సాక్షి, హైదరాబాద్: ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా వక్ఫ్‌బోర్డు భూములంటూ 20 ఏళ్ల కింద జరిగిన సేల్‌డీడ్స్‌ను ఏకపక్షంగా రద్దు చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. 2000 సంవత్సరంలో 75 గజాలను పిటిషనర్ కొని అనుమతులు పొంది ఇళ్లు కట్టుకొని ఉంటున్న నేపథ్యంలో బలవంతపు చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది. దీనిపై కౌంటర్ వేయాలని వక్ఫ్‌బోర్డు, ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కొహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లోని సర్వే నంబర్ 389లో 2000లో కొనుగోలు చేసిన తన ఇంటి స్థలానికి సంబంధించిన సేల్‌డీడ్‌ను గత మార్చిలో ఏకపక్షంగా రద్దు చేయడాన్ని సవాల్‌చేస్తూ ఎ.కుమార్‌గౌడ్, బి.లావణ్య దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. రిజిస్ట్రర్డ్ సేల్‌డీడ్స్‌ను రద్దు చేసే అధికారం వక్ఫ్ బోర్డుకు ఎక్కడుందన్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, వక్ఫ్‌బోర్డు సీఈవోను ఆదేశించింది.
చదవండి: ఆధార్ నంబర్‌తో.. భూమిని కొట్టేసేందుకు కుట్ర
Comments
Please login to add a commentAdd a comment