
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలువురు కేంద్రమంత్రులు, పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశం సందర్భంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం.. సభ్యులకు అందజేసింది.
ఇక, ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లోనే (Budgest Session) వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్‌కు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతోపాటు మొత్తం 16 బిల్లులను సభల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. అలాగే, ఫైనాన్స్ బిల్లు 2025, ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 2025-26 సంవత్సరానికి గాను వివిధ శాఖల పద్ధులపై పార్లమెంటులో చర్చ జరగనుంది. దీనికి సంబంధించిన జాబితాలను అఖిలపక్ష సభ్యులకు అందించింది.
ఇదిలా ఉండగా.. వక్ఫ్ చట్టంలో మార్పుల పరిశీలన కోసం ఏర్పాటుచేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ (JPC) ఇటీవల సవరణ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా.. 14 సవరణలను కమిటీ ఆమోదించింది. దానికి సంబంధించిన తుది నివేదికను సిద్ధం చేసి.. తాజాగా లోక్‌సభ స్పీకర్‌కు అందించింది. దీంతో, సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
All party meeting ahead of the #Budget Session begins at the #Parliament House complex. #Budget2025 pic.twitter.com/Pnu3tYuNzb
— All India Radio News (@airnewsalerts) January 30, 2025