Parliament Budget sessions
-
మానవాభివృద్ధి దిశగా!
2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. వ్యవసాయం; సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు; పెట్టుబడి, ఎగుమతుల అభివృద్ధిని వేగవంతం చేయడం, సమ్మిళిత సాధన, ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, మధ్యతరగతి ప్రజల వినియోగ వ్యయ సామర్థ్యం పెంపు లాంటి లక్ష్యాల సాధన ‘వికసిత్ భారత్’ ఆకాంక్షలుగా ఆర్థిక మంత్రి అభివర్ణించారు. నూతన పన్ను వ్యవస్థలో భాగంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు వల్ల ప్రజల వ్యయార్హ ఆదాయాలు పెరిగి, కుటుంబ వినియోగ వ్యయం పెరుగుతుంది. తద్వారా దేశంలో సమష్టి డిమాండ్ పెరిగి, ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది.బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడం ఆహ్వానించద గిన పరిణామం. ఈ చర్య ఆరోగ్య బీమా రంగంపై దీర్ఘకాల ప్రభా వాన్ని కలుగజేస్తుంది. బీమా రంగంలో పెట్టుబడులు పెరగడంతో పాటు పోటీతత్వం పెరిగి బీమా పాలసీల రూపకల్పన, సేవల డెలి వరీలో నవకల్పనలు చోటుచేసు కుంటాయి. తద్వారా వ్యక్తులు, కుటుంబాలు తమ ఆరోగ్య సంర క్షణ వ్యయాన్ని సక్రమంగా నిర్వ హించుకోవడం ద్వారా నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలను పొంద గలుగుతారు. ఆర్థిక సేవల అందు బాటు దేశంలో మానవాభివృద్ధికి దారితీస్తుంది, ఆర్థికాభివృద్ధి వేగ వంతమవుతుంది.ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను విద్యారంగానికి విస్తరించి పెట్టుబడులను ప్రకటించడం ద్వారా దీన్ని భవిష్యత్ సామాజిక – ఆర్థిక ప్రగతికి కారకంగా ప్రభుత్వం గుర్తించింది. అదనంగా పదివేల మెడికల్ సీట్లు, ఐఐటీలలో అదనంగా 6,500 సీట్ల పెంపు, నాణ్యతతో కూడిన శ్రామిక శక్తి పెంపు నవకల్పనలకు దారితీస్తాయి. గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనపై పెట్టు బడులు, ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు దారితీసి, అధిక వినియోగం, మార్కెట్ విస్తరణకు నూతన అవకాశాలు ఏర్ప డతాయి. 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌కు కస్టమ్ సుంకాన్ని మినహా యింపునివ్వడం వల్ల పేషెంట్లపై ఆర్థిక ఒత్తిడి తగ్గి ఆరోగ్య ప్రమాణాలు మెరుగవుతాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీల క్షీణతకు మూలధన వ్యయంలో స్వల్ప పెరుగుదల కారణంగా భావించవచ్చు. 2024–25 ఆర్థిక సంవత్సరం మూలధన వ్యయంతో పోల్చినప్పుడు 2025–26లో మూలధన వ్యయంలో పెరుగుదల 10 శాతం మాత్రమే. ఆర్థికాభివృద్ధికి మూలధన వ్యయంలో పెరుగుదల అధికంగా లేనప్పుడు ఆ ప్రభావం ఉత్పాక రంగాలపై రుణాత్మకంగా ఉండి, వృద్ధి క్షీణతకు దారితీస్తుంది. ప్రభుత్వ కోశ విధానాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లు స్పందిస్తాయి. 2024–25 ఆర్థిక సంవ త్సరం ద్రవ్యలోటు జీడీపీలో 4 శాతంగా నమోదు కావడం, పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు, బాండ్ల రాబడి, ఈక్విటీ మార్కెట్లపై స్వల్పకాల ఒడుదొడుకులను కలుగజేస్తాయి. విదేశీ పెట్టుబడులను భారత్ అధికంగా ఆకర్షించడమనేది ప్రతి పాదిత బడ్జెట్ చర్యలు ఆర్థిక విస్తరణ, రాజకీయ సుస్థిరత, కార్పొరేట్ సంస్థల రాబడుల పెరుగుదలకు దారితీశాయా, లేదా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.ఆదాయపు పన్ను మినహాయింపు వలన పెరిగిన వ్యయార్హ ఆదాయాన్ని, వినియోగదారులు వినియోగ వ్యయంగా మరల్చగలరనే విషయంలోనూ అనిశ్చితి ఉంది. పన్ను రేట్ల తగ్గింపు స్వల్పకాల ప్రయోజనాలకే దారి తీస్తుంది. మరోవైపు అవస్థాపనా సౌకర్యా లపై పెట్టుబడులు అధికవృద్ధి సాధనకు దారి తీస్తాయి.రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వా మ్యంతో వంద జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించడం, సరకు నిల్వ, నీటి పారుదల సౌకర్యాల విస్తరణ, స్వల్పకాల, దీర్ఘకాల వ్యవసాయ పరపతి పెంపు లక్ష్యాలుగా, ‘ప్రధాన మంత్రి ధన్ – ధాన్య క్రిషి యోజన’ పథకాన్ని ప్రకటించారు. భారత్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించి అధిక శాతం రైతులు ఉపాంత, చిన్న కమతాలపై ఆధా రపడి జీవనం సాగిస్తున్నారు. మొత్తం వ్యవసాయ భూమిలో రెండు హెక్టార్ల కన్నా తక్కువ ఉన్న కమతాల వాటా 86 శాతం. కమతాల విస్తీర్ణం తక్కువగా ఉండటం వలన ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించలేకపోతున్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన సంస్క రణలు ముఖ్యంగా మేలు రకమైన వంగడాల వినియోగం,పంటమార్పిడి విధానాన్ని అవలంబించగలిగే సామర్థ్యం తక్కువగా ఉండటానికి రైతులలో ఆధునిక వ్యవసాయ పద్ధతు లపై అవగాహన లేకపోవడంతోపాటు, పరపతి లభ్యత తక్కు వగా ఉండటాన్ని కారణాలుగా పేర్కొనవచ్చు.స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు బడ్జెట్ ప్రతిపాదనలు అనుకూలంగా ఉన్నప్పటికీ లోప భూయిష్ఠ సప్లయ్ చెయిన్ వ్యవస్థ, అసంఘటిత రంగ కార్య కలాపాలు, సంస్థాపరమైన పరపతి లభ్యతలో ఇబ్బందులు అభివృద్ధికి అవరోధంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త ప్రొఫెసర్ అండ్ డీన్, ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఐఎఫ్ హెచ్ఇ, హైదరాబాద్ -
భారత్‌పై అన్ని దేశాల కన్ను
-
పేదలు, మధ్య తరగతిపై లక్ష్మీకటాక్షం
సాక్షి, న్యూఢిల్లీ: పేదలు, మధ్య తరగతి ప్రజలపై సంపదల దేవత లక్ష్మీదేవి కటాక్షం చూపాలని తాను ప్రార్థిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా వర్గాలకు లక్ష్మీదేవి ప్రత్యేకంగా ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ బడ్జెట్లో పేదలు, మధ్య తరగతితోపాటు మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ ప్రాంగణంలో మోదీ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. మహిళలకు సమాన హక్కులు ఉండాలన్నారు. వారిపై వివక్ష అంతం కావాలని ఆకాంక్షించారు. మహిళల గౌరవాన్ని పెంచే చర్యలు చేపట్టబోతున్నామని ప్రకటించారు. ఇప్పటికే మహిళల సాధికారతే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరంచారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పలు చరిత్రాత్మక బిల్లులు, ప్రతిపాదనలపై చర్చించబోతున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. దేశాన్ని మరింత బలోపేతం చేసే చట్టాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. యువ ఎంపీలే విధాన రూపకర్తలు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఎదిగేందుకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు విశ్వాసాన్ని, శక్తిని నింపుతాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని 140 కోట్ల మంది పౌరులు ఈ తీర్మానాన్ని సమష్టిగా నెరవేరుస్తారని ఆయన నొక్కి చెప్పారు. మూడో దఫా ప్రభుత్వంలో భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా సమగ్ర అభివృద్ధి దిశగా మిషన్ మోడ్‌లో ముందుకు సాగుతోందని, ఆవిష్కరణలు, చేరికలు, పెట్టుబడులు స్థిరంగా దేశ ఆర్థిక రోడ్‌మ్యాప్‌కు పునాదిగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశాన్ని బలోపేతం చేసే చట్టాలకు దారితీసే అనేక చరిత్రాత్మక బిల్లులు, ప్రతిపాదనలు ఈ సెషన్లో చర్చిస్తామన్నారు. స్త్రీల గౌరవాన్ని పెంచేలా, ప్రతి మహిళకు సమాన హక్కులు కల్పించడంతోపాటు మతపరమైన చిచ్చుల , వర్గ విభేదాలు లేకుండా చేయడం.. తమ ప్రా«థామ్యాలని ఆయన నొక్కిచెప్పారు. ఈ లక్ష్య సాధన దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. వేగవంతమైన అభివృద్ధిని సాధించడంలో సంస్కరణలు, పనితీరు, మార్పు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. దేశం అపారమైన యువశక్తితో తొణికిసలాడుతోందని, ఈ రోజు 20–25 సంవత్సరాల వయస్సు గల యువత 45–50 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి అభివృద్ధి చెందిన భారతదేశంలో అతిపెద్ద లబి్ధదారులు అవుతారని అన్నారు. వారంతా విధాన రూపకల్పనలో కీలక స్థానాల్లో ఉంటారని, అభివృద్ధి చెందిన భారతాన్ని రాబోయే శతాబ్దంలో గర్వంగా నడిపిస్తారన్నారు. 1930, 1940లలో స్వాతంత్య్రం కోసం పోరాడిన యువతతో వారిని పోల్చారు. యువ ఎంపీలకు ఇది సువర్ణావకాశమని, సభలో వారి చురుకైన భాగస్వామ్యంతో వికసిత్ భారత్‌కు సాక్షులుగా ఉంటారని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రతి ఎంపీ, ముఖ్యంగా యువ ఎంపీలు వికసిత్ భారత్ ఎజెండాకు ఇతోధికంగా కృషి చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సంస్కరణలు, పనితీరు, పరివర్తన’ తమ మంత్రంగా ఉంటుందన్నారు. వేగంగా అభివృద్ధిని సాధిస్తామని, సంస్కరణలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే మార్పు సాధ్యమన్నారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తాము పనిచేస్తామని పేర్కొన్నారు. పదేళ్లలో విదేశీ జోక్యం లేని సమావేశాలివే గడిచిన పదేళ్లలో విదేశీ జోక్యం లేకుండా జరుగుతున్న మొదటి పార్లమెంట్ సమావేశాలు ఇవేనని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతి సమావేశాలకు ముందు విదేశాల నుంచి అగ్గిరాజేయడం పరిపాటిగా వస్తోందని, ఈసారి మాత్రం అలాంటిదేమీ జరుగలేదని విపక్షాలకు చురకలు వేశారు. ‘‘2014 నుంచి నేను గమనిస్తున్నాను. ప్రతి సమావేశానికి ముందు ఇక్కట్లు సృష్టించేందుకు చాలామంది సిద్ధంగా ఉంటారు. ఇక్కడ దేశంలో ఈ ప్రయత్నాలను ఎగదోసే వారికి కొదవలేదు. విదేశీ మూలాల నుంచి ఎలాంటి జోక్యం లేని మొదటి సమావేశం ఇదే’’ అని వ్యాఖ్యానించారు. -
మూడో పర్యాయం.. మూడింతల వేగం
న్యూఢిల్లీ: దేశ అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అసాధారణ వేగంతో పనిచేస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయాలు, విధానాలను అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల్లో వేగంగా మూడు రెట్లు పెరిగిందని అన్నారు. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా అంకితభావంతో ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్‌సభ చాంబర్లో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. 60 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ ప్రగతి ప్రయాణంలో అమృతకాలం నడుస్తోందని, ఇప్పటిదాకా సాధించిన అపూర్వమైన విజయాలతో ప్రభుత్వం దేశానికి నూతన శక్తిని ఇచ్చిందని తెలిపారు. మహా కుంభమేళాలో మౌని అమావాస్య రోజు తొక్కిసలాటలో భక్తులు మరణించడం పట్ల రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు నివాళులరి్పంచారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలను వివరించారు. ద్రౌపదీ ముర్ము ప్రసంగం ఆమె మాటల్లోనే... అప్పుడే అభివృద్ధికి సార్థకత శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో వంద రాకెట్ ప్రయోగాలు పూర్తిచేయడం ప్రశంసనీయం. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న గగన్‌యాన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లే రోజు ఇక ఎంతోదూరంలో లేదు. కోవిడ్–19 మహమ్మారి, ఇతర దేశాల్లో యుద్ధాలు, తద్వారా అంతర్జాతీయంగా అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోంది. మన బలాన్ని ఆర్థిక వ్యవస్థ చాటి చెబుతోంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ఒకే దేశం.. ఒకే పన్ను అనే విధానంతో జీఎస్టీని తీసుకొచ్చింది. దీనితో అన్ని రాష్ట్రాలూ ప్రయోజనం పొందుతున్నాయి. అభివృద్ధి ఫలాలు సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి సైతం అందాలి. అప్పుడే ఈ అభివృద్ధికి ఓ సార్థకత ఉంటుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ప్రభుత్వం 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద 10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. సౌభాగ్య యోజన కింద 80 కోట్ల మందికి రేషన్ సరుకులు అందజేస్తోంది. స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి జల జీవన్ మిషన్‌ను అమలు చేస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో తాము గౌరవంగా జీవించగలమన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది. పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తే.. పేదరికాన్ని జయించగలమన్న ధీమా వారిలో పెరుగుతుంది. ప్రభుత్వ కృషితో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. వారంతా ఒక నూతన మధ్యతరగతి వర్గంగా మారారు. దేశ పురోభివృద్ధికి వారు ఒక చోదకశక్తి. డిజిటల్ విప్లవంలో ముందంజ భారతదేశ సామాజిక, ఆర్థిక, జాతీయ భద్రతకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, డీప్ ఫేక్ వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యను కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి. భౌతికమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూనే సామాజిక మౌలిక సదుపాయాల విప్లవంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత పదేళ్లలో ప్రగతిలో కొత్త అధ్యాయం లిఖించింది. డిజిటల్ విప్లవంలో మనం ముందంజలో ఉన్నాం. డిజిటల్ టెక్నాలజీ రంగంలో ఇండియా అతిపెద్ద గ్లోబల్ ప్లేయర్‌గా అవతరించింది. మన దేశంలో ప్రజలకు 5జీ సరీ్వసులు అందుతున్నాయి. ఇక మన డిజిటల్ చెల్లింపులు ప్రపంచ దేశాలను అబ్బురపరుస్తున్నాయి. ప్రపంచం మొత్తంలో 50 శాతానికి పైగా రియల్–టైమ్ డిజిటల్ లావాదేవీలు మనదేశంలోనే జరుగుతున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వానికి డిజిటల్ టెక్నాలజీని ప్రభుత్వం ఒక సాధనంగా వాడుకుంటోంది. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ‘మహిళల సారథ్యంలో ప్రగతి’ అనేది ప్రభుత్వ విధానం. మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తోంది. 91 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 10 కోట్ల మంది మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆయా సంఘాలకు రూ.9 లక్షల కోట్లు అందజేసింది. వారు ఆర్థిక స్వాతంత్య్రం గణనీయంగా పెంచుకుంటున్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న లక్ష్యంతో నారీశక్తి వందన్ అధినియంను ప్రభుత్వం తీసుకొచ్చింది. రైల్వే నెట్వర్క్ ద్వారా కన్యాకుమారితో కశీ్మర్ అనుసంధానమైంది. ఉధంపూర్–బారాముల్లా–శ్రీనగర్ రైలు ప్రాజెక్టు పూర్తయ్యింది. దేశవ్యాప్తంగా 71 వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రధాన నగరాల సమీపంలో 100కుపైగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం రూ.28,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ దేశంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలని కేంద్రం సంకల్పించింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2023–14లో దేశంలో రికార్డు స్థాయిలో 322 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రభుత్వం రైతులకు రూ.41,000 కోట్లు అందజేసింది. పంటలకు కనీస మద్దతు ధరలను పెంచింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ మన దేశంలోనే ఉంది. ఇప్పటికే వెయ్యి కిలోమీటర్ల మెట్రో రైలు నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. రూ.8,000 కోట్లతో అదనంగా 52,000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నూతన పరిపాలనా విధానానికి సంస్కరణ, పనితీరు, మార్పు అనేవి పర్యాయ పదాలుగా మారాయి’’ అని రాష్ట్రపతి ముర్ము స్పష్టంచేశారు. జమిలి ఎన్నికలపై ముందడుగు‘‘బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అహరి్నశలూ కృషి చేస్తోంది. పేద కుటుంబాలకు ఇళ్లు ఇవ్వబోతోంది. గ్రామీణులకు ప్రాపర్టీ కార్డులు అందజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. 70 ఏళ్లు దాటినవారిలో 6 కోట్ల మందికి ఆరోగ్య బీమా పథకం వర్తింపజేస్తోంది. కీలకమైన జమిలి ఎన్నికలతోపాటు వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రభు త్వం ముందడుగు వేసింది. అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ మాత్రం ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థిరత్వంలో ఒక మూలస్తంభంగా నిలిచింది. ఈ విషయంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారింది. భారతదేశ బలాలు, విధానాలు, ఉద్దేశాల పట్ల ప్రపంచ దేశాలు విశ్వాసం కనబరుస్తున్నాయి. క్వాడ్, బ్రిక్స్, షాంఘై సహకార సంస్థతోపాటు జీ20లో ఇండియాదే కీలకపాత్ర. సమతుల్య అభివృద్ధి అత్యంత కీలకంఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధికి సానుకూల వాతావరణం ఏర్పడింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు ఏమిటో ప్రభుత్వానికి తెలుసు. తాము ఒంటరిమన్న భావనను వారిలో తొలగించడానికి కృషి చేస్తోంది. ఈశాన్యంలో శాంతి సాధన కోసం పదికిపైగా ఒప్పందాలు కుదిరాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సమతుల్య అభివృద్ధి అత్యంత కీలకం. దేశమంతటా అన్ని ప్రాంతాలూ సమానంగా పురోగతి సాధించాలన్నదే కేంద్రం ఉద్దేశం. అండమాన్, నికోబార్ దీవులు, లక్షదీవుల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రారంభించింది. అందరికీ నాణ్యమైన వైద్య సేవలుసమాజంలో అన్ని వర్గాలకు ప్రజలకు తక్కువ రుసుముతో నాణ్యమైన వైద్య సేవలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ చర్యలతో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు క్రమంగా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా 1.75 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాబోయే ఐదేళ్లలో మెడికల్ కాలేజీల్లో కొత్తగా 75 వేల సీట్లు రాబోతున్నాయి. జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం అత్యాధునిక విద్యా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత పదేళ్లలో ఉన్నత విద్యా సంస్థల సంఖ్య భారీగా పెరిగింది. వాటిలో నాణ్యత కూడా మెరుగుపడింది.మధ్య తరగతికి సొంత గూడుప్రభుత్వ పథకాలతో దళితులు, గిరిజనులు, బీసీలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో వారు భాగస్వాములవుతున్నారు. సొంత గూడు కలిగి ఉండాలన్నది మధ్య తరగతి ప్రజల కల. దాన్ని నిజం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గృహరుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు తావులేకుండా ‘రెరా’ వంటి చట్టాలు తీసుకొచ్చింది. ‘అందరికీ ఇళ్లు’ అనేది ప్రభుత్వ లక్ష్యం. -
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
-
బడ్జెట్ సమావేశాలు.. వక్ఫ్ సహా 16 బిల్లులను సిద్ధం చేసిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలువురు కేంద్రమంత్రులు, పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశం సందర్భంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం.. సభ్యులకు అందజేసింది.ఇక, ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లోనే (Budgest Session) వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్‌కు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతోపాటు మొత్తం 16 బిల్లులను సభల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. అలాగే, ఫైనాన్స్ బిల్లు 2025, ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 2025-26 సంవత్సరానికి గాను వివిధ శాఖల పద్ధులపై పార్లమెంటులో చర్చ జరగనుంది. దీనికి సంబంధించిన జాబితాలను అఖిలపక్ష సభ్యులకు అందించింది.ఇదిలా ఉండగా.. వక్ఫ్ చట్టంలో మార్పుల పరిశీలన కోసం ఏర్పాటుచేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ (JPC) ఇటీవల సవరణ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా.. 14 సవరణలను కమిటీ ఆమోదించింది. దానికి సంబంధించిన తుది నివేదికను సిద్ధం చేసి.. తాజాగా లోక్‌సభ స్పీకర్‌కు అందించింది. దీంతో, సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.All party meeting ahead of the #Budget Session begins at the #Parliament House complex. #Budget2025 pic.twitter.com/Pnu3tYuNzb— All India Radio News (@airnewsalerts) January 30, 2025 -
బడ్జెట్ బతుకునిచ్చేనా?
2025, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రేవేశ పెట్టనున్నారు. గత బడ్జెట్లకు భిన్నంగా ఈ బడ్జెట్‌పై అటు కార్పొరేట్ వర్గాలు, ఇటు మధ్యతరగతి – సామాన్య జనాలలో కూడా పెద్ద స్థాయిలో ఆసక్తి, అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ప్రస్తుతం దేశంలో నెలకొంటోన్న ఆర్థిక మాంద్య వాతావరణం. మొన్నటి 2వ త్రైమాసికంలో 5.4 శాతానికి పడిపోయిన వృద్ధి రేటుతో పాటుగా ప్రజల కొనుగోలు శక్తికి కోతలు పెడుతోన్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతోన్న నిరుద్యోగం వంటి అనేకానేక సమస్యల వల్ల నేడు దేశీయ ప్రజల స్థితిగతులపై కారుమబ్బులు కమ్ముతున్నాయి. ఫలితంగా కార్పొరేట్ల అమ్మకాలూ, లాభాలూ కూడా నేలచూపులు చూస్తున్నాయి. కాబట్టి, ప్రస్తుత బడ్జెట్ ప్రజలకు ఉపాధి కల్పించేది, వారి కొనుగోలు శక్తిని పెంచేది, ద్రవ్యోల్బణానికి పరిష్కారం చెప్పేదిగా ఉండాలనేది అందరి ఆకాంక్ష. అయితే, గత మూడున్నర దశాబ్దాలుగా మన దేశంలో అమలవుతూ... గత దశాబ్ద కాలంగా మరింత ముమ్మరం అయిన కార్పొరేట్ల, ధనికుల అనుకూల విధానాలను ఈ బడ్జె ట్లో ప్రభుత్వం విడనాడగలదా అనేది పెద్ద ప్రశ్న. ఈమధ్యే వెలువడిన ప్రత్యక్ష పన్నులూ, పరోక్ష పన్నుల వసూలు గణాంకాలు చూస్తే ప్రభుత్వ విధానాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో స్పష్టమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025) లోని 2024 ఏప్రిల్– నవంబర్ కాలంలో కేంద్ర ప్రభుత్వం తాలూకు వ్యక్తిగత పన్ను ఆదాయ వసూళ్ళు అంతకు ముందరి సంవత్సరం అదే కాలం కంటే 23.5 శాతం పెరిగాయి. కాగా, 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ పెరుగుదల అంచనా 13.6 శాతంగా ఉంది. ఇక 2024 ఆర్థిక సంవత్స రంలో కూడా ఈ వసూళ్ళు... అంచనా కంటే (10.5%) అధికంగా (సుమారు 23 శాతం) ఉన్నాయి. కార్పొరేట్ పన్ను ద్వారా సమకూరే ఆదాయం 2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో 12 శాతం పెరుగుతుందని అంచనా వేసుకోగా... వాస్తవంలో అది అంతకు ముందరి సంవత్సరం కంటే 0.5 శాతం తగ్గింది. 2019–20 కాలంలో కార్పొరేట్ పన్నును 10 శాతం మేర తగ్గించడంతో తగ్గిన వసూళ్ళు, తగ్గిపోయిన కార్పొరేట్ల లాభాల మొత్తాలవంటివి దీని వెనుక ఉన్న కారణాలు.ఏదేమైనా ఇక్కడ కనపడేది మధ్యతరగతి ఉద్యోగస్థులు, వ్యాపారులు, తదితరులు కట్టే వ్యక్తిగత ఆదాయ పన్ను మొత్తాల వసూళ్ళు అంచనాలను మించి పెరగడం... బడా కార్పొరేట్లు కడుతోన్న పన్ను మొత్తాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడం అనేవి... ప్రభుత్వ కార్పొరేట్లు, ధనికుల అనుకూల విధానాలకు తార్కాణాలు. అలాగే, పరోక్ష పన్ను అయిన జీఎస్టీ వసూళ్ళ విషయంలో కూడా 2025 ఆర్థిక సంవత్సరానికి గాను 2 శాతం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తే అది 8.7 శాతంగా ఉండడం గమనార్హం. ప్రభుత్వ విధానాలు జన సామాన్యాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయనేదానికి అంచనాలను మించిన ఈ జీఎస్టీ ఆదాయ పెరుగుదల తార్కాణం. అలాగే, కార్పొ రేట్ అనుకూల ప్రభుత్వ విధానాలకు మరో మచ్చు తునక ఎక్సయిజ్ ఆదాయం కూడా ఈ కాలంలో అంచనాల కంటే తగ్గుముఖం పట్టడం. దీనికి కారణం పెట్రోలియంపై లభించే భారీ లాభాలకు గాను కంపెనీలపై విధించబడే ‘విండ్‌ఫాల్ ట్యాక్స్’ను ఉపసంహరించుకోవడం!ఏ విధంగా చూసినా పెద్ద మనుషులకో నీతి; సామాన్య, మధ్యతరగతి జనానికో నీతిగా ప్రభుత్వ విధా నాలు నడుస్తున్నాయి. అలాగే, ఈ మధ్య కాలంలో ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ స్వయంగా వాపోయినట్లుగా... కార్పొరేట్ కంపెనీల లాభాలు పెరిగిన స్థాయిలో... వాటి కార్మికులూ, ఉద్యోగుల జీతాలు పెర గడం లేదు. అలాగే, 2016 నవంబర్‌లో అమలు జరిగిన పెద్ద నోట్ల రద్దు... 2017లో అమలులోకి వచ్చిన జీఎస్టీ పన్ను విధానాల వల్ల దేశంలో లెక్కకు మించిన స్థాయిలో సూక్ష ్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు మూతపడ్డాయి. అదే విధంగా అనేకమంది సాధారణ వ్యాపారులు జీవనోపా ధిని కోల్పోయారు. ఫలితంగా దేశంలో నిరుద్యోగం పెరిగి పోయింది. అలాగే, 2020లో చుట్టు ముట్టిన కోవిడ్ మహ మ్మారిని ఎదుర్కోవడంలోని వైఫల్యాల వలన కూడా దేశంలో నగర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తిరిగి తరలి వెళ్ళిపోయిన వలస కార్మికులలోని పెద్ద భాగం, నేటికీ తిరిగి నగర ప్రాంతాలకు పూర్తిగా రాలేదు. అంటే, నిజానికి దేశంలోని ఆర్థిక పరిస్థితులు కోవిడ్ ముందరి కాలం నాటి స్థితికి కూడా ఇంకా చేరుకోలేదన్న మాట. స్థూలంగా నేడు, కార్పొరేట్లకు పన్ను రాయి తీలు... ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పేరుతో నజరా నాలు, అలాగే వాటి బ్యాంక్ ఋణాల రద్దు (రైట్ ఆఫ్)లు ఒక ప్రక్క; సామాన్య మధ్యతరగతి జనాలపై ప్రత్యక్ష (ఆదాయపు పన్ను), పరోక్ష పన్నుల (జీఎస్టీ) భారాలు మరో పక్క నేటి ప్రభుత్వ విధానాలుగా ఉన్నాయి. అంటే, మార్కెట్లో తమ కొనుగోళ్ళ ద్వారా కార్పొరేట్ల సరుకులూ, సేవలకు డిమాండ్‌ను కల్పించే జన సామాన్యం కొనుగోలు శక్తిని, చేజేతులా కూలదోస్తోన్న ప్రభుత్వ విధానాలు కూర్చున్న కొమ్మనే నరుక్కునే పిచ్చివాడి తీరుగా ఉన్నాయి. కాబట్టి, ఈ బడ్జెట్లోనైనా మన ‘స్వదేశీ’ విధానాల కేంద్ర ప్రభుత్వం తన తీరును మార్చుకుంటుందా?గమనిక: ఈలోగా, పేద ప్రజానీకానికి ఉపశమనాన్ని ఇచ్చి... వారి కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ ఆదాయం పడిపోతోన్న కోవిడ్ కాలంలో కూడా కొద్దిమేరనైనా ఈ ఆదాయం పెరుగుదలను చూపించగలిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల విధానాలూ... అలాగే 2008 ప్రపంచ ఆర్థికసంక్షోభ కాలంలో కూడా దేశీయ ప్రజల కొనుగోలు శక్తిని కాపాడిన ‘జాతీయ ఉపాధి హామీ పథకం’ వంటి వాటిని మన మధ్యతరగతి వర్గం సానుకూలంగా చూడగలగాలి. నిజానికి ఈ వర్గానికి నష్టం చేస్తోంది ప్రభుత్వాల కార్పొరేట్, ధనికుల అనుకూల విధానాలే కానీ... అవి పేద ప్రజలకు ఇచ్చే కొద్దిపాటి రాయితీలు కాదనేది గుర్తించాలి!డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... రేపు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు అప్డేట్స్
Updates.. ► తమిళనాడు ఎంపీ సురేష్ వ్యాఖ్యలపై రాజ్యసభలో ఖర్గే సీరియస్ కామెంట్స్. రాజ్యసభలో ఖర్గే మాట్లాడుతూ.. దేశాన్ని విచ్చిన్నం చేయాలని ఎవరైనా మాట్లాడితే సహించబోము. అలా మాట్లాడిన వారు ఎవరైనా సరే. భారత్ అంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఒక్కటే. #WATCH | Congress president and LoP Rajya Sabha Mallikarjun Kharge speaks on Congress MP DK Suresh's "...forced to demand a separate country" statement. "...If anyone speaks about breaking the country, we will never tolerate it - irrespective of whichever party they belong to.… pic.twitter.com/LuR3cNjXaT — ANI (@ANI) February 2, 2024 ► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ►లోక్‌సభ నుంచి ఇండియా కూటమి సభ్యుల వాకౌట్ ►పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ►లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభం ►భారత కూటమి నేతలు పార్లమెంటులో జార్ఖండ్ సమస్యను లేవనెత్తాలని నిర్ణయం. ► రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభలలో చర్చ జరుగనుంది. ► నేడు రాజ్యసభలో పలు ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు ► మత్స్యకారుల సంక్షేమ కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎంపీ బీద మస్తాన్ రావు ప్రైవేట్ మెంబర్ బిల్లు ► మత్స్య పరిశ్రమ రంగం అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహకం, మత్స్యకారుల సంక్షేమం కోసం చర్యల కోసం ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని బిల్లు ► సాక్షుల రక్షణ కోసం ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్న ఎంపీ నిరంజన్ రెడ్డి ► క్రిమినల్ కేసుల్లో సాక్షుల రక్షణ కోసం తగిన యంత్రాంగం ఏర్పాటు కోసం బిల్లు ► నేడు ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ సమావేశం ► ఉదయం 10 గంటలకు ఖర్గే అధ్యక్షతన పార్లమెంట్లో సమావేశం ► పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ -
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: రాష్ట్రపతి ప్రసంగం ఇదే..
Live Updates.. ►రాష్ట్రపతి ప్రసంగం అనంతరం రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన ద్రౌపది ముర్ము.. #WATCH | President Droupadi Murmu departs from the Parliament for Rashtrapati Bhavan after concluding her address to the joint session of both Houses on the first day of Budget Session. pic.twitter.com/VKweTcdlBB — ANI (@ANI) January 31, 2024 ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. ►కొత్త పార్లమెంటులో నా తొలి సంతకం ►భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైంది ►శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది ►భగవాన్ బిర్సాముండా జన్మదినాన్ని జన్ జాతీయ దివస్ గా జరుపుకుంటున్నాం ►ఆదివాసీ యోధులను సర్మించుకోవడం గర్వకారణం ►చంద్రుడి దక్షిణధ్రువం పై దిగిన తొలి దేశంగా భారత్ రికార్డు ►ఆదిత్య ఎల్-1 మిషన్ ను భారత్ దిగ్విజయంగా ప్రయోగించింది ►భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1 ప్రవేశించింది. #WATCH | President Murmu speaks on the potential of India's growing tourism sector "Tourism is a sector that provides employment opportunities to the youth. A record number of tourists are reaching the northeast region. There is excitement among people about the Andaman Islands… pic.twitter.com/6ugt4VzHwU — ANI (@ANI) January 31, 2024 ►జీ20 సమావేశాలను భారత్ విజయవంతంగా నిర్వహించింది ►ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారిగా 107 పతకాలు సాధించింది ►ఆసియా పారా క్రీడల్లో భారత్ 111 పతకాలు సాధించింది ►భారత్ లో తొలిసారిగా నమో భారత్ రైలును ఆవిష్కరించాం నారీ శక్తి వందన్ అధినీయం బిల్లును ఆమోదించుకున్నాం. ►నారీశక్తి వందన్ అధినీయం చట్టం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయింపు ►పేదరికి నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్ ముందుకెళ్తోంది ►తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేశాం ►అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని ఆటంకాలు అధిగమించాం ►ఎన్నో ఏళ్ల భారతీయుల కల.. రామమందిర నిర్మాణం సాకారమైంది. #WATCH | Budget session | President Droupadi Murmu says, "My Government is working towards making India, a major space power of the world. This is a mode to make human life better. This is also an effort to increase India's share in the space economy. Important decisions have… pic.twitter.com/ejZ9VHzCgG — ANI (@ANI) January 31, 2024 ►దేశంలో 5జీ నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తోంది ►దేశంలో కొత్త క్రిమినల్ చట్టాన్ని తీసుకొచ్చాం ►ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తో ముందుకెళ్తున్నాం ►రక్షణరంగం, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి ►నా చిన్నప్పటి నుంచి గరీబీ హఠావో నినాదాలు వింటున్నా ►ప్రస్తుతం దేశంలో పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం జరుగుతోంది. ►పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ►రెండు లక్షల అమృత్ వాటికలను నిర్మించాం ►లక్ష కోట్లకు డిఫెన్స్ ఉత్పత్తులు చేరాయి ►డిజిటల్ ఇండియా నిర్మాణం గొప్ప విషయం ►డిజిటల్ ఇండియాలో 46 శాతం అభివృద్ధి సాధించాం ►డిజిటల్ ఇండియాతో బ్యాంకింగ్ లావాదేవీలు సులభతరమయ్యాయి ►రక్షణ రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. ►ఆయుష్మాన్ భారత్ లో 57 కోట్ల మంది భాగస్వామ్యమయ్యారు ►జాతీయ రహదారుల్లో లక్షా 40 వేల కిలో మీటర్లు నిర్మించాం ►39 వందే భారత్ రైళ్లను ఏర్పాటు చేసుకున్నాం ►యువశక్తి, నారీశక్తి, రైతులు, పేదల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ►10 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం ►తక్కువ ధరకు గ్యాస్ సరఫరా చేస్తున్నాం ►కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొన్నాం. ►ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థలున్న దేశం భారత్ ►దేశంలో 10 లక్షల కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించుకుంటున్నాం ►ప్రపంచంలో అత్యంత వేగంగా భారత ఎకానమీ అభివృద్ధి ►రక్షణ, అంతరిక్ష రంగాల్లో నూతన ఆవిష్కరణలు జరిగాయి ►రైల్వే శాఖలో పలు సంస్కరణలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు ►విద్యుదీకరణ, వందే భారత్ రైళ్లతో వేగంగా ప్రయాణికుల రాకపోకలు ►దేశంలో ప్రస్తుతం పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం జరుగుతోంది. ►నా చిన్నప్పటి నుంచి గరీబీ హఠావో నినాదాలు వింటున్నా ►దేశంలో 10 లక్షల కి.మీల గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసుకున్నాం ►ముంబైలో అటల్ సేతు నిర్మించుకున్నాం. ►రూ.7 లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా చేశాం ►సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలు తీసుకొచ్చాం. ►2 కోట్ల మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించారు ►4 కోట్ల 10 లక్షల మందికి పక్కా ఇళ్లు నిర్మించాం ►కిసాన్ సమ్మాన్ ద్వారా 10 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయమందిస్తున్నాం ►కరోనా, యుద్దాల ప్రభావం దేశంలో ధరల పెరుగుదలపై పడకుండా జాగ్రత్తపడ్డాం #WATCH | Budget Session | President Droupadi Murmu says, "In the past years, the world witnessed two major wars and faced a pandemic like Corona. Despite such global crises, my government kept inflation under control in the country and did not let the burden on common Indians… pic.twitter.com/N2aL6sRma8 — ANI (@ANI) January 31, 2024 ►యువతకు లక్షల్లో ఉపాధి అవకాశాలు కల్పించాం ►25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి పైకి తీసుకొచ్చాం ►ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మోదీ సర్కార్ విప్లవాత్మక మార్పులు తెచ్చింది ►లక్షకు పైగా స్టార్టప్స్ ను ఎంకరేజ్ చేశాం ►డీబీటీ కింద రూ.25 లక్షల కోట్లు ప్రజలకు అందించాం ►గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ తో 46 శాతం మనదే ►రక్షణరంగం, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి #WATCH | President Droupadi Murmu says, "My Government believes that the grand edifice of a developed India will stand on four strong pillars – youth power, women power, farmers and the poor." pic.twitter.com/u8C4opfICx — ANI (@ANI) January 31, 2024 ►ఆవాస్ యోజన పథకం ద్వారా సామాన్యులకు నీడ కల్పిస్తున్నాం ►పదేళ్లలో వేల ఆదివాసీ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాం ►ఆదివాసీ గ్రామాలకు శుద్దజలాలు అందిస్తున్నాం ►ట్రాన్స్ జెండర్లకు సమాజంలో గౌరవస్థానం కల్పించాం ►దేశ అభివృద్ధి నాలుగు స్తంభాల పై ఆధారపడి ఉంది ►యువశక్తి, నారీశక్తి, రైతులు, పేదలు అనే స్తంభాలపై ఆధారపడి ఉంది. #WATCH | Budget Session | President Droupadi Murmu addresses a joint session of both Houses at the new Parliament building. She says, "...In the last 10 years, India saw the completion of several works towards national interest that had been awaited by the people of the country… pic.twitter.com/ERbVcaSI7P — ANI (@ANI) January 31, 2024 ►రష్యా-ఉక్రెయిన్, పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్దాల వేళ ద్రవ్యోల్భణాన్ని అదుపుచేశాం ►ఎన్నో సమస్యలున్నా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతున్నాం ►గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహిస్తున్నాం ►సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉన్నాం ►సికిల్ సెల్, ఎనీమియతో బాధపడుతున్న గిరిజనుల కోసం జాతీయ మిషన్ ►జాతీయ మిషన్ కింద ఇప్పటివరకు 1.40 కోట్ల మందికి పరీక్షలు చేయించాం ►ఇంజినీరింగ్, మెడిసన్ కూడా మాతృభాషల్లో చదివే అవకాశం కల్పించాం ►వైద్య కళాశాలల సంఖ్యను గణనీయంగా పెంచాం. #WATCH | 'Make in India' and 'Aatmanirbhar Bharat' have become our strengths, says President Droupadi Murmu. The President also lauds defence production crossing the Rs 1 lakh crore mark. pic.twitter.com/KDkEKZZ3kA — ANI (@ANI) January 31, 2024 ►పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభయ్యాయి. ►పార్లమెంట్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. #WATCH | Budget Session | President Droupadi Murmu arrives at the Parliament for her address to the joint session of both Houses. Sengol carried and installed in her presence. pic.twitter.com/vhWm2oHj6J — ANI (@ANI) January 31, 2024 ►కాసేపట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ►ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ నుంచి పార్లమెంట్‌కు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. #WATCH | President Droupadi Murmu departs from Rashtrapati Bhavan for the Parliament building. The Budget Session will begin with her address to the joint sitting of both Houses. This will be her first address in the new Parliament building. pic.twitter.com/I5KmoSRcKV — ANI (@ANI) January 31, 2024 ►పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. పార్లమెంట్ వద్దకు చేరుకున్న సోనియా. #WATCH | Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives at the Parliament on the first day of the Budget session. pic.twitter.com/pFyrQ11Utp — ANI (@ANI) January 31, 2024 ►నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త పార్లమెంట్లో తొలిసారిగా బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. ►పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నారీ శక్తిని కేంద్రం ప్రతిబింబిస్తోంది. బడ్జెన్‌ను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతుండటం నారీశక్తికి నిదర్శనం. ప్రతీసారి సభను అడ్డుకుంటున్న సభ్యులు.. ఈసారైనా సహకరించాలి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇవే చివరి సమావేశాలు. గత పదేళ్లలో మేము చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసు. #WATCH | Budget Session | PM Narendra Modi says, "...At the end of the first session that was convened in this new Parliament building, the Parliament took a graceful decision - Nari Shakti Vandan Adhiniyam. After that, on 26th Jan we saw how the country experienced the… pic.twitter.com/Oa84GNftCX — ANI (@ANI) January 31, 2024 ►ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయనున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదలచేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ►తొలి రెండు రోజులు ఉభయసభల్లో జీవో అవర్, క్వశ్చన్ అవర్‌ను ఇప్పటికే రద్దు చేస్తూ బులిటెన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఆ తర్వాత రాజ్యసభ, లోక్‌సభలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసిన నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్రపతిపాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూకశ్మీర్ బడ్జెట్‌నూ ఆర్థిక మంత్రి నిర్మల లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. -
రేపట్నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉభయ సభల్లోని పారీ్టల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ అవుతారు. సమావేశాలు ఫిబ్రవరి 9 దాకా కొనసాగుతాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. -
parliament session 2024: 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలంటున్నాయి. 31న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయని సమాచారం. సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. తర్వాతి రోజు ఫిబ్రవరి ఒకటిన ఆరి్ధక మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అవసరమైన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తీసుకునేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మహిళా రైతులను ఆకట్టుకునేలా కీలక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసే ప్రతిపాదన ఉండొచ్చని సమాచారం. మహిళా రైతులకు కిసాన్ నిధిని పెంచితే ప్రభుత్వానికి అదనంగా రూ.12,000 కోట్లు రావచ్చని లెక్కలు వేస్తున్నాయి. ఈ ప్రకటనను ఆరి్ధక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో హైలైట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. -
Budget Session: జనవరి 31 నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
సాక్షి, ఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వివరాల ప్రకారం.. ఈనెల 31వతేదీ నుంచి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 31న రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వంలో ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశాల అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. Parliament Budget Session will be held from 31st January to 9th February. — News Arena India (@NewsArenaIndia) January 11, 2024 -
పార్లమెంట్లో అదే రచ్చ
న్యూఢిల్లీ: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లపై ఏమాత్రం పట్టువీడడం లేదు. బుధవారం సైతం ఎంపీల నినాదాలు, నిరసనల కారణంగా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేంద్రం తీరుకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు నల్లదుస్తులతో హాజరయ్యారు. అదానీ ఉదంతంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేశారు. దాంతో సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 13న ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఉభయ సభల్లో రగడ కొనసాగుతూనే ఉంది. ప్రమాదంలో ప్రజాస్వామ్యం బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు జేపీసీ కోసం నినాదాలు ప్రారంభించారు. ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 దాకా వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమయ్యాక సభ్యుల నినాదాల మధ్యే కేంద్ర పర్యావరణ శాఖ భూపేంద్ర యాదవ్ అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు–2023ను ప్రవేశపెట్టారు. తర్వాత కాంపిటీషన్(సవరణ) బిల్లు–2022 ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి స్థానంలో ఉన్న రమాదేవి ప్రకటించారు. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా సెలవు కాగా, పలువురు సభ్యుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం సభ నిర్వహించవద్దని నిర్ణయించారు. అదానీ–మోదీ భాయి భాయి రాజ్యసభలోనూ ఉదయం సమావేశం ప్రారంభం కాగానే ‘మోదీ–అదానీ భాయి భాయి’ అంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు మొదలుపెట్టారు. అదానీ గ్రూప్‌పై ఆరోపణపై విచారణకు జేపీసీకి డిమాండ్ చేశారు. దాంతో సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. సభ పునఃప్రారంభమైన తర్వాత అటవీ(సంరక్షణ) సవరణ బిల్లు–2023పై జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కమిటీలో బీజేపీ ఎంపీలు అశోక్ బాజ్‌పాయ్, అనిల్ బలూనీ, సమీర్ ఓరావాన్, సీఎం రమేశ్, ఏఐటీసీ ఎంపీ జవహర్ సిర్కార్, బీజేడీ ఎంపీ ప్రశాంత్ నందా, ఎడీఎఫ్ ఎంపీ హిషే లాచూంగ్పా, ఏజీపీ ఎంపీ బిరేంద్ర ప్రసాద్ భైష్యాను సభ్యులుగా నియమించారు. మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. -
20 సెకన్లకే.. లోక్‌సభ వాయిదా
సాక్షి, ఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. ఇవాళ(మంగళవారం) మొదలైన కాసేపటికే ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడ్డాయి. ప్రారంభమైన 20 సెకండ్లకే లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడడం విశేషం. అదానీ వ్యవహారంపై జాయింట్‌పార్లమెంటీ కమిటీని పట్టుబడుతూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో ప్యానెల్ స్పీకర్ మిథున్‌రెడ్డిపై పేపర్లు చించివేశారు విపక్షాల సభ్యులు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారాయన. మరోవైపు పెద్దల సభ(రాజ్యసభ)లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. #BudgetSession: #LokSabha adjourned till 2:00 PM pic.twitter.com/qZksUIX54s — SansadTV (@sansad_tv) March 28, 2023 -
వెనక్కితగ్గని విపక్షాలు.. ఉభయసభలు మంగళవారానికి వాయిదా..
► విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ కూడా మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదాపడింది. సాయంత్రం 4:00 గంటలకు సభ తిరిగిప్రారంభమైనా విపక్ష ఎంపీలు నిరసనలు కొనసాగించారు. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ►విపక్షాల ఆందోళనల నేపథ్యంలో రాజ్యసభ కార్యకలాపాలు రేపటికి వాయిదాపడ్డాయి. మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమైనా.. రాహుల్ గాంధీ అనర్హత వేటుపై విపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించారు. దీంతో ఛైర్మన్ సభను మంగళవారం ఉదయం 11:00 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు లోక్‌సభ సాయంత్ర 4:00 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది. ఢిల్లీ: మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభమైంది. ఉదయం పార్లమెంట్ ప్రారంభమైన వెంటనే విపక్షాల ఆందోళన నేపథ్యంలో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అనంతరం తిరిగి రాజ్యసభ ప్రారంభం కాగా మళ్లీ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ►విపక్షాల ఆందోళనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ సాయంత్రం 4 గంటల వరకు వాయిదా పడగా, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఈరోజు(సోమవారం) ఉదయం పార్లమెంట్ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో కాంగ్రెస్ తీవ్ర ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలోనే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంలో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా చేసిన తీరుపై చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ మేరకు పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. లోక్‌సభలో ఇవాళ కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అలాగే.. రాహుల్‌గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగించనుంది. ఇవాళ పార్లమెంట్లో కాంగ్రెస్ సభ్యులు నిరసన చేపట్టనున్నారు. ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీయాలని కాంగ్రెస్ ఎంపీలకు ఇప్పటికే ఏఐసీసీ పిలుపు ఇచ్చింది. ఇందులో భాగంగా నల్ల దుస్తులతో పార్లమెంట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు నిరసనల్లో కొందరు నల్ల దుస్తులతో కనిపించారు కూడా. ఇదిలా ఉంటే.. ఖర్గే ఆదేశిస్తే తాము రాజీనామాలకు సైతం సిద్ధమని భువనగిరి(తెలంగాణ) ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెబుతున్నారు. ఇవాళ్టి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ప్రతిపక్ష నేతలు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత ఉభయ సభల కాంగ్రెస్ సభ్యులు విడిగా సమావేశం కానున్నారని సమాచారం. ఇదీ చదవండి: మోదీ.. అధికారం వెనుక దాక్కుంటున్నాడు! -
దద్దరిల్లిన పార్లమెంట్.. అదే ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ అక్రమాలపై విచారణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్ నుంచి విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని కించపర్చారని, క్షమాపణ చెప్పాలని బీజేపీ పట్టుబడుతోంది. దీంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం స్తంభించాయి. లోక్‌సభ మంగళవారం ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలన్నారు. దీంతో స్పీకర్ బిర్లా జోక్యం చేసుకున్నారు. అయినా ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. శాంతించాలంటూ సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ విన్నవించారు. అయినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు రాజేంద్ర ప్రకటించారు. రాహుల్ క్షమాపణ చెప్పాలన్న బీజేపీ సభ్యుల నినాదాలతో రాజ్యసభ దద్దరిల్లింది. ప్రజల ఆకాంక్షలను వమ్ము చేయొద్దని సభ్యులకు రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ హితవు పలికారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ప్రతిష్టంభనకు తెరదించడమే లక్ష్యంగా లోక్‌సభ స్పీకర్ మంగళవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. సమస్యను పరిష్కరించే విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో అఖిలపక్ష సమావేశం విఫలమైంది. లోక్‌సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి పలువురు కేంద్ర మంత్రులు లోక్‌సభలో తనపై పూర్తి నిరాధారమైన, అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. వాటిపై సభలో సమాధానం చెప్పే హక్కు తనకు ఉందని అన్నారు. ఈ మేరకు ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ లేఖ రాశారు. కారిడార్లలో విపక్షాల నిరసన అదానీ గ్రూప్ నిర్వాకంపై విచారణకు జేపీసీని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. వివిధ పార్టీల ఎంపీలు, నాయకులు మంగళవారం పార్లమెంట్ హౌస్ కారిడార్లలో నిరసన చేపట్టారు. జేపీసీ కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బ్యానర్లు ప్రదర్శించారు. అదానీ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరసన తెలిపారు. రూ.లక్ష కోట్ల కుంభకోణంలో భాగస్వామి అయిన అదానీని రక్షించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. అంతకంటే ముందు విపక్ష నేతలు సమావేశమయ్యారు. జేపీసీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, జేడీయూ, జేఎంఎం, ఆప్ తదితర పార్టీల నాయకులు ఈ భేటీకి హాజరయ్యారు. రూ.1.48 లక్షల కోట్ల అనుబంధ పద్దుకు ఆమోదం న్యూఢిల్లీ: ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.1.48 లక్షల కోట్ల అదనపు నిధుల ఖర్చుకు సంబంధించిన అనుబంధ పద్దుకు మంగళవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. అదానీ షేర్ల వివాదంపై విపక్ష పార్టీల నిరసనల నినాదాల మధ్యే ఈ పద్దుకు సభ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన మొత్తం రూ.2.7 లక్షల కోట్ల అదనపు పద్దును 13వ తేదీనే ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. అదనపు పద్దుకు సంబంధించి రూ.36,325 కోట్లను ఎరువుల సబ్సిడీ కోసం కేంద్రం ఖర్చుచేయనుంది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ సంబంధిత మాజీ సైనికులకు కేంద్రప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.33,718 కోట్ల బకాయిలను ప్రభుత్వం మొత్తం పద్దులో కలిపింది. -
పార్టీల ఎజెండాలదే పైచేయి
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిష్టంభనకు తెరపడడం లేదు. అధికార, ప్రతిపక్షాలు మెట్టు దిగకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభలో కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభమైనప్పటి నుంచీ ఇదే పరిస్థితి. వరుసగా ఐదో రోజు శుక్రవారం సైతం అరుపులు కేకలతో ఉభయసభలు దద్దరిల్లాయి. భారత ప్రజాస్వామ్యాన్ని విదేశీ గడ్డపై కించపర్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార బీజేపీ సభ్యులు, అదానీ ఉదంతంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ చేశారు. ఎవరూ పట్టు వీడకపోవడంతో అర్థవంతమైన చర్చలకు తావు లేకుండా పోయింది. అధికార, ప్రతిపక్షాల అజెండాలదే పైచేయిగా మారింది. దాంతో మరో దారిలేక ఉభయ సభలను సభాపతులు సోమవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 13న పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. గత ఐదురోజులుగా లోక్‌సభ, రాజ్యసభలో కార్యకలాపాలేవీ సాగలేదు. స్పీకర్ విజ్ఞప్తి బేఖాతర్ లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి ప్రవేశించారు. తమ పార్టీ నేత రాహుల్ గాంధీకి సభలో మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ బిగ్గరగా నినాదాలు మొదలుపెట్టారు. అదానీ గ్రూప్ అక్రమాలపై విచారణ కోసం ప్రభుత్వం జేపీసీ ఏర్పాటు చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. అధికార బీజేపీ సభ్యులు తమ సీట్ల వద్దే లేచి నిల్చున్నారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు ప్రారంభించారు. దాంతో దాదాపు 20 నిమిషాలపాటు సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభకు సహకరించాలంటూ స్పీకర్ ఓం బిర్లా పదేపదే కోరినప్పటికీ ఎవరూ శాంతించలేదు. అలజడి సృష్టించడానికి ప్రజలు మిమ్మల్ని ఇక్కడికి పంపించలేదు, అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తా, సభ సజావుగా నడిచేందుకు సహకరించాలి అని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. సభ్యులెవరూ వినిపించుకోకపోవడంతో సభను ఈ నెల 20వ తేదీ వరకూ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. రాజ్యసభలోనూ అదే పునరావృతం ఎగువ సభలోనూ గందరగోళం కొనసాగింది. కార్యకలాపాలేవీ సాగకుండానే సభ సోమవారానికి వాయిదా పడింది. అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని విపక్ష సభ్యులు కోరగా, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఇరుపక్షాల ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. రూల్ 267 కింద 11 వాయిదా తీర్మానాల నోటీసులు వచ్చాయని, వాటిని అనుమతించడం లేదని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తేల్చిచెప్పారు. సభలో తాను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరగా, చైర్మన్ నిరాకరించారు. అధికార, విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగిస్తుండడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. అంతకంటే ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ సభలో ఒక ప్రకటన చేశారు. ఈ నెల 20 నుంచి రాజ్యసభలో వివిధ కీలక శాఖల పనితీరుపై చర్చించనున్నట్లు తెలిపారు. అదొక కొత్త టెక్నిక్: థరూర్ సంసద్ టీవీలో సౌండ్‌ను మ్యూట్ చేయడం ఒక కొత్త టెక్నిక్ అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఎద్దేవా చేశారు. సభలో ఇకపై ఒక్కో సభ్యుడి మైక్రోఫోన్‌ను ఆపేయాల్సిన అవసరం లేదని, ప్రత్యక్ష ప్రసారంలో శబ్దాలను మ్యూట్ చేస్తే సరిపోతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. లోక్‌సభలో తమ పార్టీ సభ్యుల గొంతు నొక్కేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు. సభలో వారు చేసిన నినాదాలు ప్రత్యక్ష ప్రసారంలో వినిపించకుండా చేశారని విమర్శించారు. అయితే, సాంకేతిక సమస్యల వల్లే సభ్యుల నినాదాలు వినిపించలేదని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. మోదీ, అదానీ బంధమేంటి?: ప్రియాంక ప్రధాని మోదీకి, అదానీకి మధ్య సంబంధం ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకాగాంధీ వాద్రా నిలదీశారు. అదానీపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదని నిలదీశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ట్వీట్ చేశారు. మోదీ, అదానీ బంధంపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీజేపీ మౌనం పాటిస్తోందని తప్పుపట్టారు. గాంధీ విగ్రహం వద్ద విపక్షాల ధర్నా అదానీ వ్యవహారంపై నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష నేతలు శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద ఉమ్మడిగా ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదానీ అంశంపై విచారణకు జేపీసీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడిన తర్వాత జరిగిన ఈ ధర్నాలో కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతోపాటు డీఎంకే, ఆప్, శివసేన(యూబీటీ), జేఎంఎం, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ధర్నా కంటే ముందు ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే చాంబర్లో భేటీ అయ్యారు. ప్రభుత్వంపై ఉమ్మడిగా నిరసన తెలపాలని నిర్ణయించారు. అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని ఖర్గే ట్విట్టర్లో కోరారు. -
పేదరికరహిత భారత్
న్యూఢిల్లీ: ‘‘కేంద్రంలో నిర్భీతితో కూడిన సుస్థిరమైన, నిర్ణాయక ప్రభుత్వముంది. మన ఘన వారసత్వాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్తోంది. దేశాభివృద్ధికి, అన్ని వర్గాల వారి అభ్యున్నతికి నిష్పాక్షికంగా పాటుపడుతోంది. విప్లవాత్మక నిర్ణయాలతో ప్రతి విషయంలోనూ దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోంది’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆమె తొలిసారి ప్రసంగించారు. 2047కల్లా పేదరికరహిత దేశంగా భారత్ స్వావలంబన సాధించేలా చూడటమే నరేంద్ర మోదీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి అతి పెద్ద శత్రువైన అవినీతిపై నిరంతరం రాజీ లేని పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. ఫలితంగా అవినీతిపరులపై ఎలాంటి సానుభూతీ చూపొద్దన్న సామాజిక స్పృహ పెరుగుతోందన్నారు. ఆత్మనిర్భర భారతాన్ని సాకారం చేసేందుకు వచ్చే పాతికేళ్ల అమృత కాలంలో ప్రజలంతా తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వ విజయాలను రంగాలవారీగా గణాంకాల సాయంతో వివరిస్తూ రాష్ట్రపతి గంట పైగా ప్రసంగించారు. ముఖ్యాంశాలు... ►మోదీ సర్కారు తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో విజయాలు, సానుకూల మార్పులు సాధించింది. ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో ఇనుమడింపజేయడం వాటిలో ముఖ్యమైనది. ►సమున్నత ఆకాంక్షలతో గొప్ప లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించే దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. నిజాయతీకి పెద్దపీట వేస్తోంది. భారీ కుంభకోణాలు, ప్రభుత్వ పథకాల అమలులో అంతులేని అవినీతికి మంగళం పాడాలన్న జనాకాంక్షలను నిజం చేసి చూపిస్తోంది. ►పేదల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి వారిని సాధికారపరిచేందుకు కృషి చేస్తోంది. ►ఇన్నొవేషన్, టెక్నాలజీలను ప్రజా సంక్షేమానికి సమర్థంగా వినియోగిస్తూ కనీవినీ ఎరగని వేగంతో దూసుకెళ్తోంది. ఫలితంగా పేదలకు రోజుకు 11 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. 55 వేల గ్యాస్ కనెక్షన్లు అందుతున్నాయి. ఒక్క ముద్రా పథకం ద్వారానే రోజూ రూ.700 కోట్లకు పైగా రుణాలందుతున్నాయి. 300 పై చిలుకు పథకాల ద్వారా లబ్ధిదారులకు ఖాతాల ద్వారా నేరుగా నగదు అందుతోంది. ►ప్రజలకు దశాబ్దాల పాటు కలగానే మిగిలిన మౌలిక సదుపాయాలెన్నో పరిపూర్ణంగా అందుతున్నాయి. ►అటు సాంకేతికంగా, ఇటు సాంస్కృతికంగా దేశంలో అద్భుతమైన ప్రగతి చోటుచేసుకుంటోంది. మన డిజిటల్ ప్రగతి అభివృద్ధి చెందిన దేశాలకూ ఆదర్శంగా మారింది. ►అవసరాలకు అనుగుణంగా సత్వరం విధానాలను, వ్యూహాలను సమూలంగా మార్చుకునే ప్రభుత్వ సంకల్ప శక్తికి సర్జికల్ దాడులు మొదలుకుని ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్‌ల రద్దు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం, నియంత్రణ, వాస్తవాధీన రేఖల వద్ద శత్రువుల ప్రతి దుస్సాహసానికీ దీటుగా బదులివ్వడం వంటివన్నీ తార్కాణాలుగా నిలిచాయి. సైన్యాన్ని ఆధునీకరించేందుకు పెద్దపీట వేశాం. ►ఫలితంగా విధాన వైకల్యంతో కుంగిపోయే రోజులు పోయి శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా రాణిస్తూ ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. ►అంతర్జాతీయ వేదికపైనా తనదైన కీలక పాత్ర పోషించేందుకు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తోంది. సమస్యల పరిష్కారానికి ఇతర దేశాల వైపు చూసే స్థితి నుంచి ప్రతిష్టాత్మక జి–20 కూటమి సారథిగా ప్రపంచ సమస్యల పరిష్కారానికి నడుం బిగించే స్థాయికి ఎదిగింది. ►రక్షణ, వైమానిక రంగాల్లోనూ గొప్ప ప్రగతి సాధించాం. అగ్నివీర్ పథకం యువతకు దేశ సేవ చేసేందుకు గొప్ప అవకాశంగా మారింది. ►మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ రూపుమాపేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చింది. ఫలితంగా సైన్యంతో పాటు అన్ని రంగాల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. తొలిసారిగా మహిళల జనాభా పురుషులను మించిపోయింది. పీఎం కిసాన్ లబ్ధిదారుల్లోనూ 3 లక్షలకు పైగా మహిళలే! ►బంజారాలు, ఇతర సంచార జాతుల సంక్షేమానికి తొలిసారిగా బోర్డు ఏర్పాటైంది. ►అటు అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఇటు అత్యాధునిక పార్లమెంటు భవన నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక, యాత్రా స్థలాల అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతోంది. ►మన యోగ, ఆయుర్వేదం ప్రపంచమంతా విస్తరిస్తున్నాయి. ►శిలాజేతర వనరుల ద్వారా 40 శాతం విద్యుదుత్పాదన లక్ష్యాన్ని తొమ్మిదేళ్లు ముందే చేరుకున్నాం. ►ఉగ్రవాదంపై మనం తీసుకున్న కఠిన వైఖరిని ప్రపంచమంతా స్వాగతిస్తోంది. ►ఆయుష్మాన్ భారత్ ద్వారా జనాభాలో ఏకంగా 50 కోట్ల మందికి ఉచిత చికిత్స అందింది. ప్రజలకు రూ.80 వేల కోట్లు మిగిలాయి. కొత్తదనం కొరవడింది రాష్ట్రపతి ప్రసంగంపై ఖర్గే బీజేపీ సర్కార్ ఎప్పుడూ చెప్పే విషయాలనే మళ్లీ రాష్ట్రపతి తన ప్రసంగం ద్వారా పునరుద్ఘాటించారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పెదవి విరిచారు. ‘దేశం అద్భుతంగా పురోగమించిందని రాష్ట్రపతి ప్రసంగం ద్వారా కేంద్రం చెప్పించింది. అదే నిజమైతే అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పేదలు ఇంకా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? పథకాల ఫలాలు ఎందుకు అణగారిన వర్గాల దాకా చేరడం లేదు? కొత్త కాలేజీలు, స్కూళ్లన్నీ ప్రైవేటురంగంలో వచ్చినవే. వాటి భారీ ఫీజుల వల్ల పేదలకు ఎలాంటి లబ్ధిచేకూరలేదు’ అని ఆరోపించారు. అవినీతి అంతమైతే ఒకే వ్యక్తి రూ.1 లక్ష కోట్ల విలువైన షేర్ల పెట్టుబడుల ద్వారా ఎల్ఐసీ/ఎస్బీఐలను ఎలా మభ్యపెట్టగలిగాడు? మోదీకి ఆప్తుడైన ఆ ఒక్కడి చేతిలోకే తమ పెట్టుబడులు తరలిపోయాయని 30 కోట్ల మంది గగ్గోలు పెడుతున్నారు’’ అంటూ ఖర్గే విమర్శించారు. -
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు, రెండో విడతలో మార్చి 6 నుంచి తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 6న ముగియనున్నాయి. తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, వార్షిక బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది. ఇదీ చదవండి: ఒడిశాలో మిస్టరీ మరణాల కలకలం.. మరో రష్యా పౌరుడు మృతి -
పార్లమెంట్ వేదికగా మహిళా ఎంపీపై దాడి.. వీడియో వైరల్
డాకర్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనూహ్య సంఘటన జరిగింది. ఓ మహిళా చట్ట సభ్యురాలిపై మరో ఎంపీ చేయి చేసుకున్నాడు. ఇష్టారీతిన దాడి చేశాడు. ఈ సంఘటన ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అధికార కూటమి బెన్నో బాక్ యకార్(బీబీవై)కి చెందిన మహిళా చట్టసభ్యురాలు అమి డైయే గ్నిబీపై.. ప్రతిపక్ష ఎంపీ మస్సాటా సాంబ్ చేయి చేసుకున్నాడు. దాడి చేసిన క్రమంలో పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పక్షాల ఎంపీలు కుర్చీలు, పేపర్లు విసురుకున్నారు. తనపై దాడి చేసిన సాంబ్పై కుర్చీ విసిరి పడిపోయారు గ్నిబీ. ఇరువురిని వేరు చేసేందుకు మరికొంత మంది ఎంపీలు ప్రయత్నించారు. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైన క్రమంలో సమావేశాలను వాయిదా వేశారు. అధ్యక్షుడు మాకి సాల్ మూడోసారి ఎన్నికను గ్నీబి వ్యతిరేకించారు. మరోవైపు.. సాంబ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన క్రమంలో ఆయన ఆమె వద్దకు వచ్చి దాడి చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఏడాది జులైలో జరిగిన ఎన్నికల్లో అధికార కూటమికి మెజారిటీ రాకపోవటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు నేతలు. ❗*Chaos in Senegal Parliament after MP Slaps Female Colleague* The brawl began when opposition member Massata Samb walked over and slapped Amy Ndiaye Gniby - an MP of the ruling coalition - during a budget presentation, TV footage showed. pic.twitter.com/9Y074xSVTS — Daniel Marven (@danielmarven) December 2, 2022 ఇదీ చదవండి: మస్క్లో ప్రవహించే రక్తం సగం చైనాదే!.. ఎలన్ మస్క్ పుట్టుకపై తీవ్ర వ్యాఖ్యలు -
బడ్జెట్ సమావేశాలపై బులెటిన్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభ కార్యకలాపాలకు సంబంధించి సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల చేసింది. ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అరగంట ప్రభుత్వ బిజినెస్ ఉంటుంది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 11 వరకు లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశం కానుంది. -
బడ్జెట్ సమావేశాలపై వెంకయ్య, ఓం బిర్లా సమాలోచనలు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌ను సురక్షితంగా ఎలా చేపట్టాలనే అంశంపై సోమవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమాలోచనలు జరిపారు. సుమారు 400 మంది పార్లమెంట్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష జరిపి రానున్న బడ్జెట్ సెషన్‌ను సురక్షితంగా జరిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వెంకయ్య, ఓం బిర్లా ఉభయసభల సెక్రటరీ జనరళ్లను ఆదేశించారు. ఈ మేరకు పార్లమెంట్ భవన సముదాయంలో వచ్చే రెండు, మూడు రోజుల్లో విస్తృతంగా డిస్ ఇన్ఫెక్షన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు కాకున్నా, సాధారణంగా జనవరి చివరి వారంలో ఈ సెషన్ ప్రారంభమవుతుంది. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను అమలు చేస్తూ 2020 వర్షాకాల సెషన్లో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ కార్యకలాపాలు జరిగిన విషయం తెలిసిందే. -
విదేశాల్లో నేరుగా భారత కంపెనీల లిస్టింగ్
ముంబై: భారత కంపెనీలు నేరుగా విదేశీ స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అయ్యేందుకు అవసరమైన చట్ట సవరణలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టొచ్చంటూ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. పలు స్టార్టప్‌లు (యూనికార్న్‌లు) నేరుగా విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు అవకాశాలు కల్పించాలని కోరుతూ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాయడం గమనార్హం. ‘‘భారత సంస్థలు నేరుగా విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు అనుమతి ఉంది. కాకపోతే ఇందుకు సంబంధించి కొన్ని అంశాలను పరిష్కరించాల్సి ఉంది. ఈ దిశగా అనుమతించాలని కోరిన సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నాం’’ అని తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు ఏటా జనవరి చివర్లో ప్రారంభమై రెండు దశల్లో కొనసాగుతాయని తెలిసిందే. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో (ఐఎఫ్ఎస్సీ) సెక్యూరిటీలను లిస్ట్ చేసేందుకు ఎటువంటి అనుమతులు అవసరం లేదని తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. భారత కంపెనీలు విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తే అది పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా.. నిధుల సమీకరణను సులభతరం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత కంపెనీలు నేరుగా విదేశీ స్టాక్ ఎక్సేంజ్‌ల్లో, అదే మాదిరి విదేశీ కంపెనీలు భారత స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్టింగ్‌కు అనుమతించాలని సెబీ 2018లోనే ప్రతిపాదించింది. ధరల స్పీడ్‌కు వంట నూనెలు, పప్పుదినుసులే కారణం ముంబై: వంట నూనెలు, పప్పు దినుసుల ధరల తీవ్రత వల్లే మొత్తం ద్రవ్యోల్బణం రేటు తీవ్రంగా ఉంటోదని తరుణ్ బజాబ్ పేర్కొన్నారు. మార్కెట్లో వాటి లభ్యత పెంపు, సరఫరాల వ్యవస్థ మెరుగుదల, సుంకాల తగ్గింపు వంటి చర్యల ద్వారా ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్రం ప్రయత్నిస్తుందని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.అలాగే పంట దిగుబడి ఒకసారి అందుబాటులోకి వచ్చాక సమస్య మరికొంత దిగివస్తుందన్న భరోసాను ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం నిర్దిష్ట శ్రేణిలో కొనసాగుతుందన్న అంచనాలను వెలువరించారు. చదవండి : మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు -
బడ్జెట్ రైలు ఏపీలో ఆగేనా!
సాక్షి, అమరావతి: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రకటించే రైల్వే బడ్జెట్‌పై ఏపీ వాసులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో అధిక శాతం ఆదాయం ఏపీ నుంచే లభిస్తోంది. కానీ ఆ మేరకు ఏపీకి రైల్వే పరంగా నిధులు, పనులు మాత్రం మంజూరు కావడం లేదు. ఈ సారైనా ఏపీలో రైల్వే ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించేందుకు, పూర్తి చేసేందుకు కేంద్ర బడ్జెట్ పచ్చ జెండా ఊపుతుందా? అని రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధాన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలి. నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గంలో పురోగతి ఉంది. పిడుగురాళ్ల–శావల్యాపురం మధ్య 46 కి.మీ. రైల్వే లైన్ పూర్తయింది. విజయవాడ–గుడివాడ–మచిలీపట్నం–భీమవరం–నర్సాపురం–నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ పనుల్లో ఈ ఆర్థిక ఏడాది 106 కి.మీ. మేర విద్యుదీకరణ మార్గం పూర్తయింది. గత బడ్జెట్లో ఈ రైలు మార్గానికి రూ.1,158 కోట్లు కేటాయించారు. గత పదేళ్లలో ఈ ప్రాజెక్టుకు రూ.970 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని బట్టి చూస్తే కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతానికి విశాఖపట్నంతో కనెక్టివిటీ పెంచడానికి ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టమైంది. రాష్ట్రంలో నర్సరావుపేట–మచిలీపట్నం, కంభం–ఒంగోలు, చిత్తూరు–కుప్పం వయా పలమనేరు, ఓబులవారిపల్లె–వాయల్పాడు రైల్వే లైన్లకు సర్వేపై బోర్డు ఏమీ తేల్చడం లేదు. కోస్తా రైల్వే లైన్ అయిన మచిలీపట్నం–బాపట్లకు కనెక్టివిటీ కోసం సర్వే చేసి అంచనా వ్యయం రూ.793 కోట్లుగా తేల్చినా నివేదికను పక్కన పెట్టారు. కడప–బెంగళూరు కొత్త రైలు మార్గానికి గత బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అయితే ఈ దఫా ఈ మార్గం పూర్తి చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. గతంలో గూడూరు–దుగరాజపట్నం రైల్వే లైన్‌కు నిధులు కేటాయించలేదు. గత బడ్జెట్లో తెలంగాణ కంటే ఏపీకే ప్రాధాన్యత కేంద్ర బడ్జెట్లో గత ఏడాది రైల్వే శాఖకు కేటాయించిన నిధుల్లో ఏపీకి తెలంగాణ కంటే సింహభాగం కేటాయింపులు దక్కాయి. గత బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.6,846 కోట్ల కేటాయింపుల్లో ఏపీకి సంబంధించి కొనసాగుతున్న ప్రాజెక్టులకు రూ.4,666 కోట్లు కేటాయించారు. ధర్మవరం–పాకాల–కాటా్పడి (290 కి.మీ.) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.2,900 కోట్లు, గుంటూరు–బీబీనగర్ (248 కి.మీ.) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.2,480 కోట్ల అంచనాలతో ఈ రెండు ప్రాజెక్టుల్ని మంజూరు చేశారు. ఈ దఫా కొత్త రైలు మార్గాలపై కోటి ఆశలున్నాయి. ఏపీలో డబ్లింగ్ ప్రాజెక్టులతో రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. మంగళగిరి–అమరావతి కొత్త లైన్ మార్గం లాభసాటి కాదని రైల్వే బోర్డు ఓ నిర్ణయానికి వచ్చింది. -
ఆర్థిక సర్వే : 11 శాతంగా జీడీపీ వృద్ధి
సాక్షి , న్యూఢిల్లీ: కరోనాసంక్షోభం, వాక్సినేషన్, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ దశాబ్దంలో తొలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలిరోజు కోవిడ్ సంబంధిత నిబంధనలతో కొలువు దీరిని ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. మెగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియతో శరవేగంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందనుందని ఆర్థిక సర్వే అభిప్రాయ పడింది. దీంతో లోక్‌సభ ఫిబ్రవరి 1 వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. మరోవైపు ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఏఈ) డాక్టర్ వి. కృష్ణమూర్తి సుబ్రమణియన్ ఈ రోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆర్థిక సర్వే : 2020-21 2020-21పూర్తి ఆర్థిక సంవత్సరానికిగాను వీ షేప్ రికవరీ ఉంటుందని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2021 - మార్చి 2022 వరకు) జీడీపి వృద్ధి 11 శాతంగా అంచనా వేసింది. వ్యవసాయ రంగంపై కరోనా వైరస్ ప్రభావం పడలేదు. అన్ని రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి నమోదు చేసిందని తెలిపింది. కాంటాక్ట్ ఆధారిత సేవలు, తయారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ వినియోగం, నికర ఎగుమతుల క్షీణత ఆర్థికవృద్ధిని బాగా ప్రభావితం చేశాయి. అయితే ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం రానున్న రెండేళ్ళలో వేగంగా దేశీయ ఆర్థికవ్యవస్థ పుంజుకోనుంది. 17 సంవత్సరాల్లో తొలిసారిగా 2021 ఏడాదిలో జీడీపీలో కరెంట్ ఖాతా మిగులు 2 శాతంగా ఉంటుంది. నిరుపేదలను పేదరికం నుంచి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికవృద్ధిపై దృష్టి పెట్టాలని కోరింది. కరోనా నేపథ్యంలో హెల్త్ కేర్ రంగంపై మరింత దృష్టి కేంద్రీ కరించాల్సి ఉందని సర్వే సూచించింది. అలాగే చురుకైన కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీలకు పిలుపు నిచ్చింది. ఆర్థిక సంక్షోభాలను పరిష్కరించే క్రమంలో రాజులకాలంనాటి పురాతన మార్గాలను ఉదాహరించింది. వినియోగాన్ని భారీగా పెంచాలని సాధారణ సంవత్సరాలతో పోలిస్తే మాంద్యం సమయంలో, మెండైన ఉపాధి అవకాశాల కల్పనతోపాటు, ప్రైవేటు రంగం ఆర్ధిక సంపదను మెరుగుపర్చడాకి కృషి చేయాలని శుక్రవారం విడుదల చేసిన సర్వే సిఫారసు చేసింది. కాగా కోవిడ్-19 విస్తరణ, పలువురు సభ్యులకు కరోనా సోకిన ఆందోళనల మధ్య వర్షాకాల సమావేశాలను కుదించారు. అలాగే శీతాకాల సమావేశాలను రద్దు చేసిన తరువాత జరుగుతున్న ఈ పార్లమెంటు సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీనికి తోడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని 17 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించినట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సెషన్ తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. రెండో విడత సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే. -
ఫిబ్రవరి 1వ తేదీకి లోక్‌సభ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభం, వాక్సినేషన్, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ దశాబ్దంలో తొలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉభయ సభలు కొలువు దీరాయి. సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా లక్షలాది పౌరుల ప్రాణాలను కరోనానుంచి కాపడగలిగామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త కేసుల సంఖ్య వేగంగా తగ్గుతోందని, అలాగే రికవరీల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం ముగిసింది. జాతీయ గీతాలాపన అనంతరం ఆయన సభనుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రులు, ఇతర సభ్యులు రాష్ట్రపతికి వీడ్కోలు చెప్పారు. నిర్మలా సీతారామన్ ఆర్థికసర్వే-2021ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా పడింది. రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ► ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత జమ్ము కాశ్మీర్ ప్రజలకు కొత్త అధికారం దక్కింది. ► సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఈఓడీబీలో భారత్ ర్యాంక్ మెరుగుపడింది. ► ఒకప్పుడు ఇక్కడ రెండు మొబైల్ తయారీ ఫ్యాక్టరీలు మాత్రమే ఉండేవి. ► స్మార్ట్‌ఫోన్ తయారీలో ఇప్పుడు మనం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నాం. ► రెరాతో రియల్ ఎస్టేట్ రంగానికి మేలు ► ఇస్రో గగన్ యాన్, చిన్న శాటిలైట్లను పంపే ప్రయోగాలు విజయవంతం. ► పారిశ్రమిక రంగంలో పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంది. ► వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకువచ్చాం. ► కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణంతో, ప్రతీసభ్యుడు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా మెరుగైన సౌకర్యాలు పొందుతారు. ► కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి గత ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేశాయి. కానీ యాదృచ్చికంటగా స్వాతంత్య్రం వచ్చి 75వ సంవత్సరానికి చేరుకుంటున్న తరుణంలో కొత్త పార్లమెంట్ హౌస్ నిర్మాణం ప్రారంభం కావడం సంతోషకరం. ► జాతి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ► భారతదేశ సౌర్వభౌమత్వాన్ని కాపాడటం కోసం వాస్తవాధీన రేఖ వెంబడి అదనపు బలగాలను మోహరించాం. ► గల్వాన్ లోయలో గత ఏడాది చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్ల వీరమరణం మరువలేనిది. ► దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాన్ని ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకుంటారు. ► కరోనా మహమ్మారి నుంచి ప్రతి పౌరుడిని కాపాడుకుంటూ, ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకుంటున్నాం. ► ఈ కరోనా టైంలోనూ ప్రపంచ పెట్టుబడిదారులకు భారతదేశం ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలిచింది. ► కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లోకి లక్షా 13వేల కోట్లు బదిలీ ► ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జరుగుతోంది ► రెండు వ్యాక్సిన్లు కూడా భారత్‌లోనే రూపొందించారు ► కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఉపయోగం ► కొత్త చట్టాలతో రైతులకు విస్తృత అవకాశాలు ► రైతులకు మరింత లబ్ధి కలిగించేందుకే కొత్త చట్టాలు తీసుకొచ్చాం ► కొత్త చట్టాలతో 10 లక్షల మంది రైతులకు తక్షణ ఉపయోగం ► ఎర్రకోట ముట్టడి ఘటన దురదృష్టకరం: రాష్ట్రపతి కోవింద్ ► క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మనిర్భర ప్యాకేజీ వరంగా మారింది ► గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మా ప్రభుత్వ ధ్యేయం ► రైతుల అభివృద్ధి కోసం కిసాన్ రైలు తీసుకొచ్చాం ► మత్స్యకారుల కోసం కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు ► దేశవ్యాప్తంగా 24వేల ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ భారత్ సేవలు ► జనఔషధి పరియోజన్ ద్వారా దేశవ్యాప్తంగా పేదలకు చౌకగా ఔషధాలు ► వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ► మత్స్యకారుల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.20వేల కోట్ల వ్యయం ► 3 వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం గౌరవిస్తుంది ► గణతంత్ర దినోత్సవం రోజున హింస జరగడం బాధాకరం. దేశానికి ఎంతో పవిత్రమైన జాతీయ జెండాకు అవమానం జరిగింది. ► భావ ప్రకటనా స్వేచ్ఛా హక్కును కల్పించడంతోపాటు చట్టాలను గౌరవించాలని కూడా రాజ్యాంగం బోధిస్తుంది ► ప్రతి సమస్యను దేశమంతా ఒక్కటిగా ఎదుర్కొంది. ► తుపాన్ల నుంచి బర్డ్‌ఫ్లూ వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. ► కరోనా తర్వాత కొత్త సామర్థ్యంతో శక్తివంతమైన దేశంగా భారత్ నిలిచింది. ► ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాం. ► సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలిచాం. ► కరోనాపై పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం. ► సమయానుకూల చర్యలతో కరోనాను కట్టడి చేయగలిగాం. ► మానవత్వంతో కరోనా వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపించాం. ► పేదల కోసం వన్ నేషన్, వన్ రేషన్ కార్డు అమలు చేశాం. ► జన్‌ధన్ యోజన ద్వారా నేరుగా అకౌంట్లోకి నగదు బదిలీ చేశాం. ► ఆరు రాష్ట్రాల్లో గ్రామీణ్ కల్యాణ్ యోజన అమలు చేశాం. ► 14 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ► దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ► దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లు ఇతర దేశాలకు సరఫరా అవుతున్నాయి ► ఆరేళ్ల కాలంలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగాయి. ► సన్నకారు రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషిచేస్తోంది. ► కోటిన్నర మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్. ► దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. ► దేశంలోని 24,000 ఆసుపత్రులలో ఆయుష్మాన్ భారత్ యోజన సౌకర్యాలను పొందవచ్చు. ► దేశవ్యాప్తంగా 7000 కేంద్రాల్లో పేదలు చాలా తక్కువ ఖర్చుతో మందులు పొందుతున్నారు. ► కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న పోరులో చాలా మంది పౌరులను కోల్పోయాము. ప్రధానంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ కాలంలోనే కన్నుమూశారు. కోవిడ్ కారణంగా ఆరుగురు ఎంపీలు మనల్ని విడిచి వెళ్లారు. వారందరికి నివాళులు అర్పిస్తున్నాం. కాగా, రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రైల్వే బడ్జెట్‌ను కూడా యూనియన్ బడ్జెట్లోనే కలిపి ప్రకటించనున్న సంగతి తెలిసిందే. -
ఈ దశాబ్దం చాలా కీలకం : ప్రధాని మోదీ
సాక్షి,న్యూఢిల్లీ: దశాబ్దంలో తొలి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి సంబంధించి ఈ దశాబ్దం కాలా కీలకమైందని మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఈ దశాబ్దం చాలా ముఖ్యమైనది. స్వాతంత్య్ర సమరయోధుల కలలను నెరవేర్చేందుకు ఇదొక సువర్ణావకాశమని ఆయన పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో 2020 లో మొట్టమొదటిసారిగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4-5 మినీ బడ్జెట్లను వివిధ ప్యాకేజీల రూపంలో సమర్పించాల్సి వచ్చింది. ఈ బడ్జెట్ కూడా 4-5 మినీ బడ్జెట్లుగా కనిపించనుందని భావిస్తున్నానని మోదీ తెలిపారు. కరోనా సంక్షోభం, వాక్సినేషన్, ప్రధానంగా మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ బడ్జెట్ సమావేశాలు నేడు (శుక్రవారం, జనవరి 29) మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నాయి. రెండు విడతలుగా సమావేశాలు కొనసాగనున్న ఈ సమావేశాల తొలిరోజు అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆర్థికసర్వేను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1న దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. రైల్వే బడ్జెట్‌ను కూడా యూనియన్ బడ్జెట్లోనే కలిపి ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో దేశాధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా , ఇతర సభ్యులు ఒక్కొక్కరు పార్లమెంటుకు చేరుకుంటున్నారు. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించా లని 17 ప్రతిపక్ష పార్టీలునిర్ణయించినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ గురువారం ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
వేడెక్కనున్న పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: రెండు నెలలకు పైగా కొనసాగుతున్న రైతు ఆందోళనలకు సంఘీభావంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై దాడికి సిద్ధం కావడంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వేడెక్కనున్నాయి. శుక్రవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగిస్తారు. రైతు ఆందోళనలకు సంఘీభావంగా కాంగ్రెస్, ఆప్ సహా 17 ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు చేసిన ప్రకటన సమావేశాలు వాడీవేడిగా సాగనున్నట్టు సంకేతమిచ్చింది. శుక్రవారం ఉదయం ఉభయ సభల ఉమ్మడి సమావేశం రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలబడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగిత రహిత కార్యకలాపాలు ఉండాలన్న లక్ష్యంతో బడ్జెట్, ఎకనామిక్ సర్వే సహా అన్ని పత్రాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వెంటనే ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రయివేటు మెంబర్స్ బిజినెస్ కూడా పునరుద్ధరించారు. వర్షాకాల సమావేశాల్లో వారాంతపు సెలవులు లేకుండా సాగగా.. బడ్జెట్ సమావేశాల్లో శని, ఆదివారాలను వారాంతపు సెలవులుగా పునరుద్ధరించారు. బడ్జెట్ సమావేశాల్లో వచ్చే బిల్లులు ఇవే.. ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌లను చట్టాలుగా మార్చడానికి ప్రభుత్వం బిల్లులను ప్రతిపాదించనుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఆర్డినెన్స్ 2020, మధ్యవర్తిత్వం; సయోధ్య (సవరణ) ఆర్డినెన్స్–2020, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) ఆర్డినెన్స్–2021 తదితర ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు ప్రతిపాదించనుంది. వీటితో పాటు మరికొన్ని బిల్లులు రానున్నాయి. బడ్జెట్ సెషన్ తొలి విడత సమావేశాలు 29వ తేదీతో మొదలై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. మంత్రిత్వ శాఖల ప్రతిపాదిత నిధుల పద్దులను పరిగణనలోకి తీసుకుని స్థాయీ సంఘాలు తమ నివేదికలు సిద్ధం చేసేందుకు వీలుగా తొలి విడత సమావేశాలను ఫిబ్రవరి 15న వాయిదా వేస్తారు. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగుతాయి. చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి ప్రహ్లాద్ రాష్ట్రపతి ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని బహిష్కరిస్తామని కాంగ్రెస్ సహా 16 ప్రతిపక్షాలు ప్రకటించడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తప్పుపట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మీరు అడిగితే దేనిపైన అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించిన సమయం మేరకు చర్చించేందుకు మేం సిద్ధం. సమగ్రంగా చర్చించేందుకు సిద్ధం. ఇలా బహిష్కరించడం అవాంఛనీయం..’అని పేర్కొన్నారు. -
29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 15 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రతి రోజు నాలుగు గంటల పాటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు.(చదవండి: ఎందుకు భారత వ్యాక్సిన్లపై వివాదం...?) కాగా, గత సెప్టెంబర్ 14న ప్రారంభమయిన వర్షాకాల సమావేశాలు ప్రకటిత సమయం కన్నా 8 రోజుల ముందే ముగిసిన సంగతి తెలిసిందే.. ఎంపీల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.(చదవండి: దేశంలో విస్తరిస్తున్న కొత్త కరోనా) -
ఇక ఏకంగా బడ్జెట్ సమావేశాలే
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు చేయాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే రైతు నిరసనలకు సంబంధించి వివాదాస్పదమైన కొత్త వ్యవసాయ చట్టాలతో పాటు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై చర్చించేందుకు కోవిడ్19 నిబంధనలను పాటిస్తూ శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి గతంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఈ లేఖకు ప్రతిస్పందనగా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి అధిర్ రంజన్ చౌదరికి లేఖ రాశారు. అందులో శీతాకాల సమావేశాల విషయంలో అందరు ఫ్లోర్ లీడర్లతో సంప్రదింపులు జరిపామని, సమావేశాలను నిర్వహించరాదని ఏకగ్రీవంగా అందరు నాయకులు అంగీకరించారని పేర్కొన్నారు. జనవరిలో బడ్జెట్ సమావేశాలు.. 2021 జనవరిలో బడ్జెట్ సమావేశానికి అనుకూలమని ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీంతో వచ్చే ఏడాది జనవరిలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. త్వరలో కరోనా వ్యాక్సిన్ వస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా నవంబర్ చివర్లో కానీ డిసెంబర్ నెల మొదటి వారంలో శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశాలు జనవరి చివరి వారంలో ప్రారంభమై, ఫిబ్రవరి 1న కేంద్రం ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. -
‘పన్ను’ పరిష్కారాలకు ‘వివాద్ సే విశ్వాస్’
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు సాయపడేందుకే వివాదాల పరిష్కార పథకం ‘వివాద్ సే విశ్వాస్’ను బడ్జెట్లో ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘‘ఈ పథకం పన్ను వివాదాల్ని పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. పన్ను చెల్లింపుదారులు.. కేసుల పరిష్కారానికి ఎంతో సమయాన్ని, డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. ఈ పథకం వాటిని ఆదా చేస్తుంది’’ అని తెలియజేస్తూ.. ‘డైరెక్ట్ ట్యాక్సెస్ వివాద్ సే విశ్వాస్, 2020’ బిల్లును సోమవారం పార్లమెంట్లో మంత్రి ప్రవేశపెట్టారు. ఎందుకు ఈ పథకం..? ప్రత్యక్ష పన్నులకు సంబంధించి కమిషనర్, అప్పీల్స్, ఆదాయపన్ను శాఖ.. ఆదాయపన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్.. హైకోర్టు.. సుప్రీంకోర్టు వంటి పలు అప్పిలేట్ వేదికల వద్ద 4,83,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.9 లక్షల కోట్లు రావాల్సి ఉంది. వీటిలో అధిక భాగాన్ని ఈ ఏడాది మార్చి చివరికి పరిష్కరించి, పన్నుల ఆదాయం పెంచుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం కూడా ఈ లక్ష్యంలో భాగమే. ఈ పథకంలో కింద... వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించినట్లయితే వారికి ఎలాంటి జరిమానాలూ ఉండవు. పైపెచ్చు క్షమాభిక్ష కల్పిస్తారు. తద్వారా భవిష్యత్తులో ఆ వివాదానికి సంబంధించి చట్టపరమైన విచారణలు లేకుండా రక్షణ పొందొచ్చు. ఎవరికి వర్తిస్తుంది.. ఆదాయపన్ను శాఖ జారీ చేసిన డిమాండ్ నోటీసులను వ్యతిరేకిస్తూ అప్పీల్‌కు వెళ్లిన వారు.. 2020 మార్చి 31 నాటికి బకాయిలను చెల్లిస్తే చాలు. దానిపై వడ్డీ, పెనాల్టీని ప్రభుత్వం రద్దు చేస్తుంది. గడువు నాటికి చెల్లించలేకపోతే, మార్చి తర్వాత జూన్ 30 వరకు మరో విడత గడువు లభిస్తుంది. కానీ, మార్చి 31లోపు చెల్లించాల్సిన దానితో పోలిస్తే ఆ తర్వాత 10 శాతం అదనంగా చెల్లించాలి. 2020 జనవరి 31 నాటికి పలు అప్పిలేట్ ఫోరమ్‌ల వద్ద నమోదై, అపరిష్కృతంగా ఉన్న కేసులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. పన్ను చెల్లింపులు రూ.5 కోట్లలోపు ఉన్న సోదా కేసులకే ఇది వర్తిస్తుంది. ఎంత మేర చెల్లించాలి..? సోదా కేసులు: ఆదాయ పన్ను, వడ్డీ, పెనాల్టీల రూపంలో చెల్లించాల్సిన మొత్తానికి మరో 25 శాతం కలిపి మొత్తం 125 శాతాన్ని మార్చి చివరి నాటికి చెల్లించడం ద్వారా వివాదాలను తొలగించుకోవచ్చు. మార్చిలోపు సాధ్యం కాకపోతే, తర్వాత జూన్ 31 నాటికి 135 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సోదా జరగని కేసులు: పన్ను, పెనాల్టీ, వడ్డీ రేటుపై వివాదం ఉంటే... ఆ మొత్తాన్ని (100 శాతాన్ని) మార్చి చివరిలోపు చెల్లించడం ద్వారా వివాదాన్ని మాఫీ చేసుకోవచ్చు. ఈ గడువు దాటితే జూన్ చివరికి 110 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఆదాయపన్ను కింద రూ.1,00,000 చెల్లించగా.. ఆదాయపన్ను శాఖ మాత్రం చెల్లించాల్సిన పన్ను ఆదాయం రూ.1,50,000గా తేల్చి, దీనికి రూ.20,000 వడ్డీ కింద, రూ.1,00,000 పెనాల్టీ కింద చెల్లించాలని డిమాండ్ చేసి ఉంటే.. అప్పుడు వివాదంలో ఉన్న మొత్తం రూ.1,70,000 అవుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ పన్ను చెల్లింపుదారు అప్పీల్ కోసం దాఖలు చేసి ఉంటే.. ఈ కేసులో కేవలం రూ.50,000ను మార్చి చివరికి చెల్లించడం ద్వారా మాఫీ చేసుకోవచ్చు. మార్చి తర్వాత అయితే 10% అదనంగా రూ.55,000 చెల్లించాల్సి ఉంటుంది. ♦ ఇక కేవలం పెనాల్టీ, వడ్డీ రేటుపైనే వివాదం ఉన్నట్టయితే, చెల్లించాల్సిన మొత్తంలో మార్చి ఆఖరు నాటికి కనీసం 25% చెల్లిస్తే చాలు. ఆ తర్వాత జూన్‌లోపు అయితే చెల్లించాల్సిన మొత్తం 30 శాతం అవుతుంది. ఇవన్నీ కూడా పన్ను చెల్లింపుదారులు అప్పీలు దాఖలు చేసిన కేసులకే వర్తిస్తాయి. ఒకవేళ ఆదాయపన్ను శాఖే అప్పీల్‌కు వెళ్లి ఉంటే, చెల్లించాల్సిన మొత్తం ఇంత కంటే తక్కువగా ఉంటుంది. అందరికీ ఈ పథకం వర్తించదండోయ్.. ఈ ప్రతిపాదిత పథకం కొన్ని వివాదాలకు వర్తించదు. పన్ను చెల్లింపుదారుడికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఆరంభమై ఉన్నా...సోదాలు జరిగి, రూ.5 కోట్లకు పైగా విలువైన స్వాధీనాలు చోటు చేసుకున్నా... బయటకు వెల్లడించని విదేశీ ఆదాయం, విదేశీ ఆస్తులు కలిగి ఉన్న కేసులైనా... భారతీయ శిక్షాస్మృతి, మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్నా... అటువంటి వారు ఈ పథకం కింద వివాదాలు పరిష్కరించుకునే అవకాశం ఉండదు. -
నెట్టుకున్నారు.. తోసేసుకున్నారు!
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల మలి దశ తొలి రోజే లోక్‌సభ దద్ధరిల్లింది. ఢిల్లీ అల్లర్లపై అధికార, విపక్ష సభ్యులు ఆవేశంగా ఒకరినొకరు గట్టిగా తోసుకోవడంతో సభలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సభలో నెలకొన్న తోపులాటపై స్పీకర్ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సభను నిర్వహించలేనంటూ అశక్తత వ్యక్తం చేశారు. సభలో తమ మహిళా సభ్యులపై అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల మలి దశ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే.. ఫిబ్రవరి 28వ తేదీన మరణించిన జేడీయూ ఎంపీ బైద్యనాథ్ ప్రసాద్‌కు నివాళి అర్పించి, అనంతరం ఆయనకు గౌరవ సూచకంగా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగానే గందరగోళం మొదలైంది. ఇటీవలి ఢిల్లీ అల్లర్ల అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు. హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికార పక్ష సభ్యులు కూర్చున్న వైపు కూడా వెళ్లి అమిత్‌షా రాజీనామా డిమాండ్ ఉన్న నల్లని బ్యానర్‌ను ప్రదర్శించారు. ‘అల్లర్లకు కారణం వీరే. వీరే రెచ్చగొట్టారు. 1984లోనూ వీరు 3000 మందిని హతమార్చారు. వీరికి శాంతి నెలకొనడం ఇష్టం లేదు’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో విపక్ష సభ్యులు మరింత బిగ్గరగా.. ‘వి వాంట్ జస్టిస్’, ‘అమిత్ షా ముర్దాబాద్’ అని నినాదాలు చేయసాగారు. ఈ సమయంలో, కాంగ్రెస్ సభ్యులు నల్ల బ్యానర్‌తో అధికార పక్ష సభ్యుల వైపు వెళ్లారు. బీజేపీ సభ్యులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు చేతిలోని కాగితాలను చించి, విసిరేశారు. ఈ సమయంలో, ఇరు వర్గాల సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. గట్టిగా నెట్టివేసుకున్నారు. దీంతో సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. 3 గంటలకు సభ ప్రారంభమైన తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. తమవైపు నుంచి వెల్‌లోకి వెళ్లనివ్వకుండా బీజేపీ సభ్యులు విపక్ష సభ్యులను అడ్డుకున్నారు. ఈ సమయంలో బీజేపీ మహిళా ఎంపీ ఒకరు తనపై దాడి చేశారని కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాస్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. గందరగోళం మధ్య సభ పదేపదే వాయిదాపడింది.దీంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, బీజేపీ మహిళా సభ్యులతో కాంగ్రెస్ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని, స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని మంత్రి స్మృతి ఇరానీ సభ వెలుపల మీడియాకు తెలిపారు. వాయిదా పడిన రాజ్యసభ ఢిల్లీ అల్లర్లపై రాజ్యసభలో దుమారం రేగింది. ఢిల్లీ తగులబడుతుంటే కేంద్రం నిద్ర పోతోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. హోం మంత్రి రాజీనామా చేయాలని కోరాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది. వెల్‌లోకి వచ్చి నిలబడిన సభ్యులను సీట్లలో కూర్చోవాల్సిందిగా అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలు పర్యాయాలు కోరినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆయన సభను మధ్యాçహ్నానికి వాయిదావేశారు. ఆ తర్వాతా అదే తీరు కొనసాగడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మంగళవారానికి వాయిదా వేశారు. గొడవ మధ్యనే తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్ సహా మూడు సంస్కృత వర్సిటీలను సెంట్రల్ వర్సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టారు. గౌరవంగా వ్యవహరిద్దాం సభ్యులను సముదాయించేందుకు స్పీకర్ ఓం బిర్లా పలు సందర్భాల్లో విఫల యత్నం చేశారు. దేశ ప్రజలు చూస్తున్నారని, గౌరవ సభ్యులుగా హుందాగా వ్యవహరిద్దామని సభ్యులకు సూచించారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందన్నారు. గందరగోళం మధ్యనే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(అమెండ్మెంట్) బిల్లు, మినరల్ లాస్ అమెండ్మెంట్ బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన ‘వివాద్ సే విశ్వాస్’ బిల్లుపై చర్చ జరిగింది. -
‘ఆర్థికం’పై సమగ్రంగా చర్చిద్దాం
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో విపక్ష సభ్యులు లేవనెత్తారు. నిరసనకారుల ఆందోళనలపై స్పందించకుండా కేంద్ర ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన ఆర్థిక మాంద్యం సహా అన్ని అంశాలపై పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారికి స్పష్టం చేశారు. మెజారిటీ సభ్యులు కోరుతున్న విధంగా.. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక అంశాలకు సముచిత ప్రాధాన్యత ఇద్దామని, ప్రస్తుతం ప్రపంచమంతా నెలకొన్న ఆర్థిక మాంద్య పరిస్థితుల నుంచి భారత్ ఎలా ప్రయోజనం పొందగలదనే విషయంపై దృష్టిపెడదామని ప్రధాని సూచించారు. ‘కొత్త సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థకు సరైన దిశానిర్దేశం చేద్దాం’ అన్నారు. భేటీలో సభ్యులు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు. ‘ప్రతీ అంశంపైనా సాదాసీదాగా చర్చించడం కాకుండా.. సమగ్రంగా నిర్మాణాత్మకంగా చర్చ జరుపుదాం’ అని ప్రధాని సూచించారు. 26 పార్టీలు పాల్గొన్న ఈ అఖిలపక్ష సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. సీఏఏ వ్యతిరేక నిరసనలు, ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న నిరుద్యోగం.. తదితర అంశాలను ఈ భేటీలో విపక్షాలు లేవనెత్తాయి. జమ్మూకశ్మీర్‌లో మాజీ సీఎంలు, ఇతర రాజకీయ నేతలను నిర్బంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించామని భేటీ అనంతరం కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వీలుగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లాను విడుదల చేయాలని డిమాండ్ చేశామన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరామని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ తెలిపారు. అంతా సహకరిస్తామన్నారు: స్పీకర్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని అన్ని పార్టీల నేతలు తనకు హామీ ఇచ్చారన్నారు. సభలో మాట్లాడేందుకు అన్ని పార్టీల సభ్యులకు తగిన సమయమిస్తానన్నారు. -
రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా గళమెత్తండి..
సాక్షి, హైదరాబాద్ : త్వరలో జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా పార్టీ ఎంపీలు గళమెత్తాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. సీఏఏ విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పార్లమెంటులో వ్యవహరించాలని, ఎన్పీఆర్లో ఓబీసీ జనగణన కాలమ్‌ను చేర్చాలనే డిమాండు లేవనెత్తాలని సూచించారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణభవన్‌లో మంగళవారం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేటీఆర్ అధ్యక్షత వహించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ, ఐజీఎస్టీ ఇతర బకాయిలపై పార్లమెంటులో నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు ఆర్థిక సాయం అందించాలని గతంలో నీతి ఆయోగ్ సిఫారసు చేసినా, ఇప్పటి వరకు కేంద్రం నుంచి నిధులు రాని విషయాన్ని ప్రస్తావించాలని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, తెలంగాణకు హరితహారం, మిషన్ భగీరథ పథకాల స్ఫూర్తితో కేంద్రం కూడా అనేక పథకాలు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధుల సాయం లేకున్నా విజయవంతంగా పనులు సాగుతున్న విషయాన్ని ప్రస్తావించాలన్నారు. నిధులు, దీర్ఘకాల డిమాండ్లపై నిలదీయండి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్ ప్లాంటు, ట్రైబల్ యూనివర్సిటీ వంటి డిమాండ్లతో పాటు, తెలంగాణకు దక్కాల్సిన నిధులపై నిలదీయాలని పార్టీ ఎంపీలకు కేటీఆర్ సూచించారు. దేశంలో ఓ వైపు ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండగా, నిరుద్యోగ సమస్య, ఆర్థిక వ్యవస్థ బలోపేతం వంటి కీలక అంశాలపై కేంద్రం దృష్టి పెట్టకపోవడాన్ని ప్రశ్నించాలన్నారు. సీఏఏ, ఎన్నార్సీ వంటి రాజకీయ అంశాలను పక్కన పెట్టాలని కేంద్రానికి సూచించాలని పేర్కొన్నారు. మున్సిపోల్స్ ఘన విజయంపై తీర్మానం మున్సిపల్ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎన్నడూ లేని విధంగా అవకాశం కల్పించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ తీర్మా నంచేసింది. పార్టీ అధికారంలో వచ్చిననాటి నుంచి ఆయా వర్గాల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు చేపట్టిన సీఎం.. రాజకీయంగా వారికి ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం సీఎం కేసీఆర్ కృషి వల్లే సాధ్యమైందని, పార్టీని విజయం దిశగా నడిపించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ అభినందింది. కాగా, బుధవారం ఢిల్లీలో జరిగే పార్లమెంటు అఖిలపక్ష సమావేశంలో తమ పార్టీ ప్రాధాన్య అంశాలను పార్లమెంటు సమావేశాల ఎజెండాలో చేర్చాలని డిమాండ్ చేస్తామని పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవరావు, లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు వెల్లడించారు. కేటీఆర్‌తో మున్సిపల్ చైర్మన్లు భేటీ కొత్తగా ఎన్నికైన సుమారు 50 మందికి పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పాలక మండలి సభ్యులు మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వీరిని వెంట బెట్టుకుని తెలంగాణ భవన్‌కు రావడంతో సందడి నెలకొంది. జిల్లాలు, మున్సిపాలిటీల వారీగా కేటీఆర్ వారితో గ్రూప్ ఫొటో దిగి అభినందించారు. కాగా, కరీంనగర్ మున్సిపాలిటీలో గెలుపొందిన ఏడుగురు స్వతంత్ర కార్పొరేటర్లు కేటీఆర్, మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. -
31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ, రాజ్యసభలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అధికారిక ప్రకటనను సోమవారం విడుదల చేశాయి. రాష్ట్రపతి ఆదేశాలతో ఈ నెలాఖరు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత బడ్జెట్ సెషన్, మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండవ విడత బడ్జెట్ సెషన్ జరగనున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 1 వరకు మధ్యలో విరామం ఉండనుంది. రెండు విడతల మధ్య ఉండే ఈ విరామంలో శాఖల వారీగా ఉన్న బడ్జెట్ కేటాయింపులను పార్లమెంటరీ కమిటీలు పరిశీలించనున్నాయి. -
పార్లమెంట్ వద్ద కనీవిని ఎరుగని హైడ్రామా
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో పరిణామాలు దర్శనమిచ్చాయి. శుక్రవారం ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డ తర్వాత.. పార్లమెంట్ ఆవరణలో అధికార-ప్రతిపక్షాలు పోటాపోటీ నిరసనలకు దిగాయి. ఇరుపార్టీల ఎంపీలు ఫ్లకార్డులు చేతబూని వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ముందుగా కేంద్ర మంత్రులతో సహా బీజేపీ ఎంపీలంతా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. సభ నిర్వహణకు కాంగ్రెస్ అడ్డుతగిలిందని.. పూర్తి సెషన్స్ వృథా అయిపోయిందని ఆరోపిస్తూ ఫ్లకార్డర్లతో నినాదాలు చేశారు. మరోవైపు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇచ్చిన టీ ఆతిథ్యాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ.. అదే సమయంలో తమ నిరసన వ్యక్తం చేసేందుకు గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంది. ఆ సమయంలో ఇరు పార్టీల నేతలు ఎదురెదురు పడ్డారు. బీజేపీ చేతగానీ తనం వల్లే సభ కార్యాకలాపాలు స్తంభించాయని కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. ఒకనొక తరుణంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కాసేపటికే ఇరుపార్టీల ఎంపీలు అక్కడి నుంచి నిష్క్రమించారు. (మోదీ సంచలన నిర్ణయం) కాగా, ఇంతకు ముందు బీజేపీ ఇలాంటి ఆరోపణలను చేస్తూ కాంగ్రెస్, సోనియా గాంధీలపై తీవ్ర విమర్శలు గుప్పించింది. దీంతో గురువారం సభలో మాట్లాడిన సోనియా గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. సభను నిర్వహించటంలో విఫలమై.. ఆ నెపాన్ని తమపై నెడుతూ ఆరోపణలు చేయటం సరికాదంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్‌పై సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ ఏప్రిల్ 12న నిరహార దీక్ష చేపట్టాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని పిలుపునివ్వగా.. మత ఘర్షణలు, దళితులపై దాడులకు ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏప్రిల్ 9వ తేదీనే దీక్ష చేపట్టబోతున్నారు. -
వేతనం వదులుకోనున్న ఎన్డీయే ఎంపీలు
న్యూఢిల్లీ: నిరసనలు, ఆందోళనల కారణంగా పార్లమెంటు బడ్జెట్ మలిదశ సమావేశాలు సజావుగా సాగకపోవటంతో.. ఈ 23 రోజుల వేతనాన్ని వదులుకునేందుకు అధికార ఎన్డీయే ఎంపీలు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ బుధవారం వెల్లడించారు. కాంగ్రెస్, ఇతర విపక్షాల అప్రజాస్వామిక తీరు కారణంగానే పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడుతున్నాయని విమర్శించారు. ప్రజలు చెల్లిస్తున్న పన్ను వృధా అవుతోందన్నారు. ‘ఈ విషయాన్ని ప్రధాని, బీజేపీ అధ్యక్షుడు, ఎన్డీయే పక్షాల అధ్యక్షులతో చర్చించాం. రెండోవిడత బడ్జెట్ సమావేశాలు జరిగిన 23 రోజుల వేతనాన్ని వదులుకోవాలని నిర్ణయించాం’ అని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాసం సహా పలు అంశాలపై చర్చకు సిద్ధమని ప్రకటించినా విపక్షాలు ఆందోళన చేయటం సరికాదని అనంత్ కుమార్ పేర్కొన్నారు. -
రాజీనామాలపై వైఎస్సార్సీపీ ఎంపీల ముందడుగు
-
రాజీనామా లేఖలపై వైఎస్సార్సీపీ ఎంపీల సంతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పోరాటం చేస్తోన్న వైఎస్సార్సీపీ.. చివరి అస్త్రమైన రాజీనామాలపై ముందడుగువేసింది. పార్లమెంట్ నిరవధికంగా వాయిదాపడ్డ మరుక్షణమే రాజీనామాలు చేస్తామన్నా ఆ పార్టీ ఎంపీలు బుధవారం రాజీనామా లేఖలపై సంతకాలు చేశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి.. సంతకాలు చేసిన రాజీనామా లేఖలతో లోక్‌సభకు బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఎనిమిదో సారి ఇచ్చిన నోటీసులు నేడు సభ ముందుకు రానుంది. అయితే నోటీసులపై స్పీకర్ చర్చ చేపడతారా, లేదా అనేది తేలాల్సిఉంది. అవిశ్వాసాన్ని తప్పించుకునే క్రమంలో కేంద్రం.. ఏఐఏడీఎంకే ఎంపీల నిరసనలను సాకుగా చూపి పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీలు ముందస్తుగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖలను సిద్ధంచేశారు. -
సవాల్‌కు సై: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానితో భేటీ అంశాంలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ విసిరిన సవాలును స్వీకరిస్తున్నానని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అని, చర్చల కోసం దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చినా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు సంచలన అంశాలు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలో టీడీపీ బాగోతం: ‘ప్రజా సమస్యల గురించి ప్రధానిని కలిస్తే నన్ను విమర్శిస్తున్న టీడీపీ నేతలు.. ఇవాళ రాజ్యసభలో జరిగినదానికి ఏం సమాధానం చెబుతారు? ఒకవైపు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇంకోవైపు ప్రధాని మోదీతో, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో వీళ్లు ఏం మంతనాలు చేస్తున్నారు? ఏకంగా జైట్లీ కాళ్లు మొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజ్యసభ సీసీటీవీ ఫుటేజీల్లో టీడీపీ ఎంపీల బాగోతమంతా రికార్డైంది. ఆ ఫుటేజీని సర్టిఫై చేయించి, సెక్రటరీ సంతకంతో బయటపెడితే టీడీపీ గుట్టు రట్టవుతుంది’ అని విజయసాయిరెడ్డి అన్నారు. సీఎం ఓ దొంగ.. సుజనా దెబ్బకి బ్యాంకులు దివాలా: ‘‘నాలుగైదు రోజుల్లో సీఎం రమేశ్ బండారాన్ని బయటపెడతాం. ఉత్తరాఖండ్‌లో పనులు చేయకుండా బిల్లులు తీసుకున్నాడు. సుజనా చౌదరి బ్యాంకులను మోసం చేశాడు. ఆయన దెబ్బకి త్వరలో కొన్ని బ్యాంకులు దివాలా తీయబోతున్నాయి. ఇలాంటి దొంగలా మాపై విమర్శలు చేసేది? ఇవాళ రాజ్యసభలో టీడీపీ ఎంపీలు జైట్లీతో ఏం మాట్లాడారో వెల్లడించే దమ్ముందా?’’అని విజయసాయి ప్రశ్నించారు. చంద్రబాబు ఓ చార్లెస్ శోభరాజ్: అందితే జుట్టు, లేకపోతే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబుతోపాటు టీడీపీ నాయకుల నైజమని విజయసాయి అన్నారు. ‘‘చంద్రబాబూ.. మీరో చార్లెస్ శోభరాజ్. మీ అంత దుర్మార్గపు నాయకుడు ఈ దేశంలోనే లేరు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హత మీకు లేనేలేదు’ అని మండిపడ్డారు. -
అవిశ్వాసం; నిప్పులుచెరిగిన ఖర్గే.. దాడి!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీఏ సర్కారుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ సహా ఏడు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులపై స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చ చేపట్టకపోవడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఒకదశలో ఏఐఏడీఎంకే ఎంపీలు.. కాంగ్రెస్ నేత ఖర్గేపై దాడికి యత్నించారు. ఖర్గే ఫైర్: అవిశ్వాస తీర్మానం సభలోకి రానుండగా.. ఏడో రోజు కూడా అన్నాడీఎంకే ఎంపీలు నిరసనలు కొనసాగించారు. సభ ఆర్డర్లో లేదన్న కారణాన్ని చూపుతూ స్పీకర్.. అవిశ్వాసంపై చర్చ చేపట్టలేకపోతున్నానన్నారు. స్పీకర్ అలా మాట్లాడిన మరుక్షణమే కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే నిలబడి నిరసన తెలిపారు. ‘‘అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 50 కంటే చాలా ఎక్కువ మంది ఎంపీలు నిలబడ్డారు. ఇంకేం కావాలి మేడం? చర్చ మొదలుపెట్టండి.. ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్లు పారిపోతుంది? చర్చ మొదలైనట్లు ప్రకటించండి..’’ అంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు. అనంతకుమార్ కౌంటర్: మల్లికార్జున ఖర్గే ఆవేశపూరిత మాటలతో సభ ఒక్కసారిగా వేడెక్కడం, విపక్ష ఎంపీలంతా ఆయనకు మద్దతు పలకడంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ కౌంటర్ ఇచ్చేందుకు యత్నించారు. ‘‘కూటముల ఏర్పాటు నుంచి సీట్ల సర్దుబాట్ల దాకా కాంగ్రెస్ అన్నింటా విఫలమైంది. అలాంటి వాళ్లు అవిశ్వాసం పెడితే మేం భయపడతామా? ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉన్నాం. సభలోపలేకాదు.. బయట కూడా విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు మోదీ సర్కార్ సిద్ధంగా ఉంది’’ అని అన్నారు. ఈలోపే స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభను రేపటికి వాయిదావేశారు. ఖర్గేపై దాడి!: సభ వాయిదా పడిన తర్వాత కాంగ్రెస్, ఏఐఏడీఎంకే సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం నాటకాలాడుతోంది.. బీజేపీకి ఎంతకు అమ్ముడుపోయారు?’ అని తమిళ ఎంపీలను ఉద్దేశించి ఓ కాంగ్రెస్ సభ్యుడు వ్యాఖ్యానించడంతో ఇరువర్గాల మధ్య ఉద్రికత్తత పెరిగింది. ఒకదశలో అన్నాడీఎంకే ఎంపీలు ఖర్గేపై దాడికి దూసుకురాగా, సోనియాగాంధీ అడ్డుపడ్డారు. తమిళ ఎంపీలను వారించి వెనక్కి పంపారు. ఆ కొద్ది సేపటికే పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఖర్గే.. అన్నాడీఏంకే-బీజేపీల తీరును తప్పుపట్టారు. ‘‘అవిశ్వాసాన్ని తప్పించుకునేందుకు ప్రభుత్వం.. అన్నాడీఎంకేను పావులా వాడుకుంటోంది. బయటికిమాత్రం చర్చకు సిద్ధమని అబద్ధపు ప్రకటనలు చేస్తోంది’ అని మండిపడ్డారు. -
లోక్‌సభలో అవిశ్వాసంపై నిప్పులుచెరిగిన ఖర్గే
-
అవిశ్వాసం; మళ్లీ అడ్డుపడ్డ అన్నాడీఎంకే.. వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఎన్డీఏ సర్కారుపై వైఎస్సార్సీపీ సహా ఏడు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు ముందుకు రాకుండానే లోక్‌సభ వాయిదా పడింది. కావేరి నదీజలాల వివాదంపై అన్నాడీఎంకే ఎంపీలు నిరసనలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. మంగళవారం 11 గంటలకు సభ ప్రారంభమైన మరుక్షణం నుంచే ఏఐఏడీఎంకే ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. రాజ్యసభ కూడా: పలు అంశాలపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో పెద్దల సభలోనూ వాయిదాల పర్వం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11 గంటలకే సభ ప్రారంభంకాగా.. విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను 15 నిమిషాలపాటు వాయిదావేశారు. అనంతరం సభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాకపోవడం రాజ్యసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు
-
ఆ మరుక్షణమే రాజీనామాలు: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పోరాడుతోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఎంపీల రాజీనామాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ నిరవధిక వాయిదా పడిన మరుక్షణమే తాము రాజీనామాలు చేస్తామని ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల గ్రామంలో ప్రజాసంకల్పయాత్ర శిబిరం వద్ద పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో సోమవారం ఎంపీలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు: ఎన్డీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాం. సభలో చర్చ జరిగేదాకా నోటీసులు ఇస్తూనే ఉంటాం. హోదా ప్రకటన రాకుంటే పార్లమెంట్ సమావేశాల చివరిరోజు పదవులకు రాజీనామాలు చేస్తామని ఇదివరకే ప్రకటించాం. కానీ, ఈ లోపే సభ నిరవదికంగా వాయిదా పడితే.. తర్వాతి నిమిషమే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పిస్తాం. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మేరకు మాకు దిశానిర్దేశం చేశారు’ అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాకు తెలిపారు. టీడీపీ ఎంపీలు కూడా చేస్తే..: ‘‘అసలు హోదానే వద్దన్న చంద్రబాబు ఇప్పుడు స్టాండ్ మార్చుకుని మాతోకలిసి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందుకొచ్చారు. రాజీనామాల విషయంలోనూ టీడీపీకి మా సూచన ఇదే.. వైఎస్సార్‌సీపీతోపాటే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే దేశవ్యప్తంగా చర్చ జరుగుతుంది. తద్వారా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంది. హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని మొదటి నుంచీ నమ్మింది వైఎస్సార్సీపీనే, ధర్నాలు, యువభేరిలతో ప్రజల్ని చైతన్యం చేసింది కూడా మేమే. కానీ చంద్రబాబు ఇప్పటికీ పూటకో మాట చెబుతూ ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. మోదీ గ్రాఫ్ పడిపోవడం వల్లే బాబు ఎన్డీఏ నుంచి బయటికొచ్చారన్నది వాస్తవం’’ అని మేకపాటి పేర్కొన్నారు. పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్ భేటీ ముఖ్యాంశాలు ఏప్రిల్ 6 కన్నా ముందే పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడితే అదే రోజే ఎంపీలు లోక్‌సభకు రాజీనామాలు. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు ఇవ్వాలని సూచించిన వైఎస్ జగన్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్లలో ప్రజాసంకల్పయాత్ర శిబిరంలో పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్ సమావేశం. ప్రత్యేక హోదా పోరాటంపై ఎంపీలకు వైఎస్ దిశానిర్దేశం ముందుగా రాజీనామాలు ప్రకటిస్తే.. టీడీపీకూడా ఈ తరహా ప్రకటనలు చేసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన ఎంపీలు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భేషజాలకు పోవాల్సిన పనిలేదన్న వైఎస్ జగన్ ఏ విషయాన్నైనా దాపరికంలేకుండా మనం ప్రజలముందు ఉంచుతున్నాం రాజీనామాల ప్రకటన నుంచి అవిశ్వాసం వరకూ మనం నిర్ణయాలన్నీ చిత్తశుద్ధితో తీసుకున్నాం. వాటిని నేరుగా ప్రజలముందే ఉంచుతున్నామన్న వైఎస్ జగన్ ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి, ఏపీకి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నదే మన ఉద్దేశం మనం రాజీనామాలు ప్రకటించినప్పుడు, అవిశ్వాసం పెడతానన్నప్పుడు చంద్రబాబు ముందుకురాలేదన్న వైఎస్ జగన్ విధిలేని పరిస్థితుల్లో వారుకూడా అవిశ్వాసం పెట్టాల్సి వచ్చింది ఏది ఏమైనా రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు ఒక నిర్ణయం విషయంలో ముందుకు వస్తే.. దానివల్ల వచ్చే ఒత్తిడి, తీవ్రత వేరేలా ఉంటుంది ఎవరు ముందు, ఎవరు వెనక కన్నా.. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే ముఖ్యమని అభిప్రాయపడ్డ వైఎస్ జగన్ అందుకే మనం రాజీనామాల నిర్ణయం ప్రకటించినప్పుడు కలిసి రావాలని చంద్రబాబును అడిగాం అవిశ్వాసం ముందు వారు పెట్టినా మద్దతు ఇస్తామన్నాం, లేదంటే.. మనం పెట్టినా మద్దతు ఇవ్వాలని కోరాం మన పోరాట ప్రణాళిక చాలా స్పష్టంగా ఉందన్న వైఎస్ జగన్ ఇప్పుడు కూడా రాజీనామాల విషయంలో కలిసి రావాలని టీడీపీని కోరుతున్నాం ప్రత్యేక హోదాకోసం వైఎస్ఆర్సీపీ పోరాడుతున్న తీరుపై పార్లమెంటులో వివిధ పార్టీల తీరును వైఎస్ జగన్‌కు వివరించిన పార్టీ ఎంపీలు ఎత్తుగడలు, మీడియా మేనేజ్మెంట్లను నమ్ముకుని ఇరుకునపడ్డామన్న అభిప్రాయాన్ని వ్యక్తిగత సంభాషణల్లో టీడీపీ ఎంపీలు వెల్లడించారని వైఎస్ జగన్‌కు చెప్పిన ఎంపీలు ‘‘ప్రత్యేక హోదా కోసం మీ నాయకుడు చక్కటి పోరాటాన్ని చేస్తున్నారంటూ...’’ అనేక పార్టీలకు చెందిన నాయకులు ప్రశంసించిన విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి తెచ్చిన నేతలు ‘‘మా నాయకుడు ఏదైనా ముక్కుసూటిగా చేస్తాడని, దాపరికం లేకుండా వ్యవహరిస్తాడన్న విషయాన్ని’’ ఆయా పార్టీలకు వివరించామన్న ఎంపీలు పార్లమెంటులో ఏ చోట చూసినా ప్రత్యేక హోదాపైనే చర్చ జరగుతుందని, మన పోరాటానికి ఇతర పార్టీల నుంచి చక్కటి మద్దతు వస్తుందని వైఎస్ జగన్‌కు వివరించిన ఎంపీలు -
నిమిషాల్లోనే.. గందరగోళం.. వాయిదా!
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరు ఏమాత్రం మారడం లేదు. ఇరుసభల్లోనూ వాయిదాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. సభలు ప్రారంభమైన క్షణాల్లోనే వాయిదా పడుతుండటం గమనార్హం. దీంతో పలు విపక్ష పార్టీలు సభలో తమ గొంతు వినాలని ఎంతగా అభ్యర్థించినా.. పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతోంది. ముఖ్యంగా విభజన హామీల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన తీరని అన్యాయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటు లోపల, బయటా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అన్యాయాన్ని తప్పుబడుతూ.. వైఎస్ఆర్సీపీ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ అవిశ్వాసానికి పలు విపక్ష పార్టీలు మద్దతు తెలిపినా.. సభ ఆర్డర్లో లేకపోవడంతో వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. బుధవారం కూడా లోక్‌సభ నిమిషాలలోపే వాయిదా పడింది. దీంతో అవిశ్వాసంపై చర్చకు వీలులేకుండా పోయింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పెద్దలసభ బుధవారం అలా ప్రారంభమై.. అలా నిమిషాల్లో గురువారానికి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు పోడియం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అంటూ నినదించారు. దీంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేశారు. ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే పెద్దలసభ వాయిదాపడటంపై ప్రతిపక్ష సభ్యులు మండిపడుతున్నారు. సభను ఆర్డర్‌లోకి తీసుకొచ్చి.. సజావుగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని గుర్తుచేస్తున్నారు. అధికారపక్షం చొరవ తీసుకొని.. ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష సభ్యులను సముదాయించి.. సభను సజావుగా నడిపించాల్సి ఉంటుందని, కానీ అధికారపక్షం నుంచి అలాంటి చొరవ కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
వైఎస్ఆర్సీపీ ఎంపీల పోరాటం!
సాక్షి, న్యూఢిల్లీ: గత మూడురోజులుగా లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టేలా స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవ చూపాలని వారు కోరారు. సభలో ఆందోళనలను నియంత్రించి.. అవిశ్వాసంపై చర్చ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అంటూ బుధవారం కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, బుధవారం కూడా లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి. అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేస్తుండటంతో సభ ఇలా ప్రారంభం కాగానే.. అలా స్పీకర్ మహాజన్ మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు. దీంతో అవిశ్వాస తీర్మానంపై చర్చ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు మరోసారి నిరుత్సాహానికి గురయ్యారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు.. అవిశ్వాస తీర్మానంపై చర్చ కోసం పట్టుపడుతూనే ఉంటామని, కేంద్రంపై అవిశ్వాసం పెడుతూనే ఉంటామని వారు స్పష్టం చేశారు. హోదా కోసం పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన భాగంగా కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అటు టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానం కోసం నోటీసులు ఇచ్చింది. అయితే, సభలో కొన్ని విపక్ష పార్టీల ఆందోళనల వల్ల గందరగోళం నెలకొనడంతో అవిశ్వాస తీర్మానంపై చర్చను స్పీకర్ గత మూడురోజులుగా వాయిదా వేస్తూ వచ్చారు. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన తర్వాత అదే పరిస్థితి నెలకొనడంతో మరోసారి వాయిదా వేశారు. అయితే, వాయిదాల పర్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు.. ఇప్పటికైనా సభలో అవిశ్వాసంపై చర్చ జరిగేలా చూసేందుకు కేంద్రం ముందుకురావాలని కోరుతున్నారు. చంద్రబాబు ద్రోహి..! ఏపీకి బీజేపీ, టీడీపీ తీరని అన్యాయం చేశాయని వైఎస్ఆర్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మండిపడ్డారు. హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అన్న ద్రోహి చంద్రబాబేనని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇకనైనా గొప్పలు చెప్పడం మానుకోవాలని, రాబోయే ఎన్నికల్లో ఆయనను ప్రజలు శిక్షించబోతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాడుతున్నది వైఎస్‌ఆర్‌సీపీయేనని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. హోదా విషయంలో ఏపీకి చంద్రబాబు ద్రోహం చేశారని అన్నారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచింది చంద్రబాబేనని మండిపడ్డారు. హోదా కోసం తాము పోరాడుతుంటే.. తమను అణగదొక్కడానికి చంద్రబాబు కుట్రలు చేశారని మండిపడ్డారు. ఈ రోజైనా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. సభ ఆర్డర్లో లేదని ఒకవైపు వాయిదా వేస్తూ.. మరోవైపు ప్రభుత్వం బిల్లులు ఆమోదించుకుంటున్నదని అన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కోరినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చంద్రబాబు తన నీడ కూడా నమ్మరు ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. మొదట తాము పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తామని చెప్పి.. ఆ తర్వాత చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని గుర్తుచేశారు. హోదా వద్దు.. ప్యాకేజీ కావాలన్న బాబుకు నైతిక విలువలు ఉన్నాయా? అని నిలదీశారు. చంద్రబాబుకు ఏపీ ప్రయోజనాలు పట్టవని, ఆయన తన నీడనే తాను నమ్మరని అన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా తాను ఎవరినైనా కలుస్తానని, దానికి చంద్రబాబు పర్మిషన్ అవసరం లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలతోనూ చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారని, ప్రతి రెండు, మూడేళ్లకోసారి భాగస్వామిని బాబు మారుస్తారని, ఆయనకు చిత్తశుద్ధి, విధివిధానాలు లేవని మండిపడ్డారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని విమర్శించారు. నాలుగేళ్లుగా ఒకే మాట మీద నిలబడ్డాం చంద్రబాబు తరహాలో లాలూచీ రాజకీయాలు చేయడం తమకు రాదని, నాలుగేళ్లుగా ఒకే మాట మీద ఉన్నామని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం తాము పార్లమెంటు లోపల, బయటా పోరాడుతున్నామని గుర్తుచేశారు. చంద్రబాబు మేడిపండులాంటివారు అని, పొట్టవిప్పిచూస్తే పురుగులు ఉంటాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబే కారణం కమీషన్ల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదా కాదని ప్యాకేజీకి మొగ్గుచూపారని ఎంపీ వరప్రసాద్ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబేనని అన్నారు. హోదాపై అసెంబ్లీలో ఒక్కసారి కూడా చంద్రబాబు మాట్లాడలేదని, ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రంగులు మారుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు డ్రామాలు ఆపాలని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవకాశం ఇవ్వాలని రెండు చేతులు జోడించి స్పీకర్‌ను కోరామని వరప్రసాద్ తెలిపారు. -
‘ఇరాక్‌లో భారతీయ బందీల’పై కేంద్రం ప్రకటన
-
ఆ 39 మంది భారతీయులను చంపేశారు..
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధికోసం పరాయిదేశానికి వెళ్లి అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులు తిరిగివస్తారనే ఆశలు కూలిపోయాయి. ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన ఆ 39 మంది భారతీయులు ప్రాణాలతోలేరని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ మేరకు మంగళవారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటన చేశారు. ఐసిస్ చేతుల్లో హతమయ్యారు: ఇరాక్ రెండో అతిపెద్ద నగరం మోసుల్‌ను ఐసిస్ ఉగ్రవాదులు హస్తగతం చేసుకునేనాటికి(2014నాటికి) అక్కడ10 వేల మంది భారతీయులు ఉండేవారు. హెచ్చరికల నేపథ్యంలో చాలా మంది అక్కడి నుంచి వచ్చేయగా.. ఇంకొద్దిమంది ఉగ్రవాదులకు బందీలుగా చిక్కారు. వారిలో 39 మందిని గుర్తించిన భారత అధికారులు.. విడుదలకోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. బందీలను సురక్షితంగా తీసుకొస్తామని భారత్‌లోని వారి కుటుంబీకులకు విదేశాంగశాఖ భరోసా కూడా ఇచ్చింది. ఈ ప్రయత్నాలు సాగుతుండగానే ఐసిస్ పెద్ద ఎత్తున నరమేధాలకు పాల్పడింది. బందీలుగా చిక్కిన విదేశీయులను ఎక్కడిక్కడే చంపేసింది. కష్టతరంగా మృతదేహాల గుర్తింపు : ఇటీవల ఐసిస్ ప్రాబల్యం తగ్గుముఖంపట్టడం, మోసుల్ సహా ఇతర నగరాలను ప్రభుత్వ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్న దరిమిలా.. సామూహిక మారణకాండలకు సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా చనిపోయినవారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. భారత్‌లోని కుటుంబ సభ్యుల డీఎన్ఏ నమూనాలను.. మోసుల్‌లో లభించిన మృతదేహాల నమూనాలతో పోల్చుతూ వెళ్లారు. కష్టతరంగా సాగిన ఈ ప్రక్రియ అంతా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఆధ్వర్యంలో సాగిందని సుష్మా స్వరాజ్ చెప్పారు. పార్లమెంట్ నివాళి : ఇరాక్‌లో చనిపోయిన 39 మంది భారతీయులకు పార్లమెంట్ నివాళి అర్పించింది. రాజ్యసభలో రెండు నిమిషాలు మౌనం పాటించగా, లోక్‌సభలో తీర్మానాన్ని ఆమోదించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి చెప్పారు. -
ఏ పార్టీ మమ్మల్ని ఫిక్స్ చేయలేదు
-
ఆగని ఆందోళనలు.. లోక్‌సభ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్, అన్నాడీఎంకేల నిరవధిక ఆందోళన కారణంగా లోక్‌సభలో గందరగోళం నెలకొంది. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టాలని భావించారు. కానీ అప్పటికే ఎంపీలు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాసతీర్మానం నేడు సభముందుకు రానున్న దరిమిలా అన్ని రాజకీయ పక్షాలూ సహకరించాని వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభ కూడా: రెండో విడత బడ్జెట్ సమావేశాల ప్రారంభం నుంచి దిగువ సభ మాదిరే పెద్దలసభలోనూ ఆందోళనలు వ్యక్తం తెలిసిందే. నేడు కూడా అలాంటి పరిస్థితే తలెత్తింది. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం తీరును కాంగ్రెస్ తప్పుపట్టింది. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభను రేపటికి వాయిదావేశారు. -
‘అవిశ్వాసం’పై టీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ: తెలంగాణలో అధికార పార్టీగా ఉంటూనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాటాన్ని సమర్థించిన టీఆర్ఎస్.. ఎన్డీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం విషయంలో మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల అంశంపై గడిచిన కొద్ది రోజులుగా పార్లమెంట్లో ఆందోళనలు చేస్తోన్న టీఆర్ఎస్ ఎంపీలు.. అవిశ్వాస తీర్మానం నోటీసులను స్పీకర్ చదివిన సందర్భాల్లోనూ వెనక్కి తగ్గకపోవడం, దాంతో అవిశ్వాసంపై చర్చ జరగకుండా సభ వాయిదాపడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ వైఖరి ఇదే.. : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయంలో టీఆర్ఎస్ తటస్థంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు ఎంపీలు తెలిపారు. రిజర్వేషన్లను రాష్ట్రానికే వదిలిపెట్టాలన్న డిమాండ్‌తో లోక్‌సభలో చేస్తున్న ఆందోళనలు మంగళవారం కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోమవారం కూడా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ధర్నా చేశారు. ఆ సందర్భంలో మీడియా అడిగి పలు ప్రశ్నలకు వారు సమాధానాలిచ్చారు. బీజేపీకి సహకరిస్తున్నారా? : అవిశ్వాస తీర్మానాలు సభ ముందుకు వచ్చేలా మీరు మద్దతుగా నిలబడితే ఈ అంశాలన్నీ చర్చకు వస్తాయి కదా అని ఎంపీ జితేందర్‌రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ‘రెండు వారాలుగా మా డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నాం. డిమాండ్లను హౌస్‌లో పెట్టి పరిష్కరించుకుంటాం. ఎవ్వరినీ అనుసరించాల్సిన అవసరం మాకు లేదు. సరైన హామీ లభించే వరకు ఆందోళన కొనసాగుతుంది’అని సమాధానమిచ్చారు. టీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయికదాని విలేకరులు ప్రస్తావించగా... ‘వాళ్లకు వాళ్లు ఆరోపణలు చేసుకోవడం కాదు. ఈరోజు వాళ్లకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని మనసొచ్చింది. మా ప్రజల ఆకాంక్షలు, డిమాండ్లు మాకు ముఖ్యం. మా డిమాండ్లపై వాళ్లు వాగ్దానం చేసి మమ్మల్ని కూర్చోబెడితే కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం’అని చెప్పుకొచ్చారు. -
రాజకీయ పార్టీలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి
-
అవిశ్వాసం; 150 మంది ఎంపీలు నిలబడ్డారు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్సీపీ మరోమారు అవిశ్వాసతీర్మానం పెట్టనుంది. సోమవారం లోక్‌సభ వాయిదా పడిన అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. లోక్‌సభ సెక్రెటరీ జనరల్ స్నేహలతా శ్రీవాత్సవకు నోటీసులు అందజేశారు. ఇంతకు ముందు రెండు సార్లు ఇచ్చిన నోటీసులపై సభలో చర్చ జరగని కారణంగా.. మూడోసారి నోటీసులు ఇవ్వడం అనివార్యమైందని ఆ పార్టీ ఎంపీలు చెప్పారు. 150 మంది లేచి నిలబడ్డారు: వైవీ కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభలో అనూహ్య మద్దతు లభించిందని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. సభ వాయిదా అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ‘‘స్పీకర్‌గారు అవిశ్వాస తీర్మానం నోటీసులను చదివినతర్వాత 150 మందిదాకా ఎంపీలు లేచి నిలబడ్డారు. అయితే అప్పటికే పోడియం దగ్గర కొన్ని పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. సభ ఆర్డర్లో లేనికారణంగా చర్చను చేపట్టలేకపోతున్నట్లు స్పీకర్ చెప్పారు. గందరగోళ పరిస్థితుల్లోనే ఆర్థిక బిల్లులు ఆమోదించుకున్నారే, మరి అవిశ్వాసంపై చర్చను మాత్రం వాయిదా వేయడం ఎంతవరకు సబబు? స్పీకర్, కేంద్రం తీరును మేం నిరసిస్తున్నాం. నేడు స్పీకర్ ఇచ్చే విందును కూడా వైఎస్సార్సీపీ బహిష్కరిస్తున్నది. చర్చ జరిగే వరకూ నోటీసులు ఇస్తూనేఉంటాం..’ అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అందుకే బాబును నమ్మొద్దు: మేకపాటి ‘‘హోదా కోసం నిజాయితీగా పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్సీపీనే. ఈ క్రమంలో వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. వాస్తవానికి అవసరాలమేరకు రంగులు మార్చడంలో చంద్రబాబును మించినవాళ్లు లేనేలేరు. మొన్నటిదాకా ప్యాకేజీ చాలన్నీ సీఎం.. దేశంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని గమనించి మళ్లీ హోదా కావాలంటూ యూటర్న్ తీసుకున్నారు. ఏ ఎండకు ఆ గొడుగుపట్టే వ్యక్తిగనుకే బాబును ఎవరూ నమ్మొద్దు’’ అని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఎంపీల రాజీనామాలపై స్పందించాలి: విజయసాయిరెడ్డి ‘‘రాజకీయ, సామాజిక, ఆర్థిక నేరగాడైన చంద్రబాబు.. హోదా విషయంలో మొసలి కన్నారు పెడుతున్నాడు. ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎంపీల రాజీనామాలపై వెంటనే స్పందించాలి. రాష్ట్ర సమస్యలపై నేను ప్రధానిని కలిస్తే తప్పేముంది? తన సొంత కొడుకుని కూడా నమ్మని చంద్రబాబు తనలాగే అందరూ ఉంటారని అనుకుంటారు. అవినీతి సొమ్మును బాబు విదేశాలకు ఎలా తరలిస్తున్నాడో ప్రధానికి వివరించాను. మాపై నమోదైన కేసులు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి కాబట్టి చంద్రబాబు న్యాయస్థానాలనే తప్పుపట్టేలా మాట్లాడటం సరికాదు’’ అని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. -
దేశమంతటా ఇదే చర్చ..
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ హక్కు ప్రత్యేక హోదా కోసం పట్టుసడలించకుండా వైఎస్సార్సీపీ కొనసాగించిన పోరు సత్ఫలితాలనిస్తోంది. హోదా ఇవ్వని కారణంగా కేంద్రంపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గురు, శుక్రవారాల్లో యావత్ జాతీయ మీడియా ఇదే అంశాన్ని ప్రధాన శీర్షికల్లో పొందుపర్చింది. టీడీపీ కూడా వైఎస్సార్సీపీ బాటనే అనుసరిస్తూ అవిశ్వాసం పెడతాని ప్రకటించడంతో రాబోయే రోజుల్లోనూ ‘ఏపీకి హోదా’ అంశమే హైలైట్ కానుంది. సోమవారం మళ్లీ నోటీసులిస్తాం : శుక్రవారం సభ ఆర్డర్లో లేని కారణంగా వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాసం నోటీసులపై చర్చ చేపట్టలేకపోతున్నట్లు లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. దీంతో సోమవారం తిరిగి నోటీసులు ఇస్తామని వైఎస్సార్సీపీ ఎంపీలు చెప్పారు. అవిశ్వాసంపై చర్చ జరగాల్సిందేనని, ఇందుకోసం ఎన్నిసార్లైనా నోటీసులు ఇచ్చేందుకు వెనుకాడబోమని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. హోదాకు జై కొట్టిన అన్ని పార్టీలు.. : అవిశ్వాసంపై లోక్‌సభ స్పీకర్‌కు గురువారమే నోటీసులు ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీల బృందం.. అదేరోజు దాదాపు అన్ని పక్షాల నేతలను కలిసి మద్దతు కోరింది. కాంగ్రెస్, శివసేన, టీఎంసీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, ఏఐఏడీఎంకే, ఆమ్‌ఆద్మీలు, బీజేడీ, టీఆర్ఎస్ పక్ష నేతలతోపాటు టీడీపీ పార్లమెంటరీ నేత తోట నర్సింహంను కూడా వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కలిసింది. ఏపీ ఆకాంక్షను సమర్థిస్తామని మెజారిటీ పక్షాలు ప్రకటించాయి. కానీ అంతలోనే టీడీపీ.. తాము ప్రత్యేకంగా తీర్మానం పెట్టబోతున్నట్లు ప్రకటించింది. వైఎస్సార్సీపీ తీర్మానానికి మద్దతిచ్చిన పక్షాల్లో కొన్ని టీడీపీ తీర్మానానికి కూడా మద్దతిస్తామని చెప్పాయి. ఒకవైపు వైఎస్సార్సీపీ తీర్మానానికి టీడీపీ మద్దతు ఇవ్వలేదు. అయినాసరే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ సహా ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామని వైఎస్సార్సీపీ ప్రకటించడం గమనార్హం. ఇది ప్రజల విజయం : ‘‘రాజకీయంగా వేరే మార్గం లేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టీడీపీ మరోసారి అనుసరిస్తోంది.. ఇది ముమ్మాటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రజాస్వామ్యం సాధించిన విజయం’’ అని తాజా పరిణామాలపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘‘ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్న పాలకుల నోటితో... కాదు, హోదా మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని అనిపించేలా చేసిన ఘనత ఒక్క వైఎస్సార్సీపీకే దక్కుతుందని, హోదా ఉద్యమాన్ని సజీవంగా నిలపడంలో, లెక్కకుమించిన కార్యక్రమాల ద్వారా ప్రజలను సంఘటితం చేయడంలో విజయం సాధించామని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. -
‘అవిశ్వాసం’పై మాట్లాడిన లోక్‌సభ స్పీకర్..
-
‘అవిశ్వాసం’పై మాట్లాడిన లోక్‌సభ స్పీకర్..
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ హక్కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందించారు. వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన నోటీసులు తనకు అందాయని చెప్పారు. ఈ మేరకు నోటీసులను ఆమె చదివి వినిపించారు కూడా. ‘‘లోక్‌సభ నియమావళిలోని 17 అధ్యాయం 198(బీ) నిబంధన మేరకు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గారు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు నాకు అందాయి. హౌజ్ అదుపులోకి వస్తే దానిపై చర్చ చేపడతాను..’’ అని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. ఆ సమయంలో కొన్ని పక్షాలు వేర్వేరు డిమాండ్లతో స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తుండటంతో ఆమె సభను సోమవారానికి వాయిదా వేశారు. దీంతో వైఎస్సార్సీపీ సోమవారం మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు ఆ పార్టీ ఎంపీలు తెలిపారు. సభ అదుపులో ఉంటేనే అవిశ్వాసం చర్చ సాధ్యం.. రాజ్యాంగంలోని 75(3) ప్రకరణ ప్రకారం లోక్‌సభకు మంత్రిమండలి బాధ్యత వహిస్తుంది. దానిపై నమ్మకం కోల్పోయామని భావించినప్పుడు ఏ సభ్యుడైనా అవిశ్వాస తీర్మాన కోసం నోటీసు ఇవ్వొచ్చు. లోక్‌సభ నియమావళిలోని 17 అధ్యాయం 198(బీ) నిబంధన మేరకు అవిశ్వాస తీర్మానం కోసం నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఇస్తారు. ఈ తీర్మానాన్ని సభలో చర్చకు చేపట్టాలంటే కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. నోటీసును స్పీకర్ పరిశీలించాక.. సభ్యుల మద్దతుందని సభ్యుడు చెప్పిన తర్వాత.. ఆ 50 మంది లేచి నిలబడాలి. స్పీకర్ సంతృప్తి చెందితే.. చర్చకు స్వీకరిస్తారు. నోటీసును స్పీకర్ పరిగణనలోకి తీసుకోవాలంటే ఆ రోజు సభ క్రమపద్ధతిలో ఉండాలి. లేకుంటే తరువాతి రోజుకు ఆ సభ్యుడు మరోసారి నోటీసివ్వాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ చర్చకు చేపడితే.. అది ముగిశాక ఓటింగ్ నిర్వహిస్తారు. తీర్మానానికి అనుకూలంగా మెజార్టీ సభ్యులు ఓటేస్తే ప్రభుత్వం పడిపోతుంది. -
లోక్‌సభ ; ఓం శాంతి.. అంతలోనే హంగామా!
న్యూఢిల్లీ : రెండో విడత బడ్జెట్ సమావేశాల ఐదో రోజు కూడా పార్లమెంట్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని లోక్‌సభ స్పీకర్ వెల్‌లోకి చొచ్చుకెళ్లారు. వారిని టీడీపీ ఎంపీలు కూడా అనుసరించారు. కార్యకలాపాలు సజావుగా నడపలేని స్థితిలో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ సరిగ్గా ఇలాంటి దృశ్యమే చోటుచేసుకుంది. ఎంపీల ఆందోళనలన నేపథ్యంలో చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా వేశారు. ఓం శాంతి.. : శుక్రవారం సభ ప్రారంభమైన వెంటనే.. ఇటీవలే దివంగతులైన సభ్యుడికి లోక్‌సభ నివాళులు అర్పించింది. స్పీకర్ సూచన మేరకు ఎంపీలందరూ మౌనంపాటించారు. ఒక నిమిషం మౌనం పూర్తయిందనడానికి సంకేతంగా స్పీకర్.. ‘ఓం శాంతి.. ఓం శాంతి..’ అని పలికారు. ఆమె మాటలు పూర్తికాకముందే ఎంపీలు ఒక్కసారిగా నినాదాలు మొదలుపెట్టారు. ‘‘ఇప్పుడే ఓం శాంతి.. అంతలోనే హంగామానా?’ అంటూ స్పీకర్ విస్తుపోయారు! దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. -
పార్లమెంట్లో నిరసనలపై స్పీకర్ ఆందోళన
న్యూఢిల్లీ : రెండో విడత బడ్జెట్ సమావేశాల తొలిరోజు నుంచే పార్లమెంట్లో నిరసనలు వ్యక్తం అవుతుండటంపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో కొద్ది నిమిషాలు మాట్లాడిన ఆమె.. ఎంపీల తీరును తప్పుపట్టారు. ‘‘సభ సజావుగా జరిగేలా సహకరించాలని నేను చేసిన మనవిని సభ్యులు పట్టించుకోలేదు. సభలోపల ప్లకార్డులు ప్రదర్శించడం, వెల్ లోకి దూసుకురావడం లాంటి చర్యలు ఆమోదనీయంకాదు. ఇలాంటివి.. ప్రపంచం దృష్టిలో మన సభకున్న గౌరవాన్ని దిగజార్చే అవకాశం ఉంది. కాబట్టి సభ్యులంతా హుందాగా ప్రవర్తించి, సభా మర్యాదను కాపాడాలి’ అని స్పీకర్ సుమిత్రా అన్నారు. -
ఇవిగో.. బడ్జెట్-2018 పత్రాలు వచ్చేశాయి..
సాక్షి, న్యూఢిల్లీ : వార్షిక బడ్జెట్ 2018-19 పత్రాలు పార్లమెంట్‌కు వచ్చాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. నేటి ఉదయమే బడ్జెట్ సూట్‌కేసుతో ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్న జైట్లీ.. అక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ప్రధమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్‌ను కలుసుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఇది ఆనవాయితీగా వస్తున్నది. ఈ మర్యాదపూర్వక భేటీకి జైట్లీతో పాటు ఆర్థిక శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా వచ్చారు. కేబినెట్ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం ఉదయం కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అయింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభంకానున్నాయి. వరాలు.. తాయిలాలు! : వచ్చేఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనుండటంతో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. అటు సార్వత్రిక ఎన్నికలు, మరి కొద్ది రోజుల్లో 8 రాష్ట్రాల్లోజరుగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అన్ని వర్గాలనూ మెప్పించే రీతిలో బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు తెలిసింది. ప్రధానంగా వ్యయసాయ రంగానికి ఊతమిచ్చేలా, వేతన జీవులపై భారాన్ని తగ్గించేలా బడ్జెట్ ఉండబోతున్నది. ద్రవ్యలోటు కట్టడి చేయడం కూడా ప్రభుత్వ ప్రాధామ్యాల్లో కీలకం కానుంది. ప్రెసిడెంట్ కోవింద్‌తో ఫైనాన్స్ మినిస్టర్ భేటీ -
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చితీరాలి..
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై నిర్వహించిన అఖిలపక్షంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంటరీ వ్యవహాల శాఖ మంత్రి అనంత్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి హాజరైన విజయసాయిరెడ్డి అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో విజ్ఞప్తి చేశామన్నారు. హోదా విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని సూచించారు. రైల్వేజోన్ విషయంలో జాప్యం తగదని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని వాగ్దానాలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించాలని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని కోరినట్టు తెలిపారు. మేము లేవనెత్తిన అంశాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నోట్ చేసుకున్నారని, ప్రభుత్వం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నామని చెప్పారు. ఏపీ రెవెన్యూ లోటును కేంద్రం పూర్తిగా పూడ్చలేదని చెప్పారు. అఖిలపక్షం భేటీలో విజయసాయి రెడ్డితోపాటు టీడీపీ నుంచి తోట నరసింహం, టీఆర్ఎస్ నుంచి కేకే, జితేందర్ రెడ్డి, జాతీయ విపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా విపక్షాలను కోరింది. -
ఎల్లుండి అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదివారం అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా అన్ని రాజకీయపార్టీల నేతల్ని ఆమె ఆహ్వానించారు. పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపక్షాల అభిప్రాయం తెలుసుకునేందుకు కేంద్రం ఇదే తరహా సమావేశం ఒకటి నిర్వహించనుంది. ఈ నెల 29న ఆర్థిక సర్వేను, ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడుతుందనిఅధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ఉభయ సభల్ని ఉద్దేశించి చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని కోవింద్ ప్రస్తావించే వీలుంది. -
ప్రధాని మోదీపై రాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకుంటారని, ఏ అంశాన్నైనా చాలా నేర్పుగా పరిష్కరించగలరని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ప్రధాని మోదీలోని అద్భుతమైన ఈ గుణం తనకు ఎంతగానో నచ్చిందని ఆయన కొనియాడారు. రాష్ట్రపతి ప్రణబ్ శుక్రవారం ఆయన ముంబైలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో ప్రసంగించారు. పార్లమెంట్ సమావేశాలను సమర్ధవంతంగా డీల్ చేయటంలో మోదీ ప్రతిభను గుర్తించానని చెప్పారు. కేవలం ఒక రాష్ట్ర పాలకునిగా మాత్రమే అనుభవం గడించిన మోదీ నేరుగా ప్రధానమంత్రిగా పార్లమెంట్లో అడుగుపెట్టటం అపూర్వమన్నారు. ప్రధాని హోదాలో జీ-20 దేశాల సమావేశాల్లోనూ చతురతతో వ్యవహరించి మోదీ అందరి ప్రశంసలు అందుకున్నారని.. ఆర్థిక వ్యవహారాలతో పాటు ఇతర దేశాలతో సత్సంబంధాల్లోనూ నేర్పరితనం చూపుతున్నారని ప్రశంసించారు. అయితే, విలువైన పార్లమెంట్ సమావేశాలు గొడవలతో వృథా కావటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో అమూల్యమైన సమావేశాలను అనవసర విషయాలతో పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు పన్నుల రూపంలో అందజేసే డబ్బును ఖర్చు చేయటంపై చట్టసభలు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని ప్రణబ్ సూచించారు. -
'ట్రంప్ వచ్చాకే దాడులు పెరిగాయి'
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే అక్కడ మన దేశీయులపై జాత్యహంకార దాడులు పెరిగాయని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార దాడులపై లోక్‌సభ మలివిడత బడ్జెట్ సమావేశాలలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి అంశంపైనా ట్విట్టర్లో స్పందిస్తారని, మరి ఈ జాత్యహంకార దాడుల విషయంలో మాత్రం ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఖర్గే ప్రశ్నించారు. ప్రధాని వెంటనే ఈ అంశంపై సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అమెరికాలో భారతీయులకు భద్రత కరువైందని, అక్కడ మనవాళ్ల మీద జరుగుతున్న దాడులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. కాగా.. అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార దాడుల అంశాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని, వచ్చేవారం ఈ అంశంపై సభలో ప్రకటన చేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభకు తెలిపారు. -
ఏపీకి హోదా కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు
వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు లోక్‌సభ ఎజెండాలో ఈ బిల్లును తొమ్మిదవ అంశం గా పొందుపర్చారు. అనాథ పిల్లలకు సాంఘిక భద్రత కల్పించడం లక్ష్యంగా టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్, జంతువుల చట్టంలో సవరణలు తేవాలని టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెడుతున్నారు. ఉచిత విద్యా చట్టం, 2009లో సవరణలను ప్రతిపాదిస్తూ ఎంపీ టి. సుబ్బరామిరెడ్డి రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడతారు. రాజ్యాంగంలో సవరణలను ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ ఎంపీలు కేవీపీ రామచందర్ రావు, పాల్వాయి గోవర్ధన రెడ్డి వేర్వేరుగా ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. -
పార్లమెంట్ ఉభయసభల్లో రగడ
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రకటన తర్వాత శుక్రవారం తిరిగి ప్రారంభమైన పార్లమెంటులో గందరగోళం నెలకొంది. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు పెద్ద పెట్టున నినాదాలు చేశాయి. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టేప్రయత్నం చేయగా, కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకున్నారు. సీనియర్ పార్లమెంట్ సభ్యుడైన ఇ.అహ్మద్ మరణాన్ని పరిగణలోకి తీసుకోకుండా బడ్జెట్ ప్రదేశపెట్టడం దారుణమని, ఆయన మరణవార్తను ప్రకటించడంలో కుట్రలు జరిగాయని ఆరోపిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్.. సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. అటు రాజ్యసభ మొదలవుతూనే తృణమూల్, జేడీయూ సహా ఇతర విపక్షాలు ఆందోళన చేశాయి. డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రశ్నోత్తరాలను చేపట్టగా, తమ ఎంపీల అరెస్టులపై తృణమూల్ నినాదాలు చేసింది. శారద చిట్‌ఫండ్ స్కాంలో తమ ఎంపీలు సుదీప్ బందోపాథ్యాయ, తపస్ పౌల్‌లను సీబీఐ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికచర్య అని తృణమూల్ ఎంపీ ఒబ్రెయిన్ అన్నారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా టీఎంసీ సభ నుంచి వాకౌట్ చేసింది. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఎంసీ సభ్యులు దీక్ష చేశారు. ఎంపీ అహ్మద్ మృతి అంశాన్ని సభలో లేవనెత్తుతామని కాంగ్రెస్ పార్టీ సభా నాయకుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో చెప్పారు. పార్లమెంట్ సమావేశాలకు కొద్ది నిమిషాల ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. దివంతగ ఎంపీ అహ్మద్‌ను ప్రభుత్వం అవమానించిందని అన్నారు. మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులో గుండెపోటుకుగురైన మళప్పురం(కేరళ) ఎంపీ అహ్మద్ బుధవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి నేపథ్యంలో బడ్జెట్‌ను ఒకరోజు వాయిదా వేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు నిరాకరించిన ప్రభుత్వం బడ్జెట్‌ను యధావిధిగా ప్రవేశపెట్టింది. దీనిపై ఆందోణ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. -
ఎంపీ హఠాన్మరణం : కేంద్ర బడ్జెట్ వాయిదా?
-
కేంద్ర బడ్జెట్ వాయిదా..?
న్యూఢిల్లీ: చరిత్రాత్మక బడ్జెట్ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయనున్నట్లు తెలిసింది. ముందుగా అనుకున్నట్లు ఫిబ్రవరి 1న కాకుండా రేపు(ఫిబ్రవరి 2న) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది. కేరళలోని మళప్పురం పార్లమెంట్ స్థానం సిట్టింగ్ ఎంపీ ఇ. అహ్మద్ ఆకస్మిక మరణం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిన్న(మంగళవారం) పార్లమెంట్ సెంట్రల్ హాలులో గుండెపోటుకు గురై, ఆస్పత్రిలో చేరిన ఎంపీ అహ్మద్.. బుధవారం తెల్లవారుజామున రెండుగంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే అహ్మద్ కిందపడిపోయారు. దీంతో సిబ్బంది ఆయనను రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. కొద్ది గంటల చికిత్స అనంతర బుధవారం ఉదయం2:30 గంటల సమయంలో అహ్మద్ కన్నువూశారు. పార్లమెంట్ నిబంధనల ప్రకారం సిట్టింగ్ ఎంపీ చనిపోయిన సందర్భాలలో ఉభయసభలలోనూ ఆయన/ఆమె కు అంజలిఘటిస్తారు. రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం సభ ఒకరోజుకు వాయిదా వేస్తారు. బడ్జెట్ వాయిదా వార్తలపై పై ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోశ్ గాంగ్వర్ స్పందించారు. ‘ఎంపీలు చనిపోయినప్పుడు సభను వాయిదా వేడయం ఆనవాయితీనే. అయితే తుది నిర్ణయం మాత్రం స్పీకర్‌దే’అని గాంగ్వర్ అన్నారు. సాధారణంగా సమావేశాలు లేని సందర్భంలోనూ ఎంపీలు ఎవరైనా చనిపోతే, ఆ సీజన్లో సభ ప్రారంభమైన మొదటిరోజే మృతులకు నివాళులు అర్పించిన పిదప సభను వాయిదావేస్తారు. గత ఏడాది వేసవి కాల సమావేశాల్లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. షహదోల్(మధ్యప్రదేశ్) నియోజకవర్గ ఎంపీ దళ్పత్ సింగ్ పరాస్తే జూన్ 1న కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపకంగా వేసవికాల సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజే నివాళులు అర్పించి, సభను వాయిదావేశారు. మలప్పురం ఎంపీ ఇ.అహ్మద్ పార్లమెంట్ హాలులోనే అస్వస్థతకుగురై, ఆస్పత్రిలో కన్నుమూశారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వంలో అహ్మద్ విదేశాంగ శాఖ సహాయమంత్రిగానూ పనిచేశారు. ఎంపీ అహ్మద్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘పశ్చిమ ఆసియా’పై ఆయనది కీలక పాత్ర: ప్రధాని మోదీ రాజకీయరంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న అహ్మద్ కేరళ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని, ఆయన మరణం తీవ్ర వేదన కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. విదేశాంగ మంత్రిగా పశ్చిమ ఆసియా దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడంలో అహ్మద్ కీలక పాత్ర పోశించారని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. చురుకైన రాజకీయవేత్తగా అహ్మద్ పేరుతెచ్చుకున్నారని, ఆయన అకాలమరణం బాధకుగురిచేసిందని అన్నారు. (పార్లమెంట్లో పడిపోయిన ఎంపీ.. ఆస్పత్రికి తరలింపు) -
పార్లమెంట్లో పడిపోయిన ఎంపీ.. ఆస్పత్రికి తరలింపు
- సెంట్రల్ హాలులో రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా ఘటన న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల తొలిరోజే ఓ ఎంపీ అస్వస్థతకు గురవ్వడంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభోపన్యాసం చేస్తున్న సమయంలోనే మాజీ మంత్రి, ప్రస్తుత కేరళ ఎంపీ ఇ.అహ్మద్ పడిపోవడంతో పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఆందోళనకర పరిస్థితి చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూనే సభకు వచ్చిన అహ్మద్ నీరసంతో పడిపోయారు. పార్లమెంట్ సిబ్బంది అప్రమత్తమై ఎంపీని ఆసుపత్రికి తరలించారు. మళప్పురం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన ఇ.అహ్మద్.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీ జాతీయ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. యూపీఏ-2లో విదేశాంగ శాఖ సహాయమంత్రిగానూ అమ్మద్ పనిచేశారు. ఆస్పత్రిలో చేరిన కొద్ది గంటలకే ఎంపీ అహ్మద్ కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున 2:30కు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. -
ఇవి చరిత్రాత్మక సమావేశాలు
-
ఇవి చరిత్రాత్మక సమావేశాలు
- తొలిసారి సాధారణ బడ్జెట్లో ‘రైల్వే’ విలీనం - ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్’ నినాదంతో ప్రభుత్వం ముందడుగు - పీడిత వర్గాల అభ్యున్నతికి విశేషకృషి - బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన రాష్ట్రపతి - ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రణబ్ ముఖర్జీ - రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి న్యూఢిల్లీ: అనేక కారణాల రీత్యా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు చరిత్రాత్మకవైనవని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మంగళవారం ఉదయం పార్లమెంట్ బడ్జెట్ మావేశాలను ప్రారంభించిన ఆయన.. దశాబ్దాల సంప్రదాయానికి విరుద్ధంగా రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. సబ్కా సాత్ - సబ్కా వికాస్(సమిష్టిగా సర్వతోముఖాభివృద్ధి) నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని చెప్పారు. పీడిత, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ క్రమంలోనే గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. అంతకుముందు, బడ్జెట్ సమావేశాలను ప్రారంభించేందుకు పార్లమెంట్ భవనానికి చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ చైర్మన్(ఉపరాష్ట్రపతి) హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తదితరులు ప్రణబ్‌కు వందనం చేసి సభలోపలికి తీసుకెళ్లారు. జాతీయగీతాలాపన తర్వాత రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రేపు(బుధవారం ) ఉదయం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. -
ఇటు కత్తులు, అటు కసరత్తులు, పైన ఎండ!
న్యూఢిల్లీ: భానుడి భగభగలకు రాజకీయ సెగలు తోడైతే దేశం ఉక్కపోతతో అల్లాడిపోదూ! సోమవారం నుంచి సరిగ్గా అలాంటి పరిస్థితే నెలకొనబోతోంది... పార్లమెంట్ ఉభయ సభల్లో సమావేశాల పునఃప్రారంభంతో! బడ్జెట్ సెషన్స్ లో భాగంగా రెండో దశ సమావేశాలు సోమవారం(ఏప్రిల్ 25) నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఎక్కుపెట్టేందుకు ప్రతిపక్షాలు సమస్యలనే కత్తులను నూరుతుంటే, వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు అమితమైన కసరత్తుచేస్తోంది పాలకపక్షం. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పిలుపుమేరకు ఆదివారం అఖిలపక్షం భేటీకానుంది. మరోవైపు కీలక సమస్యలపై చర్చ చేపట్టాలంటూ పలువురు విపక్ష సభ్యులు ఇప్పటికే స్పీకర్, చైర్మన్ లకు నోటీసులు అందచేశారు. వాటిలో అధిక శాతం ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం, మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా నెలకొన్న కరువుకు సంబంధించినవే కావటం.. ఈ దఫా సమావేశాలు ఎలా జరగబోతున్నాయనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న ఉత్తరాఖండ్ పరిణామాలపై చర్చను చేపట్టాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులామ్ నబీ ఆజాద్, ఉపనేత ఆనంద్ శర్మలు చైర్మన్ కు శుక్రవారమే నోటీసులు ఇచ్చారు. 267వ నిబంధన ప్రకారం చర్చకు అనుమతించాలని కోరినట్లు వారు తెలిపారు. మహారాష్ట్ర సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను అంచనావేయడంలో, ఉపశమన చర్యలు తీసుకోవడంలో ఎన్డీఏ సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ మరికొందరు విపక్ష ఎంపీలు కరువుపై చర్చను కోరుతున్నారు. అయితే బడ్జెట్ సంబంధిత బిల్లుపై చర్చకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటనతో ప్రభుత్వ తీరు ఎలా ఉండబోతోందో తెలుస్తోంది. రెండు రోజుల కిందట హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన కీలకమైన బిల్లులకు అడ్డుపడుతోందని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాగా, ఆదివారంనాటి అఖిలపక్ష భేటీ, సోమవారం ఉదయం జరిగే బీఏసీ సమావేశాల్లో సభ జరగబోయే తీరుతెన్నులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
చర్చ వద్దు.. సమాధానమే కావాలి!
రాజ్యసభలో బుధవారం విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్ష సభ్యులు కోరిన అంశంపై చర్చకు అధికార పక్షం సరేనని చెప్పినా.. బీఎస్పీ సభ్యులు మాత్రం తమకు చర్చ అవసరం లేదని, తమ పార్టీ అధినేత్రి మాయావతి తన ప్రసంగంలో వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి తక్షణం సమాధానం కావాలని పట్టుబట్టారు. ఉదయం రాజ్యసభ సమావేశం అయిన తర్వాత మాయావతి తనకు కేటాయించిన సమయం కంటే మరింత అదనపు సమయం తీసుకుని.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సెంట్రల్ యూనివర్సిటీలలో రుద్దాలని చూస్తోందని ఆరోపించారు. తాను ప్రస్తావించిన అంశాలకు ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దాంతో కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కల్పించుకుని, ఈ అంశంపై రెండు గంటల పాటు చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. చర్చ తర్వాత అధికారపక్షం నుంచి సమాధానం వస్తుందన్నారు. కానీ, అందుకు బీఎస్పీ సభ్యులు ససేమిరా అన్నారు. పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. సభను ఎన్నిసార్లు 10, 15 నిమిషాల చొప్పున వాయిదా వేసిన ప్రయోజనం కనిపించలేదు. చివరకు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొంది. సభా నాయకుడు అరుణ్ జైట్లీ కల్పించుకుని, రెండు గంటల పాటు దీనిపై చర్చిద్దామని, వాళ్లు లేవనెత్తే ప్రతి ఒక్క ప్రశ్నకూ తాము సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దాంతో సీతారాం ఏచూరిని చర్చ ప్రారంభించాల్సిందిగా డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ కోరారు. ఆయన మాట్లాడేలోపే సభలో గందరగోళం యథాతథంగా కొనసాగింది. ఇలాగే అయితే తాను చర్యలు తీసుకోక తప్పేలా లేదని కురియన్ హెచ్చరించినా ఫలితం కనిపించలేదు. ఆ సమయంలో ఆయన సభను మరో 15 నిమిషాలు వాయిదా వేశారు. -
మోదీ సర్కారు తొలి బడ్జెట్‌పై భారీ అంచనాలు
-
24 ఏళ్ళుగా పెండింగ్‌లో రైల్వే ప్రాజెక్ట్‌లు
-
రైల్వే బడ్జెట్ మరి కాసేపట్లో పట్టాలెక్కనుంది
-
కొత్త రైల్వే జోన్ లేనట్టేనా?
-
బడ్జెట్ పై ఉత్కంఠ
-
క్వొశ్చన్ అవర్ రద్దుకు కాంగ్రెస్ నోటీసు
న్యూఢిల్లీ : రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం రద్దుకు కాంగ్రెస్ పార్టీ మంగళవారం నోటీసు ఇచ్చింది. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ రూల్ 267 నిబంధన ప్రకారం ఈ నోటీసు ఇచ్చారు. భూ సేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రాజ్యసభలో కాంగ్రెస్ ....ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. రైతులకు అన్యాయం చేసే ఆర్డినెన్స్‌ను తక్షణమే వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ సభలో డిమాండ్ చేయనుంది. కాగా రెండోరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. మరోవైపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఈరోజు ఉదయం ఇక్కడ సమావేశమైంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పలు కీలక బిల్లుల ఆమోదం తదితర అంశాలపై చర్చించింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు.