ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఇప్పుడు కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది. గత కొన్నేళ్లుగా అల్లకల్లోలంగా మారిన పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఇప్పుడు ‘ఐఎస్‌ఐఎస్’కి అనువైన గమ్యస్థానాలుగా మారుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
పేదరికం,ఆకలితో పాటు పశ్చిమ ఆఫ్రికా దేశాలు అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్నాయి. నైజర్, మాలి, బుర్కినా ఫాసో వంటి పశ్చిమ ఆఫ్రికా దేశాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకుని ఈ దేశాలలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
పశ్చిమ ఆఫ్రికాలో నెలకొన్న రాజకీయ అస్థిరతతో పాటు అక్కడి తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ స్థావరాలు ముప్పుగా పరిణమించాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘ఐఎస్‌ఐఎస్’ విదేశాల్లో దాడులు చేయాలనుకుంటోందనే సమాచారం తమకు నిఘా వర్గాల ద్వారా అందిందని, అలాగే ఆ సంస్థ ఉగ్రవాదులు ఆఫ్రికన్ దేశాలను తమ కొత్త స్థావరంగా ఏర్పాటు చేసుకుంటున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment