isis
-
అమెరికాలో వరుస దాడులు
వాషింగ్టన్: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత తొలి 24 గంటల వ్యవధిలోనే అగ్రరాజ్యం అమెరికాలో మూడు భీకర దాడులు జరిగాయి. 16 మంది మరణించారు. పదులు సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం న్యూ ఆర్లియన్స్‌లో జరిగిన దాడిలో 15 మంది మృతి చెందారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రేరణతో ఓ దుండగుడు జనంపైకి వాహనంపై దూసుకెళ్లాడు. తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని హతమార్చారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే లాస్ వెగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో టెస్లా కారు పేలిపోయింది. ఒకరు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. తర్వాత బుధవారం రాత్రి న్యూయార్క్ నైట్‌క్లబ్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే, ఈ మూడు ఘటనలకూ పరస్పరం సంబంధం ఉందని, ఇవన్నీ ముమ్మాటికీ ఉగ్రవాద దాడులేనని ప్రజలు అను మానం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రెండు ఘటనలను ఉగ్రదాడి కోణంలో విచారణ సాగిస్తుండడం గమనార్హం. జబ్బార్ ట్రక్కులో ఐసిస్ జెండా న్యూ ఆర్లియన్స్‌లోని బార్బన్ వీధిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న జనంపైకి శంషుద్దీన్ జబ్బార్ అనే వ్యక్తి వాహనంతో దూసుకొచ్చాడు. ఫోర్డ్ ఎఫ్–150 అద్దె ట్రక్కుతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తర్వాత రైఫిల్‌తో జనంపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 15 మంది చనిపోగా, 35 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో జబ్బార్ హతమయ్యాడు. ట్రక్కులో ఐసిస్ జెండాను గుర్తించినట్లు ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. లాస్ వెగాస్‌లో ట్రంప్ హోటల్ వద్ద టెస్లా కారును పేల్చేసిన వ్యక్తి, జబ్బార్‌కు సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వారిద్దరూ గతంలో ఒకే మిలటరీ స్థావరంలో పనిచేశారు. న్యూ ఆర్లియన్స్ దాడిని ఉగ్రవాద దాడిగానే దర్యాప్తు అధికారులు పరిగ ణిస్తున్నారు. ఎక్కువ మందిని చంపాలన్న ఉద్దేశంతోనే జబ్బార్ దాడి చేశాడని అంటున్నారు. ఐసిస్ తో అతడికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో ఎఫ్‌బీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. రెండు వాహనాలు ఒకే యాప్ నుంచి.. న్యూ ఆర్లియన్స్ దాడికి ఉపయోగించిన ట్రక్కును, లాస్ వెగాస్ దాడిలో ఉపయోగించిన టెస్లా కారును ‘టూరో యాప్’ నుంచే అద్దెకు తీసుకున్నారు. వాహనంలో బ్యాటరీ వల్ల ఈ పేలుడు జరగలేదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు. కారులో పేలుడు పదార్థాలను అమర్చడం వల్లే అది పేలిందని అన్నారు. కారులో లోపం ఏమీ లేదని స్పష్టంచేశారు. టెస్లా కారు పేలుడు వ్యవహారాన్ని సైతం అధికారులు ఉగ్రవాద దాడి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. కొలరాడోలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో ఈ వాహనాన్ని దుండగుడు అద్దెకు తీసుకున్నాడు. అక్కడ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, సదరు దుండగుడి పేరును ఇంకా బయటపెట్టలేదు. కానీ స్థానిక మీడియా కథనం ప్రకారం... మాథ్యూ లివెల్స్బర్గర్ అనే ఈ దుండగుడు కొలరాడో స్ప్రింగ్స్ కారును అద్దెకు తీసుకున్నాడు. కారులో తొలుత నెవడాకు చేరుకున్నాడు. అందులో బాణాసంచా, మోర్టార్స్, గ్యాస్ క్యాన్లు అమర్చాడు. అనంతరం లాస్ వెగాస్‌లో ట్రంప్ హోటల్ ఎదుట పేల్చేశాడు.నైట్‌క్లబ్‌లో 30 రౌండ్ల కాల్పులు మూడో ఘటన విషయానికొస్తే న్యూ యార్క్‌లో క్వీన్స్ ప్రాంతంలోని నైట్‌క్లబ్ వద్ద కాల్పులు జరిగాయి. కనీసం 12 మంది గాయపడ్డారు. క్లబ్ బయట వేచి ఉన్న జనంపైకి దాదాపు నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కనీసం 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి దుండుగులు పరారయ్యారు. -
న్యూఓర్లీన్స్ ట్రక్కు దాడి.. ఎవరీ జబ్బర్?
కొత్త సంవత్సరం వేళ.. కేవలం గంటల వ్యవధిలో అమెరికాను వరుస దాడులు వణికించాయి. ముఖ్యంగా న్యూ ఓర్లీన్స్ ట్రక్కు దాడి కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై విచారణ పూర్తిగా ఉగ్రకోణంలోనే సాగుతోందని ఎఫ్‌బీఐ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అనుమానితుడికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు విడుదల చేసింది.గతంలో అమెరికా సైన్యం పని చేసిన షంసుద్ దిన్ జబ్బార్(42)ను ఈ దాడికి ప్రధానసూత్రధారిగా అనుమానిస్తున్నారు. ట్రక్కుతో దాడికి పాల్పడిన అనంతరం.. అతడ్ని భద్రతా బలగాలు అక్కడికక్కడే కాల్చి చంపాయి. అయితే అతనొక మానసిక రోగినా? లేకుంటే ఉగ్రవాదినా? అనేదానిపై ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. కానీ.. 👉జబ్బార్ గతంలో టెక్సాస్‌లో రియల్ ఎస్టేట్(Real Estate) ఎజెంట్‌గా పని చేశాడు. అంతకు ముందు చాలాఏళ్లు అమెరికా సైన్యంలో పని చేశాడు. అయితే.. ఆర్థిక సమస్యలతో పాటు విడాకులు అతని వ్యక్తిగత జీవితాన్ని కుంగదీసినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల కిందట.. యూట్యూబ్ ఛానెల్లో తనను తాను రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పరిచయం చేసుకున్న ఓ వీడియో సైతం ఇప్పుడు బయటకు వచ్చింది.👉ఇదిలా ఉంటే.. జబ్బార్ 2005 నుంచి 2015 మధ్య అమెరికా సైన్యంలో హ్యూమన్ రీసోర్స్ స్పెషలిస్ట్‌గా, ఐటీ స్పెషలిస్ట్‌గా పని చేశాడని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. అంతేకాదు.. 2009-10 మధ్య అఫ్గనిస్థాన్‌లో అతను విధులు నిర్వహించాడు. తాజా దాడి ఘటన తర్వాత.. అమెరికా సైన్యంలో అతను పని చేసిన టైంలో ఓ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది. అయితే కాసేపటికే ఆ వీడియోను ఎవరో యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు.👉వీటితో పాటు 2021 నుంచి ప్రముఖ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్‌లో అతడు సీనియర్ సొల్యూషన్ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వహించాడు.👉దాడి ఘటనపై అతని కుటుంబం స్పందించింది. తన సోదరుడు జబ్బార్ ఎంతో మంచివాడని అబ్దుర్ జబ్బార్ చెప్తున్నాడు. చిన్నతనంలో మా కుటుంబం మతం మారింది. కానీ, ప్రస్తుత దాడిని మతానికి ముడిపెట్టడం సరికాదు. రాడికలైజేషన్ ప్రభావంతోనే నా సోదరుడు ఉన్మాదిగా మారిపోయి ఉంటాడు అని అబ్దుర్ చెప్తున్నాడు.👉జార్జియా స్టేట్ యూనివర్సిటీలో జబ్బార్ విద్యాభ్యాసం కొనసాగింది. 2015-17 మధ్య కంప్యూటర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడతను. జబ్బార్ డైవోర్సీ. రెండుసార్లు వివాహం జరగ్గా.. ఇద్దరితోనూ విడాకులు తీసుకున్నాడు. ఆర్థిక సమస్యలతోనే రెండో భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు 2022లో అతను పంపిన మెయిల్‌ను అధికారులు పరిశీలించారు.👉రియల్ ఎస్టేట్ నష్టాలతో జబ్బార్ ఆర్థికంగానూ జబ్బార్ చితికిపోయి ఉన్నాడు. ఒకానొక టైంలో అద్దె కూడా చెల్లించని లేని స్థితికి చేరుకున్నాడు. ఆఖరికి లాయర్‌కు ఫీజులను కూడా క్రెడిట్ కార్డులతో చెల్లించి.. వాటిని ఎగ్గొట్టాడు.👉నేర చరిత్రను పరిశీలిస్తే.. 2002లో దొంగతనం, 2005లో కాలం చెల్లిన డ్రైవింగ్ లైసెన్స్‌తో బండి నడిపి శిక్ష అనుభవించాడు.👉షంషుద్దీన్ జబ్బార్ దాడి చేస్తాడని కొన్ని గంటల ముందే ఎఫ్‌బీఐ తనకు సమాచారం అందించినట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వెల్లడించారని ఏబీసీ న్యూస్ ఓ కథనం ప్రచురించింది. ఐసిస్ స్ఫూర్తితోనే తాను ఈ చర్యకు ఉపక్రమిస్తున్నట్లు వీడియో పోస్ట్ చేశాడు. ఇస్లామిక్ స్టేట్ ఆర్మ్డ్ గ్రూప్(ఐసిస్‌కు మరో పేరు) జెండా కూడా దాడికి పాల్పడిన ట్రక్కులో ఉన్నట్లు ఎఫ్‌బీఐ తనకు నివేదించిందని బైడెన్ చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. 👉షంషుద్దీన్ జబ్బార్‌ను ఐసిస్ ఒంటరి తోడేలు (Lone Wolf)గా ఎఫ్‌బీఐ భావిస్తోంది. అంటే.. ఒంటరిగాగానీ లేదంటే చిన్నగ్రూపులుగా ఏర్పడి దాడులు చేయడం. అమెరికాలో జరిగే అత్యధిక ఉగ్రదాడులు ఈ రూపంలోనే ఉంటున్నాయి. 2014లో బెల్జియంలో యూదుల మ్యూజియంపై, 2012లో బ్రస్సెల్స్‌లో మసీదుపై, 2016లో ఫ్రాన్స్‌లో బాస్టిల్‌డే నాడు ట్రక్కుతో దాడి ఇలా చేసినవే. ‘‘అతడికి సైనిక నేపథ్యం ఉంది. కానీ, ఏనాడూ యుద్ధంలో పాల్గొనలేదు. నౌకాదళంలో చేరేందుకు ప్రయత్నించినా.. అది వీలుకాలేదు. దాడికి ముందు సెయింట్ రోచ్ సమీపంలో ఓ ఇంటి సమీపంలో అతడు ట్రక్కును ఆపి కొన్ని పెట్టెలను కిందకి దించుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఆ తర్వాత కొన్ని గంటలకే అక్కడున్న ఆ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిందితుడు జబ్బార్ ఎయిర్ బీఎన్‌బీలో ఒక గది తీసుకొని.. అక్కడ న్యూఆర్లీన్ దాడికి పేలుడు పదార్థాలు తయారుచేశాడు. టూరో అనే యాప్ సాయంతో అతడు ఫోర్డ్ ఎఫ్-150 లైటినింగ్ అనే భారీ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కును బుక్ చేశాడు. దానిని వాడే నూతన సంవత్సర వేడుకల వేళ బర్బన్ వీధిలో విచక్షణా రహితంగా దాడి చేసి 15 మందిని బలిగొన్నాడు’’ అని లూసియానా అటార్నీ జనరల్ లిజ్ ముర్రిల్ల్ తెలిపారు.అయితే జబ్బార్ తన కుటుంబాన్ని ఐసిస్‌లో కలవాలని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేశాడని.. వినకపోయేసరికి వాళ్లను సైతం కడతేర్చడానికి వెనుకాడలేదని అధికారులు చెప్తుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తున్నారు. -
ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ విజృంభిస్తుందా?
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) ఉగ్రసంస్థ మొదట్నుంచీ సిరియా కేంద్రంగానే తన ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తోంది. బషర్ అల్ అసద్ నియంత పాలనలో ఇన్నాళ్లూ ఉక్కుపిడికిలి కింద నలిగిపోయి కటిక పేదరికంలో మగ్గిపోయిన సిరియన్లు ఇకనైనా మంచి రోజులు వస్తాయని సంబరపడుతున్నారు. అయితే ఈ ఆనందక్షణాలు కలకాలం అలాగే నిలిచి ఉంటాయో లేదోనన్న భయాలు అప్పుడే కమ్ముకుంటున్నాయి.అసద్ పాలన అంతమయ్యాక పాలనాపగ్గాలు అబూ మొహమ్మద్ అల్ జొలానీ చేతుల్లోకి వెళ్తున్నాయి. ఈయన దేశాన్ని కర్కశపాలన నుంచి విముక్తి ప్రసాదించిన నేతగా ప్రస్తుతానికి స్థానికులు కీర్తిస్తున్నా ఆయన చరిత్రలో చీకటికోణాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే జొలానీ మూలాలు అల్‌ఖైదా ఉగ్రసంస్థలో ఉన్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థతో మంచి దోస్తీ చేసి తర్వాత తెగదెంపులు చేసుకున్నా.. ఇప్పుడు మళ్లీ పాత మిత్రులకు ఆహ్వానం పలికితే సిరియాలో ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ జడలు విప్పుకుని కరాళ నృత్యం చేయడం ఖాయమని అంతర్జాతీయ యుద్ధ, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జొలానీతో సుస్థిరత పాలన సాధ్యమా?ఉగ్రమూలాలున్న వ్యక్తికి యావత్‌దేశాన్ని పాలించేంత శక్తియుక్తులు ఉన్నాయా? అనే సందేహాలు అందరికీ వస్తున్నాయి. 2011లో వెల్లువలా విస్తరించిన అరబ్ ఇస్లామిక్ విప్లవం ధాటికి ఈజిప్ట్, లిబియా, టునీషియా, యెమెన్లలో ప్రభుత్వాలు కూలిపోయాయి. దేశ మత, విదేశాంగ విధానాలు మారిపోయాయి. ఇప్పుడు హయత్ తహ్రీర్ అల్ షామ్(హెచ్‌టీఎస్) చీఫ్ హోదాలో జొలానీ సిరియాలోని తిరుగుబాటుదారులు, వేర్వేరు రెబెల్స్ గ్రూప్‌లను ఏకతాటి మీదకు తేగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అల్‌ఖైదాతో గతంలో సత్సంబంధాలు ఉన్న హెచ్‌టీఎస్‌ను అమెరికా, ఐక్యరాజ్యసమితి గతంలోనే ఉగ్రసంస్థగా ప్రకటించాయి.ఉగ్రసంస్థగా ముద్రపడిన సంస్థ.. ఐసిస్‌ను నిలువరించగలదా అన్న మీమాంస మొదలైంది. రాజకీయ శూన్యతను తమకు అనువుగా మార్చుకుని ఐసిస్ మళ్లీ చాపకింద నీరులా విస్తరించే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. 2019 నుంచి అమెరికా ఇచ్చిన సైనిక, ఆర్థిక సహకారంతో సిరియాలో పెద్దగా విస్తరించకుండా ఐసిస్‌ను బషర్ అసద్ కట్టడిచేయగలిగారు. సిరియా సామాజిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన అంతర్యుద్ధానికి తెరపడిన నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని మొహమ్మెద్ ఘాజీ జలానీ.. హెచ్‌టీఎస్ చీఫ్ జొలానీతో అధికార మార్పిడికి పూర్తి సుముఖత వ్యక్తంచేశారు.అయితే అధికారం చేతికొచ్చాక రెబెల్స్‌లో ఐక్యత లోపిస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని అంతా భయపడుతున్నారు. దేశం మొత్తమ్మీద జొలానీ పట్టుసాధించని పక్షంలో ఇన్నాళ్లూ దూరం దూరంగా చిన్న చిన్న ప్రాంతాలకు పరిమితమైన ఐసిస్ అత్యంత వేగంగా విస్తరించే సామర్థ్యాన్ని సముపార్జించగలదు. అసద్ పాలన అంతం తర్వాత ఆరంభమైన ఈ కొత్త శకం అత్యంత రిస్క్‌తో, ఏమౌతుందో తెలియని గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యలు చూస్తుంటే క్షేత్రస్తాయిలో పరిస్థితి ఎంతటి డోలాయమానంగా ఉందో ఇట్టే అర్ధమవుతుంది. ఐసిస్ ప్రభావమెంత?బషర్ అసద్ కాలంలోనూ ఆయనకు వాయవ్య సిరియాపై పట్టులేదు. అక్కడ ఐసిస్ ప్రభావం ఎక్కువ. ఈ వాయవ్య ప్రాంతంలో 900కుపైగా అమెరికా సైనికులు ఉన్నా సరిపోవడం లేదు. ఈ జనవరి–జూన్కాలంలో ఇరాక్, సిరియాల్లో ఐసిస్ 153 దాడులు చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ గణాంకాల్లో వెల్లడైంది. ఐసిస్‌ను అంతమొందించేందుకు అమెరికా తరచూ గగనతల దాడులు చేస్తోంది. ఐసిస్ ఉగ్రవాదులు, సానుభూతిపరులు, స్థావరాలే లక్ష్యంగా ఇటీవలే 75 చోట్ల దాడులుచేసింది. కొన్ని ప్రాంతాలను తుర్కియే దన్నుతో ‘సిరియన్ నేషనల్ ఆర్మీ’ పాలిస్తోంది. అమెరికా నుంచి సాయం పొందుతున్న కుర్ద్‌ల బలగాలు కొన్నిచోట్ల పాలిస్తున్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థ కొంత ప్రాంతాన్ని ఏలుతోంది. హెచ్‌టీ ఎస్ తిరుగుబా టుదారులు, విపక్షాల ఫైటర్లు ఇంకొన్ని ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ఐసిస్ను ఎలా కట్టడిచేశారు?హెచ్‌టీఎస్ గ్రూప్‌కు మొదట్నుంచీ అల్‌ఖైదాతో సంబంధాలున్నాయి. అయితే 2016లో అల్‌ఖైదాతో హెచ్‌టీఎస్ తెగదెంపులు చేసుకుంది. అయితే 2011 నుంచే సిరియాలో ఐసిస్ విస్తరిస్తోంది. మాస్కులు ధరించిన ఐసిస్ ఉగ్రవాదులు అమాయక బందీలను తల నరికి చంపేసిన వీడియోలు అంతర్జాతీయ మీడియాలో ప్రత్యక్షమయ్యాక ఐసిస్ ఎంత నిర్దయగల సంస్థో ప్రపంచానికి తెలిసివచ్చింది. 2014 నుంచే సిరియాలో ఐసిస్‌ను అంతం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో 2016లో అమెరికా కొంతమేర సఫలీకృతమైంది.కుర్ద్, తుర్కియే బలగాలకు ఆయుధ సాయం అందించి మరింత విస్తరించకుండా అమెరికా వాయవ్య సిరియాకు మాత్రమే ఐసిస్‌ను పరిమితం చేయగలిగింది. 2018లో ఐసిస్ పని అయిపోయిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ 2019లో మళ్లీ దాడులతో ఐసిస్ తనలో చావ చచ్చిపోలేదని నిరూపించుకుంది. అయితే ఐసిస్ ప్రభావం కొనసాగినంతకాలం అంతర్యుద్ధం తప్పదని మేధోసంస్థ గల్ఫ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అబ్దుల్అజీజ్ అల్ సగేర్ వ్యాఖ్యానించారు. 2003లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పతనం, లిబియా నియంత గఢాఫీ 2011లో అంతం తర్వాత ఆయా దేశాల్లో పౌరయుద్ధాలు మొదలయ్యా యని ఆయన ఉదహరించారు.ఐసిస్‌ను నిలువరించే సత్తా జొలానీకి ఉందా?హెచ్‌టీఎస్ వంటి తిరుగుబాటు సంస్థకు నేతృత్వం వహించినా జొలానీ ఏనాడూ హింసాత్మక ఘటనల్లో ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. విప్లవయోధుడు చెగువేరా తరహాలో తానూ సిరియా విముక్తి కోసం పోరాడుతున్న ఆధునిక తరం యోధునిగా తన వేషభాషల్లో వ్యక్తంచేసేవారు. అతివాద సంస్థకు నేతృత్వం వహిస్తూనే ఉదారవాద నేతగా కనిపించే ప్రయత్నంచేశారు. ఐసిస్ వంటి ముష్కరమూకతో పోరాడాలంటే మెతక వైఖరి పనికిరాదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ ఐసిస్ అధీనంలోని వాయవ్య సిరియాలో ఎవరైనా తమను విమర్శిస్తే వారిని చిత్రహింసలకు గురిచేయడం, జైళ్లో పడేయడం, చంపేయడం అక్కడ మామూలు.ఈ దారుణాలను సిరియా పగ్గాలు చేపట్టాక జొలానీ నిలువరించగలగాలి’’ అని న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సోఫాన్ గ్రూప్ ఉగ్రవ్యతిరేక వ్యవహారాల నిపుణుడు కోలిన్ అన్నారు. ‘‘ అసద్‌ను గద్దె దింపేందుకు అమెరికా బిలియన్ల డాలర్లను ఖర్చుచేసింది. ఇప్పుడు కొత్త ఆశలు చిగురించినా ఐసిస్ నుంచి సవాళ్లు ఉన్నాయి’’ అని ట్రంప్ అన్నారు. జొలానీ పాలనాదక్షత, అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థిక, ఆయుధ అండదండలు అందితే, వాటిని సద్వినియోగం చేసుకుంటే సిరియాలో మళ్లీ శాంతికపోతాలు ఎగురుతాయి. లేదంటే మళ్లీ ఐసిస్ ముష్కరమూకలు సిరియన్ల కలలను కకావికలం చేయడం ఖాయం. -
పసిపిల్లల మాంసం తినిపించారు
ఐసిస్ చెర నుంచి బయటపడ్డ ఫాజియా సిడో అనే మహిళ భయంకరమైన విషయాలు వెల్లడించింది. తనతో పాటు ఇతర ఖైదీలతో పసి పిల్లల మాంసం తినిపించారని తెలిపింది! 2014లో ఇరాక్‌లోని సింజార్‌లో దాడి చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిడోను ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. అప్పటికి ఆమెకు 11 ఏళ్లు. ‘‘తీసుకెళ్లాక మమ్మల్ని రోజుల తరబడి ఆకలితో ఉంచారు. తర్వాత అన్నం, మాంసంతో కూడిన భోజనం ఇచ్చారు. చాలా ఆకలితో ఉన్నందున వింత రుచి ఉన్నప్పటికీ తిన్నాం. తర్వాత అంతా అస్వస్థతకు గురయ్యాం. మేం తిన్నది పసి పిల్లల మాంసమని ఆ తర్వాత ఐఎస్ ఉగ్రవాదులు బయటపెట్టారు. యజిదీ పిల్లల మాంసమని చెప్పారు. తలలు నరికిన చిన్నారుల ఫొటోలు చూపించి, ‘ఇప్పుడు మీరు తిన్న మాంసం ఈ పిల్లలదే’ అని చెప్పారు. అది విని మాకు మతిపోయింది. ఓ మహిళ హార్ట్ ఫెయిల్యూర్‌తో మృతి చెందారు. ఓ తల్లి ఆ ఫొటోల్లో తన బిడ్డను గుర్తించి గుండె పగిలేలా ఏడ్చారు’’ అంటూ ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఐసిస్ తమ బందీలకు మనుషుల మాంసం తినిపించిందని గతంలో వచి్చన ఆరోపణలను సిడో కథనం ధ్రువీకరించింది. ఈ విషయాన్ని 2017లో యాజిదీ పార్లమెంటేరియన్ వియాన్ దఖిల్ తొలిసారి వెలుగులోకి తెచ్చారు. ఇంకా ఐసిస్ చెరలోనే... 2014లో ఉత్తర ఇరాక్‌లో మైనారిటీలైన వేలాదిమంది యాజిదీ మహిళలు, చిన్నారులను ఐసిస్ కిడ్నాప్ చేసింది. వారిలో సిడో ఒకరు. మరో 200 మంది యాజిదీ మహిళలు, పిల్లలతో కలిసి అండర్ గ్రౌండ్ జైలులో తొమ్మిది నెలల పాటు బందీగా ఉన్నారు. కలుíÙత నీటితో కొందరు చిన్నారులు మృతి చెందారు. సిడోను అబూ అమర్ అల్–మక్దీసీతో సహా అనేక మంది జిహాదీ ఫైటర్లకు విక్రయించారు. ఆమెతోపాటు చాలా మందిని బానిసలుగా అమ్మారు. ఏళ్ల తరబడి హింస, దోపిడీ తర్వాత ఇజ్రాయెల్, అమెరికా, ఇరాక్ రహస్య మిషన్ వల్ల ఆమె చెర నుంచి సిడో బయటపడ్డారు. తరువాత ఆమెను ఇజ్రాయెల్‌లోని కెరెమ్ షాలోమ్ క్రాసింగ్‌కు పంపారు. అక్కడినుంచి జోర్డాన్‌కు ప్రయాణించి చివరికి ఇరాక్‌లోని తన కుటుంబాన్ని తిరిగి కలుసుకున్నారు. సిడో ప్రస్తుతం సురక్షితంగా ఉన్నప్పటికీ దశాబ్ద కాలం బందీగా ఉన్నప్పటి మానసిక గాయాలు తీవ్రంగా ఉన్నాయని ఆమె న్యాయవాది తెలిపారు. 2014 యాజిడీ మారణహోమం నుంచి 3,500 మందికి పైగా యాజిదీలను రక్షించారు. సుమారు 2,600 మంది గల్లంతయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సిరియా: ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు
న్యూయార్క్: సిరియాలోని ఐసిస్ స్థావరాలపై పలు వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా వెల్లడించింది. తమ దాడులతో ఐసిస్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. ‘‘శనివారం ఉదయం ఐసిస్ క్యాంప్‌లపై అమెరికా సెంట్రల్ కమాండ్ బలగాలు వైమానిక దాలు చేశాం. ఈ దాడులు.. అమెరికా, దాని మిత్రదేశాలు , భాగస్వాములపై దాడులకు ప్లాన్ చేయటం, దాడుల నిర్వహించటం వంటి ఐసిస్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ దాడులుకు సంబంధించి సమాచారం అందిస్తాం’ అని అమెరికా పేర్కొంది. అయితే ఈ దాడుల్లో మృతుల సంఖ్య తదితర వివరాలు అమెరికా వెల్లడించకపోవటం గమనార్హం.U.S. Central Command conducts airstrikes against multiple ISIS camps in Syria. pic.twitter.com/i8Nqn1K97p— U.S. Central Command (@CENTCOM) October 12, 2024ఇటీవల కాలంలో సిరియాపై అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి. సెప్టెంబరు నెల చివరిలో ఐసిస్ స్థావరాలే టార్గెట్‌గా అమెరికా గగనతల దాడులు చేసింది. ఈ దాడుల్లో 37 మంది హతమైనట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మృతి చెందిన వారంతా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదా అనుబంధ సంస్థలకు చెందినవారేనని పేర్కొంది. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు వెల్లడించింది.చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? -
రష్యా జైలులో ‘ఐసిస్’ కలకలం
మాస్కో: రష్యాలోని ఓ డిటెన్షన్ సెంటర్లో కొంతమంది విచారణ ఖైదీలు సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం సంచలనం రేపింది. ఈ షాకింగ్ ఘటనతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జైలు సిబ్బందిని నిర్బంధించిన ఖైదీల్లో కొందరిని అంతమొందించారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రోస్తోవ్-ఆన్-డాన్ నగరంలో ఉన్న ప్రీ-ట్రయల్ డిటెన్షన్ సెంటర్లో ఆరుగురు ఖైదీలు ఇద్దరు జైలు గార్డులను బందీలుగా పట్టుకున్నారు. ఆ ఖైదీలకు ఉగ్రవాదసంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు(ఐసిస్)తో సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. వారి వద్ద మారణాయుధాలున్నట్లు అధికారులు తెలిపారు.ఖైదీల బారి నుంచి ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, వారికి ఎలాంటి గాయాలు కాలేదని రష్యా మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఎంతమంది ఖైదీలు మృతి చెందారనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఈ ఏడాది మార్చిలో మాస్కోలోని ఓ మ్యూజిక్ కన్సర్ట్ హాల్‌పై ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. -
మాస్కో దాడి: ‘ఐసిస్ హస్తముందని అమెరికా నమ్ముతుందా?’
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో క్రాకస్ సిటీ హాల్లో శుక్రవారం అర్ధరాత్రి సంగీత కచేరి జరుగుతుండగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ మారణహోమంలో ఇప్పటివరకు 137కు మంది మృతి చెందారు. ఈ దారుణంలో 120 మందికి పైగా గాయపడ్డారు. అయితే దారుణాకి బాధ్యత వహిస్తూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఖోరసాన్) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని అమెరికా సైతం బహిరంగంగా ధృవీకరిస్తూ ప్రకటనలు చేయటం గమనార్హం. అయితే అమెరికా ప్రకటనలపై తాజాగా రష్యా స్పందించింది. ఉక్రెయిన్, ఆ దేశ అధ్యక్షడు వ్లాదిమిర్ జలెన్స్కీని రక్షించటం కోసమే అమెరికా.. ఈ దాడిని ఐసిస్పైకి నెడుతోందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖారోవా అన్నారు. తాను అమెరికా వైట్ హౌస్‌ను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. నిజంగా ఈ దాడికి పాల్పండింది ఐసిస్ అని మీరు (అమెరికా) ఖచ్చితంగా చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. ఇదే అభిప్రాయం మీద అమెరికా ఉండగలదా? అని నిలదీశారు. గతం మధ్య ప్రాచ్య దేశాలకు సంబంధించిన వ్యవహారాలపై అమెరికా జోక్యం చేసుకోవటం వల్ల రాడికల్, ఉగ్రవాదుల అధిపత్యం పెరిగిందని మండిపడ్డారు. ఉగ్రవాద సంస్థలు ఇప్పటికీ క్రీయాశీలకంగా ఉండటాని అమెరికా జోక్యమే కారణమన్నారు. ఇలా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవటం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషేధమని తెలిపారు. నియంత్రణ వైఖరితో ప్రపంచాన్ని ఉగ్రవాదులకు మద్దతుగా ఉండటం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఉక్రెయిన్‌లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించడానికి అమెరికా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తోందని మండిపడ్డారు. ఈ దాడికి సంబంధించి అమెరికా చేస్తున్న వ్యాఖ్యలపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే.. కాల్పుల ఘటనతో ఉక్రెయిన్‌కు సంబంధం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. పట్టుబడిన దుండుగుల్లో నలుగురు వ్యక్తులు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. పుతిన్ ఆరోపణలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారుడైన మైఖైలో పొదొలాయిక్ స్పందిస్తూ.. మాస్కో మారణహోమంతో తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఉగ్రవాద పద్ధతులను పాటించే అలవాటు తమకు లేదన్నారు. -
‘‘ఐసిస్‌లో చేరతా’’.. ఐఐటీ విద్యార్థి అరెస్టు
గువహతి: ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరతానని సోషల్ మీడియాలో ప్రకటించడంతో పాటు ఈ మెయిల్స్ చేసిన ఐఐటీ గువహతి విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన తర్వాత ఆ విద్యార్థి ఎక్కడికెళ్లాడో ఆజూకీ తెలియలేదు. తర్వాత పోలీసులు గాలించి అస్సాంలోని కమ్రుప్ జిల్లాలో అతడిని పట్టుకున్నారు. ఐసిస్ ఇండియా చీఫ్ హరిస్ ఫరూకీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫరూకీ అతని అనుచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్ అస్సాంలోని ధుబ్రిలో అరెస్టయిన నాలుగు రోజుల తర్వాత మిస్సైన విద్యార్థి ఆజూకీని పోలీసులు కనుగొనడం గమనార్హం. ‘ విద్యార్థి పంపిన మెయిల్స్ నిజమైనవేనని ధృవీకరించుకుని దర్యాప్తు ప్రారంభించాం. ట్రావెలింగ్‌లో ఉండగా ఆ విద్యార్థిని పట్టుకున్నాం. అరెస్టు చేసి ప్రాథమికంగా విచారించాం. చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటాం. ఐసిస్ నల్ల జెండాతో పాటు ఐసిస్ మనుస్క్రిప్ట్ విద్యార్థి హాస్టల్ రూమ్‌లో దొరికింది. విద్యార్థి డిల్లీలోని ఓక్లాకు చెందినవాడు’అని అస్సాం పోలీసులు తెలిపారు. Reference @IITGuwahati student pledging allegiance to ISIS - the said student has been detained while travelling and further lawful follow up would take place. @assampolice @CMOfficeAssam @HMOIndia — GP Singh (@gpsinghips) March 23, 2024 ఇదీ చదవండి.. ఎన్నికల వేళ బరితెగిస్తున్న కేటుగాళ్లు -
మాస్కోలో మారణహోమం
మాస్కో/న్యూఢిల్లీ: రష్యా రాజధాని మాస్కోలో క్రాకస్ సిటీ హాల్లో చోటుచేసుకున్న మారణహోమంలో మృతుల సంఖ్య శనివారం 133కు పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి సంగీత కచేరి జరుగుతుండగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం తెలిసిందే. ఈ దారుణంలో 120 మందికి పైగా గాయపడ్డారు. వారిలో చాలామంది తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ వెల్లడించింది. వారిని పారిపోతుండగా పశి్చమ రష్యాలోని బ్రియాన్‌స్‌్కలో ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోనే బంధించినట్లు తెలిపింది. సరిహద్దు దాటి ఉక్రెయిన్ చేరాలన్న పన్నాగాన్ని భగ్నం చేసినట్లు స్పష్టం చేసింది. ఈ దాడికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఖోరసాన్) ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధికారులు మాత్రం ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ ముష్కరుల పనేనని ఆరోపిస్తున్నారు. కాల్పులకు తెగబడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని అమెరికా నిఘా వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. తాజా పరిణామాలపై రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ చీఫ్ శనివారం రష్యా అధినేత పుతిన్‌తో సమావేశమయ్యారు. అనుమానితుల అరెస్టు తదితరాల గురించి తెలియజేశారు. రష్యాలో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల్లో పుతిన్ మరోసారి ఘన విజయం సాధించి ఆరేళ్లపాటు అధికారం దక్కించుకున్నారు. కొన్ని రోజులకే మాస్కోలో భీకర దాడి జరగడం, 133 మంది మరణించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. మోదీ దిగ్భ్రాంతి మాస్కో ఘోరకలిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అమానుష దాడిని భారత్ ఖండిస్తోందని పేర్కొన్నారు. విపత్కర సమయంలో రష్యా ప్రజలకు అండగా ఉంటామంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఉక్రెయిన్‌కు సంబంధం ఉంది: పుతిన్ కాల్పుల ఘటనతో ఉక్రెయిన్‌కు సంబంధం ఉందని పుతిన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేసినట్లు తెలిపారు. పట్టుబడిన దుండుగుల్లో నలుగురు వ్యక్తులు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయతి్నంచారని అన్నారు. మా పని కాదు: ఉక్రెయిన్ రష్యా కాల్పులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారుడైన మైఖైలో పొదొలాయిక్ స్పందించారు. మాస్కో మారణహోమంతో తమకు సంబంధం లేదని తేలి్చచెప్పారు. ఉగ్రవాద పద్ధతులను పాటించే అలవాటు ఉక్రెయిన్‌కు లేదన్నారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేశారు ► కాల్పులు జరిగిన క్రాకస్ సిటీ హాల్ చాలా విశాలమైన కాంప్లెక్స్. ఇందులో మ్యూజిక్ హాల్‌తోపాటు షాపింగ్ సెంటర్ ఉంది. ► శుక్రవారం రాత్రి సంగీత కచేరి ప్రారంభం కావడానికి ముందు జనం సీట్లలో కూర్చున్నారు. మొత్తం 6,200 సీట్లూ నిండిపోయాయి. ► సంగీత కార్యక్రమం ప్రారంభం కాకముందే కాల్పుల మోత మొదలైనట్లు వీడియో ఫుటేజీని బట్టి తెలుస్తోంది. ► సైనిక దుస్తుల్లో వచి్చన ముష్కరులు అటోమేటిక్ రైఫిళ్లతో విరుచుకుపడ్డారు. ఉన్మాదుల్లాగా చెలరేగిపోయారు. జనంపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో గురిపెట్టి కాల్పులు జరిపారు. తూటా నుంచి రక్షణ కోసం పలువురు సీట్ల వెనుక దాక్కున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ► అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది. చాలామంది బయటకు పరుగులు తీసేందుకు ప్రయతి్నంచారు. తొక్కిసలాట జరిగింది. హాల్ కిక్కిరిసి ఉండడంతో తప్పించుకునే వీల్లేకుండా పోయింది. మృతుల సంఖ్య భారీగా పెరిగింది. లోపలంతా పొగ అలుముకుంది. ► ముష్కరులు గ్రెనేడ్లు, బాంబులు కూడా వేసినట్టు రష్యా మీడియా వెల్లడించింది. కాల్పులు, పేలుళ్ల ధాటికి హాల్లో మంటలు రేగాయి. పైకప్పు కూలిపోయింది. అగి్నమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. క్రాకస్ సిటీ హాల్లో కాల్పులు జరుపుతున్న దుండగులు -
మాస్కో ఉగ్రదాడిపై ముందే హెచ్చరించిన అమెరికా !
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించే అవకాశాలున్నట్లు ముందే హెచ్చరించామని అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని వైట్‌హౌజ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి ఆడ్రియెన్ వాట్సన్ వెల్లడించారు. ‘ఈ నెల మొదట్లో అమెరికా ప్రభుత్వానికి మాస్కో ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం అందింది. ప్రజలు గుమిగూడి ఉన్న ప్రదేశాల్లో ఈ దాడి జరిగే అవకాశాలున్నాయని తెలిసింది. దీంతో వెంటనే రష్యాలో ఉన్న అమెరికాన్లకు అడ్వైజరీ కూడా జారీ చేశాం. డ్యూటీ టు వార్న్ పాలసీ కింద ఇదే విషయాన్ని రష్యా ప్రభుత్వంతోనూ పంచుకున్నాం’అని వాట్సన్ తెలిపారు. మాస్కో శివార్లలో ఓ సంగీత కచేరి కార్యక్రమంలో నలుగురు ఉగ్రవాదులు చొరబడి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో పాటు గ్రెనేడ్ కూడా విసిరారు. ఈ కాల్పుల్లో 62 మంది మృతి చెందగా మరో 100 మంది దాకా గాయపడ్డారు. దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది. ఇదీ చదవండి.. మాస్కోలో ఐసిస్ మారణహోమం -
భారీ ఆపరేషన్.. ఐసిస్ ఇండియా చీఫ్, సహాయకుడు అరెస్ట్
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఇండియా చీఫ్ హరీస్ ఫారూఖీ అరెస్ట్ అయ్యారు. ఆయనతో పాటు ఐసిస్‌కు చెందిన మరో వ్యక్తి(సహాయకుడు)ని అదుపులోకి తిసుకున్నట్లు అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) బుధవారం వెల్లడించింది. ఎన్ఐఏ జాబితా మోస్ వాంటెడ్‌గా ఉన్న హరీస్ ఫారూఖీ బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోని ధుబ్రీలో ప్రవేశించి విధ్వంస కార్యకలపాలకు పాల్పడుతున్నట్లు ఎస్టీఎఫ్ టీంకు సమాచారం అందింది. దీంతో ఎస్టీఎఫ్ టీం చేపట్టిన భారీ ఆరేషన్లో హరీస్ ఫారూఖీ పట్టుబడ్డారు. బంగ్లాదేశ్‌లో ఉంటూ భారత్‌లోని అస్సాం ధుబ్రీ ప్రాంతంలో విధ్వంస కార్యకలాపాలకు పాల్పడాలని ప్రణాళిక వేస్తున్నట్లు ఎస్టీఎఫ్ పోలీసులు గుర్తించారు. హరీష్ ఫారూఖీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫారూఖీ భారత ఐసిస్ చీఫ్‌గా ఉన్నారు. అయనతో పాటు మరో వ్యక్తి రెహ్మన్‌ను భారీ ఆపరేషన్ చేపట్టి ఆరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘మా బృందానికి నమ్మదగిన సమాచారం అందింది. ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దులో ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నరని మేం కూడా నిర్ధారించుకున్నాం. వారు సరిహద్దును దాటే సమయంలో మా టీం ఉదయం వారిని పట్టుకొని అరెస్ట్ చేసింది’ అని స్పెష్ల్ టాస్క్ ఫోర్స్ ఐజీ పార్థసారధి మహంతా తెలిపారు. ఐసిస్ విస్తరణలో భాగంగా.. భారత్‌లో నియామకాలు చేపట్టడానికి కుట్ర పన్నుతున్నారని తెలిపారు. పలు చోట్ల ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధుల సేకరణ, ఐసిస్ కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారని ఐజీ పార్థసారధి వెల్లడించారు. ఢిల్లీ, లక్నో ప్రాంతాల్లో హరీష్ ఫారూఖ్ మీద పలు ఎన్ఐఏ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తదుపరి చర్యలు తీసుకోవటం కోసం అరెస్ట్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏకు అప్పగించినట్లు అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. చదవండి: బీజేపీతో పొత్తు: లోక్‌సభ బరిలో దినకరన్ పార్టీ.. ఎన్ని సీట్లంటే? -
‘ఐఎస్ఐఎస్’కి అడ్డాగా ఆఫ్రికా దేశాలు?
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఇప్పుడు కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది. గత కొన్నేళ్లుగా అల్లకల్లోలంగా మారిన పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఇప్పుడు ‘ఐఎస్ఐఎస్’కి అనువైన గమ్యస్థానాలుగా మారుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. పేదరికం,ఆకలితో పాటు పశ్చిమ ఆఫ్రికా దేశాలు అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్నాయి. నైజర్, మాలి, బుర్కినా ఫాసో వంటి పశ్చిమ ఆఫ్రికా దేశాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకుని ఈ దేశాలలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో నెలకొన్న రాజకీయ అస్థిరతతో పాటు అక్కడి తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ స్థావరాలు ముప్పుగా పరిణమించాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘ఐఎస్ఐఎస్’ విదేశాల్లో దాడులు చేయాలనుకుంటోందనే సమాచారం తమకు నిఘా వర్గాల ద్వారా అందిందని, అలాగే ఆ సంస్థ ఉగ్రవాదులు ఆఫ్రికన్ దేశాలను తమ కొత్త స్థావరంగా ఏర్పాటు చేసుకుంటున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. -
‘మోదీ ప్రధాని కాకముందు రాష్ట్రంలో ఐసిస్ ఏజెంట్లు ఉండేవారు’
సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు తెలంగాణలో ఐసిస్ ఏజెంట్లు ఉండేవారని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో గోకుల్‌చాట్, దిల్సుఖనగర్, లుంబిని పార్క్‌లో మూడుచోట్ల ఒకే సారి బాంబ్ బ్లాస్టులు జరిగాయని అన్నారు. ముంబైలాంటి ప్రాంతాల్లో నడుస్తున్న ట్రైన్లలోకూడా బాంబ్ బ్లాస్టులు జరిగాయని తెలిపారు. పాకిస్థాన్‌లో కూర్చొని రిమోట్ నొక్కితే భారత్‌లో బాంబ్ బ్లాస్టులు జరిగేవని అన్నారు. పాకిస్థాన్ ఐఎస్ఐ వేళ్లుపాతుకొని భారత్‌ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసిందని తెలిపారు. మతకలాహాలు ప్రేరేపించి, ఆడీఎక్స్‌లు పేల్చేవాళ్లని, ఏకే 47లు పంపేవాళ్లని కిషన్‌రెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక ఈ పదేళ్లలో మతకలాలు, కర్ఫ్యూ లు, ఎకే 47లు, RDXలు లేవని అన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించడం జరిగిందని గుర్తుచేశారు. భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ వేల కోట్లు ఖర్చు పెట్టేదని తెలిపారు. ఇండియన్ కరెన్సీని పాకిస్థాన్‌లో నకిలీ కరెన్సీగా ముద్రించి, ఒక ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థను పాకిస్థాన్ నడిపేదన్నారు.ఇవాళ పాకిస్థాన్‌లో ప్రజలు రొట్టె ముక్క కోసం కోట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.పాకిస్థాన్ గత పాపాలను ఇప్పుడు అనుభవిస్తోందని అన్నారు. చదవండి: రేవంత్ ప్రభుత్వానికి మేము సహకరిస్తాం.. బండి సంజయ్ ఆసక్తికర కామెంట్స్ -
పేలుళ్లకు కుట్ర.. 8మంది ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. కర్ణాటక, ముంబయి, ఢిల్లీలో జరిపిన సోదాల్లో 8మంది ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసింది. భారీగా పేలుడు పదార్ధాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. Nia Foils ISIS Ballari Module’s Plans to Trigger IED Blasts Arrests 8 Terror Operatives, including Module Head, in Raids Across 4 States, Seizes Explosive Raw Materials, Weapons, Documents Exposing Terror Plans, etc. pic.twitter.com/jluje0B91b — NIA India (@NIA_India) December 18, 2023 సల్ఫర్, పొటాషియం నైట్రేట్, గన్‌పౌడర్ వంటి పేలుడు పదార్థాల నిల్వలు, ప్రతిపాదిత దాడుల వివరాలతో కూడిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. బాకులు, నగదు, డిజిటల్ పరికరాల వంటి పదునైన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. బళ్లారి మాడ్యూల్‌కు చెందిన నాయకుడు మహ్మద్ సులైమాన్ అరెస్టైన వాళ్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదులు సమాచారం పంచుకోవడానికి IM యాప్‌లను ఉపయోగించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోపేలుళ్లు జరపడానికి కుట్ర పన్నారని అధికారులు పేర్కొన్నారు. తమ గ్యాంగ్‌లో చేర్చుకోవడానికి కళాశాల విద్యార్థులను కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలోని గత వారం ఎన్ఐఏ 40 చోట్ల దాడులు చేసి 15 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం? -
ఐసిస్ మాడ్యూల్ నేత సహా 15 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్)పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కొరడా ఝళిపించింది. సంస్థకు చెందినట్లుగా అనుమానిస్తున్న మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల్లో శనివారం దాడులు జరిపి 15 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఐసిస్ మాడ్యూల్ సూత్రధారి సాకిబ్ నచాన్ కూడా ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఇతడు కొత్తవారిని తమ గ్రూప్‌లోకి చేర్చుకుంటూ వారితో విధేయతతో ఉంటామని ప్రమాణం చేయిస్తుంటాడని వెల్లడించారు. మహారాష్ట్రలోని పగ్ధా–బోరివలి, థానె, మిరా రోడ్డు, పుణెలతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఉదయం దాడులు జరిపినట్లు వివరించారు. ఐసిస్ తరఫున ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, ఉగ్ర సంబంధ చర్యల్లో వీరు పాల్గొంటున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు, తుపాకులు, ఇతర ఆయుధాలు, నిషేధిత సాహిత్యం, సెల్ఫోన్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
టార్గెట్ ఐసిస్..44 చోట్ల ఎన్ఐఏ రెయిడ్స్
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఐసిస్ లక్ష్యంగా కర్ణాటక,మహారాష్ట్రల్లో ఏకకాలంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)రెయిడ్స్ చేస్తోంది. రెండు రాష్ట్రాల్లో మొత్తం 44 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. కర్ణాటకలోని ఒక ప్రాంతంలో మహారాష్ట్రలో 43 చోట్ల ఎన్ఐఏ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా దాడులకు ఐసిస్ కుట్ర పన్నిందని సమాచారం రావడంతోనే ఎన్ఐఏ ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.ఈ రెయిడ్స్‌లో భాగంగా ఎన్ఐఏ ఇప్పటికే 13 మంది దాకా అనుమానితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇదీచదవండి..అమెరికన్ కన్సల్టెన్సీ సర్వే: ప్రధాని మోదీపై కీలక విషయం వెల్లడి..! -
అరబిక్ క్లాసుల ముసుగులో ఉగ్ర పాఠాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ–తమిళనాడుల్లో ఉన్న కొన్ని కేంద్రాలు అరబిక్ క్లాసుల ముసుగులో ఉగ్రవాద పాఠాలు బోధిస్తూ, యువతను ఐసిస్ వైపు ఆకర్షిస్తున్నాయా? ఔననే అంటున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వర్గాలు. ఇలా ప్రేరేపించిన నేపథ్యంలోనే 2022 అక్టోబర్ 23 కోయంబత్తూరులోని సంగమేశ్వర దేవాలయం వద్ద కారు బాంబు పేలుడు జరిగిందని స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చెన్నై ఎన్ఐఏ యూనిట్ శనివారం హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు చేసింది. హైదరాబాద్–తమిళనాడుల్లో మొత్తం 31 చోట్ల తనిఖీలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సోదాల్లో ఉగ్రవాద సంబంధిత పుస్తకాలు, పత్రాలతో పాటు ఫోన్లు, ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్‌లు వంటి డిజిటల్ పరికరాలు, రూ.60 లక్షల నగదు, 18,200 అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ పుస్తకాలు, పత్రాలు అరబిక్‌తో పాటు తెలుగు, తమిళం భాషల్లో ఉన్నట్లు అధికారులు వివరించారు. యువతను ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షించడానికి కొందరు ఉగ్రవాదులు ప్రాంతాల వారీగా అధ్యయన కేంద్రాలు, అరబిక్ బోధన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వాట్సాప్, టెలిగ్రామ్‌లో ఏర్పాటు చేసిన గ్రూపుల ద్వారా తమ భావజాలాన్ని ఐసిస్ విస్తరిస్తోందని ఎన్ఐఏ గుర్తించింది. చెన్నైకి చెందిన ఉగ్రవాది ఈ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. కొన్ని రోజులపాటు హైదరాబాద్‌లోనూ నివసించిన ఇతగాడు అల్ ఫుర్ఖాన్ పేరుతో ఓ పబ్లికేషన్స్ నిర్వహించాడు. ఇందులో తెలుగు, తమిళం, అరబిక్ భాషల్లో ఉగ్రవాద సాహిత్యం, భావజాలాన్ని వ్యాప్తి చేసే మెటీరియల్ ముద్రించాడు. ఐసిస్ మీడియా వింగ్ పేరు కూడా అల్ ఫుర్ఖానే కావడం గమనార్హం. ఇతగాడు ఇటీవలే విదేశాలకు పారిపోయాడని నిఘా వర్గాలు గుర్తించాయి. ఐదుగురి ఇళ్లపై ఏకకాలంలో దాడులు.. ఈ చెన్నై వాసి నగరంలో నివసించిన కాలంలో సైదాబాద్ పరిధిలోని సపోటాబాద్కు చెందిన హసన్, రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌కు చెందిన అమీర్, యూసుఫ్‌గూడ, బోరబండ ప్రాంతాలకు చెందిన నూరుల్లా, జాహెద్‌లతో పాటు గోల్కొండ పరిధిలోని షేక్‌పేటకు చెందిన జబ్బార్‌తో సన్నిహితంగా మెలిగాడు. వీరితో పాటు మరికొందరు ఉగ్రవాద సానుభూతిపరులతో సోషల్ మీడియా గ్రూపులు నిర్వహించాడు. తాను ముద్రించిన పుస్తకాలను అందించడంతో పాటు వివిధ అంశాలకు సంబంధించిన సాఫ్ట్‌కాపీలను షేర్ చేశాడు. కోయంబత్తూరు బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడిగా ఉన్న కేరళ వాసి మహ్మద్ అజారుద్దీన్‌ను ఈనెల 1న ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇతడి నుంచీ ఎన్ఐఏ అధికారులు అల్ ఫుర్ఖాన్ ద్వారా ముద్రితమైన సాహిత్యం, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ పుస్తకాలపై హైదరాబాద్‌లో ముద్రితమైనట్లు చిరునామా ఉంది. దీంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి నగరానికి చెందిన ఐదుగురి వ్యవహారం ఎన్ఐఏ దృష్టికి వెళ్ళింది. దీంతో శనివారం నగరానికి చేరుకున్న ఎన్ఐఏ చెన్నై యూనిట్‌కు చెందిన ప్రత్యేక బృందం ఐదుగురి ఇళ్లపై ఏకకాలంలో దాడి చేసి సోదాలు నిర్వహించింది. అల్ ఫుర్ఖాన్ పబ్లిషర్స్ ద్వారా ముద్రితమైన పుస్తకాలు, ఇతర పత్రాలతో పాటు సెల్ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. హసన్, అమీర్, నూరుల్లా, జాహెద్, జబ్బార్‌లకు సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేశారు. -
ఐఎస్ఐఎస్ చీఫ్ మృతి..ప్రకటించిన టర్కీ అధ్యక్షుడు
అనుమానిత ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ హుస్సేన్ అల్ ఖురాషి సిరియాలో మృతి చెందినట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు. టర్కీ గూఢచార సంస్థ ఎంఐటీ ఇంటిలిజెన్స్ నిర్వహించిన ఆపరేషన్‌లో హతమయ్యినట్లు పేర్కొన్నారు. తీవ్రవాద సంస్థలపై ఎలాంటి వివక్ష లేకుండా టర్కీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఎర్గోగాన్ అన్నారు. 2013లో డేష్/ఐసిస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన మొదటి దేశాలలో టర్కీ ఒకటిగా నిలిచింది. ఇంటిలిజెన్స్ ఏజెంట్లు స్థానిక మిలటరీ పోలీసుల సాయంతో సిరియాలో ఆఫ్రిన్ వాయవ్య ప్రాంతంలో జిండిరెస్‌లోని ఒక జోన్‌ని మూసివేసి ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు ఎర్డోగాన్. ఈ ఆపరేషన్‌లో ఇస్లామిక్ పాఠశాలగా వినియోగిస్తున్న పాడుపడిన పోలాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. టర్కీ 2020 నుంచి ఉత్తర సిరియాలో దళాలను మోహరించి ఈ ఆపరేషన్లను నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలో సిరియన్ సహాయకుల సాయంతో మొత్తం జోన్లను నియంత్రిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఐఎస్ఐఎస్ మునుపటి చీఫ్ అబూ హసన్ అల్-హషిమీ అల్-ఖురాషి మరణించినట్లు నవంబర్ 30న ప్రకటించింది టర్కీ. అతని స్థానంలోకి ప్రస్తుతం టర్కీ చనిపోయినట్లు ప్రకటించిన ఐఎస్ఐఎస్ అబూ హుస్సేన్ అల్-ఖురాషీ వచ్చాడు. కాగా, అమెరికా కూడా ఏప్రిల్ మధ్యలో హెలికాప్టర్ దాడులతో ఒక ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో ఐఎస్ఐఎస్కు చెందిన అబ్ద్-అల్ హదీ మహ్మద్ అల్-హాజీ అలీని హతమార్చినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అంతేగాదు 2019లో వాయువ్య సిరియాలో జరిగిన ఆపరేషన్‌లో ఐఎస్ఐఎస్ అబూ బకర్ అల్ బాగ్దాదీని చంపినట్లు యూఎస్ ప్రకిటించింది. ఆ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఒకప్పుడూ నియంత్రించి తరిమికొట్టినప్పటికీ ఇప్పటికీ సిరియాలో దాడలు చేస్తుండటం గమనార్హం. (చదవండి: ఏ మూడ్‌లో ఉందో సింహం! సడెన్‌గా కీపర్‌పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో..) -
భూకంపంతో జైలు గోడలు ధ్వంసం.. 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు జంప్..!
టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించి వేల భవనాలు నేలమట్టం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భూకంపం కారణంగా కొందరు ఖైదీలకు జైలు నుంచి తప్పించుకునేందుకు అవకాశం లభించింది. టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతం రాజోలోని జైలు భూప్రకంపనల కారణంగా పాక్షికంగా దెబ్బతింది. గోడలకు పగుళ్లు వచ్చి కులిపోయాయి. దీన్నే అదునుగా భావించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన ఖైదీలు జైలులో తిరుగుబాటు చేశారు. జైలులోని ఓ భాగాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అనంతరం 20 మంది జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. వీరంతా ఐసిస్ సంస్థకు చెందిన వారేరని అధికారులు తెలిపారు. ఈ జైలును టర్కీ అనుకూల గ్రూప్‌లే నియంత్రిస్తాయి. మొత్తం 2,000 మంది ఖైదీలున్నారు. వీరిలో 1,300 మంది ఐసిస్ ఉగ్రసంస్థకు చెందినవారే. వీరితో పాటు సిరియా అనుకూల ఖుర్షీద్ దళాలకు చెందిన ఫైటర్లు ఉన్నారు. అయితే జైలులో తిరుగుబాటు జరిగిన విషయం నిజమేనని, కానీ 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు ధ్రువీకరించలేమని బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబసర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ తెలిపింది. ఐసిస్ ఖైదీలను తప్పించేందుకు గతేడాది డిసెంబర్లో సెక్యూరిటీ కాంప్లెక్స్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఖుర్దీష్ దళాలకు చెందిన ఆరుగురు చనిపోయరు. చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
Bengaluru: షారిఖ్‌పై ఉగ్ర ముఠాల గురి?.. రహస్యాలన్నీ చెప్పేస్తాడని భయం
రేవు నగరిలో బాంబు విస్ఫోటం దేశమంతటా చర్చనీయాంశమైంది. ఈ పేలుడులో ప్రాణాలతో దొరికిపోయిన ఉగ్ర అనుమానితుడు షారిఖ్ వద్ద విలువైన సమాచారం పోలీసులకు లభిస్తోంది. బడా ఉగ్రవాదుల నెట్వర్క్ తాళం అతని వద్ద ఉందని ఎన్ఐఏ కూడా విచారిస్తోంది. ఇక షారిఖ్ వల్ల తమకు నష్టమే తప్ప లాభం లేదనుకున్న ఉగ్రవాద ముఠాలు అతన్ని హతమార్చాలని కుట్రలు చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. సాక్షి, బెంగళూరు(యశవంతపుర): మంగళూరు కుక్కర్ బాంబ్ పేలుడు నిందితుడు షారిఖ్‌ను అంతమొందించాలని ఉగ్రవాద ముఠాలు ప్లాన్ వేసినట్లు అనుమానాలు వచ్చాయి. దీంతో సోమవారం నుంచి షారిఖ్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి చుట్టూ భద్రతను మరింత పెంచారు. ఓ ఉగ్రవాద సంస్థ చేసిన పోస్ట్‌లో షారిఖ్‌ను హత్య చేయాలనేలా కొన్ని ఆధారాలు పోలీసులకు చిక్కాయి. స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులు ఈ దాడి చేసే అవకాశం ఉంది. షారిఖ్ వల్ల తమ రహస్యాలన్నీ పోలీసులకు చేరిపోతాయని, అందరూ ఇబ్బందుల్లో పడతామని, కాబట్టి అతన్ని హతమారిస్తే ఈ సమస్య ఇంతటితో అయిపోతుందని ఉగ్రవాదుల ఆలోచనగా పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆస్పత్రి గదుల వద్ద మెటల్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేసి వచ్చి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. షారిఖ్ కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఫోన్లో బాంబుల తయారీ, ఐసిస్, అల్‌ఖైదా వీడియోలు నిందితుడు షారిఖ్ మొబైల్లో 12 వందల వీడియోలు బయట పడ్డాయి. ఇందులో బాంబ్‌ను ఎలా తయారు చేయాలనే వీడియోలతో పాటు ఐసిస్, అల్‌ఖైదా ఉగ్రవాదుల వీడియోలు ఉండటం పోలీసు వర్గాలను ఆందోళన కలిగిస్తోంది. ఇతడు అనేక చోట్ల భారీ మొత్తాల్లో నగదు వ్యవహారం చేశాడు. నాలుగేళ్ల నుంచి బాంబ్ తయారీ కోసం తపించేవాడని, కొన్నిసార్లు ఉన్మాదంగా ప్రవర్తించేవాడని షారిఖ్ కుటుంబసభ్యులు పోలీసులకు వివరించారు. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకాలోని తన స్వగ్రామంలో బాంబ్‌ను తయారు చేసి పేల్చిన సంగతి బయట పడింది. చిన్నవయస్సులోనే దారి తప్పి ఇలాంటి ఘటనలకు పాల్పడటంపై గ్రామస్థులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేలుడు రోజున షారిఖ్‌తో పాటు బ్యాగ్ తగిలించుకొని వచ్చిన యువకుడు అదృశ్యమయ్యాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నా జాడ లేదు. వలస కార్మికులపై నిఘా దక్షిణ కన్నడ జిల్లాలో పోలీసులు వలస కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కారి్మకుల వివరాలను సేకరించేపనిలో ఉన్నారు. ఇసుక తరలింపు, రబ్బర్, వక్కతోటలు, సిమెంట్, టైల్స్, గ్రానైట్, హోటల్, బార్లు, ఎస్టేట్లలో పని చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కారి్మకుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: స్వామీజీ తీరప్రాంతంలో అనుమానాస్పదమైన కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తులపై నిఘా పెట్టాలని ఉడుపి పేజావర విశ్వప్రసన్నతీర్థ స్వామి ప్రజలను హెచ్చరించారు. అయన సోమవారం మంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. కుక్కర్ బాంబ్ పేలుడు తరువాత కరావళిలో జరుగుతున్న ఉగ్రవాదుల కార్యకలాపాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానంగా కనిపించేవారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కరావళి ప్రాంతాలలో అనేక జాతర, తిరునాళ్లు జరుగుతున్నాయి. ఇలాంటి రద్దీ ప్రదేశాలలో ఏదైనా జరిగితే పెద్ద ముప్పు ఏర్పడుతుందన్నారు. -
భారత్‌లోని కీలక నేత లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి ప్లాన్!
మాస్కో: భారత్‌లో దాడులు చేపట్టేందుకు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఓ కీలక ఉగ్రవాదిని రష్యా బలగాలు పట్టుకున్నాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడే ఉద్దేశంతో భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఐఎస్ఐఎస్ టెర్రరిస్టును పట్టుకున్నట్లు ప్రకటించింది రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్బీ). భారత ప్రభుత్వంలోని కీలక నేతపై దాడి చేసేందుకు ఉగ్రవాది పతకం రచించినట్లు పేర్కొంది. ‘ రష్యాలో నిషేధించిన ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టును రష్యన్ ఫెడరేషన్‌కు చెందిన ఎఫ్ఎస్బీ గుర్తించి అదుపులోకి తీసుకుంది. సెంట్రల్ ఆసియా ప్రాంతంలోని ఓ దేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించింది. ఆ ఉగ్రవాది భారత్‌లోని ప్రభుత్వానికి చెందిన ఓ కీలక నేత లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేసే ప్రణాళికతో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.’ అని పేర్కొన్నారు రష్యా అధికారులు. ఇస్లామిక్ స్టేట్ ఆమిర్‌కు విధేయతతో ఉంటానని ఆ ఉగ్రవాది ప్రమాణం చేసినట్లు తెలిపారు. ఆ తర్వాతే హైప్రొఫైల్ ఉగ్రదాడికి పాల్పడేందుకు భారత్ వెళ్లేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలు చేపట్టినట్లు తెలిసిందన్నారు. సూసైడ్ బాంబర్‌ను ఐఎస్ఐఎస్ టర్కీలో తమ సంస్థలో చేర్చుకున్నట్లు పేర్కొంది ఎఫ్ఎస్బీ. ఇదీ చదవండి: అరెస్టు చేసే క్రమంలో నిందితుడి పై దాడి: వీడియో వైరల్ -
ఆ రాజధాని ఉగ్రవాద నియామకాలకు అడ్డాగా మారుతోందా?
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే సమాచారం వెలుగు చూసింది. ఐసిస్ సంస్థ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదుల నియామకం కోసం రాజధాని బెంగళూరును వేదికగా చేసుకున్నట్లు ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అనుమానం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన చార్జ్‌షీట్‌ను ఈనెల 18న హైకోర్టు ముందు ఉంచింది. మొత్తం 28 మంది యువకులను చేర్చుకుని శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం ఉందని ఎన్ఐఏ పేర్కొంది. జొహైబ్, అబ్దుల్ ఖాదిర్ అనే ఇద్దరు వ్యక్తులు బెంగళూరులో సుమారు 28 మంది యువకులను చేరదీసి మత విద్వేషాలను నూరిపోసి ఉగ్రవాదంపై బోధనలు చేసినట్లు పిటిషన్లో పేర్కొంది. సిరియా నుంచి బెంగళూరుకు వచ్చిన మహమ్మద్ నాజిద్.. ఆ యువకులను మరింత ప్రేరేపించినట్లు తెలిసింది. ఈయన బెంగళూరు నుంచి సిరియాకు తిరిగి వెళ్లే సమయంలో విమానాశ్రయం వరకు శిక్షణ పొందిన యువకులు వెంట వెళ్లినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఐసిస్ ఉగ్రవాదుల నియామకం, శిక్షణ కేసుకు సంబంధించి తిలక్‌నగర్‌కు చెందిన మహమ్మద్ తౌకిర్ మహమూద్, కామనహళ్లికి చెందిన జొహైబ్ మున్నా, భట్కళ నివాసి మహమ్మద్ సుహాబ్‌ను ఎన్ఐఏ అధికారులు ఈనెల 19న అరెస్ట్ చేశారు. ముగ్గురిపై చట్ట ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: Disha Encounter Case: నివేదిక బట్టబయలు.. వెలుగులోకి సంచలన విషయాలు.. -
చార్మినార్-ఫలక్‌నుమా మధ్య చక్కర్లు!
సాక్షి, హైదరాబాద్: కాలిఫట్ స్థాపనే ధ్యేయమంటూ ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు ఆకర్షితుడైన పాతబస్తీ వాసి మహ్మద్ అబుసాని కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ప్రారంభించింది. గత నెలలో ఇతడిపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీనిని రీ–రిజిస్టర్ చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు నిమిత్తం సిట్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో కీలకాంశాలు గుర్తించడం కోసం నిందితుడిని కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు సోమ, మంగళవారాలు విచారించారు. అబుసాని బైక్‌పై చార్మినార్–ఫలక్‌నుమా మధ్య ప్రాంతాల్లో పలుమార్లు సంచరించినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇందుకు గల కారణాలను అబుసాని నుంచి రాబట్టారు. విదేశంలో ఉన్న హ్యాండ్లర్ ఇతగాడికి సోషల్‌మీడియా ద్వారా కొన్ని లింకులు పంపించాడు. వాటిలో స్థానికంగా లభించే దీపావళి టపాసుల మందు, హైడ్రోజన్ పెరాక్సైడ్ తదితరాలు వాడి బాంబులు తయారు చేయడం ఎలా? అనే వివరాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీటి కోసమే అబుసాని ఆయా ప్రాంతాల్లో సంచరించాడని వెలుగులోకి వచ్చింది. మరికొందరిని ఉగ్రవాద బాట పట్టించడంతో పాటు నిధుల సమీకరణకు ఇతడు ప్రయత్నాలు చేశాడని చెప్తున్నారు. హ్యాండ్లర్ సహా ఇతర ప్రాంతాల్లోని స్లీపర్ సెల్స్‌తో సంప్రదింపుల జరపడానికి ఇతను ఫేస్‌బుక్‌తో పాటు 27 ఇన్‌స్ట్ర్రాగామ్ ఐడీలు, రెండు టెలిగ్రామ్ ఐడీలు వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా సోషల్‌మీడియా గ్రూపుల్లో ఉబ్జెకిస్థాన్తో పాటు పాకిస్థాన్‌కు చెందిన అనేక మంది సభ్యులుగా ఉన్నట్లు తేలింది. అమెరికా, ఇజ్రాయిల్‌కు సంబంధించిన ఎంబసీలను టార్గెట్ చేయాలని, బాంబు పేలుళ్లకు పాల్పడటం ద్వారా భయోత్పాతం సృష్టించాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వీడియోలు ఉన్నాయని సమాచారం. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎంబసీల వద్ద రెక్కీ చేసి, అనువైన దాన్ని గుర్తించాలని ఆన్లైన్ ద్వారా హ్యాండ్లర్ ఆదేశించాడు. ఓ పక్క అబుసాని ఈ ప్రయత్నాల్లో ఉండగానే హ్యాండ్లర్ నిర్వహిస్తున్న టెలిగ్రామ్ గ్రూపులో ఇటీవల మరో సందేశం వచ్చింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నేషనల్ క్యాపిటల్ బ్యాంక్ వద్ద పేలుడుకు సిద్ధం కావాలంటూ అందులో సూచించాడు. దీనికి తాను సిద్ధమంటూ అబుసాని అదే గ్రూపులో పోస్టు చేశాడు. బాంబుల తయారీని సూచించే లింకుల్ని ఓపెన్ చేసినట్లు పోలీసులు చెప్తున్నా ప్రయోగాలు చేశాడా? లేదా? అనే తేలాల్సి ఉందన్నారు. అబుసాని ఫోన్‌ను విశ్లేషించడం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ వార్త కూడా చదవండి: కడుపులో 11.57కోట్ల కొకైన్.. -
ఐరాస నివేదికపై భారత్ అసంతృప్తి
ఐరాస: ఐసిస్ ఉగ్రవాద సంస్థపై ఐరాస సెక్రటరీ జనరల్ విడుదల చేసిన నివేదికపై భారత్ అసహనం వ్యక్తం చేసింది. పాక్ స్థావరంగా కార్యకలాపాలు నిర్వహించే లష్కరేతోయిబా, జేషే మహ్మద్ సంస్థలకు ఐసిస్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి పలు మార్లు హెచ్చరించినా నివేదికలో పేర్కొనలేదని భారత్ అసంతృప్తి తెలిపింది. అఫ్గాన్‌లో ఐసిస్ అకృత్యాలపై ఐరాస్ 14వ సెక్రటరీ జనరల్ రిపోర్టును ఇటీవల విడుదల చేసింది. పాక్ మద్దతుతో హక్కానీ నెట్వర్క్ విస్తరించడాన్ని, పలు ఉగ్రసంస్థలకు ఆల్‌ఖైదా, ఐసిస్‌తో ఉన్న సంబంధాలను విస్మరించకూడదని ఐరాసలో భారత ప్రతినిధి తిరుమూర్తి వ్యాఖ్యానించారు. ఈ ఉగ్రబంధాలపై భారత్ పలుమార్లు వివరాలందించిందని, ఆందోళన వ్యక్తం చేసిందని, కానీ కార్యదర్శి నివేదిక ఈ బంధాలను ప్రస్తావించలేదని చెప్పారు. భవిష్యత్‌లోనైనా సభ్యదేశాల ఆందోళనను పట్టించుకొని నివేదికలు రూపొందించాలని కోరారు. పాక్ నుంచి తాము ఎదుర్కొంటున్న ఉగ్రముప్పుపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉందన్నారు. ఆసియాలో ఐసిస్ విస్తరణకు యత్నించడాన్ని నివేదికలో పొందుపరిచారు. దీనిపై తిరుమూర్తి స్పందిస్తూ, ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. -
ఐఎస్ అధినేత హతం
అత్మే (సిరియా): అమెరికా ప్రత్యేక దళాలు బుధవారం రాత్రి సిరియాలో జరిపిన మెరుపుదాడిలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐఎస్) చీఫ్ అబూ ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషీ హతమయ్యాడు. రెబెల్స్ అధీనంలోని వాయవ్య ఇద్లిబ్ ప్రావిన్సులో ఖురేషీ దాగున్న రెండంతస్తుల ఇంటిపై ప్రత్యేక దళాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఐఎస్ సాయుధులకు, వారికి రెండు గంటల పాటు హోరాహోరీ కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. చివరికి ఇంటిని సైన్యం చుట్టుముట్టడంతో ఖురేషీ బాంబు పేల్చుకుని కుటుంబంతో సహా చనిపోయినట్టు యూఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆరుగురు పిల్లలు, నలుగురు మహిళలతో పాటు కనీసం 13 మంది మరణించినట్టు సమాచారం. మృతదేహాలు తునాతునకలయ్యాయని, బాంబు దాడుల్లో ఇల్లు నేలమట్టమైందని చెబుతున్నారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసి తమ సైనికులంతా క్షేమంగా తిరిగొచ్చినట్టు యూఎస్ అధ్యక్షుడు బైడెన్ గురువారం ప్రకటించారు. అచ్చం బగ్దాదీ మాదిరిగానే... 2019 అక్టోబర్‌లో ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ కూడా ఇదే ఇద్లిబ్ ప్రాంతంలో యూ ఎస్ దళాలు చుట్టుముట్టడంతో ఇలాగే బాం బు పేల్చు కుని చనిపోయాడు. తర్వాత అక్టోబర్ 31న ఖురేషీ ఐఎస్ చీఫ్ అయ్యాడు. అప్పటినుంచీ వీలైనంత వరకూ జనాల్లోకి రాకుండాలో ప్రొఫైల్‌లో ఉండేవాడు. మళ్లీ కూడదీసుకునే ప్రయత్నం చేస్తున్న ఐఎస్‌కు అతని మరణం పెద్ద దెబ్బేనంటున్నారు. పాక్‌లో 13 మంది ఉగ్రవాదులు హతం కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రెండు సైనిక శిబిరాలపై సాయుధ ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించారు. పాంజ్‌గుర్, నోష్కి జిల్లాలో బుధవారం జరిగిన ఈ రెండు ఘటనల్లో కనీసం 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 7గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు గురవారం తెలిపాయి. సైనికులపై కాల్పులు జరిపిం ది తామేనని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించింది. నోష్కీలో 9 మంది ఉగ్రవాదులు, 4గురు జవాన్లు, పాంజ్‌గుర్‌లో 4గురు ముష్కరులు, ముగ్గురు సైనికులు మృతి చెందారని పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ ప్రకటించారు. దాడిని విజయవంతంగా తిప్పికొట్టిన పాక్ సైన్యాన్ని ప్రధాని ఇమ్రాన్ అభినందించారు. Last night at my direction, U.S. military forces successfully undertook a counterterrorism operation. Thanks to the bravery of our Armed Forces, we have removed from the battlefield Abu Ibrahim al-Hashimi al-Qurayshi — the leader of ISIS. https://t.co/lsYQHE9lR9 — President Biden (@POTUS) February 3, 2022 -
ఐసిస్‌తో సంబంధమున్న మహిళ అరెస్ట్
యశవంతపుర: కర్ణాటకలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ కన్నడ రచయిత దివంగత బీఎం ఇదినబ్బ మనవడి భార్య దీప్తి మార్లా అలియాస్ మరియం.. యువకులను ఐసిస్ వైపు ఆకర్షితులను చేస్తున్నారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) ఆమెను సోమవారం అరెస్ట్ చేసింది. ఉళ్లాలలో ఇదినబ్బ కొడుకు బీఎం బాషా నివాసంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గతంలో బాషా చిన్నకొడుకు రహమాన్‌ను అరెస్ట్ చేశారు. -
పాక్‌లో బలపడుతున్న ఉగ్రమూకలు
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డా అనేది కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. తీవ్రవాదులకు పాక్ సురక్షిత స్థావరంగా మారిందని అమెరికా సహా చాలాదేశాలు ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం... ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ఆఫ్గానిస్తాన్‌ను తీవ్రవాదలకు సురక్షిత స్థావరం కానివ్వకూడదని, వారికెలాంటి ఆర్థిక సహాయం అందకూడదని... తాలిబన్లతో కుదిరిన ఒప్పందంలో అమెరికా, నాటోదళాలు స్పష్టం చేశాయి. భారత్‌తో పాటు మిగతా దేశాలూ ఇదే కోరుతున్నాయి. అయితే అఫ్గాన్‌తో పాటు పొరుగున్న పాక్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు... భారత్‌కు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. అతివాద ఇస్లామిక్ ఉద్యమాన్ని నడుపుతున్న తెహ్రీక్– ఇ– లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్పీ) ముందు ఈ నవంబరులో పాక్‌లోని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయింది. మహ్మద్ ప్రవక్త గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగనివ్వకూడదు, దైవదూషణకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తున్న పాక్ చట్టాలను గట్టిగా బలపరచడం... ఈ రెండు టీఎల్పీ సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి. 2015లో ఏర్పాటైంది. పంజాబ్ ఫ్రావిన్సులో దీనికి గట్టి పునాదులు, జనాదరణ ఉన్నాయి. దీన్ని రాజకీయ లబ్ధికి ఇమ్రాన్ ఖాన్, మిలటరీ ఉపయోగించుకున్నాయి. ఇమ్రాన్‌తో చేతులు కలిపిన అతివాదశక్తులు 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఉదారవాద భావాలున్న నవాజ్ షరీఫ్‌ను గద్దెదింపడంలో సఫలమయ్యాయి. ప్రధాని పదవి చేపట్టిన ఇమ్రాన్... తర్వాత టీఎల్పీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో టీఎల్పీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. అయితే అక్టోబరులో ఈ సంస్థ వేలాది మందితో ఇస్లామాబాద్ ముట్టడికి బయలుదేరడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. 20 మంది పోలీసులు చనిపోయారు. సైన్యాన్ని దింపుతామని హెచ్చరికలు జారీచేసినా... తర్వాత తెరవెనుక ఏ శక్తులు పనిచేశాయో టీఎల్పీతో పాక్ ప్రభుత్వం రాజీ కుదుర్చుకుంది. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి టీఎల్పీని తొలగించింది. టీఎల్పీ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సాద్‌ను జైలు నుంచి విడుదల చేసింది. కేసులను ఎత్తివేయడానికి అంగీకరించింది. స్తంభింపజేసిన బ్యాంకు అకౌంట్లను పునరుద్ధరించింది. అతివాద భావాలున్న ఈ సంస్థ శ్రేణుల నుంచి జైషే మొహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ) లాంటి ఉగ్రసంస్థలు రిక్రూట్మెంట్లు చేసుకునే ప్రమాదం పొంచివుంది. పాక్‌లో అతివాద శక్తులు బలపడటం... భారత్‌కు ఆందోళన కలిగించే విషయమే. భావజాల వ్యాప్తితో ప్రమాదం తాలిబన్లు.. ప్రపంచం ఒత్తిడి మేరకు ఆఫ్గాన్కే పరిమితమైనా... వారి ప్రభుత్వంలో భాగమైన హక్కానీ నెట్వర్క్ అలా కాదు. భారత్‌లో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న సంస్థలకు దీనినుంచి మద్దతు తప్పకుండా లభిస్తుంది. అలాగే మరో ఉగ్రసంస్థ ఐసిస్–కె కూడా కశ్మీర్‌ను విముక్తం చేయాలని ఆగస్టులో ప్రకటన చేసింది. ఇకపై ఉగ్రసంస్థలు కశ్మీర్‌పై దృష్టి సారిస్తాయి. తదుపరి లక్ష్యంగా చేసుకుంటాయి. తాలిబన్ల విజయంతో ఈ ఉగ్రసంస్థలు ద్విగుణీకృత ఉత్సాహంతో చొరబాటు యత్నాలు మొదలుపెట్టాయని రక్షణశాఖలోని విశ్వసనీయవర్గాల సమాచారం. భారత్‌లో అతివాద భావాజాలన్ని వ్యాప్తిచేయడానికి ఇవి ప్రయత్నిస్తాయి. పాక్ గూడఛార సంస్థ (ఐఎస్ఐ) అండతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర కార్ఖానాలను నడుపుతున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్లతో పాటు ఐసిస్ కూడా రిక్రూట్మెంట్ల మీద దృష్టి సారిస్తాయి. గతంతో పోలిస్తే ఇంటర్నెట్ ఇప్పుడు బాగా విస్తృతమైంది. సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా అతివాద భావాలున్న యువతను గుర్తించి .. వారితో టచ్‌లోకి వస్తాయి. ‘జిహాద్’ పవిత్ర కార్యమంటూ నూరిపోసి ఉగ్రవాదం వైపు మళ్లిస్తాయి. ఎన్ఐఏ ఇప్పటికే కశ్మీర్‌తో పాటు కేరళ తదితర ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో తాలిబన్లు అధికారంలో (1996–2021) ఉన్న ఐదేళ్లలో కశ్మీర్లో ఉగ్రదాడుల్లో 5,715 సాధారణ పౌరులు మరణించగా... తర్వాత 20 ఏళ్లలో (2001– 2021 అక్టోబరు వరకు) 3,194 మంది చనిపోయారు. తాలిబన్లు అధికారంలో ఉంటే కశ్మీర్ మిలిటెన్సీ పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎడమ వైపు గ్రాఫ్‌లో ఆ వివరాలను చూడొచ్చు. కశ్మీర్లో అలజడికి యత్నాలు తాలిబన్లు అధికారం చేపట్టగానే.. ఉగ్రవాద సంస్థల నైతిక స్థైర్యం పెరిగిపోయింది. దీని ప్రభావం కశ్మీర్లో అక్టోబరు, నవంబరు నెలల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణ ప్రజలను అకారణంగా పొట్టనబెట్టుకొని... భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడానికి తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. స్కూలు టీచర్లు, శ్రీనగర్‌లో ప్రముఖ మెడికల్ షాపును నిర్వహించే కశ్మీర్ పండిట్‌ను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను... ఇలా పలువురిని ఉగ్రమూకలు కాల్పిచంపాయి. ఈ ఏడాదిలో నవంబరు 15 నాటికి కశ్మీర్లో 40 మంది సాధరణ పౌరులు ఉగ్రదాడులకు బలయ్యారని కేంద్ర ప్రభుత్వం గతనెల 30న రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. ఇందులో ఎక్కువగా అక్టోబరు– నవంబరులోనే జరిగాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం... నవంబరులో 5,500 మంది సాయుధ బలగాల(సీఆర్పీఎఫ్–3,000, బీఎస్ఎఫ్–2,500)ను అదనంగా జమ్మూ కశ్మీర్‌కు పంపింది. శీతాకాలంలో దట్టంగా మంచు కురుస్తుంది.. దూరాన ఉన్నవి ఏవీ కనపడని వాతావరణం ఉంటుంది కాబట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చొరబాటు యత్నాలూ పెరిగాయి. దీన్ని అడ్డుకోవడానికి నెలరోజుల పాటు భారత ఆర్మీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పలువురు చొరబాటుదారులను కాల్చి చంపింది. అలాగే ఉగ్రవాద సానుభూతిపరులు, మస్తిష్కాలను కలుషితం చేస్తూ కాలేజీల్లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే వారినీ గుర్తించేందుకు జమ్మూ కశ్మీర్ పోలీసు యంత్రాంగ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆర్థిక మూలాలను దిగ్భందం చేస్తోంది. కన్సల్టెన్సీల పేరిట పాక్‌లో వైద్య కళాశాలల్లోని సీట్లను కశ్మీర్ విద్యార్థులకు వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు అమ్ముతూ... వచ్చే నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని గుర్తించారు. ఆగస్టులో నలుగురు హురియత్ నేతలను అరెస్టు కూడా చేశారు. మొత్తానికి కశ్మీర్లో ఉగ్రవాదుల యాక్టివిటీ పెరిగింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
గంభీర్‌కు మళ్లీ బెదిరింపులు.. వారంలో మూడోసారి..
సాక్షి, ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు రావటం కొనసాగుతున్నాయి. మరోసారి ఆదివారం కూడా ఆయనకు బెదిరింపు ఈ మెయిల్స్ రావటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు, ఐపీఎస్ శ్వేతా(డీసీపీ) ఏం చేయలేరు. పోలీసుల్లో కూడా మా గూఢచారులు ఉన్నారు’ అని ఉగ్రవాద సంస్థ ఐసీస్ కశ్మీర్ పేరుతో ఉన్న ఈ-మెయిల్ నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. వారం రోజుల్లో బెదిరింపులు రావటం ఇది మూడోసారి. చదవండి: అఖిలపక్షం భేటీ: ‘అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధమే’ దీంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. సైబర్ సెల్‌కు చెందిన స్పెషల్ టీం బెందిరింపు మెయిల్స్‌పై దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. 23 నవంబర్ రోజు కూడా మొదటిసారి బెందింపులు వచ్చాయని వాటిపై దర్యాప్తు చేస్తున్నమని డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు. ఆయన నివాసం వద్ద పోలీసు భద్రత పెంచామని పేర్కొన్నారు. గౌతమ్ గంభీర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: చేపల ఆశీస్సులు కూడా ఉండాలి: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు -
నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు: గౌతం గంభీర్
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ పోలీసులను ఆశ్రయించాడు. ఐసిస్ కశ్మీర్ నుంచి బెదరింపు కాల్స్ వస్తున్నాయని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో.. ఐఎస్ఐఎస్ కశ్మీర్ ఉగ్రవాదుల నుంచి తనకు ఈ-మెయిల్ ద్వారా హత్య బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. బెదిరింపులకు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గంభీర్ నివాసం వెలుపల పోలీసులు భద్రతను పెంచారు. కాగా గంభీర్ ఈస్ట్ ఢిల్లీకి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: ఫ్రాన్స్ అమ్మాయితో బిహార్ కుర్రాడి ప్రేమ.. కట్ చేస్తే ఒక్కటైన జంట -
వాళ్లని వదలం.. ఎక్కడున్న వెతికి మరీ చంపుతాం: ఐసిస్ హెచ్చరిక
కాబూల్: ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ షియా ముస్లింలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో షియా ముస్లింలకు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్-కే) సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థ నడుపుతున్న పత్రిక అల్-నబ ప్రకటనలో తెలిపిన ప్రకారం.. ‘షియా ముస్లింలు ప్రమాదకరమైన వారని, వాళ్లు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించింది. బాగ్దాద్ నుంచి ఖోరాసన్ వరకు, షియా ముస్లింలు ఉంటున్న ప్రతిచోటా దాడులు జరుగుతాయని ఆ ప్రకటనలో తెలిపింది. ఖమా ప్రెస్ ప్రకారం, ఐసిస్ చర్యలు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతికి అతి పెద్ద ముప్పుగా మారాయి. ఆఫ్గనిస్తాన్‌లోని కాందహార్ ప్రావిన్స్‌లోని షియా మసీదును శుక్రవారం పేల్చివేసిన తర్వాత ఈ హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఈ దాడిలో 80 మందికి పైగా గాయపడగా, 60 మంది మరణించారు. ఈ దాడి తామే చేసినట్లు ఐఎస్-కే ప్రకటించింది. అక్టోబర్ 8 న, ఆఫ్ఘనిస్తాన్ లోని కుండుజ్ లోని షియా మసీదుపై జరిగిన మరో ఉగ్రవాద దాడిలో 100 మందికి పైగా మరణించగా, అనేక మంది గాయపడ్డారు. చదవండి: లాక్డౌన్లో తిండి కూడా లేదు.. అప్పుడొచ్చిన ఓ ఐడియా జీవితాన్నే మార్చింది -
ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ దాడులు
న్యూఢిల్లీ: ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. మూడు రాష్ట్రాల్లోని 18 ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తాంది. లష్క్రర్, జైష్, హిజ్బుల్,అల్‌బదర్ సంస్థలపై ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి సారించింది.కశ్మీర్ వ్యాలీలోని పలు చోట్ల, ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ దాడులు చేస్తోంది. షోపియాన్, శ్రీనగర్, పుల్వామా, బారాముల్లాలో తనిఖీలు చేస్తున్నారు. -
అమెరికా సాయం అక్కర్లేదు!
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో పెట్రేగుతున్న ఐసిస్ సహా ఇతర ఉగ్ర గ్రూపుల అణచివేతకు అమెరికా సాయం కోరేదిలేదని తాలిబన్లు శనివారం స్పష్టం చేశారు. ఆగస్టులో అమెరికా అఫ్గాన్ నుంచి వైదొలిగిన అనంతరం తొలిసారి తాలిబన్లతో యూఎస్ శని, ఆదివారాల్లో దోహాలో చర్చలు జరపనుంది. ఈ సమయంలో తాలిబన్లు కీలక అంశంపై తమ వైఖరిని స్పష్టం చేశారు. అఫ్గాన్‌లో తిష్టవేసుకున్న ఉగ్రతండాలను కట్టడి చేయడం, ఆదేశంలో ఉండిపోయిన విదేశీయులను వారివారి దేశాలకు పంపడంపై చర్చలు ఉంటాయని ఇరువర్గాలు తెలిపాయి. వీటిలో విదేశీయుల తరలింపుపై తాలిబన్లు సానుకూలంగా ఉన్నారు. కానీ ఐసిస్ కట్టడికి అమెరికా సాయం కోరమని తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ చెప్పారు. తాజాగా అఫ్గాన్ మసీదులో ఐసిస్ జరిపిన ఆత్మాహుతిదాడిలో పలువురు మరణించిన సంగతి తెలిసిందే! అయితే వీరిని తాము స్వతంత్య్రంగా ఎదుర్కోగలమని సుహైల్ చెప్పారు. యూఎస్ సేనలు అమెరికాలో ఉన్నప్పడు కూడా అఫ్గాన్ షియా మైనారీ్టలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ దాడులు జరిపింది. తాలిబన్లు, అమెరికన్లకు ఐసిస్ వల్ల ప్రమాదం ఉన్నందున కలసికట్టుగా దీనిపై పోరాటం చేస్తారని విశ్లేషకులు భావించారు. గుర్తింపు కోసం కాదు తాలిబన్లతో జరిపే చర్చలు, వారు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించేందుకు ముందస్తు సన్నాహాలు కాదని అమెరికా స్పష్టం చేసింది. మరోవైపు ఈచర్చలకు ముందు పాక్ మిలటరీ అధికారులతో అమెరికా డిప్యుటీ స్టేట్ సెక్రటరీ వెండీ షెర్మన్ ఇస్లామాబాద్‌లో సమావేశమయ్యారు. ఇందులో కూడా అఫ్గాన్ పరిణామాలనే చర్చించినట్లు తెలిసింది. అఫ్గాన్ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించాలని, అమెరికాలో నిలిపివేసిన అఫ్గాన్ నిధులను విడుదల చేయాలని పాక్ యూఎస్‌ను అరి్ధంచిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లేదంటే అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే తాలిబన్లు తమ ప్రభుత్వంలో మరిన్ని వర్గాలకు చోటివ్వాలని, మానవహక్కులు, మైనార్టీ హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పాక్ కోరింది. దేశంలో తమకు రక్షణ కరువైందని అఫ్గాన్ షియా పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియా నుంచి అఫ్గాన్‌కు... తాలిబన్ల దాడికి వెరిచి భారత్‌కు పారిపోయివచి్చన అఫ్గాన్ పౌరుల్లో వందమందికి పైగా స్వదేశానికి పయనమయ్యారని అఫ్గాన్ ఎంబసీ వర్గాలు తెలిపాయి. కాబూల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది మంది అఫ్గాన్లు విదేశాలకు పారిపోయారు. ఇలా ఇండియా వచి్చనవారిలో పలువురు ప్రస్తుతం అఫ్గాన్ వెళ్లేందుకు ఇండియా నుంచి టెహ్రాన్ చేరుకున్నారని అధికారులు చెప్పారు. త్వరలో మరింతమంది అఫ్గాన్లు స్వదేశానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అఫ్గాన్ మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడిని అమెరికా ఖండించింది. -
మసీదులో మారణకాండ
కాబూల్: పశ్చిమ అఫ్గానిస్తాన్ కుందుజ్ ప్రావిన్సులోని గోజార్ ఇ సయీద్ అబాద్ మసీదులో శుక్రవారం సంభవించిన పేలుడులో 60మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు ప్రముఖ మీడియా సంస్థ అల్‌జజీరా వెల్లడించింది. అయితే కుందుజ్ ఆస్పత్రి అధికారి ఒకరు పేలుడులో 25మంది మరణించారని, 51మంది గాయపడ్డారని చెప్పారు. మరోవైపు అధికారిక బఖ్తార్ న్యూస్ ఏజెన్సీ ఈ పేలుళ్లలో 46మంది మరణించారని, 140మంది గాయపడ్డారని తెలిపింది. ఇవన్నీ ప్రాథమిక గణాంకాలేనని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. దేశ పాలనపగ్గాలు తాజాగా చేపట్టిన తాలిబన్లకు ఈ పేలుడు సవాలుగా మారింది. పేలుడులో మొత్తం 100 మంది మరణించడం లేదా గాయపడడం జరిగిందని కుందుజ్ ప్రావిన్స్ తాలిబన్ పోలీసు అధికారి ఒబైదా ప్రకటించారు. గాయపడినవారి కన్నా మరణించినవారే ఎక్కువగా ఉండొచ్చన్నారు. షియాల రక్షణకు తాలిబన్లు కట్టుబడిఉన్నారని భరోసా ఇచ్చారు. అఫ్గాన్ పగ్గాలు తాలిబన్ల చేతికి వచ్చాక జరిగిన పెద్దదాడిగా దీన్ని భావిస్తున్నారు. దాడిని షియాల మతపెద్ద అలిమి బల్ఖి ఖండించారు. తాలిబన్లు షియాలకు రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రార్ధనాస్థలాల రక్షణకు ఉంచిన ఆయుధాలను తాలిబన్లు తీసుకుపోయినందున, వీటిని రక్షించాల్సిన బాధ్యత కూడా వాళ్లదేనన్నారు. ఐసిస్ హస్తం మసీదులో జరిగిన ఘోర పేలుడుకు కారకులెవరో తొలుత తెలియరాలేదు. అయితే పేలుడు జరిగింది షియా ముస్లింలకు చెందిన మసీదు కావడంతో ఐసిస్‌పైనే అందరికీ తొలుత అనుమానం వచ్చింది. ఇందుకు తగ్గట్లే తామే ఈ పేలుళ్లు జరిపామని ఐసిస్ అనుబంధ సంస్థ ఐసిస్– కే వారి మీడియా ఏజెన్సీ అమాక్ న్యూస్‌లో ప్రకటించింది. ఇదే అంశాన్ని ఎస్ఐటీఈ ఇంటిలిజెన్స్ గ్రూపు నిర్ధారించింది. షియా హజారాలను లక్ష్యంగా చేసుకొనే ఆత్మాహుతి దాడి చేసినట్లు ఐసిస్–కే టెలిగ్రామ్ ఛానెల్లో ప్రకటించుకుంది. గతంలో పలుమార్లు షియా మైనారీ్టలపై ఐసిస్ దాడులు చేసిన చరిత్ర ఉంది. అమెరికా సైన్యాలు వైదొలిగిన అనంతరం ఐసిస్ ఉగ్రవాదులు అఫ్గాన్‌లో దాడులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా షియాలపై ఐసిస్–కే యుద్ధాన్నే ప్రకటించింది. తాజాదాడులను ఐరాస ఖండించింది. పేలుడుపై తమ పత్య్రేక దళాలు దర్యాప్తు జరుపుతున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా చెప్పారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ ఆధారాలను సేకరిస్తున్నారు. ఒకప్పుడు కొన్నిప్రాంతాలకే పరిమితమైన ఐసిస్ దాడులు ఇప్పుడు పలు చోట్ల జరగడం తాలిబన్లతో పాటు అఫ్గాన్ పొరుగుదేశాలను కూడా కలవరపరుస్తోంది. -
కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద రాకెట్ దాడులు
కాబూల్: అఫ్గాన్ రాజధానిలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా సోమవారం రాకెట్ దాడులు జరిగాయి. అయితే ఆధునిక రక్షణ వ్యవస్థ ఈ దాడులను తిప్పికొట్టడంతో రాకెట్లు సమీపంలోని సలీం కార్వాన్ ప్రాంతంలో కూలిపోయినట్లు తెలిసింది. దాడుల్లో ఎవరూ గాయపడినట్లు తెలియరాలేదు. తొలుత దాడులకు ఎవరు కారణమన్నది తెలియరాలేదు, కానీ తామే దాదాపు ఆరు కత్యూషా రాకెట్లు పేల్చామని ఐసిస్ గ్రూప్ ప్రకటించుకుంది. ఒకపక్క రాకెట్ దాడులు జరుగుతున్నా అమెరికా దళాల ఉపసంహరణ కొనసాగింది. అమెరికన్లను తీసుకుపోయేందుకు వచ్చిన సీ–17 కార్గో జెట్ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లు కొనసాగాయి. ఐసిస్, ఇతర ఉగ్ర సంస్థలు ఎయిర్‌పోర్ట్‌పై దాడులకు యత్నిస్తూనే ఉన్నాయి. రాజధానిలోని చహరె షహీద్ ప్రాంతం నుంచి తాజా రాకెట్ దాడి జరిగినట్లు అనుమానాలున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు ఉపయోగించి వదిలివెళ్లిన వాహనాన్ని గుర్తించారు. ఇందులో రాకెట్ ట్యూబులను కనుగొన్నారు. రాకెట్ల రవాణాకు ఈ ట్యూబులను టెర్రరిస్టులు ఉపయోగిస్తుంటారు. దాడులకు గురైన సలీం కార్వాన్ ప్రాంతం ఎయిర్‌పోర్టుకు 3 కి.మీ.ల దూరంలో ఉంది. ఇతర గ్రూపులతో భయాలు సరైన పత్రాలున్నవారు అఫ్గాన్ వీడేందుకు అనుమతిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చినట్లు యూఎస్ ప్రపంచ దేశాలకు తెలియజేసింది. అమెరికా దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత కూడా సాధారణ ప్రయాణాలకు విమానాశ్రయాన్ని అనుమతిస్తామని తాలిబన్లు తెలిపారు. పాశ్చాత్య దళాలు తమ దేశం విడిచి సురక్షితంగా వెళ్లేందుకు తాము సహకరిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చినా, ఇతర టెర్రరిస్టు గ్రూపులతో యూఎస్ దళాలకు ప్రమాదం పొంచిఉంది. తాలిబన్లు పాలన చేపట్టాక పలువురు ఖైదీలను విడుదల చేశారు. వీరిలో ఐసిస్–కె టెర్రరిస్టులు ఉన్నారు. వీరంతా యూఎస్ దళాలపై దాడులకు ప్రస్తుతం యత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం సైతం ఐసిస్ తీవ్రవాదులు కాబూల్ విమానాశ్రయంపై దాడికి యత్నించగా, అమెరికా దళాలు తిప్పికొట్టాయి. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు మరణించారు. మంగళవారం నాటికి పూర్తిగా అఫ్గాన్ నుంచి బయటపడాలని అమెరికా యత్నిస్తోంది. సోమవారం రాకెట్ దాడులను తమ సీర్యామ్ వ్యవస్థ తిప్పికొట్టిందని అమెరికా ప్రతినిధి బిల్ అర్బన్ తెలిపారు. దారిలోనే ఐదు రాకెట్లను తమ వ్యవస్థ ధ్వంసం చేసిందన్నారు. అమెరికా డ్రోన్ దాడుల్లో ఏడుగురు మరణించారు కాబూల్‌లో ఆత్మాహుతి బాంబర్పై ఆదివారం అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో ఏడుగురు సాధారణ పౌరులు మరణించారని తాలిబన్లు వెల్లడించారు. ఏదైనా దాడి చేపట్టే ముందు తమకు సమాచారమిస్తే బాగుండేదని, విదేశీగడ్డపై అమెరికా ఇలాంటి చర్యలకు దిగడం చట్ట విరుద్ధమని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా చైనా అధికార టీవీ ఛానల్ ‘సీజీటీఎన్’తో అన్నారు. అఫ్గాన్ గడ్డపై ఏదైనా ముప్పు పొంచివుంటే అమెరికా మాకు చెప్పాల్సింది. ఇలా ఏకపక్షదాడులకు దిగడం సరికాదు’ అని జబీహుల్లా పేర్కొన్నారు. పౌరులు మృతి చెందారనే వార్తలపై దర్యాప్తు చేస్తున్నామని పెంటగాన్ తెలిపింది. మతాధికారి జద్రాన్ అరెస్ట్ అఫ్గాన్‌లో తమను వ్యతిరేకించే ప్రముఖుల అరెస్ట్‌ల పర్వాన్ని తాలిబన్లు కొనసాగిస్తున్నారు. అఫ్గాన్‌లో ప్రముఖ మతాధికారి (మౌల్వీ) మొహమ్మద్ సర్దార్ జద్రాన్‌ను అరెస్ట్ చేసినట్ల తాలిబన్లు తాజాగా ధ్రువీకరించారు. అఫ్గాన్‌లో మతాధికారుల జాతీయ మండలికి ఆయన గతంలో అధ్యక్షునిగా సేవలందించారు. ఆయనను బంధించి, కళ్లకు గంతలు కట్టిన ఫొటోను తాలిబన్లు విడుదల చేశారు. -
తాలిబన్ల ‘కే’ తలనొప్పి
తాడిని తన్నేవాడుంటే, వాడి తలదన్నేవాడొకడున్నట్లు అందరినీ భయపెడుతున్న తాలిబన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది మరో ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపు. ఐసిస్– ఖొరసాన్‌గా పిలిచే ఈ గ్రూపు చేస్తున్న దాడులను ఎలా ఎదుర్కోవాలా అని తాలిబన్లు తలపట్టుకుంటున్నారు. అమెరికా సేనలు వెనక్కు పోవడం, పౌర ప్రభుత్వం కూలిపోవడం, దేశంలో చాలా భూభాగం స్వాధీనంలోకి రావడం.. వంటి పరిణామాలు తాలిబన్లకు కలిగిస్తున్న ఆనందాన్ని ఐసిస్–కే దాడులు ఆవిరిచేస్తున్నాయి. ఘనీ ప్రభుత్వం దిగిపోయినందుకు ఆనందించాలా? ఆ ప్రభుత్వ స్థానంలో కూర్చోబోతున్న తమకు ఎదురవుతున్న సవాళ్లకు భయపడాలా? అర్థం కాని పరిస్థితి తాలిబన్లలో నెలకొంది. ఐసిస్–కే నిర్వహించిన కాబూల్‌లో బాంబు దాడి, ఎయిర్‌పోర్టుపై రాకెట్ దాడులు వంటివి తాలిబన్లను ఆందోళన పరుస్తున్నాయి. తాలిబన్లు కూడా ఐసిస్–కే లాగానే షరియాకు కట్టుబడి పాలన సాగించే గ్రూపు. మరి అలాంటప్పుడు వీరితో వారికి ఎందుకు వైరం వస్తుందని చాలామంది ప్రశ్నిస్తుంటారు. ఇందుకు ఇరు గ్రూపుల లక్ష్యంలో భేదాలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: సర్కారీ బడుల్లో చదివించే టీచర్లకు అవార్డులు ) 2015లో బీజాలు అఫ్గాన్‌లో ఐసిస్ ప్రతినిధిగా ఐసిస్– ఖొరసాన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఐసిస్ 2015లో ప్రకటించింది. వెంటనే ఈ గ్రూపుపై తాలిబన్లు యుద్ధం ప్రకటించారు. తాలిబన్లు అఫ్గాన్‌లో షరియా ఆధారిత పాలనా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆవిర్భవించిన గ్రూపు. తాలిబన్ల ఎజెండా అఫ్గాన్‌కే పరిమితం. విదేశీయుల నుంచి అఫ్గాన్‌కు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని తాలిబన్లు అంటారు. కానీ ఐసిస్ లక్ష్యం అఫ్గాన్‌తో ఆగదు. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో అన్ని ముస్లిం దేశాలను కలుపుకొని ఖలీఫత్ (ఇస్లామిక్ రాజ్యం) ఏర్పాటు ఐసిస్ ప్రధాన లక్ష్యం. ఇందువల్లనే తాలిబన్లకు, ఐసిస్‌కు భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. తాలిబన్లు పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మలని, అఫ్గాన్‌లో ఆధిపత్యం కోసం పాక్ సృష్టించిన గ్రూపని ఐసిస్ విమర్శిస్తోంది. పాక్ చేతిలో బొమ్మలు కాకపోతే వెంటనే తమతో చేతులు కలిపి షరియా అమలుకు కలిసిరావాలని తాలిబన్లను ఐసిస్–కే డిమాండ్ చేసింది. ఐసిస్–కే ఆరోపణలను తాలిబన్లు తోసిపుచ్చారు. అఫ్గాన్‌లో జిహాద్‌కు తాము సరిపోతామని, సమాంతరంగా మరో గ్రూపు అవసరం లేదని, ఐసిస్–కే తమ కార్యకలాపాలను నిలిపివేసి అఫ్గాన్ నుంచి వైదొలగాలని తాలిబన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో మండిపడ్డ ఐసిస్ ఖలీఫత్‌లో చేరని కారణంగా తాలిబన్లపై జాలి చూపవద్దని ఐసిస్–కేను ఆదేశించింది. మొత్తం ఖలీఫత్‌కు ఒకరే అధినేత (ఖలీఫా/అమిర్) ఉంటారని దానికి విరుద్ధంగా తాలిబన్లు సొంతంగా అమిర్‌ను ప్రకటించుకోవడం ఏమిటని ఐసిస్–కే గతంలోనే నిలదీసింది. రెండో ఖలీఫాను తుదముట్టించాలని 2015లోనే పిలుపిచ్చింది. (చదవండి: వైరల్: గాల్లో ఎగురుతున్న పిజ్జాలు.. తినేందుకు పడరాని పాట్లు) ఏం జరగవచ్చు ప్రస్తుతానికి అఫ్గానిస్తాన్‌లో చాలా భాగం తాలిబన్ల చేతుల్లోకి వచ్చింది. దేశంలో సుదీర్ఘ పౌరపోరాటానికి ఈ గ్రూపు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే విమానాశ్రయం వద్ద బాంబుదాడులు జరిపింది. అమెరికా దళాలు వైదొలిగాక ఈ గ్రూపు మరిన్ని దాడులు చేయవచ్చన్న భయాలున్నాయి. ఐసిస్–కేను తాము ఎదుర్కొంటామని, అమెరికా సాయం అవసరం లేదని, అందువల్ల అమెరికా దళాలు పూర్తిగా వెళ్లిపోవాలని తాలిబన్లు ప్రకటించారు. మరోవైపు అమెరికా దళాల ఉపసంహరణను జాప్యం చేయాలని ఐసిస్ భావించింది. దీనివల్ల తాలిబన్లు– అమెరికన్ల పైనే ఎక్కువగా దృష్టిపెట్టి బిజీగా ఉంటారని, ఈ మధ్యలో తాము పైచేయి సాధించవచ్చని ఐసిస్ యోచిస్తున్నట్లు రక్షణ నిపుణుల అంచనా. ఇస్లాం ఆచరణలో తేడాలు తాలిబన్లు, ఐసిస్ గ్రూప్ రెండూ జీహాద్ ద్వారా ఇస్లామిక్ సామ్రాజ్య ఏర్పాటుకు యత్నించేవే అయినా, ఇస్లాంను అర్ధం చేసుకోవడంలో రెండు గ్రూపుల మధ్య బేధాలున్నా యి. తాలిబన్లలో ప్రధానంగా ఫష్తూన్ తెగకు చెందిన వారుంటారు. వీరు సున్నీ ఇస్లాంకు చెందిన హనఫీ మార్గాన్ని అవలంబిస్తారు. తాలిబన్లు దియోబంది మార్గ ప్రవచనాలను పాటిస్తారు. ఐసిస్ సున్నీ ఇస్లాంలోని వహాబీ/సలాఫి మార్గాన్ని పాటిస్తుంది. సూఫీ మార్గంపై తాలిబన్లకు నమ్మకం ఉండగా, ఐసిస్‌కు సూఫిజం గిట్టదు. ఇస్లాంలో మరో వర్గం షియా ముస్లింలను ఐసిస్ కాఫిర్లు(ద్రోహులు)గా భావిస్తుంది. సూఫీ మార్గాన్ని తిరస్కరిస్తూ ఐసిస్ ఫత్వాలు జారీ చేయగా, ఐసిస్‌ను వ్యతిరేకిస్తూ తాలిబన్లు ఫత్వాలు జారీ చేశారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
అవును.. మరోసారి దాడులు.. తిప్పికొట్టామన్న అమెరికా!
కాబూల్/వాషింగ్టన్: ముందుగా హెచ్చరించినట్లుగానే కాబూల్ ఎయిర్‌పోర్టులో ఐదు రాకెట్ దాడులు జరిగినట్లు అమెరికా ధ్రువీకరించింది. అయితే, క్షిపణి వ్యవస్థ ద్వారా వాటన్నింటినీ తిప్పికొట్టామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ అధికారి ఒకరు రాయిటర్స్‌తో వ్యాఖ్యానించారు. అఫ్గనిస్తాన్‌లోని హమీద్ కర్జాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం జరిగిన రాకెట్ దాడిని తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు. సీ- ర్యామ్ డిఫెన్స్ సిస్టం ద్వారా వాటిని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. కాగా సీ- ర్యామ్ అనేది ఒక ఆటోమేటిక్ సిస్టం. ప్రత్యర్థి దాడులను పసిగట్టి మెషిన్ గన్ ద్వారా వాటిని ఛేదిస్తుంది. ఇరాక్, అఫ్గనిస్తాన్‌లలో ఉన్న అమెరికా బలగాలను రక్షణగా అగ్రరాజ్యం ఈ సిస్టంను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇక అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణకు రేపటి(ఆగష్టు 31)తో గడువు ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే వరుస పేలుళ్లకు పాల్పడి వందలాది మంది అఫ్గన్ ప్రజలతో పాటు 13 మంది అమెరికా సైనికులను బలిగొన్న ఐసిస్- కె(ఇస్లామిక్ స్టేట్- ఖోరసాన్) గ్రూపు మరోసారి దాడులకు తెగబడే అవకాశం ఉందని అగ్రరాజ్యం హెచ్చరించింది. సోమవారం ఈ మేరకు దాడులు జరగడంతో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించింది. చదవండి: భయం భయంగానే ఇంటర్వ్యూ: దేశం వీడిన మహిళా జర్నలిస్టు Afghanistan: As many as five rockets were fired at Kabul airport but were intercepted by a missile defense system, reports Reuters quoting a US official — ANI (@ANI) August 30, 2021 -
అనుకున్న సమయానికే ఉపసంహరణ
వాషింగ్టన్: ముందుగా అనుకున్నట్లే ఆగస్టు 31 నాటికి అఫ్గాన్ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి చేస్తామని అమెరికా మరోమారు ప్రకటించింది. ఐసిస్–కే కారణంగా తరలింపు ప్రక్రియ ప్రమాదకరంగా మారినా, అనుకున్న సమయానికే పూర్తి చేయాలని యూఎస్ నిర్ణయించింది. ప్రస్తుతం పరిస్థితి బాగాలేదని, తమ దళాలు ప్రమాదంలో ఉన్నాయని, అయితే బలగాలు అఫ్గాన్‌లో ఉన్నంత కాలం ప్రమాదంలో ఉన్నట్లేనని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. తరలింపులో ఇది అత్యంత ప్రమాదకరమైన భాగమన్నాయి. కాబూల్ విమానాశ్రయంపై ఐసిస్–కే ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే! ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. బాంబు పేలుళ్ల నేపథ్యంలో తరలింపు వాయిదా వేయాలన్న ప్రతిపాదనేదీ రాలేదని, డెడ్‌లైన్ కల్లా ప్రక్రియ పూర్తి చేస్తామని మిలటరీ అధ్యక్షుడికి స్పష్టం చేసిందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్‌సాకీ చెప్పారు. తరలింపు ప్రక్రియ ప్రస్తుతం తిరోగామి దిశలో (రెట్రోగ్రేడ్) ఉందన్నారు. అంటే రోజులు గడిచే కొద్దీ అఫ్గాన్‌లో ఉండే బలగాలు తగ్గుతూ వస్తుంటాయని, ఉన్న వారితోనే సురక్షితంగా అఫ్గాన్‌నుంచి బయటపడే ప్రక్రియ పూర్తి చేయాలని వివరించారు. తాలిబన్లను నమ్మలేం తాలిబన్లపై తమకు నమ్మకం లేదని, కానీ ప్రస్తుతం వారితో పనిచేయడం మినహా వేరే మార్గం లేదని సాకీ అభిప్రాయపడ్డారు. అఫ్గాన్‌లో చాలా భూ భాగం తాలిబన్ల అధీనంలో ఉందని, విమానాశ్ర యం కూడా వారి స్వాధీనంలోనే ఉందని, అందువల్ల వారి సహకారంతో తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 14 నుంచి ఇప్పటివరకు సుమారు 1,09,200 మందిని అఫ్గాన్ విమానాశ్రయం నుంచి తరలించామని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం 12 గంటల వ్యవధిలో 4,200 మందిని 12 యుద్ధ విమానాల్లో దేశం దాటించామని తెలిపాయి. జూలై నుంచి ఇప్పటివరకు మొత్తం 1,14,800 మందిని అఫ్గాన్ సరిహద్దులు దాటించామని వెల్లడించాయి. అమెరికా దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత కూడా వీసాలున్న అర్హులైన అఫ్గాన్ పౌరులను దేశం దాటించే వరకు రక్షించేందుకు అంతర్జాతీయ సహకారం తీసుకోవాలని అధ్యక్షుడు బైడెన్ ఆదేశించినట్లు సాకీ తెలిపారు. పౌరుల తరలింపు పూర్తి శనివారానికి అఫ్గాన్‌లోని తమ పౌరులను తరలించే ప్రక్రియ పూర్తి అవుతుందని బ్రిటన్ ప్రకటించింది. దీంతో కేవలం కొన్ని మిలటరీ దళాలు మాత్రమే అఫ్గాన్‌లో ఉంటాయని, అవి కూడా ఆగస్టు 31కి స్వదేశానికి చేరతాయని బ్రిటన్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ నిక్‌కార్టర్ చెప్పారు. ఎంత ప్రయత్నించినా అందరినీ దేశం దాటించడం కుదరదని, నిజానికి ఇలాంటి ముగింపును తాము ఊహించలేదని తెలిపారు. ఆగస్టు 13 నుంచి దాదాపు 14,543 మందిని బ్రిటన్ కాబూల్ నుంచి తరలించింది. ఇంకా 100–150 మంది బ్రిటిష్ పౌరులు అఫ్గాన్‌లోనే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
యూఎస్ డ్రోన్ దాడిలో ఐసిస్–కె ఉగ్రవాదుల మృతి
వాషింగ్టన్/కాబూల్: కాబూల్ బాంబుదాడికి ప్రతీకారంగా అమెరికా ఐసిస్–కె సూత్రధారులిద్దరిని డ్రోన్‌దాడిలో హతమార్చింది. అఫ్గాన్ లోని నాన్గర్హర్ ప్రావిన్సు ప్రాంతంలోని ఐసిస్ స్థావరాలపై ఈ దాడి జరిగినట్లు అమెరికా ప్రతినిధి కెప్టెన్ బిల్ అర్బన్ చెప్పారు. అఫ్గానిస్తాన్‌లో ఉగ్రఘాతుకానికి పాల్పడ్డ ఐసిస్ మూకలపై ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ శపథం చేసిన సంగతి తెలిసిందే! అధ్యక్షుడి ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే మిలటరీ డ్రోన్ దాడులు చేసింది. దాడుల్లో ఇద్దరు ఐసిస్ వ్యూహకర్తలు మరణించారని, ఒకరు గాయపడ్డాడని మిలటరీ ప్రతినిధి హాంక్ టేలర్ చెప్పారు. దాడిలో సామాన్య పౌరులెవరూ గాయపడలేదన్నారు. మరణించిన ఐసిస్ వ్యూహకర్తలకు కాబూల్ దాడితో సంబంధం ఉందో, లేదో తెలియరాలేదు. వీరి వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. విమానాశ్రయంపై దాడి అనంతరం ఉగ్రమూకలు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జో బైడెన్ డ్రోన్ దాడులకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఐసిస్–కెలో 14 మంది కేరళీయులు? ఐసిస్–కె ఉగ్రవాద సంస్థలో 14 మంది కేరళ రాష్ట్రానికి చెందినవారు భాగస్వాములుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత బగ్రామ్ జైలు నుంచి వారిని విడుదల చేశారు. వారంతా ఐసిస్–కెతో ఉంటూ ఈ పేలుళ్లకు పన్నాగం పన్నిన వారిలో ఉన్నారని అఫ్గాన్ నుంచి సమాచారం వచ్చినట్టుగా జాతీయ మీడియా పేర్కొంది. 14 మందిలో 13 మంది ఇంకా కాబూల్‌లోనే ఉన్నారు. కేరళలోని మల్లాపురం, కసర్గోడ్, కన్నూర్ జిల్లాలకు చెందిన వీళ్లంతా ఏడేళ్ల క్రితమే కాబూల్‌కి వెళ్లి ఉగ్రసంస్థలో చేరారు. అమెరికా బలగాలు వారిని జైలు పాలు చేస్తే, తాలిబన్లు తిరిగి బయటకు తీసుకువచ్చారు. అఫ్గాన్ ఉగ్ర కార్యకలాపాల్లో కేరళ వాసుల హస్తం ఉందని తాలిబన్లు ప్రచారం చేసి అంతర్జాతీయంగా భారత్ పరువుని బజారుకీడుస్తారేమోనని కేంద్రం ఆందోళనలో ఉంది. కాబూల్‌లోని టర్క్మెనిస్తాన్ ఎంబసీ వద్ద పేలుళ్లు జరిపేందుకు యత్నించిన ఇద్దరు పాక్ జాతీయులను తాలిబన్లు అడ్డుకున్నారు. సున్నీ పస్తూన్ ఉగ్ర సంస్థకు చెందిన వీరు పేలుడు పదార్థాలతో ఉండగా పట్టుబడ్డారు. -
టార్గెట్ ఐసిస్: అమెరికా వేట మొదలైంది
US Revenge Attacks On ISIS: తమ సైనికులను పొట్టనపెట్టుకున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థపై అమెరికా ప్రతీకార వేట మొదలైంది. ‘వెంటాడి.. వేటాడి మట్టుపెడతామ’ని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించి కొన్ని గంటలు గడవకముందే.. దాడులకు దిగి లక్క్ష్యం పూర్తి చేసింది. శుక్రవారం సాయంత్రం దాటాక నంగహర్ ప్రావిన్స్‌లోని ఐసిస్ ఖోరసాన్ ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన అమెరికా దళాలు.. వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో కాబూల్ జంట పేలుళ్ల సూత్రధారిని మట్టుపెట్టినట్లు సమాచారం. ఐసిస్-కే గ్రూపు లక్క్ష్యంగా శుక్రవారం ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా దళాలు ప్రకటించుకున్నాయి. అఫ్గన్ భూభాగం అవతలి నుంచే రీపర్ డ్రోన్ సహాయంతో ఈ దాడికి పాల్పడింది. కాబూల్ పేలుళ్ల సూత్రధారి ఓ వాహనంలో వెళ్తుండగా గుర్తించి.. ఆ పక్కా సమాచారంతో దాడి నిర్వహించింది. ఈ దాడిలో ఆత్మాహుతి దాడుల వ్యూహకర్తతో పాటు అతని సహాయకుడు మృతిచెందాడని, సాధారణ పౌరులెవరికీ ఏం కాలేదని సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్ ఓ ప్రకటనలో స్పష్టం చేశాడు. మధ్య ఆసియా దేశాల్లోని అమెరికన్ ఆర్మీ బేస్ నుంచి నిర్వహించిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు వైట్ హౌజ్ దళాలు ప్రకటించుకున్నాయి. మరోవైపు కాబూల్ దాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. బలగాల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు ప్రకటించింది. ఇంకోవైపు ఎయిర్పోర్ట్ బయట సాధారణ పౌరులు ఉండకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. గురువారం రాత్రి కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర జరిగిన జంట బాంబు పేలుళ్లలో 13 మంది యూఎస్ సైనికులు, 78 మంది పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. చదవండి: కాబూల్ దాడులు.. ట్రంప్ భావోద్వేగం బరిలోకి తాలిబన్లు ఐసిస్-కే ఉగ్రవాద సంస్థపై అమెరికాతో పాటు తాలిబన్లు ప్రతీకార చర్యలకు దిగారు. మరిన్ని దాడులకు ఐసిస్-కే పథక రచన చేస్తుందన్న సమాచారం మేరకు తాలిబన్ బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఈ మేరకు కాబూల్‌లో ఇంటింటినీ గాలిస్తున్న తాలిబన్ బలగాలు.. ఇప్పటికే ఐసిస్-కే సానుభూతిపరులు, మద్ధతుదారులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల ద్వారా దాడులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. చదవండి: ఐసిస్ ఖోరసాన్- వీళ్లెంత దుర్మార్గులంటే.. క్లిక్ చేయండి: కాబూల్ పరిస్థితి- వాటర్ బాటిల్ 3 వేలు.. ఫుడ్ ప్యాక్ 7 వేలు -
ఐసిస్ కె అంటే ఏంటి..?
-
కాబూల్ ఉగ్రదాడిని ఖండించిన భద్రతా మండలి
ఐక్యరాజ్యసమితి: కాబూల్‌లో గురువారం రాత్రి జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. పదుల సంఖ్యలో సామాన్య పౌరులు, చిన్నారులు, సైనికులను బలిగొన్న ఈ దాడులను శోచనీయమైనవిగా పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదంపై పోరు చాలా కీలకమైందనీ, అఫ్గాన్ భూభాగాన్ని ఇతర దేశాలను బెదిరించేందుకు గానీ, దాడి చేసేందుకు గానీ ఉపయోగించరాదని మండలి ఒక ప్రకటనలో పునరుద్ఘాటించింది. భారత్ అధ్యక్ష స్థానంలో ఉన్న భద్రతా మండలి ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘ఐసిస్–కె పాల్పడినట్లుగా చెబుతున్న ఈ దాడిలో పౌరులు, చిన్నారులు, ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం గర్హనీయం’ అని పేర్కొంది. పౌరుల తరలింపులో సాయ పడుతున్న ఆర్మీని, ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని చట్టం ముందు నిలబెట్టాలి’ అని స్పష్టం చేసింది. -
ఐసిస్–కెతో భారత్‌కూ ముప్పు!
న్యూఢిల్లీ: మధ్య, దక్షిణాసియాల్లో జీహాద్ లక్ష్యంగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ ఐసిస్–కె భారత్‌పైనా దృష్టి సారించినట్టుగా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. మధ్య ఆసియా దేశాల తర్వాత భారత్‌నే లక్ష్యంగా చేసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. భారత్‌లో దాడులు చేయడం, యువతపై గాలం వేసి తమ సంస్థలోకి లాగడం వారి ముందున్న లక్ష్యమని, భారత్‌లో ముస్లిం పాలన తీసుకురావాలన్న ఎజెండాతో వారు పని చేస్తున్నట్టుగా తమకు సమాచారం ఉందని ప్రభుత్వ అధికారి తెలిపారు. కేరళ, ముంబైకి చెందిన ఎందరో యువకులు ఇప్పటికే ఈ సంస్థలో చేరారని చెప్పారు. ఈ ఉగ్రవాద సంస్థ క్రమంగా బలం పెంచుకుంటూ పోతే భారత్‌లో ఎన్నో స్లీపర్ సెల్స్ చురుగ్గా మారే అవకాశం ఉందని ఆ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌ను తాలిబన్లు కైవశం చేసుకున్న తర్వాత ఉగ్రవాద సంస్థల గురి భారత్‌పైనే ఉందని అన్నారు. కేరళ టు కాబూల్ టు కశ్మీర్ అది 2016 సంవత్సరం, జూలై 10. కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన ఓ వ్యక్తి తన 30 ఏళ్ల కుమారుడు అబ్దుల్ రషీద్, ఆయన భార్య అయేషా (సోనియా సెబాస్టియన్) ముంబైకి వెళ్లిన దగ్గర్నుంచి కనిపించకుండా పోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు తీగ లాగితే ఐసిస్–కె డొంక కదిలింది. వారు దేశాన్ని వీడి ఉగ్ర సంస్థలో చేరడానికి కాబూల్ వెళ్లారని తేలింది. కేరళ నుంచి కాబూల్‌కి వెళ్లిన వారు తిరిగి కశ్మీర్‌కు వచ్చి దాడులకు పన్నాగాలు పన్నారు. అప్పట్నుంచి ఈ సంస్థపై భారత్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఇక కాబూల్‌లోని గురుద్వారాపై 2020 మార్చి 25న జరిగిన దాడిలో కూడా ఐసిస్–కెలోని భారతీయుల ప్రమేయం ఉన్నట్టు తేలింది. -
Kabul Airport Attack: ఐసిస్–కె అంటే తెలుసా?
కాబూల్ విమానాశ్రయాన్ని రక్తమోడించిన ఐసిస్–కె సంస్థ అఫ్గాన్‌లో తన పట్టు మరింత బిగించాలని చూస్తోంది. అటు అమెరికా, ఇటు తాలిబన్లకు గట్టి హెచ్చరికలు పంపడానికే ఈ దారుణానికి ఒడిగట్టింది. తాలిబన్లతో ఇప్పటికే ఆధిపత్య పోరాటంలో ఉన్న ఈ ఉగ్ర సంస్థ ఈ పేలుళ్లతో అమెరికాకి పక్కలో బల్లెంలా మారింది. అసలు ఏమిటి ఉగ్ర సంస్థ? ఎలా అరాచకాలు చేస్తోంది? ఏమిటీ ఐసిస్–కె? ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థలో కార్యకలాపాలు సాగిస్తున్న కరడుగట్టిన భావజాలం ఉన్న ఉగ్రవాదులు కొందరు 2014లో ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. పాకిస్తానీ తాలిబన్ ఫైటర్లు మొదట్లో ఈ గ్రూపులో చేరారు. తూర్పు అఫ్గానిస్తాన్‌లో తొలిసారిగా వీరి కదలికలు కనిపించాయి. ప్రస్తుత అఫ్గానిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, టర్క్‌మెనిస్తాన్‌లో భాగంగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఖొరాసన్ అని పిలిచేవారు. వీరి ప్రధాన కార్యాలయం ఈ ప్రాంతంలోనే ఉంది. పాకిస్తాన్‌కి మాదకద్రవ్యాలు, అక్రమంగా మనుషుల్ని రవాణా చేయాలంటే ఈ మార్గంలోనే వెళ్లాలి. ఈ ప్రాంతానికి గుర్తుగా వీరిని ఐసిస్–కె లేదంటే ఐఎస్–కె అని పిలుస్తారు. మధ్య, దక్షిణాసియాల్లో తమ సామ్రాజ్యాన్ని విస్తరించడమే వీరి లక్ష్యం. ఇక్కడ చదవండి: ఐసిస్–కెతో భారత్‌కూ ముప్పు! ఎన్నో అరాచకాలు తాలిబన్లు కేవలం అఫ్గానిస్తాన్‌కు పరిమితమైపోతే ఐసిస్–కె ప్రపంచవ్యాప్తంగా ముస్లిమేతరులపై జీహాద్‌కు పిలుపునిచ్చింది. అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన సంస్థ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అంచనాల ప్రకారం ఐసిస్–కెలో 2017–18 సంవత్సరంలోనే అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లో సాధారణ పౌరులు లక్ష్యంగా 100కి పైగా దాడులు చేసింది. ఇక అమెరికా–అఫ్గాన్, పాకిస్తానీ బలగాలపై 250 దాడులు జరిపింది. 2020లో కాబూల్ విమానాశ్రయం, , కాబూల్ యూనివర్సిటీపై దాడులు, అధ్యక్ష భవనంపై రాకెట్లతో దాడుల్లో వీరి ప్రమేయం ఉన్నట్టుగా అనుమానాలున్నాయి. ఇవే కాకుండా అమ్మాయిలు చదువుకునే పాఠశాలలపై దాడులకు దిగడం, ఆస్పత్రుల్లో మెటర్నటీ వార్డులపై దాడులకు పాల్పడి గర్భిణిలను, నర్సులను నిర్దాక్షిణ్యంగా కాల్చేయడం చేశారు. షియా ముస్లింలపై అధికంగా దాడులకు చేస్తున్నారు. చదవండి:Donald Trump: దేశం శోకంలో మునిగిపోయింది.. ట్రంప్ భావోద్వేగం ఇంకా ఎలాంటి ప్రమాదాలున్నాయ్? తాలిబన్ల క్రూరత్వమే భరించలేనిదిగా ఉంటే ఐసిస్–కె మరింత కర్కశంగా వ్యవహరిస్తోంది. షరియా చట్టాలను పూర్తిగా మార్చేసి తాము సొంతంగా రూపొందించిన నియమ నిబంధనలను అఫ్గాన్ ప్రజలపై రుద్దాలని ఈ సంస్థ చూస్తోంది. తాలిబన్లు కఠినంగా వ్యవహరించడం లేదన్నది వీరి భావన. తాలిబన్లు, ఐసిస్–కె మధ్య చాలాకాలంగా ఆధిపత్య పోరాటం నడుస్తూనే ఉంది. అమెరికాతో తాలిబన్లు శాంతి చర్చలకు వెళ్లడం కూడా ఈ సంస్థకి అసలు ఇష్టం లేదు. శాంతి ఒప్పందాల వల్ల జీహాద్ లక్ష్యాలను చేరుకోలేమని వీరు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇప్పుడీ దాడులతో అమెరికాకు కూడా పక్కలో బల్లెంలా మారింది. హక్కానీ నెట్వర్క్ అండ తాలిబన్లతో వీరికి ఏ మాత్రం సరిపడదు కానీ తాలిబన్లకు అత్యంత సన్నిహితంగా మెలిగే హక్కానీ నెట్‌వర్క్‌తో సత్సంబంధాలున్నాయి. ఐసిస్–కె, హక్కానీ నెట్వర్క్, పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహించే ఇతర సంస్థలు ఉమ్మడిగా పన్నాగాలు పన్ని ఎన్నో దాడులకు దిగారు. ఆగస్టు 15న అఫ్గాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్న తర్వాత జైళ్లలో ఉన్న వారిని చాలా మందిని విడుదల చేశారు. వారిలో ఐఎస్, అల్ ఖాయిదా ఉగ్రవాదులు ఐసిస్–కెతో చేతులు కలిపారు. హక్కానీ నెట్వర్క్ సభ్యులే ఈ సంస్థకి సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నారన్న అనుమానాలున్నాయి. బలమెంత? 2014లో ప్రారంభమైన ఈ సంస్థ 2016 నాటికి అత్యంత శక్తిమంతంగా ఎదిగింది. ఆ సమయంలో ఈ సంస్థలో 3 వేల నుంచి 8,500 మంది వరకు ఉగ్రవాదులు ఉండేవారు. కానీ అమెరికా, అఫ్గాన్ బలగాలతో పాటు తాలిబన్లు జరిపిన దాడుల్లో చాలా మంది మృత్యువాత పడ్డారు. 2019 నాటికి ఈ సంస్థలో సభ్యుల సంఖ్య 2,000–4,000కి పడిపోయింది. మన దేశంలోని కేరళ యువకులు 100 మందిపై ఈ సంస్థ వల వేసి లాగేసుకుంది. గెరిల్లా పోరాటంలో ఈ సంస్థ ఉగ్రవాదులకి అత్యంత నైపుణ్యం ఉంది. పలుమార్లు ఆత్మాహుతి దాడులకు దిగారు. ఈ సంస్థ ఏర్పడినప్పుడు పాకిస్తానీ తాలిబన్ హఫీజ్ సయీద్ ఖాన్ ఈ సంస్థకు చీఫ్‌గా వ్యవహరించాడు. అతనికి డిప్యూటీగా ఉన్న అధుల్ రాఫ్ అలీజా అమెరికా చేసిన దాడుల్లో హతమయ్యారు. ప్రస్తుతం షహాబ్ అల్‌ముజీర్ ఈ సంస్థకి చీఫ్‌గా ఉన్నాడు. అతను సిరియాకి చెందినవాడని భావిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
మాజీ ఎమ్మెల్యే కుమారుడికి ఐసిస్‌తో లింక్?
సాక్షి, బనశంకరి: సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మాజీ ఎమ్మెల్యే బీఎం ఇదినబ్బ కుమారుడి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళూరులోని మస్తికట్టెలో ఉన్న బీఎం బాషా నివాసంపై బుధవారం ఎన్ఐఏ ఐజీపీ ఉమా నేతృత్వంలో 25 మంది బృందం దాడి చేసింది. స్థానిక పోలీసులతో కలిసి సోదాలతో పాటు విచారణ ప్రారంభించారు. బాషా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, అతని ఇద్దరు కుమారులు విదేశాల్లో స్థిరపడ్డారు. అతడి కుమార్తె కొన్నేళ్ల క్రితం కేరళ నుంచి అదృశ్యమైంది. ఆమె సిరియాలో ఐసిస్‌లో చేరినట్లు అనుమానాలున్నాయి. బాషా కుటుంబసభ్యులు ఐసిస్ నిర్వహించే యుట్యూట్ చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసినట్లు తెలి సింది. దీంతో ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానం వ్యక్తమైంది. అంతేగాక జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న యువకులతో బాషా కుటుంబీకులు ఫోన్లో సంభా షించినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఉళ్లాల నియోజకవర్గంలో మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న బీఎం.ఇదినబ్బ పాత్రికేయుడు, స్వాతం త్య్ర సమరయోధుడు, కన్నడ సాహితీవేత్త, కన్నడ ఉద్యమకారునిగా పేరుగాంచారు. ఆయన 2009లో కన్నుమూశారు. ఆయన కుమారుడు బాషా ఉగ్రవాద ఆరోపణల్లో చిక్కుకోవడం గమనార్హం. -
భారీ పేలుడు.. రద్దీమార్కెట్ మొత్తం రక్తసిక్తం
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మరో మారణ హోమం చోటు చేసుకుంది. ఈద్ లక్క్ష్యంగా చేసుకుని భారీ కుట్రకు పాల్పడ్డారు మిలిటెంట్లు. బాగ్దాద్ శివారు నగరం సద్ర్‌లోని ఓ రద్దీ మార్కెట్లో భారీ బాంబు పేలుడుకు పాల్పడగా.. ఆ ప్రాంతం రక్తపు ముద్దలతో భీకరంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 35 మంది చనిపోగా, 60 మందికిపైగా గాయపడ్డారు. సద్ర్ సిటీ వహాయిలత్ మార్కెట్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బక్రీద్ కోసం మార్కెట్లకు క్యూ కట్టిన జనాలను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రద్దీ మార్కెట్ కావడంతో ఎటు చూసినా తెగిపడిన అవయవాలు, రక్తపు ముద్దలే కనిపిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. గాయపడ్డ వాళ్లలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఘటనకు స్థానికంగా తయారుచేసిన పేలుడు పదార్థాన్నే ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ఈ దాడి తమ పనేనని ఐఎస్ఐఎల్(ఐఎస్ఐఎస్) ప్రకటించుకుంది. ఇరాక్ అధ్యక్షుడు బర్హమ్ సాలి ఈ దాడిని ‘క్రూరమైన నేరం’గా అభివర్ణించాడు. కాగా, ఈ ఏడాదిలో ఈ తరహా దాడి ఇది మూడోది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. -
ఐసిస్ వధువు షమీమాకు యూకేలో నో ఎంట్రీ
లండన్: ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్ (ఐఎస్ఐఎస్)లో చేరేందుకు చిన్నప్పుడే సిరియాకి పారిపోయిన, బంగ్లాదేశ్ సంతతికి చెందిన లండన్ యువతి షమీమా బేగం(21)ని తిరిగి దేశంలోకి అనుమతి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో యూకే ప్రభుత్వం, న్యాయపోరాటంలో అతిపెద్ద విజయం సాధించినట్టయ్యింది. 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని షమీమా బేగం ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టు గ్రూప్‌లో చేరేందుకు 2015 ఫిబ్రవరిలో పారిపోయింది. ఈ కేసులో ఐదు ప్రధాన కోర్టులకు చెందిన న్యాయమూర్తులు బేగంని తిరిగి దేశంలోకి అనుమతించరాదని ఏకగ్రీవంగా ఈ తీర్పునిచ్చారు. ఫిబ్రవరి 2019లో సిరియా శరణార్థి శిబిరంలో బేగంని గుర్తించిన తరువాత, జాతీయ భద్రతా కారణాల రీత్యా ఆమె బ్రిటిష్ పౌరసత్వాన్ని రద్దు చేశారు. సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా హోం శాఖ చేసిన అన్ని విజ్ఞప్తులను అనుమతించింది. బేగం క్రాస్ అప్పీల్‌ను కొట్టివేసినట్టు సుప్రీంకోర్టు అధ్యక్షుడు లార్డ్ రాబర్ట్‌రీడ్ చెప్పారు. బ్రిటన్‌లోని బంగ్లాదేశ్‌కి చెందిన దంపతులకు బేగం జన్మించారు. డచ్‌కి చెందిన ఐఎస్ఐఎస్ తీవ్రవాది యోగో రియడ్జిక్‌తో వివాహం నేపథ్యంలో ఐసిస్ వధువుగా బేగంని పిలుస్తున్నారు. తన బ్రిటిష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ యూకే హోంశాఖ తీసుకున్న నిర్ణయాన్ని బేగం సవాల్ చేశారు. ప్రస్తుతం బేగం సిరియాలో సాయుధ దళాల నియంత్రణ శిబిరంలో ఉన్నారు. -
భారత్‌పై ఐసిస్ కుట్ర బట్టబయలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్ర సంస్థ ఐసిస్ కుట్రపూరిత ప్రణాళిక మరోసారి బట్టబయలైంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేబూని జీహాద్ చేపట్టాలని ఐసిస్ తన డిజిటల్ మ్యాగజైన్లో ఓ వర్గాన్ని రెచ్చగొడుతోందని ఓ జాతీయ వెబ్సైట్ పేర్కొంది. జాతి భద్రతకు ముప్పుగా ముంచుకొచ్చిన మ్యాగజైన్‌పై భద్రతా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించాలని పిలుపు ఇచ్చిన ఐసిస్ డిజిటల్ మ్యాగజైన్ ఈ పోరాటానికి మద్దతుగా తాము నిలబడతామని హామీ ఇచ్చింది. రహస్య టెలిగ్రాం చానెల్స్, వెబ్ మీడియా ద్వారా ‘వాయిస్ ఆఫ్ ఇండియా’ పేరిట ఐసిస్ డిజటల్ మ్యాగజైన్ దేశ ప్రజల్లో విద్వేష భావాన్ని నూరిపోస్తోందని ఆ కథనం పేర్కొంది. బాబ్రీమసీదు విధ్వంసానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఓ వర్గాన్ని ఈ మ్యాగజైన్ రెచ్చగొడుతోందని స్పష్టం చేసింది. సీఏఏపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ కోర్టుల నిర్ణయాలకు కట్టబడిఉండరాదని ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని పేర్కొంది. చదవండి : ఐసిస్ అడ్డాగా ఐటీ రాజధాని..! -
9 మంది ఉగ్రవాదులను దోషులుగా తేల్చిన కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో భారీ ఉగ్ర కుట్రకు పథకం పన్నిన కేసుకు సంబంధించి మరో 9 మంది ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ స్పెషల్ కోర్టు శనివారం దోషులుగా తేల్చింది. డిసెంబర్ 2015లో ఎన్ఐఏ నమోదు చేసిన కేసులో మొత్తం 15 మందికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ముస్లిం యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించి ఐసిస్‌లో చేరేలా ప్రేరేపించిన 19 మందిని ఎన్ఐఏ 2015 లో అరెస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఐసిస్‌కు యువకులను రిక్రూట్ చేసిన ఉదంతంలో ఎన్ఐఏ దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో "జునోధ్ ఉల్ ఖిలాఫా ఫీల్ హింద్" పేరుతో గ్రూప్ ఫామ్ చేసి ఐసిస్ కుట్రను నెరవేర్చేందుకు 19 మంది ఉగ్రవాదులు కుట్ర పన్నారు. దేశంలో పేళ్లులకు భారీ కుట్ర రచించారు. (చదవండి: నరేంద్ర మోదీకి బెదిరింపు మెయిల్) ఈ క్రమంలో హైదరాబాద్, బెంగుళూర్, మహారాష్ట్ర, యూపీలలో ఐసిస్ సానుభూతిపరులు మీటింగ్‌లు కూడా నిర్వహించారు. సిరియాలో ఉంటున్న యూసఫ్ ఆల్ హింద్ అలియాస్ అంజన్ భాయ్ ఆదేశాలను అమలు చేయడం వీరి పని. ఐసిస్ మీడియా చీఫ్‌గా అంజన్ భాయ్ వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్ఐఏ 2016-17 మద్యలో ఈ కేసుకు సంబంధించి 17 మంది పై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. వీరిలో 15 మందిపై నేరం రుజువయ్యింది. వీరికి ఈ నెల 22న ఎన్ఐఏ స్పెషల్ కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. -
‘వాయిస్ ఆఫ్ హింద్’ బాసిత్ సృష్టే!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అనుమానిత ఉగ్రవాది, హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అబ్దుల్లా బాసిత్ జైల్లో ఉన్నా తన పంథా మార్చుకోలేదు. ఇప్పటికీ బరితెగిస్తూ అనేక మందిని జాతి వ్యతిరేకులుగా మారుస్తున్నాడు. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న ఇతడు స్మార్ట్‌ఫోన్ సాయంతో ‘ఉగ్ర’నెట్వర్క్ విస్తరణకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీని కోసం ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖురాసన్ ప్రావెన్సీ (ఐఎస్కేపీ) నిర్వహిస్తున్న ఆన్లైన్ మ్యాగజైన్ ‘వాయిస్ ఆఫ్ హింద్’ను ఇతడే ప్రారంభించాడు. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఐఎస్కేపీ ఉగ్రవాది సామి సాయంతో ఈ పని చేశాడు. సామి సైతం ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టై ఢిల్లీ జైల్లో ఉన్నాడు. ఐఎస్కేపీ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఈ అంశాలు పొందుపరిచారు. గతంలో అరెస్టు అయి బెయిల్‌పై వచ్చిన బాసిత్‌ను ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యూల్ కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైల్లోనూ స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న బాసిత్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. ఇలా ఇతడి వల్లో పడిన వారిలో జమ్మూకశ్మీర్‌కు చెందిన దంపతులు జహన్ జెబ్ సామి, హీనా బషీర్ బేగ్ కీలకంగా మారారు. బాసిత్ ఆదేశాల ప్రకారం.. సోషల్ మీడియా ద్వారా కొందరిని ఆకర్షించి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా వీళ్లు ప్రేరేపించారు. జైల్లో ఉన్న బాసిత్, బయట ఉన్న సామి కలిసి ‘వాయిస్ ఆఫ్ హింద్’ను మొదలెట్టారు. దీని ద్వారా ఉగ్రవాద భావజాలం వ్యాప్తితో పాటు ఓ వర్గాన్ని మిగిలిన వర్గాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. ఓ దశలో కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో వీరిని ఢిల్లీకి రప్పించిన బాసిత్ ఓక్లా ప్రాంతంలోని జామియానగర్‌లో ఉంచాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వీళ్లు అరెస్టయినా.. ‘వాయిస్ ఆఫ్ హింద్’ సంచికలు మాత్రం వెలువడుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఏడు ఎడిషన్స్ రావడంతో బాసిత్ నెట్‌వర్క్‌లో మరికొందరు బయట ఉన్నారని ఎన్ఐఏ అనుమానిస్తోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగించిన బాసిత్ పుణేకు చెందిన నబీల్ ఎస్ ఖాత్రి, సాదియా అన్వర్ షేక్‌లను ఐఎస్‌కేపీలో కీలకంగా మార్చాడు. ఎన్ఐఏ అధికారులు బుధవారం ఈ ఐదుగురి పైనా చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఎవరీ బాసిత్?: చాంద్రాయణగుట్ట పరిధిలోని గుల్షాన్ ఇక్బాల్ కాలనీకి చెందిన అబ్దుల్లా బాసిత్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారా ఐసిస్‌కు సానుభూతిపరుడిగా మారాడు. 2014 ఆగస్టులో మరో ముగ్గురితో కలిసి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్ళి ఉగ్రవాద శిక్షణ తీసుకోవాలని భావించాడు. దీన్ని గుర్తించిన నిఘా వర్గాలు వీరిని కోల్‌కతాలో పట్టుకుని సిటీకి తీసుకువచ్చి కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టాయి. ఈ ఉదంతంతో ఇతడిని కళాశాల యాజమాన్యం పంపించేసింది. ఆ తర్వాత హిమాయత్‌నగర్‌లోని ఓ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. 2015 డిసెంబర్లో ఐసిస్‌లో చేరేందుకు వెళ్లిపోతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి మరో ఇద్దరితో కలిసి వెళ్లాడు. అదే నెల 28న సిట్ పోలీసులు నాగ్‌పూర్‌లో వీరిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన బాసిత్... ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో తన భావజాలంలో మార్పు రాలేదని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కూడా తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యూల్, ఐఎస్కేపీల్లో కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అప్పటి నుంచి తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. -
‘నా పేరు ‘ఐసిస్’ కాదు’
వాషింగ్టన్: జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తర్వాత అమెరికాలో జాత్యంహకారానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయిన సంగతి తెలిసిందే. అయినప్పటకి కూడా అక్కడ ఇంకా కొంత మందిలో మార్పు రావడం లేదంటున్నారు నెటిజనులు. తాజాగా స్టార్‌బక్స్‌లో జరిగిన ఓ సంఘటన చూస్తే.. ఇది నిజమనిపిస్తుంది. కాఫీ కప్పు మీద ముస్లిం మహిళ పేరును ‘ఐసిస్’ అని రాసి విమర్శలు ఎదుర్కొంటోంది స్టార్‌బక్స్ యాజమాన్యం. వివరాలు.. ఆయేషా అనే ఓ ముస్లిం మహిళ ఈ నెల 1న అమెరికాలోని మిన్నెసోటా సెయింట్ పాల్లోని స్టార్‌బక్స్ బరిస్టాలో కాఫీ ఆర్డర్ చేసింది. తీరా కాఫీ కప్పు అందుకున్న ఆమె ఒక్క క్షణం షాక్‌కు గురయ్యింది. ఎందుకుంటే స్టార్ బక్స్ సిబ్బంది ఆయేషా పేరుకు బదులుగా ‘ఐసిస్’ అని కాఫీ కప్పు మీద రాశారు. (ఇక నుంచి ‘గ్లో అండ్ లవ్లీ’) దీని గురించి ఆయేషా మాట్లాడుతూ.. ‘ముఖానికి మాస్క్ ఉండటంతో సరిగా వినపడదనే ఉద్దేశంతో నా పేరును చాలా సార్లు రిపీట్ చేశాను. అయినా వారు ‘ఐసిస్’ అని రాశారు. ఆయేషా అనే పేరు కొత్త కాదు. తరచుగా వినే పేరే. కావాలనే వారు ఇలా చేశారు. కప్పు మీద ఐసీస్ అని చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. అవమానంగా భావించాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల ప్రతిష్టను దిగజార్చే సంఘటన. ఈ రోజుల్లో కూడా జనాల ప్రవర్తన ఇలా ఉందంటే నాకు నమ్మశక్యంగా లేదు. ఇది సరైంది కాదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆయేషా. అంతేకాక దీని గురించి మేనేజర్‌ను ప్రశ్నించింది. వారు ఈ సంఘటనను చిన్న తప్పిదంగా పరిగణించారు. ఆయేషాకు మరో కప్పు కాఫీ, 25 డాలర్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ ఈ చర్యలు ఆమె కోపాన్ని తగ్గించలేకపోయాయి. (హారియట్ టబ్‌మన్ బానిసల ప్రవక్త) దాంతో ఆయేషా స్టార్‌బక్స్ షాప్ మీద డిస్క్రిమినేషన్ సూట్ దాఖలు చేసింది. దాంతో సదరు షాప్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని తెలిపింది. ‘ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నాం. అయితే ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని మా నమ్మకం. ఇక మీదట ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము. ఇందుకు కారణమైన సిబ్బంది మీద చర్యలు తీసుకుంటాము’ అని తెలిపారు. -
కశ్మీర్లో నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్, కుల్గామ్ జిల్లాల్లో జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హత మయ్యారు. మృతుల్లో ఒకరిని షకూర్ ఫరూక్ లాంగూగా గుర్తించారు. గత మే 20న ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను చంపిన కేసులో నిందితుడు. బీఎస్ఎఫ్ జవాన్ కు చెందిన రైఫిల్‌ను సైతం జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో హతుడు షహీద్ అహ్మద్ భట్ కాగా, ఇంకొకరిని గుర్తించాల్సి ఉంది. వీరు హిజ్బుల్ ముజాహిదీన్, ఐసిస్‌లకు చెందిన వారు. అలాగే, కుల్గామ్ జిల్లాలో తయాబ్ వలీద్ అలియాస్ ఇమ్రాన్ భాయ్, అలియాస్ గజీ బాబా అనే పాకిస్తానీ హతమయ్యాడు. జైషే మొహమ్మద్ కమాండర్‌గా ఉన్న ఇతడు బాంబుల తయారీలో సిద్ధహస్తుడు. -
ఉగ్రవాదులూ.. అక్కడికి వెళ్లొద్దు: ఐసిస్
లండన్: యూరప్‌లో దాడులు జరపాలంటూ తన శ్రేణులను పురిగొల్పే ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి మాట మార్చింది. కోవిడ్‌తో సతమతమవుతున్న యూరప్ దేశాలకు ప్రయాణాలను మానుకోవాలని ఐసిస్ తన శ్రేణులను కోరింది. ఈ మేరకు తన పత్రిక ‘అల్ నబా’లో ఐసిస్ పలు ఆదేశాలిచ్చిందని ‘సండే టైమ్స్’ పేర్కొంది. ‘అంటువ్యాధుల భూమి యూరప్’ వైపు ఆరోగ్యవంతులు వెళ్లరాదు. ఇప్పటికే వ్యాధికి గురైన వారు, ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు సొంత ప్రదేశం విడిచి బయటకు వెళ్లవద్దు. ముక్కు చీదేటప్పుడు, ఆవులించే సమయంలో నోటికి గుడ్డను, చేతిని అడ్డుపెట్టుకోవాలి. క్రమం తప్పక చేతులు కడుక్కోవాలి’ అని సూచించింది. కోవిడ్‌ను మహమ్మారిగా పేర్కొన్న ఐసిస్.. ‘ఎవరిని హింసించాలని దేవుడు అనుకున్నాడో అక్కడికే దీనిని పంపాడు’ అని పేర్కొంది. (కరోనా టీకా; అమెరికా కుయుక్తులు!) -
‘వాళ్లు బానిసలు.. నేను అమరుడినవుతా’
లండన్: ఆత్మాహుతి దాడికి పాల్పడతానంటూ దక్షిణ లండన్ వీధుల్లో కత్తితో ఇద్దరిని గాయపరిచిన సుదేశ్ అమ్మన్(20) అనే వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలతో అరెస్టై జైలు శిక్ష అనుభవించిన సుదేశ్ రెండు రోజుల క్రితమే విడుదలయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం నకిలీ ఆత్మాహుతి దాడి జాకెట్ ధరించి.. బాటసారులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ మధ్య వయస్కుడు, 20 ఏళ్ల యువతి గాయపడ్డారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) సానుభూతి పరుడిగా ఉన్న సుదేశ్ అమ్మన్‌ను 2018 డిసెంబరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విచారణ సందర్భంగా.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఫోన్లో జరిపిన సంభాషణలు, చాట్స్ ఆధారంగా అతడిని అదే ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా తాను త్వరలోనే ఆత్మాహుతి దాడికి పాల్పడి.. అమరుడిగా మిగిలిపోతానని స్నేహితులకు చెప్పడం సహా అతడి గర్ల్‌ఫ్రెండ్‌ను.. ఆమె తల్లిదండ్రులను తల నరికి చంపేలా ప్రోత్సహించడం వంటి మెసేజ్‌లు, సిరియాలోని యాజాదీ మహిళలు ఐసిస్ బానిసలు అని.. వారిపై సామూహిక అత్యాచారం చేసేందుకు తాను ఓ బృందాన్ని తయారు చేస్తున్నా అంటూ సోదరుడికి పంపిన ఫొటోలు, లండన్‌లోని తన ఇంట్లో ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు గుర్తించారు. నేరం నిరూపితమైన క్రమంలో స్థానిక కోర్టు అతడికి శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అతడు జైలు నుంచి విడదలయ్యాడు. అయితే పోలీసులు సుదేశ్‌పై నిఘా ఉంచి.. రెండు రోజులుగా అతడిని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆత్మాహుతి జాకెట్ ధరించి.. దక్షిణ లండన్‌లోని వీధుల్లో కత్తితో సంచరిస్తున్న సుదేశ్‌ను గుర్తించారు. అతడు కత్తితో దాడులకు తెగబడిన క్రమంలో కాల్పులు జరిపారు. కాగా అతడి శవాన్ని పరిశీలించగా.. అతడు వేసుకున్నది నకిలీ జాకెట్ అని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. -
పేలుళ్లకు పన్నాగం.. 10 సిమ్‌కార్డులు కొనుగోలు
బెంగళూరుకు భారీ పేలుళ్లు ముప్పు తప్పినట్లయింది. సకాలంలో ఉగ్రవాద ముఠా పట్టుబడడంతో ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా ఖాకీలు అడ్డుకున్నారు. దక్షిణాదిలో జిహాదీ ఉగ్రవాదాన్ని మూలమూలలకూ విస్తరించడం, యువతను అందులోకి చేర్చుకోవడం, విధ్వంసం సృష్టించడమే ముఠా అజెండాగా వెల్లడైంది. వీరు కొనుగోలు చేసిన సిమ్‌కార్డులు పశ్చిమబెంగాల్లో పనిచేస్తుండడం గమనార్హం. ముఠాకు చెందిన ఇద్దరు మాస్టర్మైండ్లు శివమొగ్గ జిల్లా నుంచి పరారైనట్లు గుర్తించారు. కర్ణాటక, బనశంకరి: ఉద్యాన నగరంలో జనసమ్మర్ధం కలిగిన ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, ఓ వర్గానికి చెందిన ముఖ్య నేతల హత్యలకు పథకం రూపొందించినట్లు పోలీసుల విచారణలో మహబూబ్ పాషా వెల్లడించాడు. సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు రహస్య స్థలంలో అతన్ని విచారిస్తున్నారు. భయానకమైన అంశాలను వెల్లడించడంతో విచారణను తీవ్రతరం చేశారు. అంతేగాక ముఖ్యమంత్రి సొంత జిల్లా శివమొగ్గ తీర్థహళ్లిలో ఇద్దరు మాస్టర్‌మైండ్స్ ఉన్నట్లు ఇతడు బయటపెట్టాడు. ఓ ఎంపీ హత్యకు, విధ్వంసానికి కుట్రపన్నిన ఆరుగురిని శుక్రవారం బెంగళూరు పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. ఈ ముఠాలో ముఖ్యమైన మహబూబ్‌పాషాను ఖాకీలు లోతుగా విచారిస్తున్నాడు. ఇతడు విప్పిన గుట్టుమట్ల ఆధారంగా మాస్టర్ మైండ్స్ కోసం సీసీబీ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 10 సిమ్‌కార్డులు కొనుగోలు దక్షిణ భారతదేశంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థను బలోపేతం చేయడానికి ఈ జిహాదీ గ్యాంగ్ పనిచేస్తోందని గుర్తించారు. 10 మొబైల్ సిమ్‌కార్డుల కొనుగోలు ఆధారంగా విచారణ చేపట్టి సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. కీలక నిందితుడు మహబూబ్‌పాషా ఐసిస్ దక్షిణ భారత కమాండర్‌గా గుర్తించారు. 2019 ఏప్రిల్‌లో తమిళనాడు హిందూనేత సురేశ్ హత్య కేసులో నిందితుడు అనుమానిత ఉగ్రవాది మోహినుద్దీన్‌ఖాజా జామీను తీసుకున్న అనంతరం పరారీలో ఉన్నాడు. సేలంలో మోహినుద్దీన్ ఖాజా శిష్యుడు ఒకరు నకిలీ పత్రాలు అందించి 10 సిమ్‌కార్డులు కొనుగోలు చేశాడు. ఈ సిమ్‌కార్డులు కోలారు, పశ్చిమబెంగాల్లోని బురŠాద్వన్‌లలో పనిచేస్తున్నట్లు పోలీసులు కనిపెట్టారు. తక్షణం ఐఎస్డీ, సీసీబీ పోలీసులు అప్రమత్తమై సుద్దగుంటెపాళ్యలోని ఓ ఇంటిలో మహబూబ్‌పాషా అనుచరుడిని అరెస్ట్ చేశారు. సీసీబీ, ఐఎస్డీ పోలీసులు అప్రమత్తమై జరగబోయే భారీ ముప్పు నుంచి తప్పించగలిగారు. శ్రీలంక పేలుళ్లతో సంబంధం? మహబూబ్ పాషా కేవలం యువకులనే నియమించుకుని వారికి శిక్షణనిచ్చేవాడు. శ్రీలంకలో గుడ్‌ఫ్రైడే నాడు చర్చిలు, హోటళ్లలో జరిగిన బాంబుదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు ఈ ముఠాలో ఉన్నారనే అనుమా నం వ్యక్తమౌతోంది. మహబూబ్ పాషా అరెస్టైన అనంతరం తీర్థహళ్లిలో ఉన్న ఇద్దరు మా స్టర్‌మైండ్స్ ఉడాయించినట్లు తెలిసింది. ఒక వర్గం యువకులను ఉగ్రవాద కార్యకలాపాలకోసం నియామకాలు, శిక్షణను మహ బూబ్‌పాషా చూసేవాడు. చివరికి తన ఇద్దరు కు మారులను కూడా ఉగ్రవాద శిక్షణనిచ్చాడు. -
అడవులను అంటించమంటున్న ‘ఐసిస్’
సాక్షి, న్యూఢిల్లీ : క్లైమేట్ ఛేంజ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ పర్యావరణ పరిస్థితుల పరిరక్షణకు పిలుపునిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తుంటే.. జిహాదీలో భాగంగా అమెరికా, యూరప్ దేశాల్లో అడవులను తగులబెట్టండంటూ ఐఎస్ఐఎస్ (ఐసిస్) క్యాడర్‌కు దాని ప్రచార సంస్థ ‘ఖురేశ్’ పిలుపునిచ్చింది. కాలిఫోర్నియా, స్పెయిన్‌లో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు పట్ల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాల్లో అడవులను తగులబెట్టి ప్రజల్లో భయాందోళనలను రేపాలని, పర్యావరణ పరిస్థితులను మరింత దిగజార్చాలని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన పోస్టర్లలో ఖురేశ్ ఐసిస్) సానుభూతిపరులకు విజ్ఞప్తి చేసింది. సిరియాలో గత నెల ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదిని అమెరికా సైనికులు హతమార్చినప్పటికీ ఐసిస్ సోషల్ మీడియా ద్వారా ఖలీఫా రాజ్యం గురించి ప్రచారం సాగిస్తూనే ఉంది. పారిస్‌లోని నాత్రే డ్యామ్ కథడ్రల్ గత ఏప్రిల్‌లో మంటల్లో చిక్కుకోవడం క్రైస్తవుల శాపంగా, తమ విజయంగా ఐసిస్) ప్రచారం చేసుకుంటోంది. అప్పటినుంచే అడవులను తగులబెట్టాలంటూ అప్పుడప్పుడు పిలుపునిస్తోంది. -
హిందూ నేతల హత్యకు కుట్ర..
చెన్నై : ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రభావానికి లోనైన కొంతమంది హిందూ నేతల హత్యకు కుట్రపన్నారన్న సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తమిళనాడులో సోదాలు చేపట్టింది. కోవై, ఇలయంగూడి, ట్రిచి, కయల్పట్టిణం, నాగాపట్టిణం తదితర ఆరు ప్రాంతాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్, ఆయన కుమారుడు ఓంకార్‌ను హత్య చేయడమే ప్రధాన లక్ష్యంగా కొన్ని ఉగ్రసంస్థలు కుట్ర పన్నాయని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. వారితో పాటు మరికొంత హిందూ నేతలను కూడా హతమార్చేందుకు పథకం రచించినట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు. కాగా తమిళనాడుకు చెందిన హిందూ నేతలు సంపత్, హిందూ మున్నై నేత మూకాంబికా మణి, శక్తి సేన నేత అంబు మారిల హత్యకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఎన్ఐఏ ప్రత్యేక బృందం ఛేదించిన విషయం తెలిసిందే. ఇక దక్షిణ రాష్ట్రంలో ఐఎస్ ప్రభావిత ఉగ్ర గ్రూపుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. 2014 నుంచి దేశ వ్యాప్తంగా మొత్తం 127 మంది ఐఎస్ సానుభూతి పరులను అరెస్టు చేయగా వారిలో 27 మంది తమిళనాడుకు చెందిన వారే ఉండటం గమనార్హం. -
బాగ్దాదీని ఎలా గుర్తించారంటే..?
బీరట్: ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) చీఫ్ అబు బాకర్-అల్- బాగ్దాదీని హతమార్చేందుకు అమెరికా పక్కా వ్యూహంతో పనిచేసింది. అబు బాకర్‌ను మట్టుబెట్టడానికి ముందు కుర్దీష్ నేతృత్వంలోని సిరియా డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్) సహాయంతో డీఎన్ఏ పరీక్ష ద్వారా అతడే అని నిర్ధారించుకుంది. రహస్య వర్గాల ద్వారా అబు బాకర్ లోదుస్తులను సేకరించి డీఎన్ఏ పరీక్ష చేయించినట్టు ఎస్డీఎఫ్ సీనియర్ సలహాదారు పొలట్ కాన్ ట్విటర్లో వెల్లడించారు. అబు బాకర్ ఆచూకీ తెలపడంతో ఎస్డీఎఫ్ ఏవిధంగా సహాయపడిందో ఆయన వివరించారు. ‘ఎస్డీఎఫ్ రహస్య బృందాలు అబు బాకర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అక్కడికి వెళ్లాయి. అతడి లోదుస్తులను తీసుకొచ్చి డీఎన్ఏ పరీక్ష చేయించాం. వంద శాతం అతడే అని ధ్రువీకరించుకున్నాకే ఆ సమాచారాన్ని అమెరికా దళాలకు చేరవేశాం. చివరివరకు సమర్థవంతంగా పనిచేసి ఆపరేషన్ విజయవంతం కావడంలో కీలకంగా వ్యవహరించామ’ని పొలట్ కాన్ వెల్లడించారు. ఎస్డీఎఫ్ ఇచ్చిన సమాచారం ‘ఆపరేషన్ కైలా ముల్లర్’లో ఎంతో ఉపయోగపడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అబు బాకర్‌ను పట్టుకునేందుకు అమెరికా గూఢచార సంస్థ సీఐఏతో మే నెల 15 నుంచి పనిచేస్తున్నట్టు చెప్పారు. (చదవండి: ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం) -
‘టిక్‌టాక్’కు ప్రమాదకరమైన ‘వైరస్’
న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన మూడు వీడియో యాప్స్‌లో ‘టిక్‌టాక్’ ఒకటి. దీన్ని వినియోగిస్తున్న వినియోగదారుల్లో 30 శాతం మంది 18 ఏళ్ల లోపు వారే. వారికింకా సొంత వ్యక్తిత్వం అబ్బనితరం. అంటే పలు ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఉన్న ప్రాయం వారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలనే అత్యంత ప్రమాదరకరమైన వైరస్ టిక్‌టాక్‌కు సోకింది. అదే ‘ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా)’ ఐసిస్ టెర్రరిస్టులు తమ బంధీలను పలు రకాలుగా హింసిస్తున్న, గొంతులు కోసి చంపేస్తున్న వీడియో క్లిప్పులను ఇందులో పోస్ట్ చేస్తున్నారు. గత మూడు వారాల నుంచే ఈ వైరస్ ప్రారంభమైంది. వీటిని చూసి ఉలిక్కిపడిన ‘టిక్‌టాక్’ కంపెనీ యాజమాన్యం ఎప్పటికప్పుడు వాటిని తొలగించేస్తోంది. గత వారం ఐసిస్ టెర్రరిస్టుల ప్రచార వీడియోలను యాప్ నుంచి యాజమాన్యం తొలగించే లోగానే అవి డజన్ ఖాతాలకు షేర్ అయ్యాయి. ఐసిస్ వీడియో క్లిప్పింగ్స్‌లో ఎక్కువగా బందీల చేతులు వెనక్కి విరిచి కట్టేసి మొకాళ్లపై కూర్చోబెట్టి వారి మెడ రక్తనాళాలను చాకుతో తెగ నరకడం, అతి దగ్గరి నుంచి బందీల తలలకు తుపాకులు ఎక్కుపెట్టి కాల్చివేసే దృశ్యాలే ఎక్కువగా ఉన్నాయి. 175 నుంచి వెయ్యి మంది వరకు ఫాలోవర్లు ఉన్న ఓ ముగ్గురు యూజర్ల నుంచే ఇప్పటి వరకు ఈ వీడియోలు పోస్ట్ అయిన విషయాన్ని యాప్ యాజమాన్యం గుర్తించింది. వారిలో ఒక యూజర్ మహిళ కావడం గమనార్హం. వారి పోస్టింగ్‌లకు 25 నుంచి 125 వరకు లైక్స్ కూడా రావడం ఆందోళనకరమైన విషయం. మూడు వారాల క్రితం ఈ వీడియో క్లిప్పింగ్‌ల పోస్టింగ్‌లు మొదలు కాగా, తాజాగా ఒకటి రెండు రోజుల క్రితం పోస్ట్ అయింది. వాటిల్లో టెర్రరిస్టులు తుపాకులు గాల్లోకి ఎత్తి పాటలు పాడుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. ఐసిస్ టెర్రరిస్టులు తమ ప్రచారం కోసం సోషల్ మీడియాలోని ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, అల్ఫాబెట్‌లను ఉపయోగించుకోగా, పాటలు, డ్యాన్సుల షేరింగ్లతో ఎక్కువ పాపులర్ అయిన ‘టిక్‌టాక్’లోకి ప్రవేశించారు. టెర్రరిస్టు సంస్థలను నిషేధించినట్లు టిక్‌టాక్ యాజమాన్యం తన కంపెనీ మార్గదర్శకాల్లోనే పేర్కొంది. టెర్రరిస్టుల పోస్టింగ్‌లను ఎవరు షేర్ చేయరాదని, ప్రోత్సహించరాదని యాజమాన్యం తాజాగా పిలుపునిచ్చింది. బీజింగ్‌లోని ‘బైటెండెన్స్ లిమిటెడ్’ కంపెనీ టిక్‌టాక్‌ను నిర్వహిస్తోంది. -
టిక్‌టాక్‌తో యువతకు ఐసిస్ వల
యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ గ్రూప్ (ఐసిస్) రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతుంది. యువత విశేషంగా వాడుతున్న టిక్‌టాక్ ద్వారా వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. 500 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉన్న టిక్‌టాక్‌ను వేదికగా చేసుకుని 16 - 24 సంవత్సరాల వయసున్న యువతకు ఐసిస్ వల వేస్తున్నట్టు వెల్లడైంది. చిన్న చిన్న వీడియోలను పోస్ట్ చేసి యువతను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐసిస్ సంబంధిత అకౌంట్ల నుంచి ఈ వీడియోలు పోస్ట్ చేసినట్టు గుర్తించిన టిక్‌టాక్ ఈ ఖాతాలను తొలగించినట్టు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తెలిపింది. సిరియా నుంచి అమెరికా తన దళాలను వెనక్కి తీసుకోవడంతో పోరాటాన్ని ఉధృతం చేయాలని ఐసిస్ భావిస్తోంది. ఇందులో భాగంగా యువతను పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసేందుకు టిక్‌టాక్‌ను వేదికగా వాడుకుని ప్రచారం చేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న రెండు డజన్ల ఖాతాలను గుర్తించి శాశ్వతంగా తొలగించినట్టు టిక్‌టాక్ ప్రకటించింది. ఐసిస్ సాగిస్తున్న ప్రచారం తమ కంపెనీ నియమాలకు విరుద్ధమని, ఉగ్రవాద వీడియోలను తమ మాధ్యమంలో స్థానం లేదని స్పష్టం చేసింది. అయితే అత్యధిక యూజర్లను కలిగియున్న భారత్‌లోనూ టిక్‌టాక్ పెను సవాళ్లు ఎదుర్కొంటుంది. హింసను ప్రేరేపించే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సైబర్ వేధింపులు వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం పలుసార్లు హెచ్చరించడంతో పాటు కొన్ని వారాలపాటు నిషేధించింది. టిక్‌టాక్ మాధ్యమంగా #ఆరెస్సెస్, #రామమందిరం, #హిందూ, #బీజేపీ వంటి హాష్ ట్యాగ్‌లను ఉపయోగించి కొందరు హిందు అతివాదులు విద్వేషపూరిత వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఒక్క భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ సవాళ్లు ఎదుర్కొంటొంది. ఇరవైకి పైగా దేశాలలో టిక్‌టాక్ వినియోగదారులు ఉన్నారు. -
ఎవరిదీ పాపం; కన్నీరు పెట్టిస్తున్న ఫొటో!
నాలుగేళ్ల క్రితం.. యూరప్‌నకు వలస వెళ్లే క్రమంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకొని... టర్కీ బీచ్‌లోకి కొట్టుకు వచ్చిన మూడేళ్ల చిన్నారి అలన్ కుర్దీ ఫొటో చూసి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. ఉగ్రమూకల దాడులతో నిరంతరం అల్లకల్లోలంగా ఉండే సిరియాలో బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది. తాజాగా.... ఆధిపత్యపు పోరులో బాల్యం ఎలా శిథిలమవుతుందో తెలిపే ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిరియాలో ఐఎస్‌ను రూపుమాపి.. అక్కడి నుంచి తమ దళాలను వెనక్కి రప్పించామని.. అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డమాస్కస్, రష్యా సైనికులు మాత్రం నేటికీ సిరియాలో ఉగ్రమూకలు లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఇందుకు ప్రతిగా ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని అరిహా పట్టణంలో ఐసిస్ ఉగ్రవాదులు స్థానికుల ఇళ్లపై బాంబులతో దాడి చేస్తూ నాలుగు వారాలుగా ఎంతో మంది చిన్నారులను పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు జరిగిన ఘర్షణలో భాగంగా బుధవారం రాత్రి ఓ ఇంటిపై బాంబుల వర్షం కురిసింది. ఈ ఘటనలో తల్లి సహా ఓ చిన్నారి మరణించగా.. తండ్రి, ఐదుగురు పిల్లలు భవన శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఉగ్రమూకలకు భయపడి చాలా సేపటి వరకు ఎవరూ వారి దగ్గరకు రాలేదు. ఈ క్రమంలో ఐదేళ్ల రీహమ్ కింద పడుతున్న తన చిన్నారి చెల్లెలు టౌకా(ఏడు నెలలు) షర్టు పట్టుకుని ఆమెను పైకి లాగేందుకు ప్రయత్నించింది. అయితే దురదృష్టవశాత్తు రీహమ్ మరణించగా.. తన చేతుల్లో ఉన్న టౌకా కిందపడిపోయింది. ప్రస్తుతం తండ్రి, ముగ్గురు తోబుట్టువులతో పాటు టౌకా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన దృశ్యాలను బషర్ అల్ షేక్ అనే స్థానిక వార్తా పత్రిక ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. చెల్లెలి ప్రాణాలు కాపాడేందుకు పరితపిస్తున్న రీహమ్ ప్రయత్నం, ఆనక ఆమె మరణించిన తీరు మానవత్వమున్న ప్రతీ ఒక్కరి మనస్సును కదిలిస్తోంది. -
హైదరాబాద్‌కు ఐసిస్ నమూనాలు!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) అధికారులు అక్కడి పర్భనీలో అరెస్టు చేసిన ఐసిస్ మాడ్యూల్‌కు చెందిన కొన్ని నమూనాలు హైదరాబాద్‌కు రానున్నాయి. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నమూనాలను ఇప్పటికే పుణేలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్)కి పంపిన ఎన్ఐఏ రిపోర్టులు సైతం తీసుకుంది. అయితే, హైదరాబాద్‌లోని ఎఫ్ఎస్ఎల్లోనూ వీటిని పరీక్ష చేయించి రిపోర్టులు తీసుకోవాలని న్యాయస్థానం గత వారం ఆదేశించింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో భారీ విధ్వంసాలకు కుట్రపన్నిన ఐసిస్ మాడ్యూల్‌ను మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు 2016లో అరెస్టు చేశారు. అప్పట్లో పట్టుబడిన నసీర్ బిన్ యాఫై చావుస్, షాహిద్ ఖాన్, ఇక్బాల్ అహ్మద్ కబీర్ అహ్మద్, రయీసుద్దీన్ సిద్ధిఖీలకు విదేశంలో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని ఏటీఎస్ ఆరోపించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రయీసుద్దీన్‌కు కింది కోర్టు బెయిల్ తిరస్కరించడంతో అతడి తరఫు లాయర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై తన వాదనలు వినిపించిన ఎన్ఐఏ తరఫు లాయర్ ఆ మాడ్యూల్లో రయీస్ కీలకంగా వ్యవహరించారని వాదించారు. ఖలీఫాకు బద్ధులమై... మాడ్యూల్‌కు ‘అమీర్’గా (చీఫ్) నసీర్ వ్యవహరించినప్పటికీ తామంతా ‘ఐసిస్’అధినేత అబు బకర్ అల్ బగ్దాదీకి (ఖలీఫా) బద్ధులమై ఉంటామని, కాలిఫట్గా పిలిచే సైన్యంగా మారుతామని అందరితో ప్రమాణం చేయించింది మాత్రం రయీస్ అని స్పష్టం చేశారు. అరెస్టు సందర్భంలో రయీస్ సహా ఇతరుల నుంచి సేకరించిన బయాహ్ పత్రాల్లో ఉన్న చేతి రాతతో పోల్చడానికి గతంలోనే న్యాయస్థానం నుంచి అనుమతి పొంది రయీస్ చేతిరాతలు తీసుకున్నామని వివరించారు. ఈ నమూనాలను పరీక్షించిన పుణే ఫోరెన్సిక్ ల్యాబ్ సైతం రయీస్ రాసినవే అని తేల్చినట్లు కోర్టుకు తెలిపారు. న్యాయస్థానం నుంచి అనుమతి పొంది రయీస్ చేతిరాతలు తీసుకున్నామని అక్కడా పరీక్షలు పూర్తయిన తర్వాత నివేదిక సంగ్రహించి దాంతో పాటు పుణే ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిందీ తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. దీంతో బయాహ్ పత్రాలతో పాటు రయీస్ చేతిరాతల్ని హైదరాబాద్ పంపడానికి ఎన్ఐఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో ఉన్న ఎఫ్ఎస్ఎల్ ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక కీలక, ప్రతిష్టాత్మక, హై ప్రొఫైల్ కేసుల్లో తమ నివేదికలు అందించింది. ఈ నేపథ్యంలోనే బాంబే హైకోర్టు ఈ తరహా ఆదేశాలు ఇచ్చి ఉండచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మాజీ ప్రేయసికి గుణపాఠం చెప్పాలని..
ముంబై : నిన్నటి దాకా తనతో చనువుగా ఉన్న గర్ల్‌ఫ్రెండ్ తనకు దూరమైందన్న కసితో ఆమెకు బుద్ధి చెప్పాలని తనే ఇరకాటంలో పడిన ప్రబుద్ధుడి నిర్వాకం ముంబైలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..ఉగ్ర సంస్ధ ఐఎస్ గురించి నగరంలోని ఓ షాపింగ్ మాల్లోని పోస్టర్‌పై రాసిన విఖ్రోలికి చెందిన కేత్ గోడ్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గోడ్కే ఐఎస్ సందేశంతో పాటు ఓ మహిళ, మరో వ్యక్తి ఫోన్ నెంబర్లను కూడా అందులో ప్రస్తావించాడు. ఐసిస్ స్లీపర్ సెల్ చురుకుగా పనిచేస్తోందంటూ ఆ పోస్టర్‌పై నిందితుడు రాశాడని డీసీపీ అవినాష్ అంబురే వెల్లడించారు. ముంబైలోని ప్రముఖ సిద్దివినాయక ఆలయం గురించి కూడా పోస్టర్లో ప్రస్తావించాడని చెప్పారు. కాగా పోస్టర్లో పేర్కొన్న మహిళ పోన్ నెంబర్‌ను విచారించగా, నిందితుడితో ఆమెకు ఏడేళ్ల పాటు సన్నిహిత సంబంధం ఉందని, ఆమెను వేధించేందుకే ఆమె నెంబర్‌ను పోస్టర్లో రాసినట్టు వెల్లడైందని తెలిపారు. ఆమెకు గుణపాఠం చెప్పేందుకే మహిళతో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ ఫోన్ నెంబర్ రాశానని నిందితుడు వెల్లడించాడని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశామని డీసీపీ తెలిపారు. -
ఐసిస్ కలకలం
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఐసిస్ కలకలం బయలుదేరింది. తమిళ పోలీసుల కళ్లు గప్పి ఇక్కడ సాగుతున్న ఐసిస్ వ్యవహారాలను ఎన్ఐఏ పసిగట్టడం రాష్ట్ర భద్రతను ప్రశ్నార్థకం చేసింది. దాడులకు వ్యూహరచన జరిగినట్టు విచారణలో తేలడంతో ఆలస్యంగానైనా తమిళ పోలీసులు మేల్కొన్నారు. కోయంబత్తూరులో విచారణను ముమ్మరం చేశారు. అజారుద్దీన్ వలలో ఎవరైనా యువత పడ్డారా? అని ఆరా తీస్తున్నారు. రాష్ట్రం తీవ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉండటంతో పోలీసు యంత్రాంగం అప్రమతంగానే వ్యవహరిస్తూ వస్తోంది. అయితే, ఇక్కడ చాప కింద నీరులా సాగుతున్న వ్యవహారాలు పోలీసుల పని తీరు మీద విమర్శలు గుప్పించడమే కాదు, రాష్ట్ర భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గతంలో నిషేధిత సిమి తీవ్రవాద సంస్థకు అనుకూలంగా యువత ఏకం అవుతోండటాన్ని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించే వరకు ఇక్కడి పోలీసులు, ఇంటెలిజెన్స్ పసిగట్టలేని పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడి పోలీసులు హడావుడి సృష్టించినా, ఫలితం శూన్యం. ఇక, సెంట్రల్ రైల్వేస్టేషన్ పేలుడు కేసు విచారణ ఓ సవాలుగానే మారింది. అలాగే, హిందూ నేతల హత్యకు వ్యూహ రచనలు సాగి ఉన్నట్టుగా వచ్చిన సంకేతాలు, సమాచారాలు ఉన్నా, ఇక్కడ ఐఎస్ఐఎస్(ఐసిస్) కార్యకలాపాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నా భద్రతా పరంగా దూకుడు పెంచడంలో మాత్రం విఫలం అవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఎన్ఐఏ వర్గాలు ఇక్కడ దాడులు చేసే వరకు ఐసిస్ సానుభూతి పరుల గురించిన వివరాలు, వారి కార్యకలాపాలను రాష్ట్రపోలీసులు పసిగట్టలేని పరిస్థితి ఉండటం విమర్శలకు దారి తీస్తోంది. దాడులే లక్ష్యంగా వ్యూహాలు శ్రీలంకలో సాగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనతో సముద్ర తీరాల్లో గస్తీని ముమ్మరం చేసి రాష్ట్ర పోలీసులు చేతులు దులుపుకున్నారు. అయితే, రాష్ట్రంలో నక్కి ఉన్న ఆ దాడులకు మాడ్యూల్ సూత్రధారి గురించి సమాచార సేకరణలో విఫలం కావడం గమనార్హం. ఇది కూడా ఎన్ఐఏ బుధవారం రంగంలోకి దిగడంతోనే వెలుగులోకి వచ్చింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) వర్గాలు కోయంబత్తూరు నగరం అన్భునగర్‌లోని అజారుద్దీన్, పోతనూరులోని సదాం, అక్బర్, అక్రమ్ తిల్లా, కునియ ముత్తురులోని అబూబక్కర్ సలీం, అల్లమిన్ కాలనీలోని ఇదయతుల్లా, కరీంషా ఇళ్లలో దాడులు సాగించిన విషయం తెలిసిందే. పొద్దు పోయే వరకు ఈ దాడులు సాగగా, అజారుద్దీన్ ఎన్ఐఏ టార్గెట్ అయ్యాడు. మిగిలిన ఐదుగుర్ని విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ వర్గాలు సమన్లు జారీ చేసి వెళ్లాయి. అయితే, అజారుద్దీన్ వద్ద జరిపిన విచారణ, లభించిన ఆధారాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర సామగ్రి మేరకు ఐసిస్ మాడ్యూల్‌గా ఇక్కడ అతగాడు వ్యవహరిస్తుండం వెలుగులోకి వచ్చింది. శ్రీలంక బాంబు పేలుళ్లలో మరణించిన మానవ బాంబు జహ్రన్ హషీంకు ఫేస్బుక్ మిత్రుడిగా ఉండటమే కాదు, తమిళనాడులో ఐసిస్‌కు యువతను పంపించడం లక్ష్యంగా అజారుద్దీన్ ఇక్కడ తిష్ట వేసి ఉండటం గమనార్హం. అలాగే, తమిళనాడులో దాడులే లక్ష్యంగా వ్యూహ రచనలు సైతం సాగి ఉన్నట్టుగా సమాచారాలు వెలువడటం ఆందోళన కల్గిస్తోంది. ఆలస్యంగా ఉరకలు ఎన్ఐఏ వర్గాలు మహ్మద్ అజారుద్దీన్‌ను అరెస్టు చేసి తమ వెంట తీసుకెళ్లినానంతరం ఆలస్యంగా తమిళ పోలీసులు మేల్కొన్నారు. కోయంబత్తూరులో బుధవారం అర్థరాత్రి నుంచి హడావుడి పెంచారు. అజారుద్దీన్‌తో సన్నిహితంగా ఉన్నట్టు పేర్కొనబడుతున్న ఉక్కడం మహ్మద్ హసీం, కరుంబుకడై సయబుల్లా, అన్భునగర్ షాజహాన్ ఇళ్లల్లో సోదాల్లో నిమగ్నం అయ్యారు. గురువారం మధ్యాహ్నం వరకు ఈ సోదాలు సాగాయి. అజారుద్దీన్ ఇంటి పరిసరాల్లో ఉన్న వారి వద్ద, అతడితో సన్నిహితంగా ఉన్న మిత్రులు, వారికి సంబంధించిన వాళ్లను టార్గెట్ చేసి విచారణ పేరిట ఉరకలు తీశారు. అలాగే, అజారుద్దీన్ వలలో ఎవరైనా యువత పడ్డారా? అని ఆరా తీస్తున్నారు. కోయంబత్తూరులో గత కొంత కాలంగా హఠాత్తుగా కన్పించకుండా పోయిన యువత, వారికి సంబంధించిన వివరాల్ని సేకరించి, వీరు ఐసిస్‌లో చేరడానికి ఏమైనా దేశం దాటారా? అన్న అనుమానాలతో విచారణను ముమ్మరం చేసి ఉన్నారు. అలాగే, తీవ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉన్న చెన్నై, మదురై నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. -
ఐసిస్ మాడ్యూల్ సూత్రధారి అరెస్టు
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం శ్రీలంక ఆత్మాహుతి బాంబర్ జహ్రాన్ హషీంకు ఫేస్బుక్ స్నేహితుడైన ఐసిస్ తమిళనాడు మాడ్యూల్ సూత్రధారి మొహమ్మద్ అజారుద్దీన్‌ను అరెస్టు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఏడు ప్రాంతాల్లో సోదాల సందర్భంగా అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 14 మొబైల్ ఫోన్లు, 29 సిమ్‌కార్డులు, 10 పెన్‌డ్రైవ్‌లు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఆరు మెమొరీ కార్డులు, నాలుగు హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు, సీడీలు, డీవీడీలు, ఒక కత్తి ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈస్టర్ పర్వదినం సందర్భంగా శ్రీలంకలో సాగిన వరుస బాంబు పేలుళ్లలో రెండు వందల మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్ల అనంతరం తమిళనాడుపై ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత నెల కోయంబత్తూరులో ముగ్గురి ఇళ్లలో సోదాలు జరిపి, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈనేపథ్యంలో బుధవారం 35మందితో కూడిన అధికారుల బృందం కోయంబత్తూరుకు చేరుకుంది. స్థానిక పోలీసులతో కలసి ఏడు చోట్ల తనిఖీలు చేపట్టారు. ఉక్కడం అన్భునగర్‌లోని అజారుద్దీన్, పోతనూరులోని సదాం, అక్బర్, అక్రమ్ తిల్లా, కునియ ముత్తురులోని అబూబక్కర్ సలీం, అల్లమిన్ కాలనీలోని ఇదయతుల్లా, కరీంషా ఇళ్లలో సోదాలు జరిపారు. కోయంబత్తూర్‌కు చెందిన అజారుద్దీన్‌తో పాటు మరో ఐదుగురు నాయకత్వంలో నడుస్తున్నట్టుగా అనుమానిస్తున్న తమిళనాడు మాడ్యూల్‌పై మే 30వ తేదీన కేసు నమోదు అయ్యింది. తమిళనాడు, కేరళలో ఉగ్రదాడులు నిర్వహించేందుకు యువతను ఆకర్షించడం వారి లక్ష్యమని ఎన్ఐఏ తెలిపింది. -
మానవబాంబు అంటూ వైరల్‌గా మారిన న్యాయవాది వీడియో
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవల కాలంలో ఎంతో ప్రశాంతంగా ఉన్న తమిళనాడులో ఐసిస్ తీవ్రవాదుల కదలికలతో కలకలంగా మారింది. శ్రీలంక బాంబు పేలుళ్ల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ జారీ చేసిన హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతుండగా చెన్నైలో మంగళవారం అర్ధరాత్రి జరిపిన సోదాల్లో ముగ్గురు శ్రీలంక వాసులు సహా నలుగురు యువకులు పట్టుబడ్డారు. శ్రీలంకలో గత నెల 21న చర్చిలో మానవబాంబు సృష్టించిన విధ్వంసం 253 మందిని బలితీసుకుంది. ఆ తరువాత మరికొన్ని బాంబు పేలుళ్ల సంఘటనలు చోటుచేసుకున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సైతం ఇదేరకమైన ఘాతుకాలకు పాల్పడేందుకు ‘స్లీపర్ సెల్’ గా వ్యవహరిస్తున్న కొందరితో తీవ్రవాదులు సంబంధాలు పెట్టుకుని ఉన్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమానిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆరుగురు మహిళలు సహా 21 మందితో కూడిన తీవ్రవాదులను గుర్తించగా వీరిలో 15 మంది అఫ్ఘనిస్తాన్, సిరియాకు తప్పించుకుని వెళ్లినట్లు కనుగొన్నారు. ఈ దశలో చెన్నై, కోయంబత్తూరు, రామనాథపురం, కన్యాకుమారి జిల్లాల్లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ తనిఖీలను నిర్వహిస్తోంది. అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక బృందంగా ఏర్పడి చెన్నైలో తీవ్రస్థాయిలో తనిఖీలు జరుపుతోంది. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు ఒక్క చెన్నైలోనే మంగళవారం ముగ్గురు శ్రీలంకవాసులు పట్టుబడ్డారు. శ్రీలంకలో బాంబు పేలుళ్ల సంఘటనలకు ముందు ఐసీస్ అగ్రనేత జాక్రాన్ హసీంతో మాట్లాడినట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీలంక పేలుళ్లతో వీరికి సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరు రహస్యమార్గంలో, మరో ఇద్దరు విమానం ద్వారా చెన్నైకి వచ్చారు. ఇదిలా ఉండగా, పదిమందితో కూడిన ఎన్ఐఏ అధికారులు బుధవారం తంజావూరు, అదిరామపట్టినం, కుడందై పరిసర సముద్రతీర ప్రాంతాల్లో స్థానికపోలీసులకు సైతం సమాచారం ఇవ్వకుండా తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. రామనాధపురంలో 19 మంది తీవ్రవాదులు సంచరిస్తున్నట్లు సామాజిక మా«ధ్యమాలు అసత్యప్రచారం జరిగిందని నిర్దారించుకున్నారు. అయినా ఆయా ప్రాంతాలపై నిఘా, భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ ఓం ప్రకాష్ తెలిపారు. చెన్నైలో నలుగురు శ్రీలంక యవకులు అరెస్ ్ట: శ్రీలంక పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు తమిళనాడు క్యూ బ్రాంచ్ పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులకు అందిన సమాచారంతో మంగళవారం రాత్రి నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చెన్నై మన్నాడికి చెందిన ఒక యువకుడిని అరెస్ట్ చేశారు. ఇతను ఇచ్చిన సమాచారంతో చెన్నై పూందమల్లి బెంగళూరు జాతీయ రహదారిలోని గోల్డన్ ఒబులన్స్ అనే అపార్టుమెంటులో కొందరు శ్రీలంక వాసులు నివసిస్తున్నట్లు కనుగొన్నారు. అర్ధరాత్రి వారు నివసిస్తున్న పోర్షన్‌ను చుట్టుముట్టి శ్రీలంకకు చెందిన తానూకా రోషన్, అతని అనుచరులైన మహమ్మద్ రబ్దూన్, లబేర్ మహమ్మద్ అనే యువకులను అరెస్ట్ చేశారు. శ్రీలంకలో ఒక హత్యకేసులో నిందితుడైన రోషన్ 8 నెలల క్రితం సముద్ర రహస్యమార్గంలో చెన్నైకి చేరుకున్నాడు. సుదర్శన్ అనే పేరు, కున్రత్తూరు, మెహతానగర్ చిరునామాతో ఆధార్‌కార్డు, గుర్తింపు కార్డులను పొంది ఉన్నాడు. అంతేగాక ఐసిస్ అగ్రనేత జాక్రాన్ హసీమన్కు సన్నిహితుడని తెలుసుకున్నారు. రోషన్ నివాసం నుంచి కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, పెన్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాస్‌పోర్టు లేకుండా చెన్నైలో నివసిస్తున్న నేరంపై పూందమల్లి పోలీసులు సైతం అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆగస్టు్ట 15న చెన్నైలో మానవబాంబు దాడి: ఆగస్టు 15న రానున్న స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సమయంలో చెన్నైలో మానవబాంబు దాడి చోటుచేసుకోనుందని సామాజిక మాధ్యమాల ద్వారా ఒక న్యాయవాది వీడియో అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. రామనాథపురం జిల్లాకు చెందిన స్వామి మదురైలో ఒక రూము తీసుకుని నివసిస్తూ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ఉన్నారు. గంజాయి ముఠాకు పోలీసులకు మధ్య సంబంధాలు ఉన్నాయని, ఈ విషయాన్ని బహిర్గతం చేసిన తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేగాక జిల్లా కోర్టు, కలెక్టర్ కార్యాలయ ప్రాంతాల్లో అర్ధనగ్నంగా పరుగులు పెట్టి కలకలం రేపారు. శ్రీలంక పేలుళ్లకు మదురై జిల్లా అధికారి ఒకరు కారణమని, అతని నడవడికలపై అనుమానం వ్యక్తం చేస్తూ 2016 ఏప్రిల్ లోనే ఫిర్యాదు చేసిన చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా పేర్కొన్నాడు. అంతేగాక, మరో మూడు నెలల్లో తమిళనాడులో తీవ్రవాదదాడులు చోటుచేసుకోనున్నాయి, నేను అబద్దం చెబుతున్నట్లు భావిస్తే అరెస్ట్ చేసి శిక్షించడంని ఆ విడియోలో సవాల్ విసిరాడు. ఆగష్టు 15వ తేదీన చెన్నైలో మానవబాంబు విధ్వంసాల కో ఐసం ‘అడ్ప్లాన్’ అనే పథకం రూపకల్పన జరిగి ఉందని, ఆ మానవబాంబులు ఉన్న ప్రాంతం తనకు తెలుసని చెప్పాడు. విద్యార్థులు, యువకుల ద్వారా రామనాథపురం, కీళ్కరైకి చెందిన ముగ్గురు యువతులతో ఈ దాడులు జరుగుతాయని తెలిపాడు. ఈ దాడుల పథకం గురించి నా వద్ద ఆధారాలున్నాయి, నేను కూడా వారితో కొన్నాళ్లు సంచరించి బైటకు వచ్చేశానని చెప్పాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ మారడంతో మదురై పోలీసులు న్యాయవాది స్వామి కోసం గాలిస్తున్నారు. -
వ్యాపారవేత్త ఇంటి నుంచే ప్రణాళిక
కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ రోజున వరుస బాంబు పేలుళ్ల వ్యవహారంలో కొత్త అంశాలు తెరమీదకొచ్చాయి. ఆత్మాహుతి దాడులకు శ్రీలంకలోని ప్రముఖ సుగంధద్రవ్యాల వ్యాపారవేత్త ఇల్లు కేంద్రంగా పనిచేసిందని అధికారులు గుర్తించారు. కొలంబో కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారవేత్త మొహమ్మద్ యూసుఫ్ ఇబ్రహీం ఇద్దరు కుమారులు ఈ దాడిలో పాల్గొన్నారు. వీరిలో ఒకరు షాంగ్రీలా హోటల్‌ను లక్ష్యంగా చేసుకోగా, మరొకరు సినమన్ హోటల్ వద్ద తనను తాను పేల్చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. దాడులకు అవసరమైన పేలుడు పదార్థాలను ఇక్కడే భద్రపరిచారన్నారు. ఈ ఉగ్రమూకకు జహ్రన్ హషీమ్(40) అనే ఉగ్రవాది నేతృత్వం వహించాడని చెప్పారు. ఉగ్రదాడులు జరిగిన అనంతరం ఇబ్రహీం ఇంట్లో తనిఖీల కోసం పోలీసులు రాగానే ఇబ్రహీం కోడలు పేలుడు పదార్థాలను పేల్చేసింది. దీంతో ఆమెతో పాటు పోలీస్ అధికారులు చనిపోయారు. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్త యూసుఫ్ ఇబ్రహీంను అరెస్ట్ చేసి, ప్రశ్నిస్తున్నారు. అందరూ విద్యావంతులే.. ఈ ఉగ్రదాడిలో మొత్తం 9 మంది ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి విజేవర్ధనే తెలిపారు. అంతేకాకుండా వీరంతా బాగా చదువుకున్నవారేనని వ్యాఖ్యానించారు. ‘ఆత్మాహుతిదాడికి పాల్పడ్డవారిలో ఒకరు బ్రిటన్‌లో చదువుకున్నారు. అలాగే ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఈ దారుణానికి తెగబడ్డ తొమ్మిది మందిలో 8 మందిని ఇప్పటికే గుర్తించాం. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వీరి వివరాలను ఇప్పుడే బయటపెట్టలేం’ అని వెల్లడించారు. శాంతిభద్రతలు అదుపులోకివచ్చేవరకూ రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని విజేవర్ధనే పేర్కొన్నారు. కాగా, షాంగ్రీలా హోటల్‌పై ఏప్రిల్ 21న అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులను ఉటంకిస్తూ బీబీసీ తెలిపింది. లతీఫ్ 2006–07 మధ్యకాలంలో బ్రిటన్‌లోని కింగ్స్టన్ విశ్వవిద్యాయలంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే వదిలేశాడని వెల్లడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లిన ఇతను, అక్కడ మాస్టర్స్ పూర్తిచేసినట్లు పేర్కొంది. శ్రీలంక పేలుళ్లకు తమిళనాడులో కుట్ర? సాక్షి ప్రతినిధి, చెన్నై: పేలుళ్లకు సంబంధించిన కీలక సూత్రధారి ఒకరు కోయంబత్తూర్ వచ్చిరనే సమాచారంతో ఎన్ఐఏ, ఎస్ఐసీ పోలీసులు రహస్యంగా విచారించారు. కోయంబత్తూరులో హిందూ సంస్థల నేతలను హతమార్చేందుకు కుట్రపన్నిన స్థానికులు ఇద్దరు, చెన్నైకి చెందిన నలుగురిని గత ఏడాది పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఐసిస్ సానుభూతి పరులుగా తేలడంతో ఈ కేసును ఎన్ఐఏ విచారణకు అప్పగించారు. దీంతో ఎన్ఐఏ అధికారులు అరెస్టైన వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు చేపట్టి పెన్ డ్రైవ్‌లను, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరుకు చెందిన ఐసిస్ సానుభూతి పరులైన ఆ ఆరుగురిని శుక్రవారం మరోసారి ఎన్ఐఏ అధికారులు విచారించి కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. -
పేలుళ్లపై ముందే హెచ్చరించాం
న్యూఢిల్లీ: కోయంబత్తూరులో ఐసిస్ కేసు విచారణను ముగించిన వెంటనే, ఆ ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు, శ్రీలంకలో బాంబు దాడులు జరగొచ్చనే నిఘా హెచ్చరికలను శ్రీలంకకు ఈ నెల మొదట్లోనే పంపామని అధికారులు ఢిల్లీలో చెప్పారు. ఐసిస్‌ను స్ఫూర్తిగా తీసుకుని దక్షిణ భారతంలోని ప్రముఖ నేతలను చంపాలని కుట్రపన్నిన ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పట్టుకుని కోయంబత్తూరులో విచారించడం తెలిసిందే. ఆ హెచ్చరికలను రాయబార కార్యాయలం ద్వారా శ్రీలంకకు పంపామని అధికారులు తెలిపారు. కోయంబత్తూరులో విచారణ సమయంలో ఆ ఉగ్రవాదుల వద్ద నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే) నేత జహ్రాన్ హషీమ్ వీడియోలు లభించాయి. కొలంబోలోని భారత హై కమిషన్‌పై ఉగ్రవాద దాడికి ప్రణాళిక రచిస్తున్నట్లు జహ్రాన్ హషీమ్ ఓ వీడియోలో సూత్రప్రాయంగా చెప్పాడు. మరింత లోతుగా విచారణ జరపగా, ఐసిస్ సహకారంతో ఉగ్రవాదులు చర్చిలు లక్ష్యంగా పేలుళ్లు జరిపేందుకు అవకాశం ఉందని తెలిసింది.ఈ సమాచారాన్ని వెంటనే శ్రీలంకకు తెలియజేశామని అధికారులు చెప్పారు. ఇస్లాం రాజ్యస్థాపనకు ముందుకు రావాల్సిందిగా శ్రీలంక, తమిళనాడు, కేరళ యువతను హషీమ్ కోరుతున్నట్లు మరో వీడియోలో ఉంది. ఇద్దరు రాజీనామా చేయండి: అధ్యక్షుడు పేలుళ్లకు సంబంధించి ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను రాజీనామా చేయాల్సిందిగా శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన ఆదేశించినట్లు సండే టైమ్స్ అనే ప్రతిక బుధవారం తెలిపింది. రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో, దేశ పోలీస్ చీఫ్ పూజిత్ జయసుందరలను రాజీనామా చేయమని సిరిసేన కోరారంది. బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య బుధవారం నాటికి 359కి చేరింది. పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 60 మందిని అరెస్టు చేశామని పోలీసు విభాగ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర చెప్పారు. ఈ పేలుళ్లలో 500 మందికి పైగా ప్రజలు గాయపడటం తెలిసిందే. ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులంతా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన వారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. -
‘విదేశాల్లో చదివొచ్చి.. ఇక్కడ రక్తం పారిస్తున్నారు’
కొలంబో : క్రైస్తవ ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా శ్రీలంకలో ఐసిస్ ఉద్రవాదులు వరుస బాంబు పేలుళ్లకు తెగబడటంతో 359 మంది అసువులుబాసారు. వేలమంది క్షతగాత్రులయ్యారు. స్థానిక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్ ఈ మారణహోమానికి పాల్పడినట్టు తొలుత భావించారు. అయితే, గత నెల 15న న్యూజిలాండ్‌లో జరిగన మసీదు దుర్ఘటనకు ప్రతీకారంగానే ఈస్టర్ పండుగ వేళ తమ ప్రతీకారాన్ని తీర్చుకున్నామని ఐసిస్ ఉగ్రసంస్థ వెల్లడించింది. బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉండటం.. అంతా లంకేయులే కావడం గమనార్హం. ఇక విదేశాల్లో ఉన్నత చదువుసాగించిన విద్యావంతులు ఉగ్రవాదంవైపు మళ్లడం ద్వీపదేశాన్ని మరింత కలవరపెడుతోంది. బాగా చదువుకొని అటు కుంటుంబాన్ని ఇటు దేశాన్ని ఉద్ధరిస్తారనుకున్న ‘మేధావులు’ పుట్టిన గడ్డపై రక్తం పారిస్తున్నారని రక్షణశాఖ సహాయమంత్రి రువాన్ విజయవర్దనే ఆవేదన వ్యక్తం చేశారు. పదిమందికి తిండి పెడతారనుకున్న ఐశ్వర్యవంతులు ప్రజల ఉసురు తీస్తున్నారని వాపోయారు. ఆత్మాహుతి దాడులకు తెగబడ్డవారిలో యూకే, ఆస్ట్రేలియాలో పీజీ పూర్తి చేసిన ఓ వ్యక్తి కూడా ఉన్నాడని తెలిపారు. చదువుల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు అతను ఉగ్రవాదం ఆకర్షితుడయ్యాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇక బడా వ్యాపారవేత్త మహమ్మద్ యూసుఫ్ ఇబ్రహీం ఇద్దరు కుమారులు కూడా సూసైడ్ బాంబర్లుగా మారారు. 33 ఏళ్ల ఇమ్సాత్ కొలంబోలోని సిన్నమన్ గ్రాండ్ హోటల్లో, 31ఏళ్ల ఇల్హామ్.. షాంగ్రిల్లా హోటల్లో పేలుళ్లకు తెగబడినట్టు వెల్లడైంది. దాడులకు సంబంధించి ఇప్పటివరకు 90 మందిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మృతుల్లో 39మంది విదేశీయులున్నారు. ఇందులో 10మంది భారతీయులు ఉండగా.. నలుగురు అమెరికన్లు ఉన్నట్టు తెలిసింది. ఈస్టర్ సండే రోజు వరుస దాడులతో ఉగ్రవాదులు నరమేథం సృష్టించిన నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. పోలీసులు, త్రివిధ దళాలు ప్రజా భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. -
కలిసే చదివారు... విడివిడిగా చేరారు!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అనుమానితులుగా, ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్ అనుచరులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ 3 రోజులుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణకు హాజరవుతున్న మసూద్ తహాజ్, షిబ్లీ బిలాల్ క్లాస్మేట్స్ అనే విషయం వెలుగులోకి వచ్చింది. విదేశంలో పీజీ వరకు కలిసే చదువుకున్నట్లు వెల్లడైంది. అయితే ఐసిస్‌లోకి మాత్రం బాసిత్ వేసిన ట్రాప్‌లో వేర్వేరుగా ఇరుక్కున్నారని ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. ఈ ఇద్దరితో పాటు మరో అనుమానితుడు జీషాన్‌ను సైతం అధికారులు వరుసగా మూడో రోజైన సోమవారమూ ప్రశ్నించారు. మాదాపూర్‌లోని హైదరాబాద్ యూనిట్ కార్యాలయంలో వీరిని, బాసిత్ రెండో భార్య మోమిన్‌ను మహారాష్ట్రలోని వార్దాలో విచారించారు. మహారాష్ట్రకు చెందిన మసూద్, షిబ్లీ కుటుంబాలు కొన్నేళ్ల క్రితం ఒమన్‌ను వలసవెళ్లాయి. దీంతో ఇద్దరూ అక్కడి ఎంబసీ అదీనంలో నడిపే భారతీయ పాఠశాలలో చదువుకున్నారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఇద్దరూ క్లాస్మేట్స్. గతేడాది ఎవరికి వారుగా భారత్‌కు వచ్చి నగరంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం వేర్వేరు సంస్థల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. బాసిత్ అనుచరులుగా... ఐసిస్ భావజాలానికి ఆకర్షితులైన వీరు వెబ్సైట్లు, సోషల్ మీడియాల్లో ఆ అంశాల కోసం బ్రౌజింగ్ చేస్తుండేవారు. ఈ క్రమంలో బాసిత్ నిర్వహిస్తున్న ఫేస్బుక్ పేజ్, టెలిగ్రామ్ చానల్ గ్రూప్‌ల్లో సభ్యులుగా మారారు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు బాసిత్‌కు అనుచరులయ్యారు. పాతబస్తీలో జరిగిన సమావేశంలో నేరుగా పాల్గొనే వరకు తామిద్దరం ఒకే సూత్రధారితో కలసి పని చేస్తున్నామన్నది మసూద్, షిబ్లీకి తెలియదు. మరోపక్క బాసిత్‌కు మోమిన్ పరిచయమైంది కూడా ఇలాంటి ఐసిస్ సంబంధిత సోషల్ మీడియా గ్రూపుల్లోనే. మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన ఈమె ఆయా గ్రూపుల్లో చేస్తున్న చర్చలు బాసిత్‌ను ఆకర్షించాయి. దీంతో గత ఏడాది తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా మోమిన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చి మలక్‌పేటలో కాపురం పెట్టాడు. విదేశాల్లో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్లతో బాసిత్‌తో పాటు మోమిన్ సైతం సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండేది. గత ఏడాది ఆగస్టులో బాసిత్ అరెస్టు తర్వాత ఈమె వ్యవహారం కీలకంగా మారిందని అధికారులు చెప్తున్నారు. బిలాల్ తండ్రీ ఉగ్రవాద కేసు నిందితుడే... పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో (ఎల్ఈటీ) సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్న షిబ్లీ బిలాల్ తండ్రి మహ్మద్ షఫీఖ్ ముజావర్ 2002లో దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్ద జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితుడే కావడం గమనార్హం. ఈ కేసులో ముజావర్‌పై నాంపల్లి కోర్టు నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కొన్నేళ్లుగా ఒమన్ కేంద్రంగానే వ్యవహారాలు నడిపిన ముజావర్ గత ఏడాది ఫిబ్రవరిలో ఖతర్ పయనమయ్యాడు. ఖతర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఇతడిని పట్టుకున్న ఇంటర్ పోల్ భారత్‌కు బలవంతంగా (డిపోర్టేషన్) పంపింది. ఢిల్లీకి చేరుకున్న ఇతడిని సీఐడీ అరెస్టు చేసింది. ఈ అరెస్టు నేపథ్యంలోనే షిబ్లీ బిలాల్ సైతం హైదరాబాద్‌కు రావాల్సి వచ్చింది. గత జూన్‌లో ముజావర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
ఆగని కన్నీళ్లు
కొలంబో: శ్రీలంకలోని ఉగ్రమూకల రాక్షసక్రీడలో ప్రాణాలు కోల్పోయిన ప్రజల సంఖ్య అమాంతం పెరిగింది. మూడు చర్చిలు, మూడు ఐదు నక్షత్రాల హోటళ్లపై ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 215 మంది చనిపోగా, తాజాగా చికిత్స పొందుతూ మరో 75 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 290కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో 500 మందికిపైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. కొలంబోలోని సెయింట్ ఆంథోనీ చర్చి, నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి, బట్టికలోవాలోని జియోన్ చర్చితో పాటు షాంగ్రీలా, సినమన్ గ్రాండ్, కింగ్స్బరీ ఫైవ్‌స్టార్ హోటళ్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. వరుస బాంబుపేలుళ్ల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఓ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థకు చెందిన 24 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురికి కొలంబో మేజిస్ట్రేట్ మే 6 వరకూ రిమాండ్ విధించారు. విచారణ కమిటీ ఏర్పాటు... ఈ విషయమై శ్రీలంక ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఆరోగ్య మంత్రి రజిత సేనరత్నే మాట్లాడుతూ.. ఈ ఉగ్రదాడుల వెనుక నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపారు. ‘ఈ ఉగ్రదాడిలో ఏడుగురు ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారు. వీరంతా శ్రీలంక వాసులేనని అనుమానిస్తున్నాం. ఎన్టీజేకు విదేశీ సాయం అందిందా? ఈ సంస్థకు విదేశీ ఉగ్రమూకలతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ కేసును క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ)కి అప్పగించాం. ఉగ్రదాడి జరిగే అవకాశముందని నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏప్రిల్ 11కు ముందుగానే పోలీస్ ఐజీ పుజిత్ జయసుందరకు సమాచారం అందించారు. నిఘా సంస్థల హెచ్చరికలపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఐజీ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఈ ఉగ్ర దుశ్చర్య నేపథ్యంలో ఈ నెల 23న జాతీయ సంతాప దినంగా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఈ దాడి ఘటనపై అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటుచేశారు. రెండు వారాల్లోగా విచారణను పూర్తిచేసి నివేదికను అందించాలని ఆదేశించారు. జాతీయ భద్రతా మండలి భేటీ.. ఉగ్రదాడి నేపథ్యంలో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో సమావేశమైన జాతీయ భద్రతా మండలి(ఎన్ఎస్సీ).. సోమవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించాలని నిర్ణయం తీసుకుంది. కేవలం ఉగ్రమూకలను ఏరివేసేందుకే ఈ అత్యవసర పరిస్థితిని విధించా మనీ, ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బంది లేదని అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఎమర్జెన్సీ నేపథ్యంలో పోలీసులు, భద్రతాబలగాలు కోర్టు వారంట్ లేకుండానే ఎవరినైనా అదుపులోకి తీసుకుని విచారించేందుకు వీలవుతుంది. ఈ ఉగ్రదాడి వెనుక విదేశీ ఉగ్రసంస్థల హస్తం ఉండొచ్చన్న నిఘావర్గాల సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరుకు శ్రీలంక విదేశాల సాయం కోరే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బాధిత కుటుంబాలకు పరిహారం.. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో నష్టపోయిన కుటుంబాలకు శ్రీలంక ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఈ విషయమై శ్రీలంక ఆరోగ్య మంత్రి రజిత సేనరత్నే మాట్లాడుతూ.. ‘ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు 10 లక్షల శ్రీలంక రూపాయలను అందజేస్తాం. అలాగే అంత్యక్రియల నిర్వహణకు మరో రూ.లక్ష ఇస్తాం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల మధ్యలో నష్టపరిహారం అందజేస్తాం. ఉగ్రదాడిలో దెబ్బతిన్న చర్చిలను ప్రభుత్వమే పునర్నిర్మిస్తుంది. ఇప్పటివరకూ ఓ అతివాద సంస్థకు చెందిన 24 మందిని అరెస్ట్‌చేశాం. అనవసర ప్రచారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే వీరి వివరాలను బయటపెట్టడం లేదు’ అని స్పష్టం చేశారు. 10 లక్షల శ్రీలంక రూపాయలు తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు. దాడి వెనుక ఐసిస్ హస్తం? శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 290 మంది చనిపోవడం వెనుక ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) హస్తం ఉండే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రదాడి విషయంలో భారత ప్రభుత్వం శ్రీలంకతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ విషయమై శ్రీలంకకు చెందిన భద్రతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ దాడి తీవ్రత, జరిగిన తీరును చూస్తే దీన్ని ఐసిస్ ఉగ్రవాదులే చేసినట్లు అనిపిస్తోంది. ఆత్మాహుతిదాడిలో వాడిన పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను జాగ్రత్తగా మరింత క్షుణ్ణంగా విశ్లేషించాల్సిన అవసరముంది. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికే శ్రీలంకలోని చర్చిలను ఈస్టర్ రోజున ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రసంస్థ లష్కరే తోయిబా శ్రీలంకలో అడుగుపెట్టేందుకు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నట్లు నిఘావర్గాల వద్ద సమాచారం ఉంది. ఇటీవల న్యూజిలాండ్‌లో రెండు మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటున్న 50 మంది ముస్లింలను బ్రెంటన్ అనే క్రైస్తవ శ్వేతజాతీయుడు కాల్చిచంపినందుకు ప్రతీకారంగా శ్రీలంక ఐసిస్ మాడ్యూల్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చు’ అని అభిప్రాయపడ్డారు. మరోవైపు శ్రీలంకలోని బౌద్ధులు క్రైస్తవ మతం స్వీకరించడంపై ఇరువర్గాల మధ్య స్వల్పఘర్షణలు చోటుచేసుకున్నాయనీ, దాని కారణంగానే ఈ బాంబు పేలుళ్లు జరిగి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అలాగే శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాలే ఈ దాడులకు తెగబడ్డాయని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మృతుల్లో 8 మంది భారతీయులు దొడ్డబళ్లాపుర / తుమకూరు: శ్రీలంక ఉగ్రదాడుల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య సోమవారం నాటికి ఎనిమిదికి చేరుకుంది. బాంబు పేలుళ్లలో లక్ష్మీ, నారాయణ్ చంద్రశేఖర్, రమేశ్ గౌడ చనిపోయినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అంతకుముందు ప్రకటించగా, ఇదే దాడుల్లో కె.జి.హనుమంతరాయప్ప, ఎం.రంగప్ప, హెచ్.శివకుమార్, వేమురై తులసీరాం, ఎస్.ఆర్.నాగరాజ్ చనిపోయినట్లు కొలంబోలోని భారత హైకమిషన్ తెలిపింది. చనిపోయివారిలో ఐదుగురు జేడీఎస్ నేతలు ఉన్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే కేరళకు చెందిన పీఎస్ రసైనా(58) ఈ ఉగ్రదాడిలో దుర్మరణం చెందినట్లు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. అయితే రసైనా మృతిని శ్రీలంక అధికారులు ధ్రువీకరించలేదు. వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశమంతటా రాత్రిపూట కర్ఫ్యూను విధిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కొలంబోలోని పెట్టాహ్ ప్రాంతంలో ఉన్న బస్‌స్టేషన్‌లో పోలీసులు 87 బాంబు డిటోనేటర్లను కనుగొన్నారు. అలాగే ఈ ఘాతుకానికి తెగబడేముందు ఉగ్రమూకలు దక్షిణ కొలంబోలోని పనదుర ప్రాంతంలో 3 నెలలపాటు తలదాచుకున్న ఇంటిని గుర్తించారు. కాగా, కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేదారిలో 6 అడుగుల పైపులో అమర్చిన శక్తిమంతమైన ఐఈడీ బాంబును అధికారులు గుర్తించారు. కొలంబోలో మరో బాంబు పేలుడు.. కొలంబోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో సోమవారం మరో బాంబు పేలుడు సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. దీంతో అధికారులు స్పందిస్తూ.. ఉగ్రవాదులు ఓ వాహనంలో బాంబును అమర్చారని తెలిపారు. దీన్ని నిర్వీర్యం చేస్తుండగా బాంబు ఒక్కసారిగా పేలిందన్నారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. -
సిరియా టు దక్షిణాసియా!
సాక్షి, హైదరాబాద్: లష్కరేతోయిబా, తాలిబన్, అల్ కాయిదా.. కరుడుగట్టిన ఈ ఉగ్రవాద సంస్థల్ని తలదన్నేలా ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న సంస్థే ఐసిస్. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్), ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనే పేర్లతో ప్రారంభమైన దీని ప్రస్థానం ప్రస్తుతం ఖండాలు, ప్రాంతాల వారీగా ప్రత్యేక విభాగాలతో విస్తరించింది. ఇరాక్, సిరియాల్లో షియాల ఆధిపత్యానికి గండికొడుతూ సున్నీల ప్రాబల్యం పెంచుతూ ఇస్లామిక్ రాజ్య స్థాపనే ధ్యేయంగా ఐసిస్ ఏర్పడింది. ఇరాక్, సిరియాల్లో ఉన్న సున్నీ ప్రాంతాలను కలిపి ఓ రాజ్యంగా ఏర్పాటు చేయాలన్నది దీని తొలినాటి లక్ష్యం. తాజాగా భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేసి ప్రత్యేక దేశంగా చేయాలంటూ ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్మూ అండ్ కశ్మీర్ (ఐఎస్‌జేకే) పేరుతో విభాగాన్ని ఏర్పాటు చేసింది. గత ఏడాది హైదరాబాద్‌లో అరెస్టు అయిన ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్‌కు ఈ విభాగంతో సంబంధాలున్నాయి. సౌదీ అరేబియా ఆ చుట్టుపక్కల దేశాల్లో కార్యకలాపాలకు ఇస్లామిక్ స్టేట్ అరబ్ పెనిన్సులా (ఐఎస్ఏపీ), దక్షిణాసియా లో ఆపరేషన్స్ కోసం పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లోని ఖురాసాన్ కేంద్రంగా మరో విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఐసిస్ వ్యవస్థాపకుడు అబూ బకర్ అల్ బాగ్దాదీ, భారత్ వ్యవహారాల చీఫ్ షఫీ ఆర్మర్ మృతి తర్వాత విభాగాల వారీగా నేతలు తయారయ్యారు. దక్షిణాసియా లక్ష్యంగా.. ఐసిస్ ఖురాసాన్ మాడ్యూల్స్ కొన్నేళ్లుగా దక్షిణాసియా దేశాలను లక్ష్యం చేస్తూ వచ్చాయి. కేవలం పాక్, బంగ్లాదేశ్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకే అడ్డాగా మారిన నేపథ్యంలో తన ఉనికి చాటుకోవడానికి ఐసిస్ ప్రయత్నించింది. ఇలాంటిదే తొలి సారిగా ఢాకాలో 2016 జూలైలో జరిగిన బేకరీ ఘటన. భారత్‌లోనూ విధ్వంస కార్యక్రమాలు చేయట్టాలని ఐఎస్ చేసిన యత్నాలు నిఘా వర్గాల అప్రమత్తతతో సఫలీకృతం కాలేదు. మాల్దీవులలో కూడా 90 మంది ఐసిస్ ఉగ్రవాదుల్ని పోలీసులు అరెస్టు చేయడంతో పెనుముప్పుతప్పింది. కానీ, తాజాగా శ్రీలంకలో వారి ప్రయత్నం సఫలమైంది. -
రాజధానిలో మళ్లీ ఐసిస్ కలకలం
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో మరోసారి నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) కలకలం రేగింది. గతేడాది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ–ఢిల్లీ) అరెస్టు చేసిన ఐసిస్ ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్, అతని అనుచరుడు ఖదీర్‌ల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా శనివారం మహారాష్ట్రలోని వార్దాతోపాటు హైదరాబాద్‌లోని షహీన్ నగర్, శాస్త్రీపురంలోని కింగ్స్ కాలనీ, మైలార్దేవ్పల్లిలలో ఏకకాలంలో దాడులు చేసింది. బాసిత్ రెండో భార్య మోనాతోపాటు అతడి స్నేహితులు, అనుచరులైన జీషాన్, మసూద్ తాహాజ్, షిబ్లీ బిలాల్లను అదుపులోకి తీసుకుంది. మోనాను మహారాష్ట్రలో, మిగిలిన ముగ్గురినీ గచ్చిబౌలిలోని ఎన్ఐఏ కార్యాలయంలో ప్రశ్నించింది. ఆదివారం మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వారి నుంచి 13 సెల్ఫోన్లతోపాటు 11 సిమ్‌కార్డులు, ఐపాడ్, ఎక్స్టెర్నల్ హార్డ్‌డిస్క్, రెండు ల్యాప్టాప్స్, ఆరేసి చొప్పున పెన్‌డ్రైవ్‌లు, ఎస్డీ కార్డులు, మూడు వాకీటాకీ సెట్స్, కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. సోషల్ మీడియా ద్వారా రిక్రూట్మెంట్... దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగే ‘అబుదాబి మాడ్యూల్’పై ఎన్ఐఏ 2016 జనవరి 28న కేసు నమోదు చేసింది. ఆ మర్నాడే ప్రధాన నిందితుడు షేక్ అజర్ ఉల్ ఇస్లామ్‌ను, రెండో నిందితుడు అద్నాన్ హసన్‌ను, మూడో నిందితుడు మహ్మద్ ఫర్హాన్ షేక్‌లను అరెస్టు చేసింది. జమ్మూకశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ఈ ముగ్గురూ దుబాయ్‌లో స్థిరపడ్డారు. అక్కడ నుంచే ఐసిస్ కోసం పని చేశారు. ఐసిస్‌కు చెందిన కీలక నేత ఖలీద్ ఖిల్జీ (కేకే) ఆదేశాల మేరకు వ్యవహరించారు. పాకిస్తాన్‌కు చెందిన ఖలీద్ అప్పట్లో దుబాయ్ కేంద్రంగా ఐసిస్ కార్యకలాపాలు నడిపాడు. ఈ నలుగురూ సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షిస్తూ దేశంలో ఐసిస్ కోసం రిక్రూట్ చేసుకోవడం, వారికి అవసరమైన నిధులు సమకూర్చడం, సిరియా వెళ్లేందుకు సహకరించడం వంటివి చేయడానికి కుట్రపన్నారు. వారికి అప్పట్లో దుబాయ్‌లో నివసించిన ఈదిబజార్వాసి మహ్మద్ ముజ్తబ ద్వారా చంద్రాయణగుట్ట సమీపంలోని హఫీజ్ బాబానగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్లా బాసిత్‌తో పరిచయం ఏర్పడింది. ఇంటర్నెట్ ద్వారా బాసిత్‌తో సంప్రదింపులు జరిపిన అద్నాన్ హసన్ భారీగా నిధులు సమకూర్చాడు. అద్నాన్ దుబాయ్ నుంచే బాసిత్, సన, ఖురేషీలతోపాటు అబ్రార్, మాజ్, ఫారూఖ్, అద్నాన్, నోమన్, లతీఫ్లతోనూ సంప్రదింపులు జరిపాడు. 2014 ఆగస్టులో బాసిత్ తన స్నేహితులు, సమీప బంధువులైన నోమన్, అబ్రార్, మాజ్‌లతో కలసి బంగ్లాదేశ్ మీదుగా అఫ్ఘానిస్తాన్‌కు, అక్కడ నుంచి సిరియా వెళ్లాలని పథకం వేశాడు. ఇందుకోసం కోల్‌కతా చేరుకోగా వారిని అక్కడ పట్టుకున్న పోలీసులు హైదరాబాద్ తరలించారు. కౌన్సెలింగ్ అనంతరం విడిచిపెట్టారు. అయినప్పటికీ పంథా మార్చోకోని బాసిత్ బృందం... ఐసిస్‌లో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నాగ్‌పూర్ మీదుగా శ్రీనగర్ చేరుకొని పీఓకే వెళ్లాలని పథకం వేశారు. 2015 డిసెంబర్ 24న ప్రయాణం ప్రారంభించి 27న నాగ్‌పూర్ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారిపై ఎన్ఐఏ అభియోగపత్రాలు సైతం దాఖలు చేసింది. వారంతా నేరుగా ఐసిస్ కీలక నేత షఫీ ఆర్మర్‌తో సంబంధాలు నెరిపారు. ‘అబుదాబి మాడ్యూల్’పై ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ 2016లో కేసు నమోదు చేసింది. అప్పట్లోనే ముగ్గురినీ అరెస్టు చేసింది. దీనికి కొనసాగింపుగా చెన్నై, ఢిల్లీల్లోనూ అరెస్టులు జరిగాయి. నాటి దర్యాప్తులోనే బాసిత్, ఖరేషీ, అద్నాన్, సన సహా మొత్తం 12 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. గతేడాది ఆగస్టులో బాసిత్, నోమన్, అబ్రార్, సన, మాజ్, ఖురేషీ, ఖదీర్ ఇళ్లలో సోదాలు చేయడంతోపాటు కీలక ఆధారాలు, పత్రాలు స్వాధీనం చేసుకుంది. అబ్దుల్లా బాసిత్‌తోపాటు షహీన్‌నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖదీర్‌ను అరెస్టు చేసింది. అప్పట్లో బాసిత్ విచారణలో అనేకవిషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానితుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్... మసూద్, బిలాల్ మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. మసూద్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈ నలుగురు అనుమానితుల్ని వివిధ కోణాల్లో విచారించి పంపారు. ఆదివారం మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో అధ్యయనం చేస్తున్నారు. ఈ విశ్లేషణలో సాంకేతిక ఆధారాలు లభిస్తే అరెస్టులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఆయుధాలు సమకూర్చుకుంటానంటూ... బాసిత్‌కు టెలిగ్రామ్ యాప్ ద్వారా పరిచయమైన హుజైఫా అనే ఐసిస్ కీలక నేత గతేడాది మార్చిలో కొన్ని కుట్రలు చేశాడు. ఆయుధాలు సమకూర్చుకొని స్థానికంగా ఆపరేషన్స్ చేయాలని బాసిత్‌ను ప్రేరేపించాడు. దీంతో పంజాబ్, ఢిల్లీ, బిహార్‌ల నుంచి ఆయుధాలు సమకూర్చుకుంటానంటూ బాసిత్ బదులిచ్చాడు. తాను అందించే నిధులతో ఓ భారీ వాహనాన్ని ఖరీదు చేసుకోవాలని, దాన్ని వినియోగించి జనసమ్మర్థ ప్రాంతంలోకి దూసుకెళ్లి వీలైనంత మందిని ‘లోన్ వూల్ఫ్’తరహాలో దాడులు చేయాలని ఉసిగొల్పాడు. అలాగే కత్తులతో కనిపించిన వారినల్లా పొడుచుకుంటూ పోవాలని నూరిపోశాడు. దీంతో బాసిత్ తాను ప్రభుత్వ ఉద్యోగులు, భద్రతా బలగాలు, నిఘా వర్గాలు, ఆర్ఎస్ఎస్ నేతలు, ఓ వర్గానికి చెందిన ముఖ్యుల్ని టార్గెట్ చేసుకుంటానని చెప్పాడు. ఈ ఆపరేషన్స్ కోసం అతనికి కొన్ని నిధులు కూడా అందాయి. ఆ ఏర్పాట్లలో ఉండగా ఈ కుట్రలు కార్యరూపం దాల్చకుండానే బాసిత్, అతడికి సహకరించిన ఖదీర్ కటకటాల్లోకి చేరారు. గతేడాది వారిని అరెస్టు చేసిన ఎన్ఐఏ... రెండు నెలల క్రితం అభియోగపత్రాలు సైతం దాఖలు చేసింది. అరెస్టు కావడానికి ముందు బాసిత్‌తో సంబంధాలు నెరపిన అతడి స్నేహితులు షహీన్‌నగర్‌కు చెందిన జీషాన్, శాస్త్రీపురంవాసి మసూద్ తాహాజ్, మైలార్‌దేవ్‌పల్లికి చెందిన షిబ్లీ బిలాల్లతోపాటు మహారాష్ట్రలోని వార్దాకు చెందిన బాసిత్ రెండో భార్య మోనాపైనా కేంద్ర నిఘా వర్గాలు కన్నేసి ఉంచాయి. బాసిత్ చేపట్టలేని ఆపరేషన్స్‌ను పూర్తి చేయడానికి వాళ్లు సిద్ధమవుతున్నారని గుర్తించాయి. బాసిత్ ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులు... శనివారం ఏకకాలంలో హైదరాబాద్, మహారాష్ట్రల్లోని నాలుగు ప్రాంతాల్లో దాడులు చేసి మోనా, జీషాన్, మసూద్ తాహాన్, షిబ్లీ బిలాల్లను అదుపులోకి తీసుకున్నారు. -
అన్నింటి వెనుకా ఐఎస్ఐ హస్తం!
దేశమంతటా ఇప్పుడు ఒకే చర్చ. పాకిస్తాన్‌తో యుద్ధం వస్తుందా...భారత సైన్యం దాడికి పాక్ ప్రతీకార దాడులకు దిగుతుందా అని. ఇటీవలి పుల్వామా దాడితోపాటు మన వైమానిక దాడుల నేపథ్యంలో ఉగ్రవాద సంస్థల చర్యలపై నగరంలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఎందుకంటే గతంలో హైదరాబాద్‌లో జరిగిన పలు ఉగ్ర ఘటనలే ఇందుకు కారణం. నిషిద్ధ ఉగ్రవాద సంస్థలైన జైష్ ఏ మహ్మద్ (జేఈఎం), లష్కరే తొయిబా(ఎల్ఈటీ),హిజ్బుల్ ముజాహిదీన్(హెచ్‌యూఎం) వంటి వాటి వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రోద్బలం ఉంది. వీటి ఛాయలు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు పదిహేడేళ్లుగా సిటీలో ఉన్నాయి. ఇవి పన్నిన కుట్రలు, సృష్టించిన విధ్వంసాలు భారీ నష్టాలనే మిగిల్చాయి. దక్షిణాదిలోని మిగిలిన నగరాల కంటే హైదరాబాద్ పైనే ముష్కరమూకల గురి ఎక్కువగా ఉంటోంది. ఇక్కడ కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాద, ఉగ్రవాద సంస్థల కదలికలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్ర ఉదంతాలపై సాక్షి ప్రత్యేక కథనం... సాక్షి,సిటీబ్యూరో :దేశాన్ని కుదిపేసిన ‘పుల్వామా’ దాడితో పాటు తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. సరిహద్దుల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఇటీవల పరిణామాలతో తెరపైకి వచ్చిన నిషిద్ధ ఉగ్రవాద సంస్థలైన జైష్ ఏ మహ్మద్ (జేఈఎం), లష్కరేతొయిబా(ఎల్ఈటీ), హిజ్బుల్ ముజాహిదీన్(హెచ్‌యూఎం) వంటి వాటి వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రోద్బలం ఉంది. వీటి ఛాయలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇరవై ఏడేళ్లుగా సిటీలో ఉన్నాయి. ఇవి పన్నిన కుట్రలు, సృష్టించిన విధ్వంసాలు భారీ నష్టాలనే మిగిల్చాయి. దక్షిణాదిలోని మిగిలిన నగరాల కంటే హైదరాబాద్ పైనే ముష్కరమూకల గురి ఎక్కువగా ఉంటోంది. ఇక్కడ కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాద, ఉగ్రవాద సంస్థల కదలికలూ ఉన్నాయి. హెచ్‌యూఎం.. ఏఎస్పీ కృష్ణప్రసాద్ హత్య 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. ఆ తర్వాతే నగరంలో, దేశంలో ఉగ్రవాదం జోరందుకుంది. అయితే, దీనికి ముందే నగరం భారీ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ఇంటెలిజెన్స్ విభాగంలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించిన కృష్ణప్రసాద్‌తో పాటు ఆయన గన్‌మెన్ వెంకటేశ్వర్లు హత్య నగరానికి సంబంధించి తొలి తీవ్రమైన ఉగ్రవాద చర్యగా చెప్పొచ్చు. టోలిచౌకిలోని బృందావన్ కాలనీలో హెచ్‌యూఎం ఉగ్రవాదులు తలదాచుకున్నారని కృష్ణప్రసాద్‌కు సమాచారం అందింది. దీంతో 1992 నవంబర్ 29న తన బృందంతో అక్కడి ఓ ఇంటిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాది ముజీబ్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో కృష్ణప్రసాద్, వెంకటేశ్వర్లు అశువులుబాసారు. ఈ ఉదంతం అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నగరం అంతకు ముందుకు వరకు ఈ తరహా ఘటనల్ని ఎప్పుడూ చూడలేదు. 2001లో గణేష్ ఊరేగింపు టార్గెట్ లష్కరే తొయిబా సంస్థ హైదరాబాద్‌లో భారీ స్థాయిలో మతకలహాలు సృష్టించాలని 2001లో కుట్ర పన్నింది. దీనికోసం నగరానికే చెందిన అబ్దుల్ అజీజ్‌ను తమ వైపు తిప్పుకుంది. మరికొందరితో కలిసి రంగంలోకి దిగిన ఇతగాడు గణేష్ నిమజ్జన ఊరేగింపులో భారీ పేలుళ్లకు పాల్పడాలని కుట్ర పన్నాడు. అలా చేస్తే నగరం మతకలహాలతో అట్టుడుకుతుందని భావించాడు. అయితే దీన్ని గుర్తించిన నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో మొత్తం మాడ్యుల్ కటకటాల్లోకి వెళ్లింది. సాయిబాబా దేవాలయం వద్ద పేలుడు దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా దేవాలయం వద్ద 2002 నవంబర్ 21న భారీ పేలుడు జరిగింది. దీనికి అవసరమైన కుట్రను లష్కరే తొయిబా చేసింది. ఈ సంస్థ తరఫున ఉగ్రవాదులుగా వ్యవహరించిన అహ్మద్ ఆజం, అబ్లుల్ అజీమ్‌ను రంగంలోకి దిగారు. పాలక్యాన్‌లో పేలుడు పదార్థాలు నింపి, దాన్ని స్కూటర్‌కు అమర్చడం ద్వారా పేల్చేశారు. ఈ ఉదంతంలో పద్మ అనే మహిళ, భానుప్రకాష్ రెడ్డి అనే బాలుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో నలుగురు నగరంతో పాటు కరీంనగర్లో జరిగిన ఎన్కౌంటర్లలో చనిపోయారు. బీజేపీ నేత హత్యకు జేఈఎం కుట్ర పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడికి తెగబడిన జైష్ ఏ మహ్మద్ (జేఈఎం) సంస్థ.. నగరంలో వరుస హత్యలకు కుట్ర పన్నింది. బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, శివసేన, హిందూ వాహినీలకు చెందిన కీలక నేతలను టార్గెట్ చేసింది. వీరిని హత్య చేయడం ద్వారా మత కలహాలు సృష్టించాలని భావించింది. ఈ ముష్కరులు టార్గెట్ చేసిన వారిలో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి కూడా ఉన్నారు. ఉగ్రవాదుల కుట్ర అమల్లోకి రాకముందే నిఘా వర్గాల సమాచారంతో వీరికి చెక్ పడింది. మొట్టమొదటి మానవబాంబు దాడి నగరంలో తొలిసారి.. ఇప్పటి వరకు ఏకైక మానవ బాంబు దాడి సైతం లష్కరే తొయిబా పనే. 2005 అక్టోబర్ 12న బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై దీన్ని పేల్చారు. ఆ రోజు దసరా పండగ కావడంతో అధికారులు, సిబ్బంది లేరు. అయితే ఆ పేలుడు ధాటికి ఒక హోంగార్డు బలయ్యాడు. ఈ కేసులో గులాం యజ్దానీ సహా నగరానికి చెందిన అనేకమంది ఉగ్రవాదుల ప్రమేయం ఉంది. హైదరాబాద్, బెంగళూరు, హుబ్లీల్లో విధ్వంసానికి కూడా.. రాజధాని హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, హుబ్లీల్లో పేలుళ్లకు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు 2012లో ఛేదించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ) విదేశాల్లో ఉన్న కొందరి ద్వారా ఇక్కడ ఉంటున్న వారిని ట్రాప్ చేసి విధ్వంసాలకు ప్రేరేపించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వీరి టార్గెట్‌లో ఉన్న బెంగళూరు, హైదరాబాద్, హుబ్లీ, నాందేడ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, జర్నలిస్టులను కాల్చి చంపడం ద్వారా మత విధ్వేషాలు రెచ్చగొట్టాలని భావించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ నిర్థారించింది. ఈ కేసులో సిటీ వాసి ఒబేద్ కూడా ఉన్నాడు. 1993లో కశ్మీరీ సంస్థల ఛాయలు బాబ్రీ విధ్వసం జరిగిన కొన్నాళ్లకు నగరంలో కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాద సంస్థల కదలికలు కనిపించాయి. దేశ వ్యాప్తంగా ఓ వర్గానికి చెందిన యువతను ఆకర్షించి, భారీ నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి ఇక్వాన్ ఉల్ ముస్లమీన్ (ఐయూఎం) కుట్ర పన్నింది. డబ్బు వెదజల్లుతూ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి తమ క్యాడర్‌ను రంగంలోకి దింపింది. అలా వచ్చిన వారే నిస్సార్ అహ్మద్ భట్, అమీన్మీర్. నగరానికి వచ్చిన వీరిద్దరూ కొందరిని ఉగ్రవాదులుగా మార్చారు. చాపకింద నీరుగా తమ కార్యకలాపాలను విస్తరించడానికి కొన్ని స్థానిక సంస్థల సహకారం కూడా తీసుకున్నారు. సిటీతో పాటు దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నారు. దీనిపై నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు 1993 నవంబర్ 10న భట్, అమీన్‌తో పాటు మరికొందరినీ అరెస్టు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అల్–జిహాద్..భారీ కుట్ర కశ్మీర్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ‘అల్ జిహాద్’ కదలికలు సిటీలో కనిపించాయి. ఈ సంస్థకు చెందిన కశ్మీరీ బిలాల్ అహ్మద్ కులూ 1993లో నగరానికి వచ్చి చిరుద్యోగిగా తలదాచుకున్నాడు. ఆపై యువతను ఆకర్షించి ఉగ్రవాద శిక్షణకు పంపాలని, వారు తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు వినియోగించుకోవాలని భావించాడు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఎల్ఈటీకి చెందిన సలీంజునైద్ మాడ్యుల్ దేశంలోని ప్రధాన నగరాల్లో మత కలహాలు సృష్టించడంతో పాటు విధ్వంసాలకు పాల్పడేందుకు ఐఎస్ఐతో పాటు లష్కరేతొయిబా(ఎల్ఈటీ) 1985లో కుట్ర పన్నింది. దీని కోసం పాకిస్తాన్‌కు చెందిన సలీం జునైద్‌ను రంగంలోకి దింపింది. నగరానికి వచ్చిన ఇతగాడు పాతబస్తీలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని, జమాతే ఇస్లామీ సంస్థకు చెందిన మరికొందరితో కలిసి నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. వీరి మాడ్యుల్లో సిటీకి చెందిన వారూ చేరారు. వీరంతా సిటీతో పాటు డెహ్రాడూన్, లక్నో, ఘజియాబాద్, ముంబై, అలీఘర్‌లో రెక్కీలు చేసి పేలుళ్లకు కుట్ర పన్నారు. దీన్ని ఛేదించిన పోలీసులు జునైద్ సహా మరికొందరిని అరెస్టు చేశారు. ఇదే మాడ్యుల్ ఘట్కేసర్లోని రైల్వే ట్రాక్‌పై బాంబులు పెట్టింది. దీనిపైనా అక్కడి ఠాణాలో మరో కేసు నమోదైంది. ఏసీ గార్డ్స్‌లో హిజ్బుల్ముష్కరులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన కీలక ఉగ్రవాదులు గుల్జార్ అహ్మద్, గులాం మొహియుద్దీన్, అబు బాఖర్, ముర్తుజా అహ్మద్‌లను 2001 జూలై 30న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విచారించగా కొందరు తమ అనుచరులు నగరంలోని ఏసీ గార్డ్స్‌లో తలదాచుకున్నారని చెప్పారు. దీనిపై ఢిల్లీ నుంచి అందిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురిని పట్టుకున్నారు. ఇండియన్ ముజాహిదీన్వెనుకాలష్కరే.. గోకుల్‌చాట్, లుంబినీ పార్కుల్లో 2007 ఆగస్టు 25న, దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జంట పేలుళ్లు జరిగాయి. దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ముష్కరులు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. అయితే, ఈ సంస్థ వెనుక ఎల్ఈటీతో పాటు ఐఎస్ఐ హస్తాలు ఉన్నాయి. అప్పట్లోనే అస్ఘర్ దుశ్చర్యలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గతేడాది జరిగిన ప్రణయ్ దారుణ హత్యలో నిందితుడిగా ఉన్న అస్ఘర్ అలీ దుశ్చర్యలు 1996లోనే వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో కశ్మీర్‌కు వెళ్లిన అలీ.. అక్కడున్న ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆపై ఇండియన్ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్ (ఐఎంఎంఎం) సంస్థలో కీలకంగా వ్యవహరిస్తూ ఉగ్రవాద చర్యలకు ఉపక్రమించాడు. మరికొందరు ముష్కరులతో కలిసి భారీ పేలుళ్లకు కుట్ర పన్నాడు. దీనికోసం కశ్మీర్ నుంచి పేలుడు పదార్థాలు, ఆయుధాలు సేకరించాడు. రెక్కీ వంటి చర్యలు చేపడుతుండగా 1997లో పోలీసులకు ఉప్పందడంతో వీరిని పట్టుకున్నారు. దీనికి ఏడాది ముందు నాంపల్లి కోర్టు నుంచి ఉగ్రవాది మీర్జా ఫయాజ్ బేగ్‌ను తప్పించింది సైతం అస్ఘర్ అలీనే అని వీరి విచారణతో తేలింది. ఇతడి మాడ్యులే 2003లో జరిగిన గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంది. గణేష్ టెంపుల్‌ను పేల్చేయాలని.. సికింద్రాబాద్‌లోని గణేష్ దేవాలయం సైతం లష్కరే తొయిబా టార్గెట్‌లో ఉంది. దీన్ని పేల్చేయడానికి 2004లో కుట్ర జరిగింది. నగరానికే చెందిన వారిని తమవైపు తిప్పుకున్న ఎల్ఈటీ.. వారికి అవసరమైన పేలుడు పదార్థాలు అందించింది. అనూహ్యంగా ఈ కుట్రను ఛేదించిన సిటీ పోలీసులు మౌలానా నసీరుద్దీన్ సహా అనేక మందిని అరెస్టు చేసి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ సిలిండర్‌ను పేలడు పదార్థంతో పేల్చేయడం ద్వారా విధ్వంసం సృష్టించి, మత కలహాలు రెచ్చగొట్టాలని లష్కరే తొయిబా కుట్ర చేసింది. ‘ఓడియన్’ ఘాతుకం ఎల్ఈటీ పనే.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న ఓడియన్ థియేటర్లో 2006 మే 7న జరిగిన గ్రెనేడ్ పేలుడు సైతం పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ) పనే. పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ పొంది, తిరిగి నగరానికి వచ్చి ‘స్లీపర్‌సెల్’గా వ్యవహరించిన మహ్మద్ జియా ఉల్ హక్ ఈ పేలుడుకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు నగరంలోనే తలదాచుకున్న జియాను 2010 మే 3న పట్టుకోగలిగారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన మహ్మద్ జియా ఉల్ హక్ కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదిబజార్‌లో స్థిరపడ్డారు. జియా ఇంటర్మీడియట్ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి ఉద్యోగం నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఉండగానే పాకిస్తానీ అబు అలీతో పరిచయమై.. అతని ద్వారా ఎల్ఈటీ కమాండర్‌గా వ్యవహరిస్తున్న అబ్దుల్ అజీజ్‌కు సన్నిహితుడిగా మారాడు. అబు అలీ 1992 బాబ్రీ విధ్వంసం, 2002 గోద్రా అల్లర్లకు చెందిన సీడీలను తరచూ చూపించడంతో స్ఫూర్తి పొందిన జియా ‘ఉగ్ర’ బాటపట్టి 2002లో శిక్షణ కోసం పాకిస్తాన్ వెళ్లాడు. అక్కడ నెలరోజుల పాటు ఎల్ఈటీ క్యాంప్‌లో శిక్షణ æపొంది ఆపై హైదరాబాద్ చేరుకున్న జియా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఎల్ఈటీకి స్లీపర్‌సెల్‌గా వ్యవహరించాడు. 2005 డిసెంబర్లో ఢిల్లీ రావాల్సిందిగా అజీజ్ నుంచి జియాను ఫోన్ వచ్చింది. అక్కడకు వెళ్లిన జియాకు ఎల్ఈటీ మాడ్యుల్స్ ఓ చైనీస్ మేడ్ తుపాకీ, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్స్, తూటాలు కొరియర్ ద్వారా అందాయి. హైదరాబాద్‌లో ఉన్న జనసమర్థ ప్రాంతాలనే టార్గెట్‌గా విరుచుకుపడాల్సిందిగా ఎల్ఈటీ ఆదేశించింది. అప్పటి నుంచి అదును కోసం చూసిన జియా.. 2006 మే 7న తొలి ఆపరేషన్ నిర్వహించాడు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓడియన్ థియేటర్లో ‘లక్ష్మీ’ చిత్రం సెకండ్ షో నడుస్తుండగా గ్రెనేడ్ విసిరి పరారయ్యాడు. మరో గ్రెనేడ్‌ను డస్ట్‌బిన్‌లో పడేశాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఉదంతం జరిగిన తరవాత కూడా జియా క్యాబ్ డ్రైవర్‌గా నగరంలోనే ఉండి ఆయుధాలతో దాడి కోసం ఎదురు చూశాడు. ఓడియన్ పేలుడు జరిగిన నాలుగేళ్ల తరవాత జియా ఉల్ హక్‌ను నగర పోలీసులు పట్టుకోగలిగారు. -
‘పౌరసత్వం’ పీడ
ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సిద్ధాంతాలకు ఆకర్షితులై అమెరికా, బ్రిటన్ తదితర దేశాలనుంచి సిరియా వెళ్లినవారిలో చాలామందికి ఇప్పుడు భ్రమలు పటాపంచలయ్యాయి. వీరిలో అత్యధికులు కుర్దిష్ గెరిల్లాల దాడుల్లో పట్టుబడినవారు. కొందరు ఇరాక్‌లో సంకీర్ణ సేనల చేతికి చిక్కారు. ఇలా ఐఎస్ బాట పట్టినవారంతా దాదాపు బడికెళ్లి చదువుకునే పిల్లలు. అందరూ వెట్టిచాకిరీతో, నిరంతర హింసతో మానసికంగా, శారీరకంగా దెబ్బతిన్నారు. అయితే ఆడపిల్లలకు అదనపు సమస్యలున్నాయి. వారు అత్యా చారాలు, ఇతరత్రా శారీరక హింసలు ఎదుర్కొని, గర్భవతులై రోగాల్లో చిక్కుకుని మానసికంగా కుంగి పోయారు. కొందరు అబార్షన్లబారినపడ్డారు. పుట్టిన వారు పోషకాహారలేమితో కొన్ని నెలలకే కన్నుమూ శారు. వీరందరికీ తాజాగా మరో ముప్పు ముంచుకొ చ్చింది. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు వీరి పౌర సత్వాన్ని రద్దు చేశాయి. ఈ పిల్లలు ముస్లిం దేశాల నుంచి వలసవెళ్లి స్థిరపడిన కుటుంబాలకు చెందిన వారు. ఈ గడ్డపై పుట్టినవారికి వేరే అభిప్రాయాలు ఏర్పడినంతమాత్రాన పౌరసత్వం ఎలా రద్దుచేస్తారని కొందరు వాదిస్తుండగా... ఇప్పటికీ పశ్చాత్తాపం లేని వారిని కనికరించరాదని మరికొందరి వాదన. పట్టు బడినవారంతా అప్పట్లో తమ నిర్ణయం సరైందేనని, సిరియా, ఇరాక్ తదితర దేశాల్లో పాశ్చాత్య దేశాలు సాగించిన దమనకాండే తమను ఆ దిశగా ఆలోచిం చేలా చేసిందని ఆ పిల్లలు సమర్థించుకున్నారు. -
గప్‌చుప్‌గా ఆన్లైన్లో..
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఐసిస్ సానుభూతిపరుడు, దేశంలో పలు విధ్వం సాల సూత్రధారి ఖదీర్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో కళ్లు చెదిరే వాస్తవాలు తెలుస్తున్నాయి. ఖదీర్ ను ఉగ్రవాద బాటలోకి పట్టించిన అబ్దుల్లా బాసిత్ ఆదేశాల మేరకు ఈ కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా పేలుడు పదార్థాలను ఇత డు కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. 2016నాటి అబుదాబి మాడ్యూల్ కేసులో గతేడాది ఆగస్టులో ఖదీర్, బాసిత్‌లను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటోన్న వీరిపై ఎన్ఐఏ అధికారులు పాటియాలా కోర్టులో అనుబంధ చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా.. విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాల సమీకరణ ఉగ్రవాద సంస్థలకు పెద్ద సవాల్‌గా మారింది. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా వీరిద్దరూ సంప్రదాయేతర విధ్వంసక వనరులపై దృష్టి పెట్టా రు. వీటిని కొనుగోలు చేసే బాధ్యతను బాసిత్ తన ప్రధాన అనుచరుడు ఖదీర్‌కు అప్పగించాడు. దీనిపై ఇంటర్నెట్లో అధ్యయనం చేసిన ఖదీర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫాస్ఫరస్, యూరియా తదితరాలను బాంబుల తయారీకి వినియోగించుకోవచ్చని తెలుసుకున్నాడు. పాతబస్తీలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసి వీటిని సమీకరిం చాడు. షహీన్‌నగర్‌లోని తన ఇంటితో పాటు తన బం ధువు ఇంట్లోనూ వీటిని ఉపయోగించడంపై కొన్ని ప్రయోగాలు చేశాడు. అయితే వీటిని బాంబు లుగా మార్చడంలో ఖదీర్ విఫలమయ్యాడు. ఎన్ఐఏ ఇతడిని అరెస్టు చేసినప్పుడు ఇంటి నుంచి ఈ పదార్థాలతో పాటు ల్యాప్‌టాప్‌నూ స్వాధీనం చేసుకున్నా రు. ఈ పదార్థాలు మార్కెట్లో తేలిగ్గా దొరకడంతో పాటు ఎవరికీ అనుమానం రాదని వీటిని ఎంపిక చేసుకున్నట్లు వీరిద్దరూ ఎన్ఐఏకు తెలిపారు. బాసిత్ ప్రభావంతోనే ఉగ్రబాట జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన అనాథాశ్రమం ఉద్యోగి అబ్దుల్ ఖుద్దూస్ కుమారుడు అబ్దుల్ ఖదీర్. కొద్దికాలం చంద్రాయణగుట్టలో నివసించిన ఖదీర్...బాసిత్ ప్రభావంతోనే ఐసిస్ వైపు ఆకర్షితుడయ్యాడు. 2015లో పదో తరగతి ఫెయిల్ అవ్వడంతో ఓ ఇంటర్నెట్ సెంటర్లో పార్ట్‌టైమ్ ఉద్యోగిగా పని చేశాడు. ఇతడి మేనత్తతో పాటు కొందరు బంధువులు పాకిస్తాన్లో ఉంటారు. గతేడాది ఆగస్టు 10న ఓ శుభకార్యం కోసం కుటుంబంతో కలసి ఖదీర్ అక్కడకు వెళ్ళాల్సి ఉంది. దానికి మూడ్రోజుల ముందే ఎన్ఐఏ విచారణకు హాజరవుతుండటంతో పాక్‌కు వెళ్లడం సాధ్యం కాలేదు. అబుదాబి మాడ్యూల్‌కు సంబంధించిన హ్యాండ్లర్‌తో పాటు ఇతర కీలక కేడర్‌తో ఆన్లైన్ ద్వారా టచ్‌లో ఉండి, సంప్రదింపులు జరిపింది అబ్దుల్లా బాసిత్ అని ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. -
వారిని సరిహద్దుల్లోనే మట్టుబెడతాం..
సాక్షి, ముంబై : మహారాష్ట్ర ఏటీఎస్ అరెస్ట్ చేసిన 9 మంది ఐసిస్ ఉగ్రవాదులు ఉత్తర ప్రదేశ్‌లో ప్రవేశిస్తే వారిని మట్టుబెడతామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాను భగ్నం చేసేందుకు వారు గంగా జలాలను విషపూరితం చేయాలని కుట్ర పన్నారనే అనుమానాల నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర ఏటీఎస్ బృందాన్ని ఆయన అభినందిస్తూ వీరు యూపీలో ప్రవేశిస్తూ తక్షణమే అంతమొందిస్తామన్నారు. ముంబైలో శుక్రవారం జరిగిన 31వ యూపీ వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగి మాట్లాడారు. కుంభమేళాలో విధ్వంసానికి కుట్ర పన్నిన ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా మీరు చాకచక్యంగా వ్యవహరించారని ఈ కార్యక్రమానికి హాజరైన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉద్దేశించి యూపీ సీఎం అభినందించారు. ఐసిస్ ఉగ్రవాదులు యూపీలో ప్రవేశిస్తే వారిని తమ రాష్ట్ర సరిహద్దులోనే మట్టుబెడతామని స్పష్టం చేశారు. అలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్‌లో ఐసీస్ కలకలం.. వ్యక్తి అరెస్ట్
-
ఐఎస్ఐఎస్ కుట్ర భగ్నం
-
భారీ ఉగ్ర కుట్ర భగ్నం
న్యూఢిల్లీ గణతంత్ర వేడుకలకు సరిగ్గా నెల రోజుల ముందు దేశంలో ఉలికిపాటు. దేశంలో భారీ దాడులకు ప్రణాళికలు రచిస్తున్న ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ – నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) చాకచక్యంగా పట్టుకుని వారి కుట్రను భగ్నం చేసింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థ స్ఫూర్తితో వరుస బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు పాల్పడాలని ప్రణాళికలు రచిస్తున్న, హర్కత్–ఉల్–హర్బ్–ఇ–ఇస్లాం (ఇస్లాం కోసం యుద్ధం) అనే సంస్థకు చెందిన 10 మంది అనుమానితులను ఎన్ఐఏ బుధవారం అరెస్టు చేసింది. ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలే వీరి లక్ష్యమనీ, సంస్థలోని సభ్యులంతా 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారేనని వెల్లడించింది. అరెస్టయిన వారంతా ఇప్పటివరకు ఎటువంటి నేర చరిత్రా లేని వారేననీ, ఉత్తరప్రదేశ్‌లోని ఆమ్రోహాకు చెందిన ఓ ముఫ్తీ (ముస్లిం మతాచారాలపై తీర్పులిచ్చే న్యాయ నిపుణుడు) కూడా వీరిలో ఉన్నాడనీ, ఇతనే ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి అని ఎన్ఏఐ ఐజీ అలోక్ మిత్తల్ చెప్పారు. ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, ఆమ్రోహ, లక్నోల్లో సోదాలు జరిపి, స్థానికంగా తయారు చేసుకున్న రాకెట్ లాంచర్ సహా పలు పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. సోదాల అనంతరం హర్కత్–ఉల్–హర్బ్–ఇ–ఇస్లాంకు చెందిన మొత్తం 16 మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వారిని విచారించి 10 మందిని ఇప్పటివరకు అరెస్టు చేసింది. మరింత మంది అరెస్టయ్యే అవకాశం ఉందని అలోక్ మిత్తల్ చెప్పారు. సమాచారంతో ముందస్తుగానే నిఘా సోదాల్లో చేతితో తయారు చేసిన ఆయుధాలు, ఇంకా పరీక్షించాల్సి ఉన్న రాకెట్ లాంచర్, ఆత్మాహుతి జాకెట్ల తయారీకి ఉపయోగించే పదార్థాలు, వంద అలారం గడియారాలు, 12 నాటు తుపాకీలు, వందలకొద్దీ బుల్లెట్లు, వంద మొబైల్ ఫోన్లు, 135 సిమ్‌కార్డులు, ఏడున్నర లక్షల రూపాయల డబ్బు, బాంబు తయారీలో వాడే పొటాషియం నైట్రేట్, పొటాషియం క్లోరేట్, సల్ఫర్ తదితరాలను భారీ మొత్తాల్లో ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఏయే ప్రభుత్వ సంస్థలపై, రాజకీయ నాయకులపై దాడులు చేయాలో ఇప్పటికే వారు రెక్కీ నిర్వహించారనీ, మరికొన్ని రోజుల్లో దాడులు చేయడానికి సిద్ధమయ్యారని అలోక్ చెప్పారు. హర్కత్–ఉల్–హర్బ్–ఇ–ఇస్లాం ప్రణాళికల గురించి తమకు ముందుగానే సమాచారం వచ్చిందనీ, అప్పటి నుంచి వారిపై ఎన్ఐఏ నిఘా పెట్టిందన్నారు. అనుమానిత ఉగ్రవాదులు చాలా వేగంగా బాంబులు తయారు చేస్తూ పోతుండటంతో ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం, ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలోని ఉగ్రవాద వ్యతిరేక దళంతో కలిసి ఎన్ఐఏ వారి కుట్రను బుధవారం భగ్నం చేశామని అలోక్ తెలిపారు. వీరి హిట్ లిస్ట్‌లో ఢిల్లీ పోలీస్, ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయని ఇతర దర్యాప్తు సంస్థలు చెప్పినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై ఎన్ఐఏ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ ‘ఇతర సంస్థలు వారికి ఇష్టమొచ్చింది ఏదైనా చెప్తాయి. ఈ కేసును దర్యా ప్తు చేస్తున్నది మేము. ఆధారాల్లేకుండా మేము అలాంటి వ్యాఖ్యలు చేయలేం’ అని అన్నారు. నెట్లో చూసి నేర్చుకున్నారు! ఎన్ఐఏ ఐదుగురు ఉగ్రవాద అనుమానితులను ఆమ్రోహాలో, మరో పది మందిని ఢిల్లీలో అదుపులోకి తీసుకుంది. పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన నిధులను హర్కత్–ఉల్–హర్బ్–ఇ–ఇస్లాం సభ్యులు సొంతంగానే సమకూర్చుకున్నారంది. ‘పేలుడు పదార్థాల తయారీలో వీరు ఇప్పటికే చాలా పురో గతి సాధించారు. బాంబులను ఇక జతపరచడమే తరువాయి. ఆ తర్వాత రిమోట్ కంట్రో ల్ బాంబులతో, ఆత్మాహుతి దాడులతో, పైప్ బాంబులతో దేశంలో భయోత్పాతం సృష్టించాలనేది వీరి ప్రణాళిక’ అని అలోక్ మిత్తల్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో ముఫ్తీ మహ్మద్ సుహైల్ (29)తోపాటు నోయిడాలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి, హ్యుమానిటీస్‌లో గ్రాడ్యుయేషన్ మూడో ఏడాది చదువుతున్న మరో విద్యార్థి కూడా ఉన్నారని అలోక్ చెప్పారు. మరో ఇద్దరు వెల్డింగ్ పని చేసుకుని జీవనం సాగించేవారన్నారు. ‘దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం హర్కత్ సంస్థను మూడు, నాలుగు నెలల క్రితం సుహైల్ స్థాపించి, వివిధ వ్యక్తులను సభ్యులుగా చేర్చుకున్నాడు. వాట్సాప్, టెలిగ్రాం వంటి యాప్‌ల ద్వారా వారు సంభా షించుకున్నారు. బాంబులు ఎలా చేయాలో వీరికి ఎవరూ శిక్షణ ఇవ్వలేదనీ, ఇంటర్నెట్లో చూసి సొంతంగానే నేర్చుకున్నట్లు ప్రాథమి కంగా తెలుస్తోంది’ అని అలోక్ వివరించారు. సోదాల్లో తమకు ఓ వీడియో లభించిందనీ, బాంబులు ఎలా తయారు చేయాలో సుహైల్ ఇతరులకు సూచనలిస్తూ రూపొందించిన వీడియో అది అని తెలిపారు. విద్యార్థులు.. వెల్డర్లు.. ఇమామ్‌లు న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) భగ్నం చేసిన ఐసిస్ ప్రేరేపిత ఉగ్ర ముఠాలోని సభ్యులంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. వారందరి వయసు 20–35 ఏళ్ల మధ్య ఉంది. అందులో కొందరు విద్యార్థులు కాగా, మరికొందరు వెల్డింగ్, వస్త్ర దుకాణం లాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన సూత్రధారి ముఫ్తీ మహ్మద్ సుహైల్ వారందరినీ ఇస్లాం పేరిట ప్రభావితం చేశాడని ఎన్ఐఏ ఆరోపించింది. వారి వ్యక్తిగత వివరాలిలా ఉన్నాయి. 1. ముఫ్తీ మహ్మద్ సుహైల్ అలియాస్ హజ్రత్ (29): ఈ బృందం వ్యవస్థాపకుడు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన హజ్రత్ స్థానిక మదరసాలో ముఫ్తీగా పనిచేస్తున్నాడు. 3–4 నెలల క్రితం ఈ సంస్థను స్థాపించి ఆన్లైన్లో ఐసిస్ భావజాలాన్ని బోధించాడు. బాంబును ఎలా తయారుచేయాలో అతడు సభ్యులకు వివరిస్తున్న వీడియో ఒకటి వెలుగుచూసింది. 2.అనాస్ యూనస్ (24): జఫ్రాబాద్‌కు చెందిన యూనస్ నోయిడాలోని ఓ ప్రైవేట్ వర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. బాంబులు తయారుచేయడానికి అవసరమైన ఎలక్ట్రికల్ వస్తువులు, బ్యాటరీలను సేకరించాడు. 3.రషీద్ జాఫర్ రఖ్ అలియాస్ జాఫర్ (23): జఫ్రాబాద్‌కు చెందిన ఇతడు బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 4.సయీద్ (28): అమ్రోహాలోని సైదాపూర్ ఇమ్మాకు చెందినవాడు. వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తున్న ఇతడు పిస్టల్స్, రాకెట్ లాంచర్లను తయారుచేశాడు. 5.రాయీస్ అహ్మద్: సయీద్‌కు సోదరుడు. ఇతనికి కూడా వెల్డింగ్ దుకాణం ఉంది. సోదరులిద్దరూ ఐఈడీలను తయారుచేయడానికి 25 కిలోల పేలుడు పదార్థాలు, గన్‌పౌడర్‌ను సేకరించారు. 6.జుబైర్ మాలిక్ (20): జఫ్రాబాద్‌కు చెందిన మాలిక్ ఢిల్లీలోని ఓ యూనివర్సిటీలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 7.జైద్ (22): జుబైర్ సోదరుడు. నకిలీ పత్రాలతో సోదరులిద్దరూ సిమ్ కార్డులు, కనెక్టర్లు, బ్యాటరీలు కొనుగోలు చేశారు. సొంతింటి నుంచే బంగారం దొంగిలించి డబ్బు సమకూర్చుకున్నారు. 8.సాకిబ్ ఇఫ్తికార్ (26): ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌కు చెందినవాడు. బక్సార్‌లోని మదరసాలో ఇమామ్‌గా పనిచేస్తున్నాడు. ఆయుధాలు సమకూర్చుకోవడంలో హజ్రత్‌కు సాయం చేశాడు. 9.మహ్మద్ ఇర్షాద్ (28): ఆటోరిక్షా నడిపే ఇర్షాద్ అమ్రోహా నివాసి. బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు దాచేందుకు రహస్య ప్రాంతాన్ని కనుగొనడంలో హజ్రత్‌కు సాయం చేశాడు. 10. మహ్మద్ ఆజామ్ (35): ఢిల్లీలోని చౌహాన్ బజార్ నివాసి. మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయుధాలు సమకూర్చుకోవడంలో హజ్రత్‌కు సాయం చేశాడు. బుధవారం జఫ్రాబాద్‌లో తనిఖీల్లో పాల్గొన్న ఎన్ఐఏ, ఢిల్లీ పోలీసులు -
మళ్లీ ఐసిస్ కలకలం.. రంగంలోకి ఎన్ఐఏ, 5గురు అరెస్టు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరోసారి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కలకలం రేపుతోంది. ఐసిస్‌కు అనుకూలంగా "హర్కత్ ఉల్ అరబ్ ఏ ఇస్లాం" పేరిట ఓ ఉగ్ర విభాగం పనిచేస్తోందని తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. దీనికి సంబంధించి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్)తో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు.. అమ్రోహ ప్రాంతంలో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితుల్లో ఒకరిని స్థానిక మదర్సా నుంచి అదుపులోకి తీసుకోగా.. మిగతా వారిని అమ్రోహలోని ఇతర ప్రదేశాల్లో ఉండగా అరెస్టు చేశారు. కొత్త పేరుతో దేశంలో వీరు ఐసిస్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు భావిస్తున్న ఎన్ఐఏ అధికారులు.. వీరు దేశంలో విధ్వంసాలకు ఏమైనా కుట్ర పన్నారా? అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.