waqf board
-
ఇంటర్ చదువుకే సీఈవో చేసేశారు
సాక్షి, అమరావతి: విద్యార్హతలు, సమర్థతతో పనిలేదు.. తాము చెప్పినట్టు వినే వాడైతే చాలు.. డీల్ కుదుర్చుకుని కీలక పోస్టుల్లో కూర్చోబెడతాం అని టీడీపీ కూటమి సర్కారు మరోసారి రుజువు చేసింది. దీనిలోభాగంగానే వేలాది ఎకరాలు.. రూ.వేల కోట్ల విలువైన ఆస్తులున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈవో) పోస్టును ఇంటర్ చదివిన ఉద్యోగికి కట్టబేట్టేశారు. బోర్డు చైర్మన్‌గా అజీజ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆధిపత్య పోరు మొదలైంది. ఇప్పటికే హజ్ కమిటీ, ఉర్దూ అకాడమీ వంటి కీలక బాధ్యతల నుంచి ఎల్.అబ్దుల్ ఖాదీర్ను తప్పించగా, తాజాగా వక్ఫ్ బోర్డు సీఈవో పోస్టు నుంచి కూడా తొలగించారు. ఈ నేపథ్యంలో తెరచాటు లాబీయింగ్‌తో మహమ్మద్ అలీ సీఈవో పదవి రేసులోకి వచ్చారు. వక్ఫ్ బోర్డుకు అత్యంత కీలకమైన సీఈవో పోస్టును 12వ తరగతి (ఇంటర్) మాత్రమే చదివిన అలీకి కట్టబెట్టే సాహసం చేయడం వెనుక డీల్ కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది. వక్ఫ్ బోర్డులో స్టెనోగా చేరిన అలీ ప్రస్తుతం డిప్యూటీ సెక్రటరీ హోదాకు వచ్చినప్పటికీ గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకు కూడా లేదు. ఆయనపై వక్ఫ్ సంస్థలకు చెందిన ఫైల్స్ తారుమారు (ఫోర్జరీ) చేశారనే ఆరోపణలు, అనేక అక్రమాలకు సంబంధించిన విచారణలు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. అలీ సకుటుంబ సపరివారం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి వక్ఫ్ బోర్డులో కనీస నియమ నిబంధనలు పాటించకపోవడంతో నచ్చినవారిని నచ్చిన పోస్టుకు ఇష్టానుసారం నియామకాలు జరిగిపోయాయి. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములపాడు గ్రామం ఒకే కుటుంబానికి చెందినవారే ఏకంగా 13 మంది పైగా వక్ఫ్ బోర్డులో అనేక హోదాల్లో తిష్టవేశారు. 1983లో షేక్ మహమ్మద్ అనీఫ్ (రిటైర్డ్) వక్ఫ్ బోర్డులోకి రావడంతోనే ఆయన సకుటుంబ సపరివారమంతా క్రమంగా చేరిపోయారు. ప్రస్తుతం ఉన్న షేక్ మహమ్మద్ అలీ, షేక్ జానీ బాషా, షేక్ హుస్సేన్, మమహ్మద్ ఇమ్రాన్, షేక్ కరీముల్లా, పఠాన్ మజూద్, షేక్ ఖాజామస్తాన్, షేక్ షాజహాన్, షేక్ ఖుదవన్, షేక్ ఇమ్రాన్, మస్తాన్, రియాజుద్దీన్ తదితరులు ఒకే కుటుంబానికి చెందిన బంధువర్గం కావడం గమనార్హం. ఇలా వక్ఫ్‌బోర్డులోని 12 సెక్షన్లలో దాదాపు 73 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే వారిలో అడ్డదారిలో నియామకాలు పొందినవారే అధికంగా కావడం గమనార్హం. వక్ఫ్ బోర్డును చక్కదిద్దే ప్రయత్నం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వక్ఫ్‌బోర్డును చక్కదిద్దేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ప్రధానంగా రూ.వేల కోట్ల విలువైన ఆస్తులున్న వక్ఫ్ బోర్డు అజమాయిషిని ఐఏఎస్, ఐపీఎస్‌లకు అప్పగిస్తే వ్యవస్థను గాడిలో పెట్టవచ్చని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పలు చర్యలు చేపట్టారు. ప్రధానంగా వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు, రెండో సర్వేను పటిష్ఠంగా చేపట్టేందుకు వక్ఫ్ సర్వే కమిషనర్‌గా షిరీన్‌బేగం (ఐపీఎస్)ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియమించింది. ఆమెకు అప్పట్లో వక్ఫ్‌బోర్డు ప్రత్యేకాధికారి బాధ్యతలు కూడా అప్పగించారు. బోర్డు సీఈవో పోస్టును కూడా ఐఏఎస్‌కు కేటాయించేలా అప్పట్లో ప్రతిపాదన చేశారు. బోర్డులో లోపాలను చక్కదిద్దడంతో పాటు ఉద్యోగాల భర్తీని యూపీఎస్సీ ద్వారా చేపట్టాలని, అందుకు అవసరమైన నియమావళిని రూపొందించేలా అలీమ్ బాషాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నివేదిక కోరింది. ఇలా వక్ఫ్ బోర్డును ప్రక్షాళన చేసి చక్కదిద్దేందుకు వైఎస్సార్సీపీ గట్టి ప్రయత్నాలు చేస్తే కూటమి సర్కారు మాత్రం ఇష్టం వచి్చనట్టు వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేస్తుండటం గమనార్హం. -
టీడీపీ వాళ్లా.. అయితే వదిలేద్దాం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని పలువురు టీడీపీ నేతలు రెచ్చిపోతు న్నారు. వక్ఫ్ భూముల్లో ఎక్కడికక్కడ పాగా వేసి దర్జాగా అనుభవిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కృష్ణా జిల్లా తాడిగడపలోని సర్వే నంబర్ 176లో 12.92 ఎకరాల వక్ఫ్ భూమిని ఆక్రమించిన ఘనుడు ఈ సంక్రాంతి మూడు రోజులు ‘బరి’ తెగించి కోడి పందాలు నిర్వహించాలనుకుంటే, చివరి ఘడియలో అధికారులు అడ్డుకోవడంతో భంగపడ్డాడు. ఇప్పుడు ఆ భూమిని సాగుకు ఇచ్చేందుకు అధికారులు జనవరి 31న బహిరంగ వేలం నిర్వహిస్తామని ప్రకటించడంతో పెద్దపులిపాకకు చెందిన టీడీపీ నేతలకు అక్రమంగా సబ్ లీజ్‌కు ఇచ్చేశాడు. దీంతో వారు రాత్రికి రాత్రే ఆ భూముల్లో అడ్డగోలుగా వరినాట్లు వేసేశారు. వెంటనే వక్ఫ్ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించి తహసిల్దార్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారికి ఫిర్యాదు చేస్తే ఇప్పుడేమి చేయలేమని.. తర్వాత చూద్దామని తీరిగ్గా బదులిచ్చారు. ఆక్రమణదారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనే విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎందుకంటే అతనికి టీడీపీ నేతల అండదండలు ఉండటమే కారణం. ఇదే రీతిలో మంత్రి ఫరూక్‌కు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న టీడీపీ నేత ఒకరు అనంతపురం మసీదు ఆస్తులను 40 ఏళ్లుగా అడ్డగోలుగా అనుభవిస్తున్నాడు. నిబంధనల ప్రకారం అతను ముతవల్లిగా ఎన్నిక కాకుండానే నియామకం అయినట్టు చెప్పుకొని అధికార దుర్విని యోగానికి పాల్పడుతూ షాపింగ్ కాంప్లెక్స్ లీజుల పేరుతో అక్రమంగా జేబులు నింపుకొంటున్నాడు. ముతవల్లీలకు రాష్ట్ర నాయకుడిగా ఎన్నికైనట్టు ప్రకటించుకుని వక్ఫ్ ఆస్తులను అనుభవిస్తున్న అతనిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా, టీడీపీ నేతలు సన్మానాలు చేసి అక్రమాలకు తమ వంతు ఆశీస్సులు అందిస్తుండటం విస్తుగొలుపుతోంది. కడప నాగరాజుపేటలో సర్వే నంబర్ 18లో దర్గాకు చెందిన రూ.కోట్లు విలువైన భూమిని టీడీపీ నాయకుడు ఆక్రమించాడు. ప్రొద్దుటూరులో సుమారు రూ.70 కోట్ల విలువైన సర్వే నంబర్ 305/ఎలో 3.10 ఎకరాలు టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి సోదరుడే ఆక్రమించుకోవడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.బరితెగించి దందాలు..రాష్ట్రంలో 2014–19లో యథేచ్ఛగా సాగిన వక్ఫ్ భూముల ఆక్రమణల పర్వం కూటమి సర్కారు రాకతో మళ్లీ ఊపందుకుంది. వక్ఫ్ భూములపై పచ్చ నేతలు పంజా విసరడంతో అధికారులు అటువైపు చూసే సాహసం చేయలేక పోతున్నారు. కూటమి నేతల ఆశీస్సులతో ఆక్రమించుకున్న భూములను అనుభవించేందుకు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ముస్లిం సమాజానికి చెందిన సంస్థలు, సేవకులకు జీతభత్యాలు, విద్యా, వైద్యం వంటి సామాజిక ప్రయోజనాల కోసం శతాబ్దాలు, దశాబ్దాల క్రితం దాతలు భూములు వక్ఫ్ చేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో 3,502 వక్ఫ్ సంస్థలకు 65,783.88 ఎకరాల భూమి దానంగా సంక్రమించింది. వాటిలో ఏళ్ల తరబడి ఆక్రమణలపాలైనవి, అన్యాక్రాంతమై అనేక వివాదాల్లో ఉన్నవి, కోర్టు కేసుల్లో 31,594.20 ఎకరాలున్నాయి. ప్రస్తుతం 29,578.21 ఎకరాలు ఎటువంటి వివాదాలు లేకుండా ఉన్నాయి. ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీల నియంత్రణలో ఉన్న ఆస్తులకు సంబంధించి వక్ఫ్ ప్రాపర్టీస్ లీజు నియమాలు–2014ను అనుసరించి వ్యవసాయ అవసరాల కోసం భూములను లీజుకు ఇస్తున్నారు. దానిపై వచ్చే ఆదాయంతో ఆయా సంస్థలను ర్వహిస్తున్నారు. వక్ఫ్ భూములు, సంస్థల ద్వారా వచ్చే ఆదాయంలో ఏడు శాతాన్ని ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు నిర్వహణ కోసం చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీల ఆధ్వర్యంలో ఈద్గా, దర్గాలు, మసీదులు వంటి సంస్థల నిర్వహణ, సేవకులకు జీతభత్యాలు, ముస్లిం సమాజానికి అవసరమైన సాయం అందించేందుకు ఉపయోగిస్తారు. కాగా, వక్ఫ్ సంస్థలకు చెందిన అనేక షాపింగ్ కాంప్లెక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయం నేరుగా వక్ఫ్ బోర్డుకే చెందాలి. అయితే కూటమి నేతల మితిమీరిన జోక్యం, బెదిరింపులతో అసలు లక్ష్యం పక్కదోవ పడుతోంది. ఎన్నికల హామీని అమలు చేసిన జగన్ వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకున్నారు. ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ చట్టం–1995 ప్రకారం గత ప్రభుత్వం సర్వే కమిషనర్ ద్వారా నోటిఫై చేయని వక్ఫ్ ఆస్తుల కోసం 2వ సర్వేను నిర్వహించింది. గుంటూరు, కృష్ణాŠ, ప్రకాశం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సర్వే నిర్వహించి.. 3,295 వక్ఫ్ ఆస్తులను గుర్తించి గెజిట్ నోటిఫికేషన్‌కు చర్యలు చేపట్టింది. గెజిట్ నోటిఫికేషన్ అయిన వక్ఫ్ ఆస్తులను అధునాతన సాంకేతిక పద్దతిలో జీఐఎస్, జీపీఎస్ మ్యాపింగ్ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో సుమారు 223 వక్ఫ్ భూములు, 3,772 మసీదులు, దర్గాలకు అనుబంధమైన ఆస్తులను మ్యాపింగ్ చేశారు. దీనికితోడు ఆక్రమణల నుంచి 580.32 ఎకరాలను రికవరీ చేయగలిగారు. వక్ఫ్ భూములకు సంబంధించిన రికార్డులను కంప్యూటరీకరణ చేశారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం కలెక్టర్ చైర్మన్‌గా జిల్లాల వారీగా రక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు చొప్పున పెంచి అందించారు.వక్ఫ్ సర్వే నిర్వహించి ఆస్తులు కాపాడాలిరాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసింది. రెండవ సర్వే నిర్వహించి వక్ఫ్ ఆస్తులను ఆక్రమణలను వెలికితీసి స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదు. వక్ఫ్ సర్వేను నిర్వహించి దాతలు పెద్ద మనస్సుతో ఇచ్చిన ఆస్తులను కాపాడాలి. ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చట్టప్రకారం చర్యలు చేపట్టాలి. – షేక్ దస్తగిరి, అధ్యక్షుడు, ముస్లిం దూదేకుల జేఏసీటీడీపీ డబుల్ గేమ్‌ను ముస్లిం సమాజం గమనిస్తోందివక్ఫ్ సవరణ బిల్లు విషయంలో టీడీపీ డబుల్ గేమ్ ఆడింది. ముందు నుంచి ముస్లిం సమాజ హితం కోరుతున్న వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్సార్సీపీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించడంతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించారు. ఇప్పుడు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలోనూ కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ముస్లిం సమాజం గమనిస్తోంది. ఇప్పటికైనా వక్ఫ్ ఆస్తులు ఆక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.– కాగజ్‌ఘర్ రిజ్వాన్, అనంతపురం జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ -
బడ్జెట్ సమావేశాలు.. వక్ఫ్ సహా 16 బిల్లులను సిద్ధం చేసిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలువురు కేంద్రమంత్రులు, పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశం సందర్భంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం.. సభ్యులకు అందజేసింది.ఇక, ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లోనే (Budgest Session) వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్‌కు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతోపాటు మొత్తం 16 బిల్లులను సభల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. అలాగే, ఫైనాన్స్ బిల్లు 2025, ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 2025-26 సంవత్సరానికి గాను వివిధ శాఖల పద్ధులపై పార్లమెంటులో చర్చ జరగనుంది. దీనికి సంబంధించిన జాబితాలను అఖిలపక్ష సభ్యులకు అందించింది.ఇదిలా ఉండగా.. వక్ఫ్ చట్టంలో మార్పుల పరిశీలన కోసం ఏర్పాటుచేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ (JPC) ఇటీవల సవరణ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా.. 14 సవరణలను కమిటీ ఆమోదించింది. దానికి సంబంధించిన తుది నివేదికను సిద్ధం చేసి.. తాజాగా లోక్‌సభ స్పీకర్‌కు అందించింది. దీంతో, సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.All party meeting ahead of the #Budget Session begins at the #Parliament House complex. #Budget2025 pic.twitter.com/Pnu3tYuNzb— All India Radio News (@airnewsalerts) January 30, 2025 -
వక్ఫ్ బోర్డు పునర్నియామకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డును ప్రభుత్వం పునర్నియమించింది. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి కె.హర్షవర్థన్ శుక్రవారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు. వక్ఫ్ యాక్ట్–1995 సవరణ చట్టం–2013(సెక్షన్ 27) ప్రకారం 8మందితో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌బోర్డు సభ్యుల నియామకం చేపట్టినట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎన్నికైన సభ్యుల నుంచి ఎండీ రుహుల్లా(ఎమ్మెల్సీ), షేక్ ఖాజా(ముతవల్లీ)లను నియమించింది. మహ్మద్ నసీర్(ఎమ్మెల్యే), సయ్యద్ దావుద్ బాషా బాక్వీ, షేక్ అక్రమ్, అబ్దుల్ అజీజ్, హాజీ ముకర్రమ్ హుస్సేన్, మహ్మద్ ఇస్మాయేల్ బేగ్‌లను వక్ఫ్‌బోర్డు సభ్యులుగా నామినేట్ చేసింది. తలా తోకలేని జీవో విడుదల చేసిన ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు కమిటీ నియామకంలో కూటమి ప్రభుత్వం తలాతోక లేని జీవో ఇచ్చిందని ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా శుక్రవారం ఒక ప్రకటనలో తప్పుబట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేసిన కూటమి ప్రభుత్వం పునర్నియామక జీవో ఇవ్వడంలో కూడా నిబంధనలు పాటించలేదన్నారు. పునర్నియామకం అంటే గత జీవో ఏ సెక్షన్ల కింద సభ్యుల నియామకం జరిగిందో అదే సెక్షన్ల మేరకు సభ్యుల నియామకం చేయాలన్నారు. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిoదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో ఎంపీ, అడ్వకేట్, మహిళా, అధికారిక విభాగాల నుంచి సభ్యులకు చోటు లేకుండా చేశారని నాగుల్ మీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏఐసీసీలో ఖర్గే ఓ బొమ్మ మాత్రమే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శీతాకాల సమావేశంలో వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుందని అన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాదని తెలిపారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో వక్ఫ్ మతం కిందకు రాదని చెబుతున్నాయని,. వక్ఫ్ అనేది ఇతర దేశాల్లో ప్రభుత్వం కిందనే ఉందని తెలిపారు. ఎవరడ్డుకున్నా వక్ఫ్ బోర్డు సవరణ జరుగుతుందని చెప్పారు.ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కీలకమని.. ఎవరైనా సర్వోన్నత న్యాయస్థాన తీర్పును గౌరవించాల్సిందేనని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. దీనికి సుప్రీంకోర్టుకు మించి అధికారలిచ్చారని విమర్శించారు. ఔరంగజేబు విధానాలు ఇప్పటికీ ప్రజలను పీడిస్తున్నాయని పేర్కొన్నారు.‘300 వందల ఏళ్ల క్రితం కింద ఔరంగా జేబు నోటి మాటతో భూములిచ్చి ఉండొచ్చు, కానీ నేడు కుప్పలువుకుప్పలుగా డాక్యుమెంట్స్‌తో భూములు మావని అంటున్నారు. వక్ఫ్ బోర్డు అనేది ఒక క్రూరమైన హాస్యం, నవ్వాలో, ఏడ్వాలో, బాధపడాలో తెలియని పరిస్థితి. దేవాలయం అనేది మతానికి సంధించింది. వక్ఫ్ ఆనేది సమాజానికి సంబంధించినది.ముస్లిం ఓట్ల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ దేశాన్నైనా అమ్ముకుంటాయి. ఏఐసీసీలో ఖర్గే ఒక బొమ్మ మాత్రమే. నాడు మన్మోహన్ సింగ్‌ను ఎలా వాడుకున్నారో నేడు ఖర్గే కూడా అలాగే వాడుకుంటున్నారు.రాహుల్ తాత నెహ్రూ హాయంలో పాలేకర్ కమిషన్ ఏర్పాటు చేశారు. 1980 మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు, ఎలాంటి చర్యలు లేవు. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ విధానాలు నచ్చక అంబేద్కర్ కేబినెట్ వదిలేసి వెళ్లిపోయారు.రాజ్యాంగాన్ని బొంద పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది’ అని మండిపడ్డారు. -
ఢిల్లీ వక్ఫ్ బోర్డు కేసు: ఆప్ నేత అమానతుల్లా ఖాన్‌కు బెయిల్
ఢిల్లీ: ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అమానతుల్లా ఖాన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమానతుల్లా ఖాన్, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. వెంటనే అమానతుల్లాను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఇక..ఆయనపై విచారణ జరపడానికి అవసరమైన అనుమతి లభించలేదని పేర్కొంది. సప్లిమెంటరీ చార్జిషీట్లో పేరున్న మరియం సిద్ధిఖీపై కేసును కొనసాగించడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. అమానతుల్లా ఖాన్‌కు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు అంగీకరించగా, అవసరమైన అనుమతులు లేకుండా విచారణ కొనసాగదని కోర్టు తెలిపింది. అవసరమైన అనుమతి పొందిన తర్వాత, ఛార్జ్ షీట్‌ను పరిగణలోకి తీసుకోవచ్చని పేర్కొంది. -
వక్ఫ్ జేపీసీలో గొడవ.. టీఎంసీ ఎంపీ సస్పెన్షన్
సాక్షి,ఢిల్లీ:వక్ఫ్ చట్ట సవరణపై ఏర్పాటైన జేపిసీ సమావేశంలో గొడవ జరిగింది. గొడవకు కారణమైన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ కళ్యాణ్బెనర్జీపై సస్పెన్షన్ వేటు వేశారు. వచ్చే సమావేశానికి రాకుండా చైర్మన్ జగదాంబికా పాల్ ఆయనను సస్పెండ్ చేశారు.మంగళవారం(అక్టోబర్ 22) జరిగిన జేపీసీ సమావేశంలో బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో టేబుల్‌పై గాజుగ్లాసును కళ్యాణ్బెనర్జీ పగులగొట్టారు.దీంతో ఆయన చేతి వేళ్లకు గాయాలయ్యాయి.ఆయనకు వైద్యులు నాలుగు కుట్లు వేశారు.కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన వక్ఫ్ చట్టాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ఈ కమిటీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష, అధికార సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలతో పాటు గొడవలు జరగడం సర్వసాధారణంగా మారింది. ఇదీ చదవండి: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: ఉదయనిధి -
వక్ఫ్ కమిటీ భేటీ నుంచి విపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ)బిల్లును సమీక్షిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం వాడీవేడీ చర్చలకు వేదికగా మారింది. అధికార బీజేపీ, విపక్ష పార్టీల ఎంపీలు వాగ్వాదానికి దిగారు. చివరకు విపక్ష ఎంపీలు సమావేశాన్ని బహిష్కరిస్తూ బయటకు వెళ్లిపోయారు. నియమనిబంధనలకు విరుద్ధంగా కమిటీ సమావేశం జరుగుతోందని ఆరోపించారు. పార్లమెంట్ సంయుక్త కమిటీలో చర్చ సజావుగా సాగట్లేదని, నియమాలను పాటించడం లేదని శివసేన ఎంపీ సావంత్ మీడియాతో చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి సీనియర్ విపక్ష నేతలపై కొందరు తీవ్రమైన వ్యక్తిగత దూషణలకు దిగారని విపక్షసభ్యులు ఆరోపించారు. తమ తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు విపక్షాల సభ్యులు విడిగా సమావేశమయ్యారు. పార్లమెంట్ సంయుక్త కమిటీ సమావేశంలో జరిగిన వాగ్వాదంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేయాలని కొందరు విపక్షసభ్యులు తమ అభిప్రాయం వ్యక్తంచేశారు. విపక్ష ఎంపీలు బయటకు వెళ్లిపోయాక బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ సారథ్యంలో కమిటీ సమావేశం యథావిధిగా కొనసాగింది. ఖర్గేపై విమర్శలువక్ఫ్ భూముల కుంభకోణంతో కర్ణాటకకు చెందిన ఖర్గే, రెహ్మాన్ ఖాన్లకు ప్రమేయం ఉందని కర్ణాటక బీజేపీ నేత అన్వర్ మణిప్పాడి ఆరోపణలు గుప్పించారు. దీంతో విపక్షసభ్యులు వాగ్వాదానికి దిగారు. సభలో లేని వ్యక్తిపై నిబంధనలకు విరుద్ధంగా పార్లమెంటరీ కమిటీలో ఆరోపణలు ఎలా చేస్తారని వాదించారు. ముస్లింలకు సంబంధించిన చట్టంపై హిందూ వర్గాల అభిప్రాయాలను ఎందుకు ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటున్నారు?. ముస్లింల అభిప్రాయాలు పట్టవా? అని విపక్ష సభ్యులు నిలదీశారు. కమిటీ చీఫ్‌కి ఒవైసీ లేఖకమిటీ చీఫ్ జగదాంబికాపాల్కు ఒవైసీ ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. ‘‘సనాతన్ సంస్థ, హిందూ జనజాగృతి సమితి వంటి సంస్థలు హిందూ అతివాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. భారత్‌ను హిందూదేశంగా మార్చడమే వారి లక్ష్యం. భారత సర్కార్‌కు వ్యతిరేకంగా ఆయా సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి’’ అని లేఖలో ఒవైసీ పేర్కొన్నారు. -
నేనే మంత్రి.. నాదే పెత్తనం!
రాష్ట్ర మైనార్టీ సంక్షేమం, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అధికారం అండతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రెచ్చిపోతున్నారు. నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫరూక్.. ఈ జిల్లాలోని వక్ఫ్‌బోర్డు ఆస్తులు, మదర్సాలను గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. వారిపై ఆస్తుల కబ్జా ఆరోపణలూ వస్తున్నాయి. వీరి చర్యలను సొంత పార్టీలోని ఓ మంత్రి, ఓ సీనియర్ ఎమ్మెల్యే కూడా వ్యతిరేకిస్తున్నారు. అయినా మంత్రి, ఆయన కుమారుడు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చెప్పినట్లు చేయని ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేయిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కర్నూలు కర్నూలు పాతబస్తీ గడ్డా వీధిలో ‘అంజుమన్ ఈ షంషియా మదర్సా’కు 60 ఏళ్లకు పైగా ఉన్న కమిటీని మంత్రి తొలగించి, అన్ని నిబంధనలను ఉల్లంఘించి తన వారిని నియమించుకోవడం మైనార్టీల్లో కలకలం రేపింది. కర్నూలు తొలి మునిసిపల్ చైర్మన్ సలాం ఖాన్ ఈ మదర్సాకు ఆస్తులు రాసిచ్చారు. అప్పటి నుంచి వారి కుటుంబ సభ్యులే చైర్మన్‌గా దానిని నడిపిస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కమిటీని గౌరవించేవారు. ఈ కమిటీ కాలపరిమితి ఫిబ్రవరితో ముగిసింది. వక్ఫ్ బోర్డు సభ్యులే కమిటీని రెన్యువల్ చేయాల్సి ఉంది. అప్పట్లో వక్ఫ్ బోర్డు లేనందున, రెన్యువల్ జరగలేదు. ఇప్పటికీ, బోర్డు ఏర్పడలేదు. కమిటీ రెన్యువల్, కొత్త కమిటీని నియమించే అధికారం బోర్డు సీఈవోకు లేదు. అయినా మంత్రి ఆదేశాలతో ఈ నెల 8న ఐదుగురితో కొత్తగా కమిటీని నియమిస్తూ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ సిఫార్సు చేయడం, అదే రోజు సీఈవో నియామకం ఉత్తర్వులు జారీ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. కొత్త అధ్యక్షుడు షేక్ అబ్దుల్ జబ్బార్ స్థానికుడు కాదు. నిబంధనల మేరకు స్థానికేతరుడికి కమిటీలో చోటే కల్పించకూడదు. కానీ ఏకంగా అధ్యక్షుడినే చేశారు. కూటమి ప్రభుత్వంలో మరో మంత్రి, టీడీపీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే కూడా ఈ మదరసా విషయంలో జోక్యం చేసుకోవద్దని కొరినా, మంత్రి లెక్క చేయలేదని సమాచారం. ఈ మదరసాకు రూ.10 కోట్లకు పైగా విలువైన ఆస్తులు, భూముల అద్దె, ఆదాయంపై పెత్తనం కోసమే కమిటీని మార్చినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై సలాంఖాన్ వారసులు కోర్టులో సవాల్ చేసినట్లు సమాచారం. జీఏడీ, ఆర్థికశాఖను కాదని కార్పొరేషన్ ఉద్యోగి ప్రభుత్వంలో విలీనం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ సబిహా ఫరీ్వన్ను మైనార్టీ సంక్షేమ శాఖలో విలీనం చేయడమూ విమర్శలకు దారితీసింది. సాధారణంగా కార్పొరేషన్ ఉద్యోగిని ప్రభుత్వంలో విలీనం చేయరు. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే జీఏడీ, ఆర్థికశాఖ ఆమోదం తీసుకోవాలి. కానీ జీఏడీ, ఆర్థికశాఖను బైపాస్ చేసి ప్రభుత్వం మంగళవారం జీవో 110 జారీ చేసింది. కార్పొరేషన్లో సరిపడినంత సిబ్బంది లేనందున ఆమెను మైనార్టీ సంక్షేమ శాఖలో విలీనం చేసేందుకు నో అబ్జెక్షన్ సరి్టఫికెట్ ఇచ్చేందుకు కూడా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిరాకరించింది. అయినప్పటికీ మంత్రి ఫరూక్ ఒత్తిడితో ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు తెలుస్తోంది. పైగా నాన్ గెజిటెడ్ ఉద్యోగి అయిన సబియాను గెజిటెడ్ ర్యాంకులో నియమించడమూ నిబంధనలకు విరుద్ధమే. నంద్యాలలో రూ.58 కోట్ల విలువైన స్థలం కబ్జా! నంద్యాలలో పద్మావతి నగర్ అత్యంత విలువైన ప్రాంతం. ఇక్కడ ఫరూక్ మేనత్తకు సర్వే నంబర్ 706–ఏ9లో 1.16 ఎకరాల స్థలం ఉంది. ఆమె వారసులు ఖతీఫ్ ఖాజా హుస్సేన్, నూర్ అహ్మద్ అందులో 28 సెంట్లు రామిశెట్టి వెంకటన్నకు, 30 సెంట్లు నిమ్మకాయల బాలనారాయణకు విక్రయించారు. ఇక్కడ సెంటు కోటి రూపాయల పైనే ఉంది. ఈ లెక్కన ఈ స్థలం విలువ రూ.58 కోట్లు చేస్తుంది. ఈ స్థలం పక్కనే సర్వే నంబర్ 700ఏలో మంత్రి ఫరూక్ స్థలం ఉంది. దీంతో పక్కనే బంధువులు విక్రయించిన ఆస్తిని కబ్జా చేసేందుకు యతి్నంచారు. ఈ స్థలంపై ఇరువర్గాలు కోర్టులను ఆశ్రయించాయి. అయితే ఎక్కడా ఫరూక్ తన ఆస్తి అని నిరూపించుకోలేకపోయారు. దీంతో తమ స్థలానికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్టీ) నిర్ధారించాలని వెంకటన్న, బాలనారాయణ మునిసిపల్ అధికారులను కోరగా.. ఆర్వో వెంకటకృష్ణ, ఆర్ఐ గులాం హుస్సేన్ ఆ స్థలానికి రూ.55,980 ట్యాక్స్ నిర్ధారించారు. దీనిపై మంత్రి పీఏ అనిల్ ఈ నెల 20న మునిసిపల్ ఆఫీసుకు వెళ్లి వారితో ఎలా ట్యాక్స్ తీసుకుంటారంటూ బూతులతో విరుచుకుపడ్డారు. అదే రోజు ఆర్వో, ఆర్ఐని అధికారులు సస్పెండ్ చేశారు. మంత్రి అధికార బలంతోనే వారిని సస్పెండ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కమిటీ తొలగింపు పై హైకోర్టులో కేసు వేశాం మా తాత సలాంఖాన్ కర్నూలు మునిసిపాలిటీ తొలి చైర్మన్. ఆయన మదరసా ఏర్పాటు చేశారు. దానికి మా పూరీ్వకులు ఆస్తులు ఇచ్చారు. తరాలుగా ఆస్తులను కాపాడుతున్నాం. ఒక్క రూపాయి మేం వాడుకోం. మదర్సాకు 60 ఏళ్లకుపైగా మా కుటుంబ సభ్యులే అధ్యక్షులుగా ఉన్నారు. అధ్యక్షుడిగా మా కుటుంబ సభ్యులే ఉండాలి. అధ్యక్షుడు నచ్చిన వారిని సభ్యులుగా నియమించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఒత్తిళ్లతో కమిటీని మార్చారు. దీనిపై హైకోర్టులో కేసు వేశాం. – అల్తాఫ్‌ఖాన్, మాజీ అధ్యక్షులు, షంషియా మదర్సాఆ స్థలం మా పెద్దల నుంచి వచ్చింది నంద్యాల సర్వే నంబర్ 700ఏ7బీ, 709ఏ9లో 4.16 ఎకరాల భూమిని మేము కబ్జా చేయలేదు. ఆ స్థలం మా పెద్దల నుంచి సంక్రమించింది. ఎన్ఎండీ ఫరూక్ మేనత్త సారంబి వారసులు వారి వాటా ఆస్తిని వెంకటన్న, బాలనారాయణకు విక్రయించారు. ఆ సమయంలో హద్దులు మార్చి 2010లో రిజిస్టర్ చేయించారు.ఆ డాక్యుమెంట్‌ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా, మొదట హద్దులు సవరించాలని.. ఆ పరిధి కోర్టుది కాదని తెలియజేస్తూ కోర్టు కేసును తిరస్కరించింది. ఇదే స్థలానికి చెందిన మరో కేసు సారంబి వారసులు, జైనబ్బి వారసుల మధ్య నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టులో నడుస్తోంది. – మంత్రి ఫరూక్ సోదరుడు ఎన్ఎండీ ఖుద్దూస్, కుమారుడు ఫిరోజ్ రూ.14 కోట్ల విలువైన పనులు నిలిపివేతనంద్యాలలో మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమ్ (పీఎంజేకే) ద్వారా హాస్టల్, స్కూలు భవనాలతో పాటు 6 మేజర్ పనులు రూ.14 కోట్లతో జరుగుతున్నాయి. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఇటీవల ఈ పనులు నిలిపివేయించారు. మంత్రితో మాట్లాడిన తర్వాతే తిరిగి మొదలెట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించడంతో పనులు ఆగిపోయాయి. షాదీఖానా కమిటీని రాజీనామా చేయించిన వైనం ఫరూక్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నంద్యాలలో ఎన్టీఆర్ షాదీఖానా కమిటీని కూడా బలవంతంగా రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ఈ కమిటీ పదవీ కాలం జూన్ 27తో ముగుస్తుందని చెప్పినప్పటికీ, జూన్ 20నే సభ్యులతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ షాదీఖానాను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రూ.కోటి నిధులతో ఆధునికీకరించారు. ఇప్పుడు తమ అస్మదీయులతో కమిటీ నియమించి షాదీఖానాను గుప్పిట్లో పెట్టుకోనున్నారు. -
వక్ఫ్ సవరణ బిల్లు: జేపీసీ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ సీనియర్ నేత
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు-2024పై అధ్యయనం కోసం జేపీసీ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ నేత జగదాంబికా పాల్ వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో వచ్చే శీతాకాల సమావేశాల్లో భాగంగా నివేదిక అందించాలని గడువు విధించారు. ఇక, కమిటీలో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించారు.కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్బంగా వక్ఫ్ సవరణ బిల్లు-2024పై చర్చ జరిగింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతల డిమాండ్ మేరకు కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం బిల్లుపై అధ్యయనానికి 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఇక, ఈ కమిటీకి ఛైర్మన్‌గా జగదాంబికా పాల్ వ్యవహరించనున్నారు. కమిటీలో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించారు.జేపీసీలో సభ్యులు వీరే.. లోక్‌సభ నుంచి ఎన్డీయే కూటమికి చెందిన వారు 12 మంది ఉండగా.. విపక్ష సభ్యులు తొమ్మిది మంది ఉన్నారు. మరోవైపు.. రాజ్యసభ నుంచి జేపీసీలో బీజీపీ నుంచి నలుగురు, విపక్షాల నుంచి నలుగురు, ఒక నామినేటెడ్ సభ్యుడు ఉన్నారు.లోక్‌సభ.. జగదాంబికా పాల్ (చైర్మన్), నిషాకాంత్ డూబే, తేజస్వి సూర్య, దిలీప్ సైకియా, డీకే అరుణ, అపరాజిత సారంగి, అభిజిత్ గంగోపాధ్యాయ్, సంజయ్ జైశ్వాల్ ఉండగా వీరంతా బీజేపీకి చెందినవారు.కాంగ్రెస్ సభ్యుల్లో గౌరవ్ గొగోయ్, ఇమ్రాన్ మసూద్, మొమహ్మద్ జావెద్ ఉండగా, కల్యాణ్ బెనర్జీ (టీఎంసీ), ఎ.రాజా (డీఎంకే), లావు శ్రీ కృష్ణ దేవరాయలు (టీడీపీ), దిలేశ్వర్ కమైత్ (జేడీయూ), అరవింద్ సావత్ (శివసేన-యూబీటీ), సురేష్ మెహత్రె (ఎన్సీపీ శరద్ పవార్), నరేష్ మహస్కే (శివసేన), అరుణ్ భారతి (ఎల్జేపీ-రామ్ విలాస్), అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం) ఉన్నారు.రాజ్యసభ నుంచి.. వి. విజయసాయి రెడ్డి (వైఎస్సార్సీపీ), బ్రిజ్ లాల్, మేథా విక్రమ్ కులకర్ణి, గులాం అలీ, రాధా మోహన్ దాస్ అగర్వాల్ (వీరంతా బీజేపీ), సైయద్ నసీర్ హుస్సేన్ (కాంగ్రెస్), మొహమ్మద్ నదీముల్ హఖ్ (టీఎంసీ), ఎం.మొహమ్మద్ అబ్దుల్లా (డీఎంకే), సంజయ్ సింగ్ (ఆప్), ధర్మశాల వీరేంద్ర హెగ్డే నామినేటెడ్ సభ్యుడుగా ఉన్నారు. -
వక్ఫ్ సవరణ బిల్లు.. 21 సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ
న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ బిల్లు 2024ను సమీక్షించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ( జేపీసీ ) శుక్రవారం ఏర్పాటైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో జేపీసీ కమిటీపై మాట్లాడారు. ఈ కమిటీలో దిగువసభ నుండి ప్రభుత్వ, ప్రతిపక్షం నుండి 21 మంది సభ్యులు ఉంటారని ప్రకటించారు . అదనంగా, ఈ కమిటీలో రాజ్యసభ నుండి 10 మంది సభ్యులు కూడా ఉంటారని తెలిపారు. లోక్‌సభ నుంచి జేపీసీకి చెందిన 21 మంది సభ్యుల జాబితా ఇలా ఉంది. 1. జగదాంబిక పాల్2. నిషికాంత్ దూబే3. తేజస్వి సూర్య4. అపరాజిత సారంగి5. సంజయ్ జైస్వాల్6. దిలీప్ సైకియా7. అభిజిత్ గంగోపాధ్యాయ8. డీకే అరుణ9. గౌరవ్ గొగోయ్10. ఇమ్రాన్ మసూద్11. మహ్మద్ జావేద్12. మౌలానా మొహిబుల్లా నద్వీ13. కళ్యాణ్ బెనర్జీ14. ఎ రాజా15. లావు శ్రీ కృష్ణ దేవరాయలు16. దిలేశ్వర్ కమైత్17. అరవింద్ సావంత్18. సురేష్ గోపీనాథ్19. నరేష్ గణపత్ మ్హస్కే20. అరుణ్ భారతి21. అసదుద్దీన్ ఒవైసీ21 MPs from Lok Sabha who will be members of the JPC are - Jagdambika Pal, Nishikant Dubey, Tejasvi Surya, Aparajita Sarangi, Sanjay Jaiswal, Dilip Saikia, Abhijit Gangopadhyay, DK Aruna, Gaurav Gogoi, Imran Masood, Mohammad Jawed, Maulana Mohibullah Nadvi, Kalyan Banerjee, A… https://t.co/CFOYj0tjY6— ANI (@ANI) August 9, 2024 -
వక్ఫ్ బోర్డు బిల్ పై కేంద్రం కీలక నిర్ణయం
-
విపక్షాల తీవ్ర ఆందోళన.. జేపీసీకి వక్ఫ్ సవరణ బిల్లు
న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కేంద్రం యూటర్న్ తీసుకుంది. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి(జేపీసీ) పంపింది.పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో గురువారం కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ప్రవేశ పెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, ఎంఐఎం, వైఎస్సార్సీపీ, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, కమ్యూనిస్టు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగాయి.బిల్లును సమర్ధించుకున్న రిజిజుమైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వక్ఫ్ చట్టంలోని సమస్యలను పరిష్కరించలేకపోయినందున తమ ప్రభుత్వం సవరణలు తీసుకురావాల్సి వచ్చిందన్నారు. ‘మీకు చేతకాకపోవడంతో ఈ సవరణలు తీసుకురావాల్సి వచ్చింది. మేం ఎన్నికైన ప్రజాప్రతినిధులం, ఈ బిల్లుకు మద్దతివ్వండి, కోట్లాది మంది ప్రజల మన్ననలు పొందుతారు.. కొందరు వక్ఫ్ బోర్డులను కబ్జా చేశారు. సామాన్య ముస్లింలకు న్యాయం చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చాం. రాష్ట్ర వక్ఫ్ బోర్డులు మాఫియాగా మారాయని చాలామంది ప్రతిపక్ష నాయకులు నన్ను వ్యక్తిగతంగా కలిసి చెప్పారు. నేను వారి పేర్లను బహిరంగంగా చెప్పి వారి రాజకీయ జీవితాన్ని నాశనం చేయలేను’ అని రిజిజు తెలిపారు.ఇది రాజ్యాంగ విరుద్ధ బిల్లు: కాంగ్రెస్ఇది క్రూరమైన బిల్లు అని, రాజ్యాంగంపై దాడి చేయడమేనని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. కేంద్రం మత స్వేచ్చను ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించాలనే నిబంధనను ఆయన వ్యతిరేకించారు. ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి: వైఎస్సార్సీపీ ఈ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే మందు ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఇక, ఈ బిల్లును వైఎస్సార్సీపీ, టీఎంసీ, ఎస్పీ, కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. అలాగే, టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి.రాజకీయ కుట్రతోనే సవరణ బిల్లు: ఎస్పీరాజ్యంగ స్పూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని సమాజ్‌వాదీ పార్టీ విమర్శలు గుప్పించింది. రాజకీయ కోణంలో భాగంగా ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టినట్లు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు.. బోర్డులో సభ్యులను ఎందుకు నామినేట్ చేయాలని ప్రశ్నించారు. ఏ మత సంస్థలలోనూ తమ కమ్యూనిటీకి చెందని వ్యక్తులు భాగస్వామ్యంగా ఉండరని, వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతరులను చేర్చడంలో ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. అంతకముందు వక్ఫ్ బోర్డులకు చెందిన భూములను సవరణల ముసుగులో విక్రయించాలని బీజేపీ భావిస్తోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ‘వక్ఫ్ బోర్డ్ సవరణలన్నీ కేవలం ఒక సాకు మాత్రమే. రక్షణ, రైల్వే, నాజుల్ భూముల మాదిరి వక్ఫ్ భూములను విక్రయించడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు.స్టాండింగ్ కమిటీకి పంపాలి: ఎన్సీపీబిల్లును సభకు తీసుకురావడానికి ముందు ప్రభుత్వం సమగ్ర సంప్రదింపులు జరపలేదని ఎన్సీపీ(శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే అన్నారు. విస్తృత సంప్రదింపుల కోసం ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ఇత ఉన్నపళంగా కేంద్రం ఈ బిల్లు తీసుకురావడానికి వక్ఫ్ బోర్డులో అకస్మాత్తుగా ఏమి జరిగింది అని ప్రశ్నించారు.ఇది మైనారిటీ వర్గానికి వ్యతిరేకమని డీఎంకే ఎంపీ కనిమొళి విమర్శించారు. హిందూ దేవాలయాలను నిర్వహించడం క్రిస్టియన్, ముస్లింలకు సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన మహమ్మద్ బషీర్, సిపిఎంకు చెందిన కె రాధాక్రిష్ణ్ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు మత స్వేచ్ఛకు భంగం: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ..వక్ఫ్ బిల్లుతో మత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. వక్ఫ్ సవరణ బిల్లు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, అధికారాల విభజనకు విఘాతం కలిగిస్తుంది. వక్ఫ్ ఆస్తులు మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం ఉన్నాయి. ఆర్టికల్-25కి భంగం కలిగేలా ఈ బిల్లు ఉంది. అల్లా పేరు మీద ఆస్తిని విరాళంగా ఇచ్చే అవకాశం లేకుండా చేశారు. దర్గా, మసీదుల ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారుకాగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఆ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు దీనిని తీసుకువచ్చారు. ఈ బిల్లుకు టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే మద్దతు తెలిపాయి. బిల్లుపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయిరాష్ట్ర వక్ఫ్ బోర్డుల అధికారులు, వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్, సర్వే, ఆక్రమణలు తొలగింపుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడడమే ఈ చట్టం లక్ష్యం. 1995 వక్ఫ్ చట్టంలోని 44 సెక్షన్లను సవరించాలని కోరుతూ కేంద్రం ఈ బిల్లును ప్రతిపాదించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని, వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని బిల్లు ప్రతిపాదిస్తుంది. మహిళల వారసత్వ సంపదకు రక్షణ కల్పించాలన్నది మరో కీలక ప్రతిపాదన. అంతేగాక వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతర సభ్యులను చేర్చాలనే నిబంధన ప్రతిపాదిత చట్టంలో వివాదాస్పద అంశంగా మారింది. -
లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు
ఢిల్లీ: ముస్లిం మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించే వక్ఫ్ బోర్డ్‌ల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టాల్లో కీలక మార్పులు చేసేందుకు కేంద్రం నడుంబిగించింది. ఇందులో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లును ఇవాళ (ఆగస్ట్8న) కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఇది కూరమైన బిల్లు అని, రాజ్యాంగంపై దాడి చేయడమేనని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. కేంద్రం మత స్వేచ్ఛ ఉల్లంగిస్తోందని తెలిపారు. వక్ఫ్ చట్టసవరణ బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, మజ్లిస్, ఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించగా.. టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు మద్దతు ఇచ్చాయి. వక్ఫ్ బోర్డులో మహిళలు, ఓబిసి ముస్లింలు, షియా, బోహ్ర తదితర ముస్లింలకు చోటు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ చట్టానికి దాదాపు 40 సవరణలు ప్రతిపాదిస్తూ కొత్త బిల్లును తీర్చిదిద్దింది.దీంతో పాటు సరైన ఆధారాలు లేకుండానే ఆస్తులు తమ వేనని ప్రకటించే వక్ఫ్ బోర్డు ఏకపక్ష అధికారాలకు స్వస్తి పలకనుంది. కాగా, ఒకవైపు ఈ బిల్లును ఆమోదించేందుకు ఎన్డీయే అన్ని విధాలా ప్రయత్నిస్తుండగా మరోవైపు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. BIG BREAKING NEWS 🚨 Union Minister Kiren Rijiju will withdraw the Waqf Properties 2014 Bill, tomorrow at 12 pm.The Bill was introduced in Rajya Sabha on 18th February 2014 during UPA-2 Govt.This will allow Modi Govt to pass new Waqf bill that strips the Board of powers to… pic.twitter.com/xOrbdA1bBg— Times Algebra (@TimesAlgebraIND) August 7, 2024 -
వక్ఫ్ బోర్డులోకి మహిళలు, ముస్లిమేతరులు !
న్యూఢిల్లీ: ముస్లిం మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తులను పర్యవేక్షించే వక్ఫ్ బోర్డుల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టంలో కీలక మార్పులకు కేంద్రం నడుంబిగించింది. ఇందులోభాగంగా వక్ఫ్ బోర్డుల పాలనా వ్యవహారాల్లో మహిళలు, ముస్లి మేతరులకు చోటు కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు వక్ఫ్ చట్టంలో సవరణలు తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వక్ఫ్ చట్టం,1995 పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్,1995గా మార్చుతూ వక్ఫ్ (సవరణ)బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. సంబంధిత బిల్లు వివరాలు మంగళవారం లోక్‌సభ సభ్యులకు అందాయి. ఆ బిల్లులోని అభ్యంతరాలు, అందుకు కారణాల జాబితా ప్రకారం ప్రస్తుత వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40ని తొలగించనున్నారు. ఏదైనా ఆస్తి వక్ఫ్‌కు చెందినదిగా నిర్ణయించే అధికారం ప్రస్తుతం వక్ఫ్ బోర్డుకే ఉంది. ఇంతటి అపరిమిత అధికా రాలను తగ్గించాలని బిల్లులో ప్రతిపాదించారు. కేంద్ర వక్ఫ్ మండలి, రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో భిన్న వర్గాలకు, ముస్లిం పురుషులతోపాటు మహిళలు, ముస్లిమేత రులకూ ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ముస్లింలలో బోరా, అగాఖనీల కోసం ప్రత్యేకంగా బోర్డ్ ఆఫ్ ఔఖాఫ్‌ను ఏర్పాటు చేయనున్నారు. కనీసం ఐదేళ్లుగా ఇస్లామ్ మతాన్ని ఆచరిస్తూ సొంత ఆస్తిని దానంగా ఇస్తేనే దానిని ‘వక్ఫ్’గా పేర్కొనాలని ‘వక్ఫ్’ పదానికి బిల్లు కొత్త నిర్వచనం ఇచ్చింది. -
‘వక్ఫ్’ అధికారాల కట్టడి!
న్యూఢిల్లీ: వక్ఫ్ చట్టాన్ని సమూలంగా మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేస్తూ వక్ఫ్ చట్టానికి సవరణలకు కసరత్తు పూర్తి చేసింది. మొత్తం 40 సవరణలకు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఏదైనా ఆస్తిని వక్ఫ్ ప్రాపరీ్టగా గుర్తించే వక్ఫ్ బోర్డు అధికారాన్ని పరిమితం చేయడమే సవరణల లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డు క్లెయిం చేసే ఆస్తులకు వెరిఫికేషన్ ప్రక్రియ తప్పనిసరి. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర బోర్డులలో మహిళలకు ప్రాతినిధ్యం కలి్పంచడం కూడా సవరణల్లో ఒకటి. బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చని సమాచారం. ఈ చర్యలను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రంగా ఖండించింది. వక్ఫ్ బోర్డుల అధికారాలు తదితరాల్లో ఎలాంటి జోక్యాన్నీ సహించేది లేదని ప్రకటించింది. అవసరమైతే కోర్టుకు వెళ్లయినా వీటిని అడ్డుకుంటామని స్పష్టం చేసింది. వక్ఫ్ బోర్డులు సుమారు 9,40,000 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 8,70,000 ఆస్తులను పర్యవేక్షిస్తున్నాయి. వక్ఫ్ చట్టం 1995కు యూపీఏ ప్రభుత్వం 2013లో కొన్ని సవరణలు చేసి బోర్డుల అధికారాన్ని పెంచింది. పుణ్య, మతపరమైన లేదా ధారి్మక ప్రయోజనాల కోసం ఆస్తిని ఇవ్వడాన్ని వక్ఫ్ అంటారు. ఈ ఆస్తులను నియంత్రించడానికి చట్టం స్థాపించబడింది.ఈ భూములపై వచ్చే ఆదాయం పేద ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు, ధారి్మక కార్యక్రమాల నిర్వహణ కొరకు వాడాలి. దాతలు యిచి్చన ఈ భూముల్ని అమ్మే అధికారం వక్ఫ్ బోర్డుకు సైతం లేదు. అయితే రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు విస్తృతమైన హక్కులున్నాయి. ఇలాంటి ఆస్తులను సర్వే చేయడానికి ఆలస్యమవుతోందని ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. ఆస్తుల దురి్వనియోగాన్ని నివారించడానికి, వక్ఫ్ ఆస్తులను పర్యవేక్షించడంలో జిల్లా మేజి్రస్టేట్లను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా పలు మార్పులు చేయాలని నిర్ణయించింది. మత స్వేచ్ఛకు వ్యతిరేకం: ఒవైసీ వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేసే ప్రతిపాదనను ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ‘‘దీని వెనుక బీజేపీ హిందూత్వ ఎజెండా ఉంది. మత స్వేచ్ఛను దెబ్బతీయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. వక్ఫ్ ఆస్తులను లాక్కునేందుకే ఈ సవరణలు. ఇది మతస్వేచ్ఛకు విరుద్ధం’’ అని ఆరోపించారు. -
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు..కేంద్ర కేబినెట్ ఆమోదం?
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ చట్టానికి సవరణలు చేసి, తద్వారా వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేసేందుకు సిద్ధంగా ఉందని జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చట్టంలోని సవరణలకు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం.ఈ సవరణలతో ఇవి తమ ఆస్తులని వక్ఫ్ బోర్డ్ అంటే అందుకు తగిన ఆధారాలు చూపుతూ ధృవీకరించాల్సి ఉంటుందని సమాచారం. ఈ సవరణలకు సంబంధించిన బిల్లును వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా వక్ఫ్ బోర్డుకు సుమారు 9.4 లక్షల ఎకరాలు భూమి ఉంది. -
‘ధరణి’ క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం ఏర్పాటైన కమిటీ తమ పరిశీలనను వేగవంతం చేసింది. ఇప్పటికే భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంతోపాటు పోర్టల్ నిర్వహణ కంపెనీ ప్రతినిధులు, ఐదు జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు జరిపిన కమిటీ.. శనివారం సర్వే సెటిల్మెంట్, దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డులకు చెందిన ఉన్నతాధికారులతో భేటీ అయింది. ఆయా విభాగాల పరిధిలో ధరణి పోర్టల్ ద్వారా ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి మార్గాలు, ప్రత్యామ్నాయాలపై చర్చించింది. సోమవారం సచివాలయంలో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖతో సమావేశం కావాలని, ఆ తర్వాత జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలోని మూడు జిల్లాలను కమిటీ ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. రంగారెడ్డి, నిజామాబాద్‌తోపాటు ఆదిలాబాద్ లేదా ఖమ్మంలో ‘ధరణి’ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్టు తెలిసింది. ఈ పర్యటనలు పూర్తయ్యాక అన్ని అంశాలను క్రోడీకరించి, ధరణి పోర్టల్ వాస్తవ పరిస్థితిని తెలి యజేస్తూ.. ప్రభుత్వానికి నివేదిక అందించాలని కమిటీ భావిస్తోంది. మీ శాఖల్లో ఏం జరుగుతోంది? సర్వే విభాగానికి సంబంధించి రికార్డుల జాబితా, ఖస్రా, సెస్లా పహాణీల నిర్వహణ, ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేయడం, భూభారతి ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన సర్వే పటాల ప్రస్తుత స్థితి, ధరణి పోర్టల్ సమాచారానికి, పటాలకు మధ్య వ్యత్యాసం తదితర అంశాలపై చర్చించారు. అదే విధంగా తమ భూమిని సబ్‌డివిజన్ చేయాలని రైతులు దరఖాస్తు చేసుకుంటే.. అందుకు అవలంబిస్తున్న పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక వక్ఫ్ బోర్డు అధికారులతో చర్చల్లో భాగంగా.. మొత్తం వక్ఫ్ బోర్డు కింద ఉన్న భూవిస్తీర్ణం ఎంత? అందులో ఎంత కబ్జాకు గురైంది? వక్ఫ్ భూముల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ధరణి పోర్టల్‌లో ఈ భూముల విషయంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన సమావేశంలో.. ఆ శాఖ ఆదీనంలో ఉన్న మొత్తం భూవిస్తీర్ణం, ఈ భూముల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ధరణి పోర్టల్‌లో సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, నవీన్ మిత్తల్, మధుసూదన్, సీఎంఆర్వో పీడీ వి.లచ్చరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేల ఎకరాల్లో తేడా.. భూములను జియోట్యాగింగ్ చేసుకోండి దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డుతో చర్చల సందర్భంగా ‘ధరణి’ కమిటీ సభ్యులు పలు వివాదాస్పద అంశాలను గుర్తించారు. దేవాదాయ శాఖ గెజిట్‌లో, వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న భూములకు, ఆయా శాఖల పేరిట ధరణి పోర్టల్‌లో నమోదైన భూముల విస్తీర్ణానికి వేల ఎకరాల్లో తేడా ఉందని తేల్చారు. ఆ భూములన్నీ ఎటు పోయాయని అధికారులను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. ఇక దేవాదాయశాఖ గెజిట్‌లో పేర్కొనని పట్టా భూములను కూడా ధరణి పోర్టల్‌లో నిషేధిత భూములుగా చేర్చారని.. వీటిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి భూముల విషయంలో పరిష్కార మార్గాలను వెతకాలని సూచించారు. ముఖ్యంగా దేవాదాయ భూములన్నింటినీ జియోట్యాగింగ్ చేసుకోవాలని.. పట్టాదారులు తమ భూముల వివరాలను చెక్ చేసుకునే తరహాలోనే ఎప్పటికప్పుడు తమ భూముల స్థితిగతులను పరిశీలించుకోవాలని సూచించారు. మార్గదర్శకాలు, బదలాయింపు లేనందునే సమస్యలు: ఎం.కోదండరెడ్డి శనివారం వివిధ వర్గాలతో సమావేశం తర్వాత ‘ధరణి’కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ సమస్యలపై తమ అధ్యయనం నిరంతరం కొనసాగుతుందన్నారు. అవసరమైనప్పుడు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా, రైతు సంఘాలతో మాట్లాడామన్నారు. అందరితో సంప్రదింపులు పూర్తయిన తర్వాత ప్రాథమిక నివేదికను రూపొందించి, ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. -
Telangana: ఆధార్ ఉంటేనే ‘నిఖా’
సాక్షి, హైదరాబాద్: మైనర్ల వివాహాలకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. మైనార్టీ తీరనివారికి పెళ్లి జరిపిన ఖాజీలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రతి ‘షాదీ’ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని వక్ఫ్ బోర్డును ఆదేశించింది. మ్యారేజ్ సర్టిఫికెట్లను కూడా ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. యుక్త వయసు రాకముందే పెళ్లిళ్లు జరుగుతుండడం.. కొందరు షేక్‌లు గుట్టుగా నగరానికి వచ్చి పేద పిల్లలను వివాహం పేరిట మోసగిస్తున్న ఘటనలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ షాదీల వెనుక కీలక పాత్ర వహిస్తున్న ఖాజీలను నియంత్రించేందుకు.. పెళ్లి చేసుకునే వరుడు, వధువు ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. గతంలో మాదిరిగా ఖాజీలు ఏదో ఒక దస్తావేజు తీసుకొని పెళ్లి చేయడానికి వీలు లేదని తేల్చిచెప్పింది. ఆధార్ నమోదైన వివరాలకు అనుగుణంగా మైనరా? మేజర్? అనే విషయాన్ని నిర్దేశించుకోవాలని.. పెళ్లిళ్ల వివరాలను వక్ఫ్ బోర్డు కార్యాలయంలో అందజేయాలని సూచించింది. మైనర్, కాంట్రాక్ట్ పెళ్లి చేసే ఖాజీలపై చట్టరీత్యా చర్యలు తప్పవని హుకుం జారీ చేసింది. మరోవైపు గతంలో మాదిరిగా ఖాజీల నియామకం నేరుగా మైనార్టీ సంక్షేమ శాఖ చేయదు. జిల్లా కలెక్టర్లు ఖాజీలకు సంబంధించి వివరాలన్ని పరిశీలించిన అనంతరం వచ్చే ప్రతిపాదనల ఆధారంగా ఖాజీల నియామకం చేయాలని ఆదేశించింది. మ్యారేజ్ సర్టిఫికెట్లూ ఆన్లైన్లోనే.. షాదీకి సంబంధిచిన సరి్టఫికెట్లను ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. పెళ్లి సర్టిఫికెట్ కోసం ప్రస్తుతం అన్ని వ్యవహారాలు రాతపూర్వకంగానే జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి ఎక్కుడ జరిగినా మ్యారేజ్ సర్టిఫికెట్లకు హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని నాజిరుల్ ఖజాత్ కార్యాలయానికి రావాల్సి వస్తుంది. ఆన్లైన్ సర్టిఫికెట్‌కు పెళ్లి సందర్భంగా ఇచ్చే పెళ్లి పుస్తకం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. దరఖాస్తు ఆన్లైన్లో అందిన తర్వాత అధికారులు తమ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి సర్టిఫికెట్‌ను ఆన్లైన్లో పెడతారు. ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైతే దేశంలో ఎక్కడ నుంచైనా మ్యారేజ్ సర్టిఫికెట్ డోన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దేశంలోనే తొలిసారిగా.. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ముస్లింల షాదీ వివరాలు ఆన్లైన్లో నమోదవుతున్నాయి. గతంలో జరిగిన వాటితో పాటు ప్రస్తుతం జరుగుతున్న ప్రతి షాదీనీ వక్ఫ్ బోర్డు కార్యాలయలయంలో నమోదు చేస్తున్నారు. దీంతో మోసాలను కట్టడి చేసేందుకు వీలు ఉంటుంది. – ఎండీ మసీవుల్లా ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ -
ఆప్ ఎమ్మెల్యేకు నాలుగు రోజుల పోలీస్ కస్టడీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ వక్ఫు బోర్డులో అవినితీ ఆరోపణలకు సంబంధించి ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది న్యాయస్థానం. ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ ఈయనను శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అమానుతుల్లా ఖాన్‌తో పాటో అతని అనుచరుడు హమీద్ అలీ ఖాన్, ఇమామ్ సిద్ధిఖీని కూడా తనిఖీల అనంతరం ఏసీబీ అదుపులోకి తీసుకుంది. 2020లో అమానుతుల్లా ఖాన్ వక్ఫు బోర్డు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో 32 మందిని నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల్లో నియమించారని ఆరోపణలు వచ్చాయి. అంతేగాక ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన నివాసంతో పాటు అనుచరుల నివాసాల్లో విస్తృత సోదాలు నిర్వహించింది. అనంతరం అధికారులు రూ.12లక్షల నగదుతో ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అమాతుల్లా ఖాన్‌ను శనివారం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 14 రోజుల కస్టడీ కోరగా.. న్యాయస్థానం నాలుగు రోజులకే అనుమతి ఇచ్చింది. అమానుతుల్లా అరెస్టుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఆప్ గుజరాత్లో బలపడటం చూసి ఓర్వేలేకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ అరెస్టు చేయిస్తుందని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ కోసమే పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. చదవండి: బీజేపీ హర్ట్ అయ్యింది.. కారణం ఇదే: కేజ్రీవాల్ -
30 వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతం
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఏపీలో వక్ఫ్‌బోర్డుకు 65 వేల ఎకరాల భూములున్నాయని, వాటిలో దాదాపు 30 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని ఏపీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఖాదర్‌బాషా చెప్పారు. వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఏపీలో వక్ఫ్ ఆస్తులు, భూముల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు తమ పాలకవర్గం కృషిచేస్తోందన్నారు. విజయవాడలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. బుధ, గురువారాల్లో విజయవాడలో జరిగిన బోర్డు సమావేశంలో 150 అంశాలను చర్చించినట్లు తెలిపారు. వక్ఫ్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలిస్తున్నామని, అందుకోసం పెండింగ్‌లో ఉన్న 220 కమిటీలు వేశామని చెప్పారు. దర్గా (దౌలత్)లకు సంబంధించి ఈ 2 రోజుల్లో 200 కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వక్ఫ్ భూముల్లో సుమారు వందవరకు కమర్షియల్ ఆస్తులు ఉన్నాయన్నారు. వాటినుంచి వక్ఫ్‌బోర్డుకు ఆదాయాన్ని మరింత పెంచేందుకు తన అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సీఎం కమిటీ ఏర్పాటు చేశారన్నారు. వక్ఫ్ కేసులకు సంబంధించి కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటవుతోందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే, వక్ఫ్‌బోర్డు సభ్యుడు హాఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న తెలంగాణ బీజేపీ నేత రాజాసింగ్‌ని కఠినంగా శిక్షించాలన్నారు. -
పబ్ కేసు: ముందు చాలా జరిగింది.. డ్యామిట్ అతడే వల్లే ఇదంతా..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ కేసులో పోలీసు కస్టడీ ముగిసింది. ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌తో పాటు మైనర్ల కస్టడీ నేటితో ముగిసింది. కాగా, కస్టడీలో పోలీసులు పలు విషయాలను రాబట్టారు. ఈ సందర్బంగా పోలీసులు.. ‘‘సామూహిక లైంగిక దాడి ఘటనలో నిందితుల్లో పశ్చాత్తాపం కనిపించలేదు. విచారణ సమయంలో నిందితులు జాలీగా ఉన్నారు. తప్పు చేయలేదన్న ఫీలింగ్‌లో ఉన్నారు. ఇక, వీడియో లీకేజీపై నిందితుల మధ్య గొడవ జరిగింది. వీడియో షూట్ చేసిన ఓ మైనర్‌పై మిగిలిన నిందితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో బయటికి రాకపోయి ఉంటే.. కేసు ఉండదని నిందితులు ధీమా వ్యక్తం చేశారు. మైనర్‌కు కారు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కుమార్తెపై కేసు నమోదైంది. బెంజ్ కారు నడిపిన మైనర్ కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేశాము. బెంజ్ కారును పోలీసులకు చిక్కకుండా కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేశారు. బెంజ్ కారు విషయంలో నిందితుల కుటుంబ సభ్యులు.. పోలీసులను తప్పుదోవపట్టించారు. వక్ఫ్‌బోర్డ్ చైర్మన్‌కు అధికారికంగా కారు కేటాయించలేదు. సొంత కారుపైనే వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ గవర్నమెంట్ స్టిక్కర్ వేసుకున్నారు. ఇంటి నుంచి ఇన్నోవా కారును డ్రైవర్ తీసుకెళ్లాడు. కాన్సూ బేకరీ వద్ద డ్రైవర్‌ను దింపేసి కారును మైనర్లు తీసుకెళ్లారు. ఇన్నోవా కారు దొరక్కుండా ప్రయత్నాలు చేశారు. బాలిక గొంతుపై గాట్లు ఉండటంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు ముందే బంజారా హిల్స్‌లోని ఆశ హాస్పిటల్లో మైనర్‌కు సైకియాట్రిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఆమె పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇప్పించారు. తమ కూతురుపై ఎవరో అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానించి, బాలికను పబ్‌కు తీసుకువెళ్లిన హాదీని మైనర్ పేరెంట్స్ ప్రశ్నించారు. మైనర్‌ను పబ్‌కు తీసుకు వెళ్లింది ఎమ్మెల్యే బంధువు కుమారుడని చెప్పడంతో ఘటన బయటకు వచ్చింది. దీంతో, నిందితులు, ఎమ్మెల్యే తనయుడు బాలిక కుటుంబ సభ్యులను బెదిరించారు. ఇక, ఇన్నోవా కారులోనే మైనర్‌పై ఐదుగురు నిందితులు లైంగిక దాడి చేశారు అని వెల్లడించారు. -
వక్ఫ్ బోర్డు సభ్యుల స్థానాలకు 15 నామినేషన్లు
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యుల ఎన్నిక కోసం మూడు కేటగిరిల్లో మొత్తం 15 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి,హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ గురువారం తెలిపారు. ఎమ్మెల్యే, ఎమెల్సీ విభాగాల్లో మజ్లిస్ ఎమ్మెల్యే కౌసర్ మొయిద్దీన్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ నామినేషన్ దాఖలు చేశారు. ముత్త్తవల్లీ, మేనేజింగ్ కమిటీ విభాగంలో మిర్జా అన్వర్ బేగ్, ఫిరాసత్ అలీ భక్షి, మన్వర్ హుస్సేన్, మిర్జా షేహెరియర్ బేగ్, సయ్యద్ అక్బర్ నిజామొద్దీన్ హుస్సేనీ, ముజఫ్ఫర్ అలీ సూఫీ, మహ్మద్ ఖైరుల్ హుస్సేన్, మసీహుర్ రహ్మన్ జాకీర్, జహీర్ అహ్మద్ ఖాన్, అబ్ధుల్ మజీద్, అబ్దుల్ ఫతహ్ సయ్యద్ బందగీ బద్‌షాఖాద్రీ నామినేషన్లు దాఖలు చేశారు. బార్ కౌన్సిల్ విభాగంలో ఎంఏ ముఖీద్, జాకీర్ హుస్సేన్ జావిద్‌లు నామినేషన్లను దాఖలు చేశారు. ఎంపీ విభాగంలో మాత్రం నామినేషన్ దాఖలు కాలేదు. -
కర్నూలులో వక్ఫ్‌బోర్డ్ ఏర్పాటు తగదు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర వక్ఫ్ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 25న జారీ చేసిన జీవో 16ను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ విజయవాడ, మొగల్రాజపురానికి చెందిన మహ్మద్ ఫరూక్ షుబ్లీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాద్‌బాబు శుక్రవారం హైకోర్టును కోరారు. అత్యవసర విచారణకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ శ్రీభానుమతి ధర్మాసనం తిరస్కరించింది. సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. 2016లో జారీచేసిన జీవో 18 ప్రకారం విజయవాడలో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సి ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఎలాంటి సహేతుక కారణాల్లేకుండా కర్నూలులో వక్ఫ్‌బోర్డును ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. -
హిందూమతంలోకి యూపీ ముస్లిం నేత
Wasim Rizvi Converts To Hinduism: ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ వసీమ్ రిజ్వి హిందూమతంలోకి మారారు. ఘజియాబాద్‌లోని దాస్నా దేవి ఆలయంలో సోమవారం పూజారి యతి నర్సింగానంద్ సరస్వతి ఆయనతో మత మారి్పడి క్రతువు చేయించారు. రిజ్వి పేరును జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా ప్రకటించారు. ‘ముస్లింలు నన్ను మతం నుంచి బహిష్కరించారు. నా ఇష్టం వచ్చిన మతం స్వీకరించే స్వేచ్ఛ ఉంది. చదవండి: సైనికులపై హత్య కేసు నా కుటుంబ సభ్యులు ఇష్టం ఉన్న మతాన్ని ఆవలంభించవచ్చు. బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన పవిత్ర దినాన నేను హిందువుగా మారా. హిందువులను చంపివేస్తూ, వారి ఇళ్లకు ముస్లింలు నిప్పుపెడుతున్నారు. హిందువులు అటువంటి వారికి దూరంగా ఉండాలి’అని త్యాగి అన్నారు. -
కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు కసరత్తు తుది అంకానికి చేరింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ ట్రిబ్యునల్‌ను కూడా అక్కడే ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. వక్ఫ్ భూముల పరిరక్షణకు నడుం కట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉన్న వక్ఫ్ ట్రిబ్యునల్ నుంచి ఏపీకి వాటాగా రావాల్సిన సిబ్బందిని కేటాయించాలని కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో హైదరాబాద్ ట్రిబ్యునల్‌లో పనిచేస్తున్నవారిలో తెలంగాణకు 60 శాతం, ఏపీకి 40 శాతం చొప్పున కేటాయిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ మరో 15 రోజుల్లో కొలిక్కి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయితే జిల్లా జడ్జిని న్యాయాధికారి (ప్రిసైడింగ్ ఆఫీసర్)గా నియమించడం ద్వారా ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కానుంది. ఇదంతా పూర్తి కావడానికి నెల నుంచి రెండు నెలలు పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. వక్ఫ్ భూముల వివాదాలకు త్వరితగతిన పరిష్కారం.. వక్ఫ్ భూములు, వాటి వివాదాలను త్వరితగతిన విచారించి పరిష్కరించడంలో ట్రిబ్యునల్ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు కాలేదు. చంద్రబాబు తన పాలనలో ఈ అంశంపై పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగా హైదరాబాద్‌లోని వక్ఫ్ ట్రిబ్యునల్‌కే ఏపీ కేసులనూ పంపిస్తున్నారు. అయితే అక్కడ విచారణ వేగంగా జరగడం లేదు. ఫలితంగా ఏపీకి చెందిన వక్ఫ్ భూముల కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఇలా దాదాపు 400 నుంచి 450 కేసుల వరకు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పెండింగ్ కేసులను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇందుకు అవసరమైన చర్యలను మైనార్టీ సంక్షేమ శాఖ వేగవంతం చేసింది. -
వక్ఫ్ భూములకు భద్రత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వక్ఫ్ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వక్ఫ్ భూములపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడంతో పాటు స్థలాల చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ పనులను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. మైనారిటీలకూ సబ్ ప్లాన్ అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో హజ్‌హౌస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మైనార్టీల సంక్షేమంపై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. వక్ఫ్ ఆస్తుల రక్షణకు హోంగార్డులు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా భూముల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టి అనంతరం హోంగార్డులను వాటి రక్షణ కోసం నియమించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్ ఆస్తులు కూడా సర్వే చేయాలని ఆదేశించారు. కొత్త శ్మశానవాటికలు మైనార్టీల కోసం కొత్త శ్మశానవాటికల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ప్రాధాన్యతాంశంగా తీసుకుని వీటి నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అవసరాలకు తగినట్టుగా కొత్త శ్మశానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో డిప్యూటీ సీఎం అంజాద్ తదితరులు సకాలంలో గౌరవ వేతనాలు ఇమామ్‌లు, మౌజంలు, ఫాస్టర్లకు సకాలంలో గౌరవ వేతనాల చెల్లింపులు జరగాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గౌరవ వేతనాల కోసం అందిన కొత్త దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మైనార్టీలకూ సబ్ ప్లాన్ మైనార్టీలకూ సబ్‌ప్లాన్ కోసం అధికారులు అందచేసిన ప్రతిపాదనలపై సీఎం స్పందిస్తూ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. మైనార్టీలకు సబ్‌ప్లాన్ అమలైతే నిధులు కూడా మరింత పెరుగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో పనులు మైనారిటీ విద్యార్ధుల వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న భవనాల ప్రగతిని సీఎంకు వివరించారు. ఐదు గురుకుల పాఠశాలలు, 2 వసతి గృహాలకు సంబంధించి రూ.75 కోట్లతో చేపడుతున్న పనుల పురోగతిని తెలియచేశారు. పెండింగ్ బిల్లుల బకాయిలు చెల్లించడంతోపాటు ఇప్పటికే ప్రారంభమైన అన్ని ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సీఎం సూచించారు. మైనార్టీ శాఖలో పెండింగ్ సమస్యలపై పూర్తి స్ధాయి నివేదిక అందచేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై దృష్టి మైనార్టీ విద్యార్ధుల్లో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల సేవలను వినియోగించుకోవడం ద్వారా మైనార్టీ వర్గాల విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు చేపట్టాలన్నారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పనుల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యత కింద యూనివర్సిటీ పనులను నాడు – నేడు తరహాలో చేపట్టాలని అధికారులకు నిర్దేశించారు. ఉర్దూ అకాడమీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాల్సిందిగా సూచనలు చేశారు. అకాడమీ అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని, షాదీఖానాల నిర్వహణను మైనారిటీశాఖకు బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు. క్రిస్టియన్ భవన్ పనులు పూర్తవ్వాలి.. మైనారిటీశాఖలో ఖాళీ పోస్టుల వివరాలను సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆర్ధికశాఖ అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో హజ్‌హౌస్ నిర్మాణ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. హజ్, వక్ఫ్ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై అర్ధాంతరంగా నిలిచిపోయిన క్రిస్టియన్ భవన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. – సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమశాఖ) అంజద్ బాషా, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి గంధం చంద్రుడు, మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్ కె.శారదాదేవి, ఏపీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ సీఈవో పి.రవి సుభాష్, ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ అలీం బాషా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆక్రమణలకు గురైన సుమారు 500 ఎకరాలకుపైగా వక్ఫ్ బోర్డు భూములను ఈ రెండేళ్ల వ్యవధిలో తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. ఆ వివరాలు ఇవీ.. -
వక్ఫ్ ఆస్తుల జియో మ్యాపింగ్
సాక్షి, అమరావతి: వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు అధునాతన సాంకేతిక పద్ధతిలో జియో మ్యాపింగ్ (జీపీఎస్, జీఐఎస్) చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎస్బీ అంజాద్ బాషా తెలిపారు. బుధవారం సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్ నిర్వహించిన సమావేశానికి అన్ని జిల్లాల అధికారులు, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్లు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీలు, ఉర్దూ అకాడమీ అధికారులు, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ తదితర విభాగాల అధిపతులు హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే రీ సర్వే చేసి వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తున్నట్లు అంజాద్ బాషా చెప్పారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వక్ఫ్ బోర్డు రెండో విడత సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. 3,674 వక్ఫ్ ఆస్తులను సర్వే చేసి 3,295 ఆస్తుల గెజిట్ నోటిఫికేషన్ కోసం ప్రభుత్వానికి నివేదించినట్లు వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో సుమారు 223 వక్ఫ్ భూములు, 3,772 మసీదులు, దర్గాలకు అనుబంధంగా ఉన్న ఆస్తులను జియో మ్యాపింగ్ చేశామన్నారు. మరో 1,206 వక్ఫ్ భూములు, 69 వక్ఫ్ సంస్థల అనుబంధ ఆస్తులను మ్యాపింగ్ చేయాల్సి ఉందన్నారు. వక్ఫ్ బోర్డుకు ఆదాయం కోసం బహిరంగ వేలం ద్వారా 1,204 ఎకరాల వ్యవసాయ భూమిని 2021–22 సంవత్సరానికి రూ.78.81 లక్షలకు లీజుకు ఇచ్చామన్నారు. అన్యాక్రాంత భూములు స్వాధీనం.. రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతమైన సుమారు 495.80 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోగలిగిందన్నారు. 2,346 పెండింగ్ కేసుల విచారణను వేగవంతం చేసినట్లు చెప్పారు. -
వక్ఫ్‌బోర్డు భూములు: బలవంతపు చర్యలొద్దు
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా వక్ఫ్‌బోర్డు భూములంటూ 20 ఏళ్ల కింద జరిగిన సేల్‌డీడ్స్‌ను ఏకపక్షంగా రద్దు చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. 2000 సంవత్సరంలో 75 గజాలను పిటిషనర్ కొని అనుమతులు పొంది ఇళ్లు కట్టుకొని ఉంటున్న నేపథ్యంలో బలవంతపు చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది. దీనిపై కౌంటర్ వేయాలని వక్ఫ్‌బోర్డు, ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కొహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లోని సర్వే నంబర్ 389లో 2000లో కొనుగోలు చేసిన తన ఇంటి స్థలానికి సంబంధించిన సేల్‌డీడ్‌ను గత మార్చిలో ఏకపక్షంగా రద్దు చేయడాన్ని సవాల్‌చేస్తూ ఎ.కుమార్‌గౌడ్, బి.లావణ్య దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. రిజిస్ట్రర్డ్ సేల్‌డీడ్స్‌ను రద్దు చేసే అధికారం వక్ఫ్ బోర్డుకు ఎక్కడుందన్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, వక్ఫ్‌బోర్డు సీఈవోను ఆదేశించింది. చదవండి: ఆధార్ నంబర్‌తో.. భూమిని కొట్టేసేందుకు కుట్ర -
హఫీజ్‌పేట భూవివాదం: హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్: హఫీజ్‌పేట్‌లోని సర్వే నంబర్ 80లోని భూమి విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు మధ్య గత కొన్నేళ్లుగా నడుస్తున్న వివాదానికి హైకోర్టు ముగి ంపు పలికింది. ఈ సర్వే నంబర్లోని 50 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులదేనని తేల్చిచెప్పింది. ఈ భూమిని వక్ఫ్‌బోర్డుకు చెందినదిగా పేర్కొంటూ చేసిన తీర్మానాన్ని కొట్టేసింది. అలాగే రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా పేర్కొనడాన్ని తప్పుబడుతూ ఎంట్రీలను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్.రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. తమ భూములను వక్ఫ్‌బోర్డు భూములుగా పేర్కొంటూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కటికనేని ప్రవీణ్‌కుమార్‌తో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ ఆధారంగా పిటిషనర్ల పేర్లను రెవెన్యూ రికార్డుల్లో చేర్చండి. అలాగే పిటిషనర్ల భూమి పొజిషన్ విషయంలో ప్రభుత్వం, వక్ఫ్‌బోర్డు జోక్యం చేసుకోరాదు. పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.50 వేలు ప్రభుత్వం, వక్ఫ్‌బోర్డు జరిమానాగా చెల్లించాలి’అని తీర్పులో పేర్కొంది. ఈ భూమి కోసమే కిడ్నాప్ యత్నం హఫీజ్‌పేటలోని ఈ భూమిని తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న కుట్రలో భాగంగానే ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ మరికొందరితో కలసి కె.ప్రవీణ్‌కుమార్, ఆయన సోదరులను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కిడ్నాపర్లు పరారయ్యారు. తర్వాత అఖిలప్రియతో పాటు కిడ్నాప్ కుట్రలో పాల్గొన్న మరికొందరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అఖిలప్రియ తదితరులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా.. భార్గవ్‌రామ్ తదితరులు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే. -
చార్మినార్‌నూ రిజిస్టర్ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: దానం చేస్తున్న వ్యక్తికి సదరు ఆస్తిపై హక్కులు ఉన్నాయా లేదా అన్నది చూడకుండా దానం ఇస్తే చార్మినార్, రాజ్భవన్లను కూడా రిజిస్టర్ చేసుకుంటారా? అని వక్ఫ్‌బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. వక్ఫ్‌బోర్డుకు 65 ఏళ్ల కిందట ఇచ్చిన భూమిని 2014 వరకు ఎందుకు రిజిస్టర్ చేసుకోలేదని నిలదీసింది. హఫీజ్‌పేటలోని సర్వే నెంబర్ 80లోని భూములను వక్ఫ్‌బోర్డు భూములుగా పేర్కొంటూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌చేస్తూ కె.ప్రవీణ్‌కుమార్, సాయిపవన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ భూములు మునీరున్నీసా బేగంకు చెందినవని, 1966లో వాటిని విక్రయించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది నివేదించారు. 2006లో ఈ భూములపై తుది డిక్రీ వచ్చిందని, సుప్రీంకోర్టులో సైతం రాష్ట్రానికి చుక్కెదురైందని తెలిపారు. 1955లో మునీరున్నీసా వక్ఫ్‌నామాగా ప్రభుత్వం పేరొంటున్నా అందులో ఆమె సంతకంలేదని, అయితే 1966లో ఆమె ఆ భూమిని విక్రయించినప్పుడు సంతకాలు చేసిందని తెలిపారు. 2014 నవంబర్‌లో ఈ భూమిని వక్ఫ్‌బోర్డు భూమిగా పేర్కొంటూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిందన్నారు. హఫీజ్‌పేట భూములు ప్రభుత్వానికి చెందినవని, 1963లో నిజాం వారసులుగా పేర్కొంటూ కొందరు ఈ ఆస్తులను పంచుకున్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు నివేదించారు. మునీరున్నీసా చనిపోయిన తర్వాత తప్పుడు పత్రాలతో ఈ రిజిస్ట్రేషన్ జరిగిందని ముతవల్లీ తరఫు న్యాయవాది అనుమానం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంలో వక్ఫ్‌బోర్డు తరఫు న్యాయవాది వాదనలకోసం ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదావేసింది. చదవండి: కెనడా నుంచి వచ్చి ఇంట్లో ఉరేసుకుని.. -
మసీదు ఎక్కడ నిర్మిస్తారు?
సాక్షి, హైదరాబాద్: సచివాలయం ఆవరణలో భవనాలతోపాటు కూల్చిన మసీదును తిరిగి అదే ప్రదేశంలోనే నిర్మిస్తున్నారా ? లేదా మరో చోటా? అనేది స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మసీదును యథాస్థానంలో కాకుండా మరో చోట నిర్మించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కూల్చిన జాగాలోనే నిర్మించేలా ఆదేశించాలంటూ నగరానికి చెందిన మహ్మద్ జాకీర్ హుస్సేన్ జావిద్, మహ్మద్ అఫ్జలుద్దీన్, ఖాజా ఐజాజుద్దీన్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. సచివాలయం ఆవరణలో మసీదు నిర్మిస్తామని ప్రభుత్వం సింగిల్ జడ్జి దగ్గర హామీ ఇచ్చింది కదా? అదే అంశంపై మళ్లీ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాది యాసర్ మమూద్ని ధర్మాసనం ప్రశ్నించింది. ముఖ్యమంత్రి స్వయంగా మసీదు, ఆలయం నిర్మిస్తామని పత్రికా ముఖంగా ప్రకటించారని, ఇంకా సచివాలయం నూతన భవన నిర్మాణం ప్రారంభం కాకముందే సందేహాలు ఎందుకని ప్రశ్నించింది. మసీదు నిర్మాణం చేపట్టకపోతే అప్పుడు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. అయినా దేవున్ని ఎక్కడి నుంచైనా ప్రార్థించుకోవచ్చుకదా? ఫలానా దగ్గర మాత్రమే ప్రార్థన చేయాలని ఎక్కడుందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే మసీదును ఎక్కడ నిర్మిస్తారన్న దానిపై ప్రభుత్వం ఇచ్చిన హామీలో స్పష్టత లేదని, కూల్చిన ప్రదేశంలోనే నిర్మించాలని మమూద్ నివేదించారు. మసీదు 647 గజాల విస్తీర్ణంలో ఒక మూలకు ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వం మాత్రం 1,500 చదరపు అడుగులు మాత్రమే మసీదుకు కేటాయిస్తామంటోందని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నూతన సచివాలయం నిర్మిస్తున్నారని, మసీదు నిర్మించిన భూమి వక్ఫ్ బోర్డు ఆస్తి అని, దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని మమూద్ వివరించారు. వక్ఫ్ చట్టంతోపాటు భూసేకరణ చట్టం నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని వివరించారు. భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని మరో వందేళ్ల వరకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సచివాలయం నిర్మించడం వ్యక్తిగత ప్రయోజనం ఎలా అవుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవచ్చని, ఇందుకు వక్ఫ్ బోర్డు అనుమతి కోరవచ్చని పేర్కొంది. ఉద్ధేశ్యపూర్వకంగా ప్రభుత్వం మసీదును కూల్చలేదని, ప్రభుత్వ ఖర్చుతో మసీదును నిర్మిస్తామని, అయితే ఎక్కడ నిర్మిస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి వివరణ తీసుకొని తెలియజేస్తానని ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం... వక్ఫ్ బోర్డుతోపాటు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో అక్టోబరు 1లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 8కి వాయిదా వేసింది. -
ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేయాలి..
ఢిల్లీ : రంజాన్ మాసం సమీపిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పేర్కొన్నారు. నఖ్వీ గురువారం అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. రంజాన్ మాస సమయంలో ముస్లిం సోదరులంతా ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేయాలని కోరారు. ఏడు లక్షల మసీదులు, ధార్మిక సంస్థల నేతలతో కలిసి పని చేయాలని వక్ఫ్ బోర్డులను ఆదేశించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులంతా భారత్ సహా ప్రపంచమంతా కరోనా బారినుంచి విముక్తి పొందేలా ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. దయచేసి కరోనా బాధితుల కోసం పోరాటం చేస్తున్న హెల్త్ వర్కర్స్, డాక్టర్లు, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దన్నారు. నిజాయితీగా వ్యక్తుల మధ్య దూరాన్ని పాటించేలా వక్ఫ్ బోర్డులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని నఖ్వీ తెలిపారు. (కరోనా నియంత్రణకు రెండు వ్యూహాలు) -
వక్ఫ్‌బోర్డును రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: ‘ముస్లింలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు. వారి అభ్యున్నతికి కావాల్సినంత మొత్తం భరించేంత ఆస్తి వక్ఫ్ వద్దే ఉంది. కానీ ఆ వక్ఫ్ సంపదను కొందరు దోచుకుంటున్నా పట్టించుకోవట్లేదు. వక్ఫ్ బోర్డును కొనసాగించాలంటే నిజాయితీ ఉన్న వారిని బాధ్యులుగా పెట్టండి.. లేదంటే వక్ఫ్ బోర్డునే రద్దు చేయండి’అని శుక్రవారం అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ‘ముస్లింలకు రంజాన్ వేళ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పేరుతో ఖర్చు చేసే మొత్తాన్ని మైనారిటీల్లోని అనాథల సంక్షేమం కోసం ఖర్చు చేయండి. దాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఇవ్వండి’అని చెప్పారు. మైనారిటీల అభ్యున్నతికి మరే రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని, అందుకే మజ్లిస్ పార్టీ ఆయనకు మద్దతు తెలుపుతోందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు మేలు జరుగుతున్న 54 అంశాలను ప్రస్తావించారు. ఈ ప్రభుత్వానికి అండగా ఉంటూనే, అవసరమైన విషయాల్లో నిలదీసేందుకూ వెనకాడబోమని తేల్చిచెప్పారు. వక్ఫ్‌బోర్డులో జరుగుతున్న లోపాలపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కనీస అర్హతలు కూడా లేనివారికి పదోన్నతులు కల్పిస్తూ భారీ ఎత్తున జీతాల రూపంలో ప్రజా ధనాన్ని చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. పదో తరగతి చదివిన వారిని ఏకంగా సహాయ కార్యదర్శి పోస్టులో కూర్చోబెట్టారని, వారికి రూ.లక్ష చొప్పున జీతాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. మూడో తరగతి మాత్రమే చదివిన ఓ వ్యక్తిని ఆఫీస్ సబార్డినేట్‌గా నియమించారని, ఆయనకు రూ.54 వేల జీతం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో సీబీఐతో లేదా సీఐడీతో లేదా హైకోర్టు విశ్రా>ంత జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 1999లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వక్ఫ్ అక్రమాల గురించి గొంతెత్తుతున్నా పట్టించుకోవట్లేదని, తన జుట్టు నెరుస్తున్నా మార్పు లేదని అసహనం వ్యక్తం చేశారు. వక్ఫ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరారు. -
మద్యం కేసుల్లో శిక్ష పడితే నో లైసెన్స్
సాక్షి, అమరావతి: జనవరి 1 నుంచి బార్ల కేటాయింపులో నూతన పాలసీకి ప్రభుత్వం పదును పెట్టింది. ఆ మేరకు నియమ నిబంధనలతో సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన విధానం ప్రకారం.. పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడా బార్లు, మైక్రో బ్రూవరీలు ఉండవు. మద్యం కేసుల్లో శిక్ష పడిన వారు, 21 ఏళ్ల లోపు వయస్సున్న వారు, ప్రభుత్వానికి ఎక్సైజ్ రెవెన్యూ ఎగవేతదారులకు, కుష్టు వ్యాధి, ఇతర వ్యాధులున్న వారికి లైసెన్సులు మంజూరు చేయరు. బార్‌ను కనీసం 200 చదరపు మీటర్లలో ఏర్పాటు చేయాలి. వాటికి అనుబంధంగా ఏర్పాటయ్యే రెస్టారెంట్, కిచెన్ 15 చదరపు మీటర్లలో ఉండాలి. గుర్తింపున్న విద్యా సంస్ధలకు, దేవదాయ శాఖ గుర్తించిన దేవాలయాలు, వక్ఫ్‌బోర్డు గుర్తింపున్న మసీదులు, రిజిస్టర్డ్ క్రైస్తవ సంస్థలు నిర్వహించే చర్చిలకు, ఆస్పత్రులకు 100 మీటర్లలోపు బార్లు ఏర్పాటు చేయరాదు. జాతీయ, రాష్ట్ర రహదార్లకు 500 మీటర్ల లోపు దూరంలో ఉండకూడదు. అక్టోబర్ 2, ఆగష్టు 15, జనవరి 26 తేదీలను డ్రై డేలుగా గుర్తించారు. ప్రస్తుతం ఉన్న బార్లలో 40 శాతం తగ్గించి వాటి సంఖ్యను ఎక్సైజ్ కమిషనర్ ప్రకటిస్తారు. దరఖాస్తు , లైసెన్సు ఫీజుల్ని ప్రకటించారు. బార్ల లైసెన్స్‌కు ఇతర నియమ నిబంధనలివే.. - బార్, మైక్రో బ్రూవరీని నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రెండు కి.మీ. పరిధిలోనూ, కార్పొరేషన్లలో 5 కి.మీ. పరిధిలో ఏర్పాటు చేయాలి. - దరఖాస్తు రుసుం రూ.10 లక్షలు. దీన్ని తిరిగి ఇవ్వరు - స్టార్ హోటళ్లు, బ్రూవరీలను మినహాయించి మిగిలిన 797 బార్లలో 40 శాతం తగ్గించి 478 బార్లకే లైసెన్సులిస్తారు. ఉదాహరణకు ఏదైనా మున్సిపాలిటీలో పది బార్లుంటే.. వాటిలో నాలుగు తగ్గిస్తారు. అదే ఒక బార్ ఉంటే అలానే ఉంచుతారు. - బార్‌కు దరఖాస్తు చేసుకునే వారు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. లేదా ఫుడ్ సేఫ్టీ స్టాండర్ట్ యాక్టు–2006 ప్రకారం లైసెన్స్ పొందాలి. - వ్యాపార వేళలు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటలు. ఆహార సరఫరా 11 వరకూ ఉంటుంది. త్రీస్టార్, ఆపైస్థాయి హోటళ్లకు వ్యాపార వేళలు ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు, ఆహార సరఫరా అర్ధరాత్రి 12 వరకు. - లైసెన్సు మార్పిడి, కొత్త లైసెన్స్ ప్రకటన ఎక్సైజ్ కమిషనర్ అనుమతితోనే ఉంటుంది. ఎక్సైజ్ చట్టం 31, 32 ప్రకారం లైసెన్స్ రద్దు చేసే, ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. -
ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో రసాభాస
సాక్షి, విజయవాడ: జిల్లాలోని ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో బోర్డు మెంబర్ షేర్వాన్ ఛాంబర్లో బైఠాయించడంతో రసాభాస చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే.. వక్ఫ్ బోర్డు స్పెషల్ ఆఫీసర్ యూసఫ్ షరీఫ్ ఏ అధికారంతో విధులు నిర్వర్తిస్తున్నారంటూ ప్రశ్నించారు. అంతేకాక అతని అపాయింట్మెంట్కు సంబంధించిన ఆధారాలు చూపాలని వీరంగం సృష్టించారు. షేర్వాన్ దీంతో వక్ఫ్ బోర్డు స్పెషల్ ఆఫీసర్ యూసఫ్ షరీఫ్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డులో జూలై 15 నుంచి విధులు నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం బోర్డు మెంబర్స్‌తో కూడిన ఫోరమ్ లేని కారణంగా షేర్వాన్ అనే బోర్డు మెంబర్ తన పనిని అడ్డుకుంటున్నారని వివరించారు. హైకోర్టు ప్రొసీడింగ్ ప్రకారమే తాను విధులలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నానని, అయితే తన విధులకు షేర్వాన్ ఆటంకం కలిగిస్తున్నాడని ఈ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. -
అతడి భార్యకు 5 లక్షల నష్ట పరిహారం
రాంచి : జార్ఖండ్ మూకదాడిలో మృతి చెందిన తబ్రేజ్ అన్సారీ కుంటుబానికి రూ. 5 లక్షల నష్ట పరిహారం అందజేస్తామని ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ గురువారం ప్రకటించారు. మృతుడి భార్యకు ఈ మొత్తాన్ని ఇస్తామన్నారు. తబ్రేజ్ అన్సారీ భార్యకు ఢిల్లీ వక్ఫ్ బోర్డులో ఉద్యోగంతో పాటు న్యాయ సహాయం అందించనున్నట్టు తెలిపారు. గతవారం జార్ఖండ్‌లోని సెరైకేలా ఖర్సావన్ జిల్లాలో తబ్రేజ్ అన్సారీని దొంగగా భావించి కొంతమంది అతన్ని స్తంభానికి కట్టేసి కర్రలతో చితకబాదుతూ మూకదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జై శ్రీరామ్’, ‘జై హనుమాన్’ నినాదాలు చేయాలంటూ తబ్రేజ్‌పై అల్లరి మూక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం రాజ్యసభలో స్పందించారు. ఈ మూకదాడి తనను బాధించిందన్నారు. దాడి చేసిన నేరస్తులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రతిపక్షాలు ఈ ఘటనను ఆసరాగా తీసుకొని జార్ఖండ్ ‘మూకదాడులకు నిలయం’ అంటూ విమర్శించడం సరికాదన్నారు. జార్ఖండ్ రాష్ట్రాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. ఈ ఘటనలో 11 మందిని అరెస్టు చేసి దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశారు. -
మదర్సాలపై వక్ఫ్ బోర్డ్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
లక్నో : మదర్సాలు ఐసిస్ సిద్ధాంతాలను ప్రోత్సహిస్తున్నాయంటూ వాటిని మూసివేయాలని యూపీ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ కోరారు. విద్యార్ధులు ఐసిస్ భావజాలానికి లోనవకుండా దేశవ్యాప్తంగా మదర్సాలను మూసివేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రిజ్వీ లేఖ రాశారు. మదర్సాలను మూసివేయకుంటే 15 ఏళ్లలో సగానికి పైగా ముస్లిం జనాభా ఐసిస్‌కు మద్దతు పలుకుతుందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పట్టు పెంచుకునేందుకు ఐసిస్ ప్రయత్నిస్తోందన్నారు.మదర్సాలకు వెళుతూ ముస్లిం విద్యార్ధులు సమాజానికి దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మదర్సాల్లో సాధారణ విద్య కొరవడటంతో ఇతర మతాలకు దూరమవుతున్నారన్నారు. ఇస్లామిక్ విద్య పేరుతో విద్యార్ధుల్లో అతివాద ధోరణలను నూరిపోస్తున్నారన్నారు. ఈ ధోరణి ముస్లిం పిల్లలతో పాటు దేశానికి ప్రమాదకరమని రిజ్వీ హెచ్చరించారు. ప్రాధమిక స్ధాయిలో మదర్సాలను మూసివేయాలని, స్కూల్ విద్య అనంతరం సంస్కృతి గురించి తెలుసుకోగోరే విద్యార్ధులు వాటిలో చేరవచ్చని సూచించారు. -
‘బాబ్రీ మసీదు అని పిలవడం కూడా నేరమే’
లక్నో : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే షియా వక్ఫ్ బోర్డ్ చీఫ్ వాసీమ్ రిజ్వీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు అనేది దేశానికి ఒక మచ్చలాంటిదని.. దాన్ని మసీదు అని పిలవడం కూడా నేరమని ఆయన వ్యాఖ్యనించారు. ఈ సందర్భంగా రిజ్వీ మాట్లాడుతూ ‘ప్రస్తుతం బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో తవ్వకాలు జరిపినప్పుడు చదరపు ఆకారంలో ఉన్న 50 స్తంభాలతో నిర్మితమైన ఆలయం బయటపడింది. ఆలయానికి సంబంధించి మొత్తం 265 అవశేషాలు బయటపడ్డాయి. దాదాపు 137 మంది ఇక్కడ తవ్వకాలు జరిపారు. వీరిలో 52 మంది ముస్లీంలు ఉన్నార’ని తెలిపారు. అంతేకాక బాబ్రీ మసీదు కింద ఆలయం ఉందని.. దాన్ని కూలదోసి అక్కడ మసీదు నిర్మించారని భారత పురావస్తు శాఖ కూడా నిర్ధారించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రిజ్వీ కేకే మహ్మద్ రాసిన ‘ఐ యామ్ ఇండియన్’ పుస్తకాన్ని ప్రస్తావించారు. ఈ పుస్తకంలో ‘ప్రస్తుతం బాబ్రీ మసీదు ఉన్న చోట ఆలయాలు ఉండేవాని.. వాటిని నాశనం చేసి ఆ శిధిలాల మీదనే బాబ్రీ మసీదును నిర్మించిరాని’ రచయిత కేకే మహ్మద్ తన పుస్తకంలో రచించినట్లు రిజ్వీ తెలిపారు. అంతేకాక ఈ బాబ్రీ మసీదు విషయంలో హిందువులు - ముస్లీంలు ఓ అగ్రిమెంట్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం బాబ్రీ మసీదు ఉన్న చోట రామాలయం నిర్మించే హక్కు హిందువులకు ఉన్నదని ఆయన తెలిపారు. ముస్లింలు లక్నోలోని మరో ప్రాంతంలో మసీదు నిర్మించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాక బాబ్రీని మసీదు అని పిలవడం ముస్లిం సాంప్రదాయలకు విరుద్ధం అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా రిజ్వీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. ‘అయోధ్యలో మసీదు ఉండటానికి అవకాశమే లేదు. ఇది రామ జన్మభూమి.. ఇక్కడ రామాలయం మాత్రమే ఉండాలి.. మసీదు కాద’ని తెలిపారు. -
ఆ ఆకుపచ్చ జెండాలను నిషేధించాలి
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ జెండాలను పోలిన ఆకుపచ్చ జెండాలను భారతదేశంలో నిషేధించాలని షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీం రజ్వీ సుప్రీంకోర్టు పిల్ దాఖలు చేశారు. దేశంలో చాలా చోట్ల నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ రంగ జెండాలను ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ఎగరవేస్తున్నారని, వాటిని నిషేధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకున్న తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తామని సోమవారం పేర్కొంది. ఈ మేరకు కేంద్రం అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందిగా అదనపు సోలిటరీ జనరల్ తుషార్ మెహతాను జస్టిస్ ఎకే సిక్రి, అశోక్ భూషన్‌లతో కూడిన ధర్మాసనం కోరింది. ముస్లింలు అధికంగా ఉండే ముంబై లాంటి ప్రాంతాల్లో భవనాలపైన, మత స్మారక చిహ్నాలపైన పాకిస్తాన్‌కు చెందిన ముస్లిం లీగ్ పార్టీ జెండాను పొలిన జెండాలను ఎగరవేస్తున్నారని వసీం రజ్వీ తన పిటిషన్లో తెలిపారు. పాకిస్తాన్ భారత్‌కు శత్రు దేశమని, అలాంటి జెండాలు దేశంలో ఉండటానికి వీల్లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ జెండాలు హిందూ-ముస్లింల మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఉందన్నారు. నెలవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ జెండా 1906లో మహ్మద్ అలీ జిన్నా స్థాపించిన ముస్లిం లీగ్ పార్టీకి చెందినది. మన దేశంలో దాన్ని ఇస్లామిక్ జెండాగా భావిస్తారు. -
‘షరియత్ కోర్టులు చట్ట వ్యతిరేకం’
లక్నో : షరియత్ కోర్టులు (దారుల్ కాజా) ఏర్పాటు చట్ట వ్యతిరేకమని యూపీ షియా వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ వాసిం రిజ్వీ పేర్కొన్నారు. ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు దేశంలోని అన్ని జిల్లాలో షరియత్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు భావిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వాసిం రిజ్వీ సమస్యలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం ఉండొచ్చని, షరియత్ కోర్టులు మాత్రం ఏర్పాటు చేయాడానికి వీళ్లేదని వ్యాఖ్యానించారు. కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి ఖ్వాసి (జడ్జి)లను నియమించడం సరికాదని అన్నారు. ముస్లింల సమస్యలను పరిష్కరించడానికి సొంతంగా కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీనియర్ న్యాయవాది, ముస్లిం లా బోర్డు సభ్యుడు జాఫర్యాబ్ జిలానీ.. ప్రస్తుతం యూపీలో 40 కోర్టులు ఉన్నాయని అవి పూర్తిగా చట్టబద్దమైనవని స్పష్టం చేశారు. షరియత్ కోర్టులు చట్టవ్యతిరేకమైనవని ప్రజలు భావిస్తే సుప్రీంకోర్టు వాటిని తిరస్కరిస్తుందని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం కోర్టులు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ నెల 15 బోర్డు సభ్యులందరూ సమావేశమై తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని జిలానీ పేర్కొన్నారు. -
వక్ఫ్ భూములు హాంఫట్
సాక్షి, హైదరాబాద్ : వక్ఫ్ భూములను కాపాడుకోవడంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు ఘోరంగా విఫలమైందని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యుల తనిఖీ బృందం దుయ్యబట్టింది. 32,596 మసీదులు, దర్గాలు, ఆషర్ఖానాలు, ఇతర సంస్థలకు సంబంధించి రాష్ట్రంలో 77,677 ఎకరాల వక్ఫ్ భూములుండగా.. అందులో 89 శాతం భూములు అన్యాక్రాంతమయ్యాయని పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వక్ఫ్ బోర్డులకు సంబంధించి హైకోర్టులో 12,628 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో 8 వేల కేసుల విషయంలో వక్ఫ్ బోర్డు కౌంటర్లు, అప్పీళ్లు కూడా దాఖలు చేయలేకపోయిందని తెలిపింది. రెండు రాజకీయ పార్టీల ప్రమేయంతో రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల వక్ఫ్ భూముల కుంభకోణం చోటుచేసుకుందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సిఫారసు చేసింది. ఈ మేరకు తనిఖీ బృందం కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ చైర్మన్‌కు ఈ నెల 23న నివేదిక సమర్పించింది. కౌన్సిల్ సభ్యుడు నౌషాద్ నేతృత్వంలోని బృందం ఇటీవల రాష్ట్ర వక్ఫ్ బోర్డులో తనిఖీలు జరిపి నివేదిక రూపొందించింది. వక్ఫ్ బోర్డు పనితీరుపై తనిఖీ బృందం అడిగిన ప్రశ్నలకు బోర్డు కమిటీ సభ్యులు హాస్యాస్పద సమాధానాలిచ్చారని పేర్కొంది. వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఎమ్మెల్సీ మహమ్మద్ సలీం పనితీరు ఏమాత్రం బాగోలేదని, ఆయన ఈ పదవికి అనర్హుడని స్పష్టంచేసింది. రాష్ట్ర వక్ఫ్ కమిటీలోని నలుగురు సభ్యులపై వక్ఫ్ భూముల ఆక్రమణకు సంబంధించి హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. సాక్షాత్తూ వక్ఫ్ బోర్డు చైర్మన్, సభ్యులు నిధులు దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. వక్ఫ్ చట్టంలోని 14(డి) నిబంధన ప్రకారం.. సున్నీ, షియా మత గురువులను నియమించాల్సి ఉండగా, వారి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ నాయకులను నియమించిందని తప్పుబట్టింది. వక్ఫ్ బోర్డుకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించింది. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలివీ.. – పని తీరు, ఆదాయ వ్యయాలు, సర్వే, వక్ఫ్ డీడ్లు, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ఆస్తుల ఆక్రమణలు, వార్షిక నివేదికలను తనిఖీ బృందానికి సమర్పించడంలో వక్ఫ్ బోర్డు విఫలమైంది – మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీంకు ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఇన్చార్జి సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. రెగ్యులర్ సీఈవో లేకపోవడం వల్ల వక్ఫ్ బోర్డు పనితీరుపై ప్రభావం పడింది – వక్ఫ్ ఆస్తుల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్ సైతం 2016లో హైకోర్టులో కేసు వేసింది – హైదరాబాద్ ఐటీ హబ్ పరిధిలో ఉన్న అత్యంత విలువైన వక్ఫ్ భూములను అభివృద్ధిపరచడంలో వక్ఫ్ బోర్డు విఫలమైంది. ఈ భూములను అభివృద్ధి పరిస్తే బోర్డు వార్షిక ఆదాయంలో 40 శాతం వృద్ధి ఉంటుంది – వక్ఫ్ బోర్డులోని రెంట్లు, లీజుల విభాగం పనితీరు సందేహాస్పదంగా ఉంది. కమర్షియల్ ఏరియాల్లో మార్కెట్ విలువతో పోలిస్తే కేవలం 3 శాతం అద్దెతోనే కీలకమైన ఆస్తులను అద్దెకిచ్చారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.25,000 అద్దె వచ్చే షాపులను కేవలం రూ.150 అద్దెకు ఇచ్చారు – వక్ఫ్ బోర్డులో సూపరింటెండెంట్లు, క్లర్కులు, ఆఫీస్ సబార్డినేట్, ఇతర పోస్టుల్లో అర్హతలు లేని ఎంతో మంది ఉద్యోగులు పని చేస్తున్నారని మైనారిటీల సంక్షేమ శాఖపై ప్రభుత్వం నియమించిన సభా కమిటీ అసెంబ్లీకి నివేదించింది. వీరిలో కొందరు ఇంకా ఉద్యోగాల్లో ఉండగా, మరికొందరు ఇప్పటికే పదవి విరమణ చెంది ప్రయోజనాలు అందుకుంటున్నారు. కొందరు ఉద్యోగులు పలుకుబడితో తమ బంధువులకు సైతం ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ అభ్యంతరం తెలిపినా.. వక్ఫ్ బోర్డు తన స్వయం ప్రతిపత్తిని ఉపయోగించుకొని ఎలాంటి రాత పరీక్ష జరపకుండానే నియామకాలు జరిపింది – వక్ఫ్ బోర్డులో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పని చేసేందుకు 200 మందికిపైగా ఉద్యోగులను తక్షణమే నియమించాలి. పదవీ విరమణ చేసి ఏడేళ్లు గడుస్తున్నా ఇంకా ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిని తొలగించాలి. ఉన్న 106 మంది ఉద్యోగుల్లో 60 మంది అటెండర్లు, తొమ్మిది మంది సూపర్వైజర్లు. సీనియర్ ఉద్యోగులకు కనీసం ఒక లేఖ రాయడం కూడా రాదు. – మొహర్రం కోసం ఆషుర్ఖానాలు, ఇమాంబాడలకు వక్ఫ్ బోర్డు నిధులు ఇవ్వడం లేదు – హైదరాబాద్‌లోని అత్యంత విలువైన వక్ఫ్ భూములు, ఆస్తులను తనిఖీ బృందం సందర్శించింది. సికింద్రాబాద్‌లోని కోహే మౌలాలి దర్గాకు చెందిన 384 ఎకరాలు, సికింద్రాబాద్ తిరుమలగిరిలోని కొహే ఇమామ్ జామిన్ దర్గాకు చెందిన రూ.200 కోట్లు విలువ చేసే 210 ఎకరాలు, కార్వాన్‌లోని టోలీ మసీదుకు చెందిన 27.30 ఎకరాలు, చార్మినార్, పత్తర్‌గట్టీలోని ఆషూర్ఖానా నాల్–ఏ–ముబారక్‌కు చెందిన 1300 ఎకరాలు, మణికొండలోని దర్గా హుస్సేన్ షావలీ దర్గాకు చెందిన 1,654 ఎకరాలు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయం కోసం బాబా షర్ఫొద్దీన్ పహాడీ దర్గాకు చెందిన 1100 ఎకరాలను సేకరించగా, ఇంకా వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. -
ఉద్రిక్తత మధ్య వక్ఫ్ బోర్డు పాలకవర్గ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వక్ఫ్ బోర్డు పాలకవర్గ సమావేశం సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు హజ్ హౌస్‌లోని మొదటి అంతస్తులో సమావేశం ప్రారంభం కాగానే.. పలు స్వచ్ఛంద సంస్థలు, మసీదు కమిటీల సభ్యులు సమావేశ మందిరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వక్ఫ్ చట్టం ప్రకారం కాకుండా బోర్డు ఇష్టానుసారం వక్ఫ్ కమిటీలను ఏర్పాటు చేస్తోందని ఆరోపిస్తూ ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. కమిటీలు, వక్ఫ్ నిర్వాహకుల నియామకాలతోనే సమావేశాలు ముగుస్తున్నాయని, వక్ఫ్ ఆస్తులు, భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. కాన్ఫరెన్స్ హాల్ ఎదుట బైఠాయించడానికి ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు.. సమావేశం జరుగుతున్న ప్రదేశానికి ఎవరినీ అనుమతించలేదు. హజ్ హౌస్‌లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించినఇతర కార్యాలయాలు ఉన్నాయి. దీంతో వాటికి వచ్చే వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే సమావేశం వాయిదా పడింది. మొక్కుబడిగా సమావేశం.. సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని మసీదు, పలు సంస్థల పాలకవర్గ కమిటీలకు అనుమతులు ఇచ్చామన్నారు. ముస్లింల మ్యారేజ్ సర్టిఫికెట్ల ఆన్లైన్ ప్రక్రియ వాయిదా పడిందన్నారు. వక్ఫ్ కార్యకలాపాలు వేగవంతం చేయడానికి 50 మంది యువకులను ఔట్సోర్సింగ్ విధానంలో నియామకంపై వచ్చే పాలకవర్గ సమావేశంలో చర్చిస్తామ న్నారు. 2018కి బడ్జెట్ నివేదిక ఇంకా సిద్ధం కాలేదని, దీన్ని వచ్చే సమావేశంలో ప్రవేశపెడతామని చెప్పారు. వచ్చే నెల 10న మళ్లీ పాలకవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. -
యూపీలో సున్నీ, షియా వక్ఫ్‌బోర్డుల విలీనం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్‌బోర్డులను విలీనం చేసి ముస్లిం వక్ఫ్‌బోర్డును ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. సున్నీ, షియా వక్ఫ్‌బోర్డులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయనీ, అందుకే త్వరలో ప్రభుత్వం వాటిని విలీనం చేసి కొత్త సంస్థను ఏర్పాటు చేయనుందని వక్ఫ్ శాఖ సహాయ మంత్రి మొహ్సిన్ రజా చెప్పారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ, కొత్తగా ఏర్పడే బోర్డులో సున్నీ, షియా ఇరు వర్గాల వారు ఉంటారని మంత్రి వెల్లడించారు. రెండు బోర్డులను విలీనం చేయాలని ప్రభుత్వానికి అనేక వినతులు వచ్చిన తర్వాతనే దీనిపై ఆలోచిస్తున్నామని రజా పేర్కొన్నారు. -
‘బాబ్రీ’ పై కీలక వాదోపవాదాలు
న్యూఢిల్లీ: అయోధ్య కేసులో మంగళవారం సుప్రీంకోర్టులో కీలక వాదోపవాదాలు జరిగాయి. వివాదాస్పద స్థలానికి సమీపంలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే మసీదు నిర్మించాలని షియా బోర్డు మంగళవారం సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. ఒకే చోట రామమందిరం, మసీదు ఉంటే అది వివాదాలకు దారితీస్తుందని షియా వక్ఫ్ బోర్డు ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇతర భాగస్వాములందరితో కూడిన కమిటీ దశాబ్ధాల నాటి ఈ వివాదానికి తెరదించాలని సూచించింది. ఈ కమిటీలో ప్రధాని కార్యాలయం, యూపీ సీఎం కార్యాలయం నుంచి నామినీలకూ చోటు కల్పించాలని కోరింది. వాదోపవాదాలను పరిశీలించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 11న చేపట్టనున్నట్టు పేర్కొంది. ఇక వివాదాస్పద స్ధలాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రామ మందిరం కోసం, మరో భాగాన్ని నిర్మోహి అఖదకు, మూడో భాగాన్ని సున్ని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని 2010లో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొంది. కాగా, షియా వక్ఫ్ బోర్డు తాజాగా సుప్రీం ఎదుట భిన్న వాదనలు వినిపించింది. సున్ని బోర్డుకు కేటాయించిన వివాదాస్పద స్థలంలో భాగం తమకు చెందినదని షియా బోర్డు పేర్కొంది. కాగా అయోధ్య–బాబ్రీ మసీదు వివాదంలో 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ను సుప్రీం కోర్టు నియమించిన విషయం తెలిసిందే. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల బెంచ్ ఈ నెల 11 నుంచి పిటిషన్ల విచారణ ప్రారంభించనుంది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని గతంలో సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖరా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని గతంలో అలహాబాద్ హైకోర్టు 2:1 మెజారిటీతో తీర్పునిచ్చిన విషయం విదితమే. -
వక్ఫ్ జాగా.. ముఫ్త్ మజా!
అక్రమార్కుల చెరలో ఇనాం భూములు - వక్ఫ్ ఖజానాకు కోట్లాది రూపాయల గండి - యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు - నోటీసులతో సరిపెడుతున్న అధికారులు - వంత పాడుతున్న రెవెన్యూ శాఖ - క్షేత్రస్థాయిలో వీఆర్ఓల ఇష్టారాజ్యం మసీదు ఇనాం భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే ఈ భూముల్లో కొందరు రాజకీయ పార్టీల నేతలు పాగా వేశారు. రియల్టర్లు కొందరు ఈ భూముల్లో ప్లాట్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చేతనైనంత సాయం చేసి ప్రోత్సహిస్తున్నారు. సాగుదారులుగా హక్కు కల్పిస్తూ మీ-భూమిలో నమోదు చేస్తూ అక్రమార్కులకు వంత పాడుతున్నారు. కోడుమూరు: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందలాది ఎకరాల వక్ఫ్ భూమి అక్రమార్కుల సొంతమవుతోంది. అధికార పార్టీ నేతల అండదండలు.. రెవెన్యూ అధికారుల లీలలు.. వెరసి ఇనాం భూములు కాస్తా ప్లాట్లుగా మారిపోతున్నాయి. ఈ భూములకు రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు జారీ చేస్తుండటంతో.. బ్యాంకుల్లో మార్టిగేజ్ చేసి రుణాలు కూడా తీసుకుంటున్నారు. నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో వక్ఫ్ అధికారులు సైతం చర్యలకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 22,600 ఎకరాల వక్ఫ్ భూములు ఉండగా.. దాదాపు 3,809.95 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు అధికారుల సర్వేలో వెల్లడయింది. ఇందులో ఇప్పటి వరకు 265.35 ఎకరాలను మాత్రమే అక్రమార్కుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకోగలిగారు. ఆక్రమణల నేపథ్యంలో గ్రామాల్లో మసీదులు ఆలనాపాలన కరువై శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వీటి పర్యవేక్షణను చూసుకునే ముక్తావలిలు(మసీదు పెద్దలు) వక్ఫ్ భూముల నుంచి ఆదాయం రాకపోవడంతో ఆర్థిక ఇక్కట్లతో సతమతం అవుతున్నారు. కోడుమూరులోని పడమటి మసీదుకు చెందిన 60.48 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇటీవల ఆ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తానని ఓ టీడీపీ నేత రూ.6లక్షలు చొప్పున వసూలు చేయడం వివాదాస్పదమైంది. విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ భూములను వక్ఫ్ బోర్డు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా వందలాది ఎకరాల వక్ఫ్ భూమి అన్యాక్రాంతం అవుతున్నా.. బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కబ్జా కోరల్లో వక్ఫ్ భూములు గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో 65/8, 65/9 సర్వే నెంబర్లోని 8.6 ఎకరాల వక్ఫ్ భూమిని కుందం ప్రతాప్‌రెడ్డి తన చిన్నాన్న కొడుకులు శ్యాంసుందర్‌రెడ్డి, సోమేంద్రప్రసాద్రెడ్డిల పేరిట కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో(డాక్యుమెంట్ నెం.4026/2008) రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ ఆస్తి విలువ దాదాపు రూ.50లక్షలు. ఇదే గ్రామంలో దాదాపు 30 మంది రైతులు 120.80 ఎకరాల వక్ఫ్ భూములను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. పాణ్యం మండలంలోని తొగర్చేడులో అక్రమార్కులు 75 ఎకరాల వక్ఫ్ భూమిని ఆక్రమించుకున్నారు. విషయం తెలిసిన వక్ఫ్ బోర్డు అధికారులు నోటీసులు జారీ చేసి మిన్నకుండిపోయారు. అక్రమార్కులు రాజకీయ పలుకుబడితో చక్రం తిప్పుతున్నారు. కల్లూరు మండలం పందిపాడు గ్రామంలోని 5, 7/ఎ, 22, 94 సర్వే నెంబర్లలో ఉన్న 21.58 ఎకరాల మసీద్ ఇనాం భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. ఎకరా రూ.2కోట్ల నుంచి రూ.3 కోట్ల విలువ చేసే ఈ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు యథేచ్ఛగా ప్లాట్లు వేసి విక్రయిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఇదే గ్రామంలోని 7/ఎ సర్వే నెంబర్లో ఉన్న 12.12 ఎకరాల భూమి(ఇండస్ స్కూల్ ఎదురుగా)ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు సెంటు రూ.3లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. కల్లూరు, కర్నూలు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. సర్వే నెం.7/ఏలో 1297 చదరపు అడుగుల భూమిని సకారం మల్లికార్జునరావు రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.సుందర్రావు అనే వ్యక్తికి(డాక్యుమెంట్ నెం.1384/2006) విక్రయించి కర్నూలు రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాడు. ముత్యాల స్వయం ప్రభాదేవి అనే మహిళ యు.మల్లికార్జున అనే వ్యక్తికి(డాక్యుమెంట్ నెం.6348/2014) 194.64 చదరపు అడుగుల భూమిని కల్లూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. పెద్దపాడు గ్రామంలోని 525 ఎకరాల భూమి 350 మంది రైతుల ఆధీనంలో ఉన్నట్లు వక్ఫ్‌బోర్డు అధికారులు గుర్తించారు. ఫలితంగా వక్ఫ్ బోర్డు ఈ భూముల నుంచి వచ్చే కౌలు ఆదాయం కోల్పోతుంది. వీఆర్వోల పొరపాటు చనుగోండ్లలోని మసీద్ ఇనాం భూములను మసీద్ ఇనాం పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశాం. వీఆర్వోలు పంట నమోదు సర్వే ఆధారంగా అప్పట్లో సాగులో ఉన్న రైతుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేశారు. - శివశంకర్‌నాయక్, తహసీల్దార్ గూడూరు -
‘బాబ్రీ’పై సుప్రీం తీర్పును గౌరవిస్తాం
జమాతే–ఇ–ఇస్తామి హింద్ తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అధ్యక్షుడు హన్మకొండ చౌరస్తా: బాబ్రీ మసీదు, అయోధ్య రామ మందిరం వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని జమాతే–ఇ–ఇస్లామి హింద్ తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అధ్యక్షుడు మౌలానా హమీద్ మహ్మద్ ఖాన్ సాహెబ్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మ కొండలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబ్రీ వివాదంపై ఆరుసార్లు చర్చలు జరిగినా స్పష్టత లేక సమస్య అలాగే మిగిలిపోయిందని, గతం పునరావృతం కావద్దంటే న్యాయ స్థానమే సరైన తీర్పు చెప్పాలని, ఆ తీర్పుకు తాము కట్టుబడి ఉంటామన్నారు. వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు ఇవ్వాలని, అప్పుడే ఆయా ఆస్తులకు రక్షణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేç Ùన్లు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రిజర్వేషన్లు అమలు చేయకుండా బీసీ కమిషన్‌ను నియమించడం సమంజసం కాదన్నారు. -
ఆక్రమిత స్థలాల పరిశీలన..
ప్రొద్దుటూరు: ఆక్రమణలో ఉన్న వక్ఫ్‌బోర్డు స్థలాలను రాష్ట్ర స్థాయి అధికారుల బృందం పరిశీలించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన వక్ఫ్‌బోర్డు సీఈఓ ఎల్.అబ్దుల్ ఖాదర్, టాస్క్ఫోర్సు ఆఫీసర్ అబ్దుల్ ఉద్దూస్, డెరైక్టర్ మేనేజ్ మెంట్ క్లర్క్ ఖాజామొహిద్దీన్, జిల్లా వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ షేక్ మహ్మద్షఫివుల్లా, జూనియర్ అసిస్టెంట్ గౌస్ కర్నూలు జిల్లా నుంచి మధ్యాహ్నం ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడంపల్లె మసీదు పరిధిలో అక్రమంగా అమ్మిన స్థలాల గురించి ఆరా తీశారు. అలాగే చౌసేన్వలి ఆస్తుల వివరాల గురించి చర్చించినట్లు తెలిసింది. అనంతరం డీఎస్పీ నీలం పూజితను కలిశారు. ఈ నెల 11న సాక్షిలో ‘ఆక్రమణలకు అడ్డేది’ శీర్షికన వక్ఫ్‌బోర్డు స్థలాల ఆక్రమణపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి: వరద వక్ఫ్‌బోర్డు భూములను, ఆస్తులను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం సాయంత్రం అధికారులను స్వయంగా కలిసి విన్నవించారు. ప్రొద్దుటూరు పరిధిలో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆయన తెలిపారు. పోలీసు కేసులకే పరిమితమైతే ఫలితం ఉండదని, వీటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. అలాగే టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఖాజామొహిద్దీన్ కూడా వక్ఫ్‌బోర్డు ఆస్తుల అన్యాక్రాంతపై అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా వక్ఫ్ బోర్డు ఆస్తుల ఆక్రమణకు సంబంధించి కేసుల్లో ఉన్న వారు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి వర్గీయులుగా ఉండటం కొసమెరుపు. -
18 నుంచి బడాపహాడ్ ఉర్సు
* భక్తులకు మౌలిక సదుపాయాలు * జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ జావీద్ అక్రం వర్ని : ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బడాపహాడ్ సయ్యద్ షాదుల్లా హుస్సేనీ దర్గా ఉర్సును ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ జావిద్ అక్రం తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు వసతులను కల్పిస్తామని పేర్కొన్నారు. మండలంలోని బడాపహాడ్‌లో శనివారం సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉర్సుకు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కలెక్టర్ యోగితరాణాలను వక్ఫ్‌బోర్డు తరఫున ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ యేడు ఉర్సును ఘనంగా నిర్వహించేందుకు వక్ఫ్‌బోర్డు రూ. 10 లక్షలు కేటాయించిందని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సులను నడపడానికి బోధన్, నిజామాబాద్, బాన్సువాడ డిపో అధికారులతో మాట్లాడతామన్నారు. వక్ఫ్ బోర్డు అధికారులు స్థానికంగా వచ్చే భక్తుల కోసం తాగునీటి సౌకర్యం, మహిళల స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం బడాపహాడ్‌లో ప్రస్తుతం ఉన్న తాగునీటి సౌకర్యాన్ని ఆయన పరిశీలించారు. మినీ వాటర్ ట్యాంక్‌ల చుట్టు గచ్చు పగిలి అపరిశుభ్రంగా ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉర్సు వరకు బాగు చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని దర్గా సూపరింటెండెంట్ సాజిద్‌కు సూచించారు. సమావేశంలో వక్ఫ్‌బోర్డు జిల్లా ఉపాధ్యక్షుడు జహీరొద్దీన్ జావిద్, నాయకులు అయ్యూబ్, మహ్మద్ గౌస్, ఖయ్యూమ్ తదితరులు పాల్గొన్నారు. మౌలాలీ దర్గాను అభివృద్ధి చేస్తాం బీర్కూర్ : తెలంగాణ తిరుమల దేవస్థానం వద్ద ఉన్న హజ్ర త్ మౌలాలీ దర్గాను అభివృద్ధి చేస్తామని జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ జావిద్ అక్రం పేర్కొన్నారు. శనివారం ఆయన దర్గా లో ప్రత్యేక ప్రార్థన చేశారు. దర్గా స్థలంపై వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఖాదర్, వైస్ చైర్మన్ జహీరొద్దీన్ జావిద్‌లతో కలిసి సర్వేచేశామని, నివేదికను హైదరాబాద్‌లోని సీఈవో కార్యాలయానికి పంపుతామని చెప్పారు. -
మండలిలో ‘వక్ఫ్’ రగడ
బెంగళూరు: వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని దాదాపు రూ. 15 లక్షల కోట్ల విలువ చేసే 57వేల ఎకరాల భూములకు సంబంధించిన అవకతవకలపై శాసనమండలిలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన అవకతవకలపై అన్వర్ మానప్పాడి నేతృత్వంలోని సమితి ప్రభుత్వానికి అందజేసిన నివేదికను మండలిలో ప్రవేశపెట్టాలంటూ డిమాండ్ చేశాయి. ఇదే సందర్భంలో మండలిలో నివేదికను ప్రవేశపెట్టే వరకు సభను సాగనివ్వమంటూ వెల్‌లోకి దూసుకెళ్లి తమ నిరసనను తెలియజేశాయి. సోమవారం ఉదయం శాసనమండలి కార్యకలాపాలు ప్రారంభం కాగానే విపక్షనేత కె.ఎస్.ఈశ్వరప్ప మాట్లాడుతూ... వక్ఫ్ ఆస్తులకు సంబంధించి అన్వర్ మానప్పాడి ప్రభుత్వానికి అందజేసిన నివేదికను మండలిలో ప్రవేశపెట్టాల్సిందిగా చైర్మన్ ఆదేశించినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ నివేదికను మండలిలో ప్రవేశపెట్టలేదని అన్నారు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని 57వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని, తద్వారా రూ.15 లక్షల కోట్ల మేరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ భూములను కబ్జా చేసిన వారిని రక్షించుకునేందుకు ప్రభుత్వం పాకులాడుతోందని విమర్శించారు. ఈ సందర్భంలో శాసనమండలిలో అధికార పక్ష నేత ఎస్.ఆర్.పాటిల్ కలగజేసుకొని...‘ప్రజలు కడుతున్న పన్నులతో సభా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాంటి సభలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య, కరువు సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ ఇవేవీ ప్రతిపక్షానికి పట్టడం లేదు. కేవలం రాజకీయాల కోసమే సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారు’ అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య చాలా సేపు వాగ్వాదం నెలకొంది. అనంతరం రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర మాట్లాడుతూ...‘వందేళ్ల చరిత్ర ఈ సభకు ఉంది, సభ సరిగ్గా లేనపుడు ఇక చర్చలు జరపడం కూడా అనవసరం. ముందు సభా కార్యకలాపాలు సాగనివ్వండి. మీరు ఇచ్చిన రూలింగ్‌పై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం’ అని కోరారు. అయితే జయచంద్ర సమాధానంతో ప్రతిపక్షం శాంతించలేదు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప మాట్లాడుతూ....‘ఇప్పటికే మూడు సార్లు ఈ విషయంపై రూలింగ్ ఇచ్చాం, నివేదికను మీరు మండలిలో ప్రవేశపెడతారో లేదో స్పష్టంగా చెప్పి, నివేదికను ప్రవేశపెడతామని హామీ ఇస్తేనే మా పోరాటాన్ని నిలిపివేస్తాం. లేదంటే మా పోరాటం కొనసాగుతుంది’ అని హెచ్చరించారు. -
బడా పహాడ్‌లో సమస్యలు
బాన్సువాడ : తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల పవిత్ర దర్గాల్లో ప్రముఖమైన దర్గా బడా పహాడ్ దర్గా. ఈ దర్గా ద్వారా వక్ఫ్‌బోర్డుకు ఏటా రూ. 2 నుంచి 3 కోట్ల ఆదాయం వస్తోంది. సుమారు లక్ష నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తుంటారు. వీరితో పాటు మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. ఈ దర్గాకు వచ్చే భక్తులు, మనస్ఫూర్తితో న్యాయమైన కోరికలు కోరితే అవి నెరవేరుతాయనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన దర్గాలో సమస్యలు తిష్టవేశాయి. రాబడి గురించి పట్టించుకుంటున్న దర్గా అభివృద్ధి కమిటీ సభ్యులు సమస్యల పరిష్కారంలో చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముజావర్లు (దర్గా పర్యవేక్షకులు) దోపిడీయే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులను దోచుకుంటున్న కాంట్రాక్టర్లు బడాపహాడ్ నిర్వహణకు ఏటా వేలం నిర్వహిం చిన కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. ఏడాదికి సగటు న రూ.2 నుంచి 3 కోట్ల వరకు వేలం పాడి కాంట్రాక్ట్ దక్కించుకుంటారు. తర్వాత వక్ఫ్‌బోర్డు అధికారులు, కాంట్రాక్టర్లు దీనిని పట్టించుకోకపోవడంతో సమస్యలు ఎక్కడివక్కడే తిష్ట వేస్తున్నాయి. అంతేకాకుండా కోట్లు పెట్టి పాట పాడిన కాంట్రాక్టర్లు వాటిని సంపాదించుకునేందుకు బలవంతంగా భక్తుల నుంచి డబ్బు లు దండుకుంటున్నారు. డబ్బులు ఇవ్వకుంటే దర్గాహ్ లోపలికి కూడా రానివ్వడం లేదు. ‘ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి. మాకేం కాదు’ అని మొహం మీదే చెబుతున్నారు. వక్ఫ్‌బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కనీస సౌకర్యాలు కరువు యేటా కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నా దర్గాలో భక్తుల కోసం వసతులు కరువయ్యూయి. భక్తులకు విడిది కోసం విశ్రాంతి గృహాలు లేవు. స్నానం చేయడానికి, తాగడానికి నీరు లేదు. మూత్ర శాలలు లేవు. రోప్‌వే నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసినా అవి కనుమరుగయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. నేటి నుంచి బడాపహాడ్ ఉర్సు వర్ని : జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన బడాపహాడ్ దర్గా ఉర్సు గురువారం ప్రారంభం కానుంది. 30న జలాల్పూర్ నుంచి జొహర్ తర్వాత మధ్యాహ్నం ముజావర్ ఇంటి నుంచి సంధల్ (గంధం)తో ర్యాలీగా బయలు దేరుతారు. మే 1న దీపారాధన, చిరాగ్ ఖవ్వాలి, 2న ఫజర్ తర్వాత తిలావత్ ఖురాన్-ఏ-పాక్, తబర్రుక్ పంచడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతిపాదనలు పంపించాం బడాపహాడ్ తెలంగాణలోనే ఎంతో ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రం. దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయా లి. బడాపహాడ్‌లో కొందరు భక్తులను దోచుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిపై చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకే డబ్బులు తీసుకోవాలి. బడాపహాడ్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపించాం. - జావీద్ అక్రం, వక్ఫ్‌బోర్డు జిల్లా అధ్యక్షుడు -
తాజ్‌మహల్ పురావస్తు శాఖ ఆస్తి: బాజపేయి
బర్లాంపూర్(యూపీ): తాజ్‌మహల్ ను వక్ఫ్ బోర్డుకు అప్పగించరాదని బీజేపీ యూపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజపేయి డిమాండ్ చేశారు. ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్ పురావస్తు శాఖకు చెందుతుందని చెప్పారు. 'తేజోమహాలయ ఆలయ భూమిలోని కొంతభాగాన్ని రాజా జాయ్ సింగ్ నుంచి మొఘల్ చక్రవర్తి షాజహాన్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన పత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. తాజ్‌మహల్ ను వక్ఫ్ బోర్డుకు అప్పగించకూడదు. ఇది భారత పురావస్తు శాఖకు చెందిన ఆస్తి. బ్రిటీషు ప్రభుత్వం 1920లో దీన్ని పురావస్తు శాఖకు అప్పగించింది' అని లక్ష్మీకాంత్ బాజపేయి పేర్కొన్నారు. తాజ్‌మహల్ ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించి, అప్పగించాలని ఉత్తరప్రదేశ్ మంత్రి మహ్మద్ ఆజంఖాన్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేసింది. -
తాజ్‌మహల్‌పై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
-
తాజ్‌మహల్ పై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఆగ్రా: తాజ్‌మహల్ పై ఉత్తరప్రదేశ్ మంత్రి మహ్మద్ ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది. తాజ్‌మహల్ ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించి, అప్పగించాలని గురువారం ఆయన వ్యాఖ్యానించారు. రోజుకు ఐదుసార్లు తాజ్‌మహల్ లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు అనుమతించాలని అధికార సమాజ్‌వాది పార్టీని మరో ముస్లిం నాయకుడు కోరారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రా వాసులు, బుద్ధిజీవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆజంఖాన్ కు మతి తప్పిందని బ్రజ్ మండల్ హెరిటేజ్ కన్జర్వేషన్ సొసైటీ అధ్యక్షుడు సురేంద్ర శర్మ మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మంత్రికి తగదని హితవు పలికారు. మంత్రి వ్యాఖ్యలు బాధాకరమని అజ్మీర్ కు చెందిన మొఘల్ చరిత్రకారుడు ఆర్. నాథ్ అన్నారు. బీజేపీ కూడా ఆజంఖాన్ వ్యాఖ్యలను ఖండించింది. ఏడాదికి 80 లక్షల మందిపైగా పర్యాటకులు తాజ్‌మహల్ ను సందర్శిస్తుంటారు. -
వక్ఫ్ .. రగడ
దేవరకొండ: వక్ఫ్‌భూముల పరిరక్షణకు అటు ప్రభుత్వం..ఇటు వక్ఫ్ బోర్డు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఆక్రమణలను గుర్తించి భూములను స్వాధీనం చేసుకోవాలని వక్ఫ్ పరిరక్షణ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఎక్కడెక్కడ కబ్జాకు గురయ్యాయి...ఎవరి చేతుల్లో ఉన్నాయో ఆరా తీస్తోంది. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వక్ఫ్గ్రడ ప్రభుత్వ కార్యాలయాలకుతగిలింది. చాలా ప్రభుత్వ కార్యాలయాలు వక్ఫ్ భూముల్లో ఉండడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. జిల్లావ్యాప్తంగా సుమారు 5వేల ఎకరాల వక్ఫ్ భూములుండగా అందులో 85 శాతం భూములు ఇతరుల ఆక్రమణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క దేవరకొండలో 111 ఎకరాల 8 గుంటల వక్ఫ్ భూములుండగా, అందులో సుమారు 83 ఎకరాలు పలువురి ఆక్రమణలో ఉన్నాయి. వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పరాయి, ప్రైవేట్ అని కాదు.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కార్యాలయాల స్థలాలను కూడా వదులుకునేది లేదని తేల్చి చెబుతోంది. గతంలో నగర పంచాయతీ స్థలం వక్ఫ్ భూమిగా పేర్కొంటూ కొందరు మైనార్టీలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై తీర్పు రాకపోవడంతో భవన నిర్మాణానికి మంజూరైన 2 కోట్ల రూపాయల నిధులు మూలుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ స్థలం కూడా వక్ఫ్ ల్యాండేనని (సర్వేనంబర్ 754) సదరు వక్ఫ్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అదనపు గదుల పనులను స్టేట్ వక్ఫ్ ప్రొటెక్ట్ ఆఫీసర్ సనా ఉల్లాఖాన్ నిలుపుదల కూడా చేయించారు. అసలు వక్ఫ్ కథ ఏమిటంటే .. నిజాం కాలం నుంచి మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించిన వక్ఫ్, వక్ఫ్ ఇనాం భూములు దేవరకొండ పట్టణంలో 111 ఎకరాలు ఉన్నాయి. ఇవి అష్రాఖానా, దర్గా, ఖాదర్‌షా సాహెబ్, దర్గా, హాజీదర్వేష్ మహ్మద్‌ఖాద్రి, హజ్రత్ జెల్షెహద్ఖాద్రి, దర్గా హసులేమాన్, జామా మసీద్ వంటి వాటి పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 224, 244, 399, 402, 408, 412, 535, 534, 489, 454, 489, 464, 420, 407, 404, 403, 398, 397, 395, 396 సర్వేనంబర్లలో ఈ వక్ఫ్ భూములు ఉన్నాయి. కాలక్రమంలో 83 ఎకరాల మేర కబ్జాకు గురైంది. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆటంకంగా మారిన ‘వక్ఫ్’ దేవరకొండలోని చాలా ప్రభుత్వ కార్యాలయాలు వక్ఫ్ భూముల్లోనే ఉన్నాయి. దేవరకొండ నగర పంచాయతీ కార్యాలయం, సివిల్ సప్లయీస్ గోడౌన్, శాఖా గ్రంథాలయం, తహసీల్దార్ కార్యాలయం ఇవన్నీ వక్ఫ్ సర్వేనంబర్లలోనే ఉం డడం గమనార్హం. ఇప్పటికే నగర పంచాయతీ నిర్మాణానికి ఆటంకంగా మారిన వక్ఫ్ రగడ.. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలకు కూడా తగిలింది. ఆయా కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అయితే వీటి నిర్మాణానికి పట్టణానికి సమీపంలో ప్రభుత్వ భూములు లేవు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోగా ఆ భవనాన్ని కూల్చి అక్కడే ఈ రెండు కార్యాలయాలను నిర్మించాలని మొదట అధికారులు భావించారు. కానీ తహసీల్దార్ కార్యాలయం వక్ఫ్ సర్వేనంబర్‌లోనే ఉండడంతో ఉన్న భవనాన్ని కూల్చి నిర్మాణం చేపడితే చట్టపరమైన చర్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు కూడా వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడేంటి .. వక్ఫ్ భూములపై వక్ఫ్ పరిరక్షణ బోర్డు దృష్టి సారించింది. ఆక్రమణకు, కబ్జాలకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా బోర్డు అధికారులు గత ఏడాది దేవరకొండ పరిధిలోని మెయిన్‌రోడ్డులో ఉన్న వాణిజ్య స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు డీఆర్ఓ, కలెక్టర్లను సంప్రదించారు. ఆయా స్థలాల్లో కబ్జాలో ఉన్న 105 మందికి నోటీసులు జారీ చేశారు. వెంటనే ఖాళీ చేయాలని పేర్కొన్నారు. కానీ రాజకీయ జోక్యంతో ఆ వివాదం సద్దుమణిగినా ఇప్పుడు ఆ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ భూములను స్వాధీనం చేసుకుని తిరిగి సంవత్సరం వారీగా లీజ్‌కు ఇవ్వాలని, తద్వారా రాబడి పెంచుకోవాలని వక్ఫ్ భావిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం.. మరోవైపు వక్ఫ్‌బోర్డు ఈ భూముల స్వాధీనానికి కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఆక్రమణదారుల్లో భయం మొదలైంది. -
హాంఫట్!
ఇప్పటికే ఎక్కువ శాతం ఆక్రమణ ఉన్నవాటిపైనా రియల్టర్ల కన్ను పట్టించుకోని పాలకులు, అధికారులు ముస్లిం మైనారిటీల ఆందోళన ఇబ్రహీంపట్నం : పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులు, భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. వక్ఫ్‌బోర్డు అధికారులు కూడా సరిగా పట్టించుకోకపోవడంతో మండలంలోని 90 శాతం భూములు కబ్జాకు గురయ్యాయి. 1962వ సంవత్సరంలో వక్ఫ్ గెజిట్‌లో పేర్కొన్న ప్రకారం కొండపల్లి శాంతినగర్‌లోని ముర్తుజా అలీ పంజా కింద ఆర్ఎస్ నంబరు 212ఏ, 212బీలలో 18.30 ఎకరాల మాన్యం భూమి, బ్యాంక్ సెంటరులో 293 సర్వే నంబరులో 1,800 చదరపు గజాల భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయి. బ్యాంక్ సెంటర్లో ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. మసీదు గడ్డ కింద ఆర్ఎస్ నంబరు 289లో ఉన్న 15 ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే కొందరు భవనాలు కూడా నిర్మించుకున్నారు. కొండపల్లి ఖిల్లా రోడ్డులో ఉన్న బొమ్మలకాలనీలోని పురాతన మసీదును సైతం కొందరు ఆక్రమించుకుని ఏకంగా కాపురం ఉంటున్నారు. ఈ మసీదు కింద ఉన్న భూములను కొందరు ఆక్రమించి నిర్భయంగా విక్రయిస్తున్నారు. మిగిలిన భూములను ఆక్రమించుకునేందుకు.. మండలంలోని గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, దొనబండ, దామలూరు, ఈలప్రోలు గ్రామాల్లోనూ వందలాది ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. మసీదులు, శ్మశానాలు, పంజాలు, దర్గాలు, ఖాజీమాన్యం, జాగీర్దార్ మాన్యం తదితర ఆస్తులు, భూములను కొందరు పెద్దలు ఆక్రమించారు. మరోవైపు విజయవాడను రాష్ట్ర రాజధానిగా ప్రకటించడంతో మిగిలిన భూములపై కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేశారు. ఈ పరిస్థితుల్లో తమ భూములను పరిరక్షించుకునేందుకు అధికార టీడీపీ తరఫున ముస్లిం ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ లేరని, కనీసం మైనారిటీ శాఖకు మంత్రిగా తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని నియమించలేదని ముస్లింలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పంచాయతీ, రెవెన్యూ వర్గాల నిర్లక్ష్యం వల్లే.. మైనారిటీలకు చెందిన ఆస్తులు, భూములను కాపాడాల్సిన బాధ్యత వక్ఫ్‌బోర్డుపై ఉంది. ప్రభుత్వం 2002 జారీ చేసిన జీవో ఎంఎస్ నంబరు 374 ప్రకారం వక్ఫ్ బోర్డు భూములను పర్యవేక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారులపై కూడా ఉంది. కానీ, వక్ఫ్ భూములు ఆక్రమించుకున్నవారిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొందరు రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి తప్పుడు ఎన్వోసీలు ఇస్తున్నారు. వాటి సాయంతో సర్వే నంబర్ మార్చుకుని, సమీప డోర్ నంబరు వేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీంతో గ్రామ పంచాయతీ అధికారులకు అన్నీ తెలిసినా మామూళ్లు తీసుకుని ఇళ్లు, ఇతర నిర్మాణానాలకు అనుమతులు ఇస్తున్నారు. పన్నులు కూడా వసూలు చేస్తున్నారు. కబ్జాదారులు అక్రమ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ అధికారులు జారీచేసిన ఎన్వోసీలు, పంచాయతీకి పన్నులు చెల్లించిన రశీదులు చూపించి కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. వక్ఫ్ భూములపై ప్రభుత్వ కన్ను! విజయవాడ కేంద్రంగా నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో భూ సేకరణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలోని ఖాజీమాన్యం, జాగీర్దార్ మాన్యం భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆక్రమణదారులకే కొమ్ముకాస్తున్నారు కొండపల్లి గ్రామంలో సర్వే నంబర్లు 438/1, 289, 293లలో ఉన్న వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అధికారులు ఆక్రమణదారులకే కొమ్ముకాస్తున్నారు. దీంతో ఆక్రమణదారులకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. వక్ఫ్ చట్టాన్ని కఠినంగా అమలు చేసి కబ్జాలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. - ఎస్ఏ రెహ్మాన్, న్యాయవాది, కొండపల్లి మైనారిటీ అధికారులు ఆదేశిస్తేనే చర్యలు కొండపల్లి, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి గ్రామాల్లో ఖాజీమాన్యం, వక్ఫ్‌భూములు ఉన్నమాట వాస్తవమే. ఈ భూములు అన్యాక్రాతమైతే ముస్లిం మైనారిటీ అధికారులే ముందుగా స్పందించాలి. ఆక్రమణలపై మైనారిటీ అధికారులు రాత పూర్వకంగా ఉత్తర్వులు అందజేస్తేనే రెవెన్యూ శాఖ తరఫున మేము స్పందింస్తాము. నేను వచ్చిన తర్వాత అటువంటి ఉత్తర్వులేమీ అందలేదు. వస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాము. - హరిహర బ్రహ్మాజీ, తహశీల్దార్, ఇబ్రహీంపట్నం చర్యలు తీసుకుంటున్నాం ఇబ్రహీంపట్నం ఖాజీమాన్యం ఆక్రమించిన 11 మందిపై క్రిమినల్ కేసులు పెట్టించాము. కొండపల్లి శాంతినగర్, బ్యాంక్ సెంటర్, బొమ్మలకాలనీల్లో ఉన్న భూముల ను ఆక్రమించుకుని భవనాలు నిర్మించుకున్నవారిలో కొందరికి నోటీసులు ఇచ్చాము. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాము. మిగిలిన వారికి కూడా నోటీసులు ఇచ్చి తప్పకుండా భూములను కాపాడటానికి చర్యలు తీసుకుంటాము. - అహ్మద్, వక్ఫ్‌బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్, విజయవాడ -
మహంకాళి దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతం!
సమాచార హక్కు చట్టంతో బహిర్గతం రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయానికి చెందిన ఆస్తులు అన్యాక్రాంతమైనట్టు తెలుస్తోంది. కోట్ల రూపాయల విలువ చేసే అమ్మవారి ఆస్తులను కొందరు అధికారులు కైంకర్యం చేసినట్టు స్పష్టమవుతోంది. తమ తప్పును దీన్ని కప్పిపుచ్చుకునేందుకు రికార్డులనే మాయం చేశారని తెలుస్తోంది. దీన్ని నిరూపించే బలమైన సాక్ష్యాధారాలను సమాచార హక్కు చట్టం కార్యకర్త నాగెల్లి శ్రీనివాస్ సంపాదించారు. ఆయన మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయానికి స్వాతంత్య్రానికి పూర్వమే భక్తులు ఎకరం 37 గుంటల స్థలాన్ని మాన్యంగా ఇచ్చారు. 1954 సంవత్సరానికి ముందు మసీదు, చర్చీలు, దేవాలయాలకు చెందిన ఆస్తులను అవుకాఫ్‌లో రిజిష్టర్ చేయించేవారు. 1954 సంవత్సరంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు కాగా 1966 సంవత్సరంలో దేవాదాయ శాఖ ఏర్పడింది. దీంతో 1946 (1356 ఫస్లీ)సంవత్సరంలో అప్పటి ఆలయ ఫౌండర్ ట్రస్టీలు దేవాలయానికి చెందిన ఎకరం 37 గుంటల మాన్యం భూమిని కితాబ్ ఉల్ అవుకాఫ్‌లో రిజిష్టర్ చేయించారు. దీనికి సంబంధించిన ఫైల్ నంబర్ 17/2గా నమోదు చేశారు. ఇదే భూమిలో 7 మడిగెలు కూడా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఈ రికార్డు ప్రకారం ఈ భూమికి సంబంధించిన సర్వే నంబర్ 92 భోలక్‌పూర్ విలేజ్‌గా ఉంది. ఆ రికార్డు ప్రకారం దేవాలయానికి ఎకరం 37 గుంటల స్థలం ఉండగా, ఇప్పుడు మిగిలింది మాత్రం కేవలం 1,308 గజాల స్థలం మాత్రమే. అంటే సుమారు 7,972 వేల గజాల స్థలం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ ప్రాంతంలో మార్కెట్ రేటు ప్రకారం చూస్తే సుమారు రూ.100 కోట్ల స్థలం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయిందనేది స్పష్టం అవుతుంది. లోకాయుక్తకు తప్పుడు సమాచారం.. ఆలయ భూమి కబ్జా వ్యవహారాన్ని నాగెల్లి శ్రీనివాస్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త బయటకు తేవడంతో లోకాయుక్త దీన్ని సూమోటోగా స్వీకరించింది. దేవాలయానికి చెందిన కోట్ల రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం కాగా అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికారులు లోకాయుక్తకు తప్పుడు సమాచారం అందించారు. భోలక్‌పూర్ విలేజ్‌లో సర్వే నెంబర్ 92 లేదని, కితాబ్ ఉల్ అవుకాఫ్‌లో క్లరికల్ తప్పిదం వల్ల 17/2 ఫైల్ నంబర్ నమోదైందని చెప్పారు. సర్వే ల్యాండ్ రికార్డ్స్‌లో టీఎస్ నంబర్ 108, 109,110లో దేవాలయం, దాని సంబంధించిన స్థలం ఉందని భోలక్‌పూర్ విలేజ్ 92 సర్వే నంబర్ లేదని దేవాదాయ శాఖ అధికారులు లోకాయుక్తకు తెలిపారు. కానీ 1912 సంవత్సరంలో అప్పటి నిజాం నవాబు సర్వే నంబర్ 92 భోలక్‌పూర్ విలేజ్‌కు 15 ఎకరాల భూమిని బ్రిటిష్ వారికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భోలక్‌పూర్ విలేజ్ 92 కింద పలు డాక్యుమెంట్లు, దీన్ని నిర్ధారించే మ్యాప్లున్నా అధికారులు దాన్ని పక్కన బెట్టి 1963 సంవత్సరంలో చేసిన టౌన్ సర్వే ల్యాండ్ రికార్డ్స్‌నే ప్రామాణికంగా భావిస్తుండటం అనుమానాలకు దారితీస్తుంది. ఆ రికార్డు ఏమైంది? 1946 సంవత్సరంలో కితాబ్ ఉల్ అవుకాఫ్‌లో దేవాలయానికి చెందిన భూమి రిజిష్టర్ చేసిన 17/2 ఫైల్ మొత్తం కొంత మంది అధికారులే మాయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్లరికల్ తప్పిదం వల్లే అలా జరిగిందంటూ తప్పించుకుంటున్నారు. భోలక్‌పూర్ విలేజ్ 92 సర్వే నంబర్‌తో అనేక లావాదేవీలు జరిగినటుట సాక్ష్యాధారాలున్నా కొంత మంది పెద్దలు చేసిన నిర్వాహకం బయటకు రాకుండా ఉండేందుకు ఈ ఫైల్‌తోపాటు సర్వే నంబర్ 92ను కూడా రికార్డుల్లో కనిపించకుండా చేసినట్టు తెలుస్తోంది. ఇదే రికార్డులో దేవాలయానికి చెందిన మరికొన్ని భూములు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మహంకాళి దేవాలయానికి చెందిన భూములపై దృష్టిసారిస్తే కోట్లాది రూపాయల ఆస్తులు బయటకు వచ్చే అవకాశం ఉంది. -
వక్ఫ్ బోర్డ్‌కు సీఈవోను నియమించండి
రాష్ట్ర వక్ఫ్ బోర్డ్‌కు పూర్తిస్థాయి ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈవో)ని నియమించాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు గాను ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ బోర్డులో అకౌంటింగ్ అధికారిగా ఉన్న ఎం.ఎ.గఫార్‌ను సీఈవోగా కొనసాగేందుకు అనుమతి ఇస్తూ ఈ ఏడాది జూన్ 22న మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన సయ్యద్ ఒమర్ షఫీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీన్ని సోమవారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం రెండు వారాల్లో వక్ఫ్ బోర్డ్‌కు పూర్తిస్థాయి సీఈవోను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.