ఉపాధికోసం పరాయిదేశానికి వెళ్లి అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులు తిరిగివస్తారనే ఆశలు కూలిపోయాయి. ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన ఆ 39 మంది భారతీయులు ప్రాణాలతోలేరని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ మేరకు మంగళవారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటన చేశారు.