్తలు పాటించకపోవడంవల్ల ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ మరింతగా విస్తరించిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్ఓ) డైరెక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అధనామ్ తెలిపారు. గత డిసెంబర్లో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేలమంది మరణించారని పేర్కొన్నారు. 50 దేశాల నుంచి అందిన డేటా ప్రకారం ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య కూడా 42 శాతం మేరకు పెరిగిందన్నారు. భారతదేశంలో కూడా కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని, ప్రతిరోజూ సగటున 600 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 514 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,422. దీనికిముందు అంటే బుధవారం కొత్తగా 605 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కారణంగా రోజుకు సగటున ఐదుగురు మృత్యువాత పడుతున్నారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. -
ఇజ్రాయెల్-హమాస్ యుద్దం.. ఐరాసలో భారత్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ అంశంతో మరోసారి ఆచితూచి వ్యవహరించింది. తాజాగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశ పెట్టిన తీర్మానంపై భారత్ అనుకూలంగా ఓటువేసింది. ఇక, తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటు వేయడంతో తీర్మానం ఆమోదం పొందింది. వివరాల ప్రకారం.. ఆక్రమిత పాలస్తీనా భూభాగం, తూర్పు జెరూసలెం, సిరియాకు చెందిన గోలాన్ హైట్స్‌లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ కార్యకలాపాలకు పాల్పడటాన్ని ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటు వేయగా.. 18 దేశాలు తటస్థంగా ఓటు వేశాయి. మరోవైపు.. కెనడా, హంగేరీ, ఇజ్రాయెల్, మార్షల్‌ఐలాండ్స్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, నౌరు, అమెరికా మాత్రం తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరోవైపు, ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ యద్ధాన్ని తక్షణమే ఆపేయాలని కోరుతూ జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. దీనిలో హమాస్ అనాగరిక చర్యలను పేర్కొనకపోవడాన్ని భారత్ వ్యతిరేకించింది. అప్పట్లో ఈ తీర్మానం ఓటింగ్‌కు భారత్ సహా 45 దేశాలు గైర్హాజరయ్యాయి. 120 దేశాలు మాత్రం దీనికి అనుకూలంగా ఓటేశాయి. 🔥🔥BIG UPDATE 🔥🔥 India Supports UN Resolution Condemning Israeli Settlements In Palestine This comes weeks after India abstained from a vote on a UN resolution calling for "immediate, durable and sustained humanitarian truce" in Gaza Strip. India has voted in favour of a… pic.twitter.com/fttSp5xiWq — Resonant News🌍 (@Resonant_News) November 12, 2023 గాజాలో దారుణ పరిస్థితులు.. ఇదిలా ఉండగా.. గాజాలో మానవీయ సంక్షోభం క్రమంగా తీవ్ర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఆస్పత్రుల ముంగిట్లోకి చేరడంతో పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధం దెబ్బకు కనీస సౌకర్యాలన్నీ నిలిచిపోవడంతో గాజాలో 20 ఆస్పత్రులు ఇప్పటికే పూర్తిగా స్తంభించిపోయాయి. మిగిలిన 15 ఆస్పత్రులూ అదే బాటన ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సందర్భంగా పాలస్తీనా అధికారులు శుక్రవారం మాట్లాడుతూ.. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 11,078 మంది గాజావాసులు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించారు. వారిలో దాదాపు 40శాతం మంది చిన్నారులే ఉన్నారని వెల్లడించారు. గాజాపై నిరంతరం వైమానిక, శతఘ్ని దాడులు నిర్వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిలిచిపోయిన వైద్యసేవలు.. కరెంటు సరఫరా లేకపోవడంతో వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. అల్ ఖుద్స్ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఆ ఆస్పత్రికి ఏకంగా 20 మీటర్ల సమీపం దాకా సైన్యం చొచ్చుకొచ్చినట్టు తెలుస్తోంది. దాంతో అందులోని 14 వేల మంది రోగులు, శరణార్థుల ప్రాణాల్లో గాల్లో దీపంగా మారాయి. విరామం లేకుండా దూసుకొస్తున్న తూటాలు, బాంబు వర్షం కారణంగా అల్ షిఫా ఆస్పత్రిలోని వేలాది మంది కూడా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అందులో 1,500 మందికి పైగా రోగులు, అంతే సంఖ్యలో వైద్య సిబ్బంది, 15 వేలకు పైగా శరణార్థులున్నట్టు చెబుతున్నారు. గాజా అంతటా వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టేనని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న ఐరాస సంస్థలు కూడా స్పష్టం చేస్తున్నాయి. గాజాలోని మొత్తం 35 ఆస్పత్రులూ చేతులెత్తేసినట్టే. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిందని అవి చెబుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర గాజాలోని అల్ నస్ర్, అల్ రంటిసి సహా చాలా ఆస్పత్రులు సైనిక దిగ్బంధంలో ఉన్నాయి. దీనికి తోడు గాజావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధికం ఎప్పుడో మూతబడ్డాయి. ఇది కూడా చదవండి: రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్ -
2100 నాటికి ప్రపంచ జనాభాలో భారీ తగ్గుదల? భారత్, చైనా పరిస్థితి ఏమిటి?
పెరుగుతున్న జనాభాపై ప్రపంచంలోని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా పెరుగుదల అనేక అనర్థాలకు దారితీస్తుందని వాపోతున్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి అందించిన ‘రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022’ డేటాలోని వివరాలు మన ఊహలకు భిన్నంగా ఉన్నాయి. భవిష్యత్‌లో ప్రపంచ జనాభాలో తగ్గుదల కనిపించనున్నదని ఈ నివేదిక వెల్లడించింది. దీనికి వెనుకనున్న కారణాలేమిటో కూడా తెలియజేసింది. ప్రపంచంలో 2100 నాటికి మొత్తం జనాభా ఎంత ఉంటుందనే దానిపై ఈ నివేదికలో అంచనా అందించారు. దీనిలో భారతదేశంతో పాటు చైనా, పాకిస్తాన్, అమెరికా, యూరోపియన్ దేశాల జనాభాకు సంబంధించి అంచనాలున్నాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం 2021లో భారతదేశ జనాభా 153 కోట్లు. ప్రస్తుత జనాభా దాదాపు 140 కోట్లు. అంటే 2021కి.. ఇప్పటికి(2023) జనాభాలో తగ్గుదల కనిపించింది. దీని ప్రకారం చూస్తే వచ్చే 77 ఏళ్లలో అంటే 2100 నాటికి భారతదేశ జనాభా 13 కోట్ల మేరకు మాత్రమే పెరగనుంది. 2100వ సంవత్సరంలో ప్రపంచ జనాభాలో గణనీయమైన పెరుగుదల ఉండకపోవచ్చంటూ ఈ అంచనాలలో పేర్కొన్నారు. ఈ నివేదికలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం చైనాతో ముడిపడివుంది. 2100 నాటికి చైనా జనాభా 140 కోట్ల నుంచి దాదాపు 77 కోట్లకు తగ్గిపోనుంది. యూఎన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ), ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలిసిస్ (ఐఐఏఎస్‌ఏ)లు అందించిన డేటాలలోని అంశాలను క్రోడీకరించి 2100నాటి జనాభా అంచనాలను రూపొందించారు. ప్రపంచ జనాభా 2086 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. సంతానోత్పత్తి రేట్లు 2050కి ముందుగానే త్వరితగతిన తగ్గుతాయని ఈ అంచనాలలో వెల్లడయ్యింది. 2100కి వీటి స్థిరీకరణ జరగనుందని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు జనన రేటు తగ్గుతుంది. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడం, గర్భనిరోధకాల లభ్యత, కుటుంబ నియంత్రణకు ప్రోత్సాహం, అధిక సంతాన ఖర్చులు మొదలైనవి సంతానోత్పత్తి తగ్గుదలకు కారణాలుగా నిలుస్తున్నాయి. 2100 నాటికి వివిధ దేశాల జనాభా ఎంత ఉండవచ్చనే అంచనాలను ‘రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022’ డేటాలో అందించారు. 2100 నాటికి ఏ దేశంలో ఎంత జనాభా(అంచనా)? భారతదేశం: 153 కోట్లు చైనా: 77 కోట్ల 10 లక్షలు నైజీరియా: 54 కోట్ల 60 లక్షలు పాకిస్తాన్: 48 కోట్ల 70 లక్షలు కాంగో: 43 కోట్ల 10 లక్షలు అమెరికా: 39 కోట్ల 40 లక్షలు ఇథియోపియా: 32 కోట్ల 30 లక్షలు ఇండోనేషియా: 29 కోట్ల 70 లక్షలు టాంజానియా: 24 కోట్ల 40 లక్షలు ఈజిప్ట్: 20 కోట్ల 50 లక్షలు బ్రెజిల్: 18 కోట్ల 50 లక్షలు ఫిలిప్పీన్స్: 18 కోట్లు బంగ్లాదేశ్: 17 కోట్ల 70 లక్షలు సూడాన్: 14 కోట్ల 20 లక్షలు అంగోలా: 13 కోట్ల 30 లక్షలు ఉగాండా: 13 కోట్ల 20 లక్షలు మెక్సికో: 11 కోట్ల 60 లక్షలు కెన్యా: 11 కోట్ల 30 లక్షలు రష్యా: 11 కోట్ల 20 లక్షలు ఇరాక్: 11 కోట్ల 10 లక్షలు ఆఫ్ఘనిస్తాన్: 11 కోట్లు మొజాంబిక్: 10 కోట్ల 60 లక్షలు వియత్నాం: 9 కోట్ల 10 లక్షలు కామెరూన్: 8 కోట్ల 70 లక్షలు మాలి: 8 కోట్ల 70 లక్షలు మడగాస్కర్: 8 కోట్ల 30 లక్షలు టర్కీ: 8 కోట్ల 20 లక్షలు ఇరాన్: 7 కోట్ల 90 లక్షలు దక్షిణాఫ్రికా: 7 కోట్ల 40 లక్షలు యెమెన్: 7 కోట్ల 40 లక్షలు జపాన్: 7 కోట్ల 40 లక్షలు ఇది కూడా చదవండి: చైనా జిత్తులకు అమెరికా, భారత్ పైఎత్తు! -
గాజాలో కాల్పుల విరమణ పిలుపుపై ఇజ్రాయెల్ స్పందన
టెల్ అవీవ్: గాజాలో కాల్పుల విరమణ పిలుపుపై ఇజ్రాయెల్ స్పందించింది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రకటించారు. కాల్పుల విరమణ పాటిస్తేనే.. మానవతా సాయం గాజాకు అందుతుందని, లేకుంటే అక్కడి పరిస్థితులు మానవతా సంక్షోభానికి దారి తీస్తాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే నెతన్యాహూ స్పందించారు. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో కాల్పలు విరమణ ఉండదు. ఎందుకంటే అది హమాస్‌కు లొంగిపోవడమే అవుతుంది గనుక అని అన్నారాయన. ‘‘కాల్పుల విరమణ కోసం ఇస్తున్న పిలుపు.. ఇజ్రాయెల్ హమాస్‌కు లొంగిపోవాలని, ఉగ్రవాదానికి లొంగిపోవాలని పిలుపు ఇవ్వడమే అవుతుంది. కాబట్టి అది జరగదు. యుద్ధంలో గెలిచే వరకు ఇజ్రాయెల్ పోరాడుతుంది అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సోమవారం ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికా కూడా కాల్పుల విరమణపై అభ్యంతరం వ్యక్తం చేసింది.‘‘ప్రస్తుత ఉద్రిక్తతలకు కాల్పుల విరమణ సరైన సమాధానం అని మేము భావించం అని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. అయితే గాజాలో సాయం అందాలంటే.. యుద్ధ విరమణల సమయం కేటాయిస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
భారత జాతీయతకే తీరని అవమానం..సిగ్గుగా ఉంది: ప్రియాంక గాంధీ ధ్వజం
ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్యం, అహింస అనే ధర్మాలకు ప్రతీక అయిన భారత దేశం దీనికి దూరంగా ఉండటం సిగ్గు చేటు అంటూ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె శనివారం ట్విటర్ ద్వారా ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. అహింస, సత్యం అనే సిద్దాంతాల పునాదుల మీదే మన దేశం ఆవిష్కృతమైంది. ఈ సిద్ధాంతాల కోసమే స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. దేశానికి స్వేచ్ఛని ప్రసాదించారు. మన జాతీయతకు నిదర్శనమైన ఈ సూత్రాలకోసం జీవితమంతా నిలబడిన దేశానికి భిన్నంగా మోదీ సర్కార్ వ్యవహరించిందంటూ ట్వీట్ చేశారు. పాలస్తీనాలో వేలాది మంది పురుషులు మహిళలు, పిల్లలను హత మార్చడాన్ని మౌనంగా చూస్తూ ఉండటం భారత దేశ మూల సూత్రాలకే విరుద్ధమని మండిపడ్డారు. కంటికి కన్ను అనే విధానం మొత్తం ప్రపంచాన్ని అంధత్వంలోని నెట్టేస్తుందన్న గాంధీజీ కోట్‌ను తన ప్రకటనకు ప్రియాంక జోడించారు. కాగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లో బాధితులకు ఎలాంటి అవరోధం లేకుండా సహాయ కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన ‘మానవతావాద సంధి’ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసిన ఉగ్రవాద సంస్థ హమాస్ పేరును ఈ తీర్మానంలో ప్రస్తావించకపోవడమే ఇందుకు కారణమని భారత్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్-హమాస్ నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లో ఎలాంటి అవరోధాలు లేకుండా సహాయ కార్యక్రమాలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ జోర్డాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. గాజా స్ట్రిప్‌కు సహాయం అందించాలని ,పౌరులకు రక్షణ కల్పించాలని కూడా తీర్మానం డిమాండ్ చేసింది. పౌరుల రక్షణ. చట్టపరమైన, మానవతా బాధ్యతలకు సమర్థన’ అనే పేరిట ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్, రష్యా, దక్షిణాఫ్రికాతో సహా 40కిపైగా దేశాలు మద్ధతుగా నిలిచాయి. అనుకూలంగా 120 దేశాలు, వ్యతిరేకంగా 14 దేశాలు ఓటువేశాయి. 45 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకేతోపాటు పలు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. “An eye for an eye makes the whole world blind” ~ Mahatma Gandhi I am shocked and ashamed that our country has abstained from voting for a ceasefire in Gaza. Our country was founded on the principles of non-violence and truth, principles for which our freedom fighters laid down… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 28, 2023 -
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహం
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటికే 19 రోజులు దాటింది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య ఏడువేలు దాటింది. ప్రపంచమంతా ఈ యుద్ధాన్ని గమనిస్తోంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ)లో కూడా ఈ యుద్ధంపై చర్చలు జరుగుతున్నాయి. వీటినడుమ ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులపై హమాస్ సాగిస్తున్న దారుణాలపై ఆంటోనియో గుటెర్రెస్ ఉపేక్ష వహిస్తున్నట్టు కనిపిస్తున్నారని, అందుకే ఆయన ఐక్యరాజ్యసమితికి నాయకత్వం వహించడానికి తగినవారు కాదని ఎర్డాన్ ఆరోపించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఇజ్రాయెల్, యూదు ప్రజలపై దురాగతాలకు తెగబడుతున్న వారిపై సానుభూతి తెలిపేవారితో తాను మాట్లాడటంలో అర్థం లేదని అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, హమాస్ ఎటువంటి కారణం లేకుండా దాడులు చేసి ఉండదని తెలుసుకోవడం కూడా ముఖ్యమేనని అన్నారు. పాలస్తీనా ప్రజలు 56 ఏళ్లుగా దురాక్రమణలను ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ హమాస్ దాడులను సమర్థించలేమని కూడా ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: భారత్ నుంచి గాజాకు 38 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలు! -
ఇంటర్నేషనల్ ఫుడ్ డే: ఎన్ని టన్నుల ఆహారం వృథా అవుతోందో తెలుసా?
World Food Day 2023: ప్రపంచ ఆహార దినోత్సవం 2023: సరైన ఆహారం , పోషకాహారాన్ని పొందడం మానవ ప్రాథమిక హక్కు. ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజలు సరైన పోషకాహారంలేక, పరిశుభ్రమైననీరు అందుబాటులో లేక నానా కష్టాలుపడుతున్నారు.మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టన్నుల కొద్దీ ఆహారం వృధా అవుతోంది. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈ భూమ్మీద ప్రతి వ్యక్తికి సరైన పోషకాహారం, సరైన ఆహారం లభించేలా అవగాహన పెంచడం, సంబంధిత చర్యలు తీసుకోవడంపై ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రస్టింగ్ సంగతులు మీకోసం.. 1979లో, FAO సమావేశంలో, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అధికారికంగా ప్రపంచ సెలవుదినంగా ఆమోదించారు. ఆ తర్వాత, 150 కంటే ఎక్కువ దేశాలు ప్రపంచ ఆహార దినోత్సవ ప్రాధాన్యతను గుర్తించాయి. 2023 వరల్డ్ ఫుడ్ డే ధీమ్ ఏంటంటే ‘‘నీరే జీవితం, నీరే ఆహారం... ప్రతీ ఒక్కరికీ ఇది అందుబాటులో ఉండాలి’’ భూమిపై జీవించడానికి నీరు చాలా అవసరం. ఈ భూమిపై ఎక్కువ భాగం, మన శరీరాల్లో 50శాతం పైగా నీరే ఉంటుంది. అసలు ఈ ప్రపంచం ముందుకు సాగాలంటే నీరు లేకుండా సాధ్య పడుతుందా? అలాంటి అద్భుతమైన ఈ జీవజలాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ప్రపంచ జనాభాలో ఎంతమందికి కడుపునిండా భోజనం దొరుకుతోంది? అసలు ఎంత ఆహారం వృథా అవుతోంది మీకు తెలుసా? మీకు తెలుసా... ►ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా అక్టోబరు 16వ తేదీని ఇంటర్నేషనల్ ఫుడ్ డేను ఆచరిస్తున్నాం. ► ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. ప్రపంచ జనాభా 810 కోట్లు కాగా... ఇందులో 300 కోట్ల మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత కూడా లేదు. ►ఇజ్రాయెల్ - పాలస్తీనా, రష్యా-ఉక్రెయిన్ల మాదిరిగా యుద్ధాలు, వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న ధరల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత తగ్గిపోతోంది. ►అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఏటా 130 కోట్ల టన్నుల ఆహార ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెరిగితే అన్నార్తులు మరింత మంది ఆకలి తీర్చే అవకాశం ఏర్పడుతుంది. ► కోవిడ్-19 పుణ్యమా అని పేదల ఆర్థిక స్తోమత మరింత దిగజారిపోయింది. ఫలితంగా చాలామందికి ప్రతి రోజూ నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లడమే కష్టమవుతోంది. Water is not an infinite resource. We need to stop taking it for granted. What we eat and how that food is produced all affect water. On #WorldFoodDay @FAO calls on countries to take greater #WaterAction for food.https://t.co/DKBqAUky9y pic.twitter.com/I3TYWf4LrL — UN Environment Programme (@UNEP) October 16, 2023 ► ఆకలి మనిషి శరీరాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది. పోషకాహార లోపం వాటిల్లో ఒకటి మాత్రమే. భారతదేశంలో పోషకాహార లోపాల కారణంగా ఐదేళ్ల లోపు పిల్లల్లో 30 శాతం మంది వారి సామర్థ్యానికి తగ్గట్టు ఎదగలేకపోతున్నారు. ►ఆకలి మన రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకూ కారణమవుతుంది. రక్తహీనత, విటమిన్ లోపాలు వాటిల్లో కొన్ని మాత్రమే. ►మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు కూడా ఆకలి కారణమవుతుందంటే చాలామంది ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజం. మనోవ్యాకులత (డిప్రెషన్) యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు ఆకలి కారణంగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతారు. ఇవీ చదవండి: ప్రకృతి ప్రకోపానికి మూల్యం... 12,300 కోట్ల డాలర్లు ఆకలి సూచీలో అధోగతి -
మన విద్యార్థులు యూఎన్ఓకు వెళ్లడం రాష్ట్రనికే గర్వకారణం
సాక్షి, అమరావతి: పదో తరగతిలో అత్యుత్తమ ఫలి తాలతో టాపర్స్‌గా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులనే ఐక్యరాజ్య సమితికి పంపించామని, ఇది రాష్ట్రానికే గర్వకారణమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన శనివారం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని పత్రికలు, మీడియా ఉద్దేశపూర్వకంగా వీరిపై తప్పుడు కథనాలు ఇస్తున్నాయని, విద్యార్థులను ప్రోత్సహించడం మానేసి నిరుత్సాహపరిస్తే వారితో పాటు తల్లిదండ్రుల మనోభావాలు కూడా దెబ్బతింటాయని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని, మన విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అధునాతన వసతులు, డిజిటల్ విద్యా బోధనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. డిసెంబర్ 21న 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌ల పంపిణీ చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం 8, 9, 10 తరగతుల మేథమెటిక్స్, సైన్స్ పాఠ్యాంశాల మార్పుపై ఆలోచన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవసరమైన మేరకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా నియామకాలు చేపడతామని అన్నా రు. టీచర్ పోస్టుల భర్తీపై కూడా త్వరలోనే నిర్ణ యం తీసుకుంటామని చెప్పారు. సీపీఎస్ విధానంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతున్నందున కేంద్రం కూడా ఒప్పుకోవడంలేదని, అందుకే జీపీఎస్‌ను తీసుకొచ్చామని చెప్పారు. ఉద్యోగులు దీనిపై సహృదయంతో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. -
పటిష్ట విద్యా వ్యవస్థతో యువత ప్రగతి
సాక్షి, అమరావతి: ఒక దేశం ఆర్థికంగా, శక్తివంతంగా ఎదగాలంటే ఉన్నత విలువలు గల యువత పాత్ర ఎంతో కీలకమని ఐక్యరాజ్య సమితి సదస్సులో ఏపీ విద్యార్థులు తెలిపారు. యువత ప్రగతికి పటిష్టమైన విద్యా వ్యవస్థ అవసరమని, ఇది భారతదేశంలోను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోను బలంగా ఉందని చాటిచెప్పారు. ఏపీ నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఎస్డీజీ సమ్మిట్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. వీరు ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన కొలంబియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. న్యూయార్క్‌లోని యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ విభాగంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌కు వీరు హాజరయ్యారు. యూఎన్ఓ స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ నేతృత్వంలో సదస్సుకు హాజరైన విద్యార్థినులు రాజేశ్వరి, షేక్ అమ్మాజాన్ తమ ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆర్థిక ప్రగతిలో యువత పాత్ర, భారతదేశంలో సుస్థిరాభివృద్ధి, ప్రజావైద్యం అంశాలపైన, రాష్ట్రంలో ప్రజా వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌పై వారు ప్రసంగించారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, నవరత్నాలు సుస్థిరాభివృది్ధకి ఏ విధంగా తోడ్పడుతున్నాయో, ఏపీ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన స మూల మార్పులు పేద కుటుంబాలకు చెందిన తమను అంతర్జాతీయ వేదికలపై ఎలా నిలి పాయో అంతర్జాతీయ ప్రతినిధులు, మేధావుల ముందు వారు వివరించారు. ఏఐ టెక్నాలజీ వినియోగించుకోవాలి.. ఇక ఐక్యరాజ్య సమితి భాగస్వామ్య సంస్థలైన యూఎన్ హాబిటాట్, యూఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్, సివిల్ సొసైటీ యూనిట్, యునిసెఫ్, ఏఎస్ఎఫ్, యూత్ అసెంబ్లీ ఆధ్యర్యంలో రెండ్రోజులుగా యూత్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న రాజేశ్వరి, అమ్మాజాన్ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని ఉన్నతంగా మార్చడంలో యువత చురుౖకైన పాత్ర పోషించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, శాంతిస్థాపన, రాజకీయాలు, విధాన రూపకల్పనలో యువత నిమగ్నం కావాలని, విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వినియోగించుకోవాలన్నారు. ఏపీలో పాఠశాల విద్యలో ఈ తరహా పరి జ్ఞానం అమలు చేస్తున్నారని వివరించారు. అలాగే, పాలనలోనూ, విధానపరమైన నిర్ణయాల్లోనూ యువత అభిప్రాయాలకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్–పేరెంట్ కమిటీలు వేసి వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు రాజేశ్వరి వివరించింది. ఏపీలో విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారని అమ్మాజాన్ తెలిపింది. షకిన్‌కుమార్ మాట్లాడుతూ.. భారత్‌లో యువతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ వారికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇందుకు 10 మంది విద్యార్థులను ఐరాస సదస్సుకు పంపడమే నిదర్శనమన్నారు. -
UNO సదస్సుకు ఎంపికైన ఏపీ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు
-
ఇండియా పేరు మార్పుపై ఐరాస స్పందన
న్యూయార్క్: కేంద్ర ప్రభుత్వం.. ఇండియా అనే పేరును భారత్‌గా మారబోతోందన్న ఊహాగానాలపై విస్త్రృత స్థాయిలో చర్చ నడుస్తున్న వేళ ఐక్యరాజ్య సమితి స్పందించింది. అలాంటి విజ్ఞప్తి ఏదైనా తమ దాకా వస్తే.. తప్పకుండా పరిశీలిస్తామని తెలిపింది. దేశాలు తమ తమ పేర్లను మార్చుకునే క్రమంలో.. ప్రపంచ దేశాల సమాఖ్య ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తులు పంపుతుంటాయి కూడా. ఐరాస గనుక ఆ విజ్ఞప్తిని అధికారికంగా అంగీకరిస్తే.. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాన్ని కొత్త పేరుతోనే పిలుస్తుంటారు. ఇదే విషయాన్ని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఉపప్రతినిధి ఫర్హాన్ హక్ ప్రస్తావించారు. ‘‘ చివరిసారిగా.. టర్కీ దేశం కూడా తుర్కీయేగా తమ పేరును మార్చాలని ఐరాసకు విజ్ఞప్తి పెట్టుకుంది. అలా ఇండియా కూడా అలాంటి విజ్ఞప్తి ఏదైనా చేస్తే.. తప్పక పరిశీలిస్తాం. ఇండియా మాత్రమే కాదు ఏ దేశం అలా రిక్వెస్ట్ పంపినా పరిశీలిస్తాం’’ అని తెలిపారు. కిందటి ఏడాది టర్కీ తుర్కీయేగా తమ దేశం పేరును మార్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో పేరు మార్పు అంశం రాజకీయదుమారానికి తెర తీసింది. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ President of Bharat అని ఉండటంతో ఈ అంశం కాస్తా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో కేంద్రంపై విరుచుకుపడుతోంది. బీజేపీ ఆ విమర్శలకు కౌంటర్ ఇస్తోంది. అయితే.. విపక్ష ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల నేతలు భారత్ అనే పేరు మార్పుపై సానుకూల వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. మరోవైపు ప్రధాని మోదీ ఈ విషయంలో కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పేరు మార్పు విషయంలో వివాదాలకు దూరంగా ఉండాలని మంత్రులను కోరారాయన. -
ఏపీలో విద్యా విధానాలపై UNO అభినందనలు
-
మా నిర్ణయంలో తప్పులేదు.. ఉక్రెయిన్‌కు సాయంపై బైడెన్
వాషింగ్టన్: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఆయుధ నిల్వలుతరిగిపోయిన కారణంగా ఉక్రెయిన్ అమెరికాపై ఒత్తిడి తీసుకురావడంతో వారు ఉక్రెయిన్ దేశానికి క్లస్టర్ బాంబులను పంపించనున్నట్లు ప్రకటించింది. క్లస్టర్ బాంబులు తీవ్రస్థాయిలో ప్రాణనష్టం చేకూరుస్తాయని తెలిసి కూడా అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సమర్ధించుకున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఒకటిన్నర సంవత్సరం పూర్తి కావస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. ఇంకా జరుగుతూ ఉంది. సుదీర్ఘ కాలంగా యుద్ధం చేస్తోన్న నేపథ్యంలో ఉక్రెయిన్ వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. అందుకే అగ్రరాజ్యాన్ని సాయం కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ జో బైడెన్ పై ఒత్తిడి చేశారు. దీంతో చాలాకాలంగా వారి ఆయుధ కర్మాగారంలో నిల్వ ఉండిపోయిన క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్‌కు పంపించాలన్న నిర్ణయానికి వచ్చింది అగ్ర రాజ్యం. ఈ నిర్ణయాన్ని పలు మానవ హక్కుల సంఘాలు, డెమొక్రాట్లు తప్పుబట్టిన కూడా జో బైడెన్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. క్లస్టర్ బాంబుల తీవ్రత గురించి తెలుసు.. అందుకే ఇన్నాళ్లు వాటిని ఉక్రెయిన్‌కు పంపలేదు. కానీ ఇప్పుడు వారి వద్ద ఆయుధ నిల్వలు బాగా తగ్గిపోయాయి. ఈ సమయంలో వారిని అలా వదిలేయలేము. నాటో మిత్రదేశాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. సాధారాణ ఆయుధాలతో పోలిస్తే ఈ క్లస్టర్ బాంబులు పెను విధ్వాంసాన్ని సృష్టిస్తాయి. వీటి కారణంగా భారీగా ప్రాణనష్టం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే వీటిని ఉక్రెయిన్‌కు పంపే విషయమై తీవ్ర జాప్యం చేశామని అన్నారు. ఆయుధాలు కొరవడిన సమయంలో మిత్రదేశాన్ని అలా వదిలేయకూడదని బాగా ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. క్లస్టర్ బాంబుల ప్రత్యేకత ఏంటి? ఒక క్లస్టర్ బాంబు అంటే అది అనేక బాంబుల సముదాయం. దాన్ని ఒక రాకెట్ ద్వారా గానీ ఫిరంగుల ద్వారా గానీ ఈ క్లస్టర్ బాంబును సంధిస్తే సుమారు 24-32 కిలోమీటర్ల దూరాన ఉన్న లక్ష్యాన్ని కూడా తునాతునకలు చేయవచ్చు. ఒక్కటే బాంబుగా రిలీజైన ఈ క్లస్టర్ గాల్లో చిన్న చిన్న బాంబులుగా విడిపోయి అక్కడక్కడా చెదురుముదురుగా పడి పేలతాయి. కాబట్టే వీటివలన భారీగా ప్రాణనష్టం కూడా వాటిల్లుతుంది. పైగా ఇవి నేల మీద పడిన వెంటనే విస్ఫోటం చెందవు. కొన్ని అప్పుడే పేలగా కొన్ని మాత్రం ఎప్పుడో పేలుతుంటాయి. అందుకే ఐక్యరాజ్యసమితి 2008లో ఈ క్లస్టర్ బాంబుల వాడకాన్ని నిషేధిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బ్రిటన్, ఫ్రాన్స్ సహా 120 దేశాలు వీటి వినియోగాన్ని నిషేధిస్తూ సంతకాలు కూడా చేశాయి. 2003లో ఇరాక్ పై చేసిన యుద్ధంలో అమెరికా ఈ క్లస్టర్ బాంబులనే అధికంగా ప్రయోగించింది. అటు తర్వాత అమెరికా వాటిని మళ్ళీ ఎక్కడా ఉపయోగించలేదు. అందుకే వారి వద్ద లక్షల సంఖ్యలో క్లస్టర్ బాంబుల నిల్వ ఉండిపోయింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు సాయం చేస్తూ నిల్వలను తగ్గించుకుంటోందని అమెరికా చెబుతుంటే.. అందులో రష్యాపై గెలవాలన్న వారి కాంక్షే కనిపిస్తోందని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా చదవండి: బ్రెజిల్లో పేకమేడలా కూలిన భవనం, 8 మంది మృతి -
తుపాన్లు తలొంచుతున్నాయ్..! వారం రోజుల ముందే హెచ్చరికలతో..
మాండాస్, సిత్రాంగ్, అసానీ, గులాబ్, బిపర్ జోయ్. పేరు ఏదైనా కానివ్వండి ఆ తుపాను ఎంత తీవ్రమైనదైనా కానివ్వండి మనం తట్టుకొని నిలబడుతున్నాం. 1990,–2000నాటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు తుపాన్లు, వరదలంటే భారీగా ప్రాణ నష్టాలే జరిగేవి. ఇప్పుడు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ముందస్తుగా తుపాన్లను గుర్తించి పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో సత్ఫలితాల్ని ఇస్తోంది. గుజరాత్లో ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన తరలించడంతో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. తుపాన్ల సన్నద్ధతలో ఒడిశా ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఆ రాష్ట్ర చర్యలకు ఐక్యరాజ్య సమితి కూడా శభాష్ అనడం విశేషం. అది 1999 సంవత్సరం అక్టోబర్ 29. ఒడిశా ప్రజలకు అదో కాళరాత్రి. పారాదీప్ సూపర్ సైక్లోన్ రాష్ట్రంపై విరుచుకుపడింది. సముద్రం అలల ధాటికి 14 జిల్లాల్లో భారీ విధ్వంసం జరిగింది. జగత్సింగ్పూర్ జిల్లాకి జిల్లాయే తుడిచిపెట్టుకుపోయింది. తుపాను దెబ్బకి 10 వేల మంది జలసమాధి అయ్యారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 30 వేల మంది వరకు ప్రాణాలు పోగొట్టుకుని ఉంటారని ఒక అంచనా. అప్పట్లో భారత వాతావరణ కేంద్రం దగ్గర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. దీంతో తుపాను ముంచుకొస్తోందని కేవలం 48 గంటల ముందు మాత్రమే తెలిసింది. వాతావరణ శాఖ అధికారులు ఒడిశా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినప్పటికీ సన్నద్ధత లేని కారణంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 10 వేలు నుంచి 30 వేల మంది మరణిస్తే, 3.5 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు గ్రామాలే నీళ్లలో కొట్టుకుపోయాయి. 25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రెండు లక్షల జంతువులు మరణించాయి. గంటకి 250 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ నాశనమైంది. ఒడిశాతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. ఈ పెను విధ్వంసంతో అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తుపాన్లు ఎదుర్కోవడంలో నవీన పంథా సూపర్ సైక్లోన్ ముంచెత్తిన తర్వాత సంవత్సరం 2000లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నవీన్ పట్నాయక్ తుపాన్లు ఎదుర్కోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. సూపర్ సైక్లోన్ తుపాను బీభత్సం నుంచి అప్పటికి ఇంకా రాష్టం కోలుకోలేదు. భౌగోళికంగా ఒడిశా తుపాన్ల తాకిడిని తప్పించుకోవడం అసాధ్యం. 1891 నుంచి 100కి పైగా తుపాన్లు ఒడిశాను వణికించాయి. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం నవీన్ పట్నాయక్ ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు ► రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేశారు. ఇలా ఒక రాష్ట్రం విపత్తు నిర్వహణ కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయడం అదే మొదటి సారి. జిల్లాలు, బ్లాక్ స్థాయిలో కూడా విపత్తు కమిటీలు ఏర్పాటు చేశారు. 22 వేల గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక యువకుల్ని సభ్యులుగా నియమించారు. తుపాను హెచ్చరికలు అందిన వెంటనే లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే వీరు చేయాల్సిన పని ► రాష్ట్రంలోని 480 కి.మీ. పొడవైన తీర ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లపై ప్రజల్ని అప్రమత్తం చేయడానికి 2018లో ప్రభుత్వం ఎర్లీ వార్నింగ్ డిస్సెమినేషన్ సిస్టమ్ (ఈడబ్ల్యూడీఎస్) ఏర్పాటు చేసింది. తుపాన్లు ముంచుకొస్తే లోతట్టు ప్రాంత ప్రజలకి కనీసం అయిదారు రోజుల ముందే హెచ్చరికలు అందుతాయి. ► తీర ప్రాంతాల్లో నివసించే వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చింది ► ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లో బాగా విస్తరించి సుశిక్షితులైన సిబ్బందిని 20 రెట్లు పెంచింది. వారి దగ్గర 66 రకాల ఆధునిక పరికరాలు అంటే జనరేటర్లు, చెట్లను కట్ చేసే, రోడ్లను శుభ్రం చేసే యంత్రాలు, పడవలు, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ వంటివి ఎప్పుడూ ఉండేలా చర్యలు తీసుకుంది. ► 1999 సూపర్ సైక్లోన్ సమయం నాటికి ఒడిశాలో కేవలం ఆరు జిల్లాల్లో కేవలం 23 శాశ్వత తుపాను శిబిరాలు ఉండేవి. తీర ప్రాంతాల్లో అడుగడుక్కీ బహువిధాలుగా ఉపయోగపడే శిబిరాలు నిర్మించారు. ఇప్పుడు వాటి సంఖ్య 870కి చేరుకుంది. ఒక్కో శిబిరంలో వెయ్యి మంది వరకు తలదాచుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రశంసలు 2013 సంవత్సరంలో ఫాలిని అత్యంత తీవ్రమైన తుపానుగా ఒడిశాను ముంచెత్తింది. అప్పుడు భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ తుపాను సమయంలో లక్షలా ది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఒడిశా ప్రభుత్వ సహాయక చర్యలకు ఐక్యరాజ్యసమితి ఫిదా అయింది. ఒడిశా ప్రభుత్వం చారిత్రక విజయాన్ని సాధించిందని అభినందించింది. కేంద్రం మూడంచెల వ్యవస్థ బిపర్జోయ్ మహా తుపాను గుజరాత్లో విధ్వంసం సృష్టించినా ప్రాణ నష్టం జరగలేదు. దీనికి తుపాన్లపై ముందస్తు సన్నద్ధతే కారణం. తుపాను ముప్పుని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం మూడంచెల వ్యవస్థని ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ పనితీరుతో ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణాలు కాపాడగలిగారు. తుపాన్లు ఎప్పుడు ఏర్పడతాయి? ఏ దిశగా ప్రయాణిస్తాయి, ఎక్కడ తీరం దాటుతాయన్న అంశాలను వారం రోజులు ముందుగానే గుర్తించే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజల్లో తుపాన్లపై అవగాహన పెరుగుతుంది. ఇక రెండో అంచెగా శిబిరాల నిర్మాణం, ప్రజల్ని తరలించడం ఒక యుద్ధంలా చేస్తారు. ఇక మూడో దశలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్లో విద్యుత్ లైన్లు, మంచినీటి పైపుల నిర్మాణం, రైల్వే, విమానాశ్రయాల్లో రాకపోకలు సాగేలా ఏర్పాట్లు వంటి వాటిపై దృష్టి పెట్టింది. ఫలితాలు ఇలా..! ప్రకృతి వైపరీత్యాలతో జరిగే ఆర్థిక నష్టాన్ని నివారించలేకపోయినా ప్రాణలైతే కాపాడగలుగుతున్నాం. గత కొద్ది ఏళ్లలో ఒడిశాను అల్లకల్లోలం చేసిన తుపాన్లలో ప్రాణనష్టం తగ్గుతూ వస్తోంది. -
G7 Summit: ఐరాసను సంస్కరించాల్సిందే
హిరోషిమా: ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలను నేటి వాస్తవాలకు అద్దం పట్టేలా, అవసరాలను తీర్చేలా తక్షణం సంస్కరించుకోవాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. లేదంటే ఐరాస, భద్రతా మండలి వంటివి కేవలం నామమాత్రపు చర్చా వేదికలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఆదివారం జపాన్‌లోని హిరోషిమాలో జీ–7 సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ప్రపంచ శాంతే ప్రధాన లక్ష్యంగా స్థాపించుకున్న ఐరాస యుద్ధాలు, సంక్షోభాలను ఎందుకు నివారించలేకపోతోంది? శాంతి గురించి పలు ఇతర వేదికలపై చర్చించుకోవాల్సిన అవసరం ఎందుకు తలెత్తుతోంది? ఉగ్రవాదపు నిర్వచనాన్ని కూడా ఐరాస ఎందుకు అంగీకరించడం లేదు? ఆలోచిస్తే తేలేదొక్కటే. ఐరాస ప్రస్తుత ప్రపంచపు వాస్తవాలకు అనుగుణంగా లేదు. గత శతాబ్దానికి చెందిన ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు 21వ శతాబ్దపు అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇవన్నీ చాలా సీరియస్‌గా దృష్టి సారించాల్సిన విషయాలు’’ అని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం మానవతకు సంబంధించిన సంక్షోభమని మోదీ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాలను, దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను అందరూ గౌరవించాలని రష్యా, చైనాలను ఉనుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ఏకపక్ష ప్రయత్నాలపై దేశాలన్నీ ఉమ్మడిగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం, లద్దాఖ్ దురాక్రమణకు కొన్నేళ్లుగా చైనా చేస్తున్న యత్నాల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు భారత్ సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తుందని హామీ ఇచ్చారు. దీనికి చర్చలు, రాయబారమే ఏకైక పరిష్కారమని తాము ముందునుంచీ చెబుతున్నామని గుర్తు చేశారు. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ బుద్ధుని బోధల్లో చక్కని పరిష్కారాలున్నాయన్నారు. హిరోషిమా పార్కులోని స్మారక మ్యూజియాన్ని దేశాధినేతలతో కలిసి మోదీ సందర్శించారు. అణుబాంబు దాడి మృతులకు నివాళులర్పించారు. మీకు మహా డిమాండ్! మోదీతో బైడెన్, ఆల్బనీస్ వ్యాఖ్యలు మీ ఆటోగ్రాఫ్ అడగాలేమో: బైడెన్ జీ–7 సదస్సులో భాగంగా జరిగిన క్వాడ్ దేశాధినేతల భేటీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీ దగ్గరికి వచ్చి మరీ ఆత్మీయంగా ఆలింగనంచేసుకుని ముచ్చటించడం తెలిసిందే. మోదీ విషయమై తమకెదురవుతున్న గమ్మత్తైన ఇబ్బందిని ఈ సందర్భంగా బైడెన్ ఆయన దృష్టికి తెచ్చారట. వచ్చే నెల మోదీ వాషింగ్టన్లో పర్యటించనుండటం తెలిసిందే. ఆ సందర్భంగా మోదీ పాల్గొనే పలు కార్యక్రమాల్లో ఎలాగైనా ఆయనతో భేటీ ఏర్పాటు చేయించాల్సిందిగా అమెరికా ప్రముఖుల నుంచి లెక్కలేనన్ని ‘రిక్వెస్టులు’ వచ్చిపడుతున్నాయట! వాటిని తట్టుకోవడం తమవల్ల కావడం లేదని బైడెన్ చెప్పుకొచ్చారు. భేటీలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా తామూ అచ్చం అలాంటి ‘సమస్యే’ ఎదుర్కొంటున్నామంటూ వాపో యారు! మోదీ మంగళవారం ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో 20 వేల మంది సామర్థ్యమున్న స్టేడియంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. దానికి టికెట్లు కావాలని లెక్కకు మించిన డిమాండ్లు, రిక్వెస్టులు వచ్చి పడుతున్నాయని ఆల్బనీస్ చెప్పుకొచ్చారు. ఇటీవలి భారత్ పర్యటన సందర్భంగా గుజరాత్లో 90 వేల మంది సామర్థ్యంతో కిక్కిరిసిన స్టేడియంలో తామిద్దరం ఎలా ప్రజలకు అభివాదం చేసిందీ గుర్తు చేసుకున్నారు. దాంతో బైడెన్ స్పందిస్తూ బహుశా తాను మోదీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలేమో అంటూ చమత్కరించారు! గత మార్చిలో భారత్–ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌ను మోదీ, ఆల్బనీస్ ప్రారంభించడం తెలిసిందే. -
Sudan Crisis: 72 గంటలపాటు కాల్పుల విరమణ!
ఖార్తోమ్: సూడాన్‌లో సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరు వర్గాల జనరల్స్.. మూడు రోజుల పాటు కాల్పుల విమరణపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. గత పదిరోజులుగా సూడాన్ ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు నడుమ అక్కడ పోరు జరుగుతోంది. నడుమ 400 మందికి పైగా సాధారణ పౌరులు మరణించగా.. దాదాపు నాలుగు వేల మంది గాయపడ్డారు. భారీ ఎత్తున్న విదేశీయులు తమ తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. అయితే.. 48 గంటల పాటు జరిగిన తీవ్ర చర్చల తర్వాత.. సుడానీస్ సాయుధ దళాలు (SAF) - ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కాల్పుల విరమణకు ముందుకు వచ్చాయని బ్లింకెన్ వెల్లడించారు. ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా 72 గంటల పాటు కాల్పుల విరమణను అమలు చేయడానికి అంగీకరించాయని తెలుస్తోంది. సంధి అమలు కావడానికి రెండు గంటల ముందే బ్లింకెన్ ప్రకటన వెలువడడం విశేషం. ఈ మూడు రోజుల్లో పౌరుల తరలింపు ప్రక్రియ వేగవంతం కానుంది. శనివారం నుంచి విదేశీయుల తరలింపు ప్రారంభం కాగా, ఇప్పటిదాకా సుమారు నాలుగు వేల మందికి పైగా స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే లక్షల మంది సూడాన్ పౌరులు మాత్రం అక్కడి దీనపరిస్థితుల్లో మగ్గిపోతున్నారు. ప్రస్తుతం అక్కడ తాగునీరు, ఆహారం, మందులు, ఇంధన వనరుల కొరత, విద్యుత్ కోత కొనసాగుతోంది. అలాగే ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించారు. ఈ తరుణంలో ఎటు పోవాలో పాలుపోని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అగాధంలోకి సూడాన్.. సాయుధ బలగాల నడుమ జరుగుతున్న ఆ ఆధిపత్య పోరును.. ఐక్యరాజ్య సమితి తీవ్రంగా తప్పుబట్టింది. అత్యంత పేద దేశమైన సూడాన్ ఈ పోరుతో అగాధంలోకి కూరుకుపోతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. అంతేకాదు కాల్పుల విరమణకు ఆయన పిలుపు ఇచ్చారు. ఐరాస తరపున పలు విభాగాలు సూడాన్ పౌరులను సరిహద్దులకు దేశాలకు సురక్షితంగా తరలించే యత్నంలో ఉన్నాయి. మరోవైపు సూడాన్ అంశంపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి బ్రిటన్ విజ్ఞప్తి చేస్తోంది. మంగళవారం ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్స్‌ను ఆర్మీలో విలీనం చేయాలనే ప్రతిపాదన.. ఈ రెండు వర్గాల నడుమ ఘర్షణలకు దారి తీసింది. సూడాన్ రాజధాని ఖార్తోమ్తో పాటు దేశంలో పలు చోట్ల ఈ ఘర్షణలు కొనసాగుతుండగా.. సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ కావేరీ.. మనోళ్ల కోసమే! -
భారత్‌పై బిలావల్ ఆక్రోశం
ఐక్యరాజ్యసమితి: కశ్మీర్‌ను పాలస్తీనాతో పోలుస్తూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మరోసారి నోరుపారేసుకున్నారు. ‘‘రెండుచోట్లా పరిస్థితులు ఒక్కటే. రెండు సమస్యలనూ ఐరాస ఇప్పటికీ పరిష్కరించలేదు. కశ్మీర్‌ను ఐరాస ప్రధాన ఎజెండాలోకి తీసుకురాకుండా భారత్ పదేపదే అడ్డుపడుతోంది’’ అంటూ వాపోయారు. భారత్‌ను గురించి మాట్లాడే క్రమంలో ఒకసారి మిత్రదేశం, మరోసారి పొరుగుదేశం అంటూ ఆయన తడబాటుకు గురయ్యారు. -
జన ధన భారత్! 2023లో రికార్డు దిశగా.. 1950లో మన జనాభా ఎంతో తెలుసా?
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఈ ఏడాదే భారత్ అవతరించబోతోంది. 2011 తర్వాత మన దేశంలో జనాభా వివరాల సేకరణ జరగలేదు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఐక్యరాజ్యసమితి (యూఎన్వో) జనాభా లెక్కల కోసం పాటించే సూత్రాన్ని అనుసరించి ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ ఏడాది ఏప్రిల్ నెల నాటికి భారత జనాభా చైనాను అధిగమించనుందని అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితి 1950లో ప్రపంచ జనగణన మొదలు పెట్టినప్పటి నుంచీ అధిక జనాభాగల దేశంగా పేరుపడిన చైనా ఇంకో రెండు నెలల్లో ఆ హోదాను కోల్పోబోతోందని ప్యూ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. –దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి 72 ఏళ్లలో 100 కోట్లు.. ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనగణన చేసిన తొలి సంవత్సరం 1950లో భారత జనాభా 35.3 కోట్లు. ఇప్పుడది 140 కోట్లకు చేరినట్లు ‘ప్యూ’అంచనా. అంటే గత 72 ఏళ్లలో దేశ జనాభా 100 కోట్లకుపైగా పెరిగింది. ఇది మొత్తం యూరప్ దేశాల జనాభా (74.4 కోట్లు) కంటే అధికం. ఉత్తర, దక్షిణ, అమెరికా ఖండాల కంటే (100 కోట్లు) కూడా ఎక్కువే. చైనాలో ప్రస్తుత జనాభా 140 కోట్లుగా ఉన్నా.. అక్కడ కొన్నేళ్లుగా జనాభా పెరుగుదల మందగించింది. కానీ భారత్‌లో మాత్రం ఎప్పటి మాదిరిగానే పెరుగుతోంది. యూఎన్వో అంచనా ప్రకారం.. భారత దేశ జనాభా ఈ దశాబ్ధం చివరికి 150 కోట్లకు, 2064 నాటికి 170 కోట్లకు చేరుకుంటుంది. అక్కడి నుంచి జనాభా పెరుగుదల మందగిస్తుంది. యంగ్ ఇండియా ►భారత జనాభాలో 25 ఏళ్ల కన్నా తక్కువ వయసున్నవారు 40 శాతంపైగా ఉన్నారు. జనాభా సగటు వయసు 28 ఏళ్లు. అదే అమెరికాలో 38, చైనాలో 39 ఏళ్లు. అంటే ఇండియాలో ప్రతి పది మందిలో నలుగురికిపైగా పాతిక సంవత్సరాలలోపు వయసువారే. ►మరోవైపు అధిక జనాభా ఉన్న చైనా, అమెరికా దేశాల్లో వయసుపై బడిన వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. 65 ఏళ్లు దాటిన వారు భారత జనాభాలో కేవలం 7.1 శాతం మాత్రమే. వీరి సంఖ్య భారత జనాభాలో 2063 నాటికి 20 శాతం, 2100 నాటికి 30 శాతానికి మాత్రమే పెరుగుతుంది. అంటే ఈ శతాబ్దం చివరి వరకు భారత్ యువ భారతంగానే ఉంటుందన్న మాట. ఇంకా భారతదేశంలో పాతికేళ్లలోపు వారి సంఖ్య 2078 నాటికి కానీ 65 ఏళ్ల పైబడిన వారి సంఖ్యను దాటే అవకాశం లేదన్నది యూఎన్ అంచనా. జననాల్లోనూ వేగమే.. చైనా, అమెరికాలతో పోలిస్తే భారత్‌లో జననాల రేటు కూడా అధికమే. ప్రస్తుతం సగటున భారత మహిళ తన జీవితకాలంలో 2.0 పిల్లలకు జన్మనిస్తోంది. అదే చైనాలో 1.2, అమెరికాలో 1.6గా ఉంది. అయితే గతంతో పోలిస్తే భారత దేశంలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 1992లో జననాల రేటు 3.4, 1950లో ఏకంగా 5.9 ఉండేది. భారత్‌లో అన్ని మతస్తుల్లోనూ జననాల రేటు తగ్గుతూనే ఉంది. ముస్లింలలో జననాల రేటు 1992లో 4.4గా ఉంటే.. 2019 కల్లా అది 2.4కి తగ్గింది. హిందువుల్లో 3.3 నుంచి 1.9కు, క్రిస్టియన్లలో 2.9 నుంచి 1.9కు, సిక్కుల్లో 2.4 నుంచి 1.6కు తగ్గింది. అయితే పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో శిశు జననాల రేటులో తేడాలు ఉన్నాయి. పట్టణాల్లో ప్రతి మహిళకు సగటున 1.6 శిశువులు జన్మిస్తే.. గ్రామాల్లో 2.1 మంది జన్మిస్తున్నారు. అదే 20 ఏళ్ల క్రితం సగటు పట్టణాల్లో 2.7, గ్రామాల్లో 3.7 మందిగా ఉండేది. ఇక జనాభా పెరుగుదల విషయంలోనూ ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉంది. 2001–2011 మధ్య మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌లలో జనాభా పెరుగుదల 25 శాతం ఉంటే.. గోవా, కేరళలో 10 శాతం మాత్రమే ఉందని భారత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు చెప్తున్నాయి. అదే నాగాలాండ్‌లో అయితే 0.6 శాతం జనాభా తగ్గింది. తగ్గుతున్న లింగభేదం 70వ దశకంలో లింగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచ్చిన తరువాత బాల బాలికల సంఖ్యలో వ్యత్యాసం పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 111 మంది బాలురకి 100 మంది మాత్రమే బాలికలు ఉన్నట్లు తేలింది. తర్వాత వ్యత్యాసం తగ్గుతూ వస్తోంది. కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015 నాటికి బాల బాలికల వ్యత్యాసం 109–100కి తగ్గింది. 2019 నాటికి 108 మంది అబ్బాయిలకు 100 మంది అమ్మాయిలు ఉన్నట్టు వెల్లడైంది. లింగభేదంతో పాటు శిశు మరణాలు కూడా బాగా తగ్గుతూ వస్తున్నాయి. 1990లో ప్రతి వెయ్యిమంది శిశువులకు 89 మంది మరణించేవారు. అదే 2020 వచ్చే నాటికి 27 మందికి తగ్గింది. ఐరాస ఆధ్యర్యంలో పనిచేస్తున్న గ్రూప్ యూఎన్ఐజీ 1960 నుంచి ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాల సమాచారాన్ని సేకరిస్తోంది. అయితే శిశుమరణాల విషయంలో భారత్ పొరుగు దేశాలతో పోలిస్తే వెనుకబడే ఉంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ప్రతి వెయ్యిమంది శిశువులకు 24 మంది, నేపాల్‌లో 24, భూటాన్‌లో 23, శ్రీలంకలో ఆరుగురు మరణిస్తున్నారు. చైనాలో 6, అమెరికాలో ఐదుగురు శిశువులు పుట్టుక సమయంలోనే అసువులుబాస్తున్నారు. వెళ్లేవారే ఎక్కువ.. వలసలు కూడా దేశ జనాభాను ప్రభావితం చేస్తాయి. జనాభాను పెంచుకోవడం కోసం అనేక దేశాలు వలసదారుల్ని, శరణార్థులను ఆహ్వానిస్తున్నాయి. జనాభాను సంపదగా భావిస్తున్నాయి. పనిచేయగల సత్తా ఉన్న వారికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. అయితే భారతదేశానికి ఇతర దేశాల నుంచి వలస వస్తున్న వారి కంటే ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఒక్క 2021లోనే భారత్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు మూడు లక్షల మంది ఉన్నారు. అనేక సందర్భాల్లో భారత్‌కు వలస వచ్చిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిన దాఖలాలు ఉన్నాయి. 2016లో దాదాపు 68,000 మంది భారత్‌కు శరణుకోరి వచ్చారు. వీరిలో అధిక శాతం మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలే. ఏదేమైనా ఈ శతాబ్దం చివరి వరకు భారత్ నుంచి వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంటుందని ఐక్యరాజ్యసమితి జనాభా వివరాల విభాగం అంచనా వేసింది. -
విద్యావిధానం అమలులో ఏపీ భేష్
స్విట్జర్లాండ్‌లోని జెనీవా ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, విద్యా విధానం బాగున్నాయని కొనియాడారు. మంచి ప్రాథమిక విద్య, శిక్షణ, స్థిరమైన అభివృద్ధికి కీలకం అనే అంశంపై స్విట్జర్లాండ్ దేశం జెనీవా లో ఉన్న ఐక్యరాజ్య సమితి కార్యాలాయంలో జరిగిన కార్యక్రమంలో ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఇండియా నుంచి ఐక్యరాజ్య సమితి పర్మినెంట్ మెంబర్ వున్నవ షకిన్ కుమార్ (united nations special consultative status member) పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పేద విద్యార్ధుల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న విద్య గురించి ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమంలో ప్రస్తావించారు. కరోనా తర్వాత దేశాల్లో ఉన్నటువంటి గడ్డు పరిస్ధితులను మీటింగ్‌లో పలువురు ప్రతినిధులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విద్యావ్యవస్థలు పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పధకాల స్టాల్‌ను సందర్శించిన స్విట్జర్లాండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ జనరల్ పాట్రిసియా దన్జీ ప్రభుత్వ పధకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీలో విద్య కోసం నాడు-నేడులో తీసుకున్న నిర్ణయాలు, అమలు జరుగుతున్న విద్యాప్రమాణాలను తెలుసుకుని అభినందించారు. నాడు-నేడులో భాగంగా డిజిటల్ లెర్నింగ్, నాణ్యతమైన విద్యలో భాగంగా విద్యార్ధులకు ప్రభుత్వం అందజేస్తున్నటువంటి కంప్యూటర్ ట్యాబ్‌లు పంపిణీ, శిధిలావస్ధలో ఉన్నటువంటి పాఠశాలలను ఆధునీకరించడం, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి ఆధునిక పద్ధతుల్లో నూతన విద్యావిధాన బోధన వంటివి పేదవిద్యార్ధులకు ఎంతో మేలు చేస్తుందని వారన్నారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించడంతో సమాజంలో అన్ని వర్గాల వారు విద్యనభ్యసిస్తారన్నారు. విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంలో న్యూట్రీషన్ ఫుడ్ అందించడం వంటివి బాగున్నాయన్నారు. లైబ్రరీ, ప్లేగ్రౌండ్స్, హైజెనిక్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్, యూనిఫాం, స్టేషనరీ కిట్స్, బుక్స్ అందిస్తున్న విధానం చాలా బాగుందన్నారు. ఎస్పెషల్లీ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్ అనేది చాలా నచ్చిందన్నారు పాట్రిసియా దన్జీ. యూఎన్ఓలో ఆంధ్రప్రదేశ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టాల్‌ను ఇంటర్నేషనల్ యూనిసెఫ్ ప్రోగ్రామ్స్ స్పెషలిస్ట్ అతెనా లౌబాచెర్ సందర్శించారు. లింగ అసమానతలను పోగెట్టేలా ఆడపిల్లకు అందిస్తున్న గర్ల్స్ ఎడ్యుకేషన్ విధానాన్ని అభినందించారు. దీని ద్వారా అమ్మాయిలకు విద్య అనేది చాలా ముఖ్యమనదన్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్ బెస్ట్ గా ఉందన్నారు. బైజ్యూస్ ద్వారా అందిస్తున్న విద్యా విధానం నూతన పద్ధతుల్లో విద్యా విధానం అనేది బాగుందన్నారు. -
మా ‘విడాకులు’ తెగుతున్నాయి
విశాఖ ప్రాంతానికి చెందిన దంపతులు 30 ఏళ్లు కుటుంబ బాధ్యతల్లో ఎంతో గొప్పగా మెలిగారు. భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాగా.. ఆయన భార్య కొడుకు స్థిరపడ్డాక సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. ఇదే వీరిద్దరి మధ్య మూడు దశాబ్దాల బంధాన్ని విచ్ఛిన్నం చేసింది. తనకు విడాకులు ఇప్పించాలంటూ అతడి భార్య కోర్టుకెళ్లారు. విజయవాడ ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల ప్రియాంక తన 31 ఏళ్ల వైవాహిక బంధం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబంలో కలతలు ఉన్నా పిల్లల పెంపకం కోసం సర్దుకుపోయానని.. అయినా భర్త తనను అర్థం చేసుకోవడం లేదని పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు పాశ్చాత్య దేశాలకే పరిమితం. ఇప్పుడు మన దేశంలోని పట్టణాలకూ ఇది పాకింది. నడివయసు దాటిన వారు.. వైవాహిక జీవితంలో కొందరు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతుంటే.. చాలామంది విడిగా ఉంటున్నారు. సాక్షి, అమరావతి: పాతికేళ్ల వైవాహిక జీవితం గడిపినవారు విడిపోవడాన్ని ‘సిల్వర్ డైవర్సీ’ లేదా ‘గ్రే డైవర్సీ’గా చెబుతారు. రాష్ట్రంలోని ఒక్క విశాఖ జిల్లాలోనే కుటుంబ న్యాయస్థానానికి ఏటా 3 వేలకు పైగా విడాకుల కేసులు వస్తుండగా.. వాటిలో కనీసం 15 నుంచి 20 శాతం వరకు 25 ఏళ్లకు మించి వైవాహిక జీవితం గడిపిన జంటలు ఉంటున్నాయి. వివాహ బంధాన్ని ఎంతో పవిత్రంగా భావించే మన దేశంలో నడివయసు దాటినవారు విడిపోవాలని కోరుకుంటున్న తీరుపై ఐక్యరాజ్య సమితి (యూఎన్వో) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. యూఎన్వో ‘ప్రోగ్రెస్ ఆఫ్ ది వరల్డ్స్ ఉమెన్ రిపోర్టు–2010’ ప్రకారం భారతదేశంలో 45–49 ఏళ్ల వయసు మహిళల్లో విడాకులు తీసుకుంటున్న వారు 1.1 శాతం ఉండగా.. 2019–20 నాటికి రెండింతలైనట్టు అంచనా వేసింది. అపోహలు.. అనర్థాలతో తెగదెంపులు మన దేశంలోనూ విడాకులు కోరుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. వీరిలో వృద్ధాప్యానికి చేరువైన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ‘భర్తను, ఇద్దరు బిడ్డలను మెప్పించేందుకు ఎంతో శ్రమించాను. భర్త, పిల్లలు సహా నన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు. ఇన్నేళ్ల నా సంసార జీవితంలో నాకంటూ ఏమీ లేదు. బాగా అలసిపోయాను. అందుకే విడాకులు తీసుకుంటున్నాను’ అంటున్న వారు ఎక్కువ మందే కనిపిస్తున్నారు. ‘ఉద్యోగరీత్యా ఇన్నేళ్లూ ఊళ్లు పట్టుకు తిరుగుతూ భార్యాబిడ్డల్ని పుట్టింట్లోనే ఉంచేశారు. ఏ అవసరం వచి్చనా మీరు నా పక్కన లేరు. ఇప్పుడు రిటైరై తిరిగొచ్చాక మీ అవసరం నాకు ఏముంటుంది’ అంటూ ఓ భార్య వైవాహిక బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య జరిగే మాటల యుద్ధం, బంధువులు, సన్నిహితులు ఇచ్చే ఉచిత సలహాలు బంధాలను విచి్ఛన్నం చేస్తున్నాయంటున్నారు సైకాలజిస్టులు. ఇటీవల 50 ఏళ్లు దాటిన వారిలో ఇది ఎక్కువ కనిపిస్తోందంటున్నారు. స్త్రీ, పురుషుల్లో ఆర్థిక స్వేచ్ఛ, ప్రపంచ సంస్కృతులు ఇందుకు కారణమవుతున్నాయంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. విడాకుల కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానం, గుజరాత్ రెండు, పశి్చ మ బెంగాల్ మూడు, ఉత్తర ప్రదేశ్ నాలుగు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉన్నాయి. ఒకరి ఉనికిని మరొకరు గౌరవించుకోవాలి గతంలో పురుషులు సంపాదించాలి.. స్త్రీ ఇల్లు చక్కదిద్దాలని ఉండేది. మన సమాజంలో సంపాదించే స్థాయిలో ఉన్నవారు ఇల్లు చూసుకునే వారికి విలువ ఇవ్వరు. అక్కడే సమస్య మొదలవుతుంది. ఏళ్ల తరబడి మనసులో ఉన్న అసహనం పెల్లుబుకుతుంది. అప్పటికీ పిల్లల భవిష్యత్ కోసం మానసిక క్షోభను భరిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఒకరి ఉనికిని మరొకరు గౌరవించుకుంటే ఇబ్బంది రాదు. కానీ జరుగుతున్నది వేరు. అందువల్ల పిల్లలు స్థిరపడ్డాక విడిపోయేందుకు భార్యాభర్తలు సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేస్తే విడిపోయే ప్రసక్తి ఉండదు. – డాక్టర్ జి.పద్మజ, విభాగాధిపతి, సెంటర్ ఫర్ హెల్త్ సైకాలజీ హెచ్ఓడీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విడాకులు బాగా పెరిగాయి గతంతో పోలిస్తే పట్టణాల్లో ఆరి్థక స్వేచ్ఛ పెరిగింది. సంపాదనలో ఆడ, మగా సమానంగా ఉంటున్నారు. కుటుంబంలో సమస్య వచి్చనప్పుడు సర్దుబాటు చేసుకోవడం లేదు. తక్కువ వయసులో వివాహం చేసుకున్న వారిలో ఎక్కువ మంది విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. అదే 35 ఏళ్లు తర్వాత పెళ్లి చేసుకున్న వారిలో ఈ సమస్య కనిపించడం లేదు. రెండో పెళ్లిళ్లు కుదిర్చేందుకు 1997లో మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశాం. అప్పట్లో తక్కువ వయసు వారే రెండో వివాహ సంబంధానికి వచ్చేవారు. ఇప్పుడు నెలకు 10–12 మంది సంప్రదిస్తుంటే వారిలో కనీసం నలుగురు 50–55 ఏళ్లు పైబడి, విడాకులు తీస్తున్నవారు ఉంటున్నారు. ఇటీవల మహిళలు కూడా ఎక్కువగా వస్తున్నారు. – పి.వెంకట్‌రెడ్డి, తోడు–నీడ మ్యారేజ్ బ్యూరో -
ఉగ్ర అడ్డాగా పాక్
ఐక్యరాజ్యసమితి: ఉగ్రవాదానికి పాకిస్తాన్‌ను కేంద్ర స్థానంగా ప్రపంచ దేశాలన్నీ పరిగణిస్తున్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ‘‘పాక్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఉగ్రభూతాన్ని పెంచి పోషించడం మానుకోవాలి’’ అంటూ హితవు పలికారు. ‘‘ఉగ్రవాదం ఎక్కడ పురుడు పోసుకుందో ప్రపంచమంతటికీ తెలుసు. పామును ఇంట్లో పెంచుకుంటే ఎప్పటిౖMðనా కాటేయడం ఖాయమని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అప్పట్లో పాక్‌ను హెచ్చరించారు’’ అని గుర్తుచేశారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో ‘అంతర్జాతీయ ఉగ్రవాదం, సవాళ్లు, పరిష్కార మార్గాలు’ అంశంపై భేటీకి మంత్రి నేతృత్వం వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆసియాలో, ఇతర ప్రాంతాల్లో ఉగ్ర దాడుల వెనుక ఉన్నదెవరో అందరికీ తెలుసన్నారు. దక్షిణాసియాలో ఉగ్రవాదం ఎప్పుడు అంతమవుతుందని పాక్ జర్నలిస్టు ప్రశ్నించగా ‘మీ దేశ మంత్రులనే అడగండి’ అని బదులిచ్చారు. -
భారత్ సూచనతో చిరుధాన్యాల సంవత్సరం ప్రారంభం
రోమ్: అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం–2023 మంగళవారం అధికారికంగా ప్రారంభమైంది. ఇటలీలోని రోమ్‌లో ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎఫ్ఏవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభతో పాటు ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వలిన్ హ్యుగ్స్ పాల్గొని ప్రత్యేక చిహ్నాన్ని ఆవిష్కరించారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐరాస సర్వసభ్య సమావేశం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వాతావరణ మార్పుల్ని దీటుగా ఎదుర్కొని పౌష్టికాహార, ఆరోగ్య భద్రతను కలిగించే శక్తి చిరుధాన్యాలకు ఉందని.. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో వినియోగదారులు, రైతులు, పాలకులను చైతన్యపరిచి కార్యోన్ముఖుల్ని చేయటమే తమ లక్ష్యమని ఎఫ్ఏవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు ఈ సందర్భంగా అన్నారు. చిరుధాన్యాలు తరతరాలుగా భారతీయ సమాజానికి ఆహార భద్రతను కల్పిస్తున్నాయని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. మోదీ సందేశాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ చదివి వినిపించారు. ఇదీ చదవండి: పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే: ఐక్యరాజ్యసమితి -
షాకింగ్! మంచి తిండికి దూరంగా 300,00,00,000 మంది
- కంచర్ల యాదగిరిరెడ్డి తిండి కలిగితే కండగలదోయ్... కండ కలవాడేను మనిషోయ్.. అని మహాకవి ఎప్పుడో చెప్పాడు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొద్దోగొప్పో అందరూ తిండి తినడమైతే తింటున్నారు కానీ, ఈ భూమి మీద సుమారు 300 కోట్ల మంది ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారానికి దూరంగా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ఈ విషయాన్ని స్పష్టం చేయడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 138 దేశాల సమాచారాన్ని ఈ సంస్థ విశ్లేషించింది. తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికల్లా భూమ్మీద ఆకలన్నది లేకుండా చేయాలని ఎఫ్ఏఓ తీర్మానం చేసుకుంది. అయితే ఏటేటా ఆరోగ్యకరమైన తిండికి దూరమవుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడాదిలో11.2 కోట్ల పెరుగుదల తిండి లేని పేదల గురించి తరచూ వార్తలు వస్తుంటాయి కానీ, తిన్న తిండితో ఆరోగ్యంగా ఉండలేని వారి గురించి తెలిసింది తక్కువే. ఈ క్రమంలోనే ఎఫ్ఏఓ ప్రతి దేశంలో ఆరోగ్యకరమైన తిండి తినగలిగిన వాళ్లు ఎంతమంది? అసలు ఆరోగ్యకరమైన తిండి అంటే ఏమిటన్నది తెలుసుకుని వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం 2020లో ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేని వారి సంఖ్య 300 కోట్లు. 2019 గణాంకాలతో పోలిస్తే 11.2 కోట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం ఆహారపు ధరలు పెరగడమేనని సంస్థ చెపుతోంది. ఈ మేరకు ఆదాయం పెరగకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించింది. దీని ప్రభావం ధనిక దేశాలపై కాకుండా, ఆహార ద్రవ్యోల్బణం అదుపు తప్పడం ద్వారా పేద దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుందని తేల్చి చెప్పింది. శక్తి అవసరాలను తీర్చగలగాలి ఒక మనిషి రోజువారీ శక్తి అవసరాలను తీర్చగలిగేదే ఆరోగ్యకరమైన ఆహారమని ఎఫ్ఏఓ నిర్వచిస్తోంది. అలాగే ఆయా దేశాల్లో నిర్వచించుకున్న పౌష్టికాహార మార్గదర్శకాలనూ సంతృప్తి పరచాలి. ఉదాహరణకు భారత్‌లో ప్రతి ఒక్కరు రోజుకు కనీసం 400 గ్రాముల కాయగూరలు, పండ్లు తినడం అవసరమని జాతీయ పోషకాహార సంస్థ పేర్కొంటోంది. చాలామంది ఈ స్థాయిలో వీటిని తీసుకోవడం లేదు. పైగా ఈ మోతాదుల్లో కాయగూరలు, పండ్లు తీసుకునే స్థోమత కూడా కొందరికి ఉండదు. ఒక కుటుంబం రోజువారీ ఆదాయంలో 52% లేదా అంతకంటే ఎక్కువను ఆహారానికి వెచి్చంచాల్సిన పరి స్థితి ఉంటే, దాన్ని స్థోమతకు మించిందిగా ఎఫ్ఏఓ చెపుతోంది. ఆఫ్రికాలోనే సగం దేశాలు సర్వే చేసిన 138 దేశాల్లో కనీసం 52 దేశాల జనాభాలో సగం మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత లేదని ఎఫ్ఏఓ సర్వే వెల్లడించింది. ఇందులో అత్యధికం ఆఫ్రికా ఖండంలో ఉండగా మిగిలినవి ఆసియా, ఓషియానా, ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఉన్నాయి. ఆహార కొరత అన్నది ఆఫ్రికా ఖండంలో ఎప్పుడూ సమస్యే కానీ, సహారా ఎడారి పరిసర దేశాల్లోని జనాభాలో 90 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. కరువు ప్రాంతాల్లో మూడింట ఒక వంతు ఇక్కడే ఉండటం, వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల ఆహార ధరలు భారీగా హెచ్చుతగ్గులకు గురవుతుండటం ఈ పరిస్థితికి కారణమని ఎఫ్ఏఓ విశ్లేషించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని ఇప్పుడు ఆఫ్రికా దేశాలకు గోధుమ దిగుమతులు సగం కంటే ఎక్కువ పడిపోయాయి. ఫలితంగా చాలా దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం అధికమైంది. సమస్యను మరింత జటిలం చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత లేని వారు ఒక్క భారత దేశంలోనే 97.3 కోట్ల మంది ఉన్నట్లు ఎఫ్ఏఓ దగ్గర ఉన్న సమాచారం చెపుతోంది. ఆసియా మొత్తం మీద 189 కోట్లు, ఆఫ్రికాలో సుమారు 100 కోట్ల మంది ఉన్నారు. అమెరికా, ఓషియానాల్లో సుమారు 15.1 కోట్ల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆజర్బైజాన్, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాత్రమే జనాభా మొత్తం పుష్టికరమైన ఆహారాన్ని కొనుక్కోగల స్థితిలో ఉన్నట్లు ఆ సర్వే నివేదిక తెలిపింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాల్లో 95 శాతం ప్రజలు కూడా మంచి స్థితిలోనే ఉన్నారు. పెరుగుతున్న జనాభా కూడా కారణమే ఆరోగ్యకరమైన ఆహారం అందుకునే స్థోమత లేకపోవడానికి పెరుగుతున్న జనాభా కూడా ఒక కారణం. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనుంది. 2050 నాటికి ఇది ఇంకో 35 శాతం పెరగనుంది. అంటే సుమారు 250 కోట్ల మందికి అదనంగా ఆహారం అవసరం. ఈ డిమాండ్‌ను తట్టుకోవాలంటే పంట దిగుబడులు ఇప్పుడున్న స్థాయికి రెట్టింపు కావాలి’అని యునైటెడ్ నేషన్స్ తరఫున అధ్యయనంలో పాల్గొన్న స్టాన్‌ఫర్డ్ వర్సిటీ ఎకనామిక్స్ విభాగం హెడ్ అబ్రమిస్కీ అన్నారు. పెరిగిపోతున్న జనాభాకు తగినంత ఆహారం పండించాలన్నా, పండించిన ఆహారం ప్రజల కడుపులు నింపడం మాత్రమే కాకుండా తగిన పుష్టిని ఇవ్వాలన్నా పలు రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు అవసరమని పేర్కొంటూ యూఎన్‌కు ఆయన ఓ నివేదిక కూడా అందజేశారు. ‘ఆహార వృథాను తగ్గించాలి’ ఆహార వృథాను వీలైనంత వరకూ తగ్గించడం. పండిన పంట వినియోగదారుడి చేతికి చేరేలోపు జరుగుతున్న వృథాను గణనీయంగా తగ్గించడం ద్వారా ఉన్న ఆహారాన్ని ఎక్కువమందికి చేరేలా చేయవచ్చునని ఐరాస ఇటీవల తన సభ్యదేశాలకు సూచించింది. వాతావరణ మార్పులను తట్టుకోగల రీతిలో కొత్త కొత్త వంగడాల సృష్టి, ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే భవిష్యత్తు ఆహార సవాళ్లను ఎదుర్కోగలమని నిపుణులు అంటున్నారు. పరిస్థితిని దిగజార్చిన కోవిడ్ ఆకలి కారణంగా 2018లో ఐదేళ్లు నిండకుండానే మరణించిన పిల్లల సంఖ్య 53 లక్షలు. 2020లో విడుదలైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ విషయం చెపుతోంది. ► ఐక్యరాజ్య సమితి నిర్దేశించినసుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో రెండోది‘జీరో హంగర్’. 2030 నాటికి ఆకలిని చెరిపేసేందుకు చేసుకున్న తీర్మానం ఇది. ► కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ప్రపంచమిప్పుడు ‘జీరో హంగర్’లక్ష్యాన్ని అందుకోలేని స్థితిలో ఉంది. ఒకపక్క వాతావరణ సమస్యలు సవాళ్లు విసురుతుండగా, కోవిడ్ పరిస్థితిని మరింత దిగజార్చింది. సమాజంలోని అసమానతలను ఎక్కువ చేయడం ద్వారా మరింత మంది ఆకలి కోరల్లో చిక్కుకునేలా చేసింది. ►ప్రపంచం మొత్తమ్మీద ఏటా 400 కోట్ల టన్నుల ఆహారం ఉత్పత్తి అవుతుండగా, ఇందులో 33 శాతం వృథా అవుతోంది. దీని విలువ ఏకంగా 60 లక్షల కోట్ల రూపాయలు. అభివృద్ధి చెందిన దేశాల్లో తినే ఆహారం ఎక్కువగా వృథా అవుతుండగా, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో పంటనష్టాలు ఎక్కువ. డిమాండ్‌కు తగ్గ ఆహారం కోసం.. ఆకలిని ఎదుర్కొనేందుకు మన దేశంలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే అనేక పథకాలు ఆచరణలో ఉన్నాయి. వాటిలో కొన్ని.. 1.నేషనల్ న్యూట్రిషన్ మిషన్: పోషణ్ అభియాన్ అని పిలిచే ఈ పథకాన్ని 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో పోషకాహార లోపాలను తగ్గించడం, రక్తహీనత, తక్కువ బరువున్న పిల్లలు పుట్టడాన్ని నివారించడం ఈ పథకం ఉద్దేశం 2. జాతీయ ఆహార భద్రత పథకం: 2007లో నేషనల్ డెవలప్మెంటల్ కౌన్సిల్ ప్రారంభించిన పథకం ఇది. 11వ పంచవర్ష ప్రణాళిక ముగిసే సమయానికి దేశంలో వరి ఉత్పత్తి రెండు కోట్ల టన్నులు అధిమించగా, గోధుమల ఉత్పత్తి 80 లక్షల టన్నులకు చేరుకుంది. కాయధాన్యాల దిగుబడి 20 లక్షల టన్నుల పైచిలుకుకు చేరుకుంది. 12వ పంచవర్ష ప్రణాళికలోనూ లక్ష్యానికి మించి దిగుబడులు సాధించాం. భవిష్యత్తులోనూ డిమాండ్‌కు తగ్గ ఆహారాన్ని పండించేందుకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ పలు వ్యూహాలను సిద్ధం చేసి అమలు చేస్తోంది. 3. రెండేళ్ల లోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాలను తగ్గించేందుకు, ఏడాది పొడవునా మంచి ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా చేసేందుకు ప్రభుత్వం జీరో హంగర్ పేరుతో ఇంకో పథకాన్ని అమలు చేస్తోంది. పోషకాహార లోపాలను అధిగమించేందుకు ఆహారానికి పోషకాలు జోడించడం కూడా ప్రభుత్వ ప్రయత్నాల్లో ఒకటి. -
జీవనదులు విలవిల
అమెరికాతో సహా యూరప్, ఆసియా ఖండాల్లోని పలు దేశాలు తీవ్ర దుర్భిక్షం బారిన పడుతున్నాయి. పెచ్చుమీరిన వేసవి తాపం, అత్తెసరు వర్షపాతం, నానాటికీ పెరిగిపోతున్న భూతాపం దెబ్బకు మహా మహా నదులన్నీ అక్షరాలా మటుమాయమే అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరార్ధ గోళం కనీవినీ ఎరుగని సంక్షోభంలో చిక్కి కొట్టుమిట్టాడుతోంది. పారిశ్రామిక, ఆహార ధాన్యాల ఉత్పత్తులు, సరుకు రవాణా, జల విద్యుదుత్పత్తి రంగాలన్నీ కుదేలవుతున్నాయి. ఈ దుర్భిక్షం గత 500 ఏళ్లలో ఎన్నడూ చూడని విపరిణామాలకు కారణమవుతోంది. 230 కోట్ల మందికి నీటి కొరత జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చైనా, అమెరికా, ఇరాక్ వంటి దేశాల్లో నిత్యం నిండుగా ప్రవహించే జీవనదులన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. దాంతో వాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు కూడా గుడ్లు తేలేస్తున్నాయి. ఫలితంగా కోట్లాదిమంది తాగు, సాగు నీటికి అల్లాడుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా దేశాలను వేధిస్తున్న ఆహార ధాన్యాల కొరత కాస్తా ఈ కరువు దెబ్బకు రెట్టింపైంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 230 కోట్ల మంది నీటి కొరత బారిన పడ్డట్టు ఐరాస నివేదికచెబుతోంది. లానినో పరిస్థితుల దెబ్బకు యూరప్‌లో 47 శాతంపై దుర్భిక్షం ఛాయలు కమ్ముకున్నాయని గ్లోబల్ డ్రాట్ అబ్జర్వేటరీ తాజా నివేదిక చెబుతోంది. బయట పడుతున్న చారిత్రక అవశేషాలు మహా నదులన్నీ ఎండిపోతుండటంతో ఎన్నడూ చూడని చారిత్రక అవశేషాలు వాటి గర్భం నుంచి బయటపడుతున్నాయి. అమెరికాలో కొలరాడో నది గర్భంలో లక్షలాది ఏళ్లనాటి డైనోసార్ అడుగుజాడలు బయటపడ్డాయి. స్పెయిన్‌లో బార్సెలోనా సమీపంలోని రిజర్వాయర్‌లో నీరు ఆవిరవడంతో 9వ శతాబ్దానికి చెందిన చర్చి బయట పడింది. మాడ్రిడ్‌లో వందల ఏళ్ల కింద నీట మునిగిన ఓ గ్రామ శిథిలాలు వెలుగు చూశాయి. స్పెయిన్‌లోనే కాసెరస్ ప్రావిన్స్‌లో క్రీస్తుపూర్వం 5 వేల ఏళ్లనాటి రాతి పలకలు చైనాలో యాంగ్జీ నదిలో బుద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. ఇరాక్‌లో టైగ్రిస్ నది ఎండిన చోట మెసపటోమియా నగరికత కాలం నాటి రాజమహల్, నాటి నగరం బయట పడ్డాయి. నదులన్నింటా కన్నీళ్లే... ► జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రెయిన్ నది పరిస్థితి ఎంతో దైన్యంగా ఉంది. ► 2,900 కిలోమీటర్లు ప్రవహించి నల్లసముద్రంలోకలిసే ఈ నది ఎన్నోచోట్ల ఎండిపోయింది. ► రెయిన్, దాని ఉపనదులు, కాల్వల ద్వారా ఏటా ఏకంగా 8,000 కోట్ల డాలర్ల (రూ.6.4 లక్షల కోట్ల) విలువైన సరుకు రవాణా జరుగుతుంటుంది. అలాంటిది రవాణా నౌకలు కొంతకాలంగా చూద్దామన్నా కన్పించడం లేదు. ► ఆల్ఫ్స్ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కళకళలాడే పో నది కూడా ఎండల దెబ్బకు జీవచ్ఛవంగా మారిపోయింది. ► ఇటలీలో 30 శాతం వ్యవసాయం ఈ నది మీదే ఆధారపడింది. ఇప్పుడు అదీ కుదేలైంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతటి దుర్భిక్షాన్ని ఎన్నడూ చూడలేదంటూ ఇటలీ వాతావరణ నిపుణులు వాపోతున్నారు. ► ఇక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ వైన్ తయారీకి ఆధారమైన లోయెర్ నదిలో కూడా నీరు అతి వేగంగా అడుగంటుతోంది. ఫ్రాన్స్‌లో 600 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నదిలో జలమట్టాన్ని కాపాడుకునేందుకు అనేక రిజర్వాయర్ల నుంచి నీటిని వదులుతున్నారు. ► యూరప్‌లో 10 దేశాల గుండా పారే అతి పొడవైన నది డాన్యూబ్ కూడా చిక్కిపోతోంది. ► అమెరికాలో డెన్వర్ నుంచి లాస్ఏంజెలెస్ దాకా 4 కోట్ల మంది నీటి అవసరాలు తీర్చే కొలరాడో నదిదీ ఇదే దుస్థితి! ► 45 లక్షల ఎకరాలకు నీరందించి ఏటా 1.4 లక్షల కోట్ల డాలర్ల వ్యవసాయ, తదితర ఆదాయాన్ని సమకూర్చే ఈ నది ఎండల ధాటికి చేతులెత్తేస్తోంది. ► నిత్యం ఉధృతంగా ప్రవహించే చైనాలోని యాంగ్జీ నది మరింత దుస్థితిలో ఉంది. సి చువాన్ ప్రావిన్స్‌కు జీవనాధారమైన ఈ నదిలో ఎక్కడ చూసినా నీరు అడుగంటి నదీగర్భం పైకి కన్పిస్తోంది. దాంతో ప్రభుత్వం కరువు హెచ్చరికలు జారీ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వీగర్లపై చైనా పంజా
చైనా వాయవ్యప్రాంతం షింజియాంగ్‌లో సర్కారీ దౌష్ట్యానికి లోనవుతున్న మైనారిటీ వీగర్ ముస్లింల విషయంలో ఐక్యరాజ్యసమితి పట్టనట్టు వ్యవహరిస్తున్నదని కొంతకాలంగా హక్కుల సంస్థలు చేస్తున్న ఆరోపణలకు బ్రేక్ పడింది. అక్కడ చైనా ప్రభుత్వం తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సంగతి నిజమేనని గురువారం విడుదలైన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ(యూఎన్హెచ్ఆర్సీ) నివేదిక నిర్ధారించింది. ఈ నివేదిక బయటకు రాకుండా ఆపడానికి చైనా చేయని ప్రయత్నం లేదు. దీన్ని పూర్తిగా బుట్టదాఖలయ్యేలా చూడాలనీ, కనీసం నివేదిక విడుదలను దీర్ఘకాలం వాయిదాపడేలా చూడాలనీ చైనా అనేక ఎత్తులు వేసింది. ఇప్పుడిక నివేదికను ఖండించే పనిలోపడింది. 48 పేజీల యూఎన్హెచ్ఆర్సీ నివేదికకు 122 పేజీల్లో బదులిచ్చింది. ఆ ప్రాంత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అణచేస్తున్నాం తప్ప సాధారణ పౌరుల జోలికి పోవటం లేదన్నది దాని సారాంశం. నియంతృత్వం, అణచివేత గాల్లోంచి ఊడిపడవు. వాటికి రాజకీయ కారణాలతోపాటు ఆర్థిక, భౌగోళిక, జాతి, మత, భాషాపరమైన కారణాలు కూడా ఉంటాయి. వరమో, శాపమో వీగర్ ముస్లింలు అత్యధికంగా ఉండే షింజియాంగ్ ప్రాంతం పర్వతాలు, అడవులు, ఎడారులతో నిండి ఉంటుంది. వాటిమధ్య బతకడానికి అనువైన చోటు ఎంచుకోవడం వారికి కష్టమే. అందుకే జనా వాసప్రాంతాలు విసిరేసినట్టు ఎక్కడెక్కడో ఉంటాయి. ఇరుగుపొరుగున రష్యాతోపాటు పలు మధ్య ఆసియా దేశాలుంటాయి. అందుకే దీన్ని నియంత్రించేందుకు ప్రస్తుత చైనా పాలకులు మాత్రమే కాదు... గతంలో పాలించినవారూ ప్రయత్నించారు. ఎందుకంటే ఇక్కడ అపారమైన ప్రకృతి సంపద ఉంది. పైగా వ్యూహాత్మకంగా చూస్తే పశ్చిమ దేశాలకు సమీపంగా, వాటిపై తన ప్రభా వాన్ని పెంచుకునేందుకు వీలుగా ఈ ప్రాంతం ఉంటుంది. భౌగోళికంగా చిన్నదే అయినా షింజి యాంగ్ ఎప్పుడూ బేలగా లేదు. చరిత్రలోకి తొంగిచూస్తే అనేక రాజరిక వ్యవస్థలకు అది కొరకరాని కొయ్యగా నిలిచింది. నియంత్రించడానికి ప్రయత్నించిన ప్రభుత్వాలకు చుక్కలు చూపింది. స్వయంప్రతిపత్తి నిలుపుకోవడమే లక్ష్యంగా పోరాడింది. 1949లో చైనా విప్లవ విజయానికి కాస్త ముందు ఆ ప్రాంతం స్వయంపాలనను రుచిచూసింది కూడా. కానీ జాతుల సమస్య విషయంలో కమ్యూనిస్టులకున్న అవగాహనను గౌరవించి కావొచ్చు... తొలిసారి వారికి తలవంచింది. ఆధిపత్య హాన్ జాతి పెత్తనమే ఇక్కడా కనబడటం, 1966–76 మధ్య సాగిన సాంస్కృతిక విప్లవకాలంలో అది మరింత బాహాటం కావడంతో మళ్లీ ఆ ప్రాంతం పోరుబాట పట్టింది. పథకం ప్రకారం వేరే ప్రాంతాలనుంచి హాన్ జనాభాను ఇక్కడికి తరలించడం, క్రమేపీ వారి రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం పెంచడంతో వీగర్లు రగిలిపోయారు. 90వ దశకం మొదట్లో చెదురుమదురు నిరసనలుగా మొదలైన ఉద్యమం 2009 నాటికి తిరుగుబాటుగా మారింది. హింస చెలరేగి వందలాదిమంది ప్రాణాలు కోల్పోవడంతో 2014 నాటికి అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పూర్తిస్థాయి అణచివేత చర్యలకు ఆదేశాలిచ్చారు. అప్పటినుంచీ నరకానికి ప్రతీకలుగా ఉండే నిర్బంధ శిబిరాలకు లక్షలాదిమంది వీగర్లను తరలించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఉండే ఆ శిబిరాలు కిక్కిరిసి ఉంటున్నా యని వార్తలొస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈమధ్యవరకూ చైనా ఎవరినీ అనుమతించక పోవడంతో అనుమానాలు బలపడ్డాయి. సమితిలో కదలికలు రావడం మొదలయ్యాక శిబిరాల్లో పరిస్థితులు కొంత మారాయంటున్నారు. నిర్బంధితుల విడుదల కూడా చోటుచేసుకున్నదని కథనాలు వచ్చాయి. కానీ జరగాల్సినదాంతో పోలిస్తే ఇది చాలా స్వల్పం. ఒక దేశ ఆంతరంగిక సమస్యగానో, సంబంధం లేని వ్యవహారమనో భావించి ప్రపంచ ప్రజానీకం ఈ నియంతృత్వ ధోరణులను చూస్తూ ఊరుకుంటే అంతటా ఇలాంటి పాలకులే తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈమధ్యే యూఎన్హెచ్ఆర్సీ హైకమిషనర్‌గా రిటైరైన మిషెల్ బాష్లెట్ చిలీలో పినోచెట్ పాలనాకాలంలో స్వయంగా నిర్బంధాన్ని అనుభవించినవారు. అందుకే ఆమె హైకమిషనర్‌గా వచ్చినప్పుడు అందరిలో ఆశలు చిగురించాయి. అందుకు తగ్గట్టు చైనా ఎంత మొండికేసినా దాన్ని ఒప్పించడానికి ఆమె ఓపిగ్గా ప్రయత్నించారు. పరిమిత సంఖ్యలోనైనా పాత్రికేయులను అక్కడి ప్రభుత్వం అనుమతించక తప్పని స్థితి ఏర్పడటం బాష్లెట్ విజయమే. కానీ ఏళ్లతరబడి నివేదిక వెలుగు చూడకపోవడం, అత్యంత అమానుషమైన ఉదంతాలు నిజమంటూనే వాటిని నరమేథంగా మాత్రం పరిగణించకపోవడం ఆమె పనితీరును ప్రశ్నార్థకం చేసింది. బక్క దేశాలపై ఆరోపణలు వచ్చినప్పుడు విరుచుకుపడే అగ్రరాజ్యాలు బలమైన దేశాలు కళ్లెదుటే దురాగ తాలకు పాల్పడుతున్నా పట్టించుకోవు. అరబ్ దేశాలు వీగర్ ముస్లింలకు ఏదో ఒరగబెడ తాయనుకోవడం దండగ. మతాన్ని కించపరిచారన్న ఆరోపణలపై తప్ప సాధారణ ముస్లింలపై జరిగే దాడుల విషయంలో అవి ఎప్పుడూ మౌనమే పాటిస్తాయి. చైనా రాక్షసత్వాన్ని నిగ్గుతేల్చడానికి మరింత లోతైన దర్యాప్తు అవసరమని నివేదిక తెలిపింది. యూఎన్హెచ్ఆర్సీ సభ్య దేశాలు అంగీకరిస్తేనే అది సాధ్యం. చైనా దీన్నెలాగైనా అడ్డుకుంటుంది. మొత్తానికి ఈ నివేదిక చైనా నేర వైఖరిని బయటపెట్టింది. ఉనికి కోసం, కనీస మానవ హక్కుల కోసం పోరాడుతున్న వీగర్ ముస్లింలకు నైతిక మద్దతునీయడం దేశదేశాల్లోని ప్రజాస్వామికవాదుల తక్షణ కర్తవ్యం. -
అణు వినాశనం ముంగిట ప్రపంచం: గుటెర్రస్
ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌లో యుద్ధం, మధ్యప్రాచ్యం, ఆసియా దేశాల్లో ఉద్రిక్తతలు ప్రపంచాన్ని అణు వినాశనం వైపుగా నడిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక్క అపోహ, పొరపాటు అంచనాతో మానవాళి మొత్తాన్ని అణ్వస్త్రాలు కబళించి వేస్తాయని హెచ్చరించారు. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ) అమలుకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన సదస్సులో ఆయన మాట్లాడారు. వివిధ దేశాల వద్ద ప్రస్తుతం 13 వేల అణ్వాయుధాలు పోగుపడ్డాయని చెప్పారు. -
చైనా కాదు త్వరలో భారత్ నెం.1: యూఎన్ నివేదిక
వచ్చే ఏడాది నాటికి చైనాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుందట. ఈ మేరకు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదల చేసింది. యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ ఏమంటోందంటే.. ప్రపంచ జనాభా నవంబర్ మధ్య నాటికి ఎనిమిది బిలియన్లకు చేరుకుంటుందని, దీంతో పాటు 2030లో దాదాపు 8.5 బిలియన్లుగా, 2050లో 9.7 బిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా తక్కువ సంఖ్యలో జనాభా పెరుగుతున్నట్లు నివేదికలో వెల్లడించింది. నివేదికలోని కొన్ని కీలకమైన విషయాలు: ►2023నాటికి చైనాను భారత్ అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారునుందని అంచనా వేసింది. ►2050 వరకు అంచనా ప్రకారం.. ప్రపంచ జనాభాలో సగానికి పైగా జనాభా కేవలం ఎనిమిది దేశాలలో ఉండనున్నట్లు తెలిపింది. (అందులో భారత్ కూడా ఒకటి) ►ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, ఓషియానియాలోని జనాభా ఈ శతాబ్దం చివరి నాటికి పెరుగుదల నెమ్మదిగా ఉండనున్నట్లు భావిస్తున్నట్లు పేర్కొంది. ►2010-2021 నుంచి వలసదారుల నికర ప్రవాహం 1 మిలియన్ దాటిన 10 దేశాలలో ఉన్నాయని తెలపగా, అందులో భారతదేశం కూడా ఉంది. ►సిరియా, వెనిజులా, మయన్మార్ వంటి దేశాలు అభద్రత, సంఘర్షణ కారణాల వల్ల అక్కడ నుంచి వలసలు పెరుగుతున్నట్లు వెల్లడించింది. ►ఎక్కువగా కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కారణంగా ప్రపంచ ఆయుర్దాయం 2019లో 72.8 నుంచి 2021లో 71.0 సంవత్సరాలకు పడిపోయిందని తెలిపింది. ►తక్కువ అభివృద్ధి చెందిన 46 దేశాలు జనాభా పరంగా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నట్లు పేర్కొన్నారు. 2022 నుంచి 2050 మధ్య చాలా వరకు జనాభా రెట్టింపు అవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? -
శతమానం భారతి.. ఆహార భద్రత
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2023ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచంలోనే చిరుధాన్యాల ఉత్పత్తిలో అగ్రగామి భారతదేశం. ఈ పంటల జీవవైవిధ్యంలోనూ మనదే అగ్రస్థానం. కాబట్టి, 2022–23 కేంద్ర బడ్జెట్లో చిరుధాన్య పంటలకు అదనపు విలువ జోడిస్తున్నట్లు ప్రకటించారు. చిరుధాన్యాల్లో మూడు కీలక పంటలు (జొన్నలు, సజ్జలు, రాగులు); ఆరు మైనర్ పంటలు (ఊదలు, వరిగలు, కొర్రలు, అరికెలు, అండు కొర్రలు, చిన్న అండు కొర్రలు) ఉంటాయి. గోధుమ, వరిలో కంటే పోషకపదార్థాలు, మినరల్స్, విటమిన్స్ ్స మూడు నుంచి 5 రెట్లు ఎక్కువగా ఈ చిరుధాన్యాల్లో ఉంటాయి. దేశవ్యాప్తంగా కోటి 14 లక్షల హెక్టార్లలో చిరుధాన్యాలను పండిస్తున్నారని అంచనా. అంటే సంవత్సరానికి దాదాపు కోటి 60 లక్షల టన్నుల పంట పండుతోంది. ఆసియా చిరుధాన్యాల ఉత్పత్తిలో 80 శాతం, ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో 20 శాతాన్ని భారతదేశంలోనే పండిస్తున్నారు. భారతీయ చిరుధాన్య ఎగుమతులు 2020 సంవత్సరంలో 2 కోట్ల 60 లక్షల డాలర్లకు చేరుకున్నాయి. నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాల ఉత్పత్తి, పంపిణీ, క్షేత్ర స్థాయి ప్రదర్శనలు, శిక్షణలు, ప్రాథమిక ప్రాసెసింగ్ క్లస్టర్లు, పరిశోధనా మద్దతుతో రైతులకు ప్రోత్సాహకాలు అందించడానికి... భారత ప్రభుత్వం, జాతీయ ఆహార భద్రతా లక్ష్యసాధనా నిర్వాహక మార్గదర్శకాల్లో మార్పులు తీసుకొచ్చింది. వచ్చే పాతిక సంవత్సరాలో అవసరమైన ఆహార భద్రత కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే చిరుధాన్య దిగుబడి ప్రణాళికలను కార్యాచరణలో పెట్టింది. -
శతమానం భారతి... విద్యారంగం-లక్ష్యం 2047
డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశం విద్యారంగంలో గణనీయమైన అభివృద్ధినే సాధించింది. రాధాకృష్ణ కమిషన్ , మొదలియార్ కమిటీ, కొఠారి కమిటీ, జాతీయ విద్యా విధానం – 1968, నూతన విద్యా విధానం–1986, స్వర్ణ సింగ్ కమిటీ, రామ్మూర్తి కమిటీ, యశ్పాల్, జనార్దన్ కమిటీల సిఫారసులను అనుసరించి అనేక సంస్కణలను చేపట్టింది. ఫలితంగా 1951లో 18 శాతంగా ఉన్న అక్షరాస్యత 75 ఏళ్లలో 74 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ‘2030 నాటికి అందరికీ నాణ్యమైన విద్య’ అనే ఐక్యరాజ్య సమితి లక్ష్యం వైపు దేశం ముందుకు సాగుతోంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యారంగాన్ని రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు భారత ప్రభుత్వం బదలాయించింది. 45వ అధికరణలో అందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. నూతన విద్యా విధానం–1986లో భాగంగా పాఠశాల స్థాయి విద్యలో అత్యుత్తమ ప్రమాణాలు పెంపొందించేలా మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటైంది. పాఠశాల స్థాయి విద్యావ్యవస్థలో ప్రమాణాల మెరుగుదలకు ఆ వ్యవస్థ నాంది పలికింది. ‘యునైటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ 2019–20’ గణాంకాల ప్రకారం, ప్రాథమిక విద్యలో సగటు విద్యార్థి నమోదు నిష్పత్తి 97.8శాతం గా ఉంది. వచ్చే 25 ఏళ్లలో విద్యారంగంలో మరింత మెరుగైన çఫలితాలను సాధించే దిశగా భారత్ కృషి చేస్తోంది. (చదవండి: దాదాపు 20% ఉక్రెయిన్ భూభాగం రష్యా హస్తగతం!) -
Turkey To Turkiye: టర్కీ పేరు మార్చుకోవడానికి కారణం ఇదే!
అంకారా: మిడిల్ ఈస్ట్ కంట్రీ టర్కీ.. అధికారికంగా తన పేరు మార్చుకుంది. టర్కీ కాస్త ఇక నుంచి ‘తుర్కియె’గా మారనుంది. ఇక నుంచి కొత్త పేరుతో తమను గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిపాదన పంపారు. ఆ వెంటనే ఐరాస అంగీకారం చెబుతూ.. ఈ విషయాన్ని ప్రకటించింది. దేశం గుర్తింపులో మార్పులుచేసే ‘‘రీబ్రాండింగ్’’ను.. కిందటి ఏడాది అధ్యక్షుడు రెచప్ టయ్యప్ ఎర్దోవాన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా దేశం పేరును మార్చాలంటూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను అక్కడి ప్రభుత్వ అధికారులు ఆశ్రయిస్తున్నారు. ఎర్దోగాన్ సైతం తమ దేశం పేరును తుర్కియె (Türkiye)గా ఉచ్చరించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నారు. తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు తుర్కియా అనే పదం చక్కగా నప్పుతుందని ఎర్దోవాన్ చెబుతూ వస్తున్నారు. గత ఏడాది పేరును మారుస్తున్నట్లు టర్కీ ప్రకటించిన వెంటనే ప్రభుత్వ మీడియా సంస్థ టీఆర్టీలో వెంటనే మార్పులు చేశారు. టర్కీ (turkey)గా ఉన్న దేశం పేరును తుర్కియె(Türkiye)గా మార్చుకున్నట్లు.. ఐక్యరాజ్య సమితికి పంపిన లేఖలో పేర్కొన్నారు. కొత్త పేరును అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు టర్కీ విదేశాంగ మంత్రి. తమ దేశం పేరును మార్చాలని టర్కీ పెట్టుకున్న అభ్యర్థనకు ఐరాస అంగీకారం తెలిపింది. దీంతో టర్కీ అనే పేరు ఇక చరిత్ర కానుంది. కారణం ఇదే.. టర్కీ అనేది ఒక పక్షి పేరు. అంతేకాదు.. ఫెయిల్యూర్, మూర్ఖుడు, సిల్లీ ఫెలో అనే ఇంగ్లిష్ అర్థాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ పేరు మార్చాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని టీఆర్టీ చెబుతోంది. గత జనవరిలో ‘హలో తుర్కియా’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా.. ఇక నుంచి ఆ దేశం నుంచి ఎగుమతి అయ్యే ప్రాడక్టులపై ‘మేడ్ ఇన్ తుర్కియె’ మారుస్తారు. దేశం కొత్త పేరును విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మిశ్రమ స్పందన దేశం పేరును మార్చడంపై అక్కడి ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎర్దోవాన్ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జనాలు కూడా తమ పరిస్థితి పట్టించుకోకుండా.. ఇలా పేర్లు మారుస్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. దేశాలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేమీ కాదు. 2020లో డచ్ ప్రభుత్వం హోలాండ్ అనే పేరును ఇకపై వాడబోమని నెదర్లాండ్స్, ఐరాసకు తెలిపింది. అంతకుముందు మాసిడోనియా కూడా గ్రీస్‌తో ఉన్న గొడవల నేపథ్యంలో.. నార్త్ మాసిడోనియాగా పేరు మార్చుకుంది. గతంలో పర్షియా ఇరాన్ అయ్యింది. అలాగే.. సియామ్ కాస్త థాయ్‌లాండ్ అయ్యింది. ఇలా ఎన్నో దేశాలు పేర్లు మార్చుకున్నాయి. -
Russia War: శాంతి చర్చల కోసం రంగంలోకి కీలక వ్యక్తి.. పుతిన్ రెస్పాన్స్..?
వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటన ఖరారైంది. ఈ నెల 26న రష్యాలో, 28న ఉక్రెయిన్‌లో గుటెరస్ పర్యటించనున్నారు. ఈ పర్యటన విషయంపై రెండు దేశాలకు ఆయన లేఖలు రాశారు. కాగా, రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు ఆంటోనియో గుటెరస్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన వేర్వేరుగా సమావేశం కానున్నారు. అటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్తో, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబాతోనూ ఆయన భేటీ కానున్నారు. మరోవైపు.. కాల్పుల విరమణ కోసం వివిధ పక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలితమివ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ప్రజలను తరలించేందుకు వీలుగా రష్యా యుద్ధానికి విరామం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా గుటెరస్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో 1.2 కోట్ల మందికి మానవతా సాయం అవసరం ఉందన్నారు. డొనెట్స్క్, లుహాన్స్క్, మరియుపోల్, ఖేర్సన్ వంటి నగరాల్లోనే చాలా మంది ఉక్రేనియన్లు బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చావు బతుకుల మధ్య ఉన్న ప్రజల కోసం రష్యా, ఉక్రెయిన్ దేశాలు తుపాకులు వదిలాలని పిలుపునిస్తున్నానని అన్నారు. ఇది కూడా చదవండి: రక్షణ విషయంలో రష్యాపై భారత్ ఆధారపడొద్దు -
రష్యా నరమేధం.. బుచా వీధుల వెంట చెల్లాచెదురుగా శవాలు
Bucha Massacre Ukraine: యుద్ధ నేరానికి దిగిన రష్యా.. నర మేధానికి పాల్పడింది!. కాళ్లు చేతులు కట్టేసి.. తలలో బుల్లెట్లు దింపిన పౌరుల ఫొటోలు, వీడియోలు ఉక్రెయిన్‌లో జరిగిన మారణహోమం తాలుకా పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. రాజధాని కీవ్‌కు ఇంతకాలం అడ్డుగోడగా నిలిచిన బుచా పట్టణంలో.. శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. మరోవైపు మహిళలపై నడిరోడ్డుపైనే అఘాయిత్యాలు జరిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్, అమెరికాలు రష్యాపై తీవ్రస్థాయిలో ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. కీవ్‌కు ఈశాన్యంగా 37 కిలోమీటర్ల దూరంలో ఉంది బుచా పట్టణం. నెలరోజుల పాటు జరిగిన రష్యా దురాక్రమణలో సుమారు 300 మంది పౌరులు మరణించినట్లు బుచా మేయర్ ఫెడోరుక్ ఇదివరకే ప్రకటించారు. ఈ తరుణంలో.. రష్యా బలగాలు తిరుగుముఖం పట్టిన టైంలో మరో 400 మందికి పైగా పొట్టనపెట్టుకుందని చెప్పారాయన. వీధుల వెంట బుల్లెట్ గాయాలతో, కాళ్లు చేతులు కట్టేసి ఉన్న శవాలే దర్శనమిస్తున్నాయి ఎటు చూసినా. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేషీలోని ఒలెక్సీ అరెస్టోవీచ్ బుచా ఊచకోతకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. Butcha లో మహిళలపై రష్యా బలగాలు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డాయని, ఆపై వాళ్లను కట్టేసి నిప్పటించి సజీవ దహనం చేశారని ఆరోపించారు. అంతేకాదు స్థానిక అధికారులు, పిల్లల మృతదేహాలు రోడ్ల వెంబడి చెల్లాచెదురుగా పడి ఉన్న హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఒకే చోట 300 మందికి నైరుతి భాగంలో ఉన్న ఓ చర్చి దగ్గర అంత్యక్రియలు నిర్వహించగా.. ఇది రష్యా జరిపిన ఉద్దేశపూర్వక మారణకాండగా ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి దిమిత్రి కులేబా అభివర్ణించారు. మృతుల్లో ఓ పసికందు, 14 ఏళ్ల బాలుడు కూడా ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఇండిపెండెంట్ దర్యాప్తునకు ఆదేశించింది ఐక్యరాజ్య సమితి. I am deeply shocked by the images of civilians killed in Bucha, Ukraine. It is essential that an independent investigation leads to effective accountability. — António Guterres (@antonioguterres) April 3, 2022 రష్యా కౌంటర్ ఈ ఆరోపణలపై రష్యా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అదంతా కీవ్ నుంచి జరుగుతున్న కుట్రే అని పేర్కొంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బుచాలో శవాల ఫొటోలు, వీడియోలు కీవ్ నుంచి వెలువడుతున్న రెచ్చగొట్టుడు సంకేతాలే అని పేర్కొంది. ఇదంతా కీవ్‌వర్గాలు ఆడుతున్న నాటకం. పాశ్చాత్య దేశాల మీడియా కోసమే ఇదంతా చూపిస్తున్నారు. రష్యా బలగాలు అక్కడ ఉన్న టైంలో ఒక్క సాధారణ పౌరుడు కూడా మరణించలేదు. ఎలాంటి హింసకు, అఘాయిత్యాలకు కూడా మా సైన్యం పాల్పడలేదు. శాంతి స్థాపనలో భాగంగానే మా దళాలు ఎలా వెళ్లాయో.. అలాగే వెనక్కి వచ్చేశాయి. అలాంటప్పుడు ఇదంతా ఎలా జరుగుతుంది? అని ప్రశ్నించింది రష్యా రక్షణ శాఖ. -
భారత్‌ను నిండా ముంచేస్తున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం! ఐక్యరాజ్యసమితి వార్నింగ్!
ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం 2022లో భారత్‌పై తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి వ్యవహారాల విభాగం (యూఎన్‌సీటీఏడీ) గురువారంనాటి తన తాజా నివేదికలో పేర్కొంది. 2022పై ఇంతక్రితం 6.7 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను తాజాగా 4.6 శాతానికి (2 శాతానికి పైగా) తగ్గించింది. ఇంధన సరఫరాలపై సమస్యలు, వాణిజ్య ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరపతి విధానాలు, వెరసి ఆర్థిక అనిస్థితిని దేశం ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. ఇక యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి రేటు అంచనాను ఒక శాతం అంటే 3.6 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ►ఈ ఏడాది రష్యా తీవ్ర మాంద్యాన్ని చవిచూసే పరిస్థితి ఉండగా, పశ్చిమ ఐరోపా అలాగే మధ్య, దక్షిణ, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో వృద్ధిలో గణనీయమైన మందగమనం ఉంటుంది. ► రష్యా వృద్ధి 2.3 శాతం నుండి మైనస్ 7.3 శాతానికి క్షీణించింది. ► దక్షిణ, పశ్చిమ ఆసియాలోని కొన్ని ఇతర ఆర్థిక వ్యవస్థలు ఇంధన ధరల వేగవంతమైన పెరుగుదల నుండి కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఆయా దేశాలు ప్రాథమిక వస్తువుల మార్కెట్లలో ప్రతికూలతలు, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం తత్సబంధ ఫైనాన్షియల్ అస్థిరతలు ఎదుర్కొనే వీలుంది. ► అమెరికా వృద్ధి అంచనా మూడు శాతం నుండి 2.4 శాతానికి, చైనా వృద్ధి 5.7 శాతం నుంచి 4.8 శాతానికి తగ్గిస్తున్నాం. ► రష్యా క్రూడ్, గ్యాస్‌ను ఎగుమతి చేస్తున్నప్పటికీ దేశంలో ఇతర వస్తువలు అధిక ధరల కారణంగా ఆదాయాల భర్తీలోపురోగతి కనిపించని పరిస్థితి ఉంది. దిగుమతులు లేదా రుణ సేవల కోసం విదేశీ మారక ఆదాయాన్ని ఉపయోగించే పరిస్థితి లేకపోవడం ప్రతికూలాంశం. ► ఫారెక్స్ మార్కెట్లలో రోజువారీ టర్నోవర్ 6.6 ట్రిలియన్ డాలర్లు. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా కరెన్సీలు వాటా 3.5% కంటే ఎక్కువ కాదు. యునైటెడ్ స్టేట్స్ డాలర్ టర్నోవర్ ఒక్కటే 44 శాతంగా ఉండడం గమనార్హం. ► ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా పలు అభివృద్ధి చెందిన దేశాలు ద్రవ్య పరపతి విధానాలను కఠినతరం చేసే వీలుంది. ఆయా అంశాలు బడ్జెట్ వ్యయాల కోతలకూ దారితీయవచ్చు. ► బలహీనపడుతున్న ప్రపంచ డిమాండ్, అంతర్జాతీయ స్థాయిలో తగినంత విధాన సమన్వయం లేకపోవడం, మహమ్మారి వల్ల పెరిగిన రుణాలు వంటి అంశాలు పలు దేశాలకు ఆర్థిక కష్టాలను సృష్టిస్తాయి. ఇది కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలను దివాలా, మాంద్యం అగాధాలకు నెట్టవచ్చు. ► కోవిడ్–19తో అసలే తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన ప్రపంచ ఎకానమీకి ఇప్పుడు యుద్ధం మరింత ప్రమాదం తెచ్చిపెట్టే పరిస్థితి నెలకొంది. ► పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో అత్యంత పేదలపై దుర్బలమైన తక్షణ ప్రభావం చూపుతాయి. ఫలితంగా తమ ఆదాయంలో అత్యధిక వాటాను ఆహారంపై ఖర్చు చేసే కుటుంబాలు తీవ్ర సమస్యలకు గురయ్యే వీలుంది. వీరి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయే వీలుంది. ► ఆహారం, ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రమాదం తీవ్రంగా ఉంటుంది. తాజా పరిస్థితులు అధిక ధరలు జీవనోపాధిని తగ్గించడంతోపాటు, పెట్టుబడులను నిరుత్సాహపరుస్తాయి. దీనికితోడు పలు దేశాల వాణిజ్య లోటు భారీగా పెరగడం ఆందోళన కలిగించే అంశం. -
ఫిన్లాండ్.. అంత సంతోషంగా ఎలా ఉంటుందో తెలుసా?
ఫిన్లాండ్.. మరోసారి హ్యాపీయెస్ట్ కంట్రీగా నిలిచింది. వరుసగా ఐదవ ఏడాది ఈ ఘనత సొంతం చేసుకుంది ఈ యూరోపియన్ కంట్రీ. ఐక్యరాజ్య సమితి వార్షిక సూచీ వివరాల ప్రకారం.. ఈ భూమ్మీద ఫిన్లాండ్ అత్యంత సంతోషకరమైన దేశంగా మొదటి స్థానంలో ఉంది. వరుసగా ఐదో ఏడాది World's Happiest Nation సూచీలో తొలిస్థానం సంపాదించుకుంది. సెర్బియా, బల్గేరియా, రొమేనియా సైతం ఈ లిస్ట్‌లో పుంజుకుని ముందుకు ఎగబాకాయి. ► ఇక ఈ సూచీలో ఘోరంగా పతనం అయ్యింది లెబనాన్, వెనిజులా, అఫ్గనిస్థాన్ దేశాలు. లెబనాన్.. ఆర్థిక సంక్షోభం కారణంగా జాబితాలో చివరి నుంచి రెండో ప్లేస్‌లో నిలిచింది. ► ఇక చివరిస్థానంలో ఉంది అఫ్గనిస్థాన్. గత ఆగష్టులో తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్నాక మానవ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. ► వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్.. 2022లో వరుసగా పదవ ఏడాది రిలీజ్ అయ్యింది. ఆర్థిక, సోషల్ డేటా, ప్రజల ఆనందం యొక్క స్వంత అంచనా ఆధారంగా ఈ సూచీలో స్థానం కల్పిస్తారు. సూచీ స్కేల్ సున్నా నుంచి పది మధ్యగా ఉంటుంది. సగటున మూడేళ్ల కాలానికి గణిస్తారు. ఇదిలా ఉంటే.. తాజా నివేదిక ఉక్రెయిన్-రష్యా యుద్దం కంటే ముందుగానే రూపొందించారు. ► ఉత్తర యూరప్ దేశాల డామినేషన్ ఈ సూచీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్ స్విట్జార్లాండ్, ఐస్‌ల్యాండ్, నెదర్లాండ్స్(హాల్యాండ్), నార్వే, స్వీడన్ ఉన్నాయి. ప్రత్యేక గౌరవం భూటాన్‌కు దక్కింది. భారత్ 136వ స్థానంలో నిలిచింది. ► ఫిన్లాండ్ జనాభా.. దాదాపు 5.5 మిలియన్. ఇక్కడి ప్రజల లైఫ్‌స్టయిల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఫిన్లాండ్ ప్రజలు సంతోషం వచ్చినా.. దుఖం వచ్చినా గోల చేయరు. ఒక డిగ్నిటీతో సాగిపోతుంటుంది వాళ్ల లైఫ్. ► ముఖ్యంగా కరోనా టైంలో ఫిన్లాండ్ ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పింది. బహిరంగ వేడుకలను పరిమితంగా చేసుకోవాలన్న ప్రభుత్వ పిలుపును తూచా తప్పకుండా పాటించి క్రమశిక్షణలో తమకు తామే సాటని ప్రపంచానికి చాటి చెప్పారు. ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ ► విస్తారమైన అడవులు, సరస్సుల దేశం అది. బాగా పనిచేసే ప్రజా సేవలు, అధికారంపై విస్తృత విశ్వాసం ఉంటుంది అక్కడి ప్రజలకు. అలాగే నేరాలు తక్కువ. పైగా అసమానతలకు తావు ఉండదు. ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తుంటారు అక్కడి ప్రజలు. ► నాణ్యత విద్య, ఉచిత ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం, స్వచ్ఛమైన స్వభావం, అధిక వ్యక్తిగత స్వేచ్ఛ, బాగా పనిచేసే సమాజం.. Finland ప్రజల సంతోషానికి కారణాలు. ► కరోనా టైంలో ప్రపంచంలో చాలా దేశాలు తీవ్ర సంక్షోభంలో మునిపోయాయి. ప్రజలు మానసికంగా కుంగిపోయారు. అయితే ఫిన్లాండ్లో మాత్రం కరోనా ప్రభావం.. వాళ్ల సంతోషాన్ని దూరం చేయలేకపోయింది. -
Sakshi Cartoon: ఉక్రెయిన్ వలసలు 5 లక్షలు: ఐక్యరాజ్యసమితి
ఉక్రెయిన్ వలసలు 5 లక్షలు: ఐక్యరాజ్యసమితి -
నగరాల్లో హోరాహోరీ..ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాలు
కీవ్: ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా సేనలు కీలక పట్టణాల్లోకి చొచ్చుకువస్తున్నాయి. దీంతో చాలా నగరాల్లో రష్యా బలగాలకు, ఉక్రెయిన్ మిలటరీకి మధ్య హోరాహోరీ పోరాటం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎయిర్‌ఫీల్డ్స్, ఇంధన నిల్వాగారాలపై దాడులు చేసిన రష్యా బలగాలు ఆదివారం నాటికి ఉక్రెయిన్‌లోని కీలక నౌకాశ్రయాలను స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు చర్చలకోసం బెలారస్‌కు బృందాన్ని పంపినట్లు రష్యా ప్రకటించింది. కానీ తమ దేశం నుంచి దాడులకు కేంద్రమైన బెలారస్లో చర్చలకు వెళ్లమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. మరే దేశంలోనైనా చర్చలకు సిద్ధమని తొలుత చెప్పారు, కానీ బెలారస్ సరిహద్దుల్లో చర్చలకు సిద్ధమని తాజాగా ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. ఆదివారం రష్యాలోని ఖార్కివ్ నగరం సమీపంలోకి రష్యా సేనలు చొచ్చుకువచ్చాయి. వీరిని ఉక్రెయిన్ బలగాలు ఎదుర్కొంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నగరం తూర్పున ఉన్న గ్యాస్ లైన్‌ను రష్యా సేనలు పేల్చివేశాయి. రష్యా నుంచి కాపాడేందుకు అందరూ ఆయుధాలు ధరించాలన్న అధ్యక్షుడి పిలుపుతో పలువురు ఉక్రేనియన్లు కదనరంగంలో పోరాడుతున్నారు. దీంతో రష్యన్ బలగాలకు చాలాచోట్ల ప్రతిఘటన ఎదురవుతోంది. పోరాడుతాం...: ‘‘మేం మా దేశం కోసం పోరాడుతున్నాం, మా స్వతంత్రం కోసం పోరాడుతున్నాం, ఎందుకంటే దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడే హక్కు మాకుంది.’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం ప్రకటించారు. దేశమంతా బాంబులతో దద్దరిల్లుతోందని, పౌర నివాసాలను కూడా విడిచిపెట్టడం లేదని ఆయన వాపోయారు. కీవ్ సమీపంలో భారీ పేలుళ్లతో పాటు మంటలు కనిపించాయి. దీంతో ప్రజలంతా భయంతో బంకర్లలో, సబ్‌వేల్లో దాక్కుంటున్నారు. నగరంలో 39 గంటల కర్ఫ్యూ విధించారు. కీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూడా పేలుళ్లు వినిపించాయని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. రష్యాది ఉగ్రవాదమని జెలెన్స్కీ దుయ్యబట్టారు. తమ నగరాలపై రష్యా దాడులకు సంబంధించి అంతర్జాతీయ యుద్ధనేరాల ట్రిబ్యునల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రష్యాను ఐరాస భద్రతా మండలి నుంచి తొలగించాలన్నారు. తీరప్రాంత స్వాధీనం ఉక్రెయిన్ దక్షిణాన ఉన్న కీలక నౌకాశ్రయ నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. దీంతో ఉక్రెయిన్ తీరప్రాంతం రష్యా అదుపులోకి వచ్చినట్లయింది. నల్ల సముద్రంలోని ఖెర్సన్, అజోవ్ సముద్రంలోని బెర్డిన్స్క్ పోర్టులను స్వాధీనం చేసుకున్నామని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి ప్రకటించారు. పలు నగరాల్లో విమానాశ్రయాలు కూడా తమ అదుపులోకి వచ్చాయన్నారు. అయితే ఒడెసా, మైకోలైవ్ తదితర ప్రాంతాల్లో పోరు కొనసాగిస్తున్నామని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. పోర్టులు చేజారడం ఉక్రెయిన్‌కు ఎదురుదెబ్బని విశ్లేషకులు భావిస్తున్నారు. పొంతన లేని గణాంకాలు యుద్ధంలో ఇరుపక్షాల్లో ఎంతమంది మరణించారు, గాయపడ్డారు అన్న విషయమై సరైన గణాంకాలు తెలియడంలేదు. రష్యాదాడిలో 198 మంది పౌరులు చనిపోయారని, వెయ్యికిపైగా గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ ఆరోగ్యమంత్రి చెప్పారు. రష్యాసేనల్లో 3,500మంది చనిపోయారని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. దాడులు ఆరంభమైన తర్వాత సుమారు 3.68 లక్షలమంది ఉక్రేనియన్లు పొరుగుదేశాలకు వలసపోయారని ఐరాస తెలిపింది. ఒకపక్క రష్యా సేనలు ఉక్రెయిన్‌లోకి చొచ్చుకుపోతున్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు పలురకాల ఆయుధాలు, మందుగుండు సమాగ్రిని సమకూరుస్తున్నాయి. అదే సమయంలో రష్యాపై భారీ ఆంక్షలను విధిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు 35 కోట్ల డాలర్ల మిలటరీ సాయాన్ని అమెరికా ప్రకటించింది. 500 మిస్సైళ్లు, 1000 యాంటీ టాంక్ ఆయుధాలను పంపుతామని జర్మనీ తెలిపింది. బెల్జియం, చెక్, డచ్ ప్రభుత్వాలు కూడా ఆయుధాలు పంపుతున్నాయి. ఎంపిక చేసిన రష్యా బ్యాంకులను స్విఫ్ట్ (అంతర్జాతీయ బ్యాంకు అనుసంధానిత వ్యవస్థ) నెట్‌వర్క్‌లో బ్లాక్ చేసేందుకు యూఎస్, యూకే, ఈయూ అంగీకరించాయి. ఉక్రెయిన్‌లో తమ స్టార్లింగ్ ఇంటర్నెట్ వ్యవస్థను యాక్టివేట్ చేస్తున్నట్లు బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రకటించారు. ఐరాస అత్యవసర భేటీ! ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణపై చర్చకు 193 మంది సభ్యులతో కూడిన ఐరాస సాధారణ అసెంబ్లీ ‘అరుదైన అత్యవసర ప్రత్యేక సమావేశం’ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భేటీ కోసం భద్రతా మండలిలో ఓటింగ్ జరగనుంది. భద్రతామండలి పూర్తి సమావేశంలో శాశ్వత దేశాలు వీటో అధికారం ఉపయోగించే వీలు లేదు. దాడిపై భద్రతా మండలి తీర్మానాన్ని శుక్రవారం రష్యా వీటో చేయడం తెలిసిందే. రష్యా విమానాలపై ఈయూ నిషేధం రష్యా విమానాలను తమ గగనతలంపై నిషేధించాలని 27 దేశాల యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఉక్రెయిన్‌కు ఆయుధాల కొనుగోలుకు నిధులు సమకూర్చాలని నిర్ణయించామని ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా చెప్పారు. ఈయూ చరిత్రలో దాడికి గురవుతున్న దేశానికి ఆయుధ సాయం కోసం నిధులందించడం ఇదే తొలిసారన్నారు. -
తెల్లవారుతూనే నిప్పుల వాన.. ఏ సమయానికి ఏం జరిగింది..
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలు. వెలుగు రేఖలు పుడమిని పలుకరించే సమయం ఆసన్నమైంది. జనమంతా అప్పుడే నిద్ర నుంచి మేల్కొంటున్నారు. ఇంతలోనే రష్యా సైన్యం దండయాత్ర ప్రారంభించింది. ప్రభాత కిరణాలకు బదులు ఆకాశం నుంచి నిప్పుల వాన మొదలయ్యింది. గ్రీన్విచ్ మీన్ టైమ్(జీఎంటీ) ప్రకారం.. ఉదయం 3 గంటలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి యుద్ధ ప్రకటన వెలువడింది. ఆ తర్వాత వరుసగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎప్పుడేం జరిగిందంటే... ఉదయం 03: ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌పై దాడి ప్రారంభించినట్లు పుతిన్ ప్రకటన. ఆయుధాలు వదిలేసి ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఉక్రెయిన్ సైన్యానికి సూచన. జోక్యం చేసుకొనేందుకు ప్రయత్నిస్తే ఎన్నడూ చూడని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇతర దేశాలకు హెచ్చరిక. ఉదయం 3.35: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను తీవ్రంగా ఖండించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ముందస్తు హెచ్చరిక లేకుండా దాడికి దిగడం అన్యాయమని వెల్లడి. ఈ అవాంఛనీయ పరిణామాలకు రష్యా బాధ్యత వహించాలని స్పష్టీకరణ. రష్యా దుందుడుకు చర్యను ఖండించిన ‘నాటో’ సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్. రష్యా సైనిక బలగాలను, ఆయుధాలను ఉక్రెయిన్ నుంచి వెనక్కి మళ్లించాలని పుతిన్‌కు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వినతి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన జో బైడెన్. ఉక్రెయిన్ ప్రజలకు అండగా ఉంటామని హామీ. ఉదయం 3.46: తూర్పు ఉక్రెయిన్‌లోని మారియూపోల్‌లో తీవ్రస్థాయిలో వినిపించిన పేలుళ్ల శబ్దాలు. ఉదయం 04.00: కీవ్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణికులను, సిబ్బంది ఖాళీ చేసినట్లు ఉక్రెయిన్ మౌలిక సదుపాయాల శాఖ ప్రకటన. ఉదయం 4.15: రాజధాని కీవ్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వినిపించిన బాంబు పేలుళ్ల శబ్దాలు. కీవ్‌లో ఏడుసార్లు భీకర శబ్దాలు వినిపించినట్లు అల్ జజీరా ప్రతినిధి ఆండ్రూ సైమన్స్ వెల్లడి. రష్యా అనుకూల తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డొనెట్క్స్, ఖార్వివ్లోనూ పేలుళ్ల శబ్దాలు. ఉదయం 4.30: తమ దేశంపై రష్యా పూర్తిస్థాయి యుద్ధం ఆరంభించిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా స్పష్టీకరణ. కీలక నగరాలపై క్షిపణి దాడులు చేస్తోందని వెల్లడి. ఉదయం 4.30: ఉక్రెయిన్ కంప్యూటర్లపై సైబర్ దాడులు చేసిన రష్యా ఉదయం 4.41: పేలుళ్ల దృష్టా ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని కీవ్ నగర మేయర్ సూచన. ఉదయం 4.45: డాన్‌బాస్‌లో రష్యా సైనిక చర్యలకు ప్రతిస్పందనగా తమ గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించిన ఉక్రెయిన్. ఉదయం 05: కీవ్‌లోని జుంటా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా మిలటరీ ఆపరేషన్ చేపట్టినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర భేటీలో తెలియజేసిన ఐరాసలోని రష్యా రాయబారి. ఉక్రెయిన్ ప్రజలకు తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదని ఉద్ఘాటన. లుహాన్స్క్ ప్రావిన్స్‌లో ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్న ష్కాస్టియా పట్టణంపై దాడి చేసినట్లు రష్యా అనుకూల వేర్పాటువాదుల ప్రకటన. అలాగే డొనెట్క్స్లోని లైన్ ఆఫ్ కాంటాక్టు వద్ద ఉక్రెయిన్ దళాలపై విరుచుకుపడ్డామని వెల్లడి. ఉదయం 5.25: అత్యంత కచ్చితత్వంతో కూడిన ఆయుధాలతో ఉక్రెయిన్ సైనిక మౌలిక సదుపాయాలను, వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటన. ఉదయం 5.30: ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న దేశీయ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలను రద్దు చేసిన రష్యా. ఉదయం 5.45: తమ దేశ తూర్పు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క్షిపణి దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఆందోళన. ఉదయం 06.00: రష్యాతోపాటు బెలారస్ భూభాగం నుంచి సైతం రష్యా సైన్యం దాడులు చేస్తోందని ఉక్రెయిన్ బోర్డర్ గార్డ్ సర్వీస్ వెల్లడి. రష్యా సంయమనం పాటించాలని చైనా విజ్ఞప్తి. ఉదయం 6.05: ఉక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అధ్యక్షుడు వ్లాదిమిర్ జేలెన్స్కీ. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచన. దేశవ్యాప్తంగా మార్షల్ లా విధిస్తున్నట్లు ప్రకటన. ఉదయం 6.20: ఉక్రెయిన్ వైమానిక స్థావరాలపై దాడులు చేశామని, గగనతల రక్షణ వ్యవస్థలను బలహీనపర్చామని రష్యా రక్షణ శాఖ ప్రకటన. తమ యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ నేలకూల్చినట్లు వస్తున్న వార్తలను ఖండించిన రష్యా. ఉదయం 6.48: లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని ష్కాస్టియా, స్టానిస్టియా పట్టణాలను స్వాధీనం చేసుకున్నామని తేల్చిచెప్పిన రష్యా అనుకూల వేర్పాటువాదులు. ఉదయం 07: లుహాన్స్క్లో ఐదు రష్యా యుద్ధ విమానాలను, ఒక హెలికాప్టర్‌ను నేలకూల్చామ ని ఉక్రెయిన్ సైన్యం ప్రకటన. ఉదయం 7.15: క్రిమియా నుంచి రష్యా ఆయుధాలను, సైనిక సామగ్రిని తమ భూభాగంలోకి చేరవేస్తోందని ఉక్రెయిన్ వెల్లడి. పశ్చిమ ఉక్రెయిన్‌లోని లెవివ్ ప్రాంతంపై గురిపెట్టిన రష్యా సైన్యం. రష్యా దాడుల్లో తమ దేశంలో కనీసం 8 మంది మరణించారని, మరో 9 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సలహాదారు వెల్లడి. చెర్నీహివ్, ఖార్కివ్, లుహాన్స్క్ నుంచి సరిహద్దులు దాటి ఉక్రెయిన్‌లోకి ప్రవేశిస్తున్న రష్యా సైన్యం. ఉదయం 7.46: తీరు మార్చుకోకపోతే రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తామని ఈయూ హెచ్చరిక ఉదయం 8.22: ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని పుతిన్‌కు ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి ఉదయం 9.10: తమ సైనిక సాయం అందజేయాలని ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలెన్స్కీ వినతి ఉదయం 9.51: రష్యాతో దౌత్యపరమైన సంబం ధాలు తెంచుకుంటున్నట్లు జేలెన్స్కీ ప్రకటన ఉదయం 10.02: రష్యా దాడుల్లో తమ దేశంలో ఇప్పటిదాకా 40 మంది మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు వెల్లడి -
దూకుడు పెంచిన రష్యా.. పుతిన్ తీరుపై ఫుల్ ఫైర్
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దూకుడు క్రమంగా ప్రత్యక్ష సైనిక ఆక్రమణగా మారుతోంది. ఈ పరిణామాలపై అమెరికా, యూరప్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. అంతర్జాతీయ ఒప్పందాలను రష్యా అతిక్రమిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై, రష్యా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. రష్యా చర్యలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. తూర్పు ఉక్రెయిన్‌లోని ఈ సమస్యను మిన్స్క్ ఒప్పందానికి లోబడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రష్యాకు సూచించారు. తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఉక్రెయిన్ చేసే అన్ని ప్రయత్నాలకూ ఐరాస పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. బలప్రయోగం ద్వారా ఏమైనా చేయొచ్చని పుతిన్ భావిస్తున్నారని, తన దుందుడుకు చర్యల ద్వారా అంతర్జాతీయ వ్యవస్థలనే సవాలు చేస్తున్నారని ఐరాసలో అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ విమర్శించారు. ఆయనకు గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ, డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, ఆస్ట్రియా తదితర దేశాలన్నీ రష్యా చర్యను తీవ్రంగా తప్పుబట్టాయి. 15 దేశాలతో కూడిన భద్రతా మండలి ఉక్రెయిన్ సంక్షోభంపై భేటీ కావడం ఇటీవలి కాలంలో ఇది మూడోసారి. కాగా, రష్యాకు దగ్గరవుతున్న చైనా మాత్రం, సంక్షోభ నివారణకు మరిన్ని చర్చలు మేలంటూ ఆచితూచి స్పందించింది. (ఇది చదవండి: రష్యాకు షాకిచ్చిన అమెరికా.. బైడెన్ కీలక నిర్ణయం) -
తొలిసారిగా 25 శాతం మంది మహిళా పోలీసు అధికారులు..
కొంత కాలం క్రితం... దక్షిణ సూడాన్‌లోని జుబా నగరంలో జరుగుతున్న యూఎన్ (ఐక్యరాజ్యసమితి) మెడల్ పరేడ్ అది. పతకం స్వీకరించడానికి ఆ ఐదుగురు మహిళా పోలిసు అధికారులు నడిచొస్తుంటే నలుదిక్కుల నుంచి చప్పట్లు మారుమోగాయి. వారి నడకలో సాహస ధ్వని వినిపించింది. దక్షిణ సుడాన్లో ఏ ప్రమాదం ఏ మూల నుంచి మృత్యువును మోసుకొస్తుందో తెలియని కల్లోల ప్రాంతాల్లో పనిచేశారు వారు. పోలిస్ ఇన్స్పెక్టర్ రీనా యాదవ్... చండీగఢ్ డీఎస్పీ భారతి స్వామినాథన్... మహారాష్ట్ర ఇన్స్పెక్టర్ రజనీకుమారి... మహారాష్ట్ర డీఎస్పీ గోపిక జహగిర్దార్.... మహారాష్ట్ర ఏ ఎస్పీ కమలా షెకావత్... రాజస్థాన్ దక్షిణ సుడాన్లో అంతర్యుద్ధ పరిస్థితులను నివారించడంలో తమవంతు పాత్ర పోషించి ‘శభాష్’ అనిపించుకున్నారు. ఐక్యరాజ్యసమితికి మన మహిళా పోలిస్ అధికారుల సాహస ప్రవృత్తి, త్యాగం... సుపరిచితం. (చదవండి: 6 లక్షల పెట్టుబడి.. 4 కుట్టు మిషన్లతో ఆరంభం.. లక్షల్లో ఆదాయం!) తాజాగా... ఆంధ్ర, తెలంగాణ, దిల్లీ, హరియాణ, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, సిక్కిం, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్... మొదలైన రాష్ట్రాలు, రకరకాల సెంట్రల్ పోలిస్ ఆర్గనైజేషన్స్ నుంచి 69 మంది పోలిసు అధికారులు ‘యునైటెడ్ నేషన్స్ మిషన్ సర్వీసెస్: 2022–2024’లో భాగం అయ్యారు. వెహికిల్, వెపన్ హ్యాండ్లింగ్, కంప్యూటర్ స్కిల్స్... మొదలైన వాటికి సంబంధించిన పరీక్షలలో వీరు విజయం సాధించారు. ఈసారి విశేషం ఏమిటంటే ప్యానల్లో తొలిసారిగా 25 శాతం మంది మహిళా పోలిసు అధికారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూఎన్‌లో పనిచేయడానికి వృత్తినిబద్ధత, భిన్నసంస్కృతుల పట్ల గౌరవభావం... ప్రధాన లక్షణాలు అంటారు. అవి మన మహిళాపోలిసు అధికారులలో పుష్కలంగా ఉన్నాయని గత చరిత్ర సగర్వంగా చెప్పకనే చెబుతుంది. (చదవండి: ‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కూడా..) -
ఎలాన్ మస్క్ భారీ విరాళం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రపంచ కుబేరుడు..!
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. చిన్నారుల ఆకలి తీర్చేందుకు ప్రపంచ కుబేరులు ముందుకు రావాలని గతంలో ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డేవిడ్ బేస్లే ఇచ్చిన పిలుపు మేరకు.. సుమారు 5 మిలియన్ టెస్లా షేర్లను విరాళంగా ఇచ్చారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో దాఖలు చేసిన వివరాల ప్రకారం.. నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు తన వాటాలో నుంచి ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు చెందిన 5 మిలియన్లకు పైగా షేర్లను విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. మస్క్ ఇచ్చిన ఈ విరాళం విలువ సుమారు 5.7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 43 వేల కోట్లు) ఉంటుందని అంచనా. ఇప్పటి వరకు ఇచ్చిన ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విరాళాల్లో ఈ విరాళం ఒకటిగా నిలవనుంది. అయితే విరాళంగా ఇచ్చిన ఈ మొత్తాన్ని ఏ స్వచ్ఛంద సంస్థకు ఇచ్చారు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. నియంత్రణా సంస్థలకు ఇచ్చిన సమాచారంలో కూడా ఆ ట్రస్ట్ వివరాలు పొందుపరచలేదు. మస్క్ వంటి బిలియనీర్లు "ఒక్కసారి తలచుకుంటే" కోట్ల మంది నిరుపేదల ఆకలి బాధలు తీర్చేయొచ్చని ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డేవిడ్ బేస్లే గతంలో అన్నారు. ప్రపంచంలో సుమారు 4.2 కోట్ల మంది ఆకలి తీర్చేందుకు 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.45,000 కోట్లు) అవసరమని గతంలో ట్వీట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన మస్క్ నిరుపేదల ఆకలి బాధల నిర్మూలనపై మీ ప్రణాళికేంటో చెబితే, నిధులు ఎలా సద్వినియోగం చేస్తారో వెల్లడిస్తే.. 6 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఇప్పటికిప్పుడు విక్రయించి, ఐక్యరాజ్యసమితి ఫుడ్ ఏజెన్సీకి ఇచ్చేందుకు తాను సిద్ధమేనని గతంలో అన్నారు. అప్పుడు ఇచ్చిన మాట మేరకు మస్క్ తన కంపెనీ షేర్లను విరాళంగా ఇచ్చారు. (చదవండి: 10 నిమిషాల్లో రూ.186 కోట్లు సంపాదించిన బిగ్ బుల్) -
Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు..
Warning! Terminator like robots could wipe out humanity from Earth వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కిల్లర్ రోబోట్‌ను తయారు చేసేందుకు అగ్రరాజ్యాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ కిల్లర్ రోబో టార్గెట్ విక్టిమ్ బతికున్నాడా లేదా అనే విషయాన్ని స్వయంగా తెలుసుకోగలవు కూడా. అత్యంత శక్తివంతమైన కిల్లర్ రోబోట్‌ను రూపొందించే రేసులో దేశాలు నేనంటే నేనని పరుగులు తీస్తున్నాయి. ఐతే ఈ రోబోల వంటి టెర్మినేటర్లు భూమిపై మానవాళిని తుడిచిపెట్టగలవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇలాంటి డ్రోన్లను అభివృద్ధి చేయడానికి చైనా, రష్యా, అమెరికా పూర్తి మద్ధతును తెలిపాయి. సాంకేతికతతో ఊచకోత కోసేందుకు యత్నం కిల్లర్ రోబోల ముప్పుపెరుగుతున్న దృష్ట్యా ఈ నెలలో జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశం జరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాణాంతక స్వయం ప్రతిపత్తి గల ఆయుధాల సాంకేతికతపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ రోబోలు పూర్తిగా మెషిన్ కంట్రోల్‌తో పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను తీయగలవు. వీటిలో కృత్రిమ మేధస్సు, ముఖ గుర్తింపు సాంకేతికత పొందుపరచి ఉంటాయి. ఇప్పటికే మొదటి కిల్లర్ రోబో తయారీ పూర్తిచేసిన లిబియా కిల్లర్ రోబోల్లో ఉన్న సాంకేతికత సహాయంతో ఎరను వేటాడి చంపగలవు. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా పనిచేసేలా ఈ రోబోలను రూపొందించబడినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు ఒక వ్యక్తిని చంపాలా వద్దా అనే విషయాన్ని కూడా స్వయంగా నిర్ణయించుకోగలవు. సాంకేతికత సహాయంతో మనుషులు పెద్ద సంఖ్యలో ఊచకోత కోసే అవకాశం ఉందని మకాలెస్టర్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ డావ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి మొత్తం మావనవాళి అంతం చేస్తాయి. లిబియాలో మొదటి స్వీయ నిర్ణయాత్మక దాడి చేయగల డ్రోన్‌ను విజయవంతంగా తయారు చేసిందని మార్చిలో ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అణ్వాయుధ పోటీలో తప్పిదాలకు చోటివ్వకూడదని, ఇటువంటి డ్రోన్లను వెంటనే నియంత్రించాలని ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వినిపిస్తోంది. చదవండి: హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు! -
Afghan Crisis: ఏం మిగల్లేదు! అఫ్గన్ ఆర్తనాదాలు
అనుకున్నదానికంటే వేగంగా అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోంది. మూడు నెలల పాలనలో తాలిబన్లకు పెద్దగా చేయడానికి ఏం లేకుండా పోయింది. దీంతో అఫ్గన్ నేలకు తగిలిన ‘ఆర్థిక’ గాయం మానకపోగా.. పుండు మరింత పెద్దది అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత దయనీయమైన సంక్షోభం చూడబోతున్నామన్న ఐరాస, కొన్ని ప్రపంచ దేశాల అంచనాలే నిజం కావడానికి ఎంతో టైం పట్టేలా కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో జారీ అయిన మిలియన్ డాలర్ల సహాయం పత్తా లేకుండా పోయింది. అఫ్గనిస్తాన్‌కు చెందిన బిలియన్ల ఆస్తులు నిలిచిపోయాయి. ఆర్థిక ఆంక్షలు కొత్త ప్రభుత్వానికి గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి దూరం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఏర్పడ్డ నగదు కొరత.. వ్యాపారాలు, బ్యాంకుల నిర్వహణకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. ఇక కరెన్సీ కొరత అఫ్గన్ పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అకౌంట్లలో డబ్బులున్నా.. నిల్వలు నిండుకోవడంతో బ్యాంకులకు క్లోజ్డ్ బోర్డులు కనిపిస్తున్నాయి. కరెన్సీ కోసం వందల కిలోమీటర్లు వెళ్లినా లాభం లేకపోవడంతో దొరికిన వస్తువునల్లా తాకట్టు పెట్టి, అధిక వడ్డీకి డబ్బును తెచ్చుకుంటున్నారు కొందరు. బ్యాంకుల ముందు నగదు కోసం బారులు తీరిన జనం ఉత్పత్తుల కొరతతో ఆహార, ఇంధన ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు అఫ్గన్ అంతటా ఇదే పరిస్థితి. వీటికి తోడు ఆకలి కేకలు మొదలయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా 30 లక్షల మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులకు గురవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి పది లక్షల చిన్నారులు మరణించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఫర్నీచర్ అమ్ముకుని మరీ.. ఆర్థికంగా చితికిపోయిన వందల కుటుంబాలు రాజధాని కాబూల్ రోడ్ల మీదకు చేరి ఇంట్లోని సామాన్లు అమ్మేసుకుంటున్నారు. ఆకలి తీర్చుకునేందుకు వస్తు మార్పిడికి పాల్పడుతున్నారు. ఇక ప్రధాన నగరాల ఆస్పత్రుల్లో మందుల కొరత, వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది ఉద్యోగాలకు గుడ్‌బై చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులు చిన్నపిల్లలతో నిండిపోతున్నాయి. పిల్లలకు తిండి పెట్టలేని తల్లిదండ్రులు.. అనారోగ్యం పేరుతో ఆస్పత్రుల్లో చేర్పిస్తున్న దయనీయమైన పరిస్థితి నెలకొంది. ఆధారపడడం వల్లే! అఫ్గనిస్తాన్ ఎన్నో ఏండ్లుగా దిగుమతి ఆహారం, నిత్యావసరాలు, ఇంధనాల మీదే ఆధారపడి ఉంటోంది. సొంతంగా ఎలాంటి వనరులను వృద్ధి చేసుకోలేదు. ప్రతీదానికి పొరుగు దేశాల వైపు చూస్తుండేది. తాలిబన్ ఆక్రమణ తర్వాత సరిహద్దులు కూడా మూసుకుపోవడంతో ఆహారం, మందులతో సహా అన్నింటి కొరత ఏర్పడింది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఫారిన్ ఎయిడ్ (విదేశీ సాయం) అఫ్గన్ జీడీపీని తీవ్రంగా ప్రభావితం చేసేది. ఆరోగ్యం, విద్యా సేవలకు అందులో నుంచే 75 శాతం ఖర్చు చేసేది ప్రభుత్వం. కానీ, తాలిబన్లు అధికారంలోకి వచ్చాక బైడెన్ ప్రభుత్వం ఏకంగా 9.5 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను నిలిపివేసింది. అంతేకాదు అఫ్గన్ కేంద్రీయ బ్యాంక్‌కు అవసరమైన డాలర్ల పంపడం ఆపేసింది. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ఓ దేశం త్వరగతిన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ప్రపంచ సమాజం చూడబోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తాలిబన్ ప్రభుత్వానిది. గతంలో లక్షల మందికి ఉపాధి కల్పించిన ప్రైవేట్ సెక్టార్.. ఇప్పుడు మూగబోయింది. వచ్చే ఏడాది జూన్ కల్లా 97 శాతం అఫ్గనిస్తాన్ జనాభా దారిద్ర్యరేఖ దిగువకు మునిగిపోనుందని యూఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విశ్లేషించింది. దీనికితోడు ఉపాధి కరువు, అవినీతి, పేదరికం, కరువు.. తాలిబన్ పాలనలో అఫ్గన్ నేలను ఆర్తనాదాలు పెట్టిస్తోంది. కరెన్సీ కొరతను అధిగమించేందుకు విత్‌డ్రా కరెన్సీపై పరిమితులు విధించిన అఫ్గన్ ప్రభుత్వం.. చైనా, పాకిస్థాన్, ఖతర్, టర్కీ దేశాలకు ఆ లోటును పూడ్చేందుకు విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాదు వీలైనంత మేర సాయం ద్వారా ఉపశమనం అందించాలని, లేదంటే యూరప్ దేశాలకు వలసలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. సెప్టెంబర్‌లో బైడెన్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూనే.. మానవతా ధృక్పథంతో కొన్ని మినహాయింపులతో సాయం అందించేందుకు ఒప్పుకుంది. కానీ, ఆ మినహాయింపుల ద్వారా ఒరిగింది ఏంలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న కరెన్సీ ఆంక్షలు ఇలాగే కొనసాగితే అఫ్గన్ పౌరుల జీవితాలు తలకిందులు అవుతాయి. ఈ పరిణామాలు ఊహించలేనంత ఘోరంగా ఉంటాయనేది నిపుణుల హెచ్చరిక. అయితే బిలియన్నర డాలర్ల సాయాన్ని తాజాగా ప్రకటించిన అమెరికా, యూరప్ యూనియన్లు.. అఫ్గన్ అంతర్గత వ్యవస్థ బలపడనంత వరకు మానవతా కోణంలో బయటి దేశాల నుంచి సాయం ఎంత అందినా లాభం ఉండదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కన్నీటిని కన్నీటితోనే తుడవలేం! స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా పోరాడుదాం..
International Day for the Elimination of Violence against Women: ఒకరోజు వెనక్కి వెళితే... కేరళలోని ఎర్నాకుళంలో పర్వీన్ అనే లా స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. తన చేతిరాతతో కూడిన ఒక సూసైడ్ నోట్ సంఘటన స్థలంలో దొరికింది. భర్త, అత్తమామలు పెట్టే హింసను తట్టుకోలేక చనిపోతున్నానని రాసింది. రెండు రోజులు వెనక్కి వెళితే... కెన్యాలో అకియో అనే పేరుగల స్త్రీ హత్యకు గురైంది. చంపింది ఎవరో కాదు... భర్తే. అనుమాన పీడితుడైన భర్త అకియోను తరచు హింసించేవాడు. ఒకరోజు బాగా తాగి వచ్చి అందరూ చూస్తుండగానే భార్యను హత్య చేశాడు. కేరళ నుంచి కెన్యా వరకు, అమెరికా నుంచి చైనా వరకు...దేశాల మధ్య భౌగోళిక దూరాలు ఉండొచ్చుగానీ, స్త్రీలపై జరిగే హింస విషయంలో మాత్రం ఎలాంటి దూరాలు లేవు. ఇక్కడెంతో అక్కడంతే! అక్కడెంతో ఇక్కడ అంతే!! బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, వర్ణవివక్షతతో కూడిన హింస, లింగనిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు, పరువు హత్యలు... ఇలా వివిధ రూపాల్లో స్త్రీలపై జరిగే హింసను నిరోధించడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం స్త్రీ హింసా వ్యతిరేక దినం (నవంబర్ 25) సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది, ఈ సంవత్సరం ‘ఆరేంజ్ ది వరల్డ్: ఫండ్, రెస్పాండ్, ప్రివెంట్, కలెక్ట్’ గ్లోబల్ థీమ్‌తో నేటి నుంచి డిసెంబర్ 10 (మానవ హక్కుల దినోత్సవం) వరకు 16 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటిలో ప్రపంచవ్యాప్తంగా 6000కు పైగా ఉమెన్ ఆర్గనైజేషన్స్, 180 దేశాల ప్రతినిధులు, మరెంతో మంది స్త్రీ ఉద్యమ కార్యకర్తలు పాల్గొంటారు. చదవండి: Winter Heart Attacks: అందుకే శీతాకాలంలో హార్ట్ అటాక్స్ అధికంగా సంభవిస్తాయి..! కన్నీటిని కన్నీటితోనే తుడవలేం...కార్యాచరణ కావాలి...ప్రణాళిక కావాలి. ఆచరణ వైపు వడివడిగా అడుగులు పడాలి. ఈ సమావేశాలు అలాంటి పనే చేస్తున్నాయి. లోకల్, కంట్రీ, గ్లోబల్ నేపథ్యంలో ఆలోచనలు, ఆచరణలను సమన్వయం చేస్తున్నాయి. ‘ఇదిగో మా దగ్గర ఇలా చేశాం. మీ దగ్గర మాత్రం ఎందుకు చేయరు’ అని ఒక సూచన ఇస్తాయి. హింసకు వ్యతిరేకంగా పోరాడే స్త్రీ యోధురాళ్ల ఉపన్యాసాలు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తాయి. ‘ఎక్కడో మహిళలపై జరిగే హింస గురించి మాట్లాడడానికి ముందు, మీ ఇంట్లో అలాంటి హింస జరగకుండా చర్యలు తీసుకోండి’ అని దేశ దేశాలకు ఉపదేశం ఇస్తాయి. కాలంతో పాటు హింసా రూపాలు మారుతున్నాయి. కొత్తగా ‘డిజిటల్ వయొలెన్స్’ వచ్చింది... ఇలాంటి ఎన్నో వికృతరూపాల గురించి ఈ సమావేశాలు లోతుగా చర్చిస్తాయి. నిర్మాణాత్మకమైన పరిష్కార మార్గాలు ఆలోచిస్తాయి. ‘ఎండ్ వయొలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ నౌ’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదం ఇచ్చేలా చేస్తాయి. చదవండి: Octopus Unknown Facts: 9 మెదడులు, 3 గుండెలు.. ఐనా పాపం పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!! -
మరో సంక్షోభం దిశగా అఫ్గన్! ఐరాస హెచ్చరిక
తాలిబన్ల ఆక్రమణ, అల్లకల్లోల పరిస్థితులు, బయటి దేశాలతో వర్తక వాణిజ్యాలు నిలిచిపోవడం.. తదితర కారణాలతో అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలుకు లోనైంది. ఈ తరుణంలో అఫ్గనిస్తాన్ పై మరో పిడుగు పడనుంది. ఊహించని స్థాయిలో ఆర్థిక సంక్షోభం అఫ్గన్‌ను ముంచెత్తే అవకాశాలున్నాయంటూ హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి. యూఎన్ డెవలప్మెంట్ ప్రొగ్రాం(UNDP) సోమవారం మూడు పేజీలతో కూడిన ఒక నివేదికను రిలీజ్ చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయని, తద్వారా ఆర్థిక తలెత్తే అవకాశం ఉందని, ఆ ప్రతికూల ప్రభావం సొసైటీపై ఊహించని స్థాయిలో చూపించ్చొచ్చని అభిప్రాయపడింది ఐరాస. కిందటి ఏడాది 7 బిలియన్ డాలర్ల విలువైన గూడ్స్, ఉత్పత్తులను, సేవలను అందించింది అఫ్గనిస్తాన్. ఎలాంటి అవాంతరాలు లేకుండా లావాదేవీలు జరగడానికి కారణం.. అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థే. అయితే చాలామంది లోన్లు తిరిగి చెల్లించకపోవడం, తాలిబన్ల ఆక్రమణ తర్వాత నగదు విత్‌డ్రా, అదే సమయంలో డిపాజిట్లు తక్కువగా వస్తుండడం, అవసరాలకు సరిపడా కరెన్సీ నిల్వలు లేకపోవడంతో.. కొద్దినెలల్లోపే ఈ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఐరాస యూఎన్డీపీ నివేదికలో పేర్కొంది. ఇప్పటికైనా తేరుకుని బ్యాంకింగ్ వ్యవస్థను బలపర్చాలని తాలిబన్ ప్రభుత్వానికి సూచించింది ఐక్యరాజ్య సమితి. ఇందుకోసం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు సైతం సహకరించాలని యూఎన్డీపీ అభిప్రాయపడింది. మరోవైపు కఠిన ఆంక్షల విధింపు, విదేశీ నిధులు నిలిచిపోవడం, తాలిబన్ల ఆక్రమణ టైంలో వర్తకవాణిజ్యాలు ఆగిపోవడంతో పాటు అఫ్గన్‌కు రావాల్సిన బకాయిలు నిలిచిపోవడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలావరకు దెబ్బతింది. ఈ తరుణంలో బ్యాంకింగ్, డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ వ్యవస్థలు సైతం దెబ్బతింటే గనుక.. ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చినా ఆ సంక్షోభం నుంచి కోలుకోవడానికి దశాబ్దాల సమయం పట్టే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
ఎలక్ట్రిక్ శకంలో ‘ఈ’ చెత్తకు తుది ఏది? ఇవీ దుష్ఫ్రభావాలు..!
భూతాపం సెగలకు అంతర్జాతీయ వేదికలు వేడెక్కుతున్నాయి. శిలాజ ఇంధనాలకు వీలైనంత తొందరగా తిలోదకలాచ్చేసి, శరవేగంగా ఎలక్ట్రిక్ శకాన్ని ప్రారంభించడానికి ప్రపంచ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. భూతాపం దూకుడును కట్టడి చేయడానికి కలసికట్టుగా నడుంబిగిస్తున్నామని బల్లలుగుద్ది మరీ బలంగా చెబుతున్నారు. ఇవన్నీ సరే, టీవీలూ మొబైల్ ఫోన్లూ ఇంటింటి వస్తువులుగా మారిన హైటెక్కుటమారాల యుగంలో రోజూ పోగుపడుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు– అదేనండీ– ఈ–చెత్త! దీనికి సరైన విరుగుడు ఎప్పటికి దొరుకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. భూతాపం పెరుగుదలలో ఈ–చెత్త ఇతోధిక పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ–చెత్త ఎక్కడెక్కడ ఎంతెంతగా తయారవుతోందో, ఎక్కడెక్కడ ఎంతెంతగా పోగుపడుతోందో, ఇది పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఏ స్థాయిలో చేటు కలిగిస్తోందో ఆ కథా కమామిషూ తెలుసుకుందాం. తాజా అంచనాల ప్రకారం గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా పోగుపడిన ఈ–చెత్త 53.6 మిలియన్ టన్నులు. ఏడాదికేడాది ఈ–చెత్త కొండలా పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. అంటే, ప్రపంచంలో ప్రతి మనిషి సగటున దాదాపు ఏడు కిలోల ఈ–చెత్త పోగు చేస్తున్నట్లు లెక్క! అభివృద్ధి చెందిన దేశాలు ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు పనికిరాని స్థితికి చేరుకున్నాక, ఇవి తుక్కు తుక్కుగా చెత్త చెత్తగా మిగులుతున్నాయి. ఈ–చెత్త విలువలేనిదేమీ కాదు, ఏటా దాదాపు 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.75 వేల కోట్లు) విలువ చేసే ప్లాటినమ్, బంగారం, వెండి, రాగి వంటి లోహాలు ఈ–చెత్తతో పాటే డంపింగ్ యార్డులకు చేరుతున్నాయి. మన భారత్ నుంచి ఏటా 3 మిలియన్ టన్నులకు పైగా ఈ–చెత్త పోగవుతోంది. ఎడాపెడా ఎలక్ట్రానిక్ వస్తువులను వాడి పడేసే అభివృద్ధి చెందిన దేశాలు, తమ దేశాల్లో పోగుపడిన ఈ–చెత్తను పారబోయడానికి నిరుపేద దేశాలను డంపింగ్ యార్డుల్లా వాడుకుంటున్నాయి. మరో నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ–చెత్త ఏటా 33 శాతం మేరకు పెరుగుతుందని, ఈ పరిమాణం ఎనిమిది గ్రేట్ ఈజిప్షియన్ పిరమిడ్ల కంటే ఎక్కువని ఐక్యరాజ్య సమితి ‘స్టెప్ ఇనీషియేటివ్’ (సాల్వింగ్ ఈ–వేస్ట్ ప్రాబ్లెమ్ ఇనీషియేటివ్) హెచ్చరిస్తోందంటే, ఈ–చెత్త సమస్య ప్రపంచానికి ఏ స్థాయిలో ముప్పుగా పరిణమిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్త సమస్యగా పరిణమించిన ఈ–చెత్త సమస్య పరిష్కారం కోసమే ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం 2007లో ‘స్టెప్ ఇనీషియేటివ్’ను ప్రారంభించింది. మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, ట్యాబ్‌లు, డిజిటల్ కెమెరాలు, ఎలక్ట్రానిక్ ఆటబొమ్మలు తదితర వస్తువులు, వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాలు ప్రతిఏటా పెద్దసంఖ్యలో తయారవుతున్నాయి. కొత్తగా ఎన్ని తయారవుతున్నాయో, అందుకు తగ్గట్లే పాతబడినవి, పనికిరాకుండా పోయినవి చెత్తగుట్టలకు చేరుకుంటున్నాయి. ఇళ్లలో పేరుకునే రోజువారీ తడిచెత్త, పొడిచెత్తలతో పోల్చి చూస్తే, ఈ–చెత్త పర్యావరణానికి మరింతగా హాని కలిగిస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ప్లాటినమ్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు మాత్రమే కాదు, సీసం, తగరం, పాదరసం, ఆర్సెనిక్, కాడ్మియం, లిథియం, బేరియం వంటి ప్రమాదకరమైన భారలోహాలు కూడా ఉంటాయి. ఒక సాదాసీదా మొబైల్ లేదా లాప్టాప్ సర్క్యూట్బోర్డులో పదహారు వేర్వేరు లోహాలు ఉంటాయి. ఇవి నేలలోకి చేరుకుంటే, భూసారం క్షీణిస్తుంది. జలాశయాల్లోకి చేరుకుంటే, తాగునీటి కాలుష్యం తప్పదు. చివరకు సముద్రాల్లోకి చేరినా, సముద్రాల్లో జీవించే జలచరాల మనుగడకు ముప్పు. ఇక ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ఎక్కువగా ఉపయోగించే పదార్థం ప్లాస్టిక్. చెత్తకుప్పల్లోకి చేరిన ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి విలువైన లోహాలను వేరుచేసి, సేకరించేందుకు వీటిని ఇష్టానుసారం తగులబెడుతుండటం మామూలే. ఫలితంగా ఈ–చెత్త వల్ల వాయుకాలుష్యం కూడా ఏర్పడుతోంది. ‘సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఎప్పటికప్పుడు అధునాతనమైన ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా, కొనుగోలు చేసిన కొద్దికాలానికే మొబైల్ ఫోన్లు, టీవీలు, లాప్‌టాప్‌లు వంటివి మూలపడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల జీవితకాలం బొత్తిగా తక్కువవుతోంది. ఫలితంగా ఈ–చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది’ అని స్టెప్ ఇనీషియేటివ్ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ ర్యూడిగర్ క్వెహర్ చెబుతున్నారు. ‘ఈ–చెత్త వల్ల కలిగే అనర్థాలను కొన్నిదేశాలు మాత్రమే అర్థం చేసుకుని, చర్యలు ప్రారంభించాయి. చాలా దేశాల్లో ఏటా పోగుపడే ఈ–చెత్తపై కచ్చితమైన లెక్కలు సేకరించే పరిస్థితి కూడా లేదు’ అని యూరోపియన్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ చెబుతోంది. యూరోపియన్ దేశాల నుంచి ఏటా దాదాపు 1.3 మిలియన్ టన్నుల ఈ–చెత్త వెనుకబడిన ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఓడల్లో తరలుతోందని కూడా ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ–చెత్తకు డంపింగ్ యార్డులుగా మారిన ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఏటా సంభవిస్తున్న మరణాల్లో దాదాపు ఇరవై శాతానికి పైగా మరణాలు ఈ–చెత్త కాలుష్యం కారణంగా సంభవిస్తున్నవేనని, ఇక దీని ఫలితంగా రకరకాల వ్యాధులకు లోనవుతున్న వారి సంఖ్య ఊహించుకోవాల్సిందేనని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ–చెత్తలో మనది మూడోస్థానం మన దేశంలో ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 5 మిలియన్ టన్నుల ఈ–చెత్త పేరుకోవచ్చని ‘స్టెప్ ఇనీషియేటివ్’ అంచనా. ఈ–చెత్త పరిమాణంలో చైనా, అమెరికాల తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. చైనాలో అత్యధికంగా 10.1 టన్నులు, అమెరికాలో 6.9 మిలియన్ టన్నులు, భారత్‌లో 3.2 మిలియన్ టన్నులు ఈ–చెత్త పోగుపడినట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యాలు తమ దేశంలో పోగుపడిన ఈ–చెత్తను తమ దేశంలోనే రీసైకిల్ చేసే ప్రయత్నాలు చేయకుండా, నిరుపేద దేశాలకు తరలిస్తున్నాయి. ఈ పరిస్థితికి ఉదాహరణ చెప్పుకోవాలంటే, నిరుపేద ఆఫ్రికా దేశమైన ఘనాలో అగ్రరాజ్యాలు పోగేస్తున్న ఈ–చెత్తపై 2018లో ‘వెల్కమ్ టు సోడోమ్’ అనే డాక్యుమెంటరీ విడుదలైంది. విషపూరితమైన ఈ–చెత్తకుప్పల మధ్యే అక్కడి పిల్లలు కాలం గడుపుతున్న దృశ్యాలు కలచివేస్తాయి. ఈ–చెత్త నుంచి విలువైన లోహాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యే కార్మికులు తలనొప్పి, శ్వాసకోశ వ్యాధులు, ఛాతీనొప్పి, నీరసం, మగత, తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి దీర్ఘకాలిక రుగ్మతలకు లోనవుతున్నారు. ఈ–చెత్త కుప్పల మధ్యే ఎక్కువకాలం గడిపేవారిలో డీఎన్ఏ సైతం దెబ్బతింటున్నట్లు వైద్యపరిశోధకులు గుర్తించారు. ఏటా పోగవుతున్న ఈ–చెత్తను రీసైక్లింగ్ కోసం సేకరించే శ్రద్ధ కూడా మన దేశంలో బొత్తిగా కొరవడుతోంది. ఈ ఏడాది విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం, 2018–19లో పోగైన ఈ–చెత్తలో 3.5 శాతం, 2019–20లో 10 శాతం మాత్రమే రీసైక్లింగ్ కోసం సేకరించారు. మిగిలిన ఈ–చెత్తంతా పర్యావరణంలోకే చేరుతోంది. మన దేశంలో స్థానిక సంస్థలు ఈ–చెత్త సేకరణ జరుపుతున్న దాఖలాలు దాదాపు కనిపించవు. దేశవ్యాప్తంగా కేవలం 312 అధికారిక కేంద్రాలు మాత్రమే ఈ–చెత్త సేకరణ అరకొరగా జరుపుతున్నాయి. ఇవికాకుండా, ఢిల్లీలోని సీలమ్పూర్, ముంబైలోని ధారవి, మీరట్, మొరాదాబాద్ వంటి చోట్ల అనధికారిక ఈ–చెత్త రీసైక్లింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇలాంటి అనధికారిక ఈ–చెత్త సేకర్తలను స్థానికంగా ‘కబాడీవాలా’లుగా పిలుచుకుంటారు. ఎలాంటి శిక్షణ లేని కార్మికులు, కనీసమైన వసతులు, జాగ్రత్తలు సైతం లేని ఈ కర్మాగారాల్లో ఈ–చెత్త రీసైక్లింగ్ వల్ల పర్యావరణానికి ఒరిగే మేలు కంటే జరిగే కీడే ఎక్కువగా ఉంటోంది. సేకరించిన ఈ–చెత్తకు వీరు చేసే రీసైక్లింగ్ అంతా, పాడైన పరికరాల నుంచి విలువైన లోహాలను వేరుచేసి, సేకరించడమే! ఈ పనికోసం వారు సైనైడ్ కలిసిన యాసిడ్లను వాడుతుంటారు. ఈ ప్రక్రియలో వెలువడే విషపూరితమైన పొగవల్ల ఆ కేంద్రాల్లో పనిచేసే కార్మికులతో పాటు చుట్టుపక్కల ప్రజలకు కూడా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటి ద్వారా వెలువడే నీరు కొంత వీధుల్లోకి, కొంత మురుగు కాలువల్లోకి, వాటి ద్వారా సమీపంలోని జలాశయాల్లోకి, నదుల్లోకి చేరుతుండటంతో నీటి కాలుష్యం కూడా ఏర్పడుతోంది. చదవండి: The Exorcism Of The Emily Rose: ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!! చట్టాలూ నిబంధనలూ ఉన్నా... మన దేశంలో కాలుష్య నివారణ కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో పాటు వివిధ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 1974లో జల చట్టం కింద కాలుష్య నియంత్రణ మండలిని జాతీయస్థాయి సంస్థగా ఏర్పాటు చేసింది. తర్వాతి కాలంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాల స్థాయిలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లను ఏర్పాటు చేసుకున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటైన కాలానికి ఈ–చెత్త బెడద అంతగా ఉండేది కాదు. కంప్యూటర్ల శకం మొదలైన తర్వాత ఈ–చెత్త తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇది ప్రపంచ సమస్యగా మారిన నేపథ్యంలో వివిధ అంతర్జాతీయ వేదికల్లో జరిగిన చర్చల్లో దీనికోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించుకోవడానికి వివిధ దేశాలు సిద్ధపడ్డాయి. ఇందులో భాగంగానే కేంద్రప్రభుత్వం ‘ఈ–వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్’ను 2016లో రూపొందించగా, ఈ నిబంధనలు 2017 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం అనుమతి పొందిన సంస్థలు మాత్రమే ఈ–చెత్త రీసైక్లింగ్ చేయాలి. ఈ నిబంధనలు అమలులోకి వచ్చినా, దేశంలో అనుమతి పొందిన రీసైక్లింగ్ కేంద్రాల కంటే, కనీస సౌకర్యాలు లేని అనధికారిక రీసైక్లింగ్ కేంద్రాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా పేరుకుపోతున్న ఈ–చెత్తతో పోల్చి చూసుకుంటే, రీసైక్లింగ్ కేంద్రాలకు చేరుతున్నది చాలా తక్కువ. మిగిలినదంతా ఖాళీస్థలాల్లోకి, నదులు, సముద్రాల్లోకి చేరుతూ పర్యావరణానికీ, ప్రజల ఆరోగ్యానికీ భారీ స్థాయిలో చేటు కలిగిస్తోంది. ఇవీ ఆరోగ్య నష్టాలు ఈ–చెత్త పర్యావరణంలోకి చేరిన పరిసరాల్లో జీవించే వారికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ–చెత్త కారణంగా గాలి, నీరు, నేల కాలుష్యానికి లోనవుతాయి. ఈ–చెత్త వల్ల ఏర్పడే కాలుష్యానికి బహిర్గతమైన వారిలో ఎదుగుదల లోపాలు, బుద్ధిమాంద్యం, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, వంధ్యత్వం, హార్మోన్ల అసమతుల్యతలు, కిడ్నీ, లివర్, గుండె వంటి కీలక అవయవాల పనితీరు దెబ్బతినడం, డీఎన్ఏ మార్పులు, కండరాల బలహీనత, ఎముకల బలహీనత, ఊపిరితిత్తుల క్యాన్సర్ సహా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలు అకాల మరణాలకు కారణమవుతాయి. ప్రమాద ఘంటికలపై ప్రపంచం ఆందోళన భూతాపం పెరుగుదలపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భూతాపాన్ని అరికట్టే లక్ష్యంతో ఇప్పటికే ఐక్యరాజ్య సమితి పలుమార్లు ప్రపంచ దేశాల సమావేశాలను (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–సీఓపీ–26) నిర్వహించింది. ఇటీవల గ్లాస్గోలో జరిగిన సమావేశంలో సైతం పెరుగుతున్న భూతాపం కారణంగా పర్యావరణంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటికే మోగుతున్న ఈ ప్రమాద ఘంటికలను పట్టించుకోకుంటే, భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయానికి వచ్చాయి. భూతాపాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఈ సమావేశాల్లో పాల్గొన్న ప్రపంచ దేశాలు కూలంకషంగా చర్చలు సాగించి, పలు ప్రతిపాదనలను ముందుకు తెచ్చాయి. 2030 నాటికి కనీసం 30 శాతం నేలను, నీటిని పరిరక్షించుకోవాలని, ఈ మేరకు నేలపైనా, నీటిలోనూ జీవవైవిధ్యాన్ని కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ఈ గడువులోగా దేశాలన్నీ అడవుల నరికివేతను పూర్తిగా అరికట్టాలని, ఇందుకోసం కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవాలని, 2050 నాటికల్లా కర్బన ఉద్గారాలకు కారణమయ్యే శిలాజ ఇంధనాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టే దిశగా నడుం బిగించుకోవాలని తీర్మానించుకున్నాయి. గ్లాస్గోలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ పాశ్చాత్యదేశాల్లో ఒత్తిళ్లకు భారత్ తల ఒగ్గబోదని స్పష్టం చేస్తూనే, పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ తీసుకుంటున్న చర్యలను వివరించారు. భూతాపాన్ని తగ్గించే దిశగా, పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ కట్టుబడి ఉంటుందని మోదీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా వివిధ దేశాధినేతలు భూతాపాన్ని తగ్గించేందుకు ఉద్గారాలను అరికట్టడానికి సత్వర చర్యలను ముమ్మరం చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా శిలాజ ఇంధనాల వినియోగాన్ని అరికట్టడంపైనే దృష్టిసారించారు. పర్యావరణానికి చేటు కలిగిస్తున్న ఈ–చెత్త అంశానికి సీఓపీ–26 అజెండాలో చోటివ్వకపోవడం శోచనీయం. పర్యావరణ మార్పులపై చేపట్టే అంతర్జాతీయ సమావేశాల్లో ఈ–చెత్త అంశానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా, భూతాపాన్ని తగ్గించే లక్ష్యాలను చేరుకోవడం దుస్సాధ్యం. ఈ–చెత్తలో చేరుతున్నవివే! ఈ–చెత్తలో చేరుతున్న వస్తువులను యూరోపియన్ యూనియన్ పది రకాలుగా విభజించింది. అవి: ►భారీ గృహపరికరాలు (ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు వంటివి) ►చిన్న గృహపరికరాలు (ఎలక్ట్రిక్ స్టవ్‌లు, ఇండక్షన్ స్టవ్‌లు, డిజిటల్ వాచీలు వంటివి) ►ఐటీ–టెలికం పరికరాలు (లాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు తదితరమైనవి) ►వినియోగదారుల వస్తువులు (డిజిటల్ కెమెరాలు, పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్స్ వంటివి) ►లైటింగ్ పరికరాలు (ట్యూబ్‌లైట్లు, ఎల్ఈడీ లైట్లు, వాటి హోల్డర్లు వంటివి) ►ఎలక్ట్రికల్–ఎలక్ట్రానిక్ పనిముట్లు ►ఎలక్ట్రానిక్ ఆటబొమ్మలు, క్రీడా పరికరాలు ►వైద్య పరికరాలు (బీపీ యంత్రాలు, సుగర్ యంత్రాలు వంటివి) ►మానిటరింగ్ పరికరాలు (సీసీ కెమెరాలు వంటివి) ►ఆటోమేటిక్ డిస్పెన్సర్స్ (వెండింగ్ మెషిన్లు, వెయింగ్ మెషిన్లు తదితరమైనవి) కబాడీవాలాల కథ ‘కబాడీవాలాలకు ఈ–చెత్తను ఇవ్వడం ఏమీ ఎరుగని పసిపిల్లవాడి చేతికి కత్తిని ఇవ్వడం ఒకటే! కబాడీవాలాలకు ఈ–చెత్తను ఇస్తే తమకు తాము ప్రమాదంలో చిక్కుకోవడమే కాకుండా, ఇతరులనూ ప్రమాదంలోకి నెట్టేస్తారు’ అని గోవాకు చెందిన ఈ–చెత్త సేకరణ సంస్థ ‘గ్రూప్ టెన్ప్లస్’ వ్యవస్థాపకుడు ఆష్లే డెలానే వ్యాఖ్యానించారు. ‘గ్రూప్ టెన్ప్లస్’ ఈ–చెత్త సేకరణ కోసం ప్రారంభించిన లైసెన్స్డ్ సంస్థ. కబాడీవాలాలు నడిపే కేంద్రాల్లో ఈ–చెత్త నుంచి విలువైన లోహాలను మాత్రమే వేరు చేసి, మిగిలిన వాటిని యథేచ్ఛగా పర్యావరణంలోకి వదిలేస్తుంటారని, దీనివల్ల పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని డెలానే చెబుతున్నారు. ఉదాహరణకు ట్యూబ్‌లైట్, సీఎఫ్ఎల్ బల్బులు, కాలంచెల్లిన బ్యాటరీలు వంటివాటిని మట్టిలో పడేస్తే, వాటిలోని పాదరసం, సీసం వంటి ప్రమాదకర భారలోహాలు మట్టిలోకి చేరి, వాటి ఫలితంగా ఆ ప్రదేశంలోని మట్టి ఎందుకూ పనికిరానంతగా నాశనమవుతుందని, అక్కడ భూసారం శాశ్వతంగా దెబ్బతింటుందని ఆయన వివరించారు. ఇష్టానుసారంగా ఈ–చెత్త వ్యవసాయ భూముల్లోకి చేరితే, భవిష్యత్తులో ప్రజల ఆహారభద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. చదవండి: The New York Earth Room: ‘చెత్త’ అపార్ట్మెంట్ రికార్డు.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి నేనే!! -
తెలంగాణ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు..
న్యూఢిల్లీ: తెలంగాణలోని పోచంపల్లి (యాదాద్రి భువనగిరి జిల్లా) గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ జాబితాలో పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో అవార్డుల ప్రధానం జరగనుంది. కాగా, పోచంపల్లి గ్రామానికి గుర్తింపుపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గుర్తింపు రావడానికి కృషి చేసిన మంత్రిత్వశాఖ అధికారులను కిషన్ రెడ్డి ప్రశంసించారు. చదవండి: (బీజేపీ నేతలకు సిగ్గుండాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి) -
అక్కడా... బడా కంపెనీల లాబీయింగ్?
వ్యవసాయం, పంట ఉత్పత్తుల శుద్ధి, రవాణా, నిల్వ, పంపిణీ – ఈ గొలుసు మొత్తం కలిస్తే అది ‘ఆహార వ్యవస్థ’ (ఫుడ్ సిస్టం). ప్రతి ఒక్కరి మనుగడా ఆహార వ్యవస్థపైనే ఆధారపడి ఉంటుంది. పది వేల ఏళ్ల సంప్రదాయ సేద్య జ్ఞానానికి ప్రతి రూపమై ఔషధంగా విరాజిల్లిన ఆహారం.. రసాయనాలు రంగంలోకొచ్చిన వందేళ్లలోనే – భూగోళానికి, మనుషులకు, పశు పక్ష్యాదులకు – హానికరంగా మారిపోవటం విషాదకరమైన వాస్తవం. దశాబ్దాల తరబడి పారిశ్రామిక / రసాయనిక పద్ధతుల్లో ఆహార వ్యవస్థలను నిర్వహించడం వల్లనే ఈ ముప్పు వచ్చి పడింది. ‘ఇలా రసాయనిక పద్ధతుల్లో పండించిన/శుద్ధి చేస్తున్న, సుదూర ప్రాంతాలకు తరలించి పంపిణీ చేస్తున్న ఆహారం భూతాపోన్నతికి 34% కారణమవుతోంది. పోషకాల లోపంతో, రసాయనిక అవశేషాలతో కూడిన ఈ పారిశ్రామిక ఆహారం ప్రకృతి వనరులకు, వినియోగదారుల ఆరోగ్యానికి ‘నష్టదాయ కంగా’ తయారైంది. ఆహార వ్యవస్థల దుర్గతి వల్ల 70% మంచి నీరు ఖర్చవుతోంది. అంతేకాదు... జీవవైవిధ్యం తరిగి పోవడానికి 80% ఇవే కారణమ’ని ఐరాస తాజా నివేదిక విస్పష్టంగా ప్రకటించింది. ఐరాస శిఖరాగ్రసభ ఆహార వ్యవస్థలను పర్యావరణానికి, ఆరోగ్యానికి నష్టదాయకం కాని తీరులోకి ఇప్పటికైనా మార్చుకుంటే ఈ దుస్థితి నుంచి మానవాళిని, భూగోళాన్ని రక్షించుకోగలమని ఐరాస గుర్తించింది. ఇందుకు దోహదపడే అనుభవాలు, ఆవిష్కరణలను క్రోడీకరించి ప్రపంచ దేశాలకు అందించడానికి ‘ఆహార వ్యవస్థల శిఖరాగ్ర సభ’ను 18 నెలల కసరత్తు చేసి మరీ గత నెల 23న ఐరాస నిర్వ హించింది. 193 దేశాలకు చెందిన 51 వేల మంది పాల్గొన్నారు. ఆహార వ్యవస్థలలో సమూలంగా, గుణాత్మక మార్పు తేవడానికి 2 వేలకు పైగా సూచనలు, అనుభవాలను పంచుకున్నారని ఐరాస ప్రకటించింది. అయితే, ఉత్తమ సంప్రదాయాలకు ఐరాస తిలోదకాలివ్వటంతో అంతర్జాతీయంగా పెద్ద దుమారమే రేగింది. బహుళజాతి కంపెనీల కొమ్ము కాచే అంతర్జాతీయ వితరణ సంస్థల కనుసన్నల్లోనే ఆద్యంతం ఈ తంతు సాగిందంటూ పలు అంతర్జాతీయ పౌర, స్వచ్ఛంద, రైతు సంస్థలు భగ్గుమన్నాయి. ఏమిటీ పౌర సంస్థల అభ్యంతరం? ఆహారం గురించి, పౌష్టికత గురించి ప్రజాస్వామికంగా చర్చించి సభ్య దేశాలకు విధానపరమైన సూచనలు అందించే అధికారం ఐక్యరాజ్యసమితిలోని ఆహార భద్రతా కమిటీ (సి.ఎఫ్.ఎస్.)కి ఉంది. ఇందులో సభ్య దేశాలతో పాటు రైతులు, ఆదివాసులు, పౌర, స్వచ్ఛంద సంస్థలకు కూడా పూర్వం నుంచి సముచిత ప్రాతినిధ్యం ఉంది. విధాన నిర్ణయాలపై ఆయా దేశాలకు సూచనలు పంపడానికి ముందే పౌర సంస్థలు తమకున్న అభ్యంతరాలను తెలియజెప్పడానికి, ఆయా దేశాలతో చర్చించడా నికి అవకాశం ఉంటుంది. అయితే, ఆహార వ్యవస్థల శిఖరాగ్ర సభ విషయంలో ఐరాస సెక్రటరీ జనరల్ భిన్నంగా వ్యవహరిం చారు. సి.ఎఫ్.ఎస్.ను పక్కనపెట్టి.. కార్పొరేట్ సంస్థలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తిని ప్రత్యేక ప్రతినిధిగా నియమించి శిఖరాగ్ర సభను జరిపించటం ఏమిటని స్వచ్ఛంద సంస్థలతోపాటు ఆహార హక్కుపై ఐరాస ప్రత్యేక ప్రతినిధి మైఖేల్ ఫక్రి కూడా నిరసించటం విశేషం. కొద్ది కంపెనీలదే రాజ్యం ప్రపంచ ఆహార, వినిమయ వస్తువుల వాణిజ్యం అతికొద్ది బహుళ జాతి కంపెనీల చేతుల్లో కేంద్రీ కృతం కావడమే ముఖ్య సమస్య. ప్రపంచ విత్తనాల మార్కెట్లో 53% వాటా 2 కంపెనీలదే. వ్యవసాయ రసాయనాల ఉత్పత్తి, వాణిజ్యంలో 70% వాటా 3 కంపెనీలదే. పశువులకు సంబంధించిన బ్రీడింగ్, ఔషధాలు, వ్యవసాయ యంత్రాల తయారీ, సరుకు వాణిజ్యంలోనూ రెండు, మూడు కంపెనీలదే సింహభాగం. బడా కంపెనీలు తమకు లాభాలు తెచ్చిపెట్టే ఆధునిక టెక్నాలజీలను, జన్యుమార్పిడి పంటలను సరికొత్త మాటల గారడీతో ఐరాస సభ్య దేశాలపై రుద్దే ప్రమాదం పొంచి ఉంది. మన రైతుల విజయాలు చాలవూ? అనేక ఖండాల్లో చిన్న, సన్నకారు రైతులు సంప్రదాయ విజ్ఞా నంతో ఆవిష్కర్తలుగా మారి ఆహార వ్యవస్థలను ప్రకృతికి, ఆరోగ్యానికి నష్టదాయకం కాని సాగు పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మన దేశం ముందుంది. పెద్ద వ్యవ సాయ రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచంలోకెల్లా పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయం చేస్తూ సాధారణ రైతులు అసాధారణ విజయాలు సాధిస్తున్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ గణాం కాల ప్రకారం.. 1,30,000 మంది రైతులు 3–4 ఏళ్లలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు. మరో 3.5 లక్షల మంది రైతులు కొద్దిమేర పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2.7 లక్షల మంది భూమి లేని గ్రామీణ పేదలు ఇళ్ల దగ్గర ఖాళీ స్థలాల్లో ప్రకృతి సేద్య పద్ధతుల్లో పెరటి తోటలు సాగు చేస్తున్నారు. ‘సెస్’, ఐ.డి.ఎస్.ల ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ ఎసెస్ మెంట్ మూడేళ్లుగా జరుగుతోంది. ‘ప్రకృతి వ్యవసాయం వల్ల ఏపీలో ఖర్చు తగ్గుతోంది, దిగుబడులు పెరుగుతున్నాయి, రైతుల నికరాదాయం పెరుగుతోంది..’ అని ఈ సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. ఐరాస శిఖరాగ్ర సభలో ఉత్పత్తిదారుల విభాగంలో ఏపీ ప్రకృతి వ్యవసాయ విభాగం అధిపతి టి. విజయకుమార్ మన రైతుల ప్రకృతి సేద్య అనుభవాలను సాకల్యంగా వివరిం చారు. గుత్తాధిపత్యానికి దారితీసే బడా బహుళజాతి కంపెనీల అత్యాధునిక సాంకేతికతల అవసరం లేకుండానే, ఆహార వ్యవస్థ లను శాశ్వతంగా పునరుజ్జీవింపజేసుకునేందుకు దోహదపడే సుసంపన్న అనుభవాలు ఇవి. అయితే, అత్యంత ఆశ్చర్యకరం ఏమిటంటే.. ఐరాస ఆహార వ్యవస్థల శిఖరాగ్ర సభలో భారత ప్రభుత్వ ప్రతినిధి సమర్పించిన అధికార పత్రంలో ఏపీ ప్రకృతి రైతుల అపురూప అనుభవాలను మచ్చుకు కూడా ప్రస్తావించలేదు. బడా కార్పొరేట్ సంస్థల లాబీ యింగ్ ప్రభావానికి ఇదొక మచ్చుతునకేమో మరి! – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు -
హంగర్ ఇండెక్స్‌లో దిగజారిన ఇండియా: ముంచుకొస్తున్న ఆకలి భూతం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఆకలి తీర్చడమే వరల్డ్ ఫుడ్ డే ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అంటూ ప్రతీ ఏడాది లాగానే ‘‘ఆరోగ్యకరమైన రేపటి కోసం ఇప్పుడు సురక్షితమైన ఆహారం" అనే థీమ్‌ను నిర్ణయించారు. ఆహారాన్ని ఆదా చేయడం, వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని పెంచడం అనేది లక్ష్యం. తద్వారా భవిష్యత్తు తరాల కోసం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న పోషకాహారలోప సమస్యను నిర్మూలించాలనేది ప్రధానోద్దేశం. వరల్డ్ ఫుడ్ డే : చరిత్ర, ప్రాధాన్యత ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) 1945లో స్థాపితమైంది. దీనికి గుర్తుగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పాటిస్తున్నారు. 1979 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. హంగేరియాకు చెందిన మాజీ వ్యవసాయ, ఆహార మంత్రి డాక్టర్ పాల్ రోమానీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఈ డేను జరుపుకుంటాయి. దాదాపు 821 మిలియన్ల ప్రజలు దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో ఉన్నారు. వీరిలో దాదాపు 99 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసిస్తుండటం గమనార్హం. ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో 60శాతం మంది మహిళలు. ప్రతి సంవత్సరం దాదాపు 20 మిలియన్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుట్టారు. ఇందులో కూడా 96.5శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నారు. అది కూడా ప్రతి ఐదు జననాలలో ఒకటి సరైన వైద్య సదుపాయం లేనందు వల్ల చనిపోతున్నారు. ఫలితంగా పిల్లల్లో మరణాలలో దాదాపు 50శాతం మంది 5 సంవత్సరాల లోపే ఉంటున్నాయి. ఎయిడ్స్, మలేరియా, క్షయ వ్యాధి కారణగా సంభవిస్తున్న మరణాలకంటే ఆకలి కారణంగా ప్రపంచవ్యాప్తంగాఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి రోజు, 10,000 మందికి పైగా పిల్లలతో సహా 25,000 మంది ఆకలి, సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆహార ఉత్పత్తని పెంచడం అంటే తక్కువ ప్రాంతంలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులు ముఖ్యంగా సహజ వనరులను ఉపయోగించాలినేది లక్ష్యం. మెరుగైన పంట, నిల్వ, ప్యాకింగ్, రవాణా, మౌలిక సదుపాయాలు, మార్కెట్ యంత్రాంగాలతో పాటు, సంస్థాగత చట్టపరమైన చర్యల తో అనేక కార్యక్రమాల ద్వారా తుది వినియోగానికి ముందు ఆహార నష్టాలను తగ్గించాలని నిర్ణయించింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మరోవైపు గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో ఇండియా మరింత దిగజారింది. ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్ఐ) 2021లో 116 దేశాలలో భారతదేశం 101వ స్థానానికి పడి పోయింది. తాజా నివేదిక ప్రకారం 94వ స్థానం 101కి దిగజారింది. తద్వారా పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ , నేపాల్ కంటే కూడా ఇండియా వెనుకబడి ఉంది. బ్రెజిల్, చిలీ, చైనా. క్యూబా కువైట్ సహా పద్దెనిమిది దేశాలు జీహెచ్ఐ స్కోరు తొలి అయిదు టాప్ ర్యాంక్‌లో నిలిచాయని ఆకలి, పోషకాహారలోపాలను లెక్కించే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్సైట్ గురువారం తెలిపింది. అంతేకాదు ఇండియాలో ఆకలి స్థాయి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి, సంబంధిత ఆంక్షల ప్రభావంతో ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్నారనీ, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే పోషహార లోపంతో బాధపడుతున్న పిల్లల రేటు అత్యధికంగా ఉన్న దేశం ఇండియానే అని నివేదిక పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రకారం దేశంలో పోషకాహార ప్రమాణాలను కాపాడటం ప్రభుత్వాల విధి. -
మరణాలు లెక్కలేనంత.. నష్టం ఊహించలేనంత!!
International Day for Disaster Risk Reduction 2021: విపత్తులకు పరిమితి అంటూ ఉండదు. ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. ప్రపంచం మొత్తం మీద విపత్తులు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. ఇవి వాటిల్లినప్పుడు అన్ని వ్యవస్థల మీద, అన్నివర్గాల మీద ప్రభావం చూపిస్తాయి. ఈ భూమ్మీద ఇప్పటిదాకా ప్రకృతి విపత్తుల కోట్ల మంది చనిపోయారు. ఒక్కోసారి ఇవి కలగజేసే నష్టం తీరనిదిగా.. కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టేదిగా ఉంటుంది కూడా. సాధారణంగా విపత్తులు రెండు రకాలు. ఒకటి మానవ తప్పిదం. రెండోది ప్రకృతి వల్ల జరిగేవి. కరువు, భారీ వర్షాలు, వరదలు, తుపాన్, సునామీ, భూకంపాలు ప్రకృతి విపత్తులు. ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల ఇవి వస్తాయి. భూమి వేడెక్కటం(గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్), కాలుష్యం, అడవుల నరికివేత తదితర కారణాలు మానవ తప్పిదాలు. ఈ రెండు రకాల విపత్తులు ప్రాణ, ఆస్తి, పర్యావరణ నష్టాలకు కారణం అవుతుంటాయి. కరోనా లాంటి మహమ్మారులను సైతం విపత్తులుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 2009, డిసెంబర్ 21న ఒక ప్రతిపాదన చేసింది. ప్రతియేటా అక్టోబర్ 13ను అంతర్జాతీయ విపత్తు కుదింపు(తగ్గింపు) దినోత్సవాన్ని International Day for Disaster Risk Reduction అధికారికంగా పాటించాలని నిర్ణయించింది. కానీ, 1989లోనే మొదటి దినోత్సవాన్ని పాటించారు. విపత్తులను తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాలు, రిస్క్ అవేర్నెస్ గురించి ప్రమోట్ చేస్తుంది ఈ దినోత్సవం. మొదట్లో నేచురల్ డిజాస్టర్ రెడక్షన్ డేగా ఉండేది. 2002లో ఓ రెజల్యూషన్ పాస్ చేసింది ఐరాస. ఆపై 2009లో అధికారికంగా ప్రకటించడంతో పాటు International Day for Natural Disaster Reduction పేరును International Day for Disaster Reductionగా మార్చేసింది. విపత్తు నిర్వహణ విపత్తులు సంభవించాకే సహాయక చర్యలు మొదలుపెట్టాలి. ‘విపత్తు నిర్వహణ అంటే ఇంతే’.. అని ఒకప్పుడు అనుకునేవాళ్లు. గతంలో మన దేశంలో విపత్తులుచాలా సంభవించాయి. ఆయా సందర్భాల్లో కీలక పాత్ర పోషించింది పునరావాస విభాగాలే. అయితే విపత్తును ముందే అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోలేమా?. ఈ దిశగా ఐక్యరాజ్య సమితి 1990లో ఒక తీర్మానం చేసింది. ఆ దశాబ్దం మొత్తాన్ని ‘అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు’ దశాబ్దంగా ప్రకటించింది. ‘విపత్తు నిర్వహణ అంటే.. ఆపదలు వచ్చాక సాయం చేయటం మాత్రమే కాదు. రాకముందే పరిస్థితిని అంచనా వేయాలి. ముందస్తు చర్యలు చేపట్టాలి. లోపాలను అధిగమించాలి. ఒకవేళ విపత్తులు వస్తే త్వరగతిన సాయం అందించాలి. ఇందుకోసం టెక్నాలజీ సాయం తీసుకోవడంతో పాటు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు’.. ప్రపంచ దేశాలకు ఐరాస సూచించింది ఇదే. 2017 World Conference on Disaster Risk Reductionలో సెండాయ్(జపాన్) సెవెన్ క్యాంపెయిన్‌ను ప్రతిపాదించారు. 2030కల్లా విపత్తులతో ప్రభావితం అయ్యే ప్రజల సంఖ్యను తగ్గించాలనేది ఈ క్యాంపెయిన్ ఉద్దేశం మన దగ్గర.. భారత్‌లో విపత్తు నిర్వహణ ప్రయత్నాలు 1990లో ఊపందుకున్నాయి. కానీ, చట్టం వచ్చింది మాత్రం 2005లో. విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కేంద్రం, రాష్ట్రం, జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయా విభాగాలకు చైర్మన్లు. ఇవి ఏర్పడ్డాక విపత్తులను ఎదుర్కొనేందుకు అనుసరించే వ్యూహం, సహాయక చర్యల్లో చాలా మార్పు వచ్చింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణం ఆదుకునేలా చర్యలు చేపడుతున్నాయి ఆయా ప్రభుత్వాలు. దేశంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్(సైన్యం) తక్షణం రంగంలోకి దిగుతుంది. మరోవైపు విపత్తుల నివారణపై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినప్పటికీ లోటుపాట్లతో నష్టం జరుగుతూనే ఉంది. థీమ్ Disaster Risk Governance.. 2021 ఏడాది కోసం ఇచ్చిన థీమ్ పిలుపు. కరోనాతో లక్షల మంది(కోట్ల మంది!) చనిపోయారు. ఈ నేపథ్యంలో విపత్తుల ప్రభావం తగ్గించే పరిపాలన మీద దృష్టిసారించాలని ప్రభుత్వాలకు చెబుతోంది ఈ థీమ్. లోపాలు ఇండియాలో 2001–21 మధ్య కాలంలో విపత్తుల మూలంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఊహించని రీతిలో ఆస్తి నష్టం వాటిల్లింది. ఐదేళ్ల క్రితం ‘జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక’ అనుకున్నప్పటికీ.. అది విఫలమైంది. అంతెందుకు మూడేళ్ల క్రితం వచ్చిన కేరళ వరదలనే చూసుకుంటే.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి కేరళకు ముందస్తు హెచ్చరికలేవీ చెయ్యలేదన్న విమర్శలు వినిపించాయి. అదే సమయంలో వర్షాలు, వరదలను కేరళ ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని, డ్యాముల నుంచి నీటిని ఆలస్యంగా విడుదల చేసిందని ప్రతివిమర్శలు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందని వేసుకుని చేతులు దులుపుకున్నారు. ఇక్కడ కామన్ పాయింట్ మాత్రం నిర్వహణ లోపమే. జాతీయ విపత్తు విపత్తు నిర్వహణ చట్టంలో లొసుగులూ ఉన్నాయి. ఇవి చూపిస్తూ కేంద్ర ప్రభుత్వాలు.. రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపిస్తుంటాయి. ఉదాహరణకు.. కేరళ వరదలను ‘జాతీయ విపత్తి’గా కేంద్ర ప్రకటించకపోవడానికి కారణం కూడా ఇదే. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం.. మహా విపత్తు, మానవ తప్పిదాల వల్ల భారీ తప్పిదాలు జరిగాలి. ఆ పరిస్థితిని అంచనా వేసి కేంద్రం ‘జాతీయ విపత్తు’గా ప్రకటిస్తుంది. కానీ, సహజ విపత్తులను ఖచ్ఛితంగా జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రూలేం చట్టంలో లేదు. అసలు సహజ విపత్తులు అంటే ఏంటో తేల్చేందుకు 2001లో అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆనాటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని కమిటీ ఎలాంటి సూచనలు చెయకుండానే డిజాల్వ్ అయ్యింది. రాష్ట్రాలకు ఇదే మైనస్‌గా మారింది. అయితే విమర్శలు వచ్చినప్పుడల్లా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దింపి, ఏదో మొక్కుబడి ఆర్థిక సాయం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది కేంద్రం. విపత్తులు/ఆపదలు చెప్పి రావు. ఆకస్మాత్తుగా వస్తాయి. మానవ తప్పిదాలతో జరిగే విపత్తులను అరికట్టొచ్చు. కానీ, ప్రకృతి విపత్తులను పూర్తిగా జయించే శక్తి మనకు లేదు. ఎదుర్కొవటానికి.. తీవ్రతను తగ్గించడానికి మాత్రమే సిద్ధంగా ఉండాలి!. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తు నిర్వహణను ఉమ్మడి బాధ్యతగా స్వీకరించాలి. అత్యున్నత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే మున్ముందు కూడా అంతులేని నష్టం జరుగుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. - సాక్షి, వెబ్‌స్పెషల్ చదవండి: చిట్టితల్లి భయపడకు.. అలా ఎవరైనా టచ్ చేస్తే చెప్పేయ్ -
తాగి కారు నడిపితే నేరం.. మరీ కారే వైన్ తాగి రోడ్ల మీదకి వస్తే!?
డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం, అంటే మద్యం సేవించి కారు నడిపితే చట్ట ప్రకారం శిక్షార్హులు. కానీ కారే మద్యం సేవించి రోడ్లపై పరుగులు తీస్తే అది నేరమా? దానికేమైనా శిక్షలు ఉంటాయా? అసలు అది సాధ్యమా ? అంటే అవుననే అంటున్నారు యువరాజా వారు. అనడమే కాదు నిజం చేసి చూపించారు కూడాను. అసలు కారేంటి, అది వైన్ తాగడమేంటీ అనే సందేహాలు వస్తున్నాయా? అయితే ఈ వివరాలేంటో మీరే చూడండి. అది అలాంటి ఇలాంటి కారు కాదు. రాజుగారు వాడే కారు. ఆయనేమో సామాన్యమైన రాజు కాదు, ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటీష్ రాజవంశపు కాబోయే చక్రవర్తి. అందుకే ఈ కారు నడిచేందుకు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్‌లు ఉపయోగించడం లేదు. అంతకు మించి మనమెవరం ఊహించలేని ఇంధనాన్ని ఈ కారు నడిపేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే స్వయంగా వివరించారు. కొత్త ఐడియా కార్లను కనిపెట్టినప్పటి నుంచి నిన్నా మొన్నటి వరకు అవి నడిచేందుకు ఫ్యూయల్‌గా వాడేది డీజిల్ లేదా పెట్రోల్లను ఉపయోగించారు. ఆ తర్వాత కాలంలో ఈ రెండు ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వచ్చింది సీఎన్జీ గ్యాస్. అయితే వాతావరణ కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంగ్లీష్ రాజుగారు మరో అడుగు ముందుకు వేసి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పెట్రోలు , డీజిల్ బదులు వైన్‌తో నడిపిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేశారు. వెంటనే తన సిబ్బందిని పిలిపించి ఆదేశాలు జారీ చేశారు. అస్టోన్ మార్టిన్ బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్‌కి 21వ ఏటా ఆస్టోన్మార్టిన్ కారుని బహుమతిగా అందుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఈ యువరాజు గ్యారేజీలో మరెన్నో కార్లు వచ్చి చేరినా సరే ఆ పాత ఆస్టోన్ మార్టిన్ కారు వన్నె తగ్గలేదు. రాజుగారికి దానిపై మోజు పోలేదు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఆ కారులో చక్కర్లు కొడుతూనే ఉంటారు. తన మనసులో మాట చెప్పేందుకు ఈ కారునే రాజుగారు ఎంచుకున్నారు. వైన్ ఉంటే చాలు యువరాజు ఆజ్ఞలకు తగ్గట్టుగా కారుని రీ డిజైన్ చేశారు ఇంజనీర్లు. వారి కృషి ఫలించి ప్రస్తుతం రాజుగారి కారు వైన్‌తో నడుస్తోంది. బకింగ్‌హామ్ ప్యాలేస్‌లో మిగిలిపోయిన వైన్‌ని ఈ కారు నడిపేందుకు ఉపయోగిస్తున్నారు. కొన్ని సార్లు జున్ను తయారు చేస్తుండగా విరిగిపోయిన పాలను సైతం ఈ కారులో ఫ్యూయల్‌గా వాడుతున్నారు. ఈ విషయాలను స్వయంగా ప్రిన్స్ ఛార్లెస్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అక్టోబరు 31న వాతావరణ మార్పులపై సమావేశం జరగనుంది. కర్బణ ఉద్ఘారాలు తగ్గించేందుకు ప్రపంచ నాయకులు చేస్తున్న కృషికి నా వంతు సహాకారం అందించేందుకు పెట్రోలు, డీజిల్ బదులు వైన్‌ను ఉపయోగిస్తున్నాను’ అంటూ ఆయన తెలిపారు. కాలుష్యమే కారణం ఇటీవల వాతావరణ కాలుష్యంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. కర్బణ ఉద్ఘారాలను తగ్గించాలంటూ ప్రపంచ దేశాలన్నీ నిర్ణయిస్తున్నాయి. వాతావరణ కాలుష్యంపై ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతున్నా.. బ్రిటీష్ యువరాజు ఇప్పటి వరకు స్పందించలేదు,. దీంతో ఆయనపై చాలా విమర్శలు లోగడ వచ్చాయి. దీంతో తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరిలా ఎలక్ట్రిక్ కార్లంటే రాయల్ రేంజ్ ఏముంటుంది అనుకున్నారో ఏమో? ‘గ్లోబల్ వార్మింగ్’ ప్రచారానికి ఊతం ఇచ్చేందుకు కర్బన ఉద్ఘారాలను వెదజల్లని వైన్ కారు ఫార్ములాను యువరాజు ఎంచుకున్నారు. అయితే రాజుగారి నిర్ణయంపై గ్లోబల్ లీడర్ల నుంచి పెద్దగా స్పందన లేకున్నా సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. చదవండి :ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి శుభవార్త.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్! -
భారత్ అభివృద్ధి చెందితే.. ప్రపంచం కూడా వృద్ధి చెందుతుంది: మోదీ
-
US ఎయిర్ పోర్ట్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
-
వరల్డ్ రోజ్ డే: ఈరోజు గెలిచాను.. జీవిస్తున్నాను అనే అనుభూతి పొందండి
క్యాన్సర్‌తో పోరాడుతూ ఏటా వేలాదిమంది చనిపోతున్న సంగతి మనకు తెలియంది కాదు. ప్రముఖులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ ప్రాణాంతక వ్యాధి బారినపడిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదేమో!. గతంతో పోలిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీ సాయంతో క్యాన్సర్‌ని మొదటి దశలో గుర్తించి బయట పడే మార్గాలు ఉన్నాయి. రోగులు కూడా త్వరితగతిన కోలుకోగలుగుతున్నారు. కానీ ఈ వ్యాధిని జయించాలంటే కావల్సింది మెరుగైన వైద్యమే కాక మనోధైర్యం అత్యంత ముఖ్యం. క్యాన్సర్ అనగానే జీవితం మీద ఆశ వదులుసుకునేంతగా అందర్నీ భయబ్రాంతులకు గురు చేస్తుందనడంలో సందేహం లేదు. అందుకే ప్రపంచ దేశాలన్ని ముందుకు వచ్చి క్యాన్సర్‌ని జయించే విధంగా ప్రజలకు మనోధైర్యంతో పాటు చైత్యవంతులను చేసే విధంగా అడుగులు వేయాలని సంకల్పించాయి. దానిలో భాగంగానే ఐక్యరాజ్యసమితి వరల్డ్ రోజ్ డే అనే ప్రతిపాదన తీసుకువచ్చింది. దీంతో ప్రతి ఏడాది సెప్టెంబర్ 22న ప్రపంచ గులాబీ దినోత్సవం (వరల్డ్ రోజ్ డే)ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. (చదవండి: జీ7 పన్నుల ఒప్పందం అమలుతో పురోగతి సాధించగలం: బోరిస్ జాన్సన్) దీని వెనుక ఉన్న చరిత్ర: కెనడియన్ అమ్మాయి మెలిండా రోజ్ గౌరవార్థం క్యాన్సర్ రోగుల కోసం ప్రపంచ గులాబీ దినోత్సవం జరుపుకుంటారు. ఆమె కేవలం 12 సంవత్సరాల వయసులో అరుదైన బ్లడ్ క్యాన్సర్(రక్త క్యాన్సర్) అయిన అస్కిన్స్ ట్యూమర్‌తో బాధపడింది. ఆమె కొన్ని వారాలు మాత్రమే జీవించగలదు అని వైద్యులు చెప్పారు. కానీ ఆమె తన అచంచలమైన మనోధైర్యంతో ఆరేళ్లు జీవించగలిగింది. అంతే కాదు తనలా క్యాన్సర్‌తో బాధపడుతున్నవారిని తన కవితలతో, సందేశాత్మకమైన ఉత్సాహపూరిత మాటలతో, సందేశాలతో ప్రోత్సాహించింది. వారిలో ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడగలిగే మనోశక్తిని, ధైర్యాన్ని నింపడమే కాక చనిపోయేంత వరకు సంతోషంగా ఎలా ఉండాలో చేసి చూపించింది. తాను అంత చిన్న వయసులో ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ మరోవైపు తనలా బాధపడుతున్న వారి పట్ల ఆమె కనబర్చిన గుండె నిబ్బరానికి గుర్తుగా ప్రతి ఏటా ఆమె పేరుతో వరల్డ్ రోజ్ డే(ప్రపంచ గూలాబీ దినోత్సవం) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ రోగుల్లో ఆమె స్ఫూర్తిని నింపేలా ప్రతి ఏడాది ఒక సరికొత్త థీమ్‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది థీమ్: "జీవించే సమయం తగ్గిపోవచ్చు.. ప్రతి రోజు ఉదయించే సూర్యుడిని చూసినప్పుడల్లా.. మీరు ఈ రోజు గెలిచాను జీవిస్తున్నాను అనే అనుభూతిని పొందండి. అలా ఆ రోజుని ఆనందంగా గడపండి, ఆస్వాదించండి." ఈ వ్యాధి బారినపడిని కొందరి ప్రముఖుల మనోభావాలు... మీరు ఏదో కోల్పోతున్నాను అనుకునే కంటే మీరు చనిపోతున్నారు అనే విషయాన్ని గుర్తించుకోవటమే ఉత్తమమైన మార్గం. ఈ సమయం మీ మనస్సుకు దగ్గరగా ఉండి నచ్చినవి చేసి ఆనందంగా గడిపే క్షణాలుగా భావించండి. - స్టీవ్ జాబ్స్ క్యాన్సర్ మీ జీవితాన్ని మారుస్తుంది. మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మీరు ద్వేషించిన వాళ్లను, ప్రేమించిన వాళ్ల పట్ల కనబర్చిన ప్రతీది మీకు గుర్తుకు రావడమే కాక ఏం చేసుంటే బాగుండేది అనేది కూడా తెలుస్తుంది. అంతేకాదు సమయాన్ని వృధా చేయరు. మీకు ఇష్టమైన వ్యక్తులతో ప్రేమిస్తున్నానే విషయాన్ని చెప్పడానికి కూడా వెనుకడుగు వేయరు. -జోయెల్ సీగెల్ మీకు ఏదైనా నచ్చకపోతే దాన్ని మార్చండి. ఒకవేళ దానిని మార్చలేనిదైత మీరే మీ వైఖరిని మార్చుకోండి. - మాయ ఏంజెలో క్రికెటే నాజీవితం. క్యాన్సర్‌కు ముందు నేను సంతోషంగా ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ వ్యాధి భారినపడ్డానో అప్పుడే నాలో ఆందోళన, భయం మొదలైయ్యాయి. నాలా బాధపడుతున్న వాళ్లని చూసినప్పుడు దీన్ని ఏ విధంగానైనా ఎదిరించి జీవిచడమే కాక తనలా బాధపడేవాళ్లకు తన వంతు సాయం చేయాలనే తపన మొదలైంది. మళ్లీ నా జీవితం నాకు తిరిగి లభించినందుకు సంతోషంగా ఉంది. - క్రికెటర్ యువరాజ్ సింగ్ (చదవండి: పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో తొలి హిందూ మహిళగా సనా) -
ఐక్యరాజ్య సమితికి సైబర్ సెగ, కీలక సమాచారం హ్యాక్!
ఐక్యరాజ్య సమితిపై సైబర్ ఎటాక్ జరిగింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సర్వర్లకు ఉండే రక్షణ వ్యవస్థలను హ్యకర్లు చేధించారు. పలు దేశాల మధ్య జరిగిన చర్చలు, లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. అవును నిజమే గుర్తు తెలియని హ్యాకర్లు ఐక్యరాజ్య సమితికి సంబంధించి పలు విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని హ్యక్ చేశారని యూఎన సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టిఫెన్ డుజారిక్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హ్యకింగ్ జరిగినట్టు గుర్తించామని, దీనికిపై విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. హ్యకింగ్ ఇలా ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలకు సంబంధించిన కీలక సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను హ్యకర్లు ఎలా ఛేధించారనే దానిపై విచారణ కొనసాగుతోంది. యూన్‌కి సంబంధించిన ప్రొప్రైటరీ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఉద్యోగికి చెందిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆధారంగా హ్యకర్లు యూఎన్ సిస్టమ్స్‌తో అనుసంధానమైనట్టు గుర్తించారు. ఆగస్టు వరకు యూఎన్‌కి సంబంధించిన సిస్టమ్స్‌తో యాక్సెస్ సాధించిన హ్యకర్లు ఏప్రిల్ 5 నుంచి ఆగస్టు 7 వరకు వరుసగా చొరబడినట్టు గుర్తించారు. అయితే వారు ఏ సమాచారం తస్కరించారు. అందులో భద్రతాపరంగా కీలకమైనవి ఏమైనా ఉన్నాయా ? అనే అంశాలను గుర్తించే పనిలో యూఎన్ భద్రతా సిబ్బంది ఉన్నారు. చదవండి: అశ్లీల వీడియోలకు పరోక్ష కారణం?.. ఎఫ్బీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు -
ఢిల్లీ : ఐరాస కార్యాలయం వద్ద ఆఫ్ఘనిస్తాన్ శరణార్ధుల ధర్నా
-
వీరే... ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ !
వెబ్‌డెస్క్: జగడ జగడ జగడం చేసేస్తాం.. రగడ రగడ రగడం దున్నేస్తాం... ఎగుడుదిగుడు గగనం మేమేరా పిడుగులం అంటూ యూత్‌ని వర్ణించాడు ఓ సినీ కవి. నిజమే ! ఆ యుత్‌లో ఉన్న ఎనర్జీకి స్కిల్‌ను జోడించి వారి భవిష్యత్తుతో పాటు మానవాళి మనుగడకు కొత్త బాటలు వేయడం లక్క్ష్యంగా ప్రతీ ఏడు జులై 15న వరల్డ్ యూత్ స్కిల్ డేను నిర్వహిస్తున్నారు. వరల్డ్ యూత్ స్కిల్ డే ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి 2014 డిసెంబరు 18న తీర్మాణించింది. దీని ప్రకారం మొదటిసారి 2015లో జులై 15న తొలిసారి ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య ఉద్దేశం యువతకు సరైన శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యం పెంచడం ద్వారా భవిష్యతత్తులో వారు ఎంట్రప్యూనర్లుగా, ఉద్యోగస్తులుగా రూపొందించడం వరల్డ్ యూత్ స్కిల్ డే ముఖ్య ఉద్దేశం. ఈ విషయానికి సంబంధించి ప్రజా ప్రతినిథులు, యాజమాన్యాలు, ఉద్యోగస్తులు, నైపుణ్యం కలిగిన యువత అందరినీ ఒకతాటిపైకి తెచ్చి భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేయడం ప్రధానంగా ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి కరోనా తర్వాత యువతలో మిగిలి ఉన్న నైపుణ్యాలు అనే థీమ్‌తో ఈసారి వరల్డ్ యూత్ స్కిల్ డేను నిర్వహిస్తున్నారు. కోవిడ్ ఇబ్బందులు ఎదుర్కొవడంలో యువత చూపించిన నైపుణ్యాలు అనే అంశం ప్రధానంగా ఈసారి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తీవ్ర ఒత్తిడి కరోనా రక్కసి దాడికి తీవ్రంగా గురయ్యారు యువత. సమాజంలో అన్ని వర్గాలపైన కరోనా ప్రభావం ఉన్నా.. 15 నుంచి 24 ఏళ్లలోపు వారు చాలా ప్రభావానికి లోనయ్యారు. మానసికంగానే కాకుండా కెరీర్ పరంగా కూడా ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఇటు చిన్న వాళ్లలా ఉండలేక అటు పెద్ద వాళ్లతో పోటీ పడలేక నలిగిపోయారు. ఐక్యరాజ్య సమితి గణాంకాలు సైతం ఇదే విషయాన్ని పట్టి చూపుతున్నాయి. కరోనా కల్లోలం కరోనా కారణంగా గడిచిన ఇంచు మించు ఏడాదిగా పాఠశాలలు పాక్షికంగా లేదా పూర్తిగా మూత పడి ఉన్నాయి. 2021 జూన్ వరకు 19 దేశాల్లో ఏడాదిగా పాఠశాలలు తెరుచుకోలేదు. పాఠశాలలు మూత పడటం వల్ల 15.7 కోట్ల మంది యువత నష్టపోతుండగా పాక్షింగా మూతపడటం వల్ల 76.8 కోట్ల మంది నష్టపోతున్నట్టు ఐక్యరాజ్య సమితి నివేదికలు తెలియజేస్తున్నాయి. - 15 నుంచి 24 ఏళ్లలోపు వయస్సు వారు కరోనా వల్ల తలెత్తిన పరిస్థితులకు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు - 2020లో కరోనా సంక్షోభం కారణంగా 8.7 శాతం యూత్ ఉద్యోగాలు కోల్పోయారు. ఇదే సమయంలో 25 ప్లస్ వయస్సు వారు 3.7 శాతమే ఉద్యోగాలు కోల్పోయారు. - యువతలో మగవారితో పోల్చినప్పుడు అమ్మాయిలే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
2050 నాటికి ఇండియా జనాభా ఎంతో తెలుసా ?
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ అప్పారావు. కానీ మనుషులు అన్ని దేశాల్లో ఒకేలా లేరు. ఒక చోట వనరులకు మించి జనాభా ఉంటే .. మరో చోట వనరులున్నా జనాభా తగ్గిపోతుంది. నాగరికత మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జనాభా ఎలా ఉంది. ఇక ముందు ఎలా ఉండబోతుందనే అంశాలపై ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సాక్షి వెబ్ ప్రత్యేక కథనం 1989లో ఐక్య రాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. అంతకు ముందు 1987 జులై 11న ప్రపంచ జనాభా 500 కోట్లు దాటింది. జనాభా విస్ఫోటనం జరుగుతుందని గుర్తించిన ఐక్యరాజ్య సమితి జనాభా పెరుగుదలపై ఫోకస్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచీ జులై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అప్పుడు మరణాలే నాగరికత నేర్చింది మొదలు రెండో ప్రపంచ యుద్ధం వరకు మనిషి మనుగడ అంత సులువుగా లేదు. ఎప్పుడో ఏదో ఒక ఉపద్రవం రావడం, యుద్ధాల కారణంగా భారీ సంఖ్యలో మరణాలు చోటు చేసుకునేవి. పైగా వైద్య రంగం అంతగా అభివృద్ధి చెందకపోవడం వల్ల అంటు రోగాలు, వ్యాధులుల విజృంభించేవి. శిశు మరణాల రేటు ఎక్కువ. దీంతో జనాభా వృద్ధి ఓ మోస్తరుగా ఉండేంది. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం, అంతకు ముందు వచ్చిన స్పానిష్ ఫ్లూ కారణంగా లక్షలాది మంది మరణించారు. బేబీ బూన్ 1950 నుంచి 1987 మధ్య కాలంలో ఒక్క సారిగా ప్రపంచ జనాభా విస్ఫోటనం జరిగింది. ప్రపంచ జనాభా 250 కోట్ల నుంచి 500 కోట్లకు చేరుకోవడానికి కేవలం 37 ఏళ్లు మాత్రమే పట్టింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగవడం, భూస్వామ్య, రాచరిక వ్యవస్థ స్థానంలో ప్రజాస్వామ్యం రావడం, ఆధునిక వ్యవసాయం, తగ్గిపోయిన యుద్ధాలు తదితర కారణాలతో జనాభా ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. అందుకే ఈ 37 ఏళ్ల కాలాన్ని బేబీ బూన్గా వ్యవహరిస్తుంటారు జనాభా తగ్గిపోతుంది ప్రపంచ వ్యాప్తంగా జనాభా రేటు పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంటే మరికొన్ని దేశాలు... తమ జనాభా తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నాయి. ఉదాహరణకు 2020లో జపాన్ జనాభా 12.70 కోట్లు ఉండగా 2050 నాటికి ఈ సంఖ్య 10.60 కోట్లకు చేరుకోనుంది. అంటే జనాభాలో 16 శాతం తగ్గుదల నమోదు అవుతోంది. ఇక ఇటలీ విషయానికి వస్తే ఇదే కాలానికి 6.10 కోట్ల జనాభా కాస్త 5.40 కోట్లకు చేరుకోనుంది. గ్రీస్, క్యూబా దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనవచ్చని అంచనా. ఇండియా పరిస్థితి జపాన్, ఇటలీ స్థాయిలో కాకపోయినా ఇండియాలో కూడా జనాభా వృద్ధి రేటు తగ్గనుంది. తాజా గణాంకాలు ఇదే విషయాన్ని పట్టి చూపుతున్నాయి. 1991-2001 పదేళ్ల కాలానికి 2001-2011తో పోత్చితే జనాభా వృద్ధి రేటు 3.9 శాతం తగ్గింది. జనాభా పెరుగుదల విషయంలో భారతీయులు జాగ్రత్త వహిస్తున్నారని చెప్పవచ్చు. 1950లో భారతీయ మహిళలు సగటున ఒక్కొక్కరు ఆరుగురు పిల్లలకు జన్మనిస్తే.. ప్రస్తుతం అది 2.1గా ఉంది. మరో 25 ఏళ్లు సాధారణంగా ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే జనాభా భవిష్యత్తులో కూడా కొనసాగాలంటే ఆ దేశ లేదా ప్రాంత లేదా తెగకు చెందిన మహిళలకు 2.1 మంది పిల్లలకు జన్మనివ్వాలి. ప్రస్తుతం ఇండియాలో జననాలు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. అందువల్ల మరో 25 ఏళ్ల పాటు ఇదే స్థాయిలో భారత జనాభా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అందులో హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళా, కర్నాటక రాష్ట్రాల్లో మహిళలు జన్మనిచ్చే రేటు 2.1 కంటే దిగువకు చేరుకుంది. 2047లో గరిష్ట స్థాయికి 2018-19లో చేపట్టిన ఆర్థిక సర్వేలో 2030 నాటికి ఇండియాలో జననాల రేటు 2 కంటే దిగువకు చేరుకుంటుందని తేలింది. ఈ లెక్క ప్రకారం 2047 వరకు భారత దేశ జనాభా పెరుగుతూ పోయి గరిష్టంగా 161 కోట్లకు చేరుకుంటుందని.. ఆ తర్వాత తగ్గుదల నమోదు అవుతుందని అంచనా. మొత్తంగా 2100 నాటికి ఇండియా జనాభా 100 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా. పెంచండి దాదాపు అర్థ దశాబ్ధం పాటు అత్యంత కఠిన జనాభా నియంత్రణ విధానాలు అమలు చేసిన చైనా ధోరణిలో ప్రస్తుతం మార్పు వచ్చింది. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు కన్నా పర్వాలేదు అంటోంది. మరోవైపు పోలాండ్ దేశం అబార్షన్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టాలను అమలు చేస్తోంది. ఒక్కో చిన్నారికి 100 యూరోల వంతున ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు ప్రతీ నెల ఆర్థిక సాయం అందిస్తోంది. దక్షిణ కోరియా పిల్లలు ఎక్కువగా ఉన్న దంపతులకు ఇన్సెంటీవ్లు, హోం లోన్లు అందిస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలకు ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తోంది. సువర్ణావకాశం జనాభా పెరిగిపోయిందని దేశంలో ఆందోళన నెలకొన్నా ఇప్పుడు ప్రపంచలోనే యువ జనాభా అధికంగా ఉన్న దేశంగా భారత్ నిలబడింది. ఇప్పుడు యువ జనాభాలో నైపుణ్యం పెంచి కొత్త అవకాశాలు సృష్టిస్తేనే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినవాళ్లం అవుతాం. అలా కానట్టయితే మరో ముప్పై ఏళ్లకు అత్యధిక వృద్ధ జనాభా ఉన్న దేశంగా ఇండియా మిగిలిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధి, మౌలిక సదుపాయాలతో వృద్ధ జనాభాతో నెట్టుకురావడం కష్టంగా మారుతుంది. ఇద్దరు చాలు ఇండియాలో 24 కోట్ల ప్రజలతో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉత్తర్ ప్రదేశ్ నిలిచింది. అత్యధిక జనాభా కలిగిన టాప్ టెన్ దేశాల్లో ఉన్న బ్రెజిల్, నైజీరియా, బంగ్లాదేశ్, రష్యా, మెక్సికోల కంటే ఉత్తర్ ప్రదేశ్ జనాభాయే ఎక్కువ. దీంతో జనాభా నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది యోగీ సర్కార్. దీని కోసం న్యూ పాపులేషన్ పాలసీ 2021-30ని అమల్లోకి తెచ్చారు. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కలిగిన వారికి ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సబ్సిడీలు అందవ్వమంటూ సీఎం యోగి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిల్లలన్ని కనండి జపాన్, పోలండ్ దేశాల తరహా పరిస్థితిని ఇండియాలో పార్సి మతస్తులు ఎదుర్కొంటున్నారు. స్వతంత్రం వచ్చినప్పుడు పార్సీల జనాభా ఇండియాలో లక్షకు పైగా ఉండగా ఇప్పుడు కేవలం 55,000లకు పరిమితమైంది. గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో మినహాయిస్తే నగరాల్లోనే అక్కడక్కడ పార్సీలు నివసిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంచుమించు వెయ్యి మంది పార్సీలు ఉండగా ఏపీలో అయితే రెండు అంకెలలోపే ఉండవచ్చని అంచనా. దీంతో పిల్లలు కనాలంటూ దంపతులను ప్రోత్సహించేందుకు ‘జియో పార్సీ’ అనే పథకాన్ని మైనార్టీ వెల్ఫేర్ మినిస్ట్రీ చేపట్టింది. ప్రభుత్వంలో పాటు పలు పార్సీ స్వచ్చంధ సంస్థలు ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. పార్సీల జనాభా తగ్గిపోవడానికి కారణం లేటు వయస్సులో పెళ్లిలు చేసుకోవడం, పెద్ద కుటుంబాల పట్ల అయిష్టత ఉండటం ముఖ్య కారణమని పార్సీ అంజుమాన్ ట్రస్టు బాధ్యులు జహంగీర్ తెలిపారు. జనాభా పెరుగుదల తీరుతెన్నులు భూమిపై మనిషి పుట్టుక మొదలైన తర్వాత వేల ఏళ్ల తర్వాత 1800లో మొదటి సారిగా జనాభా వంద కోట్లను దాటింది. - 1900 నాటికి జనాభా ఒకేసారిగా పెరిగి 200 కోట్లకు చేరుకుంది - 2000 వచ్చే సరికి జనాభా మూడింతలై 600 కోట్లకు చేరుకుంది - 2000 నుంచి 2012 అంటే పదేళ్లలో జనాభా 700 కోట్లు అయ్యింది - 2030 నాటికి రికార్డు స్థాయిలో 850 కోట్లు, 2050 నాటికి 970 కోట్లకు చేరుకోవచ్చని అంచనా - 2100 నాటికి ప్రపంచ జనాభా 1000.90 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి లెక్కకట్టింది -
ఆ ‘వైరస్’ తో నిమిషానికి 11 మంది మృతి
వెబ్‌డెస్క్: ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా. అయితే కరోనాను మించిన మరో మహమ్మారి చాప కింద నీరులా భూమ్మీద దేశాలను పట్టి పీడిస్తోంది. కరోనాను మించిన మరణాలు ఈ మహమ్మారి కాటుకు గురవుతున్నాయి. కరోనాను మించిన ఆ భయంకర వైరస్ పేరు ఆకలి. అవును ఆక్స్ ఫాం అనే సంస్థ తాజాగా చేపట్టిన సర్వేలు ఆకలి చావులు పెరిగినట్టు తేలింది. ఆకలిరాజ్యం పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ ఫాం అనే సంస్థ ఆకలి వైరస్ ఎక్కువైంది పేరిట విడుదల చేసిన నివేదిక సంచలనంగా మారింది. ఈ నివేదిక ప్రకారం ఈ భూమ్మిదీ నిమిషానికి 11 మంది ఆకలికి తట్టుకోలేక, తినడానికి తిండి లేక చనిపోతున్నారని తేలింది. కరోనాను మించి ఇవ్వాళ ‘ద హంగర్ వైరస్ మల్టిప్లైస్ (ఆకలి వైరస్ అధికమైంది)’ పేరిట విడుదల చేసిన ఆ నివేదికలో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఏడుగురు చనిపోతుంటే.. ఆకలితో 11 మంది ఊపిరి వదులుతున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభంలో 15.5 కోట్ల మంది చిక్కుకున్నారని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 2 కోట్ల మంది ఎక్కువగా ఆకలి బారిన పడ్డారని తెలిపింది. సైనిక సంక్షోభం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారిలో 66 శాతం మంది సైనిక సంక్షోభంలో చిక్కుకున్న దేశంలోని వారేనని తెలిపింది. వీరికి తినడానికి బుక్కెడు బువ్వ దొరకట్లేదు. ఆకలి వారి ప్రాణాలను తోడేస్తోంది. రోజూ వందలాది మందిని కబళిస్తోంది. మరోవైపు కరోనా కారణంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి పేద ప్రాంతాలకు అందుతోన్న సాయం కూడా తగ్గుతోంది. సైన్యంపైనే ఖర్చు కరోనా, లాక్ డౌన్ లతో తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి యుద్ధ వాతావరణం తోడు కావడంతో సుమారు 5.2 లక్షల మంది ఆకలి చావులకు గురయ్యారని ఆక్స్ ఫాం ఆవేదన వ్యక్తం చేసింది. చాలా దేశాలు కరోనా ఉన్నా యుద్ద పరిస్థితుల కారణంగా తమ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ బలగాల పటిష్ఠత కోసం ఖర్చు చేయక తప్పలేదని వెల్లడించింది. ఈ ఖర్చు రూ. 5,100 కోట్ల డాలర్లు దాటిందని.... పేదల ఆకలి తీర్చేందుకు ఐక్యరాజ్యసమితి ఖర్చు చేయాలనుకున్న దాని కన్నా ఇది ఆరు రెట్లు ఎక్కువని తేల్చి చెప్పింది. అంతర్ యుద్దాలతో ఆఫ్ఘనిస్థాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ వంటి అంతర్ యుద్దాల్లో చిక్కుకున్న దేశాల్లో ఆకలి చావుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ లతో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాబిన్నమైందని, దాంతో ఆహార పదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా 40 శాతం వరకు పెరిగాయని సూత్రీకరించింది. ఈ దశాబ్దంలోనే ధరల పెరుగుదలలో ఇదే అత్యధికమని ఆవేదన వ్యక్తం చేసింది. ఫలితంగా నిరుపేదలు ఆకలి రాజ్యంలోకి నెట్టివేయబడుతున్నారని పేర్కొంది. -
అతి అణచివేతతో తిరుగుబాటు తీవ్రం
ఆదివాసీల ఆత్మీయనేస్తం ఫాదర్ స్టాన్‌స్వామి (84) నిర్బంధంలో చనిపోవడం పలువుర్ని చలింపజేసింది. ఇది మామూలు మరణం కాదని, వ్యవస్థ చేసిన హత్యగా హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులంటున్నారు. ‘మిట్టమధ్యాహ్నమే కమ్మిన కారుచీకటి’గా న్యాయకోవిదులే అభివర్ణిస్తున్నారు. ఈ మర ణాన్ని, ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం, ఐరోపా సమాజ ప్రతినిధి... ఇలా పలువురు ఖండించారు. ప్రశ్నించే గొంతుల్ని, నిరసించే బృందాలను, అసమ్మతి స్వరాలను సాక్ష్యం లేని అభియోగాలతో నిర్బంధించేందుకు ‘ఉపా’ చట్టం ఒక అస్త్రం కావడం దారుణం, అమానుషం. విచారణే మొదలు కాని కేసులో, న్యాయ ప్రక్రియే మరణశిక్ష అయింది. ఆధారాల్లేని అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ హక్కుల కార్యకర్త... వృద్ధాప్యానికి, వ్యాధులకు, కడకు బెయిల్ నిరాకరణకు బలై నిర్బంధంలోనే అసహజ మరణం పొందారు. దీనికి బాధ్యులె వరు? నేరుగా జవాబు రాకపోగా... లోపభూయిష్టమైన మన నేర– న్యాయ నిర్వహణ (క్రిమినల్ జస్టిస్) ప్రక్రియపైనే ఇది సందేహాలను రేకెత్తిస్తోంది. నిర్హేతుక నిబంధనలున్న ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)’ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. రాజ్యం–పోలీసు అపవిత్ర బంధం ఎల్లలు దాటి, ‘అసమ్మతి’ని అణచివేస్తున్న దాష్టీ కాన్ని ఎత్తిచూపుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాదని వక్రగతిన సాగే చట్టం అమలును ఉపేక్షిస్తున్న న్యాయవ్యవస్థ దౌర్బల్యాన్ని తెరకెక్కి స్తోంది. ఇదిక్కడితో ఆగకూడదు. జరిగే దురాగతాలకు బాధ్యులెవరో తేలాలి. అందుకు, పౌరసమాజం చేతనతో, ఈ అరిష్టాలకు మూలాలు వెతికి పట్టుకోవాల్సిన, అడ్డుకోవాల్సిన సమయం వచ్చింది. ఆదివా సీల ఆత్మీయనేస్తం ఫాదర్ స్టాన్‌స్వామి (84) నిర్బంధంలో చని పోవడం పలువుర్ని చలింపజేసింది. వృద్ధాప్యం, పార్కిన్సన్ వ్యాధి, కోవిడ్ అనంతర సమస్యలు.... పలుమార్లు బెయిల్ కోరి నిరాకరణకు గురైన దురవస్థ! ఇది మామూలు మరణం కాదని, వ్యవస్థ చేసిన హత్యగా హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులంటున్నారు. ‘మిట్టమధ్యాహ్నమే కమ్మిన కారుచీకటి’గా న్యాయకోవిదులే అభి వర్ణిస్తున్నారు. ఈ మరణాన్ని, ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితి (యూఎన్) మానవహక్కుల విభాగం, ఐరోపా సమాజ (ఈయూ) ప్రతినిధి... ఇలా పలువురు ఖండించారు. దేశంలోని పది రాజకీయ (వి)పక్షాలు, బాధ్యులపై చర్య తీసుకోవాలని, భీమా–కోరేగావ్ నింది తులతో పాటు రాజకీయ కారణాలతో నిర్బంధంలో ఉన్న వారందరినీ బెయిల్‌పై విడుదల చేయాలని రాష్ట్రపతిని కోరారు. ఇదే కేసు సహ నిందితులు జైళ్లోనే ఒక రోజు నిరాహారదీక్ష చేశారు. ఇంతటి స్పంద నలు రేకెత్తించిన ఈ ఘటనను కేవలం ఒక హక్కుల కార్యకర్త మరణంగానే చూడకూడదు. ప్రజావిశ్వాసం కోల్పోతూ... రాజకీయ, పాలన, న్యాయ వ్యవస్థలు రోజురోజుకూ క్షయమవుతున్న దుస్థితికి నిలువెత్తు నిదర్శనంగా చూడాలి. సంబంధం లేని కేసులో.... కోరేగావ్ తానెప్పుడూ వెళ్లలేదని, తనకీ కేసుతో సంబంధమే లేదని రోమన్ కాథలిక్ పూజారి స్టాన్ స్వామీ మొదట్నుంచీ చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐజీ) పథకం ప్రకారం తనను ఇరికించిన తీరుకు ఆశ్చర్యపోలేదు. అరెస్టుకు ముందు విడుదల చేసిన వీడియో కథనం ప్రకారం, ఆయనకీ విషయంలో స్పష్టత ఉంది. ‘ప్రశ్నించిన వారి గొంతు దేశమంతటా నొక్కుతున్నారు. నాకొక్కడికే జరుగుతు న్నది కాదిది. సంతోషం, ఈ ప్రక్రియలో నేను భాగమయ్యాను. ఎందు కంటే, నేను మౌన ప్రేక్షకుడిని కాదు. ఈ ఆటలో భాగమైన వాణ్ణే! ... తగు మూల్యం చెల్లించడానికి నేను సిద్ధమే!’ అన్నారు ధీమాగా! కానీ, ప్రాణాలనే ఇచ్చి మూల్యం చెల్లించాల్సి రావడం దురదృష్టకరం. 2018 జనవరి 1 భీమా–కోరేగావ్ అల్లర్ల వెనుక మావోయిస్టులున్నారని, వారిని హింసకు ప్రేరేపించిన ప్రసంగాలు 2017 డిసెంబరు 31 ఎల్గార్ పరిషత్ సమావేశంలో జరిగాయనేది కేసు. మరికొందరు ఒకరితో ఒకరు మాటాడుకుంటూ కుట్రపన్నారనేది ఆరోపణ. విప్లవకవి, హక్కుల యోధుడు వరవరరావుతో పాటు మొత్తం 17 మంది కవులు, న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు, ఇతర మేధావుల్ని ఈ కేసులో అరెస్టు చేశారు. నిషేధిత మావోయిస్టులతో చేతులు కలిపి, ప్రభు త్వాన్ని కూల్చే విశాల కుట్ర పన్నారనేది ప్రధాన అభియోగం. ‘మావో యిస్టు సిద్దాంతాలను నేను ఒప్పుకోను, వ్యతిరేకిస్తాను’ అని బహి రంగంగా ప్రకటించే వ్యక్తికి, వారితో ‘కుట్ర’ సంబంధాలు అంట గట్టడంలోనే అభియోగమెంత బలహీనమో తేలిపోయింది. బెయిల్ వినతి వచ్చినపుడు, నమ్మదగ్గ సాక్ష్యాలను బట్టే న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటాయి. ఈ కేసులో ఇప్పటివరకు అభియోగ పత్రాన్ని ఖరారు చేసి విచారణ ప్రారంభించలేదు. ఇక స్వామిపై వచ్చిన అభియోగాలకు ఆధారమని, ఆయన ల్యాప్‌టాప్‌లోని పత్రా లను చూపిస్తున్నారు. మరో నిందితుడు సురేంద్ర గాడ్లింగ్ కంప్యూటర్ రెండేళ్లుగా దురుపయోగమౌతోందని, ‘మాల్వేర్’ ద్వారా అందులోకి డాక్యుమెంట్లు పంపేందుకు గల ఆస్కారాన్ని అమెరికాకు చెందిన డిజి టల్ ఫోరెన్సిక్ సంస్థ నిరూపించింది. అదే, స్టాన్‌స్వామీ ల్యాప్‌టాప్ తోనూ జరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే, అరెస్టుకు ముందు రెండు సార్లు ఆయన గదిలో సోదాలు జరిపి, ల్యాప్‌టాప్, మొబైల్ తది తరాల్ని దర్యాప్తు బృందం స్వాధీనపరచుకుంది. నిర్దిష్ట ఆరోపణ లున్నా, దీనిపై విచారణే జరుగలేదు, ఇది నమ్మదగ్గ సాక్ష్యం కాదు. ఇంతటి కాఠిన్యం యాధృచ్ఛికమా? న్యాయ కస్టడీలో, మొదట చికిత్సకు నిరాకరించినా, ‘వారిచ్చే చిన్న మాత్రల కన్నా, నా వ్యాధి తీవ్రతే హెచ్చుగా ఉంది, ఏమో నేను చచ్చి పోతానేమో?’ అని ఒక దశలో సందేహించిన స్వామీ, చివరకు ఆస్పత్రిలో చేరడానికి అంగీకరించారు. మూడు దశాబ్దాలకు పైగా జార్ఖండ్‌లోని ఆదివాసీల హక్కుల కోసం స్టాన్‌స్వామి పోరాడు తున్నారు. గిరిజనుల అటవీ–భూమి హక్కుల కోసం, యువత అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాటాలకు ‘బగీచా’ను స్థాపించారు. 3000 మంది యువకులను మావోయిస్టులుగా ముద్రవేసి, అక్ర మంగా జైళ్లలో కుక్కడాన్ని నిరసిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. అరెస్టయిన 97 శాతం మందికి మావోయిస్టులతో ఏ సంబంధం లేదని, 96 శాతం యువత కుటుంబ నెలసరి ఆధాయం రూ. 5 వేల లోపని నిర్ధారించారు. నిష్కారణంగా జైళ్లో మగ్గి, విలువైన జీవిత కాలాన్ని, కొన్నిసార్లు జీవితాల్ని కోల్పోతున్నారని స్వామి తరచూ బాధపడేవారు. ఈ సుదీర్ఘ పోరాట క్రమమే పాలకులకు, వారితో అంటకాగుతున్న కార్పొరేట్ శక్తులకు కంటగింపైంది. యథే చ్చగా సహజవనరుల్ని, ప్రకృతి సంపదను కొల్లగొట్టే తమకు... పోరా టాలు అవరోధంగా, స్వామీ ఒక అడ్డంకిగా కనిపించారు. కుంటి జిల్లా ‘ముండే’ ఆదివాసీల భూహక్కుల కోసం సాగిన ‘పథల్ గాడీ’ ఉద్య మాన్ని అణచివేసేందుకు, 20 మందిపై రాజద్రోహం కేసు పెట్టారు. అందులో స్టాన్‌స్వామీ ఒకరు. రాజ్యాంగ రక్షణకు, దానికి లోబడి శాంతియుతంగా పోరాడుతున్న వ్యక్తిని వ్యవస్థ హతమార్చింది. పరి వర్తన కేంద్రాలు, సంస్కరణాలయాలు అని చెప్పుకునే మన జైళ్లలో... ఇంతటి కాఠిన్యం బయటి వారూహించరు. 84 ఏళ్ల వయసులో, పార్కిన్సన్ వ్యాధివల్ల ‘గ్లాసు పట్టుకొని నీళ్లు తాగలేకపోతున్నాను స్ట్రానో, సిప్పరో ఇప్పించండి’ అంటే, మూడు వారాలు జాప్యం చేసిన కర్కశత్వం చరిత్రలో నిలుస్తుంది. ప్రత్యేక కోర్టు జడ్జి బెయిల్ నిరా కరిస్తూ, ‘స్వామి వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా సమాజ ఉమ్మడి ప్రయోజనాలే ప్రాధాన్యమైనవి’ అన్నారు నిష్కర్షగా! ఈ నెల 6న ముంబాయి హైకోర్టు ముందు బెయిల్ పిటిషన్ విచారణ ఉన్నపుడు... ఒకరోజు ముందు, 5ననే స్టాన్, ఏ బెయిలూ అవసరం లేని లోకాలకు వెళ్లి పోయారు. 2016–19 నాలుగేళ్లలో 2.2 శాతం కేసుల్లోనే నేర నిరూపణ జరిగి శిక్షలు పడ్డాయి. అందుకే, ‘ఉపా’ చట్టం పాలకుల చేతిలో దురుప యోగమౌతోంది. ప్రశ్నించే గొంతుల్ని, నిరసించే బృందాలను, అస మ్మతి స్వరాలను సాక్ష్యం లేని అభియోగాలతో నిర్బంధించేందుకు ఇదొక అస్త్రం. అరెస్టు చేయడం, బెయిల్ నిరాకరించడం, గిట్టని వారిని పాలకులు కోరుకున్నంత కాలం నిర్బంధంలోనే ఉంచడం రివాజ యింది. గొంతెత్తే ఇతరులకు, ఇది ముందస్తు హెచ్చరికగానూ పని కొస్తోంది. ఇదివరకటి నల్లచట్టాలు ‘టాడా’ ‘పోటా’ల దారిలోనే ‘ఉపా’ కూడా అటకెక్కాల్సిన సమయం వచ్చింది. అణచివేత ఎంత అధికంగా ఉంటే, అనులోమ నిష్పత్తిలోనే తిరుగుబాటు తీవ్రత ఉంటుందని రాజ్యం గ్రహించాలి. దిలీప్ రెడ్డి ఈమెయిల్ : dileepreddy@sakshi.com -
అధిక ఉష్ణోగ్రత! కారణం ఏంటంటే..
అధిక ఉష్ణోగ్రతలు.. అది కూడా మంచుమయమైన అంటార్కిటికాలో పెరుగుతుండడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా ఈ గడ్డపై అత్యధిక ఉష్ణోగ్రత ఈ ఏడాదిలోనే నమోదు అయ్యిందని జులై 1న ఒక ప్రకటన విడుదల చేసింది యూఎన్వో. న్యూయార్క్: ఈ ఏడాది ఫిబ్రవరి 6న అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో 18.3 డిగ్రీల సెల్సియస్ (64.9 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. దీంతో ఇప్పుడు అంటార్కిటికా సైతం వేగంగా వేడెక్కుతున్న ప్రాంతాల్లో ఒకటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక అంటార్కిటికాలో గత 50 ఏళ్లలో దాదాపు మూడు డిగ్రీల సెల్సియస్ మేరకు సగటు ఉష్ణోగ్రత పెరిగినట్లు డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ పెటేరి తాలాస్ చెప్పారు. దీనికి సంబంధించిన రిపోర్టును ఆయన గురువారం వెల్లడించారు. వేడికి కారణం మంచు కొండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధిక పీడనం కారణంగా ఫోహెన్ ప్రభావం ఏర్పడుతుంది. అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని UN డబ్ల్యూఎంవో(వరల్డ్ మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్) రిపోర్టు వెల్లడించింది. ఫోహెన్ ప్రభావం వల్ల.. మంచు కొండలకు ఒకవైపు నుంచి వీచే సాధారణ గాలులు.. కొండ అంచు నుంచి మరో వైపునకు వీచేటప్పుడు వేడెక్కుతాయి. ఈ ఫలితమే అత్యధిక వేడి, ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఈ రిపోర్టు పేర్కొంది. ఈ దిగువ గాలుల ఫలితంగా.. అంటార్కిటికాలోని ఎస్పెరంజా స్టేషన్, సేమౌర్ ద్వీపంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. గతంలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు నివేదికలో పొందుపరిచారు. ఇంతకు ముందు.. గతంలో 2015, మార్చి 24న అంటార్కిటికాలో అత్యధికంగా 17.5 డిగ్రీల సెల్సియస్ (63.5 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడి ఎస్పెరంజా పరిశోధనా కేంద్రంలో ఈ ఉష్ణోగ్రత నమోదైనట్లు డబ్ల్యూఎమ్ఓ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో రికార్డు స్థాయిలో నమోదైన 18.3 డిగ్రీల సెల్సియస్ కొత్త రికార్డు కూడా అర్జెంటీనాలోని అదే స్టేషన్లో నమోదైనట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు అంటార్కిటిక్ ట్రీటీ సిస్టంతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రొఫెసర్ తాలాస్ చెప్పారు. చదవండి: తొలిసారి నీలి తిమింగలం పాట! -
గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో చైనాను దాటేసిన భారత్
న్యూఢిల్లీ: గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్-200 టాప్-10 దేశాల్లో భారత్ నిలిచింది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ రూపొందించిన ఈ జాబితాలో భారత్ 10వ ర్యాంక్‌ను చేజిక్కించుకుంది. 37 స్థానాలు మెరుగుపడి ఈ ర్యాంక్‌ను దక్కించుకోవడం విశేషం. 2019లో 47వ స్థానానికి పరిమితమైన భారత్ ఈ అంశంలో తాజాగా తన ర్యాంకును మరింతగా మెరుగుపరుచుకుంది. ఆసియా పసిఫిక్ ప్రాంత పరంగా నాల్గవ ర్యాంక్ సాధించింది. సైబర్ సెక్యూరిటీ విషయంలో చట్టపరమైన, సాంకేతిక, సంస్థాగత చర్యలు, సామర్థ్యం అభివృద్ధి, సహకారం ఆధారంగా ఇండెక్స్ రూపుదిద్దుకుంటుంది. ప్రపంచ సైబర్ సెక్యూరిటీ ర్యాంకింగ్ పరంగా భారత్ టాప్ 10లో ఉంటే మన శత్రు దేశాలు చైనా 33వ స్థానంలో, పాకిస్తాన్ 79వ స్థానంలో ఉన్నాయి. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్(ఐటీయు), గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఎజెండా(జీసీఏ) జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. తరువాత స్థానంలో యుకె ఉంది. "ఇది గొప్ప వార్త సీఈఆర్టీ(సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్)తో పాటు మేము తీసుకున్న చర్యలకు ఇది నిదర్శనం' అని భారత జాతీయ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్(ఎన్ సీఎస్సీ) రాజేష్ పంత్ అన్నారు. చదవండి: సెప్టెంబర్ నుంచి బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్ డెలివరీలు